నెట్‌ఫ్లిక్స్‌లో టాప్ రేటింగ్ యాక్షన్ చిత్రాలు
2k+ views1 year ago
నెట్‌ఫ్లిక్స్‌లో 2018-2023 వరకు వచ్చి యాక్షన్ మూవీల్లో బెస్ట్ రేటింగ్ ఉన్న టాప్ 10 చిత్రాలను YouSay TFIDB సేకరించడం జరిగింది. వీటిలో RRR, శ్యామ్‌సింగరాయ్, అలవైకుంఠపురములో వంటి బ్లాక్ బాస్టర్ హిట్ సినిమాలు ఉన్నాయి. వీటిలో మీ మనసుకు నచ్చిన సినిమాను ఎంచుకుని యాక్షన్ మోడ్‌ను ఎంజాయ్ చేయండి.
1 . ఆర్ఆర్ఆర్(మార్చి 25 , 2022)
UA|యాక్షన్,డ్రామా,హిస్టరీ
నిజాం రాజును కలిసేందుకు వచ్చిన బ్రిటిష్ అధికారి గోండు పిల్లను తమ వెంట ఢిల్లీకి తీసుకెళ్తారు. ఆ గోండు జాతి నాయకుడైన భీమ్(జూ.ఎన్టీఆర్) ఆ పిల్లను వెతుక్కుంటూ ఢిల్లీకి వస్తాడు. ఈ విషయం తెలిసిన బ్రిటిష్ ప్రభుత్వం అతన్ని పట్టుకునేందుకు రామరాజు(రామ్‌చరణ్)ను ప్రత్యేక అధికారిగా నియమిస్తుంది. ఈక్రమంలో ఓ సంఘటన వల్ల భీమ్- రామరాజు ఒకరికొకరు తెలియకుండానే ప్రాణ స్నేహితులుగా మారుతారు. కానీ కొన్ని పరిణామాల వల్ల ఒకరిపై ఒకరు దాడి చేసుకోవాల్సి వస్తుంది. ఇంతకు గోండు పిల్లను బ్రిటిష్ చర నుంచి భీమ్ విడిపించాడా? అసలు రామరాజు బ్రిటిషర్ల దగ్గర ఎందుకు పనిచేశాడు అనేది మిగతా కథ.
2 . జవాన్(నవంబర్ 02 , 2023)
UA|యాక్షన్,థ్రిల్లర్
సరిహద్దుల్లో తీవ్ర గాయాలతో పడిపోయిన ఓ వ్యక్తిని తల్లి కొడుకులు రక్షిస్తారు. అతను కోమాలోకి వెళ్లగా గ్రామానికి తీసుకెళ్లి వైద్యం చేయిస్తారు. ఇదే సమయంలో ఆ ఊరిపై కొందరు పదునైన ఆయుధాలతో దాడి చేస్తారు. కోమాలో నుంచి బయటకు వచ్చిన ఆ వ్యక్తి వారిని తరిమికొడతాడు. దీంతో ఆ గ్రామ ప్రజలు అతన్ని దేవుడిలా పూజిస్తారు. అప్పుడు ఆ వ్యక్తి తాను ఎవర్ని అని వారిని ప్రశ్నిస్తాడు. దీనికి జవాబు తాను పెద్దయ్యేలోపు కనుగొంటానని కాపాడిన పిల్లోడు ప్రామిస్ చేస్తాడు. ఇంతకు ఆ వ్యక్తి ఎవరు? పిల్లాడితో అతనికి ఉన్న సంబంధం ఏమిటి అన్నది మిగతా కథ.
