• TFIDB EN
  • 105 మినిట్స్
    ATelugu
    జాను (హ‌న్సిక‌) ఆఫీసు నుంచి కారులో ఇంటికి వెళ్తున్న క్రమంలో తననేదో అదృశ్యశక్తి వెంటాడుతున్నట్లు ఆమెకు అర్థమవుతుంది. ఇంటికి వెళ్లాక అనూహ్య ప‌రిణామాలు చోటుచేసుకుంటాయి. ఆ అదృశ్య శ‌క్తి జానును ఇనుప గొలుసుతో బంధించి చిత్రహింస‌ల‌కు గురి చేయ‌డం ప్రారంభిస్తుంది. తన మరణానికి జానునే కారణమని చెప్పి ఇబ్బందులకు పెడుతుంది. ఇంతకీ ఆ అదృశ్య శక్తి ఎవరు? ఆ వ్య‌క్తి మ‌ర‌ణానికి జాను ఎలా కార‌ణ‌మైంది? దాని బారి నుంచి జాను ఎలా బ‌య‌ట‌ప‌డింది? అన్న‌ది మిగ‌తా క‌థ‌
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌Primeఫ్రమ్‌
    ఇన్ ( Telugu )
    Watch
    స్ట్రీమింగ్‌ ఆన్‌Aha
    ఇన్ ( Telugu )
    Watch
    రివ్యూస్
    YouSay Review

    105 Minuttess Review: హన్సికా కెరీర్‌ బెస్ట్‌ నటన.. ‘105 మినిట్స్‌’ హిట్టా? ఫట్టా?

    ‘దేశ‌ముదురు’, ‘కందిరీగ’ వంటి విజ‌య‌వంత‌మైన చిత్రాల‌తో నటి హన్సిక తెలుగు ఇండస్ట్రీపై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం ఆమె నాయికా ప్రాధాన్యమున్న చిత్రాల్...read more

    How was the movie?

    తారాగణం
    హన్సిక మోత్వాని
    సిబ్బంది
    రాజా దుస్సాదర్శకుడు
    బొమ్మక శివనిర్మాత
    సామ్ సిఎస్
    సంగీతకారుడు
    ఎడిటోరియల్ లిస్ట్
    కథనాలు
    105 Minuttess Review: హన్సికా కెరీర్‌ బెస్ట్‌ నటన.. ‘105 మినిట్స్‌’ హిట్టా? ఫట్టా?
    105 Minuttess Review: హన్సికా కెరీర్‌ బెస్ట్‌ నటన.. ‘105 మినిట్స్‌’ హిట్టా? ఫట్టా?
    న‌టీన‌టులు: హ‌న్సిక ద‌ర్శ‌క‌త్వం: రాజు దుస్సా  సంగీతం: సామ్ సిఎస్‌ ఛాయాగ్రహ‌ణం: కిషోర్ బోయిడ‌పు నిర్మాత‌: బొమ్మక్ శివ ‘దేశ‌ముదురు’, ‘కందిరీగ’ వంటి విజ‌య‌వంత‌మైన చిత్రాల‌తో నటి హన్సిక తెలుగు ఇండస్ట్రీపై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం ఆమె నాయికా ప్రాధాన్యమున్న చిత్రాల్లో నటిస్తూ ఆకట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే హన్సిక ‘105 మినట్స్‌’ (105 Minutes)తో థియేట‌ర్ల‌లోకి వ‌చ్చింది. ప్ర‌యోగాత్మ‌కంగా తెరకెక్కిన ఈ చిత్రంలో సినిమా మెుత్తం హన్సిక ఒక్కరే కనిపించడం విశేషం. మ‌రి ఈ సినిమా ప్రేక్ష‌కుల‌కు ఎలాంటి అనుభూతి పంచింది? హ‌న్సిక‌కు విజ‌యాన్ని అందించిందా? లేదా? ఇప్పుడు చూద్దాం. కథేంటి జాను (హ‌న్సిక‌) ఆఫీసు నుంచి కారులో ఇంటికి వెళ్తున్న క్రమంలో తననేదో అదృశ్యశక్తి వెంటాడుతున్నట్లు