
ఆహాలో ప్రేక్షకాదరణ పొందిన టాప్ 20 చిత్రాలు 2022 & 2023
3k+ views1 year ago
ఆహా ఓటీటీ వేదికగా 2023 ఏడాదిలో టాప్‌లో స్ట్రీమింగ్ అవుతున్న అత్యంత వినోదాత్మక చిత్రాలు ఇక్కడ అందిస్తున్నాం. వీటిలో డీజే టిల్లు, బేబీ వంటి హిట్ చిత్రాలతో పాటు మరెన్నో ఉన్నాయి. TFIDB అందిస్తున్న లిస్ట్‌లో మీకు నచ్చిన చిత్రాన్ని చూసి ఎంజాయ్ చేయండి.

1 . ఖుబూల్ హై?(మార్చి 11 , 2022)
UA|క్రైమ్,డ్రామా,థ్రిల్లర్
తాలబ్‌కట్టాలో పేదరికం మరియు కష్టాల మధ్య, ఒక తండ్రి తన 12 ఏళ్ల కుమార్తె (అమీనా)ను ధనవంతుడుకి అమ్మవలసి వస్తుంది. ఇంతలో, తలాబ్ కట్టా పోలీస్ స్టేషన్‌లో కొత్త పోలీసు అధికారి అయిన భాను పిల్లల అక్రమ రవాణా యొక్క చీకటి వ్యాపారాన్ని చేపట్టాలని నిర్ణయించుకున్నాడు. ఈ ప్రక్రియలో, అతను చాలా వెలికితీసిన వాస్తవాలను కనుగొనడం జరుగుతుంది.

2 . మసూదా(నవంబర్ 18 , 2022)
A|హారర్
నాజియా (భాంధవి శ్రీధర్) ఆమె తల్లి నీలం (సంగీత) ఇద్దరు కలిసి జీవిస్తుంటారు. వీరు గోపీ కృష్ణ (తిరువీర్) సాఫ్ట్‌వేర్ ఉద్యోగితో మంచి సంబంధాన్ని కలిగి ఉంటారు. అయితే నాజియా విచిత్రంగా ప్రవర్తిస్తుంటుంది. ఆమె ప్రవర్తన నీలం, గోపిలను షాక్‌కు గురిచేస్తుంది. ఆమెను భూతవైద్యుల దగ్గరికి తీసుకెళ్తారు. మరి నాజియా కోలుకుందా? ఆమె ఎందుకు అలా ప్రవర్తిస్తోంది? అనేది మిగతా కథ.

3 . 18 పేజెస్(డిసెంబర్ 23 , 2022)
UA|డ్రామా
సిద్ధు (నిఖిల్ సిద్ధార్థ్) యాప్ డెవలపర్. ఓ అమ్మాయిని ప్రేమించి మోసపోతాడు. సిద్ధూ డిప్రెషన్‌లోకి వెళ్తాడు. ఈక్రమంలో నందిని (అనుపమ పరమేశ్వరన్) డైరీని చూస్తాడు. సిద్ధూ దానిని చదవడం ప్రారంభించి, మెల్లగా ఆమెను ఇష్టపడుతాడు. సిద్ధు నందిని గురించి చాలా ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటాడు. ఆమెను కలిసే ప్రయత్నంలో కథలో పెద్ద ట్విస్ట్ వస్తుంది. ఇంతకు ఆమెను సిద్ధు కలిశాడా? అన్నది మిగతా కథ.

4 . సర్కారు వారి పాట(మే 12 , 2022)
UA|యాక్షన్,డ్రామా
అమెరికాలో ఫైనాన్స్ వ్యాపారం చేసే మహేశ్ దగ్గర కళావతి (కీర్తి సురేష్) అబద్దాలు చెప్పి డబ్బు అప్పు తీసుకుంటుంది. డబ్బు ఇవ్వనని చెప్పడంతో వైజాగ్‌లో ఉన్న కళావతి తండ్రి రాజేంద్రనాథ్ (సముద్రఖని) దగ్గరకు మహేశ్ వెళ్తాడు. రూ.10 వేల కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తాడు. ఇంతకీ ఆ రూ.10 వేల కోట్ల కథేమిటి? ఇంతకీ మహేశ్ గతం ఏమిటి? అనేది కథ.
.jpeg)
5 . యశోద(నవంబర్ 11 , 2022)
UA|సైన్స్ ఫిక్షన్,థ్రిల్లర్
యశోద(సమంత) పేద ఒక పేద యువతి. తన ఇంట్లో ఆర్థిక పరిస్థితి వల్ల అద్దె తల్లి కావడానికి ఒప్పుకుంటుంది. ఆమెను మధు(వరలక్ష్మి శరత్ కుమార్)కి చెందిన ఎవా అనే సరోగసీ సెంటర్‌కి తీసుకెళ్తారు. అక్కడ యశోద అద్దె గర్భం మాటున జరగుతున్న ఘోరాలు తెలుస్తాయి. సరోగసి మాఫియాతో సమంత ఎలా పోరాడింది? ఆ మాఫియా కోరల్లోంచి సమంత బయటపడిందా? అనేది కథ

