• TFIDB EN
  • Editorial List
    వరుణ్ తేజ్ టాప్ హిట్ చిత్రాలు ఇవే
    Dislike
    300+ views
    9 months ago

    మెగా కాంపౌండ్‌ నుంచి హీరోగా బయటకొచ్చిన వరుణ్ తేజ్... కెరీర్‌లో దూసుకెళ్తున్నాడు. స్టార్ హీరోలకు నిలయమైన తన కుటుంబం ప్రభావం తనపై పడకుండా వరుణ్ తేజ్ ప్రత్యేక గుర్తింపు పొందాడు. వరుణ్ నటించిన చిత్రాల్లో ప్రేక్షకులను అలరించిన చిత్రాలను ఓసారి చూద్దాం

    ఇంగ్లీష్‌లో చదవండి

    1 . F3: ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్(మే 27 , 2022)
    U|148 minutes|హాస్యం,ఫ్యామిలీ
    అత్యాశపరులైన వెంకీ, వరుణ్‌, తమన్నా, మెహ్రీన్‌, ఎస్సై రాజేంద్ర ప్రసాద్‌ ఓ క్రైమ్‌లో ఇరుక్కుంటారు. దాని నుంచి బయటపడేందుకు వీరికి పెద్ద మెుత్తంలో డబ్బు అవసరమవుతుంది. ఈ క్రమంలో వ్యాపారవేత్త ఆనంద్‌ ప్రసాద్‌ (మురళి శర్మ) చిన్నప్పుడే తప్పిపోయిన తన కొడుకు కోసం ప్రకటన ఇస్తాడు. దీంతో పెద్దాయన డబ్బు కోసం వారంతా ఎలాంటి నాటకం ఆడారన్నది కథ.
    2 . F2: ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్(జనవరి 12 , 2019)
    UA|150 minutes|హాస్యం,డ్రామా
    వెంకీ, వరుణ్ తమ వైవాహిక జీవితంపై అసంతృప్తితో భార్యలను వదిలేసి యూరప్ ట్రిప్‌కు వెళ్తారు. ఆ ట్రిప్ వారి జీవితాన్ని మరింత గందరగోళానికి గురి చేస్తుంది.

    వెంకటేష్‌తో కలిసి నటించిన ఈ సినిమాలో తనలోని కామెడీ యాంగిల్‌ను బయటపెట్టాడు. ఈ చిత్రం సూపర్ హిట్‌గా నిలిచింది

    3 . గద్దలకొండ గణేష్(సెప్టెంబర్ 20 , 2019)
    UA|172 minutes|యాక్షన్,క్రైమ్,డ్రామా,థ్రిల్లర్
    ఒక ఫిల్మ్ మేకర్ గ్యాంగ్‌స్టర్ సినిమా తీయాలని కలలు కంటాడు. ఈ క్రమంలో రియల్ గ్యాంగ్‌స్టర్ అయి గద్దలకొండ గణేష్‌ని తన సబ్జెక్ట్‌గా ఎంచుకుంటాడు. గద్దలకొండ గణేష్‌కు తెలియకుండా అతన్ని అనుసరిస్తాడు. ఈ విషయం గద్దలకొండ గణేష్‌కు తెలిసి ఏం చేశాడు అనేది కథ.

    వరుణ్ తేజ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్‌ బాస్టర్‌గా ఈ చిత్రం నిలిచింది. మాస్ ప్రేక్షకులను దగ్గర చేసింది

    4 . తొలి ప్రేమ(ఫిబ్రవరి 10 , 2018)
    UA|136 minutes|హాస్యం,రొమాన్స్
    ఆదిత్య (వరుణ్‌ తేజ్‌) రైలులో వర్ష (రాశీఖన్నా)ను చూసి ప్రేమిస్తాడు. తాను చదువుతున్న ఆమె కాలేజీకే రావడంతో ఒకరినొకరు ప్రేమించుకుంటారు. కాలేజీలో జరిగిన ఓ గొడవ మూలంగా ఆదిత్య వర్షను వదిలి వెళ్లిపోతాడు. ఆరేళ్ల తర్వాత వర్ష మళ్లీ ఆదిత్య జీవితంలోకి వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? వారిద్దరు కలిశారా లేదా? అన్నది కథ.
    5 . ఫిదా(జూలై 21 , 2017)
    U|134 minutes|హాస్యం,డ్రామా,రొమాన్స్
    వరుణ్ అనే ఎన్ఆర్ఐ మెడికల్ స్టూడెంట్ తన అన్న పెళ్లి కోసం ఇండియా వచ్చి భానుమతి అనే తెలంగాణ యువతితో ప్రేమలో పడుతాడు. ఓ సంఘటన వల్ల భానుమతి వరుణ్‌ను అపార్థం చేసుకుంటుంది. మరి ఈ ఇద్దరు తిరిగి కలుసుకుంటారా? లేదా? అన్నది కథ

    ఈ చిత్రంలో వరుణ్ తేజ్- సాయిపల్లవితో చేసిన రొమాన్స్‌ ప్రేక్షకుల హృదయాల్లో గుర్తుండిపోతుంది.

    6 . కంచె(అక్టోబర్ 22 , 2015)
    UA|125 minutes|రొమాన్స్,యుద్ధం,హిస్టరీ
    రెండవ ప్రపంచ యుద్ధం నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుంది. ధూపతి హరిబాబు అనే సైనికుడు ఆ యుద్ధంలో పోరాడుతూనే, స్వదేశంలో కులం, సామాజిక వివక్షపై వ్యథ చెందుతాడు.

    ఈ చిత్రంలో వరుణ్ తేజ్ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఈ సినిమా తొలి విజయం అందించింది.


    @2021 KTree