• TFIDB EN
  • ZEE5లో టాప్ రెటేడ్ సోషియో ఫాంటసీ చిత్రాలు
    Dislike
    2k+ views
    1 year ago

    సోషియో ఫాంటసీ చిత్రాల్లోని థ్రిల్‌ను ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం ఈ చిత్రాలపై ఓ లుక్ వేయండి. జీ5లో బెస్ట్ రేటింగ్ ఉన్న సినిమాల లిస్ట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. వీటిలో మీకు నచ్చిన చిత్రాన్ని చూసి ఎంజాయ్ చేయండి.

    ఇంగ్లీష్‌లో చదవండి

    1 . జెర్సీ(ఏప్రిల్ 19 , 2019)
    U|డ్రామా,క్రీడలు
    ఒక మాజీ క్రికెటర్ తన కొడుకు కోరికను తీర్చడానికి ఇండియా టీమ్‌కు సెలెక్ట్ అయ్యేందుకు ఎలాంటి కష్టాలు పడ్డాడు అనేది కథ
    2 . కార్తికేయ 2(ఆగస్టు 13 , 2022)
    UA|థ్రిల్లర్,ఫాంటసీ,మిస్టరీ
    కార్తికేయ (నిఖిల్‌)కు ప్రశ్నలకు సమాధానం వెతకడం అంటే ఇష్టం. తల్లితో పాటు కార్తికేయ ద్వారక వెళ్లగా అక్కడ ఓ ఆర్కియాలజిస్ట్ హత్యకు గురవుతాడు. దాని వెనక కారణాల్ని వెతుకుతూ కార్తికేయ చేసే సాహసోపేతమైన ప్రయాణమే అసలు కథ.
    3 . హను మాన్(జనవరి 12 , 2024)
    UA|యాక్షన్,అడ్వెంచర్,ఫాంటసీ
    సౌరాష్ట్రలో ఉండే మైఖేల్‌ (వినయ్ రాయ్‌) చిన్నప్పటి నుంచి సూపర్‌ హీరో అవ్వాలని భావిస్తుంటాడు. ఇందుకు అడ్డు వస్తున్నారని తల్లిదండ్రులను కూడా మట్టు పెడతాడు. మరో పక్క అంజనాద్రి అనే గ్రామంలో దొంగతనాలు చేస్తూ కొంటె కుర్రాడిలా హనుమంతు (తేజ సజ్జ) తిరుగుతుంటాడు. కొన్ని పరిణామాల రీత్యా అతడు హనుమాన్ శక్తులని పొందుతాడు. ఈ శక్తి హనుమంతుకు ఎలా వచ్చింది? ఆ శక్తి భూమిపై ఎలా నిక్షిప్తం అయ్యింది? హనుమంతు పవర్స్‌ గురించి మైఖేల్ ఎలా తెలుసుకున్నాడు? మైఖేల్‌ నుంచి గ్రామస్తులకు ఏర్పడ్డ ముప్పును హనుంతు ఎలా తొలగించాడు? విభీషణుడు (సముద్రఖని), అంజమ్మ (వరలక్ష్మి) పాత్రల ప్రాధాన్యత ఏంటి? అన్నది కథ.
    4 . బంగార్రాజు(జనవరి 14 , 2022)
    UA|హాస్యం,ఫాంటసీ
    మనవడి కళ్యాణంతో పాటు, లోక కళ్యాణం కోసం బంగార్రాజు (నాగార్జున)ని కిందికి పంపిస్తాడు యమధర్మరాజు. మరి చిన్న బంగార్రాజు (నాగ చైతన్య), నాగలక్ష్మీ (కృతిశెట్టి)ని ఎలా కలిపాడు? ఊరి గుడిలో ఉన్న నిధులను ఎలా కాపాడాడు? అన్నది కథ.
    5 . బింబిసార(ఆగస్టు 05 , 2022)
    UA|యాక్షన్,డ్రామా,ఫాంటసీ,హిస్టరీ
    త్రిగర్తల సామ్రాజ్యాధినేత బింబిసారుడు (కల్యాణ్‌ రామ్‌) క్రూరత్వానికి ప్రతీక. అలాంటి బింబిసారుడు మాయా దర్పణం వల్ల క్రీ.పూ 500 ఏళ్ల నాటి నుంచి ప్రస్తుత ప్రపంచంలోకి అడుగుపెడతాడు. వర్తమానంలో బింబిసారుడికి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? అనేది కథ.
