• TFIDB EN
  • 35
    UATelugu
    ప్రసాద్‌ (విశ్వదేవ్‌), సరస్వతి (నివేదా థామస్‌) మధ్యతరగతి కుటుంబానికి చెందిన భార్య భర్తలు. పెద్ద కుమారుడు అరుణ్‌ స్కూల్లో ఆరో తరగతి చదువుతుంటాడు. మ్యాథ్స్‌లో చాలా వీక్‌. దాంతో లెక్క‌ల మాస్టారు చాణ‌క్య (ప్రియ‌ద‌ర్శి) అరుణ్‌కి జీరో అని పేరు పెడతాడు. పరీక్షల్లో ఫెయిల్ కూడా చేస్తాడు. అరుణ్ స్కూల్‌లో ఉండాలంటే లెక్క‌ల్లో క‌నీసం 35 మార్కులు సాధించాల్సిందేనని షరతు విధిస్తాడు. ఆ పరిస్థితుల్లో అరుణ్ ఏం చేశాడు? అతడికి తల్లి సరస్వతి ఎలా సాయం చేసింది? అన్నది స్టోరీ.
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌Ahaఫ్రమ్‌
    ఇన్ ( Telugu )
    Watch
    రివ్యూస్
    YouSay Review

    35 Chinna Katha Kaadu Review: ఇద్దరు పిల్లల తల్లిగా నివేదా థామస్‌.. ఆలోచింపజేసేలా ‘35 చిన్న కథ కాదు’ సినిమా!

    నివేదా థామస్‌ (Nivetha Thomas), విశ్వదేవ్‌ ఆర్‌, ప్రియదర్శి (Priyadarshi) ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం ‘35 చిన్న కథ కాదు’ (35 Chinna Katha Kaadu R...read more

    How was the movie?

    తారాగణం
    నివేతా థామస్
    గౌతమి
    ప్రియదర్శి పులికొండ
    విశ్వదేవ్ రాచకొండ
    అరుణ్ దేవ్
    సిబ్బంది
    నంద కిషోర్ ఈమనిదర్శకుడు
    విశ్వదేవ్ రాచకొండనిర్మాత
    సృజన్ యరబోలునిర్మాత
    కథనాలు
    <strong>Tollywood Collections: జనవరి - డిసెంబర్.. అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు</strong>
    Tollywood Collections: జనవరి - డిసెంబర్.. అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు
    టాలీవుడ్‌లో ఏటా పదుల సంఖ్యలో చిత్రాలు రిలీజ్ అవుతుంటాయి. కొన్ని బాక్సాఫీస్‌ వద్ద చతికిలపడితే మరొన్ని వసూళ్ల సునామి సృష్టిస్తుంటాయి. అయితే ప్రతి సంతవ్సరం ఏ సినిమా టాప్‌లో నిలిచిందన్న లెక్కలు బయటకు వస్తూనే ఉంటాయి. కానీ నెలల వారీగా ఏ సినిమా టాప్‌లో ఉందన్న విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. ఈ నేపథ్యంలో ఆ వివరాలను వెల్లడిస్తూ Yousay ఈ ప్రత్యేక కథనాన్ని మీ ముందుకు తీసుకొచ్చింది. జనవరి నుంచి డిసెంబర్‌ వరకూ ఆయా నెలల్లో రిలీజైన చిత్రాల్లో కలెక్షన్స్‌ పరంగా ఏది అగ్రస్థానంలో నిలిచిందో ఇప్పుడు తెలుసుకుందాం.&nbsp; జనవరి&nbsp; ఈ ఏడాది సంక్రాంతికి రిలీజైన ‘హనుమాన్‌’ (Hanuman) చిత్రం రూ.350 కోట్ల గ్రాస్‌ను సొంతం చేసుకుంది. ఓవరాల్‌గా జనవరిలో రిలీజైన తెలుగు చిత్రాలతో పోలిస్తే హనుమాన్ కలెక్షన్స్‌ పరంగా టాప్‌లో ఉంది. ప్రశాంత్‌ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో యువ నటుడు తేజ సజ్జ హీరోగా నటించాడు.&nbsp; ఫిబ్రవరి ఫిబ్రవరిలో రిలీజైన చిత్రాల్లో 'భీమ్లా నాయక్‌' (Bheemla Nayak) కలెక్షన్స్‌ పరంగా అగ్రస్థానంలో ఉంది. 2022లో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద రూ.193 కోట్లను కలెక్ట్‌ చేసింది. సాగర్‌ కె. చంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పవన్‌ కల్యాణ్‌, రానా, నిత్యా మీనన్‌, సంయుక్త మీనన్‌ ముఖ్య పాత్రలు పోషించారు. మార్చి దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'RRR' మార్చి నెలలో అగ్రభాగాన నిలిచింది. 2022లో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద రూ.1300 కోట్లను వసూలు చేసింది. ఇందులో రామ్‌చరణ్‌, జూ.ఎన్టీఆర్‌ హీరోలుగా నటించారు.&nbsp; ఏప్రిల్‌&nbsp; 2017 ఏప్రిల్ వచ్చిన 'బాహుబలి 2' (Bahubali 2)చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ఏకంగా రూ.1810 కోట్లను కొల్లగొట్టింది. తద్వారా ఏప్రిల్‌ నెలలో తిరుగులేని విధంగా టాప్‌లో నిలిచింది. ఓవరాల్‌గా చూస్తే కలెక్షన్స్‌ పరంగా రెండో భారతీయ చిత్రంగా 'బాహుబలి 2' నిలిచింది. ఇందులో ప్రభాస్‌, రానా, అనుష్క, సత్యరాజ్‌, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో కనిపించారు.&nbsp; మే మహేష్‌ బాబు హీరోగా తెరకెక్కిన 'సర్కారు వారి పాట' (Sarkaru vaari Pata)చిత్రం రూ.180 కోట్లకు పైగా గ్రాస్‌ సాధించి మే నెలలో టాప్‌లో నిలిచింది. 2022లో వచ్చిన ఈ చిత్రానికి పరుశురామ్‌ దర్శకత్వం వహించారు. కీర్తి సురేష్‌ హీరోయిన్‌గా చేసింది. జూన్‌ ఈ ఏడాది జూన్‌లో వచ్చిన 'కల్కి 2898 ఏడీ' (Kalki 2898 AD) చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.1200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. తద్వారా జూన్‌లో ఎవరికి అందనంత ఎత్తులో నిలిచింది. ఇందులో ప్రభాస్‌ హీరోగా నటించగా కమల్‌ హాసన్‌, అమితాబ్‌ బచ్చన్‌, దీపికా పదుకొనే, దిశా పటానీ ముఖ్య పాత్రలు పోషించారు.&nbsp; జులై రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా చేసిన 'బాహుబలి' (Bahubali) చిత్రం కలెక్షన్ల పరంగా జులైలో నెం.1 స్థానంలో నిలిచింది. 2015లో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద రూ.650 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ సినిమాతోనే రాజమౌళి టాలెంట్‌ పాన్‌ ఇండియా స్థాయికి తెలిసింది. ఆగస్టు ప్రభాస్‌ హీరోగా సుజిత్‌ దర్శకత్వంలో రూపొందిన ‘సాహో’ (Saaho) బాక్సాఫీస్‌ వద్ద రూ.445 కోట్లు వసూలు చేసింది. తద్వారా ఆగస్టులో టాప్‌లో ఉంది. 2019లో వచ్చిన ఈ చిత్రంలో బాలీవుడ్‌ నటి శ్రద్ధా కపూర్‌ హీరోయిన్‌గా చేసింది.  సెప్టెంబర్ గత నెల సెప్టెంబర్‌ రిలీజైన ‘దేవర’ (Devara: Part 1) చిత్రం వసూళ్ల పరంగా సెప్టెంబర్‌లో టాప్‌లో నిలిచింది. తారక్‌, జాన్వీ కపూర్‌ జంటగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద రూ.341 కోట్లు కొల్లగొట్టింది. ఇప్పటికీ విజయవంతంగా బాక్సాఫీస్‌ వద్ద కొనసాగుతోంది. ఈ మూవీకి కొరటాల శివ దర్శకత్వం వహించారు. సైఫ్‌ అలీఖాన్‌ విలన్‌ పాత్రలో కనిపించారు.&nbsp; అక్టోబర్‌ మెగాస్టార్‌ చిరంజీవి నటించిన 'సైరా నరసింహారెడ్డి' (Syra Narasimha Reddy) 2019 అక్టోబర్‌లో విడుదలైంది. ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద రూ.240.60 కోట్లు రాబట్టి అక్టోబర్‌లో టాప్‌లో నిలిచింది. ఈ మూవీకి సురేందర్‌ రెడ్డి దర్శకత్వం వహించారు.&nbsp; నవంబర్‌&nbsp; టాలీవుడ్‌ అగ్రకథానాయికల్లో ఒకరైన సమంత కలెక్షన్స్‌ పరంగా నవంబర్‌లో నెం.1గా ఉంది. 2022లో ఆమె నటించి యశోద (Yashoda) చిత్రం ఈ నెలలోనే రిలీజై రూ.33 కోట్లు రాబట్టింది. ఈ సినిమాకు హరి శంకర్ - హరీష్ నారాయణ్ ద్వయం దర్శకత్వం వహించారు. డిసెంబర్‌ గతేడాది డిసెంబర్‌లో విడుదలైన ‘సలార్‌’ (Salaar) చిత్రం రూ.700 కోట్లు కొల్లగొట్టి ఈ నెలలో టాప్‌లో ఉంది. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీలో మలయాళ నటుడు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ముఖ్య పాత్ర పోషించాడు. హీరోయిన్‌గా శ్రుతి హాసన్‌ చేసింది. ఈ మూవీకి సీక్వెల్‌ కూడా రూపొందనుంది.&nbsp;
    అక్టోబర్ 17 , 2024
    <strong>Nivetha Thomas: బరువు పెరగడంపై రిపోర్టర్‌ ప్రశ్న.. స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చిన నివేదా థామస్‌!</strong>
    Nivetha Thomas: బరువు పెరగడంపై రిపోర్టర్‌ ప్రశ్న.. స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చిన నివేదా థామస్‌!
    టాలీవుడ్‌లో తనకంటూ ఫ్యాన్స్ బేస్‌ను సంపాదించుకున్న హీరోయిన్లలో నివేదా థామస్‌ (Nivetha Thomas) ఒకరు. ఈ అమ్మడు నటించింది తక్కువే సినిమాలే అయినప్పటికీ స్టార్‌ హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని క్రేజ్‌ను తెలుగులో సొంతం చేసుకుంది. నివేదా.. ఇప్పటివరకూ యాక్టింగ్‌కు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లోనే కనిపించింది. బోల్డ్‌ పాత్రలను అసలు చేయలేదు. దీంతో టాలీవుడ్‌ ఆడియన్స్‌లో ఈ భామకు మంచి గుర్తింపు లభించింది. ఇదిలా ఉంటే.. తన అప్‌కమింగ్‌ ఫిల్మ్‌ '35' టీజర్ లాంచ్ ఈవెంట్‌లో నివేదా థామస్‌కు ఊహించని ప్రశ్న ఎదురైంది. ఈ అమ్మడు ఇచ్చిన కౌంటర్‌.. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.&nbsp; ఏం జరిగిందంటే? నివేథ థామస్‌ నటించిన '35&nbsp; చిన్న కథ కాదు' చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో తాజాగా టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ క్రమంలో ఓ జర్నలిస్టు బాడీ షేమింగ్‌ గురించి నివేదాను ప్రశ్నించారు. ‘అనుష్క లేదా మీలాంటి పలువురు ఆర్టిస్టులు బరువు పెరగడం అనేది సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారుతోంది. హీరోయిన్‌ అంటే జీరో సైజే అని సోషల్‌ మీడియాలో ఇప్పటికీ వైరల్‌ అవుతోంది. వీటికి ఏం చెప్తారు మీరు? అని మహిళా రిపోర్టర్‌ ప్రశ్నిస్తారు. ఇందుకు నివేదా థామస్‌ బదులిస్తూ.. ‘నేను మీతోనే చెప్పాలి ఇది. ఈ వైరల్‌ అనేది మీకు మాత్రమే వస్తుందేమో.. నాకు తెలీదు. ఈ క్వశ్చన్‌కు నా సింపుల్ ఆన్సర్‌.. 35 అనేది ఈ సెట్‌లో ఉన్న ఎవరి వెయిట్‌ కాదు.. క్యాస్ట్‌లో ఉన్న ఎవరి వెయిట్‌ కాదు.. టెక్నిషియన్స్‌ వెయిట్‌ కాదు' అంటూ నవ్వుతూనే స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు. సినిమాకు సంబంధించిన ప్రశ్నలు మాత్రమే వేయాలంటూ పరోక్షంగా హెచ్చరించారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది.&nbsp; https://twitter.com/i/status/1808789199795204521 తొలిసారి ‘అమ్మ’ పాత్రలో.. '35 చిన్న కథ కాదు' చిత్రంలో నివేదా థామస్‌తో పాటు విశ్వదేవ్‌ ఆర్‌, ప్రియదర్శి ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాకు నందకిశోర్‌ ఇమాని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ ఆగస్టు 15న థియేటర్లలో సందడి చేయనుంది. తిరుపతి నేపథ్యంలో జరిగే ఈ కథలో నివేదా థామస్ తల్లి పాత్ర పోషించారు. పరీక్షల్లో పాస్‌ మార్కులు కూడా రానందుకు తండ్రి మందలించగా.. కొడుకు ఇంటి నుంచి వెళ్లిపోతాడు. కుమారుడి కోసం తల్లి ఆరాటపడటం లాంటి సన్నివేశాలు తాజా విడుదల చేసిన టీజర్‌లో చూపించారు. మూవీని తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. మీరు ఓ లుక్కేయండి.&nbsp; https://www.youtube.com/watch?v=4cq7F7ihsbM నాకు పెళ్లైంది : నివేదా థామస్‌ తనకు పెళ్లంటూ గతంలో నెట్టింట జరిగిన ప్రచారంపై తాజాగా నటి నివేదా థామస్‌ స్పందించారు. టీజర్‌ విడుదల వేడుకలో దీనిపై కూడా మాట్లాడారు. ‘ఈ సినిమా ప్రచారంలో భాగంగా సోషల్‌ మీడియాలో నేను ఓ ఫొటో పోస్ట్‌ చేశా. దాన్ని చూసి చాలామంది నాకు పెళ్లి కానుందని భావించారు. దానిపై వార్తలు రాగా మా అమ్మ నాకు ఆ ఫొటో పంపారు. అవునా అమ్మా.. మీరెప్పుడు నా కోసం అబ్బాయిని చూశారు అని అమ్మని అడిగా’ అని నివేదా తెలిపారు. ఇక ఈ చిత్రంలో తన భర్తగా నటించిన విశ్వదేవ్‌, తన కుమారులుగా నటించిన వారిని ఉద్దేశిస్తూ.. ‘నాకు పెళ్లైంది. ఈయనే నా భర్త. వీళ్లే నా ఇద్దరు పిల్లలు అరుణ్‌, వరుణ్‌’ అంటూ నివేదా సరదాగా వ్యాఖ్యానించారు. కాగా, హీరో రానా ఈ మూవీకి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.&nbsp; https://twitter.com/i/status/1808760891615416465
    జూలై 04 , 2024
    <strong>Prasad Behera Arrest: ‘నా ప్రైవేట్ భాగాలు తాకాడు’.. ప్రసాద్ బెహరాపై యువ నటి ఫిర్యాదు</strong>
    Prasad Behera Arrest: ‘నా ప్రైవేట్ భాగాలు తాకాడు’.. ప్రసాద్ బెహరాపై యువ నటి ఫిర్యాదు
    టాలీవుడ్‌లో లైంగిక దాడి ఘటనలు ఇటీవల బాగా ఎక్కువయ్యాయి. నటులు తమను వేధించారంటూ పలువురు మహిళలు పోలీసు స్టేషన్‌కు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే తాాజాగా మరో నటుడిపై పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. దీనికి సంబంధించి ప్రముఖ యూట్యూబర్‌ ప్రసాద్‌ బెహరా (Prasad Behera Arrest)ను హైదరాబాద్‌ పోలీసులు అరెస్టు చేశారు. అతడిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. దీంతో కోర్టు అతడికి 14 రోజుల రిమాండ్‌ సైతం విధించింది.&nbsp; ఏం జరిగిందంటే? సహచర నటిని వేధించిన కేసులో బెహరా ప్రసాద్‌ (Prasad Behera Arrest)ను జూబ్లీహిల్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. మణికొండకు చెందిన బాధితురాలు ప్రసాద్‌తో కలిసి ఓ వెబ్‌సిరీస్‌లో నటించింది. షూటింగ్‌ టైమ్‌లో తన ప్రైవేటు భాగాలను తాకాడని ఆరోపించింది. ఈ క్రమంలో గట్టిగా నిలదీయడంతో క్షమాపణలు కూడా చెప్పాడని పేర్కొంది. ఆ తర్వాత కూడా పదే పదే తప్పుగా ప్రవర్తించాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది.&nbsp; https://twitter.com/Theteluguone/status/1869352505127407721 ‘తిడుతూ దాడి కూడా చేశాడు’ కొద్ది రోజుల తర్వాత మరో వెబ్‌సిరీస్‌లో కలిసి పనిచేసినప్పుడు కూడా మరోమారు అందరి ముందు అసభ్యంగా ప్రవర్తించాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. ఇదేంటని ప్రశ్నించగా అందరిముందు దూషించాడని చెప్పింది. డిసెంబర్‌ 11న షూటింగ్‌ నుంచి ఇంటికి వెళ్తున్న సమయంలో యూనిట్‌ అందరి ముందు తనపై దాడి కూడా చేశాడని పోలీసులకు తెలిపింది. దీంతో జూబ్లీహిల్స్‌ పోలీసులు ప్రసాద్‌పై 75(2), 79, 351(2)BNS సెక్షన్స్ కింద కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. కోర్టు అతడికి 14 రోజుల రిమాండ్ విధించడంతో చంచల్‌గూడ జైలుకు తరలించారు.&nbsp; ప్రసాద్‌ ఎలా ఫేమస్‌ అంటే? ‘మా విడాకులు’, ‘పెళ్లి వారమండి’, ‘దిల్ పసంద్’, ‘వింధ్యా విహారి’ వంటి యూట్యూబ్‌ కామెడీ సిరీస్‌లతో ప్రసాద్ బెహరా మంచి గుర్తింపు సంపాదించాడు. అతడి కామెడీ టైమింగ్‌కు చాలా మంది ఫ్యాన్స్ ఏర్పడ్డారు. ఈ క్రమంలో చిన్నగా సినిమా అవకాశాలు సైతం అతడ్ని వరించాయి. నిహారిక కొణిదెల నిర్మించిన ‘కమిటీ కుర్రోళ్లు’ (Committee Kurrollu) మూవీలో ప్రసాద్‌ మంచి రోల్‌ పోషించాడు. తనలో కమెడియన్‌తో పాటు మంచి నటుడు ఉన్నాడని నిరూపించాడు.&nbsp; కెరీర్‌ ముగిసినట్లేనా? కమిటీ కుర్రోళ్లు సక్సెస్‌తో ప్రసాద్‌ బెహారాకు టాలీవుడ్‌లో అవకాశాలు మెుదలయ్యాయి. ఈ క్రమంలో అతడు అరెస్టు కావడం ఇండస్ట్రీ వర్గాలు షాకయ్యాయి. అది కూడా యువతిని లైంగికంగా వేధించిన కేసులో జైలుకు వెళ్లడం తీవ్ర చర్చకు తావిస్తోంది. క్రమశిక్షణ, మంచి ప్రవర్తన లేని వ్యక్తులకు అవకాశాలు రావడం అనేది ఇండస్ట్రీలో చాలా అరుదుగా చూస్తుంటాం. తాజా అరెస్టు నేపథ్యంలో సినిమాల్లోకి ప్రసాద్‌ను తీసుకోవడం కష్టమేనని ఫిల్మ్‌ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. తాజా కేసులో దోషి అని తేలితే ఇండస్ట్రీ నుంచి గట్టి ఎదురుదెబ్బ తగలక మానదని అంటున్నారు.&nbsp;
