• TFIDB EN
  • అబ్రహం ఓజ్లర్
    UATelugu
    ఓ సీరియల్‌ సర్జికల్‌ బ్లేడ్‌తో వరుస హత్యలకు పాల్పడుతుంటాడు. ముగ్గుర్ని ఒకే విధమైన పద్ధతిలో చంపుతాడు. దీంతో ఏసీపీ అబ్రహం ఓజ్లర్ రంగంలోకి దిగుతాడు. నాలుగో హత్య జరగకుండా ఏసీపీ ఆపగలిగాడా? చనిపోయిన ముగ్గురికి మధ్య ఉన్న సంబంధం ఏంటి? అలెగ్జాండర్‌ (మమ్ముట్టి) పాత్ర ఏంటి? అన్నది స్టోరీ.
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌Hotstarఫ్రమ్‌
    Watch
    రివ్యూస్
    How was the movie?

    తారాగణం
    జయరామ్
    ACP అబ్రహం ఓజ్లర్ IPS
    మమ్ముట్టి
    డాక్టర్ అలెగ్జాండర్ జోసెఫ్
    అనశ్వర రాజన్
    డాక్టర్ సుజా జయదేవ్
    అర్జున్ అశోక్
    వినీత్
    అనూప్ మీనన్డాక్టర్ సతీష్ మాధవన్
    సైజు కురుప్
    కృష్ణదాస్ పి ఎస్
    ఆర్య సలీంఎస్‌ఐ దివ్య శ్రీధరన్
    జగదీష్
    డా. జేవీ పున్నూస్
    కుమరకొం రఘునాథ్డాక్టర్ శివకుమార్
    రవి వెంకట్రామన్సెల్వరాజ్
    దిలీష్ పోతన్
    సుధాకరన్ పయ్యారత్
    సాయి కుమార్
    కౌన్సిలర్
    అసిమ్ జమాల్
    డీఐజీ ప్రదీప్ రాజన్ IPS
    అర్జున్ నందకుమార్
    డా. అరుణ్ జయదేవ్
    హరికృష్ణన్ ఎస్.
    నవీన్ శివకుమార్
    అంజు కురియన్
    అనీషా
    పార్వతి టి.
    డాక్టర్ అన్నపూర్ణేశ్వరి
    సిబ్బంది
    మిధున్ మాన్యువల్ థామస్
    దర్శకుడు
    ఇర్షాద్ ఎం. హసన్నిర్మాత
    మిధున్ మాన్యువల్ థామస్
    నిర్మాత
    మిధున్ ముకుందన్
    సంగీతకారుడు
    తేని ఈశ్వర్
    సినిమాటోగ్రాఫర్
    షమీర్ మహమ్మద్
    ఎడిటర్ర్
    కథనాలు
    This Week Movies: తెలుగులో ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘ఓపెన్‌ హైమర్‌’.. ఈ వారం రిలీజయ్యే చిత్రాలు ఇవే!
    This Week Movies: తెలుగులో ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘ఓపెన్‌ హైమర్‌’.. ఈ వారం రిలీజయ్యే చిత్రాలు ఇవే!
    గత వారం లాగే ఈ వీక్ కూడా పలు చిన్న చిత్రాలు థియేటర్లలో సందడి చేయడానికి రాబోతున్నాయి. ఆహ్లాదకరమైన వినోదాన్ని అందించేందుకు సిద్ధమవుతున్నాయి. మార్చి 18 నుంచి 24 తేదీల మధ్య ఇవి థియేటర్లలో సందడి చేయనున్నాయి. అలాగే ఓటీటీలో కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్‌ కాబోతున్నాయి. మరి ఆ సినిమాలు ఏంటి? వాటి విశేషాలు ఎలా ఉన్నాయి? ఈ కథనంలో చూద్దాం. థియేటర్‌లో విడుదలయ్యే చిత్రాలు ఓం భీమ్‌ బుష్‌.. శ్రీవిష్ణు, రాహుల్‌ రామకృష్ణ, ప్రియదర్శి కీలక పాత్రల్లో శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఓం భీమ్‌ బుష్‌..’ (Om Bheem Bush). నో లాజిక్‌ ఓన్లీ మేజిక్‌ అనేది ఉప శీర్షిక. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ మార్చి 22న ప్రేక్షకుల ముందుకు రానుంది.  అనన్య జయరామన్, చందన, తోషి అలహరి, ప్రజ్ఞ గౌతమ్, అరవింద్, సుమన్ కీలక పాత్రల్లో ప్రసాద్ రాజు బొమ్మిడి రూపొందించిన చిత్రం ‘అనన్య’ (Ananya Movie). జంధ్యాల ఉమా నాగ శివ గంగాధర శర్మ నిర్మించారు. హర్రర్ నేపథ్యంలో కుటుంబ ప్రేమ కథాచిత్రంగా ఈ సినిమా రూపొందింది. మార్చి 22న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. హద్దులేదురా ఆశిష్‌ గాంధీ, అశోక్‌ కథానాయకులుగా తెరకెక్కుతున్న చిత్రం ‘హద్దులేదురా’ (haddu ledura movie). వర్ష, హ్రితిక కథానాయికలు. రాజశేఖర్‌ రావి దర్శకత్వం వహించారు. వీరేష్‌ గాజుల బళ్లారి నిర్మించారు. ‘భగవద్గీతలోని కృష్ణార్జునుల స్ఫూర్తితో ఈ చిత్రం తెరకెక్కించినట్లు మూవీ యూనిట్‌ తెలిపింది. మార్చి 21న ఈ సినిమా థియేటర్‌లలో విడుదల కానుంది. ఓటీటీలో రిలీజయ్యే చిత్రాలు/సిరీస్‌లు ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాల విషయానికొస్తే.. ఈసారి ఏడు ఆస్కార్స్ గెలుచుకున్న 'ఓపెన్ హైమర్'.. ఈ వారమే తెలుగులో స్ట్రీమింగ్ కానుంది. అలానే 'అబ్రహం ఓజ్లర్' అనే హిట్ మూవీ కూడా రానుంది. వీటితోపాటు 'ఏ వతన్ మేరే వతన్', 'ఫైటర్' లాంటి హిందీ చిత్రాలు కూడా డిజిటల్ రిలీజ్‌కి సిద్ధమైపోయాయి. మెుత్తంగా ఈ వారం 20 వరకూ చిత్రాలు ఓటీటీలోకి రాబోతున్నాయి. వాటిలో ప్రధానమైనవి ఏంటో ఇప్పుడు చూద్దాం.  