• TFIDB EN
  • ఆయ్
    UATelugu
    కార్తీక్, సుబ్బు, హరి బాల్య స్నేహితులు. వర్క్ ఫ్రమ్ హోం కోసం ఊరికి వచ్చిన కార్తీక్ పల్లవి అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. ఒకే కులం అని భావించి కార్తీక్‌ను కూడా పల్లవి ఇష్టపడుతుంది. అయితే నిజం తెలిసి అతడ్ని వదిలేసి ఇంకో పెళ్లికి రెడీ అవుతుంది. వారిద్దరిని కలిపేందుకు సుబ్బు, హరి ఎలాంటి పాట్లు పడ్డారు? చివరికీ వారు ఒక్కటయ్యారా? లేదా? అన్నది స్టోరీ.
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌Netflixఫ్రమ్‌
    ఇన్ ( Telugu )
    Watch
    2024 June 256 months ago
    నార్నే నితిన్ హీరోగా నటిస్తున్న ఆయ్ సినిమా విడుదల తేదీ ప్రకటిస్తూ రిలీజ్ పోస్టర్ విడుదల చేశారు.
    రివ్యూస్
    YouSay Review

    Aay Movie Review: ఎన్టీఆర్‌ బావమరిది ఖాతాలో మరో హిట్‌ పడినట్లేనా?

    ఎన్టీఆర్‌ బావ మరిది నార్నే నితిన్‌ నటించిన రెండో చిత్రం ‘ఆయ్‌’. మ్యాడ్‌ చిత్రంతో సాలిడ్‌ విజయాన్ని అందుకున్న ఈ యంగ్‌ హీరో తన సెకండ్‌ హిట్‌ కోసం ఈ వారం...read more

    How was the movie?

    తారాగణం
    నార్నే నితిన్
    నయన్ సారిక
    అంకిత్ కొయ్య
    మైమ్ గోపి
    సిబ్బంది
    అంజి కంచిపల్లిదర్శకుడు
    బన్నీ వాసు
    నిర్మాత
    విద్యా కొప్పినీడినిర్మాత
    ఎడిటోరియల్ లిస్ట్
    కథనాలు
    <strong>Telugu Movies 2024: ‘కల్కి’, ‘హనుమాన్‌’ సరసన ‘ఆయ్‌’, ‘కమిటీ కుర్రోళ్లు’.. ఇది మామూలు సక్సెస్‌ కాదు భయ్యా!&nbsp;</strong>
    Telugu Movies 2024: ‘కల్కి’, ‘హనుమాన్‌’ సరసన ‘ఆయ్‌’, ‘కమిటీ కుర్రోళ్లు’.. ఇది మామూలు సక్సెస్‌ కాదు భయ్యా!&nbsp;
    2024 సంవత్సరం టాలీవుడ్‌కు బాగా కలిసొచ్చింది. ఈ ఏడాదిలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ప్రభాస్‌ నటించిన ‘కల్కి 2898 ఏడీ’ నిలిచింది. సంక్రాంతి కానుకగా వచ్చిన ‘హనుమాన్‌’ మూవీ సైతం జాతీయ స్థాయిలో సత్తా చాటి మంచి వసూళ్లు సాధించింది. అయితే ఈ రెండు చిత్రాలు భారీ బడ్జెట్‌తో రూపొందాయి. కానీ తక్కువ బడ్జెట్‌తో రూపొందిన టిల్లు స్క్వేర్‌, కమిటీ కుర్రోళ్లు, ఆయ్‌ వంటి చిత్రాలు సైతం కలెక్షన్ల పరంగా ఆ రెండు చిత్రాలతో చేరి సమానంగా నిలిచాయి. పెట్టిన ఖర్చుకు దాదాపు మూడింతలు రికవరి సాధించి సత్తా చాటాయి. బడ్జెట్‌ - కలెక్షన్స్‌ మధ్య భారీ వ్యత్యాసం కలిగిన టాప్‌ 5 తెలుగు చిత్రాలుగా నిలిచాయి. ఆ వివరాలేంటో ఈ ప్రత్యేక కథనంలో పరిశీలిద్దాం.  కమిటి కుర్రోళ్లు (Committee Kurrollu) నిహారిక కొణిదెల నిర్మించిన తొలి సినిమా ‘కమిటీ కుర్రోళ్లు’. 11 మంది కొత్త హీరోలతో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 10న విడుదలై మంచి టాక్‌ తెచ్చుకుంది. వరల్డ్‌ వైడ్‌గా రూ.17.60 కోట్లు కొల్లగొట్టింది. ఈ సినిమా నిర్మాణానికి రూ.6 కోట్లు మాత్రమే ఖర్చు అయ్యింది. బడ్జెట్‌తో పోలిస్తే మూడింతలు వసూళ్లు సాధించి ‘కమిటీ కుర్రోళ్లు’ మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. ప్రస్తుతం ఈటీవీ విన్‌ వేదికగా ఈ మూవీ స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. అక్కడ కూడా ఈ మూవీకి మంచి రెస్పాన్స్‌ వస్తున్నట్లు ఓటీటీ వర్గాలు తెలిపాయి.&nbsp; ఆయ్‌ (Aay) నార్నే నితిన్, నయన్ సారిక హీరోయిన్లుగా నటించిన రీసెంట్‌ చిత్రం 'ఆయ్‌' (Aay). అంజి కె. మణిపుత్ర దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఆగస్టు 15న రిలీజై హిట్‌ టాక్‌ సొంతం చేసుకుంది. ‘మిస్టర్‌ బచ్చన్‌’, ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ వంటి స్టార్ హీరోల చిత్రాలకు కంటే బెటర్‌గా వసూళ్లు సాధించింది. ఓవరాల్‌గా రూ.14.10 కోట్లు తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమాకు రూ.6-8 కోట్లు ఖర్చు అయినట్లు సమాచారం. ఓటీటీ రైట్స్‌ కూడా కలుపుకుంటే ‘ఆయ్‌’ దాదాపు మూడింతలు లాభాలు సాధించినట్లు చిత్ర వర్గాలు పేర్కొన్నాయి.&nbsp; కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD) రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ‘కల్కి 2898 ఏడీ’ చిత్రం ఇండియన్‌ బాక్సాఫీస్‌ను షేక్‌ చేసింది. వరల్డ్‌ వైడ్‌గా రూ.1200-1300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. మైథాలజీ &amp; ఫ్యూచరిక్‌ జానర్‌లో రూపొందిన ఈ చిత్రానికి దాదాపు రూ.600 కోట్లు ఖర్చయ్యింది. అయితే దానికి రెట్టింపు కంటే ఎక్కువ వసూళ్లు సాధించి కల్కి అందరి చేత ప్రశంసలు అందుకుంది. పాన్ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ మరోమారు తన సత్తా ఏంటో బాక్సాఫీస్‌ వద్ద నిరూపించుకున్నాడు. కాగా, ఈ సినిమాలో ప్రభాస్‌తో పాటు అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌, దీపికా పదుకొనే వంటి స్టార్స్‌ నటించారు. విజయ్‌ దేవరకొండ, దుల్కర్‌ సల్మాన్‌, ఎస్‌.ఎస్‌. రాజమౌళి, రామ్‌గోపాల్‌ వర్మ వంటివారు స్పెషల్‌ క్యామియోలతో అలరించారు.&nbsp; టిల్లు స్క్వేర్‌ (Tillu Square) సిద్ధూ జొన్నలగడ్డ, అనుపమా పరమేశ్వరన్‌ జంటగా నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్‌’ (Tillu Square). ఈ ఏడాదిలో మార్చిలో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ప్రపంచవ్యాప్తంగా రూ.135 కోట్లకు పైగా కొల్లగొట్టింది. ప్రముఖ నిర్మాత నాగదేవర సూర్యవంశీ ఈ సినిమా నిర్మాణానికి దాదాపు రూ.40 కోట్లు ఖర్చు చేశారు. దానికి మూడింతలకు పైగా టిల్లు స్క్వేర్‌ వసూలు చేయడం విశేషం. ఈ సినిమా ద్వారా సిద్దు జొన్నల గడ్డ తొలిసారి రూ.100 కోట్ల క్లబ్‌లో చేరాడు.&nbsp; హనుమాన్‌ (Hanuman) తేజసజ్జ హీరోగా టాలెంటెడ్‌ డైరెక్టర్ ప్రశాంత్‌ వర్మ తెరకెక్కించిన ‘హనుమాన్‌’ దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజైన ఈ చిత్రం ఎవరూ ఊహించని విధంగా రూ.350 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. వాస్తవానికి ఈ సినిమా బడ్జెట్‌ రూ.40 కోట్లు మాత్రమే. కానీ పెట్టిన ఖర్చుకు దాదాపు 9 రెట్లు వసూళ్లు సాధించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. దీంతో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ పేరు దేశ వ్యాప్తంగా మార్మోగింది. హనుమాన్‌ క్రేజ్‌తో ప్రశాంత్‌ స్టార్‌ డైరెక్టర్‌గా మారిపోయారు. నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తేజతో ఓ సినిమాను సైతం అనౌన్స్‌ చేశాడు. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కనుంది. దాని తర్వాత హనుమాన్‌ సీక్వెల్‌ ‘జై హనుమాన్‌’పై ప్రశాంత్‌ వర్మ ఫోకస్‌ పెట్టనున్నారు.&nbsp;
    సెప్టెంబర్ 17 , 2024
    <strong>Mr. Bachchan Vs Double Ismart: డే 1 కలెక్షన్స్‌లో విన్నర్‌ ఎవరంటే?</strong>
    Mr. Bachchan Vs Double Ismart: డే 1 కలెక్షన్స్‌లో విన్నర్‌ ఎవరంటే?
    స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆగస్టు 15న భారీ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. రామ్‌ - పూరి కాంబోలోని 'డబుల్ ఇస్మార్ట్‌', రవితేజ - హరిష్‌ శంకర్‌ కలయికలో తెరకెక్కిన 'మిస్టర్‌ బచ్చన్‌' చిత్రాలు ప్రేక్షకులను పలకరించాయి. అలాగే తమిళ స్టార్‌ హీరో విక్రమ్‌ చేసిన 'తంగలాన్‌', ఎన్టీఆర్‌ బావమరిది నటించిన 'ఆయ్‌' థియేటర్లలో సందడి చేశాయి. వీటిలో రవితేజ, రామ్‌ చిత్రాలు మిశ్రమ స్పందన తెచ్చుకోగా, విక్రమ్‌, నార్నే నితిన్‌ చిత్రాలు పాజిటివ్‌ టాక్‌ సొంతం చేసుకున్నాయి. మరి తొలి రోజున ఏ చిత్రం కలెక్షన్స్‌ ఎలా ఉన్నాయి? ఏ చిత్రం అత్యధిక వసూళ్లు రాబట్టింది? ఈ కథనంలో తెలుసుకుందాం.&nbsp; డబుల్ ఇస్మార్ట్‌ వసూళ్లు ఎంతంటే! రామ్‌ పోతినేని (Ram Pothineni) హీరోగా పూరి జగన్నాథ్‌ (Puri Jagannadh) దర్శకత్వంలో రూపొందిన ‘డబుల్ ఇస్మార్ట్‌’ (Double Ismart) చిత్రం తొలి రోజు డివైడ్‌ టాక్‌ తెచ్చుకుంది. అయినప్పటికీ మంచి వసూళ్లను సాధించి పర్వాలేదనిపించింది. ఈ చిత్రం తొలిరోజున వరల్డ్‌ వైడ్‌గా రూ.12.45 కోట్లు (GROSS) రాబట్టినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు స్పెషల్‌ పోస్టర్‌ను సైతం రిలీజ్‌ చేశారు. ఇక ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో రూ.8.35 కోట్లకు పైగా వసూలు చేసినట్లు ట్రేడ్‌ వర్గాలు తెలిపాయి. రెస్ట్‌ ఆఫ్‌ ఇండియా, ఓవర్సీస్‌ కలిపి మరో రూ. 4 కోట్ల రాబడి వచ్చినట్లు తెలిపాయి. లాంగ్‌ వీకెండ్‌ కావడంతో ఈ సినిమా వసూళ్లు మరింత పెరిగే ఛాన్స్ ఉందని అభిప్రాయపడ్డాయి. మిస్టర్‌ బచ్చన్ పరిస్థితి ఏంటంటే! మాస్ మహారాజా రవితేజ (Ravi Teja), క్రియేటివ్ డైరెక్టర్ హరీష్ శంకర్ (Harish Shankar) కాంబినేషన్‌లో వచ్చిన మూడో చిత్రం ‘మిస్టర్ బచ్చన్‌’ (Mr. Bachchan)పై రిలీజ్‌కు ముందు వరకూ భారీగా అంచనాలే ఉన్నాయి. అయితే గురువారం (ఆగస్టు 15) రిలీజైన ఈ మూవీ మిక్స్డ్‌ టాక్‌ తెచ్చుకుంది. కాగా, వరల్డ్‌ వైడ్‌గా రూ. 5.3 కోట్లు (GROSS) రాబట్టినట్లు ట్రేడ్‌ వర్గాలు ప్రకటించాయి. ఆగస్టు 14న వేసిన ప్రీమియర్ల ద్వారా రూ.1.8 కోట్లు వసూలైనట్లు పేర్కొన్నాయి. తొలి ఆట నుంచి పెద్ద ఎత్తున ట్రోలింగ్స్‌ రావడం మిస్టర్‌ బచ్చన్‌ వసూళ్లపై ప్రభావం చూపినట్లు అభిప్రాయపడ్డాయి. అయితే లాంగ్‌ వీకెండ్‌ ఉండటంతో ఈ మూవీ పుంజుకునే అవకాశం లేకపోలేదని చెప్పుకొచ్చాయి. కాగా, ఇందులో రవితేజ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా చేసింది. ఈ మూవీ ద్వారానే తొలిసారి తెలుగు చిత్ర సీమకు పరిచయమైంది.&nbsp; తంగలాన్‌ టాప్‌! తమిళ స్టార్‌ హీరో విక్రమ్‌ నటించిన ‘తంగలాన్‌’ చిత్రం తొలి రోజున భారీ వసూళ్లను రాబట్టింది. రిలీజైన చిత్రాల్లో కెల్లా అత్యధిక వసూళ్లను సాధించింది. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ.26.44 కోట్లు (GROSS) కొల్లగొట్టినట్లు మేకర్స్‌ అధికారికంగా ప్రకటించారు. నార్త్‌లో రిలీజ్‌ కాకుండానే ఈ స్థాయి వసూళ్లు సాధించడం పట్ల సర్వత్ర ప్రశంసలు వ్యక్తమవుతోంది. ఇక నార్త్‌లో ఈ నెల 30న తంగలాన్‌ రిలీజ్‌ కానుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో మంచి మౌత్‌ టాక్‌తో దూసుకెళ్తున్న తంగలాన్‌ ఈ వీకెండ్‌ పూర్తయ్యే సరికి భారీగానే వసూళ్లు సాధించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇందులో విక్రమ్‌ నటనపై సర్వత్ర ప్రశంసలు కురుస్తున్నాయి.&nbsp; ‘ఆయ్‌’కి మంచి వసూళ్లు! 'మ్యాడ్‌' చిత్రంతో అందరి దృష్టిని ఆకర్షించిన ఎన్టీఆర్‌ బామ మరిది నార్నె నితిన్‌ తన రెండో చిత్రం 'ఆయ్‌' మరోమారు ప్రేక్షకులను పలకరించాడు. విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం తొలి రోజు పాటిటివ్‌ టాక్‌ తెచ్చుకుంది. ఇక డే 1 కలెక్షన్ల విషయానికి వస్తే ఈ మూవీ రూ.2 కోట్లు (GROSS) రాబట్టినట్లు ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రూ.8 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ తొలి రోజే ఆకర్షణీయమైన వసూళ్లు సాధించడంతో చిత్ర యూనిట్‌ సంతోషంగా ఉంది. ఈ వీకెండ్‌ నాటికి ఈజీగానే లాభాల్లోకి వెళ్లిపోతుందని అభిప్రాయపడుతోంది.
    ఆగస్టు 16 , 2024
    <strong>Tollywood New Directors: టాలీవుడ్‌లో కొత్త డైరెక్టర్ల హవా.. తొలి చిత్రంతోనే బ్లాక్‌ బాస్టర్ విజయాలు!</strong>
    Tollywood New Directors: టాలీవుడ్‌లో కొత్త డైరెక్టర్ల హవా.. తొలి చిత్రంతోనే బ్లాక్‌ బాస్టర్ విజయాలు!
