• TFIDB EN
  • Editorial List
    Chiranjeevi- Radha Movies: చిరంజీవి- రాధ మొత్తం ఎన్ని సినిమాల్లో నటించారో తెలుసా?
    Dislike
    400+ views
    1 year ago

    విజయశాంతి(19) తర్వాత చిరంజీవితో అత్యధిక సినిమాల్లో నటించిన హీరోయిన్ రాధ. ఈమె ఏకంగా 16 సినిమాల్లో నటించి చిరంజీవితో హిట్‌ పేయిర్‌గా గుర్తింపు తెచ్చుకుంది. వీటిలో 10 చిత్రాలు హిట్‌గా నిలిచాయి. వాటిపై ఓ లుక్‌ వేద్దాం.

    ఇంగ్లీష్‌లో చదవండి

    1 . కొదమ సింహం(ఆగస్టు 09 , 1990)
    U|143 minutes|డ్రామా
    భరత్‌ అన్యాయాలను ఎదిరించే కౌబాయ్‌. విలన్లు ప్రభుత్వ ఖజానాను దొంగతనం చేయబోగా భరత్ తండ్రి ఆ సొమ్మును కాపాడటం కోసం దాన్ని తీసుకొని పారిపోతాడు. ఈ కేసులో భరత్‌ తల్లిని పోలీసులు అరెస్టు చేస్తారు. ఆ ఖజానాను దక్కించుకోవాలని చూస్తున్న విలన్లను అడ్డుకొని భరత్‌ ఆ సంపదను ప్రభుత్వం వద్దకు చేరుస్తాడు.

    చిరంజీవి- రాధ కలిసి నటించిన చివరి సినిమా ఇది. ఈ సినిమాను కే మురళిమోహన్‌రావు డైరెక్ట్ చేశారు. ఈ చిత్రంలో చిరంజీవి కౌబాయ్ గెటప్‌తో అలరించారు. బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయింది.

    2 . కొండవీటి దొంగ(మార్చి 09 , 1990)
    U|151 minutes|యాక్షన్,థ్రిల్లర్
    రాజా అనే గిరిజన యువకుడు తన విద్యను పూర్తి చేసి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు తమ గూడెం వారిని స్థానిక గూండాలు హింసించడాన్ని గమనిస్తాడు. వారి అన్యాయాలను ఎదుర్కొనేందుకు కొండవీటి దొంగగా మారతాడు.

    చిరంజీవి కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ హిట్‌లలో కొండవీటి దొంగ ఒకటి. ఈ చిత్రాన్ని కొదండ రామిరెడ్డి డైరెక్ట్ చేశారు. చిరంజీవి సరసన రాధ, విజయశాంతి జంటగా నటించారు.

    3 . లంకేశ్వరుడు(అక్టోబర్ 27 , 1989)
    U|యాక్షన్,డ్రామా
    శంకర్‌ తన గ్యాంగ్‌స్టర్‌ వృత్తిని వదిలి సాధారణ జీవితం గడపాలని నిర్ణయించుకుంటాడు. అయితే బావ జీవితం ప్రమాదంలో పడినప్పుడు శంకర్ తన నిర్ణయాన్ని మార్చుకుంటాడు.

    చిరంజీవి, రాధ, రేవతి జంటగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. ఈ సినిమాను దర్శక దిగ్గజం దాసరి నారాయణరావు తెరకెక్కించారు. ఇది ఆయనకు 100వ సినిమా.

    4 . స్టేట్ రౌడీ(మార్చి 23 , 1989)
    U|యాక్షన్,డ్రామా
    పోలీసు అధికారి కావాలనుకున్న ఓ యువకుడు అవినీతి రాజకీయాల వల్ల తన కలను నెరవేర్చుకోలేకపోతాడు. దీంతో తన జీవిత గమనాన్ని మార్చుకుంటాడు. అతను చట్టానికి వ్యతిరేకంగా మారి.. ఎలాంటి పనులు చేశాడన్నది కథ.

    బి.గోపాల్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్‌ అయింది. ఈ చిత్రంలో చిరంజీవి, రాధ(Chiranjeevi and Radha Movies List) పోటీపడిమరి నటించారు.

    5 . మరణ మృదంగం(ఆగస్టు 04 , 1988)
    A|యాక్షన్,క్రైమ్
    జనార్దన్, అనూషను విధి ఒకచోట చేర్చుతుంది. ప్రమాదకరమైన ఒక నేరస్థున్ని చట్ట ముందు నిలబెట్టేందుకు కలిసి పనిచేయాలని నిర్ణయించుకుంటారు. ఇక్రమంలో ఒకరికొకరు ప్రేమలో పడతారు.

