• TFIDB EN
  • 30 రోజుల్లో ప్రేమించడం ఎలా
    UATelugu
    అర్జున్‌ (ప్రదీప్‌ మాచిరాజు), అక్షర (అమృతా అయ్యర్‌) ఒకే కాలేజీలో ఇంజనీరింగ్ స్టూడెంట్స్‌. వీరికి ఒకరంటే ఒకరికీ పడదు. ఫ్రెండ్స్‌తో విహారయాత్రకు వెళ్లినప్పుడు వీరికి పెద్ద సమస్య ఎదురవుతుంది? ఇంతకీ ఆ సమస్య ఏంటి? వీరు ఎందుకు 30రోజుల్లో ప్రేమించుకోవాల్సి వచ్చింది? అన్నది కథ.
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌Zee5ఫ్రమ్‌
    Watch
    స్ట్రీమింగ్‌ ఆన్‌Prime
    Watch
    స్ట్రీమింగ్‌ ఆన్‌Aha
    Watch
    రివ్యూస్
    How was the movie?

    తారాగణం
    ప్రదీప్ మాచిరాజు
    అర్జున్ మరియు అబ్బాయి
    అమృత అయ్యర్
    అక్షర మరియు అమ్మాయిగారు
    శుభలేఖ సుధాకర్
    స్వామీజీ
    పోసాని కృష్ణ మురళి
    అక్షర తండ్రి
    శరణ్య ప్రదీప్అక్షర సోదరి
    హేమ
    అర్జున్ తల్లి
    హర్ష చెముడు
    అర్జున్ స్నేహితుడు
    హైపర్ ఆది
    అర్జున్ స్నేహితుడు
    శృతిమహాలక్ష్మి అక్షర స్నేహితురాలు
    శివన్నారాయణ నారిపెద్ది
    అర్జున్ తండ్రి
    సమీర్
    అర్జున్ కోచ్
    సుధ
    డాక్టర్
    అనసూయ భరద్వాజ్
    వాహ్ వా మేరే బావా అనే పాటలో అనసూయ ప్రత్యేక పాత్రలో కనిపించింది
    రష్మీ గౌతమ్
    వాహ్ వా మేరే బావా అనే పాటలో స్పెషల్ అప్పియరెన్స్‌లో కనిపించింది
    శ్రీముఖి
    వాహ్ వా మేరే బావా అనే పాటలో శ్రీముఖి స్పెషల్ అప్పియరెన్స్‌లో కనిపించింది
    సిబ్బంది
    ధూళిపూడి ఫణి ప్రదీప్ (మున్నా)దర్శకుడు
    బాబు ఎస్వీనిర్మాత
    అనూప్ రూబెన్స్
    సంగీతకారుడు
    కార్తీక శ్రీనివాస్
    ఎడిటర్
    కథనాలు
    Sankranti Heroines 2024: సంక్రాతి రేసులో అందాల తారలు.. విజయం ఎవర్ని వరిస్తుందో!
    Sankranti Heroines 2024: సంక్రాతి రేసులో అందాల తారలు.. విజయం ఎవర్ని వరిస్తుందో!
    యావత్‌ ప్రపంచం కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టింది. కొత్త సంవత్సరంలో వచ్చే తొలి పండగ సంక్రాంతి. తెలుగు వారికి ఇది ఎంతో ప్రత్యేకమైంది. ముఖ్యంగా అగ్రహీరోల చిత్రాలు సంక్రాంతికి విడుదలై ప్రేక్షకులను అలరిస్తుంటాయి. బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంటాయి. ఈ ఏడాది సంక్రాంతికి స్టార్ హీరోలతో పాటు పలువురు హీరోయిన్లు సైతం సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. కొత్త ఏడాదిలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఇంతకీ ఆ అందాల తారలు ఎవరు? వారు నటించిన చిత్రాలు ఏవి? ఇప్పుడు చూద్దాం. మీనాక్షి చౌదరి యంగ్‌ బ్యూటీ మీనాక్షి చౌదరి సంక్రాంతికి తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది. మహేష్‌ హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో రూపొందిన ‘గుంటూరు కారం’ చిత్రంలో ఆమె హీరోయిన్‌గా చేసింది. ఈ చిత‌్ర విజయంపై మీనాక్షి ఎన్నో ఆశలు పెట్టుకుంది. కాగా, ఈ సినిమా జనవరి 13న గ్రాండ్‌గా విడుదల కానుంది.  శ్రీలీల గతేడాది వరుస చిత్రాలతో అలరించిన శ్రీలీల ఈ ఏడాది ప్రారంభంలోనే మరో భారీ సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఈ భామ కూడా ‘గుంటూరు కారం’ చిత్రంలో మహేష్‌కు జోడీగా నటిస్తోంది.  ఆషికా రంగనాథ్‌ కన్నడ బ్యూటీ ఆషికా రంగనాథ్‌ గతేడాది ‘అమిగోస్‌’ చిత్రం ద్వారా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. అయితే ఆ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద విఫలం కావడంతో నిరాశకు గురైంది. ఈ ఏడాది నాగార్జున పక్కన ‘నా సామిరంగ’ చిత్రంలో ఈ తార నటించింది. ఈ చిత్రం జనవరి 14న విడుదల కాబోతోంది. ఈ సినిమా విజయం సాధిస్తే టాలీవుడ్‌లో అవకాశాలు క్యూ కడతాయని ఆషికా భావిస్తోంది.  రుక్సార్‌ థిల్లాన్‌ యంగ్‌ హీరోయిన్‌ రుక్సార్‌ థిల్లాన్‌ నాని నటించిన ‘కృష్ణార్జున యుద్ధం’ చిత్రంలో తెలుగు ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం ఈ భామ కూడా ‘నా సామిరంగ’ సినిమాలో కీలక పాత్ర పోషించింది. ఆ సినిమా విజయంపై ఎన్నో ఆశలు పెట్టుకుంది.  మిర్నా మీనన్‌ తమిళ నటి మిర్నా మీనన్‌.. గతేడాది ఉగ్రం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించింది. నాగార్జున సరసన ‘నా సామిరంగ’ చిత్రంలో ముఖ్యపాత్ర పోషించింది. ఈ సినిమా విజయం ద్వారా మరిన్ని టాలీవుడ్‌ అవకాశాలను దక్కించుకోవాలని మిర్నా భావిస్తోంది. అమృత అయ్యర్‌ కన్నడ నటి అమృత అయ్యర్‌.. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా చిత్రం ద్వారా టాలీవుడ్‌లో అడుగుపెట్టింది. ఆ తర్వాత శ్రీవిష్ణు పక్కన అర్జున ఫల్గుణలో హీరోయిన్‌గా చేసింది. ప్రస్తుతం పాన్‌ వరల్డ్‌ స్థాయిలో రూపొందిన హనుమాన్‌ చిత్రంలో తేజ సజ్జ సరసన ఈ భామ నటించింది. ఈ చిత్రం జనవరి 12న సంక్రాంతి సందర్భంగా రిలీజ్‌ కాబోతుంది. శ్రద్ధ శ్రీనాథ్‌ స్టార్‌ హీరో వెంకటేష్‌ నటించిన ‘సైంధవ్‌’ సినిమా సంక్రాంతి బరిలో నిలిచింది. ఇందులో హీరోయిన్‌గా శ్రద్ధా శ్రీనాథ్‌ నటించింది. 'జెర్సీ' సినిమా తర్వాత శ్రద్ధాకు ఆ స్థాయి హిట్‌ లభించలేదు. దీంతో ఈ బ్యూటీ సైంధవ్ చిత్రంపై భారీగా ఆశలు పెట్టుకుంది. శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం.. జనవరి 13న విడుదల కానుంది. రుహానీ శర్మ 2018లో వచ్చిన ‘చి.ల.సౌ.’ సినిమా ద్వారా రుహానీ శర్మ టాలీవుడ్‌కు పరిచయం అయ్యింది. ఆ తర్వాత నుంచి వరసగా సినిమాలు చేస్తున్నప్పటికీ పెద్దగా కలిసిరాలేదు. ఈ క్రమంలోనే వెంకటేష్‌ సైంధవ్‌లో ఈ భామకు అవకాశం వచ్చింది. ఈ చిత్ర విజయంతో టాలీవుడ్‌లో నిలదొక్కుకోవాలని రుహానీ భావిస్తోంది. అనుపమ పరమేశ్వరన్‌ మాస్‌ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్‌ చిత్రం ‘ఈగల్‌’. ఈ మూవీలో కేరళ బ్యూటీ అనుపమా పరమేశ్వరన్‌ హీరోయిన్‌గా చేసింది. ఈ చిత్ర విజయం ద్వారా కొత్త ఏడాదిని గ్రాండ్‌ ప్రారంభించాలని అనుపమ భావిస్తోంది. ఇక ఈమె నటించిన ‘టిల్లు స్క్వేర్’ ఈ సంవత్సరమే విడుదల కానుంది. కావ్యా థాపర్‌ 'ఏక్ మినీ కథ' సినిమాతో నటి కావ్యా థాపర్‌ తెలుగులో అడుగుపెట్టింది. ఆ సినిమా మంచి విజయం సాధించినప్పటికీ ఈ బ్యూటీకి పెద్దగా అవకాశాలు రాలేదు. ప్రస్తుతం ‘ఈగల్‌’ సినిమాలో ఆమె సెకండ్‌ హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రం విజయంతోనైనా మంచి అవకాశాలు వస్తాయని కావ్యా భావిస్తోంది.
    జనవరి 02 , 2024
    డీగ్లామర్‌ రోల్స్‌లోనూ నటనతో అదరగొట్టిన అందాల భామలు
    డీగ్లామర్‌ రోల్స్‌లోనూ నటనతో అదరగొట్టిన అందాల భామలు
    ఒక సినిమా విజయానికి హీరో ఎంత ముఖ్యమో హీరోయిన్‌ అంతే కీలకం. కథానాయిక నటన, గ్లామర్‌, డ్యాన్స్‌ కోసమే సినిమాలకు వెళ్లే ప్రేక్షకులు ఇప్పటికీ ఉన్నారు. వెండి తెరపై తమ అందాల తార అందాలను చూసుకొని వారు మురిసిపోతుంటారు. హీరోయిన్లు కూడా గ్లామర్‌ ప్రదర్శనకు ఏమాత్రం వెనకాడకుండా థియేటర్లకు ప్రేక్షకులను రప్పించేవారు.  అయితే ఇదంతా గతం. ఇప్పుడు డీ గ్లామరస్ రోల్‌లోనూ హీరోయిన్లు అదరగొడుతున్నారు. తెరపై గ్లామర్‌కు చోటు ఇవ్వకుండా కేవలం తమ నటనతోనే ఆడియన్స్‌ను మెప్పిస్తున్నారు. ఓ వైపు గ్లామరస్‌ రోల్స్‌ చేస్తూనే అవకాశం వచ్చినప్పుడు పల్లెటూరి పాత్రల్లో తళ్లుక్కుముంటున్నారు. మట్టివాసన వెదజల్లే క్యారెక్టర్‌లో తమదైన ముద్ర వేస్తున్నారు. డీగ్లామర్‌ రోల్‌లో కనిపించి మెప్పించిన హీరోయిన్లను ఇప్పుడు చూద్దాం. కీర్తి సురేష్‌ దసరా(Dasara) మూవీలో పల్లెటూరి అమ్మాయిగా కీర్తి సురేష్‌ (keerthi suresh) అదరగొట్టింది. వెన్నెల పాత్రలో నటించి సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది. ఇందులో కీర్తి నటన సినిమాకు చాలా బాగా ప్లస్‌ అయ్యింది. హీరో నానితో పోటీపడి మరీ నటించింది. దీంతో నానితో సమానంగా కీర్తి సురేష్‌ ప్రశంసలు అందుకుంటోంది.  సమంత టాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్స్‌లో ఒకరైన సమంత(Samantha) ‘రంగస్థలం (Rangasthalam)’ చిత్రంలో డీగ్లామరస్‌గా కనిపించింది. అచ్చం పల్లెటూరి అమ్మాయిగా మెప్పించింది. రామలక్ష్మీ పాత్రలో సమంతను తప్ప మరొకరిని ఊపించుకోలేము. ఫ్యామిలీ మ్యాన్‌-2 వెబ్‌సిరీస్‌లోనూ సమంత గ్లామర్‌కు దూరంగా ఉన్న పాత్రనే చేసింది.  అనుష్క బాహుబలి(Bahubali) మెుదటి పార్ట్‌లో వృద్దురాలైన దేవసేనగా అనుష్క(Anushka Shetty) కనిపించింది. ఈ పాత్రలో ఆమె నటన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. భల్లాల దేవుడిపై పగ తీర్చుకునేందుకు ఎదురు చూస్తున్న మహిళగా అనుష్క చాాాలా బాగా నటించింది.  తమన్నా బాహుబలి పార్ట్‌-1 లోనే తమన్నా(Thamanna)  కూడా అవంతిక పాత్రలో మెరిసింది. ఎలాంటి మేకప్‌ లేకుండా పోరాట సన్నివేశాల్లో అదరగొట్టింది. గ్లామర్‌ పాత్రలే కాదు అందానికి ప్రాధాన్యం లేని క్యారెక్టర్లు కూడా చేయగలనని తమన్నా నిరూపించుకుంది.  ఐశ్వర్య రాజేష్‌ ‘కౌసల్య కృష్ణమూర్తి’ (Kousalya krishnamurthy), ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’ (world famous lover) లాంటి చిత్రాల్లో ఐశ్వర్య రాజేష్‌ డీ గ్లామరస్‌ రోల్స్‌లో నటించారు. ఈ రెండు సినిమాల్లో పల్లెటూరి యువతిగా ఐశ్వర్య అద్భుతంగా నటించింది. అయితే కౌసల్య కృష్ణమూర్తి పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకోగా.. వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌లో ఐశ్వర్య పాత్రకు మంచి మార్కులే పడ్డాయి. రితికా సింగ్ వెంకటేష్‌ ప్రధాన పాత్రలో చేసిన గురు(Guru) సినిమా ద్వారా రితికా సింగ్‌ (Ritika Singh) తొలిసారి టాలీవుడ్‌కు పరిచయమైంది. తొలుత కూరగాయాలు అమ్ముకునే రాముడు పాత్రలో రితికా డీగ్లామరెస్‌గా కనిపించింది. ఆ తర్వాత బాక్సర్‌గా మారి సినిమా విజయంలో ముఖ్య భూమిక పోషించింది.  అమ్రితా అయ్యర్‌ బుల్లితెర యాంకర్ ప్రదీప్‌ హీరోగా వచ్చి 30 రోజుల్లో ప్రేమించడం ఎలా చిత్రంలో అమ్రితా అయ్యర్‌ పల్లెటూరి అమ్మాయిగా కనిపించి మెప్పించింది. ఈ సినిమాలో ‘నీలి నీలి ఆకాశం పాట’ (Neeli Neeli Aakasam) ఎంత ఫేమస్‌ అయ్యిందో అందరికీ తెలిసిందే. సంజనా బుజ్జిగాడు సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన సంజనా (Sanjana).. దండుపాళ్యం-2 Dandupalyam-2)లో ఓ విభిన్నమైన పాత్ర పోషించి షాక్‌ ఇచ్చింది. హత్యలు చేసే గ్యాంగ్‌లో నటించి మెప్పించింది. ఇదే సినిమాలో సంజన న్యూడ్‌గా నటించిందన్న వార్తలు అప్పట్లో షికారు చేశాయి. 
    ఏప్రిల్ 01 , 2023
    EXCLUSIVE: Tillu Square Top Dialogues: ‘టిల్లు స్కేర్‌లో అదరగొట్టిన టాప్ డైలాగ్స్ ఇవే..!
    EXCLUSIVE: Tillu Square Top Dialogues: ‘టిల్లు స్కేర్‌లో అదరగొట్టిన టాప్ డైలాగ్స్ ఇవే..!
