రివ్యూస్
How was the movie?
తారాగణం
విశాల్
అర్జున్ సర్జా
సమంత రూత్ ప్రభు
ఢిల్లీ గణేష్
శ్రీజ రవి
రోబో శంకర్
దర్శన రాజేంద్రన్
సుమన్
కాళి వెంకట్
విన్సెంట్ అశోకన్
మధుసూధన్ రావు
కవితాలయా కృష్ణన్
వివేక్ ప్రసన్న
జి. మరిముత్తు
ఆర్ఎస్ శివాజీ
మహానది శంకర్
రాహుల్ తథా
అబ్దుల్
సత్య NJ
జెరెమీ రోస్కే
ప్రదీప్ కె విజయన్
కోతాండమ్
శరత్ రవి
అరంతాంగి నిషా
రిషికాంత్
అశోక్ పాండియన్
హరీష్
రైల్ రవి
సూపర్‌గుడ్ సుబ్రమణి
నమస్కారం కందసామి
గుర్తింపు లేని పాత్రలో నితిన్ ప్రసన్న
పిఎస్ మిత్రన్
సిబ్బంది
పిఎస్ మిత్రన్
దర్శకుడువిశాల్
నిర్మాతయువన్ శంకర్ రాజా
సంగీతకారుడుకథనాలు
Hero Vishal: విశాల్ vs తమిళ నిర్మాతల మండలి.. కోలీవుడ్‌లో రచ్చరేపుతున్న వివాదం!
కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ (Vishal)కు తమిళంతో పాటు తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంది. అతడు చేసే యాక్షన్ చిత్రాలకు మాస్ ఆడియన్స్‌లో పెద్ద ఫాలోయింగ్ ఉంది. అయితే ముక్కుసూటి మనస్తత్వం కలిగిన విశాల్ ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడి తరచూ వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మరో వివాదానికి విశాల్ కేంద్ర బిందువుగా మారారు. తమిళ నిర్మాతల మండలితో తలెత్తిన గొడవ నేపథ్యంగా ఎక్స్ వేదికగా ఘాటు పోస్టు పెట్టాడు. ‘నన్ను ఆపడానికి ప్రయత్నించండి’ అంటూ గట్టి సవాలు విసిరారు. అసలు విశాల్ ఈ పోస్టు ఎందుకు పెట్టాడు? నిర్మాతల మండలితో అతడికి తలెత్తిన వివాదం ఏంటి? ఈ కథనంలో తెలుసుకుందాం.
అసలేం జరిగింగంటే?
హీరో విశాల్ గతంలో టీఎఫ్‌పీసీ (తమిళ్ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్) అధ్యక్షుడిగా పనిచేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో రూ.12 కోట్ల నిధులను విశాల్ దుర్వినియోగం చేశాడని అతడిపై ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో ఇటీవల తమిళనాడు ప్రభుత్వం, కొందరు నిర్మాతలను పరోక్షంగా టార్గెట్ చేస్తూ విశాల్ కొన్ని కామెంట్స్ చేశాడు. తమిళనాడులోని థియేటర్స్ అన్ని కొంతమంది చేతుల్లోనే ఉన్నాయని ఆరోపించారు. వాళ్లు చెప్పినప్పుడే సినిమాను రిలీజ్ చేయాలని, సినిమా వాళ్లను వారు కంట్రోల్ చేస్తున్నారని విమర్శించారు. దీనిపై ఆగ్రహించిన ‘టీఎఫ్‌పీసీ’ విశాల్‌ను టార్గెట్ చేస్తూ కొన్ని ఆంక్షలు విధించింది. ఇక మీదట విశాల్‌తో సినిమాలు చేయకూడదని అల్టిమేటం జారీ చేసింది.
విశాల్ స్ట్రాంగ్ వార్నింగ్!
‘టీఎఫ్‌పీసీ’ ఆదేశాలను తీవ్రంగా ఖండిస్తూ విశాల్ (Vishal) ఆసక్తికర పోస్టు పెట్టారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సినిమాలు చేయడం మానుకోనని స్పష్టం చేశాడు. ఒకవేళ తనను ఆపే ప్రయత్నం చేస్తే నిర్మాతలమని చెప్పుకొనే కొందరు ఎప్పటికీ సినిమాలు ప్రొడ్యూస్ చేయాలేరని హెచ్చరించాడు. అలాగే నిధుల దుర్వినియోగంపై వచ్చిన ఆరోపణలపై తన పోస్టులో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు విశాల్. ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సభ్యుల సంక్షేమానికే మేం నిధులు వినియోగించాం. వృద్ధులు, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారికి ఆరోగ్య బీమా కల్పించాం. మిస్టర్ కథిరేసన్ ఈ నిర్ణయం మీ టీమ్‌తో కలిసి తీసుకున్నదనే విషయం తెలియదా? మీ పని మీరు సక్రమంగా చేయండి. ఇండస్ట్రీ కోసం చేయాల్సింది చాలా ఉంది. రెట్టింపు పన్ను, థియేటర్ నిర్వహణ ఖర్చులు ఇలా ఎన్నో సమస్యలను పరిష్కరించాల్సి ఉంది. నేను సినిమాలు చేస్తూనే ఉంటా. కావాలంటే నన్ను ఆపడానికి ప్రయత్నించండి' అంటూ ఎక్స్‌లో సుదీర్ఘ పోస్టు పెట్టాడు. ప్రస్తుతం ఇది వైరల్‌గా మారింది. తమిళ నిర్మాతల మండలి ఈ వ్యాఖ్యలపై ఎలా బదులిస్తుందో చూడాలి.
https://twitter.com/VishalKOfficial/status/1816832712193573070
విశాల్ ఎలా పాపులర్ అంటే?
తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన విశాల్ టాలీవుడ్ నిర్మాత జి.కె. రెడ్డి దంపతులకు 29 ఆగస్టు 1975న జన్మించాడు. ప్రేమ చదరంగం (2004) సినిమాతో తెరంగేట్రం చేశాడు. విశాల్ ప్రధానంగా తమిళ చిత్రాలు చేసినప్పటికీ చాలావరకూ అవి తెలుగులో డబ్ అయ్యాయి. అలా వచ్చిన 'పందెం కోడి' (Pandem Kodi), 'పొగరు' (Pogaru), 'భరణి' (Bharani), 'పూజ' (Pooja), 'అభిమన్యుడు' (Abhimanyudu) చిత్రాలు విశాల్‌కు తెలుగులోనూ పాపులారిటీ తీసుకొచ్చాయి. రీసెంట్‌గా ‘రత్నం’ (2024) అనే సినిమాతో విశాల్ తెలుగు ఆడియన్స్‌ను పలకరించాడు. అయితే అది పెద్దగా ఆకట్టుకులేదు. ప్రస్తుతం ‘తుప్పరివాళన్ 2’ అనే చిత్రంలో విశాల్ నటిస్తున్నాడు. ఇది 2017లో వచ్చిన ‘డిటెక్టివ్’ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతోంది.
జూలై 27 , 2024
PVCU 3: కాళికాదేవి శక్తితో మహిళా సూపర్ హీరో.. ప్రశాంత్ వర్మ గట్టిగానే ప్లాన్ చేశాడుగా!
‘హనుమాన్’ (Hanuman) చిత్రంతో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ (Prasanth Varma) పేరు దేశవ్యాప్తంగా మార్మోగింది. పెద్దగా అంచనాలు లేకుండా ఈ ఏడాది సంక్రాంతికి రిలీజైన హనుమాన్ పాన్ ఇండియా స్థాయిలో వసూళ్ల సునామీ సృష్టించింది. దర్శకుడిగా ప్రశాంత్ వర్మ పనితీరుపై సర్వత్రా ప్రశంసలు కురిశాయి. ఇదిలా ఉంటే తన సినిమాటిక్ యూనివర్స్ (PVCU) నుంచి ప్రతి ఏడాది ఓ సినిమా వస్తుందని ప్రశాంత్ వర్మ గతంలోనే చెప్పారు. ఇందుకు అనుగుణంగా PVCU నుంచి అదిరిపోయే ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేశాడు.
