• TFIDB EN
  • Editorial List
    ZEE5లో టాప్ ఫ్రీ మూవీస్ లిస్ట్ ఇదే!
    Dislike
    500+ views
    1 year ago

    తెలుగు ప్రేక్షకులకు ZEE5 ఓటీటీ ప్లాట్‌ఫాం బోలెడంతా వినోదాన్ని పంచుతోంది. ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్‌తో అలరిస్తుంటుంది. అయితే తాజాగా మరికొన్ని హిట్ చిత్రాలను ఫ్రీ స్ట్రీమింగ్ జాబితాలో చేర్చింది. ఇంకెందుకు ఆలస్యం వీటిని చూసి ఆనందించండి మరి..

    ఇంగ్లీష్‌లో చదవండి

    1 . ఇది సంగతి(ఫిబ్రవరి 22 , 2008)
    A|128 minutes|హాస్యం,డ్రామా
    రిపోర్టర్లు సత్య మూర్తి, నీలాద్రి రైలు ప్రమాదం జరిగిన ప్రదేశానికి వెళ్తారు. అక్కడ మరణించిన ప్రయాణికుల వస్తువులను దొంగిలిస్తారు. వజ్రాలు నింపిన సూట్‌కేస్‌ని సత్య దొంగిలించడంతో కథ కీలక మలుపు తిరుగుతుంది.
    2 . బ్రదర్స్(అక్టోబర్ 12 , 2012)
    U|172 minutes|యాక్షన్,రొమాన్స్
    అఖిల్‌, విమల్‌ అవిభక్త కమలలు. ఇద్దరూ కాజల్‌ను ప్రేమిస్తారు. ఓ రోజు అఖిల్‌కు తన తండ్రి చేస్తున్న మోసం గురించి తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అఖిల్‌ ఎందుకు చనిపోయాడు? సోదరుడి హత్య తర్వాత విమల్ ఏం చేశాడు? అన్నది కథ.
    3 . బావ(అక్టోబర్ 29 , 2010)
    UA|145 mins|డ్రామా
    సీతారాముడు తన కొడుకును గౌరవించే కుటుంబంతో సంబంధం కుదుర్చుకోవాలని కోరుకుంటాడు. కానీ అతని కొడుకు తన తల్లి తరపు బంధువుల్లో ఒకరితో ప్రేమలో పడినప్పుడు వారి ప్రేమ బంధాన్ని వ్యతిరేకిస్తాడు. మరి అతని కొడుకు వీరబాబు ఏం చేశాడు? తన ప్రియురాలి కుటుంబ సభ్యుల హృదయాలను ఎలా గెలుచుకుంటాడు? వారి కుటుంబం ఈ జంటను ఎలా అంగీకరిస్తుందనేది మిగతా కథ
    4 . రారండోయ్ వేడుక చూద్దాం(మే 26 , 2017)
    UA|150 minutes|డ్రామా,రొమాన్స్
    ఒక యువతి అందమైన అబ్బాయిని పెళ్లిచేసుకోవాలని కలలుగంటుంది. కానీ తనతో సన్నిహితంగా ఉండే అబ్బాయితో ప్రేమలో పడుతుంది. అయితే ఇరువురి కుటుంబాల మధ్య ఉన్న వైరం వారి ప్రేమకు అడ్డుగా నిలుస్తుంది.
    5 . ఆడవారి మాటలకు అర్థాలే వేరులే(ఏప్రిల్ 27 , 2007)
    UA|157 minutes|డ్రామా
    గణేష్ ఒక నిరుద్యోగి.. కీర్తిని చూసి ప్రేమలో పడతాడు. ఆమె సాయంతో కీర్తి పనిచేసే సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం సాధిస్తాడు. అయితే, ఆమె అప్పటికే వేరొకరితో నిశ్చితార్థం చేసుకున్నట్లు గణేష్‌ తెలుస్తుంది. ఓ సంఘటన వల్ల గణేష్‌ తీవ్రమైన డిప్రెషన్‌లోకి వెళ్తాడు. గణేష్‌ను మాములు మనిషి చేసేందుకు అతని స్నేహితుడు తన ఊరికి తీసుకెళ్తాడు. ఈ క్రమంలో అతనికి ఓ నిజం తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది అన్నది మిగతా కథ.