    యంగ్‌ హీరో సిద్దూ జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) నటింటిన ‘టిల్లు స్క్వేర్‌’ (Tillu Square) బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ‘డీజే టిల్లు’ (DJ Tillu)కు సీక్వెల్‌గా వచ్చిన ఈ చిత్రం తొలి పార్ట్‌ కంటే ఇంకా బెటర్‌ టాక్‌ తెచ్చుకొని దూసుకెళ్తోంది. ఈ సినిమా తొలి నాలుగు రోజుల్లోనే ఏకంగా రూ.78 కోట్ల గ్రాస్‌ సాధించి సంచలనం సృష్టించింది. అయితే ‘టిల్లు స్క్వేర్‌’ ఈ స్థాయిలో విజయం సాధించడానికి ప్రధాన కారణం ఇందులోని డైలాగ్స్‌ అని చెప్పవచ్చు. హీరో సిద్దూ తన డిఫరెంట్‌ వాయిస్‌ మాడ్యులేషన్‌తో చెప్పిన ఆ డైలాగ్స్‌ యూత్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. అవేంటో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.  డైలాగ్‌ ఓ సీన్‌లో హీరోయిన్‌ లిల్లీ జోసేఫ్‌ (అనుపమా) తన తండ్రిని టిల్లు (సిద్దూ జొన్నలగడ్డ) ఫ్యామిలీకి పరిచయం చేస్తుంది. ఈ సీన్ నవ్వులు పూయిస్తుంది లిల్లీ: నా పూర్తి పేరు లిల్లీ జోసెఫ్‌ టిల్లు: అంటే మీరు క్రిస్టియన్సా? లిల్లీ: తండ్రిని చూపిస్తూ ఇతనే ఫాదర్‌ టిల్లు : చర్చి ఫాదరా? https://twitter.com/i/status/1774726359111307728 డైలాగ్‌ లిల్లీ ఫాదర్‌: ఓ ఆడపిల్ల తండ్రిగా అడుగుతున్నాను ఒక మగ పిల్లాడ్ని ఇలాగేనా పెంచేది?  టిల్లు తండ్రి: ఒక మగ పిల్లాడి తండ్రిగా చెప్తున్నాను నేనేం పెంచలేదు వాడే పెరిగాడు డైలాగ్‌ టిల్లు తన తండ్రితో చెప్పిన ఓ డైలాగ్‌కు కూడా థియేటర్లలో మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఆ సీన్ ఏంటంటే.. టిల్లు తన తండ్రితో: వచ్చిండయ్యా రియల్‌ ఏస్టేట్ ఐకూన్‌ టిల్లు తల్లి : డాడీతో గట్లనా మాట్లాడేది టిల్లు : అట్లకాదు మమ్మీ.. నేనున్న ప్రెజర్‌కి పచ్చి బియ్యం తింటే అది కడుపులోకి వెళ్లాక అన్నం అయ్యేట్లు ఉంది https://twitter.com/i/status/1774992506087944622 డైలాగ్‌ ఓ సీన్‌లో లిల్లీ మా పరిస్థితి అర్థం చేసుకో అని టిల్లుతో అంటుంది. అప్పుడు టిల్లూ చెప్పే డైలాగ్‌ థియేటర్లను నవ్వులతో దద్దరిల్లేలా చేసింది.  టిల్లు : నేను ఎవరి పరిస్థితి అర్థం చేసుకునే పరిస్థితిలో లేను. ప్రతీసారి మీరొచ్చి మీ శాడ్‌ స్టోరీలు చెప్పుడు.. ఆ బాధలన్ని విని నేను మీ ప్రాబ్లమ్‌ను నా ప్రాబ్లమ్‌గా ఫీల్ అయ్యి.. ఆ ప్రాబ్లమ్‌ను సాల్వ్‌ చేయడానికి టిప్పు సుల్తాన్‌ లాగా దూరి దాంట్లోకి.. మల్లా లాస్ట్‌కి నేనే ఫీలై మీకు డిస్కౌంట్ ఇచ్చి నేను షాపు మూసుకొనుడు ఏందే తూ.. https://twitter.com/i/status/1773542640488784015 డైలాగ్‌ లిల్లీ : నువ్వుమాట మీద నిలబడే మనిషివి కాదా టిల్లు? టిల్లు : నిలబడా నేను.. వేస్ట్‌. తాగకముందు 30 చెప్తా.. తాగినాక తొంబై చెప్తా నేను. నెక్స్ట్‌ డే పొద్దుగాల మర్చిపోతా. అసలు నాతోటి పెట్టుకోకండ్రి  https://twitter.com/i/status/1773655054655856994 డైలాగ్‌ సినిమాలో వచ్చే కారు సీన్‌లో లిల్లీ చాలా క్లోజ్‌గా ఉన్న సమయంలో టిల్లు ఓ మాట అంటాడు.  లిల్లీతో టిల్లు : పోయినసారి కంటే ఈ సారి గట్టిగా తగిలేటట్టు ఉంది గట్టి దెబ్బ అలాగే ఓ సీన్‌లో అమ్మాయి ఫొటోను చూస్తూ టిల్లు చెప్పే డైలాగ్‌ ఆడియన్స్ బాగా ఎంజాయ్‌ చేశారు.  టిల్లు:  పిల్ల హైలెట్‌గా ఉంది.. అబ్బో ఎవడి జీవితమో నాశనం https://twitter.com/i/status/1772913769770803358 డైలాగ్‌ లిల్లీతో టిల్లు చెప్పే మరో డైలాగ్‌ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.  టిల్లు:  నీకు ఒకటి చెప్పాల్నా.. టిల్లు అనేటోడు నార్మన్‌ హ్యూమన్‌ బీయింగ్‌ అయితే కాదు. నేనొక కారణజన్ముడ్ని https://twitter.com/i/status/1774319933129916896 డైలాగ్‌ లిల్లీతో కారులో ప్రయాణిస్తూ గతంలో రాధికతో జరిగిన ఎపిసోడ్‌ గురించి సినిమాటిక్‌గా టిల్లు చెప్పే డైలాగ్‌ సూపర్‌గా అనిపిస్తుంది.  టిల్లు: ఫ్రెండ్స్‌ అందరితో కలిసి ఓ సినిమా చూసినా.. ఇట్స్‌ ఏ నల్లమల్ల ఫారెస్ట్‌.. విత్‌ నల్ల చీర.. ఫిల్మ్‌ బై రాధిక. చానా పెద్ద డైరెక్టర్‌ ఆమె.. భలే చెప్తది కథలు. ఓటీటీటీ.. ప్యాన్‌ మాల్కాజ్‌ గిరి మూవీ అది. దాని స్టోరీ ఏంటంటే లవ్‌, హార్ట్‌ బ్రేక్‌, హార్రర్‌, మిస్టరీ, థ్రిల్లర్‌, చీటింగ్‌, క్రైమ్‌ జానర్‌లో వచ్చింది. డైలాగ్‌ లిల్లీతో టిల్లు: చెప్పు రాధిక నీకు ఏం కావాలి?. నేను నీకు ఎలా సాయపడగల్గుతాను రాధిక. ఈ సారి నా కొంప ఎట్లా ముంచబోతున్నావ్‌ చెప్పు రాధిక. లిల్లీ: రాధిక ఎవరు నా పేరు లిల్లీ  టిల్లు : “నీ పేరు లిల్లీ ఏమో గానీ.. నువ్వు మనిషివైతే 100% రాధికవు నువ్వు. ఒక రాధిక జాతికి సంబంధించిన ఆడపడుచువు నువ్వు. మీరందరూ కూడా ఒక రాధిక ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ టెక్నాలజీలో స్టూడెంట్స్ మీరు. ఆ కాలేజీ ఈడ యాడా ఉండదు. అదెక్కడో గుట్ట మీద ఉంటది.  అక్కడ రాధికలందరూ లైన్‌గా నిలబడి బైనాక్యూలర్లు వేసుకొని చూస్తుంటారు. టిల్లు లాంటి లప్పాగాళ్లు యాడున్నారు.. ఎవర్నీ హౌలా గాళ్లను చేద్దాం అని చెప్పి. చాలా పెద్ద కాలేజీ అంటగా అది.  నేను పోయినసారి నీ సూపర్ సీనియర్‌ను కలిసినా రాధిక ఆమె పేరు. చాలా బాగా ర్యాంగింగ్ చేసింది. ఎంజాయ్ చేసినా నేను. ఇప్పటికీ మాట్లాడుకుంటున్నారు.. దాని గురించి https://www.youtube.com/watch?v=e1gDD3_pKR8 డైలాగ్‌: బర్త్‌ డే రోజు.. లిల్లీ ఉన్న బిల్డింగ్‌కు వెళ్లిన సమయంలో.. టిల్లు : ఇదో పెద్ద ఇలాకతా మఫిలియా కొంపరా ఇది ఇక్కడ ఎవరు ఎవరితో ఆడుకుంటుర్రో తెల్వదు గానీ.. ప్రతీసారి ఇంపాక్ట్‌ ప్లేయర్‌లాగా నన్ను మాత్రం దింపుతున్నారు రా. మా సైడ్‌ జోకర్ అంటారు'  https://www.youtube.com/watch?v=sARNpvr4IoE పబ్‌లో ఓ అమ్మాయితో మాట్లాడుతూ... టిల్లు: చున్నీ ఉండదా ఈ డ్రెస్‌కు.. అమ్మాయి: ఇది బాడీకాన్ డ్రేస్.. టిల్లు..! టిల్లు: అచ్చా షాప్‌ వాడే మరచిపోయిండా.. ఎందుకంటే పిల్లగాళ్లు ఎగ్జైట్ అవుతున్నరూ.. పెళ్లి సంబంధం గురించి పిన్నితో మాట్లాడేటప్పుడు.. పిన్ని: అరెయ్ టిల్లు గీ పిల్ల జూడు ఎట్లున్నదో.. టిల్లు: ఇంకా పెళ్లిళ్లకు పిల్లల్ని చూడడం ఆపలేదా పిన్ని. మానస 5.7ఫీట్ హైట్.. కంప్లెక్సెన్ ఫేయిర్.. యూ పీపూల్ ఆర్ రేసిస్ట్స్... పిల్ల హైలెట్ ఉన్నది... అబ్బో ఎవడి జీవితమో నాశనం పిన్ని: నీకోసమేరా పిచ్చోడా.. టిల్లు: హెయ్! నాకొద్దు బొంగు... అడిగానా నిన్ను. పిన్ని: మళ్ల ఎప్పుడు చేసుకుంటవురా..  టిల్లు: చేసుకోను నేను... నీయమ్మ నాపెళ్లితో మీ అబ్సేషన్ ఏందే.. నాకు అర్థం అవతలేదు. నీ కమీషన్ కోసం నా కడుపు కొట్టకు, బతకనీయ్ కొన్నిరోజులు. నీయమ్మ సాయంత్రం కాంగనే.. అంటీలు అందరూ చూట్టూ జేరి మాఫియా..  టిల్లు డాడీ: మీ అమ్మలాగా ఉన్న ఓ మంచి పిల్లను జూసి పెళ్లి చేసుకో.. టిల్లు:  డాడీ... నీకు మార్కెట్‌లో 'బెబ్స్‌' ఎట్లున్నరో మినిమం ఐడియా కూడా లేదు నువ్వు మాట్లాడకు.. అమ్మసోంటి అమ్మాయిలు లేరు బయటా.. అమ్మేసే అమ్మాయిలు ఉన్నారు. వీకెండ్ పార్టీలో తొలి సారి లిల్లీని కలిసినప్పుడు... టిల్లు: ఉన్నడా భాయ్‌ ఫ్రెండ్.. లిల్లీ: నీకెందుకు..? టిల్లు: హా.. ఉంటే నా షూ నేను ఏసుకపోతా... లిల్లీ: లేదంటే.. టిల్లు: నిన్ను ఏసుకోని పోతా..  లిల్లీ: అబ్బా... ఎక్కడికీ..  టిల్లు: నువ్వు ఏడికంటే ఆడికి..  మందు గురించి మాట్లాడే టైంలో.. టిల్లు: మందు ఎప్పుడైనా మర్యాదగా తాగలి.. అట్ల రెవల్యూషన్‌లాగా రప్ప.. రప్ప తాగొద్దు. అర్థమైందా.. కారులో లిల్లీతో రొమాంటిక్ సీన్‌లో టిల్లు: ఒకటీ.. రెండూ, మూడూ, నాలుగు... మొత్తం ఎన్ని పుట్టుమచ్చలు ఉన్నాయేంది నీకు.. లిల్లీ: స్మైలింగ్.. టిల్లు: ప్రతి మనిషికి బాడీలో ఓ వీక్‌ పార్ట్ ఉంటదీ కదా.. అట్లా నీ వీక్ పార్ట్ ఏది?... లీప్సా.. లిల్లీ:  లేదు, నా కళ్లు. నీ వీక్ స్పాట్ ఎక్కడా? టిల్లు:  నాదా...? నా హార్ట్ చాలా వీకూ..  ** రొమాంటిక్ మ్యూజిక్…** టిల్లు: ఫర్ఫ్యూమ్ అచ్చా హై.. కౌనా సా.. లిల్లీ: నా ఫర్ఫ్యూమ్ స్మెల్ కాదు.. నా స్మెల్‌ ఏంటో తెలిసిననాడు మాట్లాడు. టిల్లు:  నువ్వోమో డీప్‌గా మాట్లాడుతున్నావ్... నేనేమో చీప్‌గా మాట్లాడుతున్నా.. లిల్లీ: Do You Know the best part Of Kiss టిల్లు: Kiss లిల్లీ: నా లిప్స్.. నీ లిప్స్‌ను టచ్‌ చేసే ముందు ఉండే ఫ్యూ సెకన్స్..  పబ్‌లో టిల్లుతో లిల్లీ లిల్లీ: దొరికింది కదా… అని ఏది పడితే అది తినొద్దు.. Good Sex is Like a Good food 'టిల్లు: what do you mean good sex? sex is good huh? లేనోన్ని అడుగు బాధేందో తెలుస్తది. లిల్లీతో ఉన్న ట్విస్ట్ రివీల్ అయినప్పుడు.. షానన్ డైలాగ్ షానన్:  ప్రతిసారి ఎక్కడ పడుతావ్‌రా… ఇలాంటి జంబల్ హార్ట్స్‌ లేడీస్‌నీ.. “ఎర్రిపప్ప అయ్యి.. అయ్యి ఆలసట రావడం లేదర నీకూ?... నీ యంకమ్మ..! క్లైమాక్స్‌లో లాస్ట్‌ డైలాగ్‌ లిల్లీ: పోయిన సారి ఆ రాధికకు బెయిల్ ఎందుకు ఇచ్చావ్.. ఈసారి లిల్లీని అరెస్ట్ ఎందుకు చేయించావ్? టిల్లు: ఎందుకంటే ఆ రాధిక నన్ను ప్రేమించి మోసం చేసింది... ఈ లిల్లీ నన్ను మోసం చేయడానికే ప్రేమించింది. https://twitter.com/i/status/1773940395300544591
    ఏప్రిల్ 02 , 2024
    Vijay Deverakonda: విజయ్‌పై హైదరాబాద్‌ మెట్రో ప్రశంసలు.. ఎందుకో తెలుసా?
    Vijay Deverakonda: విజయ్‌పై హైదరాబాద్‌ మెట్రో ప్రశంసలు.. ఎందుకో తెలుసా?
    దేశంలో భారీ స్థాయిలో మెట్రో సేవలు అందిస్తున్న నగరాల్లో హైదరాబాద్‌ (Hyderabad Metro) ఒకటి. రోజుకు వేలాది మంది నగర వాసులు మెట్రో ద్వారా ప్రయాణం చేస్తుంటారు. హైదరాబాద్‌ ట్రాఫిక్‌ను తప్పించుకొని మెట్రో ద్వారా వేగంగా తమ గమ్యస్థానాలకు చేరుతుంటారు. ఇదిలా ఉంటే రీసెంట్‌గా హైదరాబాద్‌ మెట్రో తన ఎక్స్‌ (ట్విటర్‌) ఖాతాలో ఓ పోస్టు పెట్టింది. అది స్టార్‌ హీరో విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda)కు సంబంధించిన డ్యాన్స్‌ వీడియో కావడంతో ఆ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇంతకీ హైదరాబాద్‌ మెట్రో విజయ్‌ వీడియోను ఎందుకు షేర్ చేసింది? ఆ వీడియో కింద ఇచ్చిన క్యాప్షన్ ఎందుకు వైరల్‌ అవుతోంది? ఇప్పుడు చూద్దాం.  విజయ్‌ల ఎవరూ చేయలేదు: మెట్రో విజయ్‌ దేవరకొండ లేటెస్ట్‌ చిత్రం ‘ఫ్యామిలీ స్టార్‌’ (Family Star) టీజర్‌ తాజాగా విడుదలై మంచి ఆదరణ పొందింది. ఇందులో విజయ్‌.. హైదరాబాద్‌ మెట్రోలో ప్రయాణిస్తూ స్టెప్పులేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఎక్స్‌లో షేర్‌ చేసిన హైదరాబాద్‌ మెట్రో.. విజయ్‌పై ప్రశంసలు కురిపించింది. ఈ వీడియోకు క్యాప్షన్‌ ఇస్తూ.. 'మేము ఈ వీడియోను మీతో పంచుకోకుండా ఉండలేకపోతున్నాం. విజయ్‌ దేవరకొండతో పాటు ఫ్యామిలీ స్టార్‌ చిత్ర యూనిట్‌కు మా ధన్యవాదాలు. ఇంతకన్నా బెటర్‌గా మేము ఏం చెప్పగలము' అంటూ రాసుకొచ్చింది. అటు వీడియోలోనూ టెక్ట్స్‌ రూపంలో విజయ్‌ను ప్రశంసించింది. విజయ్‌లా ఇప్పటివరకూ మెట్రోను ఎవరూ ప్రమోట్‌ చేయలేదని పేర్కొంది.  https://twitter.com/ltmhyd/status/1764660143340286442 మిడ్‌క్లాస్‌ను టచ్‌ చేసిన టీజర్‌! విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘ఫ్యామిలీ స్టార్’ మూవీ నుంచి సోమవారం టీజర్ రిలీజైంది. ఇందులో మీడిల్‌ క్లాస్‌ ఫ్యామిలీస్‌ను టచ్‌ చేసే సీన్స్‌ను అలా ఒక ఫ్లాష్‌లో చూపించేశారు. ఒక మిడిల్‌ క్లాస్‌ కుర్రాడిలో కనిపించే ఫ్యామిలీ బాధ్యతలతో పాటు హీరోయిజంను డైరెక్టర్‌ పరుశురాం ఈ చిన్న టీజర్‌లో చూపించాడు. టీజర్ చివర్లో ‘హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కాలేజీ వద్ద బైకుపై దింపుతావా? అని అడిగితే.. లీటర్ పెట్రోల్ కొట్టిస్తే దింపేస్తా’ అని విజయ్ దేవరకొండ చెప్పిన డైలాగ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గీతా గోవిందం తర్వాత విజయ్‌ - పరుశురామ్‌ కాంబినేషన్‌లో వస్తోన్న సినిమా కావడంతో ‘ఫ్యామిలీ స్టార్‌’ భారీగా అంచనాలు ఉన్నాయి.  https://www.youtube.com/watch?v=9z83t3gB9vE మృణాల్‌ - విజయ్‌ కెమెస్ట్రీ మాముల్గా లేదుగా! విజయ్ దేవరకొండ, పరుశురాం కాంబోలో వచ్చిన ‘గీత గోవిందం’లో హీరో విజయ్.. హీరోయిన్‌ రష్మికను ‘మేడం మేడం’ అంటూ వెంట తిరుగుతాడు. ఆ మేడం అనే పిలుపు అప్పట్లో ఎంత వైరల్ అయిందో అందరికీ తెలిసిందే. ఈసారి ఫ్యామిలీ స్టార్‌లో ‘ఏవండీ’ అనే పిలుపు కూడా ఆ స్థాయిలోనే హైలెట్ అయ్యేలా కనిపిస్తోంది. ఈ మూవీ గ్లింప్స్ వచ్చినప్పటి నుంచీ ఈ ‘ఏవండీ’ అనే పిలుపు నెట్టింట్లో బాగానే ట్రెండ్ అయింది. ఇక టీజర్‌లోనూ మళ్లీ అదే పిలుపు మృణాల్‌ నోట వినిపించింది. తాజాగా విజయ్‌ ఎక్స్‌లో షేర్‌ చేసిన వీడియోలోను మృణాల్‌ విజయ్‌ను ఏవండి అంటూ ప్రేమగా పిలుస్తూ కనిపిస్తుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీ కామెంట్స్‌ చేస్తున్నారు. వీరి కెమెస్ట్రీ తెరపై కనువిందు చేస్తుందని ఇప్పటి నుంచే లెక్కలు వేసుకుంటున్నారు.  https://twitter.com/TheDeverakonda/status/1765018796358775059 సరిగ్గా 30 రోజుల్లో రిలీజ్ ది ఫ్యామిలీ స్టార్ సినిమాలో తొలిసారి విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జోడిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈసినిమాలో వాసుకి, రోహిణితో పాటు మరికొందరు నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ఫ్యామిలీ స్టార్ చిత్రానికి గోపీసుందర్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. అంటే సరిగ్గా 30 రోజుల్లో ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓ పోస్టర్‌ను సైతం చిత్ర యూనిట్‌ కొద్దిసేపటి క్రితమే రిలీజ్‌ చేసింది. విజయ్‌ తర్వాతి సినిమా ఫ్యామిలీ స్టార్‌ సినిమా పూర్తిగానే విజయ్ తన పన్నెండో చిత్రాన్ని ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో చేస్తున్నట్లు ప్రకటించారు. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా ఇప్పటికే విడుదలైంది. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ కలిసి నిర్మిస్తున్నాయి. త్వరలోనే చిత్ర యూనిట్‌ షూట్‌కు కూడా వెళ్లనుంది. ఇక చిత్ర ప్రకటన సందర్భంగా మేకర్స్ కాన్సెప్ట్ పోస్టర్‌ను విడుదల చేశారు. కాగా, ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందించనున్నారు. ఇందులో విజయ్‌కు జోడీగా శ్రీలీల నటించనుంది. 