    టాలీవుడ్‌లో కొత్త శకం మెుదలైంది. వినూత్న ఆలోచనలు కలిగిన దర్శకులు కొత్త కథలతో వచ్చి బ్లాక్ బాస్టర్‌ విజయాలను అందుకుంటున్నారు. పూరి జగన్నాథ్‌, హరీష్‌ శంకర్‌, శ్రీను వైట్ల, రామ్‌ గోపాల్‌ వర్మ, వి.వి. వినాయక్‌, తేజ, గుణశేఖర్‌ వంటి స్టార్‌ డైరెక్టర్లు హిట్స్‌ లేక ఇబ్బంది పడుతుంటే కుర్ర దర్శకులు మాత్రం ఫస్ట్ సినిమాతోనే అలవోకగా బ్లాక్‌ బాస్టర్‌ విజయాలను సొంతం చేసుకుంటున్నారు. ఫ్రెష్‌ కథలు, వైవిధ్యమైన మేకింగ్‌తో తెలుగు ఆడియన్స్‌ను ఆకట్టుకుంటున్నారు. బాక్సాఫీస్‌ వద్ద పెద్ద సినిమాలకు ధీటుగా వసూళ్లు సాధిస్తున్నారు. ఇంతకీ ఆ యంగ్‌ డైరెక్టర్స్ ఎవరు? వారు చేసిన చిత్రాలు ఏంటి? ఈ కథనంలో పరిశీలిద్దాం.&nbsp; అంజి కె. మణికుమార్‌ ఎన్టీఆర్‌ బామ మరిది నార్నే నితిన్‌ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్‌ చిత్రం 'ఆయ్‌' (Aay). అంజి కె. మణిపుత్ర (Anji K. Maniputhra) ఈ చిత్రం ద్వారానే దర్శకుడిగా పరిచయం అయ్యారు. తక్కువ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం ‘డబుల్‌ ఇస్మార్ట్‌’, ‘మిస్టర్‌ బచ్చన్‌’, ‘తంగలాన్‌ ’వంటి పెద్ద హీరోల సినిమాలను తట్టుకొని నిలబడింది. బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. గోదావరి నేపథ్యంలో తనదైన మేకింగ్‌ స్టైల్‌తో దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించి ప్రసంసలు అందుకున్నారు. అమలాపురం నేపథ్యం, చిన్న నాటి స్నేహితులు, మనుషుల్లో కనిపించే అమాయకత్వం, పట్టింపులు, ఆప్యాయతలు, వెటకారం ఇలా అన్నింటిని మేళవిస్తూ దర్శకుడు కథను నడిపించిన తీరు ఎంతగానో ఆకట్టుకుంది.&nbsp; యదువంశీ మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మించిన 'కమిటీ కుర్రోళ్లు' సినిమా బాక్సాఫీస్‌ వద్ద సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. తక్కువ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం రూ.17.76 కోట్లు (GROSS) వసూళ్లు రాబట్టింది. ఈ సినిమాతోనే యదువంశీ (Yadu Vamsi) దర్శకుడిగా పరిచయమయ్యారు. ఓ గ్రామం నేపథ్యంలో కుర్రాళ్లతో సాగిన ఈ కథను అతడు అద్భుతంగా తెరకెక్కించారు. కామెడీతో పాటు 1990ల జ్ఞాపకాలను గుర్తుచేయడం, స్నేహితుల మధ్య బంధం, గోదావరి పల్లె వాతావరణాన్ని ఆకట్టుకునేలా చూపించడంలో డైరెక్టర్‌ సక్సెస్‌ అయ్యాడు.&nbsp; ముఖేశ్‌ ప్రజాపతి అంజలి వేశ్యగా నటించిన లేటెస్ట్ వెబ్‌ సిరీస్‌ 'బహిష్కరణ'. ఈ సిరీస్‌ ద్వారా దర్శకుడిగా ముఖేశ్‌ ప్రజాపతి (Mukesh Prajapati) డెబ్యూ ఇచ్చాడు. ఓటీటీలో వచ్చిన ఈ సిరీస్‌ హిట్‌ టాక్‌ తెచ్చుకొని మంచి వ్యూస్‌ సాధించింది. ఇందులో కుల వివక్షను కళ్లకు కట్టాడు దర్శకుడు. ఊరి పెద్ద అయిన వ్యక్తి అణగారిన వారి పట్ల ఎలా వ్యవహించేవారు? మహిళలను ఎలా హింసించేవారు? అన్నది ఈ సిరీస్‌లో చూపించారు. వేశ్య కోణంలో ముకేశ్‌ ప్రజాపతి తెరకెక్కించిన ఈ రివేంజ్‌ డ్రామా ఓటీటీ ప్రేక్షకులను అలరించింది. శౌర్యువ్‌ నాని రీసెంట్‌ చిత్రం 'హాయ్‌ నాన్న'తో శౌర్యువ్‌ (Shouryuu) దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఒక టిపికల్ సబ్జెక్ట్‌ను తీసుకొని అతడు అందంగా ప్రజెంట్‌ చేసిన విధానం ఆకట్టుకుంది. ముఖ్యంగా తండ్రి కూతుళ్ల మధ్య అనుబంధాన్ని అతడు చక్కగా చూపించారు. భావోద్వేగాలను అద్భుతంగా పండించారు. తొలి చిత్రంతోనే ఎంతో అనుభవం ఉన్న దర్శకుడిగా అతడు ఇంపాక్ట్‌ చూపించాడు. 'హాయ్ నాన్న' చిత్రం పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకోవడంతో పాటు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సైతం సాధించింది.&nbsp; కల్యాణ్‌ శంకర్‌ ఇటీవల కాలంలో వచ్చిన బెస్ట్‌ యూత్ ఎంటర్‌టైనర్‌ చిత్రాల్లో 'మ్యాడ్‌' ఒకటి. దర్శకుడు కల్యాణ్‌ శంకర్‌ (Kalyan Sankar) తన తొలి ప్రయత్నంతోనే సాలిడ్‌ విజయాన్ని అందుకున్నాడు. దర్శకుడిగా తనకు మంచి భవిష్యత్‌ ఉందని కల్యాణ్‌ శంకర్‌ తొలి చిత్రంతోనే చాటి చెప్పాడు. కాలేజీ కుర్రాళ్ల నేపథ్యంలో ఆకట్టుకునే ఫన్‌తో ఈ సినిమాను తెరకెక్కించి ప్రశంసలు అందుకున్నాడు. ఈ చిత్రంలోనే కామెడీ సీన్స్‌, డైలాగ్స్‌ యూత్‌ను విపరీతంగా ఆకట్టుకున్నాయి.&nbsp; కార్తిక్‌ దండు ‘విరూపాక్ష’ చిత్రంతో కార్తిక్‌ దండు దర్శకుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. ఒక డిఫరెంట్ హారర్‌ థ్రిల్లర్‌ కాన్సెప్ట్‌తో ఈ సినిమాను రూపొందించి ప్రశంసలు అందుకున్నాడు. మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్‌ లీడ్‌ రోల్‌లో చేసిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద రూ.100 కోట్ల వరకూ వసూళ్లను రాబట్టింది. కార్తిక్‌ దండు సినిమాను నడిపిన విధానంపై సర్వత్రా ప్రశంసలు కురిశాయి. శ్రీకాంత్ ఓదెల నాని ‘దసరా’ సినిమాతో రూ.100 కోట్ల క్లబ్‌లో చేరాడు. ఈ సినిమాకు దర్శకత్వం వహించింది డెబ్యూ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల. తొలి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకుని ప్రొడ్యూసర్ల దృష్టిని ఆకర్షించాడు. ప్రస్తుతానికి ఈ డైరెక్టర్ తదుపరి సినిమాపై ప్రకటన చేయలేదు. కానీ, గొప్ప సినిమాలు చేయగల సత్తా శ్రీకాంత్‌లో ఉందని నాని కితాబిచ్చాడు. వేణు యెల్దండి కమెడియన్‌గా ఎంట్రీ ఇచ్చిన వేణు అడపాదడపా రోల్స్ చేస్తూ కెరీర్‌ని నెట్టుకొచ్చాడు. కానీ, బలగం సినిమాతో డైరెక్టర్‌గా మారి బంపర్ హిట్ అందుకున్నాడు. ప్రొడ్యూసర్ దిల్‌రాజు ఖజానాను నింపాడు. దీంతో వేణు స్క్రిప్ట్‌ని ప్రొడ్యూస్ చేయడానికి నిర్మాతలు రెడీ అయ్యారు. దిల్ రాజు బ్యానర్‌లోనే వేణు మరో సినిమా తీయనున్నట్లు తెలుస్తోంది. హీరో నానితో అతడు సినిమా తీసే అవకాశముంది.&nbsp; ప్రశాంత్ వర్మ అ!, కల్కి, జాంబి రెడ్డి వంటి విభిన్న కథా చిత్రాలతో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసిన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ‘హనుమాన్’ పాన్‌ ఇండియా డైరెక్టర్‌గా మారారు. 2024 సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ మూవీ మహేష్‌, వెంకటేష్‌, నాగార్జున వంటి స్టార్ హీరోల చిత్రాలను వెనక్కి నెట్టి బ్లాక్‌ బాస్టర్‌ హిట్‌గా నిలిచింది.&nbsp; గౌతమ్ తిన్ననూరి నాని హీరోగా వచ్చిన ‘జెర్సీ’తో గౌతమ్ తిన్ననూరి డైరెక్టర్‌గా పరిచయం అయ్యారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సాధించడంతో పాటు నాని నటనపై ప్రశంసల వర్షం కురిసింది. గౌతమ్ డైరెక్షన్‌కీ ఆ స్థాయిలోనే గుర్తింపు లభించింది. తొలి సినిమాతోనే హీరోలు, ప్రొడ్యూసర్ల కంటపడ్డాడు. ప్రస్తుతం అతడు విజయ్ దేవరకొండతో ‘VD12’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా చేస్తోంది.&nbsp; బుచ్చిబాబు సానా తొలి చిత్రం ‘ఉప్పెన’తో డైరెక్టర్ బుచ్చిబాబు సానా అందరి దృష్టిని ఆకర్షించారు. డిఫరెంట్‌ లవ్‌స్టోరీతో ప్రశంసలు అందుకున్నాడు. తన తర్వాతి చిత్రాన్ని రామ్‌ చరణ్‌తో అనౌన్స్‌ చేసి అందరినీ సర్‌ప్రైజ్‌ చేశారు. ఈ సినిమాలో చరణ్‌ సరసన జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా చేయనుంది. స్పోర్ట్స్‌ డ్రామా బ్యాక్‌డ్రాప్‌లో బుచ్చిబాబు ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. తరుణ్ భాస్కర్ పెళ్లి చూపులు సినిమాతో డైరెక్టర్‌గా పరిచయమై ‘ఈ నగరానికి ఏమైంది’ అంటూ అందరినీ నవ్వించిన డైరెక్టర్ తరుణ్ భాస్కర్. కేవలం డైరెక్టర్‌గానే కాకుండా డైలాగ్ రైటర్‌గానూ తరుణ్ భాస్కర్ రాణిస్తున్నాడు. ‘మీకు మాత్రమే చెప్తా’ సినిమాతో నటుడిగా కూడా ఎంట్రీ ఇచ్చాడు. ఇలా ఇండస్ట్రీలో భవిష్యత్తును పదిలం చేసుకున్నాడీ డైరెక్టర్. ఇటీవల ‘కీడా కోలా’ అనే యూత్‌ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్ తెరకెక్కించారు.&nbsp;
    ఆగస్టు 27 , 2024
    <strong>Aay Movie Review: ఎన్టీఆర్‌ బావమరిది ఖాతాలో మరో హిట్‌ పడినట్లేనా?</strong>
    Aay Movie Review: ఎన్టీఆర్‌ బావమరిది ఖాతాలో మరో హిట్‌ పడినట్లేనా?
    నటీనటులు: నార్నె నితిన్, నయన్ సారిక, కసిరెడ్డి రాజ్ కుమార్, అంకిత్ కొయ్య తదితరులు దర్శకుడు: అంజి కె మణిపుత్ర సంగీత దర్శకుడు: రామ్ మిర్యాల, అజయ్ అరసాడ సినిమాటోగ్రఫీ: సమీర్ కళ్యాణి నిర్మాతలు : బన్నీ వాస్, విద్యా కొప్పినీడి ఎన్టీఆర్‌ బావ మరిది నార్నే నితిన్‌ నటించిన రెండో చిత్రం ‘ఆయ్‌’. మ్యాడ్‌ చిత్రంతో సాలిడ్‌ విజయాన్ని అందుకున్న ఈ యంగ్‌ హీరో తన సెకండ్‌ హిట్‌ కోసం ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అంజి కె.మణిపుత్ర దర్శకత్వం వహించిన ‘ఆయ్‌’ చిత్రంలో నయన్‌ సారిక హీరోయిన్‌గా చేసింది. కాగా, ఈ మూవీ ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉంది? ప్రేక్షకులను మెప్పించిందా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.&nbsp; కథేంటి అమలాపురంకు చెందిన కార్తీక్‌ (నార్నే నితిన్‌) హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగంలో చేరతాడు. కరోనా లాక్‌డౌన్‌ వల్ల ఊరికి వస్తాడు. ఇంటి నుంచి పని చేసుకుంటూనే బాల్య మిత్రులు హరి, సుబ్బుతో సరదాగా గడుపుతుంటాడు. ఈ క్రమంలో పక్క ఊరికి చెందిన పల్లవి (నయన్‌ సారిక)ని ప్రేమిస్తాడు. సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే పల్లవికి కులం పట్టింపులు ఎక్కువ. కార్తీక్‌ తన కులం వాడేనని భావించి ఇష్టపడుతుంది. అతడి కులం వేరని తెలిసి దూరం పెడుతుంది. పెద్దలు కుదిర్చిన పెళ్లికి అంగీకరిస్తుంది. దీంతో కార్తీక్‌ తట్టుకోలేకపోతాడు. మరోవైపు వారిద్దరిని కలిపేందుకు స్నేహితులు హరి, సుబ్బు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ ప్రయత్నం ఫలిచిందా? పల్లవితో కార్తీక్‌ పెళ్లి జరిగిందా? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.&nbsp; ఎవరెలా చేశారంటే కార్తీక్ పాత్రలో నార్నే నితిన్‌ ఆకట్టుకున్నాడు. మెుదటి చిత్రంతో పోలిస్తే నటనకు మంచి స్కోప్‌ ఉన్న పాత్రే అతడికి దక్కింది. హావభావాలు, సంభాషణల్లో అత‌నిలో ప‌రిణ‌తి కనిపించింది. డ్యాన్స్ తోనూ మెప్పించాడు. ఇక పల్లవి పాత్రలో నటించిన నయన్ సారిక తన అందం, అభినయంతో ఆకట్టుకుంది. అచ్చ‌మైన గోదావ‌రి అమ్మాయిగా తెర‌పై సందడి చేసింది. ఫ్రెండ్స్‌ పాత్రల్లో రాజ్‌కుమార్ కసిరెడ్డి, అంకిత్ కోయ చేసిన కామెడీ సినిమాకి హైలెట్‌గా నిలిచింది. ముఖ్యంగా క‌సిరెడ్డి పాత్ర ప్రతీ ఒక్కరికీ గుర్తుండిపోతుంది. మైమ్ గోపి, వినోద్ కుమార్‌లు పాత్రల పరిధి మేరకు నటించారు.&nbsp; డైరెక్షన్‌ ఎలా ఉందంటే దర్శకుడు అంజి ఎంచుకున్న కథ పాతదే అయినప్పటికీ దానిని ప్రెజెంట్‌ చేసిన తీరు మెప్పిస్తుంది. అమలాపురం నేపథ్యం, చిన్ననాటి స్నేహితులు, మనుషుల్లో కనిపించే అమాయకత్వం, ఆప్యాయతలు ఇలా అన్నింటీని మేళవిస్తూ కథను నడిపించారు. ముగ్గురు స్నేహితులు కలిసినప్పటి నుంచి సినిమాలో సందడి మెుదలవుతుంది. ముఖ్యంగా కార్తిక్ ప్రేమలో పడినప్పటి నుంచి కథ ఎంటర్‌టైనింగ్‌గా సాగుతుంది. హీరో ప్రేమ కోసం ఇద్దరు స్నేహితులు చేసే సాయం, ఈ క్రమంలో వారు పడే ఇబ్బందులు నవ్వులు పంచుతాయి. సాఫీగా సాగిపోతున్న కథలో ట్విస్ట్ తీసుకొచ్చి సెకండాఫ్‌పై ఆసక్తి పెంచాడు డైరెక్టర్‌. సెకండాఫ్‌లో ఇరు కుటుంబాల పెద్దలను ఇన్‌వాల్వ్‌ చేసి మంచి సందేశం కూడా ఇచ్చారు. ఈ క్రమంలో క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ సర్‌ప్రైజ్‌ చేస్తుంది. అయితే రొటీన్‌ స్టోరీ, లవ్‌ట్రాక్‌ను కామెడీ డామినేట్‌ చేయడం, లాజిక్‌ లేని సన్నివేశాలు మూవీకి మైనస్‌గా చెప్పవచ్చు.&nbsp; టెక్నికల్‌గా సాంకేతిక అంశాల విషయానికి వస్తే సమీర్‌ కళ్యాణి కెమెరా పనితనం సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. అమలాపురం పరిసరాలు, గ్రామీణ నేపథ్యాన్ని తన కెమెరాతో చూపించిన తీరు మెప్పిస్తుంది. సంగీతం విషయానికొస్తే పాటలు సినిమాకి ప్రాణం పోశాయి. రామ్ మిర్యాల అందించిన సూఫియానా పాట ఎంతో వినసొంపుగా ఉంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. ప్రొడ్యుసర్లు ఖర్చు విషయంలో ఎక్కడా రాజీ పడలేదు.&nbsp; ప్లస్ పాయింట్స్‌ నటీనటులుకామెడీక్లైమాక్స్‌ మైనస్‌ పాయింట్స్‌ రొటిన్‌ స్టోరీఊహకందేలా సాగే కథనం Telugu.yousay.tv Rating : 3/5&nbsp;&nbsp;
    ఆగస్టు 16 , 2024
    <strong>Allu vs Mega Family: అల్లు - మెగా ఫ్యామిలీకి అస్సలు పడట్లేదా? నిర్మాత క్రేజీ కామెంట్స్‌!</strong>
    Allu vs Mega Family: అల్లు - మెగా ఫ్యామిలీకి అస్సలు పడట్లేదా? నిర్మాత క్రేజీ కామెంట్స్‌!
