• TFIDB EN
  • 2023 ఏడాదిలో టాప్ హరర్ చిత్రాల లిస్ట్
    Dislike
    100+ views
    1 year ago

    2023లో విడుదలై ప్రేక్షకులను భయపెట్టిన హరర్ చిత్రాల జాబితాను YouSay TFIDB సేకరించింది. వీటిలో విరూపాక్ష, మంగళవారం వంటి హిట్ హరర్ చిత్రాలు ఉన్నాయి.

    ఇంగ్లీష్‌లో చదవండి

    1 . విరూపాక్ష(ఏప్రిల్ 21 , 2023)
    A|థ్రిల్లర్,హారర్,మిస్టరీ,యాక్షన్
    రుద్రవరం అనే ఊరిలో అనుమానాస్పదంగా చాలామంది దారుణంగా చనిపోతుంటారు. ఈ మరణాల చేతబడి వల్ల జరుగుతున్నయా? లేదా ఎవరైనా హత్య చేస్తున్నారా? అనే విషయాన్ని కనుక్కునేందుకు హీరో సాయిధరమ్ తేజ్‌ ఏం చేశాడు? నందినీ పాత్ర ఏంటీ? ఆ డెత్ మిస్టరీ వెనుక అసలు ఎవరున్నారు? అనేది కథ.
    2 . మా ఊరి పొలిమేర 2(నవంబర్ 03 , 2023)
    UA|క్రైమ్,హారర్,థ్రిల్లర్
    ఊరిలో చెతబడులు చేస్తూ చనిపోయాడని భ్రమ పడిన కొమురయ్య(సత్యం రాజేష్) తన తొలి ప్రేయసి కవితతో కేరళకు పారిపోతాడు. మరోవైపు జంగయ్య (బాలాదిత్య) తన సోదరుడు కొమురయ్య కోసం వెతుకులాటలో ఉంటాడు. ఇంతలో కొత్త ఎస్‌ఐ రవీంద్ర నాయక్ (రాకేందు మౌళి) ఆ గ్రామం చుట్టూ ఉన్న రహస్యాలను ఛేదించడానికి జాస్తిపల్లికి వస్తాడు. ఈ క్రమంలో జరిగిన నాటకీయ పరిణామాలు ఏమిటి? గ్రామంలోని పాడుబడిన ఆలయంలోకి ప్రవేశించాలని పురావస్తు శాఖ ఎందుకు ప్రయత్నిస్తుంటుంది? అసలు గ్రామంలో వరుస మరణాలకు కొమురయ్య ఎందుకు కారణం అయ్యాడు? ఇంతకీ ఆ గుడిలో ఏముంది? జంగయ్య తన సోదరుడిని గుర్తించాడా ? లేదా? చివరికి ఏం జరిగింది ? అనేది మిగిలిన కథ
    3 . స్ట్రీ 2(ఆగస్టు 15 , 2024)
    UA|హాస్యం,హారర్
    చందేరీ గ్రామంలో ‘స్త్రీ’ సమస్య తొలగింది అని అందరూ ఊపిరి పీల్చుకునేలోపు ‘సర్కట’తో కొత్త సమస్య మొదలవుతుంది. ఈ సమస్యను విక్కీ (రాజ్ కుమార్ రావు), రుద్ర (పంకజ్ త్రిపాఠి), జన (అభిషేక్ బెనర్జీ), బిట్టు (ఆపర్ శక్తి ఖురానా)తో కలిసి ఓ భూతం (శ్రద్ధా కపూర్) ఎలా ఎదుర్కొంది? అన్నది స్టోరీ.
    4 . భ్రమయుగం(ఫిబ్రవరి 23 , 2024)
    UA|హారర్,థ్రిల్లర్
    తేవన్ అనే గాయకుడు అడవిలో ప్రయాణిస్తూ ఓ పాడుబడ్డ పెద్ద భవంతికి వెళ్తాడు. అక్కడ యజమాని మమ్మూటీ (కుడుమోన్ పొట్టి), ఓ వంటవాడు ఉంటాడు. అనూహ్య పరిణామాల తర్వాత తేవన్ ఆ ఇంటి నుంచి పారిపోవాలని అనుకుంటాడు. అసలు తేవన్ ఏం చూసి భయపడ్డాడు? కుడుమోన్ పొట్టి ఎవరు? అడవిలో ఏం చేస్తున్నాడు? అన్నది కథ.
