• TFIDB EN
  • Editorial List
    తెలుగులో హీరోలకు వ్యాధులు/లోపాల ఆధారంగా వచ్చిన టాప్‌ సినిమాలు
    Dislike
    500+ views
    1 year ago

    టాలీవుడ్‌లో హీరో అరుదైన వ్యాధులతో బాధపడే సినిమాలు చాలానే వచ్చాయి. హీరో ఏదైన ఒక లోపం, వ్యాధితో బాధపడుతూ నటించిన సినిమాలు చాలావరకు బాక్సాఫీస్ వద్ద హిట్లు కొట్టాయి. జూ.ఎన్టీఆర్ నుంచి విజయ్ దేవరకొండ వరకు లోపాలతో సినిమాలు తీసి ప్రేక్షకులను అలరించారు. మరి ఆ సినిమాల లిస్ట్ మీకోసం

    ఇంగ్లీష్‌లో చదవండి

    1 . '1' నేనొక్కడినే (జనవరి 10 , 2014)
    UA|177 minutes (theatrical version) 157 minutes (trimmed version)|యాక్షన్,థ్రిల్లర్
    హీరోకి బాధాకరమైన గతం ఉంటుంది. దాని వల్ల అతడ్ని కొన్ని ఆలోచనలు వెంటాడుతాయి. ఈ క్రమంలో హీరో జీవితంలో ఊహించని మలుపులు చోటుచేసుకుంటాయి. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు హీరో గతం ఏంటి? అన్నది కథ.

    ఈ సినిమాలో మహేష్ బాబు స్కిజోఫెర్నియా ప్రాబ్లంతో కనిపిస్తారు.

    2 . సూర్య vs సూర్య(మార్చి 05 , 2015)
    U|130 minutes|రొమాన్స్
    సూర్య వంశపారంపర్యమైన వ్యాధితో బాధపడుతుంటాడు, అది అతన్ని పగలు బయటికి వెళ్లనివ్వదు. అతను టీవీ యాంకర్ సంజనతో ప్రేమలో పడడంతో పరిస్థితులు మారిపోతాయి.

    ఈ చిత్రంలో నిఖిల్.. జనటికల్ డిజార్డర్‌ వ్యాధితో బాధపడుతుంటాడు.

    3 . జెర్సీ(ఏప్రిల్ 19 , 2019)
    U|160 minutes|డ్రామా,క్రీడలు
    ఒక మాజీ క్రికెటర్ తన కొడుకు కోరికను తీర్చడానికి ఇండియా టీమ్‌కు సెలెక్ట్ అయ్యేందుకు ఎలాంటి కష్టాలు పడ్డాడు అనేది కథ

    ఈ సినిమాలో నాని హార్ట్ డిసీజ్‌ ప్రాబ్లంతో కనిపిస్తాడు.

    4 . లైగ‌ర్(ఆగస్టు 25 , 2022)
    UA|138 minutes|యాక్షన్,డ్రామా
    తన బిడ్డ లైగర్‌(విజయ్‌ దేవరకొండ)ను ఛాంపియన్‌గా చూడాలని బాలామణి (రమ్యకృష్ణ) కోరిక. ఇందుకోసం కరీంనగర్‌ నుంచి ముంబయికి వస్తుంది. ప్రేమ జోలికి వద్దని తల్లి చెబుతున్నప్పటికీ లైగర్ తానియా (అనన్య పాండే) ప్రేమలో పడతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? వారి ప్రేమ ఎందుకు విఫలమైంది? లైగర్ ఛాంపియన్‌గా అయ్యాడా? అనేది కథ.

    ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ నత్తిలో బాధపడుతు కనిపిస్తాడు.

    5 . భలే భలే మగాడివోయ్(సెప్టెంబర్ 04 , 2015)
    U|145 minutes|హాస్యం,రొమాన్స్
    లక్కీ అనే యువకుడు ఒక మొక్కల శాస్త్రవేత్త. మతిమరుపుతో బాధపడుతుంటాడు. నందన అనే అమ్మాయితో ప్రేమలో పడుతాడు. తన లోపాన్ని దాచడానికి కష్టపడుతుంటాడు.