    మెగా (Mega Family), అల్లు ఫ్యామిలీల మధ్య వివాదాలు తలెత్తినట్లు గత కొంతకాలంగా సోషల్‌ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. అల్లు అర్జున్‌ను మెగా ఫ్యామిలీ దూరం పెట్టిదంటూ పెద్ద ఎత్తున సోషల్‌ మీడియాలో వార్తలు వచ్చాయి. ఏపీ మంత్రిగా పవన్‌ కల్యాణ్‌ ప్రమాణ స్వీకారానికి కూాడా అల్లు ఫ్యామిలీ నుంచి కనీసం ఒక్కరు కూడా హాజరు కాకపోవడం ఈ వివాదానికి అప్పట్లో మరింత బలాన్నీ చేకూర్చింది. అయితే తాజాగా ఈ అంశంపై అల్లు, మెగా ఫ్యామిలీకి సన్నిహితంగా ఉండే టాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత బన్నీ వాసు స్పందించారు. ఈ వ్యవహారంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఇవి టాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారాయి.&nbsp; నిర్మాత ఏమన్నారంటే! జూ.ఎన్టీఆర్‌ (Jr NTR) బావమరిది నార్నే నితిన్‌ హీరోగా తెరకెక్కుతున్న 'ఆయ్‌' (AAY) చిత్రాన్ని బన్నీ వాసు నిర్మించారు. తాజాగా ఈ మూవీలోని థీమ్‌ సాంగ్‌ రిలీజ్‌ ఈవెంట్‌ జరగ్గా అందులో బన్నీ వాసు పాల్గొన్నారు. ఈ క్రమంలో అల్లు - మెగా ఫ్యామిలీ మధ్య రాజుకున్న విభేదాలపై ఆయనకు ప్రశ్న ఎదురైంది. దీనిపై బన్నీ వాసు స్పందిస్తూ ‘మెగా, అల్లు ఫ్యామిలీలను 20 ఏళ్లుగా చూస్తున్నా. కుటుంబ సభ్యులంతా కలిసి ఉండాలని చిరంజీవి కోరుకుంటారు. అందుకే ప్రతి సంక్రాంతికి ఫ్యామిలీని తీసుకొని బెంగళూరు వెళ్తుంటారాయన. ఏ కుటుంబంలోనైనా ఒకరు తీసుకున్న నిర్ణయాల వల్ల కొన్ని సందర్భాల్లో ఇష్యూస్‌ వస్తాయి. అంతమాత్రాన బంధం దెబ్బతిన్నట్లు కాదు. ఇలా తాత్కాలికమైన వాటిని హైలైట్‌ చేయడం మంచి పద్ధతి కాదు. వారి బంధం గురించి తెలుసు కాబట్టే నమ్మకంగా చెబుతున్నా. మేమంతా ఒక్కటే అని చెప్పేందుకు వారికి ఒక్క సందర్భం చాలు. సమయం రావాలంతే. ఇప్పుడొస్తున్నవన్నీ పాసింగ్‌ క్లౌడ్స్‌’ అని సమాధానం ఇచ్చారు.&nbsp; వివాదానికి కేంద్ర బిందువు ఇదే! ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు వైకాపా నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిశోర్‌కు మద్దతుగా అల్లు అర్జున్‌ ప్రచారం చేయడంతో వివాదం మెుదలైంది. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు వ్యతిరేకంగా ఉన్న పార్టీలోని అభ్యర్థికి బన్నీ మద్దతు ఇవ్వడాన్ని మెగా ఫ్యాన్స్‌ జీర్ణించుకోలేకపోయారు. దీనికి తోడు మంత్రిగా పవన్‌ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సైతం అల్లు అర్జున్ గానీ, అల్లు ఫ్యామిలీ సభ్యులు గానీ ఎవరూ హాజరు కాలేదు. దీంతో మెగా - అల్లు ఫ్యామిలీల మధ్య దూరం పెరిగినట్లు సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే ఇటీవల పవన్‌ కల్యాణ్‌ను కలిసిన నిర్మాతల బృందంలో అల్లు అరవింద్‌ ఉండటం, ఇద్దరూ ఎంతో అప్యాయంగా పలకరించకోవడంతో ఈ వివాదానికి కాస్త బ్రేకులు పడ్డాయి. అయితే బన్నీపై మాత్రం ఇప్పటికీ మెగా ఫ్యాన్స్ కోపంగానే ఉన్నట్లు సోషల్‌ మీడియాలో వస్తోన్న కామెంట్స్‌ను బట్టి తెలుస్తోంది.&nbsp; అల్లు అర్జున్‌ vs రామ్‌చరణ్‌ అల్లు అర్జున్‌, డైరెక్టర్‌ సుకుమార్‌ కాంబినేషన్‌లో ‘పుష్ప 2’ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఆగస్టు 15న ఈ చిత్రం రిలీజ్‌ కావాల్సి ఉండగా షూటింగ్‌లో జాప్యం వల్ల డిసెంబర్‌ 6కు విడుదల తేదీని మార్చారు. అయితే డిసెంబర్‌లో వచ్చే చిత్రాల రేసులో రామ్‌చరణ్‌ నటిస్తున్న ‘గేమ్‌ ఛేంజర్‌’ కూడా ఉంది. శంకర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని డిసెంబర్‌లో రిలీజ్‌ చేయాలని నిర్మాత దిల్‌రాజు భావిస్తున్నట్లు సమాచారం. ఒకవేళ డిసెంబర్‌ ఫస్ట్‌వీక్‌లోనే గేమ్‌ ఛేంజర్‌ను రిలీజ్‌ చేయాలని భావిస్తే బాక్సాఫీస్‌ వద్ద ‘బన్నీ vs చరణ్‌’ పోరు తప్పదు. అదే జరిగితే మరోమారు మెగా ఫ్యాన్స్‌ రెండుగా చీలిపోయే తమ అభిమాన హీరో చిత్రాన్ని ప్రమోట్‌ చేయడం ఖాయమని సినీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.&nbsp; సుకుమార్‌తో కోల్డ్‌వార్‌? 'పుష్ప: ది రూల్' షూటింగ్ విషయంలో అల్లు అర్జున్, క్రియేటివ్ జీనియస్ సుకుమార్ మధ్య కోల్డ్ వార్ జరుగుతున్నట్లు ఇండస్ట్రీలో ఇటీవల వార్తలు వచ్చాయి. షూటింగ్‌ సక్రమంగా జరగడం లేదని బన్నీ గుర్రుగా ఉన్నట్లు నెట్టింట ప్రచారం జరిగింది. తను పూర్తిగా సహకరిస్తున్నా సుకుమార్‌ సరిగ్గా వినియోగించుకోవడం లేదని ఆయన అసంతృప్తితో ఉన్నారట. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ ఫ్యామిలీతో హాలిడేకి వెళ్లారని తెలుస్తోంది. ఫ్లైట్ జర్నీ సమయంలో ఆయన్ను కొందరు వీడియో తీశారు. ఈ వీడియోలో బన్నీ గడ్డం ట్రిమ్‌ చేసి కనిపించారు. వాస్తవానికి పుష్ప గాడు అంటే ఆ గడ్డం లుక్కే మెయిన్‌. టువంటిది గడ్డాన్ని బన్నీ ట్రిమ్‌ చేసి పర్యటనకు వెళ్లడం ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌గా మారింది. https://twitter.com/i/status/1813405877908726058
    జూలై 20 , 2024
    <strong>Viral Video: ‘దేవర కంటే పొట్టేల్‌ బాగుంది’.. అదేంటి పుసుక్కున అలా అనేశాడు!</strong>
    Viral Video: ‘దేవర కంటే పొట్టేల్‌ బాగుంది’.. అదేంటి పుసుక్కున అలా అనేశాడు!
    అనన్య నాగళ్ల (Ananya Nagalla), యువ చంద్ర (Yuva Chandra) జంటగా నటించిన లేటెస్ట్ చిత్రం పొట్టేల్‌ (Pottel Movie Review). ‘సవారి’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన సాహిత్‌ మోత్కురి ఈ మూవీని తెరకెక్కించారు. ఇటీవల ఏ చిన్న సినిమాకు రాని పబ్లిసిటీ ‘పొట్టేల్‌’కు వచ్చింది. ఈ క్రమంలో శుక్రవారం (అక్టోబర్‌ 25) రిలీజైన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి పాజిటివ్‌ రెస్పాన్స్‌ అందుకుంటోంది. చాలా నేచురల్‌గా, గతంలో జరిగిన వాస్తవ పరిస్థితులకు అద్దం పట్టేలా సినిమా ఉందంటూ ప్రేక్షకులు కామెంట్స్‌ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ ఆడియన్‌ ‘దేవర’తో ‘పొట్టేల్‌’ను పోలుస్తూ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.&nbsp; ‘దేవర కన్నా చాలా బెటర్’ జూ.ఎన్టీఆర్‌ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ‘దేవర’ చిత్రం ఇటీవలే విడుదలై కలెక్షన్ల సునామి సృష్టించింది. బాక్సాఫీస్‌ వద్ద రూ.400 కోట్లకు పైగా వసూలు చేసి పలు రికార్డులను కొల్లగొట్టింది. అనిరుధ్‌ వంటి టాప్ నాచ్ మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఈ సినిమాకు పనిచేశాడు. అటువంటి ‘దేవర’ను పొట్టేల్‌తో పోలుస్తూ ఓ ప్రేక్షకుడు చేసిన కామెంట్స్‌ నెట్టింట ట్రెండింగ్ అవుతోంది. పొట్టేల్‌ సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్‌ వద్దకు వెళ్లిన ఓ యూట్యూబర్‌, ప్రేక్షకుల అభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో థియేటర్‌ నుంచి బయటకు వస్తోన్న ప్రేక్షకున్ని ఆపి సినిమా ఎలా ఉందని ప్రశ్నించాడు. తనకు దేవర కంటే పొట్టేల్‌ సినిమానే చాలా బాగా నచ్చిందని సదరు ప్రేక్షకుడు చెప్పడం వీడియోలో చూడవచ్చు. పెద్ద సినిమాల కంటే చిన్న సినిమాలే బెటరా? అని యూట్యూబర్‌ అడుగుతున్న సందర్భంలో ‘దేవర కంటే ఇదే (పొట్టేల్‌) బాగా నచ్చిదంటూ పునరుద్ఘటించాడు. ప్రస్తుతం ఈ వీడియోను వైరల్ అవుతోంది.&nbsp; https://twitter.com/i/status/1849871631818293722 కంటెంట్‌కే ప్రాధాన్యత సినిమాలో కంటెంట్‌ ఉంటే పెద్దదా, చిన్నదా అన్న సంబంధం లేకుండా తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తుంటారు. పొట్టేల్‌ విషయంలో అదే జరుగుతోంది. తక్కువ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం మంచి స్టోరీతో ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. ఇటీవల వచ్చిన ‘ఆయ్‌’, ‘కమిటీ కుర్రోళ్లు’, ‘మత్తు వదలరా 2’ కూడా ఇదే విధంగా సక్సెస్‌ సాధించాయి. ఆ సినిమాల్లోనూ పెద్ద స్టార్‌ హీరోలు లేరు. అలాగని నిర్మాతలు పెద్ద మెుత్తంలో ఖర్చూ చేయలేదు. మంచి ఎంటర్‌టైనింగ్ ఉండటంతో తెలుగు ఆడియన్స్‌ ఆ సినిమాలకు భారీ విజయాన్ని అందించారు. అయితే దేవర సినిమాను కూడా తెలుగు ప్రేక్షకులు అక్కున చేర్చుకున్నారు. అయినప్పటికీ సదరు ప్రేక్షకుడు దేవర కంటే ‘పొట్టేల్‌’ బాగుందని చెప్పడం ఆసక్తికరంగా మారింది.&nbsp; పొట్టేల్ ఎలా ఉందంటే? దర్శకుడు సాహిత్ మోత్కూరి 1980ల నాటి గ్రామీణ నేప‌థ్యాన్ని ‘పొట్టేల్‌’లో ఆవిష్క‌రిస్తూ ఆరంభంలోనే ప్రేక్ష‌కుల్ని ఆ కాలంలోకి తీసుకెళ్లాడు. తొలి 20 నిమిషాల్లోనే గ్రామంలో లీనమయ్యేలా చేశాడు. పటేళ్ల కాలంలో బడుగు, బలహీన వర్గాలను ఎలా అణగదొక్కారు. ఎలాంటి దారుణానికి ఒడిగట్టేవారు అనే విషయాలను చక్కగా చూపించారు. కులం, మతం, చిన్న పెద్దా అనే అహంకారం అనే అంశాన్ని ప్రొజెక్ట్‌ చేసిన విధానం ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. పాత్ర‌ల ప‌రిచ‌యం, హీరో హీరోయిన్ మ‌ధ్య ప్రేమ‌క‌థ త‌దిత‌ర స‌న్నివేశాలతో ప్రథమార్థాన్ని చక్కగా తీర్చిదిద్దాడు. సెకండ్‌ పార్ట్‌ విషయంలోనే దర్శకుడు కాస్త తడబడినట్లు అనిపిస్తుంది. ప్ర‌ధాన పాత్ర‌ల్ని విల‌న్ ఎంత హింసిస్తే అంతగా భావోద్వేగాలు పండుతాయ‌నే భావ‌న‌తో స‌న్నివేశాల్ని మ‌లిచిన‌ట్టు కనిపిస్తుంది. స‌న్నివేశాలు లాజిక్‌కి దూరంగా సాగుతుంటాయి. అయితే కథ వెనుక ఉన్న ఉద్దేశ్యాన్ని ఆడియన్స్‌కు కనెక్ట్ చేయడంలో డైరెక్టర్‌ సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు.&nbsp; కథ ఇదే మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దుల్లోని గుర్రంగట్టు గ్రామంలో కథ సాగుతుంది. గ్రామ దేవత బాలమ్మకు ఊరి ప్రజలు పుష్కరానికి ఒకసారి జాతర చేసి పొట్టేలును బలిస్తుంటారు. ఆ సమయంలో ఊరి పెద్ద పటేల్ (అజయ్‌) ఒంటిమీదకి అమ్మవారు పూనుతుందని గ్రామస్తుల నమ్మకం. అయితే పటేల్‌ ఊరి ప్రజలను ఎదగనివ్వడు. గ్రామస్తులు చదువుకోనివ్వకుండా అడ్డుకుంటూ ఉంటాడు. మరోవైపు పెద్ద గంగాధరీ (యువ చంద్ర) అమ్మవారికి బలిచ్చే పొట్టేల్‌కు కాపరిగా ఉంటాడు. ఎవరికీ తెలియకుండా కూతుర్ని చదవిస్తుంటాడు. ఈ విషయం తెలిసిన పటేల్‌, గంగాధరీ దగ్గర ఉన్న పొట్టేల్‌ను మాయం చేస్తాడు. జాతర సమయానికి పొట్టేల్‌ తీసుకురాకపోతే కూతుర్ని బలిస్తానని హెచ్చరిస్తాడు. కూతురి ప్రాణాల్ని ద‌క్కించుకునేందుకు గంగాధరీ ఏం చేశాడు? తిరిగి తీసుకొచ్చాడా లేదా? ఇందులో బుజ్జ‌మ్మ (అనన్య నాగళ్ల) క‌థేంటి? అన్నది స్టోరీ. https://telugu.yousay.tv/pottel-movie-review-comparisons-with-rangasthalam-before-release-is-pottel-at-that-level.html
    అక్టోబర్ 26 , 2024
    <strong>Game Changer: మూడు హిట్‌ సినిమాల బడ్జెట్‌తో ‘గేమ్‌ ఛేంజర్‌’ మెలోడీ సాంగ్‌.. ఇదెక్కడి అరాచకం!&nbsp;</strong>
    Game Changer: మూడు హిట్‌ సినిమాల బడ్జెట్‌తో ‘గేమ్‌ ఛేంజర్‌’ మెలోడీ సాంగ్‌.. ఇదెక్కడి అరాచకం!&nbsp;
    స్టార్ డైరెక్టర్ శంకర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్లో వస్తోన్న సినిమా ‘గేమ్ ఛేంజర్’ (Game Changer). ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్‌ కానుంది. ఇందులో చరణ్‌కు జోడీగా బాలీవుడ్‌ బ్యూటీ కియారా అద్వానీ (Kiara Advani) నటించింది. మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవల రెండు పాటలను విడుదల చేయగా వాటికి విశేష స్పందన వచ్చింది. ఈ క్రమంలోనే మూడో సాంగ్‌ను కూడా రిలీజ్‌ చేసేందుకు మేకర్స్‌ సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ పాటకు సంబంధించి ఓ వార్త హల్‌చల్‌ చేస్తోంది. ఈ మెలోడీ సాంగ్‌ కోసం చేసిన ఖర్చు అందరినీ షాక్‌కు గురిచేస్తోంది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.  ఒక్క పాటకు రూ.20 కోట్లు! 'గేమ్‌ ఛేంజర్‌' నుంచి వచ్చిన మెుదటి రెండు పాటలు ‘జరగండి.. జరగండి..’, ‘రా మచ్చా మచ్చా’ పాటలకు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ముఖ్యంగా ‘రా మచ్చా మచ్చా’ సాంగ్‌ యూట్యూబ్‌లో మిలియన్ల కొద్ది వ్యూస్‌ రాబట్టి నేషనల్‌ వైడ్‌గా ట్రెండింగ్‌ అయ్యింది. అయితే త్వరలో థర్డ్‌ సింగిల్‌ను తీసుకొచ్చేందుకు మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నారు. అక్టోబర్‌ చివర్లో లేదా నవంబర్‌ ఫస్ట్‌ వీక్‌లో ఈ సాంగ్‌ రిలీజ్‌ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. తొలి రెండు పాటలు మంచి బీట్‌తో వచ్చి దుమ్మురేపగా థర్డ్‌ సింగిల్‌ మాత్రం మెలోడిగా రానుంది. ఇక లేటెస్ట్‌ బజ్‌ ప్రకారం ఈ మూడో పాటకు రూ.20 కోట్ల పైనే ఖర్చు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయాన్ని మేకర్స్‌ ధ్రువీకరించాల్సి ఉంది. మూడు హిట్‌ చిత్రాల బడ్జెట్‌! ఇటీవల తెలుగులో రిలీజైన ‘ఆయ్‌’ (Aay), ‘కమిటీ కుర్రోళ్లు’ (Committee Kurrollu), ‘మత్తు వదలరా 2’ (Mathu Vadalara 2) చిత్రాలు మంచి విజయాలను అందుకున్నాయి. ప్రేక్షకులను ఫుల్‌గా ఎంటర్‌టైన్‌ చేసి ప్రశంసలు పొందాయి. అయితే ఈ మూడు సినిమాలు తక్కువ బడ్జెట్‌తో వచ్చి మంచి వసూళ్లు సాధించాయి. ఈ మూడు చిత్రాలు బడ్జెట్‌ కలిపితే దాదాపు రూ.20 కోట్ల వరకూ ఉంటుందని అంచనా. అయితే గేమ్‌ ఛేంజర్‌లో ఒక్క సాంగ్‌ కోసమే రూ.20 కోట్లు ఖర్చు చేశారని రూమర్లు రావడం చర్చకు తావిస్తోంది. ఇటీవల వచ్చిన సెకండ్ సింగిల్‌ ‘రా మచ్చా మచ్చా’ పాటకు కూడా దాదాపు రూ.6-10 కోట్లు ఖర్చు అయినట్లు కథనాలు వచ్చాయి. ఆ పాటలో వందల సంఖ్యలో డ్యాన్సర్లు పాల్గొని వివిధ కాస్ట్యూమ్స్‌లో స్టెప్పులు వేశారు. ఇలా సాంగ్‌లకే భారీ మెుత్తం ఖర్చు చేస్తుండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.  శంకర్‌ మారాల్సిన అవసరం ఉందా? తమిళ స్టార్ డైరెక్టర్‌ శంకర్‌ సినిమా అంటే అందులోని పాటలు సైతం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటాయి. ‘భారతీయుడు’, ‘జీన్స్‌’, ‘ఒకే ఒక్కడు’, ‘అపరిచితుడు’, ‘శివాజీ’, ‘రోబో’, ‘స్నేహితుడు’, ‘రోబో 2.0’ ఇలా ఏ సినిమా తీసుకున్న అందులోని పాటలు చాలా రిచ్‌గా ఉంటాయి. విదేశాల్లోని బ్యూటీఫుల్‌ లోకేషన్స్‌లో పాటలను చిత్రీకరించడం ద్వారా ఆడియన్స్‌లో కొత్త అనుభూతిని కలిగించేందుకు శంకర్ ప్రయత్నిస్తుంటారు. అయితే గతంలో వరుస హిట్స్‌తో శంకర్ ఫుల్‌ ఫామ్‌లో ఉన్నారు. కాబట్టి ఈ పాటల గురించి పెద్దగా చర్చ జరగలేదు. అయితే గత కొంతకాలంగా డైరెక్టర్ శంకర్‌కు అసలు కలిసిరావడం లేదు. ఆయన తీసిన చివరి నాలుగు చిత్రాలు ఫ్లాప్‌ అయ్యాయి. నిర్మాతలకు భారీ నష్టాలను మిగిల్చాయి. ఇలాంటి సమయంలో పాటల కోసం రూ. కోట్ల రూపాయలను ఖర్చు చేస్తుండటాన్ని సినీ ఆడియన్స్ తప్పుబడుతున్నారు. ప్రస్తుతం కాలంలో పాటలకు ఏ దర్శక నిర్మాతలు అంత మెుత్తంలో ఖర్చు చేయడం లేదని గుర్తు చేస్తున్నారు. శంకర్‌ తన తీరు మార్చుకోకుంటే అతనితో వర్క్‌ చేయడానికి నిర్మాతలు వెనకడుగు వేసే పరిస్థితులు తలెత్తవచ్చని అభిప్రాయపడుతున్నారు.  రికార్డు ధరకు ఓటీటీ హక్కులు! గేమ్‌ ఛేంజర్‌ ఓటీటీ హక్కులు రికార్డు ధరకు అమ్ముడుపోయినట్లు టాలీవుడ్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్‌ ప్రైమ్‌ రూ.110 కోట్లకు గేమ్‌ ఛేంజర్‌ స్ట్రీమింగ్‌ హక్కులను దక్కించుకున్నట్లు సమాచారం. కేవ‌లం సౌత్ లాంగ్వేజెస్ డిజిట‌ల్ రైట్స్ కోస‌మే అమెజాన్‌ ఇంత మెుత్తాన్ని ఆఫర్‌ చేసినట్లు తెలుస్తోంది. హిందీ డిజిట‌ల్ రైట్స్‌ను మ‌రో ఓటీటీ సంస్థ‌కు అమ్మేందుకు మేక‌ర్స్ ప్ర‌య‌త్నాలు చేస్తోన్న‌ట్లు తెలిసింది. మొత్తంగా ఓటీటీ ద్వారానే మేక‌ర్స్‌ రూ.150 కోట్ల మేర సొమ్ము చేసుకునే పరిస్థితులు ఉన్నాయని ఫిల్మ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 'గేమ్‌ ఛేంజర్‌' రిలీజ్‌కు ఇంకా రెండు నెలల సమయం ఉన్నప్పటికీ అంత పెద్ద మెుత్తంలో ఓటీటీ హక్కులు అమ్ముడుపోవడం మాములు విషయం కాదని ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. తండేల్‌ vs గేమ్‌ ఛేంజర్‌ గేమ్‌ ఛేంజర్‌ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్‌ చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. మరోవైపు నాగచైతన్య హీరోగా చేస్తున్న తండేల్‌ సైతం సంక్రాంతికి రిలీజ్‌ చేయాలని మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. టాలీవుడ్‌ సంక్రాంతి హిస్టరీలో ఇప్పటికే పలుమార్లు మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున తలపడ్డారు. అయితే ఈ సంక్రాంతికి వాళ్ల వారసులు తలపడనున్నట్లు బజ్‌ వినిపిస్తుండటం ఆసక్తి రేపుతోంది. RRR సక్సెస్‌తో రామ్‌చరణ్‌ గ్లోబల్‌ స్థాయిలో క్రేజ్‌ సంపాదించుకున్నాడు. దాన్ని గేమ్‌ ఛేంజర్‌ ద్వారా మరింత పదిలం చేసుకోవాలని చరణ్‌ చూస్తున్నాడు. మరోవైపు లవ్‌స్టోరీ తర్వా చైతూకి సరైన హిట్‌ లభించలేదు. దీంతో ఎలాగైనా తండేల్‌తో హిట్‌ కొట్టి హిట్‌ ట్రాక్‌లోకి రావాలని నాగచైతన్య పట్టుదలతో ఉన్నాడు. చరణ్‌ వర్సెస్‌ చైతూ పోరులో విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి.