    డిసెంబర్ 18 , 2024
    Pushpa 2 Ticket Price: ‘పుష్ప 2’ టికెట్‌ ధర రూ.1,239/-.. ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్
    Pushpa 2 Ticket Price: ‘పుష్ప 2’ టికెట్‌ ధర రూ.1,239/-.. ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్
    అల్లు అర్జున్‌ (Allu Arjun) హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందిన ‘పుష్ప 2’ చిత్రం మరో ఐదు రోజుల్లో రిలీజ్‌ కానుంది. దీంతో చిత్ర బృందం వరుసగా మూవీ ప్రమోషన్స్ చేస్తూ సినిమా హైప్‌ పెంచేస్తోంది. పాట్నా నుంచి మెుదలుకొని చెన్నై, కొచ్చి, ముంబయి ఇలా వరుసగా ప్రమోషన్స్‌ చేసింది. ఇదిలా ఉంటే శుక్రవారం నుంచి దేశంలోని పలు రాష్ట్రాల్లో ‘పుష్ప 2’ అడ్వాన్స్ బుకింగ్ (Pushpa 2 Advance Bookings) మెుదలయ్యాయి. దీంతో తెలుగు స్టేట్స్‌లో ఎప్పుడు మెుదలవుతాయా? అని తెగ ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో పుష్ప టీమ్‌కు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది. వారు చేసిన విజ్ఞప్తిని మన్నిస్తూ టికెట్లు రేట్లు పెంచుకునేందుకు అనుమతించింది.&nbsp; ‘టికెట్‌కు రూ.800 తీసుకోండి’ పాన్‌ ఇండియా స్టార్‌ బన్నీ 'పుష్ప 2' మూవీ టికెట్ల రేట్లు (Pushpa 2 Ticket Price) పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతించింది. సుకుమార్ తెరకెక్కించిన ఈ భారీ బడ్జెట్ చిత్రం డిసెంబర్ 5న గ్రాండ్​గా రిలీజ్ కాబోతోంది. భారీ బడ్జెట్‌తో రూపొందిన నేపథ్యంలో రెండు బెనిఫిట్ షోలకు రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం అనుమతించింది. డిసెంబర్ 4న రాత్రి 9.30 గం.లకు తొలి బెనిఫిట్ షోతో పాటు అర్ధరాత్రి 1 గం.లకు రెండో షో వేసుకునేందుకు వీలు కల్పించింది. అంతేకాదు ఈ బెనిఫిట్ షోల టికెట్ ధరను రూ.800 వరకూ పెంచుకునేందుకు అవకాశం కల్పించింది. ఫలితంగా బెనిఫిట్‌ షోలలో ‘పుష్ప 2’ టికెట్స్‌ రూ.1000కి పైగా పలకనుంది.  సింగిల్‌ స్క్రీన్‌లో రూ.1,121, మల్టీప్లెక్స్‌ రూ.1,239కి టికెట్స్‌ విక్రయించనున్నారు.  https://twitter.com/RainbowMedia_/status/1862792646055338010 https://twitter.com/TeluguScribe/status/1862784973419196691 మిగతా రోజుల్లో..&nbsp; బెన్‌ఫిట్‌ షోలతో పాటు మిగిలిన రోజులకు సంబంధించి కూడా టికెట్ పెంపు రేటును (Pushpa 2 Ticket Price) తెలంగాణ సర్కార్‌ ఫిక్స్‌ చేసింది. మల్టీప్లెక్స్‌, సింగిల్‌ స్క్రీన్‌లకు సెపరేట్స్ నిర్ణయించింది. డిసెంబర్ 5 నుంచి 8 వరకు సింగిల్ స్క్రీన్‌లలో రూ.150, మల్టీఫ్లెక్స్‌లో రూ.200 పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించింది. డిసెంబర్ 9 నుంచి 16 వరకు సింగిల్ స్క్రీన్‌లో రూ.105, మల్టీఫ్లెక్స్‌లో రూ.150 పెంపునకు గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చింది. ఇక డిసెంబర్ 17 నుంచి 23 వరకు సింగిల్ స్క్రీన్‌లో రూ.20, మల్టీఫ్లెక్స్‌లో రూ.50 పెంపునకు అనుమతి ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందుకు అనుగుణంగా తెలంగాణ వ్యాప్యంగా ఉన్న థియేటర్లలో టికెట్‌ ధరలు పెరగనున్నాయి. దీని ప్రకారం మెుదటి నాలుగు రోజుల టికెట్‌ ధరలు సింగిల్‌ స్క్రీన్స్‌లో రూ.354, మల్టీ ప్లెక్స్‌లో రూ.531గా ఉండనున్నాయి. ఇవాళ (నవంబర్‌ 30) సా. 4.56 తెలంగాణలో అడ్వాన్స్‌ బుకింగ్ మెుదలయ్యాయి. ఏపీలో కష్టమేనా.. టికెట్ల పెంపునకు తెలంగాణతో పాటు ఏపీ ప్రభుత్వాన్ని సైతం ‘పుష్ప 2’ టీమ్‌ రిక్వెస్ట్‌ చేసుకుంది. దీంతో ఏపీ సర్కార్‌ నుంచి కూడా సోమవారం అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు. అక్కడ కూడా రెండు బెన్‌ఫిట్‌ షోలు వేసుకునేందుకు అనుమతి ఇచ్చే ఛాన్స్ ఉందని ఫిల్మ్‌ వర్గాలు అంటున్నాయి. అయితే తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన స్థాయిలో భారీగా పెంచుకునేందుకు అవకాశం ఉంటుందా? లేదా? అన్నది మాత్రం ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే అల్లు వర్సెస్‌ మెగా అంటూ సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున రచ్చ జరుగుతోంది. చెన్నై ఈవెంట్‌లో ‘ఏం పీకలేరు’ అంటూ ఇంగ్లీషులో PK అనే పదాన్ని హైలెట్‌ చేసిన పోస్టు వైరల్ అయ్యింది. దీంతో పవన్‌ ఫ్యాన్స్‌ గుర్రుగా ఉన్నారు. ఇప్పుడు ఏపీలో ఉప ముఖ్యమంత్రిగా పవన్‌ ఉన్న నేపథ్యంలో టికెట్ల రేట్లు స్వల్పంగా పెంచుకునేందుకే అవకాశమిస్తారని అంటున్నారు.&nbsp; రేపు బిగ్ ఈవెంట్‌ తెలుగు రాష్ట్రాలు మినహా దేశంలోని పలు రాష్ట్రాల్లో ‘పుష్ప 2’ వరుసగా ప్రమోషన్స్ నిర్వహిస్తోంది. అయితే తెలుగు స్టేట్స్‌లో మాత్రం ఇప్పటివరకూ ఒక్క ప్రమోషన్ ఈవెంట్ నిర్వహించలేదు. దీంతో హైదరాబాద్‌లో బిగ్ ఈవెంట్‌ను ‘పుష్ప 2’ మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నట్లు సమాచారం. సినిమాకు ఎంతో కీలకమైన ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌ను మల్లారెడ్డి ఇంజనీరింగ్‌ కాలేజీ గ్రౌండ్‌లో నిర్వహించాలని అనుకుంటున్నారట. ఈవెంట్‌ ఆర్గనైజర్‌ శ్రేయాస్‌ మీడియా ఇప్పటికే మల్లారెడ్డి కాలేజీ యాజమాన్యంతో మాట్లాడినట్లు తెలుస్తోంది. పోలీసుల అనుమతి సైతం లభిస్తే డిసెంబర్‌ 1న సాయంత్రం ఈవెంట్‌ జరగనుంది. ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లోనే ఫోర్త్‌ సింగిల్‌ ‘పీలింగ్స్‌’ను కూడా రిలీజ్‌ చేసే అవకాశముంది.
    నవంబర్ 30 , 2024
    <strong>Pushpa 2: పవన్‌ సాయంతో చరిత్ర సృష్టించబోతున్న ‘పుష్ప 2’.. ఎలాగంటే?</strong>
    Pushpa 2: పవన్‌ సాయంతో చరిత్ర సృష్టించబోతున్న ‘పుష్ప 2’.. ఎలాగంటే?
    మెగా, అల్లు కుటుంబాల మధ్య మనస్పర్థలు తలెత్తినట్లు గత కొంతకాలంగా జోరుగా ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా ఏపీ ఎన్నికల సమయంలో పవన్‌ కల్యాణ్‌ ప్రత్యర్థి పార్టీ అభ్యర్థికి అల్లు అర్జున్‌ సపోర్ట్‌ చేయడం వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. ఎన్నికల అనంతరం పవన్‌ భాగస్వామిగా ఉన్న కూటమి పార్టీలు భారీ విజయం సాధించడం, ఉప ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణం చేయడం అందరికీ తెలిసిందే. ఇదిలా ఉంటే ప్రస్తుతం బన్నీ నటించిన పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప 2’ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో టికెట్ల పెంపు విషయంలో పవన్‌ ఏ విధంగా స్పందిస్తారోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా చిత్ర నిర్మాతలు పవన్ వద్దకు వెళ్లినట్లు సమాచారం. అక్కడ పవన్‌ స్పందన చూసి అందరూ షాకవుతున్నారు.&nbsp; పవన్‌.. గ్రీన్‌ సిగ్నల్‌! అల్లు అర్జున్‌, సుకుమార్‌ కాంబోలో రూపొందిన 'పుష్ప 2' (Pushpa 2) చిత్రం డిసెంబర్‌ 5న పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్‌గా రిలీజ్‌ కానుంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 13,500 స్క్రీన్స్‌లో ప్రదర్శితం కానుంది. దేశంలో 8,500, ఓవర్సీస్‌లో 5,000 థియేటర్లలో పుష్ప 2 షోలు పడనున్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమాను నిర్మాతలు నవీన్‌ యెర్నేని, రవి శంకర్‌లు దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్‌తో రూపొందించారు. దీంతో టికెట్ల రేట్లు పెంపునకు అనుమతివ్వాలని తాజాగా వారు ఏపీ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్‌ చేసుకున్నారట. ఈ విషయపై పవన్‌తో నిర్మాతలు చర్చించినట్లు ఏపీ రాజకీయ వర్గాలు తెలిపాయి. టికెట్ల పెంపుపై పవన్‌ (Pawan Kalyan) సానుకూలంగా స్పందించారని అంటున్నారు. అల్లు వర్సెస్‌ మెగా అంటూ బయట జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో పవన్‌ ఎలా రియాక్ట్ అవుతారోనని నిర్మాతలు తెగ ఆందోళన చెందారట. కానీ, పవన్‌ చాలా కూల్‌గా ఓకె చెప్పడం చూసి వారు ఆశ్చర్యపోయారట. టికెట్ల పెంపునకు సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన సైతం ఏపీ ప్రభుత్వం నుంచి రానున్నట్లు తెలుస్తోంది.&nbsp; పవన్ సాయం.. రూ.350 కోట్లు పక్కా! టికెట్ల పెంపు అంశంపై ఏపీ ప్రభుత్వాన్ని సంప్రదించినట్లే త్వరలోనే తెలంగాణ సర్కార్‌ను కూడా ‘పుష్ప 2’ (Pushpa 2) టీమ్‌ కలవనుంది. రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం కూడా టికెట్ల పెంపుపై సానుకూలంగా స్పందించే ఛాన్స్ ఉంది. సగటున టికెట్‌పై రూ.100-125 పెరిగే ఛాన్స్‌ ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీని ప్రకారం సింగిల్ స్క్రీన్ ధరలు ప్రస్తుతం రూ.175 ఉండగా రూ.300,&nbsp; మల్టీప్లెక్స్‌లలో రూ.275 ఉండగా రూ.425 లేదా అంతకంటే ఎక్కువ పెరిగే అవకాశాలు ఉన్నాయి. దీనికితోడు 13,500 స్క్రీన్స్‌లో ప్రదర్శితం కానుండటంతో ‘పుష్ప 2’ తొలిరోజే దాదాపుగా రూ.350 కోట్లు కలెక్ట్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అదే జరిగితే కలెక్షన్స్‌ పరంగా ఇండియాలోనే బిగ్గెస్ట్‌ డే 1 గ్రాసర్‌గా పుష్ప 2 చరిత్ర సృష్టించనుంది. రూ.223.5 కోట్ల తొలి రోజు కలెక్షన్స్‌తో ప్రస్తుతం RRR టాప్‌లో కొనసాగుతోంది. ‘పుష్ప 2’ తొలిరోజు రూ.350+ కోట్లు కలెక్ట్‌ చేస్తే టికెట్ల పెంపు ద్వారా పవన్‌ ఇచ్చిన ప్రోత్సాహం కూడా అందుకు కారణం కానుందని చెప్పవచ్చు. ట్రైలర్ నేపథ్యంలో మళ్లీ లొల్లి..! బిహార్‌ రాజధాని పాట్నాలో పుష్ప 2 (Pushpa 2) ట్రైలర్‌ లాంచ్ ఈవెంట్‌ గ్రాండ్‌గా జరిగిన సంగతి తెలిసిందే. ఆదివారం జరిగిన ఈ వేడుకకు ఎవరు ఊహించని స్థాయిలో భారీగా బన్నీ అభిమానులు తరలివచ్చారు. పొరుగు రాష్ట్రంలో బన్నీకి దక్కిన ఈ స్థాయి ఆదరణ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అయితే ఈ విషయాన్ని ఆయుధంగా చేసుకొని బన్నీ ఫ్యాన్స్‌ పవన్‌ను టార్గెట్‌ చేస్తున్నారు. ప‌వ‌న్‌కు కేవ‌లం ఏపీలో మాత్రమే జ‌నం వ‌స్తార‌ని, కానీ బ‌న్నీకి ఉత్తరాది రాష్ట్రంలోని పాట్నాలో కూడా పోటెత్తార‌ని కామెంట్స్ చేస్తున్నారు. బన్నీకి మద్దతుగా పోస్టులు పెడుతున్న వారిలో వైకాపా అభిమానులు సైతం ఉండటం విశేషం. అల్లు అర్జున్‌ ముందు పవన్‌ కల్యాణ్ నథింగ్ అంటూ మెగా ఫ్యాన్స్‌ను రెచ్చగొడుతున్నారు. మరోవైపు పవన్‌ ఫ్యాన్స్‌ సైతం గట్టిగా సమాధానం ఇస్తున్నారు. మహాారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పవన్‌కు వచ్చిన ఆదరణ చూడాలని సూచిస్తున్నారు. దేశ ప్రధాని మెచ్చిన గొప్ప వ్యక్తి పవన్‌ అంటూ కౌంటర్ ఇస్తున్నారు.&nbsp; పుష్ప 2 మరో రికార్డు 'పుష్ప 2' (Pushpa 2) చిత్రం రిలీజ్‌కు ముందే పలు రికార్డులను కొల్లగొడుతోంది. తాజాగా ప్రీసేల్‌ బుకింగ్స్‌లో మరో ఘనత సాధించింది. ఓవర్సీస్‌లో అత్యంత వేగంగా ‘పుష్ప2’ (Pushpa 2) వన్‌ మిలియన్‌ డాలర్ల క్లబ్‌లోకి చేరింది. అమెరికన్‌ బాక్సాఫీస్‌లో అత్యంత వేగంగా టికెట్ల ప్రీసేల్‌ ద్వారానే వన్‌ మిలియన్‌ డాలర్ల మార్క్‌ను చేరిన సినిమాగా ‘పుష్ప2’ నిలిచింది. ఈ విషయాన్ని తెలుపుతూ నిర్మాణ సంస్థ పోస్ట్‌ పెట్టింది. ‘మరో రోజు.. మరో రికార్డుతో చరిత్ర సృష్టించాడు. బాక్సాఫీస్‌ వద్ద పుష్పరాజ్‌ హవా కొనసాగుతూనే ఉంటుంది’ అంటూ కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. ఇది చూసిన అల్లు ఫ్యాన్స్‌ తెగ సంబరపడిపోతున్నారు. పుష్ప గాడి జైత్ర యాత్ర మెుదలైందంటూ కామెంట్స్ చేస్తున్నారు.&nbsp; https://twitter.com/PushpaMovie/status/1858759197883834867
    నవంబర్ 19 , 2024
    <strong>Kanguva Movie Review: తెగ నాయకుడిగా సూర్య విశ్వరూపం.. ‘కంగువా’ మెప్పించిందా?</strong>
    Kanguva Movie Review: తెగ నాయకుడిగా సూర్య విశ్వరూపం.. ‘కంగువా’ మెప్పించిందా?
