రివ్యూస్
How was the movie?
తారాగణం
త్రిగన్
ఆనంద్హెబ్బా పటేల్
శ్రీ లక్ష్మిరావు రమేష్
సైకియాట్రిస్ట్ మూర్తినరేష్
శ్రీ లక్ష్మి తండ్రిరవి వర్మ
అదితి మైకల్విశ్వ
కిషోర్ గుండాలసుధీర్
శ్రీనివాస కాపవరపుప్రవీణ్
సంజయ్ రెడ్డి ఏంజెల్ ఇన్వెస్టర్
సిబ్బంది
అయోధ్యకుమార్ కృష్ణంశెట్టిదర్శకుడు
అయోధ్యకుమార్ కృష్ణంశెట్టినిర్మాత
గిరిధర్ మామిడిపల్లినిర్మాత
జోయ్ బారువా
సంగీతకారుడుకథనాలు
Telugu hot movies : గత 25 ఏళ్లలో తెలుగులో వచ్చిన అడల్ట్ సినిమాలు, అవి స్ట్రీమింగ్ అవుతున్న ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లిస్ట్ ఇదే!
రొమాంటిక్, అడల్ట్, బొల్డ్ కంటెంట్ సినిమాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ముఖ్యంగా ఈ సినిమాలు యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తాయి. కథలో పెద్దగా లాజిక్‌లు ఏమి లేకుండా కేవలం.. హీరోయిన్ల అందాల ఆరబోతకే ప్రాధాన్యత ఇస్తుంటాయి. పాత్ర డిమాండ్ చేసినా చేయకపోయినా.. కుదిరితే ముద్దు సీన్లు.. ఇంకాస్తా ముందుకెళ్తే బెడ్ రూం సీన్లు కూడా ప్రస్తుతం సినిమాల్లో సాధారణమై పోయాయి. మరి అలాంటి చిత్రాలు గడిచిన 25 ఏళ్లలో తెలుగులో ఎన్ని వచ్చాయో ఓసారి చూద్దాం.
[toc]
Arthaminda Arunkumar Season 2
ఈ చిత్రం మంచి అడల్ట్ స్టఫ్‌తో వచ్చింది. చాలా సన్నివేశాల్లో రొమాంటిక్ సీన్లు మిమ్మల్ని అలరిస్తాయి. ఇక కథ విషయానికొస్తే.. హైదరాబాద్‌లో కొత్త ఉద్యోగంతో మొదలుపెట్టిన అరుణ్ కుమార్ తన లేడీ బాస్‌తో సవాళ్లను ఎదుర్కొంటూనే అసిస్టెంట్ మేనేజర్‌గా పదోన్నతి పొందుతాడు. అటువంటి సమయంలో అతనికి ఓ ముఖ్యమైన ప్రాజెక్ట్ అప్పగించబడుతుంది. ఈ ప్రాజెక్ట్ విజయవంతం కాకుండా చూసేందుకు తేజస్వి పాత్ర కుతంత్రాలు పన్నుతుంది. ఈ పరిస్థితుల్లో అరు౦ తన సవాళ్లను ఎలా ఎదుర్కొన్నాడు, ఆ అడ్డంకులను అధిగమించాడా అనేదే కథ.
Citadel Honey Bunny
ఈ సినిమాలోని బెడ్రూమ్ సీన్లలో సమంత రెచ్చిపోయి నటించింది. వరుణ్ ధావన్‌తో లిప్‌లాక్ సీన్స్ మరి ఘాటుగా ఉంటాయి. ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ తరహాలో ఇందులో కూడా హాట్ సీన్స్‌లో సామ్ నటించింది.
ఇక ఈ సినిమా స్టోరీ విషయానికొస్తే..బన్నీ (వరుణ్ ధావన్) ఓ స్టంట్ మ్యాన్. సీక్రెట్ ఏజెంట్‌గాను పనిచేస్తుంటాడు. షూటింగ్‌లో పరిచయమైన హనీ (సమంత)ను ఓ మిషన్‌లో భాగం చేస్తాడు. ఈ క్రమంలో ఇద్దరూ దగ్గరవుతారు. అయితే ఈ మిషన్‌లో హనీ చనిపోయిందని బన్నీ భావిస్తాడు. కానీ, 8 ఏళ్ల తర్వాత హనీ బతికున్న విషయం తెలుస్తుంది. వారిద్దరికి పుట్టిన కూతురు కూడా ఉందని తెలుస్తుంది. మరోవైపు హనీ, ఆమె కూతుర్ని చంపేందుకు కొందరు యత్నిస్తుంటారు. అప్పుడు బన్నీ ఏం చేశారు? విలన్ గ్యాంగ్‌ను హనీ-బన్నీ ఎలా ఎదుర్కొన్నారు? విలన్ గ్యాంగ్ హనీ వెంట ఎందుకు పడుతోంది? అన్నది స్టోరీ.
Honeymoon Express
చైతన్యరావు , హెబ్బా పటేల్ జంటగా నటించిన చిత్రం ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’. హీరోయిన్ హెబ్బా పటేల్ తన అందాల ఆరబోతతో కుర్రాళ్ల హార్ట్ బీట్ పెంచింది. బెడ్రూమ్ సీన్లలో చైతన్యరావు, హెబ్బా పటెల్ రెచ్చిపోయి నటించారు. బొల్డ్ కంటెంట్ ఇష్టపడేవారికి మంచి మాజాను ఇస్తుంది.
ఇక ఈ సినిమా స్టోరీ విషయానికొస్తే..ఇషాన్, సోనాలి పెళ్లైన కొత్త జంట. భిన్నమైన మనస్తత్వాలు ఉండటంతో తరచూ వీరి కాపురంలో గొడవలు వస్తుంటాయి. ఈ క్రమంలో ఓ సీనియర్ కపుల్స్.. వీరికి హనీమూన్ ఎక్స్‌ప్రెస్ అనే గేమ్ గురించి చెప్తారు. ఏంటా గేమ్? దాని వల్ల ఇషాన్, సోనాలి ఎలా దగ్గరయ్యారు? ఇంతకీ గేమ్‌ను సూచించిన సీనియర్ జంట ఎవరు? అన్నది కథ.
స్త్రీ 2
స్త్రీ 2 చిత్రంలో టైమ్ లెస్ హాట్ బ్యూటీ శ్రద్ధా కపూర్ అందాలను అప్పనంగా ఆస్వాదించవచ్చు. ఈ చిత్రంలో శ్రద్ధా కపూర్ బొల్డ్ సీన్లలో రెచ్చిపోయి నటించింది. యూత్‌కు మంచి మజాను అందిస్తుంది ఈ చిత్రం.
ఇక సినిమా స్టోరీ విషయానికొస్తే.. చందేరీ గ్రామంలో స్త్రీ సమస్య తొలిగింది అనే అంతా భావించే లోపు సర్కటతో కొత్త సమస్య మొదలువుతుంది. ఈ సమస్యను విక్కీ(రాజ్ కుమార్), రుద్ర (పంకజ్ త్రిపాఠి), జన(అభిషేక్ బెనర్జీ)తో కలిసి దెయ్యం(శ్రద్ధా కపూర్) ఎలా ఎదుర్కొంది అన్నది కథ.
Nakide First Time
రాంరెడ్డి మస్కీ దర్శకత్వంలో వచ్చిన 'నాకిదే ఫస్ట్ టైమ్' చిత్రంలో ధనుష్ బాబు, సిందూర రౌత్ ప్రధాన పాత్రలు పోషించారు. ఇందులో టీనేజీలో యువతీ యువకుల మధ్య ఉండే ఆకర్షణలను ప్రధానంగా చూపించారు.
Silk Saree
అడల్ట్ కంటెంట్ ఇష్టపడే వారికి ఈ సినిమా మంచి టైం పాస్ ఇస్తుంది. ఈ సినిమాలో వాసుదేవ్‌రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి, ప్రధాన పాత్రల్లో నటించారు.
Naughty Girl
ఈ చిత్రంలో శ్రీకాంత్, తాప్సి పన్ను ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రంలో కావాల్సినన్ని మసాల సీన్లు అందుబాటులో ఉన్నాయి.
Hi Five
ఈ చిత్రాన్ని రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్‌గా అమ్మ రాజశేఖర్ తెరకెక్కించారు.ఈ సినిమాలోనూ అడల్ట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది.
ఎవోల్
రీసెంట్‌గా ఓటీటీలో రిలీజైన ఎవోల్ చిత్రం ట్రెండింగ్‌లో ఉంది. తొలుత ఈ సినిమాను థియేటర్‌లో రిలీజ్ చేయాలనుకున్నప్పటికీ.. ఈ చిత్రంలోని బొల్డ్ సీన్లకు సెన్సార్ బోర్డు అడ్డు చెప్పడంతో నేరుగా ఓటీటీలో విడుదలైంది. ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే. నిధి అనే యువతి ప్రభుని ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. అయితే ప్రభు బిజినెస్ పార్ట్నర్ అయిన రిషితో నిధి అక్రమ సంబంధం పెట్టుకుంటుంది. ఇదే క్రమంలో ప్రభు తన అసిస్టెంట్ దివ్యతో ఎఫైర్ పెట్టుకుంటాడు. ఓ రోజు దివ్య గురించి చెప్పి విడాకులు అడుగుతాడు. ఇదే సమయంలో నిధి కూడా తనకున్న అఫైర్‌ను బయటపెడుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? మరి వీరి జీవితాలు ఎలాంటి మలుపులు తిరిగాయి అన్నది మిగతా కథ.
యావరేజ్ స్టూడెంట్ నాని
ఇటీవల సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఈ సినిమా హీరో, డైరెక్టర్ పవన్ కొత్తూరి ట్రోలింగ్‌కు గురయ్యాడు. ఈ చిత్రంలో బొల్డ్ సీన్లు శృతి మించాయని ట్రోల్ చేశారు. సరే, ఇక కథలోకి వెళ్తే..
చదువులో యావరేజ్ స్టూడెంట్ అయిన నాని తన కాలేజ్ సీనియర్ సారాతో ప్రేమలో పడుతాడు. ఆమెతో ఎఫైర్ పెట్టుకుంటాడు. బ్రేకప్ అయిన తర్వాత అనుతో ప్రేమలో పడుతాడు. సారాతో ఎఫైర్ ఉన్నట్లు తెలిసిన అను అతన్ని ఎందుకు ప్రేమించింది? బ్రేకప్ అయిన తర్వాత కూడా నానితో సారా ఎందుకు రిలేషన్ షిప్ కొనసాగించాలనుకున్నది అనేది మిగతా కథ.
https://www.youtube.com/watch?v=xQxqX7fO4Ps
హాట్ స్పాట్
నాలుగు కథల సమాహారంగా హాట్‌స్పాట్ చిత్రం రూపొందింది. నలుగురు యువతులు వారి భాగస్వాముల చుట్టూ కథ నడుస్తుంది. వారి రిలేషన్‌లో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి? వాటి నుంచి ఆ జంట ఎలా బయటపడింది? అన్నది స్టోరీ.
లవ్ మౌళి
2024లో వచ్చిన బొల్డ్ కంటెంట్ సినిమాల్లో లవ్ మౌళి చిత్రం ముందు వరుసలో నిలుస్తుంది. ఈ చిత్రం మూడేళ్ల నుంచి ఊరిస్తూ ఊరిస్తూ ఇప్పటికీ విడుదలైది. ఈ సినిమాలోనూ బొల్డ్ సీన్లు పుష్కలంగా ఉన్నాయి. కథ పక్కకు పెడితే అడల్ట్ కంటెంట్ ఇష్టపడేవారిని ఈ చిత్రం ఏమాత్రం డిస్సాపాయింట్ చేయదని చెప్పాలి. ఇక ఈ సినిమా కథలోకి వెళ్తే.."తల్లిదండ్రులు విడిపోవడంతో మౌళి (నవదీప్) చిన్నప్పటి నుంచి ఒంటరిగా పెరుగుతాడు. కొన్ని అనుభవాల వల్ల అతడికి ప్రేమపై కూడా నమ్మకం పోతుంది. పెయిటింగ్ వేస్తూ వాటి ద్వారా వచ్చిన డబ్బులతో జీవిస్తుంటాడు. కొన్ని నాటకీయ పరిణామాల వల్ల ఓ అఘోరా (రానా దగ్గుబాటి) అతడికి మహిమ గల బ్రష్ ఇస్తాడు. ఆ పెయింటింగ్ బ్రష్‌తో తను కోరుకునే లక్షణాలున్న అమ్మాయిని సృష్టించే శక్తి మౌళికి వస్తుంది. ఈ క్రమంలో అతడు వేసిన పెయింటింగ్ ద్వారా చిత్ర (ఫంఖూరీ గిద్వానీ) అతడి ముందు ప్రత్యక్షమవుతుంది. కొన్నాళ్లు సాఫీగా సాగిన వారి ప్రేమ బంధం.. గొడవలు రావడంతో బ్రేకప్ అవుతుంది. మౌళి.. మళ్లీ బ్రష్ పట్టి అమ్మాయి పెయింటింగ్ గీయగా తిరిగి చిత్రనే ముందుకు వస్తుంది. అలా ఎందుకు జరిగింది? మౌళి.. లవ్ బ్రేకప్‌కు కారణమేంటి? ప్రేమకు నిజమైన అర్థాన్ని హీరో ఎలా తెలుకున్నాడు? మౌళి, చిత్ర ఒక్కటయ్యారా? లేదా? అన్నది కథ.
Mr & Miss
ఈ చిత్రం కూడా బొల్డ్ కంటెంట్‌తో ప్రేక్షకులను ఏ మాత్రం డిస్సాపాయింట్ చేయదు. ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే.. "తన బాయ్ ఫ్రెండ్‌తో బ్రేకప్ కావడంతో శశి(జ్ఞ్యానేశ్వరి) ఓ పబ్‌లో అనుకోకుండా శివ(సన్నీ)ని కిస్ చేస్తుంది. అక్కడ మొదలైన వారి బంధం ముందుకు సాగుతుంది. ఇద్దరు ఒకరిపై ఒకరు ఇష్టం పెంచుకుని శారీరకంగా దగ్గరవుతారు. అయితే కొన్ని కారణాల వల్ల విడిపోయే పరిస్థితి వస్తుంది. సరిగ్గా బ్రేకప్ చెప్పే సమయంలో శివ ఫొన్ మిస్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? వీరి రిలేషన్ ఏమైంది అనేది మిగతా కథ.
ఏడు చేపలా కదా
ఈ సినిమా తెలుగులో పెద్ద ఎత్తున బజ్ సంపాదించింది. అడల్ట్ మూవీల్లో ఓ రకమైన ట్రెండ్ సెట్ చేసింది. ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే.. రవి(అభిషేక్ పచ్చిపాల) పగలు ఏ అమ్మాయిని చూసి టెంప్ట్ అవుతాడో.. అదే అమ్మాయి రాత్రి అతనితో శారీరకంగా కలుస్తుంటుంది. ఈక్రమంలో అతను ప్రేమించిన (ఆయేషా సింగ్) కూడా రవికి దగ్గరవుతుంది. దీని వల్ల రవి ఎదుర్కొన్న సమస్యలు ఏమిటి? అసలు రవిని చూసి వాళ్లెందుకు టెంప్ట్ అవుతున్నారన్నది మిగతా కథ.
RGV’s Climax
తెలుగులో వచ్చిన బొల్డ్ కంటెంట్ సినిమాల్లో ఇదొకటి. మియా మాల్కోవా మరియు ఆమె ప్రియుడు ఎడారి పర్యటనను అనుసరిస్తూ, వారు వేరే ఏదైనా కొత్తగా చేయాలని నిర్ణయించుకున్నారు. ఈక్రమంలో వారి పయనం ఎడారిలో ఎటు వైపు సాగిందనేది కథ.
రాజ్
ఈ చిత్రం కూడా అడల్ట్ కంటెంట్ ఉన్న మూవీ. ఇక ఈ సినిమాలో కూడా రొమాంటిక్ సీన్లు కాస్త ఎక్కువగానే ఉంటాయి. ఇక కథలోకి వెళ్తే.. ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్ అయిన రాజ్ (సుమంత్) తన తండ్రి సన్నిహితుడి కూతురు మైథిలి (ప్రియమణి)తో నిశ్చితార్థం చేసుకున్నాడు. పెళ్లి తేదీ దగ్గర పడుతున్న సమయంలో, అతను మరో అమ్మాయి ప్రియ (విమలా రామన్)తో ప్రేమలో పడుతాడు.పెళ్లిని రద్దు చేయాలని తండ్రిని కోరుతాడు. అయితే ఇంతలో ప్రియ కనిపించకుండా వెళ్లిపోతుంది. దీంతో ప్రియను రాజ్ పెళ్లి చేసుకుంటాడు? ఇంతకు ప్రియ ఎటు వెళ్లింది? మైథిలి, రాజ్ మధ్య కాపురం సజావుగా సాగిందా లేదా అనేది మిగతా కథ.
నేను
మానసిక రోగి అయిన వినోద్ తన స్నేహితురాలిగా భావించే ఒక అమ్మాయితో ప్రేమలో పడతాడు. అయితే ఆ యువతి వెరొకరితో ప్రేమలో ఉంటుంది. ప్రేమను గెలిపిస్తాననే నెపంతో ఆ యువతిని వినోద్ అడవిలోకి తీసుకెళ్లడంతో కథ మలుపు తిరుగుతుంది.
BA పాస్
బాలీవుడ్‌లో వచ్చిన అత్యంత బోల్డ్ సినిమాల్లో ఒకటిగా BA PAss గుర్తింపు పొందింది. ఈ చిత్రం తెలుగులోనూ అందుబాటులో ఉంది. ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే…
ముఖేష్ (షాదబ్ కమల్) అనే ఓ యువకుడి చూట్టూ తిరుగుతుంది. బీఏ డిగ్రీ ఫస్ట్ ఇయర్‌లో ముఖేష్ తల్లిదండ్రులు చనిపోతారు. దీంతో అతను ఢిల్లీలో ఉన్న తన మేనత్త ఇంట్లో ఉంటూ చదువుకుంటూ ఉంటాడు. అక్కడ అవమానాలను ఎదుర్కొంటూ చాలీ చాలని డబ్బుతో కాలం నెట్టుకొస్తుంటాడు. ఈ క్రమంలో అతనికి సారికా(శిల్పా శుక్లా) అనే ఓ పెళ్ళైన మహిళ పరిచయమవుతుంది.ఇద్దరూ శారీరకంగా ఒక్కటవుతారు. ముఖేష్ పరిస్థితి అర్థం చేసుకున్న సారికా అతనికి తనలాగా శారీరక సుఖం కోసం పరితపిస్తున్న పెళ్లైన మహిళలను పరిచయం చేస్తుంది. డబ్బు బాగా చేతికందుతున్న క్రమంలో అతని జీవితం ఊహించని మలుపు తిరుగుతుంది. ముఖేష్ జీవితంలో జరిగిన ఆ సంఘటన ఏమిటి? ఈ వృత్తిని ముఖేష్ కొనసాగించాడా? మానేశాడా? అనేది మిగతా కథ.
కుమారి 21F
తెలుగులో వచ్చిన బోల్డ్ కాన్సెప్ట్‌తో వచ్చిన చిత్రాల్లో కుమారి 21F ఒకటి. యూత్‌ను తెగ ఆకర్షించింది ఈ సినిమా. ఇక ఈ సినిమా కథలోకి వెళ్తే..
సిద్దు(రాజ్ తరుణ్) హోటల్ మెనేజ్‌మెంట్‌లో డిగ్రీ కంప్లీట్ చేసి చెఫ్‌గా వెళ్ళాలని తెగ ట్రై చేస్తుంటాడు. ఈక్రమంలో ముంబై నుంచి వచ్చిన మోడల్ కుమారి(హేభ పటేల్) సిద్ధు ప్రేమలో పడుతుంది. ఆమె బోల్డ్ యాటిట్యూడ్ వల్ల సిద్ధు తొలుత ఇబ్బంది పడ్డా తర్వాత ఆమెను ప్రేమిస్తాడు. ఈక్రమంలో కుమారి క్యారెక్టర్ మంచిదికాదని సిద్ధు ఫ్రెండ్స్ అతనికి చెబుతారు. దీంతో ఆమెను అనుమానించిన సిద్ధు… కుమారి ఓ రోజు వేరే ఎవరి బైక్ మీదో వెళ్తుంటే నిలదీస్తాడు. దాంతో కుమారి తనని అర్థం చేసుకునే మెచ్యూరిటీ తనకు లేదని తన ప్రేమకి నో చెప్పి వెళ్లిపోతుంది. అసలు కుమారి ఎందుకు అంతలా బోల్డ్ గా ఉండటానికి కారణం ఏమిటి? అసలు ముంబై నుంచి కుమారి హైదరాబాద్ ఎందుకు వచ్చింది? అన్నది మిగతా కథ.
మిక్స్ అప్
రీసెంట్‌గా వచ్చిన ఈ చిత్రం బొల్డ్ కంటెంట్‌కు కెరాఫ్ అడ్రస్‌గా మారింది. ఈ చిత్రం థియేటర్లలో పెద్దగా విజయం సాధించనప్పటికీ.. ఓటీటీలో మాత్రం మంచి విజయం సాధించింది. ఈ సినిమా(Telugu hot movies) ఆహా ఓటీటీలో అందుబాటులో ఉంది. రెండు జంటలకు సెక్స్, లవ్ పరంగా సమస్యలు తలెత్తుతాయి. సైకాలజిస్ట్ సూచన మేరకు వారు గోవా టూర్ ప్లాన్ చేస్తారు. ఈ క్రమంలో ఒకరి భార్యను మరొకరు మార్చుకుంటారు. చివరికి ఆ రెండు జంటల పరిస్థితి ఏమైంది? అన్నది స్టోరీ. ఈ సినిమాలో స్టార్టింగ్ సీన్ నుంచే బొల్డ్ కంటెంట్‌తో ప్రేక్షకులకు కావాల్సి మసాల అందుతుంది. ఈ చిత్రాన్ని ఫ్యామిలీతో కలిసి చూడలేమని గుర్తించుకోవాలి.
