• TFIDB EN
  • అమెజాన్‌ ప్రైమ్‌లో బెస్ట్ తెలుగు కామెడీ సినిమాలు
    Dislike
    2k+ views
    1 year ago

    అమెజాన్‌ ప్రైమ్‌లో చాలా కామెడీ సినిమాలు ఉన్నాయి. వీటిలో నాన్‌స్టాప్ కామెడీ అందించి వినోదాన్ని పంచే చిత్రాల లిస్ట్‌ ఇక్కడ ఇస్తున్నాం. ఈ జాబితాలో జాతిరత్నాలు, హుషారు, ఈనగరానికి ఏమైంది వంటి హిట్ సినిమాలు ఉన్నాయి. వీటిలో మీకు నచ్చిన సినిమాలను వీకెండ్‌లో చూసి ఎంజాయ్ చేయండి.

    ఇంగ్లీష్‌లో చదవండి

    1 . మెకానిక్ రాకీ(నవంబర్ 22 , 2024)
    UA|యాక్షన్,హాస్యం,డ్రామా
    రాకీ (విష్వక్‌ సేన్‌) తండ్రి నడుపుతున్న గ్యారేజీలో మెకానిక్‌గా చేస్తూ డ్రైవింగ్‌ నేర్పిస్తుంటాడు. అతడి వద్ద డ్రైవింగ్‌ నేర్చుకునేందుకు మాయ (శ్రద్ధ శ్రీనాథ్‌), ప్రియా (మీనాక్షి చౌదరి) జాయిన్‌ అవుతారు. తను చదువుకునే రోజుల్లోనే ప్రియను రాకీ ఇష్టపడతాడు. చాలా సంవత్సరాల గ్యాప్‌ తర్వాత కలిసిన ప్రియకు రాకీ దగ్గరయ్యాడా? ఆమె గురించి రాకీకి తెలిసిన షాకింగ్‌ విషయాలు ఏంటి? వాళ్ల లైఫ్‌ను మాయ ఏ విధంగా ప్రభావితం చేసింది? రాంకీ రెడ్డి (సునీల్‌) వల్ల రాకీకి వచ్చిన సమస్యలు ఏంటి? అన్నది స్టోరీ.
    2 . స్ట్రీ 2(ఆగస్టు 15 , 2024)
    UA|హాస్యం,హారర్
    చందేరీ గ్రామంలో ‘స్త్రీ’ సమస్య తొలగింది అని అందరూ ఊపిరి పీల్చుకునేలోపు ‘సర్కట’తో కొత్త సమస్య మొదలవుతుంది. ఈ సమస్యను విక్కీ (రాజ్ కుమార్ రావు), రుద్ర (పంకజ్ త్రిపాఠి), జన (అభిషేక్ బెనర్జీ), బిట్టు (ఆపర్ శక్తి ఖురానా)తో కలిసి ఓ భూతం (శ్రద్ధా కపూర్) ఎలా ఎదుర్కొంది? అన్నది స్టోరీ.
    3 . ది మినిస్ట్రీ అఫ్ ఉంగెంతలేమాన్ల్య్ వార్ఫేర్(ఏప్రిల్ 13 , 2024)
    A|యాక్షన్,హాస్యం
    బ్రిటిష్‌ ప్రధాని విన్‌స్టన్‌ చర్చిల్‌, సైనిక అధికారులు రెండో ప్రపంచ యుద్ధంలో హిట్లర్‌పై పోరాడేందుకు అత్యుత్తమ నైపుణ్యాలు కలిగిన సైనికులను రిక్రూట్‌ చేసుకుంటారు. వారిని ఒక టీమ్‌గా ఏర్పాటు చేసి నాజీలపైకి పంపుతారు. అప్పుడు వారు ఏం చేశారు? శత్రువులను సాహాసోపేతంగా ఎలా ఎదుర్కొన్నారు? అన్నది స్టోరీ.
    4 . ఓం భీమ్ బుష్(మార్చి 22 , 2024)
    UA|హాస్యం,డ్రామా
    క్రిష్, వినయ్, మాధవ్ సిల్లీ పనులు చేస్తూ కాలాన్ని గడుపుతుంటారు. కొన్ని నాటకీయ పరిణామాల మధ్య వారు భైరవపురం అనే గ్రామంలో అడుగుపెడతారు. అక్కడి పరిస్థితులు వీరిని ఎలా మార్చాయి? దెయ్యం ఉన్న కోటలో వీరు ఎందుకు అడుగుపెట్టారు? కోటలో వీరికి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? అన్నది కథ.
