Editorial List
తెలుగులో దేవర సినిమాలాంటి టాప్ యాక్షన్ థ్రిల్లర్ సినిమాలు
50+ views19 days ago
జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర తాజాగా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఇలాంటి సినిమాలను ఆస్వాదించేవారికి తెలుగులో మరికొన్ని అద్భుతమైన యాక్షన్-థ్రిల్లర్ చిత్రాలు ఉన్నాయి. యాక్షన్-థ్రిల్లర్ సినిమాలకు తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఆదరణ ఉంటుంది. ఈ జానర్‌లో కథలు మాసివ్‌గా ఉండడమే కాకుండా, మనసు హత్తుకునే భావోద్వేగాలతో కూడి ఉంటాయి. హీరో పాత్రల ఆవిష్కరణ, పవర్‌ఫుల్ డైలాగులు, అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్‌లు, విజువల్ ఎఫెక్ట్స్ ఈ సినిమాలకు ప్రాణం పోస్తాయి. ఆ చిత్రాల జాబితా, ఓటీటీ వివరాలను ఇక్కడ తెలుసుకోండి.
1 . విరూపాక్ష(ఏప్రిల్ 21 , 2023)
A|146 minutes|థ్రిల్లర్,హారర్,మిస్టరీ,యాక్షన్
రుద్రవరం అనే ఊరిలో అనుమానాస్పదంగా చాలామంది దారుణంగా చనిపోతుంటారు. ఈ మరణాల చేతబడి వల్ల జరుగుతున్నయా? లేదా ఎవరైనా హత్య చేస్తున్నారా? అనే విషయాన్ని కనుక్కునేందుకు హీరో సాయిధరమ్ తేజ్ ఏం చేశాడు? నందినీ పాత్ర ఏంటీ? ఆ డెత్ మిస్టరీ వెనుక అసలు ఎవరున్నారు? అనేది కథ.
2 . సాహో(ఆగస్టు 30 , 2019)
UA|170 minutes|యాక్షన్,థ్రిల్లర్
వాజీ అనే నగరం కేంద్రంగా గ్యాంగ్‌స్టర్ కార్యకలాపాలను సిండికేట్‌గా రాయ్( జాకీ ష్రాప్) నిర్వహిస్తుంటాడు. అండర్‌వరల్డ్‌ను చేజిక్కించుకోవాలని దేవరాజ్ ప్రయత్నిస్తుంటాడు. ఈ క్రమంలో రాయ్ ఓ రోడ్డు ప్రమాదంలో చనిపోతాడు. ఆ తర్వాత అతని కొడుకు విశ్వక్ క్రైమ్ వరల్డ్‌లోకి అడుగు పెడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందన్నది కథ
3 . యశోద(నవంబర్ 11 , 2022)
UA|132 minutes|సైన్స్ ఫిక్షన్,థ్రిల్లర్
యశోద(సమంత) పేద ఒక పేద యువతి. తన ఇంట్లో ఆర్థిక పరిస్థితి వల్ల అద్దె తల్లి కావడానికి ఒప్పుకుంటుంది. ఆమెను మధు(వరలక్ష్మి శరత్ కుమార్)కి చెందిన ఎవా అనే సరోగసీ సెంటర్‌కి తీసుకెళ్తారు. అక్కడ యశోద అద్దె గర్భం మాటున జరగుతున్న ఘోరాలు తెలుస్తాయి. సరోగసి మాఫియాతో సమంత ఎలా పోరాడింది? ఆ మాఫియా కోరల్లోంచి సమంత బయటపడిందా? అనేది కథ
4 . ఇస్మార్ట్ శంకర్(జూలై 18 , 2019)
A|141 minutes|యాక్షన్,సైన్స్ ఫిక్షన్,థ్రిల్లర్
ఇస్మార్ట్ శంకర్ ఒక కాంట్రాక్ట్ కిల్లర్. ఓ రాజకీయ నాయకున్ని హత్య చేసి తన లవర్‌తో పారిపోతాడు. ఈ హత్య కేసును విచారిస్తున్న క్రమంలో పోలీస్ అధికారి అరుణ్ చనిపోతాడు. దీంతో పోలీసులు అరుణ్ మెమోరీని శంకర్‌కు అతనికి తెలియకుండా బదిలీ చేస్తారు. దీంతో కథ కీలక మలుపు తిరుగుతుంది.