సిద్ధార్థ్ రాయ్
రీసెంట్‌గా వచ్చిన మంచి హాట్ సీన్లతో ప్రేక్షకులను అలరించింది. ఈ చిత్రం ఓటీటీ విడుదల కోసం ప్రేక్షకులు తెగ వెతకసాగారు. ఎట్టకేలకు ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైంది. ఈ సినిమా స్టోరీ విషయానికొస్తే.. 12 ఏళ్లకే ప్రపంచంలోని ఫిలాసఫీ పుస్తకాలన్నీ చదివిన సిద్ధార్థ్.. ఏ ఏమోషన్స్ లేకుండా జీవిస్తుంటాడు. లాజిక్స్‌ను మాత్రమే ఫాలో అయ్యే సిద్ధార్థ్ అనుకోకుండా ఇందుతో ప్రేమలో పడతాడు. ఆమె ప్రేమలో హీరో ఏం తెలుసుకున్నాడు? ఇందు ఎందుకు బ్రేకప్ చెప్పింది? సిద్ధార్థ్ ప్రేమకథ చివరికీ ఏమైంది? అన్నది కథ.
ఆట మొదలైంది
ఈ చిత్రంలో బొల్డ్ కంటెంట్ అవసరానికి మించి ఉంటుంది. కథ ఎలా ఉన్నా.. బోల్డ్ కంటెంట్ ప్రేమికులను ఈ సినిమా నిరాశపర్చదు. కథ విషాయానికొస్తే.. శ్రీను మేనకోడలికి గుండె జబ్బు వచ్చినప్పుడు, మంచి మనసున్న వ్యక్తిగా వారికి ఆర్థిక సహాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. అతని దయకు ప్రతిఫలంగా మరియు అతని కలలను నెరవేర్చుకునే ప్రయత్నంలో, శ్రీను తైక్వాండో ఛాంపియన్‌షిప్‌లో పాల్గొంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది కథ.
భక్షక్
సామాజిక రుగ్మతలపై మంచి సందేశం ఇచ్చినప్పటికీ.. ఈ చిత్రంలో కొన్ని సన్నివేశాలు బొల్డ్‌గా తీశారు. ఇక సినిమా కథలోకి వెళ్తే.. జర్నలిస్టు వైశాలి.. యూట్యూబ్ ఛానెల్ ద్వారా స్థానిక వార్తలు అందిస్తుంటుంది. ఊరిలోని అనాథ బాలికల వసతి గృహంలో లైంగిక దాడులు జరుగుతున్నట్లు ఆమెకు తెలుస్తుంది. అయితే దానిని రాజకీయంగా పలుకుబడి ఉన్న వ్యక్తి నిర్వహిస్తుంటాడు. అతడి దారుణాలను వైశాలి ఎలా బయటపెట్టింది? ఈ క్రమంలో ఎదురైన సవాళ్లు ఏంటి? అన్నది కథ.
బబుల్గమ్
ఇటీవల వచ్చిన బబుల్గమ్ చిత్రంలో ఉన్న బోల్డ్ కంటెంట్ యూత్‌ను బాగా టెంప్ట్ చేస్తుంది. చాలా వరకు లిప్ లాక్ సీన్లు అలరిస్తాయి. ఈ సినిమా కథలోకి వెళ్తే.. హైదరాబాదీ కుర్రాడు ఆది (రోషన్ కనకాల) డీజే కావాలని కలలు కంటాడు. ఓరోజు పబ్‌లో జాన్వీ(మానస చౌదరి)ని చూసి ప్రేమిస్తాడు.(Telugu hot movies) ఆమెని ఫాలో అవుతుంటాడు. అయితే జాన్వీ పెద్దింటి అమ్మాయి. లవ్, రిలేషన్స్ పెద్దగా నచ్చవు. అబ్బాయిల్ని ఆటబొమ్మల్లా చూస్తుంటుంది. ఇలాంటి అమ్మాయి అనుకోని పరిస్థితుల్లో ఆదితో లవ్‌లో పడుతుంది. భిన్న మనస్తత్వాలు కలిగిన ఆది, జాన్వీ ఎలాంటి సమస్యలు ఫేస్ చేశారు? చివరకు ఒక్కటయ్యారా? లేదా? అనేదే కథ. ఈ సినిమా ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది.
యానిమల్
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సినిమా యానిమల్. ఈ చిత్రంలోని హింసాత్మక సంఘటనలు ఏ స్థాయిలో ఉన్నాయో.. శృంగార సన్నివేశాలు కూడా అదే స్థాయిలో ఉంటాయి. రష్మిక మంధాన, తృప్తి దిమ్రితో ఉండే లిప్ లాక్ సీన్లు ప్రేక్షకులను రంజింప జేస్తాయి.ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే..దేశంలోని అత్యంత సంపన్నుల్లో బల్బీర్ సింగ్ (అనిల్ కపూర్) ఒకరు. ఆయన కుమారుడు రణ్ విజయ్ సింగ్ (రణబీర్ కపూర్). తండ్రి అంటే అమితమైన ప్రేమ. అయితే తన దూకుడు మనస్తత్వం కారణంగా హీరోకి తండ్రితో దూరం పెరుగుతుంది. దీంతో అమెరికా వెళ్లిపోతాడు. ఓ రోజు తండ్రిపై హత్యయాత్నం జరిగినట్లు తెలిసుకొని విజయ్ ఇండియాకు వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? బల్బీర్‌పై దాడి చేసిన వారిపై హీరో ఎలా ప్రతికారం తీర్చుకున్నాడు? అన్నది కథ. ఈ సినిమా ప్రైమ్‌లో అందుబాటులో ఉంది.
పర్‌ఫ్యూమ్
అమ్మాయిల వాసనపై వ్యామోహం పెంచుకున్న ఒక వ్యక్తి.. వారిని కిడ్నాప్ చేస్తూ రాక్షసానందం పోందుతుంటాడు. అతడ్ని పట్టుకోవడానికి పోలీసులు ఏం చేశారు? అతడు ఇలా ఎందుకు మారాడు? అనేది కథ.
మంగళవారం
ఈ చిత్రంలో పాయల్ రాజ్‌పుత్ చాలా హాట్‌గా కనిపిస్తుంది. మునుపెన్నడు లేని విధంగా బోల్డ్ సీన్లలో పాయల్ నటించింది. శృంగార సన్నివేశాలు కావాలనుకునేవారిని ఈ చిత్రం నిరాశపరుచదు. ఇక ఈ చిత్రం కథ విషయానికొస్తే.. మహాలక్ష్మీపురంలోని ఓ జంట మధ్య అక్రమ సంబంధం ఉందని ఊరి గోడలపై రాతలు కనిపిస్తాయి. ఆ జంట అనూహ్య పరిస్థితుల్లో చనిపోతుంది. మరో జంటకి కూడా అదే పరిస్థితి ఎదురై చనిపోవడంతో ఊరి ప్రజల్లో భయం మొదలవుతుంది. ఆ హత్యలన్ని మంగళవారం రోజునే జరుగుతుంటాయి. ఈ కేసును ఛేదించేందుకు ఎస్‌ఐ నందితా శ్వేత ప్రయత్నిస్తుంది. ఇంతకు ఆ హత్యల వెనుక ఉన్నది ఎవరు? అనేది మిగతా కథ. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది.
ది కేరళ స్టోరీ
ఈ చిత్రంలో కాస్త సందేశం ఉన్నప్పటికీ.. బొల్డ్ కంటెంట్ కూడా అదే స్థాయిలో ఉంటుంది. సినిమా స్టోరీ విషయానికొస్తే..కేరళలోని ఓ నర్సింగ్ కాలేజీలో హిందువైన షాలిని ఉన్నికృష్ణన్ (అదాశర్మ) చేరుతుంది. అక్కడ గీతాంజలి (సిద్ధి ఇద్నానీ), నిమా (యోగితా భిహాని), ఆసిఫా (సోనియా బలానీ)లతో కలిసి హాస్టల్‌లో రూమ్ షేర్ చేసుకుంటుంది. అయితే అసీఫా ఐసీస్ (ISIS)లో (Telugu Bold movies) అండర్ కవర్‌గా పనిచేస్తుంటుంది. అమ్మాయిలను బ్రెయిన్ వాష్ చేసి ఇస్లాం మతంలోకి మారుస్తుంటుంది. ఆమె పన్నిన ఉచ్చులో షాలిని చిక్కుకొని ఎలాంటి కష్టాలు అనుభవించింది అన్నది కథ. ఈ చిత్రం జీ5 ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులో ఉంది. థియేటర్లలో మిస్ అయిన వారు ఓటీటీలో వీక్షించవచ్చు.
ఒదెల రైల్వే స్టేషన్
ఈ చిత్రంలో బొల్డ్ కంటెంట్ కాస్త ఎక్కువగానే ఉంటుంది. హెబ్బా పటేల్, పూజిత పొన్నాడ అందాలు మిమ్మల్ని దాసోహం చేస్తాయి. ఇక స్టోరీ విషయానికొస్తే...అనుదీప్ (సాయి రోనక్) ఐపీఎస్ అధికారి. ట్రైనింగ్ కోసం ఓదెల వెళతాడు. ఈ క్రమంలో ఆ ఊరిలో వరుస హత్యాచారాలు తీవ్ర కలకలం రేపుతాయి. మరి అనుదీప్ హంతకుడ్ని పట్టుకున్నాడా? కేసు విచారణలో రాధ (హెబ్బా పటేల్) అతడికి ఎలా సాయపడింది? అనేది కథ. ఈ సినిమాను ఆహా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో వీక్షించవచ్చు.
హెడ్స్ అండ్ టేల్స్
హాట్ సీన్లు దండిగా కావాలనుకునేవారికి ఈ సినిమా ఒక మంచి ఛాయిస్‌గా చెప్పవచ్చు. ఈ సినిమా స్టోరీ ఏమిటంటే?..ముగ్గురు యువతులు తమ వైవాహిక జీవితంలో సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. వాటి నుండి ఎలా బయటపడ్డారు? ఆ ముగ్గురి కథ ఏంటి? అన్నది కథ. ఈ సినిమా జీ5 ఓటీటీలో అందుబాటులో ఉంది.
క్రష్
ముగ్గురు యువకులు పై చదువుల కోసం అమెరికా వెళ్లాలని ప్రయత్నిస్తుంటారు. అమెరికా నుంచి వచ్చిన తమ సీనియర్ ఇచ్చిన సలహాతో వారి జీవితాలు అనూహ్య మలుపు తిరుగుతాయి.
ఏక్ మినీ కథ
ఈ చిత్రం కూడా బొల్డ్ కంటెంట్ ప్రేమికులను ఎక్కడా నిరుత్సాహ పరుచదు. ఇక సినిమా విషయానికొస్తే, సంతోష్ శోభన్ (సంతోష్) తన జననాంగం చిన్నదని భావిస్తూ నిత్యం సతమతమవుతుంటాడు. ప్రాణహాని ఉందని తెలిసినా సర్జరీ చేయించుకునేందుకు సిద్ధమవుతాడు. ఈ క్రమంలోనే అమృత (కావ్య)తో అతడికి పెళ్లి జరుగుతుంది. తన సమస్య బయటపడకుండా సంతోష్ ఏం చేశాడు? ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు? చివరకు ఏమైంది? అన్నది కథ. ఈ సినిమా ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
డర్టీ హరి
హరికి హైదరాబాద్‌లో కోటీశ్వరురాలైన వసుధతో ప్రేమలో పడుతాడు. వారి ప్రేమ సాగుతున్న క్రమంలో వసుధ అన్న గర్ల్‌ఫ్రెండ్ అందానికి ఆకర్షితుడవుతాడు. ఒకరికి తెలియకుండా ఒకరితో సంబంధాన్ని కొనసాగిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది కథ. ఈ సినిమా ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. చూసి ఎంజాయ్ చేయండి.
RDX లవ్
అందాల తార పాయల్ రాజ్‌పుత్ పరువాల ప్రదర్శనను పీక్ లెవల్ తీసుకెళ్లిన చిత్రమిది. అలివేలు (పాయల్ రాజ్‌పుత్) రాష్ట్ర ముఖ్యమంత్రితో అపాయింట్‌మెంట్ పొందడం కోసం ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రచారం చేస్తుంటుంది. దీని కోసం, ఆమె హీరో(తేజస్)ని ఉపయోగించుకుంటుంది. ఇంతకు అలివేలు ఎవరు? సీఎంను ఎందుకు కలవాలనుకుంటుంది అనేది అసలు కథ. ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్‌లో చూడవచ్చు.
చీకటి గదిలో చితక్కొట్టుడు
ఈ చిత్రంలో కావాల్సినంత బోల్ట్ కంటెంట్ ఉంటుంది. ఈ సినిమాలో స్టోరీ విషయానికొస్తే.. ఓ స్నేహితుల బృందం బ్యాచిలర్ పార్టీ కోసం నగరానికి దూరంగా (Telugu hot movies) ఉన్న విల్లాకు వెళ్తారు. ఆ విల్లాలో వారికి వింత పరిస్థితి ఎదురవుతుంది. ఓ అదృశ్య శక్తి వారిని వెంబడిస్తుంటుంది.
నాతిచరామి
ఈ చిత్రంలో పూనమ్ కౌర్ హాట్ ఎక్స్‌ప్రెషన్స్ మిమ్మల్ని థ్రిల్ చేస్తాయి. ఒంటరి మహిళలకు ఏం కావాలి అనే ఇతివృత్తంతో ఈ సినిమా రూపొందింది. వారి శారీర కోరికలు, వారి భావోద్వేగాలు వంటి అంశాల ప్రాతిపాదికగా నడిచే బోల్డ్ చిత్రం ఇది. ఈ సినిమా MX ప్లేయర్‌లో అందుబాటులో ఉంది.
24 కిసెస్
ఆనంద్ (అదిత్ అరుణ్) సామాజిక స్పృహ ఉన్న సినీ దర్శకుడు. శ్రీలక్ష్మీ (హెబ్బా పటేల్)తో ప్రేమలో పడి డేటింగ్‌తోనే జీవితాన్ని గడపాలని అనుకుంటాడు. దీంతో వారి లవ్ బ్రేకప్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? వారు మళ్లీ కలిశారా? 24 ముద్దుల వెనక రహస్యం ఏంటి? అన్నది కథ. ఈ సినిమా ప్రైమ్‌లో అందుబాటులో ఉంది.
RX 100
ఈ చిత్రంలో పాయల్ రాజ్‌పుత్ అందాల ఆరబోత మాములుగా ఉండదు. సెలవులకు ఇంటికి వచ్చిన ఇందు (పాయల్) ఊర్లోని శివ (కార్తికేయ)ను ప్రేమిస్తుంది. పెళ్లికి ముందే అతనితో శారీరకంగా దగ్గరవుతుంది. అయితే ఓ రోజు ఇందు అమెరికా అబ్బాయిని పెళ్లి చేసుకొని వెళ్లిపోతుంది. మరి శివ ఏమయ్యాడు? ఇందు వేరే పెళ్లి ఎందుకు చేసుకుంది? అన్నది మిగతా కథ.
దండుపాళ్యం 3
దండుపాళ్యంగా పేరొందిన సైకో కిల్లర్స్ ముఠా తమ సరదాల కోసం ఎంతకైనా తెగించి నగరంలో బీభత్సం సృష్టిస్తుంటుంది. వారి కామం, డబ్బు కోసం క్రూరంగా చంపుతుంటారు. వారిని పట్టుకునేందుకు పోలీసు అధికారి (రవి శంకర్) గాలిస్తుంటాడు. చట్టం వద్ద దోషులుగా నిరూపించడానికి అతను ఏం చేశాడు? మరి వారికి శిక్ష పడిందా? లేదా? అన్నది మిగతా కథ.
జూలీ 2
నటి కావాలనుకునే సాదాసీదా అమ్మాయి జూలీ. ఓ సినిమాలో హీరోయిన్‌గా నటించి స్టార్‌గా ఎదుగుతుంది. కొన్ని నాటకీయ పరిణామాలు జూలీని చీకటి మార్గంలో పయనించేలా చేస్తాయి. అసలు జూలీ స్టార్‌గా ఎదిగిన తర్వాత ఏం జరిగింది? అన్నది కథ.
అర్జున్ రెడ్డి
ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ, శాలిని పాండే మధ్య వచ్చే కిస్ సీన్లు రంజింపజేస్తాయి. అర్జున్ రెడ్డి టాలెంట్ ఉన్న ఒక యువ సర్జన్. ప్రీతి అనే యువతిని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తాడు. అయితే ఓ సంఘటన అర్జున్ రెడ్డిని షాక్‌కు గురిచేస్తుంది. మద్యానికి బానిసవుతాడు.(Telugu Bold movies) ఇంతకు తన( ప్రేయసిని అతను తిరిగి కలుసుకున్నాడా లేదా? అన్నది మిగతా కథ.ఈ చిత్రం ప్రైమ్‌లో వీక్షించవచ్చు.
బాబు బాగా బిజీ
తెలుగులో వచ్చిన బోల్డ్ కంటెంట్ సినిమాల్లో ఇది టాప్ లెవల్లో ఉంటుంది. మాధవ్ అనేక మంది స్త్రీలతో లైంగిక సంబంధాన్ని కలిగి ఉంటాడు. అయితే, మాధవ్ తన డ్రీమ్ గర్ల్ రాధను కలిసినప్పుడు అతను తన మార్గాన్ని మార్చుకునేందుకు ప్రయత్నిస్తాడు.
గుంటూరు టాకీస్
గిరి (నరేష్), హరి (సిద్ధు) ఓ మెడికల్ షాపులో పనిచేస్తూనే అప్పుడప్పుడు దొంగతనాలు చేస్తుంటారు. ఓ దశలో పెద్ద దొంగతనమే చేయాలని నిర్ణయించుకొని ఓ ఇంట్లో 5 లక్షల రూపాయలను దోచేస్తారు. ఆ తర్వాత వారి జీవితాలు అనుకోని మలుపు తిరిగాయి. చివరికీ వీరి కథ ఎటు పోయింది? అన్నది కథ.
అవును2
ఇది "అవును" సినిమాకి సీక్వెల్. మోహిని మరియు హర్ష కొత్త ఇంటికి మారుతారు. ఆ ఇంటిలో మళ్లీ వింత ఘటనలు జరుగుతాయి. పగపట్టిన ఆత్మ వారిపై ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రయత్నిస్తుంటుంది.
ఐస్ క్రీమ్ 2
ఐదుగురు ఫ్రెండ్స్ షార్ట్‌ఫిల్మ్ తీసేందుకు అడవిలోని గెస్ట్ హౌస్‌కు వెళ్తారు. అక్కడ వారికి వింత అనుభూతులు ఎదురవుతాయి. ఈ క్రమంలో వారిని కొందరు కిడ్నాప్ చేస్తారు. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ ఫ్రెండ్స్ ఒక్కొక్కరిగా చనిపోవడానికి కారణం ఏంటి? అన్నది కథ. ఈ చిత్రాన్ని నేరుగా యూట్యూబ్‌లో వీక్షించవచ్చు.
నా బంగారు తల్లి
దుర్గ (అంజలి పాటిల్) అమలాపురంలో చాలా తెలివైన విద్యార్థి. ఉన్నత చదువులను హైదరాబాద్‌లో పూర్తి చేయాలనుకుంటుంది. కానీ ఆమె తండ్రి ఒప్పుకోడు. రహస్యంగా హైదరాబాద్‌కు వెళ్లిన ఆమెను దుండగులు కిడ్నాప్ చేసి వ్యభిచారంలోకి దింపుతారు. ఈ క్రమంలో తన తండ్రి గురించి ఒక షాకింగ్ నిజం తెలుసుకుంటుంది. ఆమె తెలుసుకున్న నిజం ఏమిటి? వ్యభిచార గృహం నుంచి ఎలా తప్పించుకున్నది అన్నది మిగతా కథ. ఈ సినిమా హాట్‌స్టార్ ఓటీటీలో అందుబాటులో ఉంది.
గ్రీన్ సిగ్నల్
ఈ సినిమాలోనూ కావాల్సినంత హాట్ మసాల సీన్లు మిమ్మల్ని అలరిస్తాయి. సినిమా కథ విషయానికొస్తే..నాలుగు జంటల జీవితాల్లో చోటుచేసుకున్న సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. అపర్థాల వలన వారి ప్రయాణంలో చోటుచేసుకున్న సంక్లిష్టతలు ఏంటి? వాటి నుంచి ఎలా బయటపడ్డారు? అన్నది కథ.
ప్రేమ ఒక మైకం
మల్లిక (ఛార్మీ కౌర్) ఓ అందమైన వేశ్య. మద్యం మత్తులో లైఫ్ లీడ్ చేస్తూ.. నచ్చిన విటులతోనే వ్యాపారం చేస్తుంటుంది. ఓరోజు అనుకోకుండా యాక్సిడెంట్ చేస్తుంది. యాక్సిడెంట్ గురైన లలిత్‌ను హస్పిటల్‌కు చేర్చి.. బ్రతికించి చేరదీసి తన ఇంట్లో ఆశ్రయం కల్పిస్తుంది. అయితే యాక్సిడెంట్‌లో లలిత్ చూపు కోల్పోతాడు. ఒకానొక సందర్భంలో యాక్సిడెంట్‌కు గురైన లలిత్ డైరీని చదువుతుంది. దాంతో డైరీ తర్వాత ఆతని జీవితం గురించి తెలుసుకున్న మల్లిక ఎలాంటి నిర్ణయం తీసుకుంది? ఏం చేసింది అన్నది మిగతా కథ. ఈ సినిమాను నేరుగా యూట్యూబ్‌లో వీక్షించవచ్చు.