    5 . #మాయలో(డిసెంబర్ 15 , 2023)
    UA|హాస్యం,రొమాన్స్
    మాయ, క్రిష్‌, సింధు చిన్ననాటి స్నేహితులు. మాయకు తన ప్రియుడితో పెళ్లి ఫిక్స్‌ కావడంతో క్రిష్‌, సింధులను అహానిస్తుంది. ఓ కారు అద్దెకు తీసుకొని క్రిష్‌, సింధు రోడ్డుమార్గంలో బయలుదేరుతారు. వీరిద్దరి ప్రయాణం ఎలా సాగింది? ఈ ముగ్గురి స్నేహ బంధం ఎలాంటింది? అన్నది కథ.
    6 . ఫ్రీలాన్స్(అక్టోబర్ 27 , 2023)
    A|యాక్షన్,హాస్యం
    మాసన్‌ పెట్టిట్స్ (జాన్‌ సెనా) మాజీ సైనికుడు. ఓ మహిళ జర్నలిస్టుకు రక్షణగా పాల్డోనియా దేశానికి వెళ్తాడు. ఆ దేశాధ్యాక్షుడిని జర్నలిస్టు ఇంటర్యూ చేస్తుండగా వారిపై తిరుగుబాటు దారులు అటాక్‌ చేస్తారు. వారి బారి నుంచి జర్నలిస్టుతో పాటు దేశాధ్యక్షుడిని హీరో ఎలా రక్షించాడు? అన్నది స్టోరీ.
    7 . షాట్ బూట్ త్రీ(అక్టోబర్ 06 , 2023)
    U|అడ్వెంచర్,హాస్యం,ఫ్యామిలీ
    పెంపుడు కుక్క మ్యాక్స్‌ నలుగురు పిల్లల జీవితాల్లో గొప్ప ఆనందాన్ని తీసుకొస్తుంది. ఓ రోజు మ్యాక్స్‌ కనిపించకుండా పోతుంది. మ్యాక్స్‌ కోసం నలుగురు పిల్లలు వెతకడం మెుదలుపెడతారు. ఈ ప్రయాణంలో వారికి ఎటువంటి అనుభవాలు ఎదురయ్యాయి? అన్నది కథ.
    8 . స్లం డాగ్ హస్బెండ్(జూలై 29 , 2023)
    UA|హాస్యం
    ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు జాతకంలో దోషం వల్ల ఓ యువకుడు.. తొలుత ఓ కుక్క మెడలో తాళి కడతాడు. ఆ తర్వాత అతనిపై ఓ లీగల్ కేసు ఫైల్ అవుతుంది? అసలు ఆ కేసు వేసింది ఏవరు? ఇంతకి ఆ యువకుడు తన ప్రేయసిని దక్కించుకుంటాడా? అనేది మిగిలిన కథ
    9 . ఓ సాథియా(జూలై 07 , 2023)
    U|హాస్యం,రొమాన్స్
    అర్జున్‌ (ఆర్యన్‌ గౌరా) బీటెక్ కాలేజీలో కీర్తి (మిస్తీ చక్రవర్తి)ని గాఢంగా ప్రేమిస్తాడు. కీర్తి కూడా అతన్ని లవ్ చేస్తుంది. ఇంతలో కీర్తి ఎవరికి కనిపించకుండా ఎక్కడికో వెళ్లిపోతుంది. అర్జున్ ఆమె కోసం హైదరాబాద్‌లోని కీర్తి చదివే కాలేజీలోనే జాయిన్ అవుతాడు. కానీ, అప్పటికే కీర్తి, రాహుల్ అనే వ్యక్తితో ప్రేమలో ఉంటుంది. అసలు ఈ రాహుల్ ఎవరు? నిజంగానే రాహుల్ – కీర్తి ప్రేమించుకుంటున్నారా? చివరకు అర్జున్ ప్రేమ గెలుస్తుందా? అనేది మిగిలిన కథ.
