• TFIDB EN
  • Editorial List
    తెలుగులో టాప్ స్పోర్ట్స్ డ్రామా చిత్రాలు ఇవే!
    Dislike
    500+ views
    1 year ago

    తెలుగులో స్పోర్ట్స్ డ్రామా చిత్రాలకు ఉన్న క్రేజే వేరు. ఎమోషనల్‌ బ్యాక్‌డ్రాప్‌తో వచ్చిన సినిమాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. సస్పెన్స్‌తో కూడిన స్పోర్ట్స్‌ స్టోరీ లైన్‌కు టాలీవుడ్‌లో ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. ఈక్రమంలో తెలుగులో వచ్చిన టాప్ స్పోర్ట్స్ డ్రామా చిత్రాల లిస్ట్‌ మీకోసం.

    ఇంగ్లీష్‌లో చదవండి

    1 . అశ్వని(మార్చి 12 , 1991)
    U|డ్రామా
    ఒక అథ్లెటిక్ ట్రైనర్.. ఒక పేద అమ్మాయి రన్నింగ్ టాలెంట్ చూసి ఆశ్చర్యపోతాడు. ఆమెను ప్రపంచ స్థాయి స్ప్రింటర్‌గా తీర్చిదిద్దాలని నిర్ణయించుకుంటాడు.
    2 . భద్రాచలం(డిసెంబర్ 06 , 2001)
    U|యాక్షన్,క్రీడలు
    పరశురాం థైక్వాండో అనే మార్షల్ ఆర్ట్స్ కోచ్. తన శిష్యుడిని వరల్డ్ థైక్యాండో ఛాంపియన్‌గా చూడాలని కలలు కంటాడు. అయితే అతని మాజీ విద్యార్థి అతన్ని కొట్టి అవమానిస్తాడు. దీంతో అతనికి గుండె పోటు వస్తుంది. పరుశురాం కుమార్తె లక్ష్మి తన తండ్రి ఆశయ సాధన కోసం భద్రాచలం అనే వ్యక్తిని తీసుకొస్తుంది
    3 . కబడ్డీ కబడ్డీ(ఫిబ్రవరి 16 , 2003)
    UA|131 minutes|డ్రామా,రొమాన్స్
    పనిపాట లేకుండా తిరిగే రాంబాబు కావేరి అనే అమ్మాయితో ప్రేమలో పడుతాడు. అయితే, వీరి ప్రేమను ఆమె అన్న ఒప్పుకోడు. తన ఊరి కబడ్డీ టీంతో మ్యాచ్ గెలిస్తే పెళ్లి చేస్తానని కండీషన్ పెడుతాడు.
    4 . లైగ‌ర్(ఆగస్టు 25 , 2022)
    UA|138 minutes|యాక్షన్,డ్రామా
    తన బిడ్డ లైగర్‌(విజయ్‌ దేవరకొండ)ను ఛాంపియన్‌గా చూడాలని బాలామణి (రమ్యకృష్ణ) కోరిక. ఇందుకోసం కరీంనగర్‌ నుంచి ముంబయికి వస్తుంది. ప్రేమ జోలికి వద్దని తల్లి చెబుతున్నప్పటికీ లైగర్ తానియా (అనన్య పాండే) ప్రేమలో పడతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? వారి ప్రేమ ఎందుకు విఫలమైంది? లైగర్ ఛాంపియన్‌గా అయ్యాడా? అనేది కథ.
    5 . కౌసల్య కృష్ణమూర్తి(ఆగస్టు 23 , 2019)
    U|149 mins|డ్రామా,క్రీడలు
    రైతు కూతురు అయిన కౌసల్య కృష్ణమూర్తి టీమిండియా తరఫున ఆడాలని కలలు కంటుంది. ఆమె తన కలను సాకారం చేసుకునే క్రమంలో ఎలాంటి సవాళ్లను ఎదుర్కొన్నది అనేది కథ.
    6 . గుడ్ లక్ సఖీ(జనవరి 28 , 2022)
    U|118 minutes|హాస్యం,క్రీడలు
    బంజార యువతి సఖి (కీర్తి సురేష్‌) అంటే గోలి రాజు (ఆది పినిశెట్టి)కి ఎంతో ఇష్టం. సఖి గురిపై రాజుకు మహా నమ్మకం. ఆమెను షూటింగ్‌ వైపు వెళ్లేలా ప్రోత్సహిస్తాడు. ఇందుకోసం ఊరికి వచ్చిన కల్నల్ (జగపతిబాబు) సాయం తీసుకుంటాడు. షూటింగ్‌లో ఎదిగే క్రమంలో సఖికి ఎదురైన సవాళ్లు ఏంటి? అన్నదే కథ.
    7 . ఒక్కడు(జనవరి 15 , 2003)
    U|171 minutes|యాక్షన్,రొమాన్స్
    అజయ్ జాతీయ స్థాయి కబడ్డి ప్లేయర్. శిక్షణ నిమిత్తం కర్నూలుకు వెళ్తాడు. అక్కడ స్వప్న అనే అమ్మాయిని ఓబుల్ రెడ్డి అనే ఫ్యాక్షనిస్టు చెర నుంచి కాపాడుతాడు. హైదరాబాద్‌కు తీసుకొచ్చి తన కుటుంబానికి తెలియకుండా ఇంట్లోనే ఉంచుతాడు. మహేష్ బాబు కేరీర్‌కు మంచి బ్రేక్ ఇచ్చింది ఈ సినిమా.