ఓపెన్ హైమర్ ప్రతిష్టాత్మక ఆస్కార్‌ అవార్డుల్లో ఈసారి 'ఓపెన్ హైమర్' సినిమా మెరిసింది. ఉత్తమ నటుడు, దర్శకుడు, చిత్రం, సహాయ నటుడు, ఒరిజినల్ స్కోర్, ఫిల్మ్ ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ.. ఇలా ప్రధాన విభాగాల్లో పురస్కారాలు కైవసం చేసుకుంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు ఈ మూవీ గురించి మరోసారి చర్చించుకుంటున్నారు. అయితే ఈ చిత్రం ఈ వారం తెలుగు డబ్బింగ్‌తో ఓటీటీలోకి రానుంది. ప్రముఖ ఓటీటీ వేదిక ‘జియో సినిమా’లో మార్చి 21 నుంచి ప్రసారం కానుంది.  సుందరం మాస్టార్ టాలీవుడ్ కమెడియన్ వైవా హర్ష హీరోగా ఎంట్రీ ఇచ్చిన తాజా చిత్రం ‘సుందరం మాస్టర్’ (Sundaram Master OTT). ఈ మూవీని దర్శకుడు క‌ళ్యాణ్ సంతోష్ తెరకెక్కించగా.. ఇందులో హీరోయిన్‌గా దివ్య శ్రీపాద నటించింది. గత నెల థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం.. హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. మార్చి 22 నుంచి ఈ సినిమా ఈటీవీ విన్‌లో ప్రసారం కానుంది.  ‘భూతద్దం భాస్కర్‌ నారాయణ’ శివ కందుకూరి, రాశీ సింగ్‌ జంటగా తెరకెక్కిన చిత్రం ‘భూతద్దం భాస్కర్‌ నారాయణ’ (bhoothaddam bhaskar narayana ott). పురుషోత్తం రాజ్‌ దర్శకత్వం వహించారు. మార్చి 1న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులకు థ్రిల్‌ని పంచింది. ఇప్పుడు ఓటీటీలోనూ అదే థ్రిల్‌ను పంచడానికి వచ్చేస్తోంది. మార్చి 22 నుంచి ఆహా వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది. ఈ చిత్రంలో అరుణ్‌ కుమార్‌, దేవి ప్రసాద్‌, వర్షిణి సౌందరరాజన్‌ కీలకపాత్రలు పోషించారు. అబ్రహాం ఓజ్లర్‌ జయరాం (Jayaram), అనూప్‌ మేనన్‌, అనస్వర రాజన్‌ కీలకపాత్రల్లో నటించిన సైకలాజికల్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘అబ్రహాం ఓజ్లర్‌’ (Abraham Ozler OTT). మిధున్‌ మేనుయేల్‌ థామస్‌ దర్శకత్వం వహించారు. మమ్ముట్టి అతిథిగా నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రలో నటించి మెప్పించారు. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని నమోదు చేసింది. ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులకు అలరించడానికి సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ వేదిక డిస్నీ+హాట్‌స్టార్‌లో మార్చి 20 నుంచి మలయాళ, తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్‌ కానుంది. TitleCategoryLanguagePlatformRelease Date3 Body ProblemSeriesEnglishNetflixMarch 21FighterMovieHindiNetflixMarch 21Lal SalaamMovieTelugu/TamilNetflixMarch 22Play GroundSeriesHindiAmazon primeMarch 17Marakkuma Nenjam MovieTamilAmazon primeMarch 19Ae Watan Mere WatanMovieHindiAmazon primeMarch 21Road HouseMovieEnglishAmazon primeMarch 21LuteraMovieHindiDisney + HotstarMarch 22OppenheimerMovieHindi/TeluguJio CinemaMarch 21Sundaram MasterMovieTelugu ETV WinMarch 22
    మార్చి 18 , 2024
    రియల్‌ లైఫ్‌ క్రైమ్స్‌కు స్ఫూర్తినిచ్చిన 10 సినిమాలు/వెబ్‌ సిరీస్‌లు
    రియల్‌ లైఫ్‌ క్రైమ్స్‌కు స్ఫూర్తినిచ్చిన 10 సినిమాలు/వెబ్‌ సిరీస్‌లు
    ]జాన్‌ అబ్రహం, అభిషేక్ బచ్చన్‌ ‘ధూమ్‌’ సినిమా స్ఫూర్తితో కేరళలో నలుగురు యువకులు బ్యాంక్‌ చోరీకి ప్లాన్‌ చేశారు. ఈ నలుగురు బైకర్స్‌ను పోలీసులు చేజ్‌ చేసి పట్టుకున్నారు.ధూమ్‌
    ఫిబ్రవరి 14 , 2023
    The Goat Life Review: పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కెరీర్‌ బెస్ట్‌ నటన.. ‘ది గోట్‌ లైఫ్‌’ సినిమా ఎలా ఉందంటే?