    నటీనటులు: సూర్య, దిశా పటానీ, బాబీ డియోల్‌, జగపతిబాబు, యోగిబాబు, ప్రకాష్‌ రాజ్‌, కె.ఎస్‌. రవికుమార్‌, హరీష్ ఉత్తమన్‌, కోవై సరళ, ఆనంద్‌రాజ్‌ తదితరులు.. దర్శకత్వం : శివ సంగీతం : దేవీ శ్రీ ప్రసాద్‌ సినిమాటోగ్రఫీ: వెట్రి పళనిస్వామి ఎడిటింగ్‌: నిషాద్‌ యూసఫ్‌ నిర్మాతలు: కె.ఈ. జ్ఞానవేల్‌, వంశీ ప్రమోద్‌ విడుదల తేదీ: 14-11-2024 తమిళ నటుడు సూర్య (Suriya) హీరోగా నటించిన మోస్ట్‌ వాంటెడ్‌ చిత్రం 'కంగువా' (Kanguva). శివ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో బాలీవుడ్ నటి దిశా పటానీ (Disha Patani), బాబీ డియోల్‌ (Bobby Deol) ఇందులో కీలక పాత్రలు పోషించారు. కె. ఈ. జ్ఞానవేల్‌ రాజా, వంశీ ప్రమోద్‌ నిర్మాతలుగా వ్యవహరించారు. రూ.350 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందింది. రూ.1000 కోట్ల కలెక్షన్స్ లక్ష్యంగా నవంబర్‌ 14న పాన్‌ ఇండియా స్థాయిలో రిలీజైంది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకుల అంచనాలను అందుకుందా? సూర్య ఖాతాలో మరో విజయం పడినట్లేనా? ఇప్పుడు తెలుసుకుందాం. (Kanguva Movie Review) కథేంటి ఫ్రాన్సిస్‌ (సూర్య) గోవాలో బౌంటీ హంటర్‌గా పని చేస్తుంటాడు. అతడికి ప్రేయసి దిశా పటానీ, స్నేహితుడు యోగిబాబు సాయం చేస్తుంటారు. ఈ క్రమంలో (Kanguva Movie Review) ఓ రోజు ఫ్రాన్సిస్‌ను ఒక పాప కలుస్తుంది. ఆ పాపకి తనకు ఎదో బంధం ఉందని అతడికి అనిపిస్తుంది. ఆ బంధం ఇప్పటిది కాదు గత జన్మదని అతడికి అర్థమవుతుంది. 1000 ఏళ్ల కిందట ఆ పాపతో ఫ్రాన్సిస్‌కు ఉన్న సంబంధం ఏంటి? అసలు కంగువా ఎవరు? తెగ నాయకుడిగా అతడు చేసిన పోరాటాలు ఏంటి? విలన్ (బాబీ డియోల్‌) నుంచి అతడి తెగకు ఎదురైన ముప్పు ఏంటి? విలన్‌ను ఎదిరించి తన తెగను కంగువా ఎలా కాపాడుకున్నాడు? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.&nbsp; ఎవరెలా చేశారంటే తమిళ స్టార్ హీరో సూర్య&nbsp; (Kanguva Movie Review) ఎప్పటిలాగే ఈ సినిమాలోనే అదరగొట్టేశాడు. ఫ్రాన్సిస్, కంగువా అనే రెండు పాత్రల్లో మెప్పించాడు. ముఖ్యంగా కంగువా పాత్ర కోసం అతడు పడిన కష్టం తెరపై స్పష్టంగా కనిపిస్తుంది. పోరాట ఘట్టాల్లో సూర్య తన విశ్వరూపం చూపించాడు. బాడీ లాంగ్వేజ్‌, డైలాగ్ డెలివరీ, భావోద్వేగాల వ్యక్తీకరణ ఇలా అన్నింటిలోనూ సత్తా చాటాడు. ఇక విలన్‌గా బాబీ డియోల్ దుమ్మురేపారు. సూర్యకు సమఉజ్జీగా, క్రూరమైన విలన్ పాత్రలో జీవించేశాడు. హాట్‌ బ్యూటీ దిశా పటాని తన గ్లామర్‌తో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ఫ్రాన్సిస్‌ పాత్రతో ఆమె కెమెస్ట్రీ బాగా వర్కౌట్‌ అయ్యింది. కమెడియన్‌ యోగిబాబు అక్కడక్కడ నవ్వులు పూయించాడు. జగపతిబాబు, ప్రకాష్‌ రాజ్‌, కె.ఎస్‌. రవికుమార్‌, హరీష్ ఉత్తమన్‌లకు కథలో ప్రాధాన్యం ఉన్న పాత్రలే దక్కాయి. మిగిలిన పాత్రదారులు తమ పరిధిమేరకు చేశారు. డైరెక్షన్ ఎలా ఉందంటే దర్శకుడు శివ సరికొత్త కథతో కంగువాను రూపొందించారు. ఫ్రాన్సిస్‌ పాత్రతో సినిమాను మెుదలుపెట్టిన దర్శకుడు కథలోకి వెళ్లేందుకు చాలా సమయమే తీసుకున్నాడు. ఓ చిన్న పాప ఫ్రాన్సిస్‌ లైఫ్‌లోకి రావడం, ఆమె ద్వారా గత జన్మను లింకప్ చేసి కథలోకి తీసుకెళ్లాడు. కంగువా ఎంట్రీ నుంచి అసలు కథను ప్రారంభించారు డైరెక్టర్‌. 1000 ఏళ్ల కిందట తెగలు ఎలా ఉండేవి? వారి మధ్య ఎలాంటి పోరాటాలు జరిగాయి? ఎందుకు జరిగాయి? అన్నది ఆసక్తిగా చూపించారు. ఇంటర్వెల్ బ్లాక్‌ వచ్చే ట్విస్టుతో సెకండాఫ్‌పై అంచనాలు పెంచేశారు డైరెక్టర్‌. సెకండాఫ్‌లో వచ్చే మలుపులు, యాక్షన్‌ సీక్వెన్స్ కథను మరింత ఆసక్తికరంగా మార్చాయి. క్లైమాక్స్‌ గూస్‌బంప్స్‌ ప్రతీఒక్కరికీ గూస్‌బంప్స్‌ తెప్పిస్తుంది. అయితే నెమ్మదిగా సాగే కథనం, కొరవడిన భావోద్వేగాలు, విలన్‌ పాత్ర కాస్త బలహీనంగా ఉండటం మైనస్‌గా చెప్పవచ్చు.&nbsp; సాంకేతికంగా.. టెక్నికల్‌ విషయాలకు వస్తే&nbsp; (Kanguva Movie Review)అన్ని విభాగాలు మంచి పనితీరు కనబరిచాయి. ముఖ్యంగా వీఎఫ్‌ఎక్స్‌ డిపార్ట్‌మెంట్‌ సినిమాకు మంచి ఔట్‌పుట్‌ ఇచ్చింది. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. దేవిశ్రీ ప్రసాద్‌ అందించిన సంగీతం సినిమాకు పెద్ద ఎస్సెట్‌. పాటలు, నేపథ్య సంగీతం సినిమాకు చాలా బాగా కలిసొచ్చాయి. నిర్మాణ విలువలు చాలా ఉన్నతంగా ఉన్నాయి. ప్రతీ సన్నివేశాన్ని చాలా రిచ్‌గా తీర్చిదిద్దారు.&nbsp; ప్లస్‌ పాయింట్స్‌ సూర్య నటనయాక్షన్‌ సీక్వెన్స్‌సంగీతం మైనస్‌ పాయింట్స్‌ నెమ్మదిగా సాగే కథనంకొరవడిన ఎమోషన్స్‌ Telugu.yousay.tv Rating : 3/5&nbsp;
    నవంబర్ 14 , 2024
    <strong>Big News: ‘పుష్ప 3’ ఉంటుందని అధికారికంగా ప్రకటించిన నిర్మాత&nbsp;</strong>
    Big News: ‘పుష్ప 3’ ఉంటుందని అధికారికంగా ప్రకటించిన నిర్మాత&nbsp;
    ఐకాన్ స్టార్‌ అల్లు అర్జున్‌ (Allu Arjun) హీరోగా పుష్ప 2 (Pushpa 2) తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. భారీ అంచనాల నడుమ ఈ చిత్రాన్ని దర్శకుడు సుకుమార్‌ (Sukumar) తెరకెక్కిస్తున్నారు. రష్మిక మందన్న హీరోయిన్‌గా చేస్తోంది. తొలి భాగం పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్‌ కావడంతో దేశవ్యాప్తంగా ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. డిసెంబర్‌ 6న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. అయితే తాజాగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో అంతకంటే ముందే సినిమాను రిలీజ్‌ చేస్తున్నట్లు వెల్లడించారు. అంతేకాదు ‘పుష్ప 3’(Pushpa 3) కూడా కచ్చితంగా ఉంటుందంటూ అధికారిక ప్రకటన చేశారు.&nbsp; ఒక రోజు ముందే.. అల్లు అర్జున్‌ (Allu Arjun) అభిమానులు, సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘పుష్ప 2’ (Pushpa 2) చిత్రం అనుకున్న తేదీ (డిసెంబరు 6) కంటే ఒక రోజు ముందుగానే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇవాళ నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో నిర్మాతలు నవీన్‌ యెర్నేని, రవిశంకర్‌ యలమంచిలి ఈ విషయాన్ని వెల్లడించారు. డిసెంబర్‌ 4 నుంచి యూఎస్‌లో లాంగ్‌ వీకెండ్‌ ఉన్నందున అక్కడ బుధవారం (డిసెంబర్‌ 4) రోజున ‘పుష్ప 2’ రిలీజ్‌ చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. దీనికి అనుగుణంగా డిసెంబర్‌ 5న పాన్‌ ఇండియా వైడ్‌గా రిలీజ్‌ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు స్పెషల్‌ పోస్టర్‌, వీడియోను సైతం మేకర్స్‌ రిలీజ్‌ చేశారు. ‘పుష్ప 2’ని ఒక రోజు ముందే రిలీజ్‌ చేయడం వల్ల బాగా కలిసొస్తుందని నిర్మాతలు అభిప్రాయపడ్డారు.&nbsp; https://twitter.com/i/status/1849372823267180790 https://twitter.com/alluarjun/status/1849372306797113361 ‘పుష్ప 3’ పక్కా ‘పుష్ప 2’కి కొనసాగింపుగా మూడో పార్ట్‌ కూడా ఉంటుందని గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. హీరో అల్లు అర్జున్‌, డైరెక్టర్‌ సుకుమార్ సైతం మూడో పార్ట్‌ గురించి హింట్స్ ఇచ్చారు. ఈ క్రమంలో తాజాగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో నిర్మాత రవి శంకర్ ‘పుష్ప 3’ కచ్చితంగా ఉంటుందని అధికారిక ప్రకటన చేశారు. పార్ట్‌ 3 కి సంబంధించి సాలిడ్‌ లీడ్‌ తమకు దొరికిందని, కాబట్టి కచ్చితంగా 'పుష్ప 3' ఉంటుందని పునరుద్ఘటించారు. దీంతో బన్నీ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోతోంది. అయితే పార్ట్‌ 3ని ఎప్పుడు పట్టాలెక్కిస్తారన్న అంశంపై మాత్రం నిర్మాత రవిశంకర్ స్పష్టమైన కామెంట్స్‌ చేయలేదు.&nbsp; https://twitter.com/i/status/1849383805657690194 జాతర ఎపిసోడ్‌పై హైప్‌ 'పుష్ప 2'లోని జాతర ఎపిసోడ్‌పై నిర్మాతలు స్పందించారు. ఆ ఎపిసోడ్‌ చిత్రీకరించేందుకు దాదాపు 35 రోజుల సమయం పట్టిందని తెలిపారు. దాని కోసం ప్రత్యేకంగా రిహార్సల్స్‌ కూడా చేసినట్లు తెలిపారు. ఈ ఎపిసోడ్‌ విషయంలోనే కాకుండా ప్రతి సన్నివేశం(Pushpa 3)&nbsp; కోసం దర్శకుడు సుకుమార్‌, అల్లు అర్జున్‌ చాలా కష్టపడినట్లు చెప్పారు. అందరూ ఊహిస్తున్నట్టే జాతర ఎపిసోడ్‌ రోమాలు నిక్కబొడుచుకునేలా ఉంటుందని స్పష్టం చేశారు. ప్రజల్లో హైప్‌కు తగ్గట్లు ఆ సీన్‌కు భారీగా ఖర్చు చేసినట్లు తెలిపారు. దీన్ని బట్టి జాతర ఎపిసోడ్‌ సినిమాకే హైలెట్‌గా నిలుస్తుందని ఫ్యాన్స్‌ ఇప్పటినుంచే అంచనాలు పెంచేసుకుంటున్నారు.&nbsp; నాన్‌ థియేట్రికల్‌ రికార్డు పుష్ప 2 ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ రూ.1000 కోట్లు దాటినట్లు జరుగుతోన్న ప్రచారంపైనా నిర్మాత రవిశంకర్‌ రియాక్ట్ అయ్యారు. థియేట్రికల్‌, నాన్ థియేట్రికల్‌ కలిపి అలా చెబుతున్నట్లు పేర్కొన్నారు. నాన్‌ థియేట్రికల్‌ మాత్రం ఇప్పటివరకూ ఏ సినిమా చేయని బిజినెస్‌ చేసిందని స్పష్టం చేశారు. పుష్ప 2 ఐటెం సాంగ్‌ షూట్‌ నవంబర్‌ 4 నుంచి మెుదలవుతుందని నిర్మాత రవిశంకర్‌ స్పష్టం చేశారు. తుది దిశ చిత్రీకరణలో ఆ పాట మాత్రమే మిగిలి ఉందన్నారు. ఆ సాంగ్‌లో ఎవరు చేస్తారన్నది మాత్రం ఇంకా ఖరారు కాలేదని తెలిపారు. రెండ్రోజుల్లో వివరాలు వెల్లడిస్తామన్నారు. రూ.1000 కోట్ల బిజినెస్‌! 'పుష్ప 2' చిత్రం రిలీజ్‌కు ముందే ఓ భారీ రికార్డును బద్దలు కొట్టినట్లు ట్రేడ్‌ వర్గాలు ప్రకటించాయి. ఈ మూవీ ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ ఏకంగా రూ.1065 కోట్లకు జరిగినట్లు వెల్లడించాయి. థియేట్రికల్ బిజినెస్‌ హక్కులు రూ.640 కోట్లకు అమ్ముడైనట్లు పేర్కొన్నాయి. ఏపీ, తెలంగాణ కలిపి రూ.220 కోట్లకు థియేట్రికల్‌ హక్కులు విక్రయించినట్లు(Pushpa 3)&nbsp; తెలిపాయి. నార్త్‌ ఇండియాలో రూ.200 కోట్లు, తమిళ నాడు రూ.50 కోట్లు, కర్ణాటక రూ.30 కోట్లు, కేరళ రూ.20 కోట్లు, ఓవర్సీస్‌ రూ.120 కోట్ల మేర బిజినెస్‌ జరిగినట్లు ట్రేడ్‌ వర్గాలు వివరించాయి. అంతేకాకుండా డిజిటల్‌ హక్కులను నెట్‌ఫ్లిక్స్‌ రూ.275 కోట్లకు దక్కించుకున్నట్లు చెప్పాయి. మ్యూజిక్‌ రైట్స్‌ రూ.65 కోట్లు, శాటిలైట్‌ రైట్స్‌ రూ.85 కోట్లు కలిపి ఓవరాల్‌గా రూ.1000 కోట్లకు పైగా ప్రీ- రిలీజ్‌ బిజినెస్‌ జరిగిందని ట్రేడ్ వర్గాలు స్పష్టం చేశాయి.&nbsp;
    అక్టోబర్ 24 , 2024
    <strong>Highest Box office collections 2024: దేశంలోనే నెం.1 చిత్రంగా ‘హనుమాన్‌’.. హృతిక్‌, మహేష్‌ను వెనక్కినెట్టిన తేజ సజ్జ!</strong>
    Highest Box office collections 2024: దేశంలోనే నెం.1 చిత్రంగా ‘హనుమాన్‌’.. హృతిక్‌, మహేష్‌ను వెనక్కినెట్టిన తేజ సజ్జ!
    ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తేజ సజ్జ (Teja Sajja) హీరోగా నటించిన ‘హనుమాన్’ జాతీయ స్థాయిలో విశేష ఆదరణ పొందింది. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ చిత్రం.. బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. తెలుగు సినిమా ఖ్యాతిని మరో స్థాయికి తీసుకెళ్లడంలో తనవంతు పాత్ర పోషించింది. అటు థియేటర్లతో పాటు ఓటీటీ, టెలివిజన్‌ ప్రీమియర్స్‌లోనూ సత్తా చాటింది. ఈ క్రమంలోనే ‘హనుమాన్‌’ మరో ఘనత సాధించింది. దేశంలో ఈ ఏడాది ఇప్పటివరకూ విడుదలైన చిత్రాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా నిలిచింది. యంగ్‌ హీరో తేజ సజ్జా కలెక్షన్ల పరంగా బాలీవుడ్‌ స్టార్‌ హృతిక్‌ రోషన్‌ (Hrithik Roshan), మహేష్‌ బాబు (Mahesh Babu), అజయ్‌ దేవగణ్‌ (Ajay Devgan) చిత్రాలను వెనక్కి నెట్టాడు. ఈ ఏడాది హైయస్ట్‌ కలెక్షన్స్‌ రాబట్టిన టాప్‌-10 చిత్రాలు ఏవో ఇప్పుడు చూద్దాం.&nbsp; [toc] హనుమాన్‌ (HanuMan) తేజ సజ్జ హీరోగా తెరకెక్కిన హనుమాన్‌ చిత్రం.. వరల్డ్‌ వైడ్‌గా రూ.350 కోట్లకు పైగా గ్రాస్‌ సాధించి అగ్రస్థానంలో నిలిచింది. అయితే ఈ సినిమాను రూ.40 కోట్ల బడ్జెట్‌తో నిర్మించడం గమనార్హం. ప్రశాంత్‌ వర్మ డైరెక్షన్‌లో వచ్చిన ఈ మూవీలో.. అమృత అయ్యర్‌ హీరోయిన్‌గా చేసింది. వరలక్ష్మీ శరత్‌ కుమార్‌, సముద్రఖని, వినయ్‌ రాయ్‌, వెన్నెల కిషోర్‌, గెటప్‌ శ్రీను ముఖ్య పాత్రలు పోషించారు. ప్రస్తుతం ఈ సినిమా ‘జీ 5’ (Zee 5)లో స్ట్రీమింగ్‌ అవుతోంది.&nbsp; ఫైటర్‌ (Fighter) హృతిక్‌ రోషన్‌ (Hrithik Roshan), దీపికా పదుకొనే (Deepika Padukone), అనిల్‌ కపూర్‌ (Anil Kapoor) ప్రధాన పాత్రల్లో చేసిన బాలీవుడ్‌ చిత్రం 'ఫైటర్‌'.. ఈ జాబితాలో రెండో స్థానంలో నిలిచింది. సుమారు రూ.250 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం.. బాక్సాఫీస్‌ వద్ద రూ. 337.2 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా హిందీలో స్ట్రీమింగ్‌ అవుతోంది.&nbsp; మంజుమ్మెల్‌ బాయ్స్‌ (Manjummel Boys) మలయాళం సెన్సేషన్‌ ‘మంజుమ్మెల్‌ బాయ్స్‌’.. ఈ ఏడాది దేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో మూడో స్థానంలో నిలిచింది. రూ.20 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా వరల్డ్‌ వైడ్‌గా రూ.242.3 కోట్లు కొల్లగొట్టింది. అటు మలయాళంలో రూ.200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన తొలి చిత్రంగా ఆల్‌టైమ్‌ రికార్డు క్రియేట్‌ చేసింది. ప్రస్తుతం ఇది హాట్‌స్టార్‌లో తెలుగు భాషలో స్ట్రీమింగ్‌లో ఉంది.&nbsp; షైతాన్‌ (Shaitaan) బాలీవుడ్‌ లేటెస్ట్‌ చిత్రం 'షైతాన్‌' ఈ జాబితాలో నాల్గో స్థానంలో ఉంది. అజయ్‌ దేవగణ్‌ (Ajay Devgan), మాదవన్‌ (Madhavan), జ్యోతిక ప్రధాన పాత్రలు పోషించిన ఈ మూవీ.. రూ.211.06 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా బడ్జెట్‌ రూ.40 కోట్లు. ఇందులో విలన్‌గా కనిపించిన మాధవన్‌.. తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ‘షైతాన్‌’ మూవీ ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో హిందీ భాషలో అందుబాటులో ఉంది.&nbsp; గుంటూరు కారం (Guntur Kaaram) మహేశ్‌ బాబు - త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో వచ్చిన 'గుంటూరు కారం'.. ప్రస్తుత జాబితాలో టాప్‌ - 5లో నిలిచింది. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా రూ. 171.5 కోట్లు రాబట్టింది. ఇందులో మహేష్‌కు జోడీగా శ్రీలీల నటించింది. ప్రకాష్‌ రాజ్‌, జయరామ్‌, రమ్యకృష్ణ ప్రధాన తారాగణంగా ఉన్నారు. ఈ మూవీని నెట్‌ఫ్లిక్స్‌లో వీక్షించవచ్చు. ది గోట్‌ లైఫ్‌ (The Goat Life) మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్‌ (Prithviraj Sukumaran) లీడ్‌ రోల్‌లో చేసిన 'ది గోట్‌ లైఫ్‌'.. తెలుగులో ఆడు జీవితం అనే పేరుతో విడుదలైంది. ఈ మూవీ వరల్డ్‌వైడ్‌గా రూ.158.15 కోట్లు సాధించి టాప్‌ - 6లో నిలిచింది. ఈ మూవీ నిర్మాణానికి రూ. 82 కోట్లు ఖర్చు అయ్యింది. కాగా, ఈ మూవీ మే 26 నుంచి హాట్‌ స్టార్‌ వేదికగా స్ట్రీమింగ్‌లోకి రానుంది.&nbsp; క్రూ (Crew) టబూ, కరీనా కపూర్‌, కృతి సనన్‌ ప్రధాన పాత్రల్లో చేసిన 'క్రూ' (Crew) ఈ ఏడాది మంచి వసూళ్లు సాధించిన బాలీవుడ్‌ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. రూ.75 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద రూ.156.36 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రం మే 24 నుంచి నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా స్ట్రీమింగ్‌లోకి రానుంది.&nbsp; ఆవేశం (Aavesham) ఈ ఏడాది విడుదలై మంచి వసూళ్లు సాధించిన మలయాళ చిత్రం ‘ఆవేశం’. పుష్ప ఫేమ్‌ ఫహద్‌ ఫాజిల్‌ (Fahad Faasil) లీడ్‌ రోల్‌లో చేసిన ఈ చిత్రం.. వరల్డ్‌ వైడ్‌గా రూ. 155 కోట్లు రాబట్టింది. ఈ చిత్ర నిర్మాణానికి రూ. 30 కోట్లు ఖర్చు అయ్యింది. ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌లో ఉంది. ప్రేమలు (Premalu) మలయాళం సెన్సేషన్‌ ప్రేమలు కూడా.. రూ.136 కోట్ల వసూళ్లు సాధించి ఈ జాబితాలో తొమ్మిదో స్థానంలో నిలిచింది. రూ. 3 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రంలో నస్లెన్ కె. గఫూర్‌, మమితా బైజు ముఖ్యపాత్రలు పోషించారు. ప్రస్తుతం ఈ సినిమా డిస్నీ + హాట్‌స్టార్‌ వేదికగా స్ట్రీమింగ్‌ అవుతోంది. తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో వీక్షించవచ్చు. టిల్లు స్క్వేర్‌ (Tillu Square) సిద్ధు జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda) హీరోగా చేసిన లెటేస్ట్‌ చిత్రం.. టిల్లు స్క్వేర్‌ ఈ ఏడాది అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రాల్లో టాప్‌ 10లో నిలిచింది. ఈ చిత్రం వరల్డ్‌ వైడ్‌గా రూ.135 కోట్లకు పైగా కలెక్షన్స్‌ రాబట్టింది. ఇందులో సిద్ధూకు జోడీగా అనుపమా పరమేశ్వరన్‌ (Anupama Parameswaran) చేసింది. ప్రస్తుతం ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా స్ట్రీమింగ్‌లో ఉంది.&nbsp;
    అక్టోబర్ 22 , 2024
    <strong>This Week Movies: ఈ వారం రిలీజయ్యే చిత్రాలు.. ‘దేవర’కు స్పీడ్‌ బ్రేకులు వేయగలవా!</strong>
    This Week Movies: ఈ వారం రిలీజయ్యే చిత్రాలు.. ‘దేవర’కు స్పీడ్‌ బ్రేకులు వేయగలవా!
