• TFIDB EN
  • 35
    UATelugu
    ప్రసాద్‌ (విశ్వదేవ్‌), సరస్వతి (నివేదా థామస్‌) మధ్యతరగతి కుటుంబానికి చెందిన భార్య భర్తలు. పెద్ద కుమారుడు అరుణ్‌ స్కూల్లో ఆరో తరగతి చదువుతుంటాడు. మ్యాథ్స్‌లో చాలా వీక్‌. దాంతో లెక్క‌ల మాస్టారు చాణ‌క్య (ప్రియ‌ద‌ర్శి) అరుణ్‌కి జీరో అని పేరు పెడతాడు. పరీక్షల్లో ఫెయిల్ కూడా చేస్తాడు. అరుణ్ స్కూల్‌లో ఉండాలంటే లెక్క‌ల్లో క‌నీసం 35 మార్కులు సాధించాల్సిందేనని షరతు విధిస్తాడు. ఆ పరిస్థితుల్లో అరుణ్ ఏం చేశాడు? అతడికి తల్లి సరస్వతి ఎలా సాయం చేసింది? అన్నది స్టోరీ.
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్ సూన్‌ ఆన్‌Ahaఫ్రమ్‌
    రివ్యూస్
    YouSay Review

    35 Chinna Katha Kaadu Review: ఇద్దరు పిల్లల తల్లిగా నివేదా థామస్‌.. ఆలోచింపజేసేలా ‘35 చిన్న కథ కాదు’ సినిమా!

    నివేదా థామస్‌ (Nivetha Thomas), విశ్వదేవ్‌ ఆర్‌, ప్రియదర్శి (Priyadarshi) ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం ‘35 చిన్న కథ కాదు’ (35 Chinna Katha Kaadu R...read more

    How was the movie?

    తారాగణం
    నివేతా థామస్
    గౌతమి
    ప్రియదర్శి పులికొండ
    విశ్వదేవ్ రాచకొండ
    అరుణ్ దేవ్
    సిబ్బంది
    నంద కిషోర్ ఈమనిదర్శకుడు
    విశ్వదేవ్ రాచకొండనిర్మాత
    సృజన్ యరబోలునిర్మాత
    కథనాలు
    <strong>Nivetha Thomas: బరువు పెరగడంపై రిపోర్టర్‌ ప్రశ్న.. స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చిన నివేదా థామస్‌!</strong>
    Nivetha Thomas: బరువు పెరగడంపై రిపోర్టర్‌ ప్రశ్న.. స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చిన నివేదా థామస్‌!
    టాలీవుడ్‌లో తనకంటూ ఫ్యాన్స్ బేస్‌ను సంపాదించుకున్న హీరోయిన్లలో నివేదా థామస్‌ (Nivetha Thomas) ఒకరు. ఈ అమ్మడు నటించింది తక్కువే సినిమాలే అయినప్పటికీ స్టార్‌ హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని క్రేజ్‌ను తెలుగులో సొంతం చేసుకుంది. నివేదా.. ఇప్పటివరకూ యాక్టింగ్‌కు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లోనే కనిపించింది. బోల్డ్‌ పాత్రలను అసలు చేయలేదు. దీంతో టాలీవుడ్‌ ఆడియన్స్‌లో ఈ భామకు మంచి గుర్తింపు లభించింది. ఇదిలా ఉంటే.. తన అప్‌కమింగ్‌ ఫిల్మ్‌ '35' టీజర్ లాంచ్ ఈవెంట్‌లో నివేదా థామస్‌కు ఊహించని ప్రశ్న ఎదురైంది. ఈ అమ్మడు ఇచ్చిన కౌంటర్‌.. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.&nbsp; ఏం జరిగిందంటే? నివేథ థామస్‌ నటించిన '35&nbsp; చిన్న కథ కాదు' చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో తాజాగా టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ క్రమంలో ఓ జర్నలిస్టు బాడీ షేమింగ్‌ గురించి నివేదాను ప్రశ్నించారు. ‘అనుష్క లేదా మీలాంటి పలువురు ఆర్టిస్టులు బరువు పెరగడం అనేది సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారుతోంది. హీరోయిన్‌ అంటే జీరో సైజే అని సోషల్‌ మీడియాలో ఇప్పటికీ వైరల్‌ అవుతోంది. వీటికి ఏం చెప్తారు మీరు? అని మహిళా రిపోర్టర్‌ ప్రశ్నిస్తారు. ఇందుకు నివేదా థామస్‌ బదులిస్తూ.. ‘నేను మీతోనే చెప్పాలి ఇది. ఈ వైరల్‌ అనేది మీకు మాత్రమే వస్తుందేమో.. నాకు తెలీదు. ఈ క్వశ్చన్‌కు నా సింపుల్ ఆన్సర్‌.. 35 అనేది ఈ సెట్‌లో ఉన్న ఎవరి వెయిట్‌ కాదు.. క్యాస్ట్‌లో ఉన్న ఎవరి వెయిట్‌ కాదు.. టెక్నిషియన్స్‌ వెయిట్‌ కాదు' అంటూ నవ్వుతూనే స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు. సినిమాకు సంబంధించిన ప్రశ్నలు మాత్రమే వేయాలంటూ పరోక్షంగా హెచ్చరించారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది.&nbsp; https://twitter.com/i/status/1808789199795204521 తొలిసారి ‘అమ్మ’ పాత్రలో.. '35 చిన్న కథ కాదు' చిత్రంలో నివేదా థామస్‌తో పాటు విశ్వదేవ్‌ ఆర్‌, ప్రియదర్శి ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాకు నందకిశోర్‌ ఇమాని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ ఆగస్టు 15న థియేటర్లలో సందడి చేయనుంది. తిరుపతి నేపథ్యంలో జరిగే ఈ కథలో నివేదా థామస్ తల్లి పాత్ర పోషించారు. పరీక్షల్లో పాస్‌ మార్కులు కూడా రానందుకు తండ్రి మందలించగా.. కొడుకు ఇంటి నుంచి వెళ్లిపోతాడు. కుమారుడి కోసం తల్లి ఆరాటపడటం లాంటి సన్నివేశాలు తాజా విడుదల చేసిన టీజర్‌లో చూపించారు. మూవీని తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. మీరు ఓ లుక్కేయండి.&nbsp; https://www.youtube.com/watch?v=4cq7F7ihsbM నాకు పెళ్లైంది : నివేదా థామస్‌ తనకు పెళ్లంటూ గతంలో నెట్టింట జరిగిన ప్రచారంపై తాజాగా నటి నివేదా థామస్‌ స్పందించారు. టీజర్‌ విడుదల వేడుకలో దీనిపై కూడా మాట్లాడారు. ‘ఈ సినిమా ప్రచారంలో భాగంగా సోషల్‌ మీడియాలో నేను ఓ ఫొటో పోస్ట్‌ చేశా. దాన్ని చూసి చాలామంది నాకు పెళ్లి కానుందని భావించారు. దానిపై వార్తలు రాగా మా అమ్మ నాకు ఆ ఫొటో పంపారు. అవునా అమ్మా.. మీరెప్పుడు నా కోసం అబ్బాయిని చూశారు అని అమ్మని అడిగా’ అని నివేదా తెలిపారు. ఇక ఈ చిత్రంలో తన భర్తగా నటించిన విశ్వదేవ్‌, తన కుమారులుగా నటించిన వారిని ఉద్దేశిస్తూ.. ‘నాకు పెళ్లైంది. ఈయనే నా భర్త. వీళ్లే నా ఇద్దరు పిల్లలు అరుణ్‌, వరుణ్‌’ అంటూ నివేదా సరదాగా వ్యాఖ్యానించారు. కాగా, హీరో రానా ఈ మూవీకి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.&nbsp; https://twitter.com/i/status/1808760891615416465
    జూలై 04 , 2024
    <strong>Devara Promotions: దేవర ప్రమోషన్స్‌ సరైన దారిలో వెళ్లడం లేదా? టాలీవుడ్‌ను నిర్లక్ష్యం చేస్తున్నారా?</strong>
    Devara Promotions: దేవర ప్రమోషన్స్‌ సరైన దారిలో వెళ్లడం లేదా? టాలీవుడ్‌ను నిర్లక్ష్యం చేస్తున్నారా?
    మ్యాన్‌ ఆఫ్‌ మాసెస్‌ తారక్‌ హీరోగా, స్టార్‌ డైరెక్టర్‌ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన 'దేవర'పై పాన్‌ ఇండియా స్థాయిలో బజ్‌ ఏర్పడింది. 'ఆర్‌ఆర్‌ఆర్‌' వంటి గ్లోబల్‌ హిట్‌ తర్వాత తారక్‌ నటించిన మూవీ కావడంతో తారక్‌ ఫ్యాన్స్‌తో పాటు సినీ లవర్స్‌ కూడా ‘దేవర’ కోసం తెగ ఎదురుచూస్తున్నారు. సెప్టెంబర్‌ 27న ఈ చిత్రం రిలీజ్‌ కానుండటంతో దేవర టీమ్‌ మూవీ ప్రమోషన్స్‌తో బిజీ బిజీగా గడుపుతోంది. అయితే నార్త్‌పైనే తారక్‌ &amp; కో ఫోకస్‌ పెట్టడంతో తెలుగు ఆడియన్స్‌లో అసంతృప్తికి కారణమవుతోంది. దేవర నుంచి ఇప్పటివరకూ వచ్చిన ఏ ప్రమోషన్ ఈవెంట్‌ అయినా ఒక్కటీ కూడా తెలుగు రాష్ట్రాల నుంచి రాలేదు. దీంతో టాలీవుడ్‌ను నిర్లక్ష్యం చేస్తూ దేవర టీమ్ తప్పుచేస్తోందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.&nbsp; చెన్నై ప్రమోషన్స్‌పై ట్రోల్స్‌ పాన్​ ఇండియా స్టార్​​ ఎన్టీఆర్​​ హీరోగా స్టార్​​ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'దేవర'. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా చిత్ర యూనిట్‌ మంగళవారం (సెప్టెంబర్‌ 17) చెన్నైలో ల్యాండ్‌ అయ్యింది. ఈ సందర్భంగా నిర్వహించిన ఈవెంట్‌లో తారక్‌తో పాటు హీరోయిన్‌ జాన్వీ కపూర్‌, డైరెక్టర్‌ కొరటాల శివ, సంగీత దర్శకుడు అనిరుధ్‌, తమిళ నటుడు కలైయరసన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తారక్‌ మాట్లాడుతూ తమిళ దర్శకుడు వెట్రిమారన్‌తో సినిమా చేయాలని ఉందని తన మనసులో మాట పంచుకున్నారు. ఇది తమిళ ఆడియన్స్‌ను ఎంతగానో ఆకట్టుకున్నప్పటికీ తెలుగు సినిమా లవర్స్‌ మాత్రం ఫీలవుతున్నారు. తారక్‌ వంటి స్టార్‌ హీరో తనతో సినిమా చేయమని ఓ తమిళ డైరెక్టర్‌ను రిక్వెస్ట్‌ చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. తారక్‌ తన స్థాయిని తానే తగ్గించుకుంటున్నారని ట్రోల్స్‌ చేస్తున్నారు.&nbsp; కపిల్ శర్మ షోలో దేవర టీమ్‌! దేవర టీమ్‌ ముంబయిలోనూ గత కొన్ని రోజులుగా వరుస ప్రమోషన్స్‌ నిర్వహిస్తూ సినిమాపై హైప్‌ పెంచే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా దేశంలోనే ఎంతో పాపులర్ అయిన ‘కపిల్‌ శర్మ సీజన్‌ 2’ షోలో తారక్‌ పాల్గొన్నాడు. బాలీవుడ్‌లో ఎంత పెద్ద తోపు హీరో అయిన ‘కపిల్ శర్మ షో’లో పాల్గొనాల్సిందే. ఆ షోకు ప్రాంతాలకు అతీతంగా ఫ్యాన్స్‌ ఉన్నారు. దీంతో ఆ షోకు వెళ్తే తమ చిత్రాలకు కావాల్సినంత ప్రమోషన్స్ వస్తాయని బాలీవుడ్ స్టార్స్ భావిస్తుంటారు. 'ఆర్‌ఆర్‌ఆర్‌' ప్రమోషన్స్‌ సమయంలోనూ రాజమౌళి, తారక్‌, రామ్‌చరణ్‌ ఈ షోలో పాల్గొని సందడి చేశారు. ఈ క్రమంలోనే తాజాగా తారక్‌ మరోమారు దేవర కోసం ఆ షోలో అడుగుపెట్టాడు. ఇందుకు సంబంధించిన ప్రోమో రిలీజై ఆకట్టుకుంటోంది. ఈ షోలో తారక్‌తో పాటు జాన్వీ కపూర్‌, అలియా&nbsp; భట్‌, సైఫ్‌ అలీఖాన్‌ తదితురులు పాల్గొన్నారు. టీమ్ ఇండియా కెప్టెన్‌ రోహిత్ శర్మ &amp; కో కూడా ప్రోమోలో కనిపించడం గమనార్హం. ఈ ఎపిసోడ్‌ సెప్టెంబర్‌ 21న రాత్రి 8 గం.లకు నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌లోకి రానుంది. https://twitter.com/NetflixIndia/status/1834826983017976063 హిందీ బిగ్‌బాస్‌ 18లో తారక్‌? హిందీలో బిగ్‌ బాగ్‌&nbsp; షోకు చాలా పాపులారిటీ ఉంది. త్వరలోనే సల్మాన్‌ ఖాన్‌ హోస్ట్‌గా బిగ్‌బాస్‌ హిందీ సీజన్‌ 18 ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో దేవర టీమ్‌ బిగ్‌బాస్‌కు వెళ్లి తమ సినిమాను ప్రమోట్‌ చేసుకోనున్నట్లు స్ట్రాంగ్‌ బజ్‌ వినిపిస్తోంది. దీనిపై దేవర టీమ్‌ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అయితే నార్త్‌లో సినిమా ప్రమోషన్స్‌కు ఏ చిన్న అవకాశం దొరికిన తారక్‌ &amp; కో ఏమాత్రం వదులుకోవడం లేదని దీన్ని బట్టి అర్థమవుతోంది. ఇదిలా ఉంటే అక్టోబర్‌ 4 నుంచి బిగ్‌బాస్‌ 18 స్ట్రీమింగ్‌ కానున్నట్లు తెలుస్తోంది. అప్పటికే దేవర రిలీజై ఉంటుంది. మరి దేవర టీమ్‌ హిందీ బిగ్‌బాస్‌లోకి వెళ్తుందో లేదో చూడాలి.&nbsp; యానిమల్‌ డైరెక్టర్‌తో ఇంటర్యూ దేవర టీమ్‌ను యానిమల్‌ డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగాతో ఇటీవల ఇంటర్యూ చేశారు. ఇందులో తారక్‌తో పాటు డైరెక్టర్‌ కొరటాల శివ, సైఫ్‌ అలీఖాన్‌, జాన్వీ కపూర్‌ పాల్గొన్నారు. ఈ చిట్‌ చాట్‌ చాలా ఫన్నీగా సాగింది. ఇందులో సందీప్‌ పలు ఆసక్తికర ప్రశ్నలను దేవర టీమ్‌కు సంధించారు. దానికి తనదైన శైలిలో జాన్వీ, తారక్‌ బదులిచ్చారు. తారక్‌ మాట్లాడుతూ దేవర యాక్షన్‌ డ్రామా అని, మాస్‌ ఎలిమెంట్స్ ప్రేక్షకుల్ని ఉర్రూతలూగిస్తుందని చెప్పారు. మరోవైపు చాలా సంవత్సరాలుగా తారక్‌, నేను మంచి స్నేహితులమని శివ కొరటాల తమ బాండింగ్‌ గురించి చెప్పారు. 35 రోజులు అండర్‌ వాటర్‌ సీక్వెన్స్‌ చేసినట్లు ఎన్టీఆర్‌ చెప్పగా, ‘దేవర’ అందరి కెరీర్‌లో బెస్ట్‌ మూవీ అవుతుందని జాన్వీ అన్నారు. ఈ సినిమా రన్‌ టైమ్‌ పై సందీప్‌ సరదాగా కామెంట్‌ చేశారు. దానికి తారక్‌ యానిమల్‌ రన్‌ టైమ్‌ ఎంత అని అడగగా 3 గంటల 24 నిమిషాలని నవ్వుతూ సందీప్‌ రెడ్డి వంగా చెప్పారు. అయితే సందీప్‌ రెడ్డి వంగా తెలుగు డైరెక్టర్ అయినప్పటికీ ఇంటర్యూలో అంతా ఇంగ్లీషులో సాగడంతో తెలుగు ప్రేక్షకులు ఓన్‌ చేసుకోలేకపోతున్నారు. పూర్తి ఇంటర్యూ కోసం కింద ఇచ్చిన లింక్‌పై క్లిక్‌ చేయండి.&nbsp; https://www.youtube.com/watch?v=EzNPma48bVM మరి టాలీవుడ్‌ ప్రమోషన్స్‌ ఎక్కడా? గత కొన్ని రోజులుగా ‘దేవర’ టీమ్‌ ఫోకస్‌ మెుత్తం బాలీవుడ్ పైనే ఉంది. అక్కడ సినిమాను బాగా ప్రమోట్‌ చేయగలిగితే వసూళ్లు గణనీయంగా ఉంటాయని టీమ్‌ భావిస్తూ ఉండవచ్చు. ఈ నేపథ్యంలో సినిమాకు కీలకమైన ట్రైలర్‌ను కూడా ముంబయిలోనే రిలీజ్‌ చేశారు. అదే సమయంలో తెలుగులోనూ పార్లర్‌గా దేవర ప్రమోషన్స్‌ నిర్వహిస్తే బాగుండేదన్న కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. తెలుగులో తారక్‌ స్టార్‌ హీరో ఇమేజ్‌ ఉన్న నేపథ్యంలో ఎలాగైన మంచి వసూళ్లు వస్తాయన్న ధీమాలో చిత్ర యూనిట్‌ ఉన్నట్లు తెలుస్తోంది. నార్త్‌లో నిర్వహించిన ప్రమోషన్స్‌తో పోలిస్తే తెలుగులో పెద్దగా ప్లాన్‌ చేస్తున్నట్లు కూడా కనిపించడం లేదు. యంగ్‌ హీరోలు సిద్ధు, విశ్వక్‌లతో ఎన్టీఆర్‌, కొరటాల ఇంటర్యూను ప్లాన్‌ చేయడం అభిమానులకు ఆశ్చర్యం కలిగిస్తోంది. యంగ్ హీరోలతో ఇంటర్వ్యూ చూడడానికి ఎంటర్‌టైనింగ్‌గా కనిపించినా ఎన్టీఆర్‌కి ఉన్న రేంజ్ ఏంటి? వారితో ఇంటర్వ్యూ ఏంటి? అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మహేశ్‌, ప్రభాస్‌, రాజమౌళితో ఉన్న సన్నిహిత సంబంధాలను ఉపయోగించుకొని వారిలో ఎవరితోనైనా ఇంటర్యూ నిర్వహించి ఉంటే తెలుగులో బాగా ప్లస్ అయ్యేదని సినీ వర్గాలు చెబుతున్నాయి. ‘సలార్‌’ టీమ్‌తో రాజమౌళి చేసిన ఇంటర్యూ గురించి గుర్తుచేస్తున్నాయి. ఇప్పటివరకైతే ప్రమోషన్స్‌లో బాలీవుడ్‌పై పెట్టిన శ్రద్ధ టాలీవుడ్‌పై కనిపించడం లేదన్న విమర్శలు గట్టిగానే వినిపిస్తున్నాయి. దీన్ని దేవర టీమ్ ఎలా కవర్‌ చేసుకుంటుందో చూడాలి.&nbsp;
    సెప్టెంబర్ 18 , 2024
    <strong>Telugu Movies 2024: ‘కల్కి’, ‘హనుమాన్‌’ సరసన ‘ఆయ్‌’, ‘కమిటీ కుర్రోళ్లు’.. ఇది మామూలు సక్సెస్‌ కాదు భయ్యా!&nbsp;</strong>
    Telugu Movies 2024: ‘కల్కి’, ‘హనుమాన్‌’ సరసన ‘ఆయ్‌’, ‘కమిటీ కుర్రోళ్లు’.. ఇది మామూలు సక్సెస్‌ కాదు భయ్యా!&nbsp;
    2024 సంవత్సరం టాలీవుడ్‌కు బాగా కలిసొచ్చింది. ఈ ఏడాదిలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ప్రభాస్‌ నటించిన ‘కల్కి 2898 ఏడీ’ నిలిచింది. సంక్రాంతి కానుకగా వచ్చిన ‘హనుమాన్‌’ మూవీ సైతం జాతీయ స్థాయిలో సత్తా చాటి మంచి వసూళ్లు సాధించింది. అయితే ఈ రెండు చిత్రాలు భారీ బడ్జెట్‌తో రూపొందాయి. కానీ తక్కువ బడ్జెట్‌తో రూపొందిన టిల్లు స్క్వేర్‌, కమిటీ కుర్రోళ్లు, ఆయ్‌ వంటి చిత్రాలు సైతం కలెక్షన్ల పరంగా ఆ రెండు చిత్రాలతో చేరి సమానంగా నిలిచాయి. పెట్టిన ఖర్చుకు దాదాపు మూడింతలు రికవరి సాధించి సత్తా చాటాయి. బడ్జెట్‌ - కలెక్షన్స్‌ మధ్య భారీ వ్యత్యాసం కలిగిన టాప్‌ 5 తెలుగు చిత్రాలుగా నిలిచాయి. ఆ వివరాలేంటో ఈ ప్రత్యేక కథనంలో పరిశీలిద్దాం.  కమిటి కుర్రోళ్లు (Committee Kurrollu) నిహారిక కొణిదెల నిర్మించిన తొలి సినిమా ‘కమిటీ కుర్రోళ్లు’. 11 మంది కొత్త హీరోలతో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 10న విడుదలై మంచి టాక్‌ తెచ్చుకుంది. వరల్డ్‌ వైడ్‌గా రూ.17.60 కోట్లు కొల్లగొట్టింది. ఈ సినిమా నిర్మాణానికి రూ.6 కోట్లు మాత్రమే ఖర్చు అయ్యింది. బడ్జెట్‌తో పోలిస్తే మూడింతలు వసూళ్లు సాధించి ‘కమిటీ కుర్రోళ్లు’ మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. ప్రస్తుతం ఈటీవీ విన్‌ వేదికగా ఈ మూవీ స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. అక్కడ కూడా ఈ మూవీకి మంచి రెస్పాన్స్‌ వస్తున్నట్లు ఓటీటీ వర్గాలు తెలిపాయి.&nbsp; ఆయ్‌ (Aay) నార్నే నితిన్, నయన్ సారిక హీరోయిన్లుగా నటించిన రీసెంట్‌ చిత్రం 'ఆయ్‌' (Aay). అంజి కె. మణిపుత్ర దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఆగస్టు 15న రిలీజై హిట్‌ టాక్‌ సొంతం చేసుకుంది. ‘మిస్టర్‌ బచ్చన్‌’, ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ వంటి స్టార్ హీరోల చిత్రాలకు కంటే బెటర్‌గా వసూళ్లు సాధించింది. ఓవరాల్‌గా రూ.14.10 కోట్లు తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమాకు రూ.6-8 కోట్లు ఖర్చు అయినట్లు సమాచారం. ఓటీటీ రైట్స్‌ కూడా కలుపుకుంటే ‘ఆయ్‌’ దాదాపు మూడింతలు లాభాలు సాధించినట్లు చిత్ర వర్గాలు పేర్కొన్నాయి.&nbsp; కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD) రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ‘కల్కి 2898 ఏడీ’ చిత్రం ఇండియన్‌ బాక్సాఫీస్‌ను షేక్‌ చేసింది. వరల్డ్‌ వైడ్‌గా రూ.1200-1300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. మైథాలజీ &amp; ఫ్యూచరిక్‌ జానర్‌లో రూపొందిన ఈ చిత్రానికి దాదాపు రూ.600 కోట్లు ఖర్చయ్యింది. అయితే దానికి రెట్టింపు కంటే ఎక్కువ వసూళ్లు సాధించి కల్కి అందరి చేత ప్రశంసలు అందుకుంది. పాన్ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ మరోమారు తన సత్తా ఏంటో బాక్సాఫీస్‌ వద్ద నిరూపించుకున్నాడు. కాగా, ఈ సినిమాలో ప్రభాస్‌తో పాటు అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌, దీపికా పదుకొనే వంటి స్టార్స్‌ నటించారు. విజయ్‌ దేవరకొండ, దుల్కర్‌ సల్మాన్‌, ఎస్‌.ఎస్‌. రాజమౌళి, రామ్‌గోపాల్‌ వర్మ వంటివారు స్పెషల్‌ క్యామియోలతో అలరించారు.&nbsp; టిల్లు స్క్వేర్‌ (Tillu Square) సిద్ధూ జొన్నలగడ్డ, అనుపమా పరమేశ్వరన్‌ జంటగా నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్‌’ (Tillu Square). ఈ ఏడాదిలో మార్చిలో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ప్రపంచవ్యాప్తంగా రూ.135 కోట్లకు పైగా కొల్లగొట్టింది. ప్రముఖ నిర్మాత నాగదేవర సూర్యవంశీ ఈ సినిమా నిర్మాణానికి దాదాపు రూ.40 కోట్లు ఖర్చు చేశారు. దానికి మూడింతలకు పైగా టిల్లు స్క్వేర్‌ వసూలు చేయడం విశేషం. ఈ సినిమా ద్వారా సిద్దు జొన్నల గడ్డ తొలిసారి రూ.100 కోట్ల క్లబ్‌లో చేరాడు.&nbsp; హనుమాన్‌ (Hanuman) తేజసజ్జ హీరోగా టాలెంటెడ్‌ డైరెక్టర్ ప్రశాంత్‌ వర్మ తెరకెక్కించిన ‘హనుమాన్‌’ దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజైన ఈ చిత్రం ఎవరూ ఊహించని విధంగా రూ.350 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. వాస్తవానికి ఈ సినిమా బడ్జెట్‌ రూ.40 కోట్లు మాత్రమే. కానీ పెట్టిన ఖర్చుకు దాదాపు 9 రెట్లు వసూళ్లు సాధించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. దీంతో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ పేరు దేశ వ్యాప్తంగా మార్మోగింది. హనుమాన్‌ క్రేజ్‌తో ప్రశాంత్‌ స్టార్‌ డైరెక్టర్‌గా మారిపోయారు. నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తేజతో ఓ సినిమాను సైతం అనౌన్స్‌ చేశాడు. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కనుంది. దాని తర్వాత హనుమాన్‌ సీక్వెల్‌ ‘జై హనుమాన్‌’పై ప్రశాంత్‌ వర్మ ఫోకస్‌ పెట్టనున్నారు.&nbsp;
    సెప్టెంబర్ 17 , 2024
    <strong>Devara: దేవర ఇంటర్వ్యూ ప్రోమో చూశారా? తారక్‌, జాన్వీ పంచ్‌లు.. భయంగా ఉందన్న సందీప్‌ రెడ్డి వంగా!</strong>
    Devara: దేవర ఇంటర్వ్యూ ప్రోమో చూశారా? తారక్‌, జాన్వీ పంచ్‌లు.. భయంగా ఉందన్న సందీప్‌ రెడ్డి వంగా!
