Editorial List
విజయశాంతి నటించిన టాప్ 15 బెస్ట్ సినిమాలు ఇవే!
300+ views8 months ago
లెడీ సూపర్ స్టార్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి విజయశాంతి. హీరోలతో సమానమైన ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సాధించిన ఏకైన నటి ఆమె. విజయశాంతి నటించిన ఎన్నో సినిమాలు ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచాయి. మరి ఈ లెడీ అమితాబ్ బచ్చన్ నటించి టాప్ 15 బెస్ట్ సినిమాలపై ఓ లుక్ వేద్దాం.
1 . భరత నారి(జూలై 07 , 1989)
UA|డ్రామా
ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో విజయశాంతి, వినోద్ కుమార్, మురళి మోహన్, నర్రా వెంకటేశ్వరరావు, సుత్తివేలు, పీ.ఎల్. నారాయణ ముఖ్య పాత్రలు పోషించారు.
2 . కర్తవ్యం(జూన్ 29 , 1990)
U|150 minutes|యాక్షన్
వైజయంతి నిజాయతీ గల పోలీసు అధికారిణి. లైంగిక వేధింపుల కేసులో ఓ యువకుడ్ని అరెస్టు చేస్తుంది. దీంతో అతడి తండ్రి వైజయంతిని చంపేస్తానని ప్రతిజ్ఞ చేస్తాడు.
3 . ఒసేయ్ రాములమ్మ(మార్చి 07 , 1997)
A|165 minutes|యాక్షన్,డ్రామా
ఈ చిత్రం తెలంగాణ ప్రాంతంలో ఒకప్పుడు నిమ్నకులాలపై ఉన్నతవర్గాల చేసిన అకృత్యాలను బయటపెట్టింది. రాములమ్మ గిరిజన యువతి. ఆమెపై ఉన్నత కులానికి చెందిన దొర అత్యాచారం చేస్తాడు. న్యాయం కోరిన ఆమె తల్లిదండ్రులను హత్య చేస్తాడు. అతనిపై ప్రతీకారంతో రాములమ్మ నక్సలైట్ బృందంలో చేరుతుంది.
4 . గ్యాంగ్ లీడర్(మే 09 , 1991)
A|యాక్షన్,డ్రామా
ముగ్గురు సోదరులలో చిన్నవాడైన రాజారామ్ తన రెండో అన్న చదువుకు డబ్బులు కట్టేందుకు చేయని నేరాన్ని తనపై వేసుకుంటాడు. అయితే తన పెద్దన్నయ్యను హత్య చేసిన నిందితుల గురించి తెలిసి వారిపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంటాడు.
5 . అత్తకు యముడు అమ్మాయికి మొగుడు(జనవరి 14 , 1989)
U|140 minutes|డ్రామా
కళ్యాణ్ సోదరి డబ్బున్న వ్యక్తిని ప్రేమిస్తుంది. అహంకారి అయిన తల్లికి భయపడి ఆ వ్యక్తి పెళ్లి గురించి ఆలోచిస్తుంటాడు. కళ్యాణ్ రంగంలోకి దిగి తల్లికి గుణపాఠం చెప్పాలని అనుకుంటాడు. ఇందుకు ఆమె కూతురు సాయం చేస్తుంది.
6 . పశివాడి ప్రాణం(జూలై 23 , 1987)
U|యాక్షన్,క్రైమ్
భార్య చనిపోవడంతో మధు మద్యానికి బానిసవుతాడు. అతని జీవితంలోకి అనుకోకుండా వినికిడి, మాట లోపం ఉన్న రాజా అనే పిల్లవాడు వస్తాడు. ఆ చిన్నారి తల్లిదండ్రులను చంపిన హంతకులు అతన్ని చంపేందుకు వెతుకుతుంటారు.
7 . ముద్దుల మావయ్య(ఏప్రిల్ 07 , 1989)
UA|138 minutes|డ్రామా
రాజా తన సోదరి లక్ష్మీ ( సీత ) కోసం మాత్రమే జీవిస్తున్న అనాథ. ఆమె చిన్నాను ప్రేమించడంతో రాజా వారికి పెళ్లి చేస్తారు. అయితే విలన్ కొడుకు అయిన చిన్నా.. లక్ష్మీని కత్తితో పొడిచి చంపుతాడు. ఆ తర్వాత రాజా ఏం చేశాడు? అన్నది కథ.
8 . మువ్వా గోపాలుడు(మే 19 , 1987)
U|138 minutes|డ్రామా
గోపి, నిర్మల ఒకరినొకరు ప్రేమించుకుని పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేసుకుంటారు. అయితే, వారి ప్రేమపై అసంతృప్తిగా ఉన్న గోపి మామ బసవ రాజు, తన సొంత కూతురిని పెళ్లి చేసుకునేలా అతన్ని మోసం చేస్తాడు.
