• TFIDB EN
 • 24 కిసెస్ (2018)
  ATelugu2h 20m

  ఆనంద్ (అదిత్ అరుణ్) సామాజిక స్పృహ ఉన్న సినీ దర్శకుడు. శ్రీలక్ష్మీ (హెబ్బా పటేల్‌)తో ప్రేమలో పడి డేటింగ్‌తోనే జీవితాన్ని గడపాలని అనుకుంటాడు. దీంతో వారి లవ్ బ్రేకప్‌ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? వారు మళ్లీ కలిశారా? 24 ముద్దుల వెనక రహస్యం ఏంటి? అన్నది కథ.

  ఇంగ్లీష్‌లో చదవండి
  మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
  స్ట్రీమింగ్‌ ఆన్‌Primeఫ్రమ్‌
  Watch
  రివ్యూస్
  How was the movie?

  తారాగణం
  త్రిగన్ఆనంద్
  హెబ్బా పటేల్శ్రీ లక్ష్మి
  రావు రమేష్సైకియాట్రిస్ట్ మూర్తి
  నరేష్శ్రీ లక్ష్మి తండ్రి
  అదితి మైకల్విశ్వ
  కిషోర్ గుండాలసుధీర్
  శ్రీనివాస కాపవరపుప్రవీణ్
  సంజయ్ రెడ్డి ఏంజెల్ ఇన్వెస్టర్
  సిబ్బంది
  అయోధ్యకుమార్ కృష్ణంశెట్టిదర్శకుడు
  అయోధ్యకుమార్ కృష్ణంశెట్టినిర్మాత
  గిరిధర్ మామిడిపల్లినిర్మాత
  జోయ్ బారువాసంగీతకారుడు
  కథనాలు
  <strong>హెబ్బా పటేల్ గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?</strong>
  హెబ్బా పటేల్ గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
  హెబ్బా పటేల్ తెలుగు సినీ నటి. తమిళ్, కన్నడ చిత్రాల్లోనూ నటించింది. తెలుగులో అలా ఎలా? ద్వారా పరిచయమైంది. కుమారి 21F సినిమాతో గుర్తింపు పొందింది. ఈ చిత్రంలో ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఆ తర్వాత ఈడోరకం ఆడోరకం, మిస్టర్, 24 కిస్సెస్, ది గ్రేట్ ఇండియన్ సూసైడ్ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. రెడ్ చిత్రంలో రామ్‌ పొత్తినేని సరసన ఓ ఐటెం సాంగ్‌లో కూడా నటించింది. ప్రస్తుతం వెబ్‌సిరీస్‌ల్లోనూ నటించి గుర్తింపు తెచ్చుకున్న హెబ్బా పటేల్(Some Lesser Known Facts about Hebba Patel) గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు హెబ్బా పటేల్ ఎప్పుడు పుట్టింది? 1989,&nbsp; జనవరి 6న జన్మించింది హెబ్బా పటేల్ తెలుగులో నటించిన తొలి సినిమా? అలా ఎలా(2014) తెలుగులో గుర్తింపునిచ్చిన సినిమా కుమారి 21F(2015) హెబ్బా పటేల్ ఎత్తు ఎంత? 5 అడుగుల 5అంగుళాలు&nbsp; హెబ్బా పటేల్ ఎక్కడ పుట్టింది? ముంబై హెబ్బా పటేల్ అభిరుచులు? డ్యాన్సింగ్, స్విమ్మింగ్ హెబ్బా పటేల్‌కు ఇష్టమైన ఆహారం? నాన్‌వెజ్ హెబ్బా పటేల్‌కు&nbsp; ఇష్టమైన కలర్ ? వైట్ హెబ్బా పటేల్‌కు ఇష్టమైన హీరో? సల్మాన్ ఖాన్, మహేష్ బాబు హెబ్బా పటేల్ పారితోషికం తీసుకుంటుంది? ఒక్కొ సినిమాకు రూ.50 లక్షల వరకు ఛార్జ్ చేస్తోంది. హెబ్బా పటేల్ సినిమాల్లోకి రాకముందు ఏం చేసేది? మోడలింగ్ చేసేది హెబ్బా పటేల్ ఇన్‌స్టాగ్రాం లింక్? https://www.instagram.com/ihebahp/?hl=en https://www.youtube.com/watch?v=kSipyGA5qC0
  ఏప్రిల్ 02 , 2024
  ఈ వారం(Feb 24) థియేటర్లు, ఓటీటీలో విడుదలవుతున్న సినిమాలు
  ఈ వారం(Feb 24) థియేటర్లు, ఓటీటీలో విడుదలవుతున్న సినిమాలు
  గత వారం సార్, వినరో భాగ్యము విష్ణు&nbsp; కథ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సందడి నెలకొంది. అయితే, ఈ వారం(ఫిబ్రవరి 24) థియేటర్లలో చిన్న సినిమాలు విడుదలవుతున్నాయి. ఓటీటీలో మాత్రం సంక్రాంతి సినిమాలు మోత మోగించనున్నాయి. అవేంటో చూద్దాం.&nbsp; మిస్టర్ కింగ్ కుటుంబ కథా నేపథ్యంలో తెరకెక్కిన సినిమా ‘మిస్టర్ కింగ్’. దివంగత విజయ నిర్మల మనవడు శరణ్‌కుమార్ హీరోగా నటించాడు. శశికుమార్ చావలి దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 24న ఈ సినిమా విడుదలవుతోంది.&nbsp; డెడ్‌ లైన్&nbsp; ఊహించిన విధంగా కథనంతో ‘డెడ్‌లైన్’ సినిమాను తెరకెక్కించినట్లు చిత్రబృందం ప్రకటించి అంచనాలు పెంచింది. అజయ్ ఘోష్ ప్రధాన పాత్రలో నటించారు. ఈ నెల 24న విడుదలవుతోంది.&nbsp; కోనసీమ థగ్స్ ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రఫర్ బృందా గోపాల్ డైరెక్ట్ చేసిన రెండో చిత్రమే ‘కోనసీమ థగ్స్’. ప్రొడ్యూసర్ రిబూ తమీన్స్ కుమారుడు హిద్రూ పరూన్ హీరోగా పరిచయం అవుతున్నాడు. ‘థగ్స్’గా రూపుదిద్దుకున్న ఈ అనువాద చిత్రాన్ని మైత్రీ మూవీస్ డిస్ట్రిబ్యూటర్స్ సంస్థ తెలుగులో ‘కోనసీమ థగ్స్’గా విడుదల చేస్తోంది.&nbsp; OTT విడుదలలు TitleCategoryLanguagePlatformRelease DateVarasuduMoviesTamilAmazon PrimeFebruary 22Veerasimha ReddyMoviesTeluguDisney Plus HotstarFebruary 23MichaelMoviesTeluguAhaFebruary 24Waltheru VeeraiyaMoviesTeluguNetflixFebruary 27The StraysMoviesEnglishNetflixFebruary 22Call me ChichiroMoviesEnglishNetflixFebruary 23Rabia and OliviaMoviesEnglishHotstarFebruary 24Potluck S2SeriesHindiSonyLivFebruary 24A Quite PlaceMovieEnglishNetflixFebruary 24Puli MekaSeriesTeluguZee5February 24
  ఫిబ్రవరి 22 , 2023
  OTT Releases This Week (Oct 24-28): ఈ వారం ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానున్న తెలుగు సూపర్ హిట్ చిత్రాలు ఇవే!
  OTT Releases This Week (Oct 24-28): ఈ వారం ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానున్న తెలుగు సూపర్ హిట్ చిత్రాలు ఇవే!
  దసరా పండుగ వేళ భగవంత్ కేసరి, టైగర్ నాగేశ్వరరావు, లియో వంటి&nbsp; పెద్ద సినిమాలు విడుదల కావడంతో ఈ వారం థియేటర్లలో రిలీజ్‌కు చెప్పుకోదగ్గ సినిమాలు అయితే ఏమి లేవు. అయితే సంపూర్ణేష్ బాబు నటించిన మార్టిన్ లూథర్ కింగ్, కన్నడ స్టార్ హీరో శివరాజ్‌ కుమార్ నటించిన ఘోస్ట్ చిత్రాలు ప్రేక్షకులను పలకరించనున్నాయి. ఇక ఓటీటీల్లో మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. దాదాపు 20కి పైగా సినిమాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు సిద్దమయ్యాయి. ఇటీవల రిలీజైన చంద్రముఖి2, స్కందతో పాటు మరికొన్ని చిత్రాలు ఉన్నాయి. మరి అవెంటో ఓసారి చూసేద్దాం. ఈవారం థియేటర్లలో రిలీజయ్యే సినిమాలు మార్టిన్ లూథర్ కింగ్ (Martin luther king telugu movie) కమెడియన్ సంపూర్ణేష్ బాబు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం మార్టిన్ లూథర్ కింగ్. పొలిటికల్ కామెడీ డ్రామాగా&nbsp; ఈ చిత్రాన్ని పూజా కొల్లూరు తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా తమిళ్ చిత్రం 'మండేలా'కీ రీమేక్‌ వస్తోంది. తమిళంలో కమెడియన్ యోగీ బాబు ఇందులో నటించారు. ఈ సినిమాలో నరేష్, మహా, శరణ్య ప్రదీప్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని YNOT స్టూడియోస్, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తోంది.&nbsp; మార్టిన్ లూథర్ కింగ్ ఈ నెల 27న థియేటర్లలో విడుదల కానుంది. ఘోస్ట్ (GHOST) కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ నటించిన హై ఓల్టేజ్ యాక్షన్ చిత్రం ఘోస్ట్. ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కింది. ఈ చిత్రం అక్టోబర్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఇక ఘోస్ట్ సినిమాలో అనుపమ్ ఖేర్, ప్రశాంత్ నారాయణ్, ఎంజీ శ్రీనివాస్, అర్చన్ జాయిస్, సత్యప్రకాశ్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. అర్జున్ జన్య మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమా.. కన్నడ, తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం భాషాల్లో రిలీజ్ కానుంది. ఈ వారం (October 24-28) ఓటీటీల్లో స్ట్రీమింగ్‌ కానున్న చిత్రాలు మరిన్ని OTT చిత్రాలు &amp; వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి (telugu.yousay.tv/tfidb/ott) TitleCategoryLanguagePlatformRelease DateParamporulMovieTamilAmazon PrimeOctober 24Asprints Season 2WebseriesHindiAmazon PrimeOctober 25Transformers: Rise of the BeastMovieEnglishAmazon PrimeOctober 26ConsecrationMovieEnglishAmazon PrimeOctober 27Burning Betrayal&nbsp;MoviePortuguese&nbsp;NetflixOctober 25Life on Our PlanetSeriesEnglishNetflixOctober 25Chandramukhi 2MovieTelugu DubbedNetflixOctober 26Long Live LoveMovieThaiNetflixOctober 26PlutoWeb SeriesJapaneseNetflixOctober 26Pain HustlersMovieEnglishNetflixOctober 27Sister DeathMovieSpanishNetflixOctober 27TorWeb Series&nbsp;SwedishNetflixOctober 27Yellow Door: 90s Lo-Fi Film ClubMovie&nbsp;KoreanNetflixOctober 27PebblesMovieTamilSony LivOctober 27Paramporul&nbsp;MovieTamilahaOctober 24Changure Bangura RajaMovieTeluguE-WinOctober 27Phone CallMovieHindiJio movieOctober 23Duranga Season 2SeriesHindiZee 5October 24Nikonj - The Search BeginsMovieBengaliZee 5October 27Masterpiece&nbsp;SeriesTelugu Dubbed&nbsp;Disney Plus HotstarOctober 25&nbsp; Koffee With Karan Season 8Talk ShowHindiDisney Plus HotstarOctober 26SkandaMovieTeluguDisney Plus HotstarOctober 27Nights of ZodiacMovieEnglishBook My showOctober 24CursesSeriesTamilApple Plus TVOctober 27The Enfield Poltergeist&nbsp;SeriesEnglishApple Plus TVOctober 27
  అక్టోబర్ 26 , 2023
  This Week OTT movies: ఈ వారం చిన్న సినిమాలదే హవా.. ఓటీటీలోకి ‘హనుమాన్‌’ సహా 24 చిత్రాలు!
  This Week OTT movies: ఈ వారం చిన్న సినిమాలదే హవా.. ఓటీటీలోకి ‘హనుమాన్‌’ సహా 24 చిత్రాలు!