    జూ.ఎన్టీఆర్‌ (NTR) హీరోగా కొరటాల శివ (Koratala siva) దర్శకత్వం వహించిన చిత్రం ‘దేవర’ (Devara) జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం సెప్టెంబర్‌ 27న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్స్‌లో బిజీ అయింది. ఇటీవల ముంబైలో ట్రైలర్‌ను విడుదల చేశారు. అనంతరం ‘యానిమల్‌’ దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగాతో (Sandeep Reddy Vanga) ‘దేవర’ టీమ్‌ చిట్‌చాట్‌ నిర్వహించింది. దానికి సంబంధించిన లేటెస్ట్‌ ప్రోమో తాజాగా విడుదలైంది. సందీప్‌ అడిగిన ప్రశ్నలకు తారక్‌ తనదైన శైలిలో జవాబిచ్చారు. ఫన్నీ చిట్‌చాట్‌.. యానిమల్‌ దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగాతో 'దేవర' టీమ్‌ చిట్‌ చాట్‌ నిర్వహించింది. దానికి సంబంధించిన లేటెస్ట్‌ ప్రోమోను చిత్ర యూనిట్‌ రిలీజ్‌ చేసింది. ఇందులో సందీప్‌ రెడ్డి వంగాతో పాటు తారక్‌, జాన్వీ కపూర్‌, సైఫ్‌ అలీఖాన్‌, కొరటాల శివ పాల్గొన్నారు. ఇందులో సందీప్ రెడ్డి వంగా అడిగిన ప్రశ్నలు చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి. ‘కచ్చితంగా చాలా భయంగా ఉంటుంది. నేను చాలా అడగాలని అనుకుంటున్నాను. ఎవరు స్టార్ట్ చేస్తారు’ అని సందీప్ రెడ్డి డైలాగ్‌తో ప్రోమో ప్రారంభమైంది. ఈ క్రమంలో తారక్‌ మాట్లాడుతూ దేవర యాక్షన్‌ డ్రామా అని, మాస్‌ ఎలిమెంట్స్ ప్రేక్షకుల్ని ఉర్రూతలూగిస్తుందని చెప్పారు. మరోవైపు చాలా సంవత్సరాలుగా తారక్‌, నేను మంచి స్నేహితులమని శివ కొరటాల తమ బాండింగ్‌ గురించి చెప్పారు. 35 రోజులు అండర్‌ వాటర్‌ సీక్వెన్స్‌ చేసినట్లు ఎన్టీఆర్‌ చెప్పగా, ‘దేవర’ అందరి కెరీర్‌లో బెస్ట్‌ మూవీ అవుతుందని జాన్వీ అన్నారు. ఆపై మీరు సినిమా కథ అంతా చెప్పేయమంటున్నారు అని జాన్వీ సందీప్‌పై పంచ్‌లు విసిరింది. ఈ సినిమా రన్‌ టైమ్‌ పై సందీప్‌ సరదాగా కామెంట్‌ చేశారు. దానికి తారక్‌ యానిమల్‌ రన్‌ టైమ్‌ ఎంత అని అడగగా 3 గంటల 24 నిమిషాలని నవ్వుతూ సందీప్‌ రెడ్డి వంగా చెప్పారు. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్‌ అవుతోంది. ఇక ఈ పూర్తి ఇంటర్యూ ఆదివారం నాడు రానుంది.&nbsp; https://twitter.com/i/status/1834829086482698288 'దేవర' ప్రీ రిలీజ్‌కు మహేష్‌బాబు? దేవర ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు మహేష్‌ బాబు రానున్నట్లు నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది. దర్శకుడు కొరటాల శివ ఈవెంట్‌కు రావాలని మహేష్‌ను కోరినట్లు టాక్ వినిపిస్తోంది. అయితే, ఈ విషయంపై మహేశ్ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని సమాచారం. త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. మహేష్‌తో దర్శకుడు కొరటాలకు మంచి అనుబంధం ఉంది. శ్రీమంతుడు, భరత్ అనే నేను చిత్రాలతో కొరటాల అతడికి మంచి విజయాలను అందించాడు. దీంతో మహేష్‌ పక్కాగా వచ్చే అవకాశముందని సినీ వర్గాలు అంటున్నాయి. అదే జరిగితే 'దేవర'పై అంచనాలు మరింత పెరగడం ఖాయమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.&nbsp; హైదరాబాద్‌లో ఈవెంట్‌ ‘దేవర’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‍ను సెప్టెంబర్ 22న నిర్వహించాలని మేకర్స్ ఆలోచిస్తున్నట్టు&nbsp; సమాచారం. హైదరాబాద్‍లోనే ఈ ఈవెంట్ జరగనుంది. ముందుగా ఆంధ్రప్రదేశ్‍లో ఈవెంట్ చేయాలని అనుకున్నా.. చివరికి హైదరాబాద్‍నే ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. కాగా, దేవర చిత్రం నుంచి ఈ వారమే ట్రైలర్‌ రిలీజైంది. యాక్షన్ ప్యాక్డ్‌గా ఉన్న ఈ ట్రైలర్ పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకుంది. అంచనాలను అందుకోవడంతో సినిమాపై క్రేజ్ మరింత పెరిగింది. ఎన్టీఆర్ యాక్షన్, కొరటాల టేకింగ్ ట్రైలర్‌లో ఆకట్టుకున్నాయి. అనిరుధ్ రవిచందర్ ఇచ్చిన బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ కూడా మెప్పించింది. సందీప్‌ మూవీలో తారక్‌! ప్రభాస్‌ హీరోగా సందీప్‌రెడ్డి వంగా డైరెక్షన్‌లో రూపొందనున్న ‘స్పిరిట్‌’ (Spirit)కు సంబంధించి ఓ వార్త నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. ఈ మూవీలో తారక్‌ ప్రతినాయకుడి పాత్రలో కనిపిస్తాడని నెట్టింట ప్రచారం జరుగుతోంది. స్పిరిట్‌లో విలన్‌గా నటించాలని తారక్‌ను సందీప్‌ కోరినట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. బాలీవుడ్‌ స్టార్‌ హీరో హృతిక్‌ రోషన్‌ నటిస్తున్న ‘వార్‌ 2’ చిత్రంలో తారక్‌ నెగిటివ్ షేడ్స్‌ ఉన్న రోల్‌లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు తాను విలన్‌గా ఎంత ప్రభావం చూపగలడో ‘జై లవకుశ’ చిత్రం ద్వారా తారక్‌ ఇప్పటికే నిరూపించాడు. ఇందులో ఎన్టీఆర్‌ త్రిపాత్రిభినయం చేయగా అందులో ఓ పాత్ర పూర్తిగా నెగిటివ్‌ షేడ్స్‌లో ఉంటుంది. దీంతో గ్లోబల్‌ స్థాయిలో తెరకెక్కనున్న ‘స్పిరిట్‌’ మూవీలో తారక్‌ విలన్‌గా చేస్తే బాగుటుందని సందీప్‌ రెడ్డి వంగా భావించినట్లు నెట్టింట టాక్‌ వినిపిస్తోంది. ఇందుకు తారక్ అంగీకరిస్తే ‘స్పిరిట్‌’పై అంచనాలు అమాంతం పెరగటం ఖాయమని అంటున్నారు.&nbsp;
    సెప్టెంబర్ 14 , 2024
    <strong>OTT Releases This Week Telugu: సెప్టెంబర్‌ ఫస్ట్‌ వీక్‌లో రిలీజయ్యే చిత్రాలు, సిరీస్‌లు ఇవే!</strong>
    OTT Releases This Week Telugu: సెప్టెంబర్‌ ఫస్ట్‌ వీక్‌లో రిలీజయ్యే చిత్రాలు, సిరీస్‌లు ఇవే!
    ఆగస్టులో వరుసగా చిత్రాలు రిలీజై సినీ ప్రియులను ఎంటర్‌టైన్‌ చేశాయి. ఇప్పుడు సెప్టెంబర్‌లోనూ అదే జోష్‌లో ప్రేక్షకులకు వినోదాన్ని పంచేందుకు కొత్త సినిమాలు రాబోతున్నాయి. ఈ నెల ఫస్ట్‌ వీక్‌లో ఓ పాన్‌ ఇండియా చిత్రంతో పాటు పలు చిన్న సినిమాలు థియేటర్లలోకి సందడి చేయనున్నాయి. అటు ఓటీటీలోనూ ఆసక్తికరమైన చిత్రాలు, సిరీస్‌లు రిలీజ్‌కు సిద్ధమయ్యాయి. ఆ విశేషాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.&nbsp; థియేటర్లలో రిలీజయ్యే చిత్రాలు ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌ తమిళ స్టార్‌ హీరో విజయ్‌ (Vijay) నటించిన లేటెస్ట్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌’ (The Greatest of All Time). వెంకట్‌ ప్రభు దర్శకుడు. మీనాక్షి చౌదరి కథానాయిక. స్నేహ, లైలా, ప్రశాంత్‌, ప్రభుదేవా తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం ‘డీ-ఏజింగ్‌ టెక్నాలజీ’తో రానుంది. ఈ సాంకేతికతతో విజయ్‌ని పాతికేళ్ల కుర్రాడిలా చూపించనున్నారు. హాలీవుడ్‌ చిత్రాలకు పనిచేసిన సాంకేతిక నిపుణులు ‘ది గోట్‌’కు వర్క్‌ చేయడం విశేషం. సెప్టెంబర్‌ 5న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.&nbsp; 35 చిన్న కథ కాదు నివేదా థామస్‌ (Nivetha Thomas), విశ్వదేవ్‌ ఆర్‌, ప్రియదర్శి (Priyadarshi) ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం ‘35 చిన్న కథ కాదు’ (35 Chinna Katha Kaadu). నందకిశోర్‌ ఇమాని దర్శకత్వం వహించారు. ప్రముఖ నటుడు రానా ఈ చిత్రాన్ని నిర్మించారు. తెలుగు, తమిళ, మలయాళంలలో సెప్టెంబర్‌ 6న ఈ మూవీ విడుదల కానుంది. ప్రముఖ నటి నివేదా ఇందులో తొలిసారి తల్లి పాత్ర పోషించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌ సినిమాపై అంచనాలు పెంచింది.&nbsp; జనక అయితే గనక యంగ్ హీరో సుహాస్‌ వరుస విజయాలతో దూసుకెళ్తున్నాడు. ఈ క్రమంగా అతడు నటించిన లేటెస్ట్‌ చిత్రం ‘జనక అయితే గనక’ (Janaka Aithe Ganaka). సందీప్‌రెడ్డి బండ్ల తెరకెక్కించిన ఈ మూవీలో వెన్నెల కిశోర్‌, రాజేంద్ర ప్రసాద్‌ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రం సెప్టెంబరు 7న ప్రేక్షకుల ముందుకురానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంది.&nbsp; ఉరుకు పటేలా తేజస్‌ కంచెర్ల ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం 'ఉరుకు పటేలా' (Uruku Patela). వివేక్ రెడ్డి దర్శకుడు. ఖుష్బూ చౌదరి కీలక పాత్రలో కనిపించనున్నారు. సెప్టెంబర్‌ 7న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. పల్లెటూరి నేపథ్యంలో ఈ సినిమా ఉండనున్నట్లు రిసెంట్‌గా రిలీజైన ట్రైలర్‌ను బట్టి తెలుస్తోంది.&nbsp; ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు TitleCategoryLanguagePlatformRelease DateThe Perfect CoupleSeriesEnglishNetflixSep 05Apollo 13: SurvicalDocumentaryEnglishNetflixSep 05Bad Boys: Ride or DieMovieEnglishNetflixSep 06Adios AmigoMovieMalayalamNetflixSep 06Sector 36MovieHindiNetflixSep 13Tanav Season 2SeriesHindiSonyLIVSep 06ThalaivanMovieMalayalamSonyLIVSep 10English TeacherMovieEnglishHotstar&nbsp;Sep 03KillMovieHindiHotstar&nbsp;Sep 06Brick ToonsMovieEnglishHotstar&nbsp;Sep 04The Fall GuyMovieEnglishJio CinemaSep 03Fight Night: The Million Dollar HeistSeriesEnglishJio CinemaSep 06
    సెప్టెంబర్ 02 , 2024
    <strong>Sobhita Dhulipala: దేశంలో శోభిత ధూళిపాళ క్రేజ్‌ మాముల్గా లేదుగా.. జాన్వీ, దీపిక, మృణాల్‌ను సైతం వెనక్కి నెట్టి!</strong>
    Sobhita Dhulipala: దేశంలో శోభిత ధూళిపాళ క్రేజ్‌ మాముల్గా లేదుగా.. జాన్వీ, దీపిక, మృణాల్‌ను సైతం వెనక్కి నెట్టి!