‘మహా కాళీ’ ప్రాజెక్ట్
‘హనుమాన్’ డైరెక్టర్ క్రియేట్ చేసిన 'ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్’ (PVCU) నుంచి మూడో ప్రాజెక్ట్ అనౌన్స్ మెంట్ వచ్చేసింది. ఈ మూవీకి 'మహా కాళీ' (MAHAKALI) అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ మేరకు టైటిల్ రివీల్ చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. భారతీయ సినీ ప్రపంచంలో మొదటి మహిళా సూపర్ హీరో సినిమాగా ఈ చిత్రం ఉండనున్నట్లు పోస్టర్ చూస్తే తెలుస్తోంది. దాంతో పాటు ఈ మూవీకి మహిళా దర్శకురాలు పూజ అపర్ణ కొల్లూరు దర్శకత్వం వహిస్తోండటం ఆసక్తి కలిగిస్తోంది. RKD స్టూడియోస్ బ్యానర్‌పై రివాజ్ రమేష్ దుగ్గల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
https://twitter.com/PrasanthVarma/status/1844241797394161761
పోస్టర్‌లో ఇవి గమనించారా?
‘మహా కాళీ’ పోస్టర్ ని గమనిస్తే 'ఒక బాలిక తన తలను పులికి సున్నితంగా తాకినట్లు చూపించారు. బ్యాగ్రౌండ్‌లో గుడిసెలు, దుకాణాలు దర్శనమివ్వడంతో ప్రజలు ఎంతో భయాందోళనతో పెరిగెడుతూ కనిపించారు. అలాగే పోస్టర్‌లో ఒక ఫెర్రిస్ వీల్ మంటల్లో చిక్కుకున్నట్లు చూపించారు. అంతేకాకుండా టైటిల్‌ను బెంగాలీ ఫాంట్‌లో డిజైన్ చేయడం, డైమండ్ లాంటి ఆకారాన్ని మధ్యలో ఉంచడం ఆసక్తిరేపుతోంది. ప్రశాంత్ వర్మ యూనివర్స్ నుంచి రానున్న ఈ చిత్రం ఈసారి ఎలాంటి మ్యాజిక్ చేయబోతుందోనన్న ఆసక్తి అందరిలోనూ మెుదలైంది. కాగా ఈ సినిమాకి స్మరణ్ సాయి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ మూవీ IMAX 3Dలో భారతీయ, విదేశీ భాషలలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.
కాళికాదేవి శక్తితో..
మహాకాళి ప్రాజెక్ట్ అనౌన్స్‌మెంట్ సందర్భంగా దర్శకుడు ప్రశాంత్ వర్మ ఎక్స్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రాజెక్ట్‌కు సంబంధించిన వీడియోను విడుదల చేశారు. ‘మా యూనివర్స్‌కు కొత్త శక్తి జోడైంది. అత్యంత భయంకరమైన చెడుపై యుద్ధం చేయడానికి కాళికాదేవి స్వరూపం రానుంది. సూపర్ హీరోలు ఎలా ఉంటారో ఈ చిత్రంలో చూపించనున్నాం’ అంటూ వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. దీంతో మహా కాళిపై ఒక్కసారిగా హైప్ క్రియేట్ అయ్యింది. ఇందులో సూపర్ ఉమెన్ పాత్ర ఏ హీరోయిన్ పోషిస్తుందా? అన్న ఆసక్తి ప్రతీ ఒక్కరిలోనూ మెుదలైంది. స్టార్ హీరోయిన్‌ను తీసుకుంటారా? లేదా కొత్త వారికి ఛాన్స్ ఉంటుందా? అన్న చర్చ నెట్టింట జరుగుతోంది.
https://twitter.com/PrasanthVarma/status/1844236760215392423
‘జై హనుమాన్’ కంటే ముందే..
తన సినిమాటిక్ యూనివర్స్‌కు సంబంధించి 20 స్క్రిప్ట్‌లు సిద్ధమవుతున్నాయని ప్రశాంత్ వర్మ గతంలోనే ప్రకటించారు. తొలి ఫేజ్‌లో ఆరుగురు సూపర్ హీరోల సినిమాలు తీస్తామని స్పష్టం చేశారు. ‘జై హనుమాన్’ కంటే ముందు ‘అధీర’, ‘మహాకాళీ’ సిద్ధంగా ఉన్నాయని ప్రశాంత్ వర్మ (Prasanth Varma) ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. వీటితో పాటు నందమూరి వారసుడు మోక్షజ్ఞను పరిచయం చేస్తున్నట్లు కూడా ఇటీవలే తెలిపారు. ప్రశాంత్‌వర్మ సినిమాటిక్ యూనివర్స్ (PVCU) నుంచి రెండో ప్రాజెక్ట్‌గా మోక్షజ్ఞ సినిమా రానున్నట్లు చెప్పారు. ఈ సినిమాకు తానే దర్శకత్వం వహించనున్నట్లు వెల్లడించారు. ప్రశాంత్ వర్మ దూకుడు చూస్తుంటే ఏడాది ఒక సినిమాతో బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపడం ఖాయంగా కనిపిస్తోంది.
మోక్షజ్ఞ సినిమాలో బిగ్‌బీ!
బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ తేజ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో 'PVCU 2' ప్రాజెక్ట్ రానున్న సంగతి తెలిసిందే. ఈ మూవీకి కోసం పాన్ ఇండియా సబ్జెక్ట్‌ను సైతం ప్రశాంత్ సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఓ కీలక పాత్రకు బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్‌ను తీసుకోవాలని ప్రశాంత్ వర్మ భావిస్తున్నారట. ఆ పాత్రకు బిగ్ బీ అయితేనే పూర్తిగా న్యాయం చేస్తారని డైరెక్టర్ నమ్ముతున్నారట. అమితాబ్‌ను తీసుకోవడం ద్వారా బాలీవుడ్‌లోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వాలని ప్రశాంత్ వర్మ చూస్తున్నట్లు సమాచారం. కాగా, ఇందులో అభిమన్యుడి పాత్రలో మోక్షజ్ఞ కనిపించనున్నట్లు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు.
అక్టోబర్ 10 , 2024
Mokshagna Teja: మోక్షజ్ఞ ఫస్ట్ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరో.. ప్రశాంత్ వర్మ బిగ్ ప్లాన్!
నట సింహం నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ తేజ (Mokshagna Teja) సినీ రంగ ప్రవేశం కోసం అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. దీంతో నందమూరి నట వారసుడిగా తెరంగేట్రం చేసేందుకు రెడీ అయ్యాడు. మెున్నటి వరకూ కాస్త బొద్దుగా కనిపించిన మోక్షజ్ఞ తాజాగా స్లిమ్ అయ్యి హీరోలా మేకోవర్ అయ్యాడు. హనుమాన్ ఫేమ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ అతడ్ని తెలుగు తెరకు పరిచయం చేయనున్నాడు. ఈ క్రమంలోనే మోక్షజ్ఞ తేజ సినిమాకు సంబంధించి ఓ వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. ఇది చూసిన నందమూరి అభిమానులు తెగ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.
అమితాబ్ స్పెషల్ రోల్!
తన కుమారుడు మోక్షజ్ఞను ఇండస్ట్రీకి పరిచయం చేసే బాధ్యతను యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మకు బాలకృష్ణ అప్పగించారు. హనుమాన్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపు సంపాదించిన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ నందమూరి నట వారసుడిని ఓ రేంజ్‌లో పరిచయం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే పాన్ ఇండియా స్టోరీని ప్రశాంత్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఓ కీలక పాత్రకు బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్‌ను తీసుకోవాలని ప్రశాంత్ వర్మ భావిస్తున్నారట. ఆ పాత్రకు బిగ్ బీ అయితేనే పూర్తిగా న్యాయం చేస్తారని డైరెక్టర్ నమ్ముతున్నారట. ఇందుకోసం త్వరంలోనే బిగ్ బీని ప్రశాంత్ వర్మ సంప్రదిస్తారని తెలుస్తోంది.