  గత కొన్ని వారాలుగా స్టార్‌ హీరోల చిత్రాలు విడుదలవుతూ థియేటర్లలో సందడి చేస్తున్నాయి. అయితే ఈ వారం మాత్రం చిన్న చిత్రాల హవా కొనసాగనుంది. ఏకంగా పదికి పైగా చిన్న హీరోల చిత్రాలు ప్రేక్షకులను అలరించేందుకు రాబోతున్నాయి. మరోవైపు ఓటీటీలోనూ కొత్త సినిమాలు, సిరీస్‌లు డబుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాయి. ఆ విశేషాలేంటో ఇప్పుడు ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.&nbsp; థియేటర్‌లో రిలీజయ్యే చిత్రాలు వెయ్‌ దరువెయ్‌ ప్రముఖ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ సోదరుడు సాయిరాం శంకర్‌ హీరోగా చేసిన లేటెస్ట్‌ చిత్రం ‘వెయ్‌ దరువెయ్‌’ (Vey Dharuvey). యషా శివకుమార్‌ హీరోయిన్‌. నవీన్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సునీల్‌, సత్యం రాజేష్‌ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. భీమ్స్‌ సిసిరిలియో సంగీతం అందించారు. ఈ సినిమా శుక్రవారం (మార్చి 15) ప్రేక్షకుల ముందుకు రానుంది.&nbsp; రజాకార్‌&nbsp; బాబీ సింహా, వేదిక, అనుష్య త్రిపాఠి, అనసూయ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘రజాకార్‌’ (Razakar). యాట సత్యనారాయణ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి భీమ్స్‌ సిసిరిలియో సంగీతం సమకూర్చారు. గూడురు నారాయణరెడ్డి నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా కూడా శుక్రవారమే థియేటర్లలో సందడి చేయనుంది.&nbsp; తంత్ర యంగ్‌ హీరోయిన్‌ అనన్య నాగళ్ల ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం ‘తంత్ర’ (Tantra). శ్రీనివాస్‌ గోపిశెట్టి దర్శకత్వం వహించారు. నరేష్‌బాబు, రవి చైతన్య నిర్మాతగా వ్యవహరించారు. హారర్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా మార్చి 15న థియేటర్లలోకి రానుంది. ఈ చిత్రానికి ఆర్ఆర్‌ ధ్రువన్‌ పాటలు, నేపథ్య సంగీతం సమకూర్చారు.&nbsp; షరతులు వర్తిస్తాయి! చైతన్యరావ్‌, భూమిశెట్టి జంటగా నటించిన ‘షరతులు వర్తిస్తాయి!’ (Sharathulu Varthisthai) సినిమా కూడా ఈ వారమే ప్రేక్షకుల ముందుకు రానుంది. శుక్రవారం (15-03-2024) నుంచి థియేటర్లలో సందడి చేయనుంది. కుమార స్వామి దర్శకత్వం వహించగా.. శ్రీలత, నాగార్జున సామల, శారత, శ్రీష్‌ కుమార్‌, విజయ, కృష్ణకాంత్‌ సంయుక్తంగా నిర్మించారు.&nbsp; లైన్‌మ్యాన్‌ త్రిగుణ్‌, కాజల్‌ కుందర్‌ జంటగా నటించిన చిత్రం ‘లైన్‌మ్యాన్‌’ (Line man). వి రఘుశాస్త్రి దర్శకుడు. ఖాద్రి మణికాంత్‌ సంగీతం అందించారు. ఈ చిత్రం మార్చి 15న రిలీజ్‌ కానుంది. ఇప్పటికే విడుదలైన మూవీ ట్రైలర్‌, టీజర్‌, ప్రచార చిత్రాలు ఆకట్టుకుంటున్నాయి.&nbsp; రవికుల రఘురామ ఈ వారం రాబోతున్న మరో చిన్న సినిమా ‘రవికుల రఘురామ’ (Ravikula Raghurama). గౌతమ్‌ వర్మ, దీప్షిక, సత్య, జబర్దస్త్‌ నాగి ప్రధాన పాత్రలు పోషించారు. చంద్రశేఖర్‌ కనూరి ఈ మూవీకి దర్శకత్వం వహించగా.. శ్రీధర్‌ వర్మ నిర్మించారు. ఈ చిత్రం శుక్రవారం (15-03-2024) ప్రేక్షకుల ముందుకు రానుంది. లంబసింగి&nbsp; భరత్‌ రాజ్‌ హీరోగా బిగ్‌బాస్‌ ఫేమ్‌ దివి హీరోయిన్‌గా చేసిన తాజా చిత్రం ‘లంబసింగి’ (Lambasingi). నవీన్‌ గాంధీ దర్శకత్వం వహించిన ఈ సినిమా మార్చి 15న విడుదలకు సిద్ధమవుతోంది. ఆర్‌ఆర్‌ ధ్రువన్‌ సంగీతం అందించిన ఈ చిత్రాన్నిఆనంద్‌ తన్నీరు నిర్మించారు.&nbsp; యోధ సిద్ధార్థ్‌ మల్హోత్ర, రాశీఖన్నా, దిశా పటానీ ప్రధాన పాత్రలో చేసిన లేటెస్ట్‌ బాలీవుడ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘యోధ’ (Yodha). సాగర్‌ అంబ్రీ దర్శకత్వం వహించారు. యశ్‌ జోహార్‌, కరణ్‌ జోహర్‌ సంయుక్తంగా నిర్మించారు. మార్చి 15 శుక్రవారం రోజున ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.&nbsp; ఇతర చిత్రాలు పై చిత్రాలతో పాటు ‘ప్రేమలో ఇద్దరు’, ‘కుంగ్‌ఫూ పాండా 4’, ‘మాయ 2024’ చిత్రాలు కూడా థియేటర్‌లో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాయి. ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు ఈ వారం ఓటీటీలో 'హనుమాన్' హిందీ వెర్షన్ రిలీజ్ కానుంది. తెలుగు వెర్షన్‌పై క్లారిటీ రావాల్సి ఉంది. మమ్మట్టి 'భ్రమయుగం', 'సేవ్ ద టైగర్స్ 2' సిరీస్‌తో పాటు 'మర్డర్ ముబారక్', 'మెయిన్ అటల్ హునా' అనే హిందీ చిత్రాలు ఇంట్రెస్ట్ కలిగిస్తున్నాయి. వీటితో పాటు పలు హిందీ, ఇంగ్లీష్ సినిమాలు, సిరీసులు మెుత్తం 24 ఓటీటీల్లోకి రాబోతున్నాయి. వాటిలో ముఖ్యమైన వాటిని ఇప్పుడు చూద్దాం. మరిన్ని OTT చిత్రాలు &amp; వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి https://telugu.yousay.tv/tfidb/ott TitleCategoryLanguagePlatformRelease DateHanuman&nbsp;MovieHindiJio CinemaMarch 16To Kill A TigerSeriesHindiNetflixMarch 10Young Royals Season 3SeriesEnglishNetflixMarch 11Jesus Revolution&nbsp;MovieEnglishNetflixMarch 12Turning PointSeriesEnglishNetflixMarch 12BandidosSeriesEnglish/SpanishNetflixMarch 13Iresh WishMovieEnglishNetflixMarch 15Iron Rean&nbsp;SeriesEnglish/SpanishNetflixMarch 15Murder MubarakMovieHindiNetflixMarch 15Love AdhuraSeriesHindiAmazon PrimeMarch 13Big Girls Don't CrySeriesHindiAmazon PrimeMarch 14Invisible Season 2SeriesEnglishAmazon PrimeMarch 14FreedaMovieEnglishAmazon PrimeMarch 15Grey's Anatomy Season 20SeriesEnglishDisney + HotstarMarch 15Save the tigers 2SeriesTeluguDisney + HotstarMarch 15Taylor Swift : The Eras TourMovieEnglishDisney + HotstarMarch 15Main Atal WhoMovieHindiZee 5March 14BramayughamMovieTeluguSonyLIVMarch 15The Devil ConspiracyMovieEnglishBook My ShowMarch 15
  మార్చి 11 , 2024
  <strong>This Week Movies: తెలుగులో ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘ఓపెన్‌ హైమర్‌’.. ఈ వారం రిలీజయ్యే చిత్రాలు ఇవే!</strong>
  This Week Movies: తెలుగులో ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘ఓపెన్‌ హైమర్‌’.. ఈ వారం రిలీజయ్యే చిత్రాలు ఇవే!
  గత వారం లాగే ఈ వీక్ కూడా పలు చిన్న చిత్రాలు థియేటర్లలో సందడి చేయడానికి రాబోతున్నాయి. ఆహ్లాదకరమైన వినోదాన్ని అందించేందుకు సిద్ధమవుతున్నాయి. మార్చి 18 నుంచి 24 తేదీల మధ్య ఇవి థియేటర్లలో సందడి చేయనున్నాయి. అలాగే ఓటీటీలో కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్‌ కాబోతున్నాయి. మరి ఆ సినిమాలు ఏంటి? వాటి విశేషాలు ఎలా ఉన్నాయి? ఈ కథనంలో చూద్దాం. థియేటర్‌లో విడుదలయ్యే చిత్రాలు ఓం భీమ్‌ బుష్‌.. శ్రీవిష్ణు, రాహుల్‌ రామకృష్ణ, ప్రియదర్శి కీలక పాత్రల్లో శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఓం భీమ్‌ బుష్‌..’ (Om Bheem Bush). నో లాజిక్‌ ఓన్లీ మేజిక్‌ అనేది ఉప శీర్షిక. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ మార్చి 22న ప్రేక్షకుల ముందుకు రానుంది.&nbsp; అనన్య జయరామన్, చందన, తోషి అలహరి, ప్రజ్ఞ గౌతమ్, అరవింద్, సుమన్ కీలక పాత్రల్లో ప్రసాద్ రాజు బొమ్మిడి రూపొందించిన చిత్రం ‘అనన్య’ (Ananya Movie). జంధ్యాల ఉమా నాగ శివ గంగాధర శర్మ నిర్మించారు. హర్రర్ నేపథ్యంలో కుటుంబ ప్రేమ కథాచిత్రంగా ఈ సినిమా రూపొందింది. మార్చి 22న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. హద్దులేదురా ఆశిష్‌ గాంధీ, అశోక్‌ కథానాయకులుగా తెరకెక్కుతున్న చిత్రం ‘హద్దులేదురా’ (haddu ledura movie). వర్ష, హ్రితిక కథానాయికలు. రాజశేఖర్‌ రావి దర్శకత్వం వహించారు. వీరేష్‌ గాజుల బళ్లారి నిర్మించారు. ‘భగవద్గీతలోని కృష్ణార్జునుల స్ఫూర్తితో ఈ చిత్రం తెరకెక్కించినట్లు మూవీ యూనిట్‌ తెలిపింది. మార్చి 21న ఈ సినిమా థియేటర్‌లలో విడుదల కానుంది. ఓటీటీలో రిలీజయ్యే చిత్రాలు/సిరీస్‌లు ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాల విషయానికొస్తే.. ఈసారి ఏడు ఆస్కార్స్ గెలుచుకున్న 'ఓపెన్ హైమర్'.. ఈ వారమే తెలుగులో స్ట్రీమింగ్ కానుంది. అలానే 'అబ్రహం ఓజ్లర్' అనే హిట్ మూవీ కూడా రానుంది. వీటితోపాటు 'ఏ వతన్ మేరే వతన్', 'ఫైటర్' లాంటి హిందీ చిత్రాలు కూడా డిజిటల్ రిలీజ్‌కి సిద్ధమైపోయాయి. మెుత్తంగా ఈ వారం 20 వరకూ చిత్రాలు ఓటీటీలోకి రాబోతున్నాయి. వాటిలో ప్రధానమైనవి ఏంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; ఓపెన్ హైమర్ ప్రతిష్టాత్మక ఆస్కార్‌ అవార్డుల్లో ఈసారి 'ఓపెన్ హైమర్' సినిమా మెరిసింది. ఉత్తమ నటుడు, దర్శకుడు, చిత్రం, సహాయ నటుడు, ఒరిజినల్ స్కోర్, ఫిల్మ్ ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ.. ఇలా ప్రధాన విభాగాల్లో పురస్కారాలు కైవసం చేసుకుంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు ఈ మూవీ గురించి మరోసారి చర్చించుకుంటున్నారు. అయితే ఈ చిత్రం ఈ వారం తెలుగు డబ్బింగ్‌తో ఓటీటీలోకి రానుంది. ప్రముఖ ఓటీటీ వేదిక ‘జియో సినిమా’లో మార్చి 21 నుంచి ప్రసారం కానుంది.&nbsp; సుందరం మాస్టార్ టాలీవుడ్ కమెడియన్ వైవా హర్ష హీరోగా ఎంట్రీ ఇచ్చిన తాజా చిత్రం ‘సుందరం మాస్టర్’ (Sundaram Master OTT). ఈ మూవీని దర్శకుడు క‌ళ్యాణ్ సంతోష్ తెరకెక్కించగా.. ఇందులో హీరోయిన్‌గా దివ్య శ్రీపాద నటించింది. గత నెల థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం.. హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. మార్చి 22 నుంచి ఈ సినిమా ఈటీవీ విన్‌లో ప్రసారం కానుంది.&nbsp; ‘భూతద్దం భాస్కర్‌ నారాయణ’ శివ కందుకూరి, రాశీ సింగ్‌ జంటగా తెరకెక్కిన చిత్రం ‘భూతద్దం భాస్కర్‌ నారాయణ’ (bhoothaddam bhaskar narayana ott). పురుషోత్తం రాజ్‌ దర్శకత్వం వహించారు. మార్చి 1న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులకు థ్రిల్‌ని పంచింది. ఇప్పుడు ఓటీటీలోనూ అదే థ్రిల్‌ను పంచడానికి వచ్చేస్తోంది. మార్చి 22 నుంచి ఆహా వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది. ఈ చిత్రంలో అరుణ్‌ కుమార్‌, దేవి ప్రసాద్‌, వర్షిణి సౌందరరాజన్‌ కీలకపాత్రలు పోషించారు. అబ్రహాం ఓజ్లర్‌ జయరాం (Jayaram), అనూప్‌ మేనన్‌, అనస్వర రాజన్‌ కీలకపాత్రల్లో నటించిన సైకలాజికల్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘అబ్రహాం ఓజ్లర్‌’ (Abraham Ozler OTT). మిధున్‌ మేనుయేల్‌ థామస్‌ దర్శకత్వం వహించారు. మమ్ముట్టి అతిథిగా నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రలో నటించి మెప్పించారు. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని నమోదు చేసింది. ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులకు అలరించడానికి సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ వేదిక డిస్నీ+హాట్‌స్టార్‌లో మార్చి 20 నుంచి మలయాళ, తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్‌ కానుంది. TitleCategoryLanguagePlatformRelease Date3 Body ProblemSeriesEnglishNetflixMarch 21FighterMovieHindiNetflixMarch 21Lal SalaamMovieTelugu/TamilNetflixMarch 22Play GroundSeriesHindiAmazon primeMarch 17Marakkuma Nenjam&nbsp;MovieTamilAmazon primeMarch 19Ae Watan Mere WatanMovieHindiAmazon primeMarch 21Road HouseMovieEnglishAmazon primeMarch 21LuteraMovieHindiDisney + HotstarMarch 22OppenheimerMovieHindi/TeluguJio CinemaMarch 21Sundaram MasterMovieTelugu&nbsp;ETV WinMarch 22
  మార్చి 18 , 2024
  REVIEW: కోనసీమ థగ్స్‌
  REVIEW: కోనసీమ థగ్స్‌