6 . భీమ్లా నాయక్(ఫిబ్రవరి 25 , 2022)
UA|యాక్షన్,డ్రామా
బీమ్లా నాయక్ (పవన్ కల్యాణ్) నిజాయతీ గల సబ్ ఇన్‌స్పెక్టర్. రాజకీయ పలుకుపడి ఉన్న డానియల్ శేఖర్ (రానా) కారులో మద్యం సీసాలతో వెళ్తూ పోలీసులకు చిక్కుతాడు. బీమ్లా నాయక్ డానియల్‌ను కొట్టి స్టేషన్‌కు తీసుకెళ్లడంతో అతని అహం దెబ్బ తింటుంది. ఆ తర్వాత అతడు ఏం చేశాడన్నది కథ.

7 . డీజే టిల్లు(ఫిబ్రవరి 12 , 2022)
UA|హాస్యం,రొమాన్స్
డీజే టిల్లు మంచి మాటకారి. మ్యూజిక్ డైరెక్టర్ కావాలనేది అతడి కల. సింగర్ రాధిక (నేహాశెట్టి)ని చూడగానే ప్రేమలో పడుతాడు. ఇంతలో రాధిక ఓ హత్య కేసులో ఇరుక్కుంటుంది. ఆమెతో స్నేహం చేసిన పాపానికి అందులో టిల్లు కూడా ఇరుక్కుంటాడు. ఆ హత్య కేసు నుంచి బయటపడేందుకు టిల్లు ఏం చేశాడు? ఇంతకు రాధిక ఎవరు అనేది మిగతా కథ.

8 . పాపం పసివాడు(సెప్టెంబర్ 29 , 2023)
UA|డ్రామా
క్రాంతి (శ్రీరామ చంద్ర) ఓ పార్టీలో చారు(రాశీ సింగ్)ను చూసి ఇష్టపడతాడు. చారును వెతికే క్రమంలోనే తల్లి ఒత్తిడితో అనూష(శ్రీవిద్య)తో పెళ్లికి ఒప్పుకుంటాడు. వీరిద్దరి నిశితార్థం జరుగుతుండగా అక్కడకు అనూహ్యంగా చారు ఎంట్రీ ఇస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అనూష, చారులలో క్రాంతి ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? అనేది కథ.

9 . బేబీ(జూలై 14 , 2023)
UA|డ్రామా,రొమాన్స్
ఆనంద్(ఆనంద్ దేవరకొండ), వైషూ(వైష్ణవి చైతన్య) చిన్నప్పటి నుంచి కలిసి పెరుగుతారు. ఈ క్రమంలో ఆనంద్‌ని వైషూ ప్రేమిస్తుంది. ఆనంద్ కూడా వైషూ ప్రేమను అంగీకరిస్తాడు. అయితే, ఆనంద్ పదో తరగతి తప్పడంతో ఆటో డ్రైవర్‌గా మారతాడు. అదే సమయంలో వైషూ ఇంటర్ పూర్తి చేసి ఇంజినీరింగ్ చదువులకు వెళ్తుంది. అక్కడ ఆమెకు విరాజ్(విరాజ్ అశ్విన్) పరిచయం అవుతాడు. ఈ క్రమంలో అక్కడి కల్చర్‌కు వైషూ అలవాటు పడి క్రమంగా ఆనంద్‌ని దూరం పెడుతుంది. మరోవైపు, విరాజ్‌తో ఇష్టం లేకున్నా శారీరకంగా ఒకటవ్వాల్సి వస్తుంది. ఆనంద్‌ను వైష్ణవి ఎందుకు దూరం పెట్టాల్సి వచ్చింది? చివరకు ఆనంద్ ఏమయ్యాడు? అనేది మిగతా కథ.

10 . ఒదెల రైల్వే స్టేషన్(ఆగస్టు 26 , 2022)
A|థ్రిల్లర్,క్రైమ్
అనుదీప్ (సాయి రోనక్) ఐపీఎస్ అధికారి. ట్రైనింగ్ కోసం ఓదెల వెళతాడు. ఈ క్రమంలో ఆ ఊరిలో వరుస హత్యాచారాలు తీవ్ర కలకలం రేపుతాయి. మరి అనుదీప్ హంతకుడ్ని పట్టుకున్నాడా? కేసు విచారణలో రాధ (హెబ్బా పటేల్) అతడికి ఎలా సాయపడింది? అనేది కథ.