ఆమెకు అర్థమవుతుంది. ఇంటికి వెళ్లాక అనూహ్య ప‌రిణామాలు చోటుచేసుకుంటాయి. ఆ అదృశ్య శ‌క్తి జానును ఇనుప గొలుసుతో బంధించి చిత్రహింస‌ల‌కు గురి చేయ‌డం ప్రారంభిస్తుంది. తన మరణానికి జానునే కారణమని చెప్పి ఇబ్బందులు పెడుతుంది. ఇంతకీ ఆ అదృశ్య శక్తి ఎవరు? ఆ వ్య‌క్తి మ‌ర‌ణానికి జాను ఎలా కార‌ణ‌మైంది? దాని బారి నుంచి జాను ఎలా బ‌య‌ట‌ప‌డింది? అన్న‌ది మిగ‌తా క‌థ‌ ఎవరెలా చేశారంటే జాను పాత్ర‌లో హ‌న్సిక  (105 Minutes Review) జీవించింది. తన అద్భుతమైన నటనతో ఆకట్టుకుంది. అయితే సినిమా ఆద్యంతం ఒకే ఎమోషన్‌ను మెయిన్‌టెన్‌ చేస్తూ ఆమె నటించడం వల్ల సినిమా భారంగా సాగినట్లు అనిపిస్తుంది. ఓవరాల్‌గా హన్సికా(Hansika) ఓ నటిగా మరోమారు సక్సెస్‌ అయ్యిందని చెప్పవచ్చు. డైరెక్షన్‌ ఎలా ఉందంటే ద‌ర్శ‌కుడు రాజు దుస్సా (Raju Dussa) కొత్త ప్ర‌య‌త్నం మంచిదైనా స‌రైన క‌థ‌, క‌థ‌నాలు లేకుండా రంగంలోకి దిగ‌డం వ‌ల్ల ఆశించిన ఫ‌లితం ద‌క్క‌లేదు. సినిమా (105 Minutes Review) ఆస‌క్తిక‌రంగానే మొదలైనా.. ఆ త‌ర్వాత నుంచి క‌థ ముందుకు సాగదు. హన్సిక పాత్రను ఆద్యంతం కేకలు వేస్తూనే, ఏడుస్తూనే చూపించడం ప్రేక్షకులకు భారంగా అనిపించింది. అస‌లు జానును ఆ ఆత్మ ఎందుకు వేధిస్తోంది? అది ఏమి చెప్పాల‌నుకుంటోంది? అన్న‌దానిపై కూడా దర్శకుడు సరైన స్ప‌ష్ట‌త ఇవ్వ‌లేదు. ఇక సినిమాను ముగించిన తీరు కూడా ప్రేక్షకుల సహనానికి మరో పెద్ద పరీక్షగా అనిపిస్తుంది. టెక్నికల్‌గా.. సాంకేతిక విషయాలకు వస్తే.. నేప‌థ్య సంగీతం సినిమాకు ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌. క‌థేమీ లేకున్నా ఆ సంగీత‌మే దీంట్లో ఏదో ఉందేమో అన్న అనుభూతిని అందిస్తుంది. ఛాయాగ్ర‌హ‌ణం బాగుంది. నిర్మాణ విలువ‌లు క‌థ‌కు త‌గ్గ‌ట్లుగా ఉన్నాయి. ప్లస్‌ పాయింట్స్‌ హన్సిక నటననేపథ్య సంగీతం మైనస్‌ పాయింట్స్‌ కథ, కథనంసాగదీత సీన్లుక్లైమాక్స్‌ రేటింగ్‌: 2.5/5
    జనవరి 27 , 2024
    <strong>Telugu OTT Movies: ఓటీటీలో ‘అహం రీబూట్‌’ తరహాలో వచ్చిన ప్రయోగాత్మక చిత్రాలు.. వీటి కాన్సెప్ట్స్‌కు సెల్యూట్‌ చేయాల్సిందే!&nbsp;</strong>
    Telugu OTT Movies: ఓటీటీలో ‘అహం రీబూట్‌’ తరహాలో వచ్చిన ప్రయోగాత్మక చిత్రాలు.. వీటి కాన్సెప్ట్స్‌కు సెల్యూట్‌ చేయాల్సిందే!&nbsp;
