• TFIDB EN
  • ఆహ
    UATelugu2h 26m
    ఇంద్రజిత్‌ సుకుమారన్‌, మనోజ్‌ కె. జయన్‌, అమిత్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'ఆహ'. మలయాళ స్పోర్ట్స్‌ డ్రామాగా రూపొందిన ఈ చిత్రానికి బిబిన్‌ పాల్‌ దర్శకత్వం వహించారు. వేర్వేరు పనులు చేస్తూ జీవనం సాగించే ఓ గ్రామానికి చెందిన యువకులు ఓ ఆట ద్వారా ఎలా క్రేజ్‌ సంపాదించారు అన్నది ఈ సినిమా కథాంశం.
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌Ahaఫ్రమ్‌
    రివ్యూస్
    How was the movie?

    తారాగణం
    ఇంద్రజిత్ సుకుమారన్
    మనోజ్ కె. జయన్
    అమిత్ చాకలక్కల్
    అశ్విన్ కె. కుమార్
    సంతి బాలచంద్రన్
    జయశంకర్ కరిముట్టం
    సిద్ధార్థ శివ
    సిబ్బంది
    బిబిన్ పాల్ శామ్యూల్దర్శకుడు
    ప్రేమ్ అబ్రహంనిర్మాత
    తోబిత్ చిరయాత్రచయిత
    షియాద్ కబీర్సంగీతకారుడు
    రాహుల్ బాలచంద్రన్సినిమాటోగ్రాఫర్
    కథనాలు
    కనీసం ఆహారం తీసుకోలేని స్థితిలో ఇలియానా పరిస్థితి.. ఏమైందంటే?
    కనీసం ఆహారం తీసుకోలేని స్థితిలో ఇలియానా పరిస్థితి.. ఏమైందంటే?
    ]ఇలియాన త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు
    ఫిబ్రవరి 11 , 2023
    OTT Suggestion: ఆహాలో ఈ బోల్డ్‌ మూవీని చూసేందుకు పోటెత్తుతున్నారు.. బెడ్‌ రూం సీన్లతో రచ్చ!
    OTT Suggestion: ఆహాలో ఈ బోల్డ్‌ మూవీని చూసేందుకు పోటెత్తుతున్నారు.. బెడ్‌ రూం సీన్లతో రచ్చ!
    సాధారణంగా బోల్డ్‌ కంటెంట్‌ చిత్రాలకు సెపరేట్ ఫ్యాన్‌ బేస్ ఉంటుంది. ఆ తరహా చిత్రాలను చూసేందుకు వారు విపరీతమైన ఆసక్తిని కనబరుస్తుంటారు. అయితే ఇతర ఇండస్ట్రీలతో పోలిస్తే ‘A’ సర్టిఫికేట్‌ చిత్రాలు టాలీవుడ్‌లో రావడం చాలా అరుదు. గతంలో వచ్చిన అరకొర చిత్రాలను కూడా గుట్టుచప్పుడు కాకుండా వెళ్లి థియేటర్లలో చూసి వచ్చేవారు. ప్రస్తుతం ఓటీటీ యుగం నడుస్తుండటంతో ఆ సమస్యకు చెక్‌ పడింది. ప్రస్తుతం ఎలాంటి కంటెంట్‌ అయినా నేరుగా ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ నేపథ్యంలో తెలుగులో వచ్చిన ఓ బోల్డ్‌ చిత్రం ప్రస్తుతం ఓటీటీలో హల్‌చల్‌ చేస్తోంది. ఆ చిత్రాన్ని వీక్షించేందుకు ఓటీటీ ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు. ఇంతకీ ఆ చిత్రం ఏంటి? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది? ఇప్పుడు తెలుసుకుందాం.  ఆ సినిమా పేరేంటి? ఆదర్శ్ బాలకృష్ణ, అక్షర గౌడ, కమల్ కామరాజు, పూజ జవేరి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన బోల్డ్ కంటెంట్ మూవీ ‘మిక్సప్’ (Mixup). ఆకాష్ బిక్కి దర్శకత్వం వహించిన ఈ చిత్రం నేరుగా ఓటీటీలో విడుదలైంది. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో.. మార్చి 15న ఈ సినిమా రిలీజైంది. అప్పటి నుంచి ఈ సినిమా నెంబర్‌ వన్‌ స్థానంలో దూసుకెళ్తోంది. పేరుకి ‘A’ సర్టిఫికేట్ అయినా.. ఈ మూవీ టేకింగ్‌, మెసేజ్‌ నేపథ్యం ఆడియన్స్‌ బాగా కనెక్ట్ అవుతోంది. అందుకే ఈ సినిమాను చూసేందుకు ఓటీటీ ప్రేక్షకులు విపరీతంగా ఆసక్తి కనబరుస్తున్నారు.  ఈ మూవీ కాన్సెప్ట్ ఏంటి? దర్శకుడు ఆకాష్‌ బిక్కి.. ఈ సినిమా కోసం తీసుకున్న కథ నేటి సమాజాన్ని అద్దం పడుతోంది. ఇందులో హైలెట్‌ చేసిన శృంగార కాన్సెప్ట్స్‌ కూడా యదార్థ సంఘటనలకు దగ్గరగా ఉన్నాయి. ఈ మూవీ కాన్సెప్ట్ ఏంటంటే.. విపరీతమైన శృంగార కోరికలు ఉన్న భార్య ఉంటే అవతలి వాళ్ల పరిస్థితి ఎలా ఉంటుంది? పెళ్లి అంటే కేవలం పడక సుఖం మాత్రమే అనుకునే భర్త ఉంటే ఆ భార్య పరిస్థితి ఏంటి? కట్టుకున్న వాళ్లు వేరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుంటే ఆ భాగస్వామి మానసిక స్థితి ఎలా ఉంటుంది? అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కించాడు దర్శకుడు అకాశ్ బిక్కి .  మిక్సప్‌ కథేంటి? అభయ్ (కమల్ కామరాజు), నిక్కీ (అక్షర గౌడ).. సాహో (ఆదర్శ్ బాలకృష్ణ), మైథిలి (పూజ ఝవేరి) భార్య భర్తలు. ఈ రెండు జంటలు సెక్సువల్ లైఫ్ దగ్గర విబేధాలు వచ్చి విడిపోదాం అనుకుంటారు. మొదటి జంటలో నిక్కీకి, రెండు జంటలో సాహోకి సెక్సువల్ లైఫ్‌పై ఎక్కువ ఇంట్రెస్ట్. అయితే వారి పార్ట్నర్స్ అయిన అభయ్, మైథిలి.. లస్ట్ కంటే ప్రేమ లైఫ్‌ని కోరుకుంటూ ఉంటారు. దీంతో రెండు జంటల్లో విబేధాలు వస్తాయి. విడిపోవాలని నిర్ణయం తీసుకుంటారు. అయితే ఓ డాక్టర్‌ సూచన మేరకు ఈ రెండు జంటలు కామన్ ఫ్రెండ్ ద్వారా ఒక రిసార్ట్‌కి వెళ్తాయి. అక్కడ ఒకరికి ఒకరు పరిచయాలు కావడం.. సెక్సువల్ లైఫ్‌పై ఎక్కువ ఇంటరెస్ట్ ఉన్న సాహో, నిక్కీ బాగా కనెక్ట్‌ అవడం జరుగుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? ఈ రెండు జంటలు చివరికి కలిసున్నాయా? విడిపోయాయా? అన్నది కథ. 
    మార్చి 25 , 2024
    Annapurna Photo Studio Review: ఆహా.. అచ్చమైన పల్లెటూరి ప్రేమ కథ.. మూవీ ఎలా ఉందంటే ?
    Annapurna Photo Studio Review: ఆహా.. అచ్చమైన పల్లెటూరి ప్రేమ కథ.. మూవీ ఎలా ఉందంటే ?
    నటీనటులు: చైతన్య రావ్, లావణ్య, మిహిరా, ఉత్తర, వైవా రాఘవ, లలిత్ ఆదిత్య, య‌ష్ రంగినేని  ద‌ర్శ‌క‌త్వం: చెందు ముద్దు సంగీతం: ప్రిన్స్ హెన్రీ ఛాయాగ్ర‌హ‌ణం: పంకజ్ తొట్టాడ నిర్మాత: య‌ష్ రంగినేని ‘30 Weds 21’ ఫేమ్‌ చైతన్యరావ్‌ హీరోగా, లావణ్య హీరోయిన్‌గా చేసిన తెరకెక్కిన చిత్రం ‘ అన్నపూర్ణ ఫొటో స్టూడియో ’. ఓ పిట్ట కథ సినిమాతో డైరెక్టర్‌గా పరిచయమైన చెందు ముద్దు తన రెండో ప్రయత్నంగా ఈ మూవీ తెరకెక్కించాడు. 1980 కాలాన్ని గుర్తు చేస్తూ ఈ ప్రేమ సాగుతుందని ఇప్పటికే చిత్ర యూనిట్‌ ప్రకటించింది. ఈ మూవీకి సంబంధించిన పోస్టర్లు, టీజర్‌, ట్రైలర్ చిత్రంపై అంచనాలు పెంచేశాయి. మంచి ప్ర‌చారంతో ప్రేక్ష‌కుల దృష్టిని ఆక‌ర్షించిన ఈ సినిమా ఎలా ఉంది?. ఆడియన్స్‌ను ఆకట్టుకుందా? చైతన్యరావ్‌కు హిట్ తెచ్చిపెట్టిందా? వంటి అంశాలను ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.  కథేంటి కపిలేశ్వరపురం అనే ప‌ల్లెటూరులో చంటి (చైతన్య రావ్‌) త‌న స్నేహితుడితో క‌లిసి ‘అన్న‌పూర్ణ ఫొటో స్టూడియో’ న‌డుపుతుంటాడు. జ్యోతిష్యుడైన త‌న తండ్రికి చుట్టు ప‌క్క‌ల ఎంతో మంచి పేరు ఉంది. కానీ చంటికి వయసు మీద పడుతున్నా పెళ్లి కాదు. దీంతో స్నేహితులంతా అతడ్ని ఎగ‌తాళి చేస్తుంటారు. ఇంత‌లోనే గౌతమి (లావణ్య) అనే అమ్మాయిని చూసి చంటి ప్రేమిస్తాడు. ఆమె కూడా చంటిని ఇష్ట‌ప‌డుతుంది. ఇక ఈ ఇద్ద‌రి ప్రేమ‌క‌థ కంచికి చేరిన‌ట్టే అనుకునేలోపే విష‌యం చంటి తండ్రికి తెలుస్తుంది. జాతకం ప్రకారం చంటి ప్రాణానికి ప్రమాదం ఉందని గౌతమికి చెబుతాడు. అది తెలిశాక గౌత‌మి ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంది?  చంటి ఓ హ‌త్య కేసులో నిందితుడిగా ఎలా మారాడు? ఆత్మ‌హ‌త్యకి ఎందుకు ప్ర‌య‌త్నించాడు? చంటి, గౌత‌మి ఒక్క‌ట‌య్యారా లేదా? వంటివి తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎవరెలా చేశారంటే చైత‌న్య‌రావ్  న‌ట‌న ఆక‌ట్టుకుంటుంది. వ‌య‌సు మీద‌ప‌డిన కుర్రాడిగా త‌న‌కి అల‌వాటైన పాత్ర‌లో మ‌రోసారి ఆక‌ట్టుకున్నారు. వింటేజ్ లుక్‌లో ఆయ‌న క‌నిపించిన తీరు, గోదావ‌రి యాస, కామెడీలో టైమింగ్ మెప్పిస్తాయి. లావ‌ణ్య అచ్చ‌మైన తెలుగ‌మ్మాయిగా అందంగా క‌నిపించింది. ఆమె న‌ట‌న కూడా బాగుంది. చెల్లెలు ప‌ద్దు పాత్ర‌లో ఉత్త‌ర‌, స్నేహితుడిగా ల‌లిత్ ఆదిత్య‌, మ‌రో పాత్ర‌లో మిహిరా మంచి అభిన‌యం ప్ర‌ద‌ర్శించారు. స్నేహితుల గ్యాంగ్‌లో ఎప్పుడూ తింటూ క‌నిపించే వైవా రాఘ‌వ పాత్ర కూడా బాగా న‌వ్విస్తుంది.  కొత్త న‌టులతో దర్శ‌కుడు స‌హ‌జ‌మైన న‌ట‌న‌ని రాబ‌ట్టుకున్నారు ఎలా సాగిందంటే క‌థానాయ‌కుడి ఆత్మ‌హ‌త్య ప్ర‌య‌త్నంతో క‌థ మొద‌లుపెట్టాడు ద‌ర్శ‌కుడు. అక్క‌డ దొరికిన లేఖ నుంచి అస‌లు క‌థ మొద‌ల‌వుతుంది. సినిమాలో హీరో హీరోయిన్ల మధ్య సాగే లవ్‌ ట్రాక్‌, సన్నివేశాలు చాలా సరదాగా ఎంటర్‌టైన్‌ చేస్తాయి. అలాగే సినిమాలో ఉన్న అన్ని పాత్రల చేత కామెడీ చేయించాలని ట్రై చేశారు కానీ పూర్తిస్థాయిలో అది వర్కౌట్ అవ్వలేదని చెప్పాలి. సినిమా ఫస్టాఫ్ అంతా చాలా సరదాగా సాగుతూ ఇంటర్‌వెల్‌ ట్విస్ట్‌ సెకండ్ హాఫ్ మీద ఆసక్తి పెంచేస్తుంది. సెకండాఫ్‌లో వచ్చే సన్నివేశాలు, పాత్రలు బాగా డిజైన్ చేసుకున్నారు. చిన్న చిన్న లోపాలు ఉన్నప్పటికీ ఓవరాల్‌గా ఎలాంటి అసభ్యతకు తావు లేకుండా సినిమాను తెరకెక్కించడంలో దర్శకుడు సఫలం అయ్యాడు.  డైరెక్షన్‌ & టెక్నికల్‌గా 1980నాటి స్వచ్ఛమైన పల్లెటూరి ప్రేమకథను తెరకెక్కించే ప్రయత్నం చేశాడు డైరెక్టర్‌. కల్మషం లేని పాత్రలు, అందమైన విజువల్స్‌, సంగీతం ప్రేక్షకులను హత్తుకుంటాయి. మాటలతో అక్క‌డ‌క్క‌డా మెరిపించినా.. క‌థ‌, క‌థ‌నాల ర‌చ‌నలో ఆయ‌న మ‌రింత శ్ర‌ద్ధ తీసుకోవాల్సింది. 80వ దశకం కథను చెప్పె క్రమంలో అప్పటి సినిమాలను అనుసరించి స్టోరీని తెరకెక్కించడం అంతగా రుచించదు. సాంకేతికంగా సినిమా ఉన్న‌తంగా  ఉంది. ముఖ్యంగా కెమెరా విభాగానికి ఎక్కువ మార్కులు ప‌డ‌తాయి. ప‌ల్లెటూరి అందాల్ని తెర‌పై ఆవిష్క‌రించిన తీరు శ‌భాష్ అనిపిస్తుంది. సంగీతం కూడా మెప్పిస్తుంది. క‌థ‌లో వేగం పెరిగేలా ఎడిటింగ్ విభాగం మ‌రింత శ్ర‌ద్ధ తీసుకోవాల్సింది. నిర్మాణం సినిమా స్థాయికి త‌గ్గ‌ట్టుగా ఉంది. ప్లస్‌ పాయింట్స్‌ 1980 నాటి నేపథ్యంనటీనటులుకథలో మలుపులు మైనస్‌ పాయింట్స్‌ ఎడిటింగ్‌పాత పంథాలో సన్నివేశాలు రేటింగ్‌: 2.75/5 https://www.youtube.com/watch?v=COPhzQh-wc8
    జూలై 21 , 2023
    అసలు రాజమౌళిని ఆస్కార్ ఆహ్వానించలేదట.. డబ్బులు కట్టి హాజరయ్యారంట!
