• TFIDB EN
  • Editorial List
    Chiranjeevi Vijayashanthi: చిరంజీవి- విజయశాంతి జంటగా నటించిన చిత్రాలు ఎన్నో తెలుసా?
    Dislike
    2k+ views
    6 months ago

    మెగాస్టార్ చిరంజీవి మరే హీరోయిన్‌తో తీయనన్ని సినిమాలు లెడీబాస్ విజయశాంతితో తీశాడు. వీరిద్దరి కాంబోలో మొత్తం 19 చిత్రాలు వచ్చాయి. 90వ దశకంలో వీరికి హిట్ పెయిర్‌ అనే పేరు ఉండేది. వీరి కాంబోలో చిత్రం విడుదలైందంటే థియేటర్లకు అభిమానులు పరుగులు తీసేవారు. చిరంజీవి- విజయశాంతి జంటగా నటించిన చిత్రాల్లో గ్యాంగ్ లీడర్, పసివాడి ప్రాణం, స్వయంకృషి, అత్తకు యముడు అమ్మాయికి మొగుడు వంటి హిట్ చిత్రాలు ఉన్నాయి.

    ఇంగ్లీష్‌లో చదవండి

    1 . సంఘర్షణ(డిసెంబర్ 29 , 1983)
    U|యాక్షన్,డ్రామా
    దిలీప్ తన తండ్రి హరనాథరావు నేర కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని గుర్తించడానికి అమెరికా నుండి తిరిగి వస్తాడు. దిలీప్ తన తండ్రిని సన్మార్గంలోకి తీసుకువస్తానని ప్రమాణం చేస్తాడు.

    మెగాస్టార్ చిరంజీవి, విజయశాంతి తొలిసారి సంఘర్షణ చిత్రంలో నటించారు. మురళి మోహన్ రావు తెరకెక్కించిన ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్ ప్రొడ్యూస్ చేసింది.

    2 . స్వయంకృషి(సెప్టెంబర్ 03 , 1987)
    U|డ్రామా,మ్యూజికల్
    సాంబయ్య (చిరంజీవి) చెప్పులు కుట్టుకుంటూ స్వయం కృషితో వ్యాపారవేత్తగా ఎదుగుతాడు. గంగ (విజయశాంతి)ను పెళ్లి చేసుకొని చెల్లెలు కొడుకు చిన్నాను సొంత బిడ్డలా పెంచుతాడు. అయితే ధనిక జీవితానికి ఇష్టపడ్డ చిన్నా కాయ కష్టం పనులను అసహ్యించుకుంటాడు. చిన్నా అసలు తండ్రి గోవింద్‌ (చరణ్‌రాజ్‌) రాకతో సాంబయ్య ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నాడు? అనేది కథ.

    చిరంజీవి- విజయశాంతి కాంబోలో వచ్చిన సూపర్ హిట్ చిత్రం స్వయంకృషి. ఈ సినిమాలో విజయశాంతి- చిరంజీవి పోటీపడి మరి నటించారు. భావోద్వేగాలను అద్భుతంగా పండించారు. ఈ సినిమాను కళాతపస్వి కే.విశ్వనాథ్ డైరెక్ట్ చేశారు. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం మంచి విజయం సాధించింది.

    3 . దేవాంతకుడు(ఏప్రిల్ 12 , 1984)
    U|యాక్షన్,డ్రామా
    విజయ్‌కి సవాళ్లను స్వీకరించే అలవాటు ఉంది. అతని స్నేహితుడు చంటి ఒక ప్రొఫెసర్‌ని చంపమని సవాలు విసురుతాడు. అయితే నిజంగానే ఆ ప్రొఫెసర్‌ హత్యకు గురవుతాడు. ఆ నింద విజయ్‌పై పడుతుంది.

    వీరిద్దరి కాంబోలో వచ్చిన ఈ చిత్రం యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఎస్‌ ఏ చంద్రశేఖర్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. ఈ సినిమాను జీవీ నారాయణరావు నిర్మించారు. కే చక్రవర్తి మ్యూజిక్ అందించారు.

