• TFIDB EN
  • Editorial List
    Best Telugu Patriotic Movies: గూస్ బంప్స్ తెప్పించే 8 గొప్ప దేశ భక్తి చిత్రాలు..!
    Dislike
    2k+ views
    7 months ago

    సినిమా అంటే ప్రేక్షకులకు వినోదం మాత్రమే కాదు సామాజిక స్పృహను సైతం కలిగించాలి. దేశం పట్ల, సమాజం పట్ల పౌరులకు ఉన్న బాధ్యతను గుర్తు చేస్తూ ఉండాలి. అలా దేశభక్తిని ప్రేక్షకుల్లో రగిలించి వెండి తెరపై వెలిగిపోయిన సినిమాలు తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో ఉన్నాయి. దేశ భక్తికి కమర్షియల్ హంగులు అద్ది బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించాయి. అలాంటి సినిమాలు ఏమున్నాయో ఓసారి చూద్దాం.

    ఇంగ్లీష్‌లో చదవండి

    1 . మనోహరం(మే 13 , 2000)
    U|155 minutes|డ్రామా
    దేశంలోని రెండు ప్రధాన నగరాల్లో ఉగ్రవాదులు బాంబు పేలుళ్లను అమలు చేస్తారు. అయితే ఈ కేసు విచారణలో ఆనంద్‌ను తప్పుగా పోలీసులు అరెస్ట్ చేస్తారు. అతని నిర్దోషిత్వాన్ని నిరూపించేందుకు ఆనంద్ భార్య పోలీస్ వ్యవస్థతో పోరాటం చేస్తుంది.

    సీనియర్ హీరో జగపతి బాబు, లయ జంటగా నటించిన దేశభక్తి చిత్రం మనోహరం. ఒక బ్యాంకు ఉద్యోగి, అమాయకురాలైన అతని భార్య, ఉగ్రవాదులు, పోలీసుల మధ్య జరిగిన ఎమోషనల్ డ్రామాను డెరెక్టర్ గుణశేఖర్ అద్భుతంగా తెరకెక్కించారు. సామాన్యుల జీవితాల్లో దేశభక్తి కోణాన్ని ఆవిష్కరించి గుణశేఖర్ మంచి విజయం సాధించారు.

    2 . బొబ్బిలి పులి(జూలై 09 , 1982)
    A|176 mins|యాక్షన్,డ్రామా
    అవినీతి మయంగా మారిన ప్రభుత్వ రంగాన్ని తనదైన రీతిలో బాగు చేయాలని ఒక ఆర్మీ ఆఫీసర్ నిర్ణయించుకుంటాడు. అయితే పరిస్థితులు అతనికి సహకరించకపోవడంతో ఇబ్బందుల్లో పడుతాడు.

    దేశ సరిహద్దుల్లో సైనికుడిగా సేవలందిస్తున్న ఓ వ్యక్తి .. సమాజంలో జరుగుతున్న అన్యాయాన్ని చూసి విప్లవం బాట పడతాడు. అవినీతి, అన్యాయాలకు పాల్పడుతున్న వారిని అంతమొందిస్తాడు. ఈ స్టోరీ లైన్‌తో దాసరి నారాయణరావు ఈసినిమాకు డైరెక్ట్ చేశారు. ఈ సినిమాలో NTR తన నటనతో దేశభక్తిని రగిలించారు.

    3 . అల్లూరి సీతారామ రాజు(మే 01 , 1974)
    U|187 minutes|యాక్షన్,డ్రామా
    స్వాతంత్య్ర సమరయోధుడైన అల్లూరి సీతారామరాజు.. రైతులు, గిరిజనుల పక్షాన నిలబడి బ్రిటిష్‌ వారికి ఎదురు తిరుగుతాడు. భూమి హక్కులను ఉల్లంఘించిన బ్రిటిష్ అధికారులపై తిరుగుబాటుకు పిలుపునిస్తాడు.

    బ్రిటిష్‌వారిని గడగడ లాడించి తెలుగువాడి పౌరుషాన్ని ఆంగ్లేయులకు రుచిచూపించిన ధీరుడు అల్లూరి సీతారామ రాజు. ఆయన పోరాటాన్ని చిత్రంగా మార్చి అద్భుత విజయం సాధించారు సూపర్ స్టార్ కృష్ణ. ఈ సినిమా చూస్తున్నంత సేపూ ప్రేక్షకులకు గూస్ బంప్స్ కలగడం ఖాయం. అలా తన నటనతో కృష్ణ మెప్పించారు. సీత పాత్రలో విజయనిర్మల, గంటం దొర పాత్రలో గుమ్మడి, మల్లు దొర పాత్రలో ప్రభాకర్ రెడ్డి ఒదిగిపోయారు.

    4 . ఠాగూర్(సెప్టెంబర్ 24 , 2003)
    U|176 minutes|యాక్షన్,డ్రామా
    ప్రభుత్వ వ్యవస్థల్లో లంచగొండి అధికారులను నిర్మూలించడానికి ఠాగూర్ అనే ప్రొఫెసర్ తన స్టూడెంట్స్‌తో ఒక నిఘా సంస్థను రూపొందిస్తాడు. ఆ సంస్థ ద్వారా అవినీతి పరులను ఏరిపారేస్తాడు.