    ఏ కొదండరామిరెడ్డి డైరెక్షన్‌లో వచ్చిన ఈ మూవీ హిట్‌ అయింది. ఈ చిత్రంలో చిరంజీవి సరసన రాధ మరోసారి నటించింది.

    6 . యముడికి మొగుడు(ఏప్రిల్ 29 , 1988)
    U|యాక్షన్,డ్రామా,ఫాంటసీ
    కాళి ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. అయితే ఆమె తండ్రి కాళిని చంపిస్తాడు. దీంతో అతను యమలోకానికి వెళ్తాడు. అక్కడ యముడితో గొడవపడి తిరిగి మరో వ్యక్తి శరీరంలోకి ప్రవేశించి తన హత్యకు ప్రతీకారం తీర్చుకుంటాడు.

    చిరంజీవి, రాధ, విజయశాంతి జోడిగా రవిరాజ పినిశెట్టి డైరెక్షన్‌లో వచ్చిన చిత్రం 'యముడికి మొగుడు'. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్టైయింది.

    7 . జేబు దొంగ(డిసెంబర్ 25 , 1987)
    U|యాక్షన్,థ్రిల్లర్
    ఒక టెర్రరిస్టును ట్రాప్ చేయడానికి చిట్టిబాబు అనే జేబు దొంగను సీబీఐ అతనికి తెలియకుండానే తమ సీక్రెట్ ఏజెంట్‌గా ఉపయోగించుకుంటుంది. చివరకు నిజం తెలుసుకున్న చిట్టిబాబు ఉగ్రవాదిని పట్టుకునేందుకు సాయం చేస్తాడు.

    కొదండరామిరెడ్డి డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ సాధించింది. చిరంజీవి- రాధ మరోసారి తమ కెమిస్ట్రీతో మెప్పించారు. ఈ చిత్రం హిందీలో ఆజ్‌కా గ్యాంగ్‌ లీడర్ పేరుతో డబ్‌ చేశారు.

    8 . రాక్షసుడు(అక్టోబర్ 02 , 1986)
    U|146 mins|యాక్షన్,డ్రామా
    పురుష చిన్నప్పుడు తన తల్లికి దూరమవుతాడు. ఆమె కోసం వెతుకుతుంటాడు. అయితే తన తల్లి గురించి సమాచారం తెలిసిన JKని కలుస్తాడు. కానీ అతను తన ప్రత్యర్థులను అంతం చేస్తేనే పుర్షకు తన తల్లి గురించి చెబుతానని కండీషన్ పెడుతాడు. ఈ క్రమంలో సుమత్రిని అనే యువతిని కలిసి ఓ ప్లాన్ వేస్తాడు.

    చిరంజీవి- రాధ కలిసి నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అట్టర్ ప్లాప్‌గా నిలిచింది. రాక్షసుడు చిత్రాన్ని ఏ.కొదండరామిరెడ్డి డైరెక్ట్ చేశారు.

    9 . రుద్రనేత్ర(జూన్ 16 , 1989)
    UA|యాక్షన్,థ్రిల్లర్
    నేత్ర డిటెక్టివ్‌ ఏజెంట్‌గా పనిచేస్తుంటాడు. అండర్‌ వరల్డ్‌ కార్యకలాపాలు ట్రాక్‌ చేసే మిషన్‌ అతడికి అప్పగించబడుతుంది. ఈ మిషన్‌లో అతడికి సవాళ్లు ఎదురవుతాయి.

    కే రాఘవేంద్ర రావు డైరెక్ట్ చేసిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అట్టర్‌ ప్లాప్ అయింది. ఈ సినిమాలో చిరుకు జోడీగా రాధ, విజయశాంతి నటించారు.

    10 . కొండవీటి రాజా(జనవరి 31 , 1986)
    U|140 minutes|యాక్షన్,డ్రామా
    ఒక పురావస్తు శాస్త్రజ్ఞుడి సహాయకుడు గుప్త నిధి రహస్యాన్ని వెలికితీసేందుకు ఒక గ్రామానికి వెళ్తాడు. అయితే అక్కడ అతను తన సోదరిని చంపిన, నిధిని దక్కించుకోవాలనుకుంటున్న ధనవంతుడితో పొరాడాల్సి వస్తుంది

    కే. రాఘవేంద్రరావు డైరెక్షన్‌లో చిరంజీవి-రాధ కాంబోలో బ్యాక్‌ టూ బ్యాక్ హిట్‌గా నిలిచిన చిత్రం 'కొండవీటి రాజా'. ఈ చిత్రం సైతం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసింది.

