Editorial List
వెంకటేష్ ఇప్పటివరకు నటించిన టాప్ కామెడీ సినిమాల లిస్ట్
20+ views1 month ago
టాలీవుడ్ అగ్రకథానాయకుల్లో విక్టరీ వెంకటేష్ ఒకరు. ఆయన సినిమా కెరీర్‌లో అన్ని రకాల పాత్రల్లో నటించి మెప్పించారు. ముఖ్యంగా ఆయన కామెడీ టైమింగ్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది. తనదైన హావభావాలతో కామెడీ పంచ్ డైలాగ్స్ విసురుతుంటారు. వెంకటేష్ తన సినీ కెరీర్‌లో ఎన్నో విజవంతమైన సినిమాల్లో నటించి సక్సెస్‌ను ఇంటి పేరుగా మార్చుకున్నారు. ఆయన నటించిన సినిమాల్లో బెస్ట్ కామెడీ చిత్రాలను ఇప్పుడు చూద్దాం.
1 . సుందరకాండ(అక్టోబర్ 02 , 1992)
U|02:07:59|డ్రామా
కాలేజీ లెక్చరర్ అయిన వెంకటేశ్వర్లను రోజా అనే స్టూడెంట్ ప్రేమిస్తుంది. అయితే వెంకటేశ్వర్లు ఆమె ప్రేమను అంగీకరించకుండా వెరే యువతిని పెళ్లి చేసుకుంటాడు. కానీ రోజాకు ప్రాణంతకమైన వ్యాధి ఉందని తెలియడంతో కథ మలుపు తిరుగుతుంది.
2 . కలిసుందాం రా(జనవరి 14 , 2000)
U|డ్రామా,ఫ్యామిలీ
రాఘవయ్య తన విడిపోయిన కొడుకు భాస్కర్ కుటుంబాన్ని అతని పుట్టినరోజుకు ఆహ్వానించడానికి అంగీకరిస్తాడు. రాఘవయ్య మనవడు రఘు, తన తండ్రి, తాతల మధ్య బంధం చెడిపోవడానికి గల కారణాన్ని తెలుసుకుంటాడు. ఆ సమస్యను పరిష్కరించి మనవడిగా రాఘవయ్య తనను అంగీకరించేలా చేస్తాడు.
3 . మల్లీశ్వరి(ఫిబ్రవరి 18 , 2004)
U|155 minutes|రొమాన్స్
ఆంధ్రబ్యాంకులో పనిచేస్తున్న ప్రసాద్.. మల్లీశ్వరిని చూడగానే ప్రేమలో పడుతాడు. ఆమె ప్రేమను పొందెందుకు నానా తంటాలు పడుతాడు. అయితే మల్లీశ్వరి ఎవరో తెలుసుకున్నాక తన ప్రేమను పక్కకు పెట్టి ఆమెకు రక్షణగా నిలుస్తాడు.
4 . వాసు(ఏప్రిల్ 10 , 2002)
U|147 minutes|మ్యూజికల్
వాసు గొప్ప సంగీతకారుడు కావాలని కలలు కంటుంటాడు. సివిల్స్ చేయాలన్న తన కోరికకు విరుద్ధంగా వాసు వెళ్తుండటంతో తండ్రి కోపం పెంచుకుంటాడు. చివరికి వాసు ఏం చేశాడు? అన్నది కథ.
5 . మసాలా(నవంబర్ 14 , 2013)
U|140 minutes|యాక్షన్,హాస్యం
భీమరాజపురంలో బలరాం (వెంకటేష్) మంచి పేరున్న పెద్ద మనిషి. అతడికి అబద్దం అంటే నచ్చదు. కొన్ని కారణాల వల్ల రెహ్మాన్ (రామ్) బలరాంకు అబద్దం చెబుతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది కథ.
6 . చింతకాయల రవి(అక్టోబర్ 02 , 2008)
UA|152 minutes|హాస్యం,రొమాన్స్
రవి న్యూయర్క్‌లో వెయిటర్‌గా పనిచేస్తుంటాడు. అయితే తన తల్లికి మాత్రం సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా చేస్తున్నట్లు అబద్దం చెబుతాడు. దీంతో ఆమె లావణ్యతో రవికి పెళ్లి ఫిక్స్ చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది కథ.
7 . బాడీగార్డ్(జనవరి 14 , 2012)
U|155 minutes|రొమాన్స్
వెంకటాద్రికి నాయుడు అంటే ఎంతో గౌరవం. నాయుడు కూతురు కీర్తికి ముప్పు ఉందని తెలయడంతో బాడీగార్డ్‌గా వెళ్తాడు. బాడీగార్డ్‌గా వ్యవహరిస్తున్న వెంకటాద్రికి ఓ అమ్మాయి ఫోన్ ద్వారా పరిచయం అవుతుంది. ఆమెను వెంకటాద్రి ఇష్టపడతాడు. ఇంతకి ఆమె ఎవరు? వారిద్దరు కలిశారా? లేదా? అన్నది కథ.
