
ప్రముఖ ఓటీటీల్లో ఫ్రీగా ఈ సినిమాలు ఇంకా వెబ్ సిరీస్‌లు చూసేయండి
500+ views11 months ago
ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ అయిన ఆహా, ఈటీవీ విన్, హాట్‌స్టార్, జియో సినిమా తమ లిస్ట్‌లో కొత్తగా ఫ్రీ కంటెంట్‌ను చేర్చాయి. వీటిలో సూపర్ హిట్ వెబ్ సిరీస్‌లతో పాటు సినిమాలు కూడా ఉన్నాయి. ఆ లిస్ట్‌ను ఇక్కడ అందిస్తున్నాం. వాటిలో మీకు నచ్చిన సినిమాను ఎంచుకుని ఆనందించండి.

1 . అసెంబ్లీ రౌడీ(జూన్ 03 , 1991)
UA|యాక్షన్,డ్రామా
తప్పుడు హత్య కేసులో శివాజీ అరెస్ట్ అవుతాడు. ఆ కేసు విచారణలో ఉండగా శివాజీ ఎన్నికల్లో పోరాడి గెలుస్తాడు. అతను రాజకీయాల్లో ఉన్న అవినీతిని బయటకు తీసి ప్రజల తరఫున పోరాడుతాడు.

2 . జ్వాలద్వీప రహస్యం(జూన్ 08 , 1965)
U|198 minutes|ఫాంటసీ
ఒక క్షుద్ర అభ్యాసకుడు ప్రజలను ఇబ్బంది పెట్టే ఒక దుష్ట వ్యక్తికి అతీంద్రియ శక్తులను అందిస్తాడు. దుష్టశక్తిని నిర్వీర్యం చేసి ప్రజలను రక్షించడానికి ఒక యోధుడు బయల్దేరుతాడు.
.jpeg)
3 . జగన్మోహిని(అక్టోబర్ 16 , 2009)
UA|147minutes|ఫాంటసీ,హారర్
యువరాజు అనుకోకుండా ఓ ద్వీపవాసి యువతిని ప్రేమిస్తాడు. ఆమె లవ్‌ను ఆస్వాదిస్తూ ఐలాండ్‌లోనే ఉండిపోతాడు. యువరాజును తిరిగి రాజ్యానికి రప్పించేందుకు అతడి తల్లిదండ్రులు యువతి చంపిస్తారు. ఆత్మ రూపంలో తిరిగి వచ్చిన యువతి ఏం చేసింది? అన్నది కథ.

4 . సర్దార్ పాపా రాయుడు(అక్టోబర్ 30 , 1980)
U|151 minutes|యాక్షన్
అవినీతిపరుడైన రాజకీయ నాయకుడు ధర్మరాజు తన కూతురి ప్రేమికుడు, నిజాయతీపరుడైన రాము అనే పోలీసును కలుసుకోవడంతో షాక్ అవుతాడు, అతను తప్పుడు కేసుతో కొన్నాళ్ల క్రితం జైలులో ఉంచిన వ్యక్తిని పోలి ఉంటాడు.

5 . గూడాచారి 116(ఆగస్టు 11 , 1966)
U|170 minutes|యాక్షన్,థ్రిల్లర్
అంతర్జాతీయ క్రిమినల్ ముఠాకు వ్యతిరేకంగా ఫోటోగ్రాఫిక్ సాక్ష్యాలను సేకరించిన తర్వాత సీక్రెట్ ఏజెంట్ 303 హత్యకు గురవుతాడు. దీంతో ఏజెంట్ 116 తన సహోద్యోగి హత్య గురించి నిజాన్ని వెలికితీసే లక్ష్యంతో బయలుదేరాడు.
.jpeg)
6 . సంపూర్ణ రామాయణం(మార్చి 16 , 1972)
U|ఫ్యామిలీ
ఈ చిత్రం రామాయణం ఇతిహాసం ఆధారంగా తెరకెక్కింది. శ్రీరాముడి బాల్యవృత్తాంతం, అరణ్యవాసం, పట్టాభిషేకం వరకు రామాయణంలో జరిగిన ఘట్టాలను ఈ చిత్రంలో తెరకెక్కించారు.
.jpeg)
7 . మయూరి(undefined 00 , 1985)
U|142 minutes|మ్యూజికల్
మయూరి అనేది సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన మరియు రామోజీ రావు నిర్మించిన 1985 భారతీయ తెలుగు భాషా జీవిత చరిత్ర నృత్య చిత్రం. సుధా చంద్రన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో ఆమె టైటిల్ రోల్‌లో నటిస్తుండగా, పి.ఎల్.నారాయణ, నిర్మలమ్మ, వై.విజయ, పొట్టి ప్రసాద్, కె.కె.శర్మ, ఎస్.ఆర్.రాజు, సుత్తి వీరభద్రరావు సహాయక పాత్రలు పోషించారు.