    6 . రైటర్ పద్మభూషణ్(ఫిబ్రవరి 03 , 2023)
    U|డ్రామా,ఫ్యామిలీ
    పెద్ద రచయిత కావాలనేది భూషణ్(సుహాస్) కల. అసిస్టెంట్ లైబ్రేరియన్‌గా పనిచేస్తుంటాడు. ఈ క్రమంలో ఓ పుసక్తం రాసి.. దానిని ప్రింట్ చేయించడానికి రూ.4లక్షల అప్పు చేస్తాడు. ఈ పుస్తకానికి సరైన ఆదరణ రాదు. దీంతో అందరితో చదివించడానికి భూషణ్ చాలా కష్టపడుతుంటాడు. ఈ క్రమంలో పద్మభూషణ్ పేరుతో మరో పుసక్తం విడుదలై మంచి ఆదరణను పొందుతుంది. కానీ, ఆ పుస్తకాన్ని తనే రాశానంటూ భూషణ్ చెబుతూ తిరుగుతుంటాడు. ఈ క్రమంలో ఆ పుస్తకం నచ్చి తన కూతురు సారిక(టీనా శిల్పరాజ్)ను ఇచ్చి పెళ్లి చేస్తానంటూ మేనమామ ముందుకొస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగతా కథ
    7 . టాక్సీవాలా(నవంబర్ 17 , 2018)
    UA|ఫాంటసీ,థ్రిల్లర్
    శివ (విజయ్‌ దేవరకొండ) ట్యాక్సీ డ్రైవర్‌. ఓ పాత ట్యాక్సీని తక్కువ ధరకే కొనుగోలు చేస్తాడు. కానీ, ఆ కారులో దెయ్యం ఉందని శివ తెలుసుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందన్నది కథ.
    8 . గోల్కొండ హై స్కూల్(జనవరి 14 , 2011)
    U|డ్రామా,క్రీడలు
    గోల్కొండ హైస్కూల్‌కు సంబంధించిన ట్రస్టీలు ఆ స్కూలులోని క్రీడా మైదానంపై కీలక నిర్ణయం తీసుకుంటారు. ఆ మైదానాన్ని విద్యార్థులు కోల్పోయే ప్రమాదం ఏర్పడుతుంది. రాష్ట్ర స్థాయి టోర్నమెంట్‌లో గోల్కొండ క్రికెట్ జట్టు గెలిస్తే మైదానం ఉంటుందని ట్రస్టీలు స్పష్టం చేస్తారు.
    9 . గామి(మార్చి 08 , 2024)
    UA|అడ్వెంచర్,ఫాంటసీ,థ్రిల్లర్
    అఘోరా శంకర్‌ (విష్వక్‌ సేన్‌) విచిత్రమైన సమస్యతో బాధపడుతుంటాడు. దానికి పరిష్కారం హిమాలయ పర్వతాల్లో ఉంటుందని ఓ సాధువు చెప్తాడు. దీంతో శంకర్‌ తన అన్వేషణ మెుదలుపెడతాడు. మరోవైపు సమాంతరంగా దేవదాసి, హ్యూమన్‌ ట్రైల్స్‌ కథ నడుస్తుంటుంది. వాటితో శంకర్‌కు ఉన్న సంబంధం ఏంటి? హిమాలయాల యాత్రలో అతడికి ఎదురైన సవాళ్లు ఏంటి? అన్నది స్టోరీ.
    10 . అనగనగా ఓ ధీరుడు(జనవరి 14 , 2011)
    U|అడ్వెంచర్,ఫాంటసీ
    యోధ ఓ గొప్ప యోధుడు. దైవ శక్తులు కలిగిన మోక్ష అనే అమ్మాయిని రక్షించే బాధ్యతను తీసుకుంటాడు. మరోవైపు ఆ అమ్మాయి రక్తం తాగి మరింత శక్తివంతంగా మారాలని మంత్రగత్తె ఐరేంద్రి చూస్తుటుంది. ఐరేంద్రితో యోధ ఎలా పోరాడాడు? అన్నది కథ.

    @2021 KTree