    మార్చి 06 , 2024
    Gaami Day 1 Collections: విష్వక్‌ కెరీర్‌లోనే అత్యధిక ఓపెనింగ్స్‌.. ‘గామి’ ఫస్ట్‌డే కలెక్షన్స్ ఎంతంటే?
    Gaami Day 1 Collections: విష్వక్‌ కెరీర్‌లోనే అత్యధిక ఓపెనింగ్స్‌.. ‘గామి’ ఫస్ట్‌డే కలెక్షన్స్ ఎంతంటే?
    విశ్వక్‌ సేన్‌ (Vishwak sen) హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ‘గామి’ (Gaami). విద్యాధర్‌ కాగిత (Vidyadhar Kagita) ఈ మూవీతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. చాందినీ చౌదరి కథానాయికగా చేసింది. మార్చి 8న శివరాత్రి కానుకగా రిలీజైన ఈ చిత్రం మంచి హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. కెరీర్‌ బెస్ట్‌ నటనతో విశ్వక్‌ సేన్‌ ఆకట్టుకున్నట్లు కథనాలు కూడా వచ్చాయి. భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం.. అదే స్థాయిలో పాజిటివ్‌ రెస్పాన్స్‌ సాధించడంతో బాక్సాఫీస్‌ వద్ద ఈ మూవీకి తిరుగుండదని అంతా భావిస్తున్నారు. ఇందుకు తగ్గట్లే మార్నింగ్ షో నుంచే ‘గామి’ భారీ ఓపెనింగ్స్ రాబట్టింది. తాజాగా ఫస్ట్‌డే కలెక్షన్స్‌ను చిత్రయూనిట్‌ అధికారికంగా ప్రకటించింది.  డే1 కలెక్షన్స్‌ ఎంతంటే? గామి సినిమా మొదటి రోజే (Gaami Day 1 Collections) రూ.9.07 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు ఓ పోస్టర్‌ను సైతం రిలీజ్‌ చేశారు. అటు అమెరికాలోనూ ఈ సినిమా తొలి రోజు 2.50 లక్షల డాలర్లకు పైగా కలెక్ట్‌ చేసినట్లు చిత్ర యూనిట్‌ వెల్లడించింది. 1 మిలియన్‌ డాలర్స్‌ దిశగా ‘గామి’ పరుగులు పెడుతున్నట్లు పేర్కొంది. విష్వక్‌ సేన్‌ ఇప్పటి వరకూ చేసిన చిత్రాల్లో ఇదే అత్యధిక డే వన్‌ కలెక్షన్స్‌ అని సినీ వర్గాలు విశ్లేషిస్తున్నారు. ఇక నేడు, రేపు రెండు రోజులు కూడా వీకెండ్ కావడంతో ఈజీగా మూడు రోజుల్లో 30 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసే అవకాశముందని అంచనా వేస్తున్నాయి.  View this post on Instagram A post shared by Vishwak Sen (@vishwaksens) సాక్నిక్‌ లెక్కల ప్రకారం గామి చిత్రం తొలిరోజు కలెక్షన్స్‌ను ప్రముఖ వెబ్‌సైట్‌ సాక్నిక్‌ (Sacnilk) కూడా ప్రకటించింది. ఈ సినిమా తొలి రోజు రూ. 4.50 కోట్ల నెట్‌ కలెక్షన్స్‌ (Gaami Day1 Net Collections)ను వసూలు చేసినట్లు తన సైట్‌లో పేర్కొంది. అయితే వరల్డ్‌ వైడ్‌గా ఎంత వసూళ్లను రాబట్టిందోనన్న విషయాన్ని మాత్రం సాక్నిక్‌ తన సైట్‌లో ప్రస్తావించలేదు. అటు ‘గామి’ ఫస్ట్‌డే రోజున చెప్పుకోతగ్గ స్థాయిలో థియేటర్ ఆక్యూపెన్సీ నమోదు చేసినట్లు సాక్నిక్‌ తెలిపింది. మార్కింగ్‌ షోకు 45.58%, మధ్యాహ్నం 56.47%, సాయంత్రం 49.88%, సెకండ్ షో 71.69% ఆక్యుపెన్సీ రేట్‌ నమోదైనట్లు వెల్లడించింది. ఈ వీకెండ్‌లో ఆక్యుపెన్సీతో పాటు కలెక్షన్స్‌ మరింత పెరిగే అవకాశముందని విశ్లేషించింది.  ప్రీ రిలీజ్‌ బిజినెస్ ఎంతంటే? విశ్వక్ సేన్ హీరోగా నటించిన 'గామి' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో మంచి బిజినెస్ జరిగింది. ట్రేడ్ లెక్కల ప్రకారం.. ఈ సినిమా నైజాంలో రూ. 3.50 కోట్లు, సీడెడ్‌లో రూ.1.20 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ఏరియాలనూ కలుపుకుని రూ.3.50 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్‌ను చేసుకుంది. రెండు రాష్ట్రాలు కలుపుకొని మెుత్తంగా రూ. 8.20 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అటు కర్నాటక ప్లస్, రెస్టాఫ్ ఇండియా ప్లస్, ఓవర్సీస్ ఏరియాల హక్కులు రూ. 2 కోట్లకు అమ్ముడుపోయాయి. దీంతో ఈ మూవీకి ప్రపంచ వ్యాప్తంగా రూ. 10.20 కోట్ల వ్యాపారం చేసింది. అంటే గామి హిట్ అవ్వాలంటే రూ. 11 కోట్ల షేర్ వసూలు చేయాల్సిన అవసరం ఉంది. తొలిరోజు రూ.9 కోట్లకు పైగా వసూళ్లు సాధించడంతో ఈ మూవీ ఈజీగానే లాభాల్లోకి అడుగుపెట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి.  విష్వక్‌ నటనపై ప్రశంసలు అఘోరా శంకర్‌ పాత్రలో విశ్వక్‌ కెరీర్ బెస్ట్‌ నటనతో ఆకట్టుకున్నాడు. ఈ సినిమాలో కొత్త విష్వక్‌ సేన్‌ను చూస్తారు. శంకర్‌ పాత్రలో పరకాయ ప్రవేశం చేసి మరి అతడు నటించాడు. విష్వక్‌ నటన, డైలాగ్‌ డెలివరీ గత చిత్రాల కంటే చాలా బెటర్‌గా అనిపిస్తాయి. భావోద్వేగాలను చక్కగా పలికిస్తూ ఎమోషన్స్‌ సీన్లలో విష్వక్ అదరగొట్టాడు. అటు ఫీమేల్‌ లీడ్‌ రోల్‌లో నటి చాందిని చౌదరి ఆకట్టుకుంది. సినిమాలో విష్వక్‌ తర్వాత స్క్రీన్‌పై ఆమె పాత్రకే ఎక్కువ ప్రజెన్స్‌ లభించింది. హిమాలయ యాత్రలో. యాక్ష విష్వక్‌కు సాయపడే పాత్రలో ఆమె మెప్పించింది. నటన పరంగా ఆమెకు ఎలాంటి మైనస్‌లు లేవు. ఇక దేవదాసి పాత్రలో అభినయ కూడా చక్కటి నటన కనబరిచింది. https://telugu.yousay.tv/top-secrets-you-dont-know-about-vishwak-sen.html
    మార్చి 09 , 2024
    RGV DEN: నెపోటిజంపై ఆర్జీవీ యుద్ధం.. కొత్తవారికి సూపర్ ఛాన్స్.. ఇలా అప్లై చేసుకోండి!
    RGV DEN: నెపోటిజంపై ఆర్జీవీ యుద్ధం.. కొత్తవారికి సూపర్ ఛాన్స్.. ఇలా అప్లై చేసుకోండి!
    ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ (RGV).. సంచలనాలకు మారుపేరుగా మారిపోయాడు. తన పోస్టులు, ఊహకందని నిర్ణయాలతో ఎప్పటికప్పుడు ఆడియన్స్‌ను సర్‌ప్రైజ్‌ చేస్తుంటాడు. తాజాగా ఆర్‌జీవీ నెపోటిజం, ఆవార్డుల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. కొత్త నటీనటులకు ‘యువర్‌ ఫిలిం’ అంటూ ఓపెన్ ఆఫర్‌ ఇచ్చాడు. ఒక చిత్రం హిట్‌ కావాలన్నా, ప్లాప్ చేయాలన్నా అది ఆడియన్స్ చేతిలోనే ఉంటుందని పేర్కొన్నాడు. అలాంటిది ఆ ప్రేక్షకులు ఒక సినిమా చేయలేరా? అంటూ ప్రశ్నించాడు. ప్రతీ సంవత్సరం 150కి పైగా సినిమాలు రిలీజ్‌ అవుతుంటాయని వాటిలో 90% ఫెయిలవుతున్నట్లు ఆర్జీవీ చెప్పాడు. చిత్ర నిర్మాతలు ఎంచుకున్న కథ, తారాగణం, సృజనాత్మక అంశాలు ప్రేక్షకులకు నచ్చలేదని పేర్కొన్నాడు. ఇండస్ట్రీలోని 90% నిర్మాతలకు ప్రేక్షకులకు ఏమి కావాలో తెలియదని ఈ లెక్కలు రుజువు చేస్తున్నట్లు చెప్పాడు. సినిమా తీయగల టాలెంట్ ఉన్న ఆడియన్స్‌కు మద్దతిచ్చేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు దర్శకుడు ఆర్జీవీ సోషల్‌ మీడియా వేదికగా తెలియజేశాడు. ఫేక్ అవార్డులను, ఇండస్ట్రీలో కనిపించే నెపోటిజంని కలిసి కట్టుగా నిర్మూలిద్దామంటూ వారికి పిలుపునిచ్చాడు. ఇండస్ట్రీలోని స్టార్ల వారసులని కాకుండా ఒక సాధారణ వ్యక్తి స్టార్ అయ్యేలా కృషి చేద్దామని ఆర్జీవీ అన్నాడు. సినిమా గురించి నేర్చుకోవడం కోసం ఫిలిం ఇన్‌స్టిట్యూషన్‌కి వెళ్లాల్సిన అవసరం లేదని.. అవి మీ సమయాన్ని, డబ్బుని వృథా చేస్తాయని చెప్పుకొచ్చాడు. కాబట్టి వాటిని కూడా నిర్మూలించేందుకు చేతులు కలపాలని సినీ అభిమానులకు పిలుపునిచ్చాడు.  చలన చిత్ర చరిత్రలో ఎప్పుడు లేని విధంగా తొలిసారి ఆర్జీవీ డెన్‌ ఒక ప్రాజెక్టును ప్రారంభిస్తున్నట్లు ప్రకటించాడు. ఇక్కడ టిక్కెట్‌ కొనుగోలు చేసే ప్రేక్షకులు మాత్రమే సినిమాను నిర్ణయిస్తారని పేర్కొన్నాడు. లీడ్‌ యాక్టర్స్‌, డైరెక్టర్స్‌, సినిమాటోగ్రాఫర్స్, మ్యూజిక్‌ డైరెక్టర్స్‌, లిరికిస్ట్స్‌, డైలాగ్‌ రైటర్స్‌ను ప్రజలే నిర్ణయిస్తారని చెప్పాడు. ఇతర టెక్నికల్‌ సిబ్బందిని పరిశ్రమలోని నిపుణుల నుండి ఎంపిక చేసిన దర్శకుడు సెలక్ట్‌ చేస్తారని స్పష్టం చేశాడు.  అసలైన సినిమా మేకింగ్ అంటే ఏంటో పని చేస్తూ నేర్చుకుందామని ఔత్సాహికులకు ఆర్జీవీ పిలుపునిచ్చాడు. వారందర్ని ఆర్జీవీ డెన్‌కి ఆహ్వానిస్తున్నట్లు చెప్పాడు. మరి మీలో టాలెంట్ ఉండి, ఇంటరెస్ట్ ఉంటే.. Rgvden.comకి వెళ్లి అక్కడ మీకు కావాల్సిన డీటెయిల్స్‌ని తెలుసుకోవాలని దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ సూచించారు.  ఔత్సాహికులు ఏ విధంగా అప్లై చేయాలి? వచ్చిన ఆప్లికేషన్ల నుంచి నటీనటులను ఫైనల్‌ చేసే విధానాన్ని కూడా ఆర్జీవీ తన వెబ్‌సైట్‌లో వివరంగా పేర్కొన్నారు. నటనపై ఆసక్తి ఉన్నవారు ఈ క్రింది వివరాలు సమర్పించాల్సి ఉంటుంది.  పేరు వయసుఎత్తు (అడుగులలో)చర్మ రంగుకంటి రంగుసింగిల్ బస్ట్ సైజ్‌ ఫొటోసింగిల్‌ ఫుల్‌ ఫిగర్ ఫొటో హీరో, హీరోయిన్ ఎంపిక ప్రక్రియ ఆసక్తిగల వారు 15 రోజుల్లో పై వివరాలను సమర్పించాల్సి ఉంటుంది. ఇందులో 30 మందిని ఆర్జీవీ డెన్‌ సిబ్బంది లుక్స్‌ను బట్టి షార్ట్ లిస్ట్‌ చేస్తారు. అలా సెలెక్ట్ చేసిన 30 మంది వివరాలను ఆర్జీవీ వెబ్‌సైట్‌లో పొందుపరుస్తారు. వారిలో ఎవర్ని ఎంచుకోవాలో పబ్లిక్‌  పోల్‌ నిర్వహిస్తారు. అలా ఎక్కువ ఓట్లు వచ్చిన టాప్‌ 15 యువతీ, యువకులను షార్ట్ లిస్ట్ చేస్తారు. తర్వాత వారిని ఏదైన డైలాగ్‌ ఇచ్చి 30 సెకన్ల ఆడిషన్స్ వీడియో పంపాలని ఆర్జీవ్‌ డెన్‌ టీమ్‌ కోరుతుంది. మళ్లీ ఆ వీడియోలను వెబ్‌సైట్‌లో పోస్టు చేసి మళ్లీ ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తారు. ఈ దఫా ఎక్కువ ఓట్లు వచ్చిన తొలి ఏడుగురు యువతీ, యువకులను ఎంపిక చేస్తారు. అలా ఎంపికైన వారికి నటనకు సంబంధించిన వివిధ రకాల ఛాలెంజ్స్ పెట్టి వారిలో బెస్ట్ ఔట్‌పుట్‌ ఇచ్చిన వారిని తిరిగి పోల్‌లోకి తీసుకొస్తారు. అందులో టాప్‌లో నిలిచిన యువతీ యువకులను ఎంపికైనట్లు ప్రకటిస్తారు. వారిని RGVDEN తీయబోయే సినిమాలో హీరో, హీరోయిన్‌గా అవకాశం ఇస్తారు. మిగతా విభాాగాలు.. ఇదే విధంగా డైరెక్టర్స్‌, రైటర్స్‌, మ్యూజిక్ కంపోజర్స్‌, సినిమాటోగ్రాఫర్స్‌, లిరికిస్ట్స్‌ వారి విభాగాలకు తగ్గట్లు ఎంపిక చేస్తారు. పూర్తి వివరాలకు ఈ కింది లింక్‌పై క్లిక్ చేయండి.  https://rgvden.com/
    ఏప్రిల్ 06 , 2024
    War 2: బాలీవుడ్‌ స్టార్లకు నిద్ర లేకుండా చేస్తున్న తారక్‌ రెమ్యూనరేషన్‌.. ‘వార్‌ 2’ తర్వాత ఎన్టీఆర్‌ సోలో చిత్రం!
    War 2: బాలీవుడ్‌ స్టార్లకు నిద్ర లేకుండా చేస్తున్న తారక్‌ రెమ్యూనరేషన్‌.. ‘వార్‌ 2’ తర్వాత ఎన్టీఆర్‌ సోలో చిత్రం!
