• TFIDB EN
  • Editorial List
    చిరంజీవి- రాధికను హిట్ పేయిర్‌గా నిలిపిన సినిమాలు ఇవే!
    Dislike
    2k+ views
    1 year ago

    తెలుగు ఇండస్ట్రీలో చిరంజీవి- రాధిక జంటకు సిల్వర్ స్క్రీన్ పేయిర్‌గా మంచి గుర్తింపు ఉంది. వీరిద్దరు కలిసి 16 చిత్రాల్లో నటించారు. వీటిలో చాలా సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. వాటిపై ఓలుక్ వేద్దాం.

    ఇంగ్లీష్‌లో చదవండి

    1 . రాజా విక్రమార్క(నవంబర్ 14 , 1990)
    U|154 minutes|యాక్షన్,డ్రామా
    రాజా విక్రమార్క ( చిరంజీవి ) స్కంద ద్వీపపు యువరాజు. యువరాజు కావడంతో, తన జీవితాన్ని స్వేచ్ఛగా గడపడానికి వీలుండేది కాదు. అతని తండ్రి రాజా భూపతి ( సత్యనారాయణ ) మరొక రాజ్య యువరాణితో పెళ్ళి సంబంధం మాట్లాడుతాడు. పెళ్లి ఇష్టంలేని రాజా విక్రమార్క రాజ్యాన్ని వదిలి వెళ్లిపోతాడు. ఓ నగరంలో మెకానిక్‌గా పనిచేస్తాడు. ఈక్రమంలో ప్రమాదంలో ఓ సంపన్న యువతికి బాడీగార్డ్‌గా మారుతాడు? ఇంతకు ఆ యువతికి వచ్చిన ప్రమాదం ఏమిటి? ఆమెను రాజా ఎలా కాపాడాడు అన్నది మిగతా కథ.

    చిరంజీవి- రాధిక, అమల కాంబోలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్లాప్ టాక్ సొంతం చేసుకుంది. ఈ చిత్రాన్ని రవిరాజా పినిశెట్టి డైరెక్ట్ చేశారు. ఈ చిత్రం చిరంజీవితో రాధిక నటించిన చివరి చిత్రం.

    2 . ఆరాధన(మార్చి 27 , 1987)
    U|మ్యూజికల్,రొమాన్స్
    పులిరాజు నిత్య తాగుబోతు, అందరినీ వేధిస్తుంటాడు. అయితే అతని గ్రామంలోకి జెన్నీ టీచర్ వస్తుంది. అతని మూర్ఖత్వాన్ని అతనికి తెలుసుకునేలా చేస్తుంది. దీంతో అతని జీవితం కీలక మలుపు తిరుగుతుంది.

    భారతీ రాజా డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రంలో చిరంజీవి సరసన సుహాసిని, రాధిక నటించారు. హీరో రాజశేఖర్ ముఖ్య పాత్రలో నటించారు.

    3 . దొంగ మొగుడు(జనవరి 09 , 1987)
    U|యాక్షన్,డ్రామా
    ఓ సంపన్నవ్యాపారవేత్త జీవితంలో నిత్యం వేధించే భార్య, తల్లి వల్ల సంతోషం లేకుండా పోతుంది. అచ్చం ఆ వ్యాపారవేత్తను పోలి ఉన్న వ్యక్తి వల్ల అతని భార్యలో మార్పు వస్తుంది.

    చిరంజీవి, రాధిక, భానుప్రియ, మాధవి కాంబోలో వచ్చిన ఈ సినిమా మంచి ప్రేక్షకాదరణ పొందింది. ఈ చిత్రాన్ని ఏ. కోదండరామిరెడ్డి డైరెక్ట్ చేశారు.

    4 . జ్వాలా(జూన్ 14 , 1985)
    UA|డ్రామా
    జ్వాల రవి రాజా పినిశెట్టి దర్శకత్వం వహించిన 1985 భారతీయ తెలుగు భాషా చిత్రం. ఈ చిత్రంలో చిరంజీవి ద్విపాత్రాభినయం చేస్తున్నారు, రాధిక, సిల్క్ స్మిత మరియు భానుప్రియ. సినిమా స్కోర్‌ని ఇళయరాజా స్వరపరిచారు. ఈ చిత్రాన్ని మలయాళంలో ప్రతీకార జ్వాల పేరుతో డబ్ చేశారు. ఈ చిత్రం కన్నడలో 1987లో సత్యం శివం సుందరం అనే పేరుతో విష్ణువర్ధన్ త్రిపాత్రాభినయంలో (తండ్రి పాత్రతో సహా) ఈ చిత్రానికి భిన్నంగా రీమేక్ చేయబడింది. ఇది ఇళయరాజా పాటలలో ఒకదానిలో జాబితా చేయబడింది.