    ప్రముఖ హీరోయిన్‌ శోభిత దూళిపాళ (Sobhita Dhulipala) పేరు గత కొన్ని రోజులుగా మార్మోగుతోంది. స్టార్‌ హీరో అక్కినేని నాగ చైతన్య (Akkineni Naga Chaitanya)తో నిశ్చితార్థం జరిగినప్పటి నుంచి ఈ అమ్మడి పేరు సోషల్‌ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. స్టార్‌ హీరోయిన్‌ సమంతకు విడాకులు ఇచ్చిన చైతూను శోభిత పెళ్లి చేసుకోనుండటంతో ఒక్కసారిగా ఈ భామపై అటెన్షన్ ఏర్పడింది. అక్కినేని ఫ్యాన్స్‌ శోభిత రాకను సమర్థిస్తుంటే సామ్‌ అభిమానులు మాత్రం నెట్టింట విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఇదిలా ఉంటే దేశంలో అత్యంత ప్రజాధరణ పొందిన సెలబ్రిటీల జాబితాలో శోభిత రెండో స్థానంలో నిలిచి సత్తా చాటింది. స్టార్‌ హీరోలు, హీరోయిన్స్‌ను వెనక్కి నెట్టి మరి ఈ ఫీట్‌ సాధించింది. ఆ విశేషాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.&nbsp; శోభితానా మజాకా..! ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్‌ పోర్టల్ ఐఎండీబీ (IMDb) ఎక్కువ ప్రజాదరణ పొందిన నటీనటుల జాబితాను తాజాగా విడుదల చేసింది. ఈ వారం తమ వెబ్‌సైట్‌లో ఎక్కువ మంది యూజర్లు సెర్చ్ చేసిన సెలబ్రిటీల పేర్ల ఆధారంగా ఐఎండీబీ ఈ లిస్ట్‌ను రూపొందించింది. ఇందులో నటి శోభిత దూళిపాళ దేశంలోనే టాప్‌ 2లో నిలిచారు. తొలిస్థానంలో బాలీవుడ్‌ నటి శార్వరీ (Sharvari) నిలిచింది. శోభిత తర్వాతి స్థానంలో బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ ఖాన్‌ (Shah Rukh Khan) నిలవడం గమనార్హం. ఇక దీపిక పదుకొణే (Deepika Padukone), జాన్వీ కపూర్‌ (Janhvi Kapoor), కాజోల్‌ (Kajol) 4, 5, 6 స్థానాల్లో నిలిచారు. బాలీవుడ్‌ నటుడు లక్ష్య, తమిళ స్టార్‌ హీరో విజయ్‌ సేతుపతి (Vijay Sethupathi), హీరోయిన్‌ మృణాల్‌ ఠాకూర్‌ (Mrunal Thakur), ఐశ్వర్యరాయ్‌ (Aishwarya Rai) తదుపరి స్థానాల్లో నిలిచారు. అటు శ్వేత బసు ప్రసాద్‌ 14, దివ్య ఖోస్లా కుమార్‌ 18, ఫహాద్‌ ఫాజిల్‌ 25, విజయ్‌ 27, విక్రాంత్‌ మెస్సీ 35, త్రిష 37, జాన్‌ అబ్రహం 39, కమల్‌ హాసన్‌ 50 స్థానాల్లో నిలిచినట్లు ఐఎండీబీ తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో వెల్లడించింది.&nbsp; View this post on Instagram A post shared by IMDb India (@imdb_in) పాపులారిటీకి కారణమిదే! నటుడు నాగ చైతన్యతో శోభితకు ఎంగేజ్‌మెంట్‌ జరిగిన సంగతి తెలిసిందే. అక్కినేని నాగార్జున ఈ విషయాన్ని తొలిసారి పంచుకోవడంతో శోభిత పేరు ఒక్కసారిగా వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలో ఎంతోమంది నెటిజన్లు ఆమె గురించి తెలుసుకునేందుకు తెగ సెర్చ్‌ చేశారు. అక్కినేని కుటుంబంలో భాగం కాబోతున్న ఈ భామ వ్యక్తిగత, సినిమా నేపథ్యం గురించి కనుక్కొనే ప్రయత్నం చేశారు. దీంతో ఆమె ఈ వారం ఇండియన్‌ పాపులర్‌ సెలబ్రిటీగా మారిపోయింది. గతంలో ఎప్పుడు లేని విధంగా ఐఎండీబీ పాపులర్‌ సెలబ్రిటీల జాబితాలో రెండో స్థానం దక్కించుకుంది. చైతూతో ఎంగేజ్‌మెంట్‌ శోభితాకు బాగా కలిసొచ్చిందని నెటిజన్లు భావిస్తున్నారు. నిశ్చితార్థంపై శోభిత స్పందన ఇదే! టాలీవుడ్‌ హీరో నాగ చైతన్య (Naga Chaitanya)తో నిశ్చితార్థం జరిగిన ఫొటోలను శోభిత షేర్‌ చేస్తూ ఆనందం వ్యక్తం చేసింది. ‘మన పరిచయం ఎలా మొదలైనా? ప్రేమలో మన హృదయాలు కలిసిపోయాయి’ అని రాసుకొచ్చింది. దీన్ని నాగ చైతన్య రీ పోస్ట్‌ చేశారు. వాస్తవానికి&nbsp; చై-శోభిత డేటింగ్‌లో ఉన్నట్లు గత రెండేళ్ల నుంచి సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది. వీరిద్దరి హాలీడే ట్రిప్‌నకు సంబంధించిన ఫొటోలు సైతం పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. వీరి జోడి బాగుందంటూ అక్కినేని అభిమానులు పోస్టులు సైతం పెట్టారు. దీంతో చై-శోభిత కచ్చితంగా పెళ్లి పీటలు ఎక్కుతారని అంతా ఊహించారు. అనుకున్నట్లుగానే బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా వీరి నిశ్చితార్థం జరిగింది.&nbsp; View this post on Instagram A post shared by Sobhita (@sobhitad) శోభితా గురించి ఈ విషయాలు తెలుసా! శోభితా దూళిపాళ్ల ఏపీలోని తెనాలిలో జన్మించింది. 2013లో ఫెమినా మిస్‌ ఇండియా టైటిల్‌ విన్నర్‌గా నిలిచింది. బాలీవుడ్‌లో 2016లో విడుదలైన రామన్‌ రాఘవన్‌ 2.0 చిత్రం ద్వారా శోభిత సినీ రంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత ‘చెఫ్‌’, ‘కళాకంది’ వంటి బాలీవుడ్ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. 2018లో వచ్చి గూఢచారి చిత్రం ద్వారా శోభితా టాలీవుడ్‌కు పరిచయమైంది. తన అంద చందాలతో తెలుగు యూత్‌ ఆడియన్స్‌ను ఆకర్షించింది. ఆ తర్వాత మేజర్‌, పొన్నియన్‌ సెల్వన్ 1 &amp; 2 చిత్రాల్లో కీలక పాత్రలు పోషించి ఆకట్టుకుంది. ఇందులో ఆమె నటనకు ప్రశంసలు దక్కాయి. ఇటీవల 'మంకీ మాన్‌' అనే అమెరికన్‌ ఫిల్మ్‌లోనూ శోభితా నటించింది. ప్రస్తుతం హిందీలో 'సితారా' అనే చిత్రంలో నటిస్తోంది. ఇక నాగచైతన్య ‘తండేల్‌’తో బిజీగా ఉన్నాడు. చందూ మొండేటి దర్శకత్వంలో ఇది రూపొందుతోంది.&nbsp;
    ఆగస్టు 13 , 2024
    <strong>Prabhas: సినిమాల్లోనే కాదు రియల్ లైఫ్‌లోనూ ప్రభాస్‌ హీరోనే.. అతడి హెల్పింగ్‌ నేచర్‌కు బిగ్‌ సెల్యూట్‌!</strong>
    Prabhas: సినిమాల్లోనే కాదు రియల్ లైఫ్‌లోనూ ప్రభాస్‌ హీరోనే.. అతడి హెల్పింగ్‌ నేచర్‌కు బిగ్‌ సెల్యూట్‌!
    టాలీవుడ్‌లో గొప్ప మనసున్న హీరోల్లో రెబల్‌ స్టార్ ప్రభాస్ (Prabhas) ఒకరు. రీల్‌ లైఫ్‌లోనే కాదు నిజ జీవితంలోనే తాను హీరోనేని ప్రభాస్‌ పలు సందర్భాల్లో నిరూపించుకున్నారు. కష్టాల్లో ఉన్నవారికి చేయుత అందించి మంచి మనసు చాటుకున్నారు. అందుకే జయపజయాలతో సంబంధం లేకుండా ప్రభాస్‌ను అందరూ ఇష్టపడుతుంటారు. అతడి మంచితనానికి సెల్యూట్‌ చేస్తుంటారు. ఈ క్రమంలోనే తాజాగా ప్రభాస్‌ మరోమారు తన మంచి మనసును చాటుకున్నారు. కేరళ వరద బాధితులకు భారీ ఎత్తున ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. దీంతో ప్రభాస్‌ పేరు మరోమారు మార్మోగుతోంది. రూ. 2 కోట్లు విరాళం&nbsp; కేరళలోని వయనాడ్‌ జిల్లాలో కొండచరియలు విరిగిపడి వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. వేలమంది నిరాశ్రయులుగా మారారు. ఈ నేపథ్యంలో సహాయక చర్యల కోసం హీరో ప్రభాస్‌ భారీ విరాళాన్ని ప్రకటించారు. కేరళ సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.2 కోట్లు ఇస్తున్నట్లు ప్రభాస్‌ టీమ్‌ ప్రకటించింది. దీనిపై ప్రభాస్‌ ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రియులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. టాలీవుడ్‌ నుంచి అంత మెుత్తం ప్రకటించిన హీరో ప్రభాస్‌ కావడంతో ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. ప్రభాస్‌ రీల్‌లోనే కాదు రియల్‌ లైఫ్‌లోనూ హీరో అంటూ పోస్టులు పెడుతున్నారు. అండగా సెలబ్రిటీలు! ప్రకృతి విపత్తు నుంచి వయనాడ్‌ త్వరగా కోలుకునేందుకు ప్రభాస్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులూ తమ వంతు సాయాన్ని ప్రకటించారు. ఆ విషాద ఘటనపై స్పందించిన చిరంజీవి, రామ్‌చరణ్‌ రూ.కోటి విరాళంగా ప్రకటించారు. అల్లు అర్జున్‌ రూ.25 లక్షలు, హీరో సూర్య, ఆయన భార్య జ్యోతిక, సోదరుడు కార్తి సంయుక్తంగా రూ.50 లక్షలు, నయనతార - విఘ్నేశ్‌ శివన్‌ దంపతులు రూ.20 లక్షలు కేరళ సీఎం సహాయ నిధికి అందిస్తున్నట్లు తెలిపారు. అలాగే మలయాళ నటులు మమ్ముట్టి, ఆయన తనయుడు దుల్కర్‌ సల్మాన్‌ కలిపి రూ.35 లక్షలు, ఫహాద్‌ ఫాజిల్‌ రూ.25 లక్షలు, కమల్‌ హాసన్‌ రూ. 25 లక్షలు, విక్రమ్‌ రూ.20 లక్షలు, రష్మిక రూ.10 లక్షల విరాళం ప్రకటించారు. నటుడు మోహన్‌లాల్‌ స్వయంగా సహాయక చర్యల్లో పాల్గొనడమే కాకుండా తాను వ్యవస్థాపకుడిగా ఉన్న విశ్వశాంతి ఫౌండేషన్‌ ద్వారా రూ. 3 కోట్ల విరాళం ప్రకటించారు.&nbsp; గతంలోనూ ఇలాగే.. కేరళకు ఏ కష్టం వచ్చినా హీరో ప్రభాస్‌ ఆపన్న హస్తం అందిస్తూనే ఉంటారు. 2018 కేరళ వరదల సమయంలోనూ ప్రభాస్‌ అండగా నిలిచారు. రూ.కోటి విరాళాన్ని ప్రకటించి కేరళ ప్రజలకు అండగా నిలిచారు. మరోవైపు ప్రభాస్‌ ఏటా వంద మంది విద్యార్థులకు విద్యాదానం చేస్తున్నట్లు ఆయన సన్నిహితులు తెలిపారు. ఆ విద్యార్థులకు సంబంధించి స్కూల్‌ ఫీజులను ప్రభాస్ చెల్లిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ వార్త కూడా నెట్టింట వైరల్ అవుతోంది. అన్ని దానాల్లోకి విద్యాదానం గొప్పది అని గ్రహించిన ప్రభాస్‌ ఈమేరకు తన వంతు సాయం అందిస్తున్నట్లు ఫ్యాన్స్‌ అంటున్నారు. లక్షల్లో ఫీజులు కడుతున్నా తమ హీరో ఎప్పుడు ప్రచారం చేసుకోలేదని ప్రశంసిస్తున్నారు.&nbsp; https://twitter.com/i/status/1821114197213626764 డైరెక్టర్స్‌కు భారీ విరాళం ఈ ఏడాది మేలో ‘డైరెక్టర్స్‌ డే’ సందర్భంగా వేడుకల కోసం రూ.35 లక్షలు విరాళంగా ఇచ్చి ప్రభాస్‌ గొప్ప మనసు చాటుకున్నాడు. ఈ విషయాన్ని అసోసియేషన్ సభ్యులు స్వయంగా వెల్లడించారు.&nbsp; లెజండరీ డైరెక్టర్‌ దాసరి నారాయణరావు పుట్టిన రోజును పురస్కరించుకొని ప్రతీ ఏటా మే 4న డైరెక్టర్స్‌ డేను నిర్వహిస్తుంటారు. ఈ ఏడాది కూడా ఎల్బీ స్టేడియంలో ఈ వేడుకలు నిర్వహించగా దీనికి ఆహ్వానించేందుకు డైరెక్టర్ అసోసియేషన్‌ సభ్యులు ప్రభాస్‌ ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా వేడుకలు బాగా నిర్వహించాలంటూ ప్రభాస్‌ వారికి డబ్బు అందజేశాడు. దీంతో హీరో ప్రభాస్‌పై సర్వత్రా ప్రశంసల వర్షం కురిసింది.&nbsp; ఫుల్‌ స్వింగ్‌లో ప్రభాస్‌! ప్రస్తుతం దేశంలో ఏ స్టార్‌ హీరో చేతిలో లేనన్ని పాన్‌ ఇండియా చిత్రాలు ప్రభాస్‌ లిస్ట్‌లో ఉన్నాయి. ప్రభాస్‌ ప్రాజెక్టుల విషయానికి వస్తే.. ప్రస్తుతం అతడు మారుతి దర్శకత్వంలో ‘రాజా సాబ్‌’ (Raja Saab) చిత్రం చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. తర్వాత సందీప్‌ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga)తో ఓ సినిమా చేయనున్నాడు. ఈ చిత్రానికి స్పిరిట్‌ (Spirit) అనే టైటిల్‌ ఖరారు చేశారు. వీటితో పాటు ‘సలార్‌ సీక్వెల్‌’ ఉంది. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహించే ఈ చిత్రం షూటింగ్‌ ఈ ఏడాదిలోనే ప్రారంభమయ్యే అవకాశం ఉంది. వీటితో పాటు మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతున్న ‘కన్నప్ప’లోనూ ప్రభాస్‌ శివుడి పాత్ర పోషించనున్నాడు. అలాగే హను రాఘవపూడితో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ చిత్రాలన్నీ పూర్తవ్వడానికి కనీసం రెండేళ్ల సమయం పడుతుంది.&nbsp;
    ఆగస్టు 07 , 2024
    <strong>Kalki 2898 AD Day 2 Collections: రెండో రోజు 80% మేర పడిపోయిన ‘కల్కి’ వసూళ్లు.. షాక్‌లో ఫ్యాన్స్‌!</strong>
    Kalki 2898 AD Day 2 Collections: రెండో రోజు 80% మేర పడిపోయిన ‘కల్కి’ వసూళ్లు.. షాక్‌లో ఫ్యాన్స్‌!
    ప్రభాస్‌ హీరోగా నాగ్ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందిన 'కల్కి 2898 ఏడీ' చిత్రం విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. జూన్‌ 27న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం.. బాక్సాఫీస్‌ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. దేశవ్యాప్తంగా హోస్‌ఫుల్‌ బోర్డులతో సినీ అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. ఓపెనింగ్ రోజే ఈ సినిమా ఏకంగా రూ.191.50 కోట్లు వసూల్ చేసి సంచలనం సృష్టించింది. దీంతో రెండో రోజు కలెక్షన్లపై అందరి దృష్టి పడింది. మరి రెండో రోజు వసూళ్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.&nbsp; డే 2 కలెక్షన్స్ ఎంతంటే? 'కల్కి 2898 ఏడీ' రెండో రోజు వసూళ్లను నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్‌ అధికారికంగా ప్రకటించింది. తొలి రోజు రూ.191.5 కోట్లు రాబట్టిన ఈ చిత్రం.. రెండు రోజుల్లో వరల్డ్‌ వైడ్‌గా రూ.298.5 కోట్లు (GROSS) వసూలు చేసినట్లు ప్రకటించింది. ఈ మేరకు ఓ స్పెషల్‌ పోస్టర్‌ను సైతం సోషల్‌ మీడియాలో పోస్టు చేసింది. మేకర్స్‌ లెక్కల ప్రకారం.. కల్కి వరుసగా రెండో రోజు కూడా రూ.100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. రెండో రోజు కల్కి ఖాతాలో మరో రూ.107 కోట్లు (GROSS) వచ్చి చేరాయి. అయితే తొలి రోజు కలెక్షన్స్‌తో పోలిస్తే రెండో రోజు వసూళ్లు భారీగా పడిపోయాయి. కలెక్షన్స్‌లో 80% మేర కోత పడింది. దీంతో తొలి రెండు రోజుల్లో ఈజీగా రూ.350 కోట్ల మార్క్‌ దాటుతుందనుకున్న కల్కి.. కనీసం రూ.300 కోట్లు కూడా అందుకోలేకపోయింది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.&nbsp; తొలి రోజు ఆల్‌టైమ్‌ రికార్డు ప్రభాస్‌ ‘కల్కి’ సినిమా నార్త్‌ అమెరికాలో సంచలనం సృష్టిస్తోంది. ప్రభాస్‌తో (Prabhas) పాటు అగ్రతారల నటనకు అక్కడి ఆడియన్స్‌ ఫిదా అవుతున్నారు. ఈ క్రమంలోనే నార్త్‌ అమెరికాలో కల్కి ఆల్‌టైమ్‌ రికార్డును క్రియేట్‌ చేసింది. తొలి రోజున నార్త్‌ అమెరికా ప్రీమియర్స్‌ కలెక్షన్స్‌లో కల్కి ఏకంగా 3.8 మిలియన్‌ డాలర్ల వసూళ్లను సాధించింది. నార్త్ అమెరికాలో ఒక ఇండియన్‌ చిత్రం ఈ స్థాయి వసూళ్లు రాబట్టడం ఇదే తొలిసారి. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ చిత్రంగా కల్కి రికార్డును సొంతం చేసుకుంది. ఈ సినిమా తర్వాతి స్థానాల్లో ‘ఆర్‌ఆర్ఆర్‌’ (3.46 మిలియన్లు), ‘సలార్‌’ (2.6 మిలియన్లు), ‘బాహుబలి2’ (2.45 మిలియన్లు) ఉన్నాయి. 'ఆర్‌ఆర్‌ఆర్‌' రికార్డ్‌ సేఫ్‌! ట్రేడ్‌ వర్గాలు లెక్కలను బట్టి.. 'ఆర్‌ఆర్‌ఆర్‌' రికార్డును 'కల్కి 2898 ఏడీ' బీట్‌ చేయలేకపోయింది. ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రం తొలిరోజు రూ.223 కోట్లు (GROSS) రాబట్టి అత్యధిక డే1 వసూళ్లు సాధించిన ఇండియన్‌ చిత్రంగా టాప్‌లో ఉంది. ట్రేడ్‌ వర్గాల అంచనాల ప్రకారం 'కల్కి 2898 ఏడీ' రూ.180 కోట్ల వద్దే ఆగిపోవడంతో 'ఆర్‌ఆర్‌ఆర్‌' రికార్డ్‌ అలాగే భద్రంగా ఉంది. ఆ తర్వాత 'బాహుబలి 2' రూ.217 కోట్లతో రెండో స్థానంలో నిలించింది. అయితే రెండింటి రికార్డులను కల్కి బ్రేక్‌ చేయలేకపోయింది. కానీ, కేజీఎఫ్ 2 (రూ.164.5 కోట్లు), సలార్ (రూ.158 కోట్లు), ఆదిపురుష్ (136.8 కోట్లు), సాహో (రూ.125.6 కోట్లు) రికార్డ్స్‌ను బ్రేక్‌ చేసి టాప్‌-3లో నిలిచింది.&nbsp; కలెక్షన్లపై మ్యాచ్ ఎఫెక్ట్! 'కల్కి 2898 ఏడీ' సినిమాను ‘బాహుబలి 2’, ‘RRR’ చిత్రాల మాదిరిగా ప్రమోట్ చేయడంలో చిత్రబృందం వెనుకబడింది. ఇంకా పెద్ద స్థాయిలో ప్రమోషన్స్ చేసి ఉంటే ఈ సినిమా కొత్త రికార్డులను క్రియేట్ చేసే అవకాశం ఉండేది. అటు ఈ సినిమా తొలి రోజు కలెక్షన్లపై టీ-20 వరల్డ్ కప్ ఎఫెక్ట్ పడింది. గురువారం (జూన్‌ 27) సాయంత్రం జరిగిన ఇండియా-ఇంగ్లాండ్ సెమీ ఫైనల్ మ్యాచ్‌ను చూసేందుకు ఆడియన్స్ మొగ్గు చూపడం కొంత మైనస్‌గా మారింది. దీనికి తోడు గురువారం వర్కింగ్‌ డే కావడం కూడా కల్కి కలెక్షన్స్‌పై ప్రభావం చూపింది. ఇవాళ (జూన్‌ 29) వరల్డ్‌ కప్ ఫైనల్ ఉండటంతో కల్కి మూడో రోజు కలెక్షన్స్‌పై ఎఫెక్ట్‌ పడే అవకాశం ఉంది.&nbsp;
    జూన్ 29 , 2024
    Rajanikanth vs Suriya: స్టార్‌ హీరోల మధ్య బిగ్‌ ఫైట్‌.. బాక్సాఫీస్‌ బరిలో రజనీ - సూర్య చిత్రాలు!
    Rajanikanth vs Suriya: స్టార్‌ హీరోల మధ్య బిగ్‌ ఫైట్‌.. బాక్సాఫీస్‌ బరిలో రజనీ - సూర్య చిత్రాలు!
