
V నాగయ్య కెరీర్‌లో టాప్ 10 బెస్ట్ చిత్రాలు
400+ views1 year ago
తెలుగులో తొలితరం నటుల్లో నాగయ్య ఒకరు. తెలుగులో ఫస్ట్ టైం స్టార్ హోదాను అనుభవించింది నాగయ్య అని చెప్పవచ్చు. ఆయన నటించిన చిత్రాల్లో ప్రేక్షకులను ఆకట్టుకున్న సినిమాలను ఓసారి చూద్దాం.

1 . లవ కుశ(మార్చి 29 , 1963)
U|208 min|డ్రామా,మ్యూజికల్
రాముడు గర్భవతి అయిన సీతను వనవాసానికి పంపినప్పుడు ఆమె కవల కుమారులకు జన్మనిస్తుంది. వారు పెద్దయ్యాక అశ్వమేధ యజ్ఞానికి అంతరాయం కలిగించడానికి అయోధ్యకు వెళ్లినప్పుడు కథ మలుపు తిరుగుతుంది.
.jpeg)
2 . యోగి వేమన(ఏప్రిల్ 10 , 1947)
U|డ్రామా
గొప్ప తెలుగు తత్వవేత్త, ప్రసిద్ధ కవి యోగి వేమన జీవితం ఆధారంగా ఈ సినిమా రూపొందింది. ఇందులో వేమన పాత్రను పాత్రను నాగయ్య పోషించారు. కె.వి. రెడ్డి దర్శకత్వం అందించారు.
.jpeg)
3 . త్యాగయ్య(నవంబర్ 01 , 1946)
U|186 minutes|డ్రామా,హిస్టరీ
ప్రసిద్ధ కర్ణాటక సంగీత వాగ్గేయకారుడు త్యాగరాజు జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. చిత్తూరు నాగయ్య దర్శక నిర్మాణంలో చిత్రం రూపొందింది.

4 . స్వర్గ సీమ(undefined 00 , 1945)
U|114 minutes|డ్రామా
స్వర్గ సీమ అనేది 1945లో విడుదలైన తెలుగు-భాషా నాటకీయ చలనచిత్రం, ఇది B. N. రెడ్డి నిర్మించి దర్శకత్వం వహించారు మరియు V. నాగయ్య, B. జయమ్మ మరియు భానుమతి నటించారు. ఘంటసాల C. H. నారాయణరావు పాటకు నేపథ్య గాయకుడిగా సినీ ప్రపంచంలోకి ప్రవేశించారు మరియు ఓహ్ నా రాజా పాట కోసం భానుమతి రామకృష్ణతో ఘంటసాల పాడిన మొదటి యుగళగీతం కూడా. మార్కస్ బార్ట్లీ ఈ సినిమాతో సినిమాటోగ్రాఫర్‌గా కూడా అరంగేట్రం చేశారు. వియత్నాం అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ప్రదర్శించబడిన తొలి తెలుగు చిత్రం ఇదే.

5 . భక్త పోతన(జనవరి 07 , 1943)
U|186 minutes|డ్రామా
ప్రసిద్ధ తెలుగు కవి పోతన జీవిత ఇతివృత్తం ఆధారంగా ఈ సినిమా రూపొందింది. చిత్తూరు నాగయ్య పోతన పాత్రలో నటించారు. ఇదే సినిమా మళ్లీ 1966లో వచ్చినప్పుడు అందులో నాగయ్య వేదవ్యాసునిగా కనిపించారు.

6 . పాండురంగ మహత్యం(నవంబర్ 28 , 1957)
U|175 minutes|డ్రామా,హిస్టరీ
ఈ చిత్రం మహారాష్ట్రలోని పండరీపురం క్షేత్ర వైభవాన్ని చాటుతుంది. సనాతన సంప్రదాయాల్నీ, ఆనాటి సామాజిక పరిస్థితులకు అద్దం పడుతుంది. నాస్తికుడైన ఒక యువకుడు పాండురంగడుకి పరమభక్తుడిగా ఎలా మారాడో చూపించారు.
.jpeg)
7 . అనార్కలి(ఏప్రిల్ 28 , 1955)
U|153 minutes|డ్రామా,రొమాన్స్
మొఘల్ యువరాజు సలీం.. పర్షియాకు చెందిన నాదిరా అనే అందమైన మహిళతో ప్రేమలో పడతాడు. అక్బర్ చక్రవర్తి నాదిరాకు అనార్కలి అనే బిరుదును ఇచ్చినప్పటికీ అతను తన కొడుకుతో ఆమె సంబంధాన్ని అంగీకరించడు.

8 . బీదల పాట్లు(ఫిబ్రవరి 11 , 1972)
U|153 mins|యాక్షన్,డ్రామా
పన్నెండేళ్ల జైలు జీవితం తర్వాత కోటయ్య కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాడు. కానీ, ఉన్న ఏకైక కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం, విప్లవకారులకు మరియు పోలీసులకు మధ్య జరిగిన పోరాటంలో అతను చిక్కుకుంటాడు.

9 . బీదల పాట్లు(నవంబర్ 09 , 1950)
U|197 minutes|డ్రామా
కోటయ్య తన తల్లి, తన మేన కోడలు ఆకలి తీర్చేందుకు ఓ రొట్టె ముక్కను దొంగిలిస్తాడు. దీంతో అతనికి రెండు నెలలు జైలు శిక్షపడుతుంది. అతని తల్లి చనిపోయిందని తెలియడంతో జైలు నుంచి తప్పించుకునేందుకు కోటయ్య ప్రయత్నిస్తాడు. కానీ విఫలమవుతాడు. అతని జైలు శిక్ష 12 ఏళ్లకు పెరుగుతుంది. జైలు నుంచి విడుదలైన అతన్ని చూసి అంతా దొంగా, దొంగా అంటూ అవమానిస్తారు. దీంతో అతను ఓ చర్చి ఫాదర్ సాయంతో దయనిధిగా పేరు మార్చుకుంటాడు. ఆ తర్వాత అతని జీవితం ఊహించని మలుపు తిరుగుతుంది.

10 . మన దేశం(నవంబర్ 24 , 1949)
UA|172 minutes|డ్రామా
మధు, శోభ ఒకరినొకరు ప్రేమిస్తున్నప్పటికీ భిన్నమైన రాజకీయ అభిప్రాయాలు కలిగి ఉంటారు. మధు స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొనడానికి బయలు దేరినప్పుడు అతని కుటుంబం వ్యతిరేకిస్తుంది.