8 . గ్యాంగ్ లీడర్(మే 09 , 1991)
A|యాక్షన్,డ్రామా
ముగ్గురు సోదరులలో చిన్నవాడైన రాజారామ్ తన రెండో అన్న చదువుకు డబ్బులు కట్టేందుకు చేయని నేరాన్ని తనపై వేసుకుంటాడు. అయితే తన పెద్దన్నయ్యను హత్య చేసిన నిందితుల గురించి తెలిసి వారిపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంటాడు.

9 . దిల్ సే(ఆగస్టు 04 , 2023)
UA|డ్రామా,రొమాన్స్
అనాథ అయిన కళ్యాణ్ ఓ అమ్మాయిని గాఢంగా ప్రేమిస్తాడు కానీ ఆ అమ్మాయి దూరం అవుతుంది. అయితే ఈక్రమంలో అతని స్నేహితురాలు దగ్గరడంతో కథ మలుపు తిరుగుతుంది. ఇంతకు కళ్యాణ్ ఎవరిని ప్రేమిస్తాడు అన్నది మిగిలిన కథ.
.jpeg)
10 . భూ(మే 27 , 2023)
UA|94 minutes|హారర్,డ్రామా
కియారా (రకుల్ ప్రీత్ సింగ్) ఆమె స్నేహితులు హాలోవీన్ వేడుక సందర్భంగా హాలోవీన్ స్టోరీస్ ఉన్న మర్మమైన పుస్తకాన్ని చదువుతారు. బుక్‌లోని అన్ని అధ్యాయాలు చదవాలని తొలి పేజీలోనే రాసి ఉంటుంది. ఒక్కో అధ్యాయ్యాన్ని ఆపకుండా చదువుతున్న క్రమంలో అందులోని పాత్రలు వీరికి ప్రత్యక్షమవుతుంటాయి. ఈ అసాధారణ పరిస్థితులను, పుస్తకంలోని రహస్యాలను, స్నేహితుల అనుభవాలను ఈ సినిమా ఆవిష్కరించింది.

11 . జర్నీ(సెప్టెంబర్ 16 , 2011)
U|138 minutes|డ్రామా,రొమాన్స్
జాతీయ రహదారిపై రెండు బస్సులు ఒకదానికొకటి ఢీకొన్న ప్రమాదంతో సినిమా మొదలవుతుంది. శర్వానంద్-అనన్య, జై-అంజలి అనే రెండు జంటల జీవితాలు ఈ ప్రమాదం వల్ల ఎలా ప్రభావితం అయ్యాయి అన్నది కథ.
.jpeg)
12 . లైగర్(ఆగస్టు 25 , 2022)
UA|138 minutes|యాక్షన్,డ్రామా
తన బిడ్డ లైగర్(విజయ్ దేవరకొండ)ను ఛాంపియన్‌గా చూడాలని బాలామణి (రమ్యకృష్ణ) కోరిక. ఇందుకోసం కరీంనగర్ నుంచి ముంబయికి వస్తుంది. ప్రేమ జోలికి వద్దని తల్లి చెబుతున్నప్పటికీ లైగర్ తానియా (అనన్య పాండే) ప్రేమలో పడతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? వారి ప్రేమ ఎందుకు విఫలమైంది? లైగర్ ఛాంపియన్‌గా అయ్యాడా? అనేది కథ.

13 . ప్రతి రోజు పండగే(డిసెంబర్ 20 , 2019)
U|146 minutes|హాస్యం,డ్రామా
తన తాత రఘు రామయ్య చివరిరోజుల్లో సంతోషం ఉండాలని సాయి కోరుకుంటాడు. రఘు రామయ్య పిల్లలు అతన్ని పరామర్శించేందుకు కూడా ఇష్టపడరు. దీంతో సాయి ఏం చేశాడు. వారిని ఎలా రప్పించాడు అనేది సినిమా కథ

14 . సీటీమార్(సెప్టెంబర్ 10 , 2021)
UA|138 minutes|డ్రామా,క్రీడలు
కార్తీక్ (గోపీచంద్) మహిళల కబడ్డీ జట్టు కోచ్. తాను తీర్చిదిద్దిన జట్టును జాతీయ స్థాయిలో గెలిపించి ఊరిలోని స్కూల్ సమస్యను అందరి దృష్టికి తీసుకెళ్లాలని భావిస్తాడు. ఆ ప్రయత్నంలో కార్తీక్‌కు ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? అన్నది కథ.