    థియేటర్లలో దేవర ప్రభజనం కొనసాగుతున్న వేళ తమ సత్తా ఏంటో చూపించేందుకు పలు చిన్న చిత్రాలు ఈ వారం థియేటర్లలోకి రాబోతున్నాయి. దసరా సెలవుల నేపథ్యంలో మిమల్ని ఎంటర్‌టైన్‌ చేసేందుకు సిద్ధమవుతున్నాయి. అటు ఓటీటీలోనూ ఆసక్తికర చిత్రాలు, సిరీస్‌లు మీకోసం స్ట్రీమింగ్‌లోకి రానున్నాయి. ఇంతకీ ఆ చిత్రాలు ఏంటి? ఏ రోజున రిలీజ్‌ కాబోతున్నాయి? వంటి విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం.&nbsp; థియేటర్లలో రిలీజయ్యే చిత్రాలు స్వాగ్‌ (Swag) వివైధ్య కథలకు కేరాఫ్‌గా మారిన శ్రీవిష్ణు (Sree Vishnu) నటించిన లేటెస్ట్‌ చిత్రం ‘స్వాగ్‌’ (Swag Movie)&nbsp; ‘రాజ రాజ చోర’ వంటి సూపర్‌ హిట్‌ తర్వాత హసిత్‌ గోలి దర్శకత్వంలో వస్తోన్న రెండో చిత్రం ఇది. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ అక్టోబరు 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఒక వంశ వృక్షంలోని పలు భిన్న తరాల కథల్ని ఇందులో చెప్పనున్నట్లు చిత్రం తెలిపింది. ఇందులో రీతూవర్మ, మీరా జాస్మిన్‌, దక్ష నగర్కర్‌ కీలక పాత్రలు పోషించారు.&nbsp; చిట్టి పొట్టి (Chitti Potti) రామ్ మిట్టకంటి, పవిత్ర, కస్వి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘చిట్టి పొట్టి’ (Chitti Potti). భాస్కర్ యాదవ్ దాసరి నిర్మించడంతో పాటు దర్శకత్వం వహించారు. సిస్టర్ సెంటిమెంట్‌తో ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌గా దీన్ని తీర్చిదిద్దారు. అక్టోబర్ 3న ఈ&nbsp; చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.&nbsp; దక్షిణ (Dakshina) తమిళ నటి సాయి ధన్సిక నటించిన తాజా చిత్రం ‘దక్షిణ’ (Dakshina Movie). అక్టోబరు 4న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.&nbsp; ‘మంత్ర’, ‘మంగళ’ సినిమాలను ప్రేక్షకులకు అందించిన ఓషో తుల‌సిరామ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం కావడంతో సహజంగానే ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. సీరియ‌ల్ కిల్లర్‌ను పట్టుకునే పోలీస్ ఆఫీస‌ర్‌గా సాయిధ‌న్సిక ఇందులో కనిపించనున్నారు.&nbsp; కలి (Kali) ఈ వారం థియేటర్లలోకి రాబోతున్న మరో సైకలాజికల్ థ్రిల్లర్‌ ‘కలి’ (Kali). ప్రిన్స్‌, నరేశ్‌ అగస్త్య ప్రధాన పాత్రల్లో నటించారు. శివ సాషు దర్శకత్వం వహించారు. ఈ మూవీ కూడా అక్టోబరు 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. అతి మంచితనం వల్ల ఇబ్బందులు పడే ఓ వ్యక్తిలైఫ్‌లోకి ఒక అపరిచితుడు రావడం వల్ల ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయన్న కాన్సెప్ట్‌తో ఈ సినిమా రూపొందించినట్లు చిత్ర బృందం తెలిపింది.&nbsp; బహిర్భూమి (Bahirbhoomi) నోయల్, రిషిత నెల్లూరు కీలక పాత్రల్లో నటించిన సినిమా ‘బహిర్భూమి’ (Bahirbhoomi). ఈ చిత్రాన్ని&nbsp; మహకాళి ప్రొడక్షన్ బ్యానర్ పై మచ్చ వేణుమాధవ్ నిర్మించారు. రాంప్రసాద్ కొండూరు దర్శకత్వం వహించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ అక్టోబర్ 4న విడుదలకు సిద్ధమైంది. రీసెంట్‌గా ట్రైలర్‌ రిలీజ్‌ చేయగా పాజిటివ్‌ రెస్పాన్స్‌ వస్తోంది.&nbsp; ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు/వెబ్‌సిరీస్‌లు 35 చిన్న కథ కాదు (35 Chinna Katha Kaadu) ప్రముఖ నటి నివేదా థామస్‌ ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ చిత్రం ’35 చిన్న కథ కాదు’. ఎమోషనల్ కామెడీ డ్రామాగా రూపొందించిన ఈ చిత్రానికి నందకిషోర్ ఇమాని దర్శకత్వం వహించాడు.ఇందులో ప్రియదర్శి, విశ్వదేవ్ రాచకొండ, గౌతమి కీలకపాత్రలు పోషించారు. సెప్టెంబర్ 6న థియేటర్లలో విడుదలైన మూవీ పాజిటివ్‌ టాక్‌ సొంతం చేసుకుంది. ఈ వీకెండ్‌లో మిమల్ని అలరించేందుకు ఓటీటీలోకి రాబోతోంది. అక్టోబర్‌ 2 నుంచి ఆహా వేదికగా ఈ సినిమాను వీక్షించవచ్చు.&nbsp; బ్లింక్‌ (Blink) ‘దసర’ ఫేమ్‌ దీక్షిత్ శెట్టి హీరోగా చేసిన కన్నడ సైన్స్‌ ఫిక్షన్‌ చిత్రం 'బ్లింక్‌'. మేలో అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా కన్నడలో ఈ మూవీ స్ట్రీమింగ్‌కు వచ్చింది. తాజాగా తెలుగు వెర్షన్‌లో అందుబాటులోకి వచ్చింది.&nbsp; ఆహా వేదికగా సెప్టెంబర్‌ 30 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. టైమ్ ట్రావెల్ కాన్సెప్టుతో డిఫరెంట్ నరేషన్‍తో వచ్చిన ఈ మూవీ బాగా పాపులర్ అయ్యింది.&nbsp; కళింగ (Kalinga) ధృువ వాయు హీరోగా నటించిన రీసెంట్‌ చిత్రం 'కళింగ'. అతడి స్వీయ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో ప్రగ్యా నయన్‌ హీరోయిన్‌గా చేసింది. దీప్తి కొండవీటి, పృథ్వీ యాదవ్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. హారర్‌ ఎలిమెంట్స్‌కు ఫాంటసీ అంశాలను జోడించి దర్శకుడు ఈ మూవీని రూపొందించారు. సెప్టెంబర్‌ 13న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం పర్వాలేదనిపించింది. ఈ వారం ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఆహా వేదికగా సెప్టెంబర్‌ 2 నుంచి ఈ సినిమాను వీక్షించవచ్చు.&nbsp; మరిన్ని OTT చిత్రాలు &amp; వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి https://telugu.yousay.tv/tfidb/ott TitleCategoryLanguagePlatformRelease DateTim Dillan&nbsp;MovieEnglishNetflixOct 01Sheffs TableSeriesEnglishNetflixOct 02Love Is BlindSeriesEnglishNetflixOct 02Unsolved Mysteries 5SeriesEnglishNetflixOct 02Hearts Topper 3SeriesEnglishNetflixOct 03CTRLSeriesHindiNetflixOct 04House Of Spoilers&nbsp;SeriesEnglishAmazonOct 03The TribeSeriesEnglishAmazonOct 04The SignatureMovieHindiZee 5Oct 23Amar Prem Ki Prem KahaniMovieHindiJio CinemaOct 04Furiosa: A Mad Max SagaMovieEnglishJio CinemaOct 2335 Chinna Katha KaduMovieTeluguAhaOct 02Balu Gani TalkiesMovieTeluguAhaOct 04
    సెప్టెంబర్ 30 , 2024
    <strong>Devara Weekend Collections: బాక్సాఫీస్‌పై ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న ‘దేవర’.. మూడు రోజుల్లో రూ.300 కోట్లు!</strong>
    Devara Weekend Collections: బాక్సాఫీస్‌పై ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న ‘దేవర’.. మూడు రోజుల్లో రూ.300 కోట్లు!
    ఎన్టీఆర్‌ (Jr NTR) హీరోగా కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వంలో రూపొందిన ‘దేవర’ చిత్రం శుక్రవారం (సెప్టెంబర్‌ 27) ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజైంది. అక్కడక్కడ మిక్స్‌డ్‌ టాక్‌ మినహా ఓవరాల్‌గా పాటిజివ్‌ టాక్‌ సొంతం చేసుకుంది. రిలీజైన అన్ని థియేటర్లలో హౌస్‌ ఫుల్‌ బోర్డ్స్‌తో దేవర ప్రదర్శితమవుతోంది. ఎన్టీఆర్‌ నటన, అనిరుధ్‌ మ్యూజిక్‌, కొరటాల శివ డైలాగ్స్ అదిరిపోయాయంటూ ప్రేక్షకులు కామెంట్స్‌ చేస్తున్నారు. దీంతో తొలిరోజు దేవర రూ.172 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి బాక్సాఫీస్‌ వద్ద సత్తా చాటింది. వీకెండ్‌ (శుక్ర, శని, ఆది) పూర్తయ్యే సరికి ఈ సినిమా కలెక్షన్స్‌ ఎన్ని కోట్లకు చేరాయో ఇప్పుడు చూద్దాం. వీకెండ్‌ కలెక్షన్స్ ఎంతంటే? ఎన్టీఆర్‌-జాన్వీకపూర్‌ జంటగా నటించిన దేవర చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. ఈ సినిమా విడుదలై నేటితో మూడు రోజులు పూర్తైనా కలెక్షన్స్ విషయంలో ఏమాత్రం తగ్గేదేలే అంటోంది. ఈ చిత్రం వీకెండ్‌లో ఏకంగా రూ.304 కోట్లు (GROSS) వసూళ్లు సాధించి సత్తా చాటింది. ఈ విషయాన్ని మేకర్స్‌ ఓ పోస్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించారు. దీంతో తారక్‌ ఫ్యాన్స్‌ తెగ సంబరపడిపోతున్నారు. బాక్సాఫీస్‌ వద్ద దేవర ఊచకోత కొనసాగుతోందంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. ఇప్పటికే మూడు వందల కోట్ల క్లబ్‌లో చేరిన ‘దేవర’ ఈ వారంలోనే ఈజీగా రూ.500 కోట్లు రాబడుతుందని ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి.&nbsp; https://twitter.com/DevaraMovie/status/1840623014981075232 ప్రాంతాల వారీగా..&nbsp; దేవర మేకర్స్‌ వరల్డ్ వైడ్‌ కలెక్షన్స్ మాత్రమే ప్రకటించారు. అయితే ట్రేడ్‌ వర్గాలు మాత్రం ప్రాంతాల వారీగా దేవర వసూళ్లను అంచనావేసే ప్రయత్నం చేశాయి. వాటి ప్రకారం దేవర చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల వ్యవధిలో రూ.126.5 కోట్లు కొల్లగొట్టింది. ఒక్క నైజాంలోనే రూ.38.77 కోట్లు రాబట్టింది. సీడెడ్‌ ఏరియాల్లో రూ.17.90 కోట్లు దేవరకు వచ్చి చేరాయి.&nbsp; కర్ణాటకలో రూ. 20.9 కోట్లు, తమిళనాడులో రూ.5.9 కోట్లు, కేరళలో రూ.1.4 కోట్లు, రెస్‌ ఆఫ్ ఇండియాలో రూ.35.3 కోట్లు తన ఖాతాలో వేసుకుంది. అటు ఓవర్సీస్‌లో రూ.65 కోట్లకు పైగా దేవర వసూళ్లు రాబట్టినట్లు తెలుస్తోంది. మెుత్తంగా కెరీర్‌లోనే అత్యధిక కలెక్షన్స్‌ సాధిస్తూ తారక్‌ బాక్సాఫీస్‌ వద్ద దూసుకెళ్తున్నాడు.&nbsp; డే 1 కలెక్షన్స్‌తో కొత్త రికార్డులు! ఎన్టీఆర్‌ కెరీర్‌లోనే (సోలో హీరోగా) అత్యధిక డే 1 కలెక్షన్స్‌ సాధించిన చిత్రంగా దేవర నిలిచింది.&nbsp;దేవర చిత్రం తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.172 కోట్లకు పైగా గ్రాస్ సాధించినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు స్పెషల్‌ పోస్టర్‌ను సైతం చిత్ర యూనిట్‌ రిలీజ్‌ చేశారు.&nbsp; ‘RRR’ తర్వాత తారక్‌ కెరీర్‌లో ఇదే అత్యధికం. రెండు తెలుగు రాష్ట్రాల్లో తొలిరోజు రూ.83.71 కోట్లు రాబట్టినట్లు ట్రేడ్‌ వర్గాలు ప్రకటించాయి. ఒక్క నైజాంలోనే 19.32 కోట్ల వసూళ్లు అందుకొని 'RRR' తర్వాత ఆల్‌టైమ్‌ టాప్‌- 2లో నిలిచిందని పేర్కొన్నాయి. దేవర సక్సెస్‌కు కారణాలు ఇవే! దేవరలో ఎర్ర సముద్రం అనే సరికొత్త ప్రపంచాన్ని దర్శకుడు కొరటాల శివ సృష్టించారు. ఈ సినిమాలో తారక్‌ వన్‌ మ్యాన్‌ షో చేశారు. దేవర, వర అనే తండ్రి కొడుకుల పాత్రలో అద్వితీయమైన నటన కనబరిచాడు. మరోవైపు విలన్‌గా చేసిన సైఫ్ అలీఖాన్‌ కూడా ఆకట్టుకున్నారు. ముఖ్యంగా అనిరుధ్‌ ఇచ్చిన బీజీఎం సినిమాకు ప్రధాన బలంగా నిలిచిందని చెప్పవచ్చు. యాక్షన్‌ సీక్వెన్స్‌లో అనిరుధ్‌ బీజీఎం గూస్‌బంప్స్‌ తెప్పించిందని కామెంట్లు వినిపిస్తున్నాయి. దర్శకుడు కొరటాల శివ తనదైన స్క్రీన్‌ప్లే, డైలాగ్స్‌తో మెప్పించారు. ముఖ్యంగా యాక్షన్‌ సీక్వెన్స్‌ రూపొందించిన తీరు అభినందనీయం. ఇంటర్వెల్‌ బ్యాంగ్‌, క్లైమాక్స్‌ ఆడియన్స్‌కు మంచి మజాను అందించాయి. అయితే సాగదీత సన్నివేశాలు, పేలవమైన లవ్‌ట్రాక్‌ సినిమాకు మైనస్‌గా చెప్పవచ్చు. దేవర స్టోరీ ఆంధ్ర-తమిళనాడు సరిహద్దుల్లో కొండపై ఉన్న నాలుగు గ్రామాల సమూహాన్ని ఎర్ర సముద్రంగా పిలుస్తుంటారు. అక్కడ దేవర (ఎన్టీఆర్)తో పాటు భైరవ (సైఫ్ అలీ ఖాన్), రాయప్ప (శ్రీకాంత్), కుంజర (షైన్‌ టామ్‌ చాకో) ఒక్కో గ్రామ పెద్దగా ఉంటారు. సముద్రం గుండా దొంగ సరుకుని అధికారుల కంట పడకుండా తీసుకొచ్చి మురుగ (మురళీ శర్మ)కి ఇవ్వడం వీళ్ల పని. అయితే దాని వల్ల జరిగే నష్టం గ్రహించి ఇకపై అలాంటి దొంగతనం చేయొద్దని దేవర ఫిక్స్‌ అవుతాడు. ఇందుకు భైరవ ఒప్పుకోడు. దాంతో ఆ ఇద్దరి మధ్య అంతర్యుద్ధం మొదలవుతుంది. దేవర వారికి తీవ్రమైన భయాన్ని చూపిస్తాడు. ఇక దేవరని చంపేయాలని భైరవ ప్లాన్ వేస్తాడు. మరి ఆ ప్లాన్ వర్కౌట్ అయిందా? ఎర్ర సముద్రం ప్రజలు దొంగ సరకు తీసుకురాకుండా దేవర తీసుకున్న కీలక నిర్ణయం ఏంటి? అతని కొడుకు వర(ఎన్టీఆర్) ఎందుకు భయస్తుడిగా మారాడు? సముద్రం ఎక్కేందుకు ప్రయత్నిస్తున్న భైరవ మనుషులని చంపేస్తుంది ఎవరు? తంగం (జాన్వీ కపూర్)తో వర ప్రేమాయణం ఎలా సాగింది? గ్యాంగ్‌స్టర్‌ యతితో దేవర కథకు సంబంధం ఏంటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.&nbsp;
    సెప్టెంబర్ 30 , 2024
    <strong>Devara Collections Analysis: బాక్సాఫీస్‌ పైకి దూసుకొస్తున్న ‘దేవర’.. తొలి రోజు రూ.125 కోట్లు పక్కా!</strong>
    Devara Collections Analysis: బాక్సాఫీస్‌ పైకి దూసుకొస్తున్న ‘దేవర’.. తొలి రోజు రూ.125 కోట్లు పక్కా!
