• TFIDB EN
  • ఆ ఒక్కటి అడక్కు
    UTelugu2h 35m
    సొమరి అయిన చిట్టి జ్యోతిష్యాన్ని బాగా నమ్ముతాడు. అతను ఒక ధనవంతుడి కూతురితో ప్రేమలో పడతాడు. అయితే ఆమె తండ్రి పెట్టిన షరతును నెరవేర్చడానికి తన సోమరితనాన్ని వదిలిపెట్టి పనిచేయాల్సి వస్తుంది.
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌Primeఫ్రమ్‌
    Watch
    స్ట్రీమింగ్‌ ఆన్‌Youtube
    Watch
    Free
    రివ్యూస్
    How was the movie?

    తారాగణం
    రాజేంద్ర ప్రసాద్
    అటుకుల చిట్టి బాబు
    రంభ
    రావు గోపాల్ రావు
    రొయ్యల నాయుడు / గోదావరి గంగరాజు
    సహదేవుడు
    బ్రహ్మానందం
    అడ్డు పుల్లారావు
    బాబూ మోహన్
    పూంపుహార్
    సాక్షి రంగారావు
    పెల్లిల్ల పేరయ్య
    కల్లు చిదంబరం
    చిదంబరం
    చిడతల అప్పారావురిక్షవాడు
    కాదంబరి కిరణ్
    పృధ్వీ రాజ్
    బోస్ బాబు
    రాధా కుమారిసహదేవుడు భార్య
    లతశ్రీకుంతి
    అన్నూజకన్నాంబ
    నిర్మలమ్మ
    చిట్టి బాబు తల్లి
    సిబ్బంది
    ఈవీవీ సత్యనారాయణ
    దర్శకుడు
    ఎం. శరవణన్ (చిత్ర నిర్మాత)
    నిర్మాత
    ఎం. బాలసుబ్రహ్మణ్యంనిర్మాత
    ఇళయరాజా
    సంగీతకారుడు
    పి. కలైమణి
    కథ
    ఎడిటోరియల్ లిస్ట్
    కథనాలు
    Aa Okkati Adakku Review: వింటేజ్‌ అల్లరి నరేష్‌ ఈజ్ బ్యాక్‌.. ‘ఆ ఒక్కటి అడక్కు’ హిట్‌ కొట్టినట్లేనా?
    Aa Okkati Adakku Review: వింటేజ్‌ అల్లరి నరేష్‌ ఈజ్ బ్యాక్‌.. ‘ఆ ఒక్కటి అడక్కు’ హిట్‌ కొట్టినట్లేనా?
    నటీ నటులు : అల్లరి నరేష్‌, ఫరియా అబ్దుల్లా, వెన్నెల కిషోర్‌, జామీ లివర్‌, హర్ష చెముడు, అరియానా గ్లోరి తదితరులు.. డైరెక్టర్‌ : మల్లీ అంకం సినిమాటోగ్రాఫర్‌ : సూర్య సంగీతం : గోపి సుందర్‌ నిర్మాత : రాజీవ్‌ చిలక నిర్మాణ సంస్థ : చిలక ప్రొడక్షన్స్‌ విడుదల తేదీ: 3 మే, 2024 అల్లరి నరేష్‌ (Allari Naresh), ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) జంటగా నటించిన లేటెస్ట్‌ చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’ (Aa Okkati Adakku). మల్లి అంకం దర్శకత్వం వహించాడు. కొన్ని సంవత్సరాల గ్యాప్‌ తర్వాత అల్లరి నరేష్‌ మళ్లీ కామెడీ సినిమాతో ప్రేక్షకుల ముందు వస్తుండటంపై సినిమాపై అంచనాలు పెరిగాయి. మే 3న విడుదలైన ఈ చిత్రం ఆడియన్స్‌ను ఆకట్టుకుందా? అల్లరి నరేష్‌ ఖాతాలో మరో విజయం చేరినట్లేనా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.  కథేంటి గణపతి (అల్లరి నరేష్) సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో పనిచేస్తుంటాడు. పెళ్లి సంబంధాలు చూడటంలో హాఫ్ సెంచరీ కంప్లీట్ చేస్తాడు. వయసు ఎక్కువ కావడంతో పాటు పెళ్లైన సోదరుడు ఉండటంతో అతడికి ఎవరూ పిల్లను ఇవ్వరు. ఓ రోజు మ్యాట్రిమోనీ సైట్‌లో సిద్ధి (ఫరియా అబ్దుల్లా)ని చూసి ప్రేమలో పడతాడు. ఆమె తిరస్కరించడంతో ఇద్దరూ ఫ్రెండ్స్‌గా మారతారు. అయితే మ్యాట్రిమోనీ ద్వారా సిద్ధి  అబ్బాయిలను మోసం చేస్తోందంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తాయి. ఇందులో నిజమెంత? సిద్ధి ఎవరు? ఆమె నేపథ్యం ఏంటి? ఓ మ్యాట్రిమోనీ సంస్థ పెళ్లికానీ అబ్బాయిలను ఎలా మోసం చేసింది? చివరికీ సిద్ధి - గణపతి ఒకట్టయ్యారా? లేదా? అన్నది కథ. ఎవరెలా చేశారంటే గణపతి పాత్రలో అల్లరి నరేష్‌ చక్కగా ఒదిగిపోయాడు. పాత్రలో పరకాయ ప్రవేశం చేసి మరి నటించాడు. తన కామెడీ టైమింగ్‌తో వింటేజ్‌ నరేష్‌ను గుర్తు చేశాడు. ఇక సిద్ధి పాత్రలో ఫరియా అబ్దుల్లా పర్వాలేదనిపించింది. నటన పరంగా ఆమెకు పెద్దగా స్కోప్‌ రాలేదు. హీరో హీరోయిన్ల మధ్య వచ్చే సరదా సంభాషణలు, వారి పెయిర్‌ ఆకట్టుకుంటాయి. ఇక జెమీ లివర్‌ ఎక్స్‌ప్రెషన్స్‌, ఆమె హుషారైన నటన మెప్పిస్తుంది. వెన్నెల కిషోర్‌, హర్ష చెముడు స్క్రీన్‌పైన కనిపిస్తున్నంత సేపు నవ్వించారు. మిగిలిన పాత్ర దారులు తమ పరిధిమేరకు నటించారు.  డైరెక్షన్ ఎలా ఉందంటే ప్రస్తుతం చాలా మంది యువత ఎదుర్కొంటున్న సమస్యను కథాంశంగా చేసుకొని దర్శకుడు మల్లి అంకం ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మ్యాట్రిమోనీ సైట్లలో యువతీ యువకులకు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయో కళ్లకు కట్టే ప్రయత్నం చేశాడు. అయితే ప్రచార చిత్రాల్లో చూపించినట్లు ఇది ఔట్‌ అండ్ ఔట్‌ కామెడీ చిత్రం కాదు. ఎన్నారై పెళ్లి కొడుకుల మోసాలు, మనం తరచూ వార్తల్లో చూసే విషయాలు తప్ప కొత్తగా ఇందులో ఏమీ లేదు. ఫేక్ పెళ్లి కూతురు కాన్సెప్ట్ కాస్త కొత్తగా అనిపించినా దాని చుట్టూ అల్లుకున్న కామెడీ మాత్రం వర్కౌట్‌ కాలేదు. ఫస్టాఫ్‌ వరకూ కామెడీ పర్వాలేదనిపించినా సెకండాఫ్‌లో మాత్రం అది ఎక్కడ కానరాదు. పెళ్లి అనే కాన్సెప్ట్‌ తీసుకొని డైరెక్టర్‌ కథను మరీ సాగదీసినట్లు అనిపించింది.  టెక్నికల్‌గా  టెక్నికల్‌ అంశాల విషయానికి వస్తే రాజ్‌ సుందర్‌ అందించిన సంగీతం పర్వాలేదు. 'రాజాది రాజా..' సాంగ్‌ మళ్లీ మళ్లీ వినేలా ఉంది. నేపథ్య సంగీతం సోసోగా ఉంది. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్‌ తన కత్తెరకు కాస్త పని చెప్పి ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్‌ అల్లరి నరేష్‌ నటనకామెడీ మైనస్‌ పాయింట్స్ కథలో మెరుపులు లేకపోవడంసాగదీత సీన్లు Telugu.yousay.tv Rating : 2.5/5
    మే 03 , 2024
    ఫరియా అబ్దుల్లా గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
    ఫరియా అబ్దుల్లా గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
    ఫరియా అబ్దుల్లా.. జాతిరత్నాలు చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది. ఈ చిత్రంలో ఆమె చేసిన 'చిట్టి' పాత్ర యూత్‌లో క్రేజ్ సంపాదించింది. ఫరియా సినిమాల్లోకి రాకముందు మోడలింగ్ చేసేది. ప్రస్తుతం తెలుగులో ఆ ఒక్కటి అడక్కు చిత్రంలో అల్లరి నరేష్ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండే ఫరియాకు డ్యాన్స్ అంటే ఇష్టం. మరి ఫరియా గురించి మరిన్ని ఆసక్తికరమైన(Some Lesser Known Facts About faria abdullah) విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఫరియా అబ్దుల్లా దేనికి ఫేమస్? ఫరియా అబ్దుల్లా జాతిరత్నాలు చిత్రం ద్వారా గుర్తింపు పొందింది. ఆ సినిమాలో ఆమె చేసిన పాత్రకు యూత్‌లో విపరీతమైన క్రేజ్ దక్కింది. ఫరియా అబ్దుల్లా వయస్సు ఎంత? 1998 మే 28న జన్మించింది. ఆమె వయస్సు 26 సంవత్సరాలు  ఫరియా అబ్దుల్లా ఎత్తు ఎంత? 5 అడుగుల 10 అంగుళాలు  ఫరియా అబ్దుల్లా ఎక్కడ పుట్టింది? కువైట్‌ ఫరియా అబ్దుల్లా ఉండేది ఎక్కడ? హైదరాబాద్ ఫరియా అబ్దుల్లా ఏం చదివింది? మల్టీమీడియా మాస్ కమ్యూనికేషన్‌లో డిగ్రీ చేసింది ఫరియా అబ్దుల్లా తల్లిదండ్రుల పేర్లు M.J అబ్దుల్లా(వ్యాపారవేత్త), కౌసర్ సుల్తానా(డాక్టర్) ఫరియా అబ్దుల్లా ఫెవరెట్ హీరో? విజయ్ దేవరకొండ ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటించిన తొలి చిత్రం? జాతిరత్నాలు, ఈ చిత్రంతో పాటు మసూధ, లైక్, షేర్, సబ్‌స్క్రైబ్ సినిమాలో నటించింది. ఫరియా అబ్దుల్లా అభిరుచులు? మోడలింగ్, డ్యాన్సింగ్, పేయింటింగ్ ఫరియా అబ్దుల్లా ఇష్టమైన ఆహారం? బిర్యాని ఫరియా అబ్దుల్లాకి  ఇష్టమైన కలర్ ? బ్లాక్, రెడ్ ఫరియా అబ్దుల్లా పారితోషికం ఎంత? ఒక్కొ సినిమాకు రూ.50లక్షల వరకు ఛార్జ్ చేస్తోంది. ఫరియా అబ్దుల్లా సినిమాల్లోకి రాకముందు ఏం చేసేది? మోడలింగ్, స్టేజీ ఫర్ఫామెన్స్ ఇచ్చేది. ఫరియా అబ్దుల్లా ఇన్‌స్టాగ్రాం లింక్? https://www.instagram.com/fariaabdullah/?hl=en https://www.youtube.com/watch?v=Xcc_cng9Cl8 ఫరియా అబ్దుల్లా మరికొన్ని విషయాలు ఫరియా అబ్దుల్లా స్కూల్ డేస్‌లో బ్రైట్ స్టూడెంట్‌గా ఉండేది. భారతీయ విద్యా భవన్‌లో హెడ్‌ గర్ల్‌ ఆఫ్ స్కూల్‌గా ఎంపికైంది.ఫరియా కుడి చేతి మీద Veni Vidi Vici అనే పదాలు రాసి ఉంటాయి. వీటి అర్థం "నేను వచ్చాను, చూశాను, జయించాను"ఫరియా అబ్దుల్లాకు ఖాళీ సమయంలో కొత్త ప్రదేశాలను చూసేందుకు ఇష్టపడుతుందిఫరియాకు తన చెల్లెలు ఇనయా అబ్దుల్లా అంటే చాలా ఇష్టం
    ఏప్రిల్ 13 , 2024
    This Week OTT Movies: ఈ వారం సందడి చేసేందుకు వస్తోన్న చిత్రాలు ఇవే!
    This Week OTT Movies: ఈ వారం సందడి చేసేందుకు వస్తోన్న చిత్రాలు ఇవే!
    టాలీవుడ్‌లో గత కొన్ని వారాలుగా చిన్న సినిమాలే సందడి చేస్తున్నాయి. ఈ సమ్మర్‌లో స్టార్‌ హీరోల చిత్రాలు లేకపోవడంతో యంగ్‌ హీరోలు తమను తాము నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో మే చివరి వారంలో పలు ఆసక్తికర చిత్రాలు థియేటర్లలో విడుదల కాబోతున్నాయి. అటు ఓటీటీలోనూ కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు అలరించేందుకు రెడీ అవుతున్నాయి. ఆ విశేషాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం. థియేటర్లలో విడుదలయ్యే చిత్రాలు గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి విష్వక్‌ సేన్‌ (Vishwak Sen) హీరోగా కృష్ణ చైతన్య తెరకెక్కించిన చిత్రం ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ (Gangs of Godavari). నేహాశెట్టి హీరోయిన్‌. అంజలి కీలక పాత్ర పోషించిన ఈ చిత్రం మే 31న విడుదలవుతోంది. ఓ సామాన్యుడిగా చీకటి ప్రపంచంలోకి అడుగు పెట్టి అసామాన్యుడిగా ఎలా ఎదిగాడన్న కాన్సెప్ట్‌తో ఈ మూవీని రూపొందించారు. ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. భజే వాయు వేగం యంగ్‌ హీరో కార్తికేయ.. ‘భజే వాయు వేగం’ (Bhaje Vaayu Vegam) చిత్రంతో ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ప్రశాంత్‌రెడ్డి చంద్రపు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఐశ్వర్య మీనన్‌ హీరోయిన్‌. మే 31న ఈ చిత్రం విడుదల కానుంది. ఎమోషనల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని రూపొందించినట్లు చిత్ర యూనిట్‌ తెలిపింది. సామాన్య వ్యక్తి అసాధారణ సమస్యలో ఇరుక్కుని తిరిగి అందులో నుంచి ఎలా బయటపడ్డాడు అన్న కాన్సెప్ట్‌తో ఈ మూవీ రానున్నట్లు చెప్పింది.  గం.. గం.. గణేశా విజయ్‌ దేవరకొండ సోదరుడు ఆనంద్‌ దేవరకొండ నటించిన లేటెస్ట్‌ చిత్రం.. ‘గం.. గం.. గణేశా’ (Gam Gam Ganesha). ఉదయ్‌ శెట్టి దర్శకుడు. ప్రగతి శ్రీవాస్తవ కథానాయిక. రిష్మా, వెన్నెల కిశోర్‌ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ‘బేబీ’ లాంటి బ్లాక్‌ బాస్టర్‌ హిట్‌ తర్వాత ఆనంద్‌ దేవరకొండ చేస్తున్న చిత్రం కావడంతో ఈ మూవీపై భారీగా అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ట్రైలర్‌ యూత్‌ను ఆకట్టుకుంటోంది. ఈ మూవీ మే 31న విడుదల కానుంది.  మిస్టర్‌ అండ్‌ మిస్సెస్‌ మహి బాలీవుడ్‌ భామ జాన్వీ కపూర్‌ (Janhvi Kapoor) నటించిన లేటెస్ట్ రొమాంటిక్‌ స్పోర్ట్స్‌ డ్రామా  ‘మిస్టర్‌ అండ్‌ మిస్సెస్‌ మహి’ (Mr. & Mrs. Mahi). శరణ్‌ శర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో రాజ్‌ కుమార్‌ కీలక పాత్ర పోషించాడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం మే 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో జాన్వీ క్రికెటర్‌గా కనిపించనుంది. హిట్ లిస్ట్ తమిళ డైరెక్టర్ విక్రమన్ కొడుకు విజయ్ కనిష్క హీరోగా సముద్రఖని, శరత్ కుమార్, గౌతమ్ వాసుదేవ మీనన్ ముఖ్యపాత్రలో నటించిన సినిమా ‘హిట్ లిస్ట్’ (Hit List). యాక్షన్, సస్పెన్స్, క్రైమ్ జోనర్ లో రూపొందిన ఈ చిత్రానికి సూర్య కతిర్ కాకల్లార్, కే. కార్తికేయన్ దర్శకత్వ వహించారు. ఈ చిత్రం మే 31న విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌, ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలు పెంచుతోంది.  ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు / వెబ్‌ సిరీస్‌లు ఆ ఒక్కటి అడక్కు కామెడీ స్టార్‌ అల్లరి నరేష్‌ (Allari Naresh) నటించిన లేటెస్ట్ చిత్రం 'ఆ ఒక్కటి అడక్కు' (Aa Okkati Adakku). మల్లి అంకం దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా చేసింది. ఇటీవలే థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం యావరేజ్‌ టాక్‌ తెచ్చుకుంది. అయితే ఈ వీకెండ్‌లో ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు రాబోతోంది. ఈ సినిమాను మే 31 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌ స్ట్రీమింగ్‌లోకి తీసుకురానున్నట్లు సమాచారం.  TitleCategoryLanguagePlatformRelease DateErikSeriesEnglishNetflixMay 30Geek GirlSeriesEnglishNetflixMay 30Panchayat S3SeriesHindiAmazon primeMay 28Aa Okkati AdakkuMovieTeluguAmazon primeMay 31Swatantra Veer SavarkarMovieHindiZee 5May 28ComdenSeriesEnglishDisney + HotstarMay 28The First AmenMovieEnglishDisney + HotstarMay 30Uppu Puli KaramMovieTamilDisney + HotstarMay 30Illegal S3SeriesHindiJio CinemaMay 29Dedh Bigha ZameenMovieHindiJio CinemaMay 31The Last Refill ManMovieEnglishJio CinemaMay 31
    మే 27 , 2024
    Telugu Movies Collections: మే నెలలో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రాలు ఇవే!
    Telugu Movies Collections: మే నెలలో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రాలు ఇవే!