    6 . సికిందర్(ఆగస్టు 14 , 2014)
    UA|యాక్షన్,క్రైమ్,థ్రిల్లర్
    ముంబైలోని రాజు భాయ్, చంద్రు అనే ఇద్దరు గ్యాంగ్‌స్టర్ల చుట్టు తిరిగే కథ ఇది. వారు గ్యాంగ్‌స్టర్లుగా ఎందుకు మారారు? ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది స్టోరీ.
    7 . శీనుగాడు చిరంజీవి ఫ్యాన్(నవంబర్ 23 , 2005)
    U|డ్రామా,రొమాన్స్
    చిరంజీవి వీరాభిమాని అయిన శీను అంజలిని ప్రేమిస్తాడు. అంజలికి ఇంకో వ్యక్తితో పెళ్లి ఫిక్స్‌ అవుతుంది. అంజలికి కాబోయే భర్త చనిపోవడంతో దానికి కారణం శీనునే అని ఆమె ఆరోపిస్తుంది. కానీ, అతడు బతికే ఉన్నాడని తెలిసినప్పుడు కథ మలుపు తిరుగుతుంది.
    8 . సౌఖ్యం(డిసెంబర్ 24 , 2015)
    UA|యాక్షన్,హాస్యం,డ్రామా,రొమాన్స్
    హీరో శ్రీను (గోపీచంద్). ఫ్రెండ్స్ తో జాలీగా తిరుగుతుంటాడు. కుటుంబం కోసం ఎంతకైనా తెగిస్తాడు. ఓ ట్రైన్ జర్నీలో హీరోయిన్ శైలజ(రెజీన)ని చూసి ప్రేమలో పడతాడు. అదే ప్రేమని శ్రీని శైలజకి చెప్తే మొదట నో అంటుంది, కానీ ఫైనల్ గా ఓ రోజు ఒప్పుకుంటుంది. ఓ రోజు శైలజని ఓ గ్యాంగ్ కిడ్నాప్ చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? కిడ్నాప్ గ్యాంగ్‌ నుంచి శైలను శ్రీను కాపాడాడా? లేదా అన్నది మిగతా కథ.
    9 . అలా మొదలైంది(జనవరి 21 , 2011)
    U|135 minutes|రొమాన్స్
    లవ్‌ ఫేయిల్ అయిన ఓ వ్యక్తి ఒక అమ్మాయిని కలుస్తాడు. ఆమెతో ప్రేమలో పడతాడు. అయితే, ఆమెకు అప్పటికే నిశ్చితార్థం జరిగిందని తెలియగానే కథలో ట్విస్ట్‌ మొదలవుతుంది.
    10 . ఇద్దరమ్మాయిలతో(మే 31 , 2013)
    UA|143 minutes|రొమాన్స్,థ్రిల్లర్
    సంజు రెడ్డి స్పెయిన్‌లో లీడ్ గిటారిస్ట్. కొంతమందితో కలిసి బ్యాండ్ నడుపుతుంటాడు. ఈక్రమంలో ఇండియాలో బాగా ధనవంతురాలైన, యూనియన్ మినిస్టర్ కూతురైన ఆకాంక్ష సైకాలజీలో పిజి చేయడానికి స్పెయిన్ వస్తుంది. తను దిగిన ఇంట్లో, ఇదివరకూ అదే ఇంట్లో ఉన్న వారికి సంబందించిన డైరీ ఒకటి దొరుకుతుంది. ఆ డైరీకి సంజూ రెడ్డికి మధ్య సంబంధమే సినిమా కథ.
    11 . ఏక్ నిరంజన్(అక్టోబర్ 29 , 2009)
    UA|155 minutes|యాక్షన్,డ్రామా
    రోడ్లపై పిల్లల్ని అడుక్కునే రాకెట్‌ను నడిపే వ్యక్తి చిన్నతనంలో చోటును కిడ్నాప్ చేస్తాడు. అయితే, అతన్ని అరెస్టు చేయడంలో పోలీసులకు చోటు సహాయం చేస్తాడు. ఆ తర్వాత తన కుటుంబం కోసం వెతుకుతాడు.
    12 . శివ(అక్టోబర్ 05 , 1989)
    A|145 minutes|యాక్షన్
    భవాని తన మనుషులతో చట్టవిరుద్దమైన పనులు చేయిస్తూ హింసాత్మక ఘటనలకు పాల్పడుతుంటాడు. కళాశాల విద్యార్థి శివ ఓ కారణంగా అతడిపై పోరాటానికి సిద్ధపడతాడు. ఈ పోరులో ఎవరు గెలిచారన్నది కథ.

    @2021 KTree