పవిత్ర
శ్రియ అందాలను ఆరాధించాలంటే ఈ బోల్డ్ కంటెంట్ ఉన్న సినిమా చూడాల్సిందే..వ్యభిచారం చేసే ఒక మహిళ తన జీవితం మార్చుకోవడానికి ఉన్న అన్నీ అడ్డంకులు దాటుకొని, పట్టుదలగా ఎలా ప్రయాణించింది అనేది సినిమా కథ. ఈ చిత్రాన్ని నేరుగా MX ప్లేయర్ ఓటీటీల్లో వీక్షించవచ్చు.
దండుపాళ్యం
క్రూరమైన ఓ గ్యాంగ్ నగరంలో దొంగతనాలు హత్యలు చేస్తుంచారు. మహిళలను దారుణంగా అత్యాచారం చేసి చంపేస్తుంటారు. పోలీసు అధికారి చలపాతి ఆ గ్యాంగ్‌ను ఎలా కనిపెట్టాడు? చట్టం ముందు వారిని ఏవిధంగా నిలబెట్టాడు? అన్నది కథ. ఈ సినిమాను యూట్యూబ్ ద్వారా నేరుగా చూడవచ్చు.
ది డర్టీ పిక్చర్
ఈ చిత్రంలో సిల్క్‌స్మిత పాత్రలో నటించిన విద్యాబాలను తన అందాలను కొంచెం కూడా దాచుకోకుండా బోల్డ్ షో చేసింది. శృంగార సన్నివేశాలు ఈ చిత్రంలో కొకొల్లలు. కథ విషయానికొస్తే.. రేష్మ పెద్ద హీరోయిన్ కావాలని చెన్నైకి వస్తుంది. కొద్ది రోజుల్లోనే నటిగా అవకాశం వస్తుంది. ఎక్కువగా ఐటెం గర్ల్ పాత్రలు వస్తుంటాయి. తరువాత ఆమె సిల్క్ స్మితగా మారుతుంది. తన గ్లామర్‌తో మొత్తం ఇండస్ట్రీని శాసించే స్థాయికి చేరుకుంటుంది. సౌత్ సూపర్ స్టార్ సూర్య కాంత్, రమా కాంత్‌తో(Telugu hot movies) ఆమె వివాహేతర సంబంధ కొనసాగిస్తుంది. మద్యానికి బానిసై.. కొద్దిరోజుల్లోనే అన్నీ కోల్పోతుంది. చివరికి ఆమె జీవితం ఎలా ముగిసిందన్నది అసలు కథ.
శ్వేత 5/10 వెల్లింగ్టన్ రోడ్
కాలేజీ స్టూడెంట్ అయిన శ్వేత ఓ బంగ్లాలో తన కుటుంబంతో నివసిస్తుంటుంది. ఆమె తల్లి దండ్రులు ఊరు వెళ్తారు. ఈక్రమంలో ఆమె తన బాయ్ ఫ్రెండ్ క్రిష్ ఇంటికి రావాలని కాల్ చేస్తుంది. అయితే ఒక అపరిచితుడు ఆమె ఇంటికి వస్తాడు. తనతో సెక్స్ చేయాలని లేకపోతే ఆమె బాయ్ ఫ్రెండ్‌తో ఉన్న ప్రైవేట్ వీడియోలను నెట్‌లో పెడుతానని బెదిరిస్తాడు. తర్వాత ఏం జరిగింది? శ్వేత అతనికి లొంగుతుందా? చివరకు ఏం జరిగింది అనేది మిగతా కథ.
అరుంధతి
ఈ సినిమాలోనూ కొన్ని సీన్లలో అనుష్క హాట్‌గా కనిపిస్తుంది.చాలా ఎళ్ల తర్వాత తన సొంత ఊరికి వెళ్లిన సమయంలో అరుందతి... తాను తన తాతమ్మ జేజమ్మలాగా ఉన్నానని తెలుసుకుంటుంది. ఈక్రమంలో తనను తన కుటుంబాన్ని నాశనం చేయాలనుకునే ఓ ప్రేతాత్మతో పోరాడుతుంది. ఈ సినిమా యూట్యూబ్‌లో అందుబాటులో ఉంది.
ఆపరేషన్ దుర్యోధన
ఈ చిత్రంలో ముమైత్ ఖాన్ రెచ్చిపోయి మరి అందాల విందు చేసింది. బొల్డ్ అందాలను వీక్షించాలనుకునే వారికి ఈ సినిమా మంచి ఛాయిస్. ఇక కథ విషయానికొస్తే..మహేష్ (శ్రీకాంత్) నిజాయితీగల పోలీసు అధికారి. అతని నిజాయితీ వల్ల నష్టపోతున్న కొద్దిమంది రాజకీయ నాయకుల వల్ల అతని భార్యను, పిల్లలను కోల్పోతాడు. దాంతో మహేష్ రాజకీయాల్లో చేరడానికి తన వేషాన్ని, పేరును మార్చుకుంటాడు. వ్యవస్థలో ఉన్న లోపాల్ని ప్రజలను ఎలా తెలియజేశాడన్నది మిగతా కథ.
రా
శ్రీధర్ ఒక ప్లేబాయ్. అమ్మాయిలను ఆకర్షిస్తూ వారిని నిరాశకు గురిచేస్తుంటాడు. శ్రీధర్ స్త్రీ ద్వేషిగా మారడానికి ఒక బలమైన గతం ఉంది. అయితే శాంతి అనే అమ్మాయి కలవడంతో అతని జీవితం మారుతుంది. ఈ చిత్రం యూట్యూబ్‌లో చూడొచ్చు.
సముద్రం
సాక్షి శివానంద్ ఈ సినిమాలో అవసారనికి మించి అందాల ప్రదర్శన చేసింది. ఈ సినిమా బొల్డ్ కంటెంట్ ప్రేమికులకు మంచి మత్తు అందిస్తుంది. ఈ చిత్రం సన్‌నెక్స్ట్ ఓటీటీ ప్లాట్‌పామ్‌లో అందుబాటులో ఉంది.
10th Class
టినేజ్‌లో ఉండే ఆకర్షణలను ఈ చిత్రం ద్వారా చూపించారు. ఈ సినిమాలోనూ కొన్ని శృంగార సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తాయి. కథ విషయానికొస్తే.. శీను, అంజలి పదోతరగతిలో ప్రేమించుకుంటారు. పెద్దలకు తెలియకుండా పెళ్లి చేసుకుని వారికి దూరంగా జీవిస్తుంటారు. ఈక్రమంలో శీను జీవితంలో ఓ విషాదం జరుగుతుంది.
ఆరుగురు పతివ్రతలు
ఈ చిత్రం కూడా బొల్డ్ కంటెంట్ ప్రేమికులకు మంచి మజా అందిస్తుంది. ఈ సినిమాలోని కొన్ని సీన్లకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. ఈ సినిమా కథ ఏంటంటే.. ఆరుగురు చిన్ననాటి స్నేహితులు ఆరేళ్ల తర్వాత తిరిగి కలుస్తారు. అందరు ఒక దగ్గర చేరి వారి వైవాహిక జీవితంలో జరిగిన సాధక బాధకాలను ఒకరితో ఒకరు పంచుకుంటారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ఈ చిత్రాన్ని నేరుగా యూట్యూబ్ ద్వారా వీక్షించవచ్చు.
4 లెటర్స్
ఈ సినిమా కథ ఎలా ఉన్నా.. బొల్డ్ కంటెంట్ మాత్రం దండిగా ఉంటుంది. ఈ సినిమా స్టోరీ ఏంటంటే.. విజ్జు టాప్ బిజినెస్ మెన్ కొడుకు. కాలేజీలో అంజలిని ఇష్టపడతాడు. అయితే (Telugu Bold Movies) ఆమె బ్రేకప్ చెప్పి వెళ్లిపోవడంతో విజ్జు మరో అమ్మాయిని ప్రేమిస్తాడు. అయితే అంజలి మళ్లీ విజ్జు లైఫ్‌లోకి వస్తుంది. చివరికి అతడు ఏ అమ్మాయిని ప్రేమించాడు? అన్నది కథ.
రొమాంటిక్ క్రిమినల్స్
ఇందులో కూడా మోతాదుకు మించి అడల్ట్ కంటెంట్ ఉంటుంది. కథ విషయానికొస్తే... కార్తీక్ మరియు ఏంజెల్ అనే యువ జంట డ్రగ్స్ పెడ్లర్ సహాయంతో అనేక నేరాలకు పాల్పడుతారు. తీరా వారు మారాలని నిర్ణయించుకున్నప్పుడు అనేక సమస్యలను ఎదుర్కొంటారు. ఈ చిత్రాన్ని ప్రైమ్‌లో వీక్షించవచ్చు.
ఈరోజుల్లో
ఇందులో కూడా మంచి రొమాంటిక్ సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తాయి. కథ విషయానికొస్తే..హీరో (శ్రీ) ఓ అమ్మాయిని పిచ్చిగా ప్రేమించి మోసపోతాడు. అప్పటి నుంచి శ్రీ అమ్మాయిలపై ద్వేషం పెంచుకుంటాడు. శ్రేయాకి కూడా అబ్బాయిలంటే అసలు నచ్చదు. అటువంటి వ్యక్తులు ఎలా ప్రేమలో పడ్డారు? చివరికి ఎలా ఒక్కటయ్యారు? అన్నది కథ. ఈ సినిమా డిస్నీ హాట్ స్టార్‌లో చూడవచ్చు.
అల్లరి
అల్లరి నరేష్ హీరోగా నటించిన తొలి చిత్రమిది. ఈ చిత్రంలో కొన్ని హాట్ సీన్లు ప్రేక్షకులను రంజింపజేస్తాయి. ఇందులో పెద్దగా కథేమి లాజిక్‌గా ఉండదు. రవి, అపర్ణ చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. పక్క ఫ్లాట్‌లోకి వచ్చిన రుచిని రవి ప్రేమిస్తాడు. ఆమెను ముగ్గులో దింపేందుకు రవికి అపర్ణ సాయం చేస్తుంది. ఈ క్రమంలో రవితో ప్రేమలో పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది అనేది కథ. ఈ సినిమాను నేరుగా యూట్యూబ్ ద్వారా వీక్షించవచ్చు.
నవంబర్ 14 , 2024
హెబ్బా పటేల్ గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
హెబ్బా పటేల్ తెలుగు సినీ నటి. తమిళ్, కన్నడ చిత్రాల్లోనూ నటించింది. తెలుగులో అలా ఎలా? ద్వారా పరిచయమైంది. కుమారి 21F సినిమాతో గుర్తింపు పొందింది. ఈ చిత్రంలో ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఆ తర్వాత ఈడోరకం ఆడోరకం, మిస్టర్, 24 కిస్సెస్, ది గ్రేట్ ఇండియన్ సూసైడ్ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. రెడ్ చిత్రంలో రామ్ పొత్తినేని సరసన ఓ ఐటెం సాంగ్‌లో కూడా నటించింది. ప్రస్తుతం వెబ్‌సిరీస్‌ల్లోనూ నటించి గుర్తింపు తెచ్చుకున్న హెబ్బా పటేల్(Some Lesser Known Facts about Hebba Patel) గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు
హెబ్బా పటేల్ ఎప్పుడు పుట్టింది?
1989, జనవరి 6న జన్మించింది
హెబ్బా పటేల్ తెలుగులో నటించిన తొలి సినిమా?
అలా ఎలా(2014)
తెలుగులో గుర్తింపునిచ్చిన సినిమా
కుమారి 21F(2015)
హెబ్బా పటేల్ ఎత్తు ఎంత?
5 అడుగుల 5అంగుళాలు
హెబ్బా పటేల్ ఎక్కడ పుట్టింది?
ముంబై
హెబ్బా పటేల్ అభిరుచులు?
డ్యాన్సింగ్, స్విమ్మింగ్
హెబ్బా పటేల్‌కు ఇష్టమైన ఆహారం?
నాన్‌వెజ్
హెబ్బా పటేల్‌కు ఇష్టమైన కలర్ ?
వైట్
హెబ్బా పటేల్‌కు ఇష్టమైన హీరో?
సల్మాన్ ఖాన్, మహేష్ బాబు
హెబ్బా పటేల్ పారితోషికం తీసుకుంటుంది?
ఒక్కొ సినిమాకు రూ.50 లక్షల వరకు ఛార్జ్ చేస్తోంది.
హెబ్బా పటేల్ సినిమాల్లోకి రాకముందు ఏం చేసేది?
మోడలింగ్ చేసేది
హెబ్బా పటేల్ ఇన్‌స్టాగ్రాం లింక్?
https://www.instagram.com/ihebahp/?hl=en
https://www.youtube.com/watch?v=kSipyGA5qC0
ఏప్రిల్ 02 , 2024
Pushpa 2: యష్ స్పీచ్‌ను సైతం కాపీ కొట్టిన బన్నీ.. సేమ్ టూ సేమ్! వీడియో వైరల్!
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘పుష్ప 2’ దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా రిలీజ్ కోసం సినీ లవర్స్ కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. మరో తొమ్మిది రోజుల్లో సినిమా రిలీజ్ ఉండటంతో మేకర్స్ వరుసగా ప్రమోషన్స్ నిర్వహిస్తూ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం (నవంబర్ 24) చెన్నైలో స్పెషల్ ఈవెంట్ నిర్వహించారు. ‘కిస్సిక్’ ఐటెం సాంగ్‌ను సైతం రిలీజ్ చేశారు. అనంతరం బన్నీ తన మెస్మరైజింగ్ స్పీచ్‌తో తమిళ ఆడియన్స్ ఆకట్టుకున్నారు. అయితేే ఇది బన్నీ ఓన్ స్పీచ్ కాదని ‘కేజీఎఫ్’ హీరో యష్ గతంలో చేసిన ప్రసంగాన్ని కాపీ కొట్టాడని నెట్టింట ప్రచారం జరుగుతోంది. అటు కేజీఎఫ్ 2 స్టోరీ, ప్రచార చిత్రాలను (Pushpa 2 vs KGF 2) సైతం మూవీ టీమ్ మక్కీకి మక్కీ దించిందని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
స్పీచ్.. సేమ్ టూ సేమ్
కన్నడ స్టార్ యష్ (Yash) హీరోగా ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వంలో రూపొందిన కేజీఎఫ్: ఛాప్టర్ 1 (KGF: Chapter 1) బాక్సాఫీస్ వద్ద ఎంత పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. 2018లో ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా హైదరాబాద్‌లో గ్రాండ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ వేడుకలో హీరో యష్ తెలుగులో మాట్లాడి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. మనం ఎక్కడికి వెళ్తే అక్కడి నేలను, భాషను, సంస్కృతిని గౌరవించాలని యష్ అన్నాడు. అయితే ‘పుష్ప 2’ చెన్నై ఈవెంట్‌లో బన్నీ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేయడం గమనార్హం. తమిళంలో మాట్లాడిన బన్నీ ఇక్కడి మట్టి (నేల అర్థం వచ్చేలా)ని తాను గౌరవిస్తానని చెప్పాడు. తాను ఎక్కడ నిలబడితే ఆ నేలను గౌరవిస్తానని అన్నాడు. దుబాయి వెళ్తే అరబిక్, పాట్నా వెళ్తే హిందీ, కేరళ వెళ్తే మలయాళంలో సొల్లుతా అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో అక్కడి వారంతా చప్పట్లు కొడుతూ బన్నీని అభినందించారు. అయితే యష్ చెప్పిన మాటలకు బన్నీ స్పీచ్ (Pushpa 2 vs KGF 2) దగ్గర ఉండటంతో నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. కేజీఎఫ్ కాన్సెప్ట్, పోస్టర్లు, ఎలివేషన్సే కాకుండా స్పీచ్ కూడా కాపీ కొట్టావా? అంటూ నవ్వు ఎమోజీలను షేర్ చేస్తున్నారు.
https://twitter.com/Salaarified22/status/1860960000090481050
కథ కూడా కాపీయేనా?
‘కేజీఎఫ్ 2’కు ‘పుష్ప 2’ అన్ అఫిషియల్ రీమేక్ (Pushpa 2 vs KGF 2) అంటూ గత కొంతకాలంగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ‘పుష్ప 2’ ట్రైలర్‌ను గమనిస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుందని కామెంట్స్ కూడా చేస్తున్నారు. ట్రైలర్‌లోని కొన్ని సీన్స్ ‘కేజీఎఫ్ 2’ను ప్రతిబింబిస్తున్నాయని అభిప్రాయపడుతున్నారు. 'కేజీఎఫ్ 2' చివర్లో రాకీభాయ్ సైతం భార్య మాట వింటాడు. అలాగే 'పుష్ప 2' ట్రైలర్‌లో శ్రీవల్లి మాట వింటానని పుష్పరాజ్ చెబుతాడు. ‘కేజీఎఫ్ 2’ క్లైమాక్స్‌లో శత్రువుల దాడిలో రాకీభాయ్ భార్య చనిపోతుంది. ‘పుష్ప 2’ ట్రైలర్‌లో చితి దగ్గర బన్నీ నిలబడటం చూపించారు. అది శ్రీవల్లిదేనని జోరుగా ప్రచారం చేస్తున్నారు. భార్య మరణం తర్వాత రాకీభాయ్ సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు. అలాగే పుష్ప రాజ్ కూడా క్లైమాక్స్‌లో విశ్వరూపం చూపిస్తాడని ట్రైలర్ చివర్లో హింట్ ఇచ్చారు. అంతేకాదు ‘కేజీఎఫ్: ఛాప్టర్ 1’లో రాకీభాయ్ పేరు స్థానికంగా మాత్రమే తెలుస్తుంది. ‘పార్ట్ 2’కు వచ్చేసరికి దేశవ్యాప్తంగా అతడి పేరు మార్మోగుతుంది. అదే విధంగా ‘పుష్ప’లో నల్లమల్ల ప్రాంతానికే పరిమితమైన పుష్పరాజ్ క్రేజ్ సెకండ్ పార్ట్‌కు వచ్చేసరికి దేశం దాటి అంతర్జాతీయ లెవల్లోకి వెళ్లిపోయినట్లు చూపించారు. వీటన్నింటిని పరిగణలోకి తీసుకొని ‘కేజీఎఫ్ 2’కి కాపీగా ‘పుష్ప 2’ వస్తోందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. డిసెంబర్ 5న దీనిపై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.
https://twitter.com/ketan__00108/status/1858948085524951474
పోస్టర్లకు సైతం ‘కేజీఎఫ్ 2’ రిఫరెన్స్!
ప్రమోషన్స్‌లో భాగంగా రిలీజ్ చేసిన 'పుష్ప 2' (Pushpa 2 vs KGF 2) పోస్టర్లు సైతం 'కేజీఎఫ్ 2' సినిమాలో యష్ పోస్టర్స్‌కు దగ్గరగా ఉన్నాయంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. గతంలో కేజీఎఫ్ టీమ్ రిలీజ్ చేసిన తరహాలోనే రెడ్ థీమ్‌తో 'పుష్ప 2' బిగ్ అనౌన్స్‌మెంట్ పోస్టర్ ఉండటాన్ని హైలెట్ చేస్తున్నారు. అలాగే 'కేజీఎఫ్ చాప్టర్ 1'కు సంబంధించి పోస్టర్‌లో రాకీభాయ్ (యష్) భుజానా గన్ పెట్టుకొని ఉంటాడు. 'పుష్ప 2' కూడా బన్నీ భుజానా గన్ పెట్టుకొని నడుస్తూ వస్తున్న పోస్టర్‌ను రిలీజ్ చేసింది. అలాగే 'కేజీఎఫ్ 2' రిలీజ్ డేట్ పోస్టర్‌లో యష్‌ను బ్యాక్ సైడ్ నుంచి చెప్పారు. అలాగే 'పుష 2' 75 డేస్ టూ గో పోస్టర్‌లో సైతం బన్నీని వెనకి వైపు నుంచి చూపించారు. ఈ రెండింటి ఫొటోల కలర్ థీమ్ కూడా యాజ్ ఇట్ ఈజ్‌గా ఉన్నయంటూ కామెంట్స్ వచ్చాయి. ఇలా 'పుష్ప 2' నుంచి వచ్చిన చాలా వరకూ ప్రమోషన్ పోస్టర్స్ 'కేజీఎఫ్', 'కేజీఎఫ్ 2' చిత్రాలకు దగ్గరగా ఉండటం ఆరోపణలకు ఊతం ఇచ్చింది. ఓసారి ఆ పోస్టర్లను మీరూ చూసేయండి.
https://twitter.com/Ggk_here_/status/1855938612832948694
‘పుష్ప’ రిలీజ్ సమయంలోనూ ఇంతే!
2021లో వచ్చిన ‘పుష్ప’ (Pushpa: Part 1) ఎవరూ ఊహించని విధంగా సెన్సేషన్ క్రియేట్ చేసింది. టాలీవుడ్‌కు మాత్రమే పరిమితం అవుతుందనుకున్న ఈ సినిమా జాతీయ స్థాయిలో బ్లాక్ బాస్టర్‌గా నిలిచింది. అయితే ‘పుష్ప’ స్టోరీ ఫార్మూలా కేజీఎఫ్’ (KGF)కు సిమిలర్‌గా ఉందంటూ అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ప్రతీ సీన్‌ను కనెక్ట్ చేస్తూ నెటిజన్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. 'కేజీఎఫ్'లో బంగారం ఉంటే 'పుష్ప' (Pushpa 2 vs KGF 2)లో ఎర్రచందనం పెట్టారని ఆరోపించారు. కేజీఎఫ్ తరహాలోనే కేశవ వాయిస్ ఓవర్‌తో కథను నడిపించారని ఆరోపించారు. ఈ రెండు చిత్రాల్లో హీరోయిన్స్ తొలుత హీరోలను వ్యతిరేకించారని, చివరికీ వారితో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారని గుర్తుచేశారు. ఇద్దరు హీరోలకు బాల్యంలో తల్లితో శాడ్ సెంటిమెంట్ ఉందని గుర్తుచేశారు. సాధారణ వ్యక్తిగా విలన్ల గ్రూప్‌లోకి వచ్చిన హీరో వారందరినీ తొక్కుకుంటా నాయకుడైన తీరు కూడా సిమిలర్‌గా ఉందని చెప్పారు. స్టోరీలో డిఫరెన్స్ ఉన్నప్పటికీ ఓవరాల్ థీమ్ చూస్తే ‘కేజీఎఫ్’ను ‘పుష్ప’తో కాపీ కొట్టారని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి.
https://twitter.com/RSKTheMonsters/status/1484072213750095874
నవంబర్ 26 , 2024
Vishwambhara: జపాన్ వీధుల్లో త్రిషతో చిరంజీవి రొమాన్స్.. ఫ్యాన్స్‌కు కిక్కే కిక్కు!
మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) హీరోగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం 'విశ్వంభర' (Vishwambhara). ఈ సోషియో ఫ్యాంటసీ చిత్రానికి ‘బింబిసార’ (Bimbisara) ఫేమ్ విశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో ప్రముఖ స్టార్ హీరోయిన్ త్రిష (Trisha) చిరుకి జోడీగా నటిస్తోంది. ‘అమిగోస్’ ఆషికా రంగనాథ్, రమ్య పసుపులేటి, సురభి, ఈషా చావ్లా, ఆష్రిత వేముగంటి నండూరి ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం జపాన్‌లో జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించి ఓ క్రేజీ అప్‌డేట్ బయటకొచ్చింది. ప్రస్తుతం అది నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
త్రిషతో చిరు రొమాంటిక్ సాంగ్!
‘విశ్వంభర’ (Viswambhara) టీమ్ ప్రస్తుతం జపాన్‌లో ఉంది. 15 రోజుల షూటింగ్ షెడ్యూల్‌తో హీరో చిరంజీవి సహా దర్శకుడు విశిష్ట ఇతర టీమ్ సభ్యులు రీసెంట్‌గా జపాన్‌లో అడుగుపెట్టారు. షెడ్యూల్‌లో భాగంగా ఇప్పటికే పలు కీలక సన్నివేశాలను మూవీ టీమ్ చిత్రీకరించింది. లేటెస్ట్ బజ్ ప్రకారం ప్రస్తుతం చిరు, త్రిష కాంబోలో ఓ డ్యూయేట్ సాంగ్‌ను షూట్ చేస్తున్నట్లు సమాచారం. ఈ సాంగ్‌లో చిరు, త్రిష జోడీ అదరగొడుతుందని మూవీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా చిరు మేకోవర్ చూస్తే ఆయన 20 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయినట్లు అనిపిస్తుందని అంటున్నారు. త్రిష - చిరంజీవి కెమెస్ట్రీ కూడా సాంగ్‌లో నెక్స్ట్ లెవల్లో వర్కౌట్ అయ్యిందని అంటున్నారు. ఈ సాంగ్ షూట్ అయిపోగానే చిత్ర బృందం హైదరాబాద్‌లో అడుగుపెడుతుందని సమాచారం. ఇదిలా ఉంటే చిరు-త్రిష సాంగ్‌పై వస్తోన్న హైప్ చూసి ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతున్నారు.
18 ఏళ్ల క్రితం ఇదే మ్యాజిక్!
చిరంజీవి - త్రిష జత కట్టడం (Viswambhara Trisha) ఇదేమి తొలిసారి కాదు. 2006లో వచ్చి ‘స్టాలిన్’ సినిమాలో వీరిద్దరు తొలిసారి జోడీగా నటించారు. ఆ తర్వాత వీరు ఏ సినిమాలో కలిసి నటించలేదు. 18 ఏళ్ల తర్వాత తిరిగి ఈ జోడి నటిస్తుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ‘స్టాలిన్’ సమయంలోనే వీరి జోడీకి మంచి మార్కులు పడ్డాయి. వెండి తెరపై వీరి కెమెస్ట్రీ చాలా బాగుందంటూ అప్పట్లో కథనాలు కూడా వచ్చాయి. ఇప్పుడు ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ‘విశ్వంభర’లో చిరు - త్రిష జతకడుతుండటంతో ఈ జోడీ ఈసారి ఏ మ్యాజిక్ చేస్తుందోనన్న ఆసక్తి ఇండస్ట్రీలో నెలకొంది. నిజానికి ‘ఆచార్య’ చిత్రంలోనే చిరుకి జోడీగా త్రిష నటించాల్సి ఉంది. చిత్ర యూనిట్ తొలుత త్రిషనే హీరోయిన్‌గా ప్రకటించింది కూడా. అయితే షూటింగ్ ప్రారంభానికి కొద్ది రోజుల ముందే తాను సినిమా నుంచి తప్పుకుంటున్నట్లు త్రిష వెల్లడించింది.
https://twitter.com/i/status/1849101610762522837
2025 సమ్మర్ బరిలో..
చిరంజీవి - వశిష్ట కాంబోలో రూపొందుతున్న ‘విశ్వంభర’ (Viswambhara) చిత్రం 2025 సమ్మర్‌లో రానున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కావాలి. జనవరి 10న రాబోతున్నట్లు గతంలోనే విశ్వంభర టీమ్ అనౌన్స్ చేసింది. అయితే తనయుడు రామ్ చరణ్ (Ram Charan) నటించిన ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) కోసం చిరు వెనక్కి తగ్గారు. దీంతో గేమ్ ఛేంజర్ సంక్రాంతి బరిలో నిలవగా ‘విశ్వంభర’ సమ్మర్‌కు పోస్టుపోన్ అయినట్లు 2025 మే (Viswambhara Release Date)లో ఈ సినిమాను గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా, గతంలో చిరు నటించిన ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’, ‘అంజి’ సినిమాల తరహాలో సోషియో ఫాంటసీ ఎంటర్ టైనర్‌గా ‘విశ్వంభర’ రూపొందుతోంది.
2024లో చిరుకి గుర్తుండిపోయే మోమోరీస్!
అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi)కి ఈ ఏడాది మరుపురాని జ్ఞాపకాలను అందించింది. మూడు విశిష్టమైన పురస్కారాను మెగాస్టార్ అందుకున్నారు. గత నెల ప్రతిష్టాత్మక ఏఎన్నార్ జాతీయ అవార్డు చిరంజీవిని వరించింది. అక్కినేని నాగార్జున కుటుంబికుల సమక్షంలో బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ ఈ అవార్డు ప్రధానం చేశారు. ఈ ఏడాది జూన్‌లో దేశంలోనే రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్‌ను రాష్ట్రపతి చేతుల మీదగా చిరు అందుకున్నారు. ఈ కార్యక్రమానికి చిరు భార్య సురేఖ, కుమారుడు రామ్‌చరణ్, కోడలు ఉపాసన, కూతురు సుస్మితా హాజరై మురిసిపోయారు. ఇటీవల గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులోను చిరు స్థానం సంపాదించారు. 156 చిత్రాలు.. 537 పాటలు.. 24 వేల స్టెప్పులతో అలరించినందుకు ఆయనకు ఈ రికార్డు దక్కింది.
నవంబర్ 20 , 2024
Devara: ఓ వైపు సెన్సేషన్.. మరోవైపు ట్రోల్స్! దేవర ‘చుట్టమల్లే’ సాంగ్‌కు వింత పరిస్థితి!
టాలీవుడ్‌లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) ఒకరు. నందమూరి నట వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తారక్ తనకంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్‌ను క్రియేట్ చేసుకున్నారు. 'ఆర్‌ఆర్‌ఆర్' (RRR) సక్సెస్‌తో పాన్ ఇండియా స్థార్‌గా ఎదిగాడు. ప్రస్తుతం 'దేవర' (Devara) షూటింగ్‌లో తారక్ బిజీ బిజీగా ఉన్నారు. తాజాగా ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ విడుదలై ఆడియన్స్‌ను విశేషంగా ఆకట్టుకుంటోంది. 'చుట్టమల్లే '(Chuttamalle Song) అంటూ సాగే ఈ పాట యూట్యూబ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. అయితే అదే సమయంలో ఈ సాంగ్‌పై పెద్ద ఎత్తున ట్రోల్స్ సైతం వస్తున్నాయి. ఆ వివరాలేంటో ఈ కథనంలో పరిశీలిద్దాం.
యూట్యూబ్‌లో రికార్డు వ్యూస్!
తారక్ హీరోగా కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వంలో రూపొందుతున్న 'దేవర' చిత్రంపై తొలి నుంచి ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. దానికి తగ్గట్లే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్లు, టీజర్, ఫస్ట్ సింగిల్ 'ఫియర్' సాంగ్ ఈ మూవీపై భారీ హైప్‌ను క్రియేట్ చేశాయి. ఈ క్రమంలోనే సోమవారం ‘దేవర’ నుంచి రెండో పాట రిలీజ్ చేశారు. 'చుట్టుమల్లే చుట్టేస్తోంది తుంటరి చూపు.. ఊరికే ఉండదు కాసేపు' అంటూ సాగే ఈ మెలోడీ సాంగ్‌లో తారక్, జాన్వీ కపూర్ అదరగొట్టారు. ఈ జోడీ కెమెస్ట్రీ అదిరిపోయిందంటూ అభిమానులు పోస్టులు పెట్టారు. అటు మ్యూజిక్ లవర్స్ నుంచి కూడా ఈ పాటకు విశేష స్పందన వస్తోంది. ఫలితంగా యూట్యూబ్‌లో 40 మిలియన్ వ్యూస్‌ను ఈ సాంగ్ సొంతం చేసుకుంది. రిలీజైనప్పటి నుంచి అగ్రస్థానంలో ట్రెండింగ్ అవుతూ మరింత దూసుకెళ్తోంది.
పెద్ద ఎత్తున ట్రోల్స్!
'చుట్టమల్లే చుట్టేస్తోంది' సాంగ్‌ను కొందరు నెటిజన్లు దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. ఈ పాట సోప్ యాడ్‌ను తలపిస్తోందంటూ కామెంట్స్ చేస్తున్నారు. సాంగ్‌లోని సీన్స్‌కు సోప్ యాడ్ మ్యూజిక్‌ను జత చేసి ట్రెండింగ్ చేస్తున్నారు. అటు మీమ్స్ పేజెస్ సైతం సదరు వీడియోను పోస్టు చేస్తుండటంతో ఎడిటింగ్ వీడియోలు సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నాయి. అంతేకాకుండా ఈ సాంగ్ ట్యూన్‌ని మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ కాపీ కొట్టాడని కూడా ప్రచారం చేస్తున్నారు. గతంలో బాగా పాపులర్ అయిన ‘మనికే మగే హితే’ పాటతో కంపేర్ చేస్తున్నారు. ఆ ట్యూన్‌కు దగ్గరగా ఉందటూ సదరు సాంగ్‌ను సైతం వైరల్ చేస్తున్నారు. దీంతో ‘చుట్టుమల్లే’ సాంగ్ ఒకే సమయంలో పాజిటివ్, నెగిటివ్ టాక్ తెచ్చుకొని సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
స్ట్రాంగ్ కౌంటర్
దేవర సెకండ్ సింగిల్‌పై వస్తోన్న ట్రోల్స్‌పై నిర్మాత సూర్యదేవర నాగవంశీ స్పందించారు. ఎవరు ఏం అనుకుంటే మనకేంటి సాంగ్ మాత్రం సూపర్ అంటూ ఎక్స్‌లో ట్వీట్ పెట్టారు. ‘గత 24 గంటలుగా చుట్టమల్లే పాటపై ట్రోల్స్ వస్తున్నాయి. ఆఫీషియల్ ఈ సాంగ్ జోష్ ఎలా ఉంది బాయ్స్? ఇందులో తారక్ అన్నని చూస్తే ముచ్చటేస్తుంది. జాన్వీ కపూర్‌ని చూస్తుంటే ముద్దొస్తుంది. ఇంకా ఎవరు ఎలా అనుకోని, దేనితో పోల్చుకుంటే మనకేంటీ కదా బాయ్స్..’ అంటూ నాగవంశీ ట్రోలర్స్‌కి గట్టి కౌంటర్ ఇచ్చారు. కొందరు నెటిజన్లు నాగవంశీకి మద్దతుగా నిలుస్తున్నారు. తమకు ఈ పాట విపరీతంగా నచ్చిందంటూ కామెంట్స్ చేస్తున్నారు.
https://twitter.com/vamsi84/status/1820689638714998854
‘దేవర’ వచ్చేస్తునాడు..!
‘దేవర’ మూవీ సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎన్టీఆర్ సోదరుడు హీరో నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ సినిమాను రూపొందిస్తున్నాయి. కొరటాల శివ సన్నిహిత మిత్రులు మిక్కిలినేని సుధాకర్, కళ్యాణ్ రామ్ బావమరిది హరికృష్ణ .కె నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. కోస్టల్ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో ఎన్టీఆర్ డబుల్ రోల్ పోషిస్తున్నట్టు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన లేకపోయినా ఇప్పటికే వచ్చిన అప్‌డేట్స్ మాత్రం ఎన్టీఆర్ ద్విపాత్రాభినయంపై హింట్స్ ఇస్తున్నాయి.
ఆగస్టు 07 , 2024
ఈ వారం(Feb 24) థియేటర్లు, ఓటీటీలో విడుదలవుతున్న సినిమాలు
గత వారం సార్, వినరో భాగ్యము విష్ణు కథ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సందడి నెలకొంది. అయితే, ఈ వారం(ఫిబ్రవరి 24) థియేటర్లలో చిన్న సినిమాలు విడుదలవుతున్నాయి. ఓటీటీలో మాత్రం సంక్రాంతి సినిమాలు మోత మోగించనున్నాయి. అవేంటో చూద్దాం.
మిస్టర్ కింగ్
కుటుంబ కథా నేపథ్యంలో తెరకెక్కిన సినిమా ‘మిస్టర్ కింగ్’. దివంగత విజయ నిర్మల మనవడు శరణ్‌కుమార్ హీరోగా నటించాడు. శశికుమార్ చావలి దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 24న ఈ సినిమా విడుదలవుతోంది.
డెడ్ లైన్
ఊహించిన విధంగా కథనంతో ‘డెడ్‌లైన్’ సినిమాను తెరకెక్కించినట్లు చిత్రబృందం ప్రకటించి అంచనాలు పెంచింది. అజయ్ ఘోష్ ప్రధాన పాత్రలో నటించారు. ఈ నెల 24న విడుదలవుతోంది.
కోనసీమ థగ్స్
ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రఫర్ బృందా గోపాల్ డైరెక్ట్ చేసిన రెండో చిత్రమే ‘కోనసీమ థగ్స్’. ప్రొడ్యూసర్ రిబూ తమీన్స్ కుమారుడు హిద్రూ పరూన్ హీరోగా పరిచయం అవుతున్నాడు. ‘థగ్స్’గా రూపుదిద్దుకున్న ఈ అనువాద చిత్రాన్ని మైత్రీ మూవీస్ డిస్ట్రిబ్యూటర్స్ సంస్థ తెలుగులో ‘కోనసీమ థగ్స్’గా విడుదల చేస్తోంది.
OTT విడుదలలు
TitleCategoryLanguagePlatformRelease DateVarasuduMoviesTamilAmazon PrimeFebruary 22Veerasimha ReddyMoviesTeluguDisney Plus HotstarFebruary 23MichaelMoviesTeluguAhaFebruary 24Waltheru VeeraiyaMoviesTeluguNetflixFebruary 27The StraysMoviesEnglishNetflixFebruary 22Call me ChichiroMoviesEnglishNetflixFebruary 23Rabia and OliviaMoviesEnglishHotstarFebruary 24Potluck S2SeriesHindiSonyLivFebruary 24A Quite PlaceMovieEnglishNetflixFebruary 24Puli MekaSeriesTeluguZee5February 24
ఫిబ్రవరి 22 , 2023
OTT Releases This Week (Oct 24-28): ఈ వారం ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానున్న తెలుగు సూపర్ హిట్ చిత్రాలు ఇవే!
దసరా పండుగ వేళ భగవంత్ కేసరి, టైగర్ నాగేశ్వరరావు, లియో వంటి పెద్ద సినిమాలు విడుదల కావడంతో ఈ వారం థియేటర్లలో రిలీజ్‌కు చెప్పుకోదగ్గ సినిమాలు అయితే ఏమి లేవు. అయితే సంపూర్ణేష్ బాబు నటించిన మార్టిన్ లూథర్ కింగ్, కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ నటించిన ఘోస్ట్ చిత్రాలు ప్రేక్షకులను పలకరించనున్నాయి. ఇక ఓటీటీల్లో మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. దాదాపు 20కి పైగా సినిమాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు సిద్దమయ్యాయి. ఇటీవల రిలీజైన చంద్రముఖి2, స్కందతో పాటు మరికొన్ని చిత్రాలు ఉన్నాయి. మరి అవెంటో ఓసారి చూసేద్దాం.
ఈవారం థియేటర్లలో రిలీజయ్యే సినిమాలు
మార్టిన్ లూథర్ కింగ్ (Martin luther king telugu movie)
కమెడియన్ సంపూర్ణేష్ బాబు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం మార్టిన్ లూథర్ కింగ్. పొలిటికల్ కామెడీ డ్రామాగా ఈ చిత్రాన్ని పూజా కొల్లూరు తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా తమిళ్ చిత్రం 'మండేలా'కీ రీమేక్ వస్తోంది. తమిళంలో కమెడియన్ యోగీ బాబు ఇందులో నటించారు. ఈ సినిమాలో నరేష్, మహా, శరణ్య ప్రదీప్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని YNOT స్టూడియోస్, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తోంది. మార్టిన్ లూథర్ కింగ్ ఈ నెల 27న థియేటర్లలో విడుదల కానుంది.
ఘోస్ట్ (GHOST)
కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ నటించిన హై ఓల్టేజ్ యాక్షన్ చిత్రం ఘోస్ట్. ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కింది. ఈ చిత్రం అక్టోబర్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఇక ఘోస్ట్ సినిమాలో అనుపమ్ ఖేర్, ప్రశాంత్ నారాయణ్, ఎంజీ శ్రీనివాస్, అర్చన్ జాయిస్, సత్యప్రకాశ్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. అర్జున్ జన్య మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమా.. కన్నడ, తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం భాషాల్లో రిలీజ్ కానుంది.
ఈ వారం (October 24-28) ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానున్న చిత్రాలు
మరిన్ని OTT చిత్రాలు & వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి (telugu.yousay.tv/tfidb/ott)
TitleCategoryLanguagePlatformRelease DateParamporulMovieTamilAmazon PrimeOctober 24Asprints Season 2WebseriesHindiAmazon PrimeOctober 25Transformers: Rise of the BeastMovieEnglishAmazon PrimeOctober 26ConsecrationMovieEnglishAmazon PrimeOctober 27Burning Betrayal MoviePortuguese NetflixOctober 25Life on Our PlanetSeriesEnglishNetflixOctober 25Chandramukhi 2MovieTelugu DubbedNetflixOctober 26Long Live LoveMovieThaiNetflixOctober 26PlutoWeb SeriesJapaneseNetflixOctober 26Pain HustlersMovieEnglishNetflixOctober 27Sister DeathMovieSpanishNetflixOctober 27TorWeb Series SwedishNetflixOctober 27Yellow Door: 90s Lo-Fi Film ClubMovie KoreanNetflixOctober 27PebblesMovieTamilSony LivOctober 27Paramporul MovieTamilahaOctober 24Changure Bangura RajaMovieTeluguE-WinOctober 27Phone CallMovieHindiJio movieOctober 23Duranga Season 2SeriesHindiZee 5October 24Nikonj - The Search BeginsMovieBengaliZee 5October 27Masterpiece SeriesTelugu Dubbed Disney Plus HotstarOctober 25 Koffee With Karan Season 8Talk ShowHindiDisney Plus HotstarOctober 26SkandaMovieTeluguDisney Plus HotstarOctober 27Nights of ZodiacMovieEnglishBook My showOctober 24CursesSeriesTamilApple Plus TVOctober 27The Enfield Poltergeist SeriesEnglishApple Plus TVOctober 27
అక్టోబర్ 26 , 2023
This week Telugu Ott Releases: ఈ వారం(నవంబర్ 18- 24) థియేటర్లు, ఓటీటీల్లో విడుదల కానున్న సినిమాలు ఇవే
కలెక్షన్ల పరంగా, వినోదం పరంగా గతవారం తెలుగు ఇండస్ట్రీకి తీవ్ర నిరాశ మిగిల్చింది.'కంగువ', 'మట్కా' చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ కావడంతో ఈవారం విడుదలయ్యే కొత్త సినిమాలపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. ఈ వారం పెద్ద హీరోల సినిమాలు లేనప్పటికీ.. విష్వక్ సేన్ నటించిన 'మెకానిక్ రాకీ' కాస్త చెప్పుకోదగింది. ఆ తర్వాత 'రోటీ కపడా రొమాన్స్', 'జీబ్రా', లాంటి చిత్రాలు విడుదలకు సిద్ధమయ్యాయి. మరోవైపు ఓటీటీలో 30కి పైగా కొత్త చిత్రాలు- వెబ్‌సిరీస్‌లు విడుదల కానున్నాయి. మరి ఆ చిత్రాలేంటో ఇప్పుడు చూద్దాం.
దేవకీ నందన వాసుదేవ
మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా చేస్తోన్న రెండో చిత్రం 'దేవకి నందన వాసుదేవ'. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచింది. ట్రైలర్‌లో అశోక్ మంచి స్క్రీన్ ప్రజెన్స్‌లో కనిపించారు. ఈ చిత్రానికి అర్జున్ జంధ్యాల దర్శకుడు. హీరోయిన్‌గా మాజీ మిస్ ఇండియా మానస వారణాసి నటిస్తోంది. హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మ ఈ చిత్రానికి కథను అందించారు. తొలుత ఈ చిత్రాన్ని నవంబర్ 14న విడుదల చేయాలనుకున్నప్పటికీ... ఈ వారంలో నవంబర్ 22న విడుదల చేస్తున్నారు.