    ‘దేవర’ (Devara: Part 1) రాకకు మరికొద్ది గంటలు మాత్రమే మిగిలి ఉంది. తారక్‌ (Jr NTR) హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం రేపు (సెప్టెంబర్‌ 27) ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్‌ కానుంది. ఇందులో తారక్‌కు జోడీగా శ్రీదేవి కూతురు, బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్‌ నటించింది. ప్రముఖ హిందీ నటుడు సైఫ్‌ అలీఖాన్‌ విలన్‌గా చేయడంతో ఈ సినిమాపై దేశవ్యాప్తంగా బజ్ ఏర్పడింది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 500లకు పైగా ప్రీమియర్స్‌తో ఈ సినిమా రిలీజ్‌ కానుంది. ఇక వరల్డ్‌ వైడ్‌గా దేవర అడ్వాన్స్‌ బుకింగ్‌ ట్రెండ్స్‌ చూస్తుంటే తొలి రోజు ఈజీగానే రూ.120 కోట్లకు పైగా వసూళ్లు సాధించనున్నట్లు తెలుస్తోంది. ఇది ఎలా సాధ్యమో ఈ కథనంలో తెలుసుకుందాం.&nbsp; తొలి రోజు రూ.125 కోట్లు పక్కా! తారక్‌ నటించిన ‘దేవర’ చిత్రం రిలీజ్‌కు ముందే పలు రికార్డులను కొల్లకొడుతూ భారీ హైప్‌ సంపాదించుకుంది. వరల్డ్‌ వైడ్‌గా ఈ సినిమా టికెట్స్‌ హాట్‌ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు టికెట్‌ రేట్లు పెంచుకునేందుకు అనుమతి సైతం ఇచ్చాయి. అటు ఓవర్సీస్‌లో రికార్డు స్థాయిలో ప్రీసేల్స్‌ జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దేవర తొలి రోజున రూ.125 కోట్లకు పైగా గ్రాస్‌ పక్కాగా సాధించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇంకా రూ.10-15 కోట్లు ఎక్కువ వచ్చిన ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని సినీ వర్గాలు అంచనా వేస్తున్నారు. ప్రీ బుకింగ్స్‌ను బట్టి రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.65 కోట్లు దేవర రాబట్టొచ్చని సమాచారం. హిందీలో రూ.8-10 కోట్లు దేవర ఖాతాలో పడొచ్చు. ఇక తమిళనాడు, కర్ణాటక, కేరళ, రెస్ట్‌ ఆఫ్ ఇండియా మెుత్తం కలిపి రూ.10-15 కోట్లు వచ్చే ఛాన్స్ ఉందని విశ్లేషణలు ఉన్నాయి. ఓవర్సీస్‌లో మాత్రం దేవర దుమ్మురేపడం ఖాయమని అంటున్నారు. తొలిరోజు ఈజీగానే రూ.30-35 కోట్లు కొల్లగొట్టే పరిస్థితులు ఉన్నాయని ట్రేడ్‌ వర్గాలు అభిప్రాయపడుతున్నారు. ఏ రకంగా చూసుకున్న తొలిరోజు దేవర ఖాతాలో రూ.125 కోట్లు + పడటం ఖాయమని ట్రేడ్‌ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. బ్రేక్‌ ఈవెన్‌ టార్గెట్‌ ఎంతంటే? ఎన్టీఆర్‌ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన దేవర చిత్రానికి ఓ రేంజ్‌లో ప్రీరిలీజ్‌ బిజినెస్‌ జరిగింది. ఈ సినిమా థియేట్రికల్‌ హక్కులు ఏకంగా రూ.185 కోట్లకు అమ్ముడుపోయినట్లు ట్రేడ్‌ వర్గాలు అంచనా వేశాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ. రూ.115 కోట్లకు ఈ సినిమా థియేట్రికల్‌ హక్కులు విక్రయించారని సమాచారం. నైజాం ఏరియాలో అత్యధికంగా రూ.45 కోట్లకు ‘దేవర’ అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. అటు సీడెడ్‌లో రూ.22 కోట్ల బిజినెస్ చేసిందని టాక్. కర్ణాటకలో రూ. రూ.15 కోట్లు, తమిళనాడులో రూ.6 కోట్లు, కేరళలో రూ.50 లక్షల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందట. యూఎస్​లో రూ.26 కోట్లు, హిందీ బెల్ట్​లో రూ.15 కోట్లకు సేల్ అయ్యిందని సమాచారం. మొత్తంగా అన్ని ఏరియాల్లో కలిపి రూ.185 కోట్ల ప్రీ రిలీజ్‌ బిజినెస్ జరిగినట్లు సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ లెక్కన రూ.200 కోట్ల షేర్‌ వసూలు చేస్తే బ్రేక్‌ ఈవెన్ అవుతుంది.&nbsp; ’దేవర’పై అనిరుధ్‌ ఫస్ట్ రివ్యూ 'దేవర' చిత్రానికి యంగ్‌ మ్యూజిక్‌ సెన్సేషన్‌ అనిరుద్‌ రవిచందర్‌ (Anirudh Ravichander) సంగీతం సమకూర్చారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనిరుద్‌ 'దేవర'పై హైప్‌ వచ్చే కామెంట్స్‌ చేశారు. ‘బ్యాగ్రౌండ్‌ మ్యూజిక్‌ అందించే సమయంలో నేను ఆశ్చర్యపోయాను. ఇంత గొప్పగా సినిమాను ఎలా తెరకెక్కించారని ఆలోచిస్తూనే ఉన్నా. ఇది అద్భుతమైన యాక్షన్ డ్రామా. ఇలాంటి సినిమాలకు నేపథ్య సంగీతం అందించాలంటే మంచి ప్రయోగాలు చేయొచ్చు. ప్రేక్షకులకు ఫ్రెష్‌ అనుభూతిని కలిగించాలనే ఉద్దేశంతో 95 శాతం రీరికార్డింగ్ పనులను విదేశాల్లోనే పూర్తి చేశాం. దేవర చూస్తున్నప్పుడు మీకు అవెంజర్స్‌, బ్యాట్‌మ్యాన్‌ వంటి హాలీవుడ్‌ సినిమాలు చూసిన అనుభూతి కలుగుతుంది. ఇందులో ఎమోషన్‌, డ్రామా, యాక్షన్‌, ఆవేశం, అన్నీ ఉన్నాయి. థియేటర్‌కు వచ్చిన ప్రేక్షకులు అద్భుతమైన అనుభూతిని పొందుతారు. ఈ సినిమాను ఫస్ట్ డే, ఫస్ట్‌ షో చూడాలనుకుంటున్నా' అని అనిరుద్‌ అన్నారు.&nbsp; సైఫ్‌ భార్యగా తెలుగు నటి దేవరలో సైఫ్‌ అలీఖాన్‌ విలన్‌ పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే ఆయన భార్యగా తెలుగు సీనియర్‌ నటి చైత్ర రాయ్‌ నటించింది. దీంతో ఆమె పేరు ఒక్కసారిగా మార్మోగుతోంది. ఎన్టీఆర్‌, సైఫ్‌ అలీఖాన్‌ లాంటి స్టార్లతో కలిసి నటించే అవకాశం దొరకడం తన అద్భుష్టమని చైత్ర అంటోంది. సెట్‌లో తొలిసారి తారక్‌, సైఫ్‌ని చూసి చాలా ఎగ్జైట్ అయ్యానని చెప్పుకొచ్చింది. కాగా, 'అష్టా చమ్మా' సీరియల్‌తో చైత్ర బుల్లితెరకు పరిచయమైంది. ప్రస్తుతం 'రాధకు నీవేరా ప్రాణం' సీరియల్‌లో నటిస్తోంది. దేవరతో మంచి గుర్తింపు లభిస్తే సినిమాల్లోనూ బిజీ కావచొచ్చని చైత్ర భావిస్తోంది.&nbsp; ఆ రెండు దేశాల్లో అరుదైన ఘనత ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ‘దేవర’ ట్రెండ్‌ నడుస్తోంది. ఇప్పటికే పలు రికార్డులు సొంతం చేసుకున్న ఈ యాక్షన్‌ డ్రామా తాజాగా మరో ఘనత సాధించింది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో కొత్త రికార్డు సృష్టించింది. ఈ రెండు దేశాల్లో అత్యధిక సంఖ్యలో డాల్బీ అట్‌మోస్‌ షోలను ప్రదర్శించనున్న తొలి భారతీయ చిత్రంగా ‘దేవర’ (Devara) నిలిచింది. ఆస్ట్రేలియాలో 13 స్క్రీన్స్‌లో, న్యూజిలాండ్‌లో 3 స్క్రీన్స్‌లో ఈ సినిమా విడుదల కానుంది. కాగా ఇటీవలే నార్త్‌ అమెరికా టికెట్ల ప్రీసేల్‌లో దేవర రికార్డు సృష్టించింది. ప్రీ సేల్‌ టికెట్ల విక్రయాల్లో అత్యంత వేగంగా 1 మిలియన్‌ డాలర్ల మార్క్‌ అందుకున్న తొలి భారతీయ చిత్రంగా నిలిచింది.&nbsp;
    సెప్టెంబర్ 26 , 2024
    <strong>Tollywood Top 10: ‘సైరా నరసింహ రెడ్డి’ని బీట్‌ చేయలేకపోయిన ‘దేవర’.. తెలుగులో టాప్‌-10 ప్రీ-రిలీజ్‌ బిజినెస్‌ చిత్రాలు ఇవే!</strong>
    Tollywood Top 10: ‘సైరా నరసింహ రెడ్డి’ని బీట్‌ చేయలేకపోయిన ‘దేవర’.. తెలుగులో టాప్‌-10 ప్రీ-రిలీజ్‌ బిజినెస్‌ చిత్రాలు ఇవే!
    తారక్‌ లేటెస్ట్ చిత్రం 'దేవర' రిలీజ్‌కు ఇంకో వారం రోజుల సమయం మాత్రమే ఉంది. దీంతో ఎక్కడ చూసిన ఈ సినిమా గురించే చర్చ నడుస్తోంది. అందుకు తగ్గట్లే మూవీ టీమ్‌ కూడా వరుసగా ప్రమోషన్స్ చేస్తూ సినిమాపై భారీగానే హైప్‌ క్రియేట్‌ చేస్తోంది. ఈ క్రమంలోనే దేవరకు సంబంధించిన రికార్డు స్థాయిలో ప్రీరిలీజ్‌ బిజినెస్‌ జరిగినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్‌ కెరీర్‌లో ఎన్నడూ లేనివిధంగా థియేట్రికల్‌ బిజినెస్‌ నమోదైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకీ దేవర ప్రీరిలీజ్‌ బిజినెస్‌ ఎంత? బ్రేక్‌ ఈవెన్‌ టార్గెట్‌ ఎన్ని కోట్లు? తెలుగులో ఇప్పటివరకూ అత్యధిక ప్రిరీలిజ్‌ బిజినెస్‌ చేసిన టాప్‌-10 చిత్రాలు ఏవి? ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.&nbsp; దేవర ప్రీ-రిలీజ్‌ బిజినెస్ ఎంతంటే? ఎన్టీఆర్‌ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన దేవర చిత్రానికి ఓ రేంజ్‌లో ప్రీరిలీజ్‌ బిజినెస్‌ జరిగినట్లు తెలుస్తోంది. ఈ సినిమా థియేట్రికల్‌ హక్కులు ఏకంగా రూ.185 కోట్లకు అమ్ముడుపోయినట్లు ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ. రూ.115 కోట్లకు ఈ సినిమా థియేట్రికల్‌ హక్కులు విక్రయించారని అంటున్నారు. నైజాం ఏరియాలో అత్యధికంగా రూ.45 కోట్లకు ‘దేవర’ అమ్ముడుపోయినట్లు పేర్కొన్నారు. అటు సీడెడ్‌లో రూ.22 కోట్ల బిజినెస్ చేసిందని టాక్. కర్ణాటకలో రూ. రూ.15 కోట్లు, తమిళనాడులో రూ.6 కోట్లు, కేరళలో రూ.50 లక్షల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందట. యూఎస్​లో రూ.26 కోట్లు, హిందీ బెల్ట్​లో రూ.15 కోట్లకు సేల్ అయ్యిందని సమాచారం. మొత్తంగా అన్ని ఏరియాల్లో కలిపి రూ.185 కోట్ల ప్రీ రిలీజ్‌ బిజినెస్ జరిగినట్లు సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ లెక్కన రూ.200 కోట్ల షేర్‌ వసూలు చేస్తే బ్రేక్‌ ఈవెన్ అవుతుంది.&nbsp; ముఖ్య అతిథులుగా స్టార్‌ డైరెక్టర్స్‌! దేవర ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ కోసం భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. హైదరాబాద్‌ వేదికగా ఈ నెల 22న ఈవెంట్ జరగనుంది. లేటెస్ట్ బజ్‌ ప్రకారం ఈ వేడుకకు ముగ్గురు స్టార్‌ డైరెక్టర్లు హాజరుకానున్నట్లు సమాచారం. దర్శకధీరుడు రాజమౌళి, ప్రశాంత్‌ నీల్‌, త్రివిక్రమ్‌ ఈవెంట్‌లో పాల్గొంటారని ఫిల్మ్‌ వర్గాల్లో టాక్‌ వినిపిస్తోంది. అదే విధంగా సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు కూడా ఈవెంట్‌కు హాజరయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది. అయితే దేవర టీమ్‌ ప్రమోషన్స్‌ పరంగా నార్త్‌పైనే ఎక్కువ ఫోకస్‌ పెట్టిందంటూ పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో స్టార్ డైరెక్టర్స్‌తోపాటు మహేష్‌ను గెస్ట్‌గా పిలవడం ద్వారా ఆ విమర్శల నుంచి బయటపడాలని దేవర టీమ్‌ భావిస్తున్నట్లు సమాచారం.&nbsp; ప్రీరిలీజ్ బిజినెస్‌లో టాప్ మూవీస్ ఇవే ఒకప్పుడు ప్రీరిలీజ్‌ బిజినెస్ అంటే బాలీవుడ్‌, హాలీవుడ్‌ చిత్రాలకు మాత్రమే సాధ్యమన్న ఆలోచనలో తెలుగు ఆడియన్స్‌ ఉండేవారు. దర్శకధీరుడు రాజమౌళి దీనిని పూర్తిగా మార్చివేశారు. ప్రీరిలీజ్‌ బిజినెస్‌ రికార్డులకు కేరాఫ్‌గా టాలీవుడ్‌ను మార్చారు. అలవోకగా 350 కోట్లకు పైగా ప్రీరిలీజ్ బిజినెస్‌ చేస్తూ తెలుగు చిత్రాలు సత్తా చాటాడు. తెలుగులో అత్యధిక ప్రిరీలిజ్‌ బిజినెస్‌ చేసిన టాప్‌ -10 చిత్రాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; ఆర్‌ఆర్‌ఆర్‌ (RRR) దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కిన ఈ మూవీ అత్యధిక ప్రీరిలీజ్‌ బిజినెస్‌ చేసిన తెలుగు చిత్రంగా టాప్‌లో నిలిచింది. డిజిటల్, శాటిలైట్, థియేట్రికల్ రైట్స్ కలిపి ఆర్‌ఆర్‌ఆర్‌కు దాదాపు రూ.480 కోట్ల వ్యాపారం జరిగిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే రూ.191 కోట్ల వ్యాపారం జరిగిందని అంచనా. ఇప్పటి&nbsp; కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD) మహానటి ఫేం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్, అమితాబ్, కమల్ హాసన్ నటించిన ‘కల్కి 2898 ఏడీ’ సరికొత్త రికార్డులను సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కింద రూ. 385 కోట్ల వ్యాపారం చేసింది. తెలుగు రాష్ట్రాల్లో రూ.180 కోట్లు, ఓవర్సీస్‌లో 70 కోట్లు, హిందీలో రూ.85 కోట్ల వ్యాపారం జరిగినట్లు ట్రేడ్‌ వర్గాలు తెలిపాయి. వరల్డ్‌వైడ్‌గా ఈ చిత్రం రూ.1200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టడం విశేషం.&nbsp; బాహుబలి 2 (Bahubali 2) దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, అనుష్క, రానా కీలకపాత్రలు పోషించిన చిత్రం బాహుబలి 2. బాహుబలికి సీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపించింది. ప్రీ రిలీజ్ బిజినెస్ కింద రూ.350 కోట్ల వ్యాపారం చేసిందని ట్రేడ్ వర్గాలు చెప్పాయి. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే ఈ సినిమాను రూ.190 కోట్లకు పైగా విక్రయించినట్లుగా అప్పట్లో వార్తలు వచ్చాయి. సలార్‌ (Salaar) కేజీఎఫ్‌తో ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ప్రశాంత్ నీల్, ప్రభాస్‌ హీరోగా ‘సలార్‌’ అనే చిత్రాన్ని తీశాడు. రిలీజ్‌కు ముందు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.345 కోట్ల వ్యాపారం చేసిందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే ఈ సినిమా రూ.120 కోట్ల బిజినెస్ చేసిందని అంచనా. సాహో (Sahoo) బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన సినిమా కావడంతో సాహోపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సుజిత్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ దుమ్మరేపింది. సాహోకు ప్రీ రిలీజ్ బిజినెస్ కింద రూ.280 కోట్ల వ్యాపారం జరిగినట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. నార్త్ ఇండియాలో ఏకంగా రూ.120 కోట్ల వ్యాపారం చేసి అప్పట్లో సాహో రికార్డ్ క్రియేట్ చేసింది&nbsp; ఆదిపురుష్‌ (Adipurush) ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన మూవీ ‘ఆదిపురుష్’. రామాయణాన్ని బేస్ చేసుకుని తెరకెక్కించిన ఈ సినిమాలో కృతి సనన్ సీతమ్మ తల్లిగా నటించారు. మైథలాజికల్ మూవీ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొనగా అందుకు తగినట్లుగానే బిజినెస్ జరిగింది. ప్రీ రిలీజ్ బిజినెస్ కింద ఈ సినిమా రూ.240 కోట్లకు పైగా వ్యాపారం చేసిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి రాధేశ్యామ్ (RadheShyam) ప్రభాస్ , పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రాధేశ్యామ్’ హీరో ప్రభాస్‌ను కంప్లీట్ డిఫరెంట్‌ లుక్‌లో చూపించింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.202.80 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేయగా తెలుగు రాష్ట్రాల్లోనే రూ.107 కోట్ల వ్యాపారం చేసి ప్రభాస్ స్టామినా ఏంటో నిరూపించింది. సైరా నర్సింహారెడ్డి (Saira Narasimha Reddy) చిరంజీవి హీరోగా నటించిన సైరా నరసింహారెడ్డి సినిమా ఏకంగా 187.25 కోట్లకు ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసింది. మెగాస్టార్‌ కెరీర్‌ అత్యధిక ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ చిత్రంగా అవతరించింది. ఇక ఈ సినిమా తెలుగులో మాత్రమే బ్రేక్ ఈవెన్ దాటడం గమనార్హం. దేవర (Devara) కొరటాల శివ - జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో తెరకెక్కిన దేవర పార్ట్ 1 రిలీజ్‌కు ముందు రూ.185 కోట్ల ప్రీరిలీజ్‌ బిజినెస్‌ చేసి ఈ జాబితాలో టాప్‌-9లో చోటు సంపాదించింది. ఇది ఎన్టీఆర్ కెరీర్‌లోనే (సోలో హీరోగా) హయ్యెస్ట్ అని చెప్పవచ్చు.&nbsp; పుష్ప (Pushpa) క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫహద్ ఫాజిల్ కీలకపాత్రలు పోషించిన ‘పుష్ప: ది రైజ్‌’ కలెక్షన్ల వర్షం కురిపించింది. ఐదు భాషల్లోని థియేట్రికల్ రైట్స్, శాటిలైట్, డబ్బింగ్, డిజిటల్ రైట్స్ ఇలా అన్ని కలిపి దాదాపు రూ.160 కోట్ల వ్యాపారం జరిగిందని అంచనా.
    సెప్టెంబర్ 21 , 2024
    <strong>Devara Promotions: దేవర ప్రమోషన్స్‌ సరైన దారిలో వెళ్లడం లేదా? టాలీవుడ్‌ను నిర్లక్ష్యం చేస్తున్నారా?</strong>
    Devara Promotions: దేవర ప్రమోషన్స్‌ సరైన దారిలో వెళ్లడం లేదా? టాలీవుడ్‌ను నిర్లక్ష్యం చేస్తున్నారా?