15 . ది వారియర్(జూలై 14 , 2022)
UA|155 minutes|యాక్షన్,క్రైమ్,డ్రామా
సత్య (రామ్ పోతినేని) ఐపీఎస్ అధికారి. తన కోరిక మేరకే కర్నూలుకి డీఎస్పీగా వస్తాడు. గ్యాంగ్‌స్టర్ గురు (ఆది పినిశెట్టి) చేసే అక్రమాలకు చెక్ పెట్టేందుకు యత్నిస్తాడు. ఆ క్రమంలో ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? విజిల్ మహాలక్ష్మి (కృతిశెట్టి)కి సత్యకు ఉన్న సంబంధం ఏంటి? అనేది కథ.

16 . బాహుబలి 2: ది కన్‌క్లూజన్(ఏప్రిల్ 28 , 2017)
UA|171 minutes|యాక్షన్,డ్రామా,ఫాంటసీ
అమరేంద్ర బాహుబలి కుమారుడైన మహేంద్ర బాహుబలి తన వారసత్వం గురించి కట్టప్ప ద్వారా తెలుసుకుంటాడు. మాహిష్మతి సింహాసనాన్ని అధిష్టించేందుకు.. భళ్లాలదేవుడితో యుద్ధంలో పోరాడుతాడు.

17 . భీమ్లా నాయక్(ఫిబ్రవరి 25 , 2022)
UA|145 minutes|యాక్షన్,డ్రామా
బీమ్లా నాయక్ (పవన్ కల్యాణ్) నిజాయతీ గల సబ్ ఇన్‌స్పెక్టర్. రాజకీయ పలుకుపడి ఉన్న డానియల్ శేఖర్ (రానా) కారులో మద్యం సీసాలతో వెళ్తూ పోలీసులకు చిక్కుతాడు. బీమ్లా నాయక్ డానియల్‌ను కొట్టి స్టేషన్‌కు తీసుకెళ్లడంతో అతని అహం దెబ్బ తింటుంది. ఆ తర్వాత అతడు ఏం చేశాడన్నది కథ.
.jpeg)
18 . విక్రమ్:హిట్‌లిస్ట్(జూన్ 03 , 2022)
UA|174 minutes|యాక్షన్,డ్రామా
డ్రగ్ మాఫియా కేసును విచారిస్తున్న ఏజెంట్ విక్రమ్ సస్పెండ్ అయిన తర్వాత అండర్ గ్రౌండ్‌కు వెళ్తాడు. ఈ క్రమంలో డ్రగ్ మాఫియా డాన్ సంతానం మిస్ అయిన ఓ భారీ డ్రగ్ కంటైనర్ కోసం వెతుకుతుంటాడు. అండర్‌గ్రౌండ్‌లో ఉన్న విక్రమ్ తన కొడుకు చావుకు కారణమైన వ్యక్తిని చంపుతాడు. అసలు విక్రమ్ కొడుకును చంపిందెవరు? డ్రగ్ కంటైనర్‌ను దక్కించుకునేందుకు సంతానం ఎలాంటి క్రూరత్వాన్ని ప్రదర్శించాడు? విక్రమ్, సంతానం మధ్య వైరం ఎందుకొచ్చింది అన్నది మిగతా కథ.

19 . వీర సింహా రెడ్డి(జనవరి 12 , 2023)
UA|172 minutes|యాక్షన్,డ్రామా
వీర సింహా రెడ్డి చిత్రంలో బాలయ్య తండ్రి కొడుకుల పాత్రల్లో ద్విపాత్రాభినయం చేశారు. వీరసింహారెడ్డి (సీనియర్ బాలకృష్ణ) రాయలసీమ ప్రజలకు దేవుడు. ఆయనకు సవతి తల్లి కూతురు భానుమతి( వరలక్ష్మి) అంటే ప్రాణం. ఆమె కోసం ఏదైన త్యాగం చేస్తాడు. కానీ భానుమతి బాలయ్య చావు కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. మరోవైపు జూ. బాలయ్య విదేశాల్లో తన తల్లితో ఉంటాడు. అసలు వీరసింహారెడ్డి తన కుటుంబానికి ఎందుకు దూరమవుతాడు? ప్రాణంగా ప్రేమించిన చెల్లెలు ఎందుకు చంపాలనుకుంటుంది అనేది కథ

20 . ఝాన్సీ(ఫిబ్రవరి 16 , 2018)
UA|100 minutes|యాక్షన్,క్రైమ్,డ్రామా
ఝాన్సీ చెన్నైలో ఒక కఠినమైన పోలీసు మహిళ, ఆమె తక్కువ వయస్సు గల అత్యాచారం కేసును ఛేదించే బాధ్యతను తీసుకుంటుంది. ఆమె గర్భవతి అయిన అరసి (ఇవానా), బాధితురాలు మరియు గాలి రాజు అనుమానితుడు, ఇద్దరూ యుక్తవయస్కులే.