
చిరంజీవి, విజయశాంతి కలిసి నటించిన చిత్రాలు ఇవే!
200+ views1 year ago
మెగాస్టార్ చిరంజీవి మరే హీరోయిన్‌తో తీయనన్ని సినిమాలు లెడీబాస్ విజయశాంతితో తీశాడు. వీరిద్దరి కాంబోలో మొత్తం 19 చిత్రాలు వచ్చాయి. 90వ దశకంలో వీరికి హిట్ పెయిర్ అనే పేరు ఉండేది. వీరి కాంబోలో చిత్రం విడుదలైందంటే థియేటర్లకు అభిమానులు పరుగులు తీసేవారు. చిరంజీవి- విజయశాంతి జంటగా నటించిన చిత్రాల్లో గ్యాంగ్ లీడర్, పసివాడి ప్రాణం, స్వయంకృషి, అత్తకు యముడు అమ్మాయికి మొగుడు వంటి హిట్ చిత్రాలు ఉన్నాయి.

1 . గ్యాంగ్ లీడర్(మే 09 , 1991)
A|యాక్షన్,డ్రామా
ముగ్గురు సోదరులలో చిన్నవాడైన రాజారామ్ తన రెండో అన్న చదువుకు డబ్బులు కట్టేందుకు చేయని నేరాన్ని తనపై వేసుకుంటాడు. అయితే తన పెద్దన్నయ్యను హత్య చేసిన నిందితుల గురించి తెలిసి వారిపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంటాడు.

2 . స్వయంకృషి(సెప్టెంబర్ 03 , 1987)
U|డ్రామా,మ్యూజికల్
సాంబయ్య (చిరంజీవి) చెప్పులు కుట్టుకుంటూ స్వయం కృషితో వ్యాపారవేత్తగా ఎదుగుతాడు. గంగ (విజయశాంతి)ను పెళ్లి చేసుకొని చెల్లెలు కొడుకు చిన్నాను సొంత బిడ్డలా పెంచుతాడు. అయితే ధనిక జీవితానికి ఇష్టపడ్డ చిన్నా కాయ కష్టం పనులను అసహ్యించుకుంటాడు. చిన్నా అసలు తండ్రి గోవింద్ (చరణ్‌రాజ్) రాకతో సాంబయ్య ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నాడు? అనేది కథ.
.jpeg)
3 . మేడమ్(అక్టోబర్ 19 , 1994)
U|హాస్యం,డ్రామా
మేడమ్ అనేది 1994లో విడుదలైన భారతీయ తెలుగు భాషా హాస్య చిత్రం, ఇది సింగీతం శ్రీనివాసరావు రచన మరియు దర్శకత్వం వహించింది. ఇందులో రాజేంద్ర ప్రసాద్ మరియు సౌందర్య నటించగా, మాధవపెద్ది సురేష్ సంగీతం అందించారు. రాజేంద్ర ప్రసాద్ సమర్పణలో విజయ చాముండేశ్వరి మూవీస్ బ్యానర్‌పై ఎం. చిట్టి బాబు, జి. జ్ఞానమ్ హరీష్‌లు దీనిని నిర్మించారు. ఈ చిత్రం 19 అక్టోబర్ 1994న విడుదలైంది మరియు రెండు నంది అవార్డులను గెలుచుకుంది.

4 . పశివాడి ప్రాణం(జూలై 23 , 1987)
U|యాక్షన్,క్రైమ్
భార్య చనిపోవడంతో మధు మద్యానికి బానిసవుతాడు. అతని జీవితంలోకి అనుకోకుండా వినికిడి, మాట లోపం ఉన్న రాజా అనే పిల్లవాడు వస్తాడు. ఆ చిన్నారి తల్లిదండ్రులను చంపిన హంతకులు అతన్ని చంపేందుకు వెతుకుతుంటారు.