    10 . భాగ్ సాలే(జూలై 07 , 2023)
    UA|హాస్యం,క్రైమ్
    అర్జున్ (శ్రీ సింహ కోడూరి) మధ్యతరగతి యువకుడు, మాయ (నేహా సోలంకి) అనే సంపన్న యువతి ప్రేమించుకుంటారు. అయితే అర్జున్ రిచ్ పర్సన్‌గా నటిస్తాడు. శామ్యూల్ (జాన్ విజయ్) శాలి శుక గజ (SSG) అని పిలిచే అరుదైన డైమండ్ కోసం మాయ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకోవడంతో వారి జీవితాలు మలుపు తిరుగుతాయి. మాయ కుటుంబం దగ్గర డైమండ్ లేతపోవడంతో శామ్యూల్ ఆమె తండ్రిని కిడ్నాప్ చేస్తాడు. ఈ క్రమంలో మాయ తన లవర్ అర్జున్ సహాయం కోరుతుంది. ఆ తర్వాత ఏమి జరిగింది? అర్జున్ ఎలా మాయ తండ్రిని ఎలా కాపాడాడు అనేదిన మిగతా కథ
    11 . మెమ్ ఫేమస్(మే 26 , 2023)
    UA|హాస్యం,డ్రామా
    తెలంగాణలోని ఓ విలేజ్‌కు చెందిన మయి(సుమంత్‌ ప్రభాస్‌), దుర్గ(మణి ఏగుర్ల), బాలి(మౌర్య చౌదరి) మంచి స్నేహితులు. తెల్లారితే గొడవలు, రాత్రి అయితే తాగుడు అన్నట్లు జీవితాన్ని గడుపుతుంటారు. మయి త‌న మ‌ర‌ద‌లు మౌనిక (సార్య ల‌క్ష్మణ్‌)ని ప్రేమిస్తాడు. ఆమె కూడా అతడ్ని ఇష్టపడుతుంది. అయితే జులాయిగా తిరిగే వీరంతా కలిసి ఓ టెంట్‌ హౌజ్ పెడతారు. అది బాగా నడుస్తున్న సమయంలో షాట్‌ సర్య్కూట్‌కి టెంట్‌ హౌజ్‌ మొత్తం కాలిపోతుంది. దీంతో యూట్యూబ్‌ ఛానెల్‌ పెట్టి వీడియోలు చేయడం స్టార్ట్‌ చేస్తారు. ఆ వీడియోల వల్ల గ్రామానికి ఎలాంటి మేలు జరిగింది? అనేది మిగతా కథ.
    12 . నూటొక్క జిల్లాల అందగాడు(సెప్టెంబర్ 03 , 2021)
    U|హాస్యం,డ్రామా
    హీరో వంశపారంపర్యంగా వచ్చిన బట్టతలతో బాధపడుతుంటాడు. విగ్గు, టోపీతో మేనేజ్‌ చేస్తుంటాడు. ఈ విషయం దాచి సహోద్యోగి అంజలి (రుహానిశర్మ)ని ప్రేమిస్తాడు. ఈ రహస్యం ఓ రోజు అంజలికి తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందన్నది కథ.
    13 . పాగల్(ఆగస్టు 14 , 2021)
    UA|హాస్యం,రొమాన్స్
    ప్రేమ్‌ (విశ్వక్‌ సేన్‌) కనిపించిన ప్రతీ అమ్మాయికీ ఐలవ్యూ చెబుతుంటాడు. కొందరు రిజెక్ట్‌ చేస్తే మరికొందరు డబ్బు కోసం అతడ్ని వాడుకొని వదిలేస్తుంటారు. ఇలా పలుమార్లు లవ్‌లో ఫెయిలైన ప్రేమ్‌ ఫైనల్‌గా పొలిటిషియన్‌ రాజీ (మురళిశర్మ)ని ప్రేమిస్తాడు. పురుషుడైన రాజీని హీరో ఎందుకు ప్రేమించాడు? నివేతా పేతురాజ్‌ ప్రేమ్‌ లైఫ్‌లోకి ఎలా వచ్చింది? అన్నది కథ.
    14 . ముగ్గురు మొనగాళ్ళు(ఆగస్టు 06 , 2021)
    UA|హాస్యం,థ్రిల్లర్
    హైదరాబాద్‌లో వరుసగా రాజకీయ నేతల హత్యలు జరుగుతుంటాయి. పోలీసులతో కలిసి అంధత్వం, చెవిటి, మూగ సమస్యలతో బాధపడుతున్న ముగ్గురు యువకులు హంతకులను ఎలా పట్టుకున్నారన్నది కథ.
    15 . జాతి రత్నాలు(మార్చి 11 , 2021)
    U|హాస్యం,డ్రామా
    మంచి ఉద్యోగాల కోసం తమ ఊరి నుంచి హైదరాబాద్ వచ్చిన ముగ్గురు యువకులు ఓ అపార్ట్‌మెంటులో దిగుతారు. అక్కడ పిలువని పార్టీకి వెళ్లి మర్డర్ అటెంప్ట్ కేసులో ఇరుక్కుంటారు. ఆ తర్వాత కేసు నుంచి ఎలా బయటపడ్డారనేది కథ.