  దుల్కర్‌ సల్మాన్‌ ‘హే సినామిక’తో దర్శకురాలిగా మారిన కొరియోగ్రాఫర్‌ బృందా రెండో చిత్రం ‘కోనసీమ థగ్స్‌’. బాబీ సింహా కీలక పాత్రలో నటించిన ఈ సినిమా ట్రైలర్‌, టీజర్‌లు సినిమాపై ఆసక్తి పెంచాయి. ప్రముఖ బ్యానర్‌ మైత్రీ ఈ సినిమాను థియేటర్లలో ఇవాళ(24 Feb) విడుదల చేసింది. మరి&nbsp; ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉందా? ట్రైలర్‌లో ఉన్న ఇంటెన్సిటీ సినిమాలోనూ ఉందా? రివ్యూలో చూద్దాం. చిత్రబృందం: దర్శకత్వం: బృందా గోపాల్‌ సంగీతం: సామ్‌ CS నటీనటులు: హ్రిదు హరూన్‌, అనస్వర రాజన్‌, బాబీ సింహా తదితరులు ఎడిటర్‌: ప్రవీణ్‌ ఆంటోనీ సినిమాటోగ్రఫీ: ప్రియేష్‌ గురుస్వామి కథ: శేషు( హ్రిదు హరూన్‌) అనుకోని పరిస్థితుల్లో జైలుకు వెళ్తాడు. అక్కడ దొర( బాబీ సింహా), మధు అనే ఇద్దరిని కలుసుకుంటాడు. వీరు ముగ్గురు జైలు నుంచి తప్పించుకోవాలని పథకం వేస్తారు. శేషు అసలు జైలుకు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది. శేషు జైలుకు వెళ్లేందుకు కారణమైన పెద్దిరెడ్డి కథేంటి?.&nbsp; దొర ఎవరు? వీరు జైలు నుంచి విజయవంతంగా తప్పించుకున్నారా? అనేదే కథ. ఎలా ఉందంటే: దర్శకురాలు బృందా మంచి కథను ఎంచుకున్నారు కానీ దానిని అంతే గొప్పగా అమలు చేయలేకపోయారు. ఫస్టాఫ్‌ చాలా నెమ్మదిగా నడుస్తుంది. పాత్రల పరిచయం, శేషు, దొర జైలుకు ఎందుకు వెళ్లారు? అనే విషయాన్ని చెప్పేందుకే ఫస్టాఫ్‌ మొత్తం పోయింది. అయితే ఫస్టాఫ్‌లోనూ జైలు పరిసరాలు, కొన్ని సీన్లు చాలా బాగున్నాయి. ఇంటర్వెల్‌ చక్కగా సెట్‌ చేశారు. సెంకడాఫ్‌పై ఆసక్తిని పెంచేలా ఇంటర్వెల్ బ్యాంగ్ ఉంటుంది. సెంకడాఫ్‌లో అసలు కథ మొదలవుతుంది.&nbsp; స్క్రీన్‌ప్లే కూడా బాగుంది. సీరియస్ నోట్‌లో సినిమా పరుగెడుతుంది. జైలు నుంచి తప్పించుకునేందుకు హీరో బృందం వేసే ప్లాన్లు, వాటిని చూపించిన విధానం బాగుంది. సహజంగా కనిపించేలా చూపడంలో దర్శకత్వం విభాగం విజయవంతమైందనే చెప్పాలి. వెట్రిమారన్‌ సినిమాలను తలపించేలా సీన్లు చాలా సహజంగా ఉంటాయి. కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ జోలికి పోకుండా కథపైనే దృష్టిపెట్టిన దర్శకురాలిని మెచ్చుకోవాల్సిందే. సాంకేతికంగా సాంకేతికంగా ఈ సినిమా చాలా బాగుంది. ప్రియేష్‌ గురుస్వామి సినిమాటోగ్రఫీ సినిమాకు బలంగా మారింది. సినిమా సహజంగా అనిపించడంలో ఆయన పాత్ర చాలా ఉంది.&nbsp; ఎడిటింగ్ ఇంకాస్త మెరుగ్గా ఉండాల్సింది. సామ్ సీఎస్‌ సంగీతం సినిమాకు పెద్ద ప్లస్‌. బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌తో చాలా సీన్లకు హైప్‌ తీసుకొచ్చాడు. ప్రొడక్షన్ వ్యాల్యూస్‌ కూడా బాగున్నాయి.&nbsp; నటీ,నటుల పెర్ఫార్మెన్స్ హ్రిదు హరూన్‌ శేషుగా అదరగొట్టాడనే చెప్పాలి. ఇంటెన్సివ్ సీన్స్‌లో తన బాడీ లాంగ్వేజ్‌తో ఆకట్టుకున్నాడు. ఎమోషనల్‌ సీన్స్‌లో కూడా బాగానే చేశాడు. ఫైట్లు, జైలు నుంచి ఎస్కేప్‌ సీన్లలో నటనలో సహజత్వం కనిపిస్తుంది. బాబీ సింహాకు ఇలాంటి పాత్రలు నల్లేరు మీద నడకే. ఎప్పటిలాగే తన పాత్రలో జీవించాడు. ఎప్పటిలాగే పాత్రకు తగ్గ యాటిట్యూడ్‌తో సూపర్‌ అనిపించుకున్నాడు. హీరోయిన్‌ అనస్వర రాజన్‌ పాత్రకు అంత నిడివి లేదు కానీ ఉన్నంత మేరలో బాగా చేసింది. మిగతా నటీనటులు తమ పాత్రల పరిధి మేరకు చేశారు. బలాలు: కథ, సెకండాఫ్‌ నటీ నటుల పెర్ఫార్మెన్స్‌ సినిమాటోగ్రఫీ బీజీఎం బలహీనతలు ఫస్టాఫ్‌ కథనం సమీక్ష: ఓవరాల్‌గా సినిమా లవర్స్‌కు ఈ వారం ‘కోనసీమ థగ్స్‌’ చూడదగ్గ సినిమా. ఫస్టాఫ్‌ కాస్త నెమ్మదిగా,బోరింగ్‌గా అనిపించినా సెకండాఫ్ ఆ నిరాశను పోగొడుతుంది. రేటింగ్‌: 2.75
  ఫిబ్రవరి 24 , 2023
  <strong>నెహా శెట్టి గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?</strong>
  నెహా శెట్టి గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
  నేహా శెట్టి మెహబూబా చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్, గల్లీ రౌడి వంటి చిత్రాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించిన నేహా శెట్టి.. డిజే టిల్లు చిత్రంలో హీరోయిన్‌గా అలరించింది. ఈ చిత్రంలో ఆమె చేసిన రాధిక పాత్ర యూత్‌లో క్రేజ్ సంపాదించింది. ఆ తర్వాత రూల్స్ రంజన్, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రాల ద్వారా ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. నేహా శెట్టి సినిమాల్లోకి రాకముందు మోడలింగ్ చేసేది. జోమాటో యాడ్ షూటింగ్‌లో అల్లు అర్జున్‌తో కలిసి నటించింది. ఈక్రమంలో నేహా శెట్టి గురించి కొన్ని ఆసక్తికరమైన(Some Lesser Known Facts About Neha Shetty ) విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. నేహా శెట్టి దేనికి ఫేమస్? నేహా శెట్టి డీజే టిల్లు చిత్రం ద్వారా గుర్తింపు పొందింది. ఆ సినిమాలో ఆమె చేసిన రాధిక పాత్రకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. &nbsp;నేహా శెట్టి వయస్సు ఎంత? 1999, డిసెంబర్ 6న జన్మించింది. ఆమె వయస్సు 24 సంవత్సరాలు&nbsp; &nbsp;నేహా శెట్టి ముద్దు పేరు? &nbsp;నేహా &nbsp;నేహా శెట్టి ఎత్తు ఎంత? 5 అడుగుల 6 అంగుళాలు&nbsp; &nbsp;నేహా శెట్టి ఎక్కడ పుట్టింది? మంగళూరు, కర్నాటక &nbsp;నేహా శెట్టి&nbsp; అభిరుచులు? డ్యాన్సింగ్, షాపింగ్ నేహా శెట్టికి&nbsp; ఇష్టమైన ఆహారం? దోశ, బిర్యాని నేహా శెట్టి&nbsp; తల్లిదండ్రుల పేర్లు? హరిరాజ్ శెట్టి, నిమ్మి శెట్టి నేహా శెట్టి&nbsp; ఫెవరెట్ హీరో? అల్లు అర్జున్ నేహా శెట్టి&nbsp; ఇష్టమైన కలర్ ? పింక్, వైట్ నేహా శెట్టి&nbsp; ఇష్టమైన హీరోయిన్స్ దీపిక పదుకునే &nbsp;నేహా శెట్టి తెలుగులో హీరోయిన్‌గా నటించిన ఫస్ట్ సినిమా? డీజే టిల్లు నేహా శెట్టి&nbsp; ఏం చదివింది? డిగ్రీ &nbsp;నేహా శెట్టి పారితోషికం ఎంత? ఒక్కొ సినిమాకు రూ.50లక్షల వరకు ఛార్జ్ చేస్ నుంచి- రూ.3 కోట్ల వరకు ఛార్జ్ చేస్తోంది. నేహా శెట్టి&nbsp; సినిమాల్లోకి రాకముందు ఏం చేసేది? మోడలింగ్, మిస్ మంగళూరు(2014)లో అందాల పోటీలో విజేతగా నిలిచింది. &nbsp;నేహా శెట్టి ఇన్‌స్టాగ్రాం లింక్? https://www.instagram.com/iamnehashetty/?hl=en https://www.youtube.com/watch?v=p4XBBBW5STM
  ఏప్రిల్ 13 , 2024
  కేతిక శర్మ గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
  కేతిక శర్మ గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
  కేతిక శర్మ తెలుగులో గ్లామర్ క్లీన్‌గా పేరొందింది. పూరిజగన్నాథ్ కుమారుడు ఆకాష్ పూరి నటించిన రొమాంటిక్(2021) చిత్రం ద్వారా టాలీవుడ్‌కు పరిచయమైంది. ఈ చిత్రం పరాజయం పొందినప్పటికీ.. ఆమె నటనకు ప్రశంసలు దక్కాయి. లక్ష్య, రంగరంగా వైభవంగా, బ్రో చిత్రాల్లో హీరోయిన్‌గా నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉంటూ గ్లామరస్ డాల్‌గా గుర్తింపు పొందింది. కేతిక సినిమాల్లోకి రాకముందే మంచి క్రేజ్ దక్కించుకుంది. ఆమె 2016లో నటించిన 'థగ్‌ లైఫ్‌ (2016)' వీడియోతో పాపులర్‌ అయ్యింది. మరి ఈ హాట్ డాల్ గురించి మరిన్ని (Some Lesser Known Facts about Ketika Sharma)&nbsp; ఆసక్తికరమైన విషయాలు మీకోసం.. &nbsp;కేతిక శర్మ ఎప్పుడు పుట్టింది? 1995, డిసెంబర్ 24 న జన్మించింది &nbsp;కేతిక శర్మ తొలి సినిమా? రొమాంటిక్(2021) &nbsp;కేతిక శర్మ ఎత్తు ఎంత? 5 అడుగుల 4అంగుళాలు&nbsp; కేతిక శర్మ ఎక్కడ పుట్టింది? ఢిల్లీ కేతిక శర్మ ఏం చదివింది? డిగ్రీ కేతిక శర్మ అభిరుచులు? జిమ్ చేయడం, ట్రావెలింగ్, మోడలింగ్ కేతిక శర్మకు ఇష్టమైన ఆహారం? నాన్‌ వెజ్ కేతిక శర్మకి&nbsp; ఇష్టమైన కలర్ ? బ్లాక్, రెడ్, వైట్ కేతిక శర్మకు ఇష్టమైన ప్రదేశం బ్యాంకాక్ కేతిక శర్మకి ఇష్టమైన హీరో? సల్మాన్ ఖాన్ కేతిక శర్మకి ఇష్టమైన హీరోయిన్? ప్రియాంక చోప్రా, దీపికా పదుకునే కేతిక శర్మ పారితోషికం ఎంత? ఒక్కొ సినిమాకు రూ.కోటి వరకు ఛార్జ్ చేస్తోంది కేతిక శర్మ ఇన్‌స్టాగ్రాం లింక్? https://www.instagram.com/ketikasharma/?hl=en కేతిక శర్మ సిగరెట్ తాగుతుందా? స్మోకింగ్ అలవాటు ఉంది. కేతిక శర్మ మద్యం తాగుతుందా? అవును, తాగుతుంది. https://www.youtube.com/watch?v=ILQ8wRqu5EI
  ఏప్రిల్ 06 , 2024
  Kushita Kallapu: యంగ్‌ బ్యూటీ ‘కుషిత కల్లపు’ గురించి ఈ సీక్రెట్స్‌ తెలుసా?
  Kushita Kallapu: యంగ్‌ బ్యూటీ ‘కుషిత కల్లపు’ గురించి ఈ సీక్రెట్స్‌ తెలుసా?
  టాలీవుడ్‌ యంగ్‌ హీరోయిన్‌ ‘కుషిత కల్లపు’ పేరు ప్రస్తుతం బాగా వినిపిస్తోంది. పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌తో లిప్‌కిస్‌ కైనా తాను సిద్ధమంటూ ఇటీవల ఆమె చేసిన కామెంట్స్ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో ఈ భామ గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు. తెలుగులో ఇప్పటివరకూ నాలుగు సినిమాలు చేసిన ‘కుషిత కల్లపు’కు సంబంధించిన పూర్తి సమాచారం, ఆమె ఇష్టా ఇష్టాలు, అభిరుచులు ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.&nbsp; కుషిత కల్లపు పుట్టిన తేది? 19 అక్టోబర్‌, 2002 శనివారం రోజున హైదరాబాద్‌లో కుషిత కల్లపు జన్మించింది.&nbsp; కుషిత కల్లపు వయసు ఎంత? 19 అక్టోబర్‌, 2002లో పుట్టినందను ప్రస్తుతం ఆమె వయసు 24 ఏళ్లు కుషిత కల్లపు తల్లిదండ్రులు ఎవరు? ఈ బ్యూటీ తన కుటుంబ సభ్యుల సమాచారంపై గోప్యత పాటిస్తోంది. తన తల్లిదండ్రుల నేపథ్యం, వృత్తి వంటి విషయాలను ఆమె ఎక్కడా పంచుకోలేదు.&nbsp; కుషిత కల్లపు మతం ఏది? ఆమె హిందువు కుషిత కల్లపుది ఏ రాశి? మిధున రాశి కుషిత కల్లపు ఎత్తు ఎంత? ఈ బ్యూటీ 5.5&nbsp; అడుగుల ఎత్తు కలిగి ఉంది.&nbsp; కుషిత కల్లపు బరువు ఎంత? ఈ భామ సుమారు 65 కిలోల బరువు ఉంది.&nbsp; కుషిత కల్లపు కళ్లు, జట్టు ఏ కలర్‌? నలుపు కుషిత కల్లపు ఇన్‌స్టాగ్రామ్ ఖాతా? https://www.instagram.com/kushithakallapu/ కుషిత కల్లపునకు పెళ్లి అయ్యిందా? లేదు కుషిత కల్లపు తొలి సినిమా? ‘నీతోనే నేను’&nbsp; సినిమాతో కుషిత టాలీవుడ్‌లో అడుగు పెట్టింది. ఆ తర్వాత 'మనోహరం', 'చాంగురే బంగారు రాజా' సినిమాల్లో నటించింది.&nbsp; కుషిత కల్లపు తాజా చిత్రం ఏది? బిగ్‌బాస్‌ ఫేమ్‌ అర్జున్‌ కళ్యాణ్‌ హీరోగా లక్ష్మణ్‌ వర్మ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'బాబు నెం.1 బుల్‌షిట్‌ గాయ్‌'. ఇందులో కుషిత హీరోయిన్‌గా చేసింది. ఈ మూవీ మార్చి 8న విడుదల కానుంది.&nbsp; సినిమాల్లోకి రాకముందు కుషిత ఏం చేసింది? టాలీవుడ్‌లోకి అడుగు పెట్టకముందు కుషిత పలు షార్ట్‌ఫిల్మ్‌లో నటించింది.&nbsp; కుషిత కల్లపు చేసిన షార్ట్‌ఫిల్మ్స్‌? డేట్‌మింటన్‌ (Dateminton), 3G, ఫ్రెండ్స్‌ విత్‌ బెనిఫిట్స్‌ (Friends with Benefits), డేట్‌ వంటి లఘు చిత్రాల్లో కుషిత చేసింది.&nbsp; కుషిత కల్లపు ఫేవరేట్‌ హీరో? కుషిత కల్లపు తన ఫేవరేట్‌ హీరో ఎవరో ఏ వేదికపై వెల్లడించలేదు. అయితే పవన్‌తో లిప్‌కిస్‌కు రెడీ అంటూ ఆమె చేసిన వ్యాఖ్యల్ని బట్టి ఆమె ఫేవరేట్‌ హీరో పవర్‌స్టార్‌ అయ్యి ఉండవచ్చు.&nbsp; కుషితను బాగా బాధ పెట్టిన ఘటన? మహేష్‌ బాబు రీసెంట్‌ చిత్రం 'గుంటూరు కారం' షూటింగ్‌లో కుషిత పాల్గొంది. నాలుగు రోజులు షూటింగ్‌ కూడా చేసిందట. అయితే తన సీన్స్‌ ఎడిటింగ్‌లో పోవడంతో తాను చాలా బాధపడినట్లు కుషిత ఓ ఇంటర్యూలో చెప్పుకొచ్చింది.&nbsp; కుషిత కల్లపు హాబీ? ట్రావెలింగ్‌ అంటే భామకు చాలా ఇష్టమట. ఖాళీ దొరికినప్పుడల్లా కొత్త ప్రదేశాల్లో వాలిపోతుందట.&nbsp; కుషిత కల్లపు ఫేవరేట్‌ ఫుడ్‌? ఛీజ్‌తో చేసిన వంటకాలంటే తనకు చాలా ఇష్టమైన ఇటీవల ఓ ఇంటర్యూలో కుషిత చెప్పుకొచ్చింది.&nbsp; కుషిత కల్లపు ముద్దు పేరు ఏంటి? కుటుంబ సభ్యులు ఈ బ్యూటీని ముద్దుగా ‘ఖుషి’ అని పిలుస్తారట. అలా పిలిపించుకోవడం కుషితకు చాలా ఇష్టమట.