    మ్యాన్‌ ఆఫ్‌ మాసెస్‌ తారక్‌ హీరోగా, స్టార్‌ డైరెక్టర్‌ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన 'దేవర'పై పాన్‌ ఇండియా స్థాయిలో బజ్‌ ఏర్పడింది. 'ఆర్‌ఆర్‌ఆర్‌' వంటి గ్లోబల్‌ హిట్‌ తర్వాత తారక్‌ నటించిన మూవీ కావడంతో తారక్‌ ఫ్యాన్స్‌తో పాటు సినీ లవర్స్‌ కూడా ‘దేవర’ కోసం తెగ ఎదురుచూస్తున్నారు. సెప్టెంబర్‌ 27న ఈ చిత్రం రిలీజ్‌ కానుండటంతో దేవర టీమ్‌ మూవీ ప్రమోషన్స్‌తో బిజీ బిజీగా గడుపుతోంది. అయితే నార్త్‌పైనే తారక్‌ &amp; కో ఫోకస్‌ పెట్టడంతో తెలుగు ఆడియన్స్‌లో అసంతృప్తికి కారణమవుతోంది. దేవర నుంచి ఇప్పటివరకూ వచ్చిన ఏ ప్రమోషన్ ఈవెంట్‌ అయినా ఒక్కటీ కూడా తెలుగు రాష్ట్రాల నుంచి రాలేదు. దీంతో టాలీవుడ్‌ను నిర్లక్ష్యం చేస్తూ దేవర టీమ్ తప్పుచేస్తోందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.&nbsp; చెన్నై ప్రమోషన్స్‌పై ట్రోల్స్‌ పాన్​ ఇండియా స్టార్​​ ఎన్టీఆర్​​ హీరోగా స్టార్​​ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'దేవర'. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా చిత్ర యూనిట్‌ మంగళవారం (సెప్టెంబర్‌ 17) చెన్నైలో ల్యాండ్‌ అయ్యింది. ఈ సందర్భంగా నిర్వహించిన ఈవెంట్‌లో తారక్‌తో పాటు హీరోయిన్‌ జాన్వీ కపూర్‌, డైరెక్టర్‌ కొరటాల శివ, సంగీత దర్శకుడు అనిరుధ్‌, తమిళ నటుడు కలైయరసన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తారక్‌ మాట్లాడుతూ తమిళ దర్శకుడు వెట్రిమారన్‌తో సినిమా చేయాలని ఉందని తన మనసులో మాట పంచుకున్నారు. ఇది తమిళ ఆడియన్స్‌ను ఎంతగానో ఆకట్టుకున్నప్పటికీ తెలుగు సినిమా లవర్స్‌ మాత్రం ఫీలవుతున్నారు. తారక్‌ వంటి స్టార్‌ హీరో తనతో సినిమా చేయమని ఓ తమిళ డైరెక్టర్‌ను రిక్వెస్ట్‌ చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. తారక్‌ తన స్థాయిని తానే తగ్గించుకుంటున్నారని ట్రోల్స్‌ చేస్తున్నారు.&nbsp; కపిల్ శర్మ షోలో దేవర టీమ్‌! దేవర టీమ్‌ ముంబయిలోనూ గత కొన్ని రోజులుగా వరుస ప్రమోషన్స్‌ నిర్వహిస్తూ సినిమాపై హైప్‌ పెంచే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా దేశంలోనే ఎంతో పాపులర్ అయిన ‘కపిల్‌ శర్మ సీజన్‌ 2’ షోలో తారక్‌ పాల్గొన్నాడు. బాలీవుడ్‌లో ఎంత పెద్ద తోపు హీరో అయిన ‘కపిల్ శర్మ షో’లో పాల్గొనాల్సిందే. ఆ షోకు ప్రాంతాలకు అతీతంగా ఫ్యాన్స్‌ ఉన్నారు. దీంతో ఆ షోకు వెళ్తే తమ చిత్రాలకు కావాల్సినంత ప్రమోషన్స్ వస్తాయని బాలీవుడ్ స్టార్స్ భావిస్తుంటారు. 'ఆర్‌ఆర్‌ఆర్‌' ప్రమోషన్స్‌ సమయంలోనూ రాజమౌళి, తారక్‌, రామ్‌చరణ్‌ ఈ షోలో పాల్గొని సందడి చేశారు. ఈ క్రమంలోనే తాజాగా తారక్‌ మరోమారు దేవర కోసం ఆ షోలో అడుగుపెట్టాడు. ఇందుకు సంబంధించిన ప్రోమో రిలీజై ఆకట్టుకుంటోంది. ఈ షోలో తారక్‌తో పాటు జాన్వీ కపూర్‌, అలియా&nbsp; భట్‌, సైఫ్‌ అలీఖాన్‌ తదితురులు పాల్గొన్నారు. టీమ్ ఇండియా కెప్టెన్‌ రోహిత్ శర్మ &amp; కో కూడా ప్రోమోలో కనిపించడం గమనార్హం. ఈ ఎపిసోడ్‌ సెప్టెంబర్‌ 21న రాత్రి 8 గం.లకు నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌లోకి రానుంది. https://twitter.com/NetflixIndia/status/1834826983017976063 హిందీ బిగ్‌బాస్‌ 18లో తారక్‌? హిందీలో బిగ్‌ బాగ్‌&nbsp; షోకు చాలా పాపులారిటీ ఉంది. త్వరలోనే సల్మాన్‌ ఖాన్‌ హోస్ట్‌గా బిగ్‌బాస్‌ హిందీ సీజన్‌ 18 ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో దేవర టీమ్‌ బిగ్‌బాస్‌కు వెళ్లి తమ సినిమాను ప్రమోట్‌ చేసుకోనున్నట్లు స్ట్రాంగ్‌ బజ్‌ వినిపిస్తోంది. దీనిపై దేవర టీమ్‌ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అయితే నార్త్‌లో సినిమా ప్రమోషన్స్‌కు ఏ చిన్న అవకాశం దొరికిన తారక్‌ &amp; కో ఏమాత్రం వదులుకోవడం లేదని దీన్ని బట్టి అర్థమవుతోంది. ఇదిలా ఉంటే అక్టోబర్‌ 4 నుంచి బిగ్‌బాస్‌ 18 స్ట్రీమింగ్‌ కానున్నట్లు తెలుస్తోంది. అప్పటికే దేవర రిలీజై ఉంటుంది. మరి దేవర టీమ్‌ హిందీ బిగ్‌బాస్‌లోకి వెళ్తుందో లేదో చూడాలి.&nbsp; యానిమల్‌ డైరెక్టర్‌తో ఇంటర్యూ దేవర టీమ్‌ను యానిమల్‌ డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగాతో ఇటీవల ఇంటర్యూ చేశారు. ఇందులో తారక్‌తో పాటు డైరెక్టర్‌ కొరటాల శివ, సైఫ్‌ అలీఖాన్‌, జాన్వీ కపూర్‌ పాల్గొన్నారు. ఈ చిట్‌ చాట్‌ చాలా ఫన్నీగా సాగింది. ఇందులో సందీప్‌ పలు ఆసక్తికర ప్రశ్నలను దేవర టీమ్‌కు సంధించారు. దానికి తనదైన శైలిలో జాన్వీ, తారక్‌ బదులిచ్చారు. తారక్‌ మాట్లాడుతూ దేవర యాక్షన్‌ డ్రామా అని, మాస్‌ ఎలిమెంట్స్ ప్రేక్షకుల్ని ఉర్రూతలూగిస్తుందని చెప్పారు. మరోవైపు చాలా సంవత్సరాలుగా తారక్‌, నేను మంచి స్నేహితులమని శివ కొరటాల తమ బాండింగ్‌ గురించి చెప్పారు. 35 రోజులు అండర్‌ వాటర్‌ సీక్వెన్స్‌ చేసినట్లు ఎన్టీఆర్‌ చెప్పగా, ‘దేవర’ అందరి కెరీర్‌లో బెస్ట్‌ మూవీ అవుతుందని జాన్వీ అన్నారు. ఈ సినిమా రన్‌ టైమ్‌ పై సందీప్‌ సరదాగా కామెంట్‌ చేశారు. దానికి తారక్‌ యానిమల్‌ రన్‌ టైమ్‌ ఎంత అని అడగగా 3 గంటల 24 నిమిషాలని నవ్వుతూ సందీప్‌ రెడ్డి వంగా చెప్పారు. అయితే సందీప్‌ రెడ్డి వంగా తెలుగు డైరెక్టర్ అయినప్పటికీ ఇంటర్యూలో అంతా ఇంగ్లీషులో సాగడంతో తెలుగు ప్రేక్షకులు ఓన్‌ చేసుకోలేకపోతున్నారు. పూర్తి ఇంటర్యూ కోసం కింద ఇచ్చిన లింక్‌పై క్లిక్‌ చేయండి.&nbsp; https://www.youtube.com/watch?v=EzNPma48bVM మరి టాలీవుడ్‌ ప్రమోషన్స్‌ ఎక్కడా? గత కొన్ని రోజులుగా ‘దేవర’ టీమ్‌ ఫోకస్‌ మెుత్తం బాలీవుడ్ పైనే ఉంది. అక్కడ సినిమాను బాగా ప్రమోట్‌ చేయగలిగితే వసూళ్లు గణనీయంగా ఉంటాయని టీమ్‌ భావిస్తూ ఉండవచ్చు. ఈ నేపథ్యంలో సినిమాకు కీలకమైన ట్రైలర్‌ను కూడా ముంబయిలోనే రిలీజ్‌ చేశారు. అదే సమయంలో తెలుగులోనూ పార్లర్‌గా దేవర ప్రమోషన్స్‌ నిర్వహిస్తే బాగుండేదన్న కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. తెలుగులో తారక్‌ స్టార్‌ హీరో ఇమేజ్‌ ఉన్న నేపథ్యంలో ఎలాగైన మంచి వసూళ్లు వస్తాయన్న ధీమాలో చిత్ర యూనిట్‌ ఉన్నట్లు తెలుస్తోంది. నార్త్‌లో నిర్వహించిన ప్రమోషన్స్‌తో పోలిస్తే తెలుగులో పెద్దగా ప్లాన్‌ చేస్తున్నట్లు కూడా కనిపించడం లేదు. యంగ్‌ హీరోలు సిద్ధు, విశ్వక్‌లతో ఎన్టీఆర్‌, కొరటాల ఇంటర్యూను ప్లాన్‌ చేయడం అభిమానులకు ఆశ్చర్యం కలిగిస్తోంది. యంగ్ హీరోలతో ఇంటర్వ్యూ చూడడానికి ఎంటర్‌టైనింగ్‌గా కనిపించినా ఎన్టీఆర్‌కి ఉన్న రేంజ్ ఏంటి? వారితో ఇంటర్వ్యూ ఏంటి? అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మహేశ్‌, ప్రభాస్‌, రాజమౌళితో ఉన్న సన్నిహిత సంబంధాలను ఉపయోగించుకొని వారిలో ఎవరితోనైనా ఇంటర్యూ నిర్వహించి ఉంటే తెలుగులో బాగా ప్లస్ అయ్యేదని సినీ వర్గాలు చెబుతున్నాయి. ‘సలార్‌’ టీమ్‌తో రాజమౌళి చేసిన ఇంటర్యూ గురించి గుర్తుచేస్తున్నాయి. ఇప్పటివరకైతే ప్రమోషన్స్‌లో బాలీవుడ్‌పై పెట్టిన శ్రద్ధ టాలీవుడ్‌పై కనిపించడం లేదన్న విమర్శలు గట్టిగానే వినిపిస్తున్నాయి. దీన్ని దేవర టీమ్ ఎలా కవర్‌ చేసుకుంటుందో చూడాలి.&nbsp;
    సెప్టెంబర్ 18 , 2024
    <strong>Telugu Movies 2024: ‘కల్కి’, ‘హనుమాన్‌’ సరసన ‘ఆయ్‌’, ‘కమిటీ కుర్రోళ్లు’.. ఇది మామూలు సక్సెస్‌ కాదు భయ్యా!&nbsp;</strong>
    Telugu Movies 2024: ‘కల్కి’, ‘హనుమాన్‌’ సరసన ‘ఆయ్‌’, ‘కమిటీ కుర్రోళ్లు’.. ఇది మామూలు సక్సెస్‌ కాదు భయ్యా!&nbsp;
    2024 సంవత్సరం టాలీవుడ్‌కు బాగా కలిసొచ్చింది. ఈ ఏడాదిలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ప్రభాస్‌ నటించిన ‘కల్కి 2898 ఏడీ’ నిలిచింది. సంక్రాంతి కానుకగా వచ్చిన ‘హనుమాన్‌’ మూవీ సైతం జాతీయ స్థాయిలో సత్తా చాటి మంచి వసూళ్లు సాధించింది. అయితే ఈ రెండు చిత్రాలు భారీ బడ్జెట్‌తో రూపొందాయి. కానీ తక్కువ బడ్జెట్‌తో రూపొందిన టిల్లు స్క్వేర్‌, కమిటీ కుర్రోళ్లు, ఆయ్‌ వంటి చిత్రాలు సైతం కలెక్షన్ల పరంగా ఆ రెండు చిత్రాలతో చేరి సమానంగా నిలిచాయి. పెట్టిన ఖర్చుకు దాదాపు మూడింతలు రికవరి సాధించి సత్తా చాటాయి. బడ్జెట్‌ - కలెక్షన్స్‌ మధ్య భారీ వ్యత్యాసం కలిగిన టాప్‌ 5 తెలుగు చిత్రాలుగా నిలిచాయి. ఆ వివరాలేంటో ఈ ప్రత్యేక కథనంలో పరిశీలిద్దాం.  కమిటి కుర్రోళ్లు (Committee Kurrollu) నిహారిక కొణిదెల నిర్మించిన తొలి సినిమా ‘కమిటీ కుర్రోళ్లు’. 11 మంది కొత్త హీరోలతో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 10న విడుదలై మంచి టాక్‌ తెచ్చుకుంది. వరల్డ్‌ వైడ్‌గా రూ.17.60 కోట్లు కొల్లగొట్టింది. ఈ సినిమా నిర్మాణానికి రూ.6 కోట్లు మాత్రమే ఖర్చు అయ్యింది. బడ్జెట్‌తో పోలిస్తే మూడింతలు వసూళ్లు సాధించి ‘కమిటీ కుర్రోళ్లు’ మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. ప్రస్తుతం ఈటీవీ విన్‌ వేదికగా ఈ మూవీ స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. అక్కడ కూడా ఈ మూవీకి మంచి రెస్పాన్స్‌ వస్తున్నట్లు ఓటీటీ వర్గాలు తెలిపాయి.&nbsp; ఆయ్‌ (Aay) నార్నే నితిన్, నయన్ సారిక హీరోయిన్లుగా నటించిన రీసెంట్‌ చిత్రం 'ఆయ్‌' (Aay). అంజి కె. మణిపుత్ర దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఆగస్టు 15న రిలీజై హిట్‌ టాక్‌ సొంతం చేసుకుంది. ‘మిస్టర్‌ బచ్చన్‌’, ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ వంటి స్టార్ హీరోల చిత్రాలకు కంటే బెటర్‌గా వసూళ్లు సాధించింది. ఓవరాల్‌గా రూ.14.10 కోట్లు తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమాకు రూ.6-8 కోట్లు ఖర్చు అయినట్లు సమాచారం. ఓటీటీ రైట్స్‌ కూడా కలుపుకుంటే ‘ఆయ్‌’ దాదాపు మూడింతలు లాభాలు సాధించినట్లు చిత్ర వర్గాలు పేర్కొన్నాయి.&nbsp; కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD) రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ‘కల్కి 2898 ఏడీ’ చిత్రం ఇండియన్‌ బాక్సాఫీస్‌ను షేక్‌ చేసింది. వరల్డ్‌ వైడ్‌గా రూ.1200-1300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. మైథాలజీ &amp; ఫ్యూచరిక్‌ జానర్‌లో రూపొందిన ఈ చిత్రానికి దాదాపు రూ.600 కోట్లు ఖర్చయ్యింది. అయితే దానికి రెట్టింపు కంటే ఎక్కువ వసూళ్లు సాధించి కల్కి అందరి చేత ప్రశంసలు అందుకుంది. పాన్ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ మరోమారు తన సత్తా ఏంటో బాక్సాఫీస్‌ వద్ద నిరూపించుకున్నాడు. కాగా, ఈ సినిమాలో ప్రభాస్‌తో పాటు అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌, దీపికా పదుకొనే వంటి స్టార్స్‌ నటించారు. విజయ్‌ దేవరకొండ, దుల్కర్‌ సల్మాన్‌, ఎస్‌.ఎస్‌. రాజమౌళి, రామ్‌గోపాల్‌ వర్మ వంటివారు స్పెషల్‌ క్యామియోలతో అలరించారు.&nbsp; టిల్లు స్క్వేర్‌ (Tillu Square) సిద్ధూ జొన్నలగడ్డ, అనుపమా పరమేశ్వరన్‌ జంటగా నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్‌’ (Tillu Square). ఈ ఏడాదిలో మార్చిలో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ప్రపంచవ్యాప్తంగా రూ.135 కోట్లకు పైగా కొల్లగొట్టింది. ప్రముఖ నిర్మాత నాగదేవర సూర్యవంశీ ఈ సినిమా నిర్మాణానికి దాదాపు రూ.40 కోట్లు ఖర్చు చేశారు. దానికి మూడింతలకు పైగా టిల్లు స్క్వేర్‌ వసూలు చేయడం విశేషం. ఈ సినిమా ద్వారా సిద్దు జొన్నల గడ్డ తొలిసారి రూ.100 కోట్ల క్లబ్‌లో చేరాడు.&nbsp; హనుమాన్‌ (Hanuman) తేజసజ్జ హీరోగా టాలెంటెడ్‌ డైరెక్టర్ ప్రశాంత్‌ వర్మ తెరకెక్కించిన ‘హనుమాన్‌’ దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజైన ఈ చిత్రం ఎవరూ ఊహించని విధంగా రూ.350 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. వాస్తవానికి ఈ సినిమా బడ్జెట్‌ రూ.40 కోట్లు మాత్రమే. కానీ పెట్టిన ఖర్చుకు దాదాపు 9 రెట్లు వసూళ్లు సాధించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. దీంతో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ పేరు దేశ వ్యాప్తంగా మార్మోగింది. హనుమాన్‌ క్రేజ్‌తో ప్రశాంత్‌ స్టార్‌ డైరెక్టర్‌గా మారిపోయారు. నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తేజతో ఓ సినిమాను సైతం అనౌన్స్‌ చేశాడు. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కనుంది. దాని తర్వాత హనుమాన్‌ సీక్వెల్‌ ‘జై హనుమాన్‌’పై ప్రశాంత్‌ వర్మ ఫోకస్‌ పెట్టనున్నారు.&nbsp;
    సెప్టెంబర్ 17 , 2024
    <strong>Devara: దేవర ఇంటర్వ్యూ ప్రోమో చూశారా? తారక్‌, జాన్వీ పంచ్‌లు.. భయంగా ఉందన్న సందీప్‌ రెడ్డి వంగా!</strong>
    Devara: దేవర ఇంటర్వ్యూ ప్రోమో చూశారా? తారక్‌, జాన్వీ పంచ్‌లు.. భయంగా ఉందన్న సందీప్‌ రెడ్డి వంగా!