    భారతీయ చిత్ర పరిశ్రమలో మరో బిగ్‌ ఫైట్‌ లాక్‌ అయ్యింది. ఇద్దరు పాన్‌ ఇండియా స్టార్లు ఒకే రోజు బాక్సాఫీస్‌ వద్ద తలపడబోతున్నారు. సాధారణంగా ఏ రెండు చిన్న హీరోల సినిమాలు రిలీజైనా అందరి దృష్టి వాటిపైనే ఉంటుంది. ఎవరు పైచేయి సాధిస్తారు? ఎవరు ఫ్లాప్‌ టాక్‌తో సరిపెట్టుకుంటారు? అని ప్రతీ ఒక్కరు ఆసక్తిగా గమనిస్తుంటారు. అలాంటిది ఇద్దరు అగ్ర కథానాయకులు తలపడితే చిత్ర సీమలో ఇక ఏ స్థాయి అటెన్షన్‌ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇంతకీ ఆ హీరోలు ఎవరు? వారు చేసిన చిత్రాలు ఏంటి? అవి బాక్సాఫీస్‌ వద్ద ఎప్పుడు ఢీకొట్టబోతున్నాయి? ఈ కథనంలో పరిశీలిద్దాం.&nbsp; రజనీకాంత్‌ vs సూర్య తమిళ పరిశ్రమలో దసరాకు పెద్ద యుద్ధమే జరగబోతోంది. రజనీకాంత్ (Rajinikanth) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వేట్టయాన్’ (Vettaiyan), సూర్య (Suriya) నటిస్తున్న ‘కంగువా’ (Kanguva) చిత్రాలు ఒకదానికొకటి ఢీకొట్టబోతున్నాయి. సూర్య చిత్రాన్ని అక్టోబర్‌ 10న రిలీజ్‌ చేయబోతున్నట్లు తాజాగా మేకర్స్‌ ప్రకటించారు. మరోవైపు అంతకుముందే ఆ డేట్‌కు రజనీకాంత్‌ ఫిల్మ్‌ వేట్టయాన్‌ను మేకర్స్‌ లాక్‌ చేశారు. దీంతో ఈ ఇద్దరు స్టార్‌ హీరోల మధ్య భీకర పోరు తప్పదని ఇప్పటి నుంచే ఫిల్మ్‌ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఈ బిగ్‌ఫైట్‌లో విజయం తమదంటే తమదని ఫ్యాన్స్‌ నెట్టింట సవాలు విసురుకుంటున్నారు.&nbsp; భారీ తారాగణం సూర్య హీరోగా తెరకెక్కుతున్న ‘కంగువా’ చిత్రాన్ని స్టార్‌ డైరెక్టర్ శివ తెరకెక్కిస్తున్నారు. అజిత్‌తో ‘వేదాలం’, ‘వివేగం’ వంటి సూపర్‌ హిట్‌ సినిమాలు తీసిన శివ.. తొలిసారి సూర్యతో కలిసి పనిచేస్తుండటంతో తమిళనాట ఈ సినిమాపై మంచి బజ్‌ ఏర్పడింది. పైగా ఇందులో ప్రముఖ బాలీవుడ్‌ నటుడు బాబీ డియల్ ప్రతీనాయకుడి పాత్రను పోషించాడు. హీరోయిన్‌గా గ్లామర్‌ డాల్‌ దిశా పటానీ చేసింది. అలాగే ప్రకాష్‌ రాజ్‌, జగపతిబాబు, డైరెక్టర్‌ కే.ఎస్‌. రవికుమార్‌ కీలకమైన రోల్స్‌లో కనిపించనున్నారు. ప్రముఖ కమెడియన్‌ యోగిబాబు సైతం ఓ ముఖ్యమైన పాత్రతో అలరించేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఇప్పటికే మేకర్స్‌ రిలీజ్‌ చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. దీంతో రజనీకాంత్‌కు గట్టి సవాలు తప్పదని సూర్య ఫ్యాన్స్ అంటున్నారు.&nbsp; గిరిజన యోధుడిగా 'సూర్య' కోలీవుడ్‌లో అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిన చిత్రాల్లో ఒకటిగా కంగువా నిలిచింది. ఈ సినిమా నిర్మాణానికి రూ.350 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు టాక్. అయితే ఈ మూవీ పవర్‌ కథతో రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో సూర్య గిరిజన యోధుడిలా కనిపిస్తాడట. 1678 నాటి బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా కథ నటుడుస్తుందని అంటున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలను గమనిస్తే ఇదే విషయం అర్థమవుతుంది. అయితే కథకు టైమ్‌ ట్రావెల్‌ కాన్సెప్ట్‌ను కూడా జోడించినట్లు కోలివుడ్‌ వర్గాలు చర్చించుకుంటున్నాయి. మూవీ విడుదల తర్వాతే దీనిపై స్పష్టత వచ్చే ఛాన్స్ ఉంది.&nbsp; రజనీకాంత్‌- అమితాబ్‌ ఇక రజనీకాంత్‌ హీరోగా చేసిన 'వేట్టయాన్‌' సినిమాకి 'జై భీమ్‌' వంటి బ్లాక్‌ బాస్టర్‌ హిట్‌ అందించిన టీజే జ్ఞానవేల్‌ దర్శకత్వం వహించారు. ఇందులో బాలీవుడ్‌ దిగ్గజం అమితాబ్‌ బచ్చన్‌ ఓ ముఖ్యమైన పాత్ర పోషించారు. 32 ఏళ్ల తర్వాత రజనితో కలిసి ఆయన యాక్ట్ చేస్తున్నారు. దగ్గుబాటి రానా, ఫహాద్‌ ఫాజిల్‌, రానా, రితికా సింగ్‌, రావు రమేష్‌ ఇతర ముఖ్య తారాగణంగా ఉన్నారు. ఒక రిటైర్‌ అయిన పోలీసు ఆఫీసర్‌.. సమాజంలోని అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తే ఎలా ఉంటుందన్న కాన్సెప్ట్‌తో ఈ మూవీని రూపొందించారు. రజనీ మార్క్‌ యాక్షన్‌ ఈ మూవీలో ఉంటుందని ప్రచార చిత్రాలను బట్టే తెలుస్తోంది. దీంతో ‘వేట్టయాన్‌’ చిత్రంపై కూడా భారీగా అంచనాలు ఏర్పడ్డాయి మరి అక్టోబర్‌ 10న జరగబోయే ఈ సంగ్రామంలో విజయం ఎవరిదన్న అంశం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.&nbsp; అటు టాలీవుడ్‌లోనూ.. టాలీవుడ్‌లోనూ ఇద్దరు స్టార్‌ హీరోలు తలపబడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అల్లు అర్జున్‌ vs రామ్‌చరణ్‌ బాక్సాఫీస్‌ బరిలో నిలిచే పరిస్థితులు కనిపిస్తున్నాయి. బన్నీ హీరోగా చేస్తున్న ‘ పుష్ప 2’ రిలీజ్‌ డేట్‌ ఆగస్టు 15 నుంచి డిసెంబర్‌ 6కు మారింది. మరోవైపు రామ్‌చరణ్‌-శంకర్‌ కాంబోలో రూపొందుతున్న గేమ్ ఛేంజర్‌’ మూవీ కూడా డిసెంబర్‌లో విడుదలయ్యే ఛాన్స్‌ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. నిర్మాత దిల్‌రాజు కూడా డిసెంబర్‌ మెుదటి వారంలోనే ‘గేమ్‌ ఛేంజర్‌’ రిలీజ్‌ చేయాలని భావిస్తే బాక్సాఫీస్‌ వద్ద బిగ్‌ ఫైట్‌ తప్పదు. &nbsp;
    జూన్ 28 , 2024
    IMDB Top 100 Celebrities: ఐఏండీబీ జాబితాలో టాలీవుడ్‌కు అన్యాయం! ప్రభాస్, తారక్, రామ్‌చరణ్‌కు తక్కువ ర్యాంక్!
    IMDB Top 100 Celebrities: ఐఏండీబీ జాబితాలో టాలీవుడ్‌కు అన్యాయం! ప్రభాస్, తారక్, రామ్‌చరణ్‌కు తక్కువ ర్యాంక్!
    భారత్‌లో సెలబ్రిటీలకు ఉన్నంత క్రేజ్‌ మరే దేశంలో ఉండదని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక్కడి ఆడియన్స్‌ సినీ తారలను ఎంతగానో అభిమానిస్తారు. తమ ఫేవరేట్‌ హీరో, హీరోయిన్‌ సినిమా వస్తుందంటే ఓ పండగలా భావిస్తుంటారు. అంతేకాకుండా తమ తారల గురించి ఎప్పటికప్పుడు అప్‌డేట్స్‌ తెలుసుకునేందుకు సెర్చ్‌ చేస్తుంటారు. ఇలా పదేళ్ల కాలంలో అత్యధికసార్లు సెర్చ్‌ చేసిన టాప్‌ 100 సెలబ్రిటీలను IMDB ప్రకటించింది. ఇందులో టాలీవుడ్‌కు చెందిన పలువురు స్టార్ హీరోలు సైతం చోటు దక్కించుకున్నారు. మరి టాప్‌ 20లో ఉన్న సెలబ్రిటీలు ఎవరు? టాలీవుడ్‌ స్టార్స్‌కు ఏ ర్యాంకులు దక్కాయి? ఇప్పుడు చూద్దాం.&nbsp; టాప్‌-20లో బాలీవుడ్‌ తారలు సినిమాలు, సెలబ్రిటీలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఒకే వేదికపై అందుబాటులో ఉంచిన సంస్థగా ఐఏండీబీ (IMDB)కి పేరుంది. అటువంటి సంస్థ గత పదేళ్లలో తమ వెబ్‌సైట్‌లో అత్యధికంగా సెర్చ్‌ చేయబడ్డ టాప్‌ -100 సెలబ్రిటీల జాబితాను విడుదల చేసింది. ఈ లిస్ట్ లో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకోణె (Deepika Padukone) అగ్రస్థానంలో నిలిచింది. రెండో స్థానాన్ని బాలీవుడ్ బాద్‌షా షారుక్‌ ఖాన్‌ దక్కించుకున్నారు. ఆ తర్వాత వరుసగా ఐశ్వర్యరాయ్, ఆలియా భట్, ఇర్ఫాన్ ఖాన్ టాప్ 5లో నిలిచారు. గత పదేళ్ల కాలంలో ఈ తారల గురించే ఎక్కువగా సెర్చ్‌ చేసినట్లు IMDB ప్రకటించింది. ఇక ఈ జాబితాలో టాప్-20లో ఏ తెలుగు స్టార్‌ హీరోకూ చోటు దక్కక పోవడం గమనార్హం. అయితే సౌత్‌ నుంచి హీరోయిన్లు సమంత (13), తమన్నా (16), నయనతార (18) టాప్‌- 20లో చోటు దక్కించుకున్నారు.&nbsp; దీపిక పదుకొనే (Deepika Padukone)షారుక్‌ ఖాన్‌ (Shah Rukh Khan)ఐశ్వర్య రాయ్‌ బచ్చన్‌ (Aishwarya Rai Bachchan)అలియా భట్‌ (Alia Bhatt)ఇర్ఫాన్‌ ఖాన్‌ (Irrfan Khan)అమీర్‌ ఖాన్‌ (Aamir Khan)సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ (Sushant Singh Rajput)సల్మాన్‌ ఖాన్‌ (Salman Khan)హృతిక్‌ రోషన్‌ (Hrithik Roshan)&nbsp;అక్షయ్‌ కుమార్‌ (Akshay Kumar)కత్రినా కైఫ్‌ (Katrina Kaif)అమితాబ్‌ బచ్చన్‌ (Amitabh Bachchan)సమంత రూత్‌ ప్రభు (Samantha Ruth Prabhu)కరీనా కపూర్‌ (Kareena Kapoor)త్రిప్తి దిమ్రి (Tripti Dimri)తమన్న భాటియా (Tamannaah Bhatia)రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor)నయనతార (Nayanthara)రణ్‌వీర్‌ సింగ్ (Ranveer Singh)అజయ్‌ దేవగణ్‌ (Ajay Devgn) View this post on Instagram A post shared by IMDb India (@imdb_in) తెలుగులో టాప్‌ ఎవరంటే? ఐఎండీబీ విడుదల చేసిన టాప్‌ 100 సెలబ్రిటీల జాబితాలో టాలీవుడ్‌ నుంచి పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్‌ టాప్‌లో నిలిచాడు. ఈ జాబితాలో ఆయన 29వ స్థానంలో నిలిచాడు. బాహుబలి చిత్రం తర్వాత ప్రభాస్‌ గురించి దేశవ్యాప్తంగా ఎక్కువ మంది సెర్చ్‌ చేసినట్లు ఐఎండీబీ వర్గాలు తెలిపాయి. ఇక ఈ జాబితాలో ప్రభాస్‌ తర్వాత తెలుగు నుంచి రామ్‌ చరణ్‌ (31), అల్లు అర్జున్‌ (47), జూనియర్ ఎన్టీఆర్‌ (67), మహేశ్‌ బాబు (72) చోటు దక్కించుకున్నారు. అటు తమిళం నుంచి పలువురు స్టార్ హీరోలు కూడా ఈ లిస్ట్‌లో స్థానం సంపాదించారు. ధనుష్ (30), విజయ్ (35), రజనీకాంత్ (42), విజయ్ సేతుపతి (43), మాధవన్ (50), కమల్ హాసన్ (54), సూర్య (62), విక్రమ్ (92), అజిత్ (98) టాప్‌-100లో నిలిచారు.&nbsp; టాలీవుడ్‌కు అన్యాయం జరిగిందా? ఐఎండీబీ రిలీజ్‌ చేసిన తాజా జాబితాలో టాప్‌-20లో కనీసం ఒక్క తెలుగు హీరో చోటు దక్కించుకోకపోవడంపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఈ జాబితాను ఏకపక్షంగా ఐఎండీబీ రూపొందినట్లు విమర్శిస్తున్నారు. ప్రభాస్‌ (సలార్‌), అల్లు అర్జున్‌ (పుష్ప), రామ్‌చరణ్‌ - తారక్‌ (ఆర్‌ఆర్‌ఆర్‌) తమ చిత్రాలతో జాతీయ స్థాయిలో సత్తా చాటిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అయితే ఐఎండీబీ జాబితాలో తెలుగు స్టార్స్ వెనకబడి పోవడానికి ఓ కారణముందని సినీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఐఎండీబీ తాజా జాబితాను తన సైట్‌లో ఎక్కువగా సెర్చ్‌కు వచ్చిన తారలను ఆధారంగా చేసుకొని విడుదల చేసిందని చెబుతున్నాయి. వాస్తవానికి ఐఎండీబీ సైట్‌ను సౌత్‌లో కంటే నార్త్‌ ఆడియన్స్‌ ఎక్కువగా వినియోగిస్తారని తెలిపాయి. గత పదేళ్ల కాలంలో వచ్చిన సెర్చ్‌ వివరాలను లెక్కగట్టి ఐఎండీబీ ఈ లిస్ట్‌ను క్రియేట్‌ చేసిందని టాలీవుడ్ నిపుణులు గుర్తు చేస్తున్నారు. అందువల్లే బాలీవుడ్‌ స్టార్‌ ఈ జాబితాలో టాప్‌లో నిలిచారని విశ్లేషిస్తున్నారు. టాలీవుడ్‌ ఆడియన్స్‌ నుంచి కూడా సైట్‌లోకి పెద్ద ఎత్తున ట్రాఫిక్‌ వచ్చి ఉంటే మన వారు కూడా కచ్చితంగా టాప్‌-10లో నిలిచేవారని స్పష్టం చేస్తున్నారు.&nbsp;
    జూన్ 05 , 2024
    Highest Box office collections 2024: దేశంలోనే నెం.1 చిత్రంగా ‘హనుమాన్‌’.. హృతిక్‌, మహేష్‌ను వెనక్కినెట్టిన తేజ సజ్జ!
    Highest Box office collections 2024: దేశంలోనే నెం.1 చిత్రంగా ‘హనుమాన్‌’.. హృతిక్‌, మహేష్‌ను వెనక్కినెట్టిన తేజ సజ్జ!
    ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తేజ సజ్జ (Teja Sajja) హీరోగా నటించిన ‘హనుమాన్’ జాతీయ స్థాయిలో విశేష ఆదరణ పొందింది. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ చిత్రం.. బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. తెలుగు సినిమా ఖ్యాతిని మరో స్థాయికి తీసుకెళ్లడంలో తనవంతు పాత్ర పోషించింది. అటు థియేటర్లతో పాటు ఓటీటీ, టెలివిజన్‌ ప్రీమియర్స్‌లోనూ సత్తా చాటింది. ఈ క్రమంలోనే ‘హనుమాన్‌’ మరో ఘనత సాధించింది. దేశంలో ఈ ఏడాది ఇప్పటివరకూ విడుదలైన చిత్రాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా నిలిచింది. యంగ్‌ హీరో తేజ సజ్జా కలెక్షన్ల పరంగా బాలీవుడ్‌ స్టార్‌ హృతిక్‌ రోషన్‌ (Hrithik Roshan), మహేష్‌ బాబు (Mahesh Babu), అజయ్‌ దేవగణ్‌ (Ajay Devgan) చిత్రాలను వెనక్కి నెట్టాడు. ఈ ఏడాది హైయస్ట్‌ కలెక్షన్స్‌ రాబట్టిన టాప్‌-10 చిత్రాలు ఏవో ఇప్పుడు చూద్దాం.&nbsp; హనుమాన్‌ (HanuMan) తేజ సజ్జ హీరోగా తెరకెక్కిన హనుమాన్‌ చిత్రం.. వరల్డ్‌ వైడ్‌గా రూ.350 కోట్లకు పైగా గ్రాస్‌ సాధించి అగ్రస్థానంలో నిలిచింది. అయితే ఈ సినిమాను రూ.40 కోట్ల బడ్జెట్‌తో నిర్మించడం గమనార్హం. ప్రశాంత్‌ వర్మ డైరెక్షన్‌లో వచ్చిన ఈ మూవీలో.. అమృత అయ్యర్‌ హీరోయిన్‌గా చేసింది. వరలక్ష్మీ శరత్‌ కుమార్‌, సముద్రఖని, వినయ్‌ రాయ్‌, వెన్నెల కిషోర్‌, గెటప్‌ శ్రీను ముఖ్య పాత్రలు పోషించారు. ప్రస్తుతం ఈ సినిమా ‘జీ 5’ (Zee 5)లో స్ట్రీమింగ్‌ అవుతోంది.&nbsp; ఫైటర్‌ (Fighter) హృతిక్‌ రోషన్‌ (Hrithik Roshan), దీపికా పదుకొనే (Deepika Padukone), అనిల్‌ కపూర్‌ (Anil Kapoor) ప్రధాన పాత్రల్లో చేసిన బాలీవుడ్‌ చిత్రం 'ఫైటర్‌'.. ఈ జాబితాలో రెండో స్థానంలో నిలిచింది. సుమారు రూ.250 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం.. బాక్సాఫీస్‌ వద్ద రూ. 337.2 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా హిందీలో స్ట్రీమింగ్‌ అవుతోంది.&nbsp; మంజుమ్మెల్‌ బాయ్స్‌ (Manjummel Boys) మలయాళం సెన్సేషన్‌ ‘మంజుమ్మెల్‌ బాయ్స్‌’.. ఈ ఏడాది దేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో మూడో స్థానంలో నిలిచింది. రూ.20 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా వరల్డ్‌ వైడ్‌గా రూ.242.3 కోట్లు కొల్లగొట్టింది. అటు మలయాళంలో రూ.200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన తొలి చిత్రంగా ఆల్‌టైమ్‌ రికార్డు క్రియేట్‌ చేసింది. ప్రస్తుతం ఇది హాట్‌స్టార్‌లో తెలుగు భాషలో స్ట్రీమింగ్‌లో ఉంది.&nbsp; షైతాన్‌ (Shaitaan) బాలీవుడ్‌ లేటెస్ట్‌ చిత్రం 'షైతాన్‌' ఈ జాబితాలో నాల్గో స్థానంలో ఉంది. అజయ్‌ దేవగణ్‌ (Ajay Devgan), మాదవన్‌ (Madhavan), జ్యోతిక ప్రధాన పాత్రలు పోషించిన ఈ మూవీ.. రూ.211.06 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా బడ్జెట్‌ రూ.40 కోట్లు. ఇందులో విలన్‌గా కనిపించిన మాధవన్‌.. తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ‘షైతాన్‌’ మూవీ ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో హిందీ భాషలో అందుబాటులో ఉంది.&nbsp; గుంటూరు కారం (Guntur Kaaram) మహేశ్‌ బాబు - త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో వచ్చిన 'గుంటూరు కారం'.. ప్రస్తుత జాబితాలో టాప్‌ - 5లో నిలిచింది. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా రూ. 171.5 కోట్లు రాబట్టింది. ఇందులో మహేష్‌కు జోడీగా శ్రీలీల నటించింది. ప్రకాష్‌ రాజ్‌, జయరామ్‌, రమ్యకృష్ణ ప్రధాన తారాగణంగా ఉన్నారు. ఈ మూవీని నెట్‌ఫ్లిక్స్‌లో వీక్షించవచ్చు. ది గోట్‌ లైఫ్‌ (The Goat Life) మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్‌ (Prithviraj Sukumaran) లీడ్‌ రోల్‌లో చేసిన 'ది గోట్‌ లైఫ్‌'.. తెలుగులో ఆడు జీవితం అనే పేరుతో విడుదలైంది. ఈ మూవీ వరల్డ్‌వైడ్‌గా రూ.158.15 కోట్లు సాధించి టాప్‌ - 6లో నిలిచింది. ఈ మూవీ నిర్మాణానికి రూ. 82 కోట్లు ఖర్చు అయ్యింది. కాగా, ఈ మూవీ మే 26 నుంచి హాట్‌ స్టార్‌ వేదికగా స్ట్రీమింగ్‌లోకి రానుంది.&nbsp; క్రూ (Crew) టబూ, కరీనా కపూర్‌, కృతి సనన్‌ ప్రధాన పాత్రల్లో చేసిన 'క్రూ' (Crew) ఈ ఏడాది మంచి వసూళ్లు సాధించిన బాలీవుడ్‌ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. రూ.75 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద రూ.156.36 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రం మే 24 నుంచి నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా స్ట్రీమింగ్‌లోకి రానుంది.&nbsp; ఆవేశం (Aavesham) ఈ ఏడాది విడుదలై మంచి వసూళ్లు సాధించిన మలయాళ చిత్రం ‘ఆవేశం’. పుష్ప ఫేమ్‌ ఫహద్‌ ఫాజిల్‌ (Fahad Faasil) లీడ్‌ రోల్‌లో చేసిన ఈ చిత్రం.. వరల్డ్‌ వైడ్‌గా రూ. 155 కోట్లు రాబట్టింది. ఈ చిత్ర నిర్మాణానికి రూ. 30 కోట్లు ఖర్చు అయ్యింది. ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌లో ఉంది. ప్రేమలు (Premalu) మలయాళం సెన్సేషన్‌ ప్రేమలు కూడా.. రూ.136 కోట్ల వసూళ్లు సాధించి ఈ జాబితాలో తొమ్మిదో స్థానంలో నిలిచింది. రూ. 3 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రంలో నస్లెన్ కె. గఫూర్‌, మమితా బైజు ముఖ్యపాత్రలు పోషించారు. ప్రస్తుతం ఈ సినిమా డిస్నీ + హాట్‌స్టార్‌ వేదికగా స్ట్రీమింగ్‌ అవుతోంది. తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో వీక్షించవచ్చు. టిల్లు స్క్వేర్‌ (Tillu Square) సిద్ధు జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda) హీరోగా చేసిన లెటేస్ట్‌ చిత్రం.. టిల్లు స్క్వేర్‌ ఈ ఏడాది అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రాల్లో టాప్‌ 10లో నిలిచింది. ఈ చిత్రం వరల్డ్‌ వైడ్‌గా రూ.135 కోట్లకు పైగా కలెక్షన్స్‌ రాబట్టింది. ఇందులో సిద్ధూకు జోడీగా అనుపమా పరమేశ్వరన్‌ (Anupama Parameswaran) చేసింది. ప్రస్తుతం ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా స్ట్రీమింగ్‌లో ఉంది.&nbsp;
    మే 22 , 2024
    Prabhas: మంచి మనసు చాటుకున్న ప్రభాస్‌.. ఆహ్వానానికి వెళ్తే భారీ విరాళం!
    Prabhas: మంచి మనసు చాటుకున్న ప్రభాస్‌.. ఆహ్వానానికి వెళ్తే భారీ విరాళం!