    అసలు రాజమౌళిని ఆస్కార్ ఆహ్వానించలేదట.. డబ్బులు కట్టి హాజరయ్యారంట!
    తెలుగు సినిమా సత్తాను ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ప్రపంచానికి చాటిన విషయం తెలిసిందే. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ మూవీ ఆస్కార్‌ను కైవసం చేసుకొని భారతీయులను గర్వించేలా చేసింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ‘నాటు నాటు’ ఆస్కార్‌ పురస్కారాన్ని కైవసం చేసుకుంది. ఇదిలా ఉండగా ఆస్కార్‌ ప్రచార ఆర్భాటాల కోసం రాజమౌళి రూ. 80 కోట్లకు పైగా ఖర్చు చేశారని వార్తలు షికారు చేశాయి.మరోవైపు ఆస్కార్‌ ఎంట్రీ టికెట్ల కోసం రాజమౌళి రూ.1.44 కోట్లు ఖర్చు చేశారని ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ ప్రచారానికి రాజమౌళి తనయుడు కార్తికేయ చెక్‌ పెట్టారు. ఆస్కార్‌ ప్రమోషన్స్‌తో పాటు, టికెట్‌ కొనుగోలుకు ఎంత ఖర్చు చేశారో తేటతెల్లం చేశారు.  ఆస్కార్‌కు వారికి మాత్రమే ఆహ్వానం! అస్కార్‌ అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమంలో ఎంట్రీకి రూ.1.44 కోట్లు ఖర్చయిందన్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని రాజమౌళి కుమారుడు కార్తికేయ స్పష్టం చేశారు. రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌, రాహుల్‌ సిప్లిగంజ్‌, కాలభైరవలు ఆస్కార్‌ వేడుకలకు అధికారిక ఆహ్వానితులుగా వెళ్లినట్లు తెలిపారు. కీరవాణి, చంద్రబోస్‌లు నామినేషన్స్‌లో ఉండటంతో వారికి  ఫ్రీ ఎంట్రీ లభించిందని చెప్పారు. ఆస్కార్‌ నిర్వాహకులు నామినీల తరపున వెళ్లే వ్యక్తులకు కూడా కొన్ని సీట్లను కేటాయిస్తారని వివరించారు. అయితే సినిమాకు సంబంధించిన మిగతావాళ్లు డబ్బులు పెట్టి టికెట్లు కొనాల్సి ఉంటుందని వెల్లడించారు.  ఆస్కార్ గ్యాలరీలో రెండు వరుసల్లో సెలబ్రెటీలు కూర్చుంటారని కార్తికేయ తెలిపారు. అప్పర్‌ లెవల‌్‌లో కూర్చునేందుకు ఒక్కో సీటుకు 750 డాలర్లు  ఖర్చు పెట్టామని చెప్పారు.  లోయర్ లెవల్‌లో కూర్చునేందుకు ఒక్కో సీటుకు 1500 డాలర్లు చెల్లించినట్లు వెల్లడించారు. అంతే కానీ ప్రచారం జరుగుతున్నట్లుగా కేవలం టికెట్ల కోసమే రూ.1.44కోట్లు ఖర్చు చేయలేదని పేర్కొన్నారు. అయితే ఆస్కార్ బరిలో నిలిచేందుకు నాటు నాటు సాంగ్, RRR మూవీ ప్రమోషన్స్ కోసం రూ.8.5 కోట్లు ఖర్చు చేసినట్లు వివరించారు. అంతకుముందు RRR ప్రమోషన్స్‌ సమయంలో సినీ దర్శకుడు, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ సంచలన వ్యాఖ్యలు చేశారు. అస్కార్‌ కోసం ఆర్‌ఆర్‌ఆర్‌ టీం రూ. 80 కోట్లు ఖర్చు పెట్టిందని ఆరోపించారు. అదే డబ్బుతో 8-10 సినిమాలు తీసి ముఖాన కొడతామని అన్నారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. 
    మార్చి 29 , 2023
    Prabhas: మంచి మనసు చాటుకున్న ప్రభాస్‌.. ఆహ్వానానికి వెళ్తే భారీ విరాళం!
    Prabhas: మంచి మనసు చాటుకున్న ప్రభాస్‌.. ఆహ్వానానికి వెళ్తే భారీ విరాళం!
    దేశం మెచ్చిన నటుల్లో రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ (Prabhas) ఒకరు. ఈ హీరో పేరు చెబితే బాక్సాఫీస్‌ రికార్డులు, పాన్‌ ఇండియా స్థాయి చిత్రాలే గుర్తుకువస్తాయి. అయితే ప్రభాస్‌కు మంచి మనసున్న వ్యక్తిగానూ గుర్తింపు ఉంది. ప్రభాస్‌ ఇప్పటివరకూ ఎన్నో సినిమాల్లో నటించినప్పటికీ ఎన్నడూ కాంట్రవర్సీల జోలికి పోలేదు. ఏ స్టేజీ మీద వివాదస్పద వ్యాఖ్యలు చేయలేదు. పైగా తన వద్దకు వచ్చిన వారికి పసందైన భోజనాన్ని పెట్టి వారి మన్ననలు పొందుతుంటాడు. అంతే కాకుండా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ అందరిచేత శభాష్‌ అనిపించుకుంటున్నాడు. ఈ క్రమంలోనే ప్రభాస్‌ మరోమారు తన మంచి మనసును చాటుకున్నాడు.  డైరెక్టర్స్‌కు భారీ విరాళం లెజండరీ డైరెక్టర్‌ దాసరి నారాయణరావు (Dasari Narayana Rao Birthday) పుట్టిన రోజును పురస్కరించుకొని ఏటా మే 4న ‘డైరెక్టర్స్‌ డే’ (Directors Day)ను జరుపుకుంటున్నారు. ఈసారి వేడుకలను హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో ఘనంగా నిర్వహించాలని ఫిల్మ్‌ డైరెక్టర్ అసోసియేషన్‌ నిర్ణయించింది. ఈ కార్యక్రమానికి అహ్వానించేందుకు అసోసియేషన్‌ సభ్యులు తాజాగా ప్రభాస్‌ను కలిశారు. ఈ సందర్భంగా వేడుకలు గ్రాండ్‌ చేయాలంటూ ప్రభాస్‌ వారికి రూ.35 లక్షలు విరాళంగా అందజేశారు. ఈ విషయాన్ని అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ స్వయంగా వెల్లడించారు. దీంతో హీరో ప్రభాస్‌పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది.  ఫుల్‌ స్వింగ్‌లో ప్రభాస్‌! ప్రస్తుతం దేశంలో ఏ స్టార్‌ హీరో చేతిలో లేనన్ని పాన్‌ ఇండియా చిత్రాలు ప్రభాస్‌ లిస్ట్‌లో ఉన్నాయి. ప్రభాస్‌ ఏ డైరెక్టర్‌కైనా ఓకే చెప్తే ఆ ప్రాజెక్ట్‌ మెుదలయ్యేది 2026 తర్వాతనే. ప్రభాస్‌ ప్రాజెక్టుల విషయానికి వస్తే.. ప్రస్తుతం అతడు 'కల్కీ 2898 ఏడీ' సినిమాలో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం ఈ ఏడాదిలోనే రిలీజ్‌ కానుంది. దీంతో పాటు మారుతి దర్శకత్వంలో ‘రాజా సాబ్‌’ (Raja Saab) చిత్రం చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. తర్వాత సందీప్‌ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga)తో ఓ సినిమా చేయనున్నాడు. ఈ చిత్రానికి స్పిరిట్‌ (Spirit) అనే టైటిల్‌ ఖరారు చేశారు. వీటితో పాటు ‘సలార్‌ సీక్వెల్‌’ ఉంది. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహించే ఈ చిత్రం షూటింగ్‌ ఈ ఏడాదిలోనే ప్రారంభమయ్యే అవకాశం ఉంది. వీటితో పాటు మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతున్న ‘కన్నప్ప’లోనూ ప్రభాస్‌ శివుడి పాత్ర పోషించనున్నాడు. అలాగే హను రాఘవపూడితో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ చిత్రాలన్నీ పూర్తవ్వడానికి కనీసం రెండేళ్ల సమయం పడుతుంది. 
    ఏప్రిల్ 23 , 2024
    <strong>Coolie Movie: </strong><strong>రజనీ కాంత్‌ చిత్రంలో బాలీవుడ్‌ స్టార్‌ హీరో? ఆహా.. ఇది కదా కాంబో అంటే!</strong>
    Coolie Movie: రజనీ కాంత్‌ చిత్రంలో బాలీవుడ్‌ స్టార్‌ హీరో? ఆహా.. ఇది కదా కాంబో అంటే!
    భారతీయ చిత్ర పరిశ్రమల్లో కాంబినేషన్స్‌కు ఎంతో క్రేజ్‌ ఉంది. ఇద్దరు హీరోల కాంబో సెట్‌ అయ్యిందంటే సినిమా అక్కడే సగం విజయం సాధించినట్లు అంతా భావిస్తారు. అలాంటిది ఇద్దరు జాతీయ స్థాయి దిగ్గజ నటులు ఒకే చిత్రంలో నటిస్తే ఇక ఆ సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో పెరిగిపోతాయే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తాజాగా ఈ క్రేజీ కాంబో కోలివుడ్‌లో లాక్‌ అయినట్లు తెలుస్తోంది. తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ నటిస్తున్న తాజా చిత్రంలో బాలీవుడ్‌ దిగ్గజ హీరో నటించబోతున్నట్లు కోలీవుడ్‌ వర్గాలు కోడై కూస్తున్నాయి. ఇంతకీ ఆ హీరో ఎవరు? అతడు చేయబోయే చిత్రం ఏంటి? ఇప్పుడు చూద్దాం.  క్రేజీ కాంబో లోడింగ్‌..! తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ ప్రస్తుతం 'కూలీ' (Coolie) చిత్రంలో నటిస్తున్నారు. సూపర్‌ హిట్‌ చిత్రాల దర్శకుడు లోకేష్‌ కనకరాజ్‌ (Lokesh Kanagaraj) ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్‌ ప్రస్తుతం ఏపీలోని వైజాగ్‌లో జరుగుతుండటం విశేషం. అయితే లేటెస్ట్ బజ్‌ ప్రకారం ఈ సినిమాలో బాలీవుడ్‌ స్టార్‌ హీరో అమీర్‌ఖాన్‌ (Aamir Khan) నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఓ ముఖ్యమైన పాత్రలో అమీర్‌ ఖాన్‌ కనిపించబోతున్నట్లు తమిళ ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది. త్వరలోనే ఆయన షూటింగ్‌లో పాల్గొంటారని కూడా అంటున్నారు. ప్రస్తుతం ఈ వార్త కోలివుడ్‌లో తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.&nbsp; 29 ఏళ్ల క్రితమే.. రజనీకాంత్‌, అమీర్‌ ఖాన్‌ కలిసి నటించడం ఇదే తొలిసారి కాదు. 29 ఏళ్ల క్రితం వచ్చిన ‘ఆటంక్‌ హై ఆటంక్‌’ (Aatank Hi Aatank) అనే ఫిల్మ్‌లో వీరిద్దరు తొలిసారి నటించారు. అయితే ఇది ఈ జనరేషన్ వారికి పెద్దగా తెలియక పోవచ్చు. ‘ది గాడ్ ఫాదర్‌’ అనే నవల ఆధారంగా దర్శకుడు దిలీప్‌ శంకర్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో జుహి చావ్లా ఫీమేల్‌ లీడ్‌గా కనిపించింది. అప్పట్లో రూ.2.5 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా రూ.4.2 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇందులో అమీర్‌ ఖాన్‌, రజనీ నటనపై ప్రశంసలు కురిశాయి. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత వీరు మళ్లీ తెరపై కనిపించనుండటంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. విలన్‌గా కన్నడ స్టార్‌! రజనీకాంత్‌ హీరోగా లోకేశ్‌ కనగరాజ్‌ తెరకెక్కిస్తున్న 'కూలీ' చిత్రం పాన్‌ ఇండియా స్థాయిలో రిలీజ్‌ కానుంది. చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమాలో కన్నడ స్టార్‌ ఉపేంద్ర ముఖ్య పాత్రలో కనివిందు చేయనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఉపేంద్ర సామాజిక మాధ్యమాల వేదికగా తెలియజేశారు. తన ఆరాధ్య నటుడు సూపర్ స్టార్‌తో తెర పంచుకోవడాన్ని ఆశీర్వాదంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా సెట్లో రజనీతో కలిసి దిగిన ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. దీంతో ఈ పోస్టు ఒక్కసారిగా వైరల్‌గా మారింది. ఇందులో ఉపేంద్ర విలన్‌ పాత్రలో కనిపించబోతున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. 171వ చిత్రంగా కూలీ తలైవ కెరీర్‌లో 171వ సినిమాగా ‘కూలీ’ని సన్‌పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధిమారన్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటోంది. అటు ‘విక్రమ్‌’ సినిమా తర్వాత లోకేష్‌ కనకరాజ్‌కు దక్షిణాదిలో ఫుల్ క్రేజ్‌ వచ్చింది. తెలుగులోనూ అతడికి మంచి ఫాలోయింగ్‌ ఏర్పడింది. దీంతో డైరెక్టర్‌ లోకేష్‌ కనకరాజ్‌ సినిమా అనగానే అందరిలో అంచనాలు పెరిగిపోయాయి. ఇక రజనీతో ఆయన సినిమా అనగానే ఓ రేంజ్‌లో బజ్‌ క్రియేట్‌ అయ్యింది. ఇప్పటికే ఈ సినిమా సంబంధించి పలు అప్‌డేట్స్‌ సోషల్‌ మీడియాలో హాట్‌టాపిక్‌గా నిలుస్తున్నాయి. రజనీ వ్యాఖ్యలపై దుమారం తమిళనాడు మాజీ సీఎం కరుణానిధిపై మంత్రి ఎ.వి. వేలు రచించిన పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో తాజాగా రజనీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. కరుణా నిధి మరణం తర్వాత పార్టీని ప్రస్తుత సీఎం స్టాలిన్‌ చక్కగా నడిపిస్తున్నారని రజనీ అన్నారు. రాష్ట్ర మంత్రి దురై మురుగన్‌ పేరును ప్రస్తావిస్తూ ఆయన లాంటి పెద్దలున్న పార్టీని స్టాలిన్‌ ఎలా ముందుకు తీసుకెళ్తున్నారో అంటూ సరదాగా సెటైర్లు వేశారు. కళాకారుడి కంట్లోనే వేలు పెట్టి ఆడించిన వ్యక్తి దురై మురుగన్ అంటూ వ్యాఖ్యానించారు. దీనిపై మంత్రి దురై మురుగన్‌ ఘాటుగా బదులిచ్చారు. సినిమా రంగంలోని పెద్ద నటులంతా వయసు మీరి, పళ్లు పోయి, గడ్డాలు పెంచుకొని చావబోయే స్థితిలోనూ నటిస్తున్నారని పరోక్షంగా రజనీని ఉద్దేశించి అన్నారు. అలాంటి వారి వల్ల యువకులకు అవకాశాలు రావడం లేదని ఆరోపించారు. ఈ పరస్పర మాటల దాడి కోలివుడ్‌తో పాటు తమిళ రాజకీయాల్లో తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి.&nbsp;
    ఆగస్టు 27 , 2024
    This Week Movies: తెలుగులో ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘ఓపెన్‌ హైమర్‌’.. ఈ వారం రిలీజయ్యే చిత్రాలు ఇవే!
