• TFIDB EN
  • Editorial List
    Allu Arjun Action Movies: అల్లు అర్జున్ నటించిన అత్యుత్తమ యాక్షన్‌ చిత్రాలు
    Dislike
    3k+ views
    1 year ago

    ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌కు యాక్షన్‌ హీరోగానూ మంచి గుర్తింపు ఉంది. బన్నీ చేసే ప్రతి సినిమాలోనూ మాస్‌ ఆడియన్స్‌ను కట్టిపడేసే ఫైటింగ్ సీన్స్‌ తప్పనిసరిగా ఉంటాయి. అందుకే బన్నీ సినిమా వస్తుందటే ఫ్యాన్స్‌ పండగలా ఫీల్ అవుతారు. థియేటర్లను గ్రాండ్‌గా ముస్తాబు చేస్తారు. అటు అల్లుఅర్జున్‌ సైతం తన సినీ కెరీర్‌లో యాక్షన్‌ చిత్రాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఎక్కువగా అగ్రెసివ్‌ పాత్రలనే ఎంచుకున్నాడు. ఈ నేపథ్యంలో బన్నీ నటించిన అత్తుత్తమ యాక్షన్‌ చిత్రాలు మీకోసం..

    ఇంగ్లీష్‌లో చదవండి

    1 . ఇద్దరమ్మాయిలతో(మే 31 , 2013)
    UA|143 minutes|రొమాన్స్,థ్రిల్లర్
    సంజు రెడ్డి స్పెయిన్‌లో లీడ్ గిటారిస్ట్. కొంతమందితో కలిసి బ్యాండ్ నడుపుతుంటాడు. ఈక్రమంలో ఇండియాలో బాగా ధనవంతురాలైన, యూనియన్ మినిస్టర్ కూతురైన ఆకాంక్ష సైకాలజీలో పిజి చేయడానికి స్పెయిన్ వస్తుంది. తను దిగిన ఇంట్లో, ఇదివరకూ అదే ఇంట్లో ఉన్న వారికి సంబందించిన డైరీ ఒకటి దొరుకుతుంది. ఆ డైరీకి సంజూ రెడ్డికి మధ్య సంబంధమే సినిమా కథ.
    2 . నా పేరు సూర్య,నా ఇల్లు ఇండియా(మే 04 , 2018)
    UA|164 minutes|యాక్షన్,డ్రామా
    సూర్య (అల్లు అర్జున్‌) కోపాన్ని కంట్రోల్‌ చేసుకోలేని సైనికుడు. దీని వల్ల ఆర్మీ నుంచి సస్పెండ్‌ అవుతాడు. మానసికంగా ఫిట్‌ అనే సర్టిఫికేట్‌తో వస్తేనే తిరిగి సైన్యంలో చేర్చుకుంటామని అధికారులు కండిషన్ పెడతారు. ఆ పని మీద వైజాగ్‌కు వచ్చిన హీరోకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? సైకాలజిస్ట్‌ అర్జున్‌తో సూర్యకు ఉన్న సంబంధం ఏంటి? అన్నది మిగతా కథ.

    ప్రముఖ రచయిత వక్కంతం వంశీ డైరెక్టర్‌గా మారి రూపొందించిన చిత్రం ‘నా పేరు సూర్య’. అప్పటివరకూ చేసిన సినిమాలకు పూర్తి భిన్నంగా ఇందులో బన్నీ నటించాడు. కోపాన్ని అదుపుచేసుకోలేని సైనికుడిగా మెప్పించాడు. ఇందులో అల్లు అర్జున్‌ నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇందులో బన్నీకి జంటగా అను ఇమ్మాన్యూయేల్‌ నటించింది. అర్జున్‌, శరత్‌కుమార్‌, బొమన్ ఇరానీ, రావు రమేష్ ముఖ్య పాత్రలు పోషించారు. విశాల్- శేఖర్‌ ద్వయం సంగీతం అందించింది.