    'ఆర్‌ఆర్‌ఆర్‌' (RRR) చిత్రంతో జూనియర్‌ ఎన్టీఆర్‌ (Jr NTR) క్రేజ్‌ పాన్ ఇండియా స్థాయికి చేరుకుంది. దీంతో ఆయన చేస్తున్న చిత్రాలపై దేశవ్యాప్తంగా బజ్‌ ఏర్పడింది. ప్రస్తుతం తారక్‌ చేతిలో రెండు క్రేజీ ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. అందులో ఒకటి కొరటాల శివ (Koratala Siva)తో చేస్తున్న 'దేవర' (Devara) కాగా.. మరోకటి బాలీవుడ్‌లో చేయబోతున్న 'వార్‌ 2' (War 2) చిత్రం. ముఖ్యంగా 'వార్‌ 2'పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో బాలీవుడ్‌ స్టార్‌ హీరో హృతిక్‌ రోషన్‌ (Hrithik Roshan) హీరోగా నటిస్తుండటంతో పాటు హిందీలో తారక్‌కు ఇదే తొలి చిత్రం. దీంతో  ఈ సినిమా నేషనల్‌ వైడ్‌గా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీకి సంబంధించి క్రేజీ అప్‌డేట్స్‌ బయటకొచ్చాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.  60 రోజుల్లో షూటింగ్‌ పూర్తి! 'వార్‌ 2' చిత్రంలో తారక్‌, హృతిక్‌ రోషన్‌ పాత్రల షూటింగ్‌కు సంబంధించి కొన్ని వార్తలు బాలీవుడ్‌లో చక్కర్లు కొడుతున్నాయి. ఎన్టీఆర్‌, హృతిక్‌ ఇద్దరూ కూడా కేవలం 60 రోజుల్లో తమ పాత్రలకు సంబంధించిన షూట్‌ను పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరి కలయికలో వచ్చే సీన్స్‌ 30 రోజులు చిత్రీకరించనున్నారని బాలీవుడ్‌ వర్గాల్లో టాక్‌ వినిపిస్తోంది. ఈ యాక్షన్‌ ఎపిసోడ్స్‌ ఎంతో క్రేజీగా ఉంటాయని అంటున్నారు. అటు హై టెక్నాలజీతో రూపొందుతున్న 'వార్‌ 2' చిత్ర షూటింగ్‌ను ఎక్కువ భాగం స్టూడియోస్‌లోనే తీయనున్నారట. హృతిక్‌ పార్ట్‌ను జూన్‌ కల్లా, తారక్‌ పార్ట్‌ను జులై కల్లా పూర్తి చేయనున్నట్లు సమాచారం.  ‘రా ఏజెంట్‌’గా ఎన్టీఆర్‌! యశ్‌రాజ్‌ స్పై యూనివర్స్‌లో భాగంగా రూపొందుతున్న 'వార్‌ 2' చిత్రానికి అయాన్‌ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ఎన్టీఆర్‌ పోషించనున్న పాత్రకు సంబంధించి ఆసక్తికరమైన విషయాలు వినిపిస్తున్నాయి. ఇందులో తారక్‌ ఇండియన్‌ రా ఏజెంట్‌ పాత్రలో కనిపిస్తారని బాలీవుడ్‌ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఆ పాత్ర భవిష్యత్తులో తరచూ తెరపై కనిపిస్తూనే ఉంటుందని అంటున్నారు. అలాగే యశ్‌రాజ్‌ స్పై యూనివర్స్‌లో భాగంగా తారక్‌ సోలో హీరోగా ఓ సినిమా కూడా రూపొందనుందని బాలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. అయితే దీనిపై ‘వార్‌ 2’ టీమ్‌, నిర్మాణ సంస్థ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. తారక్‌ రెమ్యూనరేషన్‌ అన్ని కోట్లా? 'వార్‌ 2' సినిమా కోసం ఎన్టీఆర్ భారీ మొత్తాన్ని రెమ్యునరేషన్‌గా తీసుకుంటున్నట్లు సమాచారం. ప్రత్యేక పాత్ర కోసం ఏకంగా రూ.100 కోట్లు అందుకోనున్నట్లు బాలీవుడ్‌ వర్గాల్లో టాక్‌ వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ న్యూస్ హిందీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ విషయం తెలుసుకున్న బాలీవుడ్ స్టార్స్.. తారక్‌ రెమ్యూనరేషన్‌ చూసి అవాక్కవుతున్నారట. ఓ స్పెషల్‌ రోల్‌ కోసం తారక్‌ ఈ రేంజ్‌లో ఛార్జ్‌ చేస్తుండటం చూసి ఆశ్చర్యపోతున్నారట. ఈ విషయంపై నెటిజన్స్ కూడా రియాక్ట్ అవుతున్నారు. స్పెషల్ రోల్ కోసం వంద కోట్లా.. ఇదెక్కడి మాస్ క్రేజ్ రా మావా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే దీనిపై చిత్ర యూనిట్‌ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. 'వార్‌ 2' కోసం సరికొత్త టెక్నాలజీ! 'వార్‌ 2' సినిమా కోసం దర్శకుడు అయాన్‌ ముఖర్జీ అధునాతన సాంకేతికతను వినియోగిస్తున్నట్లు సమాచారం. అవుట్‌ డోర్‌లో వచ్చే ఎన్టీఆర్‌, తారక్‌ కీలకమైన యాక్షన్‌ ఎపిసోడ్స్‌ను పూర్తిగా బాడీ డబుల్స్‌తో తీస్తున్నారట. ఆ తర్వాత VFX వాడి తారక్‌, హృతిక్‌ ముఖాలను స్వాప్‌ చేస్తారట. గ్రాఫిక్స్‌ వాడినట్లు అనుమానం రాకుండా అధునిక టెక్నాలజీని ఇందుకు వినియోగించనున్నట్లు తెలుస్తోంది. రెగ్యులర్‌ పద్దతిలో అయితే డూప్లతో పాటు హీరోలు కూడా లొకేషన్స్‌లో ఉండాల్సి ఉంటుంది. కానీ ఈ ఆధునిక బాడీ డబుల్స్‌ విధానంలో హీరోలతో పని లేకుండా సీన్లను చిత్రీకరించవచ్చని మూవీ యూనిట్‌ చెబుతోంది. 
    మార్చి 13 , 2024
    Chandra Mohan: సీనియర్‌ నటుడు చంద్రమోహన్‌ కన్నుమూత.. ఆయన గురించి ఈ విషయాలు తెలుసా?
    Chandra Mohan: సీనియర్‌ నటుడు చంద్రమోహన్‌ కన్నుమూత.. ఆయన గురించి ఈ విషయాలు తెలుసా?
    టాలీవుడ్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు చంద్రమోహన్‌ (78) కన్నుమూశారు. గత కొంత కాలంగా షుగర్‌, గుండె, డయాలసిస్‌ సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం (నవంబర్‌ 11న) తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు ధ్రువీకరించారు. దీంతో ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మరోవైపు హైదరాబాద్‌లో సోమవారం ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. ఆయన మరణంపై సెలబ్రిటీలు, అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు. చంద్రమోహన్‌ మృతి నేపథ్యంలో ఆయనకు సంబంధించిన పూర్తి సమాచారం YouSay మీ ముందుకు తీసుకొచ్చింది.  కుటుంబ నేపథ్యం చంద్రమోహన్ అసలు పేరు మల్లంపల్లి చంద్రమోహనరావు. ఏపీలోని కృష్ణాజిల్లా పమిడిముక్కలలో 1945 మే 23న ఆయన జన్మించారు. మేడూరు, బాపట్లలో చదువుకున్నారు. ఈయన దివంగత దర్శకుడు కె.విశ్వనాథ్‌కి చాలా దగ్గరి బంధువు. చంద్ర మోహన్ భార్య పేరు జలంధర. ఈమె రచయిత్రి. వీరికి మధుర మీనాక్షి, మాధవి అని ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మధుర మీనాక్షి సైకాలజిస్ట్‌గా అమెరికాలో స్థిరడ్డారు. రెండో కుమార్తె మాధవి చెన్నైలో వైద్యవృత్తిలో సేవలందిస్తున్నారు.  సినిమా నేపథ్యం చంద్రమోహన్‌ 1966లో ‘రంగుల రాట్నం’ సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. 1987లో ‘చందమామ రావే’ చిత్రానికి ఉత్తమ హాస్యనటుడిగా, 2005లో ‘అతనొక్కడే’ సినిమాకు ఉత్తమ సహాయ నటుడిగా నంది అవార్డు అందుకున్నారు. ‘పదహారేళ్ల వయసు’ సినిమాకుగానూ ఫిలిం ఫేర్‌ అవార్డు గెలుచుకున్నారు. ‘రంగుల రాట్నం’, ‘ఆమె’ ‘పదహారేళ్ల వయసు’, ‘సీతామహాలక్ష్మి’, ‘రాధాకల్యాణం’, ‘రెండు రెళ్ల ఆరు’, ‘చందమామ రావే’, ‘రామ్‌ రాబర్ట్ రహీమ్‌’ చిత్రాలతో ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరయ్యారు. 55 ఏళ్ల సినీ కెరీర్‌లో దాదాపు 932 సినిమాలలో నటించారు. చంద్రమోహన్‌ మెచ్చిన చిత్రాలు సినిమాల్లోకి రాకపోయి ఉంటే డబ్బులు లెక్కపెట్టే ఉద్యోగం చేసుకుని ఉండేవాడినని ఓ ఇంటర్యూలో చంద్రమోహన్‌ చెప్పారు. ఫస్ట్ సినిమా సక్సెస్ అయిన తర్వాత కూడా ఇండస్ట్రీలో కొనసాగాలా? వద్దా? అని ఒకటికి రెండుసార్లు ఆలోచించినట్లు చెప్పుకొచ్చారు. అంతిమంగా సినిమావైపే అడుగులు వేశారు. తన కెరీర్‌లో ‘సిరిసిరిమువ్వ’, ‘శుభోదయం’, ‘సీతామహాలక్ష్మి’, ‘పదహారేళ్ల వయసు’ చిత్రాలను ఎన్నటికీ మర్చిపోలేనని చెప్తూ ఉండేవారు. లక్కీ హీరోగా గుర్తింపు ఒకప్పుడు చంద్రమోహన్‌ను అందరూ లక్కీ హీరోగా అనేవారు. ఆయనతో ఏ హీరోయిన్‌ అయినా నటిస్తే సినిమా హిట్‌ అవ్వాల్సిందే. అలా కెరీర్‌ ప్రారంభంలో శ్రీదేవి (Sri Devi), జయసుధ (Jayasuda), జయప్రద (Jaya Prabha) ఆయనతో కలిసి నటించి హిట్స్‌ అందుకున్నారు. చంద్రమోహన్‌-సుధ కాంబినేషన్‌ అయితే సూపర్‌హిట్‌ అయింది. అటు చంద్రమోహన్‌ క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా చాలా చిత్రాలు చేశారు. తెలుగులోనే కాకుండా తమిళంలోనూ నటించారు. ఈయన నటించిన చివరి చిత్రం ఆక్సిజన్‌. సంపాదనలో శూన్యమే! చంద్రమోహన్‌ 50 ఏళ్లకు పైగా ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ పెద్దగా ఆస్తులు కూడబెట్టలేదు. చివరి రోజుల్లో ఆయన సాదాసిదా జీవితాన్నే గడిపారు. వందల కోట్లు విలువ చేసే ఆస్తులు పోగొట్టుకున్నట్లు చంద్రమోహన్‌ స్వయంగా ఓ ఇంటర్యూలో తెలిపారు. హైదరాబాద్‌ కోంపల్లిలో 35 ఎకరాల ద్రాక్ష తోట కొన్నప్పటికీ చూసుకోవడం వీలుపడటం లేదని దాన్ని అమ్మేశారు. శోభన్‌ బాబు చెబుతున్నా వినకుండా చెన్నైలోని 15 ఎకరాలు కూడా విక్రయించేశారు. దాని విలువ ప్రస్తుతం  రూ.30 కోట్లపైనే. శంషాబాద్‌ ప్రధాన రహదారి పక్కన ఆరు ఎకరాలు కొన్నప్పటికీ దాన్ని నిలుపుకోలేకపోయారు.   చెయ్యి చాలా మంచిదట! చంద్రమోహన్‌ దగ్గర ఆస్తి నిలవలేదు కానీ, ఆయన చేతితో ఒక్క రూపాయి తీసుకున్నా బాగా కలిసొస్తుందని చాలామంది నమ్మకం. అందుకని కొత్త ఏడాది ప్రారంభంలో (జనవరి 1) ఎంతోమంది ఆయన ఇంటికి వెళ్లి చంద్రమోహన్‌ చేతుల మీదుగా డబ్బు తీసుకునేవారు. ఈ విషయాన్ని చంద్రమోహన్‌ భార్య, రచయిత్రి జలంధర స్వయంగా తెలిపారు.
    నవంబర్ 11 , 2023
    Mrunal Thakur : నెటిజన్లతో మృణాల్‌ ముచ్చట్లు… సీతారామం 2 సినిమాపై క్లారిటీ..!
    Mrunal Thakur : నెటిజన్లతో మృణాల్‌ ముచ్చట్లు… సీతారామం 2 సినిమాపై క్లారిటీ..!
    సీతారామం చిత్రంలో సీతగా నటించిన మృణాల్‌ ఠాకూర్‌ తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. ఈ భామ అందం, అభినయం, నటన.. సినిమా విజయంలో కీలకపాత్ర పోషించింది. సీతారామంలో ఎంతో ట్రెడిషనల్‌గా కనిపించిన ఈ ముద్దుగుమ్మ గత కొంత కాలంగా తన హాట్‌ ఫొటోలతో సోషల్‌ మీడియాలో రచ్చ రచ్చ చేస్తోంది. బోల్డ్‌ లుక్‌లో ఉన్న మృణాల్‌ను చూసి ఆమె ఫ్యాన్స్‌ ఆశ్చర్యపోతున్నారు. ఇదిలా ఉంటే తాజాాగా మృణాల్‌ ట్విటర్‌ వేదికగా ఫ్యాన్స్‌తో ముచ్చటించింది. #askmrunal పేరుతో నెటిజన్ల ప్రశ్నలను ఆహ్వానించింది. ఈ క్రమంలో నెటిజన్లు అడిగిన ప్రతీ ప్రశ్నకు మృణాల్‌ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. ఆ ప్రశ్నలు, సమాధానాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.  ప్రశ్న: మీకు కెనడియన్‌ యాక్టర్‌ కీను రీవ్స్‌తో నటించే అవకాశం వస్తే ఎలా ఫీలవుతారు? మృణాల్‌: సంతోషం, ఆనందం, ఆశ్చర్యాన్ని తెలియజేసే ఎమోజీస్‌  https://twitter.com/mrunal0801/status/1645117683267170306 భారత్‌లో బ్రిటన్ రాయబారి: మనం రెండేళ్ల క్రితం కలిసి విమాన ప్రయాణం చేశాం. మీరు సాధించిన విజయాలకు నా అభినందనలు. మృణాల్‌: మీ నుంచి ఈ మాటలు వినడం చాలా సంతోషం. ఆ రోజు సినిమాలపై మన మధ్య జరిగిన సంభాషణ ఇప్పటికీ నాకు గుర్తింది. https://twitter.com/mrunal0801/status/1645084379264237570 ప్రశ్న: హైదరాబాద్‌లో నాని 30 సినిమా షూటింగ్‌లో మిమ్మల్ని కలిశాను. మీరు చాలా బాగా మాట్లాడారు. ఇంతపెద్ద స్టార్‌గా ఎదగడానికి మీ వినయమే కారణం అనుకుంటా. మృణాల్‌: థ్యాంక్యూ https://twitter.com/mrunal0801/status/1645078658900525056 ప్రశ్న: సీతారామంలో సీతా మహాలక్ష్మీగా మీ నటన చూసి ఫ్యాన్‌ అయిపోయా. ఆ సినిమా గురించి ఏమైన చెప్పండి. మృణాల్‌: సీతారామం నిజంగా ఓ అద్భుతం. https://twitter.com/mrunal0801/status/1645067329078804482 ప్రశ్న: బాలీవుడ్ or సౌత్‌  మృణాల్‌: ఇండియన్ సినిమా. https://twitter.com/mrunal0801/status/1645062867035496451 ప్రశ్న: తెలుగులో ఒక మాట మాట్లాడండి? మృణాల్‌: మళ్లీ మెుదలు https://twitter.com/mrunal0801/status/1645062753697103875 ప్రశ్న: సీతారామం 2 కు అవకాశం ఉందా? మృణాల్: నాకూ తెలీదు. కానీ ఉండాలని కోరుకుంటున్నా https://twitter.com/mrunal0801/status/1645028690697519104 ప్రశ్న: మీరు నటించిన గుమ్రా మూవీ చూశా. యాక్షన్‌ మూవీలో నిన్ను చూడటం చాలా ఎక్జైటింగ్‌గా అనిపించింది. కేవలం నీ కోసమే మా పేరెంట్స్‌ను సినిమాకు తెసుకెళ్లాలని అనుకుంటున్నా. మృణాల్‌: మీ తల్లిదండ్రులకు నా ప్రేమను తెలియజేయండి. వారు సినిమాను ఆస్వాదిస్తారని ఆశిస్తున్నా. https://twitter.com/mrunal0801/status/1645060359915556864 బాలీవుడ్‌లో మృణాల్‌ నటించిన గుమ్రా మూవీ ఏప్రిల్‌ 7న విడుదలై మంచి హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. ఇందులో పోలీసు ఆఫీసర్‌గా మృణాల్‌ నటన ఆకట్టుకుంది. హీరో ఆదిత్య రాయ్‌ కపూర్‌కు పోటీగా నటించి మృణాల్‌ మెప్పించింది. తొలి మూడు రోజుల్లో గుమ్రా మూవీ రూ.15కోట్ల గ్రాస్‌ సాధించినట్లు మేకర్స్‌ ప్రకటించారు. 
    ఏప్రిల్ 10 , 2023
    Vyjayanthi Movies Hits : ‘కల్కి 2898 ఏడీ’ నిర్మాణ సంస్థ  వైజయంతీ బ్యానర్‌లో ఇన్ని హిట్ సినిమాలు ఉన్నాయా?
    Vyjayanthi Movies Hits : ‘కల్కి 2898 ఏడీ’ నిర్మాణ సంస్థ  వైజయంతీ బ్యానర్‌లో ఇన్ని హిట్ సినిమాలు ఉన్నాయా?