3 . యానిమల్ (డిసెంబర్ 01 , 2023)
A|యాక్షన్,క్రైమ్,డ్రామా
దేశంలోని అత్యంత సంపన్నుల్లో బల్బీర్ సింగ్ (అనిల్ కపూర్) ఒకరు. ఆయన కుమారుడు రణ్ విజయ్ సింగ్ (రణబీర్ కపూర్). తండ్రి అంటే అమితమైన ప్రేమ. అయితే తన దూకుడు మనస్తత్వం కారణంగా హీరోకి తండ్రితో దూరం పెరుగుతుంది. దీంతో అమెరికా వెళ్లిపోతాడు. ఓ రోజు తండ్రిపై హత్యయాత్నం జరిగినట్లు తెలిసుకొని విజయ్ ఇండియాకు వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? బల్బీర్‌పై దాడి చేసిన వారిపై హీరో ఎలా ప్రతికారం తీర్చుకున్నాడు? అన్నది కథ.
4 . కల్కి 2898 ఎ.డి(జూన్ 27 , 2024)
UA|యాక్షన్,సైన్స్ ఫిక్షన్
కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడి చేత శాపం పొందిన అశ్వత్థామ (అమితాబ్‌బచ్చన్).. కల్కి ఆగమనం కోసం ఎదురుచూస్తుంటాడు. సుమతి (దీపికా పదుకొణె) అనే మహిళ కడుపున కల్కి జన్మిస్తాడని తెలిసి ఆమెకు రక్షణగా మారతాడు. కాశీలో నివసించే భైరవ (ప్రభాస్) స్వర్గాన్ని తలపించే కాంప్లెక్స్‌లోకి వెళ్లడానికి ప్రయత్నిస్తుంటాడు. సుమతిని పట్టిస్తే కాంప్లెస్ వెళ్లొచ్చని తెలుసుకుంటాడు. మరి భైరవ, అశ్వత్థామను ఎదిరించి సుమతిని తీసుకొచ్చాడా? సుప్రీమ్ యష్కిన్ (కమల్ హాసన్) పాత్ర ఏంటి? కురుక్షేత్ర యుద్ధంతో కలియుగం అంతం ఎలా ముడిపడి ఉంది? అన్నది కథ.
5 . అలా వైకుంఠపురములో(జనవరి 12 , 2020)
UA|యాక్షన్,డ్రామా
బంటు(అల్లు అర్జున్) తన పెంపుడు తండ్రి అవమానాల మధ్య పెరిగి పెద్దవాడవుతాడు. కానీ తన నిజమైన తల్లిదండ్రుల గురించి తెలుసుకుని వారికి దగ్గర కావాలని నిర్ణయించుకుంటాడు. ఈ క్రమంలో బంటు నిజమైన తండ్రి కుటుంబానికి ఓ సమస్య వస్తుంది. ఆ సమస్యను బంటు ఎలా పరిష్కరించాడు? తన కుటుంబంలో ఎలా చేరాడు అనేది మిగతా కథ.
6 . దసరా(మార్చి 30 , 2023)
UA|యాక్షన్,అడ్వెంచర్,డ్రామా
ధరణి తన స్నేహితులతో కలిసి బొగ్గుని దొంగతనం చేస్తూ.. మద్యం సేవిస్తూ అందరితో గొడవలు పడుతూ ఉంటాడు. కానీ మరుసటి రోజు అవన్నీ మర్చిపోతాడు. ఈ క్రమంలో ఓ రోజు చిన్న నంబి ( షైన్ టామ్ చాకో) సిల్క్ బార్‌లో కూడా గొడవపడి మర్చిపోతాడు. దానిని చిన్న తంబి చాలా సీరియస్ గా తీసుకుంటాడు. ఈక్రమంలో ఓ రాత్రి ముసుగు దుండగులు ధరణి ప్రాణ స్నేహితుడిని చంపుతారు. ఇంతకు ధరణి స్నేహితుడిని చంపిందెవరు? వారిపై ఎలా ప్రతికారం తీర్చుకున్నాడు అన్నది మిగతా కథ
