• TFIDB EN
  • Editorial List
    Ravi teja Dual Role Movies: రవితేజ ద్విపాత్రాభినయం చేసిన చిత్రాలు
    Dislike
    2k+ views
    6 months ago

    టాలీవుడ్‌లో అతి కఠినమైన పాత్రలను తేలికగా పోషించగల హీరోల్లో రవితేజ ఒకరు. సవాళ్లు విసిరే పాత్రలను చేసేందుకు మాస్‌ మహారాజా ఎప్పుడూ ముందుంటారు. అందుకే ఎలాంటి చిన్న అవకాశం వచ్చినా ఆయన అసలు వదులుకోరు. 60 చిత్రాలకు పైగా చేసిన రవితేజ అందులో విభిన్నపాత్రలను పోషించారు. ఈ క్రమంలో ఎంతో కష్టంతో కూడుకున్న ద్విపాత్రాభినయం చిత్రాలను కూడా రవితేజ చేశారు. ఆయన చేసిన డ్యూయల్‌ రోల్‌ సినిమాలు మీకోసం.

    ఇంగ్లీష్‌లో చదవండి

    1 . విక్రమార్కుడు(జూన్ 23 , 2006)
    U/A|161 minutes|యాక్షన్,హాస్యం
    సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ రాథోడ్‌ను పోలి ఉండే సత్తిబాబు, అతని మరణం తర్వాత అతని కుమార్తెను దత్తత తీసుకుంటాడు. రాథోడ్ స్థానంలో పోలీసు అధికారిగా వెళ్లి దుష్ట బావూజీ దోపిడీలను అంతం చేస్తాడు.

    రవితేజ హీరోగా దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి తెరకెక్కించిన బ్లాక్‌ బాస్టర్‌ చిత్రం ‘విక్రమార్కుడు’. ఇందులో రవితేజ ద్విపాత్రాభినయం చేశారు. ఒక పాత్రలో పవర్‌ఫుల్‌ పోలీసు ఆఫీసర్‌గా, మరో పాత్రలో దొంగగా ఆయన కనిపించారు. రాజమౌళి డైరెక్షన్ స్కిల్స్‌కు రవితేజ యాక్టింగ్‌ తోడవడంతో ఈ సినిమా పలు రికార్డులను క్రియేట్ చేసింది. ముఖ్యంగా రవితేజ కెరీర్‌లో చిరస్మరణీయ చిత్రంగా నిలిచిపోయింది.

    2 . దరువు(మే 25 , 2012)
    U/A|155 minutes|హాస్యం,ఫాంటసీ,రొమాన్స్
    బుల్లెట్ రాజా శ్వేతని ప్రేమిస్తాడు. ఆమె బావ హార్బర్‌ బాబు రాజాను హత్య చేస్తాడు. యమలోకానికి వెళ్లిన హీరోకి ఓ షాకింగ్‌ నిజం తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది కథ.

    2012లో వచ్చిన ‘దరువు’ చిత్రం విభిన్న కథాంశంతో తెరకెక్కింది. దర్శకుడు శివ ఈ చిత్రాన్ని యమగోల, యముడికి మెుగుడు, యమలీల సినిమాల్లాగా తెరకెక్కించారు. ఇందులో రవితేజ బుల్లెట్‌ రాజా, హోమంత్రి రవీంద్ర పాత్రల్లో నటించారు. ఈ మూవీలో ఎం.ఎస్‌ నారాయణ, షియాజీ షిండే, రఘుబాబు, అవినాష్‌, జయసుధ, వెన్నెల కిషోర్‌ కీలకపాత్రలు పోషించారు. హీరోయిన్‌గా తాప్సీ నటించింది.

    3 . డిస్కో రాజా(జనవరి 24 , 2020)
    U/A|149 minutes|యాక్షన్,సైన్స్ ఫిక్షన్,థ్రిల్లర్
    భయంకమైన మాఫియా బ్యాక్‌గ్రౌండ్ ఉన్న డిస్కో రాజా బాడీని హిమాలయాల్లో శాస్త్రవేత్తల బృందం కనిపెడుతుంది. అతనికి చికిత్స చేయడంతో మాములు మనిషిగా మారుతాడు. తన గతం గురించి తెలుసుకున్న డిస్కో రాజా ఏం చేశాడు. అసలు డిస్కో రాజా హిమాలయాల్లో ఎందుకు కూరుకు పోయాడు అనేది మిగతా కథ

    2020లో వచ్చిన ‘డిస్కో రాజా’ సినిమాలో హీరో రవితేజ ద్విపాత్రిభినయం చేశారు. అయితే సైన్స్‌ఫిక్షన్‌ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. ఆనంద్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రవితేజకు జంటగా పాయల్‌ రాజ్‌పుత్‌, నభా నటేష్‌ నటించారు. సునీల్‌, వెన్నెల కిషోర్‌ కీలక పాత్రలు పోషించారు. ఎస్‌.ఎస్‌. థమన్‌ ఈ చిత్రానికి సంగీతం అందించారు.


    @2021 KTree