5 . రంగస్థలం(మార్చి 30 , 2018)
UA|174 minutes|డ్రామా,హిస్టరీ,రొమాన్స్
ఊరి ప్రెసిడెంట్‌గా 30 ఏళ్ల నుంచి ఫణీంద్ర భూపతి (జగపతిబాబు) ప్రజలను పీడిస్తుంటాడు. అతడి అన్యాయాలకు హీరో అన్న కుమార్‌బాబు (ఆది పినిశెట్టి) ఎదురు తిరుగుతాడు. ఫణీంద్ర భూపతికి పోటీగా నామినేషన్ వేస్తాడు. ఈ క్రమంలోనే కుమార్‌బాబు అనూహ్యంగా హత్యకు గురవుతాడు. అన్న చావుని చూసిన చిట్టిబాబు (రామ్‌చరణ్) ఎలా రివేంజ్ తీర్చుకున్నాడన్నది కథ.
6 . బాహుబలి: ది బిగినింగ్(జూలై 10 , 2015)
UA|158 minutes (Telugu)159 minutes (Tamil)|యాక్షన్,డ్రామా,హిస్టరీ
మాహిష్మతి రాజ్యంలో, శివుడు అనే ధైర్యవంతుడైన యువకుడు... ఒక యువ యోధురాలుతో ప్రేమలో పడతాడు. ఆమెను ప్రేమిస్తున్న క్రమంలో అతని కుటుంబం, తన నిజమైన వారసత్వం గురించి తెలుసుకుంటాడు.
7 . సరిపోదా శనివారం(ఆగస్టు 29 , 2024)
UA|యాక్షన్,థ్రిల్లర్
సూర్య (నాని) ఎల్‌ఐసీ ఎజెంట్‌గా పనిచేస్తుంటాడు. కళ్లెదుట అన్యాయం జరిగితే అసలు సహించలేడు. తన కోపాన్ని ప్రదర్శించడానికి శనివారాన్ని సూర్య ఎంచుకుంటాడు. మరోవైపు సోకులపాలెం ప్రాంతంలోని ప్రజలు కష్టాలు అనుభవిస్తుంటారు. అక్కడ అరాచకం చేస్తున్న పోలీసు అధికారిని సూర్య ఎలా ఎదిరించాడు? అక్కడి వారికి ఏ విధంగా అండగా నిలిచాడు? అన్నది స్టోరీ. సరిపోదా శనివారం సినిమాను రూ. 90 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు.
8 . ఆర్ఆర్ఆర్(మార్చి 25 , 2022)
UA|182 minutes|యాక్షన్,డ్రామా,హిస్టరీ
నిజాం రాజును కలిసేందుకు వచ్చిన బ్రిటిష్ అధికారి గోండు పిల్లను తమ వెంట ఢిల్లీకి తీసుకెళ్తారు. ఆ గోండు జాతి నాయకుడైన భీమ్(జూ.ఎన్టీఆర్) ఆ పిల్లను వెతుక్కుంటూ ఢిల్లీకి వస్తాడు. ఈ విషయం తెలిసిన బ్రిటిష్ ప్రభుత్వం అతన్ని పట్టుకునేందుకు రామరాజు(రామ్‌చరణ్)ను ప్రత్యేక అధికారిగా నియమిస్తుంది. ఈక్రమంలో ఓ సంఘటన వల్ల భీమ్- రామరాజు ఒకరికొకరు తెలియకుండానే ప్రాణ స్నేహితులుగా మారుతారు. కానీ కొన్ని పరిణామాల వల్ల ఒకరిపై ఒకరు దాడి చేసుకోవాల్సి వస్తుంది. ఇంతకు గోండు పిల్లను బ్రిటిష్ చర నుంచి భీమ్ విడిపించాడా? అసలు రామరాజు బ్రిటిషర్ల దగ్గర ఎందుకు పనిచేశాడు అనేది మిగతా కథ.