    The Goat Life Review: పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కెరీర్‌ బెస్ట్‌ నటన.. ‘ది గోట్‌ లైఫ్‌’ సినిమా ఎలా ఉందంటే?
    నటీనటులు: ప్రృథ్వీరాజ్‌ సుకుమారన్‌, అమలాపాల్‌, అపర్ణ బాలమురళి, వినీత్‌ శ్రీనివాసన్‌, జిమ్మీ జీన్‌ లూయీస్‌, లీనా, సంతోష్‌ కీఝాత్తూర్‌, అకేఫ్‌ నజీం, శోభా మోహన్‌ తదితరులు దర్శకుడు : బ్లెస్సీ సంగీతం: ఏ.ఆర్‌. రెహమాన్‌ సినిమాటోగ్రఫీ : సునీల్‌ కే.ఎస్‌ నిర్మాతలు: బ్లెస్సీ, జిమ్మీ జీన్‌ లూయీస్‌, స్టీవెన్ ఆడమ్స్‌, కే.జీ అబ్రహం విడుదల తేదీ : 28-03-2024 ‘సలార్’తో (Salaar) తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరయ్యాడు మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran). అంతకుముందు అతడు చేసిన మలయాళ చిత్రాలు తెలుగులో డబ్‌ అయినప్పటికీ పెద్దగా పేరు రాలేదు. సలార్‌లో ప్రభాస్‌ ఫ్రెండ్‌గా నటించి తాజాగా మంచి పేరు గుర్తింపు సంపాదించాడు. తాజాగా అతడు నటించిన ‘ది గోట్ లైఫ్ : ఆడు జీవితం’ (The Goat Life : Aadujeevitham) మలయాళంతో పాటు తెలుగులోనూ ఇవాళ రిలీజైంది. బెన్యామిన్ రచించిన ‘గోట్ డేస్’ నవల ఆధారంగా దర్శకుడు బ్లెస్సీ ఈ సినిమాను తెరకెక్కించారు. మరి ఈ సినిమా ఎలా ఉంది (The Goat Life Review In Telugu)? ప్రేక్షకులను మెప్పించిందా? లేదా? ఇప్పుడు చూద్దాం.  కథేంటి ది గోట్ లైఫ్ చిత్ర కథ విషయానికి వస్తే.. కుటుంబ అవసరాల కోసం నజీబ్ అహ్మద్ (పృథ్వీరాజ్‌ సుకుమారన్‌) వలస కూలీగా సౌదీ అరేబియా వెళతాడు. అనుకోకుండా నజీబ్ సౌదీ అరేబియాలో తప్పిపోతాడు. గల్ఫ్‌లో పని చేసి డబ్బులు సంపాదించి కుటుంబానికి అండగా నిలవాలనుకున్న నజీబ్‌ కల చెదిరిపోతుంది. ఏడారిలో బానిసగా మారి గొర్రెల కాపరిగా దుర్భరమైన జీవితాన్ని గడపాల్సి వస్తుంది. ఈ క్రమంలో అతడు పడ్డ కష్టాలేంటి? బానిస సంకెళ్ళ నుండి నజీబ్‌ ఎలా బయటపడ్డాడు? తిరిగి ఇండియాకు వచ్చి తన కుటుంబ సభ్యులను నజీబ్‌ కలుసుకున్నాడా? లేదా? అనేది మిగతా కథ. ఎవరెలా చేశారంటే? ‘ది గోట్ లైఫ్’ చిత్రాన్ని పృథ్విరాజ్ సుకుమారన్ అన్నీ తానై నడిపించాడు. ఆయన నటన, షాకింగ్ ట్రాన్స్ఫర్మేషన్ అబ్బురపరుస్తాయి. నజీబ్ పాత్రలో పృథ్వీరాజ్‌ను తప్ప మరో నటుడ్ని ఊహించుకోలేము. అంతగా ఆ పాత్రలో లీనమై నటించాడు పృథ్వీ. ముఖ్యంగా భావోద్వేగ సన్నివేశాల్లో ఆయన జీవించేశాడు. కెరీర్ బెస్ట్ నటనతో అదరగొట్టాడు. నటి అమలా పాల్ కూడా ఇందులో కీలక పాత్రలో కనిపించింది. ఆమె తన పరిధి మేరకు నటించి మెప్పించింది. మిగిలిన నటీనటులు తమ పాత్రలకు న్యాయం చేశారు. డైరెక్షన్ ఎలా ఉందంటే? దర్శకుడు బ్లెస్సీ ఈ సినిమాకు మనసులను హత్తుకునే కథను ఎంచుకున్నాడు. బానిసల జీవితం ఎంత దుర్భరంగా ఉంటుందో కళ్లకు కట్టాడు. ఫస్టాఫ్‌లో పృథ్వీ సౌదీకి రావడం.. అతడి పాస్‌పోర్టును లాక్కొని బానిసగా మార్చడం వంటివి చూపించాడు. ముఖ్యంగా ఇంటర్వెల్‌కు ముందు వచ్చే సీన్‌ హృదయాలను బరువెక్కిస్తుంది. సౌదీలో ఎలాంటి దారుణాలు జరుగుతాయో కూడా దర్శకుడు ఈ సినిమాలో చూపించాడు. సెకండాఫ్‌లో ఆ బానిస సంకెళ్ల నుంచి హీరో తప్పించుకోవడం, కనుచూపు మేర కనిపించే ఏడారిలో అతడు పడే కష్టాలను తెరకెక్కించాడు. ముఖ్యంగా ఇసుక తుఫాను సీక్వెన్స్‌ను చాలా బాగా తెరకెక్కించాడు డైరెక్టర్‌. అయితే సినిమాలో సింహాభాగం అంతా పృథ్వీరాజ్‌ పడే కష్టాలే చూపించడం ఆడియన్స్‌కు బోర్‌ కొట్టిస్తుంది. పైగా సినిమా స్లో నేరషన్‌తో మరి నెమ్మదిగా సాగిన ఫీలింగ్ కలుగుతుంది. సుదీర్ఘమైన సినిమాను చూసినట్లు ఆడియన్స్ ఫీలవుతారు. కమర్షియల్‌ చిత్రాలను ఇష్టపడే వారికి ‘ది గోట్ లైఫ్’ అంతగా రుచించకపోవచ్చు.   