మెకానిక్ రాకీ
సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్న విష్వక్ సేన్.. మరో విభిన్నమైన కథతో మెకానిక్ రాకీగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, సాంగ్స్‌పై ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. యాక్షన్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ‘మెకానిక్ రాకీ చిత్రం ద్వారా రవితేజ ముళ్లపూడి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ట్రైయాంగిల్ ప్రేమకథగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. రామ్ తాళ్లూరి నిర్మాత. నవంబర్ 22న ఈ సినిమా విడుదల కానుంది.
రోటి కపడా రొమాన్స్
గత ఏడాదిగా వివిధ కారణాల చేత వాయిదా పడుతూ వస్తున్న రోటి కపడా రొమాన్స్ ఎట్టకేలకు ఈ వారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో హాట్ బ్యూటీ నువేక్ష, హర్ష నర్రా, ఖుష్బు చౌదరీ, మేఘలేఖ, తరుణ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను విక్రమ్ రెడ్డి డైరెక్ట్ చేశారు.
జీబ్రా
విలక్షణ నటుడు సత్యదేవ్ కంచరాణా ప్రధాన పాత్రలో తెలుగులో రాబోతున్న చిత్రం జీబ్రా. విభిన్న కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కింది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ మంచి రెస్పాన్స్ సాధించింంది. ఈ సినిమాలో ప్రియా భవాని శంకర్ అమృత అయ్యర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఈశ్వర్ కార్తిక్ డైరెక్ట్ చేయగా.. దినేష్ సుందరం ప్రొడ్యూస్ చేస్తున్నారు.
ఈ వారం( November 18- 24) ఓటీటీలో విడుదల కానున్న తెలుగు చిత్రాలు
మరో వైపు ఓటీటీల్లో విడుదల కానున్న సినిమాల విషయానికి వస్తే, 'నయనతార లైఫ్ డాక్యుమెంటరీ, కిష్కింద కాండం' అనే డబ్బింగ్ సినిమా, దీనితో పాటు రానా హోస్ట్ చేసిన టాక్ షో 'ఉన్నంతలో' కూడా ఆసక్తి కలిగిస్తున్నాయి. వీటితో పాటు మరికొన్ని హిందీ, ఇంగ్లీష్ చిత్రాలు/ వెబ్ సిరీస్‌లు ఓటీటీల్లో స్ట్రీమింగ్‌కు సిద్ధంగా ఉన్నాయి.
మరిన్ని OTT చిత్రాలు & వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
https://telugu.yousay.tv/tfidb/ott
PlatformMovie/Webseries NameLanguage/TypeRelease DateHotstarKishkindha KandamTelugu Dubbed MovieNovember 19Interior ChinatownEnglish SeriesNovember 19Alien: RomulusEnglish MovieNovember 21Bia & VictorPortuguese SeriesNovember 22Out of My MindEnglish MovieNovember 22ETV WinI Hate LoveTelugu MovieNovember 21Repathi VeluguTelugu MovieNovember 21NetflixNayanthara: Beyond the FairytaleDocumentaryNovember 18Wonderoos Season 2English SeriesNovember 18Zombiverse Season 2Korean SeriesNovember 19See Her AgainCantonese SeriesNovember 20AdorationItalian SeriesNovember 20A Man on the InsideEnglish SeriesNovember 21Tokyo Over RideJapanese SeriesNovember 21JoyEnglish MovieNovember 22Pokémon Horizons Part 4Japanese SeriesNovember 22SpellboundEnglish MovieNovember 22The Helicopter HeistSwedish SeriesNovember 22The Piano LessonEnglish MovieNovember 22TransmithSpanish MovieNovember 22Yeh Kaali Kaali Ankhein Season 2Hindi SeriesNovember 22The Empress Season 2German SeriesNovember 22Amazon PrimeCampus Beats Season 4Hindi SeriesNovember 20Wack GirlsHindi SeriesNovember 22PimpineroSpanish MovieNovember 22The Rana Daggubati ShowTelugu Talk ShowNovember 23Jio CinemaDune: ProphecyEnglish SeriesNovember 18Based on a True Story Season 2English SeriesNovember 22The Sex Lives of College Girls Season 3English SeriesNovember 22Harold and the Purple CrayonEnglish MovieNovember 23Manorama MaxTekku VadakkuMalayalam MovieNovember 19Apple TV+BlitzEnglish MovieNovember 22BookMyShowFrom DarknessSwedish MovieNovember 22The Girl in the TrunkEnglish MovieNovember 22The Night My Dad Saved ChristmasSpanish MovieNovember 22Lionsgate PlayGreedy PeopleEnglish MovieNovember 22
నవంబర్ 18 , 2024
This Week OTT movies: ఈ వారం చిన్న సినిమాలదే హవా.. ఓటీటీలోకి ‘హనుమాన్’ సహా 24 చిత్రాలు!
గత కొన్ని వారాలుగా స్టార్ హీరోల చిత్రాలు విడుదలవుతూ థియేటర్లలో సందడి చేస్తున్నాయి. అయితే ఈ వారం మాత్రం చిన్న చిత్రాల హవా కొనసాగనుంది. ఏకంగా పదికి పైగా చిన్న హీరోల చిత్రాలు ప్రేక్షకులను అలరించేందుకు రాబోతున్నాయి. మరోవైపు ఓటీటీలోనూ కొత్త సినిమాలు, సిరీస్‌లు డబుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాయి. ఆ విశేషాలేంటో ఇప్పుడు ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.
థియేటర్‌లో రిలీజయ్యే చిత్రాలు
వెయ్ దరువెయ్
ప్రముఖ డైరెక్టర్ పూరి జగన్నాథ్ సోదరుడు సాయిరాం శంకర్ హీరోగా చేసిన లేటెస్ట్ చిత్రం ‘వెయ్ దరువెయ్’ (Vey Dharuvey). యషా శివకుమార్ హీరోయిన్. నవీన్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సునీల్, సత్యం రాజేష్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. భీమ్స్ సిసిరిలియో సంగీతం అందించారు. ఈ సినిమా శుక్రవారం (మార్చి 15) ప్రేక్షకుల ముందుకు రానుంది.
రజాకార్
బాబీ సింహా, వేదిక, అనుష్య త్రిపాఠి, అనసూయ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘రజాకార్’ (Razakar). యాట సత్యనారాయణ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి భీమ్స్ సిసిరిలియో సంగీతం సమకూర్చారు. గూడురు నారాయణరెడ్డి నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా కూడా శుక్రవారమే థియేటర్లలో సందడి చేయనుంది.
తంత్ర
యంగ్ హీరోయిన్ అనన్య నాగళ్ల ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం ‘తంత్ర’ (Tantra). శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకత్వం వహించారు. నరేష్‌బాబు, రవి చైతన్య నిర్మాతగా వ్యవహరించారు. హారర్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా మార్చి 15న థియేటర్లలోకి రానుంది. ఈ చిత్రానికి ఆర్ఆర్ ధ్రువన్ పాటలు, నేపథ్య సంగీతం సమకూర్చారు.
షరతులు వర్తిస్తాయి!
చైతన్యరావ్, భూమిశెట్టి జంటగా నటించిన ‘షరతులు వర్తిస్తాయి!’ (Sharathulu Varthisthai) సినిమా కూడా ఈ వారమే ప్రేక్షకుల ముందుకు రానుంది. శుక్రవారం (15-03-2024) నుంచి థియేటర్లలో సందడి చేయనుంది. కుమార స్వామి దర్శకత్వం వహించగా.. శ్రీలత, నాగార్జున సామల, శారత, శ్రీష్ కుమార్, విజయ, కృష్ణకాంత్ సంయుక్తంగా నిర్మించారు.
లైన్‌మ్యాన్
త్రిగుణ్, కాజల్ కుందర్ జంటగా నటించిన చిత్రం ‘లైన్‌మ్యాన్’ (Line man). వి రఘుశాస్త్రి దర్శకుడు. ఖాద్రి మణికాంత్ సంగీతం అందించారు. ఈ చిత్రం మార్చి 15న రిలీజ్ కానుంది. ఇప్పటికే విడుదలైన మూవీ ట్రైలర్, టీజర్, ప్రచార చిత్రాలు ఆకట్టుకుంటున్నాయి.
రవికుల రఘురామ
ఈ వారం రాబోతున్న మరో చిన్న సినిమా ‘రవికుల రఘురామ’ (Ravikula Raghurama). గౌతమ్ వర్మ, దీప్షిక, సత్య, జబర్దస్త్ నాగి ప్రధాన పాత్రలు పోషించారు. చంద్రశేఖర్ కనూరి ఈ మూవీకి దర్శకత్వం వహించగా.. శ్రీధర్ వర్మ నిర్మించారు. ఈ చిత్రం శుక్రవారం (15-03-2024) ప్రేక్షకుల ముందుకు రానుంది.
లంబసింగి
భరత్ రాజ్ హీరోగా బిగ్‌బాస్ ఫేమ్ దివి హీరోయిన్‌గా చేసిన తాజా చిత్రం ‘లంబసింగి’ (Lambasingi). నవీన్ గాంధీ దర్శకత్వం వహించిన ఈ సినిమా మార్చి 15న విడుదలకు సిద్ధమవుతోంది. ఆర్‌ఆర్ ధ్రువన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్నిఆనంద్ తన్నీరు నిర్మించారు.
యోధ
సిద్ధార్థ్ మల్హోత్ర, రాశీఖన్నా, దిశా పటానీ ప్రధాన పాత్రలో చేసిన లేటెస్ట్ బాలీవుడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘యోధ’ (Yodha). సాగర్ అంబ్రీ దర్శకత్వం వహించారు. యశ్ జోహార్, కరణ్ జోహర్ సంయుక్తంగా నిర్మించారు. మార్చి 15 శుక్రవారం రోజున ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇతర చిత్రాలు
పై చిత్రాలతో పాటు ‘ప్రేమలో ఇద్దరు’, ‘కుంగ్‌ఫూ పాండా 4’, ‘మాయ 2024’ చిత్రాలు కూడా థియేటర్‌లో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాయి.
ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు
ఈ వారం ఓటీటీలో 'హనుమాన్' హిందీ వెర్షన్ రిలీజ్ కానుంది. తెలుగు వెర్షన్‌పై క్లారిటీ రావాల్సి ఉంది. మమ్మట్టి 'భ్రమయుగం', 'సేవ్ ద టైగర్స్ 2' సిరీస్‌తో పాటు 'మర్డర్ ముబారక్', 'మెయిన్ అటల్ హునా' అనే హిందీ చిత్రాలు ఇంట్రెస్ట్ కలిగిస్తున్నాయి. వీటితో పాటు పలు హిందీ, ఇంగ్లీష్ సినిమాలు, సిరీసులు మెుత్తం 24 ఓటీటీల్లోకి రాబోతున్నాయి. వాటిలో ముఖ్యమైన వాటిని ఇప్పుడు చూద్దాం.
మరిన్ని OTT చిత్రాలు & వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
https://telugu.yousay.tv/tfidb/ott
TitleCategoryLanguagePlatformRelease DateHanuman MovieHindiJio CinemaMarch 16To Kill A TigerSeriesHindiNetflixMarch 10Young Royals Season 3SeriesEnglishNetflixMarch 11Jesus Revolution MovieEnglishNetflixMarch 12Turning PointSeriesEnglishNetflixMarch 12BandidosSeriesEnglish/SpanishNetflixMarch 13Iresh WishMovieEnglishNetflixMarch 15Iron Rean SeriesEnglish/SpanishNetflixMarch 15Murder MubarakMovieHindiNetflixMarch 15Love AdhuraSeriesHindiAmazon PrimeMarch 13Big Girls Don't CrySeriesHindiAmazon PrimeMarch 14Invisible Season 2SeriesEnglishAmazon PrimeMarch 14FreedaMovieEnglishAmazon PrimeMarch 15Grey's Anatomy Season 20SeriesEnglishDisney + HotstarMarch 15Save the tigers 2SeriesTeluguDisney + HotstarMarch 15Taylor Swift : The Eras TourMovieEnglishDisney + HotstarMarch 15Main Atal WhoMovieHindiZee 5March 14BramayughamMovieTeluguSonyLIVMarch 15The Devil ConspiracyMovieEnglishBook My ShowMarch 15
మార్చి 11 , 2024
Allu Arjun: విచారణ పూర్తి.. అల్లు అర్జున్‌ను అడిగిన ప్రశ్నలు ఇవే!
సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో 'పుష్ప 2' హీరో అల్లు అర్జున్ పోలీసుల విచారణకు హాజరయ్యారు. మంగళవారం (డిసెంబర్ 24) ఉదయం 10.30 గం.ల జూబ్లీహిల్స్ ఇంటి నుంచి బన్నీ బయలుదేరారు. అతడితో పాటు తండ్రి అల్లు అరవింద్, మామ చంద్రశేఖర్ రెడ్డి, బన్నీ వాసు ఉన్నారు. చిక్కడపల్లి పోలీసు స్టేషన్‌లో ఉ.11 గంటలకు అల్లు అర్జున్ విచారణ మెుదలైంది. ఏసీపీ రమేష్, ఇన్‌స్పెక్టర్ రాజు నాయక్ సమక్షంలో సెంట్రల్ జోన్ డీసీపీ ఆకాంక్ష్ యాదవ్ ఘటనకు సంబంధించి పలు ప్రశ్నలు వేశారు.
అల్లు విచారణ పూర్తి
దాదాపు రెండున్నర గంటలకు పైగా అల్లు అర్జున్‌ను సెంట్రల్ జోన్ డీసీపీ ఆకాంక్ష్ యాదవ్ ప్రశ్నించారు. తొక్కిససలాటకు సంబంధించి కీలక ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది. అంతేకాదు తొక్కిసలాటకు సంబంధించిన 10నిమిషాల వీడియోను కూడా అల్లు అర్జున్‌కు చూపించారు. ఆ వీడియోకు సంబంధించి కూడా కొన్ని ప్రశ్నలు వేసినట్లు తెలుస్తోంది. బన్నీ స్టేట్‌మెంట్ రికార్డు చేసిన అనంతరం అతడ్ని విడిపెట్టినట్లు తెలుస్తోంది. కట్టుదిట్టమైన భద్రత మధ్య అల్లు అర్జున్‌ను ఇంటి వద్ద పోలీసులు విడిచిపెట్టనున్నారు.
https://twitter.com/ANI/status/1871431900340142523
ఆ ప్రశ్నలకు బన్నీ మౌనం..!
చిక్కడపల్లి పోలీసు స్టేషన్‌లో న్యాయవాది అశోక్ రెడ్డి సమక్షంలో విచారణ కొనసాగింది. ‘తొక్కిసలాటలో రేవతి చనిపోయిన విషయం మీకు తెలుసు కదా’ అని పోలీసులు ప్రశ్నించగా అల్లు అర్జున్ నోరు మెదపలేదని తెలుస్తోంది. ఆ తర్వాత రోజు వరకు తనకు తెలియదని మీడియాకు ఎందుకు చెప్పారని పోలీసులు ప్రశ్నించగా ఈ క్వశ్చన్‌కు కూడా బన్నీ సైలెంట్‌గానే ఉన్నారని సమాచారం.
https://twitter.com/TOIHyderabad/status/1871462776591548839
బన్నీ కోసం 50 ప్రశ్నలు!
సంధ్యా థియేటర్ ఘటనకు సంబంధించి మెుత్తం 50 ప్రశ్నలను అల్లు అర్జున్ కోసం సిద్ధం చేసినట్లు సమాచారం. ఒక్కొక్కటిగా ఆ ప్రశ్నలను బన్నీకి సంధించినట్లు తెలిసింది. దీనిపై బన్నీ ఇచ్చే సమాధానాన్ని బట్టి కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశముంది. లేటెస్ట్ అప్‌డేట్స్ ప్రకారం బన్నీ ఆచితూచి సమాధానాలు ఇచ్చినట్లు తెలుస్తుంది.
https://twitter.com/timesofindia/status/1871431495480750275
బన్నీని అడిగిన ప్రధాన ప్రశ్నలు ఇవే!
తొక్కిసలాట ఘటనకు సంబంధించి బన్నీ కోసం 50 ప్రశ్నలను చిక్కడపల్లి పోలీసులు రెడీ చేసిన సంగతి తెలిసిందే. వాటిలో అతి ముఖ్యమైన ప్రశ్నలు మీడియా సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతున్నాయి. వాటిపై ఓ లుక్కేయండి.
1. సంధ్య థియేటర్‌కు వచ్చే ముందు ఎవరి అనుమతి తీసుకున్నారు?
2. పోలీసులు అనుమతి ఉందని మీకు ఎవరు చెప్పారు?
3. పోలీసులు అనుమతి నిరాకరించినట్లు మీకు సమాచారం ఉందా? లేదా?
4. తొక్కిసలాటలో రేవతి చనిపోయినట్లు థియేటర్‌లో ఉన్నప్పుడు తెలిసిందా? లేదా?
5. రేవతి మరణం గురించి ఎవరూ చెప్పలేదని మీడియా ముందు ఎందుకు చెప్పారు?
6. రోడ్ షోకు అనుమతి తీసుకున్నారా? లేదా?
7. అనుమతి లేకుండా రోడ్ షో ఎలా నిర్వహించారు?
8. మీ కుటుంబ సభ్యులు ఎవరెవరు థియేటర్‌కు వచ్చారు?
9. మీతో వచ్చిన బౌన్సర్లు ఏ ఏజెన్సీకి సంబంధించిన వారు?
10. ఎంతమంది బౌన్సర్లను మీరు నియమించుకున్నారు?
11. అభిమానులు, పోలీసుల మీద దాడి చేసిన బౌన్సర్లు ఎవరు?
12. ఓ మహిళ చనిపోయిందని, మీరు థియేటర్ నుంచి వెళ్లిపోవాలని పోలీసులు చెప్పారా? లేదా?
13. పోలీసులు చెప్పినా వెళ్లేందుకు ఎందుకు మొదట నిరాకరించారు?
14. రేవతి చనిపోయిన విషయాన్ని మీరు మొదట ఎప్పుడు తెలుసుకున్నారు?
డిసెంబర్ 24 , 2024
చిరంజీవితో పాటు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించిన తెలుగు సినీ ప్రముఖులు వీళ్లే!
టాలీవుడ్ అగ్ర హీరో మెగాస్టార్ చిరంజీవి తాజాగా మరో అత్యున్నత గౌరవాన్ని పొందారు. గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నారు. 156 చిత్రాలు, 537 పాటలు, 24 వేల స్టెప్పులతో అలరించినందుకు ఆయనకు ఈ రికార్డు దక్కింది. ఈ మేరకు గిన్నిస్ బుక్ ప్రతినిధులు, బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ ఈ అవార్డును ప్రదానం చేశారు. ప్రముఖ దర్శకులు రాఘవేంద్రరావు, బి.గోపాల్, కోదండరామిరెడ్డి, గుణశేఖర్, బాబీతోపాటు నిర్మాతలు అల్లు అరవింద్, అశ్వనీదత్, శ్యామ్‌ప్రసాద్ రెడ్డి, సురేశ్ బాబు, జెమిని కిరణ్, మైత్రి రవిశంకర్, తమ్మారెడ్డి భరద్వాజ, కేఎస్ రామారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చిరంజీవికి అభినందనలు తెలిపారు. చిరుతో తమకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో గిన్నిస్ బుక్‌లోకి ఎక్కిన మిగతా ప్రముఖులేవరో ఇప్పుడు చూద్దాం.
రామోజీరావు
ప్రపంచంలోనే అతిపెద్ద ఫిల్మ్ సిటీని నిర్మించిన రామోజీరావు గారు, గిన్నిస్ బుక్‌లో ప్రత్యేక స్థానం సంపాదించారు. ఆయన ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్‌పై అనేక విజయవంతమైన చిత్రాలు నిర్మించారు. ఈనాడు పత్రికా సంపాదకుడిగా, నిర్మాతగా ఎంతో సేవ చేశారు.
దాసరి నారాయణ రావు
తెలుగు, తమిళం, హిందీ భాషల్లో 150కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించి, దాసరి నారాయణరావు గారు రికార్డు సృష్టించారు. ఈ ఘనతతో అతనికి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ప్రత్యేక గుర్తింపు లభించింది.
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం
శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం, ఎస్పీ బాలు అని ప్రసిద్ధి పొందారు. ఆయన తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మరాఠి, మలయాళం భాషల్లో సుమారు 40,000కి పైగా పాటలు పాడారు. ఈ విషయంలో కూడా ఆయనకు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం దక్కింది. బాలు సంగీత దర్శకుడు, నటుడు, టెలివిజన్ వ్యాఖ్యాతగా కూడా ప్రసిద్ధి పొందారు.
దగ్గుబాటి రామానాయుడు
దగ్గుబాటి రామానాయుడు, మూవీ మోఘల్‌గా ప్రసిద్ధి చెందారు. 100 చిత్రాలకు పైగా నిర్మాతగా నిలిచిపోయి, ప్రపంచ రికార్డు సృష్టించారు. ఆయన పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో ప్రత్యేక గుర్తింపు పొందింది. భారత ప్రభుత్వం పథ్మ భూషణ్ మరియు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులతో సత్కరించింది.
విజయనిర్మల
తెలుగు, తమిళ, మలయాళం భాషల్లో 200కి పైగా సినిమాల్లో నటించిన విజయనిర్మల, 44 చిత్రాలను దర్శకురాలిగా తెరకెక్కించి రికార్డు సృష్టించారు. 2002లో గిన్నిస్ బుక్‌లో ప్రత్యేక స్థానం సంపాదించారు. 2019లో ఆమె మరణించారు.