    దేశం మెచ్చిన నటుల్లో రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ (Prabhas) ఒకరు. ఈ హీరో పేరు చెబితే బాక్సాఫీస్‌ రికార్డులు, పాన్‌ ఇండియా స్థాయి చిత్రాలే గుర్తుకువస్తాయి. అయితే ప్రభాస్‌కు మంచి మనసున్న వ్యక్తిగానూ గుర్తింపు ఉంది. ప్రభాస్‌ ఇప్పటివరకూ ఎన్నో సినిమాల్లో నటించినప్పటికీ ఎన్నడూ కాంట్రవర్సీల జోలికి పోలేదు. ఏ స్టేజీ మీద వివాదస్పద వ్యాఖ్యలు చేయలేదు. పైగా తన వద్దకు వచ్చిన వారికి పసందైన భోజనాన్ని పెట్టి వారి మన్ననలు పొందుతుంటాడు. అంతే కాకుండా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ అందరిచేత శభాష్‌ అనిపించుకుంటున్నాడు. ఈ క్రమంలోనే ప్రభాస్‌ మరోమారు తన మంచి మనసును చాటుకున్నాడు.&nbsp; డైరెక్టర్స్‌కు భారీ విరాళం లెజండరీ డైరెక్టర్‌ దాసరి నారాయణరావు (Dasari Narayana Rao Birthday) పుట్టిన రోజును పురస్కరించుకొని ఏటా మే 4న ‘డైరెక్టర్స్‌ డే’ (Directors Day)ను జరుపుకుంటున్నారు. ఈసారి వేడుకలను హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో ఘనంగా నిర్వహించాలని ఫిల్మ్‌ డైరెక్టర్ అసోసియేషన్‌ నిర్ణయించింది. ఈ కార్యక్రమానికి అహ్వానించేందుకు అసోసియేషన్‌ సభ్యులు తాజాగా ప్రభాస్‌ను కలిశారు. ఈ సందర్భంగా వేడుకలు గ్రాండ్‌ చేయాలంటూ ప్రభాస్‌ వారికి రూ.35 లక్షలు విరాళంగా అందజేశారు. ఈ విషయాన్ని అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ స్వయంగా వెల్లడించారు. దీంతో హీరో ప్రభాస్‌పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది.&nbsp; ఫుల్‌ స్వింగ్‌లో ప్రభాస్‌! ప్రస్తుతం దేశంలో ఏ స్టార్‌ హీరో చేతిలో లేనన్ని పాన్‌ ఇండియా చిత్రాలు ప్రభాస్‌ లిస్ట్‌లో ఉన్నాయి. ప్రభాస్‌ ఏ డైరెక్టర్‌కైనా ఓకే చెప్తే ఆ ప్రాజెక్ట్‌ మెుదలయ్యేది 2026 తర్వాతనే. ప్రభాస్‌ ప్రాజెక్టుల విషయానికి వస్తే.. ప్రస్తుతం అతడు 'కల్కీ 2898 ఏడీ' సినిమాలో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం ఈ ఏడాదిలోనే రిలీజ్‌ కానుంది. దీంతో పాటు మారుతి దర్శకత్వంలో ‘రాజా సాబ్‌’ (Raja Saab) చిత్రం చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. తర్వాత సందీప్‌ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga)తో ఓ సినిమా చేయనున్నాడు. ఈ చిత్రానికి స్పిరిట్‌ (Spirit) అనే టైటిల్‌ ఖరారు చేశారు. వీటితో పాటు ‘సలార్‌ సీక్వెల్‌’ ఉంది. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహించే ఈ చిత్రం షూటింగ్‌ ఈ ఏడాదిలోనే ప్రారంభమయ్యే అవకాశం ఉంది. వీటితో పాటు మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతున్న ‘కన్నప్ప’లోనూ ప్రభాస్‌ శివుడి పాత్ర పోషించనున్నాడు. అలాగే హను రాఘవపూడితో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ చిత్రాలన్నీ పూర్తవ్వడానికి కనీసం రెండేళ్ల సమయం పడుతుంది.&nbsp;
    ఏప్రిల్ 23 , 2024
    Pushpa 2 OTT Record: విడుదలకు ముందే RRR రికార్డు బ్రేక్‌.. ఇది పుష్పగాడి రూలు..!
    Pushpa 2 OTT Record: విడుదలకు ముందే RRR రికార్డు బ్రేక్‌.. ఇది పుష్పగాడి రూలు..!
    ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా రష్మిక మంధాన హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రం పుప్ప2. తొలి పార్ట్‌ సూపర్ హిట్ కావడంతో ఈచిత్రాన్ని  పాన్‌ ఇండియా రేంజ్‌లో  దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం విడుదలకు ముందే ప్రీరిలీజ్ బిజినెస్‌పరంగా సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. ఈ చిత్రం గురించి వినిపిస్తున్న లెటెస్ట్ బజ్‌ ప్రకారం.. ఈ సినిమా నార్త్ హక్కులే సుమారు 200 కోట్లకి అమ్ముడుపోయినట్లు తెలిసింది. ఈ విషయంలో కల్కి, దేవర.. పుష్ప  తరువాతే ఉన్నారని చెప్పవచ్చు. కల్కి నార్త్ రైట్స్ 100 కోట్లకు కొనుగోలు అయితే.. దేవర 50 కోట్లకు అమ్ముడు పోయినట్లు సమాచారం. ఇక ఈ ప్రీ రిలీజ్ బిజినెస్ చూస్తుంటే.. రిలీజ్ తరువాత నార్త్ లో పుష్ప రూల్ ఎలా ఉండబోతుందో కళ్లకు కడుతోంది. మరోవైపు పుష్ప 2 ఓటిటి (Pushpa 2 OTT Rights) హక్కుల కొనుగోలుపై కూడా రూమర్స్ అయితే చక్కర్లు కొడుతున్నాయి. RRR రికార్డు బ్రేక్ తాజాగా వస్తున్న వార్తల ప్రకారం పుష్ప 2 ది రూల్ చిత్రం ఓటీటీ హక్కులను నెట్‌ఫిక్స్‌ భారీ ధరకు దక్కించుకున్నట్లు సమాచారం. ఏకంగా ఈ సినిమా ఓటీటీ ప్రసార హక్కుల కోసం రూ.275 కోట్ల భారీ డీల్‌ను మూవీ మేకర్స్‌తో కుదుర్చుకున్నట్లు తెలిసింది. ఇది ఇండియాలోనే అత్యధికమైన డీల్ అని క్రిటిక్స్ అభిప్రాయపడుతున్నారు. గతంలో మరే చిత్రం ఈ స్థాయిలో అమ్ముడుపోలేదని చెబుతున్నారు. పుష్ప2కు ముందు.. RRR చిత్రం ఓటీటీ ప్రసార హక్కులు భారీ ధరకు అమ్ముడు పోయాయి. దీంతో అల్లు అర్జున్ RRR రికార్డును బ్రేక్ చేసినట్లుగా తెలుస్తుంది. ఈ చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను జీ5, నెట్‌ఫ్లిక్స్ కలిసి రూ.350 కోట్లకు దక్కించుకున్నాయి. అయితే నెట్‌ఫ్లిక్స్‌ ఇందులో మెజార్టీ వాటను నెట్‌ ఫ్లిక్స్ చెల్లించింది. అయితే మొత్తం పుష్ప 2 డీల్ కంటే తక్కువ అని తెలిసింది. RRR చిత్రాన్ని కన్నడ మినహా అన్ని భాషల్లో స్ట్రీమింగ్ కోసం నెట్‌ఫ్లిక్స్ ప్రసార హక్కులను సొంతం చేసుకుంది. జీ5 కన్నడ భాష ప్రసార హక్కులను దక్కించుకుంది. అయితే పుష్ప 2 ఓటీటీ ప్రసార హక్కులను నెట్‌ఫ్లిక్స్ ఎన్ని భాషాల్లో స్ట్రీమింగ్ చేయనుందో తెలియాల్సి ఉంది. RRR సినిమా మాదిరి మెజారిటీ భాషల్లో ప్రసారం చేస్తుందా? లేక అన్ని భాషల్లో ప్రసార హక్కులను దక్కించుకుందో తెలియాల్సి ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే? మరోవైపు పుష్ప 2 థియేట్రికల్ ప్రి రిలీజ్ బిజినెస్ సైతం భారీగానే జరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం థియేట్రికల్ రైట్స్‌ కోసం దాదాపు రూ.200కోట్లకు బయ్యర్లు కోట్ చేసినట్లు తెలుస్తోంది. టీజర్‌తో భారీ హైప్  పుష్ప 2 పై ఉన్న క్రేజ్ అభిమానుల్లో మాములు లెవల్లో అయితే లేదనే చెప్పాలి. ఇప్పటికే విడుదలైన పుష్ప 2 టీజర్ సినిమా ఎలా ఉండబోతుందో అన్న ఆసక్తిని సర్వత్రా కలిగించింది. టీజర్‌లో బన్నీ చాలా పవర్‌ఫుల్‌గా, ఫెరోషియస్‌గా కనిపించాడు. అమ్మవారి గెటప్‌లో మాస్‌ అవతారంతో గూప్‌బంప్స్‌ తెప్పించాడు. జాతరలో ఫైట్‌కు సంబంధించిన సీన్‌ను మేకర్స్‌ ఫ్యాన్స్‌ కోసం ప్రత్యేకంగా రిలీజ్ చేశారు. ఇందులో బన్నీ నడిచే స్టైల్, స్వాగ్ అదిరిపోయాయి. కాళ్లకు గజ్జెలు, చెవులకు రింగ్స్, కళ్లకు కాటుకతో ‘పుష్ప రాజ్‌’ లుక్ అదిరిపోయింది. టీజర్‌లో రివీల్‌ చేసిన ఫైట్ సీక్వెన్స్ థియేటర్లను మోత మోగించేలా కనిపిస్తోంది. ఇక టీజర్‌లో దేవిశ్రీ ప్రసాద్‌ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ నెక్ట్స్ లెవెల్ అనేలా ఉంది. ఓవరాల్‌గా ఈ టీజర్‌ ఫ్యాన్స్‌కు విపరీతంగా నచ్చేసింది.  పుష్ప 2 రిలీజ్ ఎప్పుడంటే? పుష్ప 2 సినిమాను ఈ ఏడాది ఆగస్టు 15న విడుదల చేయనున్నట్లు మేకర్స్‌ ఇప్పటికే ప్రకటించారు.&nbsp; స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా వరల్డ్ వైడ్‌గా ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సినిమాలో అల్లు అర్జున్‌తోపాటు రష్మిక మందన్న, ఫహాద్ ఫాజిల్, ధనుంజయ్, సునీల్, అనసూయ భరద్వాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించనున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో వచ్చిన ‘పుష్ప ది రైజ్‌’ 2021లో విడుదలై సెన్సేషన్‌ క్రియేట్ చేసింది. దీంతో దీనికి సీక్వెల్‌గా వస్తున్న 'పుష్ప 2'పై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమాలో రష్మికా హీరోయిన్‌గా నటిస్తుండగా సునీల్, రావు రమేష్, ఫహద్ పాసిల్ అలాగే అనసూయ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.&nbsp; దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ తెరకెక్కిస్తోంది.
    ఏప్రిల్ 18 , 2024
    CSpace OTT App: మూవీ లవర్స్‌కు గుడ్‌ న్యూస్‌.. ప్రభుత్వ రంగ ఓటీటీ వచ్చేస్తోంది.. బెన్‌ఫిట్స్ ఇవే!
    CSpace OTT App: మూవీ లవర్స్‌కు గుడ్‌ న్యూస్‌.. ప్రభుత్వ రంగ ఓటీటీ వచ్చేస్తోంది.. బెన్‌ఫిట్స్ ఇవే!
    భారత్‌ సహా ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం ఓటీటీ (OTT) యుగం నడుస్తోంది. మెున్నటి వరకూ ఎంటర్‌టైన్‌మెంట్‌ వేదికలుగా ఉన్న థియేటర్ల స్థానాన్ని ఓటీటీలు ఆక్రమించేశాయి. బడా హీరోల చిత్రాలు మినహా.. అత్యధిక శాతం చిన్న సినిమాలు నేరుగా ఓటీటీలోనే రిలీజ్‌ అవుతున్నాయి. ప్రస్తుతం అమెజాన్‌ ప్రైమ్ (Amazon Prime), నెట్‌ఫ్లిక్స్‌ (Netflix), డిస్నీ+హాట్‌స్టార్‌ (Disney + Hotstar), సోనీలివ్‌ (SonyLIV), ఈటీవీ విన్‌ (ETV Win), వూట్‌ (Voot), ఆహా (Aha) వంటి ఓటీటీ వేదికలు కొత్త సినిమాలు - సిరీస్‌లు విడుదల చేస్తూ మంచి ఆదరణ పొందుతున్నాయి. ఈ నేపథ్యంలో కేరళ ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది. సొంతంగా ఒక ఓటీటీ యాప్‌ను తయారు చేయడానికి సిద్ధమయ్యింది. మార్చి 7న ఈ యాప్‌ను లాంచ్ చేస్తున్నట్టు కేరళ ప్రభుత్వం ప్రకటించింది.&nbsp; ఓటీటీ ఏర్పాటుకు కారణం ఇదే! మలయాళం నుంచి వచ్చే చిత్రాలకు భారత్‌లో మంచి ఆదరణ ఉంది. కంటెంట్‌ ఉన్న కథలను మాలీవుడ్‌ నిర్మిస్తుందన్న పేరు ఉంది. మలయాళం నుంచి తెలుగులోకి డబ్ అయిన చిత్రాలు.. ఇప్పటికే ప్రేక్షకాధరణతో దూసుకెళ్తున్నాయి. కొందరైతే సబ్‌టైటిల్స్‌ పెట్టుకొని మరి మాలీవుడ్‌ సినిమాలను వీక్షిస్తున్నారు. ఇది గమనించిన కేరళ ప్రభుత్వం.. డిజిటల్‌ ఎంటర్‌టైన్మెంట్‌లో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసేందుకు సిద్ధమైంది. ‘సీస్పేస్‌’ (CSpace) పేరుతో కొత్త ఓటీటీ యాప్‌ను మూవీ లవర్స్‌ ముందుకు తీసుకొస్తోంది. ఈ యాప్‌లో ఎంటర్‌టైన్మెంట్‌తో పాటు ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుందని అంటున్నారు. 60 మంది ఉద్యోగులతో.. కేరళ సీఎం పినరయి విజయన్‌ (Pinarayi Vijayan) రేపు స్వయంగా ‘సీస్పేస్‌’ (CSpace) యాప్‌ను లాంచ్‌ చేస్తారు. ఉదయం 9.30 గంటలకు.. కైరళి థియేటర్‌లో జరగనున్న లాంచ్‌ ఈవెంట్‌లో దీనిని ఆవిష్కరిస్తారు. ఈ కార్యక్రమానికి ఆ రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి సజీ చెరియన్ (Saji Cherian) కూడా హాజరవుతారు. ఓటీటీ సెక్టార్ విషయంలో ఎదురవుతున్న సమస్యలకు ‘సీస్పెస్’ ఒక పరిష్కారాన్ని ఇస్తుందని కేరళ స్టేట్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ - KSFDC (Kerala State Film Development Corporation) చైర్మన్ షాజీ ఎన్ కరుణ్ తెలిపారు. కేరళ ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న KSFDCనే ఈ ‘సీస్పేస్’ యాప్‌ను రన్ చేస్తుందని స్పష్టం చేశారు. ఇప్పటికే ఈ యాప్‌లో పనిచేయడం కోసం కల్చరల్స్‌పై అవగాహన ఉన్న 60 మంది సిబ్బందిని సెలక్ట్‌ చేసినట్లు చెప్పుకొచ్చారు.&nbsp; ప్రత్యేక పానెల్‌ ఏర్పాటు! ఈ ‘సీస్పేస్‌’ ఓటీటీలో ఎటువంటి కంటెంట్‌ను అందుబాటులోకి తీసుకురావాలో నిర్ణయించేందుకు ఓ ప్రత్యేక ప్యానెల్‌ను సైతం KSFDC సంస్థ ఏర్పాటు చేసింది. బెన్యమిన్, ఓవీ ఉషా, సంతోష్ శివన్, శ్యామప్రసాద్, సన్నీ జోసెఫ్, జియో బేబీ వంటి సీనియర్లతో ఈ ప్యానెల్‌ ఏర్పాటైంది. వీరంతా కలిసి ‘సీస్పేస్’ యాప్‌ కార్యకలాపాలను పర్యవేక్షిస్తారు. ఈ యాప్‌లో ఎలాంటి సమాచారం స్ట్రీమ్ అవ్వాలి అనేది పూర్తిగా ఈ ప్యానెల్‌ చేతుల్లోనే ఉండనుంది. సీస్పేస్ లాంచ్ సందర్భంగా ఇప్పటికే మొదటి ఫేజ్‌లో భాగంగా 35 సినిమాలు, 6 డాక్యుమెంటరీలు, ఒక షార్ట్ ఫిల్మ్ సెలక్ట్ చేశామని, లాంచ్ అవ్వగానే అవి స్ట్రీమింగ్‌కు అందుబాటులో ఉంటాయని KSFDC డైరెక్టర్‌ కరుణ్ తెలిపారు. ‘సీస్పేస్‌’ ఎలా పనిచేస్తుంది? ‘సీస్పేస్‌’ యాప్‌ను మాస, త్రైమాసిక, వార్షిక చెల్లింపుల విధానంలో కాకుండా ‘పే పర్‌ వ్యూ‘ (Pay Per View) స్కీమ్‌తో రన్‌ చేయనున్నారు. ఇందులో సినిమా చూడాలంటే రూ.75 చెల్లించాల్సి ఉంటుంది. అలా వచ్చిన సొమ్మును చిత్ర నిర్మాతలకు సీస్పేస్‌ ప్యానెల్ అందజేస్తుంది. ఒకవేళ తక్కువ నిడివి ఉన్న కంటెంట్‌ వస్తే సగం ధరకే వీక్షించే అవకాశం కల్పించనున్నారు. ప్రస్తుతానికి ఈ యాప్‌లో ఎక్స్‌క్లూజివ్‌గా సినిమాలు ఏమీ అందుబాటులోకి రావడం లేదని, త్వరలోనే అలాంటి ప్రయత్నాలు కూడా జరుగుతాయని KSFDC డైరెక్టర్‌ కరుణ్ తెలిపారు. ‘సీస్పేస్‌’తో ఎవరికి లాభం! కేరళలో చాలా మంది నిర్మాతలు తమ చిత్రాలను నేరుగా ఓటీటీల్లో విడుదల చేస్తున్నారు. దీనివల్ల లాభాలు తగ్గుతున్నాయని పలువురు ఎగ్జిబిటర్లు, పరిశ్రమ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఈ సమస్యకు సీస్పేస్‌ చెక్‌ పెట్టనుంది. థియేటర్లలో విడుదలైన సినిమాలను మాత్రమే ఈ ఓటీటీలో విడుదల చేయనున్నట్లు KSFDC డైరెక్టర్‌ కరుణ్ తెలిపారు. అలాగే థియేటర్లు దొరక్క సమస్యలు ఎదుర్కొనే నూతన దర్శకులు తమ చిత్రాలను సీస్పేస్‌లో రిలీజ్‌ చేసుకోవచ్చని సూచించారు. క్రౌడ్‌ ఫండింగ్‌ ద్వారా ఆదాయం పొందవచ్చని తెలియజేశారు. అటు ఓటీటీ ద్వారా వచ్చిన లాభాల్లో కొంత మొత్తాన్ని చిత్ర పరిశ్రమలో ఉపాధిలేని నిపుణుల సంక్షేమం కోసం వినియోగించనున్నట్లు&nbsp; స్పష్టం చేశారు.