    16 . క్లైమాక్స్(మార్చి 05 , 2021)
    UA|హాస్యం,థ్రిల్లర్
    నవ్య మల్టీ మిలియనీర్ విజయ్ మోడీ 7-స్టార్ సూట్‌లో రాత్రి గడిపుతుంది, అతని కథ వినడానికి ఒక కోటి ఆఫర్ చేస్తుంది. అయితే తెల్లవారుజామున మోదీ దారుణ హత్యకు గురవుతాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగతా కథ.
    17 . షాదీ ముబారక్(మార్చి 05 , 2021)
    U|హాస్యం,డ్రామా,రొమాన్స్
    మాధవ్ అనే ఎన్నారై వధువు కోసం భారతదేశానికి వస్తాడు. ఓ వెడ్డింగ్ కన్సల్టెంట్‌తో వధువులను చూసేందుకు ఒప్పందం చేసుకుంటాడు. ఇందుకోసం కన్సల్టెంట్‌ కూతురు సత్యభామ అతడికి తోడుగా వెళ్తుంది. అయితే మాధవ్‌ సత్యభామను ప్రేమించడంతో కథ మలుపు తిరుగుతుంది.
    18 . ప్రెషర్ కుక్కర్(ఫిబ్రవరి 21 , 2020)
    UA|హాస్యం,డ్రామా
    తన కొడుకును అమెరికా పంపించాలని నారాయణ కలగంటాడు. ఇంతలో కిషోర్ వీసా తిరస్కరించబడుతుంది. కాలక్రమంలో కిషోర్ గర్భిణీ స్త్రీల కోసం ఒక ఉత్పత్తిని కనుగొంటాడు. ఆ క్షణం నుంచి కిషోర్ జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది అనేది కథ
    19 . చూసి చూడంగానే(జనవరి 31 , 2020)
    UA|హాస్యం,డ్రామా,రొమాన్స్
    శివ తన తల్లి కారణంగా తనకు నచ్చినట్లు ఉండలేక ఇబ్బంది పడుతుంటాడు. ఇష్టం లేకుండానే బీటెక్ చదువుతాడు. అక్కడ ఐశ్వర్య అనే అమ్మాయితో ప్రేమలో పడుతాడు. కానీ ఆ అమ్మాయి బ్రేకప్ చెప్పి వెళ్లిపోతుంది. ఆ తర్వాత మరో అమ్మాయి పరిచయంతో శివ లైఫ్ టర్న్ అవుతుంది.
    20 . మత్తు వదలర(డిసెంబర్ 25 , 2019)
    UA|హాస్యం,క్రైమ్,థ్రిల్లర్
    బాబు, యేసు ఇద్దరు డెలివరీ ఏజెంట్లు, త్వరగా డబ్బు సంపాదించాలనే కోరికతో చట్టవిరుద్ధమైన పద్ధతులను అనుసరించాలని నిర్ణయించుకుంటారు. ఈక్రమంలో అనుకోని చిక్కుల్లో ఇరుక్కుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందనేది కథ.
    21 . క్రేజీ రొమాన్స్(అక్టోబర్ 02 , 2019)
    UA|హాస్యం,డ్రామా,రొమాన్స్
    లీ జే హూన్‌కు లవ్ బ్రేకప్ అయినా ప్రేయసిని మర్చిపోలేక పోతుంటాడు. ఈ క్రమంలో అతడు పనిచేసే ఆఫీస్‍లో సన్ యంగ్ కొత్తగా జాయిన్ అవుతుంది. ఆమె కూడా బాయ్‍ఫ్రెండ్‍తో గొడవ పడి విడిపోయి ఉంటుంది. వీరిద్దరికి పరిచయం ఏర్పడి ప్రేమలో పడతారు. అయితే వారి మధ్య కూడా విభేదాలు వస్తాయి. ప్రేమలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. వాటిని ఎలా పరిష్కరించుకున్నారు? అన్నది స్టోరీ.