    This Week Movies: తెలుగులో ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘ఓపెన్‌ హైమర్‌’.. ఈ వారం రిలీజయ్యే చిత్రాలు ఇవే!
    గత వారం లాగే ఈ వీక్ కూడా పలు చిన్న చిత్రాలు థియేటర్లలో సందడి చేయడానికి రాబోతున్నాయి. ఆహ్లాదకరమైన వినోదాన్ని అందించేందుకు సిద్ధమవుతున్నాయి. మార్చి 18 నుంచి 24 తేదీల మధ్య ఇవి థియేటర్లలో సందడి చేయనున్నాయి. అలాగే ఓటీటీలో కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్‌ కాబోతున్నాయి. మరి ఆ సినిమాలు ఏంటి? వాటి విశేషాలు ఎలా ఉన్నాయి? ఈ కథనంలో చూద్దాం. థియేటర్‌లో విడుదలయ్యే చిత్రాలు ఓం భీమ్‌ బుష్‌.. శ్రీవిష్ణు, రాహుల్‌ రామకృష్ణ, ప్రియదర్శి కీలక పాత్రల్లో శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఓం భీమ్‌ బుష్‌..’ (Om Bheem Bush). నో లాజిక్‌ ఓన్లీ మేజిక్‌ అనేది ఉప శీర్షిక. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ మార్చి 22న ప్రేక్షకుల ముందుకు రానుంది.&nbsp; అనన్య జయరామన్, చందన, తోషి అలహరి, ప్రజ్ఞ గౌతమ్, అరవింద్, సుమన్ కీలక పాత్రల్లో ప్రసాద్ రాజు బొమ్మిడి రూపొందించిన చిత్రం ‘అనన్య’ (Ananya Movie). జంధ్యాల ఉమా నాగ శివ గంగాధర శర్మ నిర్మించారు. హర్రర్ నేపథ్యంలో కుటుంబ ప్రేమ కథాచిత్రంగా ఈ సినిమా రూపొందింది. మార్చి 22న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. హద్దులేదురా ఆశిష్‌ గాంధీ, అశోక్‌ కథానాయకులుగా తెరకెక్కుతున్న చిత్రం ‘హద్దులేదురా’ (haddu ledura movie). వర్ష, హ్రితిక కథానాయికలు. రాజశేఖర్‌ రావి దర్శకత్వం వహించారు. వీరేష్‌ గాజుల బళ్లారి నిర్మించారు. ‘భగవద్గీతలోని కృష్ణార్జునుల స్ఫూర్తితో ఈ చిత్రం తెరకెక్కించినట్లు మూవీ యూనిట్‌ తెలిపింది. మార్చి 21న ఈ సినిమా థియేటర్‌లలో విడుదల కానుంది. ఓటీటీలో రిలీజయ్యే చిత్రాలు/సిరీస్‌లు ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాల విషయానికొస్తే.. ఈసారి ఏడు ఆస్కార్స్ గెలుచుకున్న 'ఓపెన్ హైమర్'.. ఈ వారమే తెలుగులో స్ట్రీమింగ్ కానుంది. అలానే 'అబ్రహం ఓజ్లర్' అనే హిట్ మూవీ కూడా రానుంది. వీటితోపాటు 'ఏ వతన్ మేరే వతన్', 'ఫైటర్' లాంటి హిందీ చిత్రాలు కూడా డిజిటల్ రిలీజ్‌కి సిద్ధమైపోయాయి. మెుత్తంగా ఈ వారం 20 వరకూ చిత్రాలు ఓటీటీలోకి రాబోతున్నాయి. వాటిలో ప్రధానమైనవి ఏంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; ఓపెన్ హైమర్ ప్రతిష్టాత్మక ఆస్కార్‌ అవార్డుల్లో ఈసారి 'ఓపెన్ హైమర్' సినిమా మెరిసింది. ఉత్తమ నటుడు, దర్శకుడు, చిత్రం, సహాయ నటుడు, ఒరిజినల్ స్కోర్, ఫిల్మ్ ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ.. ఇలా ప్రధాన విభాగాల్లో పురస్కారాలు కైవసం చేసుకుంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు ఈ మూవీ గురించి మరోసారి చర్చించుకుంటున్నారు. అయితే ఈ చిత్రం ఈ వారం తెలుగు డబ్బింగ్‌తో ఓటీటీలోకి రానుంది. ప్రముఖ ఓటీటీ వేదిక ‘జియో సినిమా’లో మార్చి 21 నుంచి ప్రసారం కానుంది.&nbsp; సుందరం మాస్టార్ టాలీవుడ్ కమెడియన్ వైవా హర్ష హీరోగా ఎంట్రీ ఇచ్చిన తాజా చిత్రం ‘సుందరం మాస్టర్’ (Sundaram Master OTT). ఈ మూవీని దర్శకుడు క‌ళ్యాణ్ సంతోష్ తెరకెక్కించగా.. ఇందులో హీరోయిన్‌గా దివ్య శ్రీపాద నటించింది. గత నెల థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం.. హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. మార్చి 22 నుంచి ఈ సినిమా ఈటీవీ విన్‌లో ప్రసారం కానుంది.&nbsp; ‘భూతద్దం భాస్కర్‌ నారాయణ’ శివ కందుకూరి, రాశీ సింగ్‌ జంటగా తెరకెక్కిన చిత్రం ‘భూతద్దం భాస్కర్‌ నారాయణ’ (bhoothaddam bhaskar narayana ott). పురుషోత్తం రాజ్‌ దర్శకత్వం వహించారు. మార్చి 1న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులకు థ్రిల్‌ని పంచింది. ఇప్పుడు ఓటీటీలోనూ అదే థ్రిల్‌ను పంచడానికి వచ్చేస్తోంది. మార్చి 22 నుంచి ఆహా వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది. ఈ చిత్రంలో అరుణ్‌ కుమార్‌, దేవి ప్రసాద్‌, వర్షిణి సౌందరరాజన్‌ కీలకపాత్రలు పోషించారు. అబ్రహాం ఓజ్లర్‌ జయరాం (Jayaram), అనూప్‌ మేనన్‌, అనస్వర రాజన్‌ కీలకపాత్రల్లో నటించిన సైకలాజికల్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘అబ్రహాం ఓజ్లర్‌’ (Abraham Ozler OTT). మిధున్‌ మేనుయేల్‌ థామస్‌ దర్శకత్వం వహించారు. మమ్ముట్టి అతిథిగా నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రలో నటించి మెప్పించారు. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని నమోదు చేసింది. ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులకు అలరించడానికి సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ వేదిక డిస్నీ+హాట్‌స్టార్‌లో మార్చి 20 నుంచి మలయాళ, తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్‌ కానుంది. TitleCategoryLanguagePlatformRelease Date3 Body ProblemSeriesEnglishNetflixMarch 21FighterMovieHindiNetflixMarch 21Lal SalaamMovieTelugu/TamilNetflixMarch 22Play GroundSeriesHindiAmazon primeMarch 17Marakkuma Nenjam&nbsp;MovieTamilAmazon primeMarch 19Ae Watan Mere WatanMovieHindiAmazon primeMarch 21Road HouseMovieEnglishAmazon primeMarch 21LuteraMovieHindiDisney + HotstarMarch 22OppenheimerMovieHindi/TeluguJio CinemaMarch 21Sundaram MasterMovieTelugu&nbsp;ETV WinMarch 22
    మార్చి 18 , 2024
    ఈ వారం( April 14,15) ఓటీటీ-థియేటర్లలో అలరించే సినిమాలు/ వెబ్‌సిరీస్‌లు ఏంటో తెలుసా?
    ఈ వారం( April 14,15) ఓటీటీ-థియేటర్లలో అలరించే సినిమాలు/ వెబ్‌సిరీస్‌లు ఏంటో తెలుసా?
    ఎప్పటిలాగే ఈ వారం కూడా పలు సినిమాలు థియేటర్ల వద్ద హంగామా సృష్టించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఆహ్లాదకరమైన వినోదాన్ని పంచేందుకు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అటు OTT సైతం పలు ఆసక్తికర చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ వారం విడుదలకు సిద్ధంగా ఉన్న చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఎంటో ఇప్పుడు చూద్దాం. థియేటర్ రిలీజ్ మూవీస్ శాకుంతలం గుణశేఖర్‌ దర్శకత్వంలో అగ్రకథానాయిక సమంత చేసిన శాకుంతలం చిత్రం ఈ శుక్రవారం (ఏప్రిల్‌ 14) థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, టీజర్‌, ట్రైలర్‌ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి. శాకుంతలం మూవీ కచ్చితంగా ప్రేక్షకులను అలరిస్తుందని చిత్ర యూనిట్‌ ధీమా వ్యక్తం చేస్తోంది. కాగా ఈ సినిమాలో దేవ్‌ మోహన్‌, అల్లు అర్హ, ప్రకాష్‌ రాజ్‌, మోహన్‌ బాబు, గౌతమి కీలక పాత్రల్లో నటించారు. రుద్రుడు&nbsp; రాఘవ లారెన్స్‌ హీరోగా తెరకెక్కిన ‘రుద్రుడు’ చిత్రం కూడా ఈ శుక్రవారమే థియేటర్లలో సందడి చేయనుంది. కతరేశణ్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో ప్రియా భవాని కథానాయికగా చేసింది. ఈ సినిమాను అదే రోజున తమిళ్‌లోనూ రుద్రన్‌ పేరుతో రిలీజ్ చేయనున్నారు.&nbsp;కాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను ఇవాళ (ఏప్రిల్‌ 10) హైదరాబాద్‌లోని&nbsp; పార్క్‌ హయాత్‌ హోటల్‌లో ఘనంగా నిర్వహించనున్నారు.&nbsp; విడుతలై పార్ట్‌-1 తమిళ హాస్యనటుడు సూరి హీరోగా రూపొందిన ‘విడుతలై పార్ట్‌-1’ చిత్రం శనివారం (ఏప్రిల్‌ 15) తెలుగులో రిలీజ్‌ కానుంది. మార్చి 31న తమిళంలో రిలీజ్‌ అయిన ఈ చిత్రం మంచి హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. దీంతో తెలుగులోనూ ‘విడుదల’గా ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. కాగా ఈ చిత్రంలో విజయ్‌సేతుపతి ఓ ప్రధానపాత్రలో కనిపిస్తారు. నక్సలైట్లకు సంబంధించిన కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది.&nbsp; చిప్‌కలి ఈ వారం బాలీవుడ్‌ నుంచి చిప్‌కలి సినిమా ఒక్కటే రిలీజ్‌ అవుతోంది. క్రైం థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రాన్ని ఏప్రిల్‌ 14 (శుక్రవారం)న రిలీజ్ చేస్తున్నారు. కౌషిక్ కర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నటులు యాష్‌పాల్‌ శర్మ, యోగేష్‌ భరద్వాజ్‌ కీలక పాత్రలు పోషించారు. ఓటీటీ సినిమాలు దాస్‌ కా ధమ్కీ తెలుగులో ఇటీవలే విడుదలై మంచి హిట్‌ టాక్‌ తెచ్చుకున్న దాస్‌ కా ధమ్కీ చిత్రం ఈ వారం ఓటీటీలో విడుదల కానుంది. ఆహాలో ఏప్రిల్‌ 14న స్ట్రీమింగ్‌ కానుంది. విశ్వక్‌ హీరోగా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల సునామి సృష్టించింది. విశ్వక్‌ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాకు నిలిచింది. కాగా, ఈ సినిమాకు ఓటీటీ ప్రియులను కచ్చితంగా అలరిస్తుందని చెప్పొచ్చు.&nbsp; అసలు రవిబాబు దర్శకత్వంలో రూపొందిన అసలు చిత్రం గురువారం( ఏప్రిల్‌ 13)న ఓటీటీలో సందడి చేయనుంది. ఈటీవీ విన్‌లో ఇది స్ట్రీమింగ్ కానుంది. నటి పూర్ణ లీడ్‌ రోల్‌లో చేసిన ఈ సినిమా క్రైమ్‌ థ్రిల్లర్‌గా రూపొందింది.&nbsp; ఓ కల చక్కటి ప్రేమ కథాంశంతో రూపొందిన ఓ కల చిత్రం డిస్నీ హాట్‌స్టార్‌లో ఈ నెల 13న విడుదల కాబోతోంది. ఈ సినిమాకు దీపక్ కొలిపాక దర్శకత్వం వహించారు. ఇటీవలే విడుదలైన ఓ కల ట్రైలర్‌ ఆకట్టుకుంది.&nbsp; ఫ్లాట్‌ఫామ్‌ వారీగా ఓటీటీ విడుదలలు…&nbsp; TitleCategoryLanguagePlatformRelease DateRennervations. Premiereseries&nbsp;EnglishDisney+ HotstarApril 12Ticket to Paradise (2022)MovieEnglishAmazon PrimeApril 11Alter Ego (2022)MovieenglishAmazon PrimeApril 12Big Bad Wolves (2014)&nbsp;movieenglishAmazon PrimeApril 12Herbie Hancock: Possibilities (2006)movieenglishAmazon PrimeApril 12Kill Me Three Times (2015)MovieEnglishAmazon PrimeApril 12Life Itself (2014)MovieEnglishAmazon PrimeApril 12The Quest of Alain Ducasse (2018)&nbsp;MovieEnglishAmazon PrimeApril 12Whose Streets?DocumentEnglishAmazon PrimeApril 12Greek Salad (2023)SeriesEnglishAmazon PrimeApril 14CoComelon: Season 8SeriesEnglishNetflixApril 10All American: Homecoming Season 2SeriesEnglishNetflixApril 11Leanne Morgan: I’m Every WomanSeriesEnglishNetflixApril 11American ManhuntSeriesEnglishNetflixApril 11Operation: NationMovieEnglishNetflixApril 11The Boss BabySeriesEnglishNetflixApril 12PhenomenaSeriesEnglishNetflixApril 12QueenmakerDramaEnglishNetflixApril 14The Best Man HolidayMovieEnglishNetflixApril 16
    ఏప్రిల్ 10 , 2023
    <strong>OTT Releases This Week Telugu: ఈ వారం సినిమా లవర్స్‌కు పెద్ద పండగే.. ఎలాగో మీరే చూడండి!</strong>
    OTT Releases This Week Telugu: ఈ వారం సినిమా లవర్స్‌కు పెద్ద పండగే.. ఎలాగో మీరే చూడండి!