    జూ.ఎన్టీఆర్‌ (NTR) హీరోగా కొరటాల శివ (Koratala siva) దర్శకత్వం వహించిన చిత్రం ‘దేవర’ (Devara) జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం సెప్టెంబర్‌ 27న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్స్‌లో బిజీ అయింది. ఇటీవల ముంబైలో ట్రైలర్‌ను విడుదల చేశారు. అనంతరం ‘యానిమల్‌’ దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగాతో (Sandeep Reddy Vanga) ‘దేవర’ టీమ్‌ చిట్‌చాట్‌ నిర్వహించింది. దానికి సంబంధించిన లేటెస్ట్‌ ప్రోమో తాజాగా విడుదలైంది. సందీప్‌ అడిగిన ప్రశ్నలకు తారక్‌ తనదైన శైలిలో జవాబిచ్చారు. ఫన్నీ చిట్‌చాట్‌.. యానిమల్‌ దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగాతో 'దేవర' టీమ్‌ చిట్‌ చాట్‌ నిర్వహించింది. దానికి సంబంధించిన లేటెస్ట్‌ ప్రోమోను చిత్ర యూనిట్‌ రిలీజ్‌ చేసింది. ఇందులో సందీప్‌ రెడ్డి వంగాతో పాటు తారక్‌, జాన్వీ కపూర్‌, సైఫ్‌ అలీఖాన్‌, కొరటాల శివ పాల్గొన్నారు. ఇందులో సందీప్ రెడ్డి వంగా అడిగిన ప్రశ్నలు చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి. ‘కచ్చితంగా చాలా భయంగా ఉంటుంది. నేను చాలా అడగాలని అనుకుంటున్నాను. ఎవరు స్టార్ట్ చేస్తారు’ అని సందీప్ రెడ్డి డైలాగ్‌తో ప్రోమో ప్రారంభమైంది. ఈ క్రమంలో తారక్‌ మాట్లాడుతూ దేవర యాక్షన్‌ డ్రామా అని, మాస్‌ ఎలిమెంట్స్ ప్రేక్షకుల్ని ఉర్రూతలూగిస్తుందని చెప్పారు. మరోవైపు చాలా సంవత్సరాలుగా తారక్‌, నేను మంచి స్నేహితులమని శివ కొరటాల తమ బాండింగ్‌ గురించి చెప్పారు. 35 రోజులు అండర్‌ వాటర్‌ సీక్వెన్స్‌ చేసినట్లు ఎన్టీఆర్‌ చెప్పగా, ‘దేవర’ అందరి కెరీర్‌లో బెస్ట్‌ మూవీ అవుతుందని జాన్వీ అన్నారు. ఆపై మీరు సినిమా కథ అంతా చెప్పేయమంటున్నారు అని జాన్వీ సందీప్‌పై పంచ్‌లు విసిరింది. ఈ సినిమా రన్‌ టైమ్‌ పై సందీప్‌ సరదాగా కామెంట్‌ చేశారు. దానికి తారక్‌ యానిమల్‌ రన్‌ టైమ్‌ ఎంత అని అడగగా 3 గంటల 24 నిమిషాలని నవ్వుతూ సందీప్‌ రెడ్డి వంగా చెప్పారు. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్‌ అవుతోంది. ఇక ఈ పూర్తి ఇంటర్యూ ఆదివారం నాడు రానుంది.&nbsp; https://twitter.com/i/status/1834829086482698288 'దేవర' ప్రీ రిలీజ్‌కు మహేష్‌బాబు? దేవర ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు మహేష్‌ బాబు రానున్నట్లు నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది. దర్శకుడు కొరటాల శివ ఈవెంట్‌కు రావాలని మహేష్‌ను కోరినట్లు టాక్ వినిపిస్తోంది. అయితే, ఈ విషయంపై మహేశ్ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని సమాచారం. త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. మహేష్‌తో దర్శకుడు కొరటాలకు మంచి అనుబంధం ఉంది. శ్రీమంతుడు, భరత్ అనే నేను చిత్రాలతో కొరటాల అతడికి మంచి విజయాలను అందించాడు. దీంతో మహేష్‌ పక్కాగా వచ్చే అవకాశముందని సినీ వర్గాలు అంటున్నాయి. అదే జరిగితే 'దేవర'పై అంచనాలు మరింత పెరగడం ఖాయమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.&nbsp; హైదరాబాద్‌లో ఈవెంట్‌ ‘దేవర’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‍ను సెప్టెంబర్ 22న నిర్వహించాలని మేకర్స్ ఆలోచిస్తున్నట్టు&nbsp; సమాచారం. హైదరాబాద్‍లోనే ఈ ఈవెంట్ జరగనుంది. ముందుగా ఆంధ్రప్రదేశ్‍లో ఈవెంట్ చేయాలని అనుకున్నా.. చివరికి హైదరాబాద్‍నే ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. కాగా, దేవర చిత్రం నుంచి ఈ వారమే ట్రైలర్‌ రిలీజైంది. యాక్షన్ ప్యాక్డ్‌గా ఉన్న ఈ ట్రైలర్ పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకుంది. అంచనాలను అందుకోవడంతో సినిమాపై క్రేజ్ మరింత పెరిగింది. ఎన్టీఆర్ యాక్షన్, కొరటాల టేకింగ్ ట్రైలర్‌లో ఆకట్టుకున్నాయి. అనిరుధ్ రవిచందర్ ఇచ్చిన బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ కూడా మెప్పించింది. సందీప్‌ మూవీలో తారక్‌! ప్రభాస్‌ హీరోగా సందీప్‌రెడ్డి వంగా డైరెక్షన్‌లో రూపొందనున్న ‘స్పిరిట్‌’ (Spirit)కు సంబంధించి ఓ వార్త నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. ఈ మూవీలో తారక్‌ ప్రతినాయకుడి పాత్రలో కనిపిస్తాడని నెట్టింట ప్రచారం జరుగుతోంది. స్పిరిట్‌లో విలన్‌గా నటించాలని తారక్‌ను సందీప్‌ కోరినట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. బాలీవుడ్‌ స్టార్‌ హీరో హృతిక్‌ రోషన్‌ నటిస్తున్న ‘వార్‌ 2’ చిత్రంలో తారక్‌ నెగిటివ్ షేడ్స్‌ ఉన్న రోల్‌లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు తాను విలన్‌గా ఎంత ప్రభావం చూపగలడో ‘జై లవకుశ’ చిత్రం ద్వారా తారక్‌ ఇప్పటికే నిరూపించాడు. ఇందులో ఎన్టీఆర్‌ త్రిపాత్రిభినయం చేయగా అందులో ఓ పాత్ర పూర్తిగా నెగిటివ్‌ షేడ్స్‌లో ఉంటుంది. దీంతో గ్లోబల్‌ స్థాయిలో తెరకెక్కనున్న ‘స్పిరిట్‌’ మూవీలో తారక్‌ విలన్‌గా చేస్తే బాగుటుందని సందీప్‌ రెడ్డి వంగా భావించినట్లు నెట్టింట టాక్‌ వినిపిస్తోంది. ఇందుకు తారక్ అంగీకరిస్తే ‘స్పిరిట్‌’పై అంచనాలు అమాంతం పెరగటం ఖాయమని అంటున్నారు.&nbsp;
    సెప్టెంబర్ 14 , 2024
    <strong>OTT Releases This Week Telugu: సెప్టెంబర్‌ ఫస్ట్‌ వీక్‌లో రిలీజయ్యే చిత్రాలు, సిరీస్‌లు ఇవే!</strong>
    OTT Releases This Week Telugu: సెప్టెంబర్‌ ఫస్ట్‌ వీక్‌లో రిలీజయ్యే చిత్రాలు, సిరీస్‌లు ఇవే!
    ఆగస్టులో వరుసగా చిత్రాలు రిలీజై సినీ ప్రియులను ఎంటర్‌టైన్‌ చేశాయి. ఇప్పుడు సెప్టెంబర్‌లోనూ అదే జోష్‌లో ప్రేక్షకులకు వినోదాన్ని పంచేందుకు కొత్త సినిమాలు రాబోతున్నాయి. ఈ నెల ఫస్ట్‌ వీక్‌లో ఓ పాన్‌ ఇండియా చిత్రంతో పాటు పలు చిన్న సినిమాలు థియేటర్లలోకి సందడి చేయనున్నాయి. అటు ఓటీటీలోనూ ఆసక్తికరమైన చిత్రాలు, సిరీస్‌లు రిలీజ్‌కు సిద్ధమయ్యాయి. ఆ విశేషాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.&nbsp; థియేటర్లలో రిలీజయ్యే చిత్రాలు ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌ తమిళ స్టార్‌ హీరో విజయ్‌ (Vijay) నటించిన లేటెస్ట్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌’ (The Greatest of All Time). వెంకట్‌ ప్రభు దర్శకుడు. మీనాక్షి చౌదరి కథానాయిక. స్నేహ, లైలా, ప్రశాంత్‌, ప్రభుదేవా తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం ‘డీ-ఏజింగ్‌ టెక్నాలజీ’తో రానుంది. ఈ సాంకేతికతతో విజయ్‌ని పాతికేళ్ల కుర్రాడిలా చూపించనున్నారు. హాలీవుడ్‌ చిత్రాలకు పనిచేసిన సాంకేతిక నిపుణులు ‘ది గోట్‌’కు వర్క్‌ చేయడం విశేషం. సెప్టెంబర్‌ 5న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.&nbsp; 35 చిన్న కథ కాదు నివేదా థామస్‌ (Nivetha Thomas), విశ్వదేవ్‌ ఆర్‌, ప్రియదర్శి (Priyadarshi) ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం ‘35 చిన్న కథ కాదు’ (35 Chinna Katha Kaadu). నందకిశోర్‌ ఇమాని దర్శకత్వం వహించారు. ప్రముఖ నటుడు రానా ఈ చిత్రాన్ని నిర్మించారు. తెలుగు, తమిళ, మలయాళంలలో సెప్టెంబర్‌ 6న ఈ మూవీ విడుదల కానుంది. ప్రముఖ నటి నివేదా ఇందులో తొలిసారి తల్లి పాత్ర పోషించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌ సినిమాపై అంచనాలు పెంచింది.&nbsp; జనక అయితే గనక యంగ్ హీరో సుహాస్‌ వరుస విజయాలతో దూసుకెళ్తున్నాడు. ఈ క్రమంగా అతడు నటించిన లేటెస్ట్‌ చిత్రం ‘జనక అయితే గనక’ (Janaka Aithe Ganaka). సందీప్‌రెడ్డి బండ్ల తెరకెక్కించిన ఈ మూవీలో వెన్నెల కిశోర్‌, రాజేంద్ర ప్రసాద్‌ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రం సెప్టెంబరు 7న ప్రేక్షకుల ముందుకురానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంది.&nbsp; ఉరుకు పటేలా తేజస్‌ కంచెర్ల ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం 'ఉరుకు పటేలా' (Uruku Patela). వివేక్ రెడ్డి దర్శకుడు. ఖుష్బూ చౌదరి కీలక పాత్రలో కనిపించనున్నారు. సెప్టెంబర్‌ 7న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. పల్లెటూరి నేపథ్యంలో ఈ సినిమా ఉండనున్నట్లు రిసెంట్‌గా రిలీజైన ట్రైలర్‌ను బట్టి తెలుస్తోంది.&nbsp; ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు TitleCategoryLanguagePlatformRelease DateThe Perfect CoupleSeriesEnglishNetflixSep 05Apollo 13: SurvicalDocumentaryEnglishNetflixSep 05Bad Boys: Ride or DieMovieEnglishNetflixSep 06Adios AmigoMovieMalayalamNetflixSep 06Sector 36MovieHindiNetflixSep 13Tanav Season 2SeriesHindiSonyLIVSep 06ThalaivanMovieMalayalamSonyLIVSep 10English TeacherMovieEnglishHotstar&nbsp;Sep 03KillMovieHindiHotstar&nbsp;Sep 06Brick ToonsMovieEnglishHotstar&nbsp;Sep 04The Fall GuyMovieEnglishJio CinemaSep 03Fight Night: The Million Dollar HeistSeriesEnglishJio CinemaSep 06
    సెప్టెంబర్ 02 , 2024
    <strong>Sobhita Dhulipala: దేశంలో శోభిత ధూళిపాళ క్రేజ్‌ మాముల్గా లేదుగా.. జాన్వీ, దీపిక, మృణాల్‌ను సైతం వెనక్కి నెట్టి!</strong>
    Sobhita Dhulipala: దేశంలో శోభిత ధూళిపాళ క్రేజ్‌ మాముల్గా లేదుగా.. జాన్వీ, దీపిక, మృణాల్‌ను సైతం వెనక్కి నెట్టి!
    ప్రముఖ హీరోయిన్‌ శోభిత దూళిపాళ (Sobhita Dhulipala) పేరు గత కొన్ని రోజులుగా మార్మోగుతోంది. స్టార్‌ హీరో అక్కినేని నాగ చైతన్య (Akkineni Naga Chaitanya)తో నిశ్చితార్థం జరిగినప్పటి నుంచి ఈ అమ్మడి పేరు సోషల్‌ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. స్టార్‌ హీరోయిన్‌ సమంతకు విడాకులు ఇచ్చిన చైతూను శోభిత పెళ్లి చేసుకోనుండటంతో ఒక్కసారిగా ఈ భామపై అటెన్షన్ ఏర్పడింది. అక్కినేని ఫ్యాన్స్‌ శోభిత రాకను సమర్థిస్తుంటే సామ్‌ అభిమానులు మాత్రం నెట్టింట విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఇదిలా ఉంటే దేశంలో అత్యంత ప్రజాధరణ పొందిన సెలబ్రిటీల జాబితాలో శోభిత రెండో స్థానంలో నిలిచి సత్తా చాటింది. స్టార్‌ హీరోలు, హీరోయిన్స్‌ను వెనక్కి నెట్టి మరి ఈ ఫీట్‌ సాధించింది. ఆ విశేషాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.&nbsp; శోభితానా మజాకా..! ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్‌ పోర్టల్ ఐఎండీబీ (IMDb) ఎక్కువ ప్రజాదరణ పొందిన నటీనటుల జాబితాను తాజాగా విడుదల చేసింది. ఈ వారం తమ వెబ్‌సైట్‌లో ఎక్కువ మంది యూజర్లు సెర్చ్ చేసిన సెలబ్రిటీల పేర్ల ఆధారంగా ఐఎండీబీ ఈ లిస్ట్‌ను రూపొందించింది. ఇందులో నటి శోభిత దూళిపాళ దేశంలోనే టాప్‌ 2లో నిలిచారు. తొలిస్థానంలో బాలీవుడ్‌ నటి శార్వరీ (Sharvari) నిలిచింది. శోభిత తర్వాతి స్థానంలో బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ ఖాన్‌ (Shah Rukh Khan) నిలవడం గమనార్హం. ఇక దీపిక పదుకొణే (Deepika Padukone), జాన్వీ కపూర్‌ (Janhvi Kapoor), కాజోల్‌ (Kajol) 4, 5, 6 స్థానాల్లో నిలిచారు. బాలీవుడ్‌ నటుడు లక్ష్య, తమిళ స్టార్‌ హీరో విజయ్‌ సేతుపతి (Vijay Sethupathi), హీరోయిన్‌ మృణాల్‌ ఠాకూర్‌ (Mrunal Thakur), ఐశ్వర్యరాయ్‌ (Aishwarya Rai) తదుపరి స్థానాల్లో నిలిచారు. అటు శ్వేత బసు ప్రసాద్‌ 14, దివ్య ఖోస్లా కుమార్‌ 18, ఫహాద్‌ ఫాజిల్‌ 25, విజయ్‌ 27, విక్రాంత్‌ మెస్సీ 35, త్రిష 37, జాన్‌ అబ్రహం 39, కమల్‌ హాసన్‌ 50 స్థానాల్లో నిలిచినట్లు ఐఎండీబీ తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో వెల్లడించింది.&nbsp; View this post on Instagram A post shared by IMDb India (@imdb_in) పాపులారిటీకి కారణమిదే! నటుడు నాగ చైతన్యతో శోభితకు ఎంగేజ్‌మెంట్‌ జరిగిన సంగతి తెలిసిందే. అక్కినేని నాగార్జున ఈ విషయాన్ని తొలిసారి పంచుకోవడంతో శోభిత పేరు ఒక్కసారిగా వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలో ఎంతోమంది నెటిజన్లు ఆమె గురించి తెలుసుకునేందుకు తెగ సెర్చ్‌ చేశారు. అక్కినేని కుటుంబంలో భాగం కాబోతున్న ఈ భామ వ్యక్తిగత, సినిమా నేపథ్యం గురించి కనుక్కొనే ప్రయత్నం చేశారు. దీంతో ఆమె ఈ వారం ఇండియన్‌ పాపులర్‌ సెలబ్రిటీగా మారిపోయింది. గతంలో ఎప్పుడు లేని విధంగా ఐఎండీబీ పాపులర్‌ సెలబ్రిటీల జాబితాలో రెండో స్థానం దక్కించుకుంది. చైతూతో ఎంగేజ్‌మెంట్‌ శోభితాకు బాగా కలిసొచ్చిందని నెటిజన్లు భావిస్తున్నారు. నిశ్చితార్థంపై శోభిత స్పందన ఇదే! టాలీవుడ్‌ హీరో నాగ చైతన్య (Naga Chaitanya)తో నిశ్చితార్థం జరిగిన ఫొటోలను శోభిత షేర్‌ చేస్తూ ఆనందం వ్యక్తం చేసింది. ‘మన పరిచయం ఎలా మొదలైనా? ప్రేమలో మన హృదయాలు కలిసిపోయాయి’ అని రాసుకొచ్చింది. దీన్ని నాగ చైతన్య రీ పోస్ట్‌ చేశారు. వాస్తవానికి&nbsp; చై-శోభిత డేటింగ్‌లో ఉన్నట్లు గత రెండేళ్ల నుంచి సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది. వీరిద్దరి హాలీడే ట్రిప్‌నకు సంబంధించిన ఫొటోలు సైతం పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. వీరి జోడి బాగుందంటూ అక్కినేని అభిమానులు పోస్టులు సైతం పెట్టారు. దీంతో చై-శోభిత కచ్చితంగా పెళ్లి పీటలు ఎక్కుతారని అంతా ఊహించారు. అనుకున్నట్లుగానే బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా వీరి నిశ్చితార్థం జరిగింది.&nbsp; View this post on Instagram A post shared by Sobhita (@sobhitad) శోభితా గురించి ఈ విషయాలు తెలుసా! శోభితా దూళిపాళ్ల ఏపీలోని తెనాలిలో జన్మించింది. 2013లో ఫెమినా మిస్‌ ఇండియా టైటిల్‌ విన్నర్‌గా నిలిచింది. బాలీవుడ్‌లో 2016లో విడుదలైన రామన్‌ రాఘవన్‌ 2.0 చిత్రం ద్వారా శోభిత సినీ రంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత ‘చెఫ్‌’, ‘కళాకంది’ వంటి బాలీవుడ్ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. 2018లో వచ్చి గూఢచారి చిత్రం ద్వారా శోభితా టాలీవుడ్‌కు పరిచయమైంది. తన అంద చందాలతో తెలుగు యూత్‌ ఆడియన్స్‌ను ఆకర్షించింది. ఆ తర్వాత మేజర్‌, పొన్నియన్‌ సెల్వన్ 1 &amp; 2 చిత్రాల్లో కీలక పాత్రలు పోషించి ఆకట్టుకుంది. ఇందులో ఆమె నటనకు ప్రశంసలు దక్కాయి. ఇటీవల 'మంకీ మాన్‌' అనే అమెరికన్‌ ఫిల్మ్‌లోనూ శోభితా నటించింది. ప్రస్తుతం హిందీలో 'సితారా' అనే చిత్రంలో నటిస్తోంది. ఇక నాగచైతన్య ‘తండేల్‌’తో బిజీగా ఉన్నాడు. చందూ మొండేటి దర్శకత్వంలో ఇది రూపొందుతోంది.&nbsp;
    ఆగస్టు 13 , 2024
    <strong>Prabhas: సినిమాల్లోనే కాదు రియల్ లైఫ్‌లోనూ ప్రభాస్‌ హీరోనే.. అతడి హెల్పింగ్‌ నేచర్‌కు బిగ్‌ సెల్యూట్‌!</strong>
    Prabhas: సినిమాల్లోనే కాదు రియల్ లైఫ్‌లోనూ ప్రభాస్‌ హీరోనే.. అతడి హెల్పింగ్‌ నేచర్‌కు బిగ్‌ సెల్యూట్‌!
