• TFIDB EN
  • Editorial List
    Science fiction movies in telugu: తెలుగులో ఇప్పటి వరకు వచ్చిన సైన్స్ ఫిక్షన్ చిత్రాలు ఇవే!
    Dislike
    3k+ views
    10 months ago

    ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో సైన్స్ సైన్స్ ఫిక్షన్, టైం ట్రావలింగ్ చిత్రాల హవా సాగుతోంది. ఈ జోనర్‌లో తెరకెక్కించిన సినిమాలో మంచి విజయం సాధిస్తున్నాయి. దీంతో దర్శకులు ఈ కెటగిరీపై సినిమాలు తీస్తున్నారు. ఆదిత్య 369 నుంచి రాబోయే కల్కీ 2898 AD వరకు తెలుగులో వచ్చిన సైన్స్ ఫిక్షన్ చిత్రాలపై ఓ లుక్ వేద్దాం.

    ఇంగ్లీష్‌లో చదవండి

    1 . ఆదిత్య 369(జూలై 18 , 1991)
    U|141 minutes|అడ్వెంచర్,సైన్స్ ఫిక్షన్
    అనుకోని పరిస్థితుల్లో ఓ సైంటిస్ట్ కనిపెట్టిన టైం మిషన్ ఎక్కిన కృష్ణకుమార్ (బాలకృష్ణ) అతని ప్రేయసి మోహిని(హేమ)... గతంలోకి శ్రీకృష్ణదేవరాయల కాలంలోకి వెళ్తారు.. అప్పుడు అక్కడ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు. ఆ తర్వాత భవిష్యత్‌ కాలంలోకి ఎలా ప్రయాణించారు? తిరిగి వారు ప్రస్తుత కాలానికి వచ్చారా? లేదా అనేది మిగతా కథ

    తెలుగులో వచ్చిన ఫస్ట్ టైం ట్రావెల్ సినిమా ఇది. ఇందులో బాలకృష్ణ అద్భుతంగా నటించారు. ఓ సైంటిస్ట్ కనిపెట్టిన టైం మిషన్ ఎక్కిన బాలకృష్ణ... గతంలోకి శ్రీకృష్ణదేవరాయల కాలంలోకి ప్రయాణిస్తాడు.. అప్పుడు అక్కడ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు అనే కథాంశంతో ఈ సినిమా రూపొందింది. ఈ చిత్రం ఆల్‌టైమ్ క్లాసిక్‌గా నిలిచింది.

    2 . అమృతం చందమామలో(మే 17 , 2014)
    U|140 minutes|హాస్యం,ఫాంటసీ
    అమృతం, అంజి అనే ఇద్దరు మిత్రులు చంద్రుడిపై హోటల్‌ పెట్టాలని నిర్ణయించుకుంటారు. ఈ క్రమంలో వారికి ఎదురైన సమస్యలు ఏంటి? అన్నది కథ.

    చందమామపై హోటల్ నెలకొల్పాలన్న వెరైటీ కథాంశంతో ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ కామెడీ జోనర్‌లో తెరకెక్కింది. ఈ చిత్రంలో శివన్నారాయణ, ఇంటూరి వాసు, శ్రీనివాస్ అవసరాల ప్రధాన పాత్రల్లో నటించారు.

    3 . టాక్సీవాలా(నవంబర్ 17 , 2018)
    UA|137 minutes|ఫాంటసీ,థ్రిల్లర్
    శివ (విజయ్‌ దేవరకొండ) ట్యాక్సీ డ్రైవర్‌. ఓ పాత ట్యాక్సీని తక్కువ ధరకే కొనుగోలు చేస్తాడు. కానీ, ఆ కారులో దెయ్యం ఉందని శివ తెలుసుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందన్నది కథ.

    ఆస్ట్రల్ ప్రొజెక్షన్ అనే సైంటిఫిక్ థియరీతో ఈ సినిమా రూపొందింది. మనం చనిపోయిన తరువాత ఆత్మ శరీరాన్ని వదిలి బయటకు వెళ్తుంది. అయితే మనం బతికి ఉండగానే శరీరం నుంచి ఆత్మను వేరు చేసుకోవచ్చు అదే 'ఆస్ట్రల్ ప్రొజెక్షన్'. దీని ప్రకారం చనిపోయిన శరీరాల్లో ఈ ఆత్మలను ప్రవేశపెట్టి వారితో మాట్లాడవచ్చు. ఇక సినిమాలో విజయ్ దేవరకొండ సరసన ప్రియాంక జువాల్కర్ నటించింది.