    సెప్టెంబర్‌ సెకండ్‌ వీక్‌లో చిన్న సినిమాల హవా కొనసాగనుంది. థియేటర్ల వద్ద హంగామా సృష్టించేందుకు స్మాల్‌ హీరోల సినిమాలు సిద్ధమవుతున్నాయి. ఆహ్లాదకరమైన వినోదాన్ని పంచేందుకు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అటు OTT సైతం పలు ఆసక్తికర చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ వారం విడుదలకు సిద్ధంగా ఉన్న చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఎంటో ఇప్పుడు చూద్దాం. థియేటర్లలో విడుదలయ్యే చిత్రాలు&nbsp; భలే ఉన్నాడే (Bhale Unnade) రాజ్‌ తరుణ్‌ హీరోగా నటించిన తాజా చిత్రం ‘భలే ఉన్నాడే!’. ఇందులో మనీషా కంద్కూర్‌ హీరోయిన్‌గా నటించారు. జె. శివసాయి వర్ధన్‌ దర్శకత్వం వహించారు. మారుతి టీమ్‌ సమర్పణలో రవికిరణ్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌పై ఎన్‌వీ కిరణ్‌ కుమార్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం సెప్టెంబర్‌ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్‌, టీజర్‌ సినిమాపై ఆసక్తిని పెంచాయి. మత్తు వదలరా 2 (Mathu Vadalara 2) శ్రీసింహా (Sri Simha) హీరోగా దర్శకుడు రితేశ్ రానా తెరకెక్కించిన చిత్రం ‘మత్తు వదలరా 2’ (Mathu Vadalara 2). ఫరియా అబ్దుల్లా (Faria Abdullah), సత్య కీలక పాత్రలు పోషించారు. ఈ నెల 13న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. హీరో ప్రభాస్‌ తాజాగా సినిమా ట్రైలర్‌ లాంచ్‌ చేయడంతో అందరి దృష్టి ఈ మూవీపై పడింది. ట్రైలర్ ఆద్యంతం నవ్వులు పూయిస్తూ అంచనాలను పెంచేసింది.&nbsp; ధూం ధాం (Dhoom Dhaam) చేతన్‌కృష్ణ, హెబ్బా పటేల్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘ధూం ధాం’. సాయికిషోర్‌ మచ్చా దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి గోపీమోహన్‌ స్టోరీ, స్క్రీన్‌ప్లే అందించారు. రామ్‌కుమార్‌ నిర్మాత. సెప్టెంబర్‌ 13న ప్రేక్షకుల ముందుకురానుంది. చక్కటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందించామని, గోపీమోహన్‌ కథ ఆకట్టుకుంటుందని నిర్మాత ఎం.ఎస్‌.రామ్‌కుమార్‌ పేర్కొన్నారు. ఈ చిత్రానికి గోపిసుందర్‌ సంగీతం సమకూర్చారు.&nbsp; ఉత్సవం (Utsavam) దిలీప్ ప్రకాష్, రెజీనా కసాండ్రా లీడ్ రోల్స్‌లో నటిస్తున్న ఇంపాక్ట్ ఫుల్ తెలుగు డ్రామా ‘ఉత్సవం’. అర్జున్ సాయి దర్శకత్వం వహించారు. హార్న్‌బిల్‌ పిక్చర్స్‌పై సురేష్‌ పాటిల్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. సెప్టెంబర్ 13న ఈ సినిమా విడుదల కానుంది. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ఈ సినిమా ఏపీ, తెలంగాణలో గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. ఈ చిత్రం లవ్, ఎమోషన్స్, భావోద్వేగాలు వినోదంతో కూడిన కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని మేకర్స్‌ తెలిపారు.&nbsp; ఓటీటీలో రిలీజయ్యే చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు కమిటీ కుర్రోళ్లు (Committee Kurrollu) మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మించిన విలేజ్ బ్యాక్‌డ్రాప్ మూవీ 'కమిటీ కుర్రోళ్లు'. ఇటీవల థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం మంచి రెస్పాన్స్‌ సాధించింది. బాక్సాఫీస్‌ వద్ద పెద్ద ఎత్తున వసూళ్లు రాబట్టింది. ఇందులో సందీప్ సరోజ్, పి సాయి కుమార్, గోపరాజు రమణ, శరణ్య సురేష్, యశ్వంత్ పెండ్యాల ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 11న ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్‌లోకి రానుంది.&nbsp; మిస్టర్ బచ్చన్ (Mr. Bachchan) రవితేజ, డైరెక్టర్‌ హరీష్‌ శంకర్‌ కాంబోలో రూపొందిన లేటెస్ట్‌ చిత్రం 'మిస్టర్ బచ్చన్'. 2018లో బాలీవుడ్‌ స్టార్‌ అజయ్ దేవగన్ నటించిన 'రైడ్'కి రీమేక్‌గా ఇది రూపొందింది. పంద్రాగస్టు రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తీవ్రంగా నిరాశపరిచింది. దీంతో సెప్టెంబర్‌ 12న నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా ఓటీటీలోకి రాబోతోంది. ఇందులో రవితేజతో పాటు భాగ్యశ్రీ బోర్సే. జగపతి బాబు కీలక పాత్రలు పోషించారు. ఆయ్‌ (Aay) నార్నే నితిన్‌ హీరోగా వచ్చిన చిత్రం ‘ఆయ్‌’ (Aay). తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కి మంచి వసూళ్లను సొంతం చేసుకుంది. ఆగస్టు 15 విడుదలైన ఈ సినిమా యూత్‌ను ఆకట్టుకొని సినీ తారల ప్రశంసలు అందుకుంది. ఇప్పుడీ యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. నెట్‌ఫ్లిక్స్‌ (Netflix) వేదికగా సెప్టెంబర్ 12 నుంచి ప్రసారం కానుంది.&nbsp; తలవన్‌ (Thalavan) జిస్‌ జాయ్‌ దర్శకత్వంలో బిజు మేనన్‌, ఆసిఫ్‌ అలీ నటించిన మలయాళ క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘తలవన్‌’. మేలో మలయాళంలో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకర్షించింది. సెప్టెంబర్ 12 నుంచి ‘సోనీలివ్‌’(SonyLIV)లో స్ట్రీమింగ్‌లోకి రానుంది. మలయాళంతో పాటు, తెలుగు, తమిళం, హిందీ, మరాఠీ ఇలా మొత్తం ఏడు భాషల్లో సినిమాను వీక్షించవచ్చు. మరిన్ని OTT చిత్రాలు &amp; వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి https://telugu.yousay.tv/tfidb/ott&nbsp; TitleCategoryLanguagePlatformRelease DateSector 36MovieHindiNetflixSept 13Breaking Down The WallDocumentaryEnglishNetflixSept 12Emily In Paris S4SeriesEnglishNetflixSept 12Midnight At The Pera Palace S2SeriesEnglishNetflixSept 12Uglies&nbsp;MovieEnglishNetflixSept 13ThangalaanMovieTelugu/TamilNetflixSept 20The Money GameDocumentaryEnglishAmazonSept 10Stree 2MovieHindiAmazonSept 27BerlinMovieHindiZee 5Sept 13NunakijiMovieMalayalamZee 5Sept 13Bench LifeSeriesTeluguSonyLIVSept 12Goli Soda RaisingMovieTamilHotstarSept 13How To Die AloneMovieEnglishHotstarSept 13In Vogue: The 90sDocumentaryEnglishHotstarSept 13Kalbali RecordsMovieHindiHotstarSept 12Late Night With DevilMovieEnglishLions GateSept 13VisfotMovieTeluguJio CinemaSept 7
    సెప్టెంబర్ 09 , 2024
    <strong>This Week Movies: ఈ వారం చిన్న చిత్రాలదే.. ఓటీటీలోకి వచ్చేస్తోన్న మలయాళ బ్లాక్‌బాస్టర్‌!</strong>
    This Week Movies: ఈ వారం చిన్న చిత్రాలదే.. ఓటీటీలోకి వచ్చేస్తోన్న మలయాళ బ్లాక్‌బాస్టర్‌!
    ఈ వారం (This Week Movies) చిన్న సినిమాలు థియేటర్ల వద్ద హంగామా సృష్టించేందుకు సిద్ధమవుతున్నాయి. ఆహ్లాదకరమైన వినోదాన్ని పంచేందుకు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అటు OTT సైతం పలు ఆసక్తికర చిత్రాలు, సిరీస్‌లతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ వారం విడుదలకు సిద్ధంగా ఉన్న చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఎంటో ఇప్పుడు చూద్దాం. థియేటర్‌లో విడుదలయ్యే చిత్రాలు డార్లింగ్‌ ప్రియదర్శి (Priyadarshi), నభా నటేష్ (Nabha Natesh) లీడ్ రోల్స్‌లో నటిస్తున్న యూనిక్ రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ 'డార్లింగ్'. ఈ సినిమాకు అశ్విన్ రామ్ (Aswin Ram) దర్శకత్వం వహిస్తున్నారు. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై కె. నిరంజన్ రెడ్డి, శ్రీమతి చైతన్య నిర్మించిన ఈ చిత్రం జూలై 19న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. రామం రాఘవం కమెడియన్ ధనరాజ్ డైరెక్టర్‌గా మారి చేసిన ద్విభాషా చిత్రం 'రామం రాఘవం' (Ramam Raghavam). ఇందులో సముద్రఖని, ధన్‌రాజ్‌ తండ్రి కొడుకులుగా నటించారు. ఈ చిత్రం జులై 19న తెలుగుతో పాటు తమిళంలోనూప్రేక్షకుల ముందుకు రానుంది. తండ్రీ కొడుకుల సెంటిమెంట్‌తో ఈ సినిమాను ఆసక్తికరంగా రూపొందించినట్లు చిత్ర యూనిట్‌ తెలిపింది.&nbsp; పేక మేడలు హీరోగా వినోద్‌ కిషన్‌ (Vinod Kishan), హీరోయిన్‌గా అనూష కృష్ణ (Anusha Krishna) నటిస్తున్న చిత్రం ‘పేకమేడలు’ (Peka Medalu). క్రేజీ యాంట్స్‌ ప్రొడక్షన్స్‌ ఈ సినిమాను నిర్మించింది. నీలగిరి మామిళ్ల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం జులై 19న ప్రేక్షకులను పలకరించనుంది. అన్ని తరగతుల ప్రేక్షకులు మెచ్చేలా ఈ సినిమా ఉంటుందని నిర్మాత రాకేష్‌ వర్రే అన్నారు.&nbsp; క్రైమ్‌ రీల్‌ సిరి చౌదరి, పింక్ పాక్ సూర్య, జబర్దస్త్ అభి, భారత్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘క్రైమ్ రీల్’ (Crime Reel). పలు చిత్రాల్లో హీరోయిన్‌‌‌‌‌‌‌‌గా నటించిన సంజన అన్నే ఈ చిత్రంతో దర్శకురాలిగా పరిచయమవుతోంది. జూన్ 19న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘సోషల్ మీడియా వల్ల యువత ఎలా చెడిపోతున్నారో ఇందులో చూపించాం. ఈ పాయింట్ అందరికీ కనెక్ట్ అవుతుంది’ అని డైరెక్టర్ సంజన అన్నారు. ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు/ సిరీస్‌లు ‘ది గోట్ లైఫ్’ (ఆడు జీవితం) స‌లార్ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత మలయాళ న‌టుడు పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన చిత్రం ‘ది గోట్ లైఫ్’ (ఆడు జీవితం). ఈ సినిమాకు అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ బ్లెస్సీ దర్శకత్వం వ‌హించ‌గా అమలాపాల్, కేఆర్ గోకుల్, జిమ్మీ జీన్ లూయిస్ కీల‌క పాత్ర‌లు పోషించారు. సర్వైవల్ అడ్వెంచర్‌గా వ‌చ్చిన ఈ చిత్రం మార్చి 28న విడుదలై ఘన విజయం సాధించింది. వ‌ర‌ల్డ్ వైడ్‌గా రూ.150 కోట్ల‌కు పైగా వసూళ్లను రాబ‌ట్టింది. కాగా, ఈ చిత్రం జూలై 19 నుంచి స్ట్రీమింగ్‌లోకి రానుంది. నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాష‌ల్లో ప్రసారం కానుంది.&nbsp; మరిన్ని OTT చిత్రాలు &amp; వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి https://telugu.yousay.tv/tfidb/ott TitleCategoryLanguagePlatformRelease DateWanda RuseSeriesEnglishNetflixJuly 15T・P BONSeriesJapaneseNetflixJuly 17The Green Glow Gang 2SeriesEnglishNetflixJuly 17Kobla Kay Season 6SeriesEnglishNetflixJuly 18Tribhuvan Mishra CA TopperSeriesHindiNetflixJuly 18Sweet Home S 3SeriesKorean/EnglishNetflixJuly 19Nagendran’s HoneymoonsSeriesTelugu DubHotstarJuly 18BahishkaranaSeriesTeluguZee 5July 19BarzakhSeriesHindiZee 5July 19HotspotMovieTelugu DubAhaJuly 17My Spy: The Eternal CityMovieEnglishAmazon&nbsp;July 18Betty Law FeeSeriesEnglish/ SpanishAmazon&nbsp;July 19
    జూలై 15 , 2024
    <strong>Aham Reboot OTT Review: సినిమా మెుత్తం సుమంత్ పాత్ర ఒక్కటే.. ‘అహం రీబూట్‌’ ప్రయోగం ఫలించిందా?</strong>
    Aham Reboot OTT Review: సినిమా మెుత్తం సుమంత్ పాత్ర ఒక్కటే.. ‘అహం రీబూట్‌’ ప్రయోగం ఫలించిందా?
