• TFIDB EN
  • Editorial List
    విక్టరీ వెంకటేష్ డ్యూయల్ రోల్‌లో నటించిన సినిమాలు ఇవే!
    Dislike
    2k+ views
    6 months ago

    టాలీవుడ్‌లో విక్టరీ వెంకటేష్ నటనకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఆయన నటనతో ప్రేక్షకులను కంటతడి పెట్టించిన సినిమాలు ఎన్నో. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్‌కు వెంకటేష్ సూపర్ హీరో. ఈక్రమంలో వెంకటేష్ తన సుదీర్ఘ సినీ ప్రయాణంలో డ్యుయల్ రోల్స్‌లో కనిపించి ప్రేక్షకులను అలరించాడు. మరి ఆ చిత్రాలేంటో ఓసారి చూద్దాం.

    ఇంగ్లీష్‌లో చదవండి

    1 . కూలీ నం.1(జూలై 12 , 1991)
    U|146 min 46 sec|రొమాన్స్
    సంపన్న కుటుంబానికి చెందిన ఒక మహిళ కూలీతో ప్రేమలో పడినప్పుడు, ఆ జంట తమ సామాజిక హోదాలో ఉన్న విభేదాల కంటే తమ ప్రేమ బలమైనదని నిరూపించడానికి ప్రయత్నిస్తారు.

    కే రాఘవేంద్రరావు డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో వెంకటేష్ తొలిసారి డబుల్ యాక్షన్‌లో కనించాడు. రాజు, భరత్ పాత్రల్లో కనిపించాడు. కానీ ఈ సినిమాలో కూలీగా ఉన్న రాజు హీరోయిన్‌కు బుద్ధి చెప్పడానికి మారువేషంలో భరత్‌లా నటిస్తాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయింది.

    2 . ముద్దుల ప్రియుడు(అక్టోబర్ 01 , 1994)
    U|132 minutes|రొమాన్స్
    రైతుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని సుబ్బయ్య వారి భూములను లాక్కుంటాడు. అయితే సుబ్బయ్య మోసాలను రాముడు బయట పెడుతాడు. దీంతో ప్రతీకారంగా రాముడిని కొట్టి సముద్రంలో పడేస్తారు. అయితే అతన్ని కొంతమంది కాపాడుతారు. కానీ రాముడు తన జ్ఞాపక శక్తి కోల్పోతాడు.

    ఈ సినిమాలోనూ వెంకటేష్ డబుల్ యాక్షన్‌లో కనిపించినప్పటికీ.. ఒకే వ్యక్తి రెండు వేర్వేరు ప్రాంతాల్లో రాముడు- రాజుగా కనిపిస్తాడు. ఈ చిత్రాన్ని కూడా కే రాఘవేంద్రరావు డైరెక్ట్ చేశారు. ఈ సినిమా మంచి విజయం సాధించింది.

    3 . పోకిరి రాజా(జనవరి 12 , 1995)
    U|145 minutes|యాక్షన్,డ్రామా
    సీఎంను ఓ ప్రమాదం నుంచి చంటి కాపాడతారు. దీంతో సీఎం చంటిని ఇంటికి ఆహ్వానిస్తాడు. ఆ సమయంలోనే మాఫియా డాన్‌ విక్కీ సీఎంపై దాడి చేస్తాడు. చంటి సీఎంను రక్షించి విక్కీని వెంబడిస్తూ వెళ్తాడు. ఈ క్రమంలో చంటి కనిపించకుండా పోతాడు. చంటి ఏమయ్యాడు? అతడిలాగే ఉన్న బాలరాజు ఎవరు? అన్నది కథ.

    ఎ. కోదండరామిరెడ్డి డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమాలో వెంకటేష్ తొలిసారి డ్యుయల్ రోల్‌లో కనిపించాడు. చంటి, బాలరాజు పాత్రల్లో నటించి మెప్పించాడు. ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఈ చిత్రంలో వెంకటేష్ సరసన రోజా, శుభశ్రీ నటించారు.

    4 . సూర్యవంశం(ఫిబ్రవరి 25 , 1998)
    U|163 minutes|డ్రామా
    భాను నిరక్షరాస్యుడు. చిన్నప్పటి నుంచి తండ్రి ప్రేమకు నోచుకోడు. ఒక అమ్మాయితో తండ్రి పెళ్లి నిశ్చయించగా ఓ కారణం చేత చేసుకోనని చెబుతాడు. దీంతో తండ్రికి మరింత దూరం ‌అవుతాడు. భాను మంచి మనసు గురించి తెలుసుకున్న పట్నం యువతి అతడ్ని పెళ్లి చేసుకోవడంతో కథ మలుపు తిరుగుతుంది.