    4 . శ్రీవల్లి(సెప్టెంబర్ 15 , 2017)
    A|120 minutes|డ్రామా,సైన్స్ ఫిక్షన్,థ్రిల్లర్
    ఈ సినిమా కథ యువ న్యూరోసైంటిస్ట్ అయిన శ్రీవల్లి చుట్టూ తిరుగుతుంది. ఆమె ఒక ప్రయోగం చేయగా, అది ఉహించని పరిణామాలకు దారి తీస్తుంది. ఆమె జ్ఞాపకశక్తి, భావోద్వేగాలపై ప్రభావం పడుతుంది.

    బ్రేయిన్ మ్యాపింగ్‌ అనే సైన్స్‌ ఫిక్షన్‌ కథాంశంతో ఈ సినిమాను దిగ్గజ రచయిత విజయేంద్ర ప్రసాద్ తెరకెక్కించారు. వేర్వేరు ప్రాంతాల్లో.. ఉన్న ఇద్దరు వ్యక్తులు కొన్నిసార్లు ఒకరి గురించి మరొకరు ఒకేవిధంగా ఆలోచిస్తారు. ఇది ఎలా సాధ్యమవుతుంది? వాళ్ల మెదళ్ల మధ్య శబ్ద తరంగాలు ఎలా ప్రవహిస్తాయి? సైన్స్ దీనికేమైనా వివరణ ఇస్తుందా.. అనే పాయింట్ ఆధారంగా 'శ్రీవల్లి' సినిమా రూపొందింది.

    5 . స్కైలాబ్(డిసెంబర్ 04 , 2021)
    U|హాస్యం,డ్రామా
    ఆనంద్‌ (సత్యదేవ్‌), రామారావు (రాహుల్‌ రామకృష్ణ) ఊరిలో ఓ క్లినిక్ ప్రారంభిస్తారు. ఆ సమయంలోనే ఊరిపై స్కైలాబ్‌ పడుతుందనే భయాలు మెుదలవుతాయి. అప్పుడు జర్నలిస్టు గౌరి (నిత్య మీనన్‌) ఏం చేసింది? స్కైలాబ్‌ భయం ఊరిపై ఎలాంటి ప్రభావాన్ని చూపింది? అన్నది కథ.

    సైన్స్ ఫిక్షన్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. అమెరికాకు చెందిన ఒక ఉపగ్రహం విఫలమై దాని శిథిలాలు తెలంగాణలోని ఈ చిన్న గ్రామంపై పడేందుకు సిద్ధంగా ఉందనే వార్తల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రంలో సత్య దేవ్, నిత్యా మీనన్, రాహుల్ రామకృష్ణ, తులసి శివమణి, తనికెళ్ల భరణి నటించారు.

    6 . మార్క్ ఆంటోనీ(సెప్టెంబర్ 15 , 2023)
    UA|సైన్స్ ఫిక్షన్
    మార్క్ (విశాల్) మెకానిక్‌గా పనిచేస్తుంటాడు. అతని స్నేహితుడు చిరంజీవి( సెల్వ రాఘవన్) ఒక టెలిఫోన్‌ మిషన్‌ను కనుగొంటాడు. ఆ టెలిఫొన్ మెషిన్ ద్వారా భూతకాలానికి చెందిన వ్యక్తులతో మాట్లాడవచ్చు. అయితే మార్క్ చనిపోయిన తన తండ్రి ఆంటోనికి కాల్ చేయాలనుకుంటాడు. ఆ క్రమంలో మార్క్ తన తండ్రిని కొంతమంది చంపాలనుకుంటున్నారన్న విషయం తెలుసుకుంటాడు.

    టైమ్ ట్రావెలింగ్ కథాంశంతో వచ్చిన మార్క్ ఆంటోని మంచి విజయం సాధించింది. గతంలోని వ్యక్తులతో మాట్లాడే ఓ టెలీఫోన్‌ను కనిపెట్టినప్పుడు ఎలాంటి పరిణామాలు జరిగాయి అనే స్టోరీతో ఈ సినిమాను అధిక్ రవిచంద్రన్ తెరకెక్కించారు. ఈ చిత్రంలో మార్క్‌- ఆంటోనిగా విశాల్ డ్యూయల్ రోల్‌లో కనిపించి అదరగొట్టాడు.