    ఒకే తరహా చిత్రాలను చూడాలంటే ఎంతటి సినిమా లవర్స్‌కైనా బోర్‌ కొట్టక మానదు. దీనిని గమనించిన కొందరు దర్శక నిర్మాతలు.. క్రేజీ కాన్సెప్ట్‌తో కొన్ని ప్రయోగాత్మక చిత్రాలను రూపొందించారు. వైవిధ్యమైన కథ, కథనంతో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం ఆ చిత్రాలు ఓటీటీ వేదికగా అందుబాటులో ఉన్నాయి. విభిన్న తరహా చిత్రాలు చూడాలని కోరుకునేవారు వీటిని ఎంచక్కా వీక్షించవచ్చు. ఇవి మీకు తప్పనిసరిగా కొత్త అనుభూతిని అందిస్తాయి. ఇంతకీ ఆ చిత్రాలు ఏవి? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయి? వాటి వైవిధ్యమైన కాన్సెప్ట్‌ ఏంటి? ఈ కథనంలో పరిశీలిద్దాం.&nbsp; అహం రీబూట్‌ (Aham Reboot) సుమంత్‌ హీరోగా రూపొందిన లేటెస్ట్‌ చిత్రం అహం రీబూట్‌'. జూన్‌ 30 నుంచి ఆహా వేదికగా ఈ సినిమా స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. ఈ సైకలాజికల్‌ థ్రిల్లర్‌ మూవీకి ప్రశాంత్ సాగర్‌ అట్లూరి దర్శకత్వం వహించారు. ఈ మూవీ ప్రత్యేకత ఏంటంటే.. ఇందులో సుమత్‌ పాత్ర ఒక్కటే స్క్రీన్‌పై కనిపిస్తాయి. మిగత పాత్రలు కేవలం వినిపిస్తాయి అంతే. ఈ మూవీ స్ట్రీమింగ్‌కు మంచి రెస్పాన్స్‌ వస్తున్నట్లు ఆహా వర్గాలు తెలిపాయి. ప్లాట్‌ ఏంటంటే.. ఆర్జే నిలయ్‌ (సుమంత్‌) స్టూడియోలో ఉండగా ఒక అమ్మాయి నుంచి కాల్‌ వస్తుంది. ఎవరో కిడ్నాప్‌ చేశారని చెబుతుంది. తొలుత ప్రాంక్‌ అని భావించిన నిలయ్‌.. ఆమె మాటలకు కన్విన్స్‌ అవుతాడు. ఎలాగైన కాపాడాని అనుకుంటాడు. మరోవైపు ఆమెను రక్షించేందుకు పోలీసులు సైతం రంగంలోకి దిగుతారు. ఇంతకీ కిడ్నాపైన యువతి ఎవరు? ఆమెకు నిలయ్‌కు ఉన్న సంబంధం ఏంటి? అన్నది కథ. ఓటీటీ వేదిక : ఆహా 105 మినిట్స్‌ (105 Minuttess) ‘అహం రీబూట్‌’ తరహాలోనే రీసెంట్‌గా ఓ లేడీ ఒరియెంటేడ్‌ చిత్రం వచ్చింది. సింగిల్‌ క్యారెక్టర్‌తో తెరకెక్కిన ‘105 మినిట్స్‌’ (105 Minuttess) సినిమాలో హీరోయిన్‌ హన్సిక (Hansika) నటించారు. కేవలం ఆరు రోజుల్లోనే ఈ సినిమా చిత్రీకరణ పూర్తికావడం విశేషం. ఈ సినిమా ప్లాట్‌ ఏంటంటే.. జాను (హ‌న్సిక‌) ఆఫీసు నుంచి కారులో ఇంటికి వెళ్తున్న క్రమంలో తననేదో అదృశ్యశక్తి వెంటాడుతున్నట్లు ఆమెకు అర్థమవుతుంది. ఇంటికి వెళ్లాక అనూహ్య ప‌రిణామాలు చోటుచేసుకుంటాయి. ఆ అదృశ్య శ‌క్తి జానును ఇనుప గొలుసుతో బంధించి చిత్రహింస‌ల‌కు గురి చేయ‌డం ప్రారంభిస్తుంది. తన మరణానికి జానునే కారణమని చెప్పి ఇబ్బందులకు పెడుతుంది. ఇంతకీ ఆ అదృశ్య శక్తి ఎవరు? ఆ వ్య‌క్తి మ‌ర‌ణానికి జాను ఎలా కార‌ణ‌మైంది? దాని బారి నుంచి జాను ఎలా బ‌య‌ట‌ప‌డింది? అన్న‌ది మిగ‌తా క‌థ‌ ఓటీటీ వేదిక : అమెజాన్‌ ప్రైమ్‌ ఆరంభం (Aarambham) కేరాఫ్‌ కంచరపాలెం ఫేమ్‌ మోహన్‌ భగత్‌ ప్రధాన పాత్రలో నటించిన 'ఆరంభం' చిత్రం కూడా ప్రయోగాత్మక కథతో రూపొందింది. ‘డెజావు’ అనే డిఫరెంట్‌ కాన్సెప్టుతో దర్శకుడు అజయ్‌ నాగ్‌ ఈ సినిమా తెరకెక్కించారు. జైల్లో శిక్ష అనుభవించే ఖైదీ ఉన్నట్టుండి మాయమవుతాడు. సెల్‌కు వేసిన తాళం వేసినట్టే ఉంటుంది. ఊచలు వంచకుండా, గోడలు పగలగొట్టకుండా సునాయాసంగా అతడెలా తప్పించుకున్నాడు? అనేది ఆసక్తికరం. ఈ మూవీలో సుప్రితా సత్యనారాయణ్‌, భూషణ్‌ కల్యాణ్‌, లక్ష్మణ్‌ మీసాల, సురభి ప్రభావతి కీలక పాత్రలు పోషించారు. సినిమా ప్లాట్‌ విషయానికి వస్తే.. ‘మిగిల్.. జైలులో శిక్ష అనుభవిస్తూ ఉరి తీయడానికి ఒక రోజు ముందు అనూహ్యంగా మిస్‌ ‌అవుతాడు. జైలు గది తాళాలు, గోడలు అలాగే ఉన్నప్పటికీ అతడు మిస్‌ కావడం ఆశ్చర్యం కలిగిస్తుంది. దీన్ని కనిపెట్టేందుకు డిటెక్టివ్ రంగంలోకి దిగుతాడు. అతడికి మిగిల్‌ డైరీ దొరగడంతో కథ మలుపు తిరుగుతుంది. డైరీలో ఏముంది? డెజావు ఎక్స్‌పెరమెంట్‌కు కథకు సంబంధం ఏంటి?’ అన్నది స్టోరీ. ఓటీటీ వేదిక : ఈటీవీ విన్‌ లవ్‌ మీ (Love Me) ఆశిష్‌ (Ashish Reddy), వైష్ణవీ చైతన్య (Vaishnavi Chaitanya) ప్రధాన పాత్రల్లో అరుణ్‌ భీమవరపు తెరకెక్కించిన చిత్రం 'లవ్‌ మీ'. ఈ మూవీ కూడా వినూత్న కాన్సెప్ట్‌తో రూపొందింది. ఒక యువకుడు దెయ్యంతో ప్రేమలో పడితే&nbsp; ఎలా ఉంటుంది? ఈ క్రమంలో అతడికి ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి? అన్న కాన్సెప్ట్‌తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా జయాపజయాలు ఎలా ఉన్నప్పటికీ.. ఈ మూవీకి కచ్చితంగా ఓ డిఫరెంట్‌ ఎక్స్‌పీరియన్స్‌లో అందిస్తుంది. ప్లాట్‌ ఏంటంటే.. ‘అర్జున్ (ఆశిష్), ప్రతాప్ (రవికృష్ణ) కలిసి ఓ యూట్యూబ్ ఛానల్ నడుపుతూ ఉంటారు. దెయ్యాలు, ఆత్మలకు సంబంధించిన వీడియోలు చేస్తుంటారు. ప్రతాప్‌ లవర్‌ ప్రియా (వైష్ణవి).. దివ్యవతి అనే దెయ్యం గురించి చెప్పడంతో ఆమె ఉంటున్న పాడుబడ్డ అపార్ట్‌మెంట్‌కు అర్జున్‌ వెళ్తాడు. అలా వెళ్లిన అర్జున్‌ దివ్యవతి ఆత్మతో ప్రేమలో పడతాడు. ఆ తర్వాత ఏమైంది? దివ్యవతి ఎవరు?’ అన్నది కథ. ఓటీటీ వేదిక : అమెజాన్‌ ప్రైమ్‌ ప్రాజెక్ట్‌ జెడ్‌ (Project Z) సందీప్ కిష‌న్‌ (Sundeep Kishan), లావ‌ణ్య త్రిపాఠి (Lavanya Tripathi) హీరో హీరోయిన్లుగా న‌టించిన 'ప్రాజెక్ట్ జెడ్' మూవీ.. ఇప్పటివరకూ చూడని స్టోరీ లైన్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మనిషికి చావు అనేది లేకుంటే ఎలా