    8 . తమ్ముడు(జూలై 15 , 1999)
    U|162 minutes|డ్రామా,రొమాన్స్,క్రీడలు
    సుభాష్‌ (పవన్‌ కల్యాణ్‌) కాలేజ్ స్టూడెంట్‌. ఫ్రెండ్స్‌తో ఎంజాయ్‌ చేస్తూ రోజులు గడుపుతుంటాడు. కిక్‌ బాక్సర్‌ అయిన సుభాష్‌ సోదరుడికి ఓ రోజు తీవ్రంగా గాయపడతాడు. దీంతో ఎలాంటి బాక్సింగ్‌ అనుభవం లేకపోయిన ప్రతర్థితో సుభాష్‌ తలపడాలని నిర్ణయించుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది కథ.
    9 . సై(సెప్టెంబర్ 23 , 2004)
    UA|163 minutes[citation needed]|యాక్షన్,డ్రామా,క్రీడలు
    ఓ మాఫియా లీడర్ నుంచి తమ కాలేజీ గ్రౌండ్‌ను కాపాడుకునేందుకు ఆర్ట్స్, సైన్స్ గ్రూప్ స్టూడెంట్ లీడర్స్ అయిన శశాంక్, పృథ్వీ చేతులు కలుపుతారు. మాఫియా లీడర్‌తో రగ్బీ మ్యాచ్ గెలిస్తే మైదానం విద్యార్థులది అవుతుంది.
    10 . సీటీమార్(సెప్టెంబర్ 10 , 2021)
    UA|138 minutes|డ్రామా,క్రీడలు
    కార్తీక్‌ (గోపీచంద్‌) మహిళల కబడ్డీ జట్టు కోచ్‌. తాను తీర్చిదిద్దిన జట్టును జాతీయ స్థాయిలో గెలిపించి ఊరిలోని స్కూల్‌ సమస్యను అందరి దృష్టికి తీసుకెళ్లాలని భావిస్తాడు. ఆ ప్రయత్నంలో కార్తీక్‌కు ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? అన్నది కథ.
    11 . A1 ఎక్స్‌ప్రెస్(మార్చి 05 , 2021)
    U|138 minutes|డ్రామా,క్రీడలు
    యానంలో ఓ హాకీ గ్రౌండ్‌ను అమ్మేందుకు స్థానిక మంత్రి ప్రయత్నిస్తాడు. ఈక్రమంలో అక్కడకు వచ్చిన సంజూ, హాకీ ప్లేయర్ లవ్‌ ప్రేమలో పడుతాడు. ఇంతకు సంజూ ఎవరు? హాకీ గ్రౌండ్‌ను రక్షించే పోరాటంలో ఎందుకు చేరుతాడు అనేది మిగిలిన కథ.
    12 . మజిలీ(ఏప్రిల్ 05 , 2019)
    UA|154 minutes|డ్రామా,రొమాన్స్
    క్రికెటర్ కావాలనే బలమైన కోరిక ఉన్న పూర్ణ.. అన్షును ప్రేమిస్తాడు. కానీ ఇద్దరు విడిపోతారు. ఆ తర్వాత బలవంతంగా శ్రావణితో పూర్ణకు పెళ్లి అవుతుంది.
    13 . గురు(మార్చి 31 , 2017)
    U|176 minutes|డ్రామా
    వెంకటేష్ ఒక పేరున్న బాక్సింగ్ కోచ్‌. అతను ఓ స్లమ్‌లోని యువతిని బాక్సింగ్ ఛాంపియన్‌గా మార్చడం కోసం అనేక సవాళ్లను ఎదుర్కొంటాడు.
    14 . భీమిలి కబడ్డీ జట్టు(జూలై 09 , 2010)
    U|డ్రామా
    కబడ్డీ ఆడే సూరి తన గ్రామానికి వచ్చిన ఓ యువతితో ప్రేమలో పడతాడు. రాష్ట్ర స్థాయి టోర్నమెంట్ నిర్వహించినప్పుడు, టైటిల్ గెలవడానికి సూరి, అతని స్నేహితులు అనేక సవాళ్లను ఎదుర్కొంటారు.
    15 . గోల్కొండ హై స్కూల్(జనవరి 14 , 2011)
    U|డ్రామా,క్రీడలు
    గోల్కొండ హైస్కూల్‌కు సంబంధించిన ట్రస్టీలు ఆ స్కూలులోని క్రీడా మైదానంపై కీలక నిర్ణయం తీసుకుంటారు. ఆ మైదానాన్ని విద్యార్థులు కోల్పోయే ప్రమాదం ఏర్పడుతుంది. రాష్ట్ర స్థాయి టోర్నమెంట్‌లో గోల్కొండ క్రికెట్ జట్టు గెలిస్తే మైదానం ఉంటుందని ట్రస్టీలు స్పష్టం చేస్తారు.
    16 . జెర్సీ(ఏప్రిల్ 19 , 2019)
    U|160 minutes|డ్రామా,క్రీడలు
    ఒక మాజీ క్రికెటర్ తన కొడుకు కోరికను తీర్చడానికి ఇండియా టీమ్‌కు సెలెక్ట్ అయ్యేందుకు ఎలాంటి కష్టాలు పడ్డాడు అనేది కథ

    @2021 KTree