    ప్రభాస్‌ (Prabhas) హీరోగా నటించిన ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) చిత్రం.. థియేటర్లలో ప్రభంజనం సృష్టిస్తోంది. బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. కల్కి ఈ స్థాయి సక్సెస్‌ సాధించడం వెనక దర్శకుడు నాగ్‌ అశ్విన్‌తో పాటు నిర్మాణ సంస్థ ‘వైజయంతీ మూవీస్‌’ (Vyjayanthi Movies) బ్యానర్‌ పాత్ర కూడా ఎంతో ఉంది. నిర్మాత అశ్వనీ దత్‌ (Aswani Dutt) ఎంతో సాహాసోపేతంగా కల్కి చిత్రాన్ని నిర్మించారు. బడ్జెట్‌ అంతకంతకూ పెరుగుతున్నప్పటికీ ఆయన వెనక్కి తగ్గలేదు. క్వాలిటీ ఔట్‌పుట్‌ ఇవ్వాలన్న లక్ష్యంతో దర్శకుడు నాగ్‌ అశ్విన్‌కు బడ్జెట్‌ పరంగా పూర్తి స్వేచ్ఛను కల్పించారు. రూ.600 కోట్లకు పైగా వ్యయంతో ఇండియాలోనే అతి భారీ బడ్జెట్‌ ఫిల్మ్‌గా కల్కిని తీర్చిదిద్దారు. కల్కి లాంటి విజువల్‌ వండర్‌ను అందించిన నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్‌ పేరు.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మారుమోగుతోంది.  వైజయంతీ మూవీస్‌ ప్రస్థానం అశ్వనీ దత్‌.. నిర్మాతగా తన ప్రస్థానాన్ని అభిమాన హీరో నందమూరి తారక రామారావు ఫిల్మ్‌తోనే ప్రారంభించారు. వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌ను నిర్మించి దాని లోగోగా కృష్ణుడి అవతారంలో ఉన్న ఎన్టీఆర్‌ను పెట్టారు. 1975లో వచ్చిన 'ఎదురులేని మనిషి' చిత్రంతో వైజయంతీ మూవీస్‌ సంస్థ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. తొలినాళ్లలో కొన్ని ఒడిదొడుకులు ఎదుర్కొన్నప్పటికీ.. బ్లాక్‌బాస్టర్‌ చిత్రాలను అందించడంలో మాత్రం వెనకడుగు వేయలేదు. ఈ బ్యానర్‌లో వచ్చిన పలు చిత్రాలు టాలీవుడ్‌లో ఎంతో ఇంపాక్ట్‌ క్రియేట్‌ చేశాయి. ఇంతకీ ఆ బ్లాక్‌బాస్టర్‌ చిత్రాలు ఏంటి? తెలుగు చిత్ర పరిశ్రమలో అవి ఎలాంటి మార్క్‌ను క్రియేట్‌ చేశాయి? ఇప్పుడు చూద్దాం.  అగ్నిపర్వతం వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌పై వచ్చిన సూపర్‌ హిట్‌ చిత్రాల్లో ‘అగ్నిపర్వతం’ (Agni Parvatam) ఒకటి. ఇందులో సూపర్‌ స్టార్‌ కృష్ణ డబుల్‌ రోల్స్‌ చేయగా.. రాధ, విజయశాంతి హీరోయిన్లుగా కనిపించారు. కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన ఈ ఫిల్మ్‌ అప్పట్లో ఘన విజయం సాధించింది. ఇందులో సూపర్‌ స్టార్‌ కృష్ణ నట విశ్వరూపం చూపించారు. ఈ చిత్రం కృష్ణ కెరీర్‌లో మైలురాయిగా నిలిచింది. ఈ సినిమాలో కృష్ణ దూకుడుగా చెప్పిన ‘అగ్గి పెట్టుందా?’ డైలాగ్‌ అప్పట్లో మారుమోగింది. అలాగే ‘కదులుతున్న అగ్నిపర్వతం’ సాంగ్‌ కూడా సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. నటుడిగా సరికొత్త కృష్ణను పరిచయం చేసింది. మూవీ కథ ఏంటంటే.. ‘జమదగ్ని తన తల్లిని విడిచిపెట్టినందుకు అతని తండ్రిని ద్వేషిస్తాడు. అయితే అతని శత్రువులు సమస్య సృష్టించేందుకు జమదగ్ని సవతి సోదరుడిని తెరపైకి తెస్తారు. ఆ తర్వాత ఏమైంది? అన్నది కథ.  https://www.youtube.com/watch?v=FaJqLrjanQM జగదేక వీరుడు అతిలోక సుందరి వైజయంతీ మూవీస్‌ రొటిన్‌ చిత్రాలనే కాకుండా ప్రయోగాత్మక ఫిల్మ్స్‌ కూడా తీయగలదని ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ చిత్రం నిరూపించింది. మెగాస్టార్ కెరీర్‌లో మరుపురాని చిత్రంగా నిలిచిపోయింది. సోషియో ఫాంటసీ జానర్‌లో రూపొందిన ఈ చిత్రం.. అప్పట్లో కలెక్షన్ల మోత మోగించింది. ఈ చిత్రం విడుదలకు ముందు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను వరదలు అతలాకుతలం చేశాయి. అయినా ఈ చిత్రం అఖండ విజయాన్ని నమోదు చేసుకోవడం విశేషం.  రూ. 2 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ ఫిల్మ్‌.. ఆ రోజుల్లో రూ.15 కోట్లు కొల్లగొట్టింది. ఈ సినిమాకు ఇళయరాజా అందించిన మధురమైన పాటలు ఇప్పటికీ ఎక్కడోచోట మారుమోగుతూనే ఉన్నాయి. కథ ఏంటంటే ‘నలుగురు అనాథలకు ఆశ్రయిమిచ్చిన రాజు.. గైడ్‌గా పనిచేస్తుంటాడు. రాజుకు అనుకోకుండా ఓ రోజు ఇంద్రుడి కుమార్తె ఇంద్రజకు చెందిన ఉంగరం దొరుకుతుంది. ఆ ఉంగరం కోసం ఇంద్రజ తిరిగి భూమి మీదకు వస్తుంది. ఆ తర్వాత ఏమైంది? అన్నది కథ.  శుభలగ్నం జగపతిబాబు హీరోగా, ఆమని, రోజా హీరోయిన్లుగా వచ్చిన ఈ చిత్రం యూనిక్‌ కాన్సెప్ట్‌తో తెరకెక్కింది. భార్య భర్తలు సంతోషంగా జీవించడానికి డబ్బుతో సంబంధం లేదని నిరూపించింది. డబ్బు కోసం భర్తనే అమ్మేసిన భార్య.. చివరికి మారి భర్తను ఎలా దక్కించుకుంది? అన్న కాన్సెప్ట్‌తో ఈ సినిమా రూపొందింది. అప్పట్లో ఫ్యామిలీ ఆడియన్స్‌ ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు. ఈ మూవీలోని ‘చిలకా ఏ తోడు లేక’ అనే పాటకు ఉత్తమ గీత రచయితగా సిరివెన్నెలకు నంది పురస్కారం రావడం విశేషం. కథ ఏంటంటే.. ‘డబ్బుపై ఆశతో రాధ తన భర్తను ధనవంతురాలైన లతకు ఇచ్చి పెళ్లి చేస్తుంది. ఫలితంగా ఆమెకు కోటి రూపాయలు లభిస్తాయి. అయితే కాలక్రమంలో భర్త తోడు లేని జీవితం వృథా అని భావిస్తుంది’. గోవిందా గోవిందా నాగార్జున - రామ్‌ గోపాల్‌ వర్మ కాంబినేషన్‌లో వచ్చిన 'గోవిందా గోవిందా'.. అప్పట్లో బ్లాక్‌ బాస్టర్ సక్సెస్‌ అందుకుంది. వెంకటేశ్వర స్వామి కిరీటం చుట్టూ తిరిగే ఈ సినిమా కథ తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచింది. ఇందులో శ్రీదేవి తెలుగు ఆడియన్స్‌ ఎంతగానో మిస్మరైజ్‌ చేశారు. కథ ఏంటంటే.. ‘భగవంతుడైన వేంకటేశ్వరుడు.. దైవిక ఆయుధాన్ని ఉపయోగించి భూమిపై గందరగోళ పరిస్థితిని పరిష్కరించాలని నిర్ణయించుకుంటాడు. అయితే ఈ ఆయుధంపై ఉన్న ఆభరణాలను కొంతమంది దుండగులు దొంగిలించినప్పుడు పరిస్థితి దిగజారుతుంది’. ఓటీటీ వేదిక : సన్‌ నెక్స్ట్‌ రాజకుమారుడు వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌ ద్వారానే సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు హీరోగా పరిచయం చేశారు. కథానాయకుడిగా అతడి ఫస్ట్‌ ఫిల్మ్‌ 'రాజకుమారుడు'ను కల్కి నిర్మాత అశ్వనీదత్‌ నిర్మించారు. ఈ సినిమాకు ఉత్తమ కుటుంబ కథా చిత్రంగా నంది అవార్డు సైతం వచ్చింది. చాలా సెంటర్లలో ఈ సినిమా 100 రోజులకు పైగా ఆడింది. ప్లాట్ ఏంటంటే.. 'సెలవులను ఎంజాయ్‌ చేయడానికి వచ్చిన రాజ్‌.. రాణిని చూసి ప్రేమలో పడతాడు. అయితే కుటుంబం ఒత్తిడితో ఆమె ప్రేమను వదులుకుంటాడు. ఇంతకి రాణి ఎవరు? ఆమె ఫ్యామిలీతో రాజ్‌ కుటుంబానికి ఉన్న వైరం ఏంటి? చివరికి వారు ఎలా ఒక్కటయ్యారు?' అన్నది కథ.  ఇంద్ర మెగాస్టార్‌ చిరంజీవి క్రేజ్‌ను మరోస్థాయికి తీసుకెళ్లిన చిత్రంగా 'ఇంద్ర'కు పేరుంది. ఈ సినిమాలో చిరు.. తొలిసారి ఫ్యాక్షనిస్టు పాత్ర పోషించారు. నిర్మాత అశ్వనీదత్‌కు ఈ సినిమా కాసుల వర్షం కురిపించింది. 2002లో ఉత్తమ నటుడిగా చిరంజీవికి నంది పురస్కారం వచ్చేలా చేసింది. 'రాయలసీమలో రెండు కుటుంబాల మధ్య ఆదిపత్య పోరు కొనసాగుతుంటుంది. ప్రజల నీటి సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యర్థుల చెల్లెలితో ఇంద్ర పెళ్లికి అంగీకరిస్తాడు. కట్‌ చేస్తే సాధారణ జీవితం కోసం ఇంద్ర మారుపేరుతో కాశీకి వెళ్లిపోతాడు. ఇంద్ర కాశీకి ఎందుకు వెళ్లాడు? తిరిగి ప్రత్యర్థులపై ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు?' అన్నది కథ. స్టూడెంట్‌ నెంబర్‌ 1 దర్శకధీరుడు రాజమౌళిని నిర్మాత అశ్వని దత్‌ ఇండస్ట్రీకి పరిచయం చేశారు. తారక్‌ హీరోగా రాజమౌళి తెరకెక్కించిన మెుట్ట మెుదటి చిత్రం 'స్టూడెంట్‌ నెం.1' అశ్వనీదత్‌ నిర్మాత. వైజయంతీ మూవీస్‌ సబ్‌ బ్యానర్‌ అయి స్వప్న సినిమాస్‌ ఈ మూవీని తెరకెక్కించింది. ఈ సినిమా 73 కేంద్రాల్లో 50 రోజులు, 42 కేంద్రాల్లో 100 రోజులకు పైగా ప్రదర్శించబడింది. ఈ సినిమాని రూ.1.85 కోట్లతో నిర్మించగా రూ.12 కోట్లు వసూలు చేసింది. కథ ఏంటంటే.. ‘ఆదిత్యకు ఇంజినీర్ కావాలని కోరిక. కానీ అతని తండ్రి లాయర్ కావాలని ఆదేశిస్తాడు. అయితే లా చదవడం ఇష్టం లేని ఆదిత్య పరీక్ష రాసేందుకు వెళ్లే క్రమంలో ఓ అమ్మాయిని రక్షించబోయి సమస్యల్లో పడతాడు. ఆదిత్య తండ్రి అతన్ని ఇంటి నుంచి గెంటేస్తాడు. ఆ తర్వాత ఏమైంది? అన్నది కథ.  మహర్షి మహేష్‌ బాబు హీరోగా పూజా హెగ్డే, అల్లరి నరేష్‌ ప్రధాన పాత్రల్లో చేసిన మహార్షి చిత్రానికి.. అశ్వనీ దత్‌ సహా నిర్మాతగా వ్యవహరించారు. 2019 సంవత్సరానికి గాను 10 విభాగాల్లో విభాగాల్లో సైమా అవార్డ్స్‌ నామినేట్‌ కాగా.. అందులో 5 పురస్కారాలను మహర్షి కైవసం చేసుకోవడం విశేషం. ‘రిషి (మహేష్‌) ఓ మల్టీ నేషనల్‌ కంపెనీకి సీఈవోగా ఉంటాడు. కాలేజీ రోజుల్లో తన కోసం ఫ్రెండ్‌ రవి  చేసిన త్యాగం గురించి తెలుసుకుంటాడు. అతడ్ని వెతుక్కుంటూ ఊరికి వెళ్లిన రిషికి అతడు సమస్యల్లో ఉన్నట్లు తెలుస్తుంది. అప్పుడు రిషి తన ఫ్రెండ్‌ కోసం ఏం చేశాడు? ఎలా అండగా నిలబడ్డాడు?’ అన్నది కథ. ఓటీటీ వేదిక : అమెజాన్‌ ప్రైమ్‌ సీతారామం 2022లో తెరకెక్కిన సీతారామం చిత్రం.. ఎంత పెద్ద ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి నిర్మాతగా అశ్వని దత్‌ వ్యవహరించారు. ఈ సినిమాతో మృణాల్‌ ఠాకూర్‌ రాత్రికి రాత్రి స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. రూ.30 కోట్లతో తెరకెక్కిన సీతారామం చిత్రం.. బాక్సాఫీస్‌ వద్ద రూ.91-98 కోట్లు కొల్లగొట్టింది. ప్లాట్‌ ఏంటంటే.. ‘ఆర్మీ అధికారి రామ్ (దుల్కర్‌ స‌ల్మాన్‌) ఓ అనాథ. ఆ విషయాన్ని రేడియోలో చెప్పినప్పటి నుంచి అతడికి ఉత్తరాలు వెల్లువెత్తుతాయి. పెద్ద కుటుంబం ఏర్పడుతుంది. ఓ అమ్మాయి మాత్రం నీ భార్య సీతామ‌హాల‌క్ష్మి (మృణాల్ ఠాకూర్‌) అని సంబోధిస్తూ ఉత్తరాలు రాస్తుంటుంది. ఇంత‌కీ ఈ ఆమె ఎవ‌రు? అనాథ అయిన రామ్‌కు భార్య ఎక్కడి నుంచి వ‌చ్చింది? ఆమెని క‌లుసుకునేందుక‌ని వ‌చ్చిన రామ్‌కు ఎలాంటి అనుభ‌వాలు ఎదుర‌య్యాయి?’ అనేది కథ. ఓటీటీ వేదిక : అమెజాన్‌ ప్రైమ్‌ & హాట్‌స్టార్‌ కల్కి 2898 ఏడీ నిర్మాత అశ్వని దత్‌.. ఎంతో ప్రతిష్టాత్మకంగా ‘కల్కి 2898 ఏడీ’ చిత్రాన్ని నిర్మించారు. వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌పై వచ్చిన అతి భారీ బడ్జెట్‌ చిత్రం ‘కల్కి’ కావడం విశేషం. ఈ సినిమాను మైథాలిజీ & ఫ్యూచరిక్‌ జానర్లలో నిర్మించారు. ఇందులో బాలీవుడ్ దిగ్గజం అమితాబ్‌ బచ్చన్‌ అశ్వత్థామ పాత్ర పోషించిగా.. విలన్‌గా కమల్‌ హాసన్‌ చేశారు. దిశాపటానీ, దీపిక పదుకొణె ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.  వైజయంతీ మూవీస్‌ సబ్‌ బ్యానర్స్‌లో వచ్చిన హిట్‌ చిత్రాలు బాణం అశ్వని దత్‌ కుమార్తె ప్రియాంక దత్‌.. త్రీ ఎంజెల్స్ బ్యానర్‌పై తొలిసారి బాణం చిత్రాన్ని నిర్మించింది. ఈ మూవీ ద్వారా నారా రోహిత్‌ హీరోగా పరిచయం అయ్యారు. ప్లాట్‌ ఏంటంటే.. ‘మాజీ నక్సలైట్ కొడుకు అయిన భగత్ ఒక చిన్న పట్టణంలో నివసిస్తుంటాడు. స్థానిక గ్యాంగ్‌స్టర్ దౌర్జన్యాల నుంచి ప్రజలను కాపాడేందకు IPS అధికారి కావాలని నిర్ణయించుకుంటాడు. ఆ తర్వాత ఏమైంది? అనుకున్న లక్ష్యాన్ని సాధించాడా? లేదా?’ అన్నది కథ. సారొచ్చారు ప్రియాంక దత్‌ నిర్మించిన ఈ సినిమా.. ఫీల్‌ గుడ్‌ ఎంటర్‌టైనర్‌గా ఆకట్టుకుంది. ఇందులో రవితేజ, కాజల్‌  రిచా గంగోపాథ్యాయ ప్రధాన పాత్రలు పోషించారు. ప్లాట్‌ ఏంటంటే.. 'సంధ్య కార్తిక్‌ను ప్రేమిస్తుంది. అయితే అతడికి ఇదివరకే పెళ్లైన విషయాన్ని తెలుసుకుంటుంది. ఇంతకీ కార్తిక్‌ గతం ఏంటి? కార్తిక్, సంధ్య కలిశారా? లేదా?’ అన్నది స్టోరీ. ఓటీటీ వేదిక : హాట్‌స్టార్‌ & ఆహా Sir Ocharu Movie Posters TollywoodAndhra.in ఎవడే సుబ్రహ్మణ్యం కల్కి డైరెక్టర్ నాగ్ అశ్విన్‌ తెరకెక్కించిన మెుట్టమెుదటి ఫిల్మ్‌ 'ఎవడే సుబ్రహ్మణ్యం'. ఇందులో నాని, విజయ్‌ దేవరకొండ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవీ టాలెంటెడ్‌ డైరెక్టర్‌గా నాగ్ అశ్విన్‌కు గుర్తింపు తీసుకొచ్చింది. ప్లాట్ ఏంటంటే.. ‘మెటీరియలిస్టిక్ స్వభావం కలిగిన సుబ్రమణ్యం జీవితాన్ని పూర్తిగా అర్థం చేసుకునేందుకు హిమాలయాలకు వెళ్తాడు. ఈ క్రమంలో అనుబంధాల పట్ల తన వైఖరిని మార్చుకుంటాడు’. ఓటీటీ వేదిక : సన్‌ నెక్స్ట్‌ మహానటి అశ్వని దత్‌ రెండో కుమార్తె స్వప్న దత్ ఈ సినిమాను నిర్మించారు. ఈ మూవీకి కూడా కల్కి ఫేమ్‌ నాగ అశ్విన్‌ దర్శకత్వం వహించారు. స్వప్న సినిమా బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రం.. మహానటి సావిత్రి జీవత కథ ఆధారంగా తెరకెక్కింది. ‘సావిత్రి ఇండస్ట్రీలోకి ఎలా అడుగుపెట్టారు? నటుడు జెమినీ గణేషన్‌ ఆమె జీవితంపై ఎలాంటి ప్రభావాన్ని చూపించారు? జీవత చరమాంకంలో ఆమె ఎలాంటి కష్టాలు అనుభవించారు?’ అన్నది స్టోరీ.  ఓటీటీ వేదిక :  అమెజాన్‌ ప్రైమ్‌ జాతి రత్నాలు వైజయంతి మూవీస్‌ సబ్‌ బ్యానర్‌ అయిన 'స్వప్న సినిమా'.. జాతిరత్నాలు మూవీని నిర్మించింది. ప్లాట్‌ ఏంటంటే.. ‘మంచి ఉద్యోగాల కోసం తమ ఊరి నుంచి హైదరాబాద్ వచ్చిన ముగ్గురు యువకులు ఓ అపార్ట్‌మెంటులో దిగుతారు. అక్కడ పిలువని పార్టీకి వెళ్లి మర్డర్ అటెంప్ట్ కేసులో ఇరుక్కుంటారు. ఆ తర్వాత కేసు నుంచి ఎలా బయటపడ్డారు’ అనేది కథ. ఓటీటీ వేదిక :  అమెజాన్‌ ప్రైమ్‌
    జూన్ 29 , 2024
    Highest Grossing Movies of Nani: నాని కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్‌-10 చిత్రాలు ఇవే!
    Highest Grossing Movies of Nani: నాని కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్‌-10 చిత్రాలు ఇవే!
