• TFIDB EN
  • Editorial List
    జూన్‌లో ఓటీటీల్లో విడుదలై టాప్‌లో ట్రెండ్‌ అవుతున్న తెలుగు చిత్రాలు
    Dislike
    200+ views
    2 months ago

    జూన్ నెలలో వివిధ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌లో చాలా సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. థియేటర్లలో ఈ సినిమాలు మిస్‌ అయిన వారు ఓటీటీలో వీటిని నేరుగా వీక్షించవచ్చు. స్ట్రీమింగ్ ఫ్లాట్ ఫాంతో పాటు ఆ సినిమాల స్టోరి, రేటింగ్‌ను కూడా మీకోసం అందిస్తున్నాం. మరి మీ అభిరుచికి తగ్గ సినిమాను చూసి ఎంజాయ్ చేయండి.

    ఇంగ్లీష్‌లో చదవండి

    1 . మిరల్(మే 17 , 2024)
    UA|క్రైమ్,థ్రిల్లర్
    హరి, రమ భార్య భర్తలు. తన భర్తను ఎవరో చంపినట్లు రమకు కల వస్తుంది. దీంతో కుల దైవం గుడిలో పూజ చేయించేందుకు సొంత ఊరికి వెళ్తారు. అనంతరం సిటీకి బయలుదేరినప్పటి నుంచి హరి, రమలకు వింత అనుభవాలు ఎదురవుతాయి. కలలో వచ్చిన సంఘటనలే వారికి తారసపడతాయి. హరి ఫ్యామిలీని వెంటాడుతున్న ఆ అతీతశక్తి ఏంటి? హరి తన ఫ్యామిలీని ఎలా కాపాడుకున్నాడు? అన్నది కథ.
    2 . టెనెంట్(ఏప్రిల్ 18 , 2024)
    UA|మిస్టరీ,థ్రిల్లర్
    గౌతమ్‌, సంధ్య పెళ్లి చేసుకొని సంతోషంగా జీవిస్తుంటారు. కొద్ది రోజుల తర్వాత వారి కాపురంలో సమస్యలు వస్తాయి. ఓ రోజు మేఘా బెడ్‌పై విగతజీవిలా పడి ఉంటుంది. అదే సమయంలో వారుంటున్న అపార్ట్‌మెంట్‌లో ఓ యువకుడు పైనుంచి దూకేస్తాడు. అసలు సంధ్యను ఎవరు చంపారు? పైనుంచి పడ్డ యువకుడు ఎవరు? గౌతమే ఆమెను చంపేశాడా? అన్నది కథ.
    3 . 105 మినిట్స్(జనవరి 26 , 2024)
    A|హారర్,థ్రిల్లర్
    జాను (హ‌న్సిక‌) ఆఫీసు నుంచి కారులో ఇంటికి వెళ్తున్న క్రమంలో తననేదో అదృశ్యశక్తి వెంటాడుతున్నట్లు ఆమెకు అర్థమవుతుంది. ఇంటికి వెళ్లాక అనూహ్య ప‌రిణామాలు చోటుచేసుకుంటాయి. ఆ అదృశ్య శ‌క్తి జానును ఇనుప గొలుసుతో బంధించి చిత్రహింస‌ల‌కు గురి చేయ‌డం ప్రారంభిస్తుంది. తన మరణానికి జానునే కారణమని చెప్పి ఇబ్బందులకు పెడుతుంది. ఇంతకీ ఆ అదృశ్య శక్తి ఎవరు? ఆ వ్య‌క్తి మ‌ర‌ణానికి జాను ఎలా కార‌ణ‌మైంది? దాని బారి నుంచి జాను ఎలా బ‌య‌ట‌ప‌డింది? అన్న‌ది మిగ‌తా క‌థ‌
    4 . గ్రౌండ్(ఫిబ్రవరి 23 , 2024)
    UA|డ్రామా
    హ‌రికి క్రికెట్ అంటే ఇష్టం. ఓ రోజు క్రికెట్ ఆడ‌టానికి త‌న స్నేహితుల‌తో క‌లిసి గ్రౌండ్‌కు వెళ‌తాడు. ఫ్రెండ్స్‌ వద్దని చెబుతున్నా మరో టీమ్‌తో బెట్ వేస్తాడు. ఆ మ్యాచ్‌ వల్ల హరికి ఎలాంటి కష్టాలు ఎదురయ్యాయి? తేజూతో హరి ప్రేమకథ ఎలాంటి మలుపు తిరిగింది? అన్నది కథ.
