• TFIDB EN
  • Editorial List
    వాలెంటైన్స్ డే రోజు సింగిల్స్ చూడదగిన 10 తెలుగు చిత్రాలు
    Dislike
    400+ views
    9 months ago

    వాలెంటైన్స్ డే రోజు ప్రేమికులంతా పార్టీలు, సినిమాలు అంటూ బిజీ బిజీగా ఉంటారు. అటు ప్రేమలో లేని సింగిల్స్ మాత్రం ఏం చేయాలో అర్థంకాకా ఆలోచిస్తు ఉంటారు. మీరు మాత్రం ఆరోజు ఎందుకు వృథా చేయాలి… మీ ఫ్రెండ్స్‌తో కలిసి ఈ ఫీల్ గుడ్ చిత్రాల్లో ఒకటి చూసి ఎంజాయ్ చేయండి.

    ఇంగ్లీష్‌లో చదవండి

    1 . హ్యాపీ డేస్(అక్టోబర్ 02 , 2007)
    U|160 minutes|డ్రామా
    ఒక ఇంజినీరింగ్ కాలేజీకి చెందిన ఎనిమిది మంది యవకులు తమ స్నేహాన్ని నిలుపుకోవడం కోసం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈ చిత్రం యూత్‌లో పెద్ద ఎత్తున క్రేజ్ సంపాదించింది. 2007లో బ్లాక్ బాస్టర్ హిట్‌గా నిలిచింది. స్నేహితులతో కలిసే చూసేందుకు ఈ సినిమా బెస్ట్ ఛాయిస్.
    2 . సొంతం(ఆగస్టు 23 , 2002)
    U|145 minutes|హాస్యం,డ్రామా
    బాల్య స్నేహితుడైన వంశీని నందు ప్రేమిస్తుంటుంది. అయితే ఆమె తన ఫీలింగ్స్‌ను వంశీతో పంచుకోదు. అయితే ఆమె పట్ల తన భావాలను వంశీ తెలుసుకునే సమయానికి నందుకి ఇంకొకరితో నిశ్చితార్థం జరుగుతుంది.
    3 . ఢీ(ఏప్రిల్ 13 , 2007)
    U|హాస్యం
    హీరో ఓ గ్యాంగ్‌స్టర్‌ దగ్గర పనిలోకి చేరతాడు. అక్కడ ఆమె చెల్లెల్ని ప్రేమిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? వారిద్దరు ఎలా ఒక్కటయ్యారు? ఈ క్రమంలో చోటుచేసుకున్న హాస్య అన్నది కథ.
    4 . వెంకీ(మార్చి 26 , 2004)
    U|170 minutes|హాస్యం,మిస్టరీ,రొమాన్స్
    వెంకటేశ్వర్లు పోలీస్ ఫోర్స్‌లో తన స్నేహితులతో కలిసి రైలులో హైదరాబాద్‌కు బయల్దేరుతాడు. కానీ రైలులో ఓ హత్య జరుగుతుంది. ఆ హత్య వెంకీ అనతి స్నేహితులపై పడుతుంది. అయితే వీరంతా శిక్షణ కోసం అకాడమీలో చేరినప్పుడు.. రైలులో జరిగిన హత్యకు కారణం తెలుసుకుంటారు.
    5 . ఆర్ఆర్ఆర్(మార్చి 25 , 2022)
    UA|182 minutes|యాక్షన్,డ్రామా,హిస్టరీ
    నిజాం రాజును కలిసేందుకు వచ్చిన బ్రిటిష్ అధికారి గోండు పిల్లను తమ వెంట ఢిల్లీకి తీసుకెళ్తారు. ఆ గోండు జాతి నాయకుడైన భీమ్(జూ.ఎన్టీఆర్) ఆ పిల్లను వెతుక్కుంటూ ఢిల్లీకి వస్తాడు. ఈ విషయం తెలిసిన బ్రిటిష్ ప్రభుత్వం అతన్ని పట్టుకునేందుకు రామరాజు(రామ్‌చరణ్‌)ను ప్రత్యేక అధికారిగా నియమిస్తుంది. ఈక్రమంలో ఓ సంఘటన వల్ల భీమ్- రామరాజు ఒకరికొకరు తెలియకుండానే ప్రాణ స్నేహితులుగా మారుతారు. కానీ కొన్ని పరిణామాల వల్ల ఒకరిపై ఒకరు దాడి చేసుకోవాల్సి వస్తుంది. ఇంతకు గోండు పిల్లను బ్రిటిష్ చర నుంచి భీమ్ విడిపించాడా? అసలు రామరాజు బ్రిటిషర్ల దగ్గర ఎందుకు పనిచేశాడు అనేది మిగతా కథ.