9 . దసరా(మార్చి 30 , 2023)
UA|156 minutes|యాక్షన్,అడ్వెంచర్,డ్రామా
ధరణి తన స్నేహితులతో కలిసి బొగ్గుని దొంగతనం చేస్తూ.. మద్యం సేవిస్తూ అందరితో గొడవలు పడుతూ ఉంటాడు. కానీ మరుసటి రోజు అవన్నీ మర్చిపోతాడు. ఈ క్రమంలో ఓ రోజు చిన్న నంబి ( షైన్ టామ్ చాకో) సిల్క్ బార్‌లో కూడా గొడవపడి మర్చిపోతాడు. దానిని చిన్న తంబి చాలా సీరియస్ గా తీసుకుంటాడు. ఈక్రమంలో ఓ రాత్రి ముసుగు దుండగులు ధరణి ప్రాణ స్నేహితుడిని చంపుతారు. ఇంతకు ధరణి స్నేహితుడిని చంపిందెవరు? వారిపై ఎలా ప్రతికారం తీర్చుకున్నాడు అన్నది మిగతా కథ
10 . యానిమల్ (డిసెంబర్ 01 , 2023)
A|201 minutes|యాక్షన్,క్రైమ్,డ్రామా
దేశంలోని అత్యంత సంపన్నుల్లో బల్బీర్ సింగ్ (అనిల్ కపూర్) ఒకరు. ఆయన కుమారుడు రణ్ విజయ్ సింగ్ (రణబీర్ కపూర్). తండ్రి అంటే అమితమైన ప్రేమ. అయితే తన దూకుడు మనస్తత్వం కారణంగా హీరోకి తండ్రితో దూరం పెరుగుతుంది. దీంతో అమెరికా వెళ్లిపోతాడు. ఓ రోజు తండ్రిపై హత్యయాత్నం జరిగినట్లు తెలిసుకొని విజయ్ ఇండియాకు వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? బల్బీర్‌పై దాడి చేసిన వారిపై హీరో ఎలా ప్రతికారం తీర్చుకున్నాడు? అన్నది కథ.
11 . సలార్(డిసెంబర్ 22 , 2023)
UA|177 minutes|థ్రిల్లర్,యాక్షన్
ఖాన్సార్ సామ్రాజ్యానికి రాజ మన్నార్ (జగపతిబాబు) రూలర్. సామ్రాజ్యంలోని ప్రాంతాలను దొరలు పాలిస్తుంటారు. ఖాన్సార్ పీఠం కోసం రాజ మన్నార్‌ను దొరలు సొంతంగా సైన్యం ఏర్పాటు చేసుకొని హత్య చేస్తారు. తండ్రి కోరిక మేరకు వరద రాజమన్నార్ (పృథ్వీరాజ్ సుకుమారన్) ఖాన్సార్‌కు రూలర్ అవ్వాలని భావిస్తాడు. ఇందుకోసం చిన్ననాటి స్నేహితుడు దేవా (ప్రభాస్) సాయం కోరతాడు. ఆ ఒక్కడు అంతమంది దొరల సైన్యాన్ని ఎలా ఎదిరించాడు? అన్నది స్టోరీ.
12 . హిట్: ది ఫస్ట్ కేస్(ఫిబ్రవరి 28 , 2020)
UA|130 minutes|యాక్షన్,మిస్టరీ,థ్రిల్లర్
ఇన్‌స్పెక్టర్ విక్రమ్ తన లవర్ నేహా మిస్‌కావడంతో గందరగోళంలో ఉంటాడు. ఇదే సమయంలో తన లవర్ మిస్సింగ్ కేసుతో సంబంధం ఉన్న ప్రీతీ అనే అమ్మాయి మిస్సింగ్ కేసులో ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్‌గా విక్రమ్ అపాయింట్ అవుతాడు. ఈ కేసు దర్యాప్తులో కొన్ని షాకింగ్ విషయాలు తెలుసుకుంటాడు. ఆ తర్వాత విక్రమ్ ఏం చేశాడు అనేది కథ.
13 . పుష్ప: ది రైజ్ - పార్ట్ 01(డిసెంబర్ 17 , 2021)
UA|179 minutes|యాక్షన్,థ్రిల్లర్
పుష్ప (అల్లుఅర్జున్) ఎర్రచందనం కూలీ. కొండా రెడ్డి (అజయ్ ఘోష్) సోదరులకు స్మగ్లింగ్‌లో సలహాలు ఇచ్చే స్థాయికి అతడు వెళతాడు. అక్కడ నుంచి సిండికేట్‌ను శాసించే రేంజ్‌కు పుష్ప ఎలా ఎదిగాడు? మంగళం శ్రీను (సునీల్)తో ఉన్న గొడవేంటి? అన్నది కథ.