    5 . ముంజ్య(జూన్ 07 , 2024)
    UA|హాస్యం,డ్రామా,హారర్
    1952లో తనకంటే పెద్దమ్మాయిని గోట్యా అనే పిల్లాడు ప్రేమిస్తాడు. ఆమెను దక్కించుకునేందుకు చేతబడి చేయబోతాడు. అయితే అది వికటించి పిల్ల దెయ్యం ముంజ్యగా మారతాడు. ప్రస్తుతం పుణెలో ఉంటున్న బిట్టు (అభయ్‌ వర్మ) అనుకోకుండా ముంజ్యకు విముక్తి కలిగిస్తాడు. ఆ ముంజ్య బిట్టును ఎన్ని ఇబ్బందులు పెట్టింది? దాని లక్ష్యం ఏంటి? చివరికీ ఏమైంది? అన్నది స్టోరీ.
    6 . మంగళవారం(నవంబర్ 17 , 2023)
    A|యాక్షన్,హారర్,థ్రిల్లర్
    మ‌హాల‌క్ష్మీపురంలోని ఓ జంట మ‌ధ్య అక్రమ సంబంధం ఉంద‌ని ఊరి గోడ‌ల‌పై రాత‌లు క‌నిపిస్తాయి. ఆ జంట అనూహ్య ప‌రిస్థితుల్లో చ‌నిపోతుంది. మ‌రో జంటకి కూడా అదే పరిస్థితి ఎదురై చ‌నిపోవ‌డంతో ఊరి ప్రజ‌ల్లో భ‌యం మొద‌ల‌వుతుంది. ఆ హత్యలన్ని మంగళవారం రోజునే జరుగుతుంటాయి. ఈ కేసును ఛేదించేందుకు ఎస్‌ఐ నందితా శ్వేత ప్రయత్నిస్తుంది. ఇంతకు ఆ హత్యల వెనుక ఉన్నది ఎవరు? అనేది మిగతా కథ.
    7 . చంద్రముఖి 2(సెప్టెంబర్ 28 , 2023)
    UA|హాస్యం,హారర్
    రంగనాయకి (రాధిక శరత్ కుమార్) కుటుంబం చాలా పెద్దది. ఆ ఫ్యామిలీని అనుకోని సమస్యలు వరుసగా చుట్టుముడతాయి. కుల దైవం గుడిలో పూజ చేస్తే కష్టాలు తీరిపోతాయని స్వామీజీ (రావు రమేష్) చెప్తారు. దీంతో లేచిపోయిన కూతురి పిల్లలను కూడా తీసుకురావాల్సి వస్తుంది. వారితో పాటు మదన్ (రాఘవ లారెన్స్) కూడా వస్తాడు. వారి కులదైవం గుడికి దగ్గరలోనే చంద్రముఖి ప్యాలెస్ (2005లో మొదటి చంద్రముఖి సినిమా కథ జరిగిన ఇల్లు) ఉంటుంది.
    8 . డీడీ రిటర్న్స్(ఆగస్టు 18 , 2023)
    UA|హారర్,హాస్యం
    కొంద‌రు ఫ్రెండ్స్ తాము దొంగిలించిన కోట్లాది రూపాయ‌ల డ‌బ్బు, నగలను ఓ భూతాల బంగ్లాలో పోలీసుల కంటపడకుండా దాచిపెడ‌తారు. ఆ బ్యాగ్‌ను తిరిగి బంగ్లా నుంచి తీసుకొచ్చే ప్రయత్నంలో వారి దెయ్యం కనిపిస్తుంది. ఈ క్రమంలో వారికి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి అనేది కథ
    9 . అశ్విన్స్(జూన్ 23 , 2023)
    A|హారర్
    కొత్త దర్శకుడు తరుణ్‌ తేజ రూపొందించిన చిత్రం అస్విన్స్‌. వసంత్‌ రవి, విమలా రామన్‌ తదితరులు కీలక పాత్ర పోషించారు. అర్జున్(వసంత్ రవి) లండన్‌లో వ్లాగ్స్ చేస్తూ ఉంటాడు. అయితే తాను తన టీమ్‌తో ఒక హాంటెడ్ హౌస్‌ని వ్లాగ్ చేయడానికి వెళ్తాడు. ఆ ఇంటికి వెళ్ళాక వారికి అనూహ్య ఘటనలు ఎదురవుతాయి. మరి అక్కడ ఏం జరిగింది? ఆ ఇల్లు ఎవరిది? వారు ఎలా బయటపడ్డారు? అనేది మిగతా కథ.