    మార్చి 06 , 2024
    Eagle Day 1 Collections: రవితేజ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 10 చిత్రాలు!&nbsp;&nbsp;
    Eagle Day 1 Collections: రవితేజ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 10 చిత్రాలు!&nbsp;&nbsp;
    మాస్ మహారాజ్ రవితేజ (Ravi Teja) నటించిన యాక్షన్ సినిమా ‘ఈగల్’ (Eagle). నిన్న (ఫిబ్రవరి 9) థియటర్స్‌లో గ్రాండ్‌గా రిలీజయింది. ఇందులో రవితేజకు జోడీగా కావ్య థాపర్ (Kavya Thapar) నటించగా.. అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran), నవదీప్, వినయ్ రాయ్, అవసరాల శ్రీనివాస్, మధుబాల.. పలువురు ముఖ్య పాత్రలు పోషించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో మాస్ యాక్షన్ సినిమాలాగా ఈగల్‌ తెరకెక్కింది. మెుదటి షో నుంచే హిట్‌ టాక్‌ తెచ్చుకున్న ఈ చిత్రం.. తొలిరోజు మంచి వసూళ్లనే సాధించి రవితేజ ఫ్యాన్స్‌కు మంచి కిక్కిచ్చింది.&nbsp; తొలి కలెక్షన్స్ ఎంతంటే? తొలి రోజు బాక్సాఫీస్ వద్ద ఈగల్‌ దూకుడు ప్రదర్శించింది. యూఎస్‌ మార్కెట్‌లోనూ మంచి వసూళ్లను సాధించింది. మెుదటి రోజున వరల్డ్‌ వైడ్‌గా ఈ చిత్రం రూ.11.90 కోట్ల గ్రాస్‌ సాధించినట్లు ట్రేడ్‌ వర్గాలు ప్రకటించాయి. దీంతో రవితేజ కెరీర్‌లోనే మరో బిగ్గెస్ట్ ఓపెనర్ గా ‘ఈగల్’ నిలిచింది. అలాగే ఈ వీకెండ్‌లో కూడా ‘ఈగల్’ మంచి వసూళ్లు రాబడుతుంది అని మేకర్స్ భావిస్తున్నారు. ఈ ఫ్లో ఇలాగే కంటిన్యూ అయితే బాక్సాఫీస్‌ వద్ద ఈగల్‌కు తిరుగుండదని అభిప్రాయపడుతున్నారు. కాగా, ఈ చిత్రానికి డేవ్ జాండ్ సంగీతం అందించారు. రవితేజ టాప్‌-10 కలెక్షన్స్‌! (Ravi Teja Top 10 Highest Grossing Movies) ‘ఈగల్’ చిత్రం పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకోవడంతో పాటు రికార్డు ఓపెనింగ్స్‌ సాధించింది. దీంతో రవితేజ కెరీర్‌లో ఈ చిత్రం హెయెస్ట్ గ్రాసర్‌గా నిలవనుందని అభిమానులు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో రవితేజ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు రాబట్టిన టాప్-10 చిత్రాలపై ఓ లుక్ వేద్దాం. ధమాకా (Dhamaka) రవితేజ హీరోగా త్రినాథ రావు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం.. బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. రూ.35 కోట్లు కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా.. వరల్డ్‌ వైడ్‌గా రూ.84.7 కోట్ల గ్రాస్‌ సాధించింది. రూ.44.5 కోట్ల షేర్‌ వసూలు చేసింది. ధమాకా ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ రూ.20 కోట్ల వరకూ జరిగింది.&nbsp; బడ్జెట్: 35 కోట్లు ప్రపంచవ్యాప్త గ్రాస్ : 84.7cr ప్రపంచవ్యాప్తంగా షేర్: 44.5cr ప్రీ రిలీజ్ బిజినెస్ : 20 కోట్లు క్రాక్‌ (Krack)&nbsp; ధమాకా తర్వాత రవితేజ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన రెండో చిత్రంగా ‘క్రాక్’ నిలిచింది. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ.70.6 కోట్ల గ్రాస్‌, రూ. 39.4 షేర్‌ను వసూలు చేసింది. ఈ సినిమా ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ రూ.18 కోట్లకు జరగడం గమనార్హం. క్రాక్‌ చిత్రానికి గోపిచంద్‌ మలినేని దర్శకత్వం వహించారు.&nbsp; బడ్జెట్: 30 కోట్లు ప్రపంచవ్యాప్త గ్రాస్ : 70.6cr ప్రపంచవ్యాప్తంగా షేర్: 39.4cr ప్రీ రిలీజ్ బిజినెస్ : 18 కోట్లు తీర్పు: బ్లాక్ బస్టర్ రాజా ది గ్రేట్‌ (Raja the Great) రవితేజ హీరోగా అనిల్‌ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం.. వరల్డ్ వైడ్‌గా రూ.52 కోట్ల గ్రాస్‌ రాబట్టింది. రూ.31.6 కోట్ల షేర్‌ను నిర్మాతలకు అందించింది. ఈ చిత్ర నిర్మాణానికి రూ.30 కోట్లు బడ్జెట్‌ కాగా.. ప్రీ రిలీజ్‌ బిజినెస్‌లోనే ఆ మెుత్తాన్ని రాబట్టడం విశేషం.&nbsp; బడ్జెట్: 30 కోట్లు ప్రపంచవ్యాప్త గ్రాస్: 52cr వరల్డ్ వైడ్ షేర్ : 31.6cr ప్రీ-రిలీజ్ బిజినెస్: 30 కోట్లు తీర్పు: హిట్ బలుపు (BALUPU) రూ.25 కోట్ల బడ్టెట్‌తో రూపొందిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.50.1 కోట్లు కొల్లగొట్టుంది. రూ.28 కోట్ల షేర్‌ను రాబట్టింది. గోపిచంద్‌ మలినేని (Gopichand Malineni) దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా తన ప్రీరిలీజ్‌ బిజినెస్‌ను రూ.15 కోట్లకు చేసుకుంది.&nbsp; బడ్జెట్: 25 కోట్లు ప్రపంచవ్యాప్త గ్రాస్ : 50.1cr ప్రపంచవ్యాప్తంగా షేర్: 28cr ప్రీ రిలీజ్ బిజినెస్ : 15 కోట్లు టైగర్‌ నాగేశ్వరరావు (Tiger Nageswara Rao) రవితేజ గత చిత్రం టైగర్‌ నాగేశ్వరరావు మిక్స్‌డ్‌ టాక్ సొంతం చేసుకోవడంతో బాక్సాఫీస్ వద్ద మోస్తరు వసూళ్లను రాబట్టింది. రూ. 55 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం.. ఓవరాల్‌గా రూ.48.8 కోట్ల గ్రాస్‌ రాబట్టింది. రూ.25.7 షేర్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమా ప్రీరిలీజ్‌ బిజినెస్‌ రూ.38 కోట్లకు జరగడం గమనార్హం. కాగా, ఈ చిత్రాన్ని వంశీ కృష్ణ నాయుడు (Vamsi Krishna Naidu) డైరెక్ట్ చేశారు.&nbsp; బడ్జెట్: 55 కోట్లు ప్రపంచవ్యాప్త గ్రాస్ : 48.8cr ప్రపంచవ్యాప్తంగా షేర్: 25.7cr ప్రీ-రిలీజ్ బిజినెస్: 38 కోట్లు పవర్‌ (Power) రవితేజ పవర్‌ఫుల్‌ పోలీసాఫీసర్‌గా నటించిన మరో చిత్రం ‘పవర్‌’. రూ. 30 కోట్ల బడ్జెట్‌తో నిర్మితమైన ఈ చిత్రం వరల్డ్‌వైడ్‌గా రూ.45 కోట్లు వసూలు చేసింది. 24.1 కోట్ల షేర్‌.. రూ.25 కోట్ల ప్రీరిలీజ్‌ గణాంకాలను నమోదు చేసింది.&nbsp; బడ్జెట్: 30 కోట్లు ప్రపంచవ్యాప్త గ్రాస్: 45cr ప్రపంచవ్యాప్తంగా షేర్: 24.1cr ప్రీ రిలీజ్ బిజినెస్ : 25 కోట్లు తీర్పు: సగటు కంటే ఎక్కువ బెంగాల్ టైగర్‌ (Bengal Tiger) ఈ సినిమా బడ్జెట్‌ రూ. 25 కోట్లు. ప్రీరిలీజ్‌ బిజినెస్‌ను రూ. 23 కోట్లకు చేసిన ఈ చిత్రం వరల్డ్‌వైడ్‌గా రూ. 38 కోట్ల గ్రాస్‌ సాధించింది. రూ.21.8 కోట్ల షేర్‌ను నమోదు చేసింది. సంపత్ నంది దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో తమన్నా (Tamanna Bhatia), రాశీఖన్నా (Rashi Khanna) హీరోయిన్లుగా నటించారు.&nbsp; బడ్జెట్: 25 కోట్లు ప్రపంచవ్యాప్త గ్రాస్ : 38cr వరల్డ్ వైడ్ షేర్ : 21.8cr ప్రీ రిలీజ్ బిజినెస్ : 23 కోట్లు విక్రమార్కుడు (Vikramarkudu) దర్శకధీరుడు రాజమౌళి (S S Rajamouli) డైరెక్షన్‌లో రవితేజ చేసిన సూపర్‌ హిట్‌ మూవీ విక్రమార్కుడు. రూ.11 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం వరల్డ్‌ వైడ్‌గా రూ.37.8 కోట్లు రాబట్టింది. అలాగే రూ.18.9 షేర్‌ను సాధించింది. ఈ ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.11.5 కోట్లకు జరగడం విశేషం.&nbsp; బడ్జెట్: 11 కోట్లు ప్రపంచవ్యాప్త గ్రాస్ : 37.8cr ప్రపంచవ్యాప్తంగా షేర్: 18.9cr ప్రీ రిలీజ్ బిజినెస్ : 11.5 కోట్లు కిక్‌ (Kick) రవితేజ చేసిన గుర్తుండిపోయే చిత్రాల్లో ‘కిక్‌’ కచ్చితంగా ఉంటుంది. సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 36 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమా బడ్జెట్‌ రూ.14 కోట్లు కాగా ప్రీరిలీజ్ బిజినెస్‌ కూడా అంతకే జరగడం గమనార్హం.&nbsp; బడ్జెట్: 14 కోట్లు ప్రపంచవ్యాప్త గ్రాస్: 36cr ప్రపంచవ్యాప్తంగా షేర్: 22.7cr ప్రీ రిలీజ్ బిజినెస్ : 14 కోట్లు కిక్‌ (KICK 2) అత్యధిక వసూళ్లు సాధించిన రవితేజ చిత్రాల జాబితాలో ‘కిక్‌ 2’ ప్రస్తుతం పదో స్థానంలో నిలిచింది. రూ.30 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.43 కోట్ల గ్రాస్‌ రాబట్టింది. రూ.25 కోట్ల షేర్‌ను తన పేరిట లిఖించుకుంది. ఈ సినిమా ప్రిరీలిజ్‌ బిజినెస్‌ రూ.36 కోట్లు. కిక్‌ సినిమాకు సీక్వెల్‌గా ఈ సినిమా తెరకెక్కినప్పటికీ ఫ్లాప్‌ టాక్‌ తెచ్చుకుంది.&nbsp; బడ్జెట్:&nbsp; 30Cr ప్రపంచవ్యాప్తంగా గ్రాస్:&nbsp; 43cr ప్రపంచవ్యాప్తంగా షేర్: 25cr ప్రీ రిలీజ్ బిజినెస్: 36Cr
    ఫిబ్రవరి 10 , 2024
    Filmfare Awards 2024: ఫిల్మ్‌ఫేర్‌ నామినేషన్స్‌లో ప్రభాస్‌, రష్మికకు అన్యాయం.! ఎందుకీ చిన్నచూపు?
    Filmfare Awards 2024: ఫిల్మ్‌ఫేర్‌ నామినేషన్స్‌లో ప్రభాస్‌, రష్మికకు అన్యాయం.! ఎందుకీ చిన్నచూపు?
    ప్రేక్షకులతో పాటు, సినీ తారలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసే అవార్డుల వేడుక 'ఫిల్మ్‌ఫేర్‌' (Filmfare Awards 2024). 69వ ఫిల్మ్‌ఫేర్‌ అవార్డుల వేడుకలకు ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి.&nbsp; జనవరి 27, 28 తేదీల్లో గుజరాత్ వేదికగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ క్రమంలో ఈ ఏడాది అవార్డుల కోసం పోటీపడుతున్న చిత్రాల జాబితాను తాజాగా విడుదల చేశారు. అయితే ఇది కొత్త వివాదానికి దారి తీసింది. రాఖీ ఔర్‌ రాణికి ప్రేమ్‌ కహానీ’ (Rocky Aur Rani Ki Prem Kahani), యానిమల్‌ (Animal) చిత్రాలతో పాటు 12th ఫెయిల్‌, డంకీ, జవాన్‌, శ్యామ్‌ బహదూర్‌ చిత్రాలు అవార్డు రేసులో నిలిచాయి. కానీ ప్రభాస్‌ హీరోగా తెరకెక్కిన 'ఆదిపురుష్‌', 'సలార్‌' వంటి చిత్రాలకు ఏ ఒక్క విభాగంలోనూ చోటు దక్కకపోవడం చర్చలకు తావిస్తోంది.&nbsp; ప్రభాస్‌కు అన్యాయం! బాహుబలి తర్వాత ప్రభాస్‌ (Prabhas) క్రేజ్‌ ప్రపంచస్థాయికి చేరింది. ఆయనతో చిత్రాలు చేసేందుకు బాలీవుడ్ దర్శకులు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలోనే గతేడాది ప్రభాస్‌ చేసిన ఆదిపురుష్‌ (Aadipurush), సలార్‌ (Saalar) చిత్రాలు ప్రేక్షకులను పలకరించాయి. ‘ఆదిపురుష్‌’ చిత్రం ఫ్లాప్‌ టాక్‌ తెచ్చుకున్నప్పటికీ ప్రభాస్‌ మానియాతో రూ.350 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అందులో డార్లింగ్‌ నటనకు సైతం మంచి మార్కులే పడ్డాయి. ఇక రీసెంట్‌ మూవీ ‘సలార్‌’ బాక్సాఫీస్‌ వద్ద దుమ్ముదులిపింది. ఇప్పటివరకూ ఈ చిత్రం వరల్డ్‌వైడ్‌గా రూ.611.8 కోట్లు రాబట్టింది. ఇప్పటికీ థియేటర్లలో రన్ అవుతూ తన కలెక్షన్స్‌ను పెంచుకుంటుంది. పైగా ఇందులో ప్రభాస్‌ తన యాక్షన్‌తో గూస్‌బంప్స్ తెప్పించాడు. అటువంటి ప్రభాస్‌కు ఉత్తమ నటుడు కేటగిరి నామినేషన్స్‌లో కనీసం చోటు దక్కకపోవడం ఫ్యాన్స్‌లో అసంతృప్తికి కారణమవుతోంది.  సలార్‌ వద్దు.. డంకీ ముద్దు!(Saalar Vs Dunki) షారుక్‌ ఖాన్‌ రీసెంట్‌ చిత్రం డంకీ (Dunki), ప్రభాస్‌ ‘సలార్‌’ చిత్రాలు రెండూ ఒకే రోజూ రిలీజయ్యాయి. డంకీ ఇప్పటివరకూ రూ.460.70 కోట్లు వసూలు చేయగా సలార్‌ అంతకంటే ఎక్కువే కలెక్షన్స్ సాధించింది. అయినప్పటికీ సలార్‌ను కాదని, డంకీ ఉత్తమ చిత్రం కేటగిరిలో చోటు కల్పించడంపై ఫ్యాన్స్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దక్షిణాది చిత్రాలు ప్రపంచ స్థాయిలో రాణిస్తున్న ఈ రోజుల్లోనూ మన హీరోలపై ఎందుకీ వివక్ష అని ప్రశ్నిస్తున్నారు. ఈ తరహా ఘటనలు భారతీయ చిత్ర పరిశ్రమకు మంచిది కాదని సినీ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. ఫిల్మ్‌ఫేర్ అవార్డులు పూర్తిగా హిందీ చిత్ర పరిశ్రమకు సంబంధించినవని తెలుసు.. సలార్, ఆదిపురుష్ వంటి చిత్రాలు పాన్‌ ఇండియా రేంజ్‌లో విడుదలైన విషయం గుర్తించుకోవాలి. ప్రభాస్ బాహుబలి తర్వాత తీసిన సినిమాలు హిందీ డైరెక్టర్లతోనే తీశాడు. విచిత్రమేమిటంటే.. జవాన్ సినిమా డైరెక్టర్ అట్లీ సౌత్ నుంచి వచ్చాడు. ఈ సినిమా పాన్‌ ఇండియా స్థాయిలో విడుదలై హిట్ అయింది. ఈ సినిమాకు అవార్డుల్లో బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ యాక్టర్ కేటగిరీల్లో స్థానం దక్కింది.  అలాగే సలార్ చిత్రాన్ని డైరెక్ట్ చేసింది.. ప్రశాంత్ నీల్. అతను సౌత్‌కు చెందినవాడే కావచ్చు. కానీ సలార్ చిత్రం తెలుగు, కన్నడ భాషల్లో ఎలాంటి హిట్ సాధించిందో… హిందీలోనూ అలాంటి హిట్‌నే సాధించింది. కావాలనే ప్రభాస్‌ను అవార్డుల రేసు నుంచి పక్కకు పెట్టారని నెటిజన్లతో పాటు ఆయన అభిమానులు కామెంట్ చేస్తున్నారు. దీనికి బాలీవుడ్‌లో కొంతమంది అగ్ర హీరోలు ఉన్నారని చర్చించుకుంటున్నారు.  సలార్ విడుదల సమయంలో థియేటర్లు కెటాయించకుండా… డంకీ చిత్రానికి థియేటర్లు కేటాయించడంపై అప్పట్లో పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రభాస్ ఫ్యాన్స్(Prabhas fans) నిరసన వ్యక్తం చేశారు. దానికి ప్రతీకారంగానే ప్రభాస్‌ను, ఆయన సినిమాలను బాలీవుడ్‌లో ఓ వర్గం పక్కకు పెట్టారని ఫ్యాన్స్ నిలదీస్తున్నారు.   పాపం రష్మిక..! అర్జున్‌ రెడ్డి ఫేమ్‌ సందీప్‌ రెడ్డి వంగా డైరెక్షన్‌లో బాలీవుడ్‌ స్టార్‌ హీరో రణ్‌బీర్‌ కపూర్‌ నటించిన చిత్రం ‘యానిమల్‌’ (Animal). ఈ మూవీ ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఇందులో రష్మిక మంచి నటన కనబరిచి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అయినప్పటికీ ఉత్తమ నటి కేటగిరి నామినేషన్స్‌లో రష్మిక( Rashmika Mandanna) పేరు లేకపోవడం ఆశ్చర్య పరుస్తోంది. అదే సినిమాలో కొద్దిసేపు కనిపించి అలరించిన నటి త్రిప్తి దిమ్రి (Tripti Dimri) ఉత్తమ సహాయ నటి కేటగిరీలో ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డ్‌ నామినేషన్స్‌లో నిలవడం చర్చకు తావిస్తోంది. దీనిని రష్మిక ఫ్యాన్స్‌ జీర్ణించుకోలేకపోతున్నారు. రష్మిక దక్షిణాది చిత్ర పరిశ్రమకు చెందిన నటి కావడం వల్లే ఆమె ఏ విభాగంలోనూ నామినేట్ కాలేదని చెబుతున్నారు.  అప్పట్లోనే అవమానం అంబాని గణపతి పూజ సమయంలోనూ… బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌ శ్రద్ధాకపూర్ కావాలనే రష్మికను పట్టించుకోని వీడియో అప్పట్లో సోషల్ మీడియోలో వైరల్ అయింది. సౌత్ నటి అయినందు వల్లే రష్మికను అవైడ్ చేశారని పెద్ద చర్చ సాగింది. https://twitter.com/leena_gaut57982/status/1704495711058812951?s=20 ‘యానిమల్’ సత్తా చాటేనా! తెలుగు డైరెక్టర్‌ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన యానిమల్‌ (Animal) చిత్రం ఏకంగా 19 విభాగాల్లో చోటు దక్కించుకుంది. ఉత్తమ దర్శకుడి కేటగిరిలో సందీప్ రెడ్డి వంగా, ఉత్తమ నటుడు విభాగంలో రణ్‌బీర్‌ కపూర్‌, ఉత్తమ సహాయ నటులుగా అనిల్‌ కపూర్‌, బాబీ దేబోల్‌, సహాయ నటిగా త్రిప్తి దిమ్రి యానిమల్‌ మూవీ నుంచి రేసులో నిలిచారు. దీన్ని బట్టి చూస్తే 69వ ఫిల్మ్‌ఫేర్‌ అవార్డుల వేడుకల్లో (Filmfare Awards 2024) యానిమల్‌ సత్తా చాటే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరోమారు జాతీయ స్థాయిలో టాలీవుడ్‌ సత్తా ఏంటో తెలియనుందని సినీ వర్గాలు చెబుతున్నాయి.  విభాగాల వారిగా నామినేషన్స్ జాబితా ఉత్తమ చిత్రం (పాపులర్‌) 12th ఫెయిల్‌జవాన్‌ఓఎంజీ2పఠాన్‌రాఖీ ఔర్‌ రాణికి ప్రేమ్‌ కహానీ ఉత్తమ చిత్రం (క్రిటిక్స్‌) 12th ఫెయిల్‌బీడ్‌ఫరాజ్‌జొరామ్‌శ్యామ్‌ బహదూర్‌త్రీ ఆఫ్‌ అజ్‌జ్విగాటో ఉత్తమ దర్శకుడు అమిత్‌ రాయ్‌ (ఓఎంజీ2)అట్లీ (జవాన్‌)కరణ్‌ జోహార్‌ (రాఖీ ఔర్‌ రాణికి ప్రేమ్‌ కహానీ)సందీప్‌ వంగా (యానిమల్‌)సిద్ధార్థ్‌ ఆనంద్‌ (పఠాన్‌)విధు వినోద్‌ చోప్రా (12th ఫెయిల్‌) ఉత్తమ నటుడు రణ్‌బీర్‌ కపూర్‌ (యానిమల్‌)రణ్‌వీర్‌ సింగ్‌ (రాఖీ ఔర్‌ రాణికి ప్రేమ్‌ కహానీ)షారుక్‌ఖాన్‌ (డంకీ)షారుక్‌ ఖాన్‌(జవాన్‌)సన్నీ దేఓల్‌ (గదర్‌2)విక్కీ కౌశల్‌ (శ్యామ్‌ బహదూర్‌) ఉత్తమ నటుడు (క్రిటిక్స్‌) అభిషేక్‌ బచ్చన్‌ (ఘూమర్‌)జయ్‌దీప్‌ అహల్వత్‌ (త్రీ ఆఫ్‌ అజ్‌)మనోజ్‌ బాజ్‌పాయ్‌ (జొరామ్‌)పంకజ్‌ త్రిపాఠి (ఓఎంజీ2)రాజ్‌కుమార్‌ రావ్‌ (బీడ్‌)విక్కీ కౌశల్‌ (శ్యామ్‌ బహదూర్‌)విక్రాంత్‌ మెస్సే (12th ఫెయిల్‌) ఉత్తమ నటి అలియా భట్‌ (రాఖీ ఔర్‌ రాణికి ప్రేమ్‌ కహానీ)భూమి పెడ్నేకర్‌ (థ్యాంక్యూ ఫర్‌ కమింగ్‌)దీపిక పదుకొణె (పఠాన్‌)కియారా అడ్వాణీ (సత్య ప్రేమ్‌కి కథ)రాణీ ముఖర్జీ (మిస్సెస్‌ ఛటర్జీ Vs నార్వే)తాప్సీ (డంకీ) ఉత్తమ నటి (క్రిటిక్స్‌) దీప్తి నవల్‌ (గోల్డ్‌ ఫిష్‌)ఫాతిమా సనా షేక్‌ (ధక్‌ ధక్‌)రాణీ ముఖర్జీ (మిస్సెస్‌ ఛటర్జీ Vs నార్వే)సయామీఖేర్‌ (ఘూమర్‌)షహానా గోస్వామి (జ్విగాటో)షఫిల్‌ షా (త్రీ ఆఫ్ అజ్‌) ఉత్తమ సహాయ నటుడు ఆదిత్య&nbsp; రావల్‌ (ఫరాజ్‌)అనిల్‌ కపూర్‌ (యానిమల్‌)బాబీ దేఓల్‌ (యానిమల్‌)ఇమ్రాన్‌ హష్మి (టైగర్‌3)టోటా రాయ్‌ చౌదరి (రాఖీ ఔర్‌ రాణి కి ప్రేమ్‌ కహానీ)విక్కీ కౌశల్‌ (డంకీ) ఉత్తమ సహాయ నటి జయా బచ్చన్‌ (రాఖీ ఔర్‌ రాణికి ప్రేమ్‌ కహానీ)రత్న పాఠక్‌ షా (ధక్‌ ధక్‌)షబానా అజ్మీ (ఘూమర్‌)షబానా అజ్మీ&nbsp; (రాఖీ ఔర్‌ రాణికి ప్రేమ్‌ కహానీ)త్రిప్తి దిమ్రి (యానిమల్‌)యామి గౌతమ్‌ (ఓఎంజీ2)
    జనవరి 17 , 2024
    Chandra Mohan: సీనియర్‌ నటుడు చంద్రమోహన్‌ కన్నుమూత.. ఆయన గురించి ఈ విషయాలు తెలుసా?