టెక్నికల్‌గా సాంకేతిక అంశాల విషయానికి వస్తే (The Goat Life Review In Telugu).. ప్రతీ విభాగం మంచి పనితీరు కనబరిచింది. ఏఆర్‌ రెహమాన్‌ అందించిన సంగీతం సినిమాకు బాగా ప్లస్‌ అయ్యింది. ముఖ్యంగా ఆయన అందించిన నేపథ్య సంగీతం సన్నివేశాలను బాగా ఎలివేట్‌ చేసింది. అటు సినిమాట్రోగ్రాఫర్‌ కూడా చక్కటి ప్రతిభను కనబరిచాడు. సౌదీలోని ఎడారి పరిస్థితులను ఆ తన కెమెరా కళ్లతో అద్భుతంగా చూపించాడు. ప్రేక్షకులకు మంచి విజువల్‌ ట్రీట్ అందించాడు. నిర్మాణ విలువలు కూడా ఉన్నతంగా ఉన్నాయి.  ప్లస్‌ పాయింట్స్ ప్రృథ్వీరాజ్‌ సుకుమారన్‌ నటనభావోద్వేగ సన్నివేశాలుసంగీతం మైనస్ పాయింట్స్ స్లో నారేషన్‌కమర్షియల్‌ హంగులు లేకపోవడం Telugu.yousay.tv Rating : 3/5
    మార్చి 28 , 2024
    <strong>Sharvari Wagh Hot: ఫిట్‌నెస్‌ మాటున శార్వరీ అందాల జాతర.. చూసి తట్టుకోగలరా!&nbsp;</strong>
    Sharvari Wagh Hot: ఫిట్‌నెస్‌ మాటున శార్వరీ అందాల జాతర.. చూసి తట్టుకోగలరా!&nbsp;
    బాలీవుడ్‌ అందాల తార శార్వరీ వాఘ్‌ (Sharvari Wagh) తన అందచందాలతో సోషల్ మీడియాను షేక్‌ చేస్తోంది.&nbsp; ఫిట్‌నెస్‌కు అధిక ప్రాధాన్యత ఇచ్చే ఈ భామ వ్యాయామం చేస్తూ కష్టపడుతున్న ఫొటోలను తాజాగా షేర్‌ చేసింది.&nbsp; మెస్మరైజింగ్‌ ఫిట్‌నెస్‌తో పాటు కళ్లు చెదిరే అందాలతో శార్వరీ ఈ ఫొటోల్లో కనిపించింది. ఎద, నడుము, థైస్‌ అందాలు చూపిస్తూ రచ్చ రచ్చ చేసింది.&nbsp; శార్వరీ లేటెస్ట్ అందాలు చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఆమె అందాలను ఎంత పొగిడినా తక్కువేనని ప్రశంసిస్తున్నారు.&nbsp; పదహారేళ్ల వయసులోనే మోడల్‌గా కెరీర్‌ను ప్రారంభించింది. 2013లో క్లీన్‌ అండ్‌ క్లియర్‌ ఫేస్‌ వాష్‌ కాంటెస్ట్‌లో పాల్గొని టైటిల్‌ గెలుచుకుంది.&nbsp; ఆ తర్వాత యాక్టింగ్‌లో శిక్షణ తీసుకుంది. పలు బ్రాండ్లకు మోడల్‌గా వ్యవహిరించింది. అప్పడే తనకు దర్శకత్వంపై ఆసక్తి కలిగింది.&nbsp; అలా 2015లో 'ప్యార్‌ కా పంచ్‌నామా 2', బాజీరావ్‌ మస్తానీ, 'సోను కే టిటు కి స్వీటీ' తదితర చిత్రాలకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా చేసింది.&nbsp; 'ద ఫర్‌గాటెన్‌ అర్మీ - ఆజాదీ కే లియే' వెబ్‌సిరీస్‌తో శార్వరీ నటిగా మారింది. ఆ తర్వాతే సినిమాల్లో నటించే అవకాశాలు దక్కాయి.&nbsp; తన తొలి చిత్రం 'బంటీ ఔర్‌ బబ్లీ 2'తోనే 2022లో ఐఫా, ఫిల్మ్‌ఫేర్‌ ఉత్తమ నటిగా అవార్డులు గెలుచుకుంది.&nbsp; ఆ తర్వాత 'ముంజ్యా', మహారాజ్‌ వంటి చిత్రాల్లో శార్వరీకి ఫీమేల్‌ లీడ్‌గా అవకాశాలు దక్కాయి. ‘మహారాజ్‌’ ఈ ఏడాదే విడుదలై పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుంది.&nbsp; రీసెంట్‌గా జాన్‌ అబ్రహం చేసిన 'వేదా' చిత్రంలోనూ శార్వరీ నటించింది. ఆగస్టు 15న విడుదలైన ఈ చిత్రం నెగిటివ్‌ టాక్‌ తెచ్చుకుంది. అయితే ఇందులో శార్వరీ నటనకు మంచి మార్కులు పడ్డాయి.&nbsp; ప్రస్తుతం 'ఆల్ఫా' అనే చిత్రంలో శార్వరీ నటిస్తోంది. అలియా భట్ గుడాఛారిగా కనిపించనున్న ఈ చిత్రంలో శార్వరీ కీలక పాత్రలో కనిపించనుంది.&nbsp; రణ్‌వీర్‌ సింగ్‌, రణ్‌బీర్‌ కపూర్‌లకు తాను వీరాభిమానినని శార్వరీ ఓ సందర్భంలో తెలిపింది. ఖాళీ సమయంలో పెంపుడు జంతువులతో ఆడుకుంటానని తెలిపింది.&nbsp; ఒత్తిడిగా, చికాకుగా ఉన్న సమయాల్లో పుస్తకాలు చదువుతుంటానని శార్వరీ చెప్పింది. అలా చేయడం ద్వారా వెంటనే వాటి నుంచి బయటపడతానిని పేర్కొంది.