    6 . పెళ్లి చూపులు(జూలై 29 , 2016)
    U|118 minutes|హాస్యం,డ్రామా,రొమాన్స్
    పెళ్లి చూపుల్లో ప్రశాంత్‌ (విజయ్‌ దేవరకొండ)ను చిత్ర (రీతు వర్మ) రిజెక్ట్‌ చేస్తోంది. ఓ కారణం వల్ల హీరోయిన్‌ పెట్టే ఫుడ్‌ ట్రక్‌ బిజినెస్‌లో హీరో భాగమవుతాడు. ఈ ఇద్దరి ప్రయాణం తర్వాత ఏయే మలుపులు తిరిగింది? అన్నది కథ.
    7 . వెన్నెల(నవంబర్ 26 , 2005)
    UA|133 mins|హాస్యం
    హీరో, హీరోయిన్లు ఇద్దరూ ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్తారు. అక్కడ ఒకరినొకరు ఇష్టపడతారు. అయితే హీరోయిన్‌ మాజీ లవర్‌ వారి మధ్యలోకి రావడంతో ఇద్దరి జీవితాలు కీలక మలుపు తిరుగుతాయి. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది కథ.
    8 . జాతి రత్నాలు(మార్చి 11 , 2021)
    U|148 minutes|హాస్యం,డ్రామా
    మంచి ఉద్యోగాల కోసం తమ ఊరి నుంచి హైదరాబాద్ వచ్చిన ముగ్గురు యువకులు ఓ అపార్ట్‌మెంటులో దిగుతారు. అక్కడ పిలువని పార్టీకి వెళ్లి మర్డర్ అటెంప్ట్ కేసులో ఇరుక్కుంటారు. ఆ తర్వాత కేసు నుంచి ఎలా బయటపడ్డారనేది కథ.
    9 . జెర్సీ(ఏప్రిల్ 19 , 2019)
    U|160 minutes|డ్రామా,క్రీడలు
    ఒక మాజీ క్రికెటర్ తన కొడుకు కోరికను తీర్చడానికి ఇండియా టీమ్‌కు సెలెక్ట్ అయ్యేందుకు ఎలాంటి కష్టాలు పడ్డాడు అనేది కథ
    10 . C/o కంచరపాలెం(సెప్టెంబర్ 07 , 2018)
    UA|151 minutes|డ్రామా
    కంచరపాలెంలో మెుదలైన నాలుగు ప్రేమకథలు వారి జీవితాల్లో ఎలాంటి మలుపులకు కారణమయ్యాయి? ఈ నాలుగు జంటలకు ఉన్న సంబంధం ఏంటి? చివరకు వారి కథలు ఎలా ముగిశాయి? అన్నది కథ.
    11 . ఆర్య(మే 07 , 2004)
    U|151 minutes|డ్రామా,రొమాన్స్
    అజయ్ గీతను ప్రేమిస్తాడు. కానీ గీత అతను చేసిన ప్రేమప్రతిపాదనను తిరస్కరించినప్పుడు బిల్డింగ్‌పై నుంచి దూకెస్తానని అజయ్ బెదిరిస్తాడు. దీంతో గీత అజయ్ లవ్‌ ప్రపోజలన్‌ను అంగీకరిస్తుంది. ఈ విషయం తెలిసి కూడా గీతకు ఆర్య లవ్ ప్రపోజ్ చేస్తాడు. ఆ తర్వాత కథ అనేక మలుపులు తిరుగుతుంది.

    @2021 KTree