    నాని లేటెస్ట్ చిత్రం ‘సరిపోదా శనివారం’ (Saripodhaa Sanivaaram) బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లను సాధిస్తోంది. సెప్టెంబర్‌ 29న ప్రేక్షకుల ముందుకు వచ్చి ఈ మూవీ సూపర్‌ హిట్‌ టాక్‌ సొంతం చేసుకుంది. తద్వారా తొలి 8 రోజుల్లోనే వరల్డ్ వైడ్‌గా రూ.73.6 కోట్లు (GROSS) కొల్లగొట్టి రూ.100 కోట్ల క్లబ్‌లో చేరేందుకు వడి వడిగా అడుగువేస్తోంది. థియేటర్‌ ఆక్యుపెన్సీ ఏమాత్రం తగ్గకపోవడంతో రెండు మూడు రోజుల్లోనే ఈ ఫీట్‌ సాధించే అవకాశం స్పష్టం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో నాని కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్‌-10 చిత్రాలేంటో ఇప్పుడు చూద్దాం.  [toc] దసరా (Dasara) నాని, డైరెక్టర్‌ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వచ్చిన 'దసరా' చిత్రం బాక్సాఫీస్‌ వద్ద రూ.120.4 కోట్లు (GROSS) కొల్లగొట్టింది. రూ.55 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం నాని కెరీర్‌లో రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన తొలి చిత్రంగా నిలిచింది. అటు తొలి రోజున రూ.38.7 కోట్లు కొల్లగొట్టి అత్యధిక డే1 వసూళ్లు రాబట్టిన నాని ఫిల్మ్‌గానూ రికార్డు సృష్టించింది. ప్రస్తుతం ఈ చిత్రాన్ని అందుకునేందుకు 'సరిపోదా శనివారం' దూసుకెళ్తోంది. Budget : 55cr First Day Collection Worldwide : 38.7cr Worldwide Collection : 120.4cr Overseas Collection : 21.8cr India Gross Collection : 98.6cr ఈగ (Eega) దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘ఈగ’ చిత్రం నాని కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన రెండో చిత్రంగా ఉంది. రూ.30 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.100.3 కోట్లు కొల్లగొట్టింది. అయితే ఇందులో నాని ఫుల్‌లెంగ్త్‌ పాత్ర చేయలేదు. అతడిది గెస్ట్ రోల్‌లాగా అనిపిస్తుంది. అందుకే ట్రేడ్‌ వర్గాలు నాని రూ.100 కోట్ల సినిమాల జాబితాలో ఈగను చేర్చలేదు. Budget : 30cr First Day Collection Worldwide : 6.5cr Worldwide Collection : 100.3cr Overseas Collection : 13.8cr India Gross Collection : 86.5cr హాయ్‌ నాన్న (Hi Nanna) నాని రీసెంట్‌ చిత్రం ‘హాయ్‌ నాన్న’ రూ.77.2 కోట్ల (GROSS) కలెక్షన్స్‌తో ఈ జాబితాలో మూడో స్థానంలో ఉంది. శౌర్యువ్‌ డైరెక్షన్‌లో రూపొందిన ఈ చిత్రం తండ్రి కూతురు సెంటిమెంట్‌తో వచ్చింది. ఇందులో నానికి జోడీగా మృణాల్‌ ఠాకూర్‌ నటించింది. తొలి రోజున ఈ చిత్రం రూ.10.5 కోట్లు కొల్లగొట్టింది. నటుడిగా నానికి మంచి గుర్తింపు తీసుకొచ్చింది. Budget : 45cr First Day Collection Worldwide : 10.5cr Worldwide Collection : 77.2cr Overseas Collection : 18.5cr India Gross Collection : 58.7cr సరిపోదా శనివారం (Saripodhaa Sanivaaram) నాని లేటెస్ట్‌ చిత్రం ‘సరిపోదా శనివారం’ ప్రస్తుతానికి ఈ జాబితాలో నాలుగో స్థానంలో ఉంది. ప్రస్తుతం రూ.73.6 కోట్ల (GROSS) కలెక్షన్స్‌తో సక్సెస్‌ఫుల్‌గా బాక్సాఫీస్‌ వద్ద రన్‌ అవుతోంది. ఏ క్షణంలోనైనా ఈ జాబితాలో పైకి ఎగబాకవచ్చు. డైరెక్టర్ వివేక్ ఆత్రేయ రూ.55 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరక్కించారు. తొలిరోజే ఈ సినిమా రూ.21.8 కోట్లు కొల్లగొట్టింది. మూడు రోజుల్లోనే లాభాల్లోకి అడుగుపెట్టింది.  Language : Telugu Budget : 55cr First Day Collection Worldwide : 21.8cr Worldwide Collection : 73.6cr (still running) Overseas Collection : 22.4cr (still running) India Gross Collection : 51.4cr (still running) MCA మిడిల్‌ క్లాస్ అబ్బాయి (MCA: Middle Class Abbayi) నాని హీరోగా వేణు శ్రీరామ్‌ డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద రూ.72.6 కోట్లు రాబట్టింది. ఇందులో నానికి జోడీగా సాయిపల్లవి చేసింది. వీరిద్దరి మధ్య కెమెస్ట్రీ బాగుందంటూ అప్పట్లో పెద్ద ఎత్తున కామెంట్స్‌ వినిపించాయి.  Budget : 25cr First Day Collection Worldwide : 15.6cr Worldwide Collection : 72.6cr Overseas Collection : 10.2cr India Gross Collection : 62.4cr నేను లోకల్‌ (Nenu Local) నాని, కీర్తి సురేష్‌ జంటగా చేసిన 'నేను లోకల్‌' చిత్రం ఏమాత్రం అంచనాలు లేకుండా థియేటర్లలోకి వచ్చి సూపర్ హిట్‌ టాక్‌ సొంతం చేసుకుంది. కేవలం రూ.15 కోట్లు బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద రూ.61.2 కోట్లు (GROSS) వసూలు చేసింది. తద్వారా ఈ జాబితాలో 6వ స్థానంలో నిలిచింది. ఈ మూవీ నటుడిగా నానికి మంచి గుర్తింపు తీసుకొచ్చింది.  Budget : 15cr First Day Collection Worldwide : 9.7cr Worldwide Collection : 61.2cr Overseas Collection : 9.8cr India Gross Collection : 51.4cr నిన్ను కోరి (Ninnu Kori) శివ నిర్వాణ డైరెక్షన్‌లో వచ్చిన ఈ ఫిల్మ్‌ కూడా నాని కెరీర్‌లో ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఇందులో నాని లవ్‌ ఫెయిల్యూర్‌ అయిన యువకుడిగా నటించాడు. రూ.20కో ట్ల ఖర్చుతో రూపొందిన ఈ ఫిల్మ్‌ వరల్డ్‌వైడ్‌గా రూ.59.2 కోట్లు రాబట్టింది.  Budget : 20cr First Day Collection Worldwide : 10.6cr Worldwide Collection : 59.2cr Overseas Collection : 10.3cr India Gross Collection : 48.9cr జెర్సీ (Jersey) నటుడిగా నాని మరో స్థాయికి తీసుకెళ్లిన చిత్రం 'జెర్సీ'. గౌతం తిన్ననూరి డైరెక్షన్‌లో రూపొందిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 58.7 కోట్లు రాబట్టింది. ఒక్క ఇండియాలోనే రూ. 47.3 కోట్లు తన ఖాతాలో వేసుకుంది.  Budget : 30cr First Day Collection Worldwide : 11.2cr Worldwide Collection : 58.7cr Overseas Collection : 11.4cr India Gross Collection : 47.3cr శ్యామ్‌ సింగరాయ్‌ (Shyam Singha Roy) పునర్జన్మ కథాంశంతో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మంచి కలెక్షన్స్ రాబట్టింది. రాహుల్‌ సంకృత్యన్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం వరల్డ్‌ వైడ్‌గా రూ.51.8 కోట్లు (GROSS) కొల్లగొట్టింది. ఇందులో సాయి పల్లవితో పాటు కృతి శెట్టి హీరోయిన్‌గా చేసింది.  Budget : 40cr First Day Collection Worldwide : 11.7cr Worldwide Collection : 51.8cr Overseas Collection : 6.5cr India Gross Collection : 45.3cr భలే భలే మగాడివోయ్‌ (Bhale Bhale Magadivoy) నాని కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన పదో చిత్రంగా ‘భలే భలే మగాడివోయ్‌’ నిలిచింది. మారుతీ డైరెక్షన్‌లో రూ.10 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద రూ.50.2 కోట్లను రాబట్టింది. ఇందులో మతిమరుపు ఉన్న వ్యక్తిగా నాని అద్భుత నటన కనబరిచాడు.  Budget : 10cr First Day Collection Worldwide : 5.2cr Worldwide Collection : 50.2cr Overseas Collection : 11.6cr India Gross Collection : 38.6cr
    సెప్టెంబర్ 06 , 2024
    <strong>Devara Trailer: ‘దేవర’ ట్రైలర్‌ రిలీజ్‌ డేట్‌ లాక్‌? ఆ రోజున టాప్‌ లేచిపోవాల్సిందే!</strong>
    Devara Trailer: ‘దేవర’ ట్రైలర్‌ రిలీజ్‌ డేట్‌ లాక్‌? ఆ రోజున టాప్‌ లేచిపోవాల్సిందే!
    జూనియర్‌ ఎన్టీఆర్‌, డైరెక్టర్‌ కొరటాల కాంబోలో వస్తోన్న పాన్‌ ఇండియా చిత్రం 'దేవర' (Devara). 'ఆర్‌ఆర్‌ఆర్‌' (RRR) లాంటి బ్లాక్‌ బాస్టర్‌ విజయం తర్వాత తారక్ నటిస్తున్న చిత్రం కావడంతో దేవరపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌ 27న రిలీజ్‌ చేయనున్నట్లు మేకర్స్‌ చాలా రోజుల క్రితమే ప్రకటించారు. సినిమా రిలీజ్‌కు 30 రోజులు కూడా లేకపోవడంతో ట్రైలర్ ఎప్పుడు రిలీజ్‌ చేస్తారా? అని ఎన్టీఆర్ అభిమానులతో పాటు సినీ లవర్స్ తెగ ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో దేవర ట్రైలర్‌కు సంబంధించి ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. అది చూసిన తారక్ ఫ్యాన్స్‌ తెగ ఖుషి అవుతున్నారు.&nbsp; ట్రైలర్‌ రిలీజ్‌ డేట్‌ లాక్‌! ఎన్టీఆర్‌ ‘దేవర’ సినిమాకు సంబంధించి ఓ సాలిడ్ బజ్‌ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సెప్టెంబర్‌ 15న దేవర ట్రైలర్‌ను రిలీజ్‌ చేయబోతున్నట్లు నెట్టింట ప్రచారం జోరుగుతోంది. ఆ దిశగా మేకర్స్‌ సన్నాహాలు సైతం మెుదలుపెట్టినట్లు సమాచారం. ట్రైలర్‌ ఎడిటింగ్‌ వర్క్‌ను కూడా రెండ్రోజుల్లో షురూ చేయబోతున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. దీంతో తారక్ ఫ్యాన్స్‌ తెగ ఖుషీ అవుతున్నారు. సెప్టెంబర్‌ 15న టాప్‌ లేచిపోతుందంటూ పోస్టులు పెడుతున్నారు. ఆ రోజు కోసం ఇప్పటి నుంచే ఎదురుచూస్తున్నట్లు పోస్టులు చేస్తున్నారు. అయితే ట్రైలర్‌ రిలీజ్‌పై దేవర టీమ్‌ స్పష్టత ఇవ్వాల్సి ఉంది.&nbsp; మూడో పాటకు రంగం సిద్ధం! దేవర సినిమా నుంచి రిలీజైన ‘ఫియర్‌’, ‘చుట్టమల్లే’ సాంగ్స్‌కు మ్యూజిక్‌ లవర్స్‌ నుంచి ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా ‘చుట్టమల్లే’ సాంగ్‌ యూట్యూబ్‌లో రికార్డ్‌ వ్యూస్‌ను సొంతం చేసుకొని ఆకట్టుకుంది. దీంతో మూడో పాటపై అందరి దృష్టి ఏర్పడింది. ఇప్పటికే ఈ పాట గురించి లిరికిస్ట్‌ రామజోగయ్య శాస్త్రి హింట్స్ ఇచ్చారు. ఈ పాట అద్భుతంగా ఉంటుందంటూ హైప్‌ పెంచేశారు. ఇక దేవర థర్డ్‌ సాంగ్‌ మాస్‌ బీట్‌తో ఉండే ఛాన్స్ ఉందని నెట్టింట ప్రచారం జరుగుతోంది. సంగీత దర్శకుడు అనిరుధ్‌ తనదైన మ్యూజిక్‌తో ఈ పాటను సిద్ధం చేసినట్లు సమాచారం. సెప్టెంబర్‌ 7న వినాయక చవితి కానుకగా ఈ సాంగ్ రిలీజ్‌ కానునట్లు తెలుస్తోంది.&nbsp; తారక్‌ డబుల్‌ షేడ్‌ చూశారా.. దేవర రిలీజ్‌కు నెల రోజుల సమయం ఉన్న నేపథ్యంలో మంగళవారం (ఆగస్టు 27) ఓ స్పెషల్‌ పోస్టర్‌ను మేకర్స్‌ రిలీజ్‌ చేశారు. ఇందులో ఎన్టీఆర్‌ రెండు డిఫరెంట్‌ గెటప్‌లలో కనిపించాడు. అంతేకాదు 'నెల రోజుల్లోనే అతడి రాక ప్రపంచాన్ని కదిలించబోతోంది' అంటూ ఈ పోస్టర్‌కు క్యాప్షన్ కూడా ఇచ్చారు. దీంతో ఈ పోస్ట్‌ ఒక్కసారిగా వైరల్‌గా మారింది. డిఫరెంట్‌ షేడ్స్‌ ఉన్న ఎన్టీఆర్‌ లుక్‌ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్‌ మాస్‌ జాతర పక్కా అంటూ అభిప్రాయపడుతున్నారు.&nbsp; https://twitter.com/DevaraMovie/status/1828291026936832064 ప్రమోషన్స్‌పై ఫోకస్‌! దేవర సినిమా షూటింగ్ పూర్తయినట్టు తెలుస్తోంది. ఈ మూవీలో తన పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్నానని ఎన్టీఆర్ ఇటీవలే వెల్లడించారు. అయితే, మిగిలిన కాస్త షూటింగ్‍ను కూడా డైరెక్టర్ కొరటాల శివ పూర్తి చేశారని సమాచారం. ప్రస్తుతం ఈ చిత్రం పోస్టు ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి. త్వరలోనే ప్రమోషన్స్‌ కూడా మెుదలు కానున్నట్లు తెలుస్తోంది. దేవర చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సుమారు రూ.250కోట్ల బడ్జెట్‍తో ఈ చిత్రం రూపొందినట్లు సమాచారం. ఇందులో తారక్‌కు జోడీగా జాన్వీ కపూర్‌ నటించింది. బాలీవుడ్‌ నటులు సైఫ్ అలీఖాన్‌, బాబీ డియోల్‌ విలన్‌ పాత్రల్లో కనిపించనున్నారు.&nbsp;
    ఆగస్టు 28 , 2024
    <strong>Telugu OTT Movies: ఓటీటీలో ‘అహం రీబూట్‌’ తరహాలో వచ్చిన ప్రయోగాత్మక చిత్రాలు.. వీటి కాన్సెప్ట్స్‌కు సెల్యూట్‌ చేయాల్సిందే!&nbsp;</strong>
    Telugu OTT Movies: ఓటీటీలో ‘అహం రీబూట్‌’ తరహాలో వచ్చిన ప్రయోగాత్మక చిత్రాలు.. వీటి కాన్సెప్ట్స్‌కు సెల్యూట్‌ చేయాల్సిందే!&nbsp;
