• TFIDB EN
  • Editorial List
    శర్వానంద్‌ హీరోగా చేసిన టాప్‌-10 చిత్రాలు మీకోసం
    Dislike
    300+ views
    12 months ago

    ఫ్యామిలీ ఆడియన్స్‌కు బాగా దగ్గరైన యంగ్‌ హీరోలలో శర్వానంద్‌ ఒకరు. ఆయన ఇప్పటివరకూ కుటుంబ కథా చిత్రాల్లోనే ఎక్కువగా నటించారు. లవర్‌ బాయ్‌ పాత్రల్లోనూ కనిపించి యూత్‌కు బాగా దగ్గరయ్యారు. కెరీర్‌ ప్రారంభంలో సపోర్టింగ్‌ రోల్స్‌, హీరో ఫ్రెండ్‌ క్యారెక్టర్లు చేసిన శర్వానంద్ వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటే ప్రముఖ హీరోగా ఎదిగారు. శర్వానంద్‌ హీరోగా చేసిన టాప్‌-10 చిత్రాలు మీ కోసం

    ఇంగ్లీష్‌లో చదవండి

    1 . శ్రీకారం(మార్చి 11 , 2021)
    U|132 minutes|రొమాన్స్,డ్రామా
    కార్తిక్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్, హైదరాబాద్‌లో లక్షల్లో సంపాదిస్తుంటాడు. చిన్నప్పటి నుంచి తన తండ్రితో గ్రామంలో పెరగటం వల్ల వ్యవసాయంపై ఇష్టం ఏర్పడుతుంది. జాబ్‌కు రిజైన్ చేసి వ్యసాయం చేయాలని నిర్ణయించుకుంటాడు. కానీ కార్తిక్ తండ్రి అందుకు ఒప్పుకోడు. ఇద్దరి మధ్య అగాథం ఏర్పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది అసలు కథ .
    2 . శతమానం భవతి(జనవరి 14 , 2017)
    U|133 minutes|డ్రామా,ఫ్యామిలీ
    "శతమానం భవతి" అనే చిత్రం, తమ ఉద్యోగాల పరంగా తల్లిదండ్రులకు దూరంగా ఉండి, బిజీగా గడుపుతున్న పిల్లల నుంచి అప్యాయత కోరుకునే ఓ వృద్ధ జంట జీవితాల చుట్టూ తిరుగుతుంది. బిజీ లైఫ్‌ గడుపుతున్న పిల్లల్ని ఏకతాటిపై తెచ్చేందుకు వారు ఒక ప్లాన్ వేయడంతో కథ మొదలుతుంది.
    3 . జాను(ఫిబ్రవరి 07 , 2020)
    U|151 minutes|డ్రామా,రొమాన్స్
    రామ్‌కు జాను అంటే ఎంతో ప్రేమ. ఆమెను హైస్కూల్‌ లైఫ్‌లో ప్రేమిస్తాడు. కానీ ఎప్పుడూ ప్రపోజ్ చేయడు. విధి వారిని దూరం చేస్తుంది. అయితే దాదాపు 20 ఏళ్ల తర్వాత స్కూలు రీయూనియన్ ఫంక్షన్‌లో వాళ్లిద్దరు కలుస్తారు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది కథ.

    రామ్‌ (శర్వానంద్‌), జాను (సమంత) స్కూల్‌ డేస్‌లో ఒకరినొకరు ఇష్టపడతారు. అయితే 20 ఏళ్ల తర్వాత స్కూల్‌ రీయూనియన్‌ ఈవెంట్‌లో వారు కలుసుకుంటారు. తమ పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది కథ.

