• TFIDB EN
  • Editorial List
    Ravi Teja Top Comedy Movies: ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన రవితేజ టాప్‌ కామెడీ సినిమాలు
    Dislike
    2k+ views
    6 months ago

    టాలీవుడ్‌లో కామెడీని అద్భుతంగా పండించగల అతికొద్ది మంది నటుల్లో రవితేజ ఒకరు. ఆయన తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులకు గిలిగింతలు పెడుతుంటారు. అందుకే రవితేజతో సినిమా అంటే హాస్య సన్నివేశాలు ఎక్కువగా ఉండేలా డైరెక్టర్లు జాగ్రత్త పడుతుంటారు. ఇదిలా ఉంటే రవితేజ ఇప్పటివరకూ ఎన్నో సూపర్‌ హిట్‌ సినిమాలు చేశారు. ముఖ్యంగా ఆయన చేసిన కామెడీ ఒరియెంటెడ్‌ మూవీస్‌ టాలీవుడ్‌లో ఘన విజయాలు అందుకున్నాయి. కొన్ని సినిమాలు యావరేజ్‌ టాక్‌ వచ్చినప్పటికీ రవితేజ కామెడీకి మాత్రం మంచి మార్కులే పడ్డాయి. ఈ నేపథ్యంలో రవితేజ నటించిన బెస్ట్‌ కామెడీ చిత్రాలు మీకోసం..

    ఇంగ్లీష్‌లో చదవండి

    1 . ఇడియట్(ఆగస్టు 22 , 2002)
    U|133 minutes|యాక్షన్,హాస్యం
    చంటి అనే యువకుడిని దుండగులు కొట్టినప్పుడు సుచిత్ర అనే యువతి అతనికి రక్త దానం చేసి కాపాడుతుంది. ఈ విషయం తెలిసిన చంటి ఆమెతో ప్రేమలో పడుతాడు. సుచిత్ర తండ్రి పోలీస్ కమిషనర్‌ కావడంతో చంటి అతని నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటాడు.

    రవితేజ కెరీర్‌ను మలుపు తిప్పిన సినిమా ఇడియట్‌. ఇందులో కాలేజీ స్టూడెంట్‌గా రవితేజ అదరగొట్టాడు. పూరి జగన్నాథ్‌ డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రంలో అప్పట్లో సెన్సెషన్‌ క్రియేట్ చేసింది. ఇందులో రక్షిత హీరోయిన్‌గా చేసింది. ప్రకాష్‌ రాజ్‌, కోటా శ్రీనివాసరావు, శ్రీనివాస్‌ రెడ్డి ముఖ్యపాత్రలు పోషించారు.

    2 . అవును వాళ్ళిద్దరూ ఇష్ట పడ్డారు!(ఆగస్టు 02 , 2002)
    U|హాస్యం,రొమాన్స్
    ఒక యువతి, యువకుడు ఒకే ఇంట్లో అద్దెకు ఉంటుంటారు. ఒకరికొకరు ఎదురు పడకుండా లెటర్ల ద్వారా సంభాషణలు జరుపుతుంటారు. ఒకరిపైఒకరు ప్రేమను పెంచుకుంటున్న క్రమంలో ఊహించని విధంగా యువతికి మరో వ్యక్తితో పెళ్లి ఫిక్స్‌ అవుతుంది.
    3 . వెంకీ(మార్చి 26 , 2004)
    U|170 minutes|హాస్యం,మిస్టరీ,రొమాన్స్
    వెంకటేశ్వర్లు పోలీస్ ఫోర్స్‌లో తన స్నేహితులతో కలిసి రైలులో హైదరాబాద్‌కు బయల్దేరుతాడు. కానీ రైలులో ఓ హత్య జరుగుతుంది. ఆ హత్య వెంకీ అనతి స్నేహితులపై పడుతుంది. అయితే వీరంతా శిక్షణ కోసం అకాడమీలో చేరినప్పుడు.. రైలులో జరిగిన హత్యకు కారణం తెలుసుకుంటారు.

    రవితేజ కెరీర్‌లోని టాప్‌ 3 కామెడీ చిత్రాల్లో వెంకీ కచ్చితంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ సినిమాలో రైలులో వచ్చే కామెడీ సీన్స్‌ ఇప్పటికీ చాలా మంది ఫేవరేట్‌. యూట్యూబ్‌లో పెట్టుకొని మరీ రైలు సీన్స్‌ను నెటిజన్లు చూస్తుంటారు. శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో స్నేహా హీరోయిన్‌గా చేసింది. బ్రహ్మానందం, A.V.S, క్రిష్ణ భగవాన్, అషుతోష్‌ రానా కీలక పాత్రలు పోషించారు.