    Chandra Mohan: సీనియర్‌ నటుడు చంద్రమోహన్‌ కన్నుమూత.. ఆయన గురించి ఈ విషయాలు తెలుసా?
    టాలీవుడ్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు చంద్రమోహన్‌ (78) కన్నుమూశారు. గత కొంత కాలంగా షుగర్‌, గుండె, డయాలసిస్‌ సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం (నవంబర్‌ 11న) తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు ధ్రువీకరించారు. దీంతో ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మరోవైపు హైదరాబాద్‌లో సోమవారం ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. ఆయన మరణంపై సెలబ్రిటీలు, అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు. చంద్రమోహన్‌ మృతి నేపథ్యంలో ఆయనకు సంబంధించిన పూర్తి సమాచారం YouSay మీ ముందుకు తీసుకొచ్చింది.&nbsp; కుటుంబ నేపథ్యం చంద్రమోహన్ అసలు పేరు మల్లంపల్లి చంద్రమోహనరావు. ఏపీలోని కృష్ణాజిల్లా పమిడిముక్కలలో 1945 మే 23న ఆయన జన్మించారు. మేడూరు, బాపట్లలో చదువుకున్నారు. ఈయన దివంగత దర్శకుడు కె.విశ్వనాథ్‌కి చాలా దగ్గరి బంధువు. చంద్ర మోహన్ భార్య పేరు జలంధర. ఈమె రచయిత్రి. వీరికి మధుర మీనాక్షి, మాధవి అని ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మధుర మీనాక్షి సైకాలజిస్ట్‌గా అమెరికాలో స్థిరడ్డారు. రెండో కుమార్తె మాధవి చెన్నైలో వైద్యవృత్తిలో సేవలందిస్తున్నారు.&nbsp; సినిమా నేపథ్యం చంద్రమోహన్‌ 1966లో ‘రంగుల రాట్నం’ సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. 1987లో ‘చందమామ రావే’ చిత్రానికి ఉత్తమ హాస్యనటుడిగా, 2005లో ‘అతనొక్కడే’ సినిమాకు ఉత్తమ సహాయ నటుడిగా నంది అవార్డు అందుకున్నారు. ‘పదహారేళ్ల వయసు’ సినిమాకుగానూ ఫిలిం ఫేర్‌ అవార్డు గెలుచుకున్నారు. ‘రంగుల రాట్నం’, ‘ఆమె’ ‘పదహారేళ్ల వయసు’, ‘సీతామహాలక్ష్మి’, ‘రాధాకల్యాణం’, ‘రెండు రెళ్ల ఆరు’, ‘చందమామ రావే’, ‘రామ్‌ రాబర్ట్ రహీమ్‌’ చిత్రాలతో ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరయ్యారు. 55 ఏళ్ల సినీ కెరీర్‌లో దాదాపు 932 సినిమాలలో నటించారు. చంద్రమోహన్‌ మెచ్చిన చిత్రాలు సినిమాల్లోకి రాకపోయి ఉంటే డబ్బులు లెక్కపెట్టే ఉద్యోగం చేసుకుని ఉండేవాడినని ఓ ఇంటర్యూలో చంద్రమోహన్‌ చెప్పారు. ఫస్ట్ సినిమా సక్సెస్ అయిన తర్వాత కూడా ఇండస్ట్రీలో కొనసాగాలా? వద్దా? అని ఒకటికి రెండుసార్లు ఆలోచించినట్లు చెప్పుకొచ్చారు. అంతిమంగా సినిమావైపే అడుగులు వేశారు. తన కెరీర్‌లో ‘సిరిసిరిమువ్వ’, ‘శుభోదయం’, ‘సీతామహాలక్ష్మి’, ‘పదహారేళ్ల వయసు’ చిత్రాలను ఎన్నటికీ మర్చిపోలేనని చెప్తూ ఉండేవారు. లక్కీ హీరోగా గుర్తింపు ఒకప్పుడు చంద్రమోహన్‌ను అందరూ లక్కీ హీరోగా అనేవారు. ఆయనతో ఏ హీరోయిన్‌ అయినా నటిస్తే సినిమా హిట్‌ అవ్వాల్సిందే. అలా కెరీర్‌ ప్రారంభంలో శ్రీదేవి (Sri Devi), జయసుధ (Jayasuda), జయప్రద (Jaya Prabha) ఆయనతో కలిసి నటించి హిట్స్‌ అందుకున్నారు. చంద్రమోహన్‌-సుధ కాంబినేషన్‌ అయితే సూపర్‌హిట్‌ అయింది. అటు చంద్రమోహన్‌ క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా చాలా చిత్రాలు చేశారు. తెలుగులోనే కాకుండా తమిళంలోనూ నటించారు. ఈయన నటించిన చివరి చిత్రం ఆక్సిజన్‌. సంపాదనలో శూన్యమే! చంద్రమోహన్‌ 50 ఏళ్లకు పైగా ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ పెద్దగా ఆస్తులు కూడబెట్టలేదు. చివరి రోజుల్లో ఆయన సాదాసిదా జీవితాన్నే గడిపారు. వందల కోట్లు విలువ చేసే ఆస్తులు పోగొట్టుకున్నట్లు చంద్రమోహన్‌ స్వయంగా ఓ ఇంటర్యూలో తెలిపారు. హైదరాబాద్‌ కోంపల్లిలో 35 ఎకరాల ద్రాక్ష తోట కొన్నప్పటికీ చూసుకోవడం వీలుపడటం లేదని దాన్ని అమ్మేశారు. శోభన్‌ బాబు చెబుతున్నా వినకుండా చెన్నైలోని 15 ఎకరాలు కూడా విక్రయించేశారు. దాని విలువ ప్రస్తుతం&nbsp; రూ.30 కోట్లపైనే. శంషాబాద్‌ ప్రధాన రహదారి పక్కన ఆరు ఎకరాలు కొన్నప్పటికీ దాన్ని నిలుపుకోలేకపోయారు.&nbsp;&nbsp; చెయ్యి చాలా మంచిదట! చంద్రమోహన్‌ దగ్గర ఆస్తి నిలవలేదు కానీ, ఆయన చేతితో ఒక్క రూపాయి తీసుకున్నా బాగా కలిసొస్తుందని చాలామంది నమ్మకం. అందుకని కొత్త ఏడాది ప్రారంభంలో (జనవరి 1) ఎంతోమంది ఆయన ఇంటికి వెళ్లి చంద్రమోహన్‌ చేతుల మీదుగా డబ్బు తీసుకునేవారు. ఈ విషయాన్ని చంద్రమోహన్‌ భార్య, రచయిత్రి జలంధర స్వయంగా తెలిపారు.
    నవంబర్ 11 , 2023
    Maleesha Kharwa: మట్టిలో మాణిక్యం.. మురికివాడ నుంచి స్టార్‌ మోడల్‌ దాకా.. ఎవరీ మలీషా ఖర్వా?
    Maleesha Kharwa: మట్టిలో మాణిక్యం.. మురికివాడ నుంచి స్టార్‌ మోడల్‌ దాకా.. ఎవరీ మలీషా ఖర్వా?
    ముంబయిలోని ప్రముఖ మురికివాడ ధారావికి చెందిన 14 ఏళ్ల మలీషా ఖర్వా.. సోషల్‌ మీడియాలో మరోమారు సంచలనంగా మారిపోయింది. ప్రముఖ స్కిన్‌ కేర్‌ కంపెనీ ‘ఫారెస్ట్ ఎసెన్షియల్’ తన లగ్జరీ కలెక్షన్స్‌కు బాలికను బ్రాండ్ అంబాసిడర్‌గా చేయడమే ఇందుకు కారణం. తమ బ్యూటీ ప్రొడక్ట్స్‌ను మలీషా ప్రమోట్‌ చేస్తున్న ఓ వీడియోను ‘ఫారెస్ట్ ఎసెన్షియల్’ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. ప్రతీ ప్రయాణంలోనూ బ్యూటీ ఉంటుందని క్యాప్షన్‌ ఇచ్చింది.&nbsp; ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. మలీషాపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.&nbsp; View this post on Instagram A post shared by @forestessentials 'లైవ్‌ యువర్‌ ఫెయిరీ టేల్‌' అనే షార్ట్‌ఫిల్మ్‌ ద్వారా తొలిసారి మలీషా ఫేమస్‌ అయింది. మురికివాడల్లో బతికే ఐదుగురు చిన్నారులను స్టార్‌ రెస్టారెంట్‌లో భోజనం చేయించి వారి అనుభవాలను తెలుసుకోవడం లక్ష్యంగా ఈ షార్ట్ ఫిల్మ్‌ రూపొందించారు. ఈ ఐదుగురు చిన్నారుల్లో మలీషా కూడా ఉంది.&nbsp; 2020లో హాలీవుడ్ యాక్టర్‌ ‘రాబర్ట్ హాఫ్‌మన్‌’ ఓ మ్యూజిక్ వీడియో షూటింగ్‌ కోసం ముంబయికి వచ్చాడు. ఈ క్రమంలో మలీషాను చూసి రాబర్ట్ ఎంతగానో ఇంప్రెస్‌ అయ్యాడు. మోడల్ అవ్వాలన్న మలీషా కలను తెలుసుకొని ఆమె పేరున స్వయంగా ఓ ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌ను క్రియేట్‌ చేశాడు.&nbsp; మలీషా కోసం ‘గో ఫండ్‌ మీ‘ అనే పేరుతో రాబర్ట్ ఓ పేజ్‌ను కూడా క్రియేట్‌ చేశాడు. బాలికకు సాయం చేయాలని నెటిజన్లకు పిలుపునిచ్చాడు. దీంతో చాలా మంది మనీషాకు ఆర్థిక సాయం చేశారు.&nbsp; సోషల్‌ మీడియాలో మలీషా పేరు మారుమోగడంతో చిన్న చిన్న కంపెనీలు ప్రమోషన్స్‌ కోసం మలీషా వెంటపడ్డాయి. ఆ అవకాశాలను అందిపుచ్చుకున్న మలీషా.. మోడలింగ్ చేస్తూ సెలబ్రిటీగా మారిపోయింది. తనను తాను ఇన్‌స్ట్రాగ్రామ్‌లో ‘princess from the slum' గా ప్రెజెంట్ చేసుకుంది.&nbsp; మలీషాకు పాపులారిటీని గమనించిన&nbsp; ‘ది పికాక్‌’ అనే మ్యాగజైన్‌ బాలిక ఫొటోను ఏకంగా తన కవర్‌ పేజ్‌ మీద ప్రింట్‌ చేసింది. బీబీసీ వంటి అంతర్జాతీయ మీడియా సంస్థలతో పాటు జాతీయ మీడియా కూడా&nbsp; మలీషా స్టోరీని పబ్లిష్‌ చేశాయి.&nbsp; మురికి వాడల్లో అందరు చిన్నారుల్లానే బతికిన మలీషాకు ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో 2 లక్షల 35 వేల మంది ఫాలోవర్స్‌ ఉన్నారు. సెలబ్రెటీస్‌కు ఇచ్చినట్టే మలీషాకు కూడా ఇన్‌స్టాగ్రామ్‌ వెరిఫైడ్‌ బ్లూ టిక్‌ ఇచ్చింది. ‘ప్రిన్సెస్‌ ఆఫ్ స్లమ్‌’గా అందరూ తనను పిలుస్తుండటంపై మలీషా సంతోషం వ్యక్తం చేస్తోంది. ఎవరీ జీవితం ఎలాంటి మలుపుతీసుకుంటుందో తెలియదని పేర్కొంది. కాబట్టి అందివచ్చిన అవకాశాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని సూచిస్తోంది.&nbsp; మురికివాడలో పుట్టి, పెరగడం కష్టంగా లేదా? అని తరుచూ ఎదురయ్యే ప్రశ్నపైనా మలీషా స్పందించింది. తన ఇంటిని ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటానని చెప్పుకొచ్చింది. అందుకే ఆ ప్రశ్న ఎదురైనప్పుడల్లా తికమకపడుతూ ఉంటాని తెలిపింది. అయితే సోదరుడితో పాటు చాలాసార్లు పస్తులు ఉండాల్సి రావడం తనకు నచ్చలేదని మలీషా అన్నది.&nbsp; చిన్నప్పుడు ధారావిలో ఏదైనా సినిమా షూటింగ్ జరుగుతుంటే తన సోదరుడితో కలిసి అక్కడి వెళ్లేదానినని మలీషా తెలిపింది. తనకు బ్యాగ్రౌండ్‌ ఆర్టిస్టుగా అవకాశమిస్తారేమోనని ఎదురు చూసేదానిని చెప్పుకొచ్చింది.&nbsp; గ్లోబల్‌ స్టార్‌ ప్రియాంక చోప్రా తనకు ఎంతో ప్రేరణ అని మలీషా ఓ సందర్భంలో చెప్పింది. ఎప్పటికైనా స్టార్‌ మోడల్‌గా ఎదిగి మెరుగైన జీవితంతో పాటు, తమ తల్లిదండ్రులకు ఆర్థికంగా సాయపడాలని కోరుకుంటున్నట్లు వివరించింది.&nbsp;
    మే 24 , 2023
    మెుదటి త్రైమాసికంలో టాలివుడ్‌, బాలివుడ్‌,కొలివుడ్‌, శాండల్‌వుడ్‌ పైచేయి ఎవరిది?
    మెుదటి త్రైమాసికంలో టాలివుడ్‌, బాలివుడ్‌,కొలివుడ్‌, శాండల్‌వుడ్‌ పైచేయి ఎవరిది?
    కొత్త సంవత్సరం ప్రారంభమై దాదాపు 3 నెలలు పూర్తయ్యింది. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో చాలా చిత్రాలు విడుదలయ్యాయి. కొన్ని చిత్రాలు బాక్సాఫీస్‌ను షేక్ చేస్తే…. మరికొన్ని అంచనాలు అందుకోలేక డిజాస్టర్లుగా మిగిలాయి. పఠాన్ వంటి ఆల్‌టైమ్‌ బ్లాక్‌ బస్టర్‌తో బాలీవుడ్‌కు పూర్వ వైభవం వచ్చింది. వీరసింహా రెడ్డి, వాల్తేరు వీరయ్య చిత్రాలు టాలీవుడ్ మేనియాను కొనసాగించాయి. తమిళ్, కన్నడ ఇండస్ట్రీలకు మంచి హిట్లే పడ్డాయి. టాలివుడ్‌ పరంపర గతేడాది ధమాకా వంటి సూపర్‌ హిట్‌తో ముగించిన టాలీవుడ్‌… ఏడాది ఆరంభంలోనే బ్లాక్‌బస్టర్లను అందుకుంది. సీనియర్ హీరోలు బాలకృష్ణ, చిరంజీవి అభిమానులు పండుగ చేసుకొనే సినిమాలను ఇచ్చారు. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మించిన వీరసింహా రెడ్డి రూ. 110 కోట్లు పెట్టి తెరకెక్కిస్తే రూ. 134 కోట్ల వసూళ్లు వచ్చాయి. ఇదే బ్యానర్‌లో వచ్చిన వాల్తేరు వీరయ్య రూ.140 కోట్లతో రూపొందించగా.. రూ. 219 కోట్లు సాధించింది.&nbsp; చిన్న హిట్లు తెలుగు ప్రేక్షకులను చిన్న సినిమాలు కూడా అలరించాయి. సుహాస్‌ హీరోగా వచ్చిన రైటర్ పద్మభూషణ్ బాక్సాఫీస్ వద్ద క్లాసిక్ హిట్‌గా నిలిచింది. రూ.2.5 కోట్లతో తెరకెక్కించగా.. రూ. 12.5 కోట్లు వచ్చాయి. ఇదే సమయంలో చాలా రోజుల తర్వాత హిట్ అందుకున్నాడు కిరణ్ అబ్బవరం. గీతా ఆర్ట్స్‌ 2 బ్యానర్‌లో వచ్చిన వినరో భాగ్యము విష్ణు కథ సినిమా ప్రేక్షకులను మెప్పించింది. రూ.1 కోటి బడ్జెట్‌ పెట్టి నిర్మించగా.. రూ. 9.15 కోట్లు వచ్చాయి.&nbsp; భావోద్వేగాల బలగం మంచి సినిమాను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారని బలగం సినిమాతో మరోసారి రుజువయ్యింది. కమెడియన్ వేణు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ప్రతి ఒక్కరూ ఆస్వాదించారు. సూపర్ హిట్‌ చేసి కలెక్షన్ల వర్షం కురిపించారు ప్రేక్షకులు. రూ. 1.5 కోట్లతో దిల్‌రాజు నిర్మించగా.. రూ. 18.65 కోట్లు వసూలు చేసింది చిత్రం. ఇంకా థియేటర్లలో అలరిస్తోంది. డిజాస్టర్లు బింబిసార వంటి ఇండస్ట్రీ హిట్‌ ఇచ్చిన కళ్యాణ్ రామ్ ఈ ఏడాది నిరాశపర్చాడు. సరికొత్త కాన్సెప్ట్‌తో అమిగోస్ అనే చిత్రం తెరకెక్కించి విఫలమయ్యాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. ఎప్పట్నుంచో హిట్‌ కోసం ఎదురుచూస్తున్న సందీప్ కిషన్‌కి కూడా సరైన హిట్‌ దక్కలేదు. మైఖేల్ సినిమాతో మళ్లీ ఫ్లాప్ మూటగట్టుకున్నాడు సందీప్. ఇవి మినహా తెలుగులో మంచి హిట్లే దక్కాయి.&nbsp; బాలీవుడ్‌ బాద్షా వరుస ఫ్లాప్‌లతో సతమతమవుతున్న బాలీవుడ్ పరిశ్రమకు చాలాకాలం గ్యాప్ తర్వాత వచ్చిన బాద్షా షారుఖ్ ఖాన్ ఆల్‌ టైమ్ బ్లాక్‌బస్టర్‌ను అందించాడు.ఏకంగా వెయ్యి కోట్ల కలెక్షన్లను దాటేశాడు. రూ.250 కోట్లతో తెరకెక్కిన పఠాన్ చిత్రం రూ. 1047 కోట్లు వసూలు చేసింది. బాలీవుడ్‌లో బాహుబలి పేరిట ఉన్న రికార్డును చేరిపేశాడు కింగ్ ఖాన్.&nbsp; రొమాంటిక్ హిట్ కింగ్ ఖాన్ తెచ్చిన వైభవాన్ని రణ్‌బీర్ కపూర్ కొనసాగించాడు. తూ జూటీ మై మక్కర్ వంటి రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామాతో హిట్‌ కొట్టాడు ఈ కుర్ర హీరో. ఈ సినిమా రూ. 70 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించగా.. రూ.151.35 కోట్లు వసూలు చేసింది. అయితే,&nbsp; తెలుగు రీమేక్‌గా రూపుదిద్దుకున్న షెహజాదా మాత్రం డిజాస్టర్‌గా మిగిలిపోయింది.&nbsp; షెహ్‌జాదా ఎందుకు ఫ్లాప్‌ అయింది? https://telugu.yousay.tv/why-did-the-remake-of-ala-vaikunthapuram-not-work-out-why-shehzada-is-a-disaster.html తమిళ్‌ సూపర్ స్టార్స్ కోలీవుడ్‌లో కూడా ఈ ఏడాది శుభారంభంతోనే ప్రారంభమయ్యింది. దిల్ రాజు నిర్మాణంలో దళపతి విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తీసిన వారిసు ఇండస్ట్రీ హిట్‌ అయ్యింది. రూ.297 కోట్లు వసూళ్లు సాధించింది ఈ సినిమా. సంక్రాంతి బరిలో అజిత్‌ చిత్రం తునివు కూడా హిట్‌గానే నిలిచింది. కాకపోతే పెట్టిన బడ్జెట్ తిరిగి వచ్చింది అంతే. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ధనుష్ నటించిన సార్ సినిమా సగటు ప్రేక్షకులను మెప్పించింది. రూ.35 కోట్లతో తీర్చిదిద్దితే రూ.115 కోట్లు సాధించింది ఈ చిత్రం. ఇంకా మెుదలుకాలేదు కన్నడలో విడుదలైన ఒకే ఒక్క పెద్ద చిత్రం కబ్జ. దాదాపు కేజీఎఫ్ రేంజ్ ట్రైలర్ చూపించినప్పటికీ సినిమా బాక్సాఫీస్‌ వద్ద పెద్దగా ఆడటం లేదు. ఇండియన్ రియల్ స్టార్ ఉపేంద్ర, కిచ్చా సుదీప్, శివన్న వంటి స్టార్లు ఉన్నప్పటికీ ప్రేక్షకులను మెప్పించలేకపోయారు.&nbsp; ఆధిపత్యం ఎవరిది? చిత్ర పరిశ్రమలన్నింటిలో హిట్లు, ఫ్లాపులు ఉన్నాయి. తెలుగులో వరుస బ్లాక్‌బస్టర్లు కొట్టాయి. తమిళ్‌ నుంచి డబ్ అయిన చిత్రాలు కూడా బాగానే ఆదరించారు. కానీ, కలెక్షన్ల పరంగా బాలీవుడ్ దూసుకుపోయింది. ఆల్‌టైమ్ ఇండస్ట్రీ హిట్‌ను కొట్టేశాయి. తమిళ్‌లోనూ రూ.100 కోట్ల క్లబ్ సినిమాలు మూడు వచ్చాయి. ఈ పరంగా చూసుకున్నట్లయితే… ఒక్కో విభాగంలో ఒక్కో ఇండస్ట్రీ టాప్‌లో నిలిచిందనే చెప్పాలి. లేదు ప్రస్తుతం కలెక్షన్లే మ్యాటర్‌ అనుకుంటే.. బాలీవుడ్‌ దే పైచేయి.&nbsp;
    మార్చి 20 , 2023
    Telugu Directors: రాజమౌళిని బీట్ చేసే సత్తా ఈ తెలుగు డైరెక్టర్లకు ఉందా?