    5 . పారిజాత పర్వం(ఏప్రిల్ 19 , 2024)
    UA|యాక్షన్,డ్రామా
    చైత‌న్య డైరెక్టర్ కావాలని క‌ల‌లు కంటాడు. స్నేహితుడ్ని హీరోగా పెట్టి అవకాశాల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తాడు. ఛాన్స్‌ రాకపోవడంతో తానే నిర్మాత‌గా మారాలని అనుకుంటాడు. డబ్బు కోసం శెట్టి సెకండ్‌ సెటప్‌ను కిడ్నాప్‌ చేయాలని ప్లాన్‌ వేస్తాడు. మరోవైపు సునీల్‌, శ్ర‌ద్దా దాస్‌ కూడా ఆమెను కిడ్నాప్‌ చేసేందుకు స్కెచ్‌ వేస్తారు. ఈ ఇద్దరిలో శెట్టి భార్యను ఎవరు కిడ్నాప్‌ చేశారు? చివరికి ఏమైంది? అన్నది కథ.
    6 . రష్(జూన్ 13 , 2024)
    UA|క్రైమ్,డ్రామా
    భర్త, పిల్లలతో కలిసి కార్తిక అందమైన జీవితాన్ని గడుపుతుంటుంది. ఓ రోజు భర్తకు యాక్సిడెంట్‌ కావడంతో ఆస్పత్రికి బయలుదేరుతుంది. మార్గం మధ్యలో బైకర్స్‌తో గొడవపడుతుంది. కొన్ని నాటకీయ పరిణామాల మధ్య ఆమె పిల్లలను ఒక రౌడీ కిడ్నాప్‌ చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? కార్తికను పోలీసు అధికారి ఎందుకు భయపడ్డాడు? ఆమె గతం ఏంటి? అన్నది కథ.
    7 . డియర్ నాన్న(జూన్ 14 , 2024)
    UA|డ్రామా
    కరోనా బ్యాక్‌డ్రాప్‌ నేపథ్యంలో ఓ తండ్రి కొడుకుల మధ్య సాగిన ఎమోషనల్ సీక్వెన్స్ ఈ సినిమా. చెఫ్ కావాలని కలలు కనే చైతన్యరావు జీవితంలో కోవిడ్ ఎలాంటి ప్రభావం చూపింది? ఆ టైంలో మెడికల్ షాపుల ప్రాధాన్యత, ఆ షాపుల యజమానులు చేసిన త్యాగాలను సినిమా ప్రధాన కథ వస్తువుగా ఉంటుంది.
    8 . లవ్ మీ(మే 25 , 2024)
    UA|హారర్,రొమాన్స్,థ్రిల్లర్
    అర్జున్ (ఆశిష్), ప్రతాప్ (రవికృష్ణ) కలిసి ఓ యూట్యూబ్ ఛానల్ నడుపుతూ ఉంటారు. దెయ్యాలు, ఆత్మలకు సంబంధించిన వీడియోలు చేస్తుంటారు. ప్రతాప్‌ లవర్‌ ప్రియా (వైష్ణవి).. దివ్యవతి అనే దెయ్యం గురించి చెప్పడంతో ఆమె ఉంటున్న పాడుబడ్డ అపార్ట్‌మెంట్‌కు అర్జున్‌ వెళ్తాడు. అలా వెళ్లిన అర్జున్‌ దివ్యవతి ఆత్మతో ప్రేమలో పడతాడు. ఆ తర్వాత ఏమైంది? దివ్యవతి ఎవరు? అన్నది కథ.