ఉంటుంది? ఆనే కాన్సెప్ట్‌తో సైన్స్‌ ఫిక్షన్‌ జానర్‌లో ఈ సినిమాను తెరకెక్కించారు. సినిమా ప్లాట్‌ ఏంటంటే.. ‘నగరంలో వరుస హత్యలు కలకలం సృష్టిస్తాయి. ఇదంతా సీరియల్‌ కిల్లర్‌ పని పోలీసు డిపార్ట్‌మెంట్‌కు తెలుస్తోంది. దీంతో పోలీసు ఆఫీసర్‌ కుమార్‌ (సందీప్‌ కిషన్‌) రంగంలోకి దిగుతాడు. కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగు చూస్తాయి. ఓ సైంటిస్టు ఇవన్ని చేస్తున్నట్లు గ్రహిస్తారు? ఇంతకీ ఆ సైంటిస్టు ఎవరు? ఎందుకు హత్యలు చేస్తున్నాడు? అతడు చేసిన ప్రయోగం ఏంటి? కుమార్‌ ఈ కేసును ఎలా ఛేదించాడు?’ అన్నది కథ. ఓటీటీ వేదిక : ఆహా ప్రసన్న వదనం (Prasanna Vadanam) సుహాస్‌ (Suhas) రీసెంట్‌ చిత్రం 'ప్రసన్న వదనం'.. ఓ ప్రయోగాత్మక మూవీగా చెప్పవచ్చు. ఇందులో హీరో ఫేస్ బ్లైండ్ నెస్ (ప్రోసోపాగ్నోసియా) అనే స‌మ‌స్య బారిన పడతాడు. ఎవరి ముఖాన్ని, వాయిస్‌నూ గుర్తుపట్టలేకపోతాడు. దీని వల్ల అతడు ఫేస్‌ చేసిన సమస్యలు ఏంటి? అన్నది కాన్సెప్ట్‌. ఇందులో పాయల్‌ రాధాకృష్ణ, రాశీసింగ్‌, నందు, వైవా హర్ష కీలక పాత్రలు పోషించారు. మూవీ కథ ఏంటంటే.. రేడియో జాకీగా పనిచేసే సూర్య జీవితాన్ని ఓ ప్రమాదం తలకిందులు చేస్తుంది. ఈ ఘటనతో అతడు ఫేస్‌ బ్లైండ్‌నెస్‌ బారిన పడతాడు. ముఖాలను, గొంతులను గుర్తుపట్టలేకపోతుంటాడు. ఈ క్రమంలో ఓ రోజు అతడి కళ్లెదుట హత్య జరుగుతుంది. అనూహ్యంగా ఆ కేసులో సూర్య ఇరుక్కుంటాడు. సూర్య‌ని ఇరికించింది ఎవ‌రు? సూర్య కేసు నుంచి బయటపడ్డాడా లేదా? అన్నది కథ. భ్రమయుగం (Bramayugam) మలయాళ చిత్ర పరిశ్రమ ప్రయోగాలకు పెట్టింది పేరు. అక్కడి స్టార్‌ హీరో మమ్ముట్టి (Mammootty) నటించిన ‘భ్రమయుగం’ (Bramayugam) కూడా ఇప్పటివరకూ చూడని కాన్సెప్ట్‌తో రూపొందింది.&nbsp;డిజిటల్‌ యుగంలోనూ బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఫార్మాట్‌లో ఈ చిత్రాన్నితెరకెక్కించారు. ఈ సినిమా మెుత్తం మూడు పాత్రల చుట్టే తిరుగుతుంది. కథ ఏంటంటే.. ‘తేవన్ అనే గాయకుడు అడవిలో ప్రయాణిస్తూ ఓ పాడుబడ్డ పెద్ద భవంతికి వెళ్తాడు. అక్కడ యజమాని మమ్ముట్టి (కుడుమోన్ పొట్టి), ఓ వంటవాడు ఉంటాడు. అనూహ్య పరిణామాల తర్వాత తేవన్ ఆ ఇంటి నుంచి పారిపోవాలని అనుకుంటాడు. అసలు తేవన్ ఏం చూసి భయపడ్డాడు? కుడుమోన్ పొట్టి ఎవరు? అడవిలో ఏం చేస్తున్నాడు?’ అన్నది స్టోరీ. ఓటీటీ వేదిక : సోనీ లివ్‌
    జూలై 03 , 2024
    This Week OTT Movies : ఈ వారం విడుదల కానున్న చిత్రాలు/వెబ్ సిరీస్‌లు ఇవే!