    అక్టోబర్ 18 , 2024
    <strong>OTT Releases This Week Telugu: ఈ వారం సినిమా లవర్స్‌కు పెద్ద పండగే.. ఎలాగో మీరే చూడండి!</strong>
    OTT Releases This Week Telugu: ఈ వారం సినిమా లవర్స్‌కు పెద్ద పండగే.. ఎలాగో మీరే చూడండి!
    సెప్టెంబర్‌ సెకండ్‌ వీక్‌లో చిన్న సినిమాల హవా కొనసాగనుంది. థియేటర్ల వద్ద హంగామా సృష్టించేందుకు స్మాల్‌ హీరోల సినిమాలు సిద్ధమవుతున్నాయి. ఆహ్లాదకరమైన వినోదాన్ని పంచేందుకు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అటు OTT సైతం పలు ఆసక్తికర చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ వారం విడుదలకు సిద్ధంగా ఉన్న చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఎంటో ఇప్పుడు చూద్దాం. థియేటర్లలో విడుదలయ్యే చిత్రాలు&nbsp; భలే ఉన్నాడే (Bhale Unnade) రాజ్‌ తరుణ్‌ హీరోగా నటించిన తాజా చిత్రం ‘భలే ఉన్నాడే!’. ఇందులో మనీషా కంద్కూర్‌ హీరోయిన్‌గా నటించారు. జె. శివసాయి వర్ధన్‌ దర్శకత్వం వహించారు. మారుతి టీమ్‌ సమర్పణలో రవికిరణ్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌పై ఎన్‌వీ కిరణ్‌ కుమార్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం సెప్టెంబర్‌ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్‌, టీజర్‌ సినిమాపై ఆసక్తిని పెంచాయి. మత్తు వదలరా 2 (Mathu Vadalara 2) శ్రీసింహా (Sri Simha) హీరోగా దర్శకుడు రితేశ్ రానా తెరకెక్కించిన చిత్రం ‘మత్తు వదలరా 2’ (Mathu Vadalara 2). ఫరియా అబ్దుల్లా (Faria Abdullah), సత్య కీలక పాత్రలు పోషించారు. ఈ నెల 13న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. హీరో ప్రభాస్‌ తాజాగా సినిమా ట్రైలర్‌ లాంచ్‌ చేయడంతో అందరి దృష్టి ఈ మూవీపై పడింది. ట్రైలర్ ఆద్యంతం నవ్వులు పూయిస్తూ అంచనాలను పెంచేసింది.&nbsp; ధూం ధాం (Dhoom Dhaam) చేతన్‌కృష్ణ, హెబ్బా పటేల్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘ధూం ధాం’. సాయికిషోర్‌ మచ్చా దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి గోపీమోహన్‌ స్టోరీ, స్క్రీన్‌ప్లే అందించారు. రామ్‌కుమార్‌ నిర్మాత. సెప్టెంబర్‌ 13న ప్రేక్షకుల ముందుకురానుంది. చక్కటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందించామని, గోపీమోహన్‌ కథ ఆకట్టుకుంటుందని నిర్మాత ఎం.ఎస్‌.రామ్‌కుమార్‌ పేర్కొన్నారు. ఈ చిత్రానికి గోపిసుందర్‌ సంగీతం సమకూర్చారు.&nbsp; ఉత్సవం (Utsavam) దిలీప్ ప్రకాష్, రెజీనా కసాండ్రా లీడ్ రోల్స్‌లో నటిస్తున్న ఇంపాక్ట్ ఫుల్ తెలుగు డ్రామా ‘ఉత్సవం’. అర్జున్ సాయి దర్శకత్వం వహించారు. హార్న్‌బిల్‌ పిక్చర్స్‌పై సురేష్‌ పాటిల్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. సెప్టెంబర్ 13న ఈ సినిమా విడుదల కానుంది. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ఈ సినిమా ఏపీ, తెలంగాణలో గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. ఈ చిత్రం లవ్, ఎమోషన్స్, భావోద్వేగాలు వినోదంతో కూడిన కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని మేకర్స్‌ తెలిపారు.&nbsp; ఓటీటీలో రిలీజయ్యే చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు కమిటీ కుర్రోళ్లు (Committee Kurrollu) మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మించిన విలేజ్ బ్యాక్‌డ్రాప్ మూవీ 'కమిటీ కుర్రోళ్లు'. ఇటీవల థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం మంచి రెస్పాన్స్‌ సాధించింది. బాక్సాఫీస్‌ వద్ద పెద్ద ఎత్తున వసూళ్లు రాబట్టింది. ఇందులో సందీప్ సరోజ్, పి సాయి కుమార్, గోపరాజు రమణ, శరణ్య సురేష్, యశ్వంత్ పెండ్యాల ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 11న ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్‌లోకి రానుంది.&nbsp; మిస్టర్ బచ్చన్ (Mr. Bachchan) రవితేజ, డైరెక్టర్‌ హరీష్‌ శంకర్‌ కాంబోలో రూపొందిన లేటెస్ట్‌ చిత్రం 'మిస్టర్ బచ్చన్'. 2018లో బాలీవుడ్‌ స్టార్‌ అజయ్ దేవగన్ నటించిన 'రైడ్'కి రీమేక్‌గా ఇది రూపొందింది. పంద్రాగస్టు రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తీవ్రంగా నిరాశపరిచింది. దీంతో సెప్టెంబర్‌ 12న నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా ఓటీటీలోకి రాబోతోంది. ఇందులో రవితేజతో పాటు భాగ్యశ్రీ బోర్సే. జగపతి బాబు కీలక పాత్రలు పోషించారు. ఆయ్‌ (Aay) నార్నే నితిన్‌ హీరోగా వచ్చిన చిత్రం ‘ఆయ్‌’ (Aay). తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కి మంచి వసూళ్లను సొంతం చేసుకుంది. ఆగస్టు 15 విడుదలైన ఈ సినిమా యూత్‌ను ఆకట్టుకొని సినీ తారల ప్రశంసలు అందుకుంది. ఇప్పుడీ యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. నెట్‌ఫ్లిక్స్‌ (Netflix) వేదికగా సెప్టెంబర్ 12 నుంచి ప్రసారం కానుంది.&nbsp; తలవన్‌ (Thalavan) జిస్‌ జాయ్‌ దర్శకత్వంలో బిజు మేనన్‌, ఆసిఫ్‌ అలీ నటించిన మలయాళ క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘తలవన్‌’. మేలో మలయాళంలో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకర్షించింది. సెప్టెంబర్ 12 నుంచి ‘సోనీలివ్‌’(SonyLIV)లో స్ట్రీమింగ్‌లోకి రానుంది. మలయాళంతో పాటు, తెలుగు, తమిళం, హిందీ, మరాఠీ ఇలా మొత్తం ఏడు భాషల్లో సినిమాను వీక్షించవచ్చు. మరిన్ని OTT చిత్రాలు &amp; వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి https://telugu.yousay.tv/tfidb/ott&nbsp; TitleCategoryLanguagePlatformRelease DateSector 36MovieHindiNetflixSept 13Breaking Down The WallDocumentaryEnglishNetflixSept 12Emily In Paris S4SeriesEnglishNetflixSept 12Midnight At The Pera Palace S2SeriesEnglishNetflixSept 12Uglies&nbsp;MovieEnglishNetflixSept 13ThangalaanMovieTelugu/TamilNetflixSept 20The Money GameDocumentaryEnglishAmazonSept 10Stree 2MovieHindiAmazonSept 27BerlinMovieHindiZee 5Sept 13NunakijiMovieMalayalamZee 5Sept 13Bench LifeSeriesTeluguSonyLIVSept 12Goli Soda RaisingMovieTamilHotstarSept 13How To Die AloneMovieEnglishHotstarSept 13In Vogue: The 90sDocumentaryEnglishHotstarSept 13Kalbali RecordsMovieHindiHotstarSept 12Late Night With DevilMovieEnglishLions GateSept 13VisfotMovieTeluguJio CinemaSept 7
    సెప్టెంబర్ 09 , 2024
    <strong>Natural Star Nani: ‘పుష్ప 2’ టీమ్‌కు నాని ఇండైరెక్ట్‌ వార్నింగ్‌?&nbsp;</strong>
    Natural Star Nani: ‘పుష్ప 2’ టీమ్‌కు నాని ఇండైరెక్ట్‌ వార్నింగ్‌?&nbsp;
    టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ దర్శక నిర్మాతలు ప్రస్తుతం కొత్త పంథాను అనుసరిస్తున్నారు. సినిమా షూటింగ్‌ పూర్తి కాకుండానే విడుదల తేదీలను అనౌన్స్‌ చేసేస్తున్నారు. షూటింగ్‌లో జాప్యం తదితర కారణాల వల్ల చెప్పిన తేదీకి రిలీజ్‌ చేయలేక వెంటనే కొత్త డేట్‌ను ప్రకటిస్తున్నారు. భారీ బడ్జెట్‌ సినిమాలు ముందుగానే ఒక డేట్‌ను లాక్‌ చేయడం వల్ల చిన్న సినిమాలు, టైర్‌-2 హీరోల చిత్రాలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఇండస్ట్రీలో టాక్‌ ఉంది. ఈ నేపథ్యంలో నేచురల్‌ స్టార్‌ నాని ఈ ఇష్యూపై ఘాటుగా స్పందించారు. ప్రస్తుతం ఇవి ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారింది.&nbsp; ‘ఆ ఆటిట్యూడ్‌ కరెక్ట్‌ కాదు’ సినిమాలు పోస్టు పోన్‌ అవ్వడం అనేది సహజమే. నటీనటుల డేట్స్‌ అడ్జస్ట్‌ కాకపోవడం, వీఎఫ్‌ఎక్స్‌ ఆలస్యం, షూటింగ్‌లో డీలే ఇలా ఏదోక కారణం చేత రిలీజులు వాయిదా పడుతుంటాయి. అయితే గతంతో పోలిస్తే ఇటీవల కాలంలో వాయిదాల పర్వం బాగా ఎక్కువైంది. రిలీజ్‌ డేట్ అనౌన్స్‌ చేసి మరలా చెప్పాపెట్టకుండా పోస్టు పోన్‌ చేస్తుండటంపై నాని హాట్‌ కామెంట్స్‌ చేశారు. ‘సరిపోదా శనివారం’ (Saripodhaa Sanivaaram) ప్రమోషన్స్‌లో భాగంగా ఈ ఇష్యూపై మాట్లాడారు. 'క్లారిటీ లేకుండా రిలీజ్‌ డేట్‌ ప్రకటించడం వలన చాలా మంది నష్టపోతున్నారు. ఒక డేట్‌ వేసేద్దాం, సినిమా రెడీ అయితే ఆ డేట్‌కు వద్దాం. లేదంటే తర్వాత చూసుకుందా అనే ఆటిట్యూడ్‌ కరెక్ట్‌ కాదు' అని నాని అన్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారాయి. సినీ వర్గాలతో పాటు నెటిజన్లు నాని వ్యాఖ్యలను సమర్థిస్తున్నారు.&nbsp; ‘పుష్ప 2’ టీమ్‌కు వార్నింగ్‌? నాని తన లేటెస్ట్ కామెంట్స్‌లో ఎక్కడా పలానా సినిమా అంటూ పేరు ప్రస్తావించలేదు. అయితే ఇది ‘పుష్ప 2’ టీమ్‌ గురించే మాట్లాడినట్లు సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. వాస్తవానికి నాని నటించిన ‘సరిపోదా శనివారం’ చిత్రాన్ని ఆగస్టు 15 రిలీజ్‌ చేయాలని షూటింగ్‌ ప్రారంభంలోనే మేకర్స్‌ లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. అయితే అల్లు అర్జున్‌ నటిస్తున్న ‘పుష్ప 2’ చిత్రం తొలుత ఆ తేదీని లాక్‌ చేసుకోవడంతో సరిపోదా టీమ్‌ నెలఖారుకు (ఆగస్టు 29) జరగాల్సి వచ్చింది. అయితే అనూహ్యంగా ‘పుష్ప 2’ టీమ్ విడుదల తేదీని డిసెంబర్‌ 6 మారుస్తూ స్పెషల్‌ పోస్టర్ రిలీజ్‌ చేసింది. ఆ వెంటనే ‘డబుల్‌ ఇస్మార్ట్‌‘, ‘మిస్టర్‌ బచ్చన్‌’, ‘తంగలాన్‌’, ‘ఆయ్‌’ చిత్రాలు తమ షెడ్యూల్‌ను మార్చుకొని ఆగస్టు 15కు వచ్చేశాయి. దీంతో ఆ పోటీలో తమ సినిమాను రిలీజ్‌ చేయడం ఎందుకని భావించి ఆగస్టు 29న నాని తన చిత్రాన్ని తీసుకొస్తున్నాడు. ‘పుష్ప 2’ టీమ్‌ సరైన అంచనాలు లేకుండా ఆగస్టు 15 లాక్‌ చేయడంతో ఆ సమయంలో వచ్చిన లాంగ్‌ వీకెండ్‌ను ‘సరిపోదా శనివారం’ కోల్పోవాల్సి వచ్చింది. ఈ కారణం చేతనే నాని పరోక్షంగా ఆ సినిమా టీమ్‌కు వార్నింగ్‌ ఇచ్చి ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది.&nbsp; నాని సినిమాకు రన్‌ టైమ్‌ ఫిక్స్‌! నాని తాజా చిత్రం 'సరిపోదా శనివారం' (Saripodhaa Sanivaaram)కు వివేక్‌ ఆత్రేయ దర్శకత్వం వహించారు. ప్రియాంకా అరుల్‌ మోహన్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. గురువారం (ఆగస్టు 29) ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా సెన్సార్‌ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ ఈ మూవీకి U/A స‌ర్టిఫికెట్ జారి చేసినట్లు తెలుస్తోంది. రన్‌టైమ్‌ను 2 గంట‌ల 50 నిమిషాలకు ఫిక్స్ చేసినట్లు ఇందులో విలన్‌ పాత్ర పోషిస్తున్న ఎస్‌.జే సూర్య తెలియజేశారు. గతంలో నాని-వివేక్ ఆత్రేయ కాంబోలో వచ్చిన 'అంటే సుందరానికి' (Ante Sundaraniki) చిత్రం కూడా మూడు గంటల నిడివితో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.&nbsp;
    ఆగస్టు 24 , 2024
    <strong>Maruthi Nagar Subramanyam Review: మధ్య వయస్కుడి నిరుద్యోగ&nbsp; కష్టాలను కళ్లకు కట్టిన ‘మారుతీనగర్‌ సుబ్రమణ్యం’.. సినిమా ఎలా ఉందంటే?</strong>
    Maruthi Nagar Subramanyam Review: మధ్య వయస్కుడి నిరుద్యోగ&nbsp; కష్టాలను కళ్లకు కట్టిన ‘మారుతీనగర్‌ సుబ్రమణ్యం’.. సినిమా ఎలా ఉందంటే?