పి. సుశీల
భారతీయ సినీ పరిశ్రమలో 60 సంవత్సరాల పైగా ప్రసిద్ధి పొందిన గానకోకిల పి. సుశీల, 12 భాషల్లో దాదాపు 30,000 పాటలు పాడారు. ఈ ఘనతతో ఆమె గిన్నిస్ బుక్‌లో ప్రత్యేక స్థానం సంపాదించారు. భారత ప్రభుత్వం ఆమెకు పథ్మభూషణ్ అవార్డు అందించింది.
బ్రహ్మానందం
కన్నెగంటి బ్రహ్మానందం, ప్రఖ్యాత తెలుగు హాస్య నటుడు, ఒకే భాషలో 754 చిత్రాల్లో నటించినందుకు గిన్నిస్ బుక్‌లో చోటు దక్కించారు. ఆయన పూర్తి సమర్థవంతంగా 1250 సినిమాలకు పైగా నటించారు. భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ పురస్కారం అందించారు.
సెప్టెంబర్ 25 , 2024
Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌పై నెటిజన్ల ట్రోల్స్, AI యూజ్ చేసి ట్వీట్ చేస్తున్నాడని సాక్ష్యాలు!
ఏపీలో తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. ప్రాయిశ్చిత్త దీక్షలో భాగంగా నిన్న (సెప్టెంబర్ 24) పవన్ కల్యాణ్ విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో శుద్ది కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా హీరో కార్తీపై పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ మండిపడ్డారు. అటు నటుడు ప్రకాష్ రాజ్‌కు సైతం తీవ్రస్థాయిలో చురకలు అంటించారు. దాంతో కార్తీ పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌కు క్షమాపణలు చెబుతూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. దీనిపై పవన్ కూడా ఎక్స్ వేదికగా స్పందించారు. తాను అర్థం చేసుకున్నానని చెప్పారు. అయితే పవన్ స్వయంగా ఈ పోస్టును రాయలేదని నెట్టింట ప్రచారం జరుగుతోంది. ఏఐ సాయంతో కార్తీకి రిప్లై ఇచ్చినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
పవన్ ఏఐ పోస్టు..?
తిరుమల లడ్డూ మహా ప్రసాదం వివాదంపై కథానాయకుడు కార్తి (Karthi) స్పందించిన తీరు పట్ల ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ (Pawan Kalyan) అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా కార్తిని ఉద్దేశిస్తూ పవన్ ‘ఎక్స్’ వేదికగా పోస్ట్ పెట్టారు. మన సంప్రదాయాలను గౌరవిస్తూ వెంటనే కార్తి స్పందించిన తీరు సంతోషదాయకమన్నారు. ఉద్దేశపూర్వకంగా కార్తి అలా అనలేదని తాను అర్థం చేసుకున్నట్లు చెప్పారు. ఈమేరకు ఎక్స్‌లో సుదీర్ఘ పోస్టు పెట్టారు. అయితే ఈ మాటలన్నీ పవన్ స్వయంగా రాయలేదని నెట్టింట ప్రచారం జరుగుతోంది. చాట్ జీపీటీ లేదా ఏఐ సాయంతో పదాల కూర్పును జనరేట్ చేయించి పవన్ ఈ ట్వీట్ చేశారని విమర్శలు వస్తున్నాయి. కార్తీ లాంటి నటుడి విషయంలో పవన్ ఇలా ప్రవర్తించడం ఏంటని కొందరు ప్రశ్నిస్తున్నారు. స్వయంగా పోస్టు పెట్టే తీరికా లేదా అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.
https://twitter.com/PawanKalyan/status/1838587619745087518
‘ఏఐ’ వినియోగంలో తప్పుందా!
కార్తీపై పవన్ చేసిన పోస్టును ఏఐ డిటెక్టర్ ద్వారా పరిశీలించగా ఇది నిజమేనని తేలింది. అయితే సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నట్లు ఇందులో తప్పు ఉందా అంటే లేదనే చెప్పాలి. ఈ రోజుల్లో ఏఐ జనరేటెడ్ కంటెంట్‌ను సెలబ్రిటీలు, పొలిటీషియన్స్ బాగానే వినియోగిస్తున్నారు. తాము చెప్పాలనుకుంటున్న విషయాన్ని ముందుగా రాసుకొని ఏఐ టూల్స్ ద్వారా వాటిలోని తప్పొప్పులను సరిచేసుకుంటున్నారు. స్పెల్లింగ్ మిస్టేక్స్, గ్రమిటికల్ తప్పులు లేకుండా ఏఐ సాయంతో సరిచూసుకుంటున్నారు. లక్షలాది మందిని తమ పోస్టు ప్రభావితం చేయనున్న నేపథ్యంలో తప్పులు దొర్లకుండా ఇలా జాగ్రత్తపడుతున్నారు. ఈ క్రమంలోనే కార్తీ విషయంలో తన రియాక్షన్ స్పష్టంగా ఉందో? లేదో? తెలుసుకునేందుకు పవన్ ఏఐ టూల్ సాయం తీసుకొని ఉండొచ్చని అంటున్నారు. అంతేకాదు కొందరు సెలబ్రిటీలు నేరుగా తమ ట్విటర్ హ్యాండిల్స్ ఉపయోగించరని, దాని కోసం ప్రత్యేకంగా ఒక పర్సన్‌ను నియమించుకుంటారని గుర్తుచేస్తున్నారు. కాబట్టి పవన్ ఏఐ ట్వీట్ అంశాన్ని భూతద్దంలో పెట్టి చూడాల్సిన పని లేదని ఫిల్మ్ వర్గాలు చెబుతున్నాయి.
కార్తీ చేసిన తప్పేంటి?
సోమవారం జరిగిన 'సత్యం సుందరం' ప్రీరిలీజ్ ఈవెంట్‌లో తిరుమల లడ్డు వ్యవహారంపై నటుడు కార్తీ ఇచ్చిన సమాధానం వివాదానికి దారితీసింది. యాంకర్ లడ్డు ప్రస్తావన తీసుకురాగా 'ఇప్పుడు లడ్డు గురించి మాట్లాడకూడదు. సెన్సిటివ్ టాపిక్.. మనకొద్దు అది' అంటూ పరిహాసమాడారు. దీనిపై తాజాగా పవన్ ఫైర్ అయిన నేపథ్యంలో కార్తీ స్పందించారు. 'ప్రియమైన పవన్ కళ్యాణ్ సర్, మీ పట్ల ప్రగాఢ గౌరవంతో ఉన్నాను. నేను మాట్లాడిన మాటల్లో ఏదైనా అనుకోని అపార్థం ఏర్పడినందుకు నేను క్షమాపణలు కోరుతున్నాను. వెంకటేశ్వరుని వినయపూర్వకమైన భక్తుడిగా, నేను ఎల్లప్పుడూ మన సంప్రదాయాలను గౌరవిస్తాను' అని ఎక్స్‌వేదికగా పోస్టు పెట్టారు. అయితే లడ్డు విషయంలో కార్తీ తప్పుగా ఏమి మాట్లాడలేదని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. యాంకర్ లడ్డు టాపిక్ తీయబట్టే ఆయన స్పందించాల్సి వచ్చిందని పేర్కొంటున్నారు.
https://twitter.com/Ashwatthama2898/status/1838434828871483470
పవన్‌కు కార్తీ, సూర్య థ్యాంక్స్!
కార్తీక్‌పై చేసిన పోస్టులో పవన్ కల్యాణ్ ‘సత్యం సుందరం’ చిత్రాన్ని ప్రస్తావించారు. సూర్య గారు, జ్యోతిక గారు సహా సత్యం సుందరం చిత్ర బృందానికి సినిమా రిలీజ్ నేపథ్యంలో శుభాకాంక్షలు తెలిపారు. ఇలాంటి జనరంజకమైన సినిమాలు మరినని తీయాలని 2డీ ఎంటర్‌టైన్‌మెంట్‌ను కోరుతున్నట్లు చెప్పారు. దీనిపై కార్తీతో పాటు నటుడు సూర్య కూడా స్పందించారు. పవన్ ట్వీట్‌కు రిప్లైగా ‘థ్యాంక్స్’ చెప్పారు. ఇద్దరి సోదరుల నుంచి పాజిటివ్ రియాక్షన్ రావడంతో వివాదం సద్దుమణినట్లేనని ఫిల్మ్ వర్గాలు అభిప్రాయపడుతున్నారు. పవన్ ఆగ్రహాన్ని అర్థం చేసుకొని హుందాగా ప్రవర్తించిన సూర్య, కార్తీల తీరును చూసి నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
సెప్టెంబర్ 25 , 2024
Megastar Chiranjeevi Dancing Hits: చిరంజీవికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు కల్పించిన టాప్ 15 సాంగ్స్ ఇవే!
టాలీవుడ్ అగ్రకథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి తాజాగా మరో విశిష్ట గౌరవాన్ని అందుకున్నారు. గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నారు. 156 చిత్రాలు.. 537 పాటలు.. 24 వేల స్టెప్పులతో అలరించినందుకు ఆయనకు ఈ రికార్డు దక్కింది. ఈ మేరకు గిన్నిస్ బుక్ ప్రతినిధులు, బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ ఈ అవార్డును ప్రదానం చేశారు. ప్రముఖ దర్శకులు రాఘవేంద్రరావు, బి.గోపాల్, కోదండరామిరెడ్డి, గుణశేఖర్, బాబీతోపాటు నిర్మాతలు అల్లు అరవింద్, అశ్వనీదత్, శ్యామ్‌ప్రసాద్ రెడ్డి, సురేశ్ బాబు, జెమిని కిరణ్, మైత్రి రవిశంకర్, తమ్మారెడ్డి భరద్వాజ, కేఎస్ రామారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చిరంజీవికి అభినందనలు తెలిపారు. చిరుతో తమకున్న అనుబంధాన్ని పంచుకున్నారు.
డ్యాన్స్‌కు కేరాఫ్!
‘పునాది రాళ్లు’ సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మెగాస్టార్, కెరీర్ ప్రారంభంలో ఎన్నో సవాళ్లు, అవమానాలు ఎదుర్కొన్నారు. వాటన్నింటిని తన టాలెంట్‌తో అధిగమించారు. నటనతో పాటు డ్యాన్స్‌లోనూ తనకు తిరుగులేదని నిరూపించుకున్నారు. డ్యాన్స్ అంటే చిరు.. చిరు అంటే డ్యాన్స్ అనే స్థాయిలో టాలీవుడ్‌పై బలమైన ముద్ర వేశారు. 1980 నుంచి 2005 మధ్య దాదాపు మూడున్నర దశాబ్దాల పాటు డ్యాన్స్‌లో రారాజుగా వెలుగొందారు. చిరుతో డ్యాన్స్ అంటే కొరియోగ్రాఫర్లే ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు. రీఎంట్రీ తర్వాత 60 ప్లస్ వయసులోనూ అదిరిపోయే డ్యాన్స్‌లు చేస్తూ ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగిస్తున్నారు. డ్యాన్స్‌లో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సాధించిన నేపథ్యంలో చిరంజీవి అద్భుతమైన డ్యాన్స్ చేసిన టాప్-15 సాంగ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
రగులుతోంది మొగలిపొద (ఖైదీ)
చిరంజీవిని సుప్రీం హీరోను చేసిన చిత్రం ఖైదీ. ఈ మూవీ సక్సెస్‌తో చిరంజీవి రాత్రికి రాత్రి స్టార్‌గా మారిపోయారు. ముఖ్యంగా ఇందులోని ‘రగులుతుంది మొగలిపొద’ సాంగ్ అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. చిరులోని గొప్ప డ్యాన్సర్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేసింది. మాధవితో కలిసి చిరు వేసిన స్టెప్స్ ఇప్పటికీ ట్రెండ్ సెట్టర్ అని చెప్పవచ్చు. పాములా మెలికలు తిరుగుతూ చిరు వేసిన స్టెప్స్ ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఈ సాంగ్ షూట్ తర్వాత దాదాపు వారం రోజుల పాటు చిరు ఒళ్లు నొప్పులతో బాధపడ్డారట. ఈ సాంగ్ ఓసారి మీరూ చూసేయండి.
https://www.youtube.com/watch?v=nyxj1TAjn8Q
చక్కని చుక్క (పసివాడి ప్రాణం)
కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘పసివాడి ప్రాణం’ చిత్రం అప్పట్లో సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాలోని ‘చక్కని చుక్కలా’ సాంగ్ ద్వారా చిరు కొత్త ట్రెండ్‌ను సృష్టించారు. ఈ సాంగ్ ద్వారానే చిరు బ్రేక్ డ్యాన్స్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఈ పాటలో హీరోయిన్ విజయశాంతితో చిరు వేసిన స్టెప్స్‌ను నాటి తరం ఎప్పటికీ మరిచిపోలేదు.
https://www.youtube.com/watch?v=q5aetbezCqM
నవ్వింది మల్లె చెండు (అభిలాష)
‘అభిలాష’ చిత్రంలోని ఈ పాటలో చిరు హుషారైన స్టెప్పులతో ఆకట్టుకున్నారు. లవ్‌ను ప్రేయసి ఓకే చేస్తే ఆ ప్రియుడు సంతోషం ఏ స్థాయిలో ఉంటుందో చిరు చూపించారు. ఇళయరాజా సంగీతంలో వచ్చిన ఈ పాట మ్యూజిక్ లవర్స్‌ను కట్టిపడేసింది.
https://www.youtube.com/watch?v=82hUDmPYazk
హే పాప (త్రినేత్రుడు)
‘త్రినేత్రుడు’లోని ‘హే పాప’ అంటూ వచ్చే సాంగ్‌లో చిరంజీవి మరోసారి తన బ్రేక్ డ్యాన్స్ స్కిల్స్‌ను చూపించారు. ఓ క్లబ్‌లోని బ్రేక్ డ్యాన్సర్‌కు సవాలు విసిరిమరి చిరు నృత్యం చేస్తాడు. హీరోయిన్ భానుప్రియ కూడా అదిరిపోయే స్టెప్పులతో చిరుకు సహకారం అందించింది. స్వతహాగా క్లాసికల్ డ్యాన్సర్ అయిన ఆమె చిరుకు పోటీగా సాంగ్ చేసింది.
https://www.youtube.com/watch?v=1vOAj1HaG1Y
పదహరేళ్ల వయసు (లంకేశ్వరుడు)
‘లంకేశ్వరుడు’ మూవీలోని ‘పదహరేళ్ల వయసు’ పాటకు అప్పట్లో సూపర్ రెస్పాన్స్ వచ్చింది. క్లాప్ క్లాప్ అంటూ సాంగ్‌ను స్టార్ట్ చేసిన చిరు తన హుషారైన స్టెప్పులతో విజిల్స్ వేయించారు. ఈ సాంగ్‌లోని చిరు గెటప్ చాలా ఏళ్ల పాటు యువతను ఒక ఊపు ఊపింది. ఈ సాంగ్‌లో చిరు వేసిన స్టెప్స్ అభిమానులు ఎప్పుడు గుర్తుంచుకుంటారు. రీసెంట్‌గా ‘మత్తు వదలరా 2’ చిత్రంలో కమెడియన్ సత్య ఈ సాంగ్‌ను రిఫరెన్స్‌గా తీసుకొని స్టెప్పులు వేయడం విశేషం.
https://www.youtube.com/watch?v=fsnOGypjHI0
గ్యాంగ్ లీడర్ టైటిల్ సాంగ్
చిరంజీవి హీరోగా విజయ బాపినీడు దర్శకత్వంలో వచ్చిన ‘గ్యాంగ్ లీడర్’ చిత్రం మాస్ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకర్షించింది. ఇందులో గ్యాంగ్ లీడర్ అంటూ సాగే టైటిల్ సాంగ్‌లో చిరంజీవి వేసిన స్టెప్స్ అదిరిపోయాయి. ఇప్పటికీ ఆ పాట చూస్తే మెగా ఫ్యాన్స్ పూనకం వచ్చినట్లు ఊగిపోతారు.
https://www.youtube.com/watch?v=KUZ4e7t4u5k
స్టార్ స్టార్ మెగాస్టార్ (కొదమ సింహం)
కొదమ సింహం సినిమాలోని 'స్టార్ స్టార్ మెగాస్టార్' సాంగ్ చిరంజీవిని డ్యాన్సర్‌గా మరో మెట్టు ఎక్కించింది. సుప్రీం హీరో ట్యాగ్‌ను దాటి మెగా స్టార్ ట్యాగ్‌ను అందించింది. ఇందులో ఆద్యంతం కౌబాయ్ కాస్ట్యూమ్స్‌లో కనిపించిన చిరు తన యునిక్ స్టెప్పులతో అదరగొట్టారు. ముఖ్యంగా తలపై టోపీని ఉపయోగిస్తూ ఆయన చేసిన డ్యాన్స్ తెలుగులో ట్రెండ్ సెట్టర్ అని చెప్పవచ్చు. అప్పటివరకూ టోపీని ఉపయోగించి ఏ తెలుగు హీరో స్టెప్స్ వేయలేదు.
https://www.youtube.com/watch?v=cFKyIHvudzI
బంగారు కోడిపెట్ట (ఘరానా మొగుడు)
రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ‘ఘరానా మొగుడు’ చిత్రం చిరంజీవి ఇమేజ్‌ని ఆకాశానికి తీసుకెళ్లింది. ఈ సినిమాకు గాను రూ. కోటి రెమ్యునరేషన్ తీసుకుని దేశంలో ఈ ఘనత సాధించిన తొలి నటుడిగా చిరంజీవి చరిత్ర సృష్టించారు. ఇక ఇందులోని 'బంగారు కోడిపిట్ట' సాంగ్ ఏ స్థాయిలో సెన్సేషన్ సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రభుదేవా కంపోజ్ చేసిన ఈ సాంగ్‌లో డిస్కో శాంతిని టీజ్ చేస్తూ చిరు స్టెప్పులు వేశారు. డ్యాన్స్‌తో పాటు తన హావభావాలతో ఆకట్టుకున్నారు. చిరు కుమారుడు రామ్‌చరణ్ మగధీర చిత్రంలో ఈ సాంగ్‌ను రీమేక్ చేయడం విశేషం.
https://www.youtube.com/watch?v=hxvUiz6s4Gk
రూపుతేరా మస్తానా (రిక్షావోడు)
రిక్షావోడు చిత్రంలోని ‘రూపుతేరా మస్తానా’ మ్యూజిక్ ప్రియులకు పూనకాలు తెప్పిస్తుంది. సంగీత దర్శకుడు కోటీ ఇచ్చిన వెస్టర్న్ బీట్‌ను మ్యాచ్ చేస్తూ చిరు ఇరగదీశారు. మెలికలు తిరుగుతూ వెస్టర్న్ స్టెప్పులతో ఆకట్టుకున్నారు. హీరోయిన్ నగ్మాతో కలిసి మెస్మరైజ్ చేశారు.
https://www.youtube.com/watch?v=mugdo_VO9pY
నడక కలిసిన నవరాత్రి (హిట్లర్)
ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో వచ్చిన ‘హిట్లర్’ మూవీలోని నడక కలిసిన నవరాత్రి సాంగ్ సూపర్‌హిట్‌గా నిలిచింది. దీనికి లారెన్స్ కొరియోగ్రఫి చేశారు. ఈ పాటలో చిరు వేసిన స్టెప్స్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా చేశాయి. హీరోయిన్ రంభ చిరుతో పోటీపడి మరి డ్యాన్స్ చేయడం గమనార్హం.
https://www.youtube.com/watch?v=j2HY4G63qaE
ఈ పేటకు నేనే మేస్త్రీ (ముఠా మేస్త్రి)
ఈ సాంగ్‌లో చిరు వేసిన హుక్ స్టెప్స్ ఎవర్‌గ్రీన్ అని చెప్పవచ్చు. ఈ పేటకు నేనే మేస్త్రీ అంటూ చేతిలో టవల్‌తో బాడిని బెండ్ చేసి భుజాలు ఎగరేసే స్టెప్ చాలా మందికి పూనకాలు తెప్పించింది. ఈ సాంగ్ మెుత్తం చిరు లుంగీలోనే కనిపిస్తారు. తలకు టవల్ చుట్టుకొని మాస్ స్టెప్పులతో ఆద్యంతం అలరించాడు.
https://www.youtube.com/watch?v=oppz5I9KeQA
దాయి దాయి దామ్మ (ఇంద్ర)
‘ఇంద్ర’ సినిమాలోని దాయి దాయి దామ్మ సాంగ్ చిరంజీవిలోని డ్యాన్సింగ్ స్కిల్స్‌ను నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళ్లింది. ఇందులోని వీణ స్టెప్ చిరు కెరీర్‌లోనే ఆల్‌టైమ్ గ్రేట్‌గా నిలిచింది. లారెన్స్ కంపోజ్ చేసిన ఈ స్టెప్‌ను ఎంతో గ్రేస్‌తో చిరు చేశారు. అతి కష్టమైన ఆ స్టెప్‌ను అలవోకగా వేసి ఆశ్చర్యపరిచారు. ఈ స్టెప్‌ను ఇప్పటికీ చాలా మంది ట్రై చేస్తూ ఆనందిస్తుంటారు.
https://www.youtube.com/watch?v=39W78Hp4E8A
ఆటకావాలా పాటకావాలా (అన్నయ్య)
‘అన్నయ్య’ సినిమాలోని ‘ఆట కావాలా పాట కావాలా’ సాంగ్‌లో చిరు మాస్ స్టెప్పులతో ఉర్రూతలూగించారు. చిరు డ్యూయల్ రోల్‌లో కనిపించిన ఏకైక సాంగ్ ఇదే కావడం విశేషం. ఈ సాంగ్ అప్పట్లో ఎక్కడా చూసిన వినిపించేది.
https://www.youtube.com/watch?v=9NGgI8OHTLY
మన్మథ మన్మథ (ఠాగూర్)
వి.వి. వినాయక్ డైరెక్షన్‌లో చిరు హీరోగా వచ్చిన ‘ఠాగూర్’ చిత్రం తెలుగు రికార్డు విజయాన్ని అందుకుంది. ఇందులోని ‘మన్మథ మన్మథ మామ పుత్రుడా’ పాట అంతే స్థాయిలో ఆదరణ పొందింది. ఇందులో చిరు నిలబడి వేసే వీణ స్టెప్ మెస్మరైజ్ చేస్తుంది.
https://www.youtube.com/watch?v=FUnaQaxJNuQ
అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు (ఖైదీ నెంబర్ 150)
‘ఖైదీ నెంబర్ 150’ చిరంజీవి రీఎంట్రీ చిత్రంగా వచ్చింది. సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి ఇండస్ట్రీలో అడుగుపెట్టిన చిరు తనదైన స్టెప్పులతో ఈ సినిమాలో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా ‘అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు’ అంటూ చిరు వేసిన హుక్ స్టెప్ ఫ్యాన్స్‌ను మునుపటి రోజులకు తీసుకెళ్లింది. ఆ సాంగ్‌ను మరోమారు చూసి ఎంజాయ్ చేయండి.
https://www.youtube.com/watch?v=7jHMP7J6tRs
సెప్టెంబర్ 23 , 2024
This Week Movies: తెలుగులో ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘ఓపెన్ హైమర్’.. ఈ వారం రిలీజయ్యే చిత్రాలు ఇవే!