    ఆగస్టు 26 , 2024
    <strong>Sobhita Dhulipala: దేశంలో శోభిత ధూళిపాళ క్రేజ్‌ మాముల్గా లేదుగా.. జాన్వీ, దీపిక, మృణాల్‌ను సైతం వెనక్కి నెట్టి!</strong>
    Sobhita Dhulipala: దేశంలో శోభిత ధూళిపాళ క్రేజ్‌ మాముల్గా లేదుగా.. జాన్వీ, దీపిక, మృణాల్‌ను సైతం వెనక్కి నెట్టి!
    ప్రముఖ హీరోయిన్‌ శోభిత దూళిపాళ (Sobhita Dhulipala) పేరు గత కొన్ని రోజులుగా మార్మోగుతోంది. స్టార్‌ హీరో అక్కినేని నాగ చైతన్య (Akkineni Naga Chaitanya)తో నిశ్చితార్థం జరిగినప్పటి నుంచి ఈ అమ్మడి పేరు సోషల్‌ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. స్టార్‌ హీరోయిన్‌ సమంతకు విడాకులు ఇచ్చిన చైతూను శోభిత పెళ్లి చేసుకోనుండటంతో ఒక్కసారిగా ఈ భామపై అటెన్షన్ ఏర్పడింది. అక్కినేని ఫ్యాన్స్‌ శోభిత రాకను సమర్థిస్తుంటే సామ్‌ అభిమానులు మాత్రం నెట్టింట విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఇదిలా ఉంటే దేశంలో అత్యంత ప్రజాధరణ పొందిన సెలబ్రిటీల జాబితాలో శోభిత రెండో స్థానంలో నిలిచి సత్తా చాటింది. స్టార్‌ హీరోలు, హీరోయిన్స్‌ను వెనక్కి నెట్టి మరి ఈ ఫీట్‌ సాధించింది. ఆ విశేషాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.&nbsp; శోభితానా మజాకా..! ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్‌ పోర్టల్ ఐఎండీబీ (IMDb) ఎక్కువ ప్రజాదరణ పొందిన నటీనటుల జాబితాను తాజాగా విడుదల చేసింది. ఈ వారం తమ వెబ్‌సైట్‌లో ఎక్కువ మంది యూజర్లు సెర్చ్ చేసిన సెలబ్రిటీల పేర్ల ఆధారంగా ఐఎండీబీ ఈ లిస్ట్‌ను రూపొందించింది. ఇందులో నటి శోభిత దూళిపాళ దేశంలోనే టాప్‌ 2లో నిలిచారు. తొలిస్థానంలో బాలీవుడ్‌ నటి శార్వరీ (Sharvari) నిలిచింది. శోభిత తర్వాతి స్థానంలో బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ ఖాన్‌ (Shah Rukh Khan) నిలవడం గమనార్హం. ఇక దీపిక పదుకొణే (Deepika Padukone), జాన్వీ కపూర్‌ (Janhvi Kapoor), కాజోల్‌ (Kajol) 4, 5, 6 స్థానాల్లో నిలిచారు. బాలీవుడ్‌ నటుడు లక్ష్య, తమిళ స్టార్‌ హీరో విజయ్‌ సేతుపతి (Vijay Sethupathi), హీరోయిన్‌ మృణాల్‌ ఠాకూర్‌ (Mrunal Thakur), ఐశ్వర్యరాయ్‌ (Aishwarya Rai) తదుపరి స్థానాల్లో నిలిచారు. అటు శ్వేత బసు ప్రసాద్‌ 14, దివ్య ఖోస్లా కుమార్‌ 18, ఫహాద్‌ ఫాజిల్‌ 25, విజయ్‌ 27, విక్రాంత్‌ మెస్సీ 35, త్రిష 37, జాన్‌ అబ్రహం 39, కమల్‌ హాసన్‌ 50 స్థానాల్లో నిలిచినట్లు ఐఎండీబీ తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో వెల్లడించింది.&nbsp; View this post on Instagram A post shared by IMDb India (@imdb_in) పాపులారిటీకి కారణమిదే! నటుడు నాగ చైతన్యతో శోభితకు ఎంగేజ్‌మెంట్‌ జరిగిన సంగతి తెలిసిందే. అక్కినేని నాగార్జున ఈ విషయాన్ని తొలిసారి పంచుకోవడంతో శోభిత పేరు ఒక్కసారిగా వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలో ఎంతోమంది నెటిజన్లు ఆమె గురించి తెలుసుకునేందుకు తెగ సెర్చ్‌ చేశారు. అక్కినేని కుటుంబంలో భాగం కాబోతున్న ఈ భామ వ్యక్తిగత, సినిమా నేపథ్యం గురించి కనుక్కొనే ప్రయత్నం చేశారు. దీంతో ఆమె ఈ వారం ఇండియన్‌ పాపులర్‌ సెలబ్రిటీగా మారిపోయింది. గతంలో ఎప్పుడు లేని విధంగా ఐఎండీబీ పాపులర్‌ సెలబ్రిటీల జాబితాలో రెండో స్థానం దక్కించుకుంది. చైతూతో ఎంగేజ్‌మెంట్‌ శోభితాకు బాగా కలిసొచ్చిందని నెటిజన్లు భావిస్తున్నారు. నిశ్చితార్థంపై శోభిత స్పందన ఇదే! టాలీవుడ్‌ హీరో నాగ చైతన్య (Naga Chaitanya)తో నిశ్చితార్థం జరిగిన ఫొటోలను శోభిత షేర్‌ చేస్తూ ఆనందం