    ప్రాణాలు ధారపోసి తెల్లవాళ్ళను తరిమి కొడితే.. కనిపించకుండా అవినీతి ప్రజల్ని కష్టాల పలు చేస్తోంది. దానిని అంతమొందించడానికి కంకణం కట్టుకున్న వ్యక్తి ఠాగూర్. లంచమనే మాట వినిపించకూడదని అవినీతి పరుల గుండెల్లో భయాన్ని కగిలిస్తాడు. ఠాగూర్‌గా చిరంజీవి నటించి సినిమాను కమర్షియల్ హిట్ చేయించారు. ఈ సినిమా చివర్లో చిరంజీవి చెప్పే డైలాగ్స్ గూస్‌బంప్స్ తెప్పిస్తాయి.

    5 . ఖడ్గం(నవంబర్ 29 , 2002)
    UA|144 minutes|యాక్షన్,థ్రిల్లర్
    విభిన్న మత నేపథ్యాలు కలిగిన ముగ్గురు వ్యక్తులు ఓ ఉగ్రదాడి వల్ల తమ స్నేహితుడ్ని కోల్పోతారు. మరో దాడికి పాల్పడకుండా ఉగ్రవాదిని ఆపడానికి చేతులు కలుపుతారు. ఆ తర్వాత ఏం చేశారు? ఉగ్రదాడిని ఎలా అడ్డుకున్నారు? అన్నది కథ.

    కుల, మతాలతో సంబంధం లేకుండా భారతీయులందరీలో దేశ భక్తి సమానంగా ఉంటుందని చాటి చెప్పిన చిత్రం ఖడ్గం. దేశద్రోహులను అంతమొందించడానికి ప్రతీ భారతీయుడు అవసరమైతే ప్రాణాలకు తెగిస్తారని ఖడ్గం సినిమాలో కృష్ణవంశీ చక్కగా చూపించారు. ఇందులో శ్రీకాంత్ యాక్టింగ్ సినిమాకే హైలెట్. రవితేజ, ప్రకాశ్ రాజ్ తన యాక్టింగ్‌తో మెస్మరైజ్ చేశారు.

    6 . సైరా నరసింహా రెడ్డి(అక్టోబర్ 02 , 2019)
    UA|170 minutes|యాక్షన్,డ్రామా,హిస్టరీ
    భారతదేశాన్ని ఆక్రమించుకునే క్రమంలో బ్రిటిష్ సైన్యాన్ని ఎదురించలేక పాలెగాళ్లు అందరూ లొంగిపోతారు. అయితే రేనాడు ప్రాంతానికి చెందిన రాజు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి బ్రిటిష్ సైనికులకు ఎదురుతిరిగి వారు దోచుకున్న భూమిని సంపదను అడ్డుకుని ప్రజలకు అండగా నిలబడతాడు. తోటి పాలెగాళ్ళలో మార్పు తెచ్చి వారితో కలిసి దేశ స్వాతంత్ర్యం కోసం ఉద్యమాన్ని నిర్మిస్తాడు? ఈ క్రమంలో ఆయన ఎదుర్కొన్న సమస్యలు ఏమిటి? అసలు యుద్దానికి దారి తీసిన అంశాలు ఏమిటి? అన్నది మిగతా కథ

    మెగాస్టార్ చిరంజీవి ప్రాణప్రతిష్ఠ చేసిన దేశభక్తి చిత్రం సైరా నరసింహా రెడ్డి. భారతీయులను బానిసలుగా వాడుకుంటున్న బ్రిటీషర్లను ఎదిరించిన మొదటి భారతీయుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి. 18వ శతాబ్దానికి చెందిన ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి రేనాటి సూర్యుడుగా కొలవబడ్డాడు. చరిత్ర మరచిన అతని గాథను సినిమాగా మలిచి ఆయన గొప్పతనం తెలియజేశారు చిరంజీవి. ఈ సినిమా కమర్షియల్‌గా సక్సెస్ కాకపోయినా.. ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించింది.

    7 . మేజర్(జూన్ 03 , 2022)
    UA|146 minutes|థ్రిల్లర్,యాక్షన్,బయోగ్రఫీ
    సందీప్‌ ఉన్నికృష్ణన్‌ (అడివి శేష్‌) కష్టపడి ఆర్మీలో చేరతాడు. అంచెలంచెలుగా ఎదిగి NSG కమాండోలకు శిక్షణ ఇచ్చే స్థాయికి ఎదుగుతాడు. ఈ క్రమంలోనే ముంబయి తాజ్‌ హోటల్‌పై ఉగ్రవాదులు దాడికి తెగబడటంతో వారిని మట్టుబెట్టే బాధ్యత సందీప్‌ బృందంపై పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందన్నది కథ.

    టాలీవుడ్ యంగ్ హీరో అడవి శేషు నటించిన మేజర్ చిత్రం ముంబై దాడులలో( 2008) మరణించిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కింది. 2008లో ముంబైలోని పలుచోట్ల ఉగ్రవాదులు సృష్టించిన మారణహోమంపై సందీంప్ ఉన్నికృష్ణన్ వీరోచితంగా ఎలా పొరాడారో చూపించారు. ఈ సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుని చేత కంటతడి పెట్టిస్తుంది మేజర్ సినిమా. దేశభక్తిని రగిలించి గూస్ బంప్స్ తెప్పిస్తుంది.


    @2021 KTree