5 . మంచి దొంగ(జనవరి 14 , 1988)
U|డ్రామా
వీరేంద్రుడు దొంగ అయినప్పటికీ అందరికీ సాయం చేస్తుంటాడు. అతను ఒక పోలీసు ప్రేమలో పడిన తర్వాత అతను లొంగిపోవాలని నిర్ణయించుకుంటాడు. తాను కూడా పోలీస్ దళంలో చేరి నేర కార్యకలాపాలను ఆపాలని నిశ్చయించుకుంటాడు.
.jpeg)
6 . చిరంజీవి(undefined 00 , 1985)
A|క్రైమ్,డ్రామా
చిరంజీవి ఒక టాలీవుడ్ చిత్రం, ఇది 18 ఏప్రిల్ 1985న విడుదలైంది. ఈ చిత్రానికి CV రాజేంద్రన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో చిరంజీవి, భానుప్రియతో విజయశాంతి ఒక చిన్న పాత్రలో నటించారు. ఈ చిత్రం కన్నడ చిత్రం నానే రాజా (1984)కి రీమేక్.
.jpeg)
7 . ఛాలెంజ్(ఆగస్టు 09 , 1984)
U|డ్రామా
గాంధీ ఒక నిరుద్యోగి. డబ్బు సంపాదించడం పెద్దగా కష్టం కాదని నమ్ముతుంటాడు. దీంతో ఐదేళ్లలో రూ.50 లక్షలు సంపాదించాలని ఒక బిజినెస్ మ్యాన్ గాంధీకి సవాలు విసురుతాడు. ఈ ఛాలెంజ్‌ను అంగీకరించిన గాంధీ డబ్బు ఎలా సంపాధించాడు? అన్నది కథ.
.jpeg)
8 . యముడికి మొగుడు(ఏప్రిల్ 29 , 1988)
U|యాక్షన్,డ్రామా,ఫాంటసీ
కాళి ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. అయితే ఆమె తండ్రి కాళిని చంపిస్తాడు. దీంతో అతను యమలోకానికి వెళ్తాడు. అక్కడ యముడితో గొడవపడి తిరిగి మరో వ్యక్తి శరీరంలోకి ప్రవేశించి తన హత్యకు ప్రతీకారం తీర్చుకుంటాడు.

9 . అత్తకు యముడు అమ్మాయికి మొగుడు(జనవరి 14 , 1989)
U|డ్రామా
కళ్యాణ్ సోదరి డబ్బున్న వ్యక్తిని ప్రేమిస్తుంది. అహంకారి అయిన తల్లికి భయపడి ఆ వ్యక్తి పెళ్లి గురించి ఆలోచిస్తుంటాడు. కళ్యాణ్ రంగంలోకి దిగి తల్లికి గుణపాఠం చెప్పాలని అనుకుంటాడు. ఇందుకు ఆమె కూతురు సాయం చేస్తుంది.

10 . ధైర్యవంతుడు(నవంబర్ 27 , 1986)
U|డ్రామా
కిషోర్ అనే నిరుద్యోగ యువకుడు తన సోదరుడు శ్రీనివాసతో కలిసి జీవిస్తుంటాడు. లావణ్యను కిడ్నాపర్ల నుండి కిషోర్ కాపాడటంతో అతడి జీవితం ఊహించని మలుపు తిరుగుతుంది.

11 . కొండవీటి రాజా(జనవరి 31 , 1986)
U|యాక్షన్,డ్రామా
ఒక పురావస్తు శాస్త్రజ్ఞుడి సహాయకుడు గుప్త నిధి రహస్యాన్ని వెలికితీసేందుకు ఒక గ్రామానికి వెళ్తాడు. అయితే అక్కడ అతను తన సోదరిని చంపిన, నిధిని దక్కించుకోవాలనుకుంటున్న ధనవంతుడితో పొరాడాల్సి వస్తుంది

12 . మెకానిక్ అల్లుడు(మే 27 , 1993)
U|యాక్షన్,డ్రామా
రవికి టీవీ ప్రెజెంటర్ ఉద్యోగం పోవడంతో గ్యారేజీలో మెకానిక్‌గా చేరుతాడు. గ్యారేజ్ ఓనర్ కూతురితో ప్రేమలో పడతాడు. కానీ, రవి తన శత్రువు కుమారుడని తెలుసుకున్న తర్వాత గ్యారేజ్ ఓనర్ తిరస్కరిస్తాడు.