    సాధారణంగా ప్రతీ మే నెల టాలీవుడ్‌ ఇండస్ట్రీకి ఎంతో కీలకమైనది. సమ్మర్‌లో భాగంగా ఏటా స్టార్‌ హీరోల చిత్రాలు ప్రధానంగా ఈ నెలలోనే విడుదలవుతుంటాయి. తద్వారా బాక్సాఫీస్‌ను షేక్‌ చేసి రికార్డులు సృష్టిస్తుంటాయి. అయితే ఈ వేసవి కాలంలో చిన్న చిత్రాలే పెద్ద ఎత్తున థియేటర్లలో సందడి చేశాయి. టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ కుర్ర హీరోల సినిమాలు.. మే నెలలో విడుదలై ఆడియన్స్‌ను ఆకట్టుకునే ప్రయత్నం చేశాయి. ఇంతకీ ఆ చిత్రాలు ఏవి? బాక్సాఫీస్ వద్ద వాటి ప్రభావం ఎలా ఉంది? నిర్మాతలు లాభపడ్డారా? నష్టపోయారా? ఈ ప్రత్యేక కథనంలో పరిశీలిద్దాం.  [toc] గ్యాంగ్స్ ఆఫ్‌ గోదావరి విష్వక్‌ సేన్‌ తాజా మూవీ ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’.. మే 31న విడుదలై హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. ఈ సినిమా విడుదలై ఆరు రోజులు కాగా.. ఇప్పటిరవరకూ వరల్డ్‌ వైడ్‌గా రూ.18 కోట్ల గ్రాస్‌ వచ్చినట్లు ట్రేడ్‌ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. రూ.9.85 కోట్ల షేర్‌ రాబట్టినట్లు పేర్కొన్నాయి. ఈ సినిమా బ్రేక్‌ ఈవెన్‌ టార్గెట్‌ రూ.11 కోట్లుగా ఉంది. అంటే షేర్‌ పరంగా చూస్తే ఈ మూవీ ఇంకా 1.15 కోట్లు వెనకబడి ఉంది.  మూవీ ప్లాట్‌ ఏంటంటే..  కొవ్వూరు గ్రామానికి చెందిన లంకల రత్నం (విశ్వక్ సేన్) రాజకీయాల్లో ఎదిగేందుకు ఎమ్మెల్యే దొరసామి రాజు (గోపరాజు రమణ) బృందంలో చేరతాడు. ఆ తర్వాత నానాజీ (నాజర్) గ్రూపులో చేరి ఎమ్మెల్యే అవుతాడు. అయితే, అతడి ప్రవర్తన కారణంగా శత్రువులు ఏర్పడతారు. టైగర్ రత్నాకర్‌గా ఎదిగిన అతడు ఎలాంటి ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్నాడు? ప్రత్యర్థుల ఎత్తుగడలను ఎలా తిప్పికొట్టాడు? బుజ్జి (నేహా శెట్టి)తో రత్నాకర్‌ లవ్‌ ట్రాక్‌ ఏంటి? అన్నది కథ.  భజే వాయు వేగం యంగ్‌ హీరో కార్తికేయ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం కూడా మే 31న విడుదలై హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. ఈ చిత్రం గత ఆరు రోజుల్లో వరల్డ్ వైడ్‌గా రూ.7.1 కోట్ల గ్రాస్‌ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు ప్రకటించాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.5.6 కోట్ల గ్రాస్‌ వసూలు చేసినట్లు పేర్కొన్నాయి. ఈ మూవీ బ్రేక్‌ ఈవెన్‌ పాయింట్‌ రూ. 4.5 కోట్లుగా ఉంది. తొలి ఆరు రోజుల లెక్కల ప్రకారం ఈ చిత్రం రూ. 3.5 కోట్లకు పైగా షేర్‌ రాబట్టింది.  మూవీ కథ ఏంటంటే.. తల్లిదండ్రులు చనిపోవడంతో వెంకట్‌ (కార్తికేయ) చిన్నప్పుడే అనాథగా మారతాడు. తండ్రి స్నేహితుడైన రాజన్న(తనికెళ్ల భరణి) అతడ్ని దత్తత తీసుకొని కొడుకు రాజు (రాహుల్‌ టైసన్‌)తో పాటే పెంచి పెద్ద చేస్తాడు. కొడుకులు ఇద్దరినీ ఉన్నత స్థితిలో చూడాలని రాజన్న కలలు కంటాడు. కానీ వారు సిటీలో ఉద్యోగం చేస్తున్నామని చెప్పి మోసం చేస్తుంటారు. ఓ రోజు తండ్రి ఆరోగ్యం విషమించడంతో వెంకట్‌ విలన్‌ గ్యాంగ్‌ దగ్గర బెట్టింగ్ వేసి గెలుస్తాడు. కానీ, వారు మోసం చేస్తారు. కొన్ని ఘటనల నేపథ్యంలో వారిపై పగ తీర్చుకోవాలని వెంకట్‌ నిర్ణయించుకుంటాడు. ఈ క్రమంలో అతడికి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? హీరోయిన్‌ ఐశ్వర్య మీనన్‌తో అతడి లవ్‌ ట్రాక్ ఏంటి? అన్నది కథ.  గం గం గణేశా స్టార్‌ హీరో విజయ్‌ దేవరకొండ సోదరుడు ఆనంద్‌ దేవరకొండ నటించిన ఈ చిత్రం.. కామెడీ ఎంటర్‌టైనర్‌గా మే 31న ఆడియన్స్‌ ముందుకు వచ్చింది. గత ఆరు రోజుల్లో ఈ సినిమా వరల్డ్‌ వైడ్‌గా రూ. 5.25 కోట్ల గ్రాస్‌ సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో రూ.4.35 కోట్ల మేర వసూలు చేసింది. ఇక ఈ సినిమాకు రూ.2.41 కోట్ల షేర్ వచ్చినట్లు ట్రేడ్‌ వర్గాలు తెలిపాయి. బ్రేక్ ఈవెన్ కోసం ఇంకో రూ.3.19 కోట్ల షేర్‌ను రాబట్టాల్సి ఉందని స్పష్టం చేశాయి. ‘గం గం గణేశా’ చిత్రానికి రూ.5.3 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. స్టోరీ ఏంటంటే..  గణేష్‌ (ఆనంద్‌ దేవరకొండ).. స్నేహితుడు శంకర్‌ (ఇమ్మాన్యుయెల్‌)తో కలిసి చిన్న చిన్న దొంగతనాలు చేస్తుంటాడు. అనూహ్య ఘటనల నేపథ్యంలో అతడికి పెద్ద దోపిడి చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఈ క్రమంలో శంకర్‌తో కలిసి వేసిన ప్లాన్‌ బెడిసి కొడుతుంది. దీంతో గణేష్‌కు కొత్త సమస్యలు ఎదురవుతాయి. మరోవైపు నంద్యాల ఉప ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అధికార, ప్రతిపక్ష పార్టీలు కష్టపడుతుంటాయి. ఇంకోవైపు ముంబయిలో రెండు గ్యాంగ్‌ల మధ్య భీకర షూటౌట్‌ జరుగుతుంది. అయితే వాటికి గణేష్‌కు మధ్య సంబంధం ఏంటి? ఓ పొలిటిషన్‌, విగ్రహాన్ని దొంగతనం చేసే బ్యాచ్‌ గణేష్‌ జీవితాన్ని ఎలా ప్రభావితం చేశారు? వాటి నుంచి హీరో ఎలా బయటపడ్డాడు? హీరోయిన్‌ శ్రీవాస్తవతో అతడి లవ్‌ట్రాక్‌ ఏంటి? అన్నది కథ.  లవ్‌ మీ యంగ్ హీరో ఆశిష్‌ హీరోగా చేసిన లేటెస్ట్‌ చిత్రం 'లవ్‌ మీ'. మే 25న రిలీజైన ఈ చిత్రం థియేటర్లలో ఫ్లాప్‌ టాక్‌ తెచ్చుకుంది. అటు నిర్మాతలకు నష్టాలను మిగిల్చింది. ఈ చిత్రం ఓవరాల్‌గా రూ.6.30 కోట్ల గ్రాస్‌.. రూ.2.75 కోట్ల షేర్ మాత్రమే వసూలు చేసింది. రూ.5.5 కోట్ల బ్రేక్ ఈవెన్‌ టార్గెట్‌ను అందుకోలేక నిర్మాతలను లాస్‌లోకి నెట్టింది. కథ ఏంటంటే.. ‘అర్జున్ (ఆశిష్‌), ప్రతాప్ (రవికృష్ణ) కలిసి ఓ యూట్యూబ్ ఛానల్ నడుపుతూ ఉంటారు. దెయ్యాలు, ఆత్మలకు సంబంధించిన వీడియోలు చేస్తుంటారు. ప్రతాప్‌ లవర్‌ ప్రియా (వైష్ణవి).. దివ్యవతి అనే దెయ్యం గురించి చెప్పడంతో ఆమె ఉంటున్న పాడుబడ్డ అపార్ట్‌మెంట్‌కు అర్జున్‌ వెళ్తాడు. అలా వెళ్లిన అర్జున్‌ దివ్యవతి ఆత్మతో ప్రేమలో పడతాడు. ఆ తర్వాత ఏమైంది? దివ్యవతి ఎవరు?’ అన్నది కథ. ఫ్యూరియోసా : ఏ మ్యాడ్‌ మ్యాక్స్‌ సాగా ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్‌ హాలీవుడ్‌ చిత్రంగా నిలిచిన ఫ్యూరియోసా.. కలెక్షన్ల పరంగా తీవ్రంగా నిరాశ పరిచింది. దాదాపు రూ.1,410 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం.. వరల్డ్ వైడ్‌గా రూ.950 కోట్లు మాత్రమే వసూలు చేసింది. దేశంలో రూ.15 కోట్ల రేంజ్‌లో గ్రాస్‌ సాధించింది. కథ ఏంటంటే.. ‘ఫ్యూరియోసాను తల్లి మేరి నుంచి డెమంటస్ గ్యాంగ్‌ కిడ్నాప్‌ చేస్తుంది. ఆమె కళ్లెదుటే తల్లిని దారుణంగా హత్య చేస్తుంది. సంధిలో భాగంగా ఫ్యూరియోసాను డెమంటస్‌.. సిటాడెల్‌ రాజుకు అప్పగిస్తాడు. అక్కడ నుంచి తప్పించుకున్న ఆమె.. డెమంటస్‌పై ఎలా ప్రతీకారం తీర్చుకుంది? అన్నది కథ. కృష్ణమ్మ సత్యదేవ్‌ హీరోగా చేసిన 'కృష్ణమ్మ' చిత్రం మేలో విడుదలై బాక్సాఫీస్‌ వద్ద ఫ్లాప్‌ టాక్‌ తెచ్చుకుంది. ఆపై వారానికే ఓటీటీలోకి వచ్చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ మూవీ ఆరో రోజుల్లో వరల్డ్ వైడ్‌గారు రూ.3.9 కోట్ల గ్రాస్‌ మాత్రమే సాధించింది. ఈ సినిమా బ్రేక్‌ ఈవెన్‌ టార్గెట్‌ రూ.3.50 కాగా, షేర్‌ అంతకంటే తక్కువే రావడంతో నిర్మాతలు నష్టాలను చవిచూశారు.  కథ ఏంటంటే..  ‘భద్ర (సత్యదేవ్), కోటి (మీసాల లక్ష్మణ్‌), శివ (కృష్ణ తేజ) ముగ్గురు ప్రాణ స్నేహితులు. అనాథలు కావడంతో తోడుగా జీవిస్తుంటారు. వీరికి డబ్బు అవసరం పడి నేరం చేయాలని అనుకుంటారు. ఈ క్రమంలో ముగ్గురు చిక్కుల్లో పడతారు. వీరిలో ఒకరు చనిపోవడంతో అందుకు కారణమైన వారిపై హీరో ఎలా రివేంజ్‌ తీర్చుకుంటాడు? అన్నది కథ.  ఆ ఒక్కటి అడక్కు అల్లరి నరేష్‌ రీసెంట్‌ రీసెంట్‌ చిత్రం 'ఆ ఒక్కటి అడక్కు'.. గత నెల మేలో విడుదలై ఫ్లాప్‌ టాక్‌ తెచ్చుకుంది. ఈ చిత్రం తొలి ఏడు రోజుల్లో రూ. 5.85 కోట్ల గ్రాస్‌ మాత్రమే వసూలు చేసింది. ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో రూ.4.8 కోట్లు సాధించింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్‌ టార్గెట్‌ రూ.4.5 కోట్లుగా ఉంది.  కథ ఏంటంటే.. ‘గణపతి (అల్లరి నరేష్) పెళ్లి సంబంధాలు చూడటంలో హాఫ్ సెంచరీ కంప్లీట్ చేస్తాడు. వయసు ఎక్కువ కావడంతో అతడికి ఎవరూ పిల్లను ఇవ్వరు. ఓ రోజు మ్యాట్రిమోనీ సైట్‌లో సిద్ధి (ఫరియా అబ్దుల్లా)ని చూసి ప్రేమలో పడతాడు. అయితే ఆమె అబ్బాయిలను మోసం చేస్తోందంటూ మీడియాలో వార్తలు వస్తాయి. అందులో నిజమెంతా? వారిద్దరు ఒక్కటయ్యారా? లేదా?’ అన్నది కథ. ప్రసన్న వదనం సుహాస్‌ హీరోగా తెరకెక్కిన ‘ప్రసన్న వదనం’ చిత్రం.. మే మెుదటి వారంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ మూవీ హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. ఈ సినిమా వరల్డ్‌ వైడ్‌గా తొలి 7 రోజుల్లో రూ.3.65 కోట్ల గ్రాస్‌ రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో రూ.2.8 కోట్లు వసూలు చేసింది. ఆ తర్వాతి రోజుల్లోనూ మంచి వసూళ్లు సాధించి బ్రేక్‌ ఈవెన్‌ టార్గెట్‌ రూ. 4 కోట్లను అందుకున్నట్లు ఫిల్మ్‌ వర్గాలు తెలిపాయి. కథ ఏంటంటే..  రేడియో జాకీగా పనిచేసే సూర్య జీవితాన్ని ఓ ప్రమాదం తలకిందులు చేస్తుంది. ఈ ఘటనతో అతడు ఫేస్‌ బ్లైండ్‌నెస్‌ బారిన పడతాడు. ముఖాలను, గొంతులను గుర్తుపట్టలేకపోతుంటాడు. ఈ క్రమంలో ఓ రోజు అతడి కళ్లెదుట హత్య జరుగుతుంది. అనూహ్యంగా ఆ కేసులో సూర్య ఇరుక్కుంటాడు. సూర్య‌ని ఇరికించింది ఎవ‌రు? సూర్య కేసు నుంచి బయటపడ్డాడా లేదా? అన్నది ప్లాట్‌. 
    జూన్ 06 , 2024
    This Week OTT Movies: ఈ వారం ఓటీటీ, థియేటర్లలో విడుదలయ్యే చిత్రాలు ఇవే!
    This Week OTT Movies: ఈ వారం ఓటీటీ, థియేటర్లలో విడుదలయ్యే చిత్రాలు ఇవే!
    గత కొన్ని వారాలుగా చిన్న హీరోల చిత్రాలు విడుదలవుతూ థియేటర్లలో సందడి చేస్తున్నాయి. అయితే ఈ వారం కూడా చిన్న చిత్రాల హవా కొనసాగనుంది. ఈ వేసవిలో అహ్లాదకరమైన వినోదాన్ని పంచేందుకు అవి రాబోతున్నాయి. మరోవైపు ఓటీటీలోనూ కొత్త సినిమాలు, సిరీస్‌లు డబుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇచ్చేందుకు వచ్చేస్తున్నాయి. ఆ విశేషాలేంటో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.  థియేటర్‌లో రిలీజయ్యే చిత్రాలు ఆ ఒక్కటీ అడక్కు అల్లరి నరేష్‌ (Allari Naresh), ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) జంటగా నటించిన లేటెస్ట్‌ చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’ (Aa Okkati Adakku). మల్లి అంకం దర్శకత్వం వహించాడు. కొన్ని సంవత్సరాల గ్యాప్‌ తర్వాత అల్లరి నరేష్‌ మళ్లీ కామెడీ సినిమాతో వస్తుండటంతో ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. మే 3న ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు ఆకట్టుకుంటున్నాయి. ప్రసన్న వదనం సుహాస్‌ (Suhas) హీరోగా నటించిన లేటెస్ట్‌ థ్రిల్లింగ్‌ చిత్రం ‘ప్రసన్న వదనం’ (Prasanna Vadanam). అర్జున్‌ వై.కె దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో పాయల్‌ రాధాకృష్ణ, రాశీ సింగ్‌ ప్రధాన పాత్రలు పోషించారు. జె.ఎస్‌ మణికంఠ, టి.ఆర్‌.ప్రసాద్‌ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు.ఫేస్‌ బ్లైండ్‌నెస్‌తో బాధపడే సూర్య అనే యువకుడు మూడు మ‌ర్డ‌ర్ కేసుల్లో ఇరుక్కొంటాడు. మరి ఆ కేసుల్లోంచి ఎలా త‌ప్పించుకొన్నాడు? అస‌లు హంత‌కుడ్ని చ‌ట్టానికి ఎలా అప్ప‌గించాడు? అనేదే క‌థ‌. శబరి వరలక్ష్మీ శరత్‌కుమార్‌ (Varalaxmi Sarathkumar) ప్రధాన పాత్రలో అనిల్‌ కాట్జ్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘శబరి’ (Sabari). మహేంద్రనాథ్‌ కూండ్ల నిర్మించారు. ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో మే 3న ప్రేక్షకుల ముందుకురానుంది. ఒక బిడ్డ కోసం తల్లి పడే తపనను సైకిలాజికల్ థ్రిల్లర్‌గా రూపొందించినట్లు చిత్ర యూనిట్‌ తెలిపింది. తెలుగులో వరలక్ష్మీ చేసిన తొలి నాయికా ప్రధానమైన చిత్రం ఇదేనని పేర్కొంది.  బాక్‌ ప్రముఖ తమిళ దర్శకుడు సుందర్‌. సి ప్రధాన పాత్రలో నటిస్తూ తెరకెక్కించిన చిత్రం ‘బాక్‌’ (Baak). తమన్నా (Tamannaah), రాశీ ఖన్నా (Raashii Khanna) కథానాయికలు.  ఖుష్బు సుందర్‌, ఏసీఎస్‌ అరుణ్‌ కుమార్‌ సంయుక్తంగా నిర్మించారు. వెన్నెల కిశోర్‌, కోవై సరళ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. హారర్‌ కామెడీ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రాన్ని మే 3న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. హారర్‌ కామెడీ ఫ్రాంచైజీ ‘అరణ్‌మనై’ నుంచి వస్తున్న 4వ చిత్రమిది. జితేందర్‌రెడ్డి యువ నటుడు రాకేశ్‌వర్రే హీరోగా నటించిన తాజా చిత్రం ‘జితేందర్‌రెడ్డి’. దర్శకుడు విరించి వర్మ.. 1980లో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా ఈ మూవీని తీర్చిదిద్దారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ మే 3నప్రేక్షకుల ముందుకు రానుంది. ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు ప్రణయ విలాసం ప్రేమలు బ్యూటీ మమితా బైజు నటించిన ప్రణయ విలాసం (Pranaya Vilasam) చిత్రం ఈ వారం ఓటీటీలోకి రానుంది. ఏప్రిల్‌ 29 నుంచి ఈ మూవీని స్ట్రీమింగ్‌లోకి తీసుకొస్తున్నట్లు ప్రముఖ ఓటీటీ వేదిక ఈటీవీ విన్‌ ప్రకటించింది. గతేడాది ఫిబ్రవరి 24న థియేటర్లలో ఈ సినిమా రిలీజైంది. చాలా తక్కువ బడ్జెట్‌తో రూపొందించిన ఈ సినిమా.. మంచి ఆదరణ సంపాదించింది. ఈ మూవీలో అర్జున్ అశోక్ మేల్ లీడ్‌ రోల్‌లో నటించాడు.  మరిన్ని OTT చిత్రాలు & వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి https://telugu.yousay.tv/tfidb/ott TitleCategoryLanguagePlatformRelease DateThe Idea Of YouMovieEnglishAmazon PrimeMay 2The WheelSeries EnglishDisney + HotstarApril 30DeArMovieTelugu/TamilNetflixApril 28Boiling Point - 1SeriesEnglishNetflixApril 29Heera MandiSeriesHindiNetflixMay 1Sithan MovieHindiNetflixMay 3The A Typical FamilySeriesKorean/English NetflixMay 4Hacks 3SeriesEnglishJio CinemaMay 3VonkaMovieEnglishJio CinemaMay 3The Tattooist of AuschwitzSeriesEnglishJio CinemaMay 3Migration MovieEnglishJio CinemaMay 1Acapulco S3SeriesEnglishApple Plus TVMay 1
    ఏప్రిల్ 29 , 2024
    Best Comedy Films in Telugu: ఆన్ లైన్‌లో ఎక్కువ మంది వెతుకుతున్న కామెడీ సినిమాలు ఏవో తెలుసా?
    Best Comedy Films in Telugu: ఆన్ లైన్‌లో ఎక్కువ మంది వెతుకుతున్న కామెడీ సినిమాలు ఏవో తెలుసా?
    నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వకపోవడం ఒక రోగం అన్నాడో మహా కవి. తెలుగులో హస్య చిత్రాలు కోకొల్లలు. కేవలం కామెడీనే ప్రధాన కథాంశంతో తెరకెక్కిన చిత్రాలు తెలుగు నాట ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్వించాయి. నవ్విస్తున్నాయి.  ఈ ఓటీటీ కాలంలో థియేటర్లకు వెళ్లకుండా ఇంటి వద్దనే చూసేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. బెస్ట్ కామెడీ సినిమాల కోసం ఆన్‌లైన్ లో సెర్చ్ చేస్తున్నారు. ఈక్రమంలో తెలుగు మంచి కామెడీ సినిమాలు ఏంటో ఓసారి చూద్దాం.. [toc] Allari Naresh comedy movies సుడిగాడు అల్లరి నరేష్ నటించిన కామెడీ సినిమాల్లో ఎక్కువమంది ఆన్‌లైన్‌లో చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్న సినిమా ఇది. ఈ సినిమా మంచి వినోదాన్ని అందిస్తుంది. ఇక కథ విషయానికొస్తే..శివ చిన్నప్పుడే సిక్స్‌ ప్యాక్‌తో పుడతాడు. పుట్టినప్పటి నుంచి తిక్కల్‌ రెడ్డి మనుషులు శివ కోసం వెతుకుతుంటారు. ఈ క్రమంలో డాన్‌ D మనుషులు శివపై దాడి చేస్తారు. అసలు డాన్‌ డి ఎవరు? శివకు తిక్కల్‌ రెడ్డికి మధ్య వైరం ఏంటి? వారందరితో శివ ఎలా పోరాడాడు? అన్నది కథ. ఓటీటీ: జీ5 అల్లరి టాలీవుడ్ లో విభిన్న కామెడీ జోనర్ తో వచ్చిన మూవీగా అల్లరిని చెప్పవచ్చు. ఈ మూవీతో హీరోగా నరేష్ పరిచయం అయ్యాడు. ఈ మూవీని రఘు బాబు డైరెక్ట్ చేయగా... ఫ్లైయ్యింగ్ ప్రాగ్స్ బ్యానర్ పై నిర్మించారు. తొలి సినిమాలోనే నరేష్ కు నటనపరంగా మంచి మార్కులు పడ్డాయి. ఈ మూవీ అనంతరం నరేష్ ను కాస్త అల్లరి నరేష్ గా పిలవడం ప్రారంభించారు. అల్లరి నరేష్ ఫుల్ టైం కామెడీ స్టార్ గా మారిపోయాడు. కామెడీ మూవీల్లో  ఈ చిత్రం ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. అల్లరిని నరేషే హీరోగా తమిళంలో కురుంబుగా రీమేక్ చేశారు. ఓటీటీ: యూట్యూబ్ ఆ ఒక్కటీ అడక్కు ఈ సినిమా చూస్తున్నంతా సేపు పొట్టచెక్కలయ్యేలా ప్రేక్షకులు నవ్వుతారు. ఇక కథ విషయానికొస్తే..