• TFIDB EN
  • బాలకృష్ణ- సిమ్రాన్ జంటగా నటించిన చిత్రాలు ఇవే!
    Dislike
    200+ views
    1 year ago

    నందమూరి నటసింహం బాలకృష్ణ- సిమ్రాన్‌కు తెలుగులో సిల్వర్ స్క్రీన్ పేయిర్‌గా మంచి గుర్తింపు ఉంది. అప్పట్లో వీరి జోడికి ప్రేక్షకుల్లో యమ క్రేజ్ ఉండేది. బాలయ్య- సిమ్రాన్ కాంబోలో ఐదు చిత్రాలు వచ్చాయి. వీటిలో రెండు ఇండస్ట్రీ హిట్స్ ఉన్నాయి. మరి ఆ చిత్రాలేంటో ఓసారి చూద్దాం.

    ఇంగ్లీష్‌లో చదవండి

    1 . సమరసింహా రెడ్డి(జనవరి 13 , 1999)
    UA|యాక్షన్,డ్రామా
    సమరసింహారెడ్డి తన కుటుంబ హత్యకు ప్రతీకారం తీర్చుకునే ప్రయత్నంలో అనుకోకుండా వాసు అనే అమాయకుడిని చంపేస్తాడు. ఓ అబద్దంతో వాసు కుటుంబానికి దగ్గరై వారిని చూసుకోవడానికి ప్రయత్నిస్తాడు.
    2 . నరసింహ నాయుడు(జనవరి 11 , 2001)
    A|యాక్షన్,డ్రామా
    రెండు ఊర్ల మధ్య ఫ్యాక్షన్ గొడవల వల్ల నరసింహనాయుడు భార్య చనిపోతుంది. దీంతో నరసింహనాయుడు తన బిడ్డను తీసుకుని దూరంగా వెళ్లి డ్యాన్స్ మాస్టర్‌గా జీవితం గడుపుతాడు. అయితే, శత్రువు కూతుర అయిన అంజలి అతన్ని ప్రేమించడంతో కథ మలుపు తిరుగుతుంది.
    3 . సీమ సింహం(జనవరి 11 , 2002)
    UA|యాక్షన్
    ఒకరి కొడుకు మరొకరి కారణంగా చంపబడిన తర్వాత ఇద్దరు స్నేహితులు శత్రువులుగా మారతారు. వారి శత్రుత్వం రెండు కుటుంబాల మధ్య చిచ్చునా రాజేస్తుంది.
    4 . గొప్పింటి అల్లుడు(జూలై 21 , 2000)
    U|డ్రామా
    మురళి ( బాలకృష్ణ) పారిశ్రామికవేత్త ఎస్వీఆర్ (ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం) కుమారుడు. అతను గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తరువాత స్టేట్స్ నుండి ఇండియా వస్తాడు. ఎస్వీఆర్ తన కోసం జిడ్డు బాలమణి (సాధిక) అనే అమ్మాయిని ఫిక్స్ చేసి ఆమెను పెళ్ళి చేసుకోమని కోరుతాడు. ఆ పెళ్ళి నుంచి బయటపడటానికి, మురళి తిరిగి స్విట్జర్లాండ్‌కు పారిపోతాడు. అక్కడ సౌమ్య అనే అమ్మాయితో ప్రేమలో పడుతాడు.
    5 . ఒక్క మగాడు(జనవరి 10 , 2008)
    A|డ్రామా
    రాము ఓ జంటకు పెళ్లి చేస్తాడు. పెళ్లి కొడుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కొడుకు కావడంతో అతడి దృష్టి రాముపై పడుతుంది. మరోవైపు అచ్చం రాములాగే ఉండే వృద్ధుడు అవినీతి పరులను హత్య చేస్తుంటాడు. ఇంతకీ ఆ వృద్ధుడు ఎవరు? రాముకి అతడికి సంబంధం ఏంటి? సీఎం కుట్రలను వారు ఎలా ఎదుర్కొన్నారు? అన్నది కథ.

    @2021 KTree