ప్రశాంత్ వర్మ బిగ్ ప్లాన్!
మోక్షజ్ఞ సినిమాలోకి అమితాబ్‌ను తీసుకోవడం ద్వారా బాలీవుడ్‌లోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వాలని డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. దిగ్గజ నటుడు తన సినిమాలో ఉంటే అటు మోక్షజ్ఞకు కూడా కలిసొస్తుందని ఆయన అభిప్రాయపడుతున్నారట. మోక్షజ్ఞతో చేయబోయే ఈ సినిమా, ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో ఓ భాగమని ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది. అభిమన్యుడి పాత్రలో నందమూరి వారసుడు కనిపిస్తాడని స్ట్రాంగ్ బజ్ కూడా వినిపిస్తోంది. ప్రముఖ నటులు కూడా ఈ మూవీలో తారాగణంగా ఉంటారని అంటున్నారు. వీటిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది.
బాలయ్యకు నో చెప్పిన బిగ్ బీ!
నందమూరి బాలకృష్ణ, అమితాబ్ బచ్చన్ కాంబోలో దర్శకుడు కృష్ణ వంశీ గతంలో ఓ సినిమాను ప్లాన్ చేశారట. ఈ విషయమై బిగ్‌బీని సంప్రదించగా ఆయన సున్నితంగా తిరస్కరించినట్లు అప్పట్లో కథనాలు వచ్చాయి. దీంతో ఆ ప్రాజెక్ట్ కూడా అటకెక్కినట్లు తెలిసింది. అప్పుడు బాలయ్యకు నో చెప్పిన అమితాబ్ అతడి కుమారుడి తెరంగేట్రం చిత్రంలో నటిస్తారో లేదోనన్న ఆసక్తి ఏర్పడింది. ఇక ఈ మూవీలో మోక్షజ్ఞకు జోడీగా శ్రీలీల పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. సినిమాకు సంబంధించి త్వరలోనే కీలక అపడేట్స్ రానున్నట్లు తెలుస్తోంది.
ప్రశాంత్ వర్మే ఎందుకు?
నందమూరి వశం నుంచి వస్తోన్న మూడో తరం హీరో కావడంతో మోక్షజ్ఞ తేజను ఎవరూ ఇండస్ట్రీకి పరిచయం చేస్తారన్న ఆసక్తి ప్రతీ ఒక్కరిలోనూ నెలకొంది. ఈ క్రమంలో బోయపాటి వంటి స్టార్ డైరెక్టర్ల పేర్లు కూడా వినిపించాయి. అయితే వారందరినీ కాదని యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మకే తన కుమారుడ్ని పరిచయం చేసే అవకాశం బాలయ్య ఇచ్చారు. ఇందుకు ఓ బలమైన కారణం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. హనుమాన్ చిత్రంతో ప్రశాంత్ వర్మ పేరు దేశవ్యాప్తంగా మార్మోగింది. అతడి ప్రతిభ ఏంటో అందరికీ తెలిసింది. తేజ సజ్జ వంటి కుర్ర హీరోతో పని చేసిన అనుభవం ఉండటంతో అతడైతేనే మోక్షజ్ఞను బాగా ప్రజెంట్ చేయగల్గుతాడని బాలయ్య నమ్మినట్లు తెలుస్తోంది. అంతేగాక వ్యక్తిగతంగానూ సన్నిహిత సంబంధాలు ఉండటం వల్ల కూడా ప్రశాంత్ వర్మపై బాలయ్య మెుగ్గు చూపించి ఉండొచ్చని టాక్.
హ్యాండ్సమ్ లుక్‌లో..
నందమూరి మోక్షజ్ఞ హ్యాండ్సమ్ లుక్‌తో ఉన్న ఫొటోలు ఇటీవల ఒక్కసారిగా నెట్టింట ప్రత్యక్షమయ్యాయి. ఇందులో మోక్షజ్ఞ తన హ్యాండ్సమ్ లుక్‌తో అందరినీ మెస్మరైజ్ చేశాడు. ఎవరూ ఊహించని విధంగా పూర్తి ఫిట్‌గా కనిపించి ఆశ్చర్యపరిచాడు. తాను పక్కా స్టార్ హీరో మెటీరియల్ అని తన న్యూ లుక్ ఫొటోలతో చాటిచెప్పాడు. ఇక మోక్షజ్ఞ మేకోవర్ చూసి నందమూరి ఫ్యాన్స్ తెగ ఖుషీ అయ్యారు. బాలకృష్ణ తనయుడు ఎలా ఉండాలని తాము ఊహించుకున్నామో మోక్షజ్ఞ అలాగే మేకోవర్ అయినట్లు కామెంట్స్ చేశారు. మరో నందమూరి వారసుడు ఇండస్ట్రీలో అడుగు పెట్టేందుకు సమయం ఆసన్నమైందని పోస్టులు పెట్టారు.
ఆగస్టు 21 , 2024
Bhamakalapam 2 Review: ప్రియమణి ‘వన్ ఉమెన్ షో’.. ‘భామా కలాపం 2’ ఎలా ఉందంటే?
నటీనటులు: ప్రియమణి, శరణ్య ప్రదీప్, సీరత్ కపూర్, చైతు జొన్నలగడ్డ, సుదీప్ వేద్, అనీష్ తదితరులు
రచన, దర్శకత్వం: అభిమన్యు
సంగీతం: ప్రశాంత్ విహారి
సినిమాటోగ్రఫీ: దీపక్
ఎడిటింగ్: విప్లవ్ నైషద్
స్ట్రీమింగ్ వేదిక: ఆహా
విడుదల తేదీ: 16-02-2024
ప్రియమణి (Priyamani) ప్రధాన పాత్రలో నటించిన ‘భామా కలాపం’ (Bhamakalapam) అప్పట్లో ఓటీటీ వేదికగా విడుదలై మంచి ఆదరణ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ చిత్రానికి కొనసాగింపుగా ‘భామా కలాపం 2’ (Bhamakalapam 2) ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలుత ఈ మూవీని థియేటర్స్‌లో విడుదల చేయాలని భావించినా కుదరలేదు. దీంతో తెలుగు ఓటీటీ వేదిక ‘ఆహా’ (Aha)లో స్ట్రీమింగ్‌కు తెచ్చారు. మరి ఈ సినిమా ఎలా ఉంది? అనుపమగా ప్రియమణి ఈసారి ఏం సాహసం చేసింది? ఇప్పుడు చూద్దాం.
కథ
అనుపమ (ప్రియమణి) (Bhamakalapam 2 Review In Telugu) యూట్యూబ్ ఛానెల్ వేదికగా వంటలు చేస్తూ ఉంటుంది. కోల్‌తా మ్యూజియంలో రూ.200కోట్ల విలువైన కోడిగుడ్డు మాయంతో ఇబ్బందుల్లో పడ్డ అనుపమ ఫ్యామిలీ దాని నుంచి పార్ట్-1లో బయటపడుతుంది. ఇక సెకండ్ పార్ట్ ఆమె ఇల్లు మారడంతో మెుదలవుతుంది. యూట్యూబ్ ద్వారా వచ్చిన ఆదాయంతో అనుపమ హోటల్ పెడుతుంది. పనిమనిషి శిల్ప (శరణ్య)ను భాగస్వామిని చేస్తుంది. అనుకోని ఘటనల వల్ల అనుపమ మరో సమస్యలో చిక్కుకుంటుంది. రూ.1,000 కోట్ల విలువైన కోడి పుంజు బొమ్మను దొంగిలించాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటుంది. ఈ క్రమంలో అనుపమకు ఎదురైన సవాళ్లు ఏంటి? అసలు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? జుబేదా (సీరత్ కపూర్) రోల్ ఏంటి? అన్నది కథ.