వ్యక్తం చేసింది. ‘మన పరిచయం ఎలా మొదలైనా? ప్రేమలో మన హృదయాలు కలిసిపోయాయి’ అని రాసుకొచ్చింది. దీన్ని నాగ చైతన్య రీ పోస్ట్‌ చేశారు. వాస్తవానికి&nbsp; చై-శోభిత డేటింగ్‌లో ఉన్నట్లు గత రెండేళ్ల నుంచి సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది. వీరిద్దరి హాలీడే ట్రిప్‌నకు సంబంధించిన ఫొటోలు సైతం పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. వీరి జోడి బాగుందంటూ అక్కినేని అభిమానులు పోస్టులు సైతం పెట్టారు. దీంతో చై-శోభిత కచ్చితంగా పెళ్లి పీటలు ఎక్కుతారని అంతా ఊహించారు. అనుకున్నట్లుగానే బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా వీరి నిశ్చితార్థం జరిగింది.&nbsp; View this post on Instagram A post shared by Sobhita (@sobhitad) శోభితా గురించి ఈ విషయాలు తెలుసా! శోభితా దూళిపాళ్ల ఏపీలోని తెనాలిలో జన్మించింది. 2013లో ఫెమినా మిస్‌ ఇండియా టైటిల్‌ విన్నర్‌గా నిలిచింది. బాలీవుడ్‌లో 2016లో విడుదలైన రామన్‌ రాఘవన్‌ 2.0 చిత్రం ద్వారా శోభిత సినీ రంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత ‘చెఫ్‌’, ‘కళాకంది’ వంటి బాలీవుడ్ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. 2018లో వచ్చి గూఢచారి చిత్రం ద్వారా శోభితా టాలీవుడ్‌కు పరిచయమైంది. తన అంద చందాలతో తెలుగు యూత్‌ ఆడియన్స్‌ను ఆకర్షించింది. ఆ తర్వాత మేజర్‌, పొన్నియన్‌ సెల్వన్ 1 &amp; 2 చిత్రాల్లో కీలక పాత్రలు పోషించి ఆకట్టుకుంది. ఇందులో ఆమె నటనకు ప్రశంసలు దక్కాయి. ఇటీవల 'మంకీ మాన్‌' అనే అమెరికన్‌ ఫిల్మ్‌లోనూ శోభితా నటించింది. ప్రస్తుతం హిందీలో 'సితారా' అనే చిత్రంలో నటిస్తోంది. ఇక నాగచైతన్య ‘తండేల్‌’తో బిజీగా ఉన్నాడు. చందూ మొండేటి దర్శకత్వంలో ఇది రూపొందుతోంది.&nbsp;
    ఆగస్టు 13 , 2024
    <strong>Comedian Ali Roles: ‘డబుల్‌ ఇస్మార్ట్‌’లో అలీ చేసిన రోల్ విశిష్టత తెలుసా?</strong>
    Comedian Ali Roles: ‘డబుల్‌ ఇస్మార్ట్‌’లో అలీ చేసిన రోల్ విశిష్టత తెలుసా?
    పూరి జగన్నాథ్‌ సినిమా అంటే పవర్‌ ఫుల్‌ డైలాగ్స్‌, హీరోయిజంతో పాటు హాస్య నటుడు అలీ క్యారెక్టర్లు కూడా గుర్తుకు వస్తాయి. పూరి ఇప్పటివరకూ చేసిన సినిమాల్లో అలీ కోసం ప్రత్యేకంగా కొన్ని పాత్రలను సృష్టించారు. ఆ పాత్ర తాలుకూ కామెడీ ట్రాకులు ఆయా సినిమాలకు భలే వర్కౌట్‌ అయ్యాయి. ఈ క్రమంలోనే 'డబుల్‌ ఇస్మార్ట్‌' సినిమాలోనూ అలీకి ఓ ప్రత్యేకమైన రోల్‌ను ఇచ్చాడు పూరి. ‘బోకా’ అనే విచిత్రమైన పాత్రలో అలీ కనిపించనున్నారు. ట్రైలర్‌లో అలీ పాత్రకు సంబంధించిన డైలాగ్స్‌ ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో గతంలో పూరి సినిమాల్లో అలీ చేసిన ప్రత్యేకమైన పాత్రలు ఏంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; బైక్‌ల దొంగ (ఇడియట్‌) రవితేజ, పూరి జగన్నాథ్‌ కాంబోలో వచ్చిన ఇడియట్‌ చిత్రం అప్పట్లో ఎంతటి సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిందో అందరికీ తెలిసిందే. అయితే ఇందులో బైక్‌లను దొంగిలించే పాత్రలో అలీ కనిపిస్తాడు. హైదరాబాద్‌ నుంచి బీదర్‌కు బైక్‌పై ఇసుక మూటను తీసుకెళ్తూ పోలీసు అధికారి జీవాను ఫుల్‌గా కన్ఫ్యూజ్‌ చేస్తాడు. ఆ ఇసుకను బీదర్‌లో చల్లడానికి తీసుకెళ్తున్నట్లు పదే పదే పోలీసులకు అలీ చెప్తాడు. అయితే అంత దూరం ఎందుకు తీసుకెళ్తున్నాడో తెలియక పోలీసులతో పాటు ఆడియన్స్‌ కూడా కన్ఫ్యూజ్‌ అవుతారు. ఫైనల్‌గా అలీనే బైక్‌ దొంగతనాలు చేస్తున్నట్లు చెప్పడంతో అంతా ఒక్కసారిగా షాకవుతారు.