• TFIDB EN
  • Editorial List
    Ravi Teja Top Action Movies: రవితేజ నటించిన అత్యుత్తమ యాక్షన్‌ చిత్రాలు
    Dislike
    3k+ views
    6 months ago

    టాలీవుడ్‌లోని అగ్ర కథానాయకుల్లో మాస్‌ మహారాజా రవితేజ ఒకరు. ముఖ్యంగా యాక్షన్‌ సినిమాలకు ఆయన పెట్టింది పేరు. రవితేజ నటించిన పలు చిత్రాలు బాక్సాఫీస్‌ను షేక్‌ చేశాయి. నిర్మాతలకు కాసుల వర్షం కురిపించాయి. అంతేగాక ఆయనకూ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. కెరీర్‌ ప్రారంభంలో అవకాశాల కోసం ఎన్నో కష్టాలు అనుభవించిన రవితేజ.. ప్రస్తుతం స్క్రీన్‌పై కనిపిస్తే చాలు సినిమా హిట్ అనే స్థాయికి ఎదిగారు. ఈ నేపథ్యంలో ఆయనకు ఎంతగానో పేరు తీసుకొచ్చిన టాప్ యాక్షన్‌ చిత్రాలు మీకోసం.

    ఇంగ్లీష్‌లో చదవండి

    1 . అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి(ఏప్రిల్ 19 , 2003)
    U|154 minutes|యాక్షన్,ఫ్యామిలీ,రొమాన్స్
    చందుకు కిక్‌బాక్సింగ్ అంటే చాలా ఇష్టం. ఎప్పటికైన నేషనల్ ఛాంపియన్ కావాలనేది అతని కల. తన తల్లితో కలిసి జీవిస్తుంటాడు. అయితే చందు తల్లి చనిపోయేటప్పుడు... తండ్రి రఘువీర్‌ను కలవమని కోరడంతో అతని జీవితం మారుతుంది.

    2003లో వచ్చిన అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి సినిమా అప్పట్లో బ్లాక్‌ బాస్టర్‌ హిట్ అందుకుంది. అంతేగాక రవితేజను సైతం ఇండస్ట్రీలో నిలదొక్కుకునేలా చేసింది. స్పోర్ట్స్‌ డ్రామా - యాక్షన్‌ మూవీగా తెరకెక్కిన ఈ సినిమాలో రవితేజ సరసన ఆసిన్‌ హీరోయిన్‌గా నటించింది. జయసుద, ప్రకాష్‌ రాజ్‌ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాకు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించారు.

    2 . భద్ర(మే 12 , 2005)
    U/A|డ్రామా
    భద్ర తన స్నేహితుడి చెల్లెలైన అనుని ప్రేమిస్తాడు. ఓ రోజు శత్రువుల దాడిలో అను మినహా అమె ఫ్యామిలీ అంతా చనిపోతుంది. విలన్ల నుంచి అనుని రక్షిస్తానని చనిపోతున్న తన ఫ్రెండ్‌కు భద్ర మాట ఇస్తాడు.

    రవితేజ కెరీర్‌లోని టాప్‌-5 హిట్‌ సినిమాల్లో ‘భద్ర’ కచ్చితంగా ఉంటుంది. 2005లో వచ్చిన ఈ చిత్రం టాలీవుడ్‌లో రవితేజ ప్రస్థానాన్ని సుస్థిరం చేసింది. మీరా జాస్మిన్, అర్జన్ బజ్వా, ప్రకాష్ రాజ్, ప్రదీప్ రావత్ ఈ సినిమాలో ముఖ్యపాత్రలు పోషించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు. మే 12, 2005న విడుదలైన భారీ విజయం సాధించింది. దీంతో ఈ సినిమాను పలు రీమేక్ చేశారు.