ఎవరెలా చేశారంటే
అనుపమ పాత్రలో ప్రియమణి (Bhamakalapam 2 Review In Telugu) జీవించేసింది. ఆ పాత్రలో ప్రియమణిని తప్ప మరొకరిని ఊహించుకోలేము. ‘వన్ ఉమెన్ షో’తో కథ మెుత్తాన్ని తన భూజాన పైన వేసుకొని నడిపించింది. ఇక శరణ్య పాత్ర ఆద్యాంతం నవ్వులు పూయించింది. సీరత్ కపూర్ అందం, అభినయంతో ఆకట్టుకుంది. ఆంటోనీ లోబో, తాషీర్, సదానందం పాత్రలు ఆకట్టుకుంటాయి. బ్రహ్మాజీ అతిథి పాత్రలో సందడి చేశారు. మిగిలిన పాత్ర ధారులు తమ పరిధి మేరకు నటించి మెప్పించారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
తొలి భాగంగా గుడ్డు చుట్టూ స్టోరీని అల్లుకున్న దర్శకుడు అభిమన్యు.. రెండో భాగంలో కోడి పుంజు బొమ్మను కథా వస్తువుగా మార్చుకున్నాడు. ఓ వైపు అనుపమ హోటల్‌ను చూపిస్తూనే కొత్త పాత్రలు జుబేదా, ఆంటోనీ లోబోలను పరిచయం చేశాడు దర్శకుడు. కోడి పుంజు బొమ్మ చుట్టూ అల్లుకున్న అంతర్జాతీయ స్మగ్లింగ్ సన్నివేశాలు ఆసక్తికరంగా అనిపిస్తాయి. అయితే అన్ని పాత్రలకు తుపాకులు ఇవ్వడంతో ఎవరు? ఎవరిని? ఎందుకు చంపుతున్నారో అర్థం గాక కాస్త గందరగోళం ఏర్పడుతుంది. ఓవరాల్‌గా అభిమన్యు డైరెక్షన్ స్కిల్స్ మెప్పిస్తాయి. మొదటి భాగంలో గుడ్డుతో విజయం సాధించిన డైరెక్టర్.. ఈసారి కోడిపుంజుతో సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు. ఇక క్లైమాక్స్‌లో ‘భామాకలాపం 3’ కూడా ఉంటుందని అభిమన్యు సంకేతాలు ఇచ్చారు.
టెక్నికల్‌గా
సాంకేతిక అంశాల విషయానికి వస్తే (Bhamakalapam 2 Review In Telugu).. ప్రతీ విభాగం మంచి పనితీరు కనబరిచింది. ప్రశాంత్ ఆర్.విహారి నేపథ్య సంగీతం, దీపక్ సినిమాటోగ్రఫీ, విప్లవ్ నైషధ ఎడిటింగ్ అన్నీ సమపాళ్లలో కుదిరాయి. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
ప్రియమణి నటనట్విస్ట్‌లుటెక్నికల్ టీమ్ పనితీరు
మైనస్ పాయింట్స్
కొన్ని సాగదీత సీన్లుప్రీ క్లైమాక్స్
Telugu.yousay.tv Rating : 3/5
ఫిబ్రవరి 16 , 2024
OG Movie Story: పవన్ ‘ఓజీ’ కథ నెట్టింట వైరల్.. అదే నిజమైతే ఇక గూస్‌బంప్సే!
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా నటిస్తున్న భారీ యాక్షన్ చిత్రం 'ఓజీ' (OG). ప్రభాస్‌తో సాహో తీసిన డైరెక్టర్ సుజిత్.. ఎపిక్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో పవన్ సరసన ప్రియాంక మోహన్ (Priyanka Mohan) హీరోయిన్‍గా నటిస్తోంది. అర్జున్ దాస్, ప్రకాష్ రాజ్, శ్రీయారెడ్డి, హరిశ్ ఉత్తమన్, అభిమన్యు సింగ్ కీరోల్స్ చేస్తున్నారు. థమన్ ఈ మూవీకి సంగీతం అందిస్తుండగా.. డీవీవీ ఎంటర్‌టైన్‍మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య ఈ మూవీని నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా స్టోరీ లీకైనట్లు తెలుస్తోంది. ‘ఓజీ’ (OG Movie Story) కథ ఇదేనంటూ ఓ వార్త నెట్టింట వైరల్ అవుతోంది.
ఓజీ కథ ఇదేనా! (Is this the story of OG)?
ఓజీ సినిమా కోసం పవన్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రీసెంట్‌గా రిలీజ్ డేట్ అప్‌డేట్ కూడా రావడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఈ క్రమంలో సినిమా స్టోరీలైన్ అంటూ ఓ కథ నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ‘ముంబయిలో పదేళ్ల క్రితం గ్యాంగ్‌స్టర్ గ్రూప్స్ అందరికీ బాస్ అయినటువంటి ఓజాస్ గంభీర సడెన్‌గా మాయం అవుతాడు. తన శత్రు మూకలపై రివేంజ్ తీర్చుకోవడానికి మళ్లీ తిరిగి వస్తాడు’ అన్నది కథ సారాంశం. దీంతో ఈ మూలకథ సినీ వర్గాల్లో వైరల్‌గా మారింది. అయితే ఈ ఓజీ ఫస్ట్ గ్లింప్స్‌తోనే డైరెక్టర్ సుజీత్ కథ బ్యాక్‌డ్రాప్‌ను రివీల్ చేశాడు. ‘పవన్ ఒక గ్యాంగ్‌స్టర్‌గా కనిపిస్తాడని అజ్ఞాతంలో ఉన్న అతడు మళ్ళీ వచ్చాడు’ అన్నట్టు చూపించారు.
సుజీత్ ‘డీపీ’ వైరల్
ఓజీ సినిమా దర్శకుడు సుజీత్ ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో డీపీని మార్చారు. ముఖాలు కనిపించని ఇద్దరు వ్యక్తులు ఆ డీపీలో ఉన్నారు. ఆ ఇద్దరిలో ఒకరు 'ఓజీ' (పవన్ కల్యాణ్) కాగా, మరొకరు డైరెక్టర్ సుజీత్. పోస్టు చేసిన కొద్దిసేపటికే ఈ చిత్రం వైరల్‌గా మారింది. ఈ ఫొటోను చూసిన నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ‘తన ఓజీతో సుజీత్’ (Sujeeth) అని కామెంట్స్ చేస్తున్నారు. ‘వైరల్ అవ్వడానికి ఫేసే కనిపించాలా ఏంటి? కటౌట్ ఉంటే చాలు’ అని అంటున్నారు. కంటెంట్ ఉన్నోడికి కటౌట్ సరిపోతుందని ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు.
విలన్‌గా బాలీవుడ్ స్టార్
బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ (Emraan Hashmi) ‘ఓజీ’ సినిమాలో విలన్‌గా నటిస్తున్నాడు. సల్మాన్ ఖాన్ 'టైగర్ 3'లో విలన్‌గా మెప్పించిన ఇమ్రాన్.. ఓజీలోనూ నటిస్తుండటంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. తాజాగా ఓ బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్యూలో ఇమ్రాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓజీలో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉందని.. బాలీవుడ్‌తో పోలిస్తే దక్షిణాది దర్శక నిర్మాతలు చాలా ముందున్నారని వ్యాఖ్యానించారు. చాలా క్రమ శిక్షణతో పనిచేస్తారన్నాడు. అందుకే సౌత్ సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందుతున్నాయని చెప్పాడు.