    నటీనటులు :&nbsp; సుమంత్‌ రచన, దర్శకత్వం : ప్రశాంత్‌ సాగర్‌ అట్లూరి సంగీతం : శ్రీరామ్‌ మద్దూరి సినిమాటోగ్రఫీ : వరుణ్‌ అంకర్ల ఎడిటింగ్‌ : మురళి కృష్ణ మన్యం విజువల్‌ ఎఫెక్ట్స్‌ : శశ్వత్‌ కౌరవ్‌ నిర్మాతలు : రఘువీర్‌, సృజన్‌&nbsp; ఓటీటీ వేదిక : ఆహా (Aha OTT) సుమంత్‌ హీరోగా ప్రశాంత్‌ సాగర్‌ అట్లూరి రూపొందించిన చిత్రం ‘అహం రీబూట్‌’ (Aham Reboot ott). రఘువీర్‌ గోరిపర్తి, సృజన్‌ యరబోలు సంయుక్తంగా నిర్మించారు. ఎప్పుడో చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ మూవీని తొలుత థియేటర్‌లో రిలీజ్‌ చేయాలని భావించారు. అయితే కొన్ని కారణాల వల్ల జూన్‌ 30న సైలెంట్‌గా ఓటీటీలోకి తీసుకొచ్చారు. ఆహాలో ఈ మూవీ స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. సైకలాజికల్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం ఎలా ఉంది? ఓటీటీ ప్రేక్షకులను మెప్పించిందా? సుమంత్‌కు మరో విజయాన్ని అందించిందా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.  కథేంటి ఫుట్‌ బాల్‌ ప్లేయర్‌ కావాలని కలలు కన్న నిలయ్‌ (సుమంత్‌).. ఓ యాక్సిడెంట్‌ వల్ల రేడియో జాకీగా మారతాడు. స్టూడియోలో ఉండగా ఓ రోజు నిలయ్‌కు.. ఒక అమ్మాయి నుంచి కాల్‌ వస్తుంది. ఎవరో కిడ్నాప్‌ చేశారని చెబుతుంది. తొలుత ప్రాంక్‌ అని భావించిన నిలయ్‌.. ఆమె మాటలకు కన్విన్స్‌ అయి లైవ్‌ పెడతాడు. రేడియోలో వీరి మాటలు విన్న పోలీసులు.. ఆమె కిడ్నాప్‌ అయ్యిందని నమ్మి కాపాడేందుకు ప్రయత్నాలు ప్రారంభిస్తారు. కిడ్నాపైన యువతి వివరాలు సేకరించే బాధ్యతను స్టూడియోలో ఉన్న నిలయ్‌కు అప్పగిస్తారు. ఇంతకీ ఆ యువతి ఎవరు? నిజంగానే ఆమెను కిడ్నాప్‌ చేశారా? పోలీసులు ఆమెను ఎలా కాపాడారు? నిలయ్‌ వల్ల యాక్సిడెంట్‌లో చనిపోయిన యువతి ఎవరు? ఆమెకు కిడ్నాప్‌ అయిన అమ్మాయికి ఏమైన సంబంధం ఉందా? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.  ఎవరెలా చేశారంటే అహం రీబూట్ సినిమాలో (Aham Reboot Movie Review).. సుమంత్‌ వన్‌ మ్యాన్‌ షో చేశారు. సినిమా మెుత్తం ఆయన పాత్ర మాత్రమే కనిపిస్తుంది. మిగతా పాత్రలు కేవలం వినిపిస్తాయి అంతే. సినిమా మెుత్తం తనపైనే డిపెండ్ అయిన వేళ.. సమంత్‌ తన నటనతో ఆకట్టుకున్నాడు. మ‌న‌సులో అంతులేని బాధ‌ను మోసే ఓ మోడ్ర‌న్ యువ‌కుడిగా, ఓ అమ్మాయి ప్రాణాల‌ను కాపాడేందుకు ఆరాట‌ప‌డే ఆర్జేగా అత‌డి యాక్టింగ్ బాగుంది. ఏమోషన్స్‌ను చక్కగా పండించాడు. కథను తన భుజాలపై మోసుకుంటూ నడిపించాడు. లుక్‌ పరంగా సుమంత్‌ ఈ మూవీలో కొత్తగా కనిపించారు. డైరెక్షన్‌ ఎలా ఉందంటే సింగిల్ క్యారెక్ట‌ర్ మూవీ చేయ‌డం అన్న‌ది క‌త్తిమీద సాము లాంటిది (Aham Reboot Movie Review). అందులోనూ ఒకే చోట నుంచి క‌థ‌ను ర‌క్తి క‌ట్టించ‌డం అంటే అంత ఈజీ కాదు. ఈ ప్ర‌య‌త్నంలో దర్శకుడు ప్రశాంత్‌ సాగర్‌ అట్లూరి కొంత మేర సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు. కిడ్నాప్‌కు గురైన అమ్మాయి ఫోన్‌ కాల్‌తో అసలు కథను మెుదలవుతుంది. కిడ్నాప్‌ అయిన అమ్మాయి నుంచి హీరో వివరాలు రాబట్టడం, వాటిని పోలీసులకు అందించడం, పోలీసులు ఆమెను కాపాడేందుకు యత్నించడం చుట్టూ దర్శకుడు కథను తిప్పారు. ఈ క్రమంలో స్టోరీని బాగా సాగదీసినట్లు అనిపిస్తుంది. ఆఖర్లో నిలయ్‌ జీవితానికి, కిడ్నాప్‌ అయిన యువతికి లింక్‌ చేస్తూ ఇచ్చిన ట్విస్ట్‌ బాగుంది. అయితే సినిమా మెుత్తం సుమంత్ మాత్రమే క‌నిపించ‌డం, కేవ‌లం డైలాగ్స్ ద్వారానే క‌థ‌ను చెప్ప‌డం వ‌ల్ల బోర్‌ కొట్టించిన ఫీలింగ్‌ కలుగుతుంది. ఓపికగా చూడకలిగితే.. అహాం రీబూట్‌ ఒక మంచి థ్లిల్లింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఇస్తుంది.  టెక్నికల్‌గా.. సాంకేతిక అంశాల విషయానికి వస్తే.. నేపథ్య సంగీతం మూవీకి బాగా ప్లస్ అయ్యింది. శ్రీరామ్‌ మద్దూరి ఇచ్చిన BGM ఆసక్తికర సన్నివేశాలను మరింతగా ఎలివేట్‌ చేసింది. ఒకే పాత్ర ఉండటంతో ఎడిటింగ్‌ క్రిస్పిగా చేయడం కలిసొచ్చింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.  ప్లస్‌ పాయింట్స్‌ సుమంత్‌ నటనప్రయోగాత్మకంగా కథ చెప్పడంనేపథ్య సంగీతం మైనస్‌ పాయింట్‌ మూవీ మెుత్తం ఒక పాత్రే ఉండటం Telugu.yousay.tv Rating : 3/5&nbsp;&nbsp;
    జూలై 01 , 2024
    This Week Movies: ఈ వారమూ చిన్న చిత్రాలదే హవా.. ఓ లుక్కేయండి!
    This Week Movies: ఈ వారమూ చిన్న చిత్రాలదే హవా.. ఓ లుక్కేయండి!
    గత కొన్ని వారాలుగా టాలీవుడ్‌లో చిన్న సినిమాల హవా కొనసాగుతోంది. ఈ వారం (This Week Movies) కూడా చిన్న సినిమాలు థియేటర్ల వద్ద హంగామా సృష్టించేందుకు సిద్ధమవుతున్నాయి. ఆహ్లాదకరమైన వినోదాన్ని పంచేందుకు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అటు OTT సైతం పలు ఆసక్తికర చిత్రాలు/ సిరీస్‌లతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ వారం విడుదలకు సిద్ధంగా ఉన్న చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఎంటో ఇప్పుడు చూద్దాం. థియేటర్‌లో విడుదలయ్యే చిత్రాలు రాజు యాదవ్‌ జబర్దస్త్ ఫేమ్‌ గెటప్‌ శ్రీను పూర్తి స్థాయి హీరోగా నటించిన లేటెస్ట్‌ చిత్రం ‘రాజు యాదవ్‌’ (Raju yadav). అంకిత కారాట్‌ కథానాయిక. కృష్ణమాచారి.కె దర్శకత్వం వహించారు. ప్రశాంత్‌ రెడ్డి, రాజేశ్‌ కల్లెపల్లి నిర్మించిన ఈ చిత్రం మే 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. వాస్తవానికి మే 17న ఈ మూవీ రిలీజ్ కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. లవ్‌ మీ ఆశిష్‌, వైష్ణవి చైతన్య జంటగా నటించిన తాజా చిత్రం ‘లవ్‌ మీ’ (Love Me). అరుణ్‌ భీమవరపు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ‘ఇఫ్‌ యూ డేర్‌’ అన్న క్యాప్షన్‌తో రాబోతుంది. ఇప్పటికే&nbsp; చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ మే 25న విడుదల కానుంది. ‘దెయ్యమని తెలిసినా అమ్మాయిని&nbsp; ఆ యువకుడు ఎందుకు ప్రేమించాడు. ఆ తర్వాత ఏమైందన్న ఆసక్తికర కథాంశంతో ఈ మూవీని రూపొందించినట్లు చిత్ర యూనిట్‌ తెలిపింది.&nbsp; డర్టీ ఫెలో శాంతి చంద్ర, దీపిక సింగ్, సిమ్రితి ప్రధాన తారాగణంగా ఆడారి మూర్తి సాయి దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘డర్టీ ఫెలో’ (Dirty Fellow). సత్యప్రకాశ్, నాగినీడు, జయశ్రీ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా ఈనెల 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. కొత్తదనంతో కూడిన యాక్షన్‌ డ్రామా చిత్రమని మూవీ యూనిట్‌ తెలిపింది.&nbsp; ఫ్యూరియోసా: ఏ మ్యాడ్‌ మ్యాక్స్‌ సాగా ఈ వారం విడుదలకు సిద్ధంగా ఉన్న హాలీవుడ్‌ చిత్రం ‘ఫ్యూరియోసా: ఏ మ్యాడ్‌ మ్యాక్స్‌ సాగా’ (Furiosa: A Mad Max Saga). అన్య టేలర్‌, క్రిస్‌ హేమ్స్‌వర్త్‌ కీలక పాత్రల్లో నటించారు. మే 23న ఇంగ్లిష్‌తో పాటు, తెలుగు, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. గతంలో బ్లాక్ బాస్టర్‌ విజయాన్ని అందుకున్న ‘మ్యాడ్‌ మ్యాక్స్‌’ చిత్ర ఫ్రాంచైజీ నుంచి ఈ సినిమా వస్తోంది. ప్రస్తుతం ఈ మూవీపై భారీగా అంచనాలు ఉన్నాయి.&nbsp; ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు/ సిరీస్‌లు మరిన్ని OTT చిత్రాలు &amp; వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి https://telugu.yousay.tv/tfidb/ott TitleCategoryLanguagePlatformRelease DateToughest Forces on EarthSeriesEnglishNetflixMay 22AtlasMovieEnglishNetflixMay 24CrewMovieHindiNetflixMay 24The Test 3SeriesEnglishAmazon primeMay 23Veer SavarkarMovieHindiZee 5May 23The Kardashians S 5SeriesEnglishDisney+HotstarMay 23The Goat LifeMovieTelugu / MalayalamDisney+HotstarMay 26The Beach BoysSeriesHindiDisney+HotstarMay 24Aqa Men 2MovieTelugu/EnglishJio CinemaMay 21Dune 2SeriesEnglishJio CinemaMay 21Trying 4SeriesEnglishApple TV PlusMay 22Wanted Man&nbsp;MovieEnglishLions Gate PlayMay 24
    మే 20 , 2024
    This Week Movies: ఈ వారం రాబోతున్న ఇంట్రస్టింగ్‌ చిత్రాలు/సిరీస్‌లు.. ఓ లుక్కేయండి!
    This Week Movies: ఈ వారం రాబోతున్న ఇంట్రస్టింగ్‌ చిత్రాలు/సిరీస్‌లు.. ఓ లుక్కేయండి!