    న‌టీన‌టులు: రావు రమేష్, ఇంద్రజ, అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి, హర్షవర్ధన్, అజయ్, అన్నపూర్ణమ్మ, ప్రవీణ్ త‌దిత‌రులు ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: లక్ష్మణ్ కార్య సంగీతం : కళ్యాణ్‌ నాయక్‌ సినిమాటోగ్రఫీ : ఎం.ఎన్‌. బాల్‌రెడ్డి ఎడిటర్‌ : బొంతల నాగేశ్వర రెడ్డి సమర్పణ: తబితా సుకుమార్ సహ నిర్మాతలు: రుషి మర్ల, శివప్రసాద్ మర్ల నిర్మాణం: బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్ కార్య విడుదల తేదీ : 23-08-2024 రావు రమేష్‌ (Rao Ramesh) ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘మారుతీనగర్‌ సుబ్రమణ్యం’ (Maruti Nagar Subramanyam Review). లక్ష్మణ్‌ కార్య దర్శకుడు. ఇంద్రజ, అంకిత్‌ కొయ్య, రమ్య పసుపులేటి ముఖ్య కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాని ప్రముఖ దర్శకుడు సుకుమార్ భార్య తబిత సుకుమార్‌ సమర్పించారు. ప్రచార కార్యక్రమాల్లో అల్లు అర్జున్‌ హాజరు కావడంతో ప్రేక్షకుల దృష్టిని ఈ మూవీ ప్రముఖంగా ఆకర్షించింది. మరి ఈ సినిమా ఎలా ఉంది. ప్రేక్షకులకు వినోదాన్ని పంచిందా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.&nbsp; కథేంటి మారుతీనగర్‌కి చెందిన సుబ్రమణ్యం (రావు రమేశ్) 1998లో టీచర్ ఉద్యోగానికి సెలెక్ట్ అవుతాడు. కానీ కోర్టు స్టే వల్ల అది అలా హోల్డ్‌లో ఉండి పోతుంది. చేస్తే గవర్నమెంట్ ఉద్యోగమే చేయాలని అప్పటినుంచి మరో పనిచేయకుండా ఖాళీగానే ఉంటాడు. భార్య కళారాణి (ఇంద్రజ) గవర్నమెంట్ ఆఫీసులో క్లర్క్‌గా చేస్తుంటుంది. వీళ్లకో కొడుకు అర్జున్ (అంకిత్ కొయ్య) ఉంటాడు. అర్జున్‌ తొలి చూపులోని కాంచన (రమ్య పసుపులేటి)తో ప్రేమలో పడతాడు. కష్టాల నడుమ జీవిస్తున్న సుబ్రమణ్యం జీవితంలోకి ఓ రోజు అనూహ్యంగా రూ.10 లక్షలు వచ్చి పడతాయి. ఇంతకీ వీటిని ఎవరు వేశారు? సుబ్రమణ్యంకు గవర్నమెంట్‌ జాబ్‌ వచ్చిందా? రాలేదా? కొడుకు ప్రేమను గెలిపించేందుకు అతడు ఏం చేశాడు? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎవరెలా చేశారంటే రావు రమేశ్ నటన గురించి కొత్తగా చెప్పడానికేం లేదు. ఎప్పటిలానే సుబ్రమణ్యం పాత్రలో ఆయన చక్కగా ఒదిగిపోయాడు. తన అనుభవాన్నంతా రంగరించి ఆద్యంతం అలరించారు. అతడి కొడుకుగా చేసిన అంకిత్ బాగానే ఆకట్టుకున్నాడు. గతవారం 'ఆయ్'తో ఇప్పుడు ఈ సినిమాతో మెప్పించాడు. అల్లు అరవింద్‌ కుమారుడినంటూ అతడు చేసే హంగామా నవ్వులు పూయిస్తుంది. ఇక కాంచన పాత్ర చేసిన రమ్య పసుపులేటికి నటన పరంగా పెద్దగా స్కోప్‌ లేదు. అయితే గ్లామర్‌ పరంగా ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ఇంద్రజ పాత్ర కూడా పరిమితంగానే ఉంది. స్టార్టింగ్‌లో ఎమోషనల్ అవ్వడం, చివర్లో డ్యాన్స్ చేయడం తప్పితే పెద్దగా స్కోప్ దొరకలేదు. మిగిలిన పాత్రల్లో ప్రవీణ్, హర్షవర్ధన్, అన్నపూర్ణమ్మ తదితరులు పర్వాలేదనిపించారు.&nbsp; డైరెక్షన్ ఎలా ఉందంటే మధ్య తరగతికి చెందిన ఓ మధ్య వయస్కుడి నిరుద్యోగ కష్టాల చుట్టూ దర్శకుడు లక్ష్మణ్‌ కార్య కథను నడిపించారు. సహజత్వంతో కూడిన సన్నివేశాలకు హాస్యాన్ని జోడించి అతడు చేసిన ప్రయత్నం మెప్పిస్తుంది. అప్పటివరకూ భార్య సంపాదనపై ఆధారపడ్డ సుబ్రమణ్యం అకౌంట్‌లో డబ్బు పడంగానే ఒక్కసారిగా మారిపోయిన వైనం, ఆ తర్వాత చేసే హంగామా హైలెట్‌గా నిలుస్తుంది. ఇక డబ్బు ఖర్చు చేశాక వచ్చే కష్టాల చుట్టూ ద్వితీయ భాగాన్ని నడిపించాడు దర్శకుడు. కథనం ఊహకందేలా సాగినప్పటికీ రావు రమేష్‌ టైమింగ్‌, హాస్యం ఈ చిత్రాన్ని మరో స్థాయికి తీసుకెళ్లాయి. పతాక సన్నివేశాల్లో వచ్చే మలుపు మూవీని మరింత ఆసక్తికరంగా మార్చింది. అయితే అంకిత్‌ లవ్‌ ట్రాక్‌, లాజిక్‌కు అందని సన్నివేశాలు, అక్కడక్కడా పండని కామెడీ సీన్స్‌ మైనస్‌లుగా చెప్పుకోవచ్చు.&nbsp; టెక్నికల్‌గా.. సాంకేతిక అంశాల విషయానికి వస్తే ప్రతీ విభాగం మంచి పనితీరు కనబరిచింది. ముఖ్యంగా సినిమాటోగ్రఫీ చాలా కలర్‌పుల్‌గా ఉంది. పాటలు కూడా వినడానికి బాగున్నాయి. నేపథ్య సంగీతం సన్నివేశాలను బాగా ఎలివేట్‌ చేసింది. ఎడిటింగ్‌ కూడా ఓకే. నిర్మాణ విలువలు చాలా రిచ్‌గా ఉన్నాయి.&nbsp; ప్లస్ పాయింట్స్‌ రావు రమేష్‌ నటనకామెడీక్లైమాక్స్‌ మైనస్‌ పాయింట్‌ అంకిత్‌ లవ్‌ ట్రాక్‌ఊహాకు అందేలా సాగే కథనం Telugu.yousay.tv Rating : 3/5&nbsp;&nbsp;
    ఆగస్టు 23 , 2024
    <strong>This Week Movies:&nbsp; ఆగస్టు 15 సందర్భంగా ఓటీటీలోకి మోస్ట్ వాంటెడ్ చిత్రాలు</strong>
    This Week Movies:&nbsp; ఆగస్టు 15 సందర్భంగా ఓటీటీలోకి మోస్ట్ వాంటెడ్ చిత్రాలు
    పంద్రాగస్టు సందర్భంగా ఈ వారం థియేటర్లలో పెద్ద ఎత్తున సందడి నెలకొననుంది. భారీ చిత్రాలతో థియేటర్స్‌ కళకళలాడేందుకు సిద్ధమవుతున్నాయి. రవితేజ, రామ్‌ పోతినేని, విక్రమ్‌ వంటి స్టార్‌ హీరోల చిత్రాలు ఈ వారం విడుదల కాబోతున్నాయి. అటు ఓటీటీలోనూ పలు ఆసక్తికర చిత్రాలు, సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు సిద్ధమయ్యాయి. ఆ విశేషాలేంటో ఈ కథనంలో చూద్దాం. థియేటర్లో విడుదలయ్యే చిత్రాలు మిస్టర్‌ బచ్చన్‌ (Mr. Bachchan) మాస్‌ మహారాజా రవితేజ హీరోగా హరీష్‌ శంకర్‌ డైరెక్షన్‌లో రూపొందిన తాజా చిత్రం ‘మిస్టర్‌ బచ్చన్‌’. బాలీవుడ్‌ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయం కాబోతోంది. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఆగస్టు 15న (Mr. Bachchan Release Date) థియేటర్స్‌లో సందడి చేయనుంది. రవితేజ ఇందులో ఐటీ అధికారిగా కనిపించనున్నారు. ఆయన ఎనర్జీ యాక్టింగ్‌, భాగ్యశ్రీ అందాలు, హరీశ్‌ శంకర్‌ టేకింగ్‌ ఈ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్తాయని చిత్ర బృందం తెలిపింది.  డబుల్‌ ఇస్మార్ట్‌ (Double iSmart)&nbsp; హీరో రామ్‌ పోతినేని, డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ కాంబోలో రూపొందిన ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ చిత్రం ఈ వారమే థియేటర్లలోకి రాబోతోంది. బ్లాక్‌ బాస్టర్‌ చిత్రం ‘ఇస్మార్ట్‌ శంకర్‌’కు సీక్వెల్‌గా దీన్ని నిర్మించారు. కావ్య థాపర్‌ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో సంజయ్‌ దత్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆగస్టు 15న (Double Ismart Release Date) థియేటర్స్‌లో సందడి చేయడానికి ఈ మూవీ సిద్ధమైంది. ఇప్పటికే విడుదల చేసిన పాటలు, ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలను పెంచాయి. తంగలాన్‌ (Thangalaan) తమిళ స్టార్‌ హీరో విక్రమ్‌ (Vikram) నటించిన లేటెస్ట్‌ చిత్రం ‘తంగలాన్‌’ కూడా ఈ వారమే గ్రాండ్‌గా థియేటర్లలోకి రానుంది. పా. రంజిత్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జ్ఞానవేల్‌రాజా నిర్మించారు. పార్వతీ తిరువోతు, మాళవిక మోహనన్‌ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రం ఈనెల 15న విడుదల కానుంది. స్వాతంత్య్రానికి పూర్వం కోలార్‌ గోల్డ్‌ ఫీల్డ్స్‌లో జరిగిన వాస్తవ సంఘటనల్ని ఆధారం చేసుకుని ఈ సినిమాను రూపొందించినట్లు చిత్ర యూనిట్‌ తెలిపింది.  ఆయ్‌ (Aay) ఎన్టీఆర్‌ బావ మరిది నార్నే నితిన్‌ నటించిన రెండో చిత్రం ‘ఆయ్‌’. మ్యాడ్‌ చిత్రంతో సాలిడ్‌ విజయాన్ని అందుకు ఈ యంగ్‌ హీరో తన సెకండ్‌ హిట్‌ కోసం ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అంజి కె.మణిపుత్ర దర్శకత్వం ‘ఆయ్‌’ మూవీ ఆగస్టు 15న రిలీజ్‌ కాబోతోంది. గోదావరి విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌ నేపథ్యంలో ఈ సినిమాను రూపొందించారు. నార్నే నితిన్‌కు జోడీగా నయన్‌ సారిక నటించింది. ఈ మూవీ తప్పకుండా ఎంటర్‌టైన్‌ చేస్తుందని చిత్ర బృందం తెలిపింది.  వేదా (Vedaa) జాన్‌ అబ్రహం (John Abraham), శార్వరీ వాఘ్‌, తమన్నా ప్రధాన పాత్రలు పోషిస్తున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘వేదా’ (Vedaa). నిఖిల్‌ అడ్వాణీ దర్శకుడు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఆగస్టు 15న హిందీ, తెలుగు భాషల్లో విడుదల కానుంది. యాక్షన్‌ డ్రామాగా రూపొందిన ‘వేదా’ను వాస్తవ సంఘటనల నుంచి స్ఫూర్తి పొంది తెరకెక్కించారు. నేటి సమాజంలో పరిస్థితులను ప్రతిబింబిస్తుందని చిత్ర బృందం తెలిపింది. ఖేల్‌ ఖేల్‌ మే (Khel Khel Mein) ఏకంగా 26సార్లు రీమేక్ అయి గిన్నిస్‌ బుక్ ఆఫ్‌ రికార్డ్స్‌లోనూ చోటు సంపాదించుకున్న పర్‌ఫెక్ట్‌ స్ట్రేంజర్స్‌ (Perfetti Sconosciuti) ఇప్పుడు హిందీలో ‘ఖేల్‌ ఖేల్‌ మే’ (khel khel mein)గా రాబోతోంది.  అగ్రకథానాయకుడు అక్షయ్‌ కుమార్‌,  తాప్సి, అమ్మీ వ్రిక్‌, వాణీకపూర్‌, ఫర్దీన్‌ఖాన్‌, ఆదిత్య సీల్‌, ప్రజ్ఞా జైశ్వాల్‌లు  ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ముదస్సర్‌ అజీజ్‌ తెరకెక్కిస్తున్నారు. ఆగస్టు 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు&nbsp; డార్లింగ్‌ ప్రియదర్శి, నభా నటేష్ నటించిన 'డార్లింగ్' (Darling) ఈ వారం ఓటీటీలోకి రాబోతోంది. థియేటర్లలోకి వచ్చి నెల రోజులు కాకముందే ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతోంది. ఆగస్టు 13 నుంచి హాట్‌స్టార్‌ వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది. మ‌ల్టీపుల్ ప‌ర్స‌నాలిటీ డిజార్డ‌ర్ అనే స‌మ‌స్య‌కు వినోదాన్ని జోడించి దర్శకుడు ఈ మూవీని తెరకెక్కించారు. జులై 19న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ పెద్దగా సక్సెస్ కాలేదు. వీరాంజనేయులు విహార యాత్ర (Veeranjaneyulu Vihara Yatra) ప్రముఖ ఓటీటీ సంస్థ ఈటీవీ విన్‌ ఈ వారం మరో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో రాబోతోంది. 'వీరాంజనేయులు విహార యాత్ర' పేరుతో ఆగస్టు 14 నుంచి కొత్త మూవీని స్ట్రీమింగ్‌ చేయబోతోంది. సీనియర్‌ నటుడు నరేశ్‌, శ్రీలక్ష్మీ, యువ నటులు రాగ్‌ మయూర్‌, ప్రియా వడ్లమాని ఈ సిరీస్‌లో కీలక పాత్ర పోషించారు. టైటిల్‌ని బట్టి విహార యాత్ర నేపథ్యంలో ఈ మూవీని రూపొందించినట్లు తెలుస్తోంది.  మనోరథంగల్‌ (Manorathangal) కమల్‌హాసన్, మోహన్‌లాల్, మమ్ముట్టి, ఫహాద్‌ ఫాజిల్‌ వంటి ప్రముఖ సౌత్‌ ఇండియన్‌ స్టార్స్‌ నటించిన లేటెస్ట్‌ సిరీస్‌ ‘మనోరథంగల్‌’.  తొమ్మిది కథలతో, ఎనిమిది మంది దర్శకులు తీర్చిదిద్దిన ఈ సిరీస్‌ను ఆగస్టు 15న ఓటీటీలో విడుదల చేస్తున్నారు. జీ 5 వేదికగా తెలుగు, హిందీతో పాటు పలు దక్షిణాది భాషల్లో ఈ సిరీస్‌ అందుబాటులోకి రానుంది. ప్రముఖ రచయిత, దర్శకుడు ఎమ్‌.టి వాసుదేవన్‌ రాసిన కథల ఆధారంగా ఈ ఆంథాలజీ సిరీస్‌ను రూపొందించారు.  మరిన్ని OTT చిత్రాలు &amp; వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి https://telugu.yousay.tv/tfidb/ott TitleCategoryLanguagePlatformRelease DateDaughtersMovieEnglishNetflixAugust 14Worst Ex EverSeriesEnglishNetflixAugust 14Emily In ParisSeriesEnglishNetflixAugust 14The UnionMovieEnglishNetflixAugust 16Love Nexts DoorMovieKorean/EnglishNetflixAugust 17DarlingMovieTeluguHotstarAugust 13The TyrantMovieKorean/EnglishHotstarAugust 14Nam Namak NishanMovieHindiAmazon&nbsp;August 14JackpotMovieEnglishAmazon&nbsp;August 15ChanakSeriesHindiSonyLIVAugust 16ManorathangalSeriesTelugu DubZee 5August 15Sekhar HomeMovieHindiJio CinemaAugust 14
    ఆగస్టు 12 , 2024
    <strong>Double Ismart: చిక్కుల్లో ‘డబుల్‌ ఇస్మార్ట్‌’.. పూరి, రామ్‌ను వెంటాడుతున్న ‘లైగర్‌’ నష్టాలు!</strong>
    Double Ismart: చిక్కుల్లో ‘డబుల్‌ ఇస్మార్ట్‌’.. పూరి, రామ్‌ను వెంటాడుతున్న ‘లైగర్‌’ నష్టాలు!
    ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌ పోతినేని (Ram Pothineni), డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ (Puri Jagannadh) కాంబోలో రూపొందిన సెకండ్‌ ఫిల్మ్‌ 'డబుల్ ఇస్మార్ట్‌' (Double Ismart). గతంలో వచ్చిన బ్లాక్‌ బాస్టర్‌ చిత్రం 'ఇస్మార్ట్‌ శంకర్‌' (Ismart Shankar)కు సీక్వెల్‌గా ఈ మూవీ రూపొందింది. ఆగస్టు 15న వరల్డ్‌ వైడ్‌గా రిలీజ్‌ చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్‌ ప్రకటించారు. ఇటీవల సరైన హిట్‌ లేక ఇబ్బంది పడుతున్న డైరెక్టర్‌ పూరికి, రామ్‌లకు ఈ మూవీ సక్సెస్‌ ఎంతో కీలకంగా మారింది. ఇటీవల రిలీజైన ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలను సైతం పెంచేసింది. దీంతో అంతా సవ్యంగా సాగుతున్న క్రమంలో ఈ ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ మూవీకి ఊహించని కష్టాలు ఎదురయ్యాయి. పూరి డైరెక్షన్‌లో వచ్చిన ‘లైగర్‌’ (Liger) సినిమా ఆర్థిక కష్టాలు రామ్‌ చిత్రాన్ని చుట్టుముడుతున్నాయి.&nbsp; అసలేం జరిగిందంటే? ‘డబుల్ ఇస్మార్ట్’ మూవీకి లైగర్ నష్టాలు పెద్ద తలనొప్పిగా మారాయి. విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda), పూరి జగన్నాథ్‌ (Puri Jagannadh) కాంబోలో భారీ బడ్జెట్‌తో రూపొందిన 'లైగర్‌' (Liger) ఊహించని స్థాయిలో డిజాస్టర్‌గా నిలిచింది. నిర్మాతలతో పాటు ఎగ్జిబిటర్లు, డిస్టిబ్యూటర్లకు పెద్ద ఎత్తున నష్టాలను మిగిల్చింది. అయితే లైగర్‌ నష్టాలను సెటిల్‌ చేయకుండా పూరి మరో సినిమాను రిలీజ్‌కు సిద్ధం చేయడంపై డిస్టిబ్యూటర్లు కోపంగా ఉన్నట్లు తెలుస్తోంది. లైగర్‌ నష్టాలను సెటిల్‌మెంట్ చేసేవరకూ ఈ చిత్రాన్ని ప్రదర్శించకూడదని వారు నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విషయమై ఓ పెద్ద డిస్ట్రిబ్యూటర్‌ ఆఫీస్‌లో మీటింగ్‌ కూడా జరిగినట్లు సమాచారం. ఈ భేటీలో లైగర్ నష్టాల భర్తీ గురించి కూలంకుషంగా చర్చించినట్లు తెలుస్తోంది. దీంతో ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ రిలీజ్‌కు ఏమైనా ఆటంకం కలుగుతుందా అన్న ఆందోళన మూవీ టీమ్‌లో నెలకొంది.&nbsp; సాంగ్‌ పైనా వివాదం! ఇటీవల డబుల్‌ ఇస్మార్ట్‌ సినిమా నుంచి రెండో లిరికల్‌ సాంగ్‌ను చిత్ర యూనిట్‌ రిలీజ్‌ చేసింది. 'మార్ ముంత చోడ్ చింత' పేరుతో సెకండ్‌ సింగిల్‌ను యూట్యూబ్‌లో రిలీజ్‌ చేశారు. అయితే ఈ పాట మధ్యలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వాయిస్ ఉపయోగించారు. సోషల్‌ మీడియాలో బాగా వైరల్‌ అయిన 'ఏం జేద్దామంటవ్ మరీ' పదాన్ని వాడారు. అది కూడా డైరెక్ట్‌గా కేసీఆర్ వాయిస్‌తోనే ఉపయోగించారు. దీంతో కేసీఆర్ అభిమానులు, తెలంగాణ వాదులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ కల్చర్‌ను తాగుడు సంస్కృతిగా చూపించేలా ఈ పాట ఉందంటూ విమర్శలు చేశారు. కేసీఆర్‌ డైలాగ్‌ను తొలగించకపోతే సినిమాను అడ్డుకుంటామని హెచ్చరించారు. అయితే దీనిపై మూవీ టీమ్‌ స్పందించాల్సి ఉంది.&nbsp; https://www.youtube.com/watch?v=-Kba0qmTtZE పోటీగా మూడు చిత్రాలు డబుల్‌ ఇస్మార్ట్‌ చిత్రాన్ని ఆగస్టు 15న రిలీజ్‌ చేయనున్నట్లు మేకర్స్‌ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. వాస్తవానికి 'పుష్ప 2' ఆ రోజున రిలీజ్‌ కావాల్సి ఉంది. షూటింగ్‌లో జాప్యం వల్ల ఆ సినిమాను డిసెంబర్‌ 6కు పోస్టు పోన్‌ చేశారు. దీంతో ఆ డేట్‌ను పూరి జగన్నాథ్‌ తన సినిమా కోసం లాక్‌ చేశారు. అయితే ఆ సంతోషం ఎక్కువ కాలం నిలువ లేదు. రవితేజ నటించిన 'మిస్టర్‌ బచ్చన్‌' (Mr Bachchan), కోలీవుడ్‌ స్టార్‌ విక్రమ్‌ లీడ్‌ రోల్‌లో చేసిన 'తంగలాన్‌' (Thangalaan) చిత్రాలు ఆగస్టు 15న రిలీజ్‌ కాబోతున్నాయి. వీటితో పాటు 'ఆయ్‌' అనే మరో మూవీ కూడా డబుల్‌ ఇస్మార్ట్‌కు పోటీగా బరిలోకి దిగుతోంది. దీంతో ఆ మూడు చిత్రాలతో బాక్సాఫీస్‌ వద్ద తలపడాల్సిన పరిస్థితి ‘డబుల్‌ ఇస్మార్ట్‌’కు ఏర్పడింది.&nbsp;
    జూలై 31 , 2024
    <strong>Young Telugu Heroes: వైవిధ్యతకు ప్రాధాన్యమిస్తున్న కుర్ర హీరోలు.. సీనియర్లు చూసి నేర్చుకోవాల్సిందే!&nbsp;</strong>
    Young Telugu Heroes: వైవిధ్యతకు ప్రాధాన్యమిస్తున్న కుర్ర హీరోలు.. సీనియర్లు చూసి నేర్చుకోవాల్సిందే!&nbsp;
    టాలీవుడ్ యంగ్ హీరోలు కథల ఎంపిక విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. కథలో కొత్త దనం ఉంటేనే సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. లేకుంటే నిర్మొహమాటంగా తిరస్కరిస్తున్నారు. తద్వారా రొటిన్‌ స్టోరీలతో వస్తోన్న నాగార్జున, వెంకటేష్‌, రవితేజ, రామ్‌ పోతినేని, నితిన్‌, గోపిచంద్‌ వంటి సీనియర్‌ హీరోలకు పాఠాలు నేర్పుతున్నారు. యువ హీరో సుహాస్ రీసెంట్‌గా 'గొర్రెపురాణం' అనే మరో విభిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ నేపథ్యంలో కుర్ర హీరోలు ఎంచుకుంటున్న కొత్త తరహా సబ్జెక్ట్స్‌పై మరోమారు చర్చ మెుదలైంది. ఇంతకీ కొత్త కథలతో వస్తోన్న యంగ్‌ హీరోలు ఎవరు? వారు చేసిన చిత్రాలు ఏంటి? ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.&nbsp; సుహాస్‌ (Suhas) ఇండస్ట్రీలో చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తూ నటుడిగా కొనసాగుతూ వచ్చిన సుహాస్ ‘కలర్‌‌ ఫోటో’ సినిమాతో ఒక్కసారిగా ఫేమస్ అయ్యాడు. షార్ట్‌ ఫిల్మ్స్‌ చేస్తూ వచ్చిన క్రేజ్‌తో సినిమా అవకాశాలను పట్టేశాడు. ‘రైటర్‌ పద్మభూషణ్‌’, ‘అంబాజీపేట మ్యారేజ్‌ బ్యాండ్‌’, ‘శ్రీరంగనీతులు’, ‘ప్రసన్నవదనం’ వంటి వైవిధ్యవంతమైన చిత్రాల్లో నటించి ఆడియన్స్‌లో మంచి మార్కులు కొట్టేశాడు. అంతేకాదు ‘హిట్‌ 2’ మూవీలో విలన్‌గానూ నటించి ఆకట్టుకున్నాడు. తాజాగా ‘గొర్రెపురాణం’ అనే సరికొత్త సబ్జెక్ట్‌తో శుక్రవారం (సెప్టెంబర్‌ 20) ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తేజ సజ్జ (Teja Sajja) బాలనటుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తేజ సజ్జ ‘జాంబి రెడ్డి’ సినిమాతో హీరోగా మారాడు. తొలి చిత్రంతోనే హీరో మెటీరియల్‌గా అనిపించాడు. ఆ తర్వాత ‘ఇష్క్‌’, ‘అద్భుతం’ వంటి వైవిధ్యమైన చిత్రాలు చేసినప్పటికీ పెద్దగా పేరు రాలేదు. తిరిగి ప్రశాంత్‌ వర్మ డైరెక్షన్‌లోనే 'హనుమాన్‌' చిత్రం చేసి జాతీయ స్థాయిలో సాలిడ్‌ హిట్ అందుకున్నాడు. ఈ మూవీ సక్సెస్‌తో తేజ సజ్జ పేరు మార్మోగింది. ప్రస్తుతం 'మిరాయ్‌' అనే మరో పాన్‌ ఇండియా చిత్రంలో తేజ నటిస్తున్నాడు. ఇందులో మంచు మనోజ్‌ విలన్‌గా నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ‘మిరాయ్’ టీజర్‌ గూస్‌బంప్స్‌ తెప్పించింది.&nbsp;&nbsp; నిఖిల్ సిద్దార్ధ్‌ (Nikhil Siddhartha) యంగ్‌ హీరో నిఖిల్‌ సిద్ధార్థ్‌ హ్యాపీ డేస్‌ చిత్రంతో అందరి దృష్టిని ఆకర్షించాడు.&nbsp; ఆ సినిమాలో వరుణ్ సందేశ్‌ పక్కన ఫ్రెండ్‌గా నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు.ఆ తర్వాత సోలో హీరోగా పలు సినిమాలు చేసి యూత్‌కు దగ్గరయ్యాడు. ఈ క్రమంలోనే స్వామి రారా, కార్తికేయా, సూర్య వర్సెస్‌ సూర్య, ఎక్కడికి పోతావు చిన్నవాడా, కార్తికేయ, కార్తికేయ 2, స్పై వంటి డిఫరెంట్‌ జానర్ ఫిల్మ్స్‌ చేసి మినమం గ్యారెంటీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం రామ్‌చరణ్‌ నిర్మాణంలో స్వయంభు అనే హిస్టారికల్‌ చిత్రంలో నిఖిల్‌ నటిస్తున్నాడు. అలాగే ‘కార్తికేయ 3’ చిత్రం కూడా అతడి లైనప్‌లో ఉంది.&nbsp; విశ్వక్‌ సేన్‌ (Visvak Sen) యువ నటుడు విశ్వక్‌ సేన్‌ యూత్‌లో మాస్‌ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. కెరీర్‌ ప్రారంభం నుంచి సినిమా సినిమాకు వైవిధ్యం ఉండేలా విశ్వక్‌ జాగ్రత్త పడుతున్నాడు. తొలి చిత్రం ‘వెళ్లిపోమాకే’ పెద్దగా సక్సెస్‌ కాకపోయిన ‘ఈ నగరానికి ఏమైంది’ ఫిల్మ్‌తో యూత్‌లో మంచి క్రేజ్‌ తెచ్చుకున్నాడు. ఆ తర్వాత ‘ఫలక్‌నామా దాస్‌’ పేరుతో మాస్‌ యాక్షన్‌ డ్రామా తీసి మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. ‘హిట్‌’, ‘పాగల్‌’, ‘అశోక వనంలో అర్జున కల్యాణం’, ‘ఓరి దేవుడా’, ‘దాస్‌ కా ధమ్కీ’, ‘గామి’, ‘గ్యాంగ్స్ గోదావరి’ సక్సెస్‌లతో తెలుగులో స్టార్‌ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ‘మెకానిక్‌ రాకీ’, ‘లైలా’ అనే డిఫరెంట్‌ జానర్‌ ఫిల్మ్‌లో విశ్వక్‌ నటిస్తున్నాడు. ‘లైలా’లో లేడీ గెటప్‌లో అతడు కనిపించనుండటం గమనార్హం.&nbsp; అడివి శేష్ (Adivi Sesh) ఆర్యన్ రాజేష్ హీరోగా వచ్చిన సొంతం సినిమాలో చిన్న క్యారెక్టర్‌‌ చేసిన అడివి శేష్ ‘కర్మ’ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. పవన్‌ కల్యాణ్‌ నటించిన ‘పంజా’ సినిమాలో విలన్‌గా నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘రన్‌ రాజా రన్’, ‘బాహుబలి’ సినిమాల్లో కీలక పాత్రల్లో నటించిన అతడు ‘క్షణం’, ‘గూఢచారి’, ‘ఎవరు’, ‘మేజర్’, ‘హిట్‌ 2’ వంటి వైవిధ్యమైన చిత్రాలతో నమ్మదగిన హీరోగా మారిపోయాడు. ముఖ్యంగా ‘మేజర్‌’ సినిమాతో అడివి శేష్‌ మార్కెట్‌ అమాంతం పెరిగిపోయింది. ప్రస్తుతం అతడు గూఢచారి సీక్వెల్‌లో నటిస్తున్నాడు. ఈ సినిమా పాన్‌ ఇండియా రేంజ్‌లో విడుదల కానుంది. ఈ మూవీ కూడా సక్సెస్ అయితే అడివి శేష్‌కు తిరుగుండదని చెప్పవచ్చు.&nbsp; సిద్ధు జొన్నలగడ్డ (Sidhu Jonnalagadda) నాగచైతన్య హీరోగా నటించిన మొదటి సినిమా జోష్‌తోనే సిద్దు జొన్నలగడ్డ కూడా ఇండస్ట్రీలోకి వచ్చాడు. ‘భీమిలి కబడ్డీ జట్టు’, ‘ఆరెంజ్’, ‘గుంటూర్ టాకీస్’ వంటి సినిమాలలో నటించినప్పటికీ సిద్ధు కెరీర్‌‌ గ్రోత్‌ అంతగా లేదనే చెప్పాలి. అయితే ఆయా చిత్రాల్లో సిద్ధు రోల్స్ మాత్రం చాలా వైవిధ్యంగా ఉంటాయి. నటనతోపాటు రైటర్‌‌గా, ఎడిటర్‌‌గా కూడా వర్క్‌ చేస్తూ వచ్చిన సిద్ధు ‘డిజే టిల్లు’తో బ్లాక్‌ బాస్టర్‌ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాకు వచ్చిన క్రేజ్‌తో సీక్వెల్‌ కూడా తెరకెక్కించి మరో సాలిడ్‌ హిట్‌ అందుకున్నాడు. ‘టిల్లు స్క్వేర్‌’ చిత్రం ఏకంగా రూ.135 కోట్లు వసూలు చేయడం విశేషం. ప్రస్తుతం ‘జాక్‌’, ‘తెలుసు కదా’ వంటి చిత్రాల్లో అతడు నటిస్తున్నాడు. వాటి తర్వాత ‘టిల్లు క్యూబ్‌’ కూడా పట్టాలెక్కనుంది.&nbsp; నార్నే నితిన్‌ (Narne Nithin) జూనియర్ ఎన్టీఆర్‌ బావ మరిది నార్నే నితిన్‌ యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ ‘మ్యాడ్‌’తో తెరంగేట్రం చేశాడు. ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయం సాధించింది. కాలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌లో రావడంతో యూత్‌ కూడా బాగా కనెక్ట్‌ అయ్యారు. ఇక నితిన్‌ తన తర్వాతి చిత్రం ‘ఆయ్‌’ను పక్కా విలేజ్‌ నేపథ్యంలో తీసుకొచ్చి వైవిధ్యం చూపించాడు. అంతేకాదు మంచి విజయాన్ని కూడా అందుకున్నాడు. మ్యాడ్‌లో కాస్త సెటిల్‌గా కనిపించిన నితీన్‌ ‘ఆయ్‌’ సినిమాలో మంచి ప్రదర్శన చేశాడు. నటన, డ్యాన్స్‌, కామెడీ ఇలా అన్ని రంగాల్లో మ్యాడ్‌తో పోలిస్తే బెటర్‌ పర్‌ఫార్మెన్స్‌ చేశాడు. భావోద్వేగాలను కూడా చక్కగా పండించి ఆకట్టుకున్నాడు.&nbsp;
    సెప్టెంబర్ 17 , 2024
    <strong>SSMB29: ఆఫ్రికన్‌ నవలల ఆధారంగా రాజమౌళి - మహేష్‌ చిత్రం.. ఇందులో నిజమెంత?</strong>
    SSMB29: ఆఫ్రికన్‌ నవలల ఆధారంగా రాజమౌళి - మహేష్‌ చిత్రం.. ఇందులో నిజమెంత?