    11 . అడవి దొంగ(నవంబర్ 19 , 1985)
    U|యాక్షన్,డ్రామా
    నేరస్థుల నుంచి తన బిడ్డను రక్షించుకోవడానికి, ఒక తల్లి తన బిడ్డను అడవి పొదలో దాచిపెట్టి పారిపోతుంది. తిరిగి తన బిడ్డను దాచి పెట్టిన చోటును కనిపెట్టడంలో విఫలమవుతుంది. తర్వాత, ఆ పిల్లవాడు ఏనుగులు, ఇతర జంతువుల మధ్య పెరుగుతాడు.

    చిరంజీవి- రాధ (Chiranjeevi and Radha Movies List) జంటగా నటించిన ఈ చిత్రం ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాను కే. రాఘవేంద్రరావు డైరెక్ట్ చేశారు.

    12 . రక్త సింధూరం(ఆగస్టు 24 , 1985)
    A|యాక్షన్,డ్రామా
    ఉరిశిక్ష నుంచి తనను తాను రక్షించుకోవడానికి ఒక నేరస్థుడు, గోపీ అనే నిజాయితీ గల పోలీసు అధికారిని వడ్డీ వ్యాపారి బంధించిన కార్మికుడిని రక్షించేలా చేస్తాడు.

    ఏ. కొదండరామిరెడ్డి డైరెక్షన్‌లో చిరంజీవి-రాధ జంటగా మెప్పించిన మరో చిత్రం పులి. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్దగా పెద్దగా ఆడలేదు.

    13 . పులి(జూన్ 26 , 1985)
    A|121 mins|యాక్షన్,డ్రామా
    క్రాంతి సోదరి లక్ష్మి, పోలీసు అధికారి శ్యామ్ వల్ల ప్రమాదానికి గురికావడంతో కంటి చూపు కోల్పోతుంది. క్రాంతి పోలీస్ అధికారిగా మారి, శ్యామ్, అతని సహచరులపై ప్రతీకారం తీర్చుకునేందుకు బయల్దేరుతాడు.

    చిరంజీవి- రాధ జంటగా నటింటిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద యావరేజ్‌గా నిలిచింది. ఈ సినిమాను రాజ్ భరత్ డైరెక్ట్ చేశారు.

    14 . దొంగ(మార్చి 14 , 1985)
    A|145 minutes|యాక్షన్,డ్రామా
    తన తండ్రిని హత్య చేసిన కోదండరామయ్యపై ప్రతీకారం తీర్చుకోవాలని ఫణి నిర్ణయించుకుంటాడు. ఈక్రమంలో అతను కోదండరామయ్య కుమార్తె మంజుతో ప్రేమలో పడతాడు.

    ఏ. కొదండరామిరెడ్డి డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం హిట్‌గా నిలిచింది. తెలుగు ఇండస్ట్రీలో పెద్దగా హిట్లు లేని సమయంలో ఈ చిత్రం విజయం సాధించి ఊపు తీసుకొచ్చింది. ఈ సినిమాతో చిరంజీవి- రాధ హిట్ పెయిర్‌గా నిలిచారు.

    15 . నాగు(అక్టోబర్ 11 , 1984)
    U|యాక్షన్,డ్రామా
    నాగు అనే చిన్న క్రిమినల్‌.. తన ప్రియురాలి హత్య కేసులో ఇరుక్కుంటాడు. జగపతిరావు ఈ నేరానికి పాల్పడినట్లు నాగు అతని తల్లి తెలుసుకుంటారు. జగపతిరావుకు వ్యతిరేకంగా సాక్ష్యాలను సేకరించడం మెుదలుపెడతాడు.

    తాతినేని ప్రసాద్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో రెండోసారి చిరంజీవి- రాధ జత కట్టారు. ఈ సినిమాను ఏవీఎం ప్రొడక్షన్‌లో వచ్చింది. ఈ చిత్రం యావరేజ్ టాక్ తెచ్చుకుంది.

    16 . గూండా(ఫిబ్రవరి 23 , 1984)
    U|యాక్షన్,డ్రామా
    చిరంజీవి కెరీర్‌లో బాగా గుర్తుండిపోయే చిత్రాల్లో గూండా ఒకటి. కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో చిరుకి జోడీగా రాధ నటించారు. కె. చక్రవర్తి సంగీతం అందించారు. 1984 ఫిబ్రవరి 23న విడుదలైన ఈ చిత్రం మంచి విజయం సాధించింది.

    చిరంజీవి- రాధ (Chiranjeevi and Radha Movies List) కాంబోలో వచ్చిన తొలి చిత్రం 'గూండా'. ఈ చిత్రాన్ని ఏ.కొదండరామిరెడ్డి డైరెక్ట్ చేశారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది.


    @2021 KTree