  మార్చి 07 , 2024
  SSMB29: మహేశ్‌ బాబు సరసన ఇండోనేషియా హీరోయిన్!
  SSMB29: మహేశ్‌ బాబు సరసన ఇండోనేషియా హీరోయిన్!
  ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంతో దర్శకధీరుడు రాజమౌళి (SS Rajamouli) ఖ్యాతి గ్లోబల్ స్థాయికి చేరింది. ప్రముఖ హాలీవుడ్‌ డైరెక్టర్‌ జేమ్స్‌ కామెరాన్ సైతం ప్రశంసించే స్థాయికి రాజమౌళి ఎదిగారు. అయితే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తర్వాత రాజమౌళి తన తర్వాతి చిత్రాన్ని మహేశ్‌ బాబు (Mahesh babu)తో రూపొందించనున్న సంగతి తెలిసిందే. ‘SSMB29’ పేరుతో ఈ సినిమా స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తవగా, ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ నడుస్తోంది. ఈక్రమంలో సినిమాకు సంబంధించి రోజుకో వార్త సామాజిక మాధ్యమాల వేదికగా వైరల్‌ అవుతోంది. తాజాగా మరికొన్ని విషయాలు బాగా ట్రెండ్‌ అవుతున్నాయి. వాటిపై ఓ లుక్కేద్దాం. నటీనటుల ఎంపిక పూర్తి! యాక్షన్ అడ్వెంచర్‌గా తెరకెక్కనున్న ‘SSMB29’ చిత్రానికి సంబంధించి నటీనటుల ఎంపిక పూర్తైనట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తోంది. 24 క్రాఫ్ట్స్‌కు చెందిన టీమ్‌ను దర్శకేందుకు ఫైనలైజ్‌ చేసినట్లు సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది. హాలీవుడ్‌ చిత్రాలకు పనిచేసిన టెక్నికల్‌ సిబ్బంది, వీఎఫ్‌ఎక్స్ నిపుణులను రాజమౌళి తన సినిమాకు ఎంచుకున్నట్లు సమాచారం. ప్రీ ప్రొడక్షన్‌ పనులు దాదాపుగా పూర్తికావడంతో.. షూటింగ్‌ను ఈ ఏడాది మిడిల్‌ నుంచి ప్రారంభించే అవకాశముందని సిని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.&nbsp; https://twitter.com/MovieTamil4/status/1762770509467689149 కీలక పాత్రలో ఇండోనేషియా భామ! తాజాగా జరుగుతున్న సమాచారం ప్రకారం ‘SSMB29’లో ఓ హాలీవుడ్‌ భామ నటించబోతున్నట్లు సమాచారం. ఇండోనేషియా నటి చెల్సియా ఎలిజబెత్ ఇస్లాన్ (Chelsea Elizabeth Islan) ఈ భారీ ప్రాజెక్ట్‌కు ఎంపికైనట్టు తెలుస్తోంది. అమెరికన్ - ఇండోనేషియా నటిగా ఈ బ్యూటీకి మంచి గుర్తింపు ఉంది. చిల్సీ ఇస్లాన్.. 18 ఏళ్లకే వెండితెరపై మెరిసింది. ‘ది బాలిక్ 98’, ‘రూడీ’, ‘హబిబీ’ వంటి చిత్రాలతో ఇండోనేషియాలో మంచి క్రేజ్ దక్కించుకుంది. ఉత్తమ నటిగా సెకండ్ ఇండోనేషియన్ చాయిస్ అవార్డ్‌ను సైతం ఈ అమ్మడు అందుకుంది. ఈ భామ ఎంట్రీపై రాజమౌళి టీమ్‌ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.&nbsp; https://twitter.com/MovieTamil4/status/1762762767856279976 విభిన్న తరహాలో ప్రమోషన్స్! ‘SSMB29’ చిత్రం.. యాక్షన్‌ అండ్‌ అడ్వెంచర్‌ మూవీ కావడంతో కథకు తగినవిధంగా పాత్రలు, వాటి స్కెచ్‌లను ప్రస్తుతం రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. సెట్స్‌ డిజైన్‌ పైనా కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం. తన గత చిత్రాల తరహాలోనే విభిన్నమైన ప్రమోషన్స్‌ కోసం డైరెక్టర్‌ రాజమౌళి సినిమాకు సంబంధించిన థీమ్స్‌, లోగోలను సిద్ధం చేస్తున్నాడట. ఈ పనులన్నీ కొలిక్కి రావడానికి కాస్త సమయం పట్టే అవకాశం ఉందని అంటున్నారు.&nbsp; మహేశ్‌కు జక్కన్న కీలక సూచన! రాజమౌళితో చేయబోయే సినిమా కోసం ప్రస్తుతం మహేశ్‌ బాబు సిద్దమవుతున్నారు. యాక్షన్‌ అడ్వెంచర్ మూవీ కావడంతో దృఢంగా కనిపించేందుకు శారీరక కసరత్తులు సైతం చేస్తున్నాడు. అయితే ఈ సినిమాలో గడ్డం పెంచి, పొడవాటి జుట్టుతో మహేశ్ కనిపిస్తాడని టాక్‌. అయితే మహేశ్‌ లుక్‌ బయటకు రాకుండా రాజమౌళి ఇప్పటి నుంచే జాగ్రత్త పడుతున్నట్లు సమాచారం. సినిమా మెుదలయ్యేలోపు ప్రకటనలకు సంబంధించిన షూట్స్‌ ఉంటే పూర్తి చేసుకోవాలని మహేశ్‌కు జక్కన్న సూచించారట. త్వరలోనే మహేశ్‌ లుక్‌కు సంబంధించి టెక్నికల్‌ టీమ్‌తో వర్క్‌షాప్‌ మెుదలు కానుందని అంటున్నారు.&nbsp; షూట్‌ ప్రారంభం ఎప్పుడంటే? ‘SSMB29’ సినిమా షూట్‌ను తెలుగు సంవత్సరాది సందర్భంగా ఏప్రిల్‌ 9న అధికారికంగా ప్రారంభించాలని రాజమౌళి తొలుత భావించారట. అయితే మిగిలిన ప్రీ ప్రొడక్షన్‌ పనులకు ఇంకాస్త సమయం కావాల్సి రావడంతో మహేశ్‌ పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 9న స్టార్ట్‌ చేస్తారని సోషల్‌మీడియాలో టాక్‌ నడుస్తోంది. అయితే ఐదు నెలల సమయం అంటే ఎక్కువేనని సినీ వర్గాలు చెబుతున్నాయి. అంతకన్నా ముందే షూటింగ్‌ మొదలయ్యే అవకాశాలు ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.&nbsp; జాతీయ స్థాయిలో ప్రెస్‌మీట్‌! ‘SSMB29’ సినిమాకు సంబంధించి దర్శకధీరుడు రాజమౌళి ఇప్పటివరకూ అధికారికంగా ఒక్క అప్‌డేట్‌ కూడా ఇవ్వలేదు. గత చిత్రాల మాదిరిగానే దీనికి కూడా ప్రెస్‌మీట్‌ పెట్టి వివరాలు ప్రకటిస్తారా? లేదా? అన్న దానిపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. అయితే ఈసారి జక్కన్న కాస్త భారీగానే ప్లాన్‌ చేస్తున్నారని ఫీల్మ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ‘SSMB29’ సినిమాకు సంబంధించి జాతీయ స్థాయిలో ప్రెస్‌మీట్‌ ఉండబోతోందని సమాచారం. తెలుగుతో పాటు, జాతీయ మీడియాకు కూడా ఒకేసారి చెప్పేస్తే ఎలా ఉంటుందా? అని మూవీ టీమ్‌ ఆలోచిస్తోందట. అయితే ఇందులో ఎంతవరకూ నిజం ఉందనేది త్వరలోనే తెలియనుంది.&nbsp;
  ఫిబ్రవరి 28 , 2024
  Sanya Malhotra: దంగల్‌ బ్యూటీ సన్యా మల్హోత్రా హాట్‌ షో.. ఓ లుక్కేయండి!
  Sanya Malhotra: దంగల్‌ బ్యూటీ సన్యా మల్హోత్రా హాట్‌ షో.. ఓ లుక్కేయండి!
  బాలీవుడ్‌ బ్యూటీ సన్యా మల్హోత్రా (Sanya Malhotra) మరోమారు స్టన్నింగ్‌ సెల్ఫీతో సోషల్‌ మీడియాను తన వైపునకు తిప్పుకుంది.&nbsp; కర్లీ హెయిర్‌తో ఎద అందాలను చూపిస్తూ నెటిజన్లకు హాట్‌ ట్రీట్‌ ఇచ్చింది. టైట్‌ ఫిట్‌ జాకెట్‌తో చూపు తిప్పుకోనికుండా చేసింది.&nbsp; ఫిబ్రవరి 24, 1992లో పంజాబీ హిందూ కుటుంబంలో జన్మించిన సన్యా.. ఢిల్లీలో డ్యాన్సర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించింది.&nbsp; డ్యాన్స్‌ ఇండియా డ్యాన్స్‌ అనే రియాలిటీ షోలో పాల్గొని అందరి దృష్టిని ఆకర్షించింది. తన అద్భుతమైన నృత్యంతో న్యాయ నిర్ణేతల ప్రశంసలు అందుకుంది.&nbsp; ఆ తర్వాత ఢిల్లీ నుంచి ముంబయికి మకాం మార్చిన ఈ బ్యూటీ (Sanya Malhotra).. సినిమా అవకాశాల కోసం ఆడిషన్స్‌కు వెళ్లింది.&nbsp; ఆడిషన్స్‌లో పాల్గొన్న ప్రతీసారి సన్యా (Sanya Malhotra)కు నిరాశే ఎదురైంది. కానీ, పట్టుదలతో అమీర్‌ఖాన్‌ (Amir Khan) పక్కన నటించే అవకాశాన్ని దక్కించుకుంది.&nbsp; అమీర్‌ ఖాన్ బ్లాక్‌ బస్టర్‌ మూవీ 'దంగల్‌' (Dangal)తో అరంగేట్రం చేసి నటిగా అందరి దృష్టిని ఆకర్షించింది.&nbsp; ఆ తర్వాత సన్యాకు బాలీవుడ్‌లో వరుస అవకాశాలు క్యూ కట్టాయి. సీక్రెట్‌ సూపర్‌ స్టార్‌ (Secret Superstar), పటాకా (Pataakha), బదాయి హో (Badhaai Ho) సినిమాల్లో నటించింది.&nbsp; ఫొటోగ్రాఫ్‌ (Photograph), శకుంతలా దేవి (Shakuntala Devi), లూడో (Ludo), పగ్‌లైట్‌ (Pagglait), మీనాక్షి సుందరేశ్వర్‌ (Meenakshi Sundareshwar) చిత్రాల్లోనూ నటించి బాలీవుడ్‌లో స్థిరపడింది.&nbsp; తెలుగు చిత్రం హిట్‌కు రీమేక్‌గా వచ్చిన బాలీవుడ్‌ మూవీలో ఈ భామ (Sanya Malhotra) హీరోయిన్‌గా ఛాన్స్‌ దక్కించుకుంది.&nbsp; రాజ్‌కుమార్‌ రావు హీరోగా చేసిన ఈ మూవీకి శైలేష్‌ కొలను దర్శకత్వం వహించారు. ‘HIT: The First Case’ పేరుతో ఈ సినిమా విడుదలై హిట్‌ టాక్‌ తెచ్చుకుంది.&nbsp; షారుక్‌ ఖాన్‌ నటించిన 'జవాన్‌' (Jawan) సినిమాలోనూ సన్యా మల్హోత్రా (Sanya Malhotra) నటించింది. డా. ఈరమ్‌ పాత్రలో నటించి అందర్నీ ఆకట్టుకుంది.&nbsp; హిందీలో బయోగ్రఫికల్‌ వార్‌ డ్రామాగా వచ్చిన 'శామ్ బహదూర్‌' మూవీలోనూ ఈ భామ చేసింది. ఇందులో చక్కటి నటన కనబరిచి విమర్శకుల ప్రశంసలు అందుకుంది.&nbsp; ప్రస్తుతం సన్యా చేతిలో రెండు బాలీవుడ్‌ చిత్రాలు ఉన్నాయి. ఒకటి 'బేబీ జాన్' కాగా రెండోదానికి ఇంకా టైటిల్‌ ఫిక్స్ చేయలేదు.&nbsp; ఓవైపు వరుస సినిమాల్లో నటిస్తూనే ఈ బ్యూటీ (Sanya Malhotra) సోషల్‌ మీడియాలో చురుగ్గా వ్యవహరిస్తోంది. తన హాట్‌ ఫొటోలతో నెటిజన్లకు నిద్ర లేకుండా చేస్తోంది.&nbsp;
  ఫిబ్రవరి 13 , 2024
  Sana Javed: షోయాబ్‌ మాలిక్ కొత్త భార్య ‘సనా జావేద్’ ఎంత ఫేమస్సో తెలుసా?