    ఒకే తరహా చిత్రాలను చూడాలంటే ఎంతటి సినిమా లవర్స్‌కైనా బోర్‌ కొట్టక మానదు. దీనిని గమనించిన కొందరు దర్శక నిర్మాతలు.. క్రేజీ కాన్సెప్ట్‌తో కొన్ని ప్రయోగాత్మక చిత్రాలను రూపొందించారు. వైవిధ్యమైన కథ, కథనంతో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం ఆ చిత్రాలు ఓటీటీ వేదికగా అందుబాటులో ఉన్నాయి. విభిన్న తరహా చిత్రాలు చూడాలని కోరుకునేవారు వీటిని ఎంచక్కా వీక్షించవచ్చు. ఇవి మీకు తప్పనిసరిగా కొత్త అనుభూతిని అందిస్తాయి. ఇంతకీ ఆ చిత్రాలు ఏవి? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయి? వాటి వైవిధ్యమైన కాన్సెప్ట్‌ ఏంటి? ఈ కథనంలో పరిశీలిద్దాం.&nbsp; అహం రీబూట్‌ (Aham Reboot) సుమంత్‌ హీరోగా రూపొందిన లేటెస్ట్‌ చిత్రం అహం రీబూట్‌'. జూన్‌ 30 నుంచి ఆహా వేదికగా ఈ సినిమా స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. ఈ సైకలాజికల్‌ థ్రిల్లర్‌ మూవీకి ప్రశాంత్ సాగర్‌ అట్లూరి దర్శకత్వం వహించారు. ఈ మూవీ ప్రత్యేకత ఏంటంటే.. ఇందులో సుమత్‌ పాత్ర ఒక్కటే స్క్రీన్‌పై కనిపిస్తాయి. మిగత పాత్రలు కేవలం వినిపిస్తాయి అంతే. ఈ మూవీ స్ట్రీమింగ్‌కు మంచి రెస్పాన్స్‌ వస్తున్నట్లు ఆహా వర్గాలు తెలిపాయి. ప్లాట్‌ ఏంటంటే.. ఆర్జే నిలయ్‌ (సుమంత్‌) స్టూడియోలో ఉండగా ఒక అమ్మాయి నుంచి కాల్‌ వస్తుంది. ఎవరో కిడ్నాప్‌ చేశారని చెబుతుంది. తొలుత ప్రాంక్‌ అని భావించిన నిలయ్‌.. ఆమె మాటలకు కన్విన్స్‌ అవుతాడు. ఎలాగైన కాపాడాని అనుకుంటాడు. మరోవైపు ఆమెను రక్షించేందుకు పోలీసులు సైతం రంగంలోకి దిగుతారు. ఇంతకీ కిడ్నాపైన యువతి ఎవరు? ఆమెకు నిలయ్‌కు ఉన్న సంబంధం ఏంటి? అన్నది కథ. ఓటీటీ వేదిక : ఆహా 105 మినిట్స్‌ (105 Minuttess) ‘అహం రీబూట్‌’ తరహాలోనే రీసెంట్‌గా ఓ లేడీ ఒరియెంటేడ్‌ చిత్రం వచ్చింది. సింగిల్‌ క్యారెక్టర్‌తో తెరకెక్కిన ‘105 మినిట్స్‌’ (105 Minuttess) సినిమాలో హీరోయిన్‌ హన్సిక (Hansika) నటించారు. కేవలం ఆరు రోజుల్లోనే ఈ సినిమా చిత్రీకరణ పూర్తికావడం విశేషం. ఈ సినిమా ప్లాట్‌ ఏంటంటే.. జాను (హ‌న్సిక‌) ఆఫీసు నుంచి కారులో ఇంటికి వెళ్తున్న క్రమంలో తననేదో అదృశ్యశక్తి వెంటాడుతున్నట్లు ఆమెకు అర్థమవుతుంది. ఇంటికి వెళ్లాక అనూహ్య ప‌రిణామాలు చోటుచేసుకుంటాయి. ఆ అదృశ్య శ‌క్తి జానును ఇనుప గొలుసుతో బంధించి చిత్రహింస‌ల‌కు గురి చేయ‌డం ప్రారంభిస్తుంది. తన మరణానికి జానునే కారణమని చెప్పి ఇబ్బందులకు పెడుతుంది. ఇంతకీ ఆ అదృశ్య శక్తి ఎవరు? ఆ వ్య‌క్తి మ‌ర‌ణానికి జాను ఎలా కార‌ణ‌మైంది? దాని బారి నుంచి జాను ఎలా బ‌య‌ట‌ప‌డింది? అన్న‌ది మిగ‌తా క‌థ‌ ఓటీటీ వేదిక : అమెజాన్‌ ప్రైమ్‌ ఆరంభం (Aarambham) కేరాఫ్‌ కంచరపాలెం ఫేమ్‌ మోహన్‌ భగత్‌ ప్రధాన పాత్రలో నటించిన 'ఆరంభం' చిత్రం కూడా ప్రయోగాత్మక కథతో రూపొందింది. ‘డెజావు’ అనే డిఫరెంట్‌ కాన్సెప్టుతో దర్శకుడు అజయ్‌ నాగ్‌ ఈ సినిమా తెరకెక్కించారు. జైల్లో శిక్ష అనుభవించే ఖైదీ ఉన్నట్టుండి మాయమవుతాడు. సెల్‌కు వేసిన తాళం వేసినట్టే ఉంటుంది. ఊచలు వంచకుండా, గోడలు పగలగొట్టకుండా సునాయాసంగా అతడెలా తప్పించుకున్నాడు? అనేది ఆసక్తికరం. ఈ మూవీలో సుప్రితా సత్యనారాయణ్‌, భూషణ్‌ కల్యాణ్‌, లక్ష్మణ్‌ మీసాల, సురభి ప్రభావతి కీలక పాత్రలు పోషించారు. సినిమా ప్లాట్‌ విషయానికి వస్తే.. ‘మిగిల్.. జైలులో శిక్ష అనుభవిస్తూ ఉరి తీయడానికి ఒక రోజు ముందు అనూహ్యంగా మిస్‌ ‌అవుతాడు. జైలు గది తాళాలు, గోడలు అలాగే ఉన్నప్పటికీ అతడు మిస్‌ కావడం ఆశ్చర్యం కలిగిస్తుంది. దీన్ని కనిపెట్టేందుకు డిటెక్టివ్ రంగంలోకి దిగుతాడు. అతడికి మిగిల్‌ డైరీ దొరగడంతో కథ మలుపు తిరుగుతుంది. డైరీలో ఏముంది? డెజావు ఎక్స్‌పెరమెంట్‌కు కథకు సంబంధం ఏంటి?’ అన్నది స్టోరీ. ఓటీటీ వేదిక : ఈటీవీ విన్‌ లవ్‌ మీ (Love Me) ఆశిష్‌ (Ashish Reddy), వైష్ణవీ చైతన్య (Vaishnavi Chaitanya) ప్రధాన పాత్రల్లో అరుణ్‌ భీమవరపు తెరకెక్కించిన చిత్రం 'లవ్‌ మీ'. ఈ మూవీ కూడా వినూత్న కాన్సెప్ట్‌తో రూపొందింది. ఒక యువకుడు దెయ్యంతో ప్రేమలో పడితే&nbsp; ఎలా ఉంటుంది? ఈ క్రమంలో అతడికి ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి? అన్న కాన్సెప్ట్‌తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా జయాపజయాలు ఎలా ఉన్నప్పటికీ.. ఈ మూవీకి కచ్చితంగా ఓ డిఫరెంట్‌ ఎక్స్‌పీరియన్స్‌లో అందిస్తుంది. ప్లాట్‌ ఏంటంటే.. ‘అర్జున్ (ఆశిష్), ప్రతాప్ (రవికృష్ణ) కలిసి ఓ యూట్యూబ్ ఛానల్ నడుపుతూ ఉంటారు. దెయ్యాలు, ఆత్మలకు సంబంధించిన వీడియోలు చేస్తుంటారు. ప్రతాప్‌ లవర్‌ ప్రియా (వైష్ణవి).. దివ్యవతి అనే దెయ్యం గురించి చెప్పడంతో ఆమె ఉంటున్న పాడుబడ్డ అపార్ట్‌మెంట్‌కు అర్జున్‌ వెళ్తాడు. అలా వెళ్లిన అర్జున్‌ దివ్యవతి ఆత్మతో ప్రేమలో పడతాడు. ఆ తర్వాత ఏమైంది? దివ్యవతి ఎవరు?’ అన్నది కథ. ఓటీటీ వేదిక : అమెజాన్‌ ప్రైమ్‌ ప్రాజెక్ట్‌ జెడ్‌ (Project Z) సందీప్ కిష‌న్‌ (Sundeep Kishan), లావ‌ణ్య త్రిపాఠి (Lavanya Tripathi) హీరో హీరోయిన్లుగా న‌టించిన 'ప్రాజెక్ట్ జెడ్' మూవీ.. ఇప్పటివరకూ చూడని స్టోరీ లైన్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మనిషికి చావు అనేది లేకుంటే ఎలా ఉంటుంది? ఆనే కాన్సెప్ట్‌తో సైన్స్‌ ఫిక్షన్‌ జానర్‌లో ఈ సినిమాను తెరకెక్కించారు. సినిమా ప్లాట్‌ ఏంటంటే.. ‘నగరంలో వరుస హత్యలు కలకలం సృష్టిస్తాయి. ఇదంతా సీరియల్‌ కిల్లర్‌ పని పోలీసు డిపార్ట్‌మెంట్‌కు తెలుస్తోంది. దీంతో పోలీసు ఆఫీసర్‌ కుమార్‌ (సందీప్‌ కిషన్‌) రంగంలోకి దిగుతాడు. కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగు చూస్తాయి. ఓ సైంటిస్టు ఇవన్ని చేస్తున్నట్లు గ్రహిస్తారు? ఇంతకీ ఆ సైంటిస్టు ఎవరు? ఎందుకు హత్యలు చేస్తున్నాడు? అతడు చేసిన ప్రయోగం ఏంటి? కుమార్‌ ఈ కేసును ఎలా ఛేదించాడు?’ అన్నది కథ. ఓటీటీ వేదిక : ఆహా ప్రసన్న వదనం (Prasanna Vadanam) సుహాస్‌ (Suhas) రీసెంట్‌ చిత్రం 'ప్రసన్న వదనం'.. ఓ ప్రయోగాత్మక మూవీగా చెప్పవచ్చు. ఇందులో హీరో ఫేస్ బ్లైండ్ నెస్ (ప్రోసోపాగ్నోసియా) అనే స‌మ‌స్య బారిన పడతాడు. ఎవరి ముఖాన్ని, వాయిస్‌నూ గుర్తుపట్టలేకపోతాడు. దీని వల్ల అతడు ఫేస్‌ చేసిన సమస్యలు ఏంటి? అన్నది కాన్సెప్ట్‌. ఇందులో పాయల్‌ రాధాకృష్ణ, రాశీసింగ్‌, నందు, వైవా హర్ష కీలక పాత్రలు పోషించారు. మూవీ కథ ఏంటంటే.. రేడియో జాకీగా పనిచేసే సూర్య జీవితాన్ని ఓ ప్రమాదం తలకిందులు చేస్తుంది. ఈ ఘటనతో అతడు ఫేస్‌ బ్లైండ్‌నెస్‌ బారిన పడతాడు. ముఖాలను, గొంతులను గుర్తుపట్టలేకపోతుంటాడు. ఈ క్రమంలో ఓ రోజు అతడి కళ్లెదుట హత్య జరుగుతుంది. అనూహ్యంగా ఆ కేసులో సూర్య ఇరుక్కుంటాడు. సూర్య‌ని ఇరికించింది ఎవ‌రు? సూర్య కేసు నుంచి బయటపడ్డాడా లేదా? అన్నది కథ. భ్రమయుగం (Bramayugam) మలయాళ చిత్ర పరిశ్రమ ప్రయోగాలకు పెట్టింది పేరు. అక్కడి స్టార్‌ హీరో మమ్ముట్టి (Mammootty) నటించిన ‘భ్రమయుగం’ (Bramayugam) కూడా ఇప్పటివరకూ చూడని కాన్సెప్ట్‌తో రూపొందింది.&nbsp;డిజిటల్‌ యుగంలోనూ బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఫార్మాట్‌లో ఈ చిత్రాన్నితెరకెక్కించారు. ఈ సినిమా మెుత్తం మూడు పాత్రల చుట్టే తిరుగుతుంది. కథ ఏంటంటే.. ‘తేవన్ అనే గాయకుడు అడవిలో ప్రయాణిస్తూ ఓ పాడుబడ్డ పెద్ద భవంతికి వెళ్తాడు. అక్కడ యజమాని మమ్ముట్టి (కుడుమోన్ పొట్టి), ఓ వంటవాడు ఉంటాడు. అనూహ్య పరిణామాల తర్వాత తేవన్ ఆ ఇంటి నుంచి పారిపోవాలని అనుకుంటాడు. అసలు తేవన్ ఏం చూసి భయపడ్డాడు? కుడుమోన్ పొట్టి ఎవరు? అడవిలో ఏం చేస్తున్నాడు?’ అన్నది స్టోరీ. ఓటీటీ వేదిక : సోనీ లివ్‌
    జూలై 03 , 2024
    SSMB 30: మహేష్‌ - త్రివిక్రమ్‌ కాంబోలో మరో సినిమా.. ఈసారి మామూల్గా ఉండదట!
    SSMB 30: మహేష్‌ - త్రివిక్రమ్‌ కాంబోలో మరో సినిమా.. ఈసారి మామూల్గా ఉండదట!
    సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు (Mahesh Babu), దర్శకధీరుడు రాజమౌళి (SS Rajamouli) కాంబినేషన్‌లో కొత్తగా ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ‘SSMB29’ ప్రొడక్షన్‌ టైటిల్‌తో ఈ సినిమా రూపొందనుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా సాగుతున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో రూపొందనున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా అధికారిక అనౌన్స్‌మెంట్‌ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే మహేష్‌ తదుపరి సినిమా గురించి టాలీవుడ్‌లో ఓ వార్త హల్‌చల్‌ చేస్తోంది. స్టార్‌ డైరెక్టర్‌ త్రివిక్రమ్‌తో మహేష్‌ నాల్గోసారి సినిమా చేయబోతున్నట్లు బజ్‌ వినిపిస్తోంది.&nbsp; మహేష్‌ - గురూజీ కాంబోలో..! రాజమౌళితో సినిమా తర్వాత మహేష్‌ తన తదుపరి చిత్రాన్ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌(Trivikram Srinivas)తో తీయనున్నట్లు టాలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. మహేష్‌ రీసెంట్‌గా ‘గుంటూరు కారం’ (Guntur Karam)తో తెలుగు ఆడియన్స్‌ను పలకరించారు. ఈ చిత్రానికి త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వం వహించాడు. SSMB 29 తర్వాత కూడా మహేష్‌ తిరిగి త్రివిక్రమ్‌ డైరెక్షన్‌లో సినిమా చేయనున్నట్లు సమాచారం. ‘SSMB 30’ పేరుతో రానున్న ఈ చిత్రం.. భారీ థ్రిల్లింగ్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కనుందట. ‘గుంటూరు కారం’ షూటింగ్‌ టైమ్‌లోనే ఈ సినిమా కథ గురించి డిస్కషన్‌ జరిగినట్లు సమాచారం. అయితే ఈ సినిమా రూపొందటానికి చాలా సమయం పట్టనుంది.  త్రివిక్రమ్‌కు మాటిచ్చిన మహేష్‌! SSMB30 సినిమా పాన్‌ ఇండియా లెవల్లో రూపొందనున్నట్లు సమాచారం. అది కూడా మహేష్ బాబు స్వయంగా త్రివిక్రమ్‌కు మాటిచ్చాడని తెలుస్తోంది. ‘గుంటూరు కారం’ సమయంలోనే మరోమారు కలిసి పనిచేద్దామని మహేష్ అన్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అటు త్రివిక్రమ్ కూడా ఎప్పటి నుంచో పాన్ ఇండియా సినిమా తీసేందుకు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. అల్లు అర్జున్‌తో ఆ కల తీర్చుకోవాలని భావించారు. కానీ అది నెరవేరలేదు. అయితే మహేష్‌ ప్రామిస్ చేసినా కూడా SSMB30 పట్టాలు ఎక్కాలంటే ఇంకో మూడేళ్ల సమయం పట్టే అవకాశముంది. ఈలోపు త్రివిక్రమ్ కూడా ఓ సినిమాను తెరకెక్కిస్తారని అంటున్నారు.&nbsp;
    మార్చి 27 , 2024
    NTR 30 Heroine: సస్పెన్స్ వీడింది… Jr NTRతో రోమాన్స్ చేయనున్న జాన్వీ కపూర్
    NTR 30 Heroine: సస్పెన్స్ వీడింది… Jr NTRతో రోమాన్స్ చేయనున్న జాన్వీ కపూర్
    ]మరిన్ని కథనాల కోసం&nbsp; మా వెబ్‌సైట్‌ చూడండి.&nbsp; YouSay యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి.Download Our App
    మార్చి 06 , 2023
    టాప్ 30 గూగుల్‌లో వెతికిన తెలుగు నటీమణులు
    టాప్ 30 గూగుల్‌లో వెతికిన తెలుగు నటీమణులు
    ]50కి పైగా స్టేజి షోలు చేసిన ఫరియా, 2021 బ్లాక్‌బస్టర్‌ ‘జాతిరత్నాలు’లో చిట్టిగా మనసులు దోచింది. 2022లో లైక్‌ షేర్‌ &amp; సబ్‌స్క్రైబ్‌ సినిమా అంతగా ఆడకపోయినా..స్పెషల్‌ సాంగ్స్‌, సోషల్‌ మీడియాలో ఉన్న క్రేజ్‌ ఈమెను రేసులో నిలబెట్టాయి.31.ఫరియా అబ్దుల్లా
    ఫిబ్రవరి 13 , 2023
    ఈ వారం (March 30) థియేటర్లు/ ఓటీటీలో విడుదల కాబోతున్న తెలుగు సినిమాలు
    ఈ వారం (March 30) థియేటర్లు/ ఓటీటీలో విడుదల కాబోతున్న తెలుగు సినిమాలు
    గతవారం బాక్సాఫీస్‌ వద్ద ‘దాస్‌ కా ధమ్కీ’, ‘రంగమార్తాండ’ బాగానే ఆకట్టుకున్నాయి. విశ్వక్‌ సేన్‌ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ ఓపెనింగ్స్‌ రాబట్టిన సినిమాగా ‘దాస్‌ కా ధమ్కీ’ నిలిస్తే… కృష్ణవంశీ మార్క్‌ కళాఖండంగా ‘రంగమార్తాండ’ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అయితే ఈ వారం థియేటర్‌లో నానీ వన్‌ మ్యాన్‌ షో నడవబోతోంది. ‘మార్చి 30’న దసరా మాత్రమే విడుదల కాబోతోంది. దసరా- మార్చి 30 నాని- కీర్తి సురేశ్‌ జంటగా శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పాన్‌ ఇండియా లెవెల్‌లో మార్చి 30న విడుదల కాబోతోంది. సినిమాపై నాని ఈ సారి చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు. ఇటీవల కాలంలో తన సినిమాలన్నీ కనీస వసూళ్లు కూడా సాధించలేకపోయాయి. చివరిసారిగా వచ్చిన ‘అంటే సుందరానికి’ సినిమా అయితే పాజిటివ్‌ టాక్ తెచ్చుకున్నా నాని కెరీర్‌లో డిజాస్టర్లలో ఒకటిగా నిలిచింది. మరి పక్కా మాస్‌ మూవీగా వస్తున్న ‘దసరా’ ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. OTT విడుదలలు శ్రీదేవి శోభన్ బాబు సంతోశ్‌ శోభన్, గౌరీ కిషన్ ప్రధాన పాత్రల్లో వచ్చిన సినిమా శ్రీదేవీ శోభన్‌ బాబు. గత నెలలో థియేటర్లలో విడుదలై పరవాలేదు అనిపించుకుంది. ప్రశాంత్‌ కుమార్‌ దిమ్మల తెరకెక్కించిన ఈ సినిమా త్వరలోనే ఓటీటీలోకి వస్తోంది. ఓటీటీ: డిస్పీ+హాట్‌స్టార్‌ తేదీ : మార్చి 30 అమిగోస్‌ కల్యాణ్‌ రామ్ త్రిపాత్రాభినంతో వచ్చిన ఈ సినిమా థియేటర్లలో జనాలకు బాగానేే వినోదాన్ని పంచింది. కల్యాణ్ నటనపై మరోసారి ప్రశంసలు కురిశాయి. రాజేంద్ర రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ వారమే &nbsp; ఓటీటీలో సందడి చేయబోతోంది. ఓటీటీ: నెట్‌ ఫ్లిక్స్‌ తేదీ: ఏప్రిల్‌ 01 అసలు రవిబాబు దర్శకత్వంలో ఓటీటీ ఎక్స్‌క్లూజివ్‌గా వస్తున్న క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘అసలు’. ఈటీవీ విన్‌ ఒరిజినల్‌గా వస్తున్న ఈ సినిమా కథ ఓ అమ్మాయి జర్నీ, అందులోని సవాళ్ల చుట్టూ జరిగే థ్రిల్లర్‌గా ఉంటనుంది. ఓటీటీ: ఈటీవీ విన్‌ తేదీ: ఏప్రిల్ 05 అన్ని ఓటీటీ విడుదలలు TitleCategoryLanguagePlatformRelease DateGODARIDocumentaryTeluguAhaMarch 31SattiGaani RendekaraluMovieTeluguAhaApril 01My Little Pony- Tell Your TaleWeb seriesenglishNetflixMarch 27Emergency NYCWeb seriesenglishNetflixMarch 29UnseenmovieenglishNetflixMarch 29Almost Pyaar with DJ MohbatMovieHindiNetflixMarch 31Murder Mistery 2MovieEnglishNetflixMarch 31Company of HeroesMovieEnglishNetflixApril 01Jar Head 3 - The SiegeMovieEnglishNetflixApril 01ShehzadaMovieHindiNetflixApril 01Spirit UntamedMovieEnglishNetflixApril 01WarSailerSeriesEnglishNetflixApril 02Avatar 2MovieenglishDisney+HotstarMarch 28GaslightMovieHindiDisney+HotstarMarch 31All That BreathesMovieHindiDisney+HotstarMarch 31AgilanMovieTamilZee5March 31AyothiMovieTamilZee5March 31United Kache&nbsp;MovieHindiZee5March 31Tetris&nbsp;MovieEnglishApple TvMarch 31MummiesMovieEnglishBookMyShowMarch 27BhageeraMovieTamilMobiMarch 31Indian SummersMovieHindiMX PlayerMarch 27
    మార్చి 27 , 2023
    This Week Releases: ఈ వారం(June 29, 30) రిలీజ్ కానున్న చిత్రాలు, వెబ్ సిరీస్‌లు ఇవే..!