11 . అశోక వనంలో అర్జున కల్యాణం(మే 06 , 2022)
UA|రొమాన్స్,డ్రామా
మాధవి(రుక్సార్ ధిల్లాన్)తో నిశ్చితార్థం కోసం అర్జున్ కుమార్(విశ్వక్ సేన్) వారింటికి వెళ్తాడు. ఇంతలో కరోనా లాక్ డౌన్ వల్ల అక్కడే ఉండాల్సి వస్తుంది. ఈ క్రమంలో అర్జున్‌కు ఊహించని ఎదురు దెబ్బ తగులుతుంది. అందులోంచి బయటపడే క్రమంలో మాధవి సోదరి వసుధ(రితికా నాయక్) అర్జున్‌తో ప్రేమలో పడుతుంది. ఇంతకు అర్జున్‌కు ఎదురైన ఆ అనుభవం ఏమటి? మాధవి సోదరి వసుధ ప్రేమను అర్జున్ ఒప్పుకున్నాడా? అన్నది మిగతా కథ.

12 . కీడా కోలా(నవంబర్ 03 , 2023)
UA|హాస్యం,క్రైమ్
ఓ కూల్ డ్రింక్ లో బొద్దింక వస్తే... కోర్టు వరకు ఆ విషయాన్ని తీసుకువెళ్తే వచ్చే డబ్బు కంటే.. సదరు కార్పొరేట్ సంస్థనే బ్లాక్ మెయిల్ చేస్తే వచ్చే డబ్బు ఎక్కువ అని భావించిన కొందరు కుర్రాళ్ళు ఎలాంటి చిక్కుల్లో పడ్డారు? అనేది కీడా కోలా కథ. ఈ చిత్రంలో బ్రహ్మానందంతో పాటు తరుణ్ భాస్కర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
.jpeg)
13 . మళ్ళి పెళ్లి(మే 26 , 2023)
UA|రొమాన్స్,డ్రామా
నటుడు నరేష్ నిజ జీవితంలోని కాంట్రవర్సీలే సినిమా స్టోరీ. నరేష్, పవిత్రల మధ్య ఉన్న రిలేషన్ ఎక్కడి నుంచి మొదలైంది? నరేష్, తన మూడో భార్య రమ్య రఘుపతికి మధ్య మనస్పర్థలు ఎక్కడ వచ్చాయి నరేష్-పవిత్ర ఓ హోటల్‌లో దొరకడం, అది మీడియాలో రావడం వంటి నిజ జీవితంలో జరిగిన సన్నివేశాలు కూడా కథలో ఇమిడి ఉన్నాయి. నరేష్ జీవితంలోని జరిగిన వివాదాల సమాహారమే ఈ సినిమా కథ.

14 . ప్రేమలు(మార్చి 08 , 2024)
U|హాస్యం,రొమాన్స్
సచిన్.. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లాలని కలలు కంటాడు. వీసా రిజెక్ట్ కావడంతో గేట్ కోచింగ్ కోసం హైదరాబాద్ వస్తాడు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని రీనూతో తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. అప్పటికే లవ్‌లో ఫెయిలైన సచిన్.. రీనూకు తన ప్రేమను ఎలా చెప్పాడు? రీనూను ప్రేమిస్తున్న ఆది ఎవరు? సచిన్ - రీనూ చివరకు కలిశారా? లేదా? అన్నది కథ.

15 . అంబాజీపేట మ్యారేజీ బ్యాండు(ఫిబ్రవరి 02 , 2024)
UA|డ్రామా
మల్లి (సుహాస్) అంబాజీపేట మ్యారేజీ బ్యాండులో సభ్యుడు. అక్క పద్మ (శరణ్య ప్రదీప్) స్కూల్ టీచర్. ఓ కారణం చేత ఊరి మోతుబరి వెంకట్‌బాబు - మల్లికీ మధ్య వైరం మొదలవుతుంది. అది పెద్దదై ఊర్లో గొడవలకు దారి తీస్తాయి. ఆ తర్వాత ఏం జరిగింది? లక్ష్మి (శివాని నాగారం), మల్లిల ప్రేమ కథ ఏంటి? అన్నది కథ.