    4 . మహానగరంలో మాయగాడు(జూన్ 28 , 1984)
    A|యాక్షన్,డ్రామా
    తల్లిదండ్రుల విషాదకర మరణంతో రాజా చలించిపోతాడు. ఎలాగైన డబ్బు సంపాదించాలని నగరానికి వస్తాడు. పోలీసు కాలనీలో ఉంటూ మాయలు మోసాలు చేసి డబ్బు సంపాదిస్తూ ఉంటాడు.

    చిరంజీవి- విజయశాంతి కాంబోలో వచ్చిన ఈ చిత్రం ఆశించినంతగా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించలేదు. ఈ సినిమాను విజయ బాపినేడు డైరెక్ట్ చేశారు. మాగంటి రవింద్రనాథ్ చౌదరి నిర్మించారు.

    5 . ఛాలెంజ్(ఆగస్టు 09 , 1984)
    U|146 mins|డ్రామా
    గాంధీ ఒక నిరుద్యోగి. డబ్బు సంపాదించడం పెద్దగా కష్టం కాదని నమ్ముతుంటాడు. దీంతో ఐదేళ్లలో రూ.50 లక్షలు సంపాదించాలని ఒక బిజినెస్ మ్యాన్‌ గాంధీకి సవాలు విసురుతాడు. ఈ ఛాలెంజ్‌ను అంగీకరించిన గాంధీ డబ్బు ఎలా సంపాధించాడు? అన్నది కథ.

    చిరంజీవి, విజయశాంతి జంటగా కోదండరామిరెడ్డి డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఈ చిత్రంలో విజయశాంతితో పాటు సుహాసిని కూడా నటించింది.

    6 . చిరంజీవి(undefined 00 , 1985)
    A|క్రైమ్,డ్రామా
    చిరంజీవి ఒక టాలీవుడ్ చిత్రం, ఇది 18 ఏప్రిల్ 1985న విడుదలైంది. ఈ చిత్రానికి CV రాజేంద్రన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో చిరంజీవి, భానుప్రియతో విజయశాంతి ఒక చిన్న పాత్రలో నటించారు. ఈ చిత్రం కన్నడ చిత్రం నానే రాజా (1984)కి రీమేక్.

    చిరంజీవి తన సొంత పేరుతో తెరకెక్కిన చిత్రం బాక్సాఫీస్ వద్ద విఫలమైంది. ఈ చిత్రాన్ని సీవీ రాజేంద్రన్ డైరెక్ట్ చేశారు. ఈ సినిమాలో విజయశాంతితో పాటు భానుప్రియ కూడా నటించింది.

    7 . కొండవీటి రాజా(జనవరి 31 , 1986)
    U|140 minutes|యాక్షన్,డ్రామా
    ఒక పురావస్తు శాస్త్రజ్ఞుడి సహాయకుడు గుప్త నిధి రహస్యాన్ని వెలికితీసేందుకు ఒక గ్రామానికి వెళ్తాడు. అయితే అక్కడ అతను తన సోదరిని చంపిన, నిధిని దక్కించుకోవాలనుకుంటున్న ధనవంతుడితో పొరాడాల్సి వస్తుంది

    చిరు, విజయశాంతి, రాధ జంటగా నటించిన ఈ చిత్రం మంచి ప్రేక్షకాదరణ పొందింది. 'కొండవీటి రాజా' సినిమాను దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు డైరెక్ట్ చేశారు.

    8 . ధైర్యవంతుడు(నవంబర్ 27 , 1986)
    U|137 mins|డ్రామా
    కిషోర్‌ అనే నిరుద్యోగ యువకుడు తన సోదరుడు శ్రీనివాసతో కలిసి జీవిస్తుంటాడు. లావణ్యను కిడ్నాపర్ల నుండి కిషోర్‌ కాపాడటంతో అతడి జీవితం ఊహించని మలుపు తిరుగుతుంది.

    చిరు, విజయశాంతి కాంబోలో వచ్చిన 'ధైర్యవంతుడు' చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది. ఈ చిత్రాన్ని లక్ష్మీ దీపక్ డైరెక్ట్ చేశాడు.

