• TFIDB EN
  • Editorial List
    Balakrishna Police Movies: బాలకృష్ణ పోలీస్ ఆఫీసర్‌గా మెప్పించిన సినిమాలు ఇన్ని ఉన్నాయా?
    Dislike
    3k+ views
    6 months ago

    నందమూరి నటసింహం బాలకృష్ణ ఇప్పటి వరకు ఆయన చేయని పాత్ర అంటూ లేదు. ఈ రోల్‌లో నటించిన ఆ క్యారెక్టర్‌కు తనదైన ఠీవీ తీసుకొస్తారు. ఆయన 40 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో మరుపురాని పాత్రాల్లో జీవించి తెలుగు ప్రేక్షకులను అలరించారు. ముఖ్యంగా పోలీస్ ఆఫీసర్ పాత్రల్లో బాలయ్య మరింత పవర్‌పుల్‌గా కనిపించారు.

    ఇంగ్లీష్‌లో చదవండి

    1 . ఇన్‌స్పెక్టర్ ప్రతాప్(జనవరి 15 , 1988)
    U|149 minutes|యాక్షన్,డ్రామా
    స్థానిక మాదకద్రవ్యాల వ్యాపారిని అరెస్టు చేయడానికి ప్రయత్నించినప్పుడు నిజాయితీగల పోలీసు అధికారి ప్రతాప్ తన ఉద్యోగం కోల్పోతాడు. అయినప్పటికీ, అతను నేరస్థుడిని పట్టుకోవడానికి ప్లాన్ చేస్తాడు.

    తొలిసారి ఇన్‌స్పెక్టర్ ప్రతాప్ చిత్రంలో బాలకృష్ణ పోలీస్ పాత్రలో నటించారు. ఈ సినిమాను ముత్యాల సుబ్బయ్య డైరెక్ట్ చేశారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది.

    2 . తిరగబడ్డ తెలుగుబిడ్డ(మే 11 , 1988)
    U|129 minutes|యాక్షన్
    అవినీతిపరుడైన మేయర్‌ శిశుపాల్‌రావుకు వ్యతిరేకంగా నిజాయితీపరుడైన రవితేజ ఎదురు తిరుగుతాడు. దీంతో రవిని కటకటాల వెనక్కి నెట్టడానికి శిశుపాల్ రావు కుట్రలు పన్నుతాడు.

    ఏ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన "తిరగబడ్డ తెలుగుబిడ్డ" సినిమాలో బాలయ్య పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించారు. ఈ చిత్రం మంచి ప్రేక్షకాదరణ పొందింది. బాలయ్య సరసన భానుప్రియ హీరోయిన్‌గా నటించింది.

    3 . రౌడీ ఇన్స్పెక్టర్(మే 07 , 1992)
    A|144 minutes|యాక్షన్,డ్రామా
    ఆటోరిక్షా డ్రైవర్ అయిన రాణి, సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అయిన ఇన్‌స్పెక్టర్ రామరాజుతో ప్రేమలో పడుతుంది. నగరంలో జరుగుతున్న నేర కార్యకలాపాలను అంతం చేయడానికి రామరాజుకు సహాయం చేయడానికి రాణి కృషి చేస్తుంది.

    రౌడీ ఇన్‌స్పెక్టర్ చిత్రంలో బాలయ్య మాస్‌ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్‌లో ఇరగదీశారు. ఈ చిత్రాన్ని బి. గోపాల్ డైరెక్ట్ చేశారు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా కాసుల వర్షం కురిపించింది. బాలయ్య సరసన హీరోయిన్‌గా విజయశాంతి నటించింది.

    4 . మాతో పెట్టుకోకు(జూలై 28 , 1995)
    U|147 min|యాక్షన్,హాస్యం
    ఎస్పీ అర్జున్‌, అతడి కవల సోదరుడు కిట్టయ్య నేరస్తులను నిర్మూలిస్తామని ప్రతిజ్ఞ చేస్తారు. అయితే వారికి ఒక గ్యాంగ్‌స్టర్ సవాలు విసురుతాడు. వారిద్దరూ అతడ్ని ఎలా అంతం చేశారన్నది కథ.

    కోదండ రామిరెడ్డి డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్ అయింది. ఈ సినిమాలో బాలకృష్ణ పోలీస్ ఆఫీసర్‌గా నటించాడు. బాలయ్య సరసన రోజా, రమ్యకృష్ణ నటించింది. బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేశారు.

    5 . సుల్తాన్(మే 27 , 1999)
    U|143 minutes|యాక్షన్
    సుల్తాన్‌ అనే ఉగ్రవాదిని పట్టుకునే బాధ్యత అశోక్ అనే పోలీసు ఆఫీసర్‌కు అప్పగించబడుతుంది. మారువేషంలో తిరుగుతున్న సుల్తాన్‌ను పట్టుకునేందుకు అశోక్‌ అనేక ప్లాన్‌లు వేస్తారు. చివరికి సుల్తాన్‌లా ఉన్న అతడి కవల సోదరుడు పృథ్వీని అరెస్టు చేయడంతో కథ మలుపు తిరుగుతుంది.

    ఈ చిత్రంలో బాలకృష్ణ 8 గెటప్‌ల్లో కనిపించారు. అప్పట్లో అదొక రికార్డు. శరత్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. ఈ సినిమాలో బాలయ్య పోలీస్ ఆఫీసర్ పాత్రలో పృథ్వీగా.. మరొక పాత్రలో సుల్తాన్‌గా నటించారు.