    9 . గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి(మే 31 , 2024)
    UA|యాక్షన్,థ్రిల్లర్
    పని పాట లేకుండా ఖాళీగా తిరిగే లంకల రత్నం అనే కుర్రాడు.. తమ ఊరి రాజకీయాల్లో జరుగుతున్న అన్యాయాన్ని చూస్తూ తట్టుకోలేకపోతాడు. రాజకీయాల్లోకి ప్రవేశించి ఆ వ్యవస్థను మార్చాలని నిర్ణయించుకుంటాడు. ఈ క్రమంలో పాలిటిక్స్‌లోకి దిగిన అతడికి ఊహించని సవాళ్లు ఎదురవుతాయి. వాటిని ఎలా ఎదుర్కొన్నాడు? అన్నది కథ.
    10 . గం గం గణేశ(మే 31 , 2024)
    UA|హాస్యం,క్రైమ్,థ్రిల్లర్
    దొంగతనాలు చేసే ఓ కుర్రాడి జీవితంలోకి ఓ పొలిటీషియన్, విగ్రహాన్ని దొంగతనం చేయాలనుకునే బ్యాచ్ ఎలా ఎంట్రీ ఇచ్చారు? ఆ తర్వాత అతడికి వీళ్ళు ఎలాంటి సమస్యలు క్రియేట్ చేశారు? వాటి నుంచి హీరో ఎలా బయటపడ్డాడు? అన్నది కథ.
    11 . బాక్(మే 03 , 2024)
    UA|హాస్యం,హారర్
    శివ శంకర్ (సుందర్ సి) ఒక లాయర్. బాక్‌ అనే దుష్టశక్తి వల్ల అతని చెల్లెలు శివాని (తమన్నా) మరణిస్తుంది. అసలు ఆ బాక్ ఎవరు? శివాని ఫ్యామిలీని ఎందుకు టార్గెట్‌ చేసింది? శివాని ఆత్మగా మారి తన కుటుంబాన్ని ఎలా కాపాడింది? కథలో మాయ (రాశి ఖన్నా) పాత్ర ఏంటి? అన్నది కథ.
    12 . లవ్ మౌళి(జూన్ 07 , 2024)
    A|డ్రామా,రొమాన్స్
    ఆర్టిస్ట్ అయిన మౌళి.. తల్లిదండ్రులు విడిపోవడంతో చిన్నప్పటి నుంచి ఒంటరిగా పెరుగుతాడు. అతడికి ప్రేమపై నమ్మకం ఉండదు. ఈ క్రమంలో ఓ అఘోరా అతడికి మహిమ గల పెయింటింగ్‌ బ్రష్‌ ఇస్తాడు. దాని సాయంతో తనకు నచ్చిన లక్షణాలున్న యువతిని మౌళి సృష్టించుకుంటాడు. ఆ తర్వాత ఏమైంది? అన్నది కథ.
    13 . సత్యభామ(జూన్ 07 , 2024)
    UA|డ్రామా
    ఏసీపీ సత్యభామ.. షీ టీమ్‌లో నిజాయతీ గల పోలీసు అధికారిణిగా పనిచేస్తుంటుంది. ఓ రోజు ఆమెను హసినా అనే బాధితురాలు కలుస్తుంది. తన భర్త చేస్తున్న గృహ హింస గురించి చెప్పుకొని వాపోతుంది. ఈ క్రమంలో హసినా.. భర్త చేతిలో దారుణ హత్యకు గురవుతుంది. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన సత్యభామ.. నేరస్థుడిని ఎలా పట్టుకుంది? దర్యాప్తులో ఆమెకు ఎదురైన సవాళ్లు ఏంటి? అన్నది కథ.
    14 . భజే వాయు వేగం(మే 31 , 2024)
    UA|యాక్షన్,థ్రిల్లర్
    తల్లిదండ్రులు చనిపోవడంతో చిన్నప్పుడే అనాథగా మారిన వెంకట్‌ను... రాజన్న దత్తత తీసుకుంటాడు. కొడుకు రాజుతో పాటే పెంచి పెద్ద చేస్తాడు. కొన్ని కారణాల వల్ల వెంకట్‌.. విలన్ గ్యాంగ్‌ దగ్గర బెట్టింగ్ వేస్తాడు. వారు మోసం చేయడంతో పగతీర్చుకోవాలని నిర్ణయించుకుంటాడు. ఈ క్రమంలో అతడికి ఎదురైన సవాళ్లు ఏంటి? అన్నది కథ.