    దర్శకధీరుడు రాజమౌళి (SS Rajamouli), సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు (Mahesh Babu) కాంబినేషన్‌లో ‘SSMB29’ చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే. కొద్ది నెలల క్రితం వరకూ తరచూ ఏదోక అప్‌డేట్‌తో వార్తల్లో నిలిచిన ఈ చిత్రం.. ఇటీవల కాలంలో ఎలాంటి సమాచారం లేకుండా సైలెంట్‌గా ఉండిపోయింది. అయితే తాజాగా కొత్త అప్‌డేట్‌తో ఈ సినిమా మరోమారు వార్తల్లో నిలిచింది. రాబోయే మహేష్‌ చిత్రం.. రెండు ఆఫ్రికన్‌ నవలల ఆధారంగా రూపొందనున్నట్లు నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది. వాటికి సంబంధించిన వివరాలేంటో ఈ కథనంలో చూద్దాం.&nbsp; కథ.. ఆ నవలల ఆధారమేనా? టాలీవుడ్‌లో ఆసక్తిరేపుతున్న క్రేజీ ప్రాజెక్ట్స్‌లో మహేష్‌ - రాజమౌళి చిత్రం ఒకటి. రాజమౌళి తండ్రి స్టార్‌ రైటర్‌ విజయేంద్ర ప్రసాద్‌ ఈ సినిమాకు కథను అందించారు. ఇప్పటికే సినిమా స్టోరీ కూడా కంప్లీట్ అయ్యిందని, ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇదిలాంటే తాజాగా రాజమౌళి &amp; టీమ్‌.. రెండు ఆఫ్రికా నవలల హక్కులను కొనుగోలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. విల్బర్‌ స్మిత్‌ రాసిన రెండు నవలలను వారు కొనుగోలు చేసినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆఫ్రికా అడవుల నేపథ్యంలో 'SSMB29' ఉంటుందని&nbsp; సినీ వర్గాల్లో టాక్ ఉంది. నేపథ్యంలో ఆఫ్రికా దేశానికి సంబంధించిన నవలల హక్కులను సొంతం చేసుకున్నట్లు వార్తలు రావడం పలు ప్రశ్నలకు తావిస్తోంది. వీటి ఆధారంగానే రాజమౌళి SSMB29 తెరకెక్కించనున్నారా? అన్న సందేహాం అభిమానుల్లో మెుదలైంది. ఇందులో నిజానిజాలు ఎంతో చిత్ర యూనిట్‌ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.&nbsp; ఆలస్యానికి కారణమిదే! SSMB29 సినిమా షూటింగ్ ఎప్పుడు మెుదలవుతుందా అని సగటు సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వాస్తవానికి జూన్‌లోనే ఈ సినిమా షూటింగ్‌ మెుదలుకావాల్సి ఉంది. అయితే ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ ఇంకా పెండింగ్‌ ఉండటంతో సినిమా పట్టాలెక్కలేదు. లొకేషన్స్‌ వెతకడానికి ఎక్కువ సమయం పట్టడమే షూటింగ్‌ ఆలస్యానికి కారణమని అంటున్నారు. అయితే పనులు ముగించుకొని డిసెంబర్‌లో SSMB29 చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకెళ్లాలని రాజమౌళి భావిస్తున్నారట. అది కుదరకపోతే కొత్త ఏడాది ప్రారంభంలోనైనా షూటింగ్‌ మెుదలు పెట్టాలని నిర్ణయించినట్లు తెలిసింది.&nbsp; కీలక పాత్రలో ఇండోనేషియా భామ! SSMB29లో ఓ హాలీవుడ్‌ భామ నటించబోతున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. ఇండోనేషియా నటి చెల్సియా ఎలిజబెత్ ఇస్లాన్ (Chelsea Elizabeth Islan) ఈ భారీ ప్రాజెక్ట్‌కు ఎంపికైనట్టు ప్రచారం జరిగింది. అమెరికన్ - ఇండోనేషియా నటిగా ఈ బ్యూటీకి మంచి గుర్తింపు ఉంది. చిల్సీ ఇస్లాన్.. 18 ఏళ్లకే వెండితెరపై మెరిసింది. ‘ది బాలిక్ 98’, ‘రూడీ’, ‘హబిబీ’ వంటి చిత్రాలతో ఇండోనేషియాలో మంచి క్రేజ్ దక్కించుకుంది. ఉత్తమ నటిగా సెకండ్ ఇండోనేషియన్ చాయిస్ అవార్డ్‌ను సైతం ఈ అమ్మడు అందుకుంది. ఈ భామ ఎంట్రీపై రాజమౌళి టీమ్‌ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.&nbsp; జాతీయ స్థాయిలో ప్రెస్‌మీట్‌! ‘SSMB29’ సినిమాకు సంబంధించి దర్శకధీరుడు రాజమౌళి ఇప్పటివరకూ అధికారికంగా ఒక్క అప్‌డేట్‌ కూడా ఇవ్వలేదు. గత చిత్రాల మాదిరిగానే దీనికి కూడా ప్రెస్‌మీట్‌ పెట్టి వివరాలు ప్రకటిస్తారా? లేదా? అన్న దానిపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. అయితే ఈసారి జక్కన్న కాస్త భారీగానే ప్లాన్‌ చేస్తున్నారని ఫిల్మ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అందుకే ‘SSMB29’ కోసం ఇంత సమయం తీసుకుంటున్నారని సన్నిహిత వర్గాలు తెలిపాయి. ప్రీ ప్రొడక్షన్‌ పనులు పూర్తయితే సినిమాకు సంబంధించి జాతీయ స్థాయిలో ప్రెస్‌మీట్‌ ఉండబోతోందని సమాచారం. తెలుగుతో పాటు, జాతీయ మీడియాకు కూడా ఒకేసారి చెప్పేస్తే ఎలా ఉంటుందా? అని మూవీ టీమ్‌ ఆలోచిస్తోందట. అయితే దీనిపై రాజమౌళి టీమ్‌ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.&nbsp;
    జూన్ 20 , 2024
    Weekend Collections: లాభాల్లోకి ‘గ్యాంగ్స్‌ ఆఫ్ గోదావరి’, ‘భజే వాయు వేగం’.. ‘గం గం గణేశా’ పరిస్థితి ఏంటంటే?
    Weekend Collections: లాభాల్లోకి ‘గ్యాంగ్స్‌ ఆఫ్ గోదావరి’, ‘భజే వాయు వేగం’.. ‘గం గం గణేశా’ పరిస్థితి ఏంటంటే?
    గత శుక్రవారం (మే 31) విడుదలైన ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’, ‘గం గం గణేశా’, ‘భజే వాయు వేగం’ చిత్రాలు.. థియేటర్లలో పాజిటివ్‌ టాక్ సొంతం చేసుకున్నాయి. అయితే విష్వక్‌ నటించిన గ్యాంగ్య్‌ ఆఫ్‌ గోదావరి తొలి రోజు రికార్డు ఓపెనింగ్స్‌ రాబట్టగా.. ఆనంద్‌ దేవరకొండ నటించిన ‘గం గం గణేశా’, కార్తికేయ నటించిన ‘భజే వాయు వేగం’ చెప్పుకోతగ్గ స్థాయిలో వసూళ్లను రాబట్టలేకపోయాయి. అయితే మౌత్‌ టాక్‌తో శని, ఆదివారాలు మంచి కలెక్షన్స్‌ను ఆకర్షిస్తాయని ట్రేడ్‌ వర్గాలు ప్రకటించాయి. మరి ఆ అంచనాలు నిజమయ్యాయా? వీకెండ్‌లో గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి కలెక్షన్స్‌ ఎంత? మిగిలిన రెండు చిత్రాల వసూళ్లు పుంజుకున్నాయా? లేదా? ఈ కథనంలో పరిశీలిద్దాం.&nbsp; దుమ్మురేపిన విష్వక్‌&nbsp; విష్వక్‌ సేన్‌, నేహా శెట్టి జంటగా రూపొందిన ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’.. శుక్ర, శని, ఆదివారాల్లో మంచి వసూళ్లను రాబట్టింది. తొలి మూడు రోజుల్లో వరల్డ్‌ వైడ్‌గా రూ.16.2 కోట్ల గ్రాస్‌ రాబట్టినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు ఓ ప్రత్యేక పోస్టర్‌ను సైతం రిలీజ్‌ చేశారు. కాగా, ఈ సినిమాలో లంక‌ల ర‌త్న అనే పాత్ర‌లో విశ్వ‌క్‌సేన్ యాక్టింగ్‌, హీరోయిజంతో పాటు అత‌డిపై తెర‌కెక్కించిన యాక్ష‌న్ సీన్స్ అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటున్నాయి. నెగెటివ్ షేడ్స్‌ ఉన్న విష్వక్‌ సేన్ క్యారెక్ట‌ర్‌ను ద‌ర్శ‌కుడు రాసుకున్న తీరు బాగుందంటూ అభిమానులు చెబుతున్నారు. అటు హీరోయిన్‌ నేహా శెట్టి.. ఇందులో అంజలి అనే కీలక పాత్రను పోషించింది. https://twitter.com/vamsikaka/status/1797530286579917125 లాభాల్లోకి వచ్చినట్లేనా? యంగ్‌ హీరో విష్వక్‌ సేన్‌.. నిర్మాతలకు మినిమం గ్యారంటీ హీరోగా మారిపోయాడు. ఆయన గత చిత్రాలు నిర్మాతలకు రూపాయి మిగిల్చిందే గానీ, నష్టాల పాలు చేయలేదని ఇండస్ట్రీలో టాక్ ఉంది. దీంతో ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ చిత్రానికి కూడా మంచి ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ జరిగింది. రూ.10 కోట్లకు మేర ఈ సినిమా థియేట్రికల్‌ హక్కులు అమ్ముడుపోయినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా నిర్మాతలు ప్రకటించిన గ్రాస్‌ రూ.16.2 కోట్లుగా ఉంది. ట్యాక్స్‌లు, థియేటర్ల అద్దెలు మినహాయిస్తే 95 శాతానికి పైగా పెట్టుబడి మెుత్తం వచ్చేసినట్లు సినీ వర్గాలు విశ్లేషిస్తున్నారు. నేటి నుంచి ఈ సినిమా లాభాల్లోకి అడుగు పెట్టబోతున్నట్లు చెబుతున్నారు.&nbsp; నిరాశ పరిచిన ‘గం గం గణేశా’ ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda) హీరోగా తెరకెక్కిన లేటెస్ట్‌ చిత్రం ‘గం గం గణేశా’ చిత్రం... బాక్సాఫీస్‌ వద్ద ఆశించిన స్థాయిలో పర్‌ఫార్మ్‌ చేయలేకపోతున్నట్లు సమాచారం. ఈ మూవీకి పాజిటివ్‌ టాక్‌ వచ్చినప్పటికీ వీకెండ్‌లో ప్రేక్షకుల నుంచి పెద్దగా రెస్పాన్స్‌ రాలేదని సమాచారం. ఈ మూవీ తొలి మూడు రోజులు.. వరల్డ్‌ వైడ్‌గా రూ.1.94 కోట్ల గ్రాస్‌ను రాబట్టినట్లు ట్రేడ్‌ వర్గాలు ప్రకటించాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.1.68 కోట్లు కలెక్ట్‌ చేసినట్లు స్పష్టం చేశాయి. కాగా, గం గం గణేశా... బ్రేక్ ఈవెన్‌ పాయింట్‌ రూ.5.50 కోట్లుగా ఉంది. ఈ మార్క్‌ను అందుకోవాలంటే ఈ వర్కింగ్‌ డేస్‌లో ఆడియన్స్‌ను మరింత అట్రాక్ట్‌ చేయాల్సి ఉంది.&nbsp; ‘భజే వాయు వేగం’కు బెటర్‌ రెస్పాన్స్‌ యంగ్‌ హీరో కార్తికేయ నటించిన 'భజే వాయు వేగం'.. మే 31న విడుదలై సాలిడ్‌ టాక్ తెచ్చుకుంది. అయితే తొలి రోజు రూ. కోటి లోపే కలెక్షన్స్‌ సాధించిన ఈ చిత్రం.. శని, ఆదివారాల్లో గణనీయంగా పుంచుకున్నట్లు కనిపిస్తోంది. ఈ మూవీ తొలి మూడు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ.5 కోట్ల మేర గ్రాస్‌ సాధించినట్లు ట్రేడ్‌ వర్గాలు వెల్లడించాయి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో రూ.4.2 కోట్ల గ్రాస్‌ వసూలు చేసినట్లు పేర్కొన్నాయి. కాగా, భజే వాయు వేగం బ్రేక్ ఈవెన్‌ టార్గెట్‌ రూ. 4 కోట్లుగా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుత గ్రాస్‌ కాకుండా షేర్‌ను పరిగణలోకి తీసుకుంటే నేటి నుంచి ఈ మూవీ కూడా లాభాల్లోకి అడుగుపెట్టే ఛాన్స్ ఉందని సినీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
    జూన్ 03 , 2024
    EXCLUSIVE : ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ పదే పదే వాయిదా పడటానికి కారణాలు ఇవే!
    EXCLUSIVE : ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ పదే పదే వాయిదా పడటానికి కారణాలు ఇవే!
    యంగ్‌ హీరో విశ్వక్‌ సేన్‌ (Vishwak Sen).. ఇటీవల ‘గామి’ (Gaami) సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించాడు. డిఫరెంట్‌ స్టోరీ లైన్‌తో రూపొందిన ఈ చిత్రంలో అఘోరా శంకర్‌ పాత్రలో అదరగొట్టాడు. మరోవైపు విశ్వక్‌ నటించిన లేటెస్ట్ చిత్రం ‘గ్యాంగ్స్ ఆఫ్‌ గోదావరి’ (Gangs Of Godavari) రిలీజ్‌కు సిద్ధమవుతోంది. మెున్నటి వరకూ ఎలాంటి అప్‌డేట్‌ లేని ఈ చిత్రం నుంచి టీజర్‌ రిలీజ్‌ డేట్‌ లాక్‌ అవ్వడంతో ఒక్కసారిగా అందరి దృష్టి ఈ చిత్రంపై పడింది. వాస్తవానికి గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి గతే ఏడాదే రిలీజ్‌ కావాల్సింది. రిలీజ్‌ తేదీని ప్రకటించి కూడా పలుమార్లు సినిమాను వాయిదా వేశారు. అందుకు కారణాలేంటో ఈ కథనంలో పరిశీలిద్దాం.&nbsp; పోస్ట్‌పోన్‌పై విష్వక్‌ అసహనం! గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి చిత్రానికి ఛల్‌ మోహన్‌ రంగ ఫేమ్‌ కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో నేహా శెట్టి హీరోయిన్‌గా చేసింది. మే 17న ఈ సినిమాను రిలీజ్‌ చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. విడుదల తేదీ కూడా దగ్గర పడుతుండటంతో ఏప్రిల్‌ 27 సా. 4.01 గం.లకు టీజర్‌ రిలీజ్‌ చేయనున్నట్లు తాజాగా ప్రకటించారు. వాస్తవానికి ఈ చిత్రం 2023 డిసెంబర్లోనే రిలీజ్‌ అవ్వాల్సింది. అయితే ‘హాయ్ నాన్న’ (Hi Nanna), ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్’ (Extra Ordinary Man) వంటి సినిమాలతో పోటీ కారణంగా ఆ సినిమాను నిర్మాతలు వాయిదా వేశారు. ఒకవేళ గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి అనుకున్న సమయానికి రాకపోతే తాను ఆ సినిమాను ప్రమోట్‌ చేయనని అప్పట్లో విశ్వక్‌ ప్రకటించడం వివాదస్పదంగా మారింది.&nbsp; నిర్మాత రియాక్షన్‌ ఇదే! ‘ఆదికేశవ’ ప్రమోషన్‌ ఈవెంట్‌ సందర్భంగా అప్పట్లో నిర్మాత నాగ వంశీ.. విష్వక్‌ వ్యాఖ్యలపై స్పందించారు. సినిమాను ఎట్టి పరిస్థితుల్లో డిసెంబర్‌ 8న విడుదల చేయాలన్నది విష్వక్‌ మాటల వెనక ఉద్దేశ్యమని స్పష్టం చేశారు. తమ సినిమా విడుదల తేదీని ప్రకటించిన సందర్భంలో వరుణ్‌ తేజ్ నటించిన 'ఆపరేషన్‌ వాలెంటైన్‌' పోటీకి సిద్ధంగా ఉందని అన్నారు. అనుకోకుండా హాయ్‌ నాన్న, ఎక్ట్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌, సలార్‌ తెరపైకి వచ్చాయని పేర్కొన్నారు. అంత కాంపింటీషన్‌కు వెళ్లి సినిమాను రిలీజ్‌ చేయడం ఎందుకని అంటానని భావించి&nbsp; విష్వక్‌ ఈ వ్యాఖ్యలు చేసి ఉండొచ్చని నాగ వంశీ అభిప్రాయపడ్డారు. సినిమా షూటింగ్‌ దశలోనే ఉన్నందున దీనిపై ఇద్దరం చర్చించి నిర్ణయం తీసుకుంటామని అప్పట్లో సమాధానం ఇచ్చారు. ఆ తర్వాత ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ ఏదోక కారణంతో వాయిదా పడుతూనే వచ్చింది.&nbsp; https://www.youtube.com/watch?v=hpFNP5gptFU ఐటెం సాంగ్‌తో గ్యాప్ ఈ ఏడాది ప్రారంభంలోనే గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరిని రిలీజ్‌ చేయాలని మేకర్స్ భావించినప్పటికీ అది జరగలేదు. ఐటెం సాంగ్‌ షూట్‌లో జరిగిన మార్పు వల్ల సినిమా షూటింగ్‌ ఆలస్యమైంది. తొలుత ఈ సినిమాలో ఐటెం సాంగ్‌ కోసం ఈషా రెబ్బను మూవీ టీమ్ ఎంపిక చేసింది. ఒక రోజు షూటింగ్‌ కూడా నిర్వహించింది. మళ్లీ ఈషాను కాదని ఆమె స్థానంలో అయేషా ఖాన్‌ను రంగంలోకి దింపారు. అటు ఇళయరాజా ఇంట విషాధం కూడా ఈ మూవీ వాయిదాకు కారణమైంది. ఈ చిత్రానికి ఇళయరాజా తనయుడు యువన్‌ శంకర్‌ రాజా సంగీతం అందించారు. జనవరి 25న అతడి సోదరి చనిపోవడంతో అతను సినిమా పనుల్లో పాల్గొనలేకపోయారు. దీంతో టెక్నికల్‌ వర్క్‌ పనులు ఆలస్యం అయ్యాయి.&nbsp; ఈ సారి విశ్వక్ వల్లే వాయిదా? దీంతో మార్చి 8న మహా శివరాత్రి సందర్భంగా సినిమాను రిలీజ్‌ చేస్తామని చిత్ర యూనిట్‌ ప్రకటించింది. అయితే ఈ శివరాత్రికి ‘గామి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు విశ్వక్‌ అనౌన్స్‌ చేశారు. దీంతో వెనక్కి తగ్గిన గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి యూనిట్‌ ఎప్పటిలాగే సినిమాను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. మే 17న ఎట్టి పరిస్థితుల్లోనూ రిలీజ్‌ చేయాలని సంకల్పంతో ఉన్నారు. సినిమా ప్రమోషన్స్‌పైనా టీమ్‌ ఫోకస్‌ పెట్టింది. నెల రోజుల క్రితం అయేషా ఖాన్‌ నటించిన ‘మోతా’ అనే ఐటెం సాంగ్‌ లిరికల్‌ వీడియోను రిలీజ్‌ చేసింది. లేటెస్ట్‌గా టీజర్‌ అప్‌డేట్‌ను ఇచ్చింది. త్వరలోనే ట్రైలర్‌ కూడా రిలీజ్‌ చేయాలని మూవీ టీమ్‌ భావిస్తోంది.&nbsp;
    ఏప్రిల్ 24 , 2024
    Salaar 2: ‘గేమ్స్‌ ఆఫ్‌ థ్రోన్స్‌’ను తలదన్నేలా ‘సలార్‌ 2’.. ప్రభాస్ షూట్‌లో పాల్గొనేది అప్పుడే!
    Salaar 2: ‘గేమ్స్‌ ఆఫ్‌ థ్రోన్స్‌’ను తలదన్నేలా ‘సలార్‌ 2’.. ప్రభాస్ షూట్‌లో పాల్గొనేది అప్పుడే!
    పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ (Prabhas) హీరోగా ప్రశాంత్ నీల్‌ (Prashanth Neel) దర్శకత్వంలో రూపొందిన బ్లాక్‌ బాస్టర్‌ చిత్రం సలార్‌ పార్ట్‌ -1; సీజ్‌ ఫైర్‌' (Salaar: Part 1 Ceasefire). గతేడాది క్రిస్‌మస్‌ కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. నిర్మాతలపై కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ మూవీకి సీక్వెల్‌గా ‘సలార్‌ 2: శౌర్యంగ పర్వం’ (Salaar 2- Shouryanga Parvam) కూడా రానుందని తొలి పార్ట్‌ క్రైమాక్స్‌లోనే డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌ స్పష్టం చేశారు. దీంతో రెండో భాగంపై అందరిలోనూ ఆసక్తి ఏర్పడింది. ఈ సినిమా షూటింగ్‌ ఎప్పుడు మెుదలవుతుందా అని ప్రతి ఒక్కరూ ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘సలార్‌ 2’కి సంబంధించి ఒకేసారి రెండు అప్‌డేట్స్‌ బయటకు వచ్చాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; వరదరాజ మన్నార్ స్పెషల్ ఎపిసోడ్‌ 'సలార్‌ 2' సినిమా షూటింగ్‌ ఏప్రిల్‌ నుంచి ప్రారంభమవుతుందని నటుడు బాబీ సింహా ఇటీవల ఓ ఇంటర్యూలో ప్రకటించాడు. తాజాగా కేరళ నటుడు పృథ్వీరాజ్‌ సుకుమాన్‌ (Prithviraj Sukumaran) కూడా ఇదే విషయాన్ని పునరుద్ఘటించాడు. సలార్‌లో ప్రభాస్‌ స్నేహితుడిగా వరద రాజమన్నార్‌ పాత్రలో పృథ్వీరాజ్‌ అదరగొట్టాడు. తాజాగా 'ది గోట్‌ లైఫ్‌' (The Goat Life) మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొన్న పృథ్వీరాజ్‌ త్వరలోనే 'సలార్‌ 2' షూట్‌ మెుదలవుతుందని చెప్పాడు. ముందుగా వరదరాజమన్నార్‌ పాత్రకు సంబంధించి యాక్షన్ ఎపిసోడ్‌ షూట్‌ చేస్తారని స్పష్టం చేశాడు. అయితే ఈ స్పెషల్‌ ఎపిసోడ్‌లోనే వరదరాజ మన్నార్‌ గ్రాఫ్‌ చూపిస్తారని అంటున్నారు.&nbsp; సెట్‌లోకి ప్రభాస్ ఎంట్రీ ఎప్పుడంటే! పృథ్వీరాజ్ సుకుమారన్‌ (Prithviraj Sukumaran)తో వరదరాజ మన్నార్‌ ఎపిసోడ్‌ పూర్తయ్యాక.. నటుడు బాబీ సింహా (Bobby Simha), శ్రియా రెడ్డి (Sriya Reddy), జగపతిబాబు (Jagapathi Babu)లపై కీలక సీన్స్‌ షూట్‌ చేస్తారని తెలుస్తోంది. ఈ రెండు షెడ్యూల్స్‌ పూర్తైన తర్వాత రెబల్‌ స్టార్ ప్రభాస్‌ (Prabhas) సెట్‌లోకి అడుగుపెడతారని సమాచారం. ఈ మూవీ మూడో షెడ్యూల్‌ నుంచి ప్రభాస్‌ రెగ్యులర్‌ షూటింగ్‌లో పాల్గొంటారని టాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం డైరెక్టర్‌ ప్రశాంత్ నీల్‌ 'సలార్‌ 2' స్క్రిప్ట్‌పై కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది.&nbsp; గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌లా ‘సలార్‌ 2’..! తాజాగా ఓ ఈవెంట్‌లో పాల్గొన్న ‘సలార్ 2’ నిర్మాత విజయ్‌ కిరగందూర్‌ సినిమాకు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏప్రిల్ తర్వాత నుంచి ఈ సినిమా పార్ట్-2 షూటింగ్‌ ప్రారంభించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. 2025లో సినిమా రిలీజ్‌ చేసేందుకు ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రముఖ హాలీవుడ్‌ సిరీస్ ‘గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌’లా సలార్‌ పార్ట్‌ 2 ఉండనుందని ఆయన తెలిపారు. నిర్మాత వ్యాఖ్యలతో ప్రభాస్‌ ఫ్యాన్స్‌ తెగ ఖుషి అవుతున్నారు. ‘సలార్‌ 2’.. తొలి భాగానికి మించి విజయం సాధిస్తుందని ఆకాంక్షిస్తున్నారు.&nbsp; ఫ్యూచర్‌ ప్రాజెక్ట్స్‌తో ప్రభాస్‌ బిజీ బిజీ.. ప్రస్తుతం ప్రభాస్.. ‘కల్కి’ (Kalki 2898 AD), ‘రాజా సాబ్’ (Raja Saab) చిత్రాల షూటింగ్‌తో తీరిక లేకుండా గడుపుతున్నాడు. మరోవైపు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) ‘స్పిరిట్’ (Spirit)ను పట్టాలెక్కించే పనిలో ఉన్నాడు. ఇంత బిజీలో ప్రభాస్ ‘సలార్-2’కు ఎలా డేట్లు కేటాయించి వచ్చే ఏడాది సినిమా రిలీజయ్యేలా చూస్తాడో చూడాలి మరి.&nbsp;
    మార్చి 12 , 2024
    బోల్డ్ బ్యూటీ రాధికా ఆప్టే సెకండ్ ఇన్నింగ్స్
    బోల్డ్ బ్యూటీ రాధికా ఆప్టే సెకండ్ ఇన్నింగ్స్
    ]ప్రస్తుతానికి ఈ బోల్డ్ బ్యూటీ మెగా ఫోన్ పట్టుకుంది. స్లీవ్‌ వాకర్స్ అనే షార్ఠ్ ఫిల్మ్‌కు దర్శకత్వం వహించింది. ఈ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.మెగా ఫోన్
    ఫిబ్రవరి 13 , 2023
    Pushpa 2 Full HD Movie Leaked: ఆన్‌లైన్‌ పైరసీ వెబ్‌సైట్లలో ఫ్రీగా పుష్ప2 డౌన్‌లోడ్ లింక్స్
    Pushpa 2 Full HD Movie Leaked: ఆన్‌లైన్‌ పైరసీ వెబ్‌సైట్లలో ఫ్రీగా పుష్ప2 డౌన్‌లోడ్ లింక్స్
    అల్లు అర్జున్ నటించిన పుష్ప 2: ది రూల్ డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం (Pushpa 2 Full HD Movie Leaked)అభిమానులకు మూడు సంవత్సరాల తర్వాత పుష్పరాజ్ పాత్రను మళ్లీ తెరపైకి తీసుకొచ్చింది. రష్మిక మందన్న, ఫహద్ ఫాజిల్ తదితరులు తమ అద్భుత నటనతో సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అటు సినీ విమర్శకులు, అభిమానులు ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతున్న ఈక్రమంలో పుష్ప 2 చిత్రం  పైరసీ బారిన పడటంతో పరిశ్రమలో కలకలం రేగింది. పైరసీ బారిన పుష్ప 2 &nbsp;పుష్ప 2 చిత్రం థియేటర్లలో విడుదలైన కొన్ని గంటల్లోనే ఐబొమ్మ, మూవీరూల్స్, తమిళ్ రాకర్స్, ఫిల్మిజిల్లా, తమిళ్ యోగి, బప్పమ్ టీవీ, మూవీస్‌డా వంటి పలు పైరసీ వెబ్‌సైట్లలో లీకైంది. ఇది 1080p నుంచి 240p వరకు అనేక ఫార్మాట్‌లలో అందుబాటులోకి వచ్చింది. ఈ లీక్ వల్ల సినిమాను ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకునే వారికి మరింత వీలైంది. "పుష్ప 2 డౌన్‌లోడ్" కోసం ఆన్‌లైన్‌లో హడావుడి సినిమా విడుదల తరువాత "Pushpa 2 The Rule Movie Download," "Pushpa 2 Tamilrockers," "Pushpa 2 Telegram Links", Pushpa 2 The Rule Movie Free Download &nbsp;వంటి పదాలు ఆన్‌లైన్‌లో ట్రెండింగ్‌గా మారాయి. ఈ చిత్రాన్ని పైరసీలో చూసేందుకు వెతుకులాట ఎక్కువైంది. ఈ పెరుగుదల పైరసీని మరింతగా ప్రోత్సహించిందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. సినిమాపై అభిమానుల స్పందన మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు విశేషంగా ఆదరిస్తున్నారు. చాలా రివ్యూ సంస్థలు మంచి రేటింగ్‌ అందించాయి. కొన్ని మీడియా సంస్థలు ఈ సినిమాకు ఏకంగా&nbsp; 5/5 రేటింగ్ ఇచ్చాయి. ప్రత్యేకంగా అల్లు అర్జున్ స్క్రీన్ ప్రెజెన్స్, కథనం, పవర్ ఫుల్ డైలాగ్స్‌పై ప్రశంసలు కురుస్తున్నాయి. సుకుమార్ దర్శకత్వం ఈ చిత్రానికి ప్రధాన బలంగా చెప్పవచ్చు. చిత్తూరు నేపథ్యంలో పుష్పరాజ్ స్మగ్లింగ్ కార్యకలాపాలు, అతని ఎర్రచందనం వ్యాపారాన్ని (Pushpa 2 Full HD Movie Leaked) అంతర్జాతీయ స్థాయికి ఎలా తీసుకెళ్లాడన్నదే ఈ కథాంశం. అల్లు అర్జున్ నెమ్మదిగా నడిచే సన్నివేశాలు, ఆయన ప్రతిసారి స్క్రీన్‌పై కనిపించినప్పుడు ప్రేక్షకుల స్పందన సినిమాకు ప్రత్యేకతను తీసుకొచ్చాయి. ఫహద్ ఫాజిల్- రష్మిక మందన్న పాత్రలు ఫహద్ ఫాజిల్ SP శేఖావత్ పాత్రలో తన నటనతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆయన పాత్ర కథానాయకుడి ప్రయాణానికి కొత్త కోణాన్ని అందించింది. రష్మిక మందన్న, శ్రీవల్లి పాత్రలో, ఈసారి మరింత బలమైన పాత్రతో కనిపించి, శక్తివంతమైన డైలాగ్స్ ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకుంది మహమ్మారిలా పైరసీ పుష్ప 2 సినిమాపై సానుకూల రివ్యూలు ఉన్నప్పటికీ, పైరసీ వల్ల ఈ సినిమా బాక్సాఫీస్ వసూళ్లపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. పైరసీ ఒకటి కాదు, రెండు కాదు, సినీ పరిశ్రమ మొత్తానికి ఒక మహమ్మారిలా మారింది. &nbsp;పుష్ప 2: ది రూల్ చిత్రం అభిమానుల హృదయాలను గెలుచుకుంటూ ముందుకు సాగుతోంది. కానీ ఈ సినిమాను థియేటర్లకు వెళ్లకుండా పైరసీ ద్వారా చూసే వారిని అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికీ ఉంది. మనం సినిమా ప్రదర్శనను థియేటర్లలో ఆనందించడం ద్వారా చిత్రబృందానికి మద్దతు అందించాలి. పుష్ప 2 సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
    డిసెంబర్ 05 , 2024
    <strong>Kali Movie Review: ఆత్మహత్యలు ఎంత తప్పో తెలియజెప్పే చిత్రం.. ‘కలి’ ఎలా ఉందంటే?&nbsp;</strong>
    Kali Movie Review: ఆత్మహత్యలు ఎంత తప్పో తెలియజెప్పే చిత్రం.. ‘కలి’ ఎలా ఉందంటే?&nbsp;
    నటీనటులు : ప్రిన్స్‌, నరేష్ అగస్త్య, నేహా కృష్ణన్‌, సి.వి.ఎల్‌. నరసింహా రావు, మణి చందన, కేదర్‌ శంకర్‌, మధుమణి, గుండు సుదర్శన్‌ తదితరులు దర్శకత్వం : శివ శేషు సంగీతం : జీవన్‌ బాబు సినిమాటోగ్రాఫర్‌ : రమణ జాగర్లమూడి ఎడిటర్‌ : విజయ్‌ వర్ధన్‌ కావురి నిర్మాత : టి. లీలా గౌతమ్‌ విడుదల తేదీ : 04-10-2024 ప్రిన్స్‌, నరేశ్‌ అగస్త్య ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ చిత్రం 'కలి' (Kali Movie 2024 Review). శివ సాషు దర్శకత్వం వహించారు. నేహా కృష్ణన్‌, సి.వి.ఎల్‌. నరసింహా రావు, మణి చందన, కేదర్‌ శంకర్‌, మధుమణి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఒక డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ చిత్రం అక్టోబర్‌ 4న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? తెలుగు ఆడియన్స్‌ను ఆకట్టుకుందా? ఈ రివ్యూలో పరిశీలిద్దాం.&nbsp; కథేంటి శివరామ్ (ప్రిన్స్) యూనివర్సిటీలో ప్రొఫెసర్. ఎవరు ఏం సహాయం అడిగినా కాదనకుండా చేస్తుంటాడు. ఈ క్వాలిటీ నచ్చే వేద (నేహా కృష్ణన్) అనే అ‍మ్మాయి అతడిని ప్రేమిస్తుంది. ఇంట్లో వాళ్లని ఎదురించి మరీ పెళ్లి చేసుకుంటుంది. అయితే శివరామ్‌ మంచి తనాన్ని క్యాష్‌ చేసుకొని ఆస్తి కొట్టేయాలని సొంత వారే కుట్రలు చేస్తుంటారు. సొంత తమ్ముడు, బాబాయ్‌ మోసం చేయడంతో శివరామ్‌ తీవ్రంగా నిరాశ చెందుతాడు. వచ్చే జన్మలోనైనా మనిషిలా పుట్టకూడదంటూ ఆత్మహత్యకు యత్నిస్తాడు. ఈ క్రమంలో కలియుగాన్ని పాలించే కలి పురుషుడు (నరేశ్ అగస్త్య) ఎంట్రీ ఇస్తాడు. సరిగ్గా సూసైడ్‌ చేసుకుంటున్న సమయంలోనే కాలింగ్‌ బెల్‌ కొట్టి అతడ్ని రక్షిస్తాడు. కలి రాకతో శివరామ్‌ జీవితంలో చోటుచేసుకున్న మార్పులేంటి? శివరామ్‌ జీవితానికి కలి కాలానికి ఉన్న సంబంధం ఏంటి? తెలియాలంటే థియేటర్లకు వెెళ్లాల్సిందే.&nbsp; ఎవరెలా చేశారంటే శివరామ్‌గా సరికొత్త పాత్రలో ప్రిన్స్ అదరగొట్టాడు. సెటిల్డ్ నటనతో మెప్పించాడు. చాలా సీన్లలో డైలాగ్స్‌ లేనప్పటికీ ఎక్స్ ప్రెషన్స్‌తోనే మెప్పించాడు. సీన్లను రక్తికట్టిస్తూ నటుడిగా తనని తాను బాగా ఆవిష్కరించుకునే ప్రయత్నం చేశాడు. ఇక కలి పాత్రలో నరేష్‌ అగస్త్య మెరిశాడు. స్టైలీష్‌ నటనతో ఆకట్టుకున్నాడు. సినిమా కథ ప్రధానంగా ఈ రెండు పాత్రల చుట్టే తిరిగింది. ఈ ఇద్దరే కథ మెుత్తాన్ని నడిపించారు. ఇక వేద పాత్రలో నేహ కృష్ణన్‌ ఉన్నంతలో ఆకట్టుకుంది. తన పాత్ర పరిధిమేరకు నటించి మెప్పించింది. మిగిలిన పాత్ర దారులు కూడా తమ రోల్స్‌కు న్యాయం చేశారు.&nbsp; డైరెక్షన్ ఎలా ఉందంటే సమస్యలకు పరిష్కారం సూసైడ్‌ కాదని, ఆత్మహత్యే అసలైన ప్రాబ్లమ్‌ అని దర్శకుడు శివ శేష్‌ ఈ చిత్రం ద్వారా తెలియజెప్పే ప్రయత్నం చేశారు. సందేశాత్మక కథనే ఎంచుకున్నప్పటికీ కమర్షియల్‌ అంశాలకూ ప్రయారిటీ ఇచ్చారు. కథను ఎంగేజింగ్‌గా, సస్పెన్స్, థ్రిల్లర్‌ అంశాలను మేళవిస్తూ ఆసక్తికరంగా తీర్చిదిద్దారు. సినిమా ప్రారంభంలో శివరామ్‌ పాత్ర, అతడి కుటుంబ నేపథ్యం, లవ్‌ ట్రాక్‌, కుటుంబ సభ్యుల మోసం చూపించారు. కలి అయిన అగస్త్య రాకతో కథలో వేగం పెంచారు డైరెక్టర్‌. శివరామ్‌ను అగస్త్య ప్రశ్నించిన తీరు, అతడు చేస్తున్న తప్పేంటో చెప్పే ప్రయత్నం మెప్పిస్తుంది. బతకాలనే ఆశని పుట్టించే సీన్లు అదిరిపోయాయి. ముఖ్యంగా ప్రిన్స్‌, నరేష్‌ అగస్త్యా మధ్య వచ్చే సీన్లు రక్తి కట్టించేలా ఉన్నాయి. అయితే కథను మరీ సాగదీసినట్లు అనిపించడం, సినిమా మెుత్తం రెండు పాత్రల చుట్టే తిరగడం, కామెడీ లేకపోవడం మైనస్‌లుగా చెప్పవచ్చు. సాంకేతికంగా టెక్నికల్‌ అంశాల విషయానికి వస్తే సంగీతం ప్రధాన బలంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా జీవన్‌ బాబు అందించిన నేపథ్యం సంగీతం సన్నివేశాలను బాగా ఎలివేట్‌ చేసింది. ఎడిటర్‌ తన కత్తెరకు ఇంకాస్త పని పెట్టి ఉంటే బాగుండేది. కెమెరా వర్క్ బాగుంది. విజువల్స్‌ రిచ్‌గా ఉన్నాయి. నిర్మాణ విలువలు కూడా సినిమాకు తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.&nbsp; ప్లస్‌ పాయింట్స్‌ కథప్రిన్స్‌, అగస్త్య నటనసంగీతం మైనస్‌ పాయింట్స్‌ సాగదీత సన్నివేశాలుఎడిటింగ్‌ Telugu.yousay.tv Rating : 2.5/5&nbsp;
    అక్టోబర్ 04 , 2024

    @2021 KTree