7 . వాల్తేరు వీరయ్య(జనవరి 13 , 2023)
UA|యాక్షన్,డ్రామా
వాల్తేరు వీరయ్య( చిరంజీవి) జాలరి పేటలో ప్రజలకు దేవుడు. ఆయన మాటకు తిరుగులేదు. సముద్రపు ఒడ్డున చిరంజీవికి తెలియకుండా కొంతమంది డ్రగ్స్ రవాణా చేస్తుంటారు. వారిని ఏసీపీ విక్రమ్( రవితేజ) అరెస్ట్ చేస్తాడు. అడ్డుపడిన చిరంజీవిని కూడా లాకప్‌లో వేస్తాడు. చిరంజీవి జైళ్లో ఉన్న సమయంలో అనుకోని విషాదం ఎదురవుతుంది. ఆ విషాధానికి కారణం ప్రకాశ్ రాజ్ అని తెలుసుకుని పోలీస్ ఆఫీసర్ రాజేంద్రప్రసాద్‌తో కలిసి చిరంజీవి మలేషియా వెళ్తాడు. ఆ విషాదం ఏమిటి అనేది కథ
8 . విరూపాక్ష(ఏప్రిల్ 21 , 2023)
A|థ్రిల్లర్,హారర్,మిస్టరీ,యాక్షన్
రుద్రవరం అనే ఊరిలో అనుమానాస్పదంగా చాలామంది దారుణంగా చనిపోతుంటారు. ఈ మరణాల చేతబడి వల్ల జరుగుతున్నయా? లేదా ఎవరైనా హత్య చేస్తున్నారా? అనే విషయాన్ని కనుక్కునేందుకు హీరో సాయిధరమ్ తేజ్ ఏం చేశాడు? నందినీ పాత్ర ఏంటీ? ఆ డెత్ మిస్టరీ వెనుక అసలు ఎవరున్నారు? అనేది కథ.
9 . సలార్(డిసెంబర్ 22 , 2023)
UA|థ్రిల్లర్,యాక్షన్
ఖాన్సార్ సామ్రాజ్యానికి రాజ మన్నార్ (జగపతిబాబు) రూలర్. సామ్రాజ్యంలోని ప్రాంతాలను దొరలు పాలిస్తుంటారు. ఖాన్సార్ పీఠం కోసం రాజ మన్నార్‌ను దొరలు సొంతంగా సైన్యం ఏర్పాటు చేసుకొని హత్య చేస్తారు. తండ్రి కోరిక మేరకు వరద రాజమన్నార్ (పృథ్వీరాజ్ సుకుమారన్) ఖాన్సార్‌కు రూలర్ అవ్వాలని భావిస్తాడు. ఇందుకోసం చిన్ననాటి స్నేహితుడు దేవా (ప్రభాస్) సాయం కోరతాడు. ఆ ఒక్కడు అంతమంది దొరల సైన్యాన్ని ఎలా ఎదిరించాడు? అన్నది స్టోరీ.
10 . దేవర(సెప్టెంబర్ 27 , 2024)
UA|యాక్షన్,డ్రామా,థ్రిల్లర్
సముద్రానికి ఆనుకొని కొండపై ఉన్న నాలుగు గ్రామాల సమూహాన్ని ఎర్ర సముద్రంగా పిలుస్తుంటారు. అక్కడ దేవర (ఎన్టీఆర్)తో పాటు భైరవ (సైఫ్ అలీ ఖాన్), రాయప్ప, కుంజర ఒక్కో గ్రామ పెద్దగా ఉంటారు. సముద్రం గుండా దొంగ సరుకు రవాణా చేస్తూ జీవిస్తుంటారు. అయితే దాని వల్ల జరిగే నష్టం గ్రహించి దేవర సరకు దొంగతనం చేయవద్దని ఫిక్స్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? భైరవను దేవర ఎలా అడ్డుకున్నాడు? సముద్రంలోకి వెళ్లిన దేవర ఏమయ్యాడు? అతడి కొడుకు వర (ఎన్టీఆర్) ఎందుకు భయస్తుడిగా మారాడు? అన్నది స్టోరీ. దేవర చిత్రాన్ని రూ.300 కోట్ల వ్యయంతో తెరకెక్కించారు.