    15 . అహం రీబూట్(జూన్ 30 , 2024)
    UA|డ్రామా
    ఆర్జే నిలయ్‌ (సుమంత్‌) స్టూడియోలో ఉండగా ఒక అమ్మాయి నుంచి కాల్‌ వస్తుంది. ఎవరో కిడ్నాప్‌ చేశారని చెబుతుంది. తొలుత ప్రాంక్‌ అని భావించిన నిలయ్‌.. ఆమె మాటలకు కన్విన్స్‌ అవుతాడు. ఎలాగైన కాపాడాని అనుకుంటాడు. మరోవైపు ఆమెను రక్షించేందుకు పోలీసులు సైతం రంగంలోకి దిగుతారు. ఇంతకీ కిడ్నాపైన యువతి ఎవరు? ఆమెకు నిలయ్‌కు ఉన్న సంబంధం ఏంటి? అన్నది కథ.
    16 . మార్కెట్ మహాలక్ష్మి(ఏప్రిల్ 19 , 2024)
    UA|హాస్యం,డ్రామా
    సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్ పార్వతీశం.. లక్షల్లో జీతం సంపాదిస్తుంటాడు. ఓ రోజు మార్కెట్‌లో కూరగాయలు అమ్మె మహాలక్ష్మీని చూసి ప్రేమిస్తాడు. కానీ ఆమె అతడి ప్రేమను తిరస్కరిస్తుంది. దీంతో మహాలక్ష్మీ ప్రేమను పొందేందుకు పార్వతీశం మార్కెట్‌లోనే తిష్టవేస్తాడు. మరి మహాలక్ష్మీ పెళ్లికి ఒప్పుకుందా? పార్వతీశం ప్రేమను ఆమె ఎందుకు రిజెక్ట్ చేసింది? మహాలక్ష్మీ కుటుంబ నేపథ్యం ఏంటి? అన్నది స్టోరీ.
    17 . ఆరంభం(మే 10 , 2024)
    UA|థ్రిల్లర్
    మిగిల్.. జైలులో శిక్ష అనుభవిస్తూ ఉరి తీయడానికి ఒక రోజు ముందు అనూహ్యంగా మిస్‌ ‌అవుతాడు. జైలు గది తాళాలు, గోడలు అలాగే ఉన్నప్పటికీ అతడు మిస్‌ కావడం ఆశ్చర్యం కలిగిస్తుంది. దీన్ని కనిపెట్టేందుకు డిటెక్టివ్ రంగంలోకి దిగుతాడు. అతడికి మిగిల్‌ డైరీ దొరగడంతో కథ మలుపు తిరుగుతుంది. డైరీలో ఏముంది? డెజావు ఎక్స్‌పెరమెంట్‌కు కథకు సంబంధం ఏంటి? అన్నది స్టోరీ.
    18 . మలయాళీ ఫ్రొం ఇండియా(మే 01 , 2024)
    UA|158 minutes|హాస్యం,డ్రామా
    ఒక జాతీయ పార్టీకి వీర విధేయుడిగా ఉండే గోపి.. ఫ్రెండ్‌ చేసిన తప్పు కారణంగా చిక్కుల్లో పడతాడు. మత, రాజకీయ ఘర్షణలు తలెత్తడంతో బలవంతంగా ఎడారి దేశానికి వెళ్తాడు. అక్కడ పాకిస్థాని సూపర్‌ వైజర్‌ వద్ద పనికి కుదురుతాడు. దేశం, మతాన్ని తీవ్రంగా విశ్వసించే గోపి.. ఒక పాకిస్తాని వద్ద ఎలా పనిచేయగలిగాడు. పాకిస్తాన్‌కు ఎందుకు వెళ్లాడు? దేశానికి తిరిగి వచ్చాడా? లేదా? అన్నది స్టోరీ.

    @2021 KTree