ఓజీపై శ్రియారెడ్డి హైప్
సలార్ సినిమాలో కీలక పాత్ర పోషించిన నటి శ్రియా రెడ్డి (Shriya Reddy) ఓజీ సినిమాపై ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఇటీవల ఓ ఇంటర్యూలో మాట్లాడిన ఆమె.. సలార్ కంటే ఓజీ ప్రపంచం చాలా పెద్దదని వ్యాఖ్యానించింది. ఓజీలో తానది నెగిటివ్ పాత్ర కాదని.. సినిమాలో తాను పోషిస్తున్న పాత్ర చాలా పెద్దదని చెప్పింది. ఓజీలో తన పాత్ర చూసిన తర్వాత సలార్‌లో తన రోల్ చాలా చిన్నదిగా అనిపిస్తుందని తెలిపింది. ఓజీ మూవీలోని క్యారెక్టర్ లైఫ్ లాంగ్ తనకు గుర్తింపు తీసుకొచ్చి పెడుతుందని చెప్పుకొచ్చింది.
ఫిబ్రవరి 17 , 2024
Rules Ranjann Review: అక్కడక్కడా మెప్పించినా… మొత్తానికే బెడిసి కొట్టింది
తారాగణం:
కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి, మెహర్ చాహల్, వెన్నెల కిషోర్, సుబ్బరాజు, హైపర్ ఆది, వైవా హర్ష, అన్నూ కపూర్, అతుల్ పర్చురే, విజయ్ పాట్కర్, మకరంద్ దేశ్‌పాండే, అభిమన్యు సింగ్
డైరెక్టర్: రతినం కృష్ణ
నిర్మాతలు: దివ్యంగా లావణ్య, మురళి క్రిష్ణ వేమూరి
సంగీతం: అమ్రీష్
సినిమాటోగ్రఫీ: దిలీప్ కుమార్
టాలీవుడ్‌లోని టైర్ 2 హీరోల్లో కిరణ్ అబ్బవరం తనకంటూ ప్రత్యేక గుర్తింపు కలిగి ఉన్నాడు. ఇప్పటి వరకు చేసింది 6 సినిమాలే అయినా యూత్‌లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. నిర్మాతలకు మినిమమ్ గ్యారెంటీ హీరోగా మారాడు. తనతో సినిమా చేస్తే నష్టాలు మాత్రం రావనే భరోసా మాత్రం ఇండస్ట్రీలో కలిగించాడు. ఈ ఏడాది వినరో భాగ్యము విష్ణు కథ, మీటర్ సినిమాలతో అలరించిన కిరణ్ అబ్బవరం తాజాగా రూల్స్ రంజన్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన మీటర్ సినిమా ప్లాప్ కావడంతో.. తనకు అచ్చొచ్చిన కామెడీ జోనర్‌నే కిరణ్ అబ్బవరం ఈసారి ఎంచుకున్నాడు. భారీ తారాగణంతో వచ్చిన రూల్స్ రంజన్ సినిమా ఎలా ఉంది? కిరణ్ మరో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టాడా? ప్రేక్షకులు ఏమనుకుంటున్నారో ఈ రివ్యూలో చూద్దాం.
కథ
మనో రంజన్(కిరణ్ అబ్బవరం) సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. తన జీవితాన్ని కఠినమైన రూల్స్ పెట్టుకుని కొనసాగిస్తుంటాడు. ఈక్రమంలో అతని ఉద్యోగం ముంబైకి ట్రాన్సఫర్ అవుతుంది. అక్కడ మనో రంజన్ పాత స్నేహితురాలు సనా( నేహా శెట్టి) కలుస్తుంది. మెల్లగా ఆమెకు దగ్గరై ప్రేమలో పడిపోతాడు. సనా కోసం తన రూల్స్ అన్ని బ్రేక్ చేసుకుంటాడు. సనాను గాఢంగా ప్రేమిస్తాడు. కానీ సనాకి పెళ్లి ఫిక్స్ అయ్యింది అని తెలియడంతో కథ అడ్డం తిరుగుతుంది. చివరికి మనో రంజన్ ఎం చేసాడు? తన ప్రేమను దక్కించుకున్నాడా? లేదా? అనే విషయాలు తెలుసుకునేందుకు సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే?
ఈ సినిమా పెద్దగా కథ లేకున్నా కామెడీ ట్రాక్ ముందుకు సాగింది. ఫస్టాఫ్ స్లోగా నడుస్తుంది. ప్రేక్షకులకు బోర్ కొడుతుందనే టైంలో వెన్నెల కిషోర్ బరిలోకి దిగి తన కామెడీ టైమింగ్‌తో కాసేపు నవ్విస్తాడు. హీరోయిన్‌తో లవ్ ట్రాక్‌తో ముందుకెళ్తుంది. సెకండాఫ్‌కు వచ్చేసరికి తేలిపోయింది. ఫస్టాప్ మాదిరి కామెడీ ట్రాక్ ఉంటే బాగుండేది. అనవసరమైన ఎలివేషన్స్ జొప్పించారనిపిస్తుంది. కొన్ని సీన్లు ప్రేక్షకులకు విసుగు తెప్పిస్తాయి. ఇక సెకండాఫ్‌లో హైపర్ ఆది, వైవా హర్ష, వెన్నెల కిషోర్ కామెడీ కాస్త ఊరటనిస్తుంది.
ఎవరెలా చేశారంటే?
గత సినిమాల కంటే భిన్నంగా కిరణ్ అబ్బవరం నటన బాగుంది. ప్రతి సినిమాలో ఒకేలాగా నటిస్తాడు అనే అపవాదును ఈ సినిమా ద్వారా కిరణ్ చెరిపేసుకున్నాడు. సినిమాలో కంప్లీట్‌గా తన లుక్‌ను మార్చేసుకున్నాడు. మనో రంజన్ పాత్రకు న్యాయం చేశాడు. ఇక నేహా శెట్టి తన పాత్రలో ఒదిగిపోయింది. తన గ్లామర్ సినిమాకు ప్లస్ అయిందని చెప్పవచ్చు. సమ్మోహనుడా సాంగ్‌లో నేహా పరువాల విందుతో కనువిందు చేసింది. హైపర్ ఆది, వెన్నెల కిషోర్ కామెడీ సినిమాకు మంచి అసెట్ అని చెప్పవచ్చు. ఆది కామెడీ పంచ్‌లు కడుపుబ్బ నవ్విస్తాయి. వైవా హర్ష తన పాత్ర పరిధిమేరకు నటించి మెప్పించాడు. మకరంద్ దేశ్ పాండే, సుబ్బరాజు తమ పాత్రలకు న్యాయం చేశారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే?
యంగ్ డైరెక్టర్ రతినం కృష్ణ సాధారణ కథతో మెప్పించలేక పోయాడు. స్టోరీ పట్ల నెరెషన్‌లో ఇంకాస్త శ్రద్ధ తీసుకుంటే బాగుండేది అనిపించింది. భారీ తారాగణం ఉన్న సరైన రీతిలో వారిని ఉపయోగించుకోలేదనే భావన కనిపిస్తుంది. ఫస్టాఫ్‌లో ఉన్న కామెడీ ట్రాక్‌నే.. సెకంఢాఫ్‌లో కొనసాగిస్తే బాగుండేది అనిపించింది. అనవసరమైన ఎలివేషన్స్‌కు వెళ్లారనిపిస్తుంది. మొత్తానికి కొద్దిసేపైన ప్రేక్షకులను ఎంగేజ్ చేయడంలో మాత్రం సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు.
టెక్నికల్‌గా..
రూల్స్ రంజన్ మూవీ నిర్మాణ విలువల పరంగా బాగుంది. అమ్రీష్ మ్యూజిక్ బాగుంది. దులీప్ కుమార్ సినిమాటోగ్రఫీ ఇంకాస్త పరిణతి చెందాల్సి ఉంది.
బలాలు
ఫస్టాప్ కామెడీ ట్రాక్
నెహా శెట్టి గ్లామర్
బలహీనతలు
అనవసరమైన ఎలివేషన్స్
సెకండాఫ్
స్టోరీ
చివరగా.. రూల్స్ రంజన్ అక్కడ అక్కడ నవ్వించే .. కామెడీ ఎంటర్టైనర్
రేటింగ్: 2.5/5
అక్టోబర్ 06 , 2023
OG Release Update: ‘ఓజీ’ రిలీజ్‌పై క్రేజీ రూమర్స్.. ‘హరిహర వీరమల్లు’ కంటే ముందే!