  Sana Javed: షోయాబ్‌ మాలిక్ కొత్త భార్య ‘సనా జావేద్’ ఎంత ఫేమస్సో తెలుసా?
  పాక్‌ నటి ‘సనా జావేద్‌’ (Sana Javed)ను పాక్‌ మాజీ కెప్టెన్‌ షోయాబ్‌ మాలిక్‌ (Shoaib Malik) మూడో పెళ్లి చేసుకోవడంతో ప్రస్తుతం ఆమె పేరు మార్మోగుతోంది.&nbsp; భారత టెన్నిస్‌ దిగ్గజం సానియా మిర్జా (Sania Mirza)కు షోయాబ్‌ భర్త కాగా, వారిద్దరు విడాకులు తీసుకోబోతున్నట్లు గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది.&nbsp; ఈ క్రమంలోనే సనా జావేద్‌ను వివాహం చేసుకున్నట్లు షోయాబ్‌ ప్రకటించడంతో ఒక్కసారిగా ఆమె పేరు ట్రెండింగ్‌లోకి వచ్చింది. దీంతో ఆమె గురించి తెలుసుకునేందుకు తెగ సెర్చ్‌ చేస్తున్నారు. ‘సనా జావేద్‌’.. సౌదీ అరేబియాలోని జడ్డా ప్రాంతంలో మార్చి 24, 1993న జన్మించింది. మోడల్‌గా కెరీర్‌ను ప్రారంభించింది.&nbsp; ఈ క్రమంలోనే 2012లో పాక్‌ సీరియల్‌ 'మేరా పెహ్లా ప్యార్‌'తో నటిగా అరంగేట్రం చేసింది. అదే ఏడాది షెహర్‌-ఈ-జాత్‌ అనే టీవీ సిరీస్‌లోనూ ఆమె కనిపించింది. 2016లో ప్రముఖ సీరియల్‌ యాక్టర్‌ జాహిద్‌ అహ్మద్‌తో 'జరా యాద్‌ కర్‌' అనే టీవీ సిరీస్‌లో నటించి అందరి దృష్టిని ఆకర్షించింది. నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.&nbsp; దీంతో తర్వాతి ఏడాదే (2017) ఆమెకు పాక్‌ సినిమాలో అవకాశం దక్కింది. యంగ్‌ హీరో ధనిష్‌ తైమూర్ సరసన ‘మెహరునీసా ఐ లవ్‌ యూ’ (Mehrunisa V Lub U) అనే చిత్రంలో సనా హీరోయిన్‌గా ఛాన్స్‌ దక్కించుకుంది. అదే ఏడాది 'రంగ్‌రేజా' చిత్రంలో లీడ్‌ రోల్‌లో కనిపించి నటిగా పాక్‌ ఇండస్ట్రీలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది.&nbsp; 2020లో రంజాన్ సందర్భంగా ఏర్పాటు చేసిన 'జీతో పాకిస్తాన్‌ లీగ్‌' అనే రియాలిటీ షోలో డ్రాగన్స్‌ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించి సనా అందరి దృష్టిని ఆకర్షించింది. అదే ఏడాది సనా జావేద్‌కి వివాహమైంది. 2020 అక్టోబర్‌లో పాక్‌ సింగర్‌ ఉమైర్ జస్వాల్‌ను కరాచీలో పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుంది.&nbsp; అయితే వారి కాపురం ఎక్కువ రోజులు నిలబడలేదు. కొద్ది రోజులకే సనా, ఉమైర్‌ విడివిడిగా జీవించడం ప్రారంభించారు. తమ ఫోటోలను సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల నుంచి తొలగించారు. ఆ తర్వాత కొద్దిరోజుల పాటు ఒంటరిగానే జీవించిన సనా జావేద్‌.. ఆ తర్వాత పాక్‌ మాజీ కెప్టెన్‌ షోయాబ్‌ మాలిక్‌కు దగ్గరైంది. గతేడాది సనా బర్త్‌డేకు షోయాబ్‌ బహిరంగంగా విషెస్‌ చెప్పడంతో వారి బంధం తొలిసారి వెలుగు చూసింది.&nbsp; అప్పటి నుంచి వారి డేటింగ్‌కు సంబంధించిన వార్తలు తరచూ చక్కర్లు కొట్టాయి. తాజాగా పెళ్లి బంధంతో షోయాబ్‌, సనా ఒక్కటై ఆ వార్తలకు ముగింపు పలికారు. ఇక రీసెంట్‌గా ‘ఐ లవ్‌ యూ జారా’ (2023) అనే చిత్రంలో సనా జావేద్‌ నటించింది. ‘సుకూన్‌’ అనే సీరియల్‌లోనూ ఐనా పాత్రను పోషిస్తోంది.&nbsp; ప్రస్తుతం సనా.. ఏ చిత్రాలను ఒప్పుకోలేదు. పోస్ట్‌ ప్రొడక్షన్‌ దశలో ఉన్న 'మెహమ్మద్‌ ఏక్‌ సాజా' అనే సిరీయల్‌లో మాత్రం ఆమె నటిస్తోంది.&nbsp;
  జనవరి 20 , 2024
  Dhootha Review: జర్నలిస్టుగా నాగ చైతన్య అదుర్స్.. ‘ధూత’ సిరీస్ ఎలా ఉందంటే?
  Dhootha Review: జర్నలిస్టుగా నాగ చైతన్య అదుర్స్.. ‘ధూత’ సిరీస్ ఎలా ఉందంటే?
  నటీనటులు: అక్కినేని నాగ చైతన్య, ప్రియా భవానీ శంకర్, ప్రాచీ దేశాయ్, పార్వతి తిరువొతు, రవీంద్ర విజయ్, జయప్రకాశ్ తదితరులు రచన, దర్శకత్వం: విక్రమ్ కె కుమార్ ఛాయాగ్రహణం: మికొలాజ్ సైగుల సంగీతం: ఇషాన్ చబ్రా నిర్మాత: శరత్ మరార్&nbsp; ఓటీటీ వేదిక: అమెజాన్ ప్రైమ్ వీడియో ఎపిసోడ్స్‌: 8 విడుదల తేదీ: డిసెంబర్ 1, 2023&nbsp;&nbsp; సరికొత్త కథలతో సినిమాలను తెరకెక్కించడంలో డైరెక్టర్‌ విక్రమ్ కె కుమార్ శైలే వేరు. '13బి', 'ఇష్క్', 'మనం', '24' వంటి మెమరబుల్ ఫిల్మ్స్‌కు ఆయన దర్శకత్వం వహించారు. అటువంటి విక్రమ్‌ తొలిసారి దర్శకత్వం వహించిన వెబ్ సిరీస్ 'దూత'. ఇందులో అక్కినేని నాగ చైతన్య హీరోగా నటించడం విశేషం. '13బి' తర్వాత సూపర్ నేచురల్ జానర్ మరోసారి టచ్ చేశారు విక్రమ్ కె కుమార్. అతీంద్రియ శక్తుల నేపథ్యంలో ఆయన తీసిన 'దూత' ఎలా ఉంది? ఓటీటీ ప్రేక్షకులను మెప్పించిందా? ఈ రివ్యూలో చూద్దాం.&nbsp; కథ సాగర్ వర్మ (నాగ చైతన్య) జర్నలిస్ట్. కొత్తగా ప్రారంభమైన సమాచార్ దిన పత్రికకు చీఫ్ ఎడిటర్‌గా వ్యవహరిస్తుంటాడు. ఓ రోజు ధాబాలోకి వెళ్లిన సాగర్‌కు ఓ పేపర్ కటింగ్ కనిపిస్తుంది. అందులో రాసినట్టు కారుకు యాక్సిడెంట్ జరిగి పెంపుడు కుక్క మరణిస్తుంది. ఆ తర్వాత మరికొన్ని పేపర్ కటింగ్స్ సాగర్ వర్మ కంట పడతాయి. వాటిలో రాసినట్టుగా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. అందుకు కారణం ఏంటి? జరగబోయే ప్రమాదాన్ని ముందే పేపర్లలో రాస్తోంది ఎవరు? అతని ప్రయాణంలో భార్య ప్రియా (ప్రియా భవానీ శంకర్), పీఏ కమ్ జర్నలిస్ట్ అమృత (ప్రాచీ దేశాయ్), డీసీపీ క్రాంతి (పార్వతి తిరువొతు) పాత్రలు ఏమిటి? అనేది సిరీస్ చూసి తెలుసుకోవాల్సిందే.&nbsp; ఎవరెలా చేశారంటే గ్రే షేడ్స్ ఉన్న పాత్రలో నాగ చైతన్య అదరగొట్టాడు. తన లుక్స్‌, ఎక్స్‌ప్రెషన్స్‌తో సిరీస్‌ ఆసాంతం నాగచైతన్య ఇంప్రెస్‌ చేస్తాడు. అతడి తర్వాత ఆ స్థాయిలో ఆకట్టుకునేది పార్వతి తిరువొతు నటన. ఎస్పీ క్రాంతిగా ఆమె ఒదిగిపోయారు. సహజంగా నటించారు. కథలో ప్రాచీ దేశాయ్, ప్రియా భవానీ శంకర్ పాత్రలు పరిమితమే. కానీ, ఉన్నంతలో తమ ఉనికి చూపించారు. జయప్రకాశ్ తనకు అలవాటైన నటనతో అలరిస్తారు. రవీంద్ర విజయ్, చైతన్య, రోహిణి, ఈశ్వరీ రావు, అనీష్ కురువిల్లా, జీవన్ కుమార్, కామాక్షీ భాస్కర్ల తదితరులు తమ పాత్ర పరిధి మేరకు నటించారు. ఫ్లాష్ బ్యాక్‌లో వచ్చే సీన్లలో పశుపతి, తరుణ్ భాస్కర్, తనికెళ్ళ భరణి, రాజా గౌతమ్, సత్య కృష్ణన్ మెప్పించారు. ఓ సన్నివేశంలో బ్రహ్మానందం తనయుడు రాజా గౌతమ్ నటన ఆశ్చర్యపరుస్తుంది. డైరెక్షన్ ఎలా ఉందంటే? విక్రమ్‌ కె కుమార్‌ దర్శకత్వ నైపుణ్యాలు ఈ సిరీస్‌లోనూ కనిపిస్తాయి. దూత కథ ఏమిటనేది ఐదారు ఎపిసోడ్స్‌ తర్వాత గానీ క్లారిటీ రాదు. అయినప్పటికీ వీక్షకులకు ఎక్కడా బోర్‌ కొట్టకుండా సిరీస్‌ను నడిపించారు డైరెక్టర్‌. చిన్న చిన్న చమక్కులు, మెరుపులతో ఆసక్తి సన్నగిల్లకుండా చూశారు. ఇక మీడియాపైనా కొన్ని చమక్కులు పేల్చారు డైరెక్టర్‌. రాజకీయ నాయకుల చేతిలో జర్నలిస్టులు పావులుగా మారుతున్న తీరును ఆయన చక్కగా చూపించారు. జర్నలిజంతో పాటు రాజీకయం, పోలీసు వ్యవస్థల్లోనే మంచి, చెడులను కళ్లకు కట్టారు. అయితే ఒక్కో ఎపిసోడ్‌ 40-50 నిమిషాల మధ్య ఉండటం వల్ల డైరెక్టర్‌ కథను సాగదీసిన ఫీలింగ్ కల్గుతుంది. ఓవరాల్‌గా విక్రమ్‌ కె కుమార్‌ డైరెక్షన్‌కు మంచి మార్కులే పడ్డాయి.&nbsp; సాంకేతికంగా సాంకేతిక అంశాల పరంగా 'దూత' సిరీస్‌ ఉన్నత స్థాయిలో ఉంది. మికొలాజ్ సైగుల సినిమాటోగ్రఫీ పనితనం మెప్పిస్తుంది. సన్నివేశాలను చిత్రీకరించిన తీరు బాగుంది. ముఖ్యంగా వర్షంలో సన్నివేశాలను ఆయన బాగా తీశారు. అటు నేపథ్య సంగీతం కూడా మెప్పిస్తుంది. చెవులకు ఇబ్బంది కలిగించే శబ్దాలు లేవు. కథతో పాటు ఆర్ఆర్ ట్రావెల్ చేసింది. నిర్మాణ విలువలు సైతం బావున్నాయి. ప్లస్‌ పాయింట్స్‌ నాగ చైతన్య నటనసస్పెన్స్‌ &amp; క్యూరియాసిటీనేపథ్య సంగీతం మైనస్‌ పాయింట్స్‌ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌సాగదీత సీన్లు రేటింగ్‌: 3.5/5
  డిసెంబర్ 01 , 2023
  Aadikeshava Review: యాక్షన్‌ సీన్లలో రుద్రతాండవం చేసిన మెగా మేనల్లుడు.. ‘ఆదికేశవ’ ఎలా ఉందంటే?
  Aadikeshava Review: యాక్షన్‌ సీన్లలో రుద్రతాండవం చేసిన మెగా మేనల్లుడు.. ‘ఆదికేశవ’ ఎలా ఉందంటే?