    3 . దేశముదురు(జనవరి 12 , 2007)
    UA|148 minutes|యాక్షన్,రొమాన్స్
    ఒక టీవీ ఛానెల్‌లో పనిచేసే బాలా గ్యాంగ్‌స్టర్ తమ్ముడిని కొట్టి ఇబ్బందుల్లో పడుతాడు. అతని నుంచి తప్పించుకునేందుకు వేరే ప్రదేశానికి వెళ్తాడు. అక్కడ ఓ అమ్మాయితో ప్రేమలో పడుతాడు. ఆ తర్వాత ఏం జరిగింది. గ్లాంగ్‌ స్టర్‌తో ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు అన్నది మిగతా కథ.
    4 . జులాయి(ఆగస్టు 08 , 2012)
    UA|152 minutes|యాక్షన్,హాస్యం
    రవీందర్ నారాయణ(అల్లు అర్జున్) తెలివైన కుర్రాడు. కష్టపడకుండా ఓవర్ నైట్‌లో ఎదిగిపోవాలనే కోరిక ఉన్నవాడు. అయితే బిట్టు(సోనూ సూద్)అనే తెలివైన దొంగ చేసిన రూ.1500 కోట్ల బ్యాంక్ దోపిడికి విట్నెస్‌ మారి క్రిమినల్స్‌కి మోస్ట్ వాంటెడ్‌గా మారతాడు. రవీందర్‌కు మధు(ఇలియానా)తో ఎలా పరిచయం ఏర్పడింది? క్రిమినల్స్‌ను అతడు ఎదుర్కొన్నాడు? అనేది అసలు కథ.

    మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ డైరెక్షన్‌లో జులాయి చిత్రం తెరకెక్కింది. ఇందులో బన్నీ తన అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించాడు. ఇలియానా హీరోయిన్‌గా చేసింది. సోనుసూద్‌, రాజేంద్ర ప్రసాద్‌, ఎం.ఎస్‌. నారాయణ, బ్రహ్మానందం, బ్రహ్మాజీ కీలక పాత్రలు పోషించారు.

    5 . రేసు గుర్రం(ఏప్రిల్ 11 , 2014)
    UA|163 minutes|యాక్షన్,రొమాన్స్
    హీరోకి తన అన్న అంటే అస్సలు పడదు. పోలీసు అధికారైన తన అన్నను ఓ పోలిటిషియన్‌ చంపాలని చూస్తున్నట్లు హీరో తెలుసుకుంటాడు. ఆ తర్వాత హీరో ఏం చేశాడు? అన్నను కాపాడుకోవడం కోసం ఎలాంటి ప్లాన్లు వేశాడు? అన్నది కథ.

    అల్లుఅర్జున్‌ నటించిన సూపర్‌ హిట్‌ సినిమాల్లో ‘రేసు గుర్రం’ ఒకటి. సురేంద్ర రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం నటుడిగా బన్నీని మరో మెట్టు పైకి ఎక్కించింది. కథ విషయానికి వస్తే.. అన్నదమ్ములైన రామ్(శ్యామ్), లక్కీ(అల్లు అర్జున్) చిన్నప్పటి నుంచి టామ్ అండ్ జెర్రీ తరహాలో కొట్టుకుంటూ ఎదుగుతారు. పెద్దయ్యాక ACPగా ఎదిగిన రామ్.. తన నిజాయితీతో లోకల్ రాజకీయ నాయకుడు శివారెడ్డి(రవికిషన్) కి సమస్యగా మారతాడు. దాంతో శివారెడ్డి అతన్ని అడ్డు తప్పించాలని భావిస్తాడు. ఆ విషయం తెలిసిన తమ్ముడు లక్కీ ఏం చేసాడు? తన అన్నను ఎలా కాపాడుకున్నాడు? అనేది అసలు కథ.

    6 . సరైనోడు(ఏప్రిల్ 22 , 2016)
    UA|160 minutes|యాక్షన్,డ్రామా,రొమాన్స్
    హీరో ఆర్మీ ఉద్యోగాన్ని వదిలేసి హైదరాబాద్‌కు వస్తాడు. నేరగాళ్లకు తన స్టైల్లో బుద్ది చెబుతుంటాడు. ఈ క్రమంలో వ్యవస్థ మొత్తాన్నీ తన చెప్పు చేతల్లో పెట్టుకున్న వైరం ధనుష్ (ఆది)ని హీరో ఎలా ఎదిరించాడు? అతడికి హీరోకు మధ్య గొడవేంటి? అన్నది కథ.
    7 . పుష్ప: ది రైజ్ - పార్ట్ 01(డిసెంబర్ 17 , 2021)
    UA|179 minutes|యాక్షన్,థ్రిల్లర్
    పుష్ప (అల్లుఅర్జున్‌) ఎర్రచందనం కూలీ. కొండా రెడ్డి (అజయ్‌ ఘోష్‌) సోదరులకు స్మగ్లింగ్‌లో సలహాలు ఇచ్చే స్థాయికి అతడు వెళతాడు. అక్కడ నుంచి సిండికేట్‌ను శాసించే రేంజ్‌కు పుష్ప ఎలా ఎదిగాడు? మంగళం శ్రీను (సునీల్‌)తో ఉన్న గొడవేంటి? అన్నది కథ.

    @2021 KTree