    టాలీవుడ్‌లో గొప్ప మనసున్న హీరోల్లో రెబల్‌ స్టార్ ప్రభాస్ (Prabhas) ఒకరు. రీల్‌ లైఫ్‌లోనే కాదు నిజ జీవితంలోనే తాను హీరోనేని ప్రభాస్‌ పలు సందర్భాల్లో నిరూపించుకున్నారు. కష్టాల్లో ఉన్నవారికి చేయుత అందించి మంచి మనసు చాటుకున్నారు. అందుకే జయపజయాలతో సంబంధం లేకుండా ప్రభాస్‌ను అందరూ ఇష్టపడుతుంటారు. అతడి మంచితనానికి సెల్యూట్‌ చేస్తుంటారు. ఈ క్రమంలోనే తాజాగా ప్రభాస్‌ మరోమారు తన మంచి మనసును చాటుకున్నారు. కేరళ వరద బాధితులకు భారీ ఎత్తున ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. దీంతో ప్రభాస్‌ పేరు మరోమారు మార్మోగుతోంది. రూ. 2 కోట్లు విరాళం&nbsp; కేరళలోని వయనాడ్‌ జిల్లాలో కొండచరియలు విరిగిపడి వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. వేలమంది నిరాశ్రయులుగా మారారు. ఈ నేపథ్యంలో సహాయక చర్యల కోసం హీరో ప్రభాస్‌ భారీ విరాళాన్ని ప్రకటించారు. కేరళ సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.2 కోట్లు ఇస్తున్నట్లు ప్రభాస్‌ టీమ్‌ ప్రకటించింది. దీనిపై ప్రభాస్‌ ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రియులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. టాలీవుడ్‌ నుంచి అంత మెుత్తం ప్రకటించిన హీరో ప్రభాస్‌ కావడంతో ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. ప్రభాస్‌ రీల్‌లోనే కాదు రియల్‌ లైఫ్‌లోనూ హీరో అంటూ పోస్టులు పెడుతున్నారు. అండగా సెలబ్రిటీలు! ప్రకృతి విపత్తు నుంచి వయనాడ్‌ త్వరగా కోలుకునేందుకు ప్రభాస్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులూ తమ వంతు సాయాన్ని ప్రకటించారు. ఆ విషాద ఘటనపై స్పందించిన చిరంజీవి, రామ్‌చరణ్‌ రూ.కోటి విరాళంగా ప్రకటించారు. అల్లు అర్జున్‌ రూ.25 లక్షలు, హీరో సూర్య, ఆయన భార్య జ్యోతిక, సోదరుడు కార్తి సంయుక్తంగా రూ.50 లక్షలు, నయనతార - విఘ్నేశ్‌ శివన్‌ దంపతులు రూ.20 లక్షలు కేరళ సీఎం సహాయ నిధికి అందిస్తున్నట్లు తెలిపారు. అలాగే మలయాళ నటులు మమ్ముట్టి, ఆయన తనయుడు దుల్కర్‌ సల్మాన్‌ కలిపి రూ.35 లక్షలు, ఫహాద్‌ ఫాజిల్‌ రూ.25 లక్షలు, కమల్‌ హాసన్‌ రూ. 25 లక్షలు, విక్రమ్‌ రూ.20 లక్షలు, రష్మిక రూ.10 లక్షల విరాళం ప్రకటించారు. నటుడు మోహన్‌లాల్‌ స్వయంగా సహాయక చర్యల్లో పాల్గొనడమే కాకుండా తాను వ్యవస్థాపకుడిగా ఉన్న విశ్వశాంతి ఫౌండేషన్‌ ద్వారా రూ. 3 కోట్ల విరాళం ప్రకటించారు.&nbsp; గతంలోనూ ఇలాగే.. కేరళకు ఏ కష్టం వచ్చినా హీరో ప్రభాస్‌ ఆపన్న హస్తం అందిస్తూనే ఉంటారు. 2018 కేరళ వరదల సమయంలోనూ ప్రభాస్‌ అండగా నిలిచారు. రూ.కోటి విరాళాన్ని ప్రకటించి కేరళ ప్రజలకు అండగా నిలిచారు. మరోవైపు ప్రభాస్‌ ఏటా వంద మంది విద్యార్థులకు విద్యాదానం చేస్తున్నట్లు ఆయన సన్నిహితులు తెలిపారు. ఆ విద్యార్థులకు సంబంధించి స్కూల్‌ ఫీజులను ప్రభాస్ చెల్లిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ వార్త కూడా నెట్టింట వైరల్ అవుతోంది. అన్ని దానాల్లోకి విద్యాదానం గొప్పది అని గ్రహించిన ప్రభాస్‌ ఈమేరకు తన వంతు సాయం అందిస్తున్నట్లు ఫ్యాన్స్‌ అంటున్నారు. లక్షల్లో ఫీజులు కడుతున్నా తమ హీరో ఎప్పుడు ప్రచారం చేసుకోలేదని ప్రశంసిస్తున్నారు.&nbsp; https://twitter.com/i/status/1821114197213626764 డైరెక్టర్స్‌కు భారీ విరాళం ఈ ఏడాది మేలో ‘డైరెక్టర్స్‌ డే’ సందర్భంగా వేడుకల కోసం రూ.35 లక్షలు విరాళంగా ఇచ్చి ప్రభాస్‌ గొప్ప మనసు చాటుకున్నాడు. ఈ విషయాన్ని అసోసియేషన్ సభ్యులు స్వయంగా వెల్లడించారు.&nbsp; లెజండరీ డైరెక్టర్‌ దాసరి నారాయణరావు పుట్టిన రోజును పురస్కరించుకొని ప్రతీ ఏటా మే 4న డైరెక్టర్స్‌ డేను నిర్వహిస్తుంటారు. ఈ ఏడాది కూడా ఎల్బీ స్టేడియంలో ఈ వేడుకలు నిర్వహించగా దీనికి ఆహ్వానించేందుకు డైరెక్టర్ అసోసియేషన్‌ సభ్యులు ప్రభాస్‌ ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా వేడుకలు బాగా నిర్వహించాలంటూ ప్రభాస్‌ వారికి డబ్బు అందజేశాడు. దీంతో హీరో ప్రభాస్‌పై సర్వత్రా ప్రశంసల వర్షం కురిసింది.&nbsp; ఫుల్‌ స్వింగ్‌లో ప్రభాస్‌! ప్రస్తుతం దేశంలో ఏ స్టార్‌ హీరో చేతిలో లేనన్ని పాన్‌ ఇండియా చిత్రాలు ప్రభాస్‌ లిస్ట్‌లో ఉన్నాయి. ప్రభాస్‌ ప్రాజెక్టుల విషయానికి వస్తే.. ప్రస్తుతం అతడు మారుతి దర్శకత్వంలో ‘రాజా సాబ్‌’ (Raja Saab) చిత్రం చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. తర్వాత సందీప్‌ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga)తో ఓ సినిమా చేయనున్నాడు. ఈ చిత్రానికి స్పిరిట్‌ (Spirit) అనే టైటిల్‌ ఖరారు చేశారు. వీటితో పాటు ‘సలార్‌ సీక్వెల్‌’ ఉంది. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహించే ఈ చిత్రం షూటింగ్‌ ఈ ఏడాదిలోనే ప్రారంభమయ్యే అవకాశం ఉంది. వీటితో పాటు మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతున్న ‘కన్నప్ప’లోనూ ప్రభాస్‌ శివుడి పాత్ర పోషించనున్నాడు. అలాగే హను రాఘవపూడితో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ చిత్రాలన్నీ పూర్తవ్వడానికి కనీసం రెండేళ్ల సమయం పడుతుంది.&nbsp;
    ఆగస్టు 07 , 2024
    <strong>Kalki 2898 AD Day 2 Collections: రెండో రోజు 80% మేర పడిపోయిన ‘కల్కి’ వసూళ్లు.. షాక్‌లో ఫ్యాన్స్‌!</strong>
    Kalki 2898 AD Day 2 Collections: రెండో రోజు 80% మేర పడిపోయిన ‘కల్కి’ వసూళ్లు.. షాక్‌లో ఫ్యాన్స్‌!
    ప్రభాస్‌ హీరోగా నాగ్ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందిన 'కల్కి 2898 ఏడీ' చిత్రం విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. జూన్‌ 27న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం.. బాక్సాఫీస్‌ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. దేశవ్యాప్తంగా హోస్‌ఫుల్‌ బోర్డులతో సినీ అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. ఓపెనింగ్ రోజే ఈ సినిమా ఏకంగా రూ.191.50 కోట్లు వసూల్ చేసి సంచలనం సృష్టించింది. దీంతో రెండో రోజు కలెక్షన్లపై అందరి దృష్టి పడింది. మరి రెండో రోజు వసూళ్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.&nbsp; డే 2 కలెక్షన్స్ ఎంతంటే? 'కల్కి 2898 ఏడీ' రెండో రోజు వసూళ్లను నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్‌ అధికారికంగా ప్రకటించింది. తొలి రోజు రూ.191.5 కోట్లు రాబట్టిన ఈ చిత్రం.. రెండు రోజుల్లో వరల్డ్‌ వైడ్‌గా రూ.298.5 కోట్లు (GROSS) వసూలు చేసినట్లు ప్రకటించింది. ఈ మేరకు ఓ స్పెషల్‌ పోస్టర్‌ను సైతం సోషల్‌ మీడియాలో పోస్టు చేసింది. మేకర్స్‌ లెక్కల ప్రకారం.. కల్కి వరుసగా రెండో రోజు కూడా రూ.100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. రెండో రోజు కల్కి ఖాతాలో మరో రూ.107 కోట్లు (GROSS) వచ్చి చేరాయి. అయితే తొలి రోజు కలెక్షన్స్‌తో పోలిస్తే రెండో రోజు వసూళ్లు భారీగా పడిపోయాయి. కలెక్షన్స్‌లో 80% మేర కోత పడింది. దీంతో తొలి రెండు రోజుల్లో ఈజీగా రూ.350 కోట్ల మార్క్‌ దాటుతుందనుకున్న కల్కి.. కనీసం రూ.300 కోట్లు కూడా అందుకోలేకపోయింది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.&nbsp; తొలి రోజు ఆల్‌టైమ్‌ రికార్డు ప్రభాస్‌ ‘కల్కి’ సినిమా నార్త్‌ అమెరికాలో సంచలనం సృష్టిస్తోంది. ప్రభాస్‌తో (Prabhas) పాటు అగ్రతారల నటనకు అక్కడి ఆడియన్స్‌ ఫిదా అవుతున్నారు. ఈ క్రమంలోనే నార్త్‌ అమెరికాలో కల్కి ఆల్‌టైమ్‌ రికార్డును క్రియేట్‌ చేసింది. తొలి రోజున నార్త్‌ అమెరికా ప్రీమియర్స్‌ కలెక్షన్స్‌లో కల్కి ఏకంగా 3.8 మిలియన్‌ డాలర్ల వసూళ్లను సాధించింది. నార్త్ అమెరికాలో ఒక ఇండియన్‌ చిత్రం ఈ స్థాయి వసూళ్లు రాబట్టడం ఇదే తొలిసారి. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ చిత్రంగా కల్కి రికార్డును సొంతం చేసుకుంది. ఈ సినిమా తర్వాతి స్థానాల్లో ‘ఆర్‌ఆర్ఆర్‌’ (3.46 మిలియన్లు), ‘సలార్‌’ (2.6 మిలియన్లు), ‘బాహుబలి2’ (2.45 మిలియన్లు) ఉన్నాయి. 'ఆర్‌ఆర్‌ఆర్‌' రికార్డ్‌ సేఫ్‌! ట్రేడ్‌ వర్గాలు లెక్కలను బట్టి.. 'ఆర్‌ఆర్‌ఆర్‌' రికార్డును 'కల్కి 2898 ఏడీ' బీట్‌ చేయలేకపోయింది. ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రం తొలిరోజు రూ.223 కోట్లు (GROSS) రాబట్టి అత్యధిక డే1 వసూళ్లు సాధించిన ఇండియన్‌ చిత్రంగా టాప్‌లో ఉంది. ట్రేడ్‌ వర్గాల అంచనాల ప్రకారం 'కల్కి 2898 ఏడీ' రూ.180 కోట్ల వద్దే ఆగిపోవడంతో 'ఆర్‌ఆర్‌ఆర్‌' రికార్డ్‌ అలాగే భద్రంగా ఉంది. ఆ తర్వాత 'బాహుబలి 2' రూ.217 కోట్లతో రెండో స్థానంలో నిలించింది. అయితే రెండింటి రికార్డులను కల్కి బ్రేక్‌ చేయలేకపోయింది. కానీ, కేజీఎఫ్ 2 (రూ.164.5 కోట్లు), సలార్ (రూ.158 కోట్లు), ఆదిపురుష్ (136.8 కోట్లు), సాహో (రూ.125.6 కోట్లు) రికార్డ్స్‌ను బ్రేక్‌ చేసి టాప్‌-3లో నిలిచింది.&nbsp; కలెక్షన్లపై మ్యాచ్ ఎఫెక్ట్! 'కల్కి 2898 ఏడీ' సినిమాను ‘బాహుబలి 2’, ‘RRR’ చిత్రాల మాదిరిగా ప్రమోట్ చేయడంలో చిత్రబృందం వెనుకబడింది. ఇంకా పెద్ద స్థాయిలో ప్రమోషన్స్ చేసి ఉంటే ఈ సినిమా కొత్త రికార్డులను క్రియేట్ చేసే అవకాశం ఉండేది. అటు ఈ సినిమా తొలి రోజు కలెక్షన్లపై టీ-20 వరల్డ్ కప్ ఎఫెక్ట్ పడింది. గురువారం (జూన్‌ 27) సాయంత్రం జరిగిన ఇండియా-ఇంగ్లాండ్ సెమీ ఫైనల్ మ్యాచ్‌ను చూసేందుకు ఆడియన్స్ మొగ్గు చూపడం కొంత మైనస్‌గా మారింది. దీనికి తోడు గురువారం వర్కింగ్‌ డే కావడం కూడా కల్కి కలెక్షన్స్‌పై ప్రభావం చూపింది. ఇవాళ (జూన్‌ 29) వరల్డ్‌ కప్ ఫైనల్ ఉండటంతో కల్కి మూడో రోజు కలెక్షన్స్‌పై ఎఫెక్ట్‌ పడే అవకాశం ఉంది.&nbsp;
    జూన్ 29 , 2024
    Rajanikanth vs Suriya: స్టార్‌ హీరోల మధ్య బిగ్‌ ఫైట్‌.. బాక్సాఫీస్‌ బరిలో రజనీ - సూర్య చిత్రాలు!
    Rajanikanth vs Suriya: స్టార్‌ హీరోల మధ్య బిగ్‌ ఫైట్‌.. బాక్సాఫీస్‌ బరిలో రజనీ - సూర్య చిత్రాలు!
    భారతీయ చిత్ర పరిశ్రమలో మరో బిగ్‌ ఫైట్‌ లాక్‌ అయ్యింది. ఇద్దరు పాన్‌ ఇండియా స్టార్లు ఒకే రోజు బాక్సాఫీస్‌ వద్ద తలపడబోతున్నారు. సాధారణంగా ఏ రెండు చిన్న హీరోల సినిమాలు రిలీజైనా అందరి దృష్టి వాటిపైనే ఉంటుంది. ఎవరు పైచేయి సాధిస్తారు? ఎవరు ఫ్లాప్‌ టాక్‌తో సరిపెట్టుకుంటారు? అని ప్రతీ ఒక్కరు ఆసక్తిగా గమనిస్తుంటారు. అలాంటిది ఇద్దరు అగ్ర కథానాయకులు తలపడితే చిత్ర సీమలో ఇక ఏ స్థాయి అటెన్షన్‌ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇంతకీ ఆ హీరోలు ఎవరు? వారు చేసిన చిత్రాలు ఏంటి? అవి బాక్సాఫీస్‌ వద్ద ఎప్పుడు ఢీకొట్టబోతున్నాయి? ఈ కథనంలో పరిశీలిద్దాం.&nbsp; రజనీకాంత్‌ vs సూర్య తమిళ పరిశ్రమలో దసరాకు పెద్ద యుద్ధమే జరగబోతోంది. రజనీకాంత్ (Rajinikanth) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వేట్టయాన్’ (Vettaiyan), సూర్య (Suriya) నటిస్తున్న ‘కంగువా’ (Kanguva) చిత్రాలు ఒకదానికొకటి ఢీకొట్టబోతున్నాయి. సూర్య చిత్రాన్ని అక్టోబర్‌ 10న రిలీజ్‌ చేయబోతున్నట్లు తాజాగా మేకర్స్‌ ప్రకటించారు. మరోవైపు అంతకుముందే ఆ డేట్‌కు రజనీకాంత్‌ ఫిల్మ్‌ వేట్టయాన్‌ను మేకర్స్‌ లాక్‌ చేశారు. దీంతో ఈ ఇద్దరు స్టార్‌ హీరోల మధ్య భీకర పోరు తప్పదని ఇప్పటి నుంచే ఫిల్మ్‌ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఈ బిగ్‌ఫైట్‌లో విజయం తమదంటే తమదని ఫ్యాన్స్‌ నెట్టింట సవాలు విసురుకుంటున్నారు.&nbsp; భారీ తారాగణం సూర్య హీరోగా తెరకెక్కుతున్న ‘కంగువా’ చిత్రాన్ని స్టార్‌ డైరెక్టర్ శివ తెరకెక్కిస్తున్నారు. అజిత్‌తో ‘వేదాలం’, ‘వివేగం’ వంటి సూపర్‌ హిట్‌ సినిమాలు తీసిన శివ.. తొలిసారి సూర్యతో కలిసి పనిచేస్తుండటంతో తమిళనాట ఈ సినిమాపై మంచి బజ్‌ ఏర్పడింది. పైగా ఇందులో ప్రముఖ బాలీవుడ్‌ నటుడు బాబీ డియల్ ప్రతీనాయకుడి పాత్రను పోషించాడు. హీరోయిన్‌గా గ్లామర్‌ డాల్‌ దిశా పటానీ చేసింది. అలాగే ప్రకాష్‌ రాజ్‌, జగపతిబాబు, డైరెక్టర్‌ కే.ఎస్‌. రవికుమార్‌ కీలకమైన రోల్స్‌లో కనిపించనున్నారు. ప్రముఖ కమెడియన్‌ యోగిబాబు సైతం ఓ ముఖ్యమైన పాత్రతో అలరించేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఇప్పటికే మేకర్స్‌ రిలీజ్‌ చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. దీంతో రజనీకాంత్‌కు గట్టి సవాలు తప్పదని సూర్య ఫ్యాన్స్ అంటున్నారు.&nbsp; గిరిజన యోధుడిగా 'సూర్య' కోలీవుడ్‌లో అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిన చిత్రాల్లో ఒకటిగా కంగువా నిలిచింది. ఈ సినిమా నిర్మాణానికి రూ.350 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు టాక్. అయితే ఈ మూవీ పవర్‌ కథతో రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో సూర్య గిరిజన యోధుడిలా కనిపిస్తాడట. 1678 నాటి బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా కథ నటుడుస్తుందని అంటున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలను గమనిస్తే ఇదే విషయం అర్థమవుతుంది. అయితే కథకు టైమ్‌ ట్రావెల్‌ కాన్సెప్ట్‌ను కూడా జోడించినట్లు కోలివుడ్‌ వర్గాలు చర్చించుకుంటున్నాయి. మూవీ విడుదల తర్వాతే దీనిపై స్పష్టత వచ్చే ఛాన్స్ ఉంది.&nbsp; రజనీకాంత్‌- అమితాబ్‌ ఇక రజనీకాంత్‌ హీరోగా చేసిన 'వేట్టయాన్‌' సినిమాకి 'జై భీమ్‌' వంటి బ్లాక్‌ బాస్టర్‌ హిట్‌ అందించిన టీజే జ్ఞానవేల్‌ దర్శకత్వం వహించారు. ఇందులో బాలీవుడ్‌ దిగ్గజం అమితాబ్‌ బచ్చన్‌ ఓ ముఖ్యమైన పాత్ర పోషించారు. 32 ఏళ్ల తర్వాత రజనితో కలిసి ఆయన యాక్ట్ చేస్తున్నారు. దగ్గుబాటి రానా, ఫహాద్‌ ఫాజిల్‌, రానా, రితికా సింగ్‌, రావు రమేష్‌ ఇతర ముఖ్య తారాగణంగా ఉన్నారు. ఒక రిటైర్‌ అయిన పోలీసు ఆఫీసర్‌.. సమాజంలోని అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తే ఎలా ఉంటుందన్న కాన్సెప్ట్‌తో ఈ మూవీని రూపొందించారు. రజనీ మార్క్‌ యాక్షన్‌ ఈ మూవీలో ఉంటుందని ప్రచార చిత్రాలను బట్టే తెలుస్తోంది. దీంతో ‘వేట్టయాన్‌’ చిత్రంపై కూడా భారీగా అంచనాలు ఏర్పడ్డాయి మరి అక్టోబర్‌ 10న జరగబోయే ఈ సంగ్రామంలో విజయం ఎవరిదన్న అంశం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.&nbsp; అటు టాలీవుడ్‌లోనూ.. టాలీవుడ్‌లోనూ ఇద్దరు స్టార్‌ హీరోలు తలపబడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అల్లు అర్జున్‌ vs రామ్‌చరణ్‌ బాక్సాఫీస్‌ బరిలో నిలిచే పరిస్థితులు కనిపిస్తున్నాయి. బన్నీ హీరోగా చేస్తున్న ‘ పుష్ప 2’ రిలీజ్‌ డేట్‌ ఆగస్టు 15 నుంచి డిసెంబర్‌ 6కు మారింది. మరోవైపు రామ్‌చరణ్‌-శంకర్‌ కాంబోలో రూపొందుతున్న గేమ్ ఛేంజర్‌’ మూవీ కూడా డిసెంబర్‌లో విడుదలయ్యే ఛాన్స్‌ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. నిర్మాత దిల్‌రాజు కూడా డిసెంబర్‌ మెుదటి వారంలోనే ‘గేమ్‌ ఛేంజర్‌’ రిలీజ్‌ చేయాలని భావిస్తే బాక్సాఫీస్‌ వద్ద బిగ్‌ ఫైట్‌ తప్పదు. &nbsp;
    జూన్ 28 , 2024

    @2021 KTree