గణపతి (అల్లరి నరేష్) పెళ్లి సంబంధాలు చూడటంలో హాఫ్ సెంచరీ కంప్లీట్ చేస్తాడు. వయసు ఎక్కువ కావడంతో అతడికి ఎవరూ పిల్లను ఇవ్వరు. ఓ రోజు మ్యాట్రిమోనీ సైట్‌లో సిద్ధి (ఫరియా అబ్దుల్లా)ని చూసి ప్రేమలో పడతాడు. అయితే ఆమె అబ్బాయిలను మోసం చేస్తోందంటూ మీడియాలో వార్తలు వస్తాయి. అందులో నిజమెంతా? వారిద్దరు ఒక్కటయ్యారా? లేదా? అన్నది కథ. ఓటీటీ: ప్రైమ్ వీడియో లడ్డూ బాబు  ఈ చిత్రంలో బరువు పెరిగిన స్థూలకాయుడిగా అల్లరి నరేష్ అలరించాడు. ఈ చిత్రం కూడా ప్రేక్షకులను అలరిస్తుంది. అతిగా బరువు పెరిగిపోయిన హీరోకి సమాజం నుంచి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి. వాటిని ఎలా ఎదుర్కొన్నాడు? అన్నది కథ. ఓటీటీ: యూట్యూబ్ సిల్లీ ఫెలోస్  ఎమ్మెల్యే (జయప్రకాష్‌రెడ్డి) ఓ రోజు మూకుమ్మడి వివాహాలు ఏర్పాటు చేస్తాడు. ఓ జంట తగ్గడంతో ఎమ్మెల్యే అనుచరుడైన వీరబాబు (అల్లరి నరేష్‌) సూరిబాబు (సునీల్‌)ను ఉత్తుత్తి పెళ్లి చేసుకోమని చెబుతాడు. కానీ కంగారులో సూరిబాబు పుష్ప (నందిని రాయ్‌)కు నిజంగానే తాళికడతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది కథ. ఓటీటీ: ప్రైమ్ వీడియో మేడ మీద అబ్బాయి  శ్రీను( అల్లరి నరేష్) ఫిల్మ్ మేకర్ కావాలని ఆడిషన్స్ కోసం హైదరాబాద్‌కు రైలు ఎక్కుతాడు. దారిలో సింధుని కలుసుకుని ఆమెకు తెలియకుండా సెల్ఫీ దిగడంతో సమస్యల్లో పడతాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది కథ. ఓటీటీ: సన్ నెక్స్ట్ జేమ్స్ బాండ్  నాని ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. అతను తనకు తెలియకుండా ఒక లేడీ డాన్‌ను వివాహం చేసుకుంటాడు. ఆమె గతం, నేర కార్యకలాపాల గురించి తెలిసిన తర్వాత నాని ఏం చేశాడు అన్నది కథ. ఓటీటీ: ప్రైమ్ వీడియో బ్రదర్ ఆఫ్ బొమ్మాళి రాంకీ (అల్లరి నరేష్), లక్కీ(కార్తీక) ఇద్దరు కవలలు. ఓ రోజు హీరోయిన్‌ను చూసి రాంకీ ప్రేమిస్తాడు. అయితే సోదరి పెళ్లి జరిగితే గాని నీ పెళ్లి చేయనని తండ్రి చెబుతాడు. దీంతో లక్కీకి పెళ్లి చేసేందుకు హీరో ఏం చేశాడు? చెల్లెలకు ఇష్టమైన వ్యక్తితోనే వివాహం చేశాడా లేదా? అన్నది కథ. ఓటీటీ: జీ5 యముడికి మొగుడు యముడికి మొగుడు 2012లో ఇ. సత్తి బాబు దర్శకత్వం వహించిన భారతీయ తెలుగు-భాషా ఫాంటసీ కామెడీ చిత్రం, ఫ్రెండ్లీ మూవీస్ బ్యానర్‌పై చంటి అడ్డాల నిర్మించారు మరియు అల్లరి నరేష్ మరియు రిచా పనై ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రంలో రమ్య కృష్ణ మరియు నరేష్ కూడా కీలక పాత్రల్లో నటించారు. . ఈ చిత్రానికి సౌండ్‌ట్రాక్‌ను సంగీత దర్శకుడు కోటి స్వరపరిచారు మరియు సినిమాటోగ్రఫీని రవీంద్ర బాబు నిర్వహించారు. ఈ చిత్రం 27 డిసెంబర్ 2012న థియేటర్లలో విడుదలైంది. OTT: అమెజాన్ ప్రైమ్ సీమ టపాకాయ్ శివ చిన్నప్పుడే సిక్స్‌ ప్యాక్‌తో పుడతాడు. పుట్టినప్పటి నుంచి తిక్కల్‌ రెడ్డి మనుషులు శివ కోసం వెతుకుతుంటారు. ఈ క్రమంలో డాన్‌ D మనుషులు శివపై దాడి చేస్తారు. అసలు డాన్‌ డి ఎవరు? శివకు తిక్కల్‌ రెడ్డికి మధ్య వైరం ఏంటి? వారందరితో శివ ఎలా పోరాడాడు? అన్నది కథ. ఓటీటీ: హాట్ స్టార్, యుట్యూబ్ కత్తి కాంతారావు ఈ చిత్రంలో అల్లరి నరేష్ కత్తి కాంతరావుగా హాస్యం పండించి ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించాడు. ఈ చిత్రం అల్లరి నరేష్‌కు మంచి గుర్తింపు తెచ్చింది. ఇక కథలోకి వెళ్తే.. కత్తి అనే వ్యక్తి తన కుటుంబం కోరికలను నెరవేర్చి తన తండ్రికి కట్టుబడి ఉండే కానిస్టేబుల్. అతను ఒక అమ్మాయితో ప్రేమలో పడతాడు కానీ తన నలుగురు అక్కచెల్లెల్ల పట్ల ఉన్న బాధ్యతల కారణంగా ఆ విషయం బయటకు చెప్పడు. మరి తన ప్రేమ వ్యవహారం ఎలా బయటపడింది? తన అక్క చెల్లెల్ల సమస్యలను ఎలా చక్కదిద్దాడు అన్నది కథ. ఓటీటీ: సన్ నెక్ట్స్ బెండు అప్పారావు R.M.P. ఈ సినిమాలో మధ్యతరగతి కుటుంబంలో జన్మించి డబ్బు సంపాదించేందుకు పడే కష్టాలను హాస్యంతో మిలితంగా చూపించాడు. ఇక  కథలో..బెండు అప్పరావు జబ్బుల పేరిట రోగులను మోసం చేస్తూ డబ్బు సంపాదిస్తుంటాడు. ఈ క్రమంలో చనిపోతున్న ఓ వ్యక్తి తన కుటుంబానికి ఇవ్యాల్సిందిగా పెద్ద మొత్తంలో డబ్బు ఇస్తాడు. కానీ బెండు దానిని ఇతర మార్గాల కోసం ఉపయోగిస్తాడు. ఓటీటీ: జీ5 బ్లేడ్ బాబ్జీ ఈ చిత్రం చూసినంత సేపూ ఎక్కడా బోర్ కొట్టదు. ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయవచ్చు. తనతో పాటు మురికి వాడల్లో నివసిస్తున్న వారి ఇళ్లను కాపాడేందుకు బ్లేడ్ బాబ్జీ బ్యాంకును దోచుకుంటాడు. అలా దోచుకున్న డబ్బును దాచిపెట్టిన స్థలంలో పోలీసు స్టేషన్‌ నిర్మిచడంతో కథ మలుపు తిరుగుతుంది. ఓటీటీ: యూట్యూబ్ బొమ్మన బ్రదర్స్ చందనా సిస్టర్స్ ఈ సినిమాలో అల్లరి నరేష్- కృష్ణభగవాన్ కామెడి ట్రాక్ నవ్వులు పూయిస్తుంది. దొంగలైన ఇద్దరు సోదరులు.. డబ్బున్న అక్కా చెల్లెళ్లను ప్రేమిస్తారు. మాయమాటలు చెప్పి వారికి దగ్గరవుతారు. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ అబద్దాల వల్ల వారు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? అన్నది కథ. ఓటీటీ: సన్‌నెక్స్ట్ సీమా శాస్త్రి ఫ్యాక్షనిస్ట్ వేశంలో నటించేందుకు అల్లరి నరేష్ పడే బాధలు కడుపుబ్బ నవిస్తాయి. ఇక కథలో..సుబ్రహ్మణ్య శాస్త్రి అనే యువకుడు ఫ్యాక్షనిస్టు కూతురు సురేఖతో ప్రేమలో పడుతాడు. ఆమె ప్రేమను దక్కించుకునేందుకు ఫ్యాక్షనిస్ట్ వేషంలోకి మారిపోతాడు. ఓటీటీ: ప్రైమ్ వీడియో నవీన్ పొలిశెట్టి కామెడీ సినిమాలు నవీన్ పొలిశెట్టి కామెడీ టైమింగ్‌తో స్టార్ డం సంపాదించాడు. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయా, జాతిరత్నాలు, మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి హిట్లతో కెరీర్‌ తారా పథంలో దూసుకెళ్తోంది. ఈక్రమంలో అతను నటించిన సూపర్ హిట్ కామెడీ చిత్రాలను ఓసారి చూద్దాం. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి  మాస్టర్ చెఫ్‌ అయిన అన్విత రవళి తల్లి అనారోగ్యంతో చనిపోతుంది. ఈక్రమంలో ఓ కీలక నిర్ణయం తీసుకుంటుంది. పెళ్లిచేసుకోవద్దని నిశ్చయించుకుంటుంది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అయిన సిద్దు పొలిశెట్టిస్టాండప్ కమెడియన్‌గా అలరిస్తుంటాడు. అన్విత అతని కామెడీ ఇష్టపడుతుంటుంది. ఈక్రమంలో సిద్దూ ఆమెతో ప్రేమలో పడతాడు. అన్విత తన నుంచి ఏమి ఆశిస్తుందో చెప్పినప్పుడు సిద్దూ షాక్‌కు గురవుతాడు. ఇంతకు అన్విత సిద్ధుని ఏం అడిగింది? అందుకు సిద్ధు అంగీకరించాడా? అన్నది మిగతా కథ. ఓటీటీ: నెట్‌ప్లిక్స్ జాతి రత్నాలు ఆన్‌లైన్‌లో ఎక్కువ మంది వెతుకుతున్న కామెడీ చిత్రమిది. ఈ సినిమా నాన్‌స్టాప్ కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తుంది. ఈ సినిమా కథ విషయానికొస్తే..మంచి ఉద్యోగాల కోసం తమ ఊరి నుంచి హైదరాబాద్ వచ్చిన ముగ్గురు యువకులు ఓ అపార్ట్‌మెంటులో దిగుతారు. అక్కడ పిలువని పార్టీకి వెళ్లి మర్డర్ అటెంప్ట్ కేసులో ఇరుక్కుంటారు. ఆ తర్వాత కేసు నుంచి ఎలా బయటపడ్డారనేది కథ. ఓటీటీ; అమెజాన్ ప్రైమ్ ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ  ఈ చిత్రం నవీన్ పొలిశెట్టిలోని మంచి నటున్ని పరిచయం చేసింది. ఈ సినిమా కామెడీ ఎంటర్‌టైనర్‌గా సాగినా.. ట్విస్ట్‌ మాత్రం బాగుంటుంది. ఏజెంట్ సాయి శ్రీనివాస్ అత్రేయా నెల్లూరులో ఓ ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెన్సీని నడుపుతుంటాడు. చిన్న చిన్న కేసులను విచారిస్తూ సమస్యలు ఎదుర్కొంటుంటాడు. రైల్వే ట్రాక్ వద్ద మృతదేహాన్ని గుర్తించినప్పుడు అతని జీవితం తలకిందులవుతుంది. ఓటీటీ: ఆహా సిద్ధు జొన్నలగడ్డ కామెడీ సినిమాలు సిద్ధు జొన్నలగడ్డ ప్రస్తుతం టాలీవుడ్‌లో స్టార్‌బాయ్‌గా కొనసాగుతున్నాడు. టిల్లు స్కేర్ హిట్‌ తర్వాత అతను నటించిన ఇతర కామెడీ చిత్రాల కోసం ఆన్‌లైన్‌ వెతుకుతున్నారు. ఈక్రమంలో సిద్ధు జొన్నలగడ్డ నటించిన కామెడీ చిత్రాలపై ఓ లుక్ వేద్దాం. టిల్లు స్క్వేర్ రాధిక జ్ఞాపకాల నుంచి బయటపడుతున్న టిల్లు జీవితంలోకి ఆమె అప్‌డేటెడ్‌ వెర్షన్‌ లిల్లీ జోసెఫ్‌ వస్తుంది. బర్త్‌డే స్పెషల్‌గా ఓ కోరిక కోరుతుంది. ఆ తర్వాత టిల్లు లైఫ్‌ ఎలాంటి టర్న్‌ తీసుకుంది? మాఫియా డాన్ వీరి మధ్యకు ఎందుకు వచ్చాడు? టిల్లు లైఫ్‌లోకి రాధికా మళ్లీ వచ్చిందా? లేదా? అన్నది కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ డీజే టిల్లు డీజే టిల్లు మంచి మాటకారి. మ్యూజిక్ డైరెక్టర్ కావాల‌నేది అత‌డి క‌ల‌. సింగ‌ర్ రాధిక (నేహాశెట్టి)ని చూడ‌గానే ప్రేమలో పడుతాడు. ఇంత‌లో రాధిక ఓ హ‌త్య కేసులో ఇరుక్కుంటుంది. ఆమెతో స్నేహం చేసిన పాపానికి అందులో టిల్లు కూడా ఇరుక్కుంటాడు. ఆ హత్య కేసు నుంచి బయటపడేందుకు టిల్లు ఏం చేశాడు? ఇంతకు రాధిక ఎవరు అనేది మిగతా కథ. ఓటీటీ: ఆహా రాజ్‌ తరుణ్  పక్కింటి అబ్బాయిలా కనిపించే రాజ్ తరుణ్ తన సహజమైన నటనతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకుల మోముల్లో నవ్వుల పువ్వులు పూయించాడు. రాజ్‌ తరుణ్ నటించిన బెస్ట్ కామెడీ సినిమాలు ఇప్పుడు చూద్దాం. ఉయ్యాల జంపాలా బావామరదళ్లైన సూరి (రాజ్ తరుణ్) - ఉమాదేవి(అవిక గోర్) ప్రతీ చిన్నదానికి గొడవలు పడుతుంటారు. అయితే ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టమని ఆలస్యంగా తెలుసుకుంటారు. అప్పటికే ఉమాదేవి పెళ్లి ఇంకొకరితో ఫిక్స్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది కథ. సినిమా చూపిస్త మావ  సాదాసీదాగా తిరిగే కత్తి అనే యువకుడు పరిణీతను ప్రేమిస్తాడు. అయితే, పరిణీత తండ్రి వీరి పెళ్లికి ఒప్పుకోడు. ఆమెతో పెళ్లి చేసేందుకు కత్తికి కొన్ని షరతులు విధిస్తాడు ఓటీటీ:  హాట్ స్టార్ విశ్వక్ సేన్ కామెడీ సినిమాలు ఇండస్ట్రిలో మాస్‌కా దాస్‌గా గుర్తింపు పొందిన విశ్వక్ సేన్ తొలినాళ్లలో కామెడీ సినిమాలతో ఆకట్టుకున్నాడు. మంచి కామెడీ టైమింగ్ ఉన్న విశ్వక్.. మంటి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈనగరానికి ఏమైంది? నలుగురు యువకులు చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. అనివార్య కారణాలతో వారు విడిపోతారు. వారిలో ఒకరి పెళ్లి ఫిక్స్‌ కావడంతో అందరూ ఒక్కటవుతారు. అనుకోని పరిస్థితుల్లో వారంతా గోవాకు వెళతారు? అక్కడ వారు ఏం చేశారు? గోవా ట్రిప్‌ వారిలో తీసుకొచ్చిన మార్పు ఏంటి? అన్నది కథ. ఓటీటీ: అమెజాన్ ప్రైమ్ అశోకవనంలో అర్జున కళ్యాణం మాధవి(రుక్సార్ ధిల్లాన్)తో నిశ్చితార్థం కోసం అర్జున్ కుమార్(విశ్వక్ సేన్) వారింటికి వెళ్తాడు. ఇంతలో కరోనా లాక్‌ డౌన్‌ వల్ల అక్కడే ఉండాల్సి వస్తుంది. ఈ క్రమంలో అర్జున్‌కు ఊహించని ఎదురు దెబ్బ తగులుతుంది. అందులోంచి బయటపడే క్రమంలో మాధవి సోదరి వసుధ(రితికా నాయక్) అర్జున్‌తో ప్రేమలో పడుతుంది. ఇంతకు అర్జున్‌కు ఎదురైన ఆ అనుభవం ఏమటి? మాధవి సోదరి వసుధ ప్రేమను అర్జున్ ఒప్పుకున్నాడా? అన్నది మిగతా కథ. ఓటీటీ: ఆహా సునీల్ కామెడీ సినిమాలు సునీల్ ప్రస్తుతం సౌత్ ఇండియాలో మంచి నటుడిగా గుర్తింపు పొందాడు. తన విలక్షణమైన నటనతో తారా పథానికి ఎదిగాడు.  సునిల్ నువ్వేకావాలి చిత్రం ద్వారా హస్య నటుడిగా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. ఆ చిత్రం సూపర్ హిట్‌ కావడంతో ఆయనకు అవకాశాలు వెల్లువెత్తాయి. సుమారు 200కి పైచిలుకు చిత్రాల్లో నటించాడు. అందులో బెస్ట్ కామెడీ చిత్రాలను ఓసారి చూద్దాం. మర్యాద రామన్న ఈ చిత్రం ద్వారా సునిల్ మంచి క్రేజ్ సంపాదించాడు. ఈ సినిమా తర్వాత హీరోగా చాలా సినిమాలు చేశాడు.ఈ సినిమా కథ విషయానికొస్తే.. రాము తనకున్న భూమిని అమ్మెందుకు తన స్వగ్రామానికి వెళ్తాడు. అయితే అనుకోకుండా తన తండ్రి శత్రువుల ఇంటికి పోతాడు. అక్కడ వాళ్లు తనని చంపాలనుకుంటున్నారని తెలిసి వారింట్లోనే ఉంటూ ఓ యువతితో ప్రేమలో పడుతాడు. ఆ ఇంట్లో నుంచి బయటపడేందుకు అతని ఎలాంటి పోరాటం చేశాడు. ఇంతకు తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడా? లేదా? అన్నది మిగతా కథ. ఓటీటీ: ప్రైమ్, హాట్ స్టార్ పూలరంగడు ఈ చిత్రంలో ఇద్దరు భూస్వాముల మధ్య నలుగుతున్న భూమిని సునిల్ కొనుగోలు చేస్తాడు. తాను మోసపోయినట్లు తెలుసుకుంటాడు. ఈక్రమంలో అతను ఓ భూస్వామి కూతురుతో ప్రేమలో పడుతాడు. అయితే ఆ భూమిని సోంతం చేసుకునేందుకు హీరో ఏం చేశాడు? చివరికి తన ప్రేమను ఎలా దక్కించుకున్నాడు అన్నది మిగతా కథ ఓటీటీ: ప్రైమ్ వీడియో కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం అప్పలరాజు అప్పల్రాజు (సునిల్) స్టార్‌ డైరెక్టర్‌ అవ్వాలన్న లక్ష్యంతో అనేక సవాళ్లను ఎదుర్కొని ఓ సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్తాడు. సినిమా స్టార్లు బాబు, కనిష్కను హీరో హీరోయిన్లుగా పెట్టుకుంటాడు. అయితే లవ్‌లో ఉన్న బాబు, కనిష్క ఇద్దరు బ్రేకప్‌ చెప్పుకొని విడిపోతారు. దీంతో సినిమా మధ్యలోనే ఆగిపోతుంది. అప్పుడు అప్పల్రాజు ఏం చేశాడు? సినిమాను ఎలా పూర్తి చేశాడు? అన్నది కథ. ఓటీటీ: ప్రైమ్ వీడియో అందాల రాముడు ఈ చిత్రంలో సునీల్ కడుపుబ్బ నవ్విస్తాడు. కథ విషయానికొస్తే.. రాముడు( తన మరదలైన రాధను వివాహం చేసుకోవడానికి 12 సంవత్సరాల తర్వాత ఇంటికి తిరిగి వస్తాడు, కానీ రఘుతో ఆమె ప్రేమలో ఉందని తెలుసుకుని నిరాశ చెందుతాడు. అయితే, రాముడు తమ్ముడు రాధను తన అన్నతో కలిపేందుకు ప్లాన్ చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగతా కథ. ఓటీటీ: యూట్యూబ్ జై చిరంజీవ! ఈ సినిమాలో సునిల్ కనిపించేది కొద్దిసేపే అయినా... మంచి కామెడీ అందిస్తాడు. ఇక సినిమా కథలో సత్యనారాయణ(చిరంజీవి) తన కుటుంబంతో కలిసి గ్రామంలో నివసిస్తుంటాడు. అతడికి మేనకోడలు లావణ్య అంటే ప్రాణం. గన్‌ డీలర్‌ పసుపతి కారణంగా లావణ్య చనిపోతుంది. అతడిపై పగ తీర్చుకునేందుకు సత్యనారాయణ అమెరికాకు వెళ్తాడు. ఓటీటీ: యూట్యూబ్ సొంతం ఈ చిత్రంలో సునీల్‌తో కామెడీ ట్రాక్ సూపర్బ్‌గా ఉంటుంది. ఇప్పటికీ.. సునిల్ కామెడీ వీడియోలు యూట్యూబ్‌లో అలరిస్తుంటాయి. ఇక సినిమా కథ విషయానికొస్తే.. బాల్య స్నేహితుడైన వంశీని(ఆర్యన్ రాజేష్) నందు ప్రేమిస్తుంటుంది. అయితే ఆమె తన ఫీలింగ్స్‌ను వంశీతో పంచుకోదు. అయితే ఆమె పట్ల తన భావాలను వంశీ తెలుసుకునే సమయానికి నందుకి ఇంకొకరితో నిశ్చితార్థం జరుగుతుంది. ఓటీటీ: యూట్యూబ్ చిరునవ్వుతో ఈ చిత్రంలో సునిల్- వేణు మధ్య వచ్చే కామెడీ సీన్లు కడుపుబ్బా నవ్విస్తాయి. ఈ సినిమా కథలో.. పెళ్లికి ముందు అరుణ, వేణుని విడిచిపెట్టిన తర్వాత, అతను నగరానికి వెళ్లి ఆమెను మరచిపోవడానికి ప్రయత్నిస్తాడు. తరువాత, అక్కడ సంధ్య అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. కానీ అప్పటికే ఆమెకు ప్రతాప్‌తో నిశ్చితార్థం జరిగిందని తెలుస్తుంది. ఓటీటీ: ఆహా నువ్వే కావాలి ఈ సినిమాలోనూ సునిల్ కామెడీ అదిరిపోతుంది. సునిల్ కామెడీ పంచ్‌లు అలరిస్తాయి. ఇక ఈ సినిమా కథలో.. తరుణ్, మధు చిన్నప్పటి నుంచి స్నేహితులు. అయితే వారు పెద్దయ్యాక ఒకరిపై ఒకరికి ప్రేమ ఉన్న బయటకు చెప్పుకోరు. మధుకు మరొకరితో పెళ్లి నిశ్చయమైనప్పుడు పరిస్థితులు మారిపోతాయి. 2000 ఏడాదిలో ఈ చిత్రం సూపర్ హిట్ సాధించింది. తరుణ్ కేరీర్‌కు ఈ చిత్రం కీలక మలుపునిచ్చింది. ఓటీటీ: ఈటీవీ విన్ తెలుగులో ఇతర బెస్ట్ కామెడీ చిత్రాలు లేడీస్ టైలర్ సమాజంలో సామాన్య పాత్రలకు హీరో నెటివెటీని జోడించి తొలిసారి కామెడీని పండించింది దర్శకుడు వంశీ. తనకే సాధ్యమైన ప్రత్యేక హస్య కథాంశంతో ఈ చిత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాడు. టైలర్ గా సుందరం పాత్రలో రాజేంద్ర ప్రసాద్ జీవించాడు. తాను ధనవంతుకు కావడం కోసం వీపు మీద పుట్టు మచ్చ ఉన్న అమ్యాయిని పెళ్లి చేసుకునేందుకు అతను పడే తపన.. నవ్వులు పూయిస్తుంది. ఇదే సినిమాలో స్టోరీ లైన్ అయినా అందుకు అనుగుణంగా వచ్చే క్యారెక్టర్లు కామెడీని పండిస్తాయి. ఈ చిత్రంలో రాళ్లపల్లి, మల్లిఖార్జునరావు, అర్చన, తనికెళ్ల భరణి ప్రధాన పాత్రల్లో నటించారు. ఓటీటీ: యూట్యూబ్ చంటబ్బాయి  జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన చంటబ్బాయి.. తెలుగులో వచ్చిన ఫస్ట్ డిటెక్టివ్ కామెడీ జోనర్ గా చెప్పవచ్చు. ఇది ప్రముఖ రచయిత మల్లాది వెంకట కృష్ణ మూర్తి రచించిన చంటబ్బాయి నవల ఆధారంగా చిత్రీకరించారు. అప్పటి వరకు యాక్షన్ చిత్రాల్లో నటించిన మెగాస్టార్ చిరంజీవి ఒక్కసారిగా కామెడీ పాత్రలో ఒదిగిపోయారు. చిరంజీవిలోని కామెడీ టైమింగ్ ను ప్రేక్షకులకు పరిచయం చేసింది ఈ సినిమా. డిటెక్టివ్ పాత్రలో మెగాస్టార్ కడుపుబ్బ నవ్వించారు. ఈ సినిమాలో సుహాసిని, జగ్గయ్య, ముచ్చెర్ల అరుణ, సుత్తివేలు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు వాణిజ్యపరంగా విజయవంతమైంది. ఓటీటీ: సన్ నెక్ట్స్ అహ! నా పెళ్లంట తెలుగులో మరుపురాని హాస్య చిత్రాల్లో అహ! నా పెళ్లంట మూవీ అగ్రభాగాన నిలుస్తుంది. జంధ్యాల డైరెక్ట్ చేసిన చిత్రాల్లో ఈ సినిమా ఒక కలకితురాయి. ప్రముఖ రచయిత ఆది విష్ణు గారు రాసిన సత్యంగారి ఇల్లు నవల ఆధారంగా జంధ్యాల తెరకెక్కించాడు. ప్రతి పాత్రను హాస్య ప్రధానంగా చిత్రీకరించిన తీరు అద్భుతంగా ఉంటుంది. పిసినారి పాత్రలో కోటా శ్రీనివాస్ రావు, అరగుండు క్యారెక్టర్ లో బ్రహ్మానందం మెప్పించారు. రాజేంద్ర ప్రసాద్, రజిని తమ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. రాజేంద్ర ప్రసాద్ తనదైన కామెడీ టైమింగ్ తో ఆకట్టుకున్నాడు. ప్రేక్షకుల హృదయాలకు దగ్గరైన ఈ చిత్రం కమర్షియల్ గాను సక్సెస్ అయింది. రూ.16లక్షల బడ్జెట్ తో నిర్మితమైన ఈ మూవీ ఆ కాలంలో ఏకంగా రూ.5కోట్లు కొల్లగొట్టింది. అహ! నా పెళ్లంట మూవీ... హస్యనటుడిగా  బ్రహ్మనందానికి మంచి బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత బ్రహ్మానందం  దాదాపు ప్రతి మూవీలో హాస్య పాత్రల్లో కనిపించాడు. ఓటీటీ-  యూట్యూబ్ జంబలకిడి పంబ తెలుగులో ఫస్ట్ వచ్చిన ఫాంటసీ కామెడీ చిత్రం జంబలకిడి పంబ. మగవాళ్లు.. ఆడవాళ్లుగా, ఆడవాళ్లు మగవాళ్లుగా, చిన్న పిల్లలు పెద్దవాళ్లుగా మారితే ఎలా ఉంటుందనే ఊహను డైరెక్టర్ ఈవీవీ సత్యనారాయణ చక్కగా చిత్రీకరించాడు. సినిమా చూస్తున్నంత సేపూ చిత్రంలోని ప్రతి పాత్ర తనదైన కామెడీతో ప్రేక్షకులను పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తుంది. ఈ కథా వస్తువే సగటు ప్రేక్షకుడ్ని మళ్లీ మళ్లీ ఈ సినిమాను చూసేందుకు థియేటర్ల బాట పట్టించింది. ఈ మూవీలో నరేష్, ఆమని, కోటా శ్రీనివాస్ రావు, బ్రహ్మానందం, అలీ, బాబు మోహన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం అప్పటి వరకు వచ్చిన కామెడీ చిత్రాల నిర్వచనాన్ని సమూలంగా మార్చేసింది. కామెడీ కథాంశంతో సైతం బాక్సాఫీస్ కొల్లగొట్టవచ్చని నిరూపించింది. ఆ తర్వాత వచ్చిన ఎన్నో చిత్రాల సక్సెస్ కు రాచ బాట వేసింది. ఓటీటీ- యూట్యూబ్ అప్పుల అప్పారావు తెలుగులో అత్యుత్తమ హాస్య చిత్రాలలో ఒకటిగా అప్పుల అప్పారావు మూవీ విమర్శకుల చేత ప్రశసించబడింది.  ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను అలరించింది. ఇందులో రాజేంద్ర ప్రసాద్, శోభన హీరో, హీరోయిన్ లుగా నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్‌గా నమోదైంది. ఊర్లో ప్రతిఒక్కరి దగ్గర అప్పులు చేసే అప్పరావు పాత్రలో రాజేంద్ర ప్రసాద్ కామెడీని పండించాడు. బ్రహ్మానందం, బాబుమోహన్, తనికెళ్ల భరణి, ఐరెన్ లెగ్ శాస్త్రి ప్రధాన పాత్రల్లో నటించారు. ఓటీటీ-  జియో సినిమా రాజేంద్రుడు గజేంద్రుడు  రాజేంద్ర ప్రసాద్, సౌందర్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం పూర్తిగా హాస్యభరితం. ఎస్. వి. కృష్ణారెడ్డికి దర్శకుడిగా ఇది మొదటి సినిమా. కథంతా ఒక ఏనుగు చుట్టూ తిరుగుతుంది. రాజేంద్రగా రాజేంద్ర ప్రసాద్, గజేంద్రగా ఏనుగు, అలకగా సౌందర్య, కోటిలింగంగా కోట శ్రీనివాసరావు, గుండు హన్మంతరావు పాత్రలకు తగ్గట్టు హాస్యాన్ని పండించారు. ఈ మూవీ డైరెక్టర్ గా ఎస్.వి. కృష్ణా రెడ్డికి మంచి లైఫ్ ఇచ్చింది.  ఓటీటీ: ఆహా మాయలోడు పక్కా కామెడీ ఎంటర్ టైనర్ గా S. V. కృష్ణారెడ్డి డైరెక్షన్ లో మాయలోడు వచ్చింది. ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్, సౌందర్య నటించారు. వీరబాబు పాత్రలో మాయలోడుగా రాజేంద్ర ప్రసాద్ అద్భుతంగా హాస్యాన్ని పండించాడు. ఈ మూవీ బాక్సాఫీసు వద్ద సూపర్‌హిట్‌గా నిలిచింది.  మాయలోడు హైదరాబాద్- శ్రీనివాస థియేటర్‌లో  ఏకంగా 260 రోజులు నడిచింది. ఈ చిత్రం రెండు నంది అవార్డులు కూడా గెలుచుకుంది. ఓటీటీ: ఈటీవీ విన్ యమలీల S. V. కృష్ణా రెడ్డి  దర్శకత్వం వహించిన యమలీల చిత్రం తెలుగు సినీచరిత్రలో పెను సంచలనం సృష్టించింది. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. కేవలం రూ.75లక్షలతో నిర్మించిన ఈ మూవీ రూ.12కోట్లు వసూలు చేసింది. అప్పటివరకు చిన్న చిన్న కామెడీ పాత్రలు చేస్తున్న అలీ తొలిసారి హీరోగా పరిచయం అయ్యాడు. తన తల్లి ప్రాణాలు కాపాడుకునేందుకు హీరో.. యముడిని ఏలా ఏమార్చాడు అనే కథాంశంతో మూవీని దర్శకుడు చక్కగా నడిపాడు. మూవీలో మదర్ సెంటిమెంట్ కొనసాగిస్తూనే.. కామెడీని అద్భుతంగా పండించాడు. ఈ చిత్రాన్ని వెంకటేష్ హీరోగా హిందీలో తక్‌దీర్‌వాలాగా,  కార్తీక్ హీరోగా తమిళంలో లక్కీ మ్యాన్‌గా రీమేక్ చేశారు. ఓటీటీ: యూట్యూబ్ క్షేమంగా వెళ్లి లాభంగా రండి  రాజా వన్నెంరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మహిళా ప్రేక్షకుల మనసులు దోచింది. శ్రీకాంత్, రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, రోజా, కోవై సరళ ముఖ్యపాత్రల్లో నటించారు. జంబులింగం పాత్రలో బ్రహ్మనందం ఆయన భార్యగా సుబ్బలక్ష్మి పాత్రలో కోవైసరళ మధ్య వచ్చే కామెడీ సీన్లు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించాయి. అలాగే రాంబాబు పాత్రలో రాజేంద్ర ప్రసాద్, రవి పాత్రలో శ్రీకాంత్ తమదైన కామెడీ టైమింగ్ తో అలరించారు. అన్నివర్గాల ప్రేక్షకులను ఈ సినిమా అలరించింది. ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. ఈ మూవీ తర్వాత చాలా సినిమాలు కామెడీ బాట పట్టాయి.  ఓటీటీ: ప్రైమ్ హనుమాన్ జంక్షన్  ఎం. రాజా దర్శకత్వంలో వచ్చిన హనుమాన్ జంక్షన్ కామెడీ కల్ట్ గా నిలిచింది. కమర్షియల్ గాను బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. అర్జున్, జగపతి బాబు, వేణు, స్నేహ, లయ ప్రధాన పాత్రల్లో నటించారు. కోవై సరళ, ఎల్ బీ శ్రీరాం, జయప్రకాశ్ రెడ్డి, ఎంఎస్ నారాయణ ఇతర పాత్రాల్లో నటించారు. తోటపల్లి మధు అందించిన కామెడీ డైలాగ్స్ పాత్రాధారుల మధ్య అద్భుతంగా పేలాయి. ఈ మూవీలోని నా 'భూతో నా భవిష్యత్' అనే డైలాగ్ ఇప్పటికీ చాలా ఫేమస్. అంతలా సినిమా ప్రేక్షకులపై ప్రభావం చూపింది. ఓటీటీ: ప్రైమ్ నువ్వు నాకు నచ్చావ్ కె. విజయ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. తెలుగులో వచ్చిన రోమాంటిక్ కామెడీ మూవీల్లో ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ అందించిన డైలాగ్స్.. ఈ చిత్రాన్ని  ప్రేక్షకుల హృదయాల్లో ఆల్ టైమ్ క్లాసిక్ గా నిలిపింది. అప్పటివరకు తెలుగు తెరకు పెద్దగా పరిచయం లేని పంచ్ కామెడీ టైమింగ్ ను ఈ సినిమా పరిచయం చేసింది. ఈ చిత్రంలో వెంకటేష్ , ఆర్తి అగర్వాల్  ప్రధాన పాత్రల్లో నటించగా.. ప్రకాశ్ రాజ్, చంద్రమోహన్, సుహాసిని ఇతర పాత్రాల్లో నటించారు. ఈ మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు కమర్షియల్ పరంగా భారీ విజయం సాధించింది. ఐదు నంది అవార్డులను గెలుచుకుంది. కుటుంబ సమేతంగా వీక్షించే ఉత్తమ చిత్రంగా అక్కినేని అవార్డు కూడా గెలుచుకుంది. ఓటీటీ: హాట్ స్టార్ వెంకీ తెలుగులో వచ్చిన ఆల్ టైం కామెడీ కల్ట్ మూవీల్లో వెంకీ ఒకటి. శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందింది. రవితేజ, స్నేహ ప్రధాన పాత్రధారులుగా.. బ్రహ్మానందం, ఏవీఎస్, చిత్రం శ్రీను, శ్రీనివాస్ రెడ్డి ఇతర పాత్రల్లో నటించారు. రోటిన్ కామెడీకి విభిన్నంగా స్పెషల్ ట్రాక్ కామెడీని శ్రీను వైట్ల పరిచయం చేశాడు. ఈ మూవీతో శ్రీను వైట్లకు మంచి బ్రేక్ వచ్చింది. ఓటీటీ: యూట్యూబ్ దూకుడు పక్కా యాక్షన్ కామెడీ ఫిల్మ్ గా  దూసుకొచ్చిన దూకుడు మూవీ టాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను షేక్ చేసింది. శ్రీనువైట్ల డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ మూవీ రూ.101 కోట్లు రాబట్టింది. సూపర్ స్టార్ మహేష్ బాబు తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను అలరించాడు. దీనికి తోడు బ్రహ్మానందం, ఎంఎస్ నారాయణ కామెడీ ట్రాక్ ఈ సినిమాకే హైలెట్.  మత్తు వదలరా తెలుగులో వచ్చిన అతి కొద్ది కామెడీ క్రైమ్ థ్రిల్లర్ సినిమాల్లో మత్తు వదలరా ఒకటి. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై రితేష్ రానా డైరెక్ట్ చేసిన తొలి సినిమా ఇది. శ్రీ‌ సింహా, సత్య, నరేష్, అతుల్య చంద్ర, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుని బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ఓటీటీ: ప్రైమ్ వీడియో బ్రహ్మానందం టాప్ 10 బెస్ట్ కామెడీ సినిమాలు బ్రహ్మానందం నటించిన ఈ చిత్రాలకు తెలుగు హాస్య చిత్రాల్లో ప్రత్యేక స్థానం ఉంది. ఈ చిత్రాలను చూడని వారు బ్రహ్మీ అసలు సిసలు కామెడీని మిస్ అవుతున్నట్లే లెక్క. మరి ఆ సినిమాలు ఏంటో ఓసారి చూసేయండి. అదుర్స్‌ అదుర్స్‌లో బ్రహ్మానందం గారు చేసిన భట్టు క్యారెక్టర్ ఎప్పటికీ ప్రత్యేకంగా నిలుస్తుంది. నువ్వంతా హార్ష్‌గా మాట్లాడకు చందు అని బ్రహ్మి చెప్పే డైలాగ్ చాలా మంది మీమర్స్‌కు మంచి స్టఫ్ అందించిందని చెప్పవచ్చు. ఈ చిత్రంలో జూ. ఎన్టీఆర్- బ్రహ్మానందం- నయనతార మధ్య వచ్చే కామెడీ ట్రాక్ బాగా ఆకట్టుకుంటుంది. బట్టు-చారి-చందు క్యారెక్టర్లు తెలుగు చిత్ర సీమలో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. ఓటీటీ: ప్రైమ్, ఆహా మన్మధుడు ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెలరేగిపోతాను.. అని బ్రహ్మి చెప్పిన డైలాగ్ ఎంతో ఫేమసో ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ చిత్రంలో బ్రహ్మానందం స్క్రీన్ టైమ్ తక్కువే అయినప్పటికీ అయిన సినిమాపై గట్టి ఇంపాక్ట్ చూపించారు. ఓటీటీ: హాట్ స్టార్, యూట్యూబ్ ఢీ మంచు విష్ణుతో కలిసి నటించిన బ్రహ్మనందం ఈ సినిమాలో గుమస్తాగా పనిచేశారు. ఏమో సార్.. "దయచేసి నన్ను ఇన్వాల్ చేయకండి సార్" అంటూ చెప్పే డైలాగ్స్ ప్రేక్షకులను అలరిస్తాయి. ఈ చిత్రంలో ఆయన అమాయకత్వం, వ్యక్తీకరణలు హాస్యాన్ని పండిస్తాయి. ఓటీటీ: యూట్యూబ్ రెడీ శ్రీను వైట్ల డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం కామెడీ చిత్రాల్లో బెస్ట్ సినిమాగా చెప్పవచ్చు. ఈ సినిమాలో మెక్‌డోవెల్ మూర్తి క్యారెక్టర్‌లో బ్రహ్మానందం కామెడీ ట్రాక్ కడుపుబ్బ నవ్విస్తుంది. అలాగే చందు పాత్రలో రామ్‌ పొత్తినేని, చిట్టినాయుడిగా జయప్రకాశ్ రెడ్డి కామెడీ అలరిస్తుంది. ఈ సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. రేసు గుర్రం ఈ చిత్రాన్ని సూపర్ హిట్ చేసింది... కిల్‌ బిల్ పాండే పాత్ర అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. చివరి అర్ధగంటలో బ్రహ్మానందం ట్రాక్ సినిమాకు హైలెట్‌గా ఉంటుంది. ప్రస్టేషన్.. ప్రస్టేషన్ అంటూ వచ్చే బీజీఎం నవ్వులు పూయిస్తుంది. కిల్ బిల్ పాండే రోల్‌లో బ్రహ్మానందం జీవించేశారు. ఓటీటీ: యూట్యూబ్ మనీ మనీ "వారేవ్వా ఏమి ఫేసు.. అచ్చం హీరోల ఉంది బాసు" ఈ పాట ఎంత ఫెమస్సో అందరికీ తెలిసిందే. అతను చేసిన ఖాన్ క్యారెక్టర్ ఎంతో మంది ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయింది. ఖాన్‌తో గేమ్స్ ఆడొద్దు..శాల్తీలు లేచిపోతాయ్ వంటి డైలాగ్స్ ఎన్నో మీమ్స్‌కు స్ఫూర్తిగా నిలిచాయి. ఓటీటీ: యూట్యూబ్, ప్రైమ్ అనగనగా ఒకరోజు ఇక చిత్రంలో బ్రహ్మానందం ఓ దొంగలా యాక్ట్ చేశాడు. 'నెల్లూరు పెద్దా రెడ్డి' తెలుసా నీకు అని బ్రహ్మి చెప్పిన డైలాగ్ ఎంతో ప్రాచూర్యం పొందింది. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు ఉందండి అని చెప్పే డైలాగ్ ఎంత అందరికి తెలిసిందే. ఓటీటీ: ప్రైమ్, జియో సినిమా కింగ్ ఈ చిత్రంలో బ్రహ్మానందం మ్యూజిక్ డైరెక్టర్‌గా తెగ నవ్వించాడు. 'అరె అరె.. రికార్డ్ చేయ్ రికార్డ్ చేయ్' ఆయన చేసిన పాత్రను ఇప్పటికీ చాలా మంది మీమర్స్.. ట్యూన్స్‌ను కాపీ చేస్తున్న మ్యూజిక్ డైరెక్టర్స్‌ను ట్రోల్ చేసేందుకు వాడుతున్నారు. ఓటీటీ: ప్రైమ్, యూట్యూబ్ వెన్నెల కిషోర్ బెస్ట్ కామెడీ సినిమాలు వెన్నెల ఈ చిత్రం పేరునే తన ఇంటి పేరుగా మార్చుకునేంత గొప్ప పేరు కిషోర్‌కు వచ్చింది. ఈ చిత్రంలో వెన్నెల కిషోర్ ఖాదర్ భాషా పాత్రలో నటించాడు. ఈ సినిమాలో కిషోర్ చెప్పే డైలాగ్‌లు చాలా హెలేరియస్‌గా ఉంటాయి. డోంట్ బాదార్ ఐ యామ్ ఖాదర్ అంటూ తెగ నవ్విస్తాడు.  ఓటీటీ: యూట్యూబ్ భలే భలే మగాడివోయ్ ఈ చిత్రంలో నానితో వెన్నెల కిషోర్ పండించే కామెడీ హెలెరియస్‌గా ఉంటుంది. నాని మతిమరుపునకు బలయ్యే క్యారెక్టర్‌లో బాగా నవ్వు తెప్పించాడు. ఓటీటీ: హాట్ స్టార్ అలీ బెస్ట్ కామెడీ చిత్రాలు అలీ తనదైన మేనరిజంతో నవ్వులు పూయించిన చిత్రాలు అనేకం ఉన్నప్పటికీ.. పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లో వచ్చిన సినిమాలు ఆయన క్యారెక్టర్ విషయంలో మోస్ట్ హెలెరియస్‌గా ఉంటాయి. వీటిని మాత్రం అస్సలు మిస్‌ కావొద్దు. దేశముదురు ఈ చిత్రంలో అలీ రోల్ తెగ నవ్విస్తుంది. బ్యాంక్ ఎంప్లాయ్ నుంచి అలీ ఎలా స్వామిజీగా మారాడు అనే ఎపిసోడ్.. చాలా హెలేరియస్‌గా ఉంటుంది ఓటీటీ: యూట్యూబ్ చిరుత ఈ సినిమాలో అలీ చేసిన లక్ష్మీ క్యారెక్టర్ చాలా ఫేమస్ అయింది. మసాజ్.. థాయ్ మసాజ్ అంటూ అలీ చెప్పే డైలాగ్స్ మంచి ఫన్ జనరేట్ అవుతుంది ఓటీటీ: యూట్యూబ్ పోకిరి ఈ సినిమాలో అలీ బిచ్చగాడు పాత్రలో చేసిని కామెడీ అంతా ఇంతకాదు. ముఖ్యంగా బ్రహ్మానందాన్ని ఓ ఆట ఆడుకునే ట్రాక్ థియేటర్ మొత్తం నవ్వులు పూయిస్తుంది ఓటీటీ: యూట్యూబ్/ హాట్‌ స్టార్ సూపర్ ఈ చిత్రంలో అలీ దొంగ పాత్రలో అద్భుతంగా కామెడీ పంచాడు. ముఖ్యంగా స్పెషల్ ఆఫీసర్‌గా బ్రహ్మానందం... అలీని ఇంటరాగెట్ చేసే సీన్ కడుపుబ్బ నవ్వు తెప్పిస్తుంది ఓటీటీ: హాట్ స్టార్/యూట్యూబ్
    మే 23 , 2024
    ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్స్‌ ఉన్న టాప్‌-10 తెలుగు హీరోలు వీళ్లే..!
    ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్స్‌ ఉన్న టాప్‌-10 తెలుగు హీరోలు వీళ్లే..!
    మనిషి జీవితంలో సోషల్ మీడియా కూడా ఒక భాగంగా మారిపోయింది. రోజులో కనీసం ఒకసారైన ఫేస్‌బుక్‌, వాట్సప్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌ తెరవని స్మార్ట్‌ ఫోన్‌ యూజర్‌ లేరని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ప్రస్తుత రోజుల్లో సమాచారం చేరవేయడానికి సోషల్‌ మీడియా ప్రధాన వేదికగా మారింది. సోషల్‌ మీడియాకు ఆదరణ పెరగడంతో సినీ హీరోలు సైతం తమను తాము ప్రమోట్‌ చేసుకునేందుకు దీనిని వేదికగా చేసుకున్నారు. టాలీవుడ్‌లో చాలా మంది హీరోలు సోషల్‌ మీడియాలో మరీ ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో సంచలనాలు సృష్టిస్తున్నారు. కోట్ల మంది ఫాలోయర్స్‌తో రికార్డులు సృష్టిస్తున్నారు. ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్స్‌ను కలిగిన టాప్‌-10 తెలుగు హీరోలు ఎవరో ఇప్పుడు చూద్దాం. 1. అల్లుఅర్జున్‌: ఐకాన్‌ స్టార్‌ అల్లుఅర్జున్‌ క్రేజ్‌ ‘పుష్ప’ చిత్రంతో అమాంతం పెరిగిపోయింది. పాన్‌ ఇండియా స్థాయిలో పుష్ప విజయం సాధించడంతో బాలీవుడ్‌ ప్రేక్షకులు సైతం బన్నీకి అభిమానులుగా మారిపోయారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవుతూ బన్నీ ఇచ్చే అప్‌డేట్స్‌ తెలుసుకుంటున్నారు. ప్రస్తుతం తెలుగు హీరోల్లో అత్యధికమంది ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉన్న నటుడిగా బన్నీ ఉన్నాడు. బన్నీ ఇన్‌స్టా ఖాతాను 20.3 మిలియన్స్‌ మంది ఫాలో అవుతున్నారు. అయితే బన్నీ మాత్రం తన భార్య స్నేహరెడ్డి ఖాతాను మాత్రమే ఫాలో అవుతుండటం గమనార్హం. 2. విజయ్‌ దేవరకొండ:  2017లో విడుదలైన అర్జున్‌ రెడ్డి మూవీతో విజయ్‌ దేవరకొండ ఓవర్‌నైట్ స్టార్‌గా ఎదిగాడు. తన విభిన్నమైన బాడీ లాంగ్వేజ్‌తో యూత్‌ను ఆకర్షించిన విజయ్‌.. తనకంటూ సపరేట్‌ ఫ్యాన్‌ బేస్‌ను క్రియేట్ చేసుకున్నాడు. ఫలితంగా ఇన్‌స్టాలో రెండో అత్యధిక ఫాలోవర్స్‌ ఉన్న తెలుగు హీరోగా విజయ్ నిలిచాడు. ప్రస్తుతం విజయ్‌ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాను 17.9 మిలియన్స్‌ మంది ఫాలో అవుతున్నారు. కానీ విజయ్‌ ఏ ఒక్కరినీ కూడా ఫాలో అవ్వడం లేదు.  3. రామ్‌చరణ్‌ RRR చిత్రంతో రామ్‌చరణ్‌ రేంజ్‌ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఈ సినిమాలో చెర్రీ నటన చూసి చాలా మంది ఆయనకు అభిమానులుగా మారిపోయారు. ప్రస్తుతం రామ్‌చరణ్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను 13.6 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. దీంతో టాప్‌ ఇన్‌స్టాగ్రామ్‌ ఫాలోవర్స్‌ ఉన్న తెలుగు హీరోల జాబితాలో చరణ్‌ 3వ స్థానంలో నిలిచాడు. 4. మహేశ్‌ బాబు టాలీవుడ్‌లో మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉన్న హీరోల్లో మహేశ్‌ ఒకరు. మహేశ్‌ కొత్త సినిమా రిలీజ్‌ అంటే ఫ్యాన్స్‌కు పండగే అని చెప్పాలి. సామాజిక మాధ్యమాలకు మహేశ్‌ కాస్త దూరం పాటిస్తున్నప్పటికీ ఆయన ఫ్యాన్స్‌ మాత్రం మహేశ్‌ను విపరీతంగా ఫాలోఅవుతున్నారు. ప్రస్తుతం మహేశ్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో 10.1 మిలియన్స్‌ మంది ఫాలోవర్స్‌ ఉన్నారు.  5. ప్రభాస్‌: బాహుబలి ముందు వరకు టాలీవుడ్‌కే పరిమితమైన ప్రభాస్‌ క్రేజ్‌ ఆ సినిమా తర్వాత విశ్వవ్యాప్తమైంది. ప్రభాస్‌ ఆహార్యం, నటన చూసి కోట్లాది మంది సినీ ప్రేక్షకులు ప్రభాస్‌కు అభిమానులుగా మారిపోయారు. అంతేగాక ప్రభాస్‌ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాను తెగ ఫాలో అవుతున్నారు.  ప్రస్తుతం 9.3 మిలియన్‌ ఫాలోవర్స్‌ను సంపాదించిన ప్రభాస్ టాప్‌-3 తెలుగు హీరోగా నిలిచాడు.  6. జూ.ఎన్టీఆర్‌ RRR చిత్రం రామ్‌చరణ్‌తో పాటు తారక్‌కు సైతం మంచి గుర్తింపు తీసుకొచ్చింది. NTR తన మిస్మరైజింగ్‌ నటనతో మరింత మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ఇన్‌స్టాలో 5.9 మిలియన్ల మంది ఎన్టీఆర్‌ను ఫాలో అవుతున్నారు.  7. నాని నేచురల్‌ స్టార్‌ నాని తన సహజ సిద్దమైన నటనతో టాలీవుడ్‌లో మంచి హీరోగా ఎదిగాడు. ఆయన లేటెస్ట్‌ మూవీ దసరా మంచి హిట్‌ టాక్‌ తెచ్చుకోవడంతో నాని ఇమేజ్‌ మరింత పెరగనుంది. ప్రస్తుతం నాని ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాను 5.9 మిలియన్ల మంది అనుసరిస్తున్నారు.  8. రామ్‌ పోతినేని యంగ్‌ హీరో రామ్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పెద్ద సంఖ్యలోనే అభిమానులు ఫాలో అవుతున్నారు. మెుత్తం 3.6 మిలియన్ల మంది రామ్‌ను అనుసరిస్తున్నారు.  9. వరుణ్‌ తేజ్ మెగా హీరోల్లో అల్లుఅర్జున్ తర్వాత వరణ్‌తేజ్‌కే అత్యధిక ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్‌ ఉన్నారు. ప్రస్తుతం వరుణ్‌ ఖాతాను కూడా 3 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు.  10. అఖిల్‌ అక్కినేని నాగార్జున తనయుడు అఖిల్ అక్కినేని నుంచి మూడు సినిమాలు విడుదలైనప్పటికీ అందులో ఒక్కటి కూడా ఆశించిన మేర విజయం సాధించలేకపోయింది. అయితే విజయాలతో సంబంధం లేకుండా అఖిల్ మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ సంపాదించాడు. అఖిల్‌ను సైతం 3 మిలియన్ల మంది ఇన్‌స్టాలో ఫాలో అవుతున్నారు. 