గత వారం లాగే ఈ వీక్ కూడా పలు చిన్న చిత్రాలు థియేటర్లలో సందడి చేయడానికి రాబోతున్నాయి. ఆహ్లాదకరమైన వినోదాన్ని అందించేందుకు సిద్ధమవుతున్నాయి. మార్చి 18 నుంచి 24 తేదీల మధ్య ఇవి థియేటర్లలో సందడి చేయనున్నాయి. అలాగే ఓటీటీలో కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. మరి ఆ సినిమాలు ఏంటి? వాటి విశేషాలు ఎలా ఉన్నాయి? ఈ కథనంలో చూద్దాం.
థియేటర్‌లో విడుదలయ్యే చిత్రాలు
ఓం భీమ్ బుష్..
శ్రీవిష్ణు, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి కీలక పాత్రల్లో శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఓం భీమ్ బుష్..’ (Om Bheem Bush). నో లాజిక్ ఓన్లీ మేజిక్ అనేది ఉప శీర్షిక. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ మార్చి 22న ప్రేక్షకుల ముందుకు రానుంది.
అనన్య
జయరామన్, చందన, తోషి అలహరి, ప్రజ్ఞ గౌతమ్, అరవింద్, సుమన్ కీలక పాత్రల్లో ప్రసాద్ రాజు బొమ్మిడి రూపొందించిన చిత్రం ‘అనన్య’ (Ananya Movie). జంధ్యాల ఉమా నాగ శివ గంగాధర శర్మ నిర్మించారు. హర్రర్ నేపథ్యంలో కుటుంబ ప్రేమ కథాచిత్రంగా ఈ సినిమా రూపొందింది. మార్చి 22న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
హద్దులేదురా
ఆశిష్ గాంధీ, అశోక్ కథానాయకులుగా తెరకెక్కుతున్న చిత్రం ‘హద్దులేదురా’ (haddu ledura movie). వర్ష, హ్రితిక కథానాయికలు. రాజశేఖర్ రావి దర్శకత్వం వహించారు. వీరేష్ గాజుల బళ్లారి నిర్మించారు. ‘భగవద్గీతలోని కృష్ణార్జునుల స్ఫూర్తితో ఈ చిత్రం తెరకెక్కించినట్లు మూవీ యూనిట్ తెలిపింది. మార్చి 21న ఈ సినిమా థియేటర్‌లలో విడుదల కానుంది.
ఓటీటీలో రిలీజయ్యే చిత్రాలు/సిరీస్‌లు
ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాల విషయానికొస్తే.. ఈసారి ఏడు ఆస్కార్స్ గెలుచుకున్న 'ఓపెన్ హైమర్'.. ఈ వారమే తెలుగులో స్ట్రీమింగ్ కానుంది. అలానే 'అబ్రహం ఓజ్లర్' అనే హిట్ మూవీ కూడా రానుంది. వీటితోపాటు 'ఏ వతన్ మేరే వతన్', 'ఫైటర్' లాంటి హిందీ చిత్రాలు కూడా డిజిటల్ రిలీజ్‌కి సిద్ధమైపోయాయి. మెుత్తంగా ఈ వారం 20 వరకూ చిత్రాలు ఓటీటీలోకి రాబోతున్నాయి. వాటిలో ప్రధానమైనవి ఏంటో ఇప్పుడు చూద్దాం.
ఓపెన్ హైమర్
ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డుల్లో ఈసారి 'ఓపెన్ హైమర్' సినిమా మెరిసింది. ఉత్తమ నటుడు, దర్శకుడు, చిత్రం, సహాయ నటుడు, ఒరిజినల్ స్కోర్, ఫిల్మ్ ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ.. ఇలా ప్రధాన విభాగాల్లో పురస్కారాలు కైవసం చేసుకుంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు ఈ మూవీ గురించి మరోసారి చర్చించుకుంటున్నారు. అయితే ఈ చిత్రం ఈ వారం తెలుగు డబ్బింగ్‌తో ఓటీటీలోకి రానుంది. ప్రముఖ ఓటీటీ వేదిక ‘జియో సినిమా’లో మార్చి 21 నుంచి ప్రసారం కానుంది.
సుందరం మాస్టార్
టాలీవుడ్ కమెడియన్ వైవా హర్ష హీరోగా ఎంట్రీ ఇచ్చిన తాజా చిత్రం ‘సుందరం మాస్టర్’ (Sundaram Master OTT). ఈ మూవీని దర్శకుడు కళ్యాణ్ సంతోష్ తెరకెక్కించగా.. ఇందులో హీరోయిన్‌గా దివ్య శ్రీపాద నటించింది. గత నెల థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం.. హిట్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. మార్చి 22 నుంచి ఈ సినిమా ఈటీవీ విన్‌లో ప్రసారం కానుంది.
‘భూతద్దం భాస్కర్ నారాయణ’
శివ కందుకూరి, రాశీ సింగ్ జంటగా తెరకెక్కిన చిత్రం ‘భూతద్దం భాస్కర్ నారాయణ’ (bhoothaddam bhaskar narayana ott). పురుషోత్తం రాజ్ దర్శకత్వం వహించారు. మార్చి 1న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులకు థ్రిల్‌ని పంచింది. ఇప్పుడు ఓటీటీలోనూ అదే థ్రిల్‌ను పంచడానికి వచ్చేస్తోంది. మార్చి 22 నుంచి ఆహా వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రంలో అరుణ్ కుమార్, దేవి ప్రసాద్, వర్షిణి సౌందరరాజన్ కీలకపాత్రలు పోషించారు.
అబ్రహాం ఓజ్లర్
జయరాం (Jayaram), అనూప్ మేనన్, అనస్వర రాజన్ కీలకపాత్రల్లో నటించిన సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ ‘అబ్రహాం ఓజ్లర్’ (Abraham Ozler OTT). మిధున్ మేనుయేల్ థామస్ దర్శకత్వం వహించారు. మమ్ముట్టి అతిథిగా నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి మెప్పించారు. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని నమోదు చేసింది. ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులకు అలరించడానికి సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ వేదిక డిస్నీ+హాట్‌స్టార్‌లో మార్చి 20 నుంచి మలయాళ, తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.
TitleCategoryLanguagePlatformRelease Date3 Body ProblemSeriesEnglishNetflixMarch 21FighterMovieHindiNetflixMarch 21Lal SalaamMovieTelugu/TamilNetflixMarch 22Play GroundSeriesHindiAmazon primeMarch 17Marakkuma Nenjam MovieTamilAmazon primeMarch 19Ae Watan Mere WatanMovieHindiAmazon primeMarch 21Road HouseMovieEnglishAmazon primeMarch 21LuteraMovieHindiDisney + HotstarMarch 22OppenheimerMovieHindi/TeluguJio CinemaMarch 21Sundaram MasterMovieTelugu ETV WinMarch 22
మార్చి 18 , 2024
REVIEW: కోనసీమ థగ్స్
దుల్కర్ సల్మాన్ ‘హే సినామిక’తో దర్శకురాలిగా మారిన కొరియోగ్రాఫర్ బృందా రెండో చిత్రం ‘కోనసీమ థగ్స్’. బాబీ సింహా కీలక పాత్రలో నటించిన ఈ సినిమా ట్రైలర్, టీజర్‌లు సినిమాపై ఆసక్తి పెంచాయి. ప్రముఖ బ్యానర్ మైత్రీ ఈ సినిమాను థియేటర్లలో ఇవాళ(24 Feb) విడుదల చేసింది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉందా? ట్రైలర్‌లో ఉన్న ఇంటెన్సిటీ సినిమాలోనూ ఉందా? రివ్యూలో చూద్దాం.
చిత్రబృందం:
దర్శకత్వం: బృందా గోపాల్
సంగీతం: సామ్ CS
నటీనటులు: హ్రిదు హరూన్, అనస్వర రాజన్, బాబీ సింహా తదితరులు
ఎడిటర్: ప్రవీణ్ ఆంటోనీ
సినిమాటోగ్రఫీ: ప్రియేష్ గురుస్వామి
కథ:
శేషు( హ్రిదు హరూన్) అనుకోని పరిస్థితుల్లో జైలుకు వెళ్తాడు. అక్కడ దొర( బాబీ సింహా), మధు అనే ఇద్దరిని కలుసుకుంటాడు. వీరు ముగ్గురు జైలు నుంచి తప్పించుకోవాలని పథకం వేస్తారు. శేషు అసలు జైలుకు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది. శేషు జైలుకు వెళ్లేందుకు కారణమైన పెద్దిరెడ్డి కథేంటి?. దొర ఎవరు? వీరు జైలు నుంచి విజయవంతంగా తప్పించుకున్నారా? అనేదే కథ.
ఎలా ఉందంటే:
దర్శకురాలు బృందా మంచి కథను ఎంచుకున్నారు కానీ దానిని అంతే గొప్పగా అమలు చేయలేకపోయారు. ఫస్టాఫ్ చాలా నెమ్మదిగా నడుస్తుంది. పాత్రల పరిచయం, శేషు, దొర జైలుకు ఎందుకు వెళ్లారు? అనే విషయాన్ని చెప్పేందుకే ఫస్టాఫ్ మొత్తం పోయింది. అయితే ఫస్టాఫ్‌లోనూ జైలు పరిసరాలు, కొన్ని సీన్లు చాలా బాగున్నాయి. ఇంటర్వెల్ చక్కగా సెట్ చేశారు. సెంకడాఫ్‌పై ఆసక్తిని పెంచేలా ఇంటర్వెల్ బ్యాంగ్ ఉంటుంది.
సెంకడాఫ్‌లో అసలు కథ మొదలవుతుంది. స్క్రీన్‌ప్లే కూడా బాగుంది. సీరియస్ నోట్‌లో సినిమా పరుగెడుతుంది. జైలు నుంచి తప్పించుకునేందుకు హీరో బృందం వేసే ప్లాన్లు, వాటిని చూపించిన విధానం బాగుంది. సహజంగా కనిపించేలా చూపడంలో దర్శకత్వం విభాగం విజయవంతమైందనే చెప్పాలి. వెట్రిమారన్ సినిమాలను తలపించేలా సీన్లు చాలా సహజంగా ఉంటాయి. కమర్షియల్ ఎలిమెంట్స్ జోలికి పోకుండా కథపైనే దృష్టిపెట్టిన దర్శకురాలిని మెచ్చుకోవాల్సిందే.
సాంకేతికంగా
సాంకేతికంగా ఈ సినిమా చాలా బాగుంది. ప్రియేష్ గురుస్వామి సినిమాటోగ్రఫీ సినిమాకు బలంగా మారింది. సినిమా సహజంగా అనిపించడంలో ఆయన పాత్ర చాలా ఉంది. ఎడిటింగ్ ఇంకాస్త మెరుగ్గా ఉండాల్సింది. సామ్ సీఎస్ సంగీతం సినిమాకు పెద్ద ప్లస్. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో చాలా సీన్లకు హైప్ తీసుకొచ్చాడు. ప్రొడక్షన్ వ్యాల్యూస్ కూడా బాగున్నాయి.
నటీ,నటుల పెర్ఫార్మెన్స్
హ్రిదు హరూన్ శేషుగా అదరగొట్టాడనే చెప్పాలి. ఇంటెన్సివ్ సీన్స్‌లో తన బాడీ లాంగ్వేజ్‌తో ఆకట్టుకున్నాడు. ఎమోషనల్ సీన్స్‌లో కూడా బాగానే చేశాడు. ఫైట్లు, జైలు నుంచి ఎస్కేప్ సీన్లలో నటనలో సహజత్వం కనిపిస్తుంది. బాబీ సింహాకు ఇలాంటి పాత్రలు నల్లేరు మీద నడకే. ఎప్పటిలాగే తన పాత్రలో జీవించాడు. ఎప్పటిలాగే పాత్రకు తగ్గ యాటిట్యూడ్‌తో సూపర్ అనిపించుకున్నాడు. హీరోయిన్ అనస్వర రాజన్ పాత్రకు అంత నిడివి లేదు కానీ ఉన్నంత మేరలో బాగా చేసింది. మిగతా నటీనటులు తమ పాత్రల పరిధి మేరకు చేశారు.
బలాలు:
కథ,
సెకండాఫ్
నటీ నటుల పెర్ఫార్మెన్స్
సినిమాటోగ్రఫీ
బీజీఎం
బలహీనతలు
ఫస్టాఫ్
కథనం
సమీక్ష:
ఓవరాల్‌గా సినిమా లవర్స్‌కు ఈ వారం ‘కోనసీమ థగ్స్’ చూడదగ్గ సినిమా. ఫస్టాఫ్ కాస్త నెమ్మదిగా,బోరింగ్‌గా అనిపించినా సెకండాఫ్ ఆ నిరాశను పోగొడుతుంది.
రేటింగ్: 2.75
ఫిబ్రవరి 24 , 2023
Mufasa: The Lion King Leak: ‘ముఫాసా’కు బిగ్‌షాక్.. ఆన్‌లైన్‌లో ఫుల్ HD మూవీ లీక్
యావత్ సినీ లోకం ఎంతో కాలంగా ఎదురుచూస్తోన్న ‘ముఫాసా: ది లయన్ కింగ్’ (Mufasa: The Lion King చిత్రం ఇవాళే (డిసెంబర్ 20) ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న చాలా థియేటర్లలో ఈ సినిమా సందడి చేస్తోంది. భారత్‌లో ఇంగ్లీషు, తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ఈ సినిమా అందు బాటులోకి వచ్చింది. విడుదలైన అన్ని చోట్ల ‘ముఫాసా: ది లయన్ కింగ్’కు విశేష స్పందన వస్తోంది. హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. ఇక ‘ముఫాసా’పై కాసుల వర్షం ఖాయమని అంతా భావిస్తున్న తరుణంగా ఈ మూవీకి బిగ్ షాక్ తగిలింది. సినిమా విడుదలై 24 గంటలు గడవకముందే ఈ మూవీ పైరసీ ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమైంది.
పైరసీ సైట్స్‌లో ప్రత్యక్షం
హాలీవుడ్ నిర్మాణ సంస్థ డిస్నీ ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ‘ముఫాసా: ది లయన్ కింగ్’ చిత్రం పైరసీ బారిన పడింది. ప్రముఖ పైరసీ సైట్స్ అయిన మూవీరూల్జ్ (Movierulz), తమిళ్ రాకర్స్ (Tamilrockers), ఫిల్మీజిల్లా (Filmyzilla), మూవీస్‌దా (Moviesda), టెలిగ్రామ్ ఛానెల్స్‌లో ఈ మూవీ అందుబాటులోకి వచ్చింది. HD, FHD క్వాలిటీతో ఈ మూవీ వీక్షించండంటూ నెట్టింట ప్రచారం జరుగుతోంది. పైరసీ బారిన పడకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఇలా జరగడంతో మూవీ టీమ్‌తో పాటు డిస్ట్రిబ్యూటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ట్రెండింగ్ హ్యాష్‌ట్యాగ్స్
ప్రస్తుతం ముఫాసా పైరసీకి సంబంధించిన హ్యాష్‌ట్యాగ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. టెలిగ్రామ్ ఛానల్స్‌లోనూ ఈ సినిమా డౌన్‌లోడ్‌కు సంబంధించిన లింక్స్ చక్కర్లు కొడుతున్నాయి. 'Mufasa: The Lion King Movie Download', 'Mufasa: The Lion King Movie HD Download', 'Mufasa: The Lion King Tamilrockers', 'Mufasa: The Lion King Filmyzilla', 'Mufasa: The Lion King Telegram Links', and 'Mufasa: The Lion King Movie Free HD Download' వంటి కీవార్డ్స్ నెట్టింట తెగ ట్రెండింగ్ అవుతున్నాయి.
పైరసీలో ఆ మజా ఉండదు..
‘ముఫాసా: ది లయన్ కింగ్’ (Mufasa: The Lion King Piracy) లైవ్ యానిమేషన్ చిత్రంగా రూపొందింది. విజువల్ వండర్‌గా రూపొందిన ఈ చిత్రాన్ని థియేటర్లలో చూస్తేనే మజా వస్తుందని ఫిల్మ్ వర్గాలు సూచిస్తున్నాయి. థియేటర్లలో మాత్రమే ఆ వీఎఫ్‌ఎక్స్‌ను అనుభూతి చెందవచ్చని చెబుతున్నారు. ముఖ్యంగా 3Dలో ముఫాసా చూస్తే పక్కాగా మరో ప్రపంచంలోకి వెళ్లి వస్తారని పేర్కొంటున్నారు. పైరసీ సినిమా చూస్తే ‘ముఫాసా’ను ఎంజాయ్ చేయలేరని స్పష్టం చేస్తున్నారు. పైరసీ ప్రింట్ వీక్షిస్తే అదొక సాధారణ ఫిల్మ్‌గానే కనిపిస్తుందని అంటున్నారు.
పైరసీలో చూస్తే చిక్కుల్లో పడ్డట్లే!
పైరసీ సైట్స్‌లో సినిమాలు చూసేవారికి సైబర్ ముప్పు (Mufasa: The Lion King Piracy) అధికంగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. ఆ ఇల్లిగల్ సైట్స్.. మాల్‌వేర్, స్పైవేర్, ర్యాన్సమ్‌వేర్ వంటి సైబర్ నేరస్తులకు కేంద్రాలుగా మారాయని తెలియజేస్తున్నారు. పైసా ఖర్చు లేకుండా సినిమా చూడొచ్చని ఆయా సైట్స్‌లోకి వెళ్తే మీ వ్యక్తిగత సమాచారం తప్పుడు వ్యక్తుల చేతుల్లోకి పోవడం ఖాయమని స్పష్టం చేస్తున్నారు. అంతేకాకుండా మీ బ్యాంక్ ఖాతా సమాచారం, పాస్‌వర్డ్స్ వారి చేతుల్లోకి వెళ్లి ఆర్థికంగా తీవ్ర నష్టం చవిచూడాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.
డిసెంబర్ 20 , 2024
Pushpa 2: సినిమా చూడండి అంటూ నాగబాబు ట్వీట్.. తగ్గేదేలే అంటున్న మెగా ఫ్యాన్స్
అల్లుఅర్జున్ హీరోగా నటించిన ‘పుష్ప 2’ (Pushpa 2)పై మెగా ఫ్యాన్స్ గుర్రుగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని బాయ్‌కాట్ చేయాలంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదికగా పిలుపునిస్తున్నారు. అంతేకాదు ‘పుష్ప 2’కి సంబంధించి ఏ చిన్న నెగిటివ్ వార్త కనిపించినా దాన్ని భూతద్దంలో చూపిస్తూ నెట్టింట దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. అటు అల్లు ఆర్మీ సైతం దీటుగా బదులిస్తుండటంతో గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో తెగ రచ్చ జరుగుతోంది. ఇదిలా ఉంటే గురువారం (డిసెంబర్ 5) ‘పుష్ప 2’ వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కాబోతోంది. మరో రెండు గంటల్లో ప్రీమియర్స్ సైతం పడనున్నాయి. ఈ నేపథ్యంలో చిరంజీవి సోదరుడు నాగబాబు ఎక్స్ వేదికగా మెగా ఫ్యాన్స్‌కు కీలక సూచనలు చేశారు.
‘సినిమాను చూడండి’
మెగా బ్రదర్ నాగబాబు (Nagababu) ఎక్స్ వేదికగా ఆసక్తికర పోస్టు పెట్టారు. ‘24 క్రాఫ్ట్‌ల కష్టంతో, వందల మంది టెక్నీషన్ల శ్రమతో, వేల మందికి ఉపాధి కలిగించి, కోట్ల మందిని అలరించేదే సినిమా. ప్రతి సినిమా విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అందరిని అలరించే సినిమాని సినిమాలనే ఆదరించాలని ప్రతి మెగా అభిమానిని మరియు ప్రతి సినీ అభిమానిని కోరుకుంటున్నాను’ అంటూ రాసుకొచ్చారు. అయితే ఈ పోస్టులో ఎక్కడా ‘పుష్ప 2’ పేరును ప్రస్తావించడం, ట్యాగ్ చేయడం వంటివి చేయలేదు. కానీ, మరికొద్ది గంటల్లో అల్లు అర్జున్ సినిమా రిలీజ్ ఉన్న నేపథ్యంలోనే ఆయన ఈ పోస్టు పెట్టినట్లు తెలుస్తోంది. మెగా అభిమానులు ఈ సినిమా చూడాలని పరోక్షంగా సూచించారని అర్థమవుతోంది.
https://twitter.com/NagaBabuOffl/status/1864291940956839994
మెగా ఫ్యాన్స్ రియాక్షన్ ఇదే..