    3 . కృష్ణ(జనవరి 11 , 2008)
    U/A|147 minutes|యాక్షన్,హాస్యం
    సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అయిన కృష్ణ మొదటి చూపులోనే సంధ్యతో ప్రేమలో పడతాడు. అయితే, సంధ్య షిండే అనే డాన్‌కి సోదరి. అంతేకాదు భయంకరమైన క్రిమినల్ అయిన జక్కా ఆమెను ఇష్టపడుతుంటాడు. మరి కృష్ణ తన ప్రేమ కోసం ఏం చేశాడు అనేది కథ.
    4 . విక్రమార్కుడు(జూన్ 23 , 2006)
    U/A|161 minutes|యాక్షన్,హాస్యం
    సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ రాథోడ్‌ను పోలి ఉండే సత్తిబాబు, అతని మరణం తర్వాత అతని కుమార్తెను దత్తత తీసుకుంటాడు. రాథోడ్ స్థానంలో పోలీసు అధికారిగా వెళ్లి దుష్ట బావూజీ దోపిడీలను అంతం చేస్తాడు.
    5 . శంభో శివ శంభో(జనవరి 14 , 2010)
    U/A|159 min.|యాక్షన్,డ్రామా
    కన్న స్నేహం కోసం ఎంత దూరమైన వెళ్తాడు. తన స్నేహితుడు సంతోష్‌కు అతను ప్రేమించిన అమ్మాయితో పెళ్లి చేయించి కన్నతో పాటు మరో ఇద్దరు స్నేహితులు తీవ్రంగా గాయపడుతారు. అయితే చిన్న గొడవ కారణంగా విడిపోయిన సంతోష్‌కు గుణపాఠం చెప్పాలని కన్న అతని స్నేహితులు నిర్ణయించుకుంటారు. మరి అతనికి ఎలాంటి గుణపాఠం చెప్పారన్నది కథ.
    6 . పవర్(సెప్టెంబర్ 12 , 2014)
    A|143 minutes|యాక్షన్,డ్రామా,రొమాన్స్
    పోలీసు ఆఫీసర్‌ కావాలని హీరో (తిరుపతి) కలలు కంటుంటాడు. మరోవైపు అదే పోలికలతో ఉన్న ఏసీపీ బల్‌దేవ్‌ సహాయ్‌ మనుషులు హోం మంత్రి తమ్ముడ్ని కిడ్నాప్‌ చేస్తారు. అనంతరం అండర్‌గ్రౌండ్‌కు తీసుకెళ్తారు. పోలీసు అధికారి లాగే ఉన్న తిరుపతిని చూసి బలదేవ్‌ సహాయ్‌ స్థానంలోకి హోంమంత్రి తీసుకొస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? ఇంతకీ బల్‌దేవ్‌ సహాయ్‌ ఏమయ్యాడు? అన్నది కథ.
    7 . బెంగాల్ టైగర్(డిసెంబర్ 10 , 2015)
    U/A|145 minutes|యాక్షన్,రొమాన్స్
    ఆకాశ్(రవి తేజ) తనను ఇష్టపడే మహిళను ఇంప్రెస్ చేయడానికి సెలబ్రెటీగా మారాలని నిర్ణయించుకుంటాడు. ఈ క్రమంలో అతను రాజకీయ నాయకుడిని రాయితో కొట్టి అతని దగ్గరే పనిచేస్తాడు. అయితే మొదట ఫేమస్ కావాలని ఇదంతా చేసినా... అతని లక్ష్యం వేరుగా ఉంటుంది. ఇంతకు ఆకాశ్ లక్ష్యం ఏమిటి? అన్నది మిగతా కథ.
    8 . రాజా ది గ్రేట్(అక్టోబర్ 18 , 2017)
    U/A|150 mins|యాక్షన్,హాస్యం,రొమాన్స్
    కంటి చూపులేని రాజా.. ఆసాధారణ ప్రతిభకలవాడు. ఓ యువతి ఆపాదలో ఉన్నప్పుడు ఆమెకు సాయం చేయాలనుకుంటాడు. ఆమెను రక్షించే క్రమంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు అన్నది మిగతా కథ.
    9 . క్రాక్(జనవరి 09 , 2021)
    U/A|154 minutes|యాక్షన్,థ్రిల్లర్
    హీరో నిక్కచ్చిగా ఉండే పోలీసాఫీసర్‌. సీఐగా ఒంగోలుకి వెళ్లాక అక్కడ ముఠా నాయకుడు కఠారి కృష్ణ(సముద్రఖని)తో వైరం ఏర్పడుతుంది. ఈ క్రమంలోనే కానిస్టేబుల్‌ హత్యకు గురవుతాడు. ఆ హత్యతో కఠారీ కృష్ణకు సంబంధం ఏంటి? ఈ కేసును వీరశంకర్‌ (రవితేజ) ఎలా ఛేదించాడు? అన్నది కథ.

    రవితేజ, డైరెక్టర్‌ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ హిట్ చిత్రం క్రాక్‌. మాస్‌కి నిర్వచనంలా కనిపించే రవితేజ ఇందులో పోలీసుగా కనిపించారు. నేరస్తుల పట్ల నిక్కచ్చిగా వ్యవహరించే పోతరాజు వీరశంకర్‌ పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయారు. ఇందులో రవితేజకు జంటగా శ్రుతి హాసన్‌ నటించగా సముద్రఖని, వరలక్ష్మీ, దేవీ ప్రసాద్‌ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఎస్‌.ఎస్‌. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

    10 . ధమాకా(డిసెంబర్ 23 , 2022)
    U/A|139 minutes|యాక్షన్,హాస్యం
    ధమాకా చిత్రంలో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఒకరు ధనవంతుడు, మరొకరు మధ్యతరగతి వ్యక్తి. ధనవంతుడు రవితేజ ఆస్తిని లాక్కోవడానికి జయరామ్‌ ప్రయత్నిస్తాడు. రవితేజ తన ఆస్తిని, కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడు అనేది మిగతా కథ.
    11 . రావణాసుర(ఏప్రిల్ 07 , 2023)
    A|140 minutes|యాక్షన్,థ్రిల్లర్
    ఫరియా అబ్దుల్లా దగ్గర రవీంద్ర (రవితేజ) జూనియర్‌ లాయర్‌గా పనిచేస్తుంటాడు. కోర్టులో న్యాయం జరగకపోతే బాధితులకు బయట న్యాయం చేస్తుంటాడు. ఈ క్రమంలో మేఘా ఆకాష్‌ ఓ కేసు విషయమై రవితేజ, ఫరియా అబ్దుల్లాను సంప్రదిస్తుంది. తన తండ్రి సంపత్‌ రాజ్‌పై పడిన హత్య అభియోగం వెనక నిజాలు వెలికితీసేందుకు వారి సాయం కోరుతుంది. అయితే మర్డర్స్‌ మాత్రం ఒకదాని తర్వాత ఒకటి జరుగుతూనే ఉంటాయి. ఇలా వరుస హత్యలు చేస్తోంది ఎవరు? రవితేజకు హత్యలకు సంబంధం ఏంటి? అనేది సినిమా కథాంశం.

    @2021 KTree