    మార్చి 30 , 2023
    S. S. Rajamouli Style:  రాజమౌళి అన్ని సినిమాల్లో ఇంతవరకు ఈ కామన్ పాయింట్ ఎప్పుడైనా గమనించారా?
    S. S. Rajamouli Style:  రాజమౌళి అన్ని సినిమాల్లో ఇంతవరకు ఈ కామన్ పాయింట్ ఎప్పుడైనా గమనించారా?
    దిగ్గజ దర్శకుడు రాజమౌళి సినిమాలన్నీ చాలా వరకు ఒక కామన్ పాయింట్‌ను బేస్‌ చేసుకుని సాగుతుంటాయి. అది అతని మొదటి సినిమా  స్టూడెంట్ నెం.1 నుంచి ఈ మధ్య వచ్చిన RRR వరకు ఒక్కటి మాత్రం బాగా గమనించవచ్చు.  రాజమౌళి సినిమాల్లో ఏ కథ అయినా ఏ ఫార్మట్‌ అయినా గమనించండి. స్టూడెంట్ నం.1, సింహాద్రి, యమదొంగ, విక్రమార్కుడు,  మగధీర, ఈగ, బాహుబలి 1, బాహుబలి 2 అయిన ఆ సినిమాలో ఒక్క బ్యాక్ గ్రౌండ్ స్టోరీ ఉంటుంది. దాన్ని ఆధారంగా చేసుకొని ప్రేక్షకులను ఎమోషన్‌తో బైండ్‌ చేసి సినిమాకి మంచి ఊపు తీసుకొస్తాడు.  స్టూడెంట్ నం.1 సినిమాలో కొడుకుగా తన తండ్రి ఆదరణ కోసం ఆరాటే పడే కుర్రాడి పాయింటు.  అందు కోసం  జైలు నుంచి కాలేజీకి వెళ్ళడమనే ట్విస్టు. బ్రాగ్రౌండ్‌లో ఓ అమ్మాయిని కాపాడటం కోసం ఓ వ్యక్తిని చంపడం,  దీంతో అక్కడ ప్రేక్షకులను రాజమౌళి ఎమోషనల్‌గా కనెక్ట్ చేయగలిగాడు.  సింహాద్రిలో ఒక పనిపై హీరో కేరళ వెళ్ళినపుడు అక్కడ అన్యాయన్ని ఎదురించి అక్కడ ప్రజలకు అండగా నిలబడటం అనే అంశం ఆధారంగా సినిమా తీశాడు. భూమిక ఎన్టీఆర్‌ను పొడవటం ట్విస్ట్. సైలో రగ్బీ ఆట మేయిన్ పాయింట్ అయితే... తన కాలేజీని ఆక్రమించకున్న విలన్ భిక్షు యాదవ్‌పై పోరాడే సన్నివేశాలు ఎమోషనల్ కనెక్టివిటీని తీసుకొచ్చాడు. ఇందులో విలనే రగ్బీకి సవాలు చెయ్యటం ట్విస్టు. ఛత్రపతిలో హీరో వాళ్ళ అమ్మని బేస్ చేసుకొని ఫ్యామిలీ సెంటిమెంట్‌ను పండిస్తాడు హీరో.  తల్లీ కొడుకుల మధ్య దూరం మెయిన్ పాయింటు అయితే.. తన తమ్ముడు తనను తల్లికి దూరం చేయాలనుకోవడం ట్విస్ట్. ఈగ సినిమాలో హీరోయిన్ కోసం విలన్ హీరోని చంపేస్తే హీరో ఈగ లాగా మారి ప్రతీకారం తీర్చుకోవడం మెయిన్ పాయింట్. చివర్లో ఈగ ఆత్మార్పణ చేసుకుని విలన్‌ను చంపే విధానాన్ని ఎమోషనల్ బైండింగ్ చేశాడు రాజమౌళి.  RRRలో రామ్ వాళ్ళ నాన్న కోసం ఆయుధాలు ఇస్తా అని మాట ఇచ్చి అందు కోసం పోలీస్ ఆఫీసర్ అవడం మెయిన్ పాయింట్. తన లక్ష్య సాధనలో అడ్డుగా ఉన్న భీంను హింసించడం ఎమోషనల్ కనెక్టివిటీ. చివరకు భీంతో కలిసి బ్రిటీష్ వారిపై పోరాడి ఆయుధాలు సంపాందించి తన నాన్న కల నెరవేరుస్తాడు రామ్. అన్ని సినిమాల్లో రాజమౌళి హీరో ఇంట్రడక్షన్ హీరో ఎవరో దేని కోసం వచ్చాడు కొద్దిగా హింట్ ఇస్తాడు. 1st హాఫ్‌లో హీరో విలన్ సైడ్ వాళ్ళతో చిన్న గొడవ ఉంటుంది. ఇంటర్వెల్ సెకండ్ ఆఫ్ స్టార్ట్ కాగానే బ్యాక్ గ్రౌండ్ స్టోరీ... ఆ స్టోరీ ఎమోషనల్‌గా ఆడియెన్స్‌ని కనెక్ట్ చేస్తాడు. చివరకు హీరో గెలుస్తాడు. హీరో బ్యాక్ గ్రౌండ్ స్టోరీ ఏం కావాలో ఆది సాధిస్తాడు.
    జూలై 06 , 2023
    Varunlav: కాక్‌టైల్‌ పార్టీలో వరుణ్‌తేజ్‌ను ఆట పట్టించిన అల్లు అర్జున్.. ఫోటోలు వైరల్
    Varunlav: కాక్‌టైల్‌ పార్టీలో వరుణ్‌తేజ్‌ను ఆట పట్టించిన అల్లు అర్జున్.. ఫోటోలు వైరల్
    మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్- హీరోయిన్ లావణ్య త్రిపాఠి పెళ్లి కార్యక్రమం.. ఇటలీలో జరుగుతున్న సంగతి సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇరు కుటుంబ సభ్యులు ఇటలీకి చేరుకున్నాయి. తాజాగా కాబోయే వధువరులు వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి జంట కుటుంబ సభ్యులకు కాట్‌ టైల్‌ పార్టీ ఇచ్చింది. తాజాగా ఈ పార్టీకి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. మెగాబాబు నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్ త్వరలో లావణ్య త్రిపాఠితో పెళ్లి పీటలు ఎక్కనున్న సంగతి తెలిసిందే.  వీరిద్దరు కొంత కాలంగా ప్రేమించుకుని పెద్దల అంగీకారంతో పెళ్లికి సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ కొత్త జంట ఇక్కడ కాదని డెస్టినేషన్ వెడ్డింగ్ జరుపుకుంటోంది. వీరిద్దరు తొలిసారిగా అంతరిక్షం సినిమాలో జంటగా నటించారు. ఆ సినిమా షూటింగ్ ఇటలీలో జరిగింది. అక్కడే వరుణ్, లావణ్యలు ప్రేమలో పడ్డారు.  తమ ప్రేమ చిగురించిన ఇటలీలోనే  పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. ఇటలీలోని టస్కానీలో ఈ కొత్త జంట వివాహం చేసుకోనుంది.  ఈ పెళ్లి కూడా పెద్దగా హడావుడి లేకుండా ఇరుకుటుంబాలకు చెందిన అతికొద్దిమంది కుటుంబ సభ్యుల నడుమ జరగనుంది. నవంబర్ 1న ఈ లవ్ బర్డ్స్‌ పెళ్లి బంధం ద్వారా ఒక్కటి కానున్నారు. అయితే సోమవారం రాత్రి వరుణ్‌తేజ్- లావణ్య జంట కుటుంబ సభ్యులకు కాక్‌టైల్ పార్టీ ఇచ్చింది. ఈ పార్టీ బోర్గోసాన్ ఫెలిస్ రిసార్ట్‌లో కాక్టైల్ పార్టీ ఘనంగా జరిగింది. ఈ పార్టీకి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దంపతులు హాజరయ్యారు. అలాగే రామ్ చరణ్ తన భార్య ఉపాసనతో కలిసి ఉత్సాహంగా గడిపాడు. కుటుంబ సమేతంగా దిగిన ఈ పిక్స్ వైరల్‌గా మారాయి. ఈక్రమంలో అల్లు అర్జున్ వరుణ్‌ను సరదాగా ఆట పట్టించాడు. నా చెల్లిని జాగ్రత్తగా చూసుకో అంటూ ఫన్నీగా బెదిరించాడు.   మెగా హీరో సాయి ధరమ్ తేజ్, పంజా వైష్ణవ్ తేజ్  ఈ పార్టీలో సందడి చేశారు. చాలా రోజుల తర్వాత అటు మెగా ఫ్యామిలీని ఇటు అల్లు ఫ్యామిలీని ఒకే ఫ్రేమ్‌లో చూడటంపై అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వరుణ్ తేజ్ తల్లిదండ్రులు నాగబాబు, పద్మజ దంపతులు పెళ్లికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇటలీలోనే లావణ్య త్రిపాఠి పేరెంట్స్ దియోరాజ్, కిరణ్ త్రిపాఠిలతో కలిసి దగ్గరుండి పెళ్లి వేడుకకు కావాల్సిన పనులు చేస్తున్నారు. నవంబర్ 1న మధ్యాహ్నం 2 గంటల 48 నిమిషాలకు వరుణ్- లావణ్య పెళ్లి బంధం ద్వారా ఏకం కానున్నారు. అదే రోజు రాత్రి 8గంటలకు అక్కడే రిసెప్షన్ కూడా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో 120 మంది వరకు ప్రత్యేక అతిథులు పాల్గొననున్నారు. ఇటలీ నుంచి హైదరాబాద్‌కు తిరిగి వచ్చాక నవంబర్ 5న ఇక్కడ రిసెప్షన్‌ పెట్టనున్నారు. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ పెద్దలతో పాటు రాజకీయ ప్రముఖులు పాల్గొననున్నారు. 
    అక్టోబర్ 31 , 2023
    Bharatanatyam Review: డైరెక్టర్‌ అయ్యేందుకు దొంగగా మారిన హీరో.. ‘భరతనాట్యం’ సినిమా ఎలా ఉందంటే?
    Bharatanatyam Review: డైరెక్టర్‌ అయ్యేందుకు దొంగగా మారిన హీరో.. ‘భరతనాట్యం’ సినిమా ఎలా ఉందంటే?
    నటీనటులు : సూర్య తేజ, మీనాక్షి గోస్వామి, వైవా హర్ష, హర్షవర్ధన్‌, అజయ్‌ ఘోష్‌, గంగవ్వ, కృష్ణుడు, టెంపర్‌ వంశీ, నాగ మహేష్‌, సత్తన్న తదితరులు దర్శకత్వం : కేవీఆర్‌ మహేంద్ర సంగీతం :  వివేక్‌ సాగర్‌ సినిమాటోగ్రఫీ: వెంకట్ ఆర్‌. శాఖమూరి ఎడిటింగ్‌ : రవితేజ గిరజాల నిర్మాత : పాయల్‌ సరాఫ్‌ నిర్మాణ సంస్థ : పీఆర్‌ ఫిల్మ్స్‌ విడుదల తేదీ: ఏప్రిల్‌ 5, 2024 కొత్త కుర్రాడు సూర్య తేజ ఏలే (Actor Surya Teja Aelay) హీరోగా మీనాక్షి గోస్వామి హీరోయిన్‌గా చేసిన చిత్రం ‘భరతనాట్యం’ (Bharatanatyam Review In Telugu). ఓ యువకుడి జీవితాన్ని సినిమా ఎలా మార్చిందన్నది ఈ చిత్రం కథ. కేవీఆర్‌ మహేంద్ర దర్శకత్వం వహించారు. హర్షవర్ధన్, అజయ్ ఘోష్, వైవా హర్ష వంటి ఇతర నటీనటులు ముఖ్య పాత్రలు పోషించారు. కాగా, ఈ చిత్రం ఇవాళ (ఏప్రిల్‌ 5) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ మూవీ ఎలా ఉంది? తెలుగు ఆడియన్స్‌ను మెప్పించిందా? లేదా? కథేంటి రాజు సుందరం (సూర్య తేజ ఏలే) అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేస్తూ డైరెక్టర్‌ అయ్యేందుకు ప్రయత్నిస్తుంటాడు. పేద కుటుంబం నుండి రావడంతో అతడ్ని ఆర్థిక సమస్యలు వెంటాడుతుంటాయి. దీంతో డబ్బు దొంగతనం చేసి ఇండస్ట్రీలో సెటిల్‌ అవ్వాలని రాజు భావిస్తాడు. ఇందుకోసం ఓ రౌడీ గ్యాంగ్‌ నుంచి డబ్బు అనుకొని పొరపాటున డ్రగ్స్‌ ఉన్న భరతనాట్యం బ్యాగ్‌ను దొంగిలిస్తాడు. ఈ క్రమంలో పోలీసు ఆఫీసర్‌ శకునికి దొరికిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? రౌడీ గ్యాంగ్‌ నుంచి రాజుకు ఎదురైన ఇబ్బందులు ఏంటి? ఈ సమస్య నుంచి అతడు ఎలా బయటపడ్డాడు? డైరెక్టర్ కావాలన్న అతడి కల నెరవేరిందా? లేదా? హీరోయిన్‌ మీనాక్షి గోస్వామితో అతడి లవ్‌ ట్రాక్ ఏంటి? అన్నది కథ. ఎవరెలా చేశారంటే? హీరోగా సూర్య తేజ ఏలే పర్వాలేదనిపించాడు. అయితే నటన పరంగా ఇంకాస్త పరిణితి చెందాల్సి ఉంది. అతడి పాత్రకు చెప్పిన డబ్బింగ్‌ కూడా పెద్ద సింక్‌ కాలేదు. హీరోయిన్‌ మీనాక్షి గోస్వామి తన గ్లామర్‌తో ఆకట్టుకుంది. అయితే ఆమె పాత్రకు ఎలాంటి ప్రాధాన్యం లేదు. హీరోయిన్‌లా కాకుండా అక్కడక్కడా ఓ గెస్ట్‌గా మెరిసింది. కనిపించినంత సేపు తన అందం, అభినయంతో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. వైవా హర్ష, హర్షవర్ధన్‌, అజయ్‌ ఘోష్‌ తమ పాత్రలకు న్యాయం చేశారు. ముఖ్యంగా హర్ష తన కామెడీ టైమింగ్‌తో అక్కడక్కడా నవ్వులు పూయించాడు. మిగిలిన పాత్రధారులు తమ పరిధి మేరకు నటించి మెప్పించారు.  డైరెక్షన్ ఎలా ఉందంటే ‘దొరసాని’ (Dorasaani) తో మంచి దర్శకుడిగా ప్రూవ్ చేసుకున్న కేవీఆర్ మహేంద్ర (KVR Mahendra) కొంత గ్యాప్ తీసుకుని చేసిన సినిమా ఇది. అయితే ఈ సినిమాలో అతడి మార్క్‌ ఎక్కడా కనిపించదు. ‘స్వామిరారా’ (Swamy Ra Ra) స్టైల్లో ఓ క్రైమ్ కామెడీ కథగా తెరకెక్కించాలని భావించి ఇందులో దర్శకుడు పూర్తిగా విఫలమయ్యాడు. ‘స్వామిరారా’ రేంజ్లో ఆకట్టుకునే ఎలిమెంట్స్ ఇందులో ఒక్కటి కూడా లేదు. ఏ దశలోనూ సినిమా ఆకట్టుకునే విధంగా ఉండదు. ఇంటర్వెల్‌ వరకూ అసలు కథ ఏంటో తెలియక ప్రేక్షకులు సతమతమవుతుంటారు. దర్శకుడు మహేంద్ర ఒక్క సన్నివేశాన్ని కూడా సందర్భానుసారంగా తెరకెక్కించినట్లు అనిపించదు. సెకండాఫ్‌ కూడా అంతంత మాత్రంగానే ఉంది.  టెక్నికల్‌గా టెక్నికల్‌ అంశాల విషయానికి వస్తే.. వెంకట్ ఆర్‌ శాఖమూరి అందించిన సినిమాటోగ్రాఫీ బాగుంది. వివేక్‌ సాగర్ అందించిన సంగీతం పెద్దగా ఆకట్టుకోలేదు. నేపథ్య సంగీతం కాస్త బెటర్ అనిపిస్తుంది. ఎడిటింగ్‌ ఓకే. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. ఖర్చు విషయంలో నిర్మాతలు ఎక్కడా రాజీపడలేదు. ప్లస్‌ పాయింట్స్‌ వైవా హర్ష కామెడీసినిమాటోగ్రఫీ మైనస్‌ పాయింట్స్‌ రొటిన్‌ స్టోరీసందర్భానుసారంగా లేని సీన్లుసంగీతం Telugu.yousay.tv Rating : 1.5/5 
    ఏప్రిల్ 05 , 2024
    Rakul Preet Singh: పెళ్లి డేట్ ఫిక్స్ చేసుకున్న రకూల్.. ప్రధాని కోసం మనసు మార్చుకున్న ముద్దుగుమ్మ
    Rakul Preet Singh: పెళ్లి డేట్ ఫిక్స్ చేసుకున్న రకూల్.. ప్రధాని కోసం మనసు మార్చుకున్న ముద్దుగుమ్మ
    తెలుగు, తమిళ భాషల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటిమణుల్లో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ (Rakul Preet Singh) ఒకరు. అయితే ఆమె త్వరలోనే పెళ్లి (Rakul Preet Singh Wedding) పీటలెక్కబోతోంది. బాలీవుడ్‌ నటుడు, నిర్మాత జాకీ భగ్నానీ (Jackky Bhagnani)ని వివాహం ఆడనుంది. ఫిబ్రవరి 21న వీరి వివాహం జరగనుంది. గోవా వేదికగా జరిగే ఈ వేడుకకు కుటుంబసభ్యులు, అతి కొద్దిమంది స్నేహితులు మాత్రమే హాజరుకానున్నట్లు తెలుస్తోంది. మూడు రోజుల పాటు వైభవంగా వీరి పెళ్లి జరగనుంది.  https://twitter.com/i/status/1755616891970949447 రకుల్‌-జాకీ (Rakul Preet Singh - Jackky Bhagnani)ల వివాహానికి సంబంధించిన ఆహ్వాన పత్రిక కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. దీనిని చూసిన ఫ్యాన్స్‌ తెగ ఖుషీ అవుతున్నారు.  బీటౌన్‌ నిర్మాత  జాకీ భగ్నానీతో తాను రిలేషన్‌లో ఉన్నానంటూ రకుల్‌ (Rakul Preet Singh) 2021లోనే ప్రకటించింది. అప్పటి నుంచి వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారు. పెళ్లి బంధంతో ఒక్కటి కాబోతున్నట్లు తాజాగా ప్రకటించారు.  https://twitter.com/i/status/1757012094317396389 ఇక రకుల్‌-జాకీ తమ పెళ్లి బట్టల డిజైనర్లను కూడా సెలెక్ట్‌ చేసుకున్నట్లు బాలీవుడ్ వర్గాల్లో టాక్‌ వినిపిస్తోంది. సబ్యసాచి, తరుణ్ తహిల్యానీ, మనీష్ మల్హోత్రా పెళ్లి దుస్తులు డిజైన్‌ చేస్తున్నట్లు తెలిసింది.  అయితే ఈ జంట తొలుత తమ వివాహాన్ని (Rakul Preet Singh Wedding) మిడిల్‌ ఈస్ట్‌లో ప్లాన్‌ చేసుకున్నట్లు తెలిసింది. ఇందుకు సంబంధించి కొన్ని ప్రదేశాలను కూడా సెలెక్ట్‌ చేసుకున్నారని టాక్‌.  కానీ, గత ఏడాది డిసెంబరులో ప్రధాని మోదీ (Narendra Modi) ఇచ్చిన పిలుపు మేరకు ఇండియాలోనే రకుల్‌-జాకీలు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.  చివరి నిమిషంలో వేదిక మార్చడం కష్టమే అయినా దేశంపై ఉన్న ప్రేమతో ఈ మార్పును వారు స్వీకరించారని సన్నిహిత వర్గాలు తెలిపాయి. రకుల్‌ సినిమా జీవితానికి వస్తే.. ఆమె ‘గిల్లి’ (Gilli Movie) అనే కన్నడ సినిమాతో నటిగా  ఎంట్రీ ఇచ్చింది. ‘7G బృందావన్ కాలనీ’ చిత్రానికి రీమేక్‌గా ఆ సినిమా వచ్చింది.  2013లో వచ్చిన ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’ సినిమా ద్వారా రకుల్‌ (Rakul Preet Singh Wedding) తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఆ సినిమా ఘన విజయం సాధించడంతో రకుల్‌ను వరుస అవకాశాలు చుట్టుముట్టాయి.  https://twitter.com/i/status/1662932748166889473 ‘లౌక్యం’ (Loukyam), ‘కరెంట్‌ తీగ’ (Current theega), ‘పండగ చేస్కో’ (Pandaga Chesko), ‘కిక్‌ 2’ (Kick 2), ‘బ్రూస్‌లీ’ (Bruce lee) వంటి వరుస సినిమాల్లో రకూల్‌ నటించింది. అయితే అవి పెద్దగా హిట్‌ కాకపోవడంతో రకుల్‌ కెరీర్‌ ప్రశ్నార్థకంగా మారింది.  అయితే, ఆ తర్వాత వచ్చిన ‘నాన్నకు ప్రేమతో’ (Nannaku Prematho), ‘సరైనోడు’ (Sarainodu), ‘ధ్రువ’ (Dhruva) వంటి సినిమాలు సూపర్‌ హిట్ కావడంతో టాలీవుడ్‌ అగ్రకథానాయికల్లో ఒకరిగా రకుల్‌ గుర్తింపు తెచ్చుకుంది.  మళ్లీ తెలుగులో అవకాశాలు తగ్గడంతో ఆమె తన ఫోకస్‌ అంతా బాలీవుడ్‌పై పెట్టింది.  అక్కడ వరుసగా సినిమాలు చేస్తూ అలరిస్తోంది. ఈ క్రమంలోనే నిర్మాత జాకీ భగ్నానీకి దగ్గరై అతడితో ప్రేమలో పడింది.  ఇటీవల ‘కట్‌పుట్‌లి’ (Cuttputlli), ‘డాక్టర్‌ G’ (Doctor G), ‘థ్యాంక్‌ గాడ్‌’ (Tank God), ‘ఛత్రివలి’ (Chhatriwali) సినిమాలతో బాలీవుడ్ ప్రేక్షకులను పలకరించింది.  తాజాగా వచ్చిన తమిళ చిత్రం 'అయాలన్‌' (Ayalaan)లోనూ ఈ బ్యూటీ హీరోయిన్‌గా చేసింది. హీరో శివకార్తికేయన్‌కు జోడీగా మంచి నటన కనబరించింది. ఈ సినిమా పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకోవడంతో రకుల్‌ ఫుల్‌ జోష్‌లో ఉంది.  కమల్‌హాసన్‌ హీరోగా శంకర్‌ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ‘ఇండియన్‌ 2’ (Indian 2) సినిమాలోనూ రకుల్‌ నటిస్తోంది. ఈ చిత్రం కూడా ఈ ఏడాదే రిలీజయ్యే ఛాన్స్ ఉంది.  అలాగే హిందీలో 'మేరి పత్ని కా రీమేక్‌' (Meri Patni Ka Remake) సినిమాలో ఈ భామ నటిస్తోంది. ఇందులో అర్జున్‌ కపూర్‌ హీరోగా చేస్తున్నాడు. ఓవైపు సినిమాల్లో నటిస్తూనే సోషల్‌ మీడియాలోనూ రకుల్‌ చాలా చురుగ్గా వ్యవహరిస్తోంది. ఎప్పటికప్పుడు తన గ్లామర్‌ ఫొటో షూట్‌ ఫొటోలను షేర్‌ చేస్తూ ఫ్యాన్స్‌ను అలరిస్తోంది. 