  నటీనటులు: పంజా వైష్ణవ్ తేజ్, శ్రీలీల, జోజు జార్జ్, సదా, సుదర్శన్, రాధికా శరత్ కుమార్, జయప్రకాశ్, తనికెళ్ళ భరణి, సుమన్, అపర్ణా దాస్ తదితరులు&nbsp;&nbsp; రచన - దర్శకత్వం: శ్రీకాంత్ ఎన్. రెడ్డి సినిమాటోగ్రఫీ: డడ్లీ&nbsp; సంగీతం: జీవీ ప్రకాష్ కుమార్ నిర్మాణ సంస్థలు: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య విడుదల తేదీ: నవంబర్ 24, 2023&nbsp;&nbsp; మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్‌ తేజ్‌ తన తొలి సినిమా ‘ఉప్పెన’ (Uppen Movie)తో బ్లాక్‌బాస్టర్‌ హిట్‌ అందుకున్నాడు. అయితే ఆ తర్వాత చేసిన చిత్రాలు ఆ స్థాయిలో విజయం సాధించలేదు. దీంతో తాజాగా నటించిన 'ఆదికేశవ' మూవీపై వైష్ణవ్‌ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. గత సినిమాలకు భిన్నంగా ఇందులో మాస్‌ లుక్‌లో వైష్ణవ్‌ కనిపించాడు. మరి, 'ఆదికేశవ'తో ఆయన విజయం అందుకున్నారా? లేదా?. వైష్ణవ్‌-శ్రీలీల జోడీ ప్రేక్షకులను మెప్పించిందా? లేదా?. ఈ రివ్యూలో తెలుసుకుందాం.&nbsp; కథ బాలు (వైష్ణవ్‌ తేజ్‌) తల్లిచాటు బిడ్డగా గారాబంగా పెరుగుతాడు. కానీ, కళ్లముందు అన్యాయం జరిగితే అసలు సహించడు. ఎంతటివాళ్లనైనా ఎదిరించే మనస్తత్వం అతడిది. తల్లిదండ్రుల బలవంతంతో కాస్మోటిక్‌ కంపెనీలో ఉద్యోగానికి చేరతాడు. కంపెనీ సీఈవో చిత్రావతి(శ్రీలీల)తో ప్రేమలో పడతాడు. ఈ క్రమంలో రాయలసీమలోని బ్రహ్మసముద్రం ప్రాంతం నుంచి వచ్చిన ఓ పెద్దాయన బాలుకు అసలైన కుటుంబం వేరే ఉందని చెబుతాడు. అతడి అసలు పేరు రుద్ర కాళేశ్వర్‌రెడ్డి అని తెలియజేస్తాడు. ఇంతకీ బాలు ఎవరు? బ్రహ్మ సముద్రం వెళ్లాక అక్కడ ఏం జరిగింది? ఆ ప్రాంతంలో అరాచకాలు సృష్టిస్తున్న చెంగారెడ్డి (జోజు జార్జ్‌)ని ఎలా ఎదుర్కొన్నాడు? అన్నది కథ. ఇది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.&nbsp; ఎలా సాగిందంటే ప్రథమార్థం మెుత్తం సరదా సరదాగా కాలక్షేపంగా సాగిపోతుంది. హైదరాబాద్‌లో స్నేహం, ప్రేమ, కుటుంబ సన్నివేశాలు కనిపిస్తాయి. విరామం సమయానికి కథ మలుపు తిరుగుతుంది. ద్వితీయార్థం కథంతా సీమలో చెంగారెడ్డితో ఢీ కొట్టడంతో సాగిపోతుంది. హీరో హీరోయిన్‌ కలవగానే ఓ పాట, విలన్‌ హీరో ఎదురుపడగానే ఓ ఫైట్‌ అన్నట్లు సినిమా సాగిపోతుంది.&nbsp; ఎవరెలా చేశారంటే వైష్ణవ్‌తేజ్‌ మరోమారు మంచి నటుడిగా నిరూపించుకున్నాడు. ప్రథమార్థంలో లవర్‌ బాయ్‌గా సరదాగా ఉండే పాత్రలో ఆకట్టుకున్నాడు. ద్వితీయార్థంలో రుద్రకాళేశ్వర్‌రెడ్డిగా వీరోచితాన్ని ప్రదర్శించాడు. తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. ఇక శ్రీలీలకు నటన పరంగా పెద్దగా స్కోప్‌ లేదు. కానీ డ్యాన్సుల్లో మాత్రం ఎప్పటిలాగే ఇరగదీసింది. హీరో తల్లి పాత్రలో రాధిక మెప్పించారు. విలన్‌గా జోజు జార్జ్‌ క్రూరంగా కనిపించినా ఆ పాత్ర ప్రభావం తక్కువే. ఇక అపర్ణాదాస్‌, సుమన్‌, తనికెళ్ల భరణి తదితరులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు. సుదర్శన్‌ అక్కడక్కడా నవ్వించాడు డైరెక్షన్‌ ఎలా ఉందంటే? కథలో ప్రేమ, కుటుంబ బంధాలు, డ్రామా, రాజకీయం తదితర అంశాలు పుష్కలంగా ఉన్నా వాటిని సమర్థవంతంగా తెరకెక్కించడంలో డైరెక్టర్‌ శ్రీకాంత్‌ ఎన్‌. రెడ్డి తడబడ్డాడు. ఒకట్రెండు మలుపులు తప్ప కథలో కానీ, కథనంలో కానీ కొత్తదనమేమీ కనిపించదు. పాత రోజుల్లో వచ్చిన ఫ్యాక్షన్‌ సినిమాల్లాగే డైరెక్టర్‌ కథను చెప్పినట్లు అనిపిస్తుంది. భావోద్వేగాలతో కట్టిపడేసే సీన్లు, తర్వాత ఏం జరుగుతుందన్న ఆసక్తి ఎక్కడా కనిపించదు. రచనలో బలం లేకపోయిన దర్శకుడి మేకింగ్‌ మాత్రం బాగుంది.&nbsp; టెక్నికల్‌గా&nbsp; సాంకేతికంగా సినిమాకు మంచి మార్కులే పడ్డాయి. డడ్లీ కెమెరా పనితనం ఆకట్టుకుంటుంది. జీవీ ప్రకాశ్‌ పాటలు గుర్తుపెట్టుకునేలా లేవు. కానీ, నేపథ్యం సంగీతం బాగుంది. సినిమాకు సంబంధించిన మిగతా విభాగాలు అన్నీ మంచి పనితీరునే కనబరిచాయి. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.&nbsp; ప్లస్‌ పాయింట్స్‌ వైష్ణవ్‌తేజ్‌ నటనమలుపులునేపథ్య సంగీతం మైనస్‌ పాయింట్స్‌ రొటీన్‌ కథ, కథనంపండని భావోద్వేగాలు&nbsp; రేటింగ్‌: 2.5/5
  నవంబర్ 24 , 2023
  Kotabommali PS Review: పోలీసుల కష్టాలను కళ్లకు కట్టిన ‘కోట బొమ్మాళి’... సినిమా హిట్టా? ఫట్టా?
  Kotabommali PS Review: పోలీసుల కష్టాలను కళ్లకు కట్టిన ‘కోట బొమ్మాళి’... సినిమా హిట్టా? ఫట్టా?
  నటీనటులు:&nbsp; శ్రీకాంత్‌, వరలక్ష్మీ శరత్‌కుమార్‌, రాహుల్‌ విజయ్‌, శివానీ రాజశేఖర్‌, మురళి శర్మ, బెనర్జీ, ప్రవీణ్‌ తదితరులు దర్శకత్వం: తేజ మర్నీ సంగీతం: రంజిన్‌ రాజ్‌, మిధున్‌ ముకుందన్ సినిమాటోగ్రఫీ: జగదీష్‌ చీకటి&nbsp; నిర్మాణ సంస్థ: గీతా ఆర్ట్స్‌ నిర్మాతలు: బన్నీ వాసు,&nbsp; విద్యా&nbsp; విడుదల తేదీ: నవంబర్‌ 24, 2023 ప్రముఖ నటుడు శ్రీకాంత్‌ (Srikanth) ఫ్యామిలీ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సెకండ్‌ ఇన్నింగ్స్‌లోనూ వరుస సినిమాలతో అలరిస్తున్నారు. వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఆయన కీలకపాత్రలో నటించిన చిత్రం ‘కోట బొమ్మాళి పి.ఎస్‌’ (Kotabommali PS). తేజ మార్ని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రాహుల్‌ విజయ్‌, శివానీ రాజశేఖర్‌ (Shivani) ప్రధాన పాత్రలు పోషించారు. మలయాళంలో నేషనల్‌ అవార్డు అందుకున్న 'నయట్టు'కు రీమేక్‌గా ఈ మూవీగా తెరకెక్కింది. మరి తెలుగులోనూ ఈ చిత్రం మెప్పించిందా? శ్రీకాంత్‌ ఖాతాలో మరో హిట్‌ చేరిందా? శివానీ రాజశేఖర్‌ తొలి సక్సెస్‌ను అందుకుందా? ఇప్పుడు చూద్దాం.&nbsp; కథ కోట బొమ్మాళి పోలీసు స్టేషన్‌లో పని చేసే ముగ్గురు కానిస్టేబుళ్లు (శ్రీకాంత్‌, శివానీ, రాహుల్‌ విజయ్‌) చేయని తప్పుకు ఓ కేసులో ఇరుక్కుంటారు. పోలీసు ఉన్నాతాధికారులు, రాజకీయ నాయకులు చేసిన వికృత చర్యలకు బలై అజ్ఞాతంలోకి పారిపోతారు. వీరిని పట్టుకునేందుకు ప్రభుత్వం పోలీసు ఆఫీసర్‌ వరలక్ష్మీని రంగంలోకి దింపుతుంది. దీంతో పోలీసులే పోలీసులను ఛేజ్‌ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ఈ పరిస్థితి ఎందుకు తలెత్తింది? వరలక్ష్మీ నుంచి తప్పించుకోవడానికి శ్రీకాంత్‌, విజయ్‌, శివానీ ఏం చేశారు? చివరికి వారు పట్టుబడ్డారా లేదా? అన్నది కథ. ఎవరెలా చేశారంటే శ్రీకాంత్ అద్భుత నటన కనిబరిచాడు. చాలా రోజుల తర్వాత ఒక డెప్త్‌ ఉన్న పాత్రను పోషించాడు. అటు రాహుల్‌ విజయ్‌, శివాని రాజశేఖర్‌, వరలక్ష్మీ శరత్‌కుమార్‌లు కూడా తమ నటనలతో పాత్రలకు ప్రాణం పోశారు.&nbsp; మురళీ శర్మ యాక్టింగ్‌ కూడా సినిమాకు బాగా ప్లస్‌ అయ్యింది. మిగతా ఆర్టిస్టులు తమ పాత్ర పరిధి మేరకు నటించారు.&nbsp; డైరెక్షన్ ఎలా ఉందంటే పోలీసులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యను డైరెక్టర్‌ తేజ మర్నీ చిత్ర కథాంశంగా ఎంచుకోవడం నిజంగా ప్రశంసనీయం. పోలీసుల కుటుంబాలకు ఉండే ఇబ్బందులను ఆయన చక్కగా చూపించారు. పొలిషియన్స్‌ చేతుల్లో పోలీసులు ఎలా నలిగిపోతారో కూడా చక్కగా తెరకెక్కించారు. అయితే సినిమాలో ఆధ్యంతం ఛేజింగ్‌ ఉండటం వల్ల కాస్త బోరింగ్‌ ఫీల్‌ అవుతారు. కథ బాగున్నప్పటికీ స్క్రీన్‌ప్లే విషయంలో డైరెక్టర్‌ కాస్త జాగ్రత్త పడాల్సింది. కొన్ని సీన్లు మరి సాగదీతగా అనిపిస్తాయి. వాటిని కాస్త ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది. ఓవరాల్‌గా డైరెక్టర్‌ పని తీరును మెచ్చుకోవాల్సిందే.&nbsp; టెక్నికల్‌గా&nbsp; టెక్నికల్‌ అంశాల విషయానికి వస్తే రంజన్‌ రాజ్‌ ఇచ్చిన మ్యూజిక్‌ చాలా బాగుంది. ముఖ్యంగా ‘లింగిడి లింగిడి’ పాటకు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. అలాగే నేపథ్య సంగీతం మూవీకి చాలా ప్లస్‌ అయ్యింది. అటు జగదీష్‌ కెమెరా పనితనం ఆకట్టుకుంటుంది. ఎడిటర్‌ తన కత్తెరకు కాస్త పని చెప్పి ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు కూడా అద్భుతంగా ఉన్నాయి.&nbsp; ప్లస్‌ పాయింట్స్‌ కథప్రధాన పాత్రల నటనసంగీతం మైనస్‌ పాయింట్స్‌ స్క్రీన్ ప్లేబోరింగ్ సీన్లు రేటింగ్‌: 3/5
  నవంబర్ 24 , 2023
  Parineeti Chopra Wedding: పెళ్లి బంధంతో ఒక్కటైన రాఘవ్-పరిణీతి.. వీరి గురించి ఈ సీక్రెట్స్‌ తెలుసా?
  Parineeti Chopra Wedding: పెళ్లి బంధంతో ఒక్కటైన రాఘవ్-పరిణీతి.. వీరి గురించి ఈ సీక్రెట్స్‌ తెలుసా?