    7 . డిస్కో రాజా(జనవరి 24 , 2020)
    UA|149 minutes|యాక్షన్,సైన్స్ ఫిక్షన్,థ్రిల్లర్
    భయంకమైన మాఫియా బ్యాక్‌గ్రౌండ్ ఉన్న డిస్కో రాజా బాడీని హిమాలయాల్లో శాస్త్రవేత్తల బృందం కనిపెడుతుంది. అతనికి చికిత్స చేయడంతో మాములు మనిషిగా మారుతాడు. తన గతం గురించి తెలుసుకున్న డిస్కో రాజా ఏం చేశాడు. అసలు డిస్కో రాజా హిమాలయాల్లో ఎందుకు కూరుకు పోయాడు అనేది మిగతా కథ

    సైన్స్ ఫిక్షన్‌ కథాంశంతో వచ్చిన ఈ సినిమాలో రవితేజ డ్యూయల్ రోల్‌లో కనిపించి మెప్పించాడు. విలన్ల చేతిలో దెబ్బలు తిన్న రవితేజ మంచులో కూరుకుపోయి... చాలా ఏళ్లు గడిచిన వయసు పెరగకుండా యవ్వనంగా ఉంటాడు. ఈ సినిమా స్టోరీలో సునీల్ ఇచ్చే ట్విస్ట్ ప్రేక్షకులను ఆశ్చర్య పరుస్తుంది.

    8 . ఓకే ఒక జీవితం(సెప్టెంబర్ 09 , 2022)
    U|157 minutes|డ్రామా,సైన్స్ ఫిక్షన్
    ఆది (శ‌ర్వానంద్‌), శ్రీను (వెన్నెల‌ కిషోర్‌), చైతూ (ప్రియ‌ద‌ర్శి) మంచి స్నేహితులు. వీరికి పాల్ (నాజ‌ర్‌) అనే ఓ శాస్త్రవేత్త ప‌రిచ‌యం అవుతాడు. పాల్‌ ఓ టైమ్‌ మిషన్‌ కనిపెడతాడు. గ‌తంలోకి వెళ్లి త‌మ త‌ప్పుల్ని స‌రిదిద్దుకునే అవ‌కాశాన్ని ఆది, శ్రీను, చైతూల‌కి ఇస్తాడు. వారు గతంలో ఏం చేశారన్నది కథ.

    తెలుగులో టైం ట్రావెలింగ్ కథాంశంతో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్‌గా నిలిచింది. చనిపోయిన తన తల్లిని బతికించుకునేందుకు టైం ట్రావెలింగ్‌కు వెళ్లిన శర్వానంద్ ఏం చేశాడు అనే కథాంశంతో ఈ సినిమాను డైరెక్టర్ శ్రీ కార్తిక్ తెరకెక్కించారు. ఈ సినిమాలో గుడ్ స్క్రీన్ ప్లే, మంచి భావోద్వేగాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి.

    9 . 7:11 PM(జూలై 07 , 2023)
    UA|డ్రామా,సైన్స్ ఫిక్షన్
    ఏపీలోని హంసల దీవికి చెందిన రవికి(సాహస్ పగడాల) పోలీస్‌ కావలని కల. అదే ఊరికి చెందిన విమల( దీపికా రెడ్డి)ని ప్రేమిస్తాడు. ఓ రోజు అనుకోకుండా ఆ ఊరిలోకి వచ్చిన బస్సును ఎక్కుతాడు. కళ్లు తెరిచి చూస్తే ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో ఉన్నట్లు గమనిస్తాడు. 1999లో ఉన్న తాను 2024లోకి వచ్చిన్నట్లు తెలిసి ఆశ్చర్య పోతాడు. ఈ క్రమంలో తన ఊరిలో ఓ కుట్ర గురించి తెలుస్తుంది. ఇంతకు రవి తిరిగి తన ఊరు చేరుకున్నాడా? ఆ కుట్రను ఛేదించాడా? అనేది మిగతా కథ

    టైమ్‌ ట్రావెలింగ్ కథాంశంతో ఈ సినిమా వచ్చింది. అనుకోకుండా ఓ ఊరిలోకి వచ్చిన గ్రహాంతర వాసుల బస్సును హీరో సాహస్ పగడాల ఎక్కడంతో అతను 1999 నుంచి 2024కు ట్రావెల్ చేస్తాడు. ఈ చిత్రాన్ని చైతు మదాల తెరకెక్కించాడు. తెలుగులో మంచి విజయం సాధించింది.


    @2021 KTree