    This Week OTT Movies : ఈ వారం విడుదల కానున్న చిత్రాలు/వెబ్ సిరీస్‌లు ఇవే!
    సంక్రాంతి తర్వాత మరోసారి సినీ ప్రేక్షకులను పలకరించడానికి ఆసక్తికర చిత్రాలు రాబోతున్నాయి. థియేటర్‌తో పాటు, ఓటీటీలోనూ అలరించేందుకు సిద్ధమవుతున్నాయి. మరి ఈ రిపబ్లిక్‌ డే సందర్భంగా వస్తున్న చిత్రాలు, వెబ్‌సిరీస్‌లేంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; థియేటర్లలో రిలీజయ్యే చిత్రాలు ఫైటర్‌ హృతిక్‌ రోషన్‌ (Hrithik Roshan), దీపికా పదుకొణె (Deepika Padukone) జంటగా నటించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘ఫైటర్‌’ (Fighter). సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వం వహించారు. భారతీయ వైమానిక దళం నేపథ్యంలో సాగే మొదటి ఏరియల్‌ యాక్షన్‌ చిత్రంగా దీన్ని రూపొందించారు. ఇందులో యుద్ధ విమాన పైలట్‌గా హృతిక్‌ కనిపించనున్నాడు. అనిల్‌ కపూర్‌ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రం జనవరి 25న థియేటర్స్‌లో విడుదల కానుంది. మలైకోటై వాలిబన్‌ మలయాళ స్టార్‌ హీరో మోహన్‌లాల్‌.. ‘మలైకోటై వాలిబన్‌’ సినిమాతో ఈ వారం ప్రేక్షకుల ముందుకు రానున్నారు. లిజో జోస్‌ పెలిసెరీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో ఓటమెరుగని రెజ్లర్‌ వాలిబన్‌ పాత్రలో ఆయన కనిపించనున్నారు. జనవరి 25న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. కెప్టెన్‌ మిల్లర్‌ ధనుష్‌ (Dhanush) కథానాయకుడిగా అరుణ్‌ మాథేశ్వరన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కెప్టెన్‌ మిల్లర్‌’ (Captain Miller). ప్రియాంక మోహన్‌ కథానాయిక. సందీప్‌కిషన్‌, శివరాజ్‌కుమార్‌ కీలక పాత్రలు పోషించారు. సంక్రాంతి కానుకగా తమిళంలో విడుదలైన ఈ చిత్రం ప్రస్తుతం బాక్సాఫీస్‌ వద్ద సందడి చేస్తోంది. జనవరి 25 నుంచి ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను అలరించనుంది. అయలాన్‌ శివ కార్తికేయన్‌ హీరోగా నటించిన ‘అయలాన్‌’ (Ayalaan) చిత్రం ఈ వారమే ప్రేక్షకుల ముందుకు రానుంది. సంక్రాంతి సందర్భంగా తమిళంలో విడుదలైన ఈ సినిమాను జనవరి 26న తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇందులో రకుల్‌ప్రీత్‌ సింగ్‌ (Rakul Preet Singh) హీరోయిన్‌గా చేసింది. శివ కార్తికేయన్‌ నటన, కామెడీ,&nbsp; గ్రహాంతరవాసి హంగామా తమిళ ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. మరి తెలుగులోనూ ఈ సినిమా ఆకట్టుకుంటుందో లేదో చూడాలి. 105 మినిట్స్‌ ఒకే ఒక్క పాత్రతో తెరకెక్కిన చిత్రం ‘105 మినిట్స్‌’. ప్రముఖ కథానాయిక హన్సిక (Hansika) ప్రధాన పాత్ర పోషించగా... రాజు దుస్సా దర్శకత్వం వహించారు. బొమ్మక్‌ శివ నిర్మించారు. జనవరి 26న ఈ చిత్రం విడుదల కానుంది. ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలు సినిమాపై ఆసక్తిని పెంచాయి. ఈ వారం ఓటీటీలో విడుదయ్యే చిత్రాలు యానిమల్‌ రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన్నా జంటగా నటించిన యానిమల్‌ (Animal) చిత్రం.. ఈ వారమే ఓటీటీలోకి రానుంది. థియేటర్లలో కంటే 8 నిమిషాల ఎక్కువ నిడివి (3 గం.