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఏపీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడంతో సినిమాలపై ఫోకస్ పూర్తిగా తగ్గిపోయింది. దీంతో ఆయన చేతిలోని ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veeramallu), ‘ఓజీ’ (OG), ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustad Bhagat Singh) చిత్రాలు గత కొంతకాలంగా పెండింగ్‌లో పడిపోయాయి. అయితే రీసెంట్‌గా ఆ ప్రాజెక్టుల్లో కదలిక వచ్చింది. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మినహా మిగిలిన రెండు ప్రాజెక్ట్స్ తిరిగి షూటింగ్ జరుపుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ‘హరిహర వీరమల్లు’ రిలీజ్ డేట్‌ను సైతం మేకర్స్ అనౌన్స్ చేశారు. దీంతో పవన్ మూడు ప్రాజెక్ట్స్‌లో ముందుగా హరిహర వీరమల్లునే ప్రేక్షకుల ముందుకు వస్తుందని అంతా భావిస్తున్నారు. అయితే ఇప్పుడా పరిస్థితి తారుమారైనట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది.
ముందే ‘ఓజీ’ రిలీజ్?
పవన్ కల్యాణ్ చేతిలో ఉన్న 'ఓజీ' ప్రాజెక్ట్‌కు యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. లేటెస్ట్ బజ్ ప్రకారం ‘హరిహర వీరమల్లు’ కంటే ముందే ‘ఓజీ’ (OG Release Update) రిలీజ్ అవుతుందని సమాచారం. యంగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ సుజీత్ మూవీని త్వరగా రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నాడని అంటున్నారు. ‘హరిహర వీరమల్లు’ కంటే ఎక్కువ బజ్ ‘ఓజీ’ పైనే ఉన్న నేపథ్యంలో ముందుగా ఈ సినిమానే రిలీజ్ చేయాలన్న ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్లు తెలుస్తోంది. పవన్‌కు సంబంధించిన షూటింగ్ పార్ట్‌ను త్వరగా ఫినిష్ చేసి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌ను స్టార్ట్ చేయాలని భావిస్తున్నారట. ఈ విషయంపై పవన్‌తో చర్చించి త్వరలోనే రిలీజ్ డేట్‌ను కూడా అనౌన్స్ చేయాలని సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో పవన్ ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు.
హరిహర వెనక్కి తగ్గాల్సిందే!
పవన్ హీరోగా రూపొందుతున్న ‘హరిహర వీరమల్లు’ చిత్రం పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రానుంది. అయితే పవన్ మూడు ప్రాజెక్టుల్లో ముందుగా మెుదలైన చిత్రం ఇదే. 2020లోనే దర్శకుడు క్రిష్ ఈ సినిమాను పట్టాలెక్కించారు. అనేక బ్రేక్స్ వచ్చినప్పటికీ క్రిష్ 60 శాతం షూటింగ్ ఫినిష్ చేశాడు. అయితే ఏపీ ఎన్నికల సమయంలో పవన్ రాజకీయాల్లో పూర్తిస్థాయిలో బిజీ కావడంతో ఈ ప్రాజెక్ట్ నుంచి క్రిష్ తప్పుకున్నారు. మిగిలిన షూటింగ్‌ను ఫినిష్ చేసేందుకు నిర్మాత రత్నం కుమారుడు డైరెక్టర్ జ్యోతి కృష్ణ హరిహర వీరమల్లు బాధ్యతను భుజానికి ఎత్తుకున్నాడు. ఎన్నికల అనంతరం షూటింగ్‌కు పవన్ కూడా సై అనడంతో మార్చి 28, 2025న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు అనౌన్స్ కూడా చేసేశారు. ఇప్పుడు సడెన్‌గా ‘ఓజీ’ రిలీజ్ తెరపైకి రావడంతో ‘హరిహర వీరమల్లు’కు కొత్త సమస్య వచ్చి పడింది. ఆడియన్స్‌లో ఫుల్ క్రేజ్ ఉన్న దృష్ట్యా పవన్ కూడా ‘ఓజీ’ రిలీజ్‌కే మద్దతు తెలిపితే ‘హరిహర వీరమల్లు’ టీమ్ వెనక్కితగ్గక తప్పదని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
ఓజీపై ఎందుకంత హైప్?
పవన్ కల్యాణ్ చేతిలోని మూడు ప్రాజెక్ట్స్‌లో ‘ఓజీ’ (OG Release Update) చాలా స్పెషల్ అని చెప్పవచ్చు. కెరీర్‌లోనే తొలిసారి గ్యాంగ్‌స్టర్ పాత్రలో పవన్ కల్యాణ్ నటిస్తున్నాడు. ‘ఓజీ’ గ్లింప్స్‌లో పవన్ యాక్టింగ్ చూసిన ఫ్యాన్స్ ఈ సినిమా మరో లెవల్లో ఉంటుందని ముందుగానే ఓ అభిప్రాయానికి వచ్చేశారు. ఇదిలాఉంటే ఈ సినిమాలో పవన్‌కు జోడిగా ప్రియాంక మోహన్ (Priyanka Mohan) నటిస్తోంది. బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ (Emraan Hashmi) విలన్‌గా నటిస్తుండగా అర్జున్ దాస్ (Arjun Das), శ్రీయ రెడ్డి (Sriya Reddy), ప్రకాష్ రాజ్ (Prakash Raj), హరీష్ ఉత్థమన్ (Harish Uthaman), అభిమన్యు సింగ్ (Abhimanyu Singh) కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీని తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అంతే కాకుండా ఈ సినిమాకి జపనీస్‌తో లింక్ ఉంటుందని డైరెక్టర్ సుజిత్ గతంలో చెప్పడంతో అభిమానుల్లో అంచనాలు తార స్థాయికి చేరాయి.
https://twitter.com/TorchbearerEdit/status/1744312598743351385
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సంగతేంటి?
గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బాస్టర్ తర్వాత పవన్ కల్యాణ్ - హరీశ్ కాంబోలో రాబోతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'. ఏపీ ఎన్నికల ముందు వరకు వరుస అప్‌డేట్స్‌తో భారీగా అంచనాలు పెంచేసిన దర్శకుడు హరీష్ శంకర్ గత కొంత కొలంగా సైలెంట్ అయిపోయారు. అయితే తాజాగా హరిహర వీరమల్లు, ఓజీ ప్రాజెక్ట్స్ తిరిగి సెట్స్‌పైకి వెళ్లడంతో ఉస్తాద్‌ను కూడా పట్టాలెక్కించాలని పవన్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇందులో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తనకు బాగా కలిసొచ్చిన పోలీసు పాత్ర చేస్తుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి రెండు గ్లింప్స్ బయటకు రాగా వాటికి ఫ్యాన్స్ నుంచి విశేష స్పందన వచ్చింది. త్వరలోనే ఈ మూవీకి సంబంధించి కూడా అప్‌డేట్ ఉంటుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
నవంబర్ 11 , 2024
OG Movie: ఒక్క ట్వీట్‌తో మెగా అభిమానుల్లో జోష్ పెంచిన థమన్.. ‘ఓజీ ఇండస్ట్రీ హిట్ పక్కా’!
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఏపీ రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. అదే సమయంలో ఆగిపోయిన తన సినిమాలను ఇటీవలే మెుదలు పెట్టారు. ప్రస్తుతం 'హరిహర వీరమల్లు' షూటింగ్ లో పాల్గొంటున్న పవన్ కల్యాణ్ త్వరలోనే 'ఓజి' (OG) మూవీ షూటింగ్‌ను కూడా స్టార్ట్ చేయబోతున్నారు. అయితే పవన్ ప్రాజెక్ట్స్‌లో అన్నిటికంటే 'ఓజీ'పైనే ఫ్యాన్స్‌లో భారీగా అంచనాలు ఉన్నాయి. ఆ మూవీ అప్‌డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మ్యూజిక్ డైరెక్టర్ థమన్ తాజాగా అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చాడు. దీంతో మెగా ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.