    చిరంజీవి, రాధిక జంటగా నటించిన ఈ చిత్రం అట్టర్ ప్లాప్‌గా నిలిచింది. ఈ సినిమాను రవిరాజా పినిశెట్టి డైరెక్ట్ చేశారు.

    5 . హీరో(మార్చి 23 , 1984)
    UA|129 minutes|యాక్షన్,అడ్వెంచర్
    గుప్త నిధులు వెలికితీసే పురావస్తు శాస్త్రవేత్త... కృష్ణ. ఓ గ్రామంలో గుప్త నిధులు వెలికితీసేందుకు వెళ్తాడు. కానీ అదే గ్రామంలో అతని స్నేహితుడు విక్రమ్ హత్యకు గురవుతాడు.తన స్నేహితుడి మరణం వెనుక ఉన్నది ఎవరు? గుప్త నిధులను కృష్ణ కనిపెట్టాడా? లేదా? అనేది మిగతా కథ.

    విజయ బాపినీడు డైరెక్ట్ చేసిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్ సాధించింది. ఈ సినిమాలో చిరంజీవి సరసన రాధిక నటించింది.

    6 . గూడచారి నెం.1(జూన్ 30 , 1983)
    U|యాక్షన్,థ్రిల్లర్
    అక్రమ పేలుడు పదార్థాలను తయారు చేసే క్రిమినల్ ముఠా గట్టురట్టు చేసేందుకు సీబీఐ ఏజెంట్‌గా విజయ్‌(చిరంజీవి) ప్రత్యేక ఆపరేషన్‌ చేయాలని ప్రభుత్వం నియమిస్తుంది. ఈ మిషన్‌లో విజయ్ ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నాడు అనేది కథ.

    చిరంజీవి- రాధిక నటించిన ఈ చిత్రాన్ని కోడి రామకృష్ణ డైరెక్ట్ చేశారు. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం మంచి విజయం సాధించింది.

    7 . అభిలాష(మార్చి 11 , 1983)
    A|145 minutes|హారర్,థ్రిల్లర్
    మరణశిక్షను రద్దు చేయాలనే ఆలోచనతో ఒక న్యాయవాది ఓ హత్య కేసులో కావాలని అరెస్ట్ అవుతాడు. అయితే ఆ కేసులో తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకునే క్రమంలో పెద్ద సమస్యను ఎదుర్కొంటాడు.

    ఉరిశిక్షను రద్దు చేయాలన్న ఇతివృత్తంతో వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ చిత్రం ఇది. ఈ సినిమాను ఏ. కోదండరామిరెడ్డి తెరకెక్కించారు. చిరంజీవి సరసన రాధిక నటించింది.

    8 . పల్లెటూరి మొనగాడు(ఫిబ్రవరి 05 , 1983)
    A|యాక్షన్,డ్రామా
    పల్లెటూరి చిన్నోడు చిత్రం యాక్షన్ చిత్రంగా తెరకెక్కింది. ఈ సినిమాలో చిరంజీవి, రాధ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని ఎస్‌.ఏ చంద్రశేఖర్ డైరెక్ట్ చేశారు.

    చిరంజీవి రాధిక కాంబోలో వచ్చిన ఈ చిత్రం ప్లాప్ అయింది. ఈ సినిమాను SA చంద్రశేఖర్ డైరెక్ట్ చేశారు.

    9 . ప్రేమ పిచ్చోలు(జనవరి 14 , 1983)
    U|డ్రామా,రొమాన్స్
    రవి, ప్రేమ ఒకరినొకరు పిచ్చిగా ప్రేమించుకుంటారు. అయితే మరో ముగ్గురు వ్యక్తులు ఆమెను ప్రేమించడానికి ప్రయత్నించినప్పుడు విషయాలు తలకిందులు అవుతాయి.

    ఏ. కోదండరామిరెడ్డి డైరెక్ట్ చేసిన ఈ చిత్రం యావరేజ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమాలో చిరంజీవి జోడీగా రాధిక నటించింది.

    10 . పులి బెబ్బులి(undefined 00 , 1983)
    U|యాక్షన్,డ్రామా
    పులి బెబ్బులి 1983లో KSR దాస్ దర్శకత్వం వహించిన తెలుగు-భాషా చిత్రం. ఈ చిత్రంలో కృష్ణం రాజు, చిరంజీవి, జయప్రద మరియు రాధిక నటించారు.

    చిరంజీవి- కృష్ణం రాజు కాంబోలో వచ్చిన ఈ చిత్రం హిట్ అయింది. చిరంజీవి సరసన రాధిక(Chiranjeevi- Radhika Movies), కృష్ణం రాజుకు జోడీగా జయప్రద నటించారు. ఈ చిత్రాన్ని KSR దాస్ డైరెక్ట్ చేశారు.