    6 . సీమ సింహం(జనవరి 11 , 2002)
    U/A|155 minutes|యాక్షన్
    ఒకరి కొడుకు మరొకరి కారణంగా చంపబడిన తర్వాత ఇద్దరు స్నేహితులు శత్రువులుగా మారతారు. వారి శత్రుత్వం రెండు కుటుంబాల మధ్య చిచ్చునా రాజేస్తుంది.

    రాంప్రసాద్ డైరెక్షన్‌లో వచ్చిన సీమసింహం సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో బాలకృష్ణ మెప్పించారు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ టాక్ సంపాదించింది.

    7 . చెన్నకేశవ రెడ్డి(సెప్టెంబర్ 25 , 2002)
    U/A|145 minutes|యాక్షన్,డ్రామా
    చెన్నకేశవ రెడ్డి 22 ఏళ్లుగా చేయని నేరానికి జైలులో శిక్ష అనుభవిస్తుంటాడు. ఓ జైలర్‌ సాయంతో విడుదలై తనను ఇరిక్కించిన వారిపై పగ తీర్చుకునేందుకు రాయలసీమకు వెళ్తాడు. పోలీసు అయిన చెన్నకేశవ రెడ్డి కుమారుడు తండ్రి నేర కార్యక్రమాలకు అడ్డు తగులుతుంటాడు. తన తండ్రి గతం తెలుసుకొని చివరికీ అతడికి సాయం చేస్తాడు.

    వి.వి. నాయక్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బాస్టర్ హిట్ అయింది. ఈ సినిమాలో ఏసీపీ భరత్‌గా, చెన్నకేశవ రెడ్డిగా బాలయ్య మెప్పించారు. బాలకృష్ణ సరసన శ్రియ, టబు నటించారు.

    8 . లక్ష్మీ నరసింహ(జనవరి 14 , 2004)
    U|185 minutes|డ్రామా
    లక్ష్మీ నర్సింహ అనే పోలీస్ ఆఫీసర్ విజయవాడకు బదిలీ అవుతాడు. అక్కడ ధర్మ బిక్షం చేసే నేరాలను కప్పిపుచ్చేందుకు లంచం తీసుకుంటాడు. అలా తీసుకున్న డబ్బును లక్ష్మీ నరసింహా ఓ పనికోసం ఉపయోగిస్తాడు.

    జయంత్ సి. పరాన్జీ డైరెక్షన్‌లో వచ్చిన 'లక్ష్మీ' నరసింహా సినిమాలో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో బాలకృష్ణ... ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. బాలయ్య సరసన హీరోయిన్‌గా ఆశిన్ నటించింది.

    9 . అల్లరి పిడుగు(అక్టోబర్ 05 , 2005)
    U|171 minutes|డ్రామా
    రంజిత్‌, గిరి కవల సోదరులు. రంజిత్‌ పవర్‌ఫుల్‌ పోలీసు ఆఫీసర్‌ అయ్యి క్రిమినల్స్‌పై ఉక్కుపాదం మోపుతుంటాడు. గిరి సాధారణ జీవితాన్ని గడుపుతుంటాడు. జీకే అనే డాన్‌.. రంజిత్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు గిరి తన సోదరుడితో కలుస్తాడు.

    మరోసారి జంయత్ సి. పరాన్జీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్లాప్‌గా నిలిచింది. ఈ చిత్రంలో ఏసీపీ రంజిత్ కుమార్‌గా బాలకృష్ణ కనిపించారు. బాలయ్య సరసన కత్రినా కైఫ్ హీరోయిన్‌గా నటించింది.

    10 . పైసా వసూల్(సెప్టెంబర్ 01 , 2017)
    U/A|142 minutes|యాక్షన్,డ్రామా
    గూఢచార సంస్థలో పనిచేస్తున్న ఒక అధికారి ఒక మాఫియా నాయకుడిని పట్టుకోవడానికి ఒక పెద్ద మిషన్ కోసం స్థానిక గ్యాంగ్‌స్టర్‌ని నియమిస్తాడు. మరి ఆ గ్యాంగ్ స్టార్‌ మాఫియా డాన్‌ను పట్టుకున్నాడా? లేదా అనేది కథ.

    పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమాలో బాలకృష్ణ సీక్రెట్ ఏజెంట్ పాత్రలో మెప్పించారు. బాలయ్య సరసన శ్రియా సరన్ హీరోయిన్‌గా నటించింది. బాక్సాఫీస్ వద్ద 'పైసా వసూల్' సినిమా యావరేజ్ టాక్‌ తెచ్చుకుంది.

    11 . రూలర్(డిసెంబర్ 20 , 2019)
    U/A|150 minutes|యాక్షన్,డ్రామా
    అర్జున్ ప్రసాద్‌(బాలకృష్ణ)ను సరోజినీ ప్రసాద్ అనే వ్యాపారవేత్త(జయసుధ) పెంచుకుంటుంది. ఉత్తరప్రదేశ్‌లో తమ వ్యాపారాన్ని విస్తరించుకోవాలని అర్జున్ ప్రసాద్ నిర్ణయిస్తాడు. అక్కడికి వెళ్లాక అతనికి ఓ ఆసక్తికరమైన విషయం తెలుస్తుంది.

    కె.ఎస్.రవికుమార్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్లాప్‌గా నిలిచింది. బాలకృష్ణ ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్‌గా కనిపించాడు. ఈ సినిమాలో బాలయ్య సరసన సోనాల్ చౌహాన్ నటించింది.


    @2021 KTree