    ఎప్పటిలాగే ఈ వారం (This Week Movies) కూడా పలు సినిమాలు థియేటర్ల వద్ద హంగామా సృష్టించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఆహ్లాదకరమైన వినోదాన్ని పంచేందుకు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అటు OTT సైతం పలు ఆసక్తికర చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ వారం విడుదలకు సిద్ధంగా ఉన్న చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఎంటో ఇప్పుడు చూద్దాం. థియేటర్‌లో విడుదలయ్యే చిత్రాలు కృష్ణమ్మ టాలీవుడ్ నటుడు సత్యదేవ్ హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘కృష్ణమ్మ’ (Krishnamma). వివి గోపాల కృష్ణ దర్శకుడు. అథిరా రాజ్ హీరోయిన్‌గా చేసింది. ఈ చిత్రాన్ని అరుణాచల క్రియేషన్స్ పతాకంపై కృష్ణ కొమ్మలపాటి నిర్మించారు. మే 10న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలు పెంచాయి. ప్రతినిధి 2 నారా రోహిత్‌ కథానాయకుడిగా మూర్తి దేవగుప్తపు తెరకెక్కించిన చిత్రం ‘ప్రతినిధి 2’ (Prathinidhi 2). ఈ సినిమాలో సిరీ లెల్లా కథానాయిక. గతంలో వచ్చిన ‘ప్రతినిధి’ చిత్రానికి కొనసాగింపుగా ఈ మూవీ రూపొందింది.&nbsp; సప్తగిరి, దినేష్‌ తేజ్‌, జిషు సేన్‌ గుప్తా తదితరులు కీలక పాత్రలు పోషించారు. మే 10న ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది. వాస్తవానికి ఏప్రిల్‌ 25న రిలీజ్‌ చేయాలని మేకర్స్‌ భావించినా కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది.&nbsp; జితేందర్‌ రెడ్డి ఉయ్యాల జంపాల ఫేమ్‌ విరించి వర్మ దర్శకత్వంలో రూపొందిన లేటేస్ట్ చిత్రం ‘జితేందర్‌ రెడ్డి’ (Jithender Reddy). రాకేశ్‌ వర్రే కథానాయకుడిగా పొలిటికల్‌ బ్యాక్‌ డ్రాప్‌లో ఈ సినిమాను నిర్మించారు. 1980లో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా మూవీని తీర్చిదిద్దారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. మే 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆరంభం మోహన్ భగత్ , సుప్రిత సత్యనారాయణ్ , భూషణ్ కళ్యాణ్ , రవీంద్ర విజయ్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘ఆరంభం’ (Aarambham). వి. అజయ్ నాగ్ (Ajay Nag) దర్శకత్వం వహించారు. ఎమోషనల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం మే 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఏవీటీ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై అభిషేక్ వీటీ ఈ చిత్రాన్ని నిర్మించారు.&nbsp; కింగ్‌డమ్‌ ఆఫ్‌ ది ప్లానెట్‌ ఆఫ్‌ ది ఏప్స్‌ హాలీవుడ్‌లో ‘రైజ్‌ ఆఫ్‌ ది ప్లానెట్‌ ఆఫ్‌ ది ఏప్స్‌’ ఫ్రాంఛైజీ నుంచి వచ్చే చిత్రాలకు భారత్‌ సహా ప్రపంచ వ్యాప్తంగా మంచి క్రేజ్ ఉంది. ఇప్పుడు ఈ సిరీస్‌లో వస్తోన్న నాల్గో చిత్రం ‘కింగ్‌డమ్‌ ఆఫ్‌ ది ప్లానెట్‌ ఆఫ్‌ ది ఏప్స్‌’ (kingdom of the planet of the apes). వెస్‌బాల్‌ దర్శకుడు. మే 10న ఈ సినిమా ఇంగ్లిష్‌తో పాటు, భారతీయ భాషల్లోనూ విడుదల కానుంది. ‘మనుషులపై యుద్ధం ప్రకటించిన ప్రాక్సిమస్‌ సీజర్ అనే కోతితో ఓ యువతి ఎలాంటి పోరాటం చేసింది. అందుకు మరో కోతి ఎలాంటి సహకారం అందించింది’ అన్నది కథ.&nbsp; ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు / సిరీస్‌లు గీతాంజలి మళ్లీ వచ్చింది హీరోయిన్‌ అంజలి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'గీతాంజలి మళ్లీ వచ్చింది' (Geethanjali Malli Vachindi). 2014లో వచ్చిన ‘గీతాంజలి’ చిత్రానికి కొనసాగింపుగా ఈ సినిమా రూపొందింది. ఏప్రిల్‌ 11న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం.. మిక్స్‌డ్‌ టాక్ తెచ్చుకుంది. మే 8 నుంచి ఆహా వేదికగా ఓటీటీలో రాబోతోంది. మరి ఓటీటీ ప్రేక్షకులను ఏమేరకు ఈ చిత్రం అలరిస్తుందో చూడాలి.  ఆవేశం&nbsp; పుష్ప ఫేమ్‌ విలన్‌ ఫహాద్‌ ఫాసిల్‌ ప్రధాన పాత్రలో చేసిన లేటెస్ట్ చిత్రం 'ఆవేశం'. ఇటీవల మలయాళంలో విడుదలైన ఈ చిత్రం ఏకంగా రూ.130 కోట్ల కలెక్షన్లు సాధించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. కాగా ఈ చిత్రాన్ని మే 9 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా ఓటీటీలోకి తీసుకున్నారు. తెలుగు, మలయాళంతో పాటు పలు ప్రాంతీయ భాషల్లో ఈ సినిమాలో అందుబాటులోకి రానుంది.&nbsp; మరిన్ని OTT చిత్రాలు &amp; వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి https://telugu.yousay.tv/tfidb/ott TitleCategoryLanguagePlatformRelease DateBodkin&nbsp;SeriesEnglishNetflixMay 09Mother Of The BrideMovieEnglishNetflixMay 09Thank You NextSeriesEnglishNetflixMay 09AaveshamMovieTelugu/MalayalamAmazon primeMay 09The GoatSeriesEnglishAmazon primeMay 09YodhaMovieHindiAmazon primeMay 108AM MetroMovieHindiZee 5May 10All Of Us StrangersMovieEnglishDisney+HotstarMay 8Un Dekhi 3SeriesHindiSonyLIVMay 10RomeoMovieTamilAhaMay 10Dark MatterSeriesEnglishApple Plus TvMay 8Hollywood Con QueenSeriesEnglishApple Plus TvMay 8
    మే 06 , 2024
    This Week Movies: ఈ వారం విడుదలయ్యే చిత్రాలు/ సిరీస్‌లు.. ఓ లుక్కేయండి!
    This Week Movies: ఈ వారం విడుదలయ్యే చిత్రాలు/ సిరీస్‌లు.. ఓ లుక్కేయండి!
    ఎప్పటిలాగే ఈ వారం (This Week Movies) కూడా పలు సినిమాలు థియేటర్ల వద్ద హంగామా సృష్టించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఆహ్లాదకరమైన వినోదాన్ని పంచేందుకు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అటు OTT సైతం పలు ఆసక్తికర చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ వారం విడుదలకు సిద్ధంగా ఉన్న చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఎంటో ఇప్పుడు చూద్దాం. థియేటర్‌లో రిలీజయ్యే చిత్రాలు ప్రతినిధి 2 నారా రోహిత్‌ (Nara Rohit) హీరోగా చేసిన ప్రతినిధి (Prathinidhi) చిత్రం.. గతంలో విడుదలై మంచి విజయం సాధించింది. ఆ సినిమాకు కొనసాగింపుగా రూపొందిన ‘ప్రతినిధి 2’ (Prathinidhi 2) చిత్రం ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మూర్తి దేవగుప్తపు తెరకెక్కించిన ఈ చిత్రం ఈ నెల 25న థియేటర్లలో రిలీజ్‌ కానుంది. సిరి లెల్లా కథానాయిక. సప్తగిరి, దినేష్‌ తేజ్‌, జిషు సేన్‌ గుప్తా తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇందులో నారా రోహిత్‌ నిజాయతీ గల న్యూస్‌ రిపోర్టర్‌ పాత్రలో కనిపించనున్నాడు. రత్నం విశాల్‌ (Vishal) హీరోగా దర్శకుడు హరి తెరకెక్కించిన చిత్రం ‘రత్నం’ (Rathnam movie). ప్రియా భవానీ హీరోయిన్‌గా చేసింది. ఈ చిత్రం తమిళ, తెలుగు భాషల్లో ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘భరణి’, ‘పూజ’ తర్వాత విశాల్‌-హరి కాంబినేషన్‌లో వస్తున్న మూవీ కావడంతో సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. రుస్లాన్ ఆయుష్‌ శర్మ, సుశ్రీ మిశ్రా జంటగా కరణ్‌.బి దర్శకత్వంలో రూపొందిన యాక్షన్‌ ఫిల్మ్‌ ‘రుస్లాన్’ (Ruslaan). జగపతిబాబు కీలక పాత్ర పోషించారు. ఈ మూవీ ఏప్రిల్‌ 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్‌ సినిమాపై అంచనాలు పెంచాయి. ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు టిల్లు స్క్వేర్‌ టాలీవుడ్ యంగ్‌ హీరో సిద్దు జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda) హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ ‘టిల్లు స్క్వేర్’ (Tillu Square). దర్శకుడు మల్లిక్ రామ్ తెరకెక్కించిన ఈ సినిమాలో అనుపమా పరమేశ్వరన్ (Anupama Parameswaran) హీరోయిన్‌గా చేసింది. మార్చి 29న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ వారం ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు రాబోతోంది. నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా ఏప్రిల్‌ 26 నుంచి టిల్లు స్క్వేర్ ప్రసారం కానుంది.&nbsp; భీమా మ్యాచో స్టార్ గోపిచంద్ (Gopichand) హీరోగా నటించిన ఫ్యాంటసీ యాక్షన్ డ్రామా ‘భీమా’ (Bhimaa). మార్చి 8వ తేదీన థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోయింది. కాగా, ఈ సినిమా కూడా ఈ వారం ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఏప్రిల్‌ 25 నుంచి డిస్నీ+ హాట్‍స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది.&nbsp; TitleCategoryLanguagePlatformRelease DateFight for paradiseSeriesEnglishNetflixApril 23BrigantiSeriesEnglishNetflixApril 23Deliver meMovieEnglishNetflixApril 24City HunterMovieJapanese/EnglishNetflixApril 25Dead Boy DetectivesSeriesEnglishNetflixApril 25Tillu SquareMovieTeluguNetflixApril 26GoodBye EarthSeriesEnglish/KoreanNetflixApril 26Dil Dosti DilemmaMovieHindiAmazon PrimeApril 25BhimaaMovieTeluguDisney + HotstarApril 25CrackMovieHindiDisney + HotstarApril 26The ZenecksMovieEnglishJio CinemaApril 22We Are Hear S4SeriesEnglishJio CinemaApril 27Kung Fu Panda 4MovieEnglishBook My ShowApril 26
    ఏప్రిల్ 22 , 2024
    This Week OTT Movies: ఈవారం ఓటీటీ/ థియేటర్లలో విడుదలయ్యే సినిమాలు
    This Week OTT Movies: ఈవారం ఓటీటీ/ థియేటర్లలో విడుదలయ్యే సినిమాలు
    కాలేజీ విద్యార్థుల పరీక్షలు ముగిశాయి. ఎండకాలం స్టార్ట్‌ అయిపోయింది. ఈ ఎండల వేడిని తగ్గించి చల్లని వినోదం అందించి ప్రేక్షకులను అలరించేందుకు పలు సినిమాలు సిద్ధమయ్యాయి. ఆహ్లాదకరమైన వినోదాన్ని పంచేందుకు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అటు OTTలో సైతం పలు ఆసక్తికర చిత్రాలు ముందుకు రానున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వారం విడుదలకు సిద్ధంగా ఉన్న చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఎంటో ఇప్పుడు చూద్దాం. ఫ్యామిలీ స్టార్(Family Star) రౌడ్ బాయ్ విజయ్ దేవరకొండ(Vijay Devarakonda), గ్లామర్ డాల్ మృణాల్ ఠాకూర్ జంటగా... పరుశురామ్ తెరకెక్కిస్తున్న చిత్రం ఫ్యామిలీ స్టార్. ఇప్పటికే నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 5న థియేటర్లోకి రానుంది. ఇప్పటికే విజయ్ దేవరకొండ, పరుశురామ్ కాంబోలో వచ్చిన 'గీతా గోవిందం' బాక్సాఫీస్‌ వద్ద సూపర్ హిట్‌గా నిలచింది. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌పై పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో అంచనాలు మరింత పెరిగాయి.&nbsp; ఈ సినిమా ప్రమోషన్లను సైతం మూవీ మేకర్స్ భారీగా చేస్తున్నారు.&nbsp; భరత నాట్యం కొత్త కుర్రాడు సూర్య తేజ ఏలే(Actor Surya Teja Aelay) హీరోగా పరిచయం అవుతున్న సినిమా భరతనాట్యం. ఓ యువకుడి జీవితాన్ని సినిమా ఎలా మార్చిందన్నది ఈ చిత్రం కథ. సూర్య తేజకు జంటగా మీనాక్షి గోస్వామి హీరోయిన్‌గా స్క్రీన్ షేర్ చేసుకొనుంది. హర్షవర్ధన్, అజయ్ ఘోష్, వైవా హర్ష వంటి ఇతర నటీనటులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. మంజుమ్మల్ బాయ్స్ మలయాళంలో సూపర్‌ హిట్‌గా నిలిచిన మంజుమ్మల్‌ బాయ్ తెలుగులో డబ్ అయిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం డబ్బింగ్ రైట్స్‌ను దక్కించుకున్న మైత్రి మూవీ మేకర్స్ ఏప్రిల్ 6న తెలుగురాష్ట్రాల్లోని థియేటర్లలో విడుదల చేయనున్నారు. తక్కువ బడ్జెట్‌తో నిర్మాణమైన ఈ చిత్రం ఏకంగా రూ.200 కోట్లు బాక్సాఫీస్ వద్ద కలెక్ట్ చేసి టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా నిలిచింది. ప్రొజెక్ట్ లావణ్య త్రిపాఠి, సందీప్ కిషన్ కాంబోలో వచ్చిన తమిళ్ చిత్రం 'మాయవన్'... తెలుగులో ప్రొజెక్ట్‌గా రానుంది.&nbsp; సైన్స్ ఫిక్షన్, క్రైమ్ థ్రిల్లర్ జనర్‌లో ఈ చిత్రం&nbsp; తెరకెక్కింది.&nbsp; ఈ సినిమా ఏప్రిల్‌ 6న విడుదల కానుంది. ఈ సినిమాలో డేనియల్ బాలాజీ,&nbsp; జయప్రకాశ్, మైమ్ గోపి వంటి వారు నటించారు.&nbsp; బహుముఖం హర్షివ్ కార్తిక్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం బహుముఖం. సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో హర్షివ్ కార్తిక్ స్వీయ దర్శకత్వం వహించాడు. గుడ్ బ్యాడ్&nbsp; అండ్ యాక్టర్ ట్యాగ్‌లైన్‌ను ఈ చిత్రానికి అందించారు. ఈ సినిమాలో హీరోయిన్‌లుగా స్వర్ణిమా సింగ్,&nbsp; మార్టినోవా కథానాయికలుగా చేశారు. ఈ చిత్రం ఏప్రిల్ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ వారం ఓటీటీల్లో విడుదలయ్యే సినిమాలు మరిన్ని OTT చిత్రాలు &amp; వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి https://telugu.yousay.tv/tfidb/ott TitleCategoryLanguagePlatformRelease DateTogetherSeriesEnglishNetflixApril 2Files Of The UnexplainedSeriesEnglishNetflixApril 3RipleySeriesEnglishNetflixApril 4ScoopSeriesEnglishNetflixApril 5MusicaMovieEnglishAmazon primeApril 5Yeh Meri FamilySeriesHindiAmazon primeApril 4How to Date Billy WalshSeriesEnglishAmazon primeApril 5FarreyMovieHindiZee5April 5LambasingiMovieTelugu&nbsp;Disney+ HotstarApril 2