  ప్రముఖ బాలీవుడ్‌ నటి పరిణీతి చోప్రా (Parineeti Chopra), ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఎంపీ రాఘవ్ చద్ధా (Raghav Chadha) వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఆదివారం (సెప్టెంబర్‌ 24) సా. 6.30 గంటలకు ఈ జంట బంధు మిత్రుల సమక్షంలో ఘనంగా పెళ్లి చేసుకుంది.&nbsp; వీరి పెళ్లికి రాజస్థాన్‌ ఉదయపూర్‌లోని లీలా ప్యాలెస్ వేదికైంది. వెడ్డింగ్‌ కోసం అత్యంత ఖరీదైన మహారాజా సూట్‌ను కూడా బుక్‌ చేశారు. అయితే కొద్దిమంది అతిథుల సమక్షంలోనే పరిణీతి, రాఘవ్‌ చద్దా వివాహం జరగడం గమనార్హం.&nbsp; ఈ వివాహనికి ముఖ్య అతిథులుగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌లు హాజరైనట్లు తెలిసింది. వీరితో పాటు సానియా మీర్జా, మనీష్ మల్హోత్రా వంటి సెలెబ్రీస్ కూడా వివాహ వేదికపై సందడి చేశారు. అయితే పరిణితీ చోప్రా అక్క ప్రియాంక చోప్రా ఈ పెళ్లికి హాజరు కాకపోవడం హాట్ టాపిక్‌గా మారింది. ఇక పరిణీతి చోప్రా, ఎంపీ రాఘవ్ చద్దా బంధం విషయానికి వస్తే వారిది ప్రేమ వివాహం అన్నది అందరికి తెలిసిందే. అయితే వీరి మధ్య ప్రేమ లండన్‌లో చిగురించిందట. కొన్నాళ్లు ప్రేమించుకున్న ఈ జంట ఇప్పుడు పెళ్లి బంధంతో ఒకటి అయ్యింది. ఇక వీరి ఏంగేజ్ మెంట్ మే 13న ఢిల్లీలో ఘనంగా జరిగింది. దీనికి సంబంధించిన పిక్స్ అప్పట్లో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ఒకరు రాజకీయ నాయకులు, మరొకరు బాలీవుడ్ నటి కావడంతో ఇరు రంగాలకు చెందిన ప్రముఖులు కూడా నిశ్చితార్థ వేడుకకు హాజరయ్యారు. పరిణీతి ఎంగేజ్‌మెంట్ కోసం ఆమె కజిన్ ప్రియాంక చోప్రా కూడా లండన్‌ నుంచి ఇండియాకు వచ్చారు. తన కూతురుతో కలిసి సిస్టర్ ఎంగేజ్‌మెంట్‌లో హ్యాపీగా గడిపారు. ప్రియాంకచోప్రాతో పాటు పరిణీతి ఫ్రెండ్స్, బాలీవుడ్ తారలు కూడా హాజరయ్యారు. తాజాగా పెళ్లి తంతు కూడా పూర్తి అవ్వడంతో ఫ్యాన్స్‌తో పాటు సెలెబ్రిటీస్ కూడా ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇప్పటికే కొందరు సన్నిహితులు సోషల్ మీడియా ద్వారా స్టార్ కపుల్‌కి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.&nbsp; ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. పరిణీతి, రాఘవ్‌ వివాహ ఫొటోలను షేర్‌ చేసి వారికి శుభాకాంక్షలు తెలిపారు. అటు ప్రియాంక చోప్రా సైతం తన బ్లెస్సింగ్స్‌ ఈ జంటకు ఎప్పుడూ ఉంటాయని ఇన్‌స్టాలో పోస్టు చేసింది. అటు మలైక అరోరా, సానియా మిర్జా, మనీష్‌ మల్హోత్రా సహా పలువురు ప్రముఖులు సోషల్‌ మీడియా వేదికగా తమ అభినందనలు తెలియజేశారు. రాఘవ్ చద్దా ఆమ్ ఆద్మీ పార్టీ యువ నాయకుడిగా గుర్తింపు పొందారు. ఇక పరిణితీ చోప్రా హిందీలో పలు విజయవంతమైన చిత్రాల్లో నటించి పాపులర్ అయ్యారు. పరిణితీ చోప్రా ఆస్తుల విషయానికి వస్తే.. ఓ వెబ్ సైట్ ప్రకారం ఆమె నికర ఎసెట్స్ విలువ దాదాపు రూ.60 కోట్లు ఉన్నట్లు టాక్. ఇప్పటికీ అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణుల్లో పరిణీతి చోప్రా ఒకరు.&nbsp;
  సెప్టెంబర్ 25 , 2023
  <strong>నాగ శౌర్య(Naga Shaurya) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్</strong>
  నాగ శౌర్య(Naga Shaurya) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
  ఛలో సినిమా విజయంతో లవర్‌ బాయ్‌గా పేరు తెచ్చుకున్న నాగ శౌర్య.. తక్కువ కాలంలోనే యూత్‌లో క్రేజ్ సంపాందించుకున్నాడు. ఊహలు గుసగుసలాడే, వరుడుకావలెను ఖుషి వంటి&nbsp; హిట్ సినిమాలతో ఫ్యామిలీ ఆడియన్స్‌కు దగ్గరయ్యాడు. ప్రస్తుతం యంగ్ టాలెంటెడ్ హీరోల్లో ఒకడిగా కొనసాగుతున్న నాగ శౌర్య గురించి కొన్ని ఆసక్తికరమైన సంగతులు మీకోసం నాగ శౌర్య అసలు పేరు? నాగశౌర్య ముల్పూరి నాగ శౌర్య ఎత్తు ఎంత? 5 అడుగుల 9 అంగుళాలు నాగ శౌర్య తొలి సినిమా? క్రికెట్ గర్స్ అండ్ బీర్(2011) చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. నాగశౌర్యకు వివాహం అయిందా? 2022 నవంబర్ 20న తన ప్రియురాలు అనూష శెట్టితో వివాహం జరిగింది.&nbsp; నాగ శౌర్య ఫస్ట్ క్రష్ ఎవరు? ఐశ్వర్య రాయ్ నాగ శౌర్యకు ఇష్టమైన సినిమా? టైటానిక్ చిత్రం తన ఫెవరెట్ చిత్రంగా నాగశౌర్య చెప్పాడు. నాగ శౌర్య ఇష్టమైన హీరో? తమిళ్ హీరో సూర్య నాగ శౌర్య తొలి బ్లాక్ బాస్టర్ హిట్? నాగ శౌర్య, రష్మిక మంధానతో కలిసి నటించిన చిత్రం ఛలో సూపర్ హిట్‌గా నిలిచింది. ఊహలు గుసగుసలాడే చిత్రం కూడా మంచి హిట్ అందుకుంది. నాగశౌర్యకు ఇష్టమైన కలర్? నీలం రంగు నాగ శౌర్య పుట్టిన తేదీ? 1989 జనవరి 14న ఏలూరులో జన్మించారు. నాగశౌర్య తల్లిదండ్రుల పేర్లు? శంకర్ ప్రసాద్, ఉషా ప్రసాద్ నాగశౌర్యకు ఇష్టమైన ప్రదేశం? హైదరాబాద్ నాగ శౌర్య ఏం చదివాడు? బ్యాచ్‌లర్ ఆఫ్ కామర్స్(Bcom) https://www.youtube.com/watch?v=GU7EJFAPxCI నాగ శౌర్యకు ఎన్ని అవార్డులు వచ్చాయి? చెప్పుకోదగ్గ అవార్డులు ఏమి రాలేదు నాగ శౌర్య ఎన్ని సినిమాల్లో నటించాడు? నాగ శౌర్య 2024 వరకు 24 సినిమాల్లో నటించాడు.&nbsp; నాగశౌర్యకు ఇష్టమైన ఆహారం? పెరుగు వడ నాగశౌర్య ముద్దుపేరు? నాని నాగ శౌర్యకు ఇష్టమైన హీరోయిన్? అనుష్క శెట్టి
  మార్చి 21 , 2024
  Animal OTT: యానిమల్‌ ఓటీటీ వెర్షన్‌లో ఆ సీన్లు లేకపోవడమే రచ్చకు కారణమైందా?
  Animal OTT: యానిమల్‌ ఓటీటీ వెర్షన్‌లో ఆ సీన్లు లేకపోవడమే రచ్చకు కారణమైందా?
  ఓటీటీ ప్రేక్షకులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న 'యానిమల్' (Animal) చిత్రం ఎట్టకేలకు స్ట్రీమింగ్‌లోకి వచ్చేసింది. రిపబ్లిక్ డే నుంచి నెట్‌ఫ్లిక్స్‌ (#AnimalOnNetflix)లో ప్రసారం అవుతోంది. తెలుగుతో పాటు హిందీ, దక్షిణాది భాషల్లో శుక్రవారం (జనవరి 26న) అందుబాటులోకి వచ్చింది. సినిమా బాగుందా? బాగాలేదా? అన్న విషయాన్ని పక్కన పెడితే ఓ విషయంలో మాత్రం ఓటీటీ ప్రేక్షకులు ‘యానిమల్‌’పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గత కొన్నాళ్లుగా చెప్పుకుంటూ వచ్చిన విషయాన్ని చిత్ర యూనిట్‌ పక్కన పెట్టేయడంపై డిసప్పాయింట్ అవుతున్నారు. ఆ మేటర్ ఏంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; అసంతృప్తికి కారణమదే! యానిమల్‌ ప్రమోషన్స్ సందర్భంగా సినిమా గురించి ఎన్నో విషయాలు చెప్పిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga).. థియేటర్లలో 3 గంటల 21 నిమిషాల మూవీ కాకుండా మరిన్ని సీన్లు ఉన్నాయని చెప్పాడు. ఈ క్రమంలోనే ఓటీటీలోకి ఎడిట్ చేసిన సన్నివేశాలు కూడా జోడిస్తామని తెగ ఊరించారు. దీంతో యానిమల్ ఓటీటీ వెర్షన్‌పై అందర్లో చెప్పలేనంత క్యూరియాసిటీ పెరిగింది. థియేటర్‌లో సినిమా చూసిన వారు సైతం అదనపు సీన్లు జోడిస్తుండంతో ఓటీటీ వెర్షన్‌పై ఆసక్తి పెంచుకున్నారు. తీరా చూస్తే థియేటర్లలో చూసిన సినిమా కట్‌నే ఓటీటీలోనూ రిలీజ్ చేశారు. దీంతో అదనపు సన్నివేశాలు ఉంటాయని భావించిన వారంతా చాలా డిసప్పాయింట్ అవుతున్నారు.&nbsp; నెటిజన్ల మండిపాటు డైరెక్టర్‌ సందీప్‌ చెప్పినట్లు 8 నిమిషాల సీన్లను కాకుండా కేవలం 3 నిమిషాల అదనపు సీన్లను మాత్రమే ఓటీటీ వెర్షన్‌లో యాడ్‌ చేసినట్లు తెలుస్తోంది. యానిమల్‌ థియేటర్‌ వెర్షన్‌ నిడివి 3 గంటల 21 నిమిషాలు. అదే ఓటీటీ వెర్షన్‌ తీసుకుంటే 3 గంటల 24 నిమిషాలుగా ఉంది. దీని ప్రకారం కేవలం మూడు సీన్లను మాత్రమే ఓటీటీలో వెర్షన్‌లో యాడ్‌ చేశారని వీక్షకులు అంటున్నారు. ట్విటర్‌ (ఎక్స్‌)లో #Animal హ్యాష్‌ట్యాగ్‌ పేరుతో తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అదనపు సీన్లు కూడా పట్టి పట్టి చూస్తే కానీ గుర్తించలేమని అంటున్నారు. కొత్త సీన్లను ఎక్స్‌పెక్ట్‌ చేసిన తమకు తీవ్ర నిరాశే ఎదురైందని పేర్కొంటున్నారు. మెుత్తంగా యానిమల్‌ వ్యవహారంపై కొందరు క్రేజీగా కామెంట్స్‌ చేస్తుంటే మరికొందరు మూవీ యూనిట్‌ తమను మోసం చేసిందని తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. కోరుకున్న సీన్లు అవేనా! యానిమల్‌ ఓటీటీ వెర్షన్‌లో తాము ఏ సీన్లను కోరుకున్నామో కొందరు నెటిజన్లు ట్విటర్‌ (ఎక్స్‌) వేదికగా స్పష్టం చేశారు. ఫ్లైట్‌లో హీరో, హీరోయిన్ల మధ్య జరిగే రొమాన్స్‌, రణ్‌బీర్‌ - త్రిప్తి దిమ్రితో శారీరకంగా కలిసే సన్నివేశాలకు అదనపు సీన్లను జత చేసి మరింత బోల్డ్‌గా చూపిస్తారని ఆశించినట్లు పోస్టులు పెట్టారు. మరికొందరు ఆ పోస్టులను లైక్‌ చేయడం ద్వారా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇంకొందరు నెటిజన్లు యాక్షన్‌ సీన్స్‌లో మరింత వైలెంట్‌ ఎక్స్‌పెక్ట్‌ చేసినట్లు చెప్పారు. సెన్సార్‌ బోర్డు ప్రేక్షకులకు చూపించకుండా కట్‌ చేసిన రొమాన్స్‌, వైలెన్స్‌ సీన్లు అన్ని ఓటీటీలో ఉంటాయని భావించి భంగపడినట్లు కామెంట్స్‌ చేశారు. https://twitter.com/MaayonTweetz_/status/1750863511738265790 మరోవైపు ప్రశంసలు కూడా! ఇదిలా ఉంటే మెుదటిసారి యానిమల్‌ చిత్రాన్ని చూసినవారు మాత్రం సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. రన్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor) నటన అద్భుతమంటూ కొనియాడుతున్నారు. డైరెక్టర్‌ సందీప్‌ వంగా టేకింగ్‌, స్క్రీన్‌ప్లే చాలా బాగుందని ప్రశంసిస్తున్నారు. యాక్షన్‌ సన్నివేశాలను, హీరోయిజాన్ని ఆయన చక్కగా ఎలివేట్‌ చేశారని కొనియాడుతున్నారు. అంతేకాకుండా యానిమల్‌ చిత్రంలోని హైలెట్‌ సీన్లను తమ ఎక్స్‌ ఖాతాల ద్వారా షేర్‌ చేస్తున్నారు. ప్రస్తుతం ఆ పోస్టులు కూడా #Animal హ్యాష్‌ట్యాగ్‌తో ట్విటర్‌లో ట్రెండ్ అవుతున్నాయి.&nbsp; https://twitter.com/i/status/1751101072092127579 బాక్సాఫీసుపై కాసుల వర్షం! డిసెంబర్‌ 1న విడుదలైన యానిమల్‌ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఈ చిత్రం డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగాకు బాలీవుడ్‌లో రెండోది. ఆయన మెుదటి చిత్రం కబీర్‌ సింగ్‌ (Kabir Singh). యానిమల్‌ వరల్డ్‌వైడ్‌గా రూ.900 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఇందులో రణ్‌బీర్‌ కపూర్‌కు జోడీగా రష్మిక మందన్న (Rashmika Mandanna) నటించింది. తన అద్భుతమైన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అటు తండ్రి పాత్రలో అనిల్‌ కపూర్‌ జీవించారు. చిత్ర విజయంలో తన వంతు పాత్ర పోషించారు.&nbsp; https://twitter.com/i/status/1751124216349638941
  జనవరి 27 , 2024
  This Week OTT Releases: ఈ వారం థియేటర్, ఓటీటీల్లో సందడి చేసే చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే!
  This Week OTT Releases: ఈ వారం థియేటర్, ఓటీటీల్లో సందడి చేసే చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే!