9 . కొడుకు దిద్దిన కాపురం(సెప్టెంబర్ 21 , 1989)
U|126 mins|డ్రామా
ట్రక్ డ్రైవర్ చక్రవర్తి.. కోటీశ్వరుడి కూతురు శశిరేఖను ప్రేమిస్తాడు. ఇద్దరూ పెళ్లి కూడా చేసుకుంటారు. చక్రవర్తి ఓ జంట హత్యల కేసులో ఇరుక్కుంటాడు. దీంతో భార్య భర్తల మధ్య మనస్పర్థలు వచ్చి దూరమవుతారు. వారిద్దరిని కొడుకు ఎలా కలిపాడు? అన్నది కథ.
10 . జానకి రాముడు(ఆగస్టు 19 , 1988)
UA|133 minutes|డ్రామా,రొమాన్స్
రాము, జానకి అనే ఇద్దరు ప్రేమికులు. ఒక గ్రామాన్ని సందర్శిస్తారు. అక్కడ వారు తమ గత జీవితాల గురించి నిజం తెలుసుకుంటారు. అయితే తమ తమ గత జీవితంలో జరిగిన దుర్ఘటనలు పునరావృతం కాకుండా ఈ జన్మలో జాగ్రత్త పడుతారు.
11 . స్వయంకృషి(సెప్టెంబర్ 03 , 1987)
U|డ్రామా,మ్యూజికల్
సాంబయ్య (చిరంజీవి) చెప్పులు కుట్టుకుంటూ స్వయం కృషితో వ్యాపారవేత్తగా ఎదుగుతాడు. గంగ (విజయశాంతి)ను పెళ్లి చేసుకొని చెల్లెలు కొడుకు చిన్నాను సొంత బిడ్డలా పెంచుతాడు. అయితే ధనిక జీవితానికి ఇష్టపడ్డ చిన్నా కాయ కష్టం పనులను అసహ్యించుకుంటాడు. చిన్నా అసలు తండ్రి గోవింద్ (చరణ్‌రాజ్) రాకతో సాంబయ్య ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నాడు? అనేది కథ.
12 . పడమటి సంధ్యా రాగం(ఏప్రిల్ 11 , 1987)
U|142 minutes|డ్రామా,రొమాన్స్
ఒక భారతీయ అమ్మాయి అమెరికన్‌తో ప్రేమలో పడుతుంది. కానీ అమ్మాయి తండ్రి వారి ప్రేమను వ్యతిరేకిస్తాడు. దీంతో కుటుంబానికి దూరంగా పారిపోవాలని నిర్ణయించుకుంటారు.
13 . కొండవీటి రాజా(జనవరి 31 , 1986)
U|140 minutes|యాక్షన్,డ్రామా
ఒక పురావస్తు శాస్త్రజ్ఞుడి సహాయకుడు గుప్త నిధి రహస్యాన్ని వెలికితీసేందుకు ఒక గ్రామానికి వెళ్తాడు. అయితే అక్కడ అతను తన సోదరిని చంపిన, నిధిని దక్కించుకోవాలనుకుంటున్న ధనవంతుడితో పొరాడాల్సి వస్తుంది
14 . దేశోద్ధారకుడు(ఆగస్టు 07 , 1986)
UA|150 minutes|డ్రామా
ధర్మారాయుడు, నరసింహ నాయుడు అనే ఇద్దరు దుర్మార్గుల వల్ల ఒక ఊరు నాశనమవుతుంది. అయితే ఆ ఊరికి పొరపాటున వచ్చిన గోపిని ప్రత్యేక అధికారి అని అందరు భయపడుతారు. ఊరిలో జరుగుతున్న అన్యాయాలను అరికట్టేందుకు ప్రత్యేకాధికారిగా కొనసాగాలని గోపిని, విజయ అభ్యర్థిస్తుంది.
15 . ముద్దుల కృష్ణయ్య(ఫిబ్రవరి 28 , 1986)
UA|133 minutes|యాక్షన్,మ్యూజికల్
ఊరిలో ధైర్యవంతుడైన కృష్ణయ్య.. పొగరుగా ప్రవర్తించే సంపన్నురాలైన ఓ మహిళ అతని కూతురితో గొడవపడుతాడు. అయితే విబేధాలను పరిష్కరించేందుకు తన కూతురుని పెళ్లి చేసుకోవాలని సంపన్నురాలైన మహిళ భర్త కృష్ణయ్యకు సూచిస్తాడు.
16 . ప్రతిఘటన(అక్టోబర్ 11 , 1985)
UA|యాక్షన్,డ్రామా
కాళి అనే రౌడీ హత్యలు చేస్తూ ఊరిలో అశాంతిని సృష్టిస్తుంటాడు. ఓ రోజు కాళి చేసిన హత్యను ఝాన్సీ చూస్తుంది. అతడిపై పోలీసులకు సైతం ఫిర్యాదు చేస్తుంది. ఆ తర్వాత కాళి ఏం చేశాడు? ఆమెను ఎంత ఘోరంగా అవమానించాడు? చివరికీ ఝాన్సీ ఏం చేసింది? అన్నది కథ.