    ఫిబ్రవరి 12 , 2024
    <strong>Telugu OTT Movies: ఓటీటీలో ‘అహం రీబూట్‌’ తరహాలో వచ్చిన ప్రయోగాత్మక చిత్రాలు.. వీటి కాన్సెప్ట్స్‌కు సెల్యూట్‌ చేయాల్సిందే!&nbsp;</strong>
    Telugu OTT Movies: ఓటీటీలో ‘అహం రీబూట్‌’ తరహాలో వచ్చిన ప్రయోగాత్మక చిత్రాలు.. వీటి కాన్సెప్ట్స్‌కు సెల్యూట్‌ చేయాల్సిందే!&nbsp;
    ఒకే తరహా చిత్రాలను చూడాలంటే ఎంతటి సినిమా లవర్స్‌కైనా బోర్‌ కొట్టక మానదు. దీనిని గమనించిన కొందరు దర్శక నిర్మాతలు.. క్రేజీ కాన్సెప్ట్‌తో కొన్ని ప్రయోగాత్మక చిత్రాలను రూపొందించారు. వైవిధ్యమైన కథ, కథనంతో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం ఆ చిత్రాలు ఓటీటీ వేదికగా అందుబాటులో ఉన్నాయి. విభిన్న తరహా చిత్రాలు చూడాలని కోరుకునేవారు వీటిని ఎంచక్కా వీక్షించవచ్చు. ఇవి మీకు తప్పనిసరిగా కొత్త అనుభూతిని అందిస్తాయి. ఇంతకీ ఆ చిత్రాలు ఏవి? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయి? వాటి వైవిధ్యమైన కాన్సెప్ట్‌ ఏంటి? ఈ కథనంలో పరిశీలిద్దాం.&nbsp; అహం రీబూట్‌ (Aham Reboot) సుమంత్‌ హీరోగా రూపొందిన లేటెస్ట్‌ చిత్రం అహం రీబూట్‌'. జూన్‌ 30 నుంచి ఆహా వేదికగా ఈ సినిమా స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. ఈ సైకలాజికల్‌ థ్రిల్లర్‌ మూవీకి ప్రశాంత్ సాగర్‌ అట్లూరి దర్శకత్వం వహించారు. ఈ మూవీ ప్రత్యేకత ఏంటంటే.. ఇందులో సుమత్‌ పాత్ర ఒక్కటే స్క్రీన్‌పై కనిపిస్తాయి. మిగత పాత్రలు కేవలం వినిపిస్తాయి అంతే. ఈ మూవీ స్ట్రీమింగ్‌కు మంచి రెస్పాన్స్‌ వస్తున్నట్లు ఆహా వర్గాలు తెలిపాయి. ప్లాట్‌ ఏంటంటే.. ఆర్జే నిలయ్‌ (సుమంత్‌) స్టూడియోలో ఉండగా ఒక అమ్మాయి నుంచి కాల్‌ వస్తుంది. ఎవరో కిడ్నాప్‌ చేశారని చెబుతుంది. తొలుత ప్రాంక్‌ అని భావించిన నిలయ్‌.. ఆమె మాటలకు కన్విన్స్‌ అవుతాడు. ఎలాగైన కాపాడాని అనుకుంటాడు. మరోవైపు ఆమెను రక్షించేందుకు పోలీసులు సైతం రంగంలోకి దిగుతారు. ఇంతకీ కిడ్నాపైన యువతి ఎవరు? ఆమెకు నిలయ్‌కు ఉన్న సంబంధం ఏంటి? అన్నది కథ. ఓటీటీ వేదిక : ఆహా 105 మినిట్స్‌ (105 Minuttess) ‘అహం రీబూట్‌’ తరహాలోనే రీసెంట్‌గా ఓ లేడీ ఒరియెంటేడ్‌ చిత్రం వచ్చింది. సింగిల్‌ క్యారెక్టర్‌తో తెరకెక్కిన ‘105 మినిట్స్‌’ (105 Minuttess) సినిమాలో హీరోయిన్‌ హన్సిక (Hansika) నటించారు. కేవలం ఆరు రోజుల్లోనే ఈ సినిమా చిత్రీకరణ పూర్తికావడం విశేషం. ఈ సినిమా ప్లాట్‌ ఏంటంటే.. జాను (హ‌న్సిక‌) ఆఫీసు నుంచి కారులో ఇంటికి వెళ్తున్న క్రమంలో తననేదో అదృశ్యశక్తి వెంటాడుతున్నట్లు ఆమెకు అర్థమవుతుంది. ఇంటికి వెళ్లాక అనూహ్య ప‌రిణామాలు చోటుచేసుకుంటాయి. ఆ అదృశ్య శ‌క్తి జానును ఇనుప గొలుసుతో బంధించి చిత్రహింస‌ల‌కు గురి చేయ‌డం ప్రారంభిస్తుంది. తన మరణానికి జానునే కారణమని చెప్పి ఇబ్బందులకు పెడుతుంది. ఇంతకీ ఆ అదృశ్య శక్తి ఎవరు? ఆ వ్య‌క్తి మ‌ర‌ణానికి జాను ఎలా కార‌ణ‌మైంది? దాని బారి నుంచి జాను ఎలా బ‌య‌ట‌ప‌డింది? అన్న‌ది మిగ‌తా క‌థ‌ ఓటీటీ వేదిక : అమెజాన్‌ ప్రైమ్‌ ఆరంభం (Aarambham) కేరాఫ్‌ కంచరపాలెం ఫేమ్‌ మోహన్‌ భగత్‌ ప్రధాన పాత్రలో నటించిన 'ఆరంభం' చిత్రం కూడా ప్రయోగాత్మక కథతో రూపొందింది. ‘డెజావు’ అనే డిఫరెంట్‌ కాన్సెప్టుతో దర్శకుడు అజయ్‌ నాగ్‌ ఈ సినిమా తెరకెక్కించారు. జైల్లో శిక్ష అనుభవించే ఖైదీ ఉన్నట్టుండి మాయమవుతాడు. సెల్‌కు వేసిన తాళం వేసినట్టే ఉంటుంది. ఊచలు వంచకుండా, గోడలు పగలగొట్టకుండా సునాయాసంగా అతడెలా తప్పించుకున్నాడు? అనేది ఆసక్తికరం. ఈ మూవీలో సుప్రితా సత్యనారాయణ్‌, భూషణ్‌ కల్యాణ్‌, లక్ష్మణ్‌ మీసాల, సురభి ప్రభావతి కీలక పాత్రలు పోషించారు. సినిమా ప్లాట్‌ విషయానికి వస్తే.. ‘మిగిల్.. జైలులో శిక్ష అనుభవిస్తూ ఉరి తీయడానికి ఒక రోజు ముందు అనూహ్యంగా మిస్‌ ‌అవుతాడు. జైలు గది తాళాలు, గోడలు అలాగే ఉన్నప్పటికీ అతడు మిస్‌ కావడం ఆశ్చర్యం కలిగిస్తుంది. దీన్ని కనిపెట్టేందుకు డిటెక్టివ్ రంగంలోకి దిగుతాడు. అతడికి మిగిల్‌ డైరీ దొరగడంతో కథ మలుపు తిరుగుతుంది. డైరీలో ఏముంది? డెజావు ఎక్స్‌పెరమెంట్‌కు కథకు సంబంధం ఏంటి?’ అన్నది స్టోరీ. ఓటీటీ వేదిక : ఈటీవీ విన్‌ లవ్‌ మీ (Love Me) ఆశిష్‌ (Ashish Reddy), వైష్ణవీ చైతన్య (Vaishnavi Chaitanya) ప్రధాన పాత్రల్లో అరుణ్‌ భీమవరపు తెరకెక్కించిన చిత్రం 'లవ్‌ మీ'. ఈ మూవీ కూడా వినూత్న కాన్సెప్ట్‌తో రూపొందింది. ఒక యువకుడు దెయ్యంతో ప్రేమలో పడితే&nbsp; ఎలా ఉంటుంది? ఈ క్రమంలో అతడికి ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి? అన్న కాన్సెప్ట్‌తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా జయాపజయాలు ఎలా ఉన్నప్పటికీ.. ఈ మూవీకి కచ్చితంగా ఓ డిఫరెంట్‌ ఎక్స్‌పీరియన్స్‌లో అందిస్తుంది. ప్లాట్‌ ఏంటంటే.. ‘అర్జున్ (ఆశిష్), ప్రతాప్ (రవికృష్ణ) కలిసి ఓ యూట్యూబ్ ఛానల్ నడుపుతూ ఉంటారు. దెయ్యాలు, ఆత్మలకు సంబంధించిన వీడియోలు చేస్తుంటారు. ప్రతాప్‌ లవర్‌ ప్రియా (వైష్ణవి).. దివ్యవతి అనే దెయ్యం గురించి చెప్పడంతో ఆమె ఉంటున్న పాడుబడ్డ అపార్ట్‌మెంట్‌కు అర్జున్‌ వెళ్తాడు. అలా వెళ్లిన అర్జున్‌ దివ్యవతి ఆత్మతో ప్రేమలో పడతాడు. ఆ తర్వాత ఏమైంది? దివ్యవతి ఎవరు?’ అన్నది కథ. ఓటీటీ వేదిక : అమెజాన్‌ ప్రైమ్‌ ప్రాజెక్ట్‌ జెడ్‌ (Project Z) సందీప్ కిష‌న్‌ (Sundeep Kishan), లావ‌ణ్య త్రిపాఠి (Lavanya Tripathi) హీరో హీరోయిన్లుగా న‌టించిన 'ప్రాజెక్ట్ జెడ్' మూవీ.. ఇప్పటివరకూ చూడని స్టోరీ లైన్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మనిషికి చావు అనేది లేకుంటే ఎలా ఉంటుంది? ఆనే కాన్సెప్ట్‌తో సైన్స్‌ ఫిక్షన్‌ జానర్‌లో ఈ సినిమాను తెరకెక్కించారు. సినిమా ప్లాట్‌ ఏంటంటే.. ‘నగరంలో వరుస హత్యలు కలకలం సృష్టిస్తాయి. ఇదంతా సీరియల్‌ కిల్లర్‌ పని పోలీసు డిపార్ట్‌మెంట్‌కు తెలుస్తోంది. దీంతో పోలీసు ఆఫీసర్‌ కుమార్‌ (సందీప్‌ కిషన్‌) రంగంలోకి దిగుతాడు. కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగు చూస్తాయి. ఓ సైంటిస్టు ఇవన్ని చేస్తున్నట్లు గ్రహిస్తారు? ఇంతకీ ఆ సైంటిస్టు ఎవరు? ఎందుకు హత్యలు చేస్తున్నాడు? అతడు చేసిన ప్రయోగం ఏంటి? కుమార్‌ ఈ కేసును ఎలా ఛేదించాడు?’ అన్నది కథ. ఓటీటీ వేదిక : ఆహా ప్రసన్న వదనం (Prasanna Vadanam) సుహాస్‌ (Suhas) రీసెంట్‌ చిత్రం 'ప్రసన్న వదనం'.. ఓ ప్రయోగాత్మక మూవీగా చెప్పవచ్చు. ఇందులో హీరో ఫేస్ బ్లైండ్ నెస్ (ప్రోసోపాగ్నోసియా) అనే స‌మ‌స్య బారిన పడతాడు. ఎవరి ముఖాన్ని, వాయిస్‌నూ గుర్తుపట్టలేకపోతాడు. దీని వల్ల అతడు ఫేస్‌ చేసిన సమస్యలు ఏంటి? అన్నది కాన్సెప్ట్‌. ఇందులో పాయల్‌ రాధాకృష్ణ, రాశీసింగ్‌, నందు, వైవా హర్ష కీలక పాత్రలు పోషించారు. మూవీ కథ ఏంటంటే.. రేడియో జాకీగా పనిచేసే సూర్య జీవితాన్ని ఓ ప్రమాదం తలకిందులు చేస్తుంది. ఈ ఘటనతో అతడు ఫేస్‌ బ్లైండ్‌నెస్‌ బారిన పడతాడు. ముఖాలను, గొంతులను గుర్తుపట్టలేకపోతుంటాడు. ఈ క్రమంలో ఓ రోజు అతడి కళ్లెదుట హత్య జరుగుతుంది. అనూహ్యంగా ఆ కేసులో సూర్య ఇరుక్కుంటాడు. సూర్య‌ని ఇరికించింది ఎవ‌రు? సూర్య కేసు నుంచి బయటపడ్డాడా లేదా? అన్నది కథ. భ్రమయుగం (Bramayugam) మలయాళ చిత్ర పరిశ్రమ ప్రయోగాలకు పెట్టింది పేరు. అక్కడి స్టార్‌ హీరో మమ్ముట్టి (Mammootty) నటించిన ‘భ్రమయుగం’ (Bramayugam) కూడా ఇప్పటివరకూ చూడని కాన్సెప్ట్‌తో రూపొందింది.&nbsp;డిజిటల్‌ యుగంలోనూ బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఫార్మాట్‌లో ఈ చిత్రాన్నితెరకెక్కించారు. ఈ సినిమా మెుత్తం మూడు పాత్రల చుట్టే తిరుగుతుంది. కథ ఏంటంటే.. ‘తేవన్ అనే గాయకుడు అడవిలో ప్రయాణిస్తూ ఓ పాడుబడ్డ పెద్ద భవంతికి వెళ్తాడు. అక్కడ యజమాని మమ్ముట్టి (కుడుమోన్ పొట్టి), ఓ వంటవాడు ఉంటాడు. అనూహ్య పరిణామాల తర్వాత తేవన్ ఆ ఇంటి నుంచి పారిపోవాలని అనుకుంటాడు. అసలు తేవన్ ఏం చూసి భయపడ్డాడు? కుడుమోన్ పొట్టి ఎవరు? అడవిలో ఏం చేస్తున్నాడు?’ అన్నది స్టోరీ. ఓటీటీ వేదిక : సోనీ లివ్‌
    జూలై 03 , 2024
    Adil Hussain: నా దృష్టిలో RRR గొప్ప సినిమానే కాదు.. మళ్లీ గెలుక్కున్న కబీర్ సింగ్ యాక్టర్
    Adil Hussain: నా దృష్టిలో RRR గొప్ప సినిమానే కాదు.. మళ్లీ గెలుక్కున్న కబీర్ సింగ్ యాక్టర్
    భారతీయ చిత్ర పరిశ్రమ ఖ్యాతిని గ్లోబల్‌ స్థాయికి తీసుకెళ్లిన చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR). రామ్‌చరణ్‌ (Ram Charan), తారక్‌ (Jr. NTR) హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి (SS Rajamouli) రూపొందించిన ఈ చిత్రం.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రియుల దృష్టిని ఆకర్షించింది. ఆస్కార్‌ సహా గ్లోబల్‌ స్థాయిలో పలు అవార్డులను కొల్లగొట్టింది. హాలీవుడ్‌ దిగ్గజ డైరెక్టర్‌ జేమ్స్ కామెరాన్ (James Cameron) సైతం రాజమౌళి దర్శకత్వ ప్రతిభకు ఫిదా అయ్యారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తనకు బాగా నచ్చినట్లు ప్రకటించారు. అటువంటి RRR చిత్రంపై ప్రముఖ బాలీవుడ్‌ నటుడు ఆదిల్‌ హుస్సేన్‌ (Adil Hussain) నోరు పారేసుకున్నారు. దక్షిణాది చిత్రంపై తన అక్కసు వెళ్లగక్కాడు.&nbsp; RRR గొప్ప చిత్రం కాదు’ బాలీవుడ్‌కు చెందిన ఆదిల్‌ హుస్సేన్‌.. వివాదస్పద వ్యాఖ్యలు చేస్తూ తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా ఓ పోడ్‌కాస్ట్‌ ఇంటర్యూలో పాల్గొన్న ఈ అస్సామీ నటుడికి యాంకర్‌ ఓ ఆసక్తికర ప్రశ్న వేశారు. ప్రాంతీయ సినిమాలు గ్లోబల్‌ స్థాయిలో అలరిస్తున్నాయని.. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ లాగా త్వరలో అసోం చిత్రాలను కూడా అంతర్జాతీయ వేదికలపై చూడవచ్చా? అని అడిగారు. ఇందుకు ఆదిల్‌ హుస్సేన్‌ సమాధానమిస్తూ.. ‘అస్సామి సినిమా ఇప్పటికే ఆ స్థాయికి (గ్లోబల్‌) చేరుకుంది. నేను RRR గొప్ప చిత్రంగా పరిగణించను. అత్యుత్తమ ప్రమాణాలతో రూపొందిన చిత్రాలు సాధారణంగా మంచి సినిమాలుగా పరిగణింపబడతాయి. అంతమాత్రాన అవి తప్పనిసరిగా గొప్ప చిత్రాలు కావాల్సిన పని లేదు. ఆర్‌ఆర్‌ఆర్‌ కూడా అంతే. అది వినోదాత్మక చిత్రం మాత్రమే. నా దృష్టిలో అది గొప్ప చిత్రం కాదు. నేను ఆర్‌ఆర్‌ఆర్‌ కంటే విలేజ్‌ రాక్‌స్టార్‌ను ఎక్కువగా ఇష్టపడతాను’ అని అన్నారు.&nbsp; View this post on Instagram A post shared by GPlus (@guwahatiplus) నెట్టింట తీవ్ర దుమారం RRRపై ఆదిల్‌ హుస్సేన్‌ చేసిన వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపై నెటిజన్లు రెండుగా విడిపోయి విమర్శలు చేసుకుంటున్నారు. కొందరు ఆదిల్‌ హుస్సేన్‌ వ్యాఖ్యలను సమర్థిస్తుంటే మరికొందరు తీవ్రంగా ఖండిస్తున్నారు. అందరి దృష్టిని ఆకర్షించడం కోసమే ఇలాంటి అర్థం లేని వ్యాఖ్యలు ఆదిల్‌ చేశారంటూ 'ఆర్‌ఆర్‌ఆర్‌' ఫ్యాన్స్‌ మండిపడుతున్నారు. సౌత్‌ సినిమాలు గ్లోబల్‌ స్థాయిలో రాణిస్తుండటం చూసి తట్టుకోలేకనే ఇలా మాట్లాడారని మండిపడ్డారు. 'ఆర్‌ఆర్‌ఆర్‌' భారత చిత్ర పరిశ్రమకు ఎనలేని గుర్తింపు తీసుకొచ్చిందన్న విషయాన్ని గుర్తుచేస్తున్నారు. మరోవైపు మరికొందరు నెటిజన్లు ఆదిల్‌ హుస్సేన్‌ వ్యాఖ్యలకు మద్దతిస్తున్నారు. ఇది ఆయన వ్యక్తిగత అభిప్రాయమని అంటున్నారు. ఆర్‌ఆర్‌ఆర్‌ మంచి ఎంటర్‌టైనింగ్‌ చిత్రమేనని.. అయితే సమాజంలో మార్పు తీసుకొచ్చిన గొప్ప సినిమా అయితే కాదని పేర్కొంటున్నారు. సందీప్ రెడ్డి వంగా మూవీపైనా విమర్శలు! యానిమల్‌ (Animal) ఫేమ్‌ అర్జున్‌ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) గత చిత్రం ‘కబీర్‌ సింగ్‌’ పైనా ఆదిల్‌ హుస్సేన్‌ ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏడేళ్ల క్రితం వచ్చిన ఈ సినిమాపై ఓ ఇంటర్యూలో షాకింగ్ కామెంట్స్‌ చేశారు. ‘ఇప్పటివరకూ నా సినీ కెరీర్‌లో ఎందుకు నటించానా? అని ఫీలైన చిత్రం ఒక్కటే. అదే ‘కబీర్‌ సింగ్‌’. అందులో కాలేజీ డీన్‌గా వర్క్‌ చేశా. ఎన్నిసార్లు నో చెప్పినా.. ఒకే ఒక్క రోజు షూట్‌కు రమ్మని అడిగారు. పెద్ద మొత్తంలో పారితోషికం ఇవ్వడంతో యాక్ట్‌ చేసి వచ్చేశా. విడుదలయ్యాక ఆ సినిమా చూసి.. ఇలాంటి చిత్రంలో ఎందుకు నటించానా? అని ఇబ్బందికరంగా ఫీలయ్యా. స్నేహితుడితో కలిసి సినిమా చూడ్డానికి వెళ్లి మధ్యలోనే బయటకు వచ్చేశా. ఆ సినిమా చూడమని నా భార్యకు కూడా చెప్పలేదు. ఒకవేళ ఆమె చూసి ఉంటే నన్ను తిట్టేది’ అని అన్నారు. సందీప్‌ వంగా స్ట్రాంగ్ కౌంటర్‌ ఆదిల్‌ హుస్సేన్‌ చేసి వ్యాఖ్యలపై డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. తనదైన శైలిలో గట్టి కౌంటర్ ఇచ్చారు. ‘మీరు గొప్పగా భావించి నటించిన 30 చిత్రాలతో రాని గుర్తింపు.. ఎందుకు నటించానా? అని ఫీలవుతున్న ఈ ఒక్క బ్లాక్‌బస్టర్‌తో మీ సొంతమైంది. నటనపై అభిరుచి కంటే దురాశ ఎక్కువగా ఉన్న మిమ్మల్ని నా సినిమాలోకి తీసుకున్నందుకు ఇప్పుడు బాధ పడుతున్నా. ఇకపై మీరంత సిగ్గుపడకుండా ఉండేలా నేను చేస్తా. ఆ సినిమాలో మీ స్థానాన్ని ఏఐ సాయంతో ఫిల్‌ చేస్తా’ అని ఎక్స్‌లో పోస్ట్‌ పెట్టారు.&nbsp;
    ఏప్రిల్ 24 , 2024
    Kiara Advani: వైరల్‌ అవుతున్న కియారా అద్వానీ హాట్ పిక్స్.. ఎందుకంటే?
    Kiara Advani: వైరల్‌ అవుతున్న కియారా అద్వానీ హాట్ పిక్స్.. ఎందుకంటే?
    బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ (Kiara Advani) పేరు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో మార్మోగుతోంది. స్టార్‌ హీరో సిద్ధార్థ్‌ మల్హోత్రాను ఆమె పెళ్లి చేసుకొని నేటితో సంవత్సరం పూర్తవడమే ఇందుకు కారణం.&nbsp; https://twitter.com/i/status/1755075870287696051 ప్రస్తుతం #KiaraAdvani, #SidKiara హ్యాష్‌ట్యాగ్‌లతో ఈ జంటకు సంబంధించిన సమాచారం నెట్టింట వైరల్‌ అవుతోంది.&nbsp; https://twitter.com/narmadakrystle/status/1755107606824440246 గతేడాది ఈ రోజునే (07 ఫిబ్రవరి, 2024) ఈ బాలీవుడ్‌ స్టార్‌ జంట పెళ్లి జరిగింది. రాజస్థాన్‌ జైసల్మేరులోని ప్యాలెస్‌లో అతిరథ మహారథుల సమక్షంలో అంగరంగ వైభోగంగా జరిగింది.&nbsp; https://twitter.com/i/status/1754935624178778242 నటి కియారా అద్వానీ బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌కు సుపరిచితమే. ఆమె తెలుగులోనూ పలువురు స్టార్‌ హీరోలతో నటించింది.&nbsp; View this post on Instagram A post shared by KIARA (@kiaraaliaadvani) 2018లో మహేష్‌తో చేసిన 'భరత్‌ అనే నేను' (Bharat Ane Nenu) సినిమా ద్వారా ఆమె తొలిసారి టాలీవుడ్‌లో అడుగుపెట్టింది. ఇందులో వసుమతి పాత్రలో అద్భుతంగా నటించి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది.&nbsp;&nbsp; View this post on Instagram A post shared by KIARA (@kiaraaliaadvani) మరుసటి ఏడాది రామ్‌చరణ్‌తో ‘వినయ విధేయ రామ’ (Vinaya Vidheya Rama)లో కనిపించింది. ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద విఫలమైనప్పటికీ చరణ్‌తో పాటు కియారా కూడా మంచి నటనే కనబరిచి ప్రశంసలు అందుకుంది.&nbsp; ఆ సినిమా ఫ్లాప్‌తో కియారాకు తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు. దీంతో ఆమె పూర్తిగా బాలీవుడ్‌కు పరిమితమై అక్కడ పలు హిట్‌ సినిమాల్లో నటించింది.&nbsp; ఇక కియారా (Kiara Advani) చేసిన ప్రముఖ బాలీవుడ్‌ సినిమాల విషయానికి వస్తే.. ఆమె తొలుత ‘ఫుగ్లీ’ (Fugly) చిత్రం ద్వారా కెరీర్‌ను ప్రారంభించింది.&nbsp; తన రెండో చిత్రం ఎం.ఎస్‌ ధోని (M.S. Dhoni: The Untold Story) ద్వారా కియారా పేరు బాలీవుడ్‌లో మార్మోగిపోయింది. ఇందులో సాక్షి రావత్‌ పాత్రలో ఆమె జీవించింది.&nbsp; ‘లస్ట్‌ స్టోరీస్‌’ (Lust Stories) సిరీస్‌లో మేఘా ఉపాధ్యాయ్‌ పాత్ర పోషించి ఆశ్చర్యపరిచింది. హస్త ప్రయోగం చేసుకునే అమ్మాయి పాత్రలో కనిపించి అందరికీ షాకిచ్చింది. ఈ సిరీస్‌లో శృంగారం హద్దులు దాటిందంటూ అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. https://twitter.com/i/status/1755140256859615281 ఆ తర్వాత బాలీవుడ్‌లో ‘కబీర్‌ సింగ్‌’, ‘షేర్‌షా’, ‘భూల్ భూలయ్యా 2’ వంటి హిట్‌ చిత్రాల్లో నటించి బాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌ (Kiara Advani)గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది.&nbsp; షేర్‌షా సినిమాలో సిద్ధార్థ మల్హోత్రాతో ఈ కియారా జోడీగా నటించింది. అయితే సినిమాకు ముందు నుంచే వీరి మధ్య రిలేషన్ ఉన్నట్లు వార్తలు వచ్చాయి. 2020లోనే వీరు డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి.&nbsp; ఆ వార్తలపై స్పందించకుండా సస్పెన్స్ మెయింటెన్‌ చేసిన ఈ జంట.. చివరికీ పెళ్లి బంధంతో ఒక్కటై ఆ వార్తలను నిజం చేసింది. ప్రస్తుతం కియారా (Kiara Advani).. చరణ్‌తో ‘గేమ్‌ ఛేంజర్‌’ సినిమాలో నటిస్తోంది. తమిళ డైరెక్టర్‌ శంకర్‌ రూపొందిస్తున్న ఈ చిత్రం పాన్‌ఇండియా స్థాయిలో విడుదల కానుంది. అటు తారక్‌ - హృతిక్‌ రోషన్‌ కాంబోలో రానున్న వార్‌-2 సినిమాలోనూ కియారా కీలక పాత్ర పోషిస్తోంది. ఈ రెండు సినిమాల్లో నటిస్తూ కియారా బిజీ బిజీగా గడుపుతోంది.&nbsp; ఓ వైపు వరుస సినిమాల్లో నటిస్తూన్నే సోషల్‌మీడియాలోనూ ఈ బ్యూటీ (Kiara Advani) చురుగ్గా ఉంటోంది. ఎప్పటికప్పుడు గ్లామర్‌ ఫొటోలను షేర్‌ చేస్తూ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది.&nbsp;
    ఫిబ్రవరి 07 , 2024
    Tollywood: రాకేష్ మాస్టర్‌పై ఇంత చిన్నచూపా?... టాలీవుడ్‌లో కనీసం ఒక్క హీరో అయినా స్పందించారా? మీకంటే వాళ్లే నయం!