    ఈ చిత్రంలో నాని మతిమరుపు వ్యాధితో బాధపడుతుంటాడు.

    6 . మహానుభావుడు(సెప్టెంబర్ 29 , 2017)
    UA|151 minutes|హాస్యం,రొమాన్స్
    శర్వానంద్ అతి శుభ్రత వ్యాధిని కలిగి(OCD) ఉంటాడు. ఈక్రమంలో హీరోయిన్‌ మెహ్రీన్‌ను ప్రేమిస్తాడు. కానీ ఆ శుభ్రతే అతని ప్రేమకు అడ్డంకిగా మారుతుంది. ఇంతకు తన ప్రేమను గెలుచుకున్నాడ? లేదా? అన్నది మిగతా కథ.

    ఈ మూవీలో శర్వానంద్ OCD ప్రాబ్లంతో కనిపిస్తాడు.

    7 . పుష్ప: ది రైజ్ - పార్ట్ 01(డిసెంబర్ 17 , 2021)
    UA|179 minutes|యాక్షన్,థ్రిల్లర్
    పుష్ప (అల్లుఅర్జున్‌) ఎర్రచందనం కూలీ. కొండా రెడ్డి (అజయ్‌ ఘోష్‌) సోదరులకు స్మగ్లింగ్‌లో సలహాలు ఇచ్చే స్థాయికి అతడు వెళతాడు. అక్కడ నుంచి సిండికేట్‌ను శాసించే రేంజ్‌కు పుష్ప ఎలా ఎదిగాడు? మంగళం శ్రీను (సునీల్‌)తో ఉన్న గొడవేంటి? అన్నది కథ.

    ఈ సినిమాలో అల్లు అర్జున్ షోల్డర్ ఇంబాలెన్స్ ప్రాబ్లంతో కనిపిస్తారు..

    8 . రంగస్థలం(మార్చి 30 , 2018)
    UA|174 minutes|డ్రామా,హిస్టరీ,రొమాన్స్
    ఊరి ప్రెసిడెంట్‌గా 30 ఏళ్ల నుంచి ఫణీంద్ర భూపతి (జగపతిబాబు) ప్రజలను పీడిస్తుంటాడు. అతడి అన్యాయాలకు హీరో అన్న కుమార్‌బాబు (ఆది పినిశెట్టి) ఎదురు తిరుగుతాడు. ఫణీంద్ర భూపతికి పోటీగా నామినేషన్‌ వేస్తాడు. ఈ క్రమంలోనే కుమార్‌బాబు అనూహ్యంగా హత్యకు గురవుతాడు. అన్న చావుని చూసిన చిట్టిబాబు (రామ్‌చరణ్‌) ఎలా రివేంజ్‌ తీర్చుకున్నాడన్నది కథ.

    ఈ చిత్రంలో రామ్‌చరణ్ వినికిడి లోపంతో బాధపడుతున్న వ్యక్తిలా కనిపిస్తారు.

    9 . రాజా ది గ్రేట్(అక్టోబర్ 18 , 2017)
    UA|150 mins|యాక్షన్,హాస్యం,రొమాన్స్
    కంటి చూపులేని రాజా.. ఆసాధారణ ప్రతిభకలవాడు. ఓ యువతి ఆపాదలో ఉన్నప్పుడు ఆమెకు సాయం చేయాలనుకుంటాడు. ఆమెను రక్షించే క్రమంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు అన్నది మిగతా కథ.

    ఈ సినిమాలో రవితేజ అధుడిగా నటించి మెప్పించారు

    10 . జై లవ కుశ(సెప్టెంబర్ 21 , 2017)
    UA|153 minutes|యాక్షన్
    విధివశాత్తు విడిపోయిన ముగ్గురు అన్నదమ్ములు తిరిగి కలిసినప్పుడు వారి మధ్య.. ప్రేమ, వంచన, ప్రతీకారం వంటి భావోద్వేగ కుటుంబ బంధాన్ని ఈ సినిమా కథ పరీక్షిస్తుంది.

    ఈ చిత్రంలో జూ.ఎన్టీఆర్ నత్తితో బాధపడుతుంటాడు.


    @2021 KTree