    10 . భూ(మే 27 , 2023)
    UA|హారర్,డ్రామా
    కియారా (రకుల్ ప్రీత్ సింగ్) ఆమె స్నేహితులు హాలోవీన్ వేడుక సందర్భంగా హాలోవీన్ స్టోరీస్ ఉన్న మర్మమైన పుస్తకాన్ని చదువుతారు. బుక్‌లోని అన్ని అధ్యాయాలు చదవాలని తొలి పేజీలోనే రాసి ఉంటుంది. ఒక్కో అధ్యాయ్యాన్ని ఆపకుండా చదువుతున్న క్రమంలో అందులోని పాత్రలు వీరికి ప్రత్యక్షమవుతుంటాయి. ఈ అసాధారణ పరిస్థితులను, పుస్తకంలోని రహస్యాలను, స్నేహితుల అనుభవాలను ఈ సినిమా ఆవిష్కరించింది.
    11 . 105 మినిట్స్(జనవరి 26 , 2024)
    A|హారర్,థ్రిల్లర్
    జాను (హ‌న్సిక‌) ఆఫీసు నుంచి కారులో ఇంటికి వెళ్తున్న క్రమంలో తననేదో అదృశ్యశక్తి వెంటాడుతున్నట్లు ఆమెకు అర్థమవుతుంది. ఇంటికి వెళ్లాక అనూహ్య ప‌రిణామాలు చోటుచేసుకుంటాయి. ఆ అదృశ్య శ‌క్తి జానును ఇనుప గొలుసుతో బంధించి చిత్రహింస‌ల‌కు గురి చేయ‌డం ప్రారంభిస్తుంది. తన మరణానికి జానునే కారణమని చెప్పి ఇబ్బందులకు పెడుతుంది. ఇంతకీ ఆ అదృశ్య శక్తి ఎవరు? ఆ వ్య‌క్తి మ‌ర‌ణానికి జాను ఎలా కార‌ణ‌మైంది? దాని బారి నుంచి జాను ఎలా బ‌య‌ట‌ప‌డింది? అన్న‌ది మిగ‌తా క‌థ‌
    12 . సి 202(అక్టోబర్ 25 , 2024)
    A|హారర్,థ్రిల్లర్
    చేతబడి వల్ల C 202 అనే ఇంట్లో హత్య జరుగుతుంది. దాని వెనక భూతాల రాజు (తనికెళ్ల భరణి) ఉన్నాడని తెలుస్తుంది. ఇంతకీ అతడు C 202 ఇంటినే ఎందుకు టార్గెట్‌ చేశాడు? ఆ ఇంట్లో వారిపై ఎందుకు చేతబడి చేస్తున్నాడు? దాని వెనక కారణాలేంటి? ఆ ఇంట్లో ఏముంది? అన్నది స్టోరీ.
    13 . సువర్ణ సుందరి(ఫిబ్రవరి 03 , 2023)
    UA|డ్రామా,హారర్,థ్రిల్లర్
    300 ఏళ్ల చరిత్ర కలిగిన సువర్ణ సుందరి విగ్రహంలో దుష్టశక్తి ఉంటుంది. స్వాతంత్రం అనంతరం ఆ విగ్రహం ఓ బంగ్లాకు చేరుతుంది. ఆ భవంతిలో దిగిన కలెక్టర్ భార్య అంజలి.. విగ్రహాన్ని తాకడంతో ఆ దుష్టశక్తి ఆమెలోకి ప్రవేశిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? విగ్రహం వెనకున్న రహస్యం ఏంటి? అన్నది కథ.
    14 . రెంట్ (నాట్ ఫర్ సేల్)(ఆగస్టు 25 , 2023)
    A|హారర్,థ్రిల్లర్
    ముగ్గురు అమ్మాయిలు ఓ ఫ్లాట్‌లో అనుమానస్పదంగా చంపబడతారు. దీనిపై పోలీసు దర్యాప్తు జరుగుతుండగానే విక్రమ్‌ ఫ్యామిలీ ఆ ఫ్లాట్‌లో అద్దెకు దిగుతుంది. ఆ తర్వాత విక్రమ్‌ కుటుంబానికి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? ఆ ముగ్గురు అమ్మాయిలను చంపింది ఎవరు? అన్నది కథ.