    Tollywood: రాకేష్ మాస్టర్‌పై ఇంత చిన్నచూపా?... టాలీవుడ్‌లో కనీసం ఒక్క హీరో అయినా స్పందించారా? మీకంటే వాళ్లే నయం!
    టాలీవుడ్‌లో ఒకప్పటి స్టార్ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్( Rakesh Master) ఆదివారం తుది శ్వాస విడిచారు. చాలా రోజుల నుంచి రాకేష్ మాస్టర్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆదివారం ఉదయం హన్‌-మ్యాన్ అనే సినిమా షూటింగ్‌లో ఆయనకు రక్త విరేచనాలు అయ్యాయి. అక్కడే రాకేష్ మాస్టర్‌ను పరిశీలించిన వైద్యులు ఆరోగ్యం విషమించినట్లు పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్ను మూశారు. అయితే ఆయన మృతిపై ఏ ఒక్క టాలీవుడ్ ప్రముఖుడు సంతాప సందేశం విడుదల చేయలేదు. రామ్‌గోపాల్ వర్మ నుంచి చిరంజీవి వరకు ఏ ఒక్కరు స్పందించలేదు. రాకేష్ మాస్టర్ చిన్న వ్యక్తి ఏమి కాదు.. దాదాపు 1500 సినిమాలకు కొరియోగ్రఫి చేశారు. ప్రభాస్, రామ్‌పొత్తినేని, రవితేజ, వేణు వంటి హీరోలు, శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్, సత్య మాస్టర్ వంటి స్టార్ కొరియోగ్రాఫర్లు కేరీర్ ఆరంభంలో ఆయన నుంచి డ్యాన్స్ మెళకువలు నేర్చుకున్నవారే. రామ్‌పొత్తినేని నటించిన దేవదాసు మూవీకి రాకేష్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. కనీసం ఆయన పనిచేసిన సినిమాలకు చెందిన నిర్మాతలు కానీ, హీరోలు కానీ స్పందిస్తే బాగుండేది. వివాదాలే ఒంటరిని చేశాయి.. యూట్యూబ్ వేదికగా రాకేష్ మాస్టర్ టాలీవుడ్ ఇండస్ట్రీలోని అనేకమంది హీరోలు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రామ్ గోపాల్ వర్మ,&nbsp; ఎన్టీఆర్, శ్రీరెడ్డి, బాలకృష్ణ, చిరంజీవి, మోహన్ బాబు, మంచు లక్ష్మి‌లను లక్ష్యంగా చేసుకుని ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం లేపాయి. అలాగే తన శిష్యులైన శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్లపై పలు ఇంటర్వ్యూల్లో అసభ్య పదజాలంతో దూషించారు. వారికి అవకాశాలు ఇచ్చి అందలం ఎక్కిస్తే.. చివరికి తనను పట్టించుకోలేదని చాలా సార్లు కంటతడి పెట్టుకున్నారు. ముక్కుసూటి తనం, నిజాలను నిర్భయంగా చెప్పడం వంటి లక్షణాలు ఆయన్ను ఇండస్ట్రీ నుంచి దూరం చేశాయి. దీంతో ఆయనకు అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి.&nbsp; పొట్ట కూటి కోసం.. అవకాశాలు తగ్గడంతో పొట్ట కూటి కోసం రాకేష్ మాస్టర్ డ్యాన్స్ స్కూల్ రన్ చేశారు. దీంతో పాటు SRK ENTERTAINMENT అనే యూట్యూబ్ ఛానెల్‌ను ఓపెన్ చేశారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఫాలోవర్లను భారీగా పెంచుకున్నారు. డ్యాన్స్ ఈవెంట్‌లతో పాటు జబర్దస్త్‌ లాంటి కామెడీ షోల్లో నటించారు.&nbsp; ఒకనొకప్పుడు ఖరీదైన కార్లలో కనిపించిన రాకేష్ మాస్టర్.. చనిపోయే నాటికి అద్దె ఇంట్లో ఉండే పరిస్థితికి పడిపోయారు. వ్యక్తిగతంగా ఎలా ఉన్నా.. రాకేష్ మాస్టర్ మాత్రం సేవా దృక్పథం కలవారు. కోవిడ్ సమయంలో తన దగ్గర ఉన్న డబ్బునంత ఖర్చు చేశారు. రోజుకు 200 మందికి అన్నదానం చేశారు. వారికి కావాల్సిన సామాగ్రిని కొనిచ్చారు. ఇంత చేసినా ఏరోజు ఆయన బయటకు చెప్పుకోలేదు. వీళ్లే నయం..! తాను చనిపోతానని ముందే తెలిసిన రాకేష్ మాస్టర్... చివరి రోజులు ఆనందంగా గడపాలని నిర్ణయించుకున్నారు. సోషల్ మీడియా స్టార్లతో ఓ పొగ్రాంను ఏర్పాటు చేశారు. ఆవేశం స్టార్, స్వాతినాయుడు, అగ్గిపెట్ట మచ్చతో కలిసి 'మ్యాన్షన్ హౌత్ విత్ మై హౌస్' అనే షోలో చాలా సంతోషంగా గడిపారు. తమను చేరదీసి ఆశ్రయం కల్పించిన రాకేష్ మాస్టర్ మృతి చెందటంతో వారంతా కన్నీరుమున్నీరయ్యారు. శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ మాత్రం రాకేష్ మాస్టర్ కడసారి చూపుకు నోచుకున్నారు. రాకేష్ మాస్టర్ భౌతిక కాయాన్ని చూసి శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ బోరున విలపించారు. ఏ సంబంధం లేనివారే ఇంత బాధపడితే... ఆయన నుంచి సినిమాలు చేయించుకున్న ప్రొడ్యూసర్లు, హీరోలు, డైరెక్టర్లు కనీసం ఒక్క సంతాప సందేశం కూడ విడుదల చేయకపోవడం నిజంగా విచారకరం. చనిపోయిన వ్యక్తితో ఎన్ని వివాదాలు ఉన్నా, ఎంత శత్రుత్వం ఉన్నా... ఆ వ్యక్తి చనిపోయాడు కదా..! మీ మీ బిజీ షెడ్యూల్స్ వల్ల రాకేష్ మాస్టర్ కడసారి చూపుకు వెళ్లకపోయినా కనీసం మానవత్వం చాటుకోవాల్సిన బాధ్యత ఇండస్ట్రీ పెద్దలకు లేదా? అని సినీ అభిమానులు ప్రశ్నిస్తున్నారు.
    జూన్ 20 , 2023
    Gaami Symbol: ‘గామి’ ట్రైలర్‌లో ఆ మిస్టరీ సింబల్‌ను గమనించారా?.. దాని వెనక ఇంత కథ ఉందా!
    Gaami Symbol: ‘గామి’ ట్రైలర్‌లో ఆ మిస్టరీ సింబల్‌ను గమనించారా?.. దాని వెనక ఇంత కథ ఉందా!
    విష్వక్‌సేన్‌ (Vishwak Sen) కథానాయకుడిగా విద్యాధర్‌ కాగిత (Vidyadhar Kagita) దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘గామి’ (Gaami). వి సెల్యులాయిడ్‌ పతాకంపై కార్తీక్‌ శబరీష్‌ నిర్మించారు. చాందిని చౌదరి కథానాయిక. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌ టాలీవుడ్‌ను ఓ కుదుపు కుదిపింది. హాలీవుడ్‌ స్థాయిలో ఉన్న విజువల్స్‌ ట్రీట్‌ను చూసి ప్రతీ ఒక్కరూ ఆశ్చర్యపోయారు. ఒక్క ట్రైలర్‌తోనే ఈ సినిమా టాలీవుడ్‌ అటెంషన్‌ మెుత్తాన్ని తన వైపునకు తిప్పుకుంది. ఇదిలా ఉంటే గామి ట్రైలర్‌లో చూపించిన ఓ సింబల్‌ ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆ సింబల్‌కు, కథకు ఏమైనా సంబంధం ఉందా? అన్న ప్రశ్న ప్రతీ ఒక్కరిలోనూ మెుదలైంది. ఇంతకి ఆ సింబల్‌ ఏంటి? దానిపై నెటిజన్లు ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు? ఈ కథనంలో చూద్దాం. అసలేంటి ఆ సింబల్‌? గామి ట్రైలర్‌ను గమనిస్తే మూడు ఆకులు ఒకదానికొకటి లింకప్‌ అయ్యి ఉన్న సింబల్‌ చాలా చోట్ల కనిపించింది. ట్రైలర్‌లో మానవ ప్రయోగాలు జరుగుతున్న ప్రాంతంలో ఈ సింబల్‌ను ప్రధానంగా చూడవచ్చు. అక్కడ బందీలుగా ఉన్న వ్యక్తుల శరీరాలపై కూడా ఇదే సింబల్‌ ముద్రించి ఉండటం గమనార్హం. తల వెనక భాగంలో మెడ కింద ఈ సింబల్‌ను మీరు చూడవచ్చు. మరోవైపు విశ్వక్‌ సేన్‌ కూడా హిమాలయ యాత్రకు బయలుదేరినప్పుడు మంచులో ఈ సింబల్‌ను రాసి దాని ముందు పెద్దగా అరవడం ట్రైలర్‌లో చూడవచ్చు. అంటే హ్యూమన్‌ ట్రైల్స్‌కు, అఘోర శంకర్‌ (విష్వక్‌ సేన్‌)కు ఏదో సంబంధం ఉన్నట్లు కనిపిస్తోంది. వాస్తవానికి ఆ తరహా సింబల్‌ను వాడుక భాషలో ‘ట్రైక్యూట్రా’ అంటారు. అటువంటి ఈ సింబల్‌కు తీసుకొని డైరెక్టర్‌ విద్యాధర్‌.. కథలో ఎలాంటి నిర్వచనం చెప్తారో చూడాలి.&nbsp; భూత- భవిష్యత్‌- వర్తమాన కాలంలో కథ సాగుతుందా? ‘గామి’ ట్రైలర్‌ను మరింత నిశితంగా పరిశీలిస్తే ఈ సినిమా.. భూత భవిష్యత్‌ వర్తమాన కాలాల్లో జరిగిన సంఘటనల చుట్టూ తిరుగుతుందని అనిపిస్తోంది. ట్రైలర్‌లో.. 'వాళ్ల గాయాలకు నువ్వు బాధలు మోస్తున్నావ్‌' అంటూ ఓ అఘోరా అనడం ఇందుకు బలం చేకూరుస్తోంది. ఆ మానవ ప్రయోగాలకు హీరో శంకర్‌కు కచ్చితంగా ఏదో సంబంధం ఉన్నట్లు కనిపిస్తోంది. శంకర్‌ గతంలో ఆ హ్యూమన్‌ ట్రైల్స్‌లో బాధితుడి అయి ఉండొచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఆ చెర నుంచి తప్పించుకొని ఆ ప్రయోగాల తాలుకూ స్పర్శ సమస్య ఎదుర్కొంటూ ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు. దీని బట్టి కథ శంకర్‌ బాల్యంలో జరిగిన మానవ ప్రయోగాలు.. తన సమస్య పరిష్కారం కోసం భవిష్యత్‌లో చేస్తున్న హిమాలయ యాత్ర చూపిస్తూ పార్లర్‌గా కథ సాగవచ్చని అంచనా.&nbsp; దేవదాసితో శంకర్‌కు ఉన్న సంబంధం? అఘోరా శంకర్‌కు.. దేవదాసికి మధ్య గల సంబంధంపై ట్రైలర్‌లో ఎలాంటి క్లూస్‌ డైరెక్టర్‌ ఇవ్వలేదు. రెండు పాత్రలను విభిన్న పరిస్థితుల్లో చూపించారు. దేవదాసి బిడ్డను కనడం.. ఆమెను ఊరివారు తరిమేయడం.. ఊరికి అరిష్టమని తెలిసి తిరిగి ఆమె కోసం వెతకడం వంటి దృశ్యాలు ట్రైలర్‌లో కనిపించాయి. ఒకవేళ దేవదాసి కూతురికి హీరోయిన్‌ చాందిని పాత్రకు సంబంధం ఉండే చాన్స్ ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చాందిని పాత్ర అఘోర శంకర్‌కు సాయం చేయడం వెనుక కూడా ఓ బలమైన కారణం ఉండవచ్చని అంటున్నారు. అయితే ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం దొరకాలంటే మార్చి 8 వరకూ ఆగాల్సిందే.&nbsp; గామి టీమ్‌పై రాజమౌళి ప్రశంసలు ఇక ‘గామి’ ట్రైలర్‌పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇప్పటికే పలువురు ప్రముఖులు మూవీ టీమ్‌ కృషిని అభినందిస్తూ వ్యాఖ్యలు చేశారు. తాజాగా దర్శకధీరుడు రాజమౌళి (SS Rajamouli) సైతం దీనిపై ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టారు. ‘కఠోరమైన కృషి ఉంటే అసాధ్యమైన కలలు సాకారమవుతాయి. ‘గామి’ గురించి దర్శకుడు, నిర్మాత ఎంత కష్టపడ్డారో నాతో చెప్పినప్పుడు ఈ మాట గుర్తొచ్చింది. ఇందులోని విజువల్స్‌ చూస్తే నాలుగేళ్ల నుంచి వాళ్లు ఎంత కష్టపడ్డారో అర్థమైంది’ అంటూ చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
    మార్చి 06 , 2024
    Review: ‘బలగం’ ఓ చక్కటి పల్లెటూరి కథాచిత్రం
    Review: ‘బలగం’ ఓ చక్కటి పల్లెటూరి కథాచిత్రం
    కమెడియన్‌ వేణు ఇండస్ట్రీలోకి వచ్చిన చాలా ఏళ్లకు దర్శకుడిగా మారి తీసిన సినిమా ‘బలగం’. తొలి సినిమానే ప్రతిష్టాత్మక నిర్మాత దిల్‌రాజు కాంపౌండ్‌లో తెరకెక్కడం విశేషం.&nbsp; తెలంగాణలో బలగం అంటే బంధుగణం. బంధుత్వాలు, ప్రేమలు, ఆప్యాయతలు, అన్నదమ్ముల ప్రేమలు, పల్లెటూరి మనస్తత్వాలు ఇలా అన్ని రంగరించి ఓ ఎమోషనల్‌ డ్రామాగా వేణు ఈ సినిమాను తెరకెక్కించాడు. మరి తన ప్రయత్నం ఎంతమేరకు విజయవంతమైందో చూద్దాం. చిత్రబృందం నటీనటులు: ప్రియదర్శి, కావ్య కల్యాణ్‌ రామ్‌, సుధాకర్‌ రెడ్డి, రచ్చ రవి, ముర‌ళీధ‌ర్ గౌడ్‌, రూప లక్ష్మి, జయరాం, విజ‌య‌ల‌క్ష్మి, వేణు టిల్లు తదితరులు దర్శకత్వం: వేణు ఎల్దండి సంగీతం: భీమ్స్‌ సిసిరోలియో సినిమాటోగ్రఫీ: ఆచార్య వేణు నిర్మాతలు: హర్షిత్‌ రెడ్డి, హన్షిత https://www.youtube.com/watch?v=8R3Vcy5CaPc కథ: ఓ పల్లెటూరిలో అందరితో సరదాగా ఉండే ఓ ముసలాయన కొమురయ్య( సుధాకర్‌ రెడ్డి). అతడి మనవడు సాయిలు (ప్రియదర్శి). విపరీతంగా అప్పులు చేసిన సాయిలు పెళ్లి చేసుకుని ఆ కట్నం డబ్బులతో అప్పు తీర్చాలనుకుంటాడు. కానీ సరిగ్గా వరపూజ రోజున అతడి తాత కొమురయ్య చనిపోతాడు. దీనికి తోడు చావు ఇంట్లో జరిగిన గొడవతో పెళ్లి కూడా ఆగిపోతుంది. ఇదే సమయంలో 20 ఏళ్ల క్రితమే ఊరి నుంచి వెళ్లిపోయిన కొమురయ్య చిన్న కొడుకు, కూతురు (సాయిలు మేనత్త) తండ్రి మరణవార్త విని ఊరికి వస్తారు.&nbsp; సాయిలు మేనత్త తన కూతురు సంధ్యను తీసుకుని వస్తుంది. సంధ్యను చూసి ఇష్టపడిన సాయిలు, తనకు బాగా ఆస్తి కూడా ఉందని తెలుసుని ఎలాగైనా తనని ప్రేమలో పడేయాలనుకుంటాడు. కానీ కర్మ రోజున కొమురయ్య పిండాన్ని ఏ కాకీ ముట్టుకోదు. అక్కడ సాయిలు మామ,బాబాయ్‌ల మధ్య గొడవ జరుగుతుంది. కాకి ముట్టకపోవడం ఊరికి అరిష్టమని భావించిన గ్రామ పెద్దలు.. కొమురయ్య కోరిక తీరకపోవడం వల్లే ఇలా జరుగుతోందని అనుకుంటారు. 11వ రోజు కాకి ముట్టకపోతే వారిని ఊరి నుంచి వెలివేస్తామని హెచ్చరిస్తారు. ఆ తర్వాత జరిగే నాటకీయ పరిణామాలు, తాత చావును సాయిలు ఎలా వాడుకున్నాడు. చివరికి ఏం జరిగింది అనేదే కథ. ఎలా ఉంది:&nbsp; చక్కటి తెలంగాణ పల్లెటూరి వాతావరణంలో తెరకెక్కిన సినిమా ‘బలగం’. పల్లెటూరి యాస, సంస్కృతి, అమాయకత్వం, మొండితనం, మూర్ఖత్వం ఇలా అన్ని కోణాలను దర్శకుడు వేణు చక్కగా తెరకెక్కించాడు. తొలి సినిమానే అయినా అలా ఎక్కడా అనిపించదు. ప్రతి పాత్రా చాలా సహజంగా ఉంది. సినిమా చూస్తున్నంత సేపు మనమే ఆ ఊరిలో ఉండి సాయిలును చూస్తున్నట్లు ఉంటుంది. భావోద్వేగాలు, కామెడీ చాలా సహజంగా ఉంటాయి. తెలంగాణ పల్లెటూరిలో ఓ వ్యక్తి చనిపోయినప్పుడు ఉండే పరిస్థితిని చాలా సహజంగా తెరకెక్కించాడు. తాత చావు, ఓ కాకి చుట్టూ కథ నడిపిస్తూ.. కామెడీ పండిస్తూ ప్రేక్షకుడిని ఆకట్టుకుంటాడు. ఫస్టాఫ్‌ పాత్రల పరిచయం, కామెడీ ఉంటుంది. కొన్ని సీన్లు సాగదీతగా అనిపిస్తాయి. సెకండాఫ్‌లో చివరి 15 నిమిషాల సినిమా కంటతడి పెట్టిస్తుంది. మన ఇంట్లో ఉండే తాత, నాయినమ్మ, అమ్మమ్మలను గుర్తుచేసేలా ఉంటుంది. భావోద్వేగాలు ఎంత చక్కగా పండాయో, కామెడీ కూడా అంతే చక్కగా పండింది.&nbsp; నటీ నటులు: సాయిలు పాత్రలో ప్రియదర్శి జీవించాడనే చెప్పాలి. నిజంగా మన ఇంటి పక్క సాయిలును చూసినట్టే ఉంటుంది. హీరోయిన్‌గా కావ్య బాగా నటించింది. సుధాకర్‌ రెడ్డి పాత్ర కాసేపే ఉన్నా చాలా బాగా చేశారు. రచ్చ రవి తన కామెడీతో మెప్పించాడు. ఇతర నటీ నటులు కూడా తమ పరిధిమేరకు నటించారు. సాంకేతిక పనితీరు: దర్శకుడు వేణు తొలి సినిమా అయినా చాలా చక్కగా తెరకెక్కించాడు. స్టార్‌ క్యాస్ట్‌ లేకపోయినా సినిమాలో ఉన్న నటులంతా సహజంగా నటించారు. కథనం విషయంలో కాస్త నెమ్మదిగా అనిపిస్తుంది. భీమ్స్‌ సిసిరోలియే సంగీతం సినిమాకు బాగా ప్లస్‌ అయింది. ఆచార్య వేణు సినిమాటోగ్రఫీ మెచ్చుకోవాలి. పల్లెటూరి వాతావరణాన్ని కళ్లకు కట్టినట్లు చూపించాడు. సినిమా చాలా సహజంగా కనిపించడానికి వేణు సినిమాటోగ్రఫీ చాలా సాయపడింది. ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది కాసర్ల శ్యామ్‌ సాహిత్యం గురించి. చివరి 15 నిమిషాలు చక్కటి ఎమోషన్స్ పండాయంటే అందుకు కారణంగా చివర్లో వచ్చే బుర్ర కథ. దీనికి కాసర్ల శ్యామ్‌ రాసిన లిరిక్స్‌ నిజంగా అద్భుతంగా ఉంటాయి. ప్రొడక్షన్ పరంగా సినిమాకు ఏ లోటు లేదు.&nbsp; బలాలు కథ కథా నేపథ్యం భావోద్వేగాలు కామెడీ పాటల్లో సాహిత్యం బలహీనతలు కొన్ని చోట్ల సాగదీత సీన్లు స్టార్‌ క్యాస్ట్‌ లేకపోవడం ఒక్కమాటలో చక్కటి భావోద్వేగాలతో ఉండే పల్లెటూరి కుటుంబ కథా చిత్రం బలగం. ఈ వీకెండ్‌కి ఫ్యామిలీతో కలిసి సినిమాకు వెళ్లాలనుకుంటే ‘బలగం’ మిస్‌ కాకూడని సినిమా. రేటింగ్‌ 3/5
    మార్చి 03 , 2023
    Pushpa 2 The Rule: పుష్ప2 నుంచి బిగ్ అప్‌డేట్.. ఆ బాలీవుడ్ బ్యూటీతో ఐటెం సాంగ్!