థమన్ ఏమన్నారంటే?
పవన్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో 'ఓజీ' చిత్రం రూపొందుతోంది. గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాగా ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది. పవన్ పాత్ర పేరు ఓజాస్ గంభీర కావడంతో ఈ మూవీకి ‘ఓజీ’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. కాగా తాజాగా ఈ సినిమా గురించి మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఎక్స్ వేదికగా స్పందించారు. ఆయన తన ట్వీట్‌లో 'ఓజి అప్డేట్స్ గురించి అందరూ అడుగుతున్నారు. త్వరలోనే అప్డేట్స్ వస్తాయి. దానికి సంబంధించిన పనులు జరుగుతున్నాయి. అయితే మా నుంచి ఇండస్ట్రీ హిట్ వస్తుందని నేను కచ్చితంగా చెప్పగలను. డైరెక్టర్ సుజిత్ అదరగొట్టేశాడు, కెమెరామెన్ రవిచంద్రన్ కూడా సూపర్ విజువల్స్ ఇచ్చాడు. నేను కూడా ఓజీకి బెస్ట్ ఇవ్వాలి. ఇది డివివి బ్యానర్ నుంచి వస్తున్న బిగ్గెస్ట్ సినిమా. నా ట్వీట్‌ని మీరంతా పిన్ చేసి పెట్టుకోండి. అప్‌డేట్స్‌తో మనం త్వరలోనే కలుద్దాం' అంటూ మెగా ఫ్యాన్స్‌లో థమన్ మరింత జోష్ పెంచారు. థమన్ చేసిన ఈ ట్వీట్ నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది.
https://twitter.com/MusicThaman/status/1842245316252209456
పాన్ ఇండియా స్థాయిలో
పవన్ కల్యాణ్ ఓజీ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఈ సినిమాలో పవన్‌కు జోడిగా ప్రియాంక మోహన్ (Priyanka Mohan) నటిస్తోంది. బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ (Emraan Hashmi) విలన్‌గా నటిస్తుండగా అర్జున్ దాస్ (Arjun Das), శ్రీయ రెడ్డి (Sriya Reddy), ప్రకాష్ రాజ్ (Prakash Raj), హరీష్ ఉత్థమన్ (Harish Uthaman), అభిమన్యు సింగ్ (Abhimanyu Singh) కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీని తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అంతే కాకుండా ఈ సినిమాకి జపనీస్‌తో లింక్ ఉంటుందని డైరెక్టర్ సుజిత్ గతంలో చెప్పడంతో అభిమానుల్లో అంచనాలు తార స్థాయికి చేరాయి. గతంలో వచ్చిన గ్లింప్స్ సైతం ఓజీ హైప్ క్రియేట్ చేసింది.
https://twitter.com/tollymasti/status/1822184749072294337
అప్‌డేట్స్‌కు కేరాఫ్‌గా థమన్!
సంగీత దర్శకుడు థమన్ తను పనిచేస్తున్న చిత్రాలకు సంబంధించి వరుసగా అప్‌డేట్స్ ఇస్తూ ఫ్యాన్స్‌ను తెగ ఖుషీ చేస్తున్నారు. ముఖ్యంగా మెగా అభిమానులకు తన వరుస అప్‌డేట్స్‌తో గ్రాండ్ ట్రీట్ ఇస్తున్నారు. మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్న 'గేమ్ ఛేంజర్' (Game Changer) చిత్రానికి కూడా థమన్ మ్యూజిక్ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. ఆ మూవీకి సంబంధించి వరుసగా అప్‌డేట్స్ ఇస్తూ దాదాపు మూవీ రిలీజ్ డేట్‌ను సైతం కన్ఫార్మ్ చేశారు. ఇప్పుడు 'ఓజీ' అప్‌డేట్స్ కూడా ఇచ్చి మెగా ఫ్యాన్స్ మరింత ఇష్టుడిగా మారిపోయారు.
సమ్మర్‌లో గ్రాండ్ రిలీజ్
ప్రస్తుతం పవన్ చేతిలో ఓజీతో పాటు ‘హరిహర వీరమల్లు’, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustad Bhagat Singh) ప్రాజెక్టులు ఉన్నాయి. వీటిలో హరిహర వీరమల్లు (Hari Hara Veera Mallu) పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. క్రిష్, జ్యోతికృష్ణ దర్శకత్వంలో ఇది సిద్ధమవుతోంది. రెండు భాగాలుగా ఈ చిత్రం రానుంది. తొలి భాగానికి సంబంధించి చిత్రీకరణ ముగింపుదశకు చేరుకున్న విషయం తెలిసిందే. పవన్ కల్యాణ్ ఇటీవలే ఈ మూవీకి సంబంధించిన షూటింగ్‌లోనూ జాయిన్ అయ్యారు. ఈ క్రమంలోనే ‘హరిహర వీరమల్లు’ (Harihara Veeramallu Release Date) రిలీజ్ డేట్‌ను చిత్రబృందం ప్రకటించింది. వచ్చే ఏడాది మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా దీనిని విడుదల చేయనున్నట్లు తెలిపింది.
అక్టోబర్ 05 , 2024
Memorable Villains in Telugu Cinema: టాలీవుడ్‌లో ఎప్పటికీ గుర్తుండిపోయే విలన్ పాత్రలు ఇవే!
సాధారణంగా ప్రతీ సినిమాలో హీరోతో సమానంగా విలన్ పాత్రకు ప్రాధాన్యత ఉంటుంది. విలన్ రోల్ ఎంత బలంగా ఉంటే కథాయనాయకుడి పాత్ర అంత బాగా ఎలివేట్ అవుతుంది. కాబట్టి టాలీవుడ్ దర్శకులు హీరోతో పాటు విలన్ క్యారెక్టర్ డిజైన్‌పైనా ప్రత్యేకంగా శ్రద్ధా వహిస్తుంటారు. విలన్ రోల్ క్లిక్ అయ్యిందంటే ఆటోమేటిక్‌గా హీరోకి ఎలివేషన్ లభించి సినిమా హిట్ అవుతుందని వారి నమ్మకం. అయితే ఇప్పటివరకూ టాలీవుడ్‌లో కొన్ని వందల చిత్రాలు వచ్చినప్పటికీ కొన్ని విలన్ పాత్రలే ప్రేక్షకుల మదిలో బలమైన ముద్ర వేశాయి. అటువంటి పాత్రలను You Say ఈ ప్రత్యేక కథనం ద్వారా మీ ముందుకు తీసుకొచ్చింది. అవేంటో ఇప్పుడు చూద్దాం.
భిక్షు యాదవ్ (Sye)
రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘సై’ చిత్రంలో హీరో నితిన్ పాత్ర కంటే.. విలన్ బిక్షు యాదవ్ పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. ప్రతినాయకుడి పాత్రలో ప్రదీప్ రావత్ (Pradeep Rawat) తన లుక్‌తోనే భయపెట్టేలా ఉంటాడు. ముక్కుకు రింగ్ తగిలించుకొని నిజమైన విలన్‌గా కనిపిస్తాడు. ఈ పాత్ర ప్రదీప్ రావత్ కెరీర్‌ను మలుపుతిప్పింది.
https://youtu.be/2JyoOhxNpGk?si=K9os2WSarS60Wz5b
అలీభాయ్ (Pokiri)
పోకిరిలో మహేష్ బాబు (Mahesh Babu) తర్వాత అందరికీ గుర్తుండిపోయే రోల్ ప్రకాష్ రాజ్ (Prakash Raj) చేసిన అలీభాయ్ పాత్ర. మాఫియా డాన్‌గా పవర్‌ఫుల్‌గా కనిపిస్తూనే ప్రకాష్ రాజ్ తనదైన డైలాగ్స్‌తో నవ్వులు పూయించాడు. ఈ పాత్ర తన కెరీర్‌లో ఎప్పటికీ గుర్తుండిపోతుందని ప్రకాష్ రాజ్ ఓ సందర్భంలో చెప్పడం విశేషం.