    15 . బ్లడీ ఇష్క్‌(జూలై 26 , 2024)
    A|హారర్,థ్రిల్లర్
    ఐల్యాండ్‍పై ఉండే ఓ భవనంలో ఉండేందుకు అవికా, వర్దన్ వెళతారు. ఈ భవనంలో అవికకు దెయ్యం ఉందని అర్థమవుతుంది. ఇంతకీ ఆ దెయ్యం ఎవరు? అవికాను ఎలాంటి ఇబ్బందులు పెట్టింది? దాని బారి నుంచి ఆమె బయటపడింది? అన్నది స్టోరీ
    16 . లిసా ఫ్రాంకెన్‌స్టైయిన్(ఫిబ్రవరి 09 , 2024)
    UA|హారర్
    ఓ జంట గాఢంగా ప్రేమించుకుంటుంది. అందులోని యువకుడు అనూహ్యంగా చనిపోవడంతో అతడికి యువతి తిరిగి ప్రాణం పోస్తుంది. ఆ తర్వాత వారు ఎలా జీవించారు? మిస్సైన ప్రియుడు శరీర భాగాల కోసం వారు ఏం చేశారు? అన్నది స్టోరీ.
    17 . బాక్(మే 03 , 2024)
    UA|హాస్యం,హారర్
    శివ శంకర్ (సుందర్ సి) ఒక లాయర్. బాక్‌ అనే దుష్టశక్తి వల్ల అతని చెల్లెలు శివాని (తమన్నా) మరణిస్తుంది. అసలు ఆ బాక్ ఎవరు? శివాని ఫ్యామిలీని ఎందుకు టార్గెట్‌ చేసింది? శివాని ఆత్మగా మారి తన కుటుంబాన్ని ఎలా కాపాడింది? కథలో మాయ (రాశి ఖన్నా) పాత్ర ఏంటి? అన్నది కథ.
    18 . పిండం(డిసెంబర్ 15 , 2023)
    A|హారర్,థ్రిల్లర్
    తాంత్రిక విద్యలో ఆరితేరిన అన్నమ్మ, లోక్ నాథ్‌కు తన కెరీర్‌లో అత్యంత క్లిష్టమైన కేసు గురించి చెబుతుంది. "ఆంటోనీ తన కుటుంబంతో కలిసి ఓ ఇంట్లో దిగుతాడు. ఆ తర్వాత నుంచి ఆ ఇంట్లో అంతా అనుమానాస్పద ఘటనలు జరుగుతుంటాయి. వాళ్ళని పీడిస్తుంది ఏంటి? ఆ విషయాన్ని కనిపెట్టాలని లోక్‌నాథ్‌కు అన్నమ్మ సూచిస్తుంది. మరి లోక్‌నాథ్‌ ఏం చేశాడన్నది మిగతా కథ.
    19 . కళింగ(సెప్టెంబర్ 13 , 2024)
    UA|హారర్,థ్రిల్లర్
    కళింగ ఊరు పొలిమేర దాటి అడవిలోకి వెళ్లిన వారు ప్రాణాలతో తిరిగి రారు. ఆ అడవిలో కళింగ రాజు సంపద ఉందని, దానికి ఓ దుష్టశక్తి కాపలాకాస్తుందని ప్రజల నమ్మకం. తన ప్రేమను గెలిపించుకోవడం కోసం గ్రామానికి చెందిన లింగా (ధ్రువవాయు) ఫ్రెండ్స్‌తో కలిసి అడవిలోకి వెళ్తాడు. అక్కడ అతడికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? కళింగ రాజు మిస్టరీ ఏంటి? లింగా ప్రాణాలతో బయటపడ్డాడా? లేదా?’ అన్నది స్టోరీ.
    20 . గార్డియన్(మార్చి 08 , 2024)
    UA|హాస్యం,హారర్
    అప‌ర్ణ‌ (హన్సిక)కు క్రిస్టల్‌ (మెరుపు రంగు రాయి) దొరుకుతుంది. అప్పటి నుంచి ఆమె ఏది కోరుకుంటే అది జరగడం మెుదలవుతుంది. మంచి ఉద్యోగం, లవ్‌ తిరిగి లభిస్తాయి. ఇంతకీ ఆమె కోరికలు ఎలా నెరవేరుతున్నాయి? వాటితో క్రిస్టల్‌కు లింక్ ఏంటి? క్రిస్టల్‌లో బంధించిన ఆత్మ ఎవరు? అన్నది స్టోరీ.

    @2021 KTree