    Pushpa 2 The Rule: పుష్ప2 నుంచి బిగ్ అప్‌డేట్.. ఆ బాలీవుడ్ బ్యూటీతో ఐటెం సాంగ్!
    ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ (Allu Arjun) హీరోగా సుకుమార్‌ (Sukumar) దర్శకత్వంలో వచ్చిన బ్లాక్‌ బాస్టర్‌ చిత్రం ‘పుష్ప’ (Pushpa). పాన్‌ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. అంతేకాకుండా బన్నీని జాతీయ స్థాయి నటుడుగా నిలబెట్టింది. ఈ సినిమాకు గాను జాతీయ ఉత్తమ నటుడి పురస్కారాన్ని అల్లు అర్జున్‌ అందుకున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి సీక్వెల్‌ రూపొందుతోంది. ‘పుష్ప 2’ పేరుతో ఇది రాబోతోంది. టైటిల్‌ కింద ‘ది రూల్‌’ అని క్యాప్షన్‌ ఇచ్చారు. అయితే ఈ సీక్వెల్‌కు సంబంధించి క్రేజీ అప్‌డేట్‌ బయటకొచ్చింది. ప్రస్తుతం ఆ వార్త సోషల్‌ మీడియాను షేక్ చేస్తోంది.&nbsp; బాలీవుడ్‌ బ్యూటీతో ఐటెం సాంగ్‌ ‘పుష్ప’ మూవీ పాటలు ఎంత పెద్ద హిట్‌ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా సినిమాలోని ‘ఊ అంటావా మావా.. ఉ.. ఉ.. అంటావా’ అనే ఐటెం సాంగ్‌ దేశవ్యాప్తంగా మార్మోగింది. ఈ పాటలో సమంత తన అందంతో మెస్మరైజ్‌ చేసింది. బన్నీ-సామ్‌ కలిసి వేసిన స్టెప్స్‌ యువతరాన్ని ఉర్రూతలూగించాయి. దీంతో ‘పుష్ప2’ లోనూ ఆ తరహా ఐటెం సాంగ్ ఉండాలని డైరెక్టర్‌ సుకుమార్‌ ప్లాన్‌ చేస్తున్నారు. ఈ పాట కోసం ఇప్పటికే ఎంతో మంది హీరోయిన్‌ల పేర్లు బయటకు వచ్చినప్పటికి చివరకు ఈ అవకాశం బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దిశ పటానీ (Disha Patani)కి దక్కింది. అంతేకాదు ఈ వారంలోనే దిశాతో ఐటమ్‌సాంగ్‌ చిత్రీకరించనున్నట్లు సమాచారం.&nbsp; శరవేగంగా షూటింగ్‌ ఆగస్టు 15న 'పుష్ప 2'ను రిలీజ్‌ చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. అందుకు అనుగుణంగా శరవేగంగా షూటింగ్‌ జరుపుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ 'రామోజీ ఫిల్మ్‌ సిటీ'లో చురుగ్గా సాగుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే నిన్న (ఫిబ్రవరి 12) ‘పుష్ప2’ హీరోయిన్‌ రష్మిక మందన్న సెట్‌లో డైరెక్టర్‌ సుకుమార్‌ను క్యాప్చర్‌ చేసింది. ఓ సింహం బొమ్మపై సుకుమార్ నవ్వుతూ కనిపించారు. ఈ ఫొటోను షేర్‌ చేసిన చిత్ర యూనిట్‌.. శ్రీవల్లి (రష్మిక) ఈ ఫోటో తీసినట్లు స్పష్టం చేశారు. చకా చకా షూటింగ్ పనులు జరుగుతున్నట్లు చెప్పారు.&nbsp; https://twitter.com/PushpaMovie/status/1756931867146907757? ఒకే ఒక్క మార్పు పుష్ప చిత్రం సౌత్‌లో కంటే.. నార్త్‌లోనే ఎక్కువ అభిమానుల్ని సంపాదించుకుంది. దాంతో ‘పుష్ప 2’ పై విప‌రీత‌మైన అంచ‌నాలు పెరిగాయి. పెరిగిన అంచ‌నాల్ని దృష్టిలో ఉంచుకొని, స్క్రిప్టు ప‌రంగా సుకుమార్ అన్ని ర‌కాల జాగ్ర‌త్త‌లూ తీసుకున్నారు. ఈ క్రమంలోనే ‘పుష్ప 2’లో కొత్త స్టార్లు ద‌ర్శ‌న‌మిస్తార‌ని గత కొంత కాలం నుంచి ప్రచారం జరుగుతోంది. అయితే అందులో ఏమాత్రం నిజం లేదని సమాచారం. ‘పుష్ప 1’లో ఉన్న‌వారే.. పార్ట్ 2లోనూ క‌నిపిస్తారట. ఒక్క జ‌గ‌ప‌తిబాబు పాత్ర మాత్రమే కొత్తగా ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలిసింది. కాగా, ఈ చిత్రంలో బన్నీతో పాటు సునీల్‌, అనసూయ, ఫహద్‌ ఫాసిల్‌ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.&nbsp; పుష్ప2 డైలాగ్ లీక్‌..! ఇక పుష్ప2 నుంచి రిలీజైన ఓ పోస్టర్‌లో బన్నీ.. గంగమ్మ జాతర గెటప్‌లో కనిపిస్తాడు. ఈ పోస్టర్‌కు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన వచ్చింది. ఇకపోతే తాజాగా ఈ మూవీ నుంచి ఓ డైలాగ్ లీకైదంటూ నెట్టింట వార్తలు వచ్చాయి. మంగళం శీను (సునీల్‌)కు పుష్ప(బన్నీ) వార్నింగ్ ఇచ్చే క్రమంలో ఈ డైలాగ్‌ ఉంటుందని అంటున్నారు. అదేంటంటే.. ‘చూడు శీనప్ప పుష్ప గుండెల్లో గుండు దింపాలంటే గన్ను ఒకటే పట్టుకుంటే సరిపోదప్ప దాన్ని పట్టుకున్నోడి గుండె కూడా గన్నులా ఉండాలి’ అని సునీల్‌తో బన్నీ అంటాడట. అయితే ఈ ప్రచారంపై చిత్ర యూనిట్‌ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.&nbsp; లీకుల బెడద..! 'పుష్ప 2' చిత్రాన్ని లీకుల బెడద వెంటాడుతోంది. ఇటీవల షూటింగ్ స్పాట్‌ నుంచి అల్లు అర్జున్‌ చీరలో ఉన్న ఫొటో లీక్‌ అయ్యింది. దీంతో సుకుమార్‌ యూనిట్‌పై సీరియస్ అయ్యాడట. తాజాగా షూటింగ్‌ స్పాట్‌ నుంచి రావు రమేష్‌ ‘ప్రజా చైతన్య పార్టీ’ అనే ఫ్లెక్సీలు కూడా బయటకు వచ్చాయి. ఈ లీకులను ఆపేందుకు సుకుమార్‌ స్వయంగా రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. మున్ముందు మూవీకి సంబంధించిన మరిన్ని ముఖ్యమైన విషయాలు లీక్‌ కాకుండా అడ్డుకోవాలని యూనిట్‌ను హెచ్చరించినట్లు సమాచారం.&nbsp; https://twitter.com/SrikanthAnu2/status/1751986145318314415
    ఫిబ్రవరి 13 , 2024
    Telugu Heroines: టాలీవుడ్‌లో తెలుగు హీరోయిన్ల హవా…! ఆ గోల్డెన్‌ డేస్‌ తిరిగి వచ్చినట్లేనా?&nbsp;
    Telugu Heroines: టాలీవుడ్‌లో తెలుగు హీరోయిన్ల హవా…! ఆ గోల్డెన్‌ డేస్‌ తిరిగి వచ్చినట్లేనా?&nbsp;
    ఒకప్పుడు టాలీవుడ్‌ హీరోయిన్స్‌ అనగానే.. తెలుగు భాష, సంప్రదాయం ఉట్టిపడే సావిత్రి, జమున, శారద, జయసుధ లాంటి వారు గుర్తుకు వచ్చేవారు. రాను రాను టాలీవుడ్‌లో పరిస్థితులు మారిపోయాయి. పర భాష ముద్దు గుమ్మలే ప్రేక్షకులను ఆకర్షిస్తారనే నమ్మకం మన టాలీవుడ్ డైరెక్టర్లలో పడిపోయింది. దీంతో నిన్నటి దాకా కాజల్‌, త్రిష, సమంత.. ప్రస్తుతం రష్మిక, పూజా హెగ్డే, మృణాల్‌ ఠాకూర్‌ వంటి ఇతర భాషల నాయికలు ఇక్కడ స్టార్‌ హీరోయిన్లుగా చెలామణి అవుతున్నారు. అయితే&nbsp; గత కొద్ది కాలంగా&nbsp; ఈ పరిస్థితుల్లో మార్పులు వస్తున్నట్లు కనిపిస్తోంది. తెలుగు అమ్మాయిల హవా ఇండస్ట్రీలో క్రమంగా పెరుగుతోంది. బడా హీరోలవి మినాహా.. రీసెంట్‌గా వస్తున్న చిన్న సినిమాలను పరిశీలిస్తే ఈ విషయం అవగతమవుతుంది. స్టార్‌ హీరోయిన్ల రేసులోకి దూసుకొస్తున్న తెలుగు భామలు ఎవరో ఇప్పుడు చూద్దాం.&nbsp; గౌరి ప్రియ (Gouri Priya) టాలీవుడ్‌లో ఇటీవల వచ్చి యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌లో ‘మ్యాడ్‌’ (MAD) చిత్రంలో హీరోయిన్‌గా చేసి గౌరి ప్రియ అందరి దృష్టిని ఆకర్షించింది. మంచి నటన, అభినయంతో యూత్‌ను కట్టిపడేసింది. రీసెంట్‌గా తమిళ హీరో మణికందన్‌ పక్కన ‘లవర్‌’ సినిమాలో నటించి కోలీవుడ్‌లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంది.&nbsp; https://www.youtube.com/watch?v=8dwrE0OCq40 ఆనందిని (Anandhi) వరంగల్‌కు చెందిన ఆనంది.. 2012లో వచ్చిన 'ఈ రోజుల్లో' (Ee Rojullo) సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత చిన్న పాత్రలు చేసుకుంటూ వెళ్లిన ఈ భామ.. తన ఫోకస్‌ను తమిళ మూవీస్‌పై వైపు మళ్లించింది. అక్కడ యంగ్‌ హీరోల సరసన హీరోయిన్‌గా చేసి అందరి ప్రశంసలు అందుకుంది. తెలుగులో జాంబి రెడ్డి, శ్రీదేవి సోడా సెంటర్‌, ఇట్లు మారేడుమిల్లి ప్రజానికం చిత్రాల్లో ఈ భామ మెయిన్‌ హీరోగా చేసింది.&nbsp; చాందిని చౌదరి (Chandini Chowdary) ఏపీలోని విశాఖపట్నానికి చెందిన చాందిని చౌదరి.. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన 'లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌' (Life Is Beautiful) మూవీతో ఇండస్ట్రీకి పరిచయమైంది. ‘కుందనపు బొమ్మ’, ‘హౌరా బ్రిడ్జ్‌’, ‘మను’ వంటి చిన్న చిత్రాల్లో హీరోయిన్‌గా చేసింది. 'కలర్‌ ఫొటో' (Colour Photo) మూవీతో ఈ అమ్మడి క్రేజ్‌ అమాంతం పెరిగిపోయింది. రీసెంట్‌గా 'గామి' (Gaami)లో విష్వక్‌ సేన్‌ సరసన నటించే స్థాయికి చాందిని ఎదిగింది. ఈ భామ సినిమాలతో పాటు 'మస్తీస్‌', 'గాలివాన', 'ఝాన్సీ' వంటి వెబ్‌సిరీస్‌లు సైతం చేసింది.&nbsp; వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya) ‘బేబీ’ (Baby) సినిమాతో ఒక్కసారిగా ఫేమ్‌లోకి వచ్చిన తెలుగు నటి ‘వైష్ణవి చైతన్య’. అంతకుముందు వరకూ యూట్యూబ్ సిరీస్‌లకు మాత్రమే పరిమితమైన ఈ సుందరి.. ‘సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌’ (Software Developer) సిరీస్‌తో ఒక్కసారిగా యూత్‌లో క్రేజీ సంపాదించుకుంది. తద్వారా ‘బేబీ’ సినిమాలో అవకాశం దక్కించుకుంది. ఈ సినిమాలో మెస్మరైజింగ్‌ నటనతో కుర్రకారు హృదయాలను దోచేసింది. ప్రస్తుతం వైష్ణవి.. బేబీ ఫేమ్‌ ఆనంద్‌ దేవరకొండతోనే మరో చిత్రంలో నటిస్తోంది. అలాగే దిల్‌ రాజు ప్రొడక్షన్‌లో ఓ సినిమా చేసేందుకు అంగీకరించింది.&nbsp; https://www.youtube.com/watch?v=wz5BIbhqhTI దివ్య శ్రీపాద (Divya Sripada) టాలీవుడ్‌లో తమ క్రేజ్‌ను క్రమంగా పెంచుకుంటున్న తెలుగు అమ్మాయిల్లో ‘దివ్య శ్రీపాద’ ఒకరు. రీసెంట్‌గా ‘సుందరం మాస్టర్‌’ (Sundaram Master) సినిమా ద్వారా ఈ భామ హీరోయిన్‌గా మారిపోయింది. అంతకుముందు ‘డియర్‌ కామ్రేడ్‌’, ‘కలర్ ఫొటో’, ‘మిస్ ఇండియా’, ‘జాతి రత్నాలు’, ‘ఎఫ్‌ 3’, ‘యశోద’, ‘పంచతంత్రం’ వంటి ప్రముఖ చిత్రాల్లో సైడ్‌ పాత్రలకే పరిమితమైంది. 'సుందరం మాస్టర్‌'లో చక్కటి నటన కనబరిచి అందరి దృష్టిని ఆకర్షించడంతో ఈ భామకు హీరోయిన్‌గా మరిన్ని అవకాశాలు దక్కే పరిస్థితులు కనిపిస్తున్నాయి. శోభిత ధూలిపాళ్ల (Sobhita Dhulipala) ఏపీలోని తెనాలిలో జన్మించిన శోభిత దూళిపాళ్ల.. ‘రామన్‌ రాఘవ్‌ 2.0’ అనే హిందీ చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయమైంది. 2018లో వచ్చిన 'గూఢచారి'తో తెలుగులో అడుగుపెట్టిన ఈ భామ.. తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఆ తర్వాత కురుప్‌, మేజర్‌, పొన్నిసెల్వన్‌ వంటి హిట్‌ చిత్రాల్లో మెరిసింది. హాలీవుడ్‌ చిత్రం 'మంకీ మ్యాన్‌'లోనూ శోభిత నటించడం విశేషం. ప్రస్తుతం హిందీలో 'సితార' మూవీలో ఈ భామ చేస్తోంది. తెలుగు ఇండస్ట్రీకి చెందిన హాలీవుడ్‌, బాలీవుడ్‌ స్థాయిలో చిత్రాలు చేస్తూ స్థానిక నటీమణులకు ఆదర్శంగా నిలుస్తోంది.&nbsp; రితు వర్మ (Ritu Varma) హైదరాబాద్‌కు చెందిన ఈ సుందరి.. 'బాద్‌ షా' (Badshah) సినిమాలో కాజల్‌ ఫ్రెండ్‌ పాత్రలో తెరంగేట్రం చేసింది. 2015లో వచ్చిన 'పెళ్లి చూపులు' (Pelli Choopulu) హీరోయిన్‌గా మారిన రీతు వర్మ.. తొలి సినిమాతోనే సాలిడ్ హిట్‌ అందుకుంది. ‘కేశవ’, ‘నిన్నిలా నిన్నిలా’, ‘టక్ జగదీష్‌’, ‘వరుడు కావలెను’, ‘ఒకే ఒక జీవితం’.. రీసెంట్‌గా ‘మార్క్‌ ఆంటోనీ’ సినిమాల్లో హీరోయిన్‌గా చేసి స్టార్‌ నటిగా గుర్తింపు పొందింది. ప్రస్తుతం ఈ భామ.. విక్రమ్‌ సరనస 'ధ్రువ నక్షత్రం'లోనూ నటిస్తుండటం విశేషం.&nbsp; https://www.youtube.com/watch?v=4hNEsshEeN8 స్వాతి రెడ్డి (Swathi Reddy) వైజాగ్‌కు చెందిన స్వాతి.. కృష్ణ వంశీ దర్శకత్వంలో వచ్చిన 'డేంజర్‌' (2005) తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత తమిళంలో 'సుబ్రహ్మణ్యపురం' చిత్రంలో హీరోయిన్‌గా చేసి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా 'అనంతపురం' పేరుతో తెలుగులో రిలీజ్ కావడం గమనార్హం. ఆ తర్వాత టాలీవుడ్‌లో వరుసగా అష్టాచమ్మా,&nbsp; గోల్కొండ స్కూల్‌, స్వామి రారా, కార్తికేయ, త్రిపుర, పంచతంత్రం చిత్రాల్లో స్వాతి నటించింది. రీసెంట్‌గా 'మంత్‌ ఆఫ్‌ మధు'తో ప్రేక్షకులను పలకరించింది.&nbsp; https://www.youtube.com/watch?v=BCwsSk_KKrE డింపుల్‌ హయాతి (Dimple Hayathi) ఏపీలోని విజయవాడలో జన్మించిన నటి డింపుల్‌ హయాతి.. హైదరాబాద్‌లో పెరిగింది. 2017లో వచ్చిన 'గల్ఫ్‌' సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఆ సినిమా పెద్దగా విజయం సాధించనప్పటికీ నటన పరంగా డింపుల్‌కు మంచి మార్కులే పడ్డాయి. దీంతో తెలుగులో ఆమెకు అవకాశాలు దక్కాయి. ‘అభినేత్రి 2’, ‘యురేఖ’, హిందీలో ‘అత్రంగి రే’, విశాల్‌తో ‘సామాన్యుడు’, రవితేజతో ‘ఖిలాడీ’, గోపిచంద్‌తో ‘రామబాణం’ చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం ఈ భామ చేతిలో సినిమాలు లేనప్పటికీ సరైన హిట్‌ తగిలితే డింపుల్ ఎవరూ ఆపలేరని ఇండస్ట్రీలో టాక్ ఉంది.&nbsp; https://twitter.com/CallBoyforwomen/status/1693578673595793606 శివాని నగరం (Shivani Nagaram) ఇటీవల టాలీవుడ్‌లో తళుక్కుమన్న కొత్త హీరోయిన్లలో శివాని నగరం ఒకరు. యంగ్‌ హీరో సుహాస్‌ ప్రధాన పాత్ర పోషించిన ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ సినిమాలో శివాని హీరోయిన్‌గా చేసింది. అచ్చమైన పల్లెటూరి అమ్మాయి పాత్రలో మెప్పించింది. ఈ మూవీ కూడా మంచి విజయాన్ని అందుకోవడంతో శివానికి తెలుగులో మంచి అవకాశాలు దక్కే పరిస్థితులు కనిపిస్తాయి. మానస చౌదరి (Maanasa Choudhary) ఏపీలోని చిత్తూరు జిల్లా పుత్తూరుకు చెందిన మానన చౌదరి.. రీసెంట్‌గా ‘బబుల్‌గమ్‌’ సినిమాతో టాలీవుడ్‌లో తళుక్కుమంది. రాజీవ్ - సుమ తనయుడు రోషన్‌.. హీరోగా నటించిన ఈ మూవీలో తన అందచందాలతో ఆకట్టుకుంది. ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద విఫలమైనప్పటికీ తనలో మంచి స్కిల్స్‌ ఉన్నాయన్న సందేశాన్ని మానస టాలీవుడ్‌ దర్శక నిర్మాతలకు పంపింది. ఒక హిట్‌ పడితే తెలుగులో ఈ భామకు తిరుగుండదని చెప్పవచ్చు.&nbsp; https://twitter.com/i/status/1762802318934950146 అంజలి (Anjali) తూర్పు గోదావరి జిల్లా రాజోల్‌లో జన్మించిన నటి అంజలి.. ఓ దశలో టాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌ స్టేటస్‌ను అందుకుంది. 2006లో 'ఫొటో' అనే తెలుగు చిత్రంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అంజలి.. ఆ తర్వాత తమిళ ఇండస్ట్రీకి వెళ్లిపోయింది. అక్కడ వరుస సినిమాల్లో నటించి కోలివుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లే చెట్టు' సినిమాతో మళ్లీ టాలీవుడ్‌లో అడుగుపెట్టిన ఈ భామ.. బలుపు, మసాలా, గీతాంజలి, డిక్టేటర్‌, సరైనోడు, వకీల్‌సాబ్‌, మాచర్ల నియోజకవర్గం చిత్రాల్లో మెరిసింది. ప్రస్తుతం తెలుగులో గీతాంజలి మళ్లీ వచ్చింది, గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి, గేమ్‌ ఛేంజర్‌లోనూ నటిస్తోంది.&nbsp; https://www.youtube.com/watch?v=3lowhNvIWK0
    మార్చి 06 , 2024
    అఖిల్ (Akhil Akkineni) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
    అఖిల్ (Akhil Akkineni) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
    అఖిల్ అక్కినేని, నాగార్జున నటవారసుడిగా ఏడాది వయసులోనే సిసింద్రీ(1995) చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. ఆ తర్వాత అఖిల్ బాల నటుడిగా మరేతర చిత్రంలో కనిపించలేదు. అఖిల్ సినిమాల్లోకి రాకముందు ప్రోఫెషనల్‌ స్థాయిలో క్రికెట్ ఆడేవాడు. క్రికెట్‌లో అఖిల్‌కు మంచి ప్రావీణ్యం ఉంది. మిస్టర్ మజ్ను, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్, హలో వంటి చిత్రాల సక్సెస్ స్టార్ డం అందించాయి. తనదైన స్లాంగ్, మెనరిజంతో&nbsp; స్టైలీష్ డ్యాన్స్‌తో యూత్ ప్రేక్షకులకు అఖిల్ దగ్గరయ్యాడు. తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో లవర్‌ బాయ్‌గా గుర్తింపు పొందాడు. మరి యూత్‌ను ఆకట్టుకుంటున్న&nbsp; అఖిల్ గురించి చాలా మందికి తెలియని కొన్ని విషయాలు ఇప్పుడు చూద్దాం. అఖిల్ అక్కినేని ఎవరు? అఖిల్ అక్కినేని ప్రముఖ నటుడు నాగార్జున- అమల దంపతుల కొడుకు, టాలీవుడ్‌లో దిగ్గజ నటుడు నాగేశ్వరరావు మనవడు అఖిల్ ఎత్తు ఎంత? 5 అడుగుల 7 అంగుళాలు&nbsp; అఖిల్ ఎక్కడ పుట్టారు? కాలిఫోర్నియా, అమెరికా అఖిల్ పుట్టిన తేదీ ఎప్పుడు? 1994 ఏప్రిల్ 08 అఖిల్ వివాహం అయిందా? లేదు ఇంకా జరగలేదు అఖిల్‌కి ఇష్టమైన రంగు? బ్లాక్ అఖిల్ అభిరుచులు? డ్యాన్స్ చేయడం, సినిమాలు చూడటం అఖిల్‌కు ఇష్టమైన ఆహారం? ఫిష్ ఫ్రై అఖిల్&nbsp; అభిమాన నటుడు? నాగార్జున, పవన్ కళ్యాణ్ అఖిల్‌కు స్టార్ డం అందించిన సినిమాలు? మిస్టర్ మజ్ను, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ అఖిల్ ఏం చదివాడు? BBA&nbsp; అఖిల్ ఎన్ని సినిమాల్లో నటించాడు? 2024 వరకు 8 సినిమాల్లో నటించాడు https://www.youtube.com/watch?v=-Qq6ff-0uQM అఖిల్ సినిమాకు ఎంత తీసుకుంటారు? &nbsp;ఒక్కో సినిమాకి దాదాపు రూ.4- రూ.5కోట్లు తీసుకుంటున్నాడు. అఖిల్ ఎన్ని అవార్డులు గెలుచుకున్నాడు? ఒక ఫిల్మ్‌ఫెర్, ఒక సైమా అవర్డును పొందాడు.
    మార్చి 21 , 2024

    @2021 KTree