&nbsp; స్కెచ్ ఆర్టిస్టు (సూపర్‌) నాగార్జున హీరోగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో ఆర్టిస్టు జాన్‌ అబ్రహం పాత్రలో అలీ కనిపిస్తాడు. ఇందులో అతడు మంచి నైపుణ్యం గల ఆర్టిస్టు. ఒకసారి చూస్తే ఇట్టే వారి స్కెచ్‌ వేయగలడు. అలా ఓ సందర్భంలో పోలీసులు వెతుకున్న హీరోను చూస్తాడు. దీంతో పోలీసులు అతడ్ని వెంటపెట్టుకొని వెళ్తారు. ఈ సందర్భంగా బ్రహ్మానందం, అలీ మధ్య వచ్చే లై డిటెక్టర్‌ సీన్‌ ఎప్పటికీ మర్చిపోలేరు.&nbsp; బిక్షగాడు (పోకిరి) మహేష్‌, పూరి కాంబోలో వచ్చిన ‘పోకిరి’ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద పలు రికార్డులను కొల్లగొట్టింది. ఇందులో బిక్షవాడి పాత్రలో అలి కనిపించాడు. బ్రహ్మానందం అతడి ఈగో హర్ట్‌ చేయడంతో పదుల సంఖ్యలో బిక్షగాళ్లతో అతడి వెంట తిరుగుతూ నవ్వులు పూయించాడు. అలీ - బ్రహ్మానందం మధ్య వచ్చే కామెడీ సీన్స్‌ ఈ సినిమా సక్సెస్‌లో ముఖ్య భూమిక పోషించాయని చెప్పవచ్చు.&nbsp; హిమాలయ బాబా (దేశ ముదురు) అల్లు అర్జున్‌ హీరోగా చేసిన దేశముదురు చిత్రంలో అలీ హిమాలయాల్లో తపస్సు చేసే బాబా పాత్రలో కనిపించాడు. తాను బాబాగా ఎందుకు మారాడో కొద్ది కొద్దిగా రివీల్‌ చేస్తూ ఆడియన్స్‌లో ఎగ్జైట్‌మెంట్‌ను క్రియేట్‌ చేస్తాడు. ప్రతీ సీన్‌ క్లైమాక్స్‌లా ఉంటుందంటూ నవ్వులు పూయించాడు. ఈ పాత్రకు సంబంధించిన సన్నివేశాలకు ఇప్పటికీ ఆడియన్స్‌లో క్రేజ్ ఉంది.&nbsp; గోలి (దేవుడు చేసిన మనుషులు) రవితేజ, పూరి కాంబోలో వచ్చిన ఈ ఫిల్మ్‌లో గోలీ అనే విచిత్రమైన పాత్రలో అలీ నటించాడు. లక్ష్మీదేవి కుమారుడిగా చెప్పుకుంటూ విపరీతంగా పూజలు చేస్తుంటాడు. లక్ష్మీదేవి (కోవై సరళ) అతడికి సాయం చేయాలని భావించి కొన్ని అవకాశాలు ఇచ్చినప్పటికీ తన తింగరితనంతో చేజేతులా వాటిని చెడగొట్టుకుంటూ నవ్వులు పూయించాడు. ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద డిజాస్టర్‌గా నిలిచినప్పటికీ అలీ చేసిన గోలి పాత్ర మాత్రం ఆడియన్స్‌ను కడుపుబ్బా నవ్వించింది.&nbsp; నచ్చిమి (చిరుత) మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ ఫస్ట్‌ ఫిల్మ్‌ 'చిరుత'లో అలీ పాత్ర విచిత్రంగా ఉంటుంది. నచ్చిమిగా అలీ పాత్ర, వేషధారణ, అన్నీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి. అప్పటివరకూ ఆయన చేసిన క్యారెక్టర్లలో భిన్నమైన పాత్రగా నచ్చిమి గుర్తింపు తెచ్చింది. ఇప్పటికీ బుల్లితెరపై నచ్చిమిగా అలీ కనిపడితే నవ్వులే నవ్వులు అని చెప్పవచ్చు.&nbsp; బోకా (ఇస్మార్ట్‌ శంకర్‌) రామ్‌ పోతినేని, పూరి కాంబోలో వస్తోన్న ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ సినిమాలో బోకా అనే అడివి మనిషి తరహా పాత్రలో అలీ కనిపించనున్నాడు. ట్రైలర్‌లో అలీ పర్‌ఫార్మెన్స్‌ చూసి ఆడియన్స్‌ ఫిదా అయ్యారు. ఈ పాత్ర కూడా పక్కాగా హైలెట్ అవుతుందని పోస్టులు పెడుతున్నారు. అయితే ఈ పాత్ర ఎలా పుట్టిందో ఈ క్యారెక్టర్‌కు సంబంధించిన ఐడియా ఎలా వచ్చిందో అలీ తాజా ఇంటర్యూలో చెప్పుకొచ్చారు. మలేషియాలో బిల్లా షూటింగ్‌ సందర్భంలో చింపాజిని మేనేజర్‌గా పెట్టుకుంటే ఎలా ఉంటుందో ప్రభాస్‌కు చేసి చూపించినట్లు అలీ తెలిపారు. తన నటనకు ప్రభాస్‌తో పాటు అక్కడ ఉన్నవారంతా గంటన్నర సేపు నవ్వుతూనే ఉన్నారని చెప్పుకొచ్చారు. ఈ విషయం ఫోన్‌లో పూరికి చెప్పగానే ట్రాక్‌ బాగుంది ఏ సినిమాలోనైనా పెడదాం అన్నట్లు చెప్పారు. అలా అమెజాన్‌ ఫారెస్ట్‌ నుంచి బోకా అనే క్యారెక్టర్‌ను తీసుకున్నట్లు అలీ స్పష్టం చేశారు. తన రోల్‌కు సంబంధించిన షూటింగ్‌ను మూడు రోజుల్లోనే ఫినిష్‌ చేసినట్లు అలీ తెలిపారు.  