    This Week Releases: ఈ వారం(June 29, 30) రిలీజ్ కానున్న చిత్రాలు, వెబ్ సిరీస్‌లు ఇవే..!
    జూన్ నెలలో ఆఖరి వారంలోకి అడుగు పెట్టేశాం. నెలాఖరున పలు చిత్రాలు థియేటర్ల వద్ద సందడి చేయడానికి రెడీగా ఉన్నాయి. డిఫరెంట్ జానర్లలో తెరకెక్కిన సినిమాలు ఈ వారం(June 29,30) విడుదల అవుతుండటం విశేషం. థియేటర్లతో పాటు ఓటీటీల్లోనూ పలు వెబ్‌సిరీస్‌లు ప్రేక్షకులను పలకరించనున్నాయి. ఆ విశేషాలు తెలుసుకుందాం.&nbsp; థియేటర్లలో విడుదలయ్యే చిత్రాలు స్పై(SPY) నిఖిల్ సిద్ధార్థ నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రమే ‘స్పై’. ఎడిటర్ గ్యారీ బీహెచ్ దర్శకుడిగా మారి ఈ సినిమాను తెరకెక్కించాడు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ డెత్ మిస్టరీ నేపథ్యంలో జరిగిన సంఘటనల ఆధారంగా దీనిని తెరకెక్కించినట్లు చిత్రబృందం చెబుతోంది. వాస్తవికతకు దగ్గరగా, నిజ జీవిత స్పై ఏజెంట్లు ఎలా ఉంటారో ఇందులో చూపించినట్లు మూవీ టీం వెల్లడించింది. కె.రాజశేఖర్ రెడ్డి కథ అందించి ఈడీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మించాడు. ఐశ్వర్య మీనన్ నిఖిల్ సరసన నటించింది. జూన్ 29న విడుదలకు సిద్ధమవుతోంది. సామజవరగమన(Samajavaragamana) శ్రీవిష్ణు కథానాయకుడిగా వస్తున్న చిత్రమే ‘సామజవరగమన’. వినూత్నమైన ప్రేమకథగా ఈ సినిమాను తెరకెక్కించినట్లు చిత్రబృందం చెబుతోంది. ఈ మూవీకి రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించగా రాజేశ్ దండా నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై ఆసక్తిని పెంచాయి. మూవీకి గోపీ సుందర్ సంగీతం అందించాడు. రెబా మోనికా జాన్ కథానాయిక. నరేశ్, సత్య, తదితరులు కీలక పాత్రల్లో నటించారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని జూన్ 29న విడుదలకు సిద్ధమైంది.&nbsp; ఇండియానా జోన్స్(Indiana Jones) సాహసోపేతమైన సినిమాలకు ప్రత్యేక అభిమానులు ఉంటారు. ఈ కోవలో వచ్చిన ఇండియానా జోన్స్ సిరీస్‌ అప్పట్లో ఎంతగానో అలరించింది. ఇప్పుడు ఇదే సిరీస్‌లో మరో చిత్రం రాబోతోంది. ‘ఇండియానా జోన్స్ అండ్ డయల్ ఆఫ్ డెస్టినీ’ సినిమా జూన్ 29న విడుదల కాబోతోంది. తమిళ్,&nbsp; తెలుగు, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో రిలీజ్ కానుంది. ఈ సిరీస్‌లో దాదాపు 14 ఏళ్ల క్రితం చివరి చిత్రం వచ్చింది. మళ్లీ ఇప్పుడే థియేటర్లలో సందడి చేయడానికి రెడీ అయింది. మాయా పేటిక(Mayaa Petika) శ్రీనివాస్, పాయల్ రాజ్‌పుత్, సునీల్, పృథ్వీ తదితరులు కలిసి నటించిన చిత్రం ‘మాయా పేటిక’. సెల్‌ఫోన్ చుట్టూ జరిగే కథగా ఈ సినిమా సాగనుందని చిత్రబృందం వెల్లడించింది. రమేశ్ రాపార్తి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎప్పుడో పూర్తయింది. ఎట్టకేలకు జూన్ 30న విడుదల అయ్యేందుకు ముస్తాబైంది.&nbsp; లవ్ యూ రామ్(Love You Ram) ప్రముఖ రచయిత, దర్శకుడు దశరథ్ కథ అందించి నిర్మిస్తున్న సినిమా ‘లవ్ యూ రామ్’. తనదైన శైలిలో ఈ ప్రేమ కథను చెక్కారు దశరథ్. విభిన్నమైన మనస్తత్వాలు ఉన్న ఇద్దరు ప్రేమికుల కథ ఎక్కడిదాకా సాగింది? చివర్లో ఎలాంటి మలుపులు తిరిగిందనేది తెరపై చూడాల్సిందేనని చిత్రబృందం తెలిపింది. రోహిత్ బెహల్, అపర్ణ జనార్దనన్ జంటగా నటించగా బి.వి.చౌదరి దర్శకత్వం వహించాడు. దశరథ్‌తో నిర్మాణ బాధ్యతలు పంచుకున్నాడు. జూన్ 30న చిత్రం రిలీజ్ కానుంది. ఓటీటీల్లో విడుదలయ్యే చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు TitleCategoryLanguagePlatformRelease DateWeekend Family Season 2Web SeriesEnglishDisney + HotstarJune 28Lust Stories 2Web SeriesHindiNetflixJune 29See You In my Nineteenth LifeWeb SeriesKoreanNetflixJune 29Jack ran Season 4Web SeriesEnglishAmazon Prime&nbsp;June 30CelebrityWeb SeriesKoreanNetflixJune 30The Night Manager Season 2Web SeriesHindiDisney+ HotstarJune 30Arthamainda ArunkumarWeb SeriesTeluguAhaJune 30SargentWeb SeriesHindiJio CinemaJune 30
    జూన్ 26 , 2023
    This Week OTT Releases: ఈ వారం థియేటర్, ఓటీటీల్లో సందడి చేసే చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే!
    This Week OTT Releases: ఈ వారం థియేటర్, ఓటీటీల్లో సందడి చేసే చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే!
    గత వారంలాగే ఈ వారం కూడా పెద్ద సినిమాలు లేకపోవడంతో థియేటర్లను ఆక్రమించేందుకు చిన్న సినిమాలు సిద్ధమవుతున్నాయి. అక్టోబర్‌ 30 నుంచి నవంబర్‌ 5 తేదీల మధ్య పలు సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. అలాగే ఓటీటీలో కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్‌ కాబోతున్నాయి. మరి ఆ సినిమాలు ఏంటి? వాటి విశేషాల ఎలా ఉన్నాయి? ఈ కథనంలో చూద్దాం. థియేటర్‌లో రిలీజయ్యే చిత్రాలు కీడా కోలా యంగ్‌ డైరెక్టర్‌ తరుణ్‌ భాస్కర్‌ రూపొందించిన చిత్రం ‘కీడా కోలా’ (keedaa cola). బ్రహ్మానందం, చైతన్యరావు, తరుణ్‌భాస్కర్‌, రాగ్‌మయూర్‌, రఘురామ్‌, రవీంద్ర విజయ్‌, జీవన్‌ కుమార్‌, విష్ణు కీలక పాత్రల్లో నటించారు. కె.వివేక్‌ సుధాంషు, సాయికృష్ణ గద్వాల్‌, శ్రీనివాస్‌ కౌశిక్‌, శ్రీపాద్‌ నందిరాజ్‌, ఉపేంద్ర వర్మ నిర్మించారు. రానా దగ్గుబాటి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా నవంబరు 3న థియేటర్‌లలో ప్రేక్షకుల ముందుకు రానుంది. మా ఊరి పొలిమేర 2 విశ్వనాథ్‌ దర్శకత్వం వహించిన ‘మా ఊరి పొలిమేర 2’ (Maa Oori Polimera 2) చిత్రం ఈ వారమే థియేటర్లలో సందడి చేయనుంది. నవంబరు 3న తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది. ఇందులో సత్యం రాజేష్‌, కామాక్షి, బాలాదిత్య, గెటప్‌ శ్రీను కీలక పాత్రల్లో నటించారు. మూవీ తొలి పార్ట్‌ కరోనా కారణంగా ఓటీటీలో రిలీజై హిట్‌ టాక్ తెచ్చుకుంది. దీంతో పార్ట్‌-2పై అంచనాలు పెరిగిపోయాయి. తొలి భాగానికి మించిన థ్రిల్‌ ఇందులో ఉంటుందని చిత్ర యూనిట్ ప్రకటించింది.&nbsp; విధి రోహిత్ నందా, ఆనంది జంటగా చేసిన చిత్రం ‘విధి’ (Vidhi). శ్రీకాంత్ రంగనాథన్ దర్శకత్వం వహించారు. నవంబరు 3న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఓ జంట జీవితంలో విధి ఎలాంటి మలుపులకు కారణమైందనే ఆసక్తికర కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 12 ఫెయిల్‌ విక్రాంత్‌ మస్సే హీరోగా విధు వినోద్‌ చోప్రా తెరకెక్కించిన చిత్రం ‘12 ఫెయిల్‌’. మనోజ్‌ కుమార్‌ అనే వ్యక్తి జీవితం ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. ఒక గ్రామంలో ఉండే నిరుపేద యువకుడు 12వ తరగతి ఫెయిల్‌ అవుతాడు. కానీ పట్టుదలతో చదివి, దృఢ సంకల్పంతో ఐపీఎస్‌ అధికారి అవుతాడు. ఆ యువకుడు తన లక్ష్యాన్ని ఎలా చేరుకున్నాడన్న ఆసక్తికర కథతో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు. ఈ సినిమా ఇప్పటికే హిందీలో విడుదలై అలరిస్తోంది. నవంబరు 3న తెలుగులోనూ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఘోస్ట్‌ కన్నడ స్టార్‌ శివ రాజ్‌కుమార్‌(Shiva Rajkumar) నటించిన లేటెస్ట్‌ పాన్‌ ఇండియా చిత్రం ‘ఘోస్ట్‌’ (Ghost). ఈ మూవీకి శ్రీని దర్శకత్వం వహించాడు. దసరా కానుకగా కన్నడలో విడుదలైన ఈ సినిమా నవంబరు 4న తెలుగులోనూ రానుంది. ఆసక్తికరమైన యాక్షన్‌ థ్రిల్లర్‌ కథతో మూవీని రూపొందించినట్లు చిత్ర యూనిట్ తెలిపింది. క్లైమాక్స్‌ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని చెప్పింది.&nbsp; ఓటీటీలో స్ట్రీమింగ్‌కానున్న చిత్రాలు/వెబ్‌సిరీస్‌లు స్కంద యంగ్ హీరో రామ్‌ లేటెస్ట్ మూవీ 'స్కంద' ఈ వారం ఓటీటీలోకి రానుంది. నవంబర్‌ 2 నుంచి డిస్నీ+హాట్‌స్టార్‌ వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది. అక్టోబర్ 27 నుంచే ఈ మూవీ స్ట్రీమింగ్‌కు రావాల్సి ఉండగా అనివార్య కారణాలతో వాయిదా పడింది. ఇక అవుట్ అండ్ అవుట్ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో రామ్‌కు జోడీగా శ్రీలీల నటించింది. ఈ సినిమాకు సీక్వెల్ కూడా ఉండబోతుందని డైరెక్టర్ బోయపాటి క్లైమాక్స్‌లో క్లారిటీ ఇచ్చాడు.&nbsp;&nbsp; ఫ్లాట్‌ఫామ్‌ వారీగా ఓటీటీ విడుదలలు…&nbsp; మరిన్ని OTT చిత్రాలు &amp; వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి (telugu.yousay.tv/tfidb/ott) TitleCategoryLanguagePlatformRelease DateP.I. MeenaWeb SeriesHindiAmazon PrimeNov 3Scam 2003 ; Part-2Web SeriesHindiSony LIVNov 3Are You Ok Baby?MovieTamilAhaOctober 31Locked InMovieEnglishNetflixNov 1JawanMovieHindiNetflixNov 2
    అక్టోబర్ 30 , 2023
    Fahadh Faasil: పుష్ప విలన్‌ ఫహాద్‌ ఫాజిల్‌కు అరుదైన వ్యాధి.. లక్షణాలు ఇవే!
    Fahadh Faasil: పుష్ప విలన్‌ ఫహాద్‌ ఫాజిల్‌కు అరుదైన వ్యాధి.. లక్షణాలు ఇవే!
    ‘పుష్ప’ (Pushpa) సినిమాతో మలయాళ నటుడు ఫహాద్‌ ఫాజిల్‌ (Fahadh Faasil) అందరి దృష్టిని ఆకర్షించాడు. సినిమాలో చివరి 30 నిమిషాలు అల్లు అర్జున్‌ (Allu Arjun)తో పోటీ పడి మరి నటించాడు. విలన్‌ షేడ్స్‌ ఉన్న ఎస్పీ భన్వర్‌సింగ్ షెకావత్‌ పాత్రలో ఫహాద్‌ను తప్ప మరొకరిని ఊహించుకోలేము. ఆ స్థాయిలో ఆయన తన పాత్రపై ముద్ర వేశాడు. ఈ సినిమా పాన్‌ ఇండియా స్థాయిలో సక్సెస్‌ కావడంతో ఫహాద్‌కు నేషనల్‌ వైడ్‌గా క్రేజ్‌ వచ్చింది. ప్రస్తుతం అతడు వరుసగా సినిమాలు చేస్తూ అలరిస్తున్నాడు. ఇదిలా ఉంటే ఫహాద్‌ తాజాగా ఓ అరుదైన వ్యాధి బారిన పడ్డాడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించడంతో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.&nbsp; ఫహాద్‌కు వచ్చిన వ్యాధి ఇదే! మలయాళ స్టార్ నటుడు ఫహాద్‌ ఫాజిల్‌.. అటెన్షన్‌ డెఫిసిట్‌ హైపర్యాక్టివిటీ డిజార్డర్‌ (ADHD)అనే వ్యాధి బారిన పడ్డాడు. ఈ విషయాన్ని స్వయంగా తెలియజేసిన ఫహాద్‌.. ఇది మెదడు పనితీరుపై తీవ్ర ప్రభావం చూపుతోందని చెప్పారు. దీని వల్ల దేనిపైనా ఎక్కువ శ్రద్ద పెట్టలేకపోతున్నట్లు చెప్పారు. కొన్నిసార్లు అతి ప్రవర్తన, తొందరగా ఆవేశపడటం వంటివి గమనించినట్లు చెప్పారు. తన సమస్య గురించి డాక్టర్‌ను అడిగినట్లు ఫహాద్‌ తెలిపాడు. 41 ఏళ్ల వయసులో దీనికి చికిత్స చేయించుకోవచ్చా లేదా అన్న వివరాలు తెలుసుకుంటున్నట్లు వివరించాడు.&nbsp; ADHD వ్యాధిని ఎలా గుర్తించాలి? ADHD రుగ్మత పిల్లల్లో చాలా సాధారణం. కానీ, పెద్దల్లో మాత్రం చాలా అరుదుగా కనిపిస్తుంది. ఆజాగ్రత్తగా తప్పులు చేయడం, స్థిరంగా ఒక చోట కూర్చోలేకపోవడం, పరిగెత్తడం, గెంతడం, అతిగా మాట్లాడటం, తరచూ చేతులు కాళ్లు కదిలిస్తూ ఉండటం చెప్పిన విషయాలు మర్చిపోవడం, అర్థం చేసుకోలేకపోవడం,, ప్రతీ దానికి తొందరపడటం, ఇతరుల వస్తువులను అనుమతి లేకుండా తీసుకోవడం వంటివి ఈ వ్యాధి లక్షణాలుగా వైద్యులు చెబుతుంటారు. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.&nbsp; ADHD వ్యాధి ఎలా వస్తుంది? ఒక వ్యక్తి ADHD వ్యాధి ఎలా వస్తుందని చెప్పడానికి నిర్దిష్ట కారణాలు ఏవీ లేవని వైద్యులు తెలిపారు. పూర్తి స్థాయి చికిత్స కూడా అందుబాటులో లేదు. ఇప్పటికీ దీనిపై పరిశోధనలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ రుగ్మతతో బాధపడే పిల్లలను పెంచడం తల్లిదండ్రులకు పెద్ద సవాలుగా మారుతుంటుంది. ఇటువంటి పిల్లలను నియంత్రించడానికి థెరపీ, కొన్ని మందులు అవసరం. అవసరమైతే మానసిక నిపుణులను సంప్రదించాల్సి ఉంటుంది. అటు పెద్దలు కూడా ఇదే ఫార్మూలాను అనుసరించాల్సి ఉంటుందని సమాచారం.&nbsp; కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌ ఇటీవలే ‘ఆవేశం’ (Aavesham) సినిమాతో ఫహాద్‌ ఫాజిల్‌ సూపర్‌ హిట్‌ను అందుకున్నాడు. ఆ సినిమాతో కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. జీతూ మాధవన్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం రూ. రూ.150 కోట్లు కొల్లగొట్టింది. ఈ ఏడాది భారీ వసూళ్లు చేసిన మలయాళ చిత్రాల జాబితాలో నిలిచింది. ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో ఈ మూవీ స్ట్రీమింగ్‌ అవుతోంది.&nbsp; ఫహాద్‌ ఫ్యూచర్‌ ప్రాజెక్ట్స్‌ ప్రస్తుతం ఫహాద్‌.. అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న 'పుష్ప 2' (Pushpa 2: The Rule) లో నటిస్తున్నాడు. మొదటిభాగంతో పోలిస్తే రెండో పార్ట్‌లో ఆయన పాత్ర నిడివి ఎక్కువగా ఉండనుంది. హీరోకు, ఆ పాత్రకు మధ్య చాలా యాక్షన్‌ సన్నివేశాలు ఉండనున్నాయి. ఇప్పటికే ఆయనకు సంబంధించిన చిత్రీకరణ కూడా పూర్తయినట్లు సమాచారం. భారీ అంచనాల మధ్య ఈ సీక్వెల్‌ ఆగస్టు 15న విడుదలకు సిద్ధమైంది. అలాగే తమిళంలో 'మారీసన్‌' (Maareesan), రజనీకాంత్‌తో 'వట్టైయాన్‌' (Vettaiyan) చిత్రంలో నటిస్తున్నాడు.&nbsp;
    మే 28 , 2024

    @2021 KTree