    22 . నానిస్ గ్యాంగ్ లీడర్(సెప్టెంబర్ 13 , 2019)
    UA|హాస్యం,డ్రామా,థ్రిల్లర్
    విభిన్న నేపథ్యాలున్న ఐదుగురు మహిళలు తమ ప్రియమైన వారిని చంపిన వ్యక్తిపై ప్రతీకారం తీర్చుకోవడానికి 'పెన్సిల్'(నాని) అనే రచయిత సాయం కోరుతారు. మరి వారు ప్రతీకారం తీర్చుకోవడానికి పెన్సిల్ ఏంచేశాడు అన్నది కథ
    23 . కొబ్బరి మట్ట(ఆగస్టు 10 , 2019)
    UA|హాస్యం
    పెదరాయుడు, గ్రామపెద్ద. తన ఉమ్మడి కుటుంబం, ముగ్గురు భార్యలతో ఆనందంగా జీవితాన్ని గడుపుతుంటాడు. అయితే పెదరాయుడి వారసుడిగా అతన్ని పోలిన ఆండ్రాయిడు ప్రవేశంతో సమస్యలు ఎదుర్కొంటాడు. ఇంతకు అండ్యాయిడు ఎవరనేది కథలో ట్విస్ట్
    24 . బ్రోచేవారెవరురా(జూన్ 28 , 2019)
    U|హాస్యం,థ్రిల్లర్
    పరీక్షల్లో ఫెయిలై ఖాళీగా సమయం వృథా చేస్తున్న ముగ్గురు విద్యార్థులు తమ కాలేజీలో మిత్ర అనే అమ్మాయితో స్నేహం చేస్తారు. ఆమెకు తండ్రితో ఓ సమస్య వస్తుంది. మిత్రను ఆ సమస్య నుంచి బయట పడేలా చేస్తారు. కానీ వారు చిక్కుల్లో పడతారు.
    25 . 1వ ర్యాంక్ రాజు(జూన్ 21 , 2019)
    UA|హాస్యం,డ్రామా,రొమాన్స్
    రాజు అనే విద్యార్థి చదువులో నెంబర్ 1, కానీ లోకజ్ఞానం ఉండదు. మరి అలాంటి రాజు చదువుతో పాటు తన జీవితంలో ఎలా విజయం సాధించాడనేది ఈ సినిమా కథ
    26 . షాజమ్!(ఏప్రిల్ 05 , 2019)
    UA|యాక్షన్,హాస్యం
    ఒక ఉత్సవంలో బిల్లీ తన తల్లి నుంచి తప్పిపోతాడు. అప్పటి నుంచి నిరంతరం తన తల్లి కోసం వెతుకుతాడు. ఈక్రమంలో అతను ఓ తాంత్రికుడి వద్ద పెరుగుతాడు. అతని వద్ద నుంచి సూపర్ పవర్‌లను వారసత్వంగా పొందినప్పుడు అతని జీవితం కీలక మలుపు తిరుగుతుంది. ఇంతకు ఆ శక్తులను బిల్లీ ఎలా ఉపయోగించాడు అన్నది కథ.
    27 . చీకటి గదిలో చితక్కొట్టుడు(మార్చి 21 , 2019)
    A|హాస్యం,హారర్
    ఓ స్నేహితుల బృందం బ్యాచిలర్ పార్టీ కోసం నగరానికి దూరంగా ఉన్న విల్లాకు వెళ్తారు. ఆ విల్లాలో వారికి వింత పరిస్థితి ఎదురవుతుంది. ఓ అదృశ్య శక్తి వారిని వెంబడిస్తుంటుంది.
    28 . కొత్తగా మా ప్రయాణం(జనవరి 25 , 2019)
    UA|హాస్యం,డ్రామా,రొమాన్స్
    కార్తీక్, ఒక ప్లేబాయ్, కీర్తికి లివ్-ఇన్ రిలేషన్ షిప్ ప్రపోజ్ చేస్తాడు. అతను తన ఫిలాండరింగ్ మార్గాలను తప్పనిసరిగా ఆపాలనే షరతుపై ఆమె అంగీకరిస్తుంది. కానీ ఆమె అతన్ని మరొక అమ్మాయితో గుర్తించినప్పుడు పరిస్థితులు మారుతాయి.
    29 . బ్లఫ్ మాస్టర్(డిసెంబర్ 28 , 2018)
    UA|హాస్యం,థ్రిల్లర్
    ఉత్తమ్‌ కుమార్‌ (సత్యదేవ్‌) ప్రజలను మోసం చేస్తుంటాడు. అవని (నందిత శ్వేత) తన జీవితంలోకి అడుగుపెట్టాక మారతాడు. అయితే అతడికి పశుపతి (ఆదిత్య మీనన్‌) రూపంలో కొత్త సమస్య ఎదురవుతుంది. దాన్ని హీరో ఎలా అధిగమించాడు? అన్నది కథ.
    30 . హుషారు(డిసెంబర్ 14 , 2018)
    A|హాస్యం
    నలుగురు యువకులు చిన్నప్పటి నుంచి స్నేహం కోసమే బ్రతుకుతుంటారు. అయితే వారిలో ఒకరు క్యాన్సర్‌ బారిన పడతారు. ట్రీట్‌మెంట్‌కు రూ.30 లక్షలు అవసరమవుతాయి. అప్పుడు వారేం చేశారు? అన్నది కథ.

    @2021 KTree