    ఈ చిత్రాన్ని బీమినేని శ్రీనివాస్ రావు డైరెక్ట్ చేశారు. విక్టరీ వెంకటేష్ ఈ సినిమాలో హరిశ్చంద్ర ప్రసాద్, భాను ప్రసాద్ క్యారెక్టర్లలో నటించారు. వెంకటేష్ సరసన రాధిక, మీనా హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రం ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది.

    5 . జయం మనదేరా(అక్టోబర్ 07 , 2000)
    U/A|152 minutes|యాక్షన్,డ్రామా
    థమ్సప్ యూరప్‌ ట్రిప్‌కు వచ్చిన ఉమను చూసిన అభిరామ్ తొలిచూపులోనే ప్రేమలో పడుతాడు. ఉమ కూడా అభిరామ్‌ను ప్రేమిస్తుంది. అయితే వీరిద్దరు ఒకరికొకరు తమ ప్రేమను చెప్పుకోరు. ఉమ ఇండియాకి వచ్చేస్తుంది. తన ప్రేమను ఉమకు చెప్పేందుకు వచ్చిన అభిరామ్‌కు తన గతం గురించి తెలుస్తుంది.

    జయం మనదేరా సినిమా ఎన్‌ శంకర్ డైరెక్షన్‌లో వచ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్‌ టాక్ సొంతం చేసుకుంది. మహదేవ నాయుడు, అభిరాం (రుద్రమ నాయుడు)గా వెంకటేష్ ద్విపాత్రాభినయం చేశాడు.

    6 . దేవి పుత్రుడు(జనవరి 14 , 2001)
    U/A|162 minutes|డ్రామా,ఫాంటసీ
    బలరాం ఒక పురాతత్వ శాస్త్రవేత్త. దేవుడంటే నమ్మకం ఉండదు. అయితే సముద్రం నుంచి శ్రీకృష్ణుడి కాలం నాటి ఒక పెట్టెను వెలికి తీస్తాడు. ఆ పెట్టె ఆధ్యాత్మిక శక్తిని తెలుసుకున్న బలరాం తిరిగి సముద్రంలోకి పంపించాలని ప్రయత్నిస్తాడు. అయితే కొంతమంది ఆ పెట్టె కోసం అతన్ని హింసిస్తారు.

    కోడి రామకృష్ణ డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రంలో వెంకటేష్ మరోసారి డ్యుయల్‌ రోల్‌లో కనిపించి మెప్పించాడు. బలరాం, కృష్ణ పాత్రల్లో కనిపించాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైనప్పటికీ మ్యూజికల్ హిట్‌గా నిలిచింది. వెంకటేష్ సరసన సౌందర్య, అంజలా జావేరి హీరోయిన్లుగా నటించారు.

    7 . సుభాష్ చంద్రబోస్(ఏప్రిల్ 22 , 2005)
    U/A|152 minutes|డ్రామా,రొమాన్స్
    అమరచంద్ర.. గవర్నర్ ప్రణాళికల గురించి తెలుసుకుని బ్రిటిష్ సైన్యాన్ని రవాణా చేస్తున్న రైలును పేల్చివేయాలని నిర్ణయించుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది? హీరో తన ప్రయత్నంలో సక్సెస్‌ అయ్యాడా? లేదా? అన్నది కథ.

    కే రాఘవేంద్రరావు డైరెక్షన్‌లో వచ్చిన 101వ చిత్రం ఇది. ఇందులో వెంకటేష్ స్వాతంత్ర్య సమరయోధుడు అమరచంద్ర , అశోక్ పాత్రాల్లో ద్విపాత్రాభినయం చేశారు. వెంకటేష్ సరసన శ్రియాసరన్, జెనిలియా నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ కాలేదు.

    8 . నాగవల్లి(డిసెంబర్ 16 , 2010)
    A|159 minutes|డ్రామా,హారర్,థ్రిల్లర్
    వ్యాపారవేత్త శంకర్ రావుకు అతని కుటుంబానికి ఇంట్లో వింత సంఘటనలు ఎదురవుతాయి. దీంతో తమకు సహాయం చేయాల్సిందిగా డాక్టర్ విజయ్ అనే సైకియాట్రిస్ట్‌ని పిలుస్తారు. ఆ తర్వాత వారింట్లో జరిగే వింత సంఘటనలపై విజయ్ పరిశోధన మొదలుపెడుతాడు.

    ఈ చిత్రాన్ని పి.వాస్ డైరెక్ట్ చేశారు. నాగవల్లి సినిమాలో నాగభైరర, డా.విజయ్ పాత్రలో వెంకటేష్ డ్యుయల్ రోల్‌లో కనిపించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్‌గా నిలిచింది. వెంకటేష్ సరసన కమల్ని ముఖర్జి, అనుష్క శెట్టి నటించారు.


    @2021 KTree