• TFIDB EN
  • ZEE5లో టాప్ రేటేడ్ 10 రొమాంటిక్ చిత్రాలు
    Dislike
    2k+ views
    1 year ago

    ZEE5లో 2018 నుంచి 2023 వరకు వచ్చిన రొమాంటిక్ చిత్రాల్లో టాప్ రేటెడ్ సినిమాలను YouSay TFIDB సేకరించడం జరిగింది. వీటిలో గీతాగోవిందం, రంగ్‌దే, శ్రీదేవి సోడా సెంటర్ వంటి హిట్ సినిమాలు ఉన్నాయి. ఇంకెందుకు ఆలస్యం రొమాంటిక్ మోడ్‌ను ఆస్వాదించండి.

    ఇంగ్లీష్‌లో చదవండి

    1 . గీత గోవిందం(ఆగస్టు 15 , 2018)
    UA|హాస్యం,రొమాన్స్
    గోవింద్‌ (విజయ్‌ దేవరకొండ) గుడిలో గీత (రష్మిక)ను చూసి తొలిచూపులోనే ఇష్టపడతాడు. విజయ్‌ ఊరు వెళ్లేందుకు బస్సు ఎక్కగా అతడి పక్క సీటులోనే గీత కూర్చుంటుంది. ఆమె నిద్రిస్తున్న క్రమంలో ముద్దు పెట్టేందుకు యత్నించి గీత దృష్టిలో విజయ్‌ రోగ్‌లా మారిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? విజయ్‌ ఆమె ప్రేమను ఎలా గెలుచుకున్నాడు? అన్నది కథ.
    2 . వరుడు కావలెను(అక్టోబర్ 29 , 2021)
    UA|హాస్యం,రొమాన్స్
    భూమి (రీతు వర్మ) చాలా పర్టిక్యులర్‌గా ఉండే అమ్మాయి. ఆమె వర్క్‌ చేసే కంపెనీలోకి ఆకాష్‌ (నాగ శౌర్య) ఎంటర్ అవుతాడు. ఆ ఇద్దరికీ ఎలా రిలేషన్‌ కుదిరింది? పెళ్లిపై ఆసక్తి లేని భూమి ఆకాష్‌ను ఇష్టపడుతుందా? లేదా? అన్నది కథ.
    3 . రంగ్ దే(మార్చి 26 , 2021)
    UA|డ్రామా,రొమాన్స్
    అను (కీర్తి సురేష్), అర్జున్ (నితిన్) ఇద్దరు చిన్ననాటి స్నేహితులు. ఒకరంటే ఒకరికి పడదు. అను అర్జున్‌ని ప్రేమిస్తుంది కానీ అతను ఆమెను ద్వేషిస్తాడు. కానీ ఓ సంఘటన వల్ల అర్జున్‌ అనును పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అను ప్రేమను అర్జున్ అర్థం చేసుకున్నాడా? లేదా? అన్నది మిగతా కథ.
    4 . హ్యాపీ వెడ్డింగ్(జూలై 28 , 2018)
    U|డ్రామా,రొమాన్స్
    విజయ్ (రాజా)తో బ్రేకప్ చెప్పిన అక్షర (నిహారిక కొణిదెల) మళ్లీ ఆనంద్‌ (సుమంత్ అశ్విన్)తో ప్రేమలో పడుతుంది. అయితే ఏ కారణాల వల్ల బ్రేకప్ జరిగిందో అవే కారణాలు ఆనంద్‌ రిలేషన్‌లో రిపీట్ అవుతాయి. అప్పుడు అక్షర ఏం చేసింది? అన్నది కథ.
    5 . సోలో బ్రతుకే సో బెటర్(డిసెంబర్ 25 , 2020)
    U|హాస్యం,డ్రామా,రొమాన్స్
    ప్రేమలో పడకుండా ఒంటరిగా, స్వతంత్రంగా ఉండటంపై దృఢ విశ్వాసం ఉన్న విరాట్ కాలేజీలో అందరికీ తన ఆలోచనలు బోధిస్తుంటాడు. అయితే, కొన్ని పరిణామాలు అతన్ని ప్రేమలో పడేలా చేస్తాయి. మరి విరాట్ తన భావజాలాన్ని వదిలిపెట్టాడా?
    6 . చల్ మోహన్ రంగ.(ఏప్రిల్ 05 , 2018)
    U|డ్రామా,రొమాన్స్
    మోహన్‌ రంగ (నితిన్‌) జాబ్‌ కోసం అమెరికాకు వెళ్తాడు. అక్కడ మేఘను ఇష్టపడతాడు. ఇద్దరి మనస్తత్వాలు, వ్యక్తిత్వాలు వేరు కావడంతో ప్రేమ వ్యక్తం చేసుకోకుండానే విడిపోతారు. వారు తిరిగి ఎలా కలిశారు? రంగ తన ప్రేమను చెప్పాడా లేదా? అన్నది కథ.
    7 . శ్రీదేవి సోడా సెంటర్(ఆగస్టు 27 , 2021)
    UA|యాక్షన్,డ్రామా,రొమాన్స్
    సూరిబాబు (సుధీర్‌బాబు), శ్రీదేవి (ఆనంది) ఒకరినొకరు ఇష్టపడతారు. వీరి ప్రేమకు కులం అడ్డువస్తుంది. ఈ క్రమంలోనే ఓ హత్య కేసులో సూరిబాబు జైలుకు వెళ్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? సూరిబాబు - శ్రీదేవి కలిశారా లేదా? అన్నది కథ.
    8 . మిస్టర్ మజ్ను(జనవరి 25 , 2019)
    UA|హాస్యం,రొమాన్స్
    ఏ అమ్మాయితో సీరియస్ రిలేషన్ షిప్ కొనసాగించని ఓ యువకుడు ఓ అమ్మాయితో ప్రేమలో పడుతాడు. దీంతో అతని జీవితం అనేక మలుపులు తిరుగుతుంది.
    9 . 30 రోజుల్లో ప్రేమించడం ఎలా(జనవరి 29 , 2021)
    UA|డ్రామా,రొమాన్స్
    అర్జున్‌ (ప్రదీప్‌ మాచిరాజు), అక్షర (అమృతా అయ్యర్‌) ఒకే కాలేజీలో ఇంజనీరింగ్ స్టూడెంట్స్‌. వీరికి ఒకరంటే ఒకరికీ పడదు. ఫ్రెండ్స్‌తో విహారయాత్రకు వెళ్లినప్పుడు వీరికి పెద్ద సమస్య ఎదురవుతుంది? ఇంతకీ ఆ సమస్య ఏంటి? వీరు ఎందుకు 30రోజుల్లో ప్రేమించుకోవాల్సి వచ్చింది? అన్నది కథ.
    10 . శైలజా రెడ్డి అల్లుడు(సెప్టెంబర్ 13 , 2018)
    UA|యాక్షన్,హాస్యం,రొమాన్స్
    చైతు, అను ప్రేమించుకుంటారు. చైతు తండ్రి (మురళీశర్మ) అను కుటుంబానికి చెప్పకుండా వారి నిశ్చితార్థం జరిపిస్తాడు. ఆడవారికి అన్యాయం జరిగితే అస్సలు ఊరుకొని శైలజారెడ్డి (రమ్యకృష్ణ) కూతురు అను. నిశ్చితార్థం గురించి తెలిసిన శైలజారెడ్డి ఏం చేసింది? చైతు-అను పెళ్లికి ఆమె ఒప్పుకుందా లేదా? అన్నది కథ.

    @2021 KTree