    11 . యమకింకరుడు(అక్టోబర్ 22 , 1982)
    A|129 min|యాక్షన్,డ్రామా
    చిన్ననాటి స్నేహితులైన కిషోర్ మరియు విజయ్ ఇద్దరు పోలీస్ అధికారులుగా పనిచేస్తుంటారు. జాకల్‌ అనే నేరస్థున్ని పట్టుకుని జైళ్లో వేస్తారు. అయితే జాకల్ జైలు నుండి తప్పించుకుని కిషోర్‌ని చంపేస్తాడు.

    రాజ్‌ భరత్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద యావరేజ్‌ టాక్ సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో చిరంజీవి సరసన రాధిక నటించింది.

    12 . బిల్లా రంగా(అక్టోబర్ 15 , 1982)
    UA|113 Minutes|యాక్షన్,క్రైమ్,డ్రామా
    స్మగ్లర్ రవిరాజ్‌ని పట్టుకోవడానికి బిల్లా అనే CID అధికారి రహస్యంగా వెళతాడు. మరోవైపు, రంగా తన భార్య, బిడ్డలను విడిచిపెట్టినప్పుడు, బిల్లా వారిని రంగాతో తిరిగి కలుపుతానని హామీ ఇస్తాడు.

    కేఎస్ఆర్ దాస్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్ అయింది. ఈ సినిమాలో చిరంజీవి సరసన రాధిక హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాలో మోహన్ బాబు కూడా నటించారు.

    13 . పట్నం వచ్చిన పతివ్రతలు(అక్టోబర్ 01 , 1982)
    U|యాక్షన్,డ్రామా
    ఇద్దరు పెళ్లైన మహిళలు పట్టణంలో జీవించాలని కలలు కంటారు. కానీ పట్టణంలో జీవించడం వారి భర్తలకు ఇష్టం ఉండదు. దీంతో వారి భర్తలకు తెలియకుండా పట్టణానికి పారిపోతారు.

    చిరంజీవి, మోహన్ బాబు కలిసి నటించిన ఈ చిత్రం సూపర్ హిట్ అయింది. ఈ సినిమాలో చిరంజీవి సరసన రాధిక(Chiranjeevi- Radhika Movies) నటించగా.. మోహన్ బాబు సరసన గీత నటించింది. ఈ సినిమాను మౌళి డైరెక్ట్ చేశారు.

    14 . ఇది పెళ్లంటారా(జూలై 16 , 1982)
    UA|డ్రామా
    దీపక్ మరియు రాధ ఇద్దరు కలిసి ఒకే దగ్గర పనిచేస్తుంటారు. ఈక్రమంలో ప్రేమలో పడతారు. ఇంతలో, రాధ భర్తనని ఓ వ్యక్తి రావడంతో పరిస్థితులు తలకిందులవుతాయి.

    విజయ్ భాస్కర్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం యావరేజ్ టాక్ సొంతం చేసుకుంది. చిరంజీవి సరసన రాధిక హీరోయిన్‌గా నటించింది. వీరిద్దరితో పాటు గొల్లపూడి మారుతీరావు నటించారు.

    15 . న్యాయం కావాలి(మే 15 , 1981)
    A|డ్రామా
    భారతిని సురేష్‌ ప్రేమ పేరుతో మోసం చేస్తాడు. గర్భవతి అయిన ఆమె సురేష్‌ను కోర్టుకు ఈడ్చి నవ్వులపాలు చేయాలని నిర్ణయించుకుంటుంది.

    డి. రామేశ్వరి నవల కొత్త మలుపు ఆధారంగా ఏ. కోదండరామిరెడ్డి ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రంలో చిరంజీవి సరసన రాధిక నటించింది. బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ సాధించింది.

    16 . కిరాయి రౌడీలు(undefined 00 , 1981)
    A|యాక్షన్,డ్రామా
    కిరాయి రౌడీలు 1981లో ఎ. కోదండరామి రెడ్డి దర్శకత్వం వహించిన తెలుగు-భాషా చిత్రం. ఇందులో చిరంజీవి, మోహన్ బాబు మరియు రాధిక నటించారు. ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద విజయం సాధించింది, మరియు ఇది హిందీలో హోషియార్‌గా రీమేక్ చేయబడింది.

    ఏ. కోదండ రామిరెడ్డి డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయింది. ఈ చిత్రంలో చిరంజీవితో పాటు మోహన్ బాబు కూడా నటించారు. చిరంజీవి సరసన రాధిక (Chiranjeevi- Radhika Movies) నటించిన తొలి చిత్రమిది.


    @2021 KTree