    9 . చాణక్య శపథం(డిసెంబర్ 18 , 1986)
    U|2 hours 28 minutes|యాక్షన్,ఫ్యామిలీ
    చాణక్య శపథం అనేది 1986లో విడుదలైన భారతీయ తెలుగు భాషా యాక్షన్ చిత్రం, ఇందులో చిరంజీవి, విజయశాంతి, రావు గోపాల్ రావు మరియు సత్యనారాయణ నటించారు, దీనిని D. V. S. రాజు నిర్మించారు మరియు K. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు.

    కే రాఘవేంద్రరావు డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. చిరంజీవి, విజయశాంతి జంటకు పీడ కలను మిగిల్చింది.

    10 . పశివాడి ప్రాణం(జూలై 23 , 1987)
    U|యాక్షన్,క్రైమ్
    భార్య చనిపోవడంతో మధు మద్యానికి బానిసవుతాడు. అతని జీవితంలోకి అనుకోకుండా వినికిడి, మాట లోపం ఉన్న రాజా అనే పిల్లవాడు వస్తాడు. ఆ చిన్నారి తల్లిదండ్రులను చంపిన హంతకులు అతన్ని చంపేందుకు వెతుకుతుంటారు.

    చిరంజీవిని టాలీవుడ్ నంబర్ వన్ హీరోగా చేసిన చిత్రం ఇది. తన తరం ఉన్న హీరోలతో ఉన్న పోటీని తట్టుకుని చిరంజీవి నంబర్ 1 గా నిలిచాడు. విజయశాంతితో నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది.

    11 . మంచి దొంగ(జనవరి 14 , 1988)
    U|147 minutes|డ్రామా
    వీరేంద్రుడు దొంగ అయినప్పటికీ అందరికీ సాయం చేస్తుంటాడు. అతను ఒక పోలీసు ప్రేమలో పడిన తర్వాత అతను లొంగిపోవాలని నిర్ణయించుకుంటాడు. తాను కూడా పోలీస్ దళంలో చేరి నేర కార్యకలాపాలను ఆపాలని నిశ్చయించుకుంటాడు.

    రాఘవేంద్ర రావు డైరెక్షన్‌ వచ్చిన ఈ చిత్రం యావరేజ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో విజయశాంతితో పాటు సుహాసిని నటించింది.

    12 . యముడికి మొగుడు(ఏప్రిల్ 29 , 1988)
    U|యాక్షన్,డ్రామా,ఫాంటసీ
    కాళి ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. అయితే ఆమె తండ్రి కాళిని చంపిస్తాడు. దీంతో అతను యమలోకానికి వెళ్తాడు. అక్కడ యముడితో గొడవపడి తిరిగి మరో వ్యక్తి శరీరంలోకి ప్రవేశించి తన హత్యకు ప్రతీకారం తీర్చుకుంటాడు.

    చిరంజీవి, విజయశాంతి జోడిగా రవిరాజ పినిశెట్టి డైరెక్షన్‌లో వచ్చిన చిత్రం 'యముడికి మొగుడు'. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్టైయింది.

    13 . యుద్ద భూమి(నవంబర్ 11 , 1988)
    U|యాక్షన్,డ్రామా
    ఒక ఆర్మీ అధికారి విహారయాత్ర కోసం తన గ్రామానికి వస్తాడు, కానీ తన గ్రామం చాలా దీన స్థితిలో ఉంటుంది. దీనికి కారణమైన భూస్వామి దురాగతాలకు వ్యతిరేకంగా పొరాడుతాడు.

    మెగాస్టార్ చిరంజీవి, విజయశాంతి కాంబోలో వచ్చిన 'యుద్ధభూమి' బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌ అయింది. ఈ సినిమాను కే రాఘవేంద్ర రావు డైరెక్ట్ చేశారు.