ల 29 ని.)తో ప్రసారం కానుంది. సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం జనవరి 26న నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా స్ట్రీమింగ్‌లోకి రానుంది. యానిమల్ మూవీపై ఎన్ని విమర్శలు వచ్చిన ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ రూ.900 కోట్లకుపైగా వసూళ్లతో సంచలనం సృష్టించింది. మరిన్ని OTT చిత్రాలు &amp; వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి https://telugu.yousay.tv/tfidb/ott TitleCategoryLanguagePlatformRelease DateQueer EyeSeriesEnglishNetflixJan 24Six NationsSeriesEnglishNetflixJan 24AnimalMovieTelugu/HindiNetflixJan 26Bad Land HuntersMovieKorean/EnglishNetflixJan 26HustlersMovieHindiAmazon PrimeJan 24PanchayatSeriesHindiAmazon PrimeJan 26Sam BahadurMovieHindiZee5Jan 26NeruMovieTelugu/MalayalamDisney+HotStarJan 23Karma callingMovieHindi&nbsp;Disney+HotStarJan 26Flex X CopSeriesEnglish/KoreanDisney+HotStarJan 26Fight ClubMovieTamilDisney+HotStarJan 27Shark Tank IndiaSeriesHindi&nbsp;SonyLIVJan 22WonkaMovieEnglishBook My ShowJan 22Aqaman 2MovieEnglishBook My ShowJan 23FearMovieEnglishBook My ShowJan 23
    జనవరి 22 , 2024
    <strong>Thangalan OTT: ‘తంగలాన్‌’ ఇప్పట్లో ఓటీటీలోకి రానట్లే.. మరి ఎప్పుడంటే?</strong>
    Thangalan OTT: ‘తంగలాన్‌’ ఇప్పట్లో ఓటీటీలోకి రానట్లే.. మరి ఎప్పుడంటే?
    ‘అపరిచుతుడు’, ‘ఐ’ వంటి చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించి తమిళ నటుడు విక్రమ్‌ తెలుగులోనూ పాపులర్‌ అయ్యాడు. ఇటీవల వచ్చిన 'తంగలాన్‌' చిత్రంలోనూ ఆటవిక మనిషిగా నటించి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ సినిమాలో పాత్ర కోసం విక్రమ్‌ తనను తాను మార్చుకున్న తీరుపై పెద్ద ఎత్తున ప్రశంసలు వచ్చాయి. ఆగస్టు 15న రిలీజైన ఈ చిత్రం మిక్స్‌డ్‌ టాక్‌ సొంతం చేసుకుంది. అయితే రిలీజ్‌కు ముందే ఈ సినిమా ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్‌ భారీ ధరకు దక్కించుకుంది. దీంతో ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి వస్తుందా? అని గత కొన్ని రోజులగా సినీ లవర్స్‌ తెగ ఎదురుచూస్తున్నారు. అయితే వారికి ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ షాక్ ఇచ్చినట్లు సమాచారం. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.