    ఏప్రిల్ 01 , 2024
    This Week Movies: ఈ వారం థియేటర్లలోకి ‘టిల్లు స్క్వేర్‌’, ‘ది గోట్‌ లైఫ్‌’.. అటు ఓటీటీలో ఏవంటే?&nbsp;
    This Week Movies: ఈ వారం థియేటర్లలోకి ‘టిల్లు స్క్వేర్‌’, ‘ది గోట్‌ లైఫ్‌’.. అటు ఓటీటీలో ఏవంటే?&nbsp;
    ఎప్పటిలాగే ఈ వారం (This Week Movies) కూడా పలు సినిమాలు థియేటర్ల వద్ద హంగామా సృష్టించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఆహ్లాదకరమైన వినోదాన్ని పంచేందుకు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అటు OTT సైతం పలు ఆసక్తికర చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ వారం విడుదలకు సిద్ధంగా ఉన్న చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఎంటో ఇప్పుడు చూద్దాం. థియేటర్‌లో రిలీజయ్యే చిత్రాలు ది గోట్‌లైఫ్‌ పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ (Prithviraj Sukumaran) హీరోగా, అమలా పాల్‌ హీరోయిన్‌గా నటించిన తాజా చిత్రం ‘ది గోట్‌లైఫ్‌’. సర్వైవల్‌ డ్రామాగా రూపొందిన ఈ మూవీ ‘ఆడు జీవితం’ (Aadujeevitham) పేరుతో మార్చి 28న విడుదల కానుంది. దీనికి బ్లెస్సీ దర్శకత్వం వహించారు. ‘గోట్‌ డేస్‌’ నవల ఆధారంగా ఈ మూవీని రూపొందించారు. కేరళ నుంచి పని కోసం మధ్య ప్రాశ్చ్యానికి వెళ్లిన ఓ యువకుడు బానిసగా ఎలా మారాడు? అక్కడి నుంచి తప్పించుకుని ఎలా బయటపడ్డాడు? ఈ క్రమంలో అతడికి ఎదురైన పరిస్థితులు ఏంటి? అన్నది ఈ సినిమా కథాంశమని చిత్ర యూనిట్‌ తెలిపింది.&nbsp; టిల్లు స్క్వేర్‌ సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda), అనుపమా పరమేశ్వరన్‌ (Anupama Parameswaran) జంటగా నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్‌’ (Tillu Square). బ్లాక్‌ బాస్టర్‌ సినిమా ‘డీజే టిల్లు’కు సీక్వెల్‌గా ఇది రూపొందింది. మల్లిక్‌ రామ్‌ దర్శకుడు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెల 29న థియేటర్లలోకి రానుంది. ఇటీవల విడుదల చేసిన పాటలు, ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలు పెంచాయి.&nbsp; గాడ్జిల్లా vs కాంగ్: ది న్యూ ఎంపైర్‌ మరో విజువల్‌ ట్రీట్ ఇచ్చేందుకు ప్రముఖ హాలీవుడ్‌ నిర్మాణ సంస్థ వార్నర్‌ బ్రదర్స్‌ సిద్ధమైంది. ఆడమ్‌ విన్‌గార్డ్‌ దర్శకత్వంలో రూపొందిన&nbsp; తాజా చిత్రం&nbsp; ‘గాడ్జిల్లా vs కాంగ్: ది న్యూ ఎంపైర్‌’ (Godzilla x Kong: The New Empire) ఈ వారం వరల్డ్‌ వైడ్‌గా రిలీజ్‌ చేయబోతోంది. ప్రపంచం మీద విరుచకుపడుతున్న గాడ్జిల్లాకు కాంగ్‌ ఎలా చెక్‌పెట్టిందనే కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించారు. తెలుగు సహా పలు భారతీయ భాషల్లో మార్చి 29న విడుదల కానుంది. కలియుగం పట్టణంలో విశ్వ కార్తికేయ, ఆయూషి పటేల్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘కలియుగం పట్టణంలో’ (Kaliyugam Pattanam Lo). కథ, డైలాగ్స్, స్క్రీన్ ప్లే, దర్శకత్వం ఇలా అన్ని బాధ్యతలను రమాకాంత్ రెడ్డి చూసుకున్నారు. డాక్టర్ కందుల చంద్ర ఓబుల్ రెడ్డి, జి.మహేశ్వరరెడ్డి, కాటం రమేష్‌‌ నిర్మించిన ఈ చిత్రం మార్చి 29న రాబోతోంది.&nbsp; ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు/ సిరీస్‌లు సుందరం మాస్టర్‌ వైవా హర్ష (Harsha Chemudu) ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘సుందరం మాస్టర్‌’ (Sundaram Master OTT Release). ఫిబ్రవరిలో బాక్సాఫీసు ముందుకొచ్చిన ఈ మూవీ ప్రేక్షకులకు వినోదం పంచింది. ఇప్పుడు ఓటీటీ వేదికగా సందడి చేసేందుకు సిద్ధమైంది. ఈ నెల 28 నుంచి ప్రముఖ తెలుగు ఓటీటీ ‘ఆహా’ (aha)లో స్ట్రీమింగ్‌ కానుంది. ఏం చేస్తున్నావ్‌? విజయ్‌ రాజ్‌కుమార్‌, నేహా పటాని జంటగా భరత్‌ మిత్ర తెరకెక్కించిన చిత్రం ‘ఏం చేస్తున్నావ్‌?’ (Em chesthunnav OTT Release). నవీన్‌ కురవ, కిరణ్‌ కురవ సంయుక్తంగా నిర్మించారు. ఈ యూత్‌ఫుల్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ గతేడాది ఆగస్టు 25న విడుదలైంది. ఇప్పుడీ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. మార్చి 28 నుంచి ఈటీవీ విన్‌ (ETV Win) వేదికగా ప్రసారం కానుంది. ట్రూ ల‌వ‌ర్‌ జై భీమ్‌, గుడ్‌నైట్ సినిమాల‌తో తెలుగు ప్రేక్షకుల‌కు ద‌గ్గ‌రైన న‌టుడు కె.మ‌ణికంద‌న్‌ (manikandan). ఆయన నటించిన తాజా చిత్రం ‘ట్రూ లవర్‌’ (True Lover OTT Release) ఇటీవల తెలుగులో రిలీజై పాజిటివ్‌ తెచ్చుకుంది. ఇందులో హీరోయిన్‌గా గౌరీ ప్రియ ఆకట్టుకుంది. ప్ర‌భురామ్ తెర‌కెక్కించిన ఈ చిత్రం ‘ట్రూ ల‌వ‌ర్‌’.. మార్చి 27న డిస్నీ+హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. మరిన్ని OTT చిత్రాలు &amp; వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి https://telugu.yousay.tv/tfidb/ott TitleCategoryLanguagePlatformRelease DateTestamentSeriesEnglishNetflixMarch 27Heart Of The Hunter&nbsp;MovieEnglishNetflixMarch 29The Beautiful GameMovieEnglishNetflixMarch 29The Great Indian Kapil ShowSeriesHindiNetflixMarch 30Tig NotaroSeriesEnglishAmazon primeMarch 26The BoxtersSeriesEnglishAmazon primeMarch 28Patna ShuklaMovieHindiDisney + HotstarMarch 29Renegade NellSeriesEnglishDisney + HotstarMarch 29The HoldoversMovieEnglishBook My ShowMarch 29A Gentle Man In MaskSeriesEnglishJio CinemaMarch 29
    మార్చి 25 , 2024
    This Week OTT Movies: ఈ వారం తెలుగులో సందడి చేసే OTT సినిమాలు ఇవే..!
    This Week OTT Movies: ఈ వారం తెలుగులో సందడి చేసే OTT సినిమాలు ఇవే..!
    ఎప్పటిలాగే ఈ వారం (This Week Movies) కూడా పలు సినిమాలు థియేటర్ల వద్ద హంగామా సృష్టించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఆహ్లాదకరమైన వినోదాన్ని పంచేందుకు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అటు OTT సైతం పలు ఆసక్తికర చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ వారం విడుదలకు సిద్ధంగా ఉన్న చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఎంటో ఇప్పుడు చూద్దాం. థియేటర్‌లో విడుదలయ్యే చిత్రాలు సుందరం మాస్టర్‌ హాస్య నటుడు హర్ష చెముడు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘సుందరం మాస్టర్‌’గా (Sundaram Master). దివ్య శ్రీపాద కథానాయిక. ఈ చిత్రాన్ని హీరో రవితేజ (RaviTeja), సుధీర్‌ కుమార్‌ కుర్రు సంయుక్తంగా నిర్మించారు. కల్యాణ్‌ సంతోష్‌ దర్శకత్వం వహించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ‘సుందరం మాస్టర్‌’.. ఫిబ్రవరి 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. మస్తు షేడ్స్‌ ఉన్నయ్‌రా! హాస్యనటుడు అభినవ్‌ గోమఠం లీడ్‌ రోల్‌లో చేసిన చిత్రం ‘మస్తు షేడ్స్‌ ఉన్నయ్‌రా!’ (Masthu Shades Unnai Ra). తిరుపతి రావు ఇండ్ల దర్శకుడు. తరుణ్‌ భాస్కర్‌, అలీ రెజా, వైశాలి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని భవాని కాసుల, ఆరెమ్‌ రెడ్డి, ప్రశాంత్‌.వి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. భావోద్వేగాల మేళవింపుతో మంచి కామెడీ ఎంటర్‌టైనర్‌గా దీన్ని రూపొందించినట్లు చిత్ర బృందం తెలిపింది. ఫిబ్రవరి 23న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. సిద్ధార్థ్‌ రాయ్‌ బాల నటుడిగా పలు చిత్రాలతో (This Week Movies) అలరించిన దీపక్‌ సరోజ్‌ హీరోగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. అతడు నటించిన ‘సిద్ధార్థ్‌ రాయ్‌’ (Siddharth Roy) చిత్రం ఈ వారమే విడుదల కాబోతోంది. ఇందులో తన్వి నేగి కథానాయిక. వి.యశస్వి దర్శకుడు.&nbsp; కొత్తతరం ప్రేమకథతో రూపొందిన ఈ సినిమా ప్రచార చిత్రాలు యువతను ఆకట్టుకుంటున్నాయి. ఫిబ్రవరి 23న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ముఖ్య గమనిక విరాన్‌ ముత్తంశెట్టి హీరోగా.. కెమెరామెన్‌ వేణు మురళీధర్‌ తెరకెక్కించిన చిత్రం ‘ముఖ్య గమనిక’ (Mukhya Gamanika). లావణ్య కథానాయిక.&nbsp; రాజశేఖర్‌, సాయికృష్ణ సంయుక్తంగా నిర్మించారు. ‘థ్రిల్లింగ్‌ అంశాలతో సాగే ఫ్యామిలీ ఎమోషనల్‌ డ్రామాగా ఈ చిత్రాన్ని రూపొందించినట్లు చిత్ర బృందం తెలిపింది. ఈ మూవీ కూడా ఫిబ్రవరి 23నే విడుదల కానుంది. సైరెన్‌ జయం రవి, అనుపమ పరమేశర్వన్‌, కీర్తి సురేశ్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన యాక్షన్‌ డ్రామా ‘సైరెన్‌’ (Siren). ఆంటోని భాగ్యరాజ్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ తమిళ చిత్రాన్ని తెలుగులో గంగ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై మహేశ్వర్‌ రెడ్డి మూలి విడుదల చేస్తున్నారు. ఫిబ్రవరి 23న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. కీర్తిసురేష్‌ పోలీసు ఆఫీసర్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో జయం రవి రెండు విభిన్నమైన పాత్రలు పోషించారు. ఆర్టికల్‌ 370 అందాల తార యామీ గౌతమ్‌ (Yami Gautam) ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్‌ చిత్రం ‘ఆర్టికల్‌ 370’ (article 370). ఆదిత్య సుహాస్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఆర్టికల్‌ 370 నేపథ్యంలో కశ్మీర్‌లో జరిగిన పరిస్థితుల ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. ఫిబ్రవరి 23న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఓటీటీలో వచ్చే చిత్రాలు/సిరీస్‌లు ఇవే మరిన్ని OTT చిత్రాలు &amp; వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి https://telugu.yousay.tv/tfidb/ott Title CategoryLanguagePlatformRelease DateApartment 404Series&nbsp;English/KoreanAmazon PrimeFeb 23PoacherMovieTelugu&nbsp;Amazon PrimeFeb 23Will Trent&nbsp;Series&nbsp;EnglishDisney+hotstarFeb 21Malaikottai VaalibanMovie&nbsp;MalayalamDisney+hotstarFeb 23The Buried TruthAvatar the Last AirbenderSeriesEnglish&nbsp;Netflix&nbsp;Feb 23&nbsp;The Buried TruthSeries&nbsp;HindiNetflix&nbsp;March 17
    ఫిబ్రవరి 19 , 2024
    Telugu OTT Releases: ఈ వారం థియేటర్లు, ఓటీటీలలో సందడి చేసే సినిమాలు ఇవే..!