నాగబాబు పిలుపుపై మెగా ఫ్యాన్స్ రియాక్ట్ అవుతున్నారు. మీ మాటపై తమకు గౌరవముందని, కానీ తాము 'పుష్ప 2' సినిమాను చూడమని తేల్చి చెబుతున్నారు. ఈ విషయంలో అస్సలు 'తగ్గేదేలే' అంటూ బన్నీ చెప్పిన డైలాగ్‌ను నెట్టింట పోస్టు చేస్తున్నారు. తమకు ఇష్టం ఉంటేనే వెళ్తామని, లేకపోతే అస్సలు వెళ్లమని తేల్చి చెబుతున్నారు. పవన్ కల్యాణ్ తమ మెుదటి ప్రేయారిటీ అని స్పష్టం చేస్తున్నారు. మరోవైపు అల్లు అర్మీ సైతం నాగబాబు పోస్టుపై రియాక్ట్ అవుతోంది. డైరెక్ట్‌గా 'పుష్ప 2' పేరు ప్రస్తావించి ఉంటే బాగుండేదని పేర్కొంటున్నారు. ఏది ఏమైనా ఈ మెగా వర్సెస్ అల్లు వార్ ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు.
https://twitter.com/IamManoharRoyal/status/1864295570006794737
https://twitter.com/TFIxBCCI/status/1864292229423992918
https://publish.twitter.com/?url=https://twitter.com/Janasena200/status/1864294848754536790#
https://twitter.com/Rohit4526418/status/1864296317863751777
https://twitter.com/KingOf_Attitude/status/1864297409125224513
https://twitter.com/Raja__JSP/status/1864301177191715096
https://twitter.com/ChinnuPenumaka/status/1864297351432818739
‘తప్పును సరిదిద్దుకో’
రెండ్రోజుల క్రితం నాగబాబు (Naga Babu) పెట్టిన ట్వీట్ సైతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అది కూడా 'పుష్ప 2' రిలీజ్ నేపథ్యంలోనే చేసినట్లు స్పష్టంగా అర్థమైంది. ‘నువ్వు తప్పుడు దారిని ఎంచుకున్నావు అని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా గమనించి సరి చేసుకో. లేదంటే ముందు ముందు ఆ దారి నీకు మరింత కష్ట తరంగా మారగలదు. తప్పును సరిదిద్దుకో’ అని స్వామి వివేకానంద చెప్పిన మాటలు షేర్ చేశారు. దీంతో ఈ పోస్ట్ అల్లు అర్జున్ (Allu Arjun)ను ఉద్దేశించే చేశారని నెటిజన్లు చర్చించుకున్నారు. తప్పులను సరిదిద్దుకొని మెగా ఫ్యామిలీతో కలిసిపోవాలని పరోక్షంగా నాగబాబు సూచించినట్లు అంతా భావించారు.
https://twitter.com/NagaBabuOffl/status/1863207473773183307
డిసెంబర్ 04 , 2024
Kantara Team Accident: 20 మందితో వెళ్తోన్న ‘కాంతార’ మూవీ టీమ్ బస్సు బోల్తా.. షూటింగ్ నిలిపివేత
కన్నడ డైరెక్టర్ కమ్ హీరో రిషభ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో నటించిన 'కాంతార' సినిమా ఎంతటి భారీ విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. సినిమా విశేష ప్రేక్షకదరణతో పాటు బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లను అందుకుంది. అయితే ఇప్పుడీ సినిమాకు ప్రీక్వెల్ కూడా రాబోతోంది. ‘కాంతార చాప్టర్ 1’ పేరుతో ప్రస్తుతం కర్ణాటకలో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ క్రమంలో ఈ మూవీ టీమ్ ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదానికి (Kantara Team Accident) గురైనట్లు తెలుస్తోంది. దీంతో షూటింగ్‌ను సైతం మేకర్స్ నిలిపేశారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
ప్రమాదం ఎలా జరిగిందంటే?
కన్నడ నటుడు రిషబ్‌శెట్టి నటిస్తున్న 'కాంతార చాప్టర్ 1' సినిమా షూటింగ్‌కు అనుకోని విధంగా బ్రేక్ పడింది. ఆదివారం (నవంబర్ 24) రాత్రి షూట్ పూర్తి చేసుకుని చిత్రబృందంలోని 20 మంది సభ్యులు ఓ మినీ బస్సులో కర్ణాటకలోని జడ్కల్ నుంచి తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో బస్సు అదుపుతప్పి బోల్తా (Kantara Team Accident) పడినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఆరుగురు జూనియర్ ఆర్టిస్టులు గాయపడ్డారట. పెద్ద స్టార్స్ ఎవరూ వాహనంలో లేరని అందరూ చిన్న చిన్న ఆర్టిస్టులేనని అంటున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకొని గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో షూటింగ్‌ను నిలిపివేసినట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. క్షతగాత్రుల యోగక్షేమాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపింది.
https://twitter.com/BNews2024/status/1861000465582088529
తప్పంతా అతడితే..!
ప్రమాదాని బస్సు డ్రైవర్ (Kantara Team Accident) నిర్లక్ష్యమే కారణమని ప్రాథమికంగా తెలుస్తోంది. డ్రైవర్ ఫోన్ నొక్కుతూ బస్సు నడిపాడని, అందుకే ప్రమాదం జరిగిందని బస్సులో ఉన్న ఓ జూనియర్ ఆర్టిస్ట్ ఆరోపించాడు. ఘటన జరగగానే డ్రైవర్‌పై దాడి చేసినట్లు కూడా తెలిసింది. సమాచారం అందుకున్న టూరిస్ట్ డ్రైవర్ అసోసియేషన్ సభ్యులు ఘటన స్థలానికి చేరుకుని ఆగ్రహం వ్యక్తం చేశారట. దీంతో ఆ ప్రాంతంలో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొందని సమాచారం అందింది. అలానే పోలీసులు కూడా ప్రమాద స్థలానికి చేరుకుని, దర్యాప్తు చేశారు.
https://twitter.com/TheFederal_KA/status/1860921151792562233
యుద్ద విద్యలో ప్రత్యేక శిక్షణ
సుమారు రెండేళ్ల క్రితం విడుదలైన ‘కాంతార’ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో ఘన విజయం సాధించింది. దీంతో 'కాంతార చాప్టర్ 1' మేకర్స్ పట్టాలెక్కించారు. స్టార్ హీరో రిషభ్ శెట్టి సొంత డైరెక్షన్‌లో ఈ సినిమా తెరకెక్కుతోంది. పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్‌గా రానున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరంగదూర్ ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. మలయాళ స్టార్ హీరో జయరామ్ కీలక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. కదంబుల కాలంలో సాగే ఆసక్తికర కథాంశంతో ఈ చిత్రం రూపందనున్నట్లు తెలుస్తోంది. దీనికోసం రిషబ్ కలరిపయట్టు యుద్ధ విద్యలో గత కొన్నాళ్లుగా శిక్షణ తీసుకుంటున్నారు. 2025 అక్టోబర్ 2న దీనిని విడుదల చేయాలనుకుంటున్నామని ఇప్పటికే టీమ్ ప్రకటించింది.
మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్‌తో..
'కాంతార చాప్టర్ 1' నిర్మిస్తున్న ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ ఇటీవల మరో క్రేజీ ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేసింది. ‘మహావతార్: నరసింహ’ (Mahavatar Narsimha) అనే పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ను నిర్మించనున్నట్లు ప్రకటించింది. కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ఈ మూవీ విడుదల కానున్నట్లు తెలిపింది. ఈ చిత్రాన్ని అశ్విన్ కుమార్ డైరెక్ట్ చేయనుండగా సామ్ సీఎస్ సంగీతం అందిస్తారు. అత్యంత భారీ బడ్జెట్‌తో శిల్పా ధావన్, కుశాల్ దేశాయ్, చైతన్య దేశాయ్‌లు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. అంతేకాదు, మహావతార్ సిరీస్‌లో మరిన్ని చిత్రాలు రానున్నట్లు తెలుస్తోంది. ఇతర అవతారాలతో సినిమాలు రాబోతున్నాయని నిర్మాణ సంస్థ చెప్పకనే చెప్తోంది.
https://twitter.com/hombalefilms/status/1857730656639303928
నవంబర్ 25 , 2024
Pushpa 2: రష్యా అధ్యక్షుడి నోట ఇండియన్ సినిమా మాట.. ‘పుష్ప 2’కి భారీ హైప్!
భారతీయ సినిమాల ఖ్యాతీ ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయికి చేరుకుంది. గతంలో అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ వేడుకలకు ఇండియన్ స్టార్స్‌కు అసలు అహ్వానం వచ్చేవి కావు. గత కొన్నేళ్ల నుంచి ఆ పరిస్థితుల్లో పూర్తిగా మార్పు వచ్చింది. ముఖ్యంగా ‘బాహుబలి’ తర్వాతి నుంచి విదేశాల్లోనూ మన భారతీయ చిత్రాలకు క్రేజ్ పెరిగింది. ఇందుకు అనుగుణంగా జపాన్, చైనా, రష్యా ఇలా విదేశీ భాషల్లోనూ మన సినిమాలు డబ్ అయ్యి అక్కడ నేరుగా రిలీజవుతున్నాయి. ఈ క్రమంలోనే రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ భారతీయ సినీ పరిశ్రమ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అది దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.
పుతిన్ ఏమన్నారంటే?
ఇండియా సభ్యదేశంగా ఉన్న ఐదు దేశాల కూటమి ‘బ్రిక్స్’ (BRICS) ఈనెల 22, 23 తేదీల్లో రష్యాలో జరగనుంది. బ్రిక్స్ సమావేశాల నేపథ్యంలో పుతిన్ మీడియా సమావేశంలో మాట్లాడారు. బ్రిక్స్ సభ్యదేశాలకు రష్యాలో తీయబోయే చిత్రాలకు ప్రోత్సాహకాలు ప్రకటిస్తారా అన్న ప్రశ్నకు పుతిన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రష్యాలో భారతీయ సినిమాలకు మంచి ఆదరణ ఉందని పుతిన్ తెలిపారు. 24 గంటలూ ఇండియన్ మూవీస్ వచ్చే ప్రత్యేక టీవీ ఛానల్ సైతం ఉన్నట్లు పేర్కొన్నారు. తమకు భారతీయ చిత్రాలంటే ఎంతో ఆసక్తి అని స్పష్టం చేశారు. ఇండియన్ మూవీస్‌ను రష్యాలో ప్రదర్శించడానికి తాము సానుకూలంగా ఉన్నట్లు చెప్పారు. వారి చిత్రాలను ప్రమోట్ చేసేందుకు ప్రత్యేక వేదికను కూడా ఏర్పాటు చేస్తామని హామి ఇచ్చారు. దీనిపై భారత ప్రధాని మోదీతో చర్చలు జరపనున్నట్లు పేర్కొన్నారు.
https://twitter.com/RT_com/status/1847495389303144506
‘పుష్ప’ దెబ్బకి రష్యన్లు ఫిదా!
ఇటీవల కాలంలో భారతీయ చిత్రాలను రష్యన్లు ఎంతో ఆదరిస్తున్నారు. పుతిన్ తాజా వ్యాఖ్యలతో ఆ దేశంలో భారతీయ సినిమాల మార్కెట్ అమాంతం పెరగనుంది. అయితే అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన ‘పుష్ప’ చిత్రాన్ని 2021 డిసెంబర్ 8న రష్యాలో నేరుగా రిలీజ్ చేశారు. అక్కడి ప్రేక్షకులు పుష్ప చిత్రాన్ని విశేషంగా ఆదరించారు. 774 స్కీన్లలో 25 రోజుల పాటు పుష్ప విజయవంతంగా ఆడింది. తద్వారా 10 మిలియన్ రూబెల్స్‌ను కలెక్ట్ చేసింది. భారతీయ కరెన్సీ ప్రకారం ఇది రూ. 13 కోట్లకు సమానం. అంతేకాదు రష్యాలో విడుదలై అత్యధిక వసూళ్లు సాధించిన సౌత్ ఇండియన్ మూవీగానూ ‘పుష్ప’ రికార్డు సాధించింది.
‘పుష్ప 2’కి కలిసి రానుందా?
రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ లేటెస్ట్ కామెంట్స్ ‘పుష్ప 2’ టీమ్‌కు ఎనలేని ఉత్సాహాన్ని ఇచ్చి ఉండొచ్చని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. రూ.1000 కోట్లకు పైగా వసూళ్లే లక్ష్యంగా ‘పుష్ప 2’ డిసెంబర్ 6న గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే రష్యాలో ‘పుష్ప’కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. భారతీయ సినిమాల ప్రమోషన్స్‌కు తాము సహకరిస్తారమని పుతిన్ సైతం తాజాగా స్ఫష్టం చేశారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ‘పుష్ప 2’ని రష్యాలో గ్రాండ్‌గా రిలీజ్ చేస్తే బాగుంటుందని ఫ్యాన్స్‌తో పాటు ఫిల్మ్ వర్గాలు కోరుకుంటున్నాయి. ఓవర్సీస్ రిలీజ్‌లో భాగంగా రష్యన్ భాషలోనూ ‘పుష్ప 2’ని డబ్ చేసి విడుదల చేస్తే అది మూవీ కలెక్షన్స్‌పై సానుకూల ప్రభావం చూపిస్తుందని అంచనా వేస్తున్నారు. మరి పుష్ప టీమ్ ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుంటుందో లేదో చూడాలి.
హైప్ పెంచేసిన దేవిశ్రీ
అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప 2’ (Pushpa 2)పై సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) ఇటీవల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా మరో స్థాయిలో ఉంటుందన్నారు. ముఖ్యంగా ఫస్టాఫ్ అదిరిపోతుందంటూ అభిమానుల్లో ఆసక్తి రేకెత్తించారు. లాక్ అయిన సినిమా ఫస్టాఫ్‌ను ఇప్పటికే తాము చూశామని, చాలా అద్భుతంగా మైండ్ బ్లోయింగ్ అనే రేంజ్‌లో ఉందని చెప్పారు. ఫస్టాఫ్‌లోనే మూడు చోట్ల ఇంటర్వెల్ లెవల్ హై ఇచ్చే సీన్లు ఉన్నాయన్నారు. సుకుమార్ ఈ సినిమాను రాసిన విధానం, తీసిన తీరు, అల్లు అర్జున్ యాక్టింగ్ అద్భుతం అంటూ సినిమాపై హైప్ పెంచేశారు. అటు 'పుష్ప 2' నేపథ్య సంగీతం కూడా తగ్గేదేలే అన్నట్లు ఉంటుందని చెప్పారు.
https://twitter.com/Cinema__Factory/status/1845798162478272773
మృణాల్‌తో ఐటెం సాంగ్!
‘పుష్ప’ మూవీ పాటలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా సినిమాలోని ‘ఊ అంటావా ఊ ఊ అంటావా’ అనే ఐటెం సాంగ్ దేశవ్యాప్తంగా మార్మోగింది. ఈ పాటలో సమంత తన అందంతో మెస్మరైజ్ చేసింది. బన్నీ-సామ్ కలిసి వేసిన స్టెప్స్ యువతరాన్ని ఉర్రూతలూగించాయి. దీంతో ‘పుష్ప2’ లోనూ ఆ తరహా ఐటెం సాంగ్ ఉండాలని డైరెక్టర్ సుకుమార్ ప్లాన్ చేస్తున్నారు. ఈ పాట కోసం ఇప్పటికే ఎంతో మంది హీరోయిన్‌ల పేర్లు బయటకు వచ్చాయి. ఈ క్రమంలోనే తాజాగా మృణాల్ ఠాకూర్ పేరు కూడా తెరపైకి వచ్చింది. పుష్ప 2 స్పెషల్ సాంగ్ కోసం మృణాల్ పేరును పరిశీలిస్తున్నట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు పుష్ప టీమ్ ఆమెతో సంప్రదింపులు సైతం జరుపుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. అంతకుముందుకు యానిమల్ బ్యూటీ త్రిప్తి దిమ్రిని ఈ సాంగ్‌కు ఎంపిక చేసినట్లు కథనాలు వచ్చాయి. ఆమెను కాదని మరో బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీని తీసుకున్నట్లు ప్రచారమూ జరిగింది. ఇప్పుడేమో మృణాల్ ఠాకూర్ అంటున్నారు. దీనిపై చిత్ర యూనిట్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.
https://twitter.com/villan_97/status/1845762894119801258
అక్టోబర్ 19 , 2024
Raju Yadav Review : 'రాజు యాదవ్'గా గెటప్ శ్రీను మెప్పించాడా? ఈ రివ్యూలో తెలుసుకోండి!
నటీనటులు : గెటప్ శ్రీను, అంకితా కరాట్, హేమంత్, ఆనంద్ చక్రపాణి, నమని ప్రశాంత్ తదితరులు
డైరెక్టర్ : కృష్ణమాచారి. కె
సినిమాటోగ్రాఫర్ : సాయిరాం ఉదయ్
సంగీతం : సురేష్ బొబ్బిలి, హర్షవర్ధన్ రామేశ్వర్
ఎడిటింగ్ : బొంతల నాగేశ్వర రెడ్డి
నిర్మాతలు: ప్రశాంత్ రెడ్డి, రాజేష్ కల్లెపల్లి, స్వాతి పసుపులేటి
జబర్దస్త్ ఫేమ్ గెటప్ శ్రీను పూర్తి స్థాయి హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘రాజు యాదవ్’ (Raju Yadav). అంకిత కరాట్ కథానాయిక. కృష్ణమాచారి.కె దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇందులో గెటప్ శ్రీను నటన సినిమాపై అంచనాలను పెంచింది. ప్రశాంత్ రెడ్డి, రాజేశ్ కల్లెపల్లి నిర్మించిన ఈ చిత్రం ఇవాళ (మే 24) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ మూవీ ఎలా ఉంది?
కథేంటి
ఈ సినిమా నిజ జీవిత కథ ఆధారంగా రూపొందింది. రాజు యాదవ్ (గెటప్ శ్రీను) ఊరిలో చాలా సరదాగా ఉండే అబ్బాయి. ఓ రోజు క్రికెట్ ఆడుతుండగా అతడికి ప్రమాదం జరుగుతుంది. దీంతో ఓ వైద్యుడ్ని సంప్రదిస్తాడు. ఆ వైద్యుడు వచ్చి రాని చికిత్స చేయడంతో రాజు స్మైలింగ్ డిజార్డర్ అనే వ్యాధి బారిన పడతాడు. అప్పటి నుంచి రాజు నవ్వుపై నియంత్రణ కోల్పోతాడు. సందర్భంతో సంబంధం లేకుండా నవ్వుతూనే ఉంటాడు. అలా స్విటీ (అంకితా)తో ప్రేమలో పడినప్పుడు అతడికి కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. అప్పుడు రాజు ఏం చేశాడు? రాజు ప్రేమకు అతడి నవ్వు ఎలాంటి చిక్కులు తెచ్చిపెట్టింది? రాజు-స్విటీ ఒక్కటయ్యారా? లేదా? అన్నది కథ.
ఎవరెలా చేశారంటే
హాస్య నటుడు గెటప్ శ్రీను.. రాజు యాదవ్ పాత్రలో అద్భుతంగా నటించాడు. ఆ పాత్రలో పూర్తిగా పరకాయ ప్రవేశం చేసి.. నటుడిగా మరో మెట్టు ఎక్కాడు. ఎప్పటిలాగే తన కామెడీ టైమింగ్ అదరగొట్టాడు. అటు ఎమోషనల్ సన్నివేశాలలోనూ తాను అద్భుతంగా నటించగలనని ఈ సినిమాతో నిరూపించుకున్నాడు. ప్రేయసి పాత్రలో అంకితా కరాట్ పర్వాలేదనిపింది. కొన్ని సన్నివేశాల్లో ఆమె నటన మెప్పిస్తుంది. ఇక తండ్రి పాత్రలో ఆనంద్ చక్రపాణి చక్కటి నటన కనిబరిచాడు. తండ్రి కొడుకుల ఎమోషన్‌ను అద్భుతంగా పండించాడు. మిగిలిన నటీనటులు తమ పరిధిమేరకు పర్వాలేదనిపించారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
దర్శకుడు కృష్ణమాచారి.. ఓ మంచి కాన్సెప్ట్‌తో ఈ సినిమాను రూపొందించారు. ఫన్, ఎమోషనల్ కంటెంట్‌తో సినిమాను నడిపించారు. స్మైలింగ్ డిజార్జర్ అనే సమస్యతో హాస్యాన్ని క్రియేట్ చేసి ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టాడు. అదే సమయంలో ఆ డిజార్డర్ చుట్టే భావోద్వేగ సన్నివేశాలను అల్లుకొని ప్రేక్షకుల హృదయాలకు సినిమా హత్తుకునేలా చేశారు. ముఖ్యంగా గెటప్ శ్రీను, ఆనంద్ చక్రపాఠి మధ్య వచ్చే తండ్రి కొడుకుల ఎమోషనల్ సీన్స్ మెప్పిస్తాయి. అయితే అక్కడక్కడ స్క్రీన్‌ప్లే విషయంలో డైరెక్టర్ కాస్త తడబడినట్లు అనిపించింది. కొన్ని సీన్లు సాగదీతలా అనిపిస్తాయి.
టెక్నికల్‌గా
సాంకేతిక అంశాల విషయానికి వస్తే.. సినిమాటోగ్రఫీ బాగుంది. పాటలు గుర్తుంచుకునేలా లేవు. కానీ, నేపథ్య సంగీతం ఆకట్టుకుంది. భావోద్వేగ సన్నివేశాలను బాగా ఎలివేట్ చేసింది. ఎడిటర్ తన కత్తెరకు కాస్త పని పెట్టి ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు సినిమాకు తగట్లు ఉన్నతంగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
గెటప్ శ్రీను నటనకామెడీనేపథ్య సంగీతం
మైనస్ పాయింట్స్
సాగదీత సీన్స్‌ఎడిటింగ్
Telugu.yousay.tv Rating : 2.5/5
మే 24 , 2024