  ఎప్పటిలాగే ఈ వారం కూడా ప్రేక్షకులను అలరించేందుకు పలు చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు సిద్ధమయ్యాయి. నవంబర్ ఆఖరి వారంలో ప్రేక్షకులకు ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇచ్చేందుకు థియేటర్లలోకి రాబోతున్నాయి. అలాగే ఓటీటీలోనూ పలు చిత్రాలు, కొత్త వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్‌ కానున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; ఆదికేశవ మెగా హీరో వైష్ణవ్‌ తేజ్‌ (Vaishnav Tej), శ్రీలీల (Sreeleela) జంటగా నటించిన చిత్రం ‘ఆదికేశవ’ (Aadikeshava). శ్రీకాంత్‌ ఎన్‌.రెడ్డి దర్శకత్వం వహించారు. నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా నవంబరు 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘మాస్‌ యాక్షన్‌ కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు చిత్ర యూనిట్‌ తెలిపింది. కోట బొమ్మాళి పి.ఎస్‌ ప్రముఖ నటుడు శ్రీకాంత్‌ కీలకపాత్రలో నటించిన చిత్రం ‘కోట బొమ్మాళి పి.ఎస్‌’ (Kota bommali PS). వరలక్ష్మి శరత్‌కుమార్‌ (Varalaxmi Sarathkumar), రాహుల్‌ విజయ్‌, శివాని రాజశేఖర్‌ (Shivani Rajashekar) ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. తేజ మార్ని దర్శకుడు. బన్నీ వాస్‌, విద్యా కొప్పినీడి నిర్మించారు. నవంబరు 24న ఈ చిత్రం థియేటర్స్‌లో విడుదల కానుంది. ఇక ఇందులోని ‘లింగి లింగి లింగిడి’ (Lingi Lingi Lingidi) పాటకు శ్రోతల నుంచి మంచి ఆదరణ లభించిన సంగతి తెలిసిందే. ధృవ నక్షత్రం విక్రమ్‌ (Vikram) హీరోగా గౌతమ్‌ వాసుదేవ్‌ మేనన్‌ (Gautham Vasudev Menon) దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘ధృవ నక్షత్రం’ (Dhruva Natchathiram). స్పై, యాక్షన్‌ థ్రిల్లర్‌ కథాంశంతో ఈ మూవీ తెరకెక్కింది. 2016లోనే ఈ సినిమా పట్టాలెక్కగా.. 2017లో విడుదల చేయాలని చిత్ర బృందం భావించింది. చిత్రీకరణ పూర్తయినప్పటికీ అనుకోని కారణాలతో వాయిదా పడింది. దాదాపు ఆరేళ్ల తర్వాత ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకొస్తోంది. పర్‌ఫ్యూమ్‌ జేడీ స్వామి దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘పర్‌ఫ్యూమ్‌’ (Perfume). చేనాగ్‌, ప్రాచీ థాకర్‌ జంటగా నటించారు. జె.సుధాకర్‌, శివ.బి, రాజీవ్‌ కుమార్‌.బి, లావురి శ్రీనివాస్‌, రాజేంద్ర కనుకుంట్ల, శ్రీధర్‌ అక్కినేని కలిసి నిర్మించారు. స్మెల్‌ బేస్డ్‌ థ్రిల్లింగ్‌ కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ సినిమాని ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. మాధవే మధుసూదన ‘మాధవే మధుసూదన’ (Madhave Madhusudana) చిత్రం కూడా ఈ వారమే రిలీజ్ కానుంది. 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో తేజ్‌ బొమ్మదేవర, రిషిక లోక్రే జంటగా నటించారు. బొమ్మదేవర రామచంద్రరావు స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. జయప్రకాష్‌, సుమన్‌ కీలక పాత్రలు పోషించారు. ఓటీటీలో స్ట్రీమింగ్‌కానున్న చిత్రాలు/వెబ్‌సిరీస్‌లు మరిన్ని OTT చిత్రాలు &amp; వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి (telugu.yousay.tv/tfidb/ott) TitleCategoryLanguagePlatformRelease DateChaaverMovieMalayalamSonyLIVNov 24Stamped from the Beginning&nbsp;MovieEnglishNetflixNov 20Squid Game Season 2MovieEnglishNetflixNov 22Puli madaMovieTelugu/MalayalamNetflixNov 23My DemonWeb SeriesEnglishNetflixNov 23Doll boyMovieEnglishNetflixNov 24Gran TurismoMovieTelugu/EnglishNetflixNov 25FargoWeb SeriesEnglishDisney+HotStarNov 21The villageMovieTamilAmazon PrimeNov 24
  నవంబర్ 21 , 2023
  Science fiction movies in telugu: తెలుగులో ఇప్పటి వరకు వచ్చిన సైన్స్ ఫిక్షన్ చిత్రాలు ఇవే!
  Science fiction movies in telugu: తెలుగులో ఇప్పటి వరకు వచ్చిన సైన్స్ ఫిక్షన్ చిత్రాలు ఇవే!
  ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో సైన్స్ సైన్స్ ఫిక్షన్, టైం ట్రావలింగ్&nbsp; చిత్రాల హవా సాగుతోంది. ఈ జోనర్‌లో తెరకెక్కించిన సినిమాలో మంచి విజయం సాధిస్తున్నాయి. దీంతో దర్శకులు ఈ కెటగిరీపై సినిమాలు తీస్తున్నారు. ఆదిత్య 369 నుంచి రాబోయే కల్కీ 2898 AD వరకు తెలుగులో వచ్చిన సైన్స్ ఫిక్షన్ చిత్రాలపై ఓ లుక్ వేద్దాం. 7:11PM టైమ్‌ ట్రావెలింగ్ కథాంశంతో ఈ సినిమా వచ్చింది. అనుకోకుండా ఓ ఊరిలోకి వచ్చిన గ్రహాంతర వాసుల బస్సును హీరో సాహస్ పగడాల ఎక్కడంతో అతను 1999 నుంచి 2024కు ట్రావెల్ చేస్తాడు. ఈ చిత్రాన్ని చైతు మదాల తెరకెక్కించాడు.&nbsp; తెలుగులో మంచి విజయం సాధించింది. ఒకే ఒక జీవితం తెలుగులో టైం ట్రావెలింగ్ కథాంశంతో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్‌గా నిలిచింది. చనిపోయిన తన తల్లిని బతికించుకునేందుకు టైం ట్రావెలింగ్‌కు వెళ్లిన శర్వానంద్ ఏం చేశాడు అనే కథాంశంతో ఈ సినిమాను డైరెక్టర్ శ్రీ కార్తిక్ తెరకెక్కించారు. ఈ సినిమాలో(Science fiction movies in telugu) గుడ్ స్క్రీన్ ప్లే, మంచి భావోద్వేగాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. Disco Raja సైన్స్ ఫిక్షన్‌ కథాంశంతో వచ్చిన ఈ సినిమాలో రవితేజ డ్యూయల్ రోల్‌లో కనిపించి మెప్పించాడు. విలన్ల చేతిలో దెబ్బలు తిన్న రవితేజ మంచులో కూరుకుపోయి... చాలా ఏళ్లు గడిచిన వయసు పెరగకుండా యవ్వనంగా ఉంటాడు. ఈ సినిమా స్టోరీలో సునీల్ ఇచ్చే ట్విస్ట్ ప్రేక్షకులను ఆశ్చర్య పరుస్తుంది. Mark Antony టైమ్ ట్రావెలింగ్ కథాంశంతో వచ్చిన మార్క్ ఆంటోని మంచి విజయం సాధించింది. (Science fiction movies in telugu) గతంలోని వ్యక్తులతో మాట్లాడే ఓ టెలీఫోన్‌ను కనిపెట్టినప్పుడు ఎలాంటి పరిణామాలు జరిగాయి అనే స్టోరీతో ఈ సినిమాను అధిక్ రవిచంద్రన్ తెరకెక్కించారు. ఈ చిత్రంలో మార్క్‌- ఆంటోనిగా విశాల్ డ్యూయల్ రోల్‌లో కనిపించి అదరగొట్టాడు. Krrish 3 సైన్స్ ఫిక్షన్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. భయంకరమైన వైరస్‌ను భారత్‌ మీద ప్రయోగించినప్పుడు క్రిష్ దానిని ఎలా అంతమొందించాడు అనే స్టోరీతో అద్భుతంగా సినిమాను రాకేష్ రోషన్ తెరకెక్కించారు. ఈ సినిమాలో హృతిక్ రోషన్ సరసన ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటించింది. Robo 2.o సైన్స్ ఫిక్షన్ స్టోరీ లైన్‌తో ఈ సినిమా వచ్చింది. సెల్‌ఫోన్‌ టవర్ల నుంచి వచ్చే రేడియేషన్ వల్ల పక్షులు చనిపోతుంటాయి. దీనిపై కోపంతో పక్షిరాజు అక్షయ్ కుమార్.. ఈ లోకంపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటాడు. ఎలక్ట్రానిక్ డివైస్‌లు పనిచేయకుండా చేస్తాడు. దీంతో పక్షిరాజు నుంచి వచ్చిన విపత్తును కాపాడేందుకు రజనీకాంత్ Robo 2.O లెటెస్ట్ వెర్షన్‌గా వచ్చి కాపాడుతాడు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ శంకర్ తెరకెక్కించాడు. కాకపోతే ఈ సినిమా రోబో సినిమా అంత విజయం సాధించలేదు. Robo&nbsp; రజనీకాంత్ అందాల తార ఐశ్వర్య రాయ్ జంటగా నటించిన ఈ సైన్స్ ఫిక్షన్ సినిమా భారీ విజయాన్ని నమోదు చేసింది. ఒక రోబోకు ఫీలింగ్స్ అందిస్తే&nbsp; ఎలాంటి వినాశనం జరుగుతుందనే కథాంశంతో ఈ సినిమాను డైరెక్టర్ శంకర్ తెరకెక్కిచారు. ఈ సినిమా మ్యూజికల్ హిట్‌గాను నిలిచింది. 24 టైం ట్రావెల్ కథాంశంతో వచ్చిన ఈ చిత్రంలో సూర్య నటించాడు. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం మంచి విజయం సాధించింది. 24 అనే వాచ్‌లో టైమ్‌ను మారిస్తే గతంలోకి- భవిష్యత్‌లోకి ప్రయాణం చేయవచ్చు. Skylab సైన్స్ ఫిక్షన్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. అమెరికాకు చెందిన ఒక ఉపగ్రహం విఫలమై దాని శిథిలాలు తెలంగాణలోని ఈ చిన్న గ్రామంపై పడేందుకు సిద్ధంగా ఉందనే వార్తల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రంలో సత్య దేవ్, నిత్యా మీనన్, రాహుల్ రామకృష్ణ, తులసి శివమణి, తనికెళ్ల భరణి నటించారు. Srivalli బ్రేయిన్ మ్యాపింగ్‌ అనే సైన్స్‌ ఫిక్షన్‌ కథాంశంతో ఈ సినిమాను దిగ్గజ రచయిత విజయేంద్ర ప్రసాద్ తెరకెక్కించారు. వేర్వేరు ప్రాంతాల్లో.. ఉన్న ఇద్దరు వ్యక్తులు కొన్నిసార్లు ఒకరి గురించి మరొకరు ఒకేవిధంగా ఆలోచిస్తారు. ఇది ఎలా సాధ్యమవుతుంది? వాళ్ల మెదళ్ల మధ్య శబ్ద తరంగాలు ఎలా ప్రవహిస్తాయి? సైన్స్ దీనికేమైనా వివరణ ఇస్తుందా.. అనే పాయింట్ ఆధారంగా 'శ్రీవల్లి' సినిమా రూపొందింది.&nbsp; Taxiwaala ఆస్ట్రల్ ప్రొజెక్షన్ అనే సైంటిఫిక్ థియరీతో ఈ సినిమా రూపొందింది.&nbsp; మనం చనిపోయిన తరువాత ఆత్మ శరీరాన్ని వదిలి బయటకు వెళ్తుంది. అయితే మనం బతికి ఉండగానే శరీరం నుంచి ఆత్మను వేరు చేసుకోవచ్చు అదే 'ఆస్ట్రల్ ప్రొజెక్షన్'. దీని ప్రకారం చనిపోయిన శరీరాల్లో ఈ ఆత్మలను ప్రవేశపెట్టి వారితో మాట్లాడవచ్చు. ఇక సినిమాలో విజయ్ దేవరకొండ సరసన ప్రియాంక జువాల్కర్ నటించింది. Tik Tik Tik సైన్స్ ఫిక్షన్ కథాంశంతో ఈ సినిమా రూపొందింది. అంతరిక్షంలో తిరిగే ఓ భారీ ఉల్క వల్ల భారత్‌కు ప్రమాదం ఉందని తెలిసి దానిని దారి మళ్లించడానికి కొందరు వ్యోమగాములను పంపిస్తారు. ఈ టీమ్‌ను జయం రవి లీడ్ చేస్తాడు. ఆ ఉల్కను ఎలా దారి మళ్లించేందుకు వ్యోమగాములు ఏం చేశారన్నది కథాంశం. ఈ చిత్రంలో&nbsp; జయం రవితో పాటు, నివేత పేతురాజ్, రమేష్ తిలక్, ఆరోజ్ అజిజ్ తదితరులు నటించారు. Chandamama Lo Amrutham చందమామపై హోటల్ నెలకొల్పాలన్న వెరైటీ కథాంశంతో ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ కామెడీ జోనర్‌లో తెరకెక్కింది. ఈ చిత్రంలో శివన్నారాయణ, ఇంటూరి వాసు, శ్రీనివాస్ అవసరాల ప్రధాన పాత్రల్లో నటించారు. Yuganiki Okkadu తమిళనాడును పాలించిన ప్రాచీన చోళులు- పాండ్యులతో వైరం వల్ల రాజ్యాన్ని వదిలి ఎవరు గుర్తించని ప్రాంతానికి వెళ్తారు. వారు వెళ్లే మార్గం ఎవరికీ తెలియకుండా అనేక అవాంతరాలు పెడుతారు. చివరకు వారిని ఎలా కనిపెట్టారు అనే కథాంశంతో ఈ సినిమా రూపొందింది. ఈ చిత్రంలో కార్తి అద్భుతంగా నటించాడు. అతని సరసన రీమా సేన్, ఆండ్రియా జెర్మియా నటించారు. ఈ సినిమాను సెల్వా రాఘవన్ తెరకెక్కించాడు. ఆదిత్య 369 తెలుగులో వచ్చిన ఫస్ట్ టైం ట్రావెల్ సినిమా ఇది. ఇందులో బాలకృష్ణ అద్భుతంగా నటించారు. ఓ సైంటిస్ట్ కనిపెట్టిన టైం మిషన్ ఎక్కిన బాలకృష్ణ... గతంలోకి శ్రీకృష్ణదేవరాయల కాలంలోకి ప్రయాణిస్తాడు.. అప్పుడు అక్కడ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు అనే కథాంశంతో ఈ సినిమా రూపొందింది. ఈ చిత్రం ఆల్‌టైమ్ క్లాసిక్‌గా నిలిచింది. Kalki 2898 AD సైన్స్‌ ఫిక్షన్ ఆధారంగా ఈ చిత్రాన్ని నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్నారు.&nbsp; కలియుగాంతంలో జరిగే విపత్తుల నుంచి ప్రజలను రక్షించే సూపర్ హీరోగా ప్రభాస్ కనిపించనున్నాడు. టైం ట్రావెల్ మిషిన్ ద్వారా 2898 జన్మించబోయే కల్కిని 2024లోకి తీసుకుని రానున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని రూ.600 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన దీపికా పదుకుణే, దిశా పటానీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రం 2024&nbsp; సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది.
  నవంబర్ 07 , 2023

  @2021 KTree