    14 . అత్తకు యముడు అమ్మాయికి మొగుడు(జనవరి 14 , 1989)
    U|140 minutes|డ్రామా
    కళ్యాణ్‌ సోదరి డబ్బున్న వ్యక్తిని ప్రేమిస్తుంది. అహంకారి అయిన తల్లికి భయపడి ఆ వ్యక్తి పెళ్లి గురించి ఆలోచిస్తుంటాడు. కళ్యాణ్‌ రంగంలోకి దిగి తల్లికి గుణపాఠం చెప్పాలని అనుకుంటాడు. ఇందుకు ఆమె కూతురు సాయం చేస్తుంది.

    చిరంజీవి, విజయశాంతి జంటగా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసింది. ఈ చిత్రాన్ని ఏ కొదండరామిరెడ్డి డైరెక్ట్ చేశారు.

    15 . కొండవీటి దొంగ(మార్చి 09 , 1990)
    U|151 minutes|యాక్షన్,థ్రిల్లర్
    రాజా అనే గిరిజన యువకుడు తన విద్యను పూర్తి చేసి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు తమ గూడెం వారిని స్థానిక గూండాలు హింసించడాన్ని గమనిస్తాడు. వారి అన్యాయాలను ఎదుర్కొనేందుకు కొండవీటి దొంగగా మారతాడు.

    చిరు, విజయశాంతి, రాధ కాంబోలో వచ్చిన ఈ సినిమా సంచలన విజయాన్ని సాధించింది. ఈ చిత్రాన్ని ఏ కొదండరామిరెడ్డి డైరెక్ట్ చేశారు.

    16 . స్టువర్టుపురం పోలీస్ స్టేషన్(జనవరి 09 , 1991)
    U|యాక్షన్,డ్రామా
    స్టూవర్ట్‌పురం గ్రామస్తులు పోలీసులను అసహ్యించుకుంటారు. వారిని తమను అణచివేసే శక్తిగా భావిస్తారు. ఆ తర్వాత రాణా ప్రతాప్ అనే పోలీస్ వచ్చి వారికి పోలీసులపై ఉన్న భయాన్ని పొగొడుతాడు.

    బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. యండమూరి వీరేంద్రనాథ్ డైరెక్షన్‌లో సినిమా రూపొందింది. ఈ చిత్రంలో చిరంజీవి సరసన విజయశాంతితో పాటు నిరోషా నటించింది.

    17 . గ్యాంగ్ లీడర్(మే 09 , 1991)
    A|యాక్షన్,డ్రామా
    ముగ్గురు సోదరులలో చిన్నవాడైన రాజారామ్ తన రెండో అన్న చదువుకు డబ్బులు కట్టేందుకు చేయని నేరాన్ని తనపై వేసుకుంటాడు. అయితే తన పెద్దన్నయ్యను హత్య చేసిన నిందితుల గురించి తెలిసి వారిపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంటాడు.

    చిరంజీవికి మెగాస్టార్ క్రేజ్‌ను సుస్థిరం చేసిన సినిమా గ్యాంగ్ లీడర్. ఈ చిత్రాన్ని విజయ బాపినీడు తెరకెక్కించారు. చిరు సరసన విజయశాంతి హీరోయిన్‌గా నటించింది.

    18 . మెకానిక్ అల్లుడు(మే 27 , 1993)
    U|146 mins|యాక్షన్,డ్రామా
    రవికి టీవీ ప్రెజెంటర్ ఉద్యోగం పోవడంతో గ్యారేజీలో మెకానిక్‌గా చేరుతాడు. గ్యారేజ్ ఓనర్ కూతురితో ప్రేమలో పడతాడు. కానీ, రవి తన శత్రువు కుమారుడని తెలుసుకున్న తర్వాత గ్యారేజ్ ఓనర్ తిరస్కరిస్తాడు.

    చిరంజీవి, విజయశాంతి జంటగా నటించిన చివరి చిత్రం ఇది. ఈ సినిమాలో నాగేశ్వరరావు చిరంజీవికి మామగా నటించారు. బాక్సాఫీస్ వద్ద యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాను బి. గోపాల్ తెరకెక్కించారు.


    @2021 KTree