https://youtu.be/4xhZMkerEtE?si=rz8Z19xEeNxXIefV
భల్లాలదేవ (Baahubali)
రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వంలో వచ్చిన ‘బాహుబలి’ చిత్రంలో రానా (Rana Daggubati) చేసిన ‘భల్లాల దేవ’ పాత్ర ప్రతీ ఒక్కరినీ అలరించింది. కుట్రలు, కుతంత్రాలు పన్నే రాజు పాత్రలో అతడు కనిపించాడు. కండలు తిరిగిన దేహంతో బాహుబలి (ప్రభాస్)ని ఎదిరించి నిలుస్తాడు. భల్లాల దేవ తరహా పాత్ర ఇప్పటివరకూ తెలుగులో రాలేదని చెప్పవచ్చు.
https://youtu.be/2dFeczHMf58?si=8UKU0_h7Q0qrIGPv
పశుపతి (Arundhati)
తెలుగులో అతి భయంకరమైన విలన్ పాత్ర ఏది అంటే ముందుగా ‘అరుంధతి’ చిత్రంలోని పశుపతినే గుర్తుకు వస్తాడు. ఈ పాత్రలో సోనుసూద్ (Sonu Sood) పగ తీరని పిశాచిలా నటించాడు. అరుంధతి (అనుష్క)ని దక్కించుకునేందుకు ప్రయత్నిస్తుంటాడు. పశుపతి పాత్ర చాలా భయంకరంగా ఉంటుంది.
https://youtu.be/aJV6JIswFYw?si=JZdCFz_l2XYuNRj3
కాట్‌రాజ్ (Chatrapathi)
ఛత్రపతి సినిమాలో కాట్‌రాజ్ పాత్ర కూడా చూడటానికి చాలా క్రూయిల్‌గా ఉంటుంది. శ్రీలంక నుంచి వలస వచ్చిన వారిపై జులుం ప్రదర్శించే పాత్రలో సుప్రీత్ రెడ్డి (Supreeth Reddy) జీవించేశాడు. ఈ సినిమా తర్వాత అతడికి ఇండస్ట్రీలో వరుస అవకాశాలు చుట్టుముట్టాయి.
https://youtu.be/QLc8I_WIFnE?si=4TYG9WD6BUUG9ZS9
పండా (Gharshana)
ఘర్షణ సినిమాలో డీసీపీ రామచంద్ర పాత్రలో హీరో వెంకటేష్ (Venkatesh) చాలా పవర్‌ఫుల్‌గా కనిపిస్తాడు. అతడ్ని ఢీకొట్టే ప్రతినాయకుడి రోల్ పండా కూడా అదే విధంగా ఉంటుంది. గ్యాంగ్‌స్టర్ అయిన పండా పాత్రలో నటుడు సలీం బైజ్ (Salim Baig) అద్భుతంగా నటించాడు.
https://youtu.be/C15GczxdDWk?si=bCbFuf4jMA-Ku9Ml
మద్దాలి శివారెడ్డి (Race Gurram)
రేసుగుర్రం చిత్రంలోని మద్దాలి శివారెడ్డి కూడా తెలుగులో ఎప్పటికీ గుర్తుండిపోయే విలన్. అల్లు అర్జున్ చేతిలో దెబ్బలు తిని.. మంత్రి అయిన తర్వాత హీరోపై రీవేంజ్ తీర్చుకునే తీరు బాగుంటుంది. నటుడు రవి కిషన్ (Ravi Kishan) ఈ పాత్రలో ఎంతో విలక్షణంగా నటించాడు.
https://youtu.be/1eI5MaEPH24?si=akVQ_0ky0sQvA__H
వైరం ధనుష్ (Sarrainodu)
బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన ‘సరైనోడు’ చిత్రంలో హీరో ఆది పినిశెట్టి (Aadhi Pinisetty) తొలిసారి విలన్‌గా నటించాడు. సీఎం కొడుకు అయిన వైరం ధనుష్ పాత్రలో చాలా క్రూయల్‌గా చేశాడు.
https://youtu.be/8-Dv9v3jlO4?si=O7-sqHVCz7MS0Usw
భవాని (Siva)
శివ సినిమా అప్పట్లో ఒక ట్రెండ్ సెట్టర్ అని చెప్పవచ్చు. భవాని అనే విలన్ పాత్ర కూడా అప్పటి ప్రతినాయకుడి రోల్స్‌కు చాలా భిన్నంగా ఉంటుంది. విలన్ అంటే కోరమీసాలు, గంభీరమైన గొంతు, పెద్ద పెద్ద డైలాగ్స్ అవసరం లేదని దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ (Ram Gopal Varma) ఈ సినిమాతో నిరూపించాడు. భవాని పాత్రతో నటుడు రఘువరన్ (Raghuvaran) స్టార్ విలన్‌గా మారిపోయాడు.
https://youtu.be/lOk1YI8xwk0?si=M7pHYNOlym7EGemT
బుక్కా రెడ్డి (Rakta Charitra)
రక్త చరిత్ర సినిమాలో బుక్కా రెడ్డి పాత్ర అతి భయానకంగా ఉంటుంది. కనిపించిన ఆడవారిపై అత్యాచారం చేస్తూ, అడ్డొచ్చిన వారిని చంపుకుంటూ పోయే ఈ పాత్రలో నటుడు అభిమన్యు సింగ్ (Abhimanyu Singh) జీవించేశాడు. సినిమాలో ఆ పాత్ర ఎంట్రీ అప్పుడల్లా ప్రేక్షకులు ఓ విధమైన టెన్షన్‌కు లోనవుతారు.
https://youtu.be/xjVj28sLQGs?si=tFP6zVO5moZcczA0
అమ్రీష్ పూరి (Jagadeka Veerudu Athiloka Sundari)
చిరంజీవి నటించిన ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ చిత్రంలో నటుడు అమ్రీష్ పూరి (Amrish Puri) ప్రతినాయకుడిగా కనిపించారు. మహాద్రాష్ట అనే మాంత్రికుడి రోల్‌లో ఆయన తెలుగు ప్రేక్షకులను అలరించారు. దేవ కన్య అయిన హీరోయిన్‌ను వశం చేసుకునే పాత్రలో అమ్రీష్ నటన మెప్పిస్తుంది.
https://youtu.be/l_XA9PuOwh0?si=3IUQQJNW3gFYuytc
రణదేవ్ బిల్లా (Magadheera)
రాజమౌళి దర్శకత్వం వహించిన ‘మగధీర’ చిత్రంలో హీరోకు సమానంగా విలన్ రణదేవ్ బిల్లాకు స్క్రీన్ షేరింగ్ ఉంటుంది. దేవ్ గిల్ (Dev Gill) ఈ పాత్ర ద్వారా తొలిసారి టాలీవుడ్‌కు పరిచయం అయ్యాడు. కండలు తిరిగిన దేహం, నటనతో వీక్షకులను కట్టిపడేశాడు.
https://youtu.be/XoYCASOhKPw?si=F1JUwUIIo4FANYpN
మంగళం శ్రీను (Pushpa)
అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) డైరెక్షన్‌లో వచ్చిన ‘పుష్ప’ (Pushpa) చిత్రంలో.. నటుడు సునీల్ (Sunil) మంగళం శ్రీను పాత్రలో నటించాడు. హాస్యనటుడిగా, హీరోగా గుర్తింపు పొందిన సునీల్‌ను విలన్‌గా చూసి తెలుగు ఆడియన్స్ ఆశ్చర్యపోయారు. ముఖ్యంగా అతడి లుక్, నటన ఎంతగానో ఆకట్టుకుంది.
https://youtu.be/qF_aQEXieGo?si=WBlNlBjRszc3KrzH
మార్చి 20 , 2024