8 . బాబు బంగారం(ఆగస్టు 12 , 2016)
UA|150 mins|యాక్షన్,హాస్యం,రొమాన్స్
హీరో మంచి మనసు కలిగిన పోలీసు ఆఫీసర్. కష్టాల్లో ఉన్న హీరోయిన్ కుటుంబానికి అండగా నిలబడతాడు. ఈ క్రమంలో అతడికి ఎదురైన సమస్యలు ఏంటి అన్నది కథ.
9 . సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు(జనవరి 11 , 2013)
U|159 minutes|డ్రామా,ఫ్యామిలీ
ఇది మధ్య తరగతి కుటుంబంలో ఉన్న ఇద్దరు అన్నదమ్ములు పెద్దోడు, చిన్నోడు జీవితాలను చుట్టూ తిరుగుతుంది. ఈ కథలో వాళ్ళ బంధం, వారి ప్రేమ, తల్లిదండ్రుల పట్ల గౌరవం చూపిస్తుంది. ఈ సినిమాలో సాంప్రదాయ విలువలు, కుటుంబం మీద ప్రేమ, విభేదాల మధ్య కూడా కలిసి ఉండటం ఎంత ముఖ్యమో చూపిస్తుంది.
10 . ఆడవారి మాటలకు అర్థాలే వేరులే(ఏప్రిల్ 27 , 2007)
UA|157 minutes|డ్రామా
గణేష్ ఒక నిరుద్యోగి.. కీర్తిని చూసి ప్రేమలో పడతాడు. ఆమె సాయంతో కీర్తి పనిచేసే సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం సాధిస్తాడు. అయితే, ఆమె అప్పటికే వేరొకరితో నిశ్చితార్థం చేసుకున్నట్లు గణేష్ తెలుస్తుంది. ఓ సంఘటన వల్ల గణేష్ తీవ్రమైన డిప్రెషన్‌లోకి వెళ్తాడు. గణేష్‌ను మాములు మనిషి చేసేందుకు అతని స్నేహితుడు తన ఊరికి తీసుకెళ్తాడు. ఈ క్రమంలో అతనికి ఓ నిజం తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది అన్నది మిగతా కథ.
11 . నువ్వు నాకు నచ్చావ్(సెప్టెంబర్ 06 , 2001)
U|180 minutes|హాస్యం,మ్యూజికల్
వెంకీని అతని తండ్రి శేఖరం.. తన చిన్ననాటి స్నేహితుడు శ్రీనివాస్ దగ్గరికి ఉద్యోగం కోసం పంపిస్తాడు. అయితే పెళ్లి నిశ్చయమైన శ్రీనివాస్ కూతురు నందిని వెంకీని ప్రేమిస్తుంది. కానీ వెంకీ, శ్రీనివాస్‌తో తన తండ్రి స్నేహం చెడిపోవద్దని ప్రేమను త్యాగం చేయాలని అనుకుంటాడు.
12 . నమో వేంకటేశా(జనవరి 14 , 2010)
U|152 minutes|డ్రామా
మిమిక్రీ ఆర్టిస్ట్ అయిన రమణ.. తన ఫారిన్ ట్రిప్‌లో ఓ ఫ్యాక్షనిస్ట్ కూతురు పూజ అనే యువతితో ప్రేమలో పడుతాడు. అయితే పూజ మనసులో తాను లేనని తెలుసుకున్న రమణ.. ఆమెకు నచ్చిన వ్యక్తితో కలపేందుకు సిద్ధమవుతాడు. ఈ క్రమంలో అతను ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు? అన్నది కథ.
13 . F3: ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్(మే 27 , 2022)
U|148 minutes|హాస్యం,ఫ్యామిలీ
అత్యాశపరులైన వెంకీ, వరుణ్, తమన్నా, మెహ్రీన్, ఎస్సై రాజేంద్ర ప్రసాద్ ఓ క్రైమ్‌లో ఇరుక్కుంటారు. దాని నుంచి బయటపడేందుకు వీరికి పెద్ద మెుత్తంలో డబ్బు అవసరమవుతుంది. ఈ క్రమంలో వ్యాపారవేత్త ఆనంద్ ప్రసాద్ (మురళి శర్మ) చిన్నప్పుడే తప్పిపోయిన తన కొడుకు కోసం ప్రకటన ఇస్తాడు. దీంతో పెద్దాయన డబ్బు కోసం వారంతా ఎలాంటి నాటకం ఆడారన్నది కథ.
14 . F2: ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్(జనవరి 12 , 2019)
UA|150 minutes|హాస్యం,డ్రామా
వెంకీ, వరుణ్ తమ వైవాహిక జీవితంపై అసంతృప్తితో భార్యలను వదిలేసి యూరప్ ట్రిప్‌కు వెళ్తారు. ఆ ట్రిప్ వారి జీవితాన్ని మరింత గందరగోళానికి గురి చేస్తుంది.