    Telugu OTT Releases: ఈ వారం థియేటర్లు, ఓటీటీలలో సందడి చేసే సినిమాలు ఇవే..!
    ఈ వారం కూడా పలు సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. డిసెంబర్‌ మెుదటి వారంలో ఆహ్లాదకరమైన వినోదాన్ని అందించేందుకు రాబోతున్నాయి. నవంబర్‌ 27 - డిసెంబర్‌ 3 తేదీల మధ్య పలు సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. అలాగే ఓటీటీలో కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్‌ కాబోతున్నాయి.&nbsp; అవేంటో ఈ కథనంలో చూద్దాం. థియేటర్‌లో రిలీజయ్యే చిత్రాలు: యానిమల్‌&nbsp; రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor) కథానాయకుడిగా సందీప్‌ వంగా దర్శకత్వంలో రూపొందిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘యానిమల్‌’ (Animal). రష్మిక హీరోయిన్‌గా చేసింది. బాబీ దేవోల్‌ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబరు 1న హిందీ, తెలుగు భాషల్లో విడుదల కానుంది. ‘అర్జున్‌ రెడ్డి’ తీసిన సందీప్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండటం, అంచనాలు పెంచేలా ట్రైలర్‌ ఉండటంతో ‘యానిమల్‌’పై అటు బాలీవుడ్‌తో పాటు, తెలుగులోనూ క్రేజ్‌ ఏర్పడింది. ఈ సినిమా రన్‌టైమ్‌ 3 గంటలా 21 నిమిషాలు కావడం విశేషం.&nbsp; అథర్వ కార్తిక్‌రాజు కథానాయకుడిగా రూపొందిన క్రైమ్‌ థ్రిల్లర్‌ చిత్రం ‘అథర్వ’ (Atharva). సిమ్రాన్‌ చౌదరి, ఐరా ఇందులో హీరోయిన్లుగా చేశారు. మహేశ్‌రెడ్డి దర్శకత్వం వహించారు. సుభాష్‌ నూతలపాటి సినిమాను నిర్మించారు. నేర నేపథ్యం, థ్రిల్లింగ్‌ అంశాలతో కూడిన ఈ చిత్రం ఆద్యంతం ఆసక్తిని రేకెత్తిస్తుందని చిత్ర బృందం చెబుతోంది. డిసెంబరు 1న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. కాలింగ్‌ సహస్ర జబర్ధస్త్‌ ఫేమ్‌ సుడిగాలి సుధీర్ హీరో తెరకెక్కిన చిత్రం ‘కాలింగ్‌ సహస్ర’ (Calling Sahasra). ఇందులో సుధీర్‌కు జోడీగా డాలీషా నటించింది. అరుణ్‌ విక్కిరాలా సినిమాను తెరకెక్కించారు.&nbsp; విజేష్‌ తయాల్‌, చిరంజీవి పమిడి, వెంకటేశ్వర్లు కాటూరి నిర్మించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబరు 1న విడుదల కానుంది. సస్పెన్స్‌, థ్రిల్లర్‌ జానర్‌లో ఈ మూవీ రూపొందింది. ఉపేంద్ర గాడి అడ్డా ఈ వారమే రాబోతున్న మరో చిన్న సినిమా ‘ఉపేంద్ర గాడి అడ్డా’ (Upendra gadi adda). కంచర్ల ఉపేంద్ర, సావిత్రి కృష్ణ జంటగా నటించారు. ఆర్యన్‌ సుభాన్‌ దర్శకత్వం వహించారు. కంచర్ల అచ్యుతరావు సినిమాను నిర్మించారు. వాణిజ్య అంశాలతో నిండిన మాస్‌ చిత్రమిదని నిర్మాతలు తెలిపారు. ఇప్పుడున్న ట్రెండ్‌కు తగ్గట్లుగా యువతరాన్ని ఆకర్షించేలా సినిమాను తెరెకక్కించినట్లు చెప్పారు. డిసెంబరు 1న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. విక్రమ్‌ రాథోడ్‌ విజయ్‌ ఆంటోనీ హీరోగా బాబు యోగేశ్వరన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ద్విభాషా (తెలుగు, తమిళం) చిత్రం ‘విక్రమ్‌ రాథోడ్‌’ (Vikram Rathod). అపోలో ప్రొడక్షన్స్, ఎస్‌ఎన్‌ఎస్‌ మూవీస్‌ సమర్పణలో రావూరి వెంకటస్వామి, ఎస్‌.కౌశల్యా రాణి నిర్మించారు. ఈ చిత్రాన్ని డిసెంబరు 1న విడుదల చేస్తున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. సురేష్‌ గోపి, రమ్య నంబీశన్, సోనూసూద్, సంగీత ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమాకు ఇళయరాజా సంగీతం అందిస్తున్నాడు. ఓటీటీలో రిలీజయ్యే చిత్రాలు / వెబ్‌సిరీస్‌లు దూత యువ సామ్రాట్ నాగచైతన్య, విక్రమ్ కె. కుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన వెబ్ సిరీస్ ‘దూత’. సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఈ సిరీస్‌ను రూపొందించారు. ఎనిమిది ఎపిసోడ్‌ల ఈ సిరీస్‌లో జర్నలిస్ట్ సాగర్‌గా చైతన్య నటించారు. అమెజాన్‌ వేదికగా డిసెంబర్ 1 నుంచి ‘దూత’ ప్రసారం కానుంది. మరిన్ని OTT చిత్రాలు &amp; వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి https://telugu.yousay.tv/tfidb/ott TitleCategoryLanguagePlatformRelease DateCandy Cane LaneMovieEnglishAmazon PrimeDec 1ObliteratedSeriesEnglishNetflixNov 30Family SwitchMovieEnglishNetflixNov 30The Bad GuysMovieEnglishNetflixNov 30Mission RaniganjMovieHindiNetflixDec 1Sweet Home Season 1Web SeriesEnglishNetflixDec 1The equalizer 3MovieEnglishNetflixDec 1Catering ChristmasMovieEnglishNetflixDec 1Chinna&nbsp;MovieTelugu/TamilDisney+HotstarNov 28Indiana JonesMovieEnglishDisney+HotstarDec 1monster inside&nbsp;MovieEnglishDisney+HotstarDec 1Martin luther kingMovieTeluguSonyLIVNov 29DhoothaWeb SeriesTeluguAmazon PrimeDec 1
    డిసెంబర్ 11 , 2023
    This Week OTT Movies : ఈ వారం థియేటర్లు / ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాల లిస్ట్ ఇదే!
    This Week OTT Movies : ఈ వారం థియేటర్లు / ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాల లిస్ట్ ఇదే!
    గత వారం లాగే ఈ వారం కూడా పలు సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. ఆహ్లాదకరమైన వినోదాన్ని అందించేందుకు రాబోతున్నాయి. డిసెంబర్‌ 4 నుంచి 10వ తేదీల మధ్య పలు సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. అలాగే ఓటీటీలో కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్‌ కాబోతున్నాయి. మరి ఆ సినిమాలు ఏంటి? వాటి విశేషాల ఎలా ఉన్నాయి? ఈ కథనంలో చూద్దాం. థియేటర్లలో విడుదలయ్యే చిత్రాలు హాయ్‌ నాన్న నేచురల్‌ స్టార్‌ నాని (Nani) నటించిన లేటెస్ట్‌ మూవీ ‘హాయ్‌ నాన్న’ (Hi Nanna). ఈ సినిమా తండ్రీకూతుళ్ల అనుబంధం నేపథ్యంలో రూపొందింది. ఇందులో హీరోయిన్‌గా మృణాల్‌ ఠాకూర్‌ (Mrunal Thakur) చేసింది. శ్రుతిహాసన్‌ (Shruti Haasan), బేబీ కియారా కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాతో శౌర్యువ్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. 2 గంటల 5 నిమిషాల నిడివితో రూపొందిన ఈ సినిమా పాన్‌ ఇండియా స్థాయిలో డిసెంబరు 7న విడుదల కానుంది. ఎక్స్‌ట్రా: ఆర్డినరీమ్యాన్‌ హీరో నితిన్‌ (Nithiin) కొత్త మూవీ ‘ఎక్స్‌ట్రా: ఆర్డినరీమ్యాన్‌’ (Extra: OrdinaryMan) ఈ వారమే రిలీజ్‌ కాబోతోంది. ఇందులో వక్కంతం వంశీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హీరోయిన్‌గా శ్రీలీల నటించింది. ప్రముఖ హీరో రాజశేఖర్‌ (Rajasekhar) కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రంలో నితిన్‌ జూనియర్‌ ఆర్టిస్ట్‌గా కనిపించనున్నారు. సినిమాను చూస్తున్నంత సేపు ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుతారని చిత్ర యూనిట్‌ ధీమా వ్యక్తం చేసింది. ఈ చిత్రం డిసెంబరు 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. చండిక వీరు, శ్రీహర్ష, కుషి చౌహన్‌, నిషా సింగ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘చండిక’ (Chandika). హారర్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా ఈ సినిమా రూపొందింది. తోట కృష్ణ దర్శకత్వం వహించారు. కె.వి.పాపారావు నిర్మించిన ఈ సినిమా డిసెంబర్‌ 8న విడుదల కానుంది.&nbsp; ఓటీటీలో రిలీజయ్యే చిత్రాలు/వెబ్‌సిరీస్‌లు ఇక ఈ వారం ఓటీటీ ప్రియులకు పండగే అని చెప్పవచ్చు. ఎందుకంటే 32కు పైగా చిత్రాలు / వెబ్‌సిరీస్‌లు ఈ వారం ఓటీటీలోకి రాబోతున్నాయి. వాటిలో ముఖ్యమైనవి ఇప్పుడు చూద్దాం.&nbsp; TitleCategoryLanguagePlatformRelease DateJigarthanda DoubleXMovieTelugu/TamilNetflixDec 8Japan&nbsp;MovieTelugu/TamilNetflixDec 11The archies&nbsp;MovieHindiNetflixDec 7Leave the World BehindMovieEnglishNetflixDec 8Dhak DhakMovieHindiNetflixDec 8VadhuvuWeb SeriesTeluguDisney+HotstarDec 8Mast Mein Rehne KaMovieHindiAmazon PrimeDec 8Kadak SinghMovieHindiZee 5Dec 8Koose Muniswamy VeerappanDocumentaryTeluguZee 5Dec 8ChamakWeb SeriesHindiSonyLIVDec 7Maa oori polimera 2MovieTeluguAhaDec 8 మరిన్ని OTT చిత్రాలు &amp; వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి https://telugu.yousay.tv/tfidb/ott
    డిసెంబర్ 04 , 2023
    This Week OTT Movies: ఈ వారం థియేటర్లు / OTTలో రిలీజ్ కానున్న సినిమాలు ఇవే!
    This Week OTT Movies: ఈ వారం థియేటర్లు / OTTలో రిలీజ్ కానున్న సినిమాలు ఇవే!
    ఈ వారం కూడా పలు సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి.&nbsp; ఆహ్లాదకరమైన వినోదాన్ని అందించేందుకు రాబోతున్నాయి. సెప్టెంబర్‌ 4 నుంచిసెప్టెంబర్‌ 10 తేదీల మధ్య పలు సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. అలాగే ఓటీటీలో కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్‌ కాబోతున్నాయి. మరి ఆ సినిమాలు ఏంటి? వాటి విశేషాల ఎలా ఉన్నాయి? ఈ కథనంలో చూద్దాం. థియేటర్లలో విడుదలయ్యే చిత్రాలు జవాన్‌ బాలీవుడ్‌ బాద్‌షా షారుక్ ఖాన్ లేటెస్ట్ మూవీ ‘జవాన్’ ఈ వారమే థియేటర్లలోకి రానుంది. తమిళ డైరెక్టర్‌ అట్లీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సెప్టెంబర్‌ 7న (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో షారుక్‌కు జోడీగా నయనతార నటించింది. విజయ్ సేతుపతి విలన్‌గా చేశారు. ఈ మూవీలో షారుక్ డ్యూయల్ రోల్‌లో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ మూవీపై భారీ బజ్ క్రియేట్ అయ్యింది. జవాన్ నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై హైప్‌ను పెంచేశాయి. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి అనుష్కా శెట్టి, నవీన్ పోలిశెట్టి ప్రధానపాత్రల్లో నటించిన ఫీల్‌గుడ్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పోలిశెట్టి’. పి.మహేశ్‌ బాబు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని వంశీ, ప్రమోద్‌&nbsp;నిర్మించారు. కాగా, ఈ చిత్రం కూడా ఈ వారమే ప్రేక్షకులను పలకరించనుంది. సెప్టెంబర్‌ 7న (శుక్రవారం) విడుదల కాబోతోంది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై ఆడియన్స్‌లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన చిత్ర టీజర్‌, ట్రైలర్‌ చిత్రంపై అంచనాలు పెంచేశాయి. ఓటీటీలో రిలీజయ్యే చిత్రాలు/వెబ్‌సిరీస్‌లు జైలర్‌ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ నటించిన బ్లాక్‌బాస్టర్‌ చిత్రం ‘జైలర్‌’ ఈ వారం ఓటీటీలోకి రానుంది. సెప్టెంబర్‌ 7న అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కాబోతోంది. తెలుగుతో పాటు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో మూవీని వీక్షించవచ్చు. ఆగస్టు 10న థియేటర్లలో రిలీజ్ అయిన జైలర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు రూ.600కోట్లకుపై గ్రాస్ కలెక్షన్లను సాధించింది. జైలర్ చిత్రానికి&nbsp; నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించగా.. అనిరుధ్ సంగీతం అందించారు. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ ఈ సినిమాను నిర్మించారు. &nbsp; TitleCategoryLanguagePlatformRelease DateShane GillisMovieEnglishNetflixSep 05Scout’s HonorMovieEnglishNetflixSep 05kung fu panda 3SeriesEnglishNetflixSep 07top boy season 2SeriesEnglishNetflixSep 07One shotSeriesEnglishAmazon primeSep 07Sitting in Bars With CakeMovieEnglishAmazon primeSep 06i'm groot season 2SeriesEnglishDisney + HotstarSep 06LoveMovieTamilAhaSep 08Love on the roadMovieEnglishBook My ShowSep 08 .
    సెప్టెంబర్ 04 , 2023

    @2021 KTree