13 . సంఘర్షణ(డిసెంబర్ 29 , 1983)
U|యాక్షన్,డ్రామా
దిలీప్ తన తండ్రి హరనాథరావు నేర కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని గుర్తించడానికి అమెరికా నుండి తిరిగి వస్తాడు. దిలీప్ తన తండ్రిని సన్మార్గంలోకి తీసుకువస్తానని ప్రమాణం చేస్తాడు.

14 . రుద్రనేత్ర(జూన్ 16 , 1989)
UA|యాక్షన్,థ్రిల్లర్
నేత్ర డిటెక్టివ్ ఏజెంట్‌గా పనిచేస్తుంటాడు. అండర్ వరల్డ్ కార్యకలాపాలు ట్రాక్ చేసే మిషన్ అతడికి అప్పగించబడుతుంది. ఈ మిషన్‌లో అతడికి సవాళ్లు ఎదురవుతాయి.

15 . మహానగరంలో మాయగాడు(జూన్ 28 , 1984)
A|యాక్షన్,డ్రామా
తల్లిదండ్రుల విషాదకర మరణంతో రాజా చలించిపోతాడు. ఎలాగైన డబ్బు సంపాదించాలని నగరానికి వస్తాడు. పోలీసు కాలనీలో ఉంటూ మాయలు మోసాలు చేసి డబ్బు సంపాదిస్తూ ఉంటాడు.

16 . చాణక్య శపథం(డిసెంబర్ 18 , 1986)
U|యాక్షన్,ఫ్యామిలీ
చాణక్య శపథం అనేది 1986లో విడుదలైన భారతీయ తెలుగు భాషా యాక్షన్ చిత్రం, ఇందులో చిరంజీవి, విజయశాంతి, రావు గోపాల్ రావు మరియు సత్యనారాయణ నటించారు, దీనిని D. V. S. రాజు నిర్మించారు మరియు K. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు.

17 . స్టువర్టుపురం పోలీస్ స్టేషన్(జనవరి 09 , 1991)
U|యాక్షన్,డ్రామా
స్టూవర్ట్‌పురం గ్రామస్తులు పోలీసులను అసహ్యించుకుంటారు. వారిని తమను అణచివేసే శక్తిగా భావిస్తారు. ఆ తర్వాత రాణా ప్రతాప్ అనే పోలీస్ వచ్చి వారికి పోలీసులపై ఉన్న భయాన్ని పొగొడుతాడు.

18 . యుద్ద భూమి(నవంబర్ 11 , 1988)
U|యాక్షన్,డ్రామా
ఒక ఆర్మీ అధికారి విహారయాత్ర కోసం తన గ్రామానికి వస్తాడు, కానీ తన గ్రామం చాలా దీన స్థితిలో ఉంటుంది. దీనికి కారణమైన భూస్వామి దురాగతాలకు వ్యతిరేకంగా పొరాడుతాడు.
.jpeg)
19 . దేవాంతకుడు(ఏప్రిల్ 12 , 1984)
U|యాక్షన్,డ్రామా
విజయ్‌కి సవాళ్లను స్వీకరించే అలవాటు ఉంది. అతని స్నేహితుడు చంటి ఒక ప్రొఫెసర్‌ని చంపమని సవాలు విసురుతాడు. అయితే నిజంగానే ఆ ప్రొఫెసర్ హత్యకు గురవుతాడు. ఆ నింద విజయ్‌పై పడుతుంది.