    4 . భద్ర(మే 12 , 2005)
    U/A|డ్రామా
    భద్ర తన స్నేహితుడి చెల్లెలైన అనుని ప్రేమిస్తాడు. ఓ రోజు శత్రువుల దాడిలో అను మినహా అమె ఫ్యామిలీ అంతా చనిపోతుంది. విలన్ల నుంచి అనుని రక్షిస్తానని చనిపోతున్న తన ఫ్రెండ్‌కు భద్ర మాట ఇస్తాడు.

    రవితేజ కెరీర్‌లోని టాప్‌-5 హిట్‌ సినిమాల్లో ‘భద్ర’ కచ్చితంగా ఉంటుంది. 2005లో వచ్చిన ఈ చిత్రం టాలీవుడ్‌లో రవితేజ ప్రస్థానాన్ని సుస్థిరం చేసింది. బోయపాటి శీను దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో యాక్షన్‌తో పాటు కామెడీకి పెద్దపీట వేశారు. మీరా జాస్మిన్, అర్జున్ బజ్వా, ప్రకాష్ రాజ్, ప్రదీప్ రావత్ ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు. మే 12, 2005న విడుదలైన భారీ విజయం సాధించింది. దీంతో ఈ సినిమాను పలు రీమేక్ చేశారు.

    5 . దుబాయ్ శీను(జూన్ 08 , 2007)
    U|హాస్యం
    దుబాయ్ వెళ్లి స్థిరపడాలని భావించిన శీను ఓ వ్యక్తి చేతిలో మోసపోయి ఫ్రెండ్స్‌తో పాటు ముంబైలో కాలం వెళ్లదీస్తుంటాడు. ఈక్రమంలో మధుమతి అనే అమ్మాయి ప్రేమలో పడుతాడు. ఒక భయంకరమైన డాన్ తన స్నేహితుడిని, మధుమతి సోదరుడిని చంపాడని తెలుసుకుని అతనిపై ప్రతీకారానికి బయల్దేరుతాడు.
    6 . ఆంజనేయులు(ఆగస్టు 14 , 2009)
    A|హాస్యం
    ఆంజనేయులు ఒక న్యూస్ ఛానెల్‌లో రిపోర్టర్. తన తోటి సహోద్యోగి హత్య కుట్రను ఛేదించేందుకు అవినీతిపరుడైన రాజకీయ నాయకులు, గ్యాంగ్‌స్టర్‌ల లింక్‌ను బయటపెట్టేందుకు ఆంజనేయులు రహస్యంగా విచారిస్తాడు.
    7 . కిక్(మే 08 , 2009)
    U/A|162 minutes|యాక్షన్,క్రైమ్,రొమాన్స్
    ఎప్పుడు సాహసాలు అంటే ఇష్టపడే కళ్యాణ్‌తో నైనా విడిపోతుంది. అతన్ని వదిలి కళ్యాణ్‌ను వెంబడిస్తున్న పోలీసును పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతుంది.
    8 . మిరపకాయ్(జనవరి 12 , 2011)
    U/A|160 minutes|యాక్షన్,హాస్యం
    పోలీసు ఆఫీసర్‌ ఓ మిషన్‌లో భాగంగా లెక్చరర్‌గా కాలేజీలో చేరతాడు. ప్రేమ కోసం ఒకరిని, ప్రొఫెషన్‌ కోసం ఇంకొకరిని ప్రేమలో పడేస్తాడు.ఆ ఇద్దరిలో హీరో ఎవర్ని చేసుకున్నాడు? అతడు చేపట్టిన మిషన్‌ సక్సెస్‌ అయ్యిందా? లేదా? అన్నది కథ.
    9 . రాజా ది గ్రేట్(అక్టోబర్ 18 , 2017)
    U/A|150 mins|యాక్షన్,హాస్యం,రొమాన్స్
    కంటి చూపులేని రాజా.. ఆసాధారణ ప్రతిభకలవాడు. ఓ యువతి ఆపాదలో ఉన్నప్పుడు ఆమెకు సాయం చేయాలనుకుంటాడు. ఆమెను రక్షించే క్రమంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు అన్నది మిగతా కథ.
    10 . ధమాకా(డిసెంబర్ 23 , 2022)
    U/A|139 minutes|యాక్షన్,హాస్యం
    ధమాకా చిత్రంలో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఒకరు ధనవంతుడు, మరొకరు మధ్యతరగతి వ్యక్తి. ధనవంతుడు రవితేజ ఆస్తిని లాక్కోవడానికి జయరామ్‌ ప్రయత్నిస్తాడు. రవితేజ తన ఆస్తిని, కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడు అనేది మిగతా కథ.

    @2021 KTree