    4 . ఓకే ఒక జీవితం(సెప్టెంబర్ 09 , 2022)
    U|157 minutes|డ్రామా,సైన్స్ ఫిక్షన్
    ఆది (శ‌ర్వానంద్‌), శ్రీను (వెన్నెల‌ కిషోర్‌), చైతూ (ప్రియ‌ద‌ర్శి) మంచి స్నేహితులు. వీరికి పాల్ (నాజ‌ర్‌) అనే ఓ శాస్త్రవేత్త ప‌రిచ‌యం అవుతాడు. పాల్‌ ఓ టైమ్‌ మిషన్‌ కనిపెడతాడు. గ‌తంలోకి వెళ్లి త‌మ త‌ప్పుల్ని స‌రిదిద్దుకునే అవ‌కాశాన్ని ఆది, శ్రీను, చైతూల‌కి ఇస్తాడు. వారు గతంలో ఏం చేశారన్నది కథ.
    5 . పడి పడి లేచె మనసు(డిసెంబర్ 21 , 2018)
    U|156 minutes|డ్రామా,రొమాన్స్
    సూర్య (శర్వానంద్‌) వైశాలి (సాయి పల్లవి)ని ఇష్టపడతాడు. ఆమె కూడా అతడ్ని ప్రేమిస్తుంది. అయితే పెళ్లికి మాత్రం సూర్య నిరాకరిస్తాడు. దీంతో వైశాలి అతడితో విడిపోతుంది. సూర్య ఎందుకు నో చెప్పాడు? చివరికీ వారు ఎలా కలిశారు? అన్నది కథ.
    6 . రన్ రాజా రన్(ఆగస్టు 01 , 2014)
    UA|137 minutes|డ్రామా,రొమాన్స్
    రాజా (శర్వానంద్‌) కూరగాయాలు అమ్ముకునే వ్యక్తి కుమారుడు. అయితే అతడు పోలీసు కమీషనర్‌ కూతురు ప్రియను ప్రేమిస్తాడు. వీరి పెళ్లికి కమీషనర్‌ అంగీకరించడు. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది కథ

    రాజా (శర్వానంద్‌) కూరగాయాలు అమ్ముకునే వ్యక్తి కుమారుడు. అయితే అతడు పోలీసు కమీషనర్‌ కూతురు ప్రియను ప్రేమిస్తాడు. వీరి పెళ్లికి కమీషనర్‌ అంగీకరించడు. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది కథ

    7 . గమ్యం(ఫిబ్రవరి 29 , 2008)
    U|128 minutes|డ్రామా
    అభిరామ్‌ (శర్వానంద్‌) జానకి (కమలిని ముఖర్జీ)ని ప్రేమలోకి దింపుతాతని ఫ్రెండ్స్‌తో బెట్‌ కాస్తాడు. ఈ విషయం తెలిసి జానకి అతడ్ని వదిలి వెళ్లిపోతుంది. జానకిని నిజంగానే ప్రేమిస్తున్నట్లు గ్రహించిన హీరో ఆమెను వెత్తుక్కుంటు వెళ్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? ఇందులో గాలిశీను (అల్లరి నరేష్‌) పాత్ర ఏంటి? అన్నది కథ.

    అభిరామ్‌ (శర్వానంద్‌) జానకి (కమలిని ముఖర్జీ)ని ప్రేమలోకి దింపుతాతని ఫ్రెండ్స్‌తో బెట్‌ కాస్తాడు. ఈ విషయం తెలిసి జానకి అతడ్ని వదిలి వెళ్లిపోతుంది. జానకిని నిజంగానే ప్రేమిస్తున్నట్లు గ్రహించిన హీరో ఆమెను వెత్తుక్కుంటు వెళ్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? ఇందులో గాలిశీను (అల్లరి నరేష్‌) పాత్ర ఏంటి? అన్నది కథ.

    8 . ప్రస్థానం(ఏప్రిల్ 16 , 2010)
    U|181 minutes|యాక్షన్,డ్రామా
    తన తండ్రి, ప్రఖ్యాత రాజకీయ నాయకుడైన తన సవతి సోదరుడు మిత్రా పట్ల చిన్నా నిత్యం అసూయతో ఉంటాడు. చివరికి, మిత్ర జీవితాన్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తూ దారితప్పిపోతాడు.

    @2021 KTree