16 . మా ఊరి పొలిమేర 2(నవంబర్ 03 , 2023)
UA|క్రైమ్,హారర్,థ్రిల్లర్
ఊరిలో చెతబడులు చేస్తూ చనిపోయాడని భ్రమ పడిన కొమురయ్య(సత్యం రాజేష్) తన తొలి ప్రేయసి కవితతో కేరళకు పారిపోతాడు. మరోవైపు జంగయ్య (బాలాదిత్య) తన సోదరుడు కొమురయ్య కోసం వెతుకులాటలో ఉంటాడు. ఇంతలో కొత్త ఎస్‌ఐ రవీంద్ర నాయక్ (రాకేందు మౌళి) ఆ గ్రామం చుట్టూ ఉన్న రహస్యాలను ఛేదించడానికి జాస్తిపల్లికి వస్తాడు. ఈ క్రమంలో జరిగిన నాటకీయ పరిణామాలు ఏమిటి? గ్రామంలోని పాడుబడిన ఆలయంలోకి ప్రవేశించాలని పురావస్తు శాఖ ఎందుకు ప్రయత్నిస్తుంటుంది? అసలు గ్రామంలో వరుస మరణాలకు కొమురయ్య ఎందుకు కారణం అయ్యాడు? ఇంతకీ ఆ గుడిలో ఏముంది? జంగయ్య తన సోదరుడిని గుర్తించాడా ? లేదా? చివరికి ఏం జరిగింది ? అనేది మిగిలిన కథ

17 . వినరో భాగ్యము విష్ణు కథ(ఫిబ్రవరి 18 , 2023)
UA|హాస్యం,డ్రామా,రొమాన్స్
దర్శన (కాశ్మీరా పరదేశి), ఒక యూట్యూబర్, ఆమె ఫోన్ నంబర్‌లో లాస్ట్ నెంబర్‌కు తర్వాత ఉన్న విష్ణు (కిరణ్ అబ్బవరం)తో అనుకోకుండా ఓ రోజు ఫోన్ కలుస్తుంది. వీరి పరిచయం నెమ్మదిగా స్నేహంగా మారుతుంది. మరోవైపు మురళి శర్మతో ఇదే తరహా ఫొన్ పరిచయం ఏర్పడుతుంది. దర్శన తన యూట్యూబ్ ఛానెల్‌ని మరింత విస్తరించేందుకు విష్ణు, శర్మ సాయం చేస్తారు. అయితే ఓ రోజు శర్మను దర్శన కాల్చి చంపుతుంది? అసలు శర్మను దర్శన ఎందుకు కాల్చి చంపుతుంది అన్నది మిగతా కథ.

18 . ఏజెంట్ ఆనంద్ సంతోష్(ఆగస్టు 05 , 2022)
UA|హాస్యం,థ్రిల్లర్
ఆనంద్ సంతోష్ ఒక డిటెక్టివ్ ఏజెంట్. తన వద్దకు వచ్చే సిల్లీ కేసులను వదులుకుంటూ సరైన కేసు కోసం ఎదురుచూస్తుంటాడు. ఈక్రమంలో తను ప్రేమించిన అమ్మాయి తండ్రి.. ఉద్యోగం చేస్తేనే పెళ్లి చేస్తానని చెప్పడంతో తన ప్రేమ కోసం ఒక డిటెక్టివ్ ఆఫీస్‌లో జాయిన్ అవుతాడు. ఇదే సమయంలో హైదరాబాద్‌లోని కూకక్‌ట్‌పల్లిలో కొంతమంది అమ్మాయిల కిడ్నాప్‌లు జరుగుతుంటాయి. మరి కేసుని ఆనంద్ సంతోష్ ఒప్పుకుంటాడా? లేదా?
.jpeg)
19 . స్వాతి ముత్యం(అక్టోబర్ 05 , 2022)
UA|హాస్యం,డ్రామా
బాలమురళీ కృష్ణ (బెల్లంకొండ గణేష్) భాగ్యలక్ష్మీ(వర్షా బొల్లమ్మ)ని చూడగానే ప్రేమలో పడతాడు. వారికి పెళ్లి జరుగుతుండగా చంటిబిడ్డతో శైలజ (దివ్య శ్రీపాద) ప్రత్యక్షం అవుతుంది. ఆ బిడ్డకు తండ్రి బాలమురళీ కృష్ణ అని చెబుతుంది. మరి భాగ్యలక్ష్మీ స్పందన ఏంటి? ఆ శైలజ ఎవరు? అనేది కథ.

20 . ఓరి దేవుడా(అక్టోబర్ 21 , 2022)
UA|హాస్యం,రొమాన్స్
అర్జున్ (విశ్వక్ సేన్), అను (మిథిలా పాల్కర్) పెళ్లి చేసుకుంటారు. అర్జున్‌ని అను అనుమానిస్తూనే ఉంటుంది. దీంతో పెళ్లి తర్వాత స్వేచ్చ కోల్పోయినట్లు అతడు భావిస్తాడు. పెళ్లి విషయంలో తనకు సెకండ్ ఛాన్స్ ఇవ్వమని దేవుడ్ని మెురపెట్టుకుంటాడు. కొన్ని షరతులతో దేవుడు (వెంకటేష్) అందుకు అంగీకరిస్తాడు. ఆ తర్వాత ఏమైందన్నది కథ.