&nbsp; వెనక్కి తగ్గిన నెట్‌ఫ్లిక్స్‌! చియాన్ విక్రమ్ నటించిన తాజా చిత్రం ‘తంగలాన్’ (Thangalan) పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీకి పా రంజిత్ దర్శకత్వం వహించారు. నీలమ్ ప్రొడక్షన్స్‌తో కలిసి స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించారు. పార్వతీ తిరువోతు (Parvathy Thiruvothu), మాళవిక మోహనన్ (Malavika Mohanan) హీరోయిన్లుగా నటించిన ఈ మూవీ భారీ అంచనాల మధ్య ఆగస్టు 15న తెలుగుతో పాటు తమిళం, కన్నడ భాషల్లో థియేటర్స్‌లో విడుదలై మిక్సిడ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమా ఎక్స్‌పెక్ట్ చేసినంత సక్సెస్‌ను అందుకోకపోవడంతో ‘తంగలాన్’ ఓటీటీ డీల్‌పై నెట్‌ఫ్లిక్స్ పునరాలోచనలో పడ్డట్లు స‌మాచారం. ఈ క్రమంలోనే ముందుగా ఒప్పందం చేసుకున్న మొత్తానికి కాకుండా త‌క్కువ‌కే ఈ సినిమా ఓటీటీ రైట్స్ ఇవ్వాల‌ని నిర్మాణ సంస్థను డిమాండ్ చేసిన‌ట్లు ప్రచారం జరుగుతోంది. మరో ఓటీటీలో రిలీజ్‌? ఓటీటీ రైట్స్‌ తక్కువకు ఇవ్వాలన్న నెట్‌ఫ్లిక్స్‌ డిమాండ్‌కు తంగలాన్‌ నిర్మాతలు ససేమీరా అన్నట్లు తెలుస్తోంది. నిర్మాతలు ఒప్పుకోకపోవడంతో ఓటీటీ డీల్‌ను నెట్‌ఫ్లిక్స్‌ రద్దు చేసుకున్నట్లు కోలీవుడ్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది. నెట్‌ఫ్లిక్స్‌ ఎంతకూ పంతం వీడకపోవడంతో మరో ఓటీటీ సంస్థకు ‘తంగలాన్‌’ను ఇచ్చే ప్రయత్నాలను నిర్మాతలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు మరింత సమయం పట్టే అవకాశం ఉంది. అప్పటివరకూ తంగలాన్‌ ఓటీటీలోకి రావడమే కష్టమే అని చెప్పవచ్చు. దీంతో ఓటీటీలో తంగలాన్‌ కోసం ఎదురుచూస్తున్న సినీ లవర్స్‌కు ఇది పెద్ద షాకే. కలెక్షన్స్‌ నిల్‌! ప్రముఖ తమిళ నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా తంగలాన్‌ చిత్రాన్ని దాదాపు రూ.100 కోట్ల బడ్టెత్‌తో నిర్మించారు. యావరేజ్‌ టాక్‌ వచ్చినప్పటికీ ఈ సినిమా ఈజీగా రూ.150 కోట్ల పైనే వసూలు చేస్తుందని అంతా భావించారు. అయితే అనూహ్యంగా ఈ సినిమా రూ.105 కోట్ల గ్రాస్‌ను మాత్రమే అందుకుంది. కేవలం రూ.70 కోట్ల నెట్‌ వసూళ్లను సాధించగలిగింది. అయితే ఈ సినిమా ఫలితం ఎలా ఉన్నా విక్రమ్‌ నటనపై మాత్రం సర్వత్రా ప్రశంసలు కురిశాయి. నటన పరంగా ‘తంగలాన్’ అతడి కెరీర్‌లో మరో మైలురాయిగా నిలుస్తుందని పెద్ద ఎత్తున ప్రశంసలు వచ్చాయి. దీంతో ఓటీటీలోనైనా ఈ సినిమాను వీక్షించాలని అంతా భావించగా నెట్‌ఫ్లిక్స్‌ వారికి నిరాశనే మిగిల్చింది.&nbsp; కథేంటి 1850లో బ్రిటీషర్లు మన దేశాన్ని పాలిస్తున్న సమయంలో కథ సాగుతుంటుంది. వెప్పూర్ అనే ఊరిలో తంగలాన్ (విక్రమ్) తన కుటుంబంతో కలిసి బతుకుతుంటాడు. అనుకోని పరిస్థితుల్లో బంగారం వెతకడం కోసం క్లెమెంట్ అనే ఇంగ్లీష్ దొరతో కలిసి తంగలాన్ వెళ్లాల్సి వస్తుంది. ఈ ప్రయాణంలో వింత వింత అనుభవాలు వారికి ఎదురవుతాయి. నాగజాతికి చెందిన మాంత్రికురాలు ఆరతి (మాళవిక మోహనన్‌) తన అతీంద్రియ శక్తులతో బంగారాన్ని రక్షిస్తున్నట్లు తంగలాన్‌కు కలలు వస్తుంటాయి. మరి ఆమె నిజంగానే బంగారాన్ని రక్షిస్తుందా? తంగలాన్‌కు అతడి బృందానికి ఆమె వల్ల ఎదురైన సవాళ్లు ఏంటి? ఈ ప్రయాణంలో తంగలాన్‌ ఏం తెలుసుకున్నాడు? చివరకు బంగారం కనిపెట్టాడా? లేదా? అన్నది స్టోరీ. 
    అక్టోబర్ 05 , 2024

    @2021 KTree