    Telugu Directors: రాజమౌళిని బీట్ చేసే సత్తా ఈ తెలుగు డైరెక్టర్లకు ఉందా?
    దేశం గర్వించతగ్గ దర్శకుల్లో ఎస్‌.ఎస్‌. రాజమౌళి (SS Rajamouli) ఒకరు. అపజయం ఎరుగని డైరెక్టర్‌గా ఆయన తన జైత్ర యాత్రను కొనసాగిస్తున్నారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) మూవీతో తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ స్థాయికి చేర్చిన ఆయన.. మహేష్‌తో SSMB29తో గ్లోబల్‌ మార్కెట్‌ను శాంసించేందుకు సిద్ధమవుతున్నారు. అయితే రాజమౌళి తర్వాత ఆ స్థాయిలో రాణించగల డైరెక్టర్లు తెలుగులో ఉన్నారా అన్న సందేహాన్ని నార్త్‌ ఆడియన్స్‌ వ్యక్తం చేస్తున్నాయి. ఈ ప్రశ్నకు సమాధానంగా పలువురు డైనమిక్‌ డైరెక్టర్స్‌ కనిపిస్తున్నారు. రాజమౌళి బాటలోనే నడుస్తూ.. ఇండియన్‌ బాక్సాఫీస్‌ను షేక్‌ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇంతకీ ఆ డైరెక్టర్లు ఎవరు? వారి ముందున్న అవకాశాలు ఏంటి? ఇప్పుడు పరిశీలిద్దాం.&nbsp; నాగ్ అశ్విన్‌ (Nag Ashwin) &nbsp; ప్రస్తుతం టాలీవుడ్‌లో బాగా వినిపిస్తున్న డైరెక్టర్‌ పేరు ‘నాగ్‌ అశ్విన్‌’. ప్రభాస్‌ హీరోగా అతడు తెరకెక్కిస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ చిత్రంపై గ్లోబల్‌ స్థాయిలో బజ్ ఉంది. భారతీయ పురాణాలు స్ఫూర్తిగా సైన్స్ ఫిక్షన్ జానర్‌లో వస్తోన్న ఈ సినిమా.. జూన్‌ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమా సక్సెస్‌ అయితే నాగ్‌ అశ్విన్‌కు కెరీర్‌ పరంగా తిరుగుండదని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ సినిమా టాలీవుడ్‌ స్థాయిని మరో రేంజ్‌కు తీసుకెళ్లి.. నాగ్‌ అశ్విన్‌కు ఎనలేని ఫేమ్‌ను తీసుకొచ్చే అవకాశం ఉంది. పైగా నాగ్‌ అశ్విన్‌.. విజన్‌, ఎగ్జిక్యూషన్‌, యునిక్‌ ప్రమోషన్స్ చూస్తే అచ్చం రాజమౌళి గుర్తుకు రాక మానడు.&nbsp;&nbsp; టెక్నాలజీని సినిమాకు అన్వయించడంలో దర్శక ధీరుడు రాజమౌళి ఎప్పుడు ముందుంటాడు. ప్రపంచస్థాయి గ్రాఫిక్స్‌, కొత్త తరహా ఆయుధాలు, వినూత్నమైన కాస్ట్యూమ్స్‌, వైవిధ్యమైన డైలాగ్స్‌, నెవర్‌బీఫోర్‌ హీరో ఎలివేషన్స్‌ ఇలా ప్రతీ అంశంలోనూ తన మార్క్‌ చూపిస్తుంటాడు. అయితే కల్కి డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్‌ కూడా ఈ విషయంలో రాజమౌళిని గుర్తు చేస్తున్నాడు. కల్కి కోసం లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నాడు. ముఖ్యంగా ఈ మూవీ కోసం ఓ స్పెషల్‌ వెహికల్‌ను చిత్ర యూనిట్‌ తయారు చేయించింది. సినిమాలో ‘బుజ్జి’ అని పిలిచే ఈ రోబోటిక్‌ వాహనంతోనే హీరో ప్రభాస్‌ అడ్వెంచర్స్ చేశాడు. బుజ్జికి సంబంధించి బుధవారం (మే 22) స్పెషల్‌ గ్లింప్స్‌ను రిలీజ్‌ చేయగా అది యూట్యూబ్‌లో అత్యధిక వ్యూస్‌తో దూసుకెళ్తోంది.&nbsp; https://twitter.com/i/status/1793606030703927405 బుజ్జి అనే స్పెషల్‌ వెహికల్‌ని మూవీ టీమ్ మహీంద్రా కంపెనీతో కలిసి తయారు చేసింది. దీన్ని తయారు చేయడానికి దాదాపు 7 కోట్లు ఖర్చు అయిందని సమాచారం. సాధారణంగా ఏదైనా కొత్త వెహికల్‌ను తయారు చేయడానికి ఐదు నుంచి పదేళ్ల సమయం పడుతుంది. డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్‌.. మహీంద్రా టీమ్‌ను సినిమాలో భాగంగా చేసుకొని తమ ఆలోచనలకు అనుగుణంగా వారిని డైరెక్ట్‌ చేస్తూ వెహికల్‌ను తయారు చేయించుకున్నారు. ఈ సినిమాలో బుజ్జికి చాలా ఇంపార్టెంట్‌ రోల్ ఉందని నాగ్ అశ్విన్‌.. గ్లింప్స్‌ రిలీజ్‌ ఈవెంట్‌లో అన్నారు. వెహికల్‌ తయారీకి సహకరించిన ఆనంద్‌ మహీంద్ర టీమ్‌కు థ్యాంక్స్ చెప్పారు.&nbsp; https://twitter.com/i/status/1793303611583418579 సుకుమార్‌ (Sukumar) ‘పుష్ప’ (Pushpa : The Rise) సినిమా ముందు వరకూ టాలీవుడ్‌కే పరిమితమైన సుకుమార్‌.. ఆ మూవీ తర్వాత ప్యాన్‌ ఇండియా డైరెక్టర్‌గా మారిపోయాడు. ఇందులో సుకుమార్‌ దర్శకత్వ నైపుణ్యం చూసి ప్రతీ ఒక్కరు ఇంప్రెస్ అయ్యారు. ముఖ్యంగా అల్లు అర్జున్ లాంటి స్టైలిష్‌ హీరోను.. ఎలాంటి మేకప్‌ లేకుండా మాసిన జుట్టు, గడ్డంతో చూపించడం ఆశ్చర్యం కలిగించింది. అయితే కథకు తగ్గట్లు బన్నీ రూపురేఖలు మార్చి అక్కడే సినిమా విజయానికి పునాది వేశారు సుకుమార్. సాధారణంగా రాజమౌళి తన సినిమాల్లో ఇంటర్వెల్‌, క్లైమాక్స్‌ సీన్లకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తాడు. సాలిడ్‌ ఇంటర్వెల్‌ ద్వారా సెకండాఫ్‌పై ఆసక్తి రేకెత్తిస్తాడు. అటు సినిమా ముగింపును కూడా ఆడియన్స్‌కు చాలా సంతృప్తి కలిగేలా రాజమౌళి తీర్చిదిద్దుతాడు. అయితే డైరెక్టర్ సుకుమార్‌ దీనికి పూర్తి డిఫరెంట్‌ ఫార్మూలను పుష్ప విషయంలో అనుసరించారు. ఇందులో ఎలాంటి రక్తపాతం లేకుండా ఇంటర్వెల్‌, క్లైమాక్స్‌ సీన్లను డిజైన్‌ చేశారు. పుష్ప.. మంగళం శీను (సునీల్‌) ఇంటికి వెళ్లి వార్నింగ్ ఇచ్చే సీన్‌తో సెకండాఫ్‌పై హైప్‌ క్రియేట్‌ చేశారు సుకుమార్‌. ‌అటు క్లైమాక్స్‌లో ఎస్పీ భన్వర్‌ సింగ్‌ షెకావత్‌ (ఫహాద్‌ ఫాజిల్‌)కు పుష్ప చేత సవాలు విసిరించి.. రెండో పార్ట్‌పై ఆసక్తిని రగిలించారు.&nbsp; ప్రస్తుతం సుకుమార్‌ రూపొందిస్తున్న పుష్ప సీక్వెల్‌ ‘పుష్ప 2 : ది రూల్‌’ కోసం యావత్‌ దేశం ఎదురుచూస్తోంది. ఆగస్టు 15న ఈ సినిమా విడుదల కానుండగా.. మేకర్స్‌ ఇప్పటికే ప్రమోషన్స్‌ షూరు చేశారు. ఈ సినిమా విజయం సాధిస్తే సుకుమార్‌ స్థాయి మరింత పెరగనుంది. పైగా తన తర్వాతి చిత్రాన్ని రామ్‌చరణ్‌తో చేయనున్నట్లు సుకుమార్ ప్రకటించారు. అటు ‘పుష్ప 3’ కూడా ఉంటుందని ప్రచారం జరుగుతోంది. కాబట్టి నెక్స్ట్‌ 2, 3 ఏళ్లలో సుకుమార్‌.. రాజమౌళి రేంజ్‌లో పాపులర్ అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.&nbsp; సందీప్‌ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) టాలీవుడ్‌ సెన్సేషన్‌ డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగా.. ‘యానిమల్‌’ (Animal) సినిమా ద్వారా తన సత్తా ఏంటో చూపించాడు. డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో సినిమాలు తెరకెక్కిస్తూ తన కంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. అయితే సందీప్‌.. రాజమౌళిలాగా సినిమా మేకింగ్‌ స్టైల్‌నే మార్చేశాడు. ఇప్పటివరకూ ఏ డైరెక్టర్‌ సాహించని విధంగా సినిమాలు తీస్తూ అలరిస్తున్నాడు. సందీప్‌ తన తర్వాతి చిత్రాన్ని ప్రభాస్‌తో తీయనున్నాడు. దీనికి స్పిరిట్‌ అనే టైటిల్‌ కూడా ఖరారు చేశారు.&nbsp; స్పిరిట్‌ సినిమాలో ప్రభాస్‌ తొలిసారి పోలీసు ఆఫీసర్‌గా కనిపించనున్నాడు. అతడి పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉండనున్నట్లు సమాచారం. ఇప్పటికే ప్రభాస్‌ పాత్రకు సంబంధించిన ఓ పోస్టర్‌ను సైతం చిత్ర యూనిట్‌ రిలీజ్‌ చేసింది. ఇందులో ప్రభాస్‌ వేసుకున్న పోలీసు డ్రెస్‌ చాలా డిఫరెంట్‌గా ఉంది. ఇంటర్‌నేషనల్‌ కాప్‌ లుక్‌ను తలపిస్తోంది. యానిమల్‌ కంటే స్ట్రాంగ్‌ కంటెంట్‌తో స్పిరిట్‌ రానుంది ఇప్పటికే సందీప్‌ ప్రకటించాడు. తొలి రోజే రూ.150 కోట్ల వసూళ్లను రాబడుతుందని ధీమా వ్యక్తం చేశారు. మూవీ హిట్‌ టాక్‌ వస్తే.. వారం రోజుల్లోనే రూ.1500 కలెక్షన్లు సాధిస్తుందని సందీప్‌ వంగా నమ్మకంగా ఉన్నట్లు తెలిసింది.&nbsp; ఇక స్పిరిట్‌ తర్వాత సందీప్‌ రెడ్డి.. రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor)తోనే ‘యానిమల్‌ 2’ చేయనున్నాడు. ఈ రెండు సినిమాలు సక్సెస్‌ అయితే సందీప్‌కు రాజమౌళి స్థాయిలో ఫేమ్‌ రావడం ఖాయమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.&nbsp; ప్రశాంత్‌ వర్మ (Prasanth Varma) యంగ్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మ.. తన టాలెంట్‌ ఏంటో ‘హనుమాన్‌’ (HanuMan) ద్వారా యావత్‌ దేశానికి తెలియజేశాడు. తన మూడో సినిమాతోనే స్టార్‌ డైరెక్టర్ల సరసన నిలబడ్డాడు. ఈ ఏడాది ఇప్పటివరకూ అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా హనుమాన్‌ నిలిచింది. బాక్సాఫీస్‌ వద్ద రూ. 350 కోట్లకు పైగా కలెక్షన్స్‌ కొలగొట్టి అందర్నీ ఆశ్చర్య పరిచింది. ప్రస్తుతం ప్రశాంత్‌ వర్మ..&nbsp; ‘హనుమాన్‌ 2’ చిత్రాన్ని తెరకెక్కించే పనిలో ఉన్నాడు. అటు బాలీవుడ్‌ స్టార్ హీరో రణ్‌వీర్‌ సింగ్‌ (Ranveer Singh)తో ఓ పీరియాడికల్‌ సినిమా చేసే ఛాన్స్ ప్రశాంత్‌కు దక్కినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ రెండు ప్రాజెక్ట్స్‌ కూడా సక్సెస్‌ అయితే ప్రశాంత్‌ పేరు జాతీయ స్థాయిలో మారుమోగడం ఖాయం.&nbsp; ప్రశాంత్‌ నీల్‌ (Prashanth Neel) కన్నడ డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌.. టాలీవుడ్‌ స్టార్‌ ప్రభాస్‌తో ‘సలార్‌’ (Salaar) రూపొందించి సాలిడ్‌ విజయాన్ని అందుకున్నాడు. ఈ దర్శకుడి మేకింగ్‌ స్టైల్‌ రాజమౌళిని సైతం ఎంతగానో ఇంప్రెస్‌ చేసింది. ప్రభాస్‌ కటౌట్‌కు తగ్గ ఎలివేషన్స్‌ ఇచ్చి.. ప్రతీ ఒక్కరినీ ప్రశాంత్‌ నీల్ ఆకట్టుకున్నారు. హీరో ప్రభాస్‌ను చాలా స్ట్రాంగ్‌ పర్సనాలిటీగా సలార్‌లో ప్రొజెక్ట్‌ చేశాడు డైరెక్టర్‌. రాజమౌళి తరహాలోనే అద్భుతంగా ఇంటర్వెల్‌ను డిజైన్‌ చేశాడు. ప్రభాస్‌ను స్క్రీన్‌పై కనిపించిన ప్రతీసారి ఫ్యాన్స్‌కు గూస్‌బంప్స్‌ వచ్చాయి.&nbsp; ప్రస్తుతం ప్రశాంత్ నీల్ ఫోకస్‌ మెుత్తం ‘సలార్‌ 2’ (Salaar: Part 2 - Shouryanga Parvam)పై ఉంది. ఈ మూవీ కూడా విజయం సాధిస్తే ప్రశాంత్‌ నీల్‌ జాతీయ స్థాయిలో టాప్‌ డైరెక్టర్లలో ఒకరిగా మారిపోవడం ఖాయం. అటు తారక్‌తోనూ ప్రశాంత్‌.. ఓ సినిమాను ప్రకటించాడు. ‘NTR31’ ప్రొడక్షన్‌ టైటిల్‌తో ఈ మూవీ సెట్స్‌పైకి వెళ్లనుంది. అటు ‘కేజీఎఫ్‌ 3’ రూపొందనున్నట్లు సదరు నిర్మాణ సంస్థ ప్రకటించింది. ఈ మూడు ప్రాజెక్టులు సక్సెస్‌ అయితే ప్రశాంత్‌ క్రేజ్‌ రాజమౌళి స్థాయికి చేరే అవకాశముంది.&nbsp; కొరటాల శివ (Koratala Siva) టాలీవుడ్‌ టాలెంటెడ్‌ డైెరెక్టర్లలో కొరటాల శివ ఒకరు. ఆచార్య మినహా ఇప్పటివరకూ అతడు డైరెక్ట్‌ చేసిన చిత్రాలన్నీ బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాయి. అతడు కెరీర్‌లో తొలిసారి ఓ పాన్‌ ఇండియా చిత్రాన్ని రూపొందిస్తున్నారు. తారక్‌తో ‘దేవర’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీపై దేశవ్యాప్తంగా బజ్ ఉంది. తీర ప్రాంత నేపథ్యంలో ఈ సినిమా వస్తోంది. మెుత్తం రెండు పార్ట్స్‌గా ఈ మూవీ రానుండగా తొలి భాగం.. అక్టోబర్‌ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. తారక్‌తో పాటు బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌, మ్యూజిక్ సెన్సేషన్‌ అనిరుధ్‌ ఈ ప్రాజెక్టులో భాగం కావడంతో సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి. గతంలో రిలీజ్‌ చేసిన దేవర గ్లింప్స్‌ ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. ఈ గ్లింప్‌లో తారక్‌.. కత్తితో శత్రువులను తెగనరకడం చూపించాడు డైరెక్టర్‌. ఓ సీన్‌లో తారక్‌ శత్రువుని నరకగా అతడి రక్తం.. హాఫ్‌ మూన్‌ను కింద వైపు నుంచి ఈక్వెల్‌గా రౌండ్‌ చేయడం గూస్‌బంప్స్‌ తెప్పిస్తుంది. అలాగే ఇటీవల తారక్‌ బర్త్‌డేను పురస్కరించుకొని రిలీజ్‌ చేసిన ఫస్ట్‌ సింగిల్‌ కూడా సినిమాపై మరింత హైప్‌ను పెంచింది. ముఖ్యంగా తారక్‌ పాత్రను ఎలివేట్‌ చేస్తూ రాసుకున్న లిరిక్స్‌ హైలెట్‌గా నిలిచాయి. ఈ మూవీ సక్సెస్‌ అయితే కొరటాల శివ క్రేజ్‌ జాతీయ స్థాయికి చేరనుంది. ఇక దేవర రెండు పార్ట్స్‌ కూడా విజయం సాధిస్తే.. దేశంలోని ప్రముఖ డైరెక్టర్ల జాబితాలో అతడు చేరడం ఖాయం.&nbsp; సుజీత్‌ (Sujeeth) యంగ్‌ డైరెక్టర్‌ సుజీత్‌.. స్టైలిష్‌ డైరెక్టర్‌గా ఇండస్ట్రీలో పేరుంది. అతడి డైరెక్షన్‌ స్కిల్స్‌ రాజమౌళి తరహాలోనే హాలీవుడ్‌ డైరెక్టర్లను తలపిస్తాయి. బాహుబలి తర్వాత ప్రభాస్‌ చేసిన ‘సాహో’ చిత్రానికి&nbsp; సుజీత్‌ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ఫ్లాప్‌ టాక్‌ తెచ్చుకున్నప్పటికీ.. సుజీత్‌ మేకింగ్‌ నైపుణ్యం, స్క్రీన్‌ప్లే, ఐడియాలజీకి ఆడియన్స్ ఇంప్రెస్ అయ్యారు. ముఖ్యంగా యాక్షన్స్‌ సీక్వెన్స్‌ను ఆయన తెరకెక్కించిన విధానం ఎంతగానో ఆకట్టుకుంది. ప్రభాస్‌ను చాలా స్టైలిష్‌గా చూపించాడు. సరైన హిట్‌ లభిస్తే సుజీత్‌ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదని అప్పట్లో వార్తలు వచ్చాయి. ప్రస్తుతం అతడు పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan)తో ‘ఓజీ’ (OG) సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ గ్లింప్స్‌ పవన్‌ ఫ్యాన్స్‌ను ఎంతగానో ఇంప్రెస్ చేసింది. ఇందులో పవన్‌ గ్యాంగ్‌ స్టర్‌గా కనిపించనున్నాడు. ఈ మూవీ సక్సెస్‌ అయితే సుజీత్ కెరీర్‌ మరోలా ఉంటుందని సినీ విశ్లేషకుల అంచనా. రెండు సాలిడ్ హిట్స్ పడితే అతడి క్రేజ్‌ రాజమౌళి స్థాయికి చేరే అవకాశముందని విశ్లేషణలు ఉన్నాయి.&nbsp; బుచ్చిబాబు (Buchi Babu) తొలి సినిమాతోనే సాలిడ్‌ హిట్‌ అందుకున్న అతికొద్ది దర్శకుల్లో బుచ్చిబాబు ఒకరు. ‘ఉప్పెన’ (Uppena) సినిమాతో స్వచ్ఛమైన ప్రేమ కథను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన అతడు.. తనలో ఎంతో టాలెంట్‌ ఉందని ఇండస్ట్రీకి తెలిసేలా చేశాడు. తన తర్వాతి చిత్రాన్ని టాలీవుడ్‌ స్టార్‌ హీరో రామ్‌చరణ్‌తో చేసే స్థాయికి ఎదిగాడు. స్పోర్ట్స్‌ డ్రామాగా రానున్న ఈ చిత్రం కూడా పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందనుంది. రామ్‌చరణ్‌ క్రేజ్‌కు బుచ్చిబాబు టాలెంట్‌ తోడైతే ఈ సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. జాతీయ స్థాయిలో అతడి పేరు మార్మోగుతుందని అభిప్రాయపడుతున్నారు.&nbsp;
    మే 24 , 2024

    @2021 KTree