    ఆగస్టు 13 , 2024
    <strong>This Week Movies:&nbsp; ఆగస్టు 15 సందర్భంగా ఓటీటీలోకి మోస్ట్ వాంటెడ్ చిత్రాలు</strong>
    This Week Movies:&nbsp; ఆగస్టు 15 సందర్భంగా ఓటీటీలోకి మోస్ట్ వాంటెడ్ చిత్రాలు
    పంద్రాగస్టు సందర్భంగా ఈ వారం థియేటర్లలో పెద్ద ఎత్తున సందడి నెలకొననుంది. భారీ చిత్రాలతో థియేటర్స్‌ కళకళలాడేందుకు సిద్ధమవుతున్నాయి. రవితేజ, రామ్‌ పోతినేని, విక్రమ్‌ వంటి స్టార్‌ హీరోల చిత్రాలు ఈ వారం విడుదల కాబోతున్నాయి. అటు ఓటీటీలోనూ పలు ఆసక్తికర చిత్రాలు, సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు సిద్ధమయ్యాయి. ఆ విశేషాలేంటో ఈ కథనంలో చూద్దాం. థియేటర్లో విడుదలయ్యే చిత్రాలు మిస్టర్‌ బచ్చన్‌ (Mr. Bachchan) మాస్‌ మహారాజా రవితేజ హీరోగా హరీష్‌ శంకర్‌ డైరెక్షన్‌లో రూపొందిన తాజా చిత్రం ‘మిస్టర్‌ బచ్చన్‌’. బాలీవుడ్‌ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయం కాబోతోంది. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఆగస్టు 15న (Mr. Bachchan Release Date) థియేటర్స్‌లో సందడి చేయనుంది. రవితేజ ఇందులో ఐటీ అధికారిగా కనిపించనున్నారు. ఆయన ఎనర్జీ యాక్టింగ్‌, భాగ్యశ్రీ అందాలు, హరీశ్‌ శంకర్‌ టేకింగ్‌ ఈ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్తాయని చిత్ర బృందం తెలిపింది.  డబుల్‌ ఇస్మార్ట్‌ (Double iSmart)&nbsp; హీరో రామ్‌ పోతినేని, డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ కాంబోలో రూపొందిన ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ చిత్రం ఈ వారమే థియేటర్లలోకి రాబోతోంది. బ్లాక్‌ బాస్టర్‌ చిత్రం ‘ఇస్మార్ట్‌ శంకర్‌’కు సీక్వెల్‌గా దీన్ని నిర్మించారు. కావ్య థాపర్‌ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో సంజయ్‌ దత్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆగస్టు 15న (Double Ismart Release Date) థియేటర్స్‌లో సందడి చేయడానికి ఈ మూవీ సిద్ధమైంది. ఇప్పటికే విడుదల చేసిన పాటలు, ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలను పెంచాయి. తంగలాన్‌ (Thangalaan) తమిళ స్టార్‌ హీరో విక్రమ్‌ (Vikram) నటించిన లేటెస్ట్‌ చిత్రం ‘తంగలాన్‌’ కూడా ఈ వారమే గ్రాండ్‌గా థియేటర్లలోకి రానుంది. పా. రంజిత్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జ్ఞానవేల్‌రాజా నిర్మించారు. పార్వతీ తిరువోతు, మాళవిక మోహనన్‌ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రం ఈనెల 15న విడుదల కానుంది. స్వాతంత్య్రానికి పూర్వం కోలార్‌ గోల్డ్‌ ఫీల్డ్స్‌లో జరిగిన వాస్తవ సంఘటనల్ని ఆధారం చేసుకుని ఈ సినిమాను రూపొందించినట్లు చిత్ర యూనిట్‌ తెలిపింది.  ఆయ్‌ (Aay) ఎన్టీఆర్‌ బావ మరిది నార్నే నితిన్‌ నటించిన రెండో చిత్రం ‘ఆయ్‌’. మ్యాడ్‌ చిత్రంతో సాలిడ్‌ విజయాన్ని అందుకు ఈ యంగ్‌ హీరో తన సెకండ్‌ హిట్‌ కోసం ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అంజి కె.మణిపుత్ర దర్శకత్వం ‘ఆయ్‌’ మూవీ ఆగస్టు 15న రిలీజ్‌ కాబోతోంది. గోదావరి విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌ నేపథ్యంలో ఈ సినిమాను రూపొందించారు. నార్నే నితిన్‌కు జోడీగా నయన్‌ సారిక నటించింది. ఈ మూవీ తప్పకుండా ఎంటర్‌టైన్‌ చేస్తుందని చిత్ర బృందం తెలిపింది.  వేదా (Vedaa) జాన్‌ అబ్రహం (John Abraham), శార్వరీ వాఘ్‌, తమన్నా ప్రధాన పాత్రలు పోషిస్తున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘వేదా’ (Vedaa). నిఖిల్‌ అడ్వాణీ దర్శకుడు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఆగస్టు 15న హిందీ, తెలుగు భాషల్లో విడుదల కానుంది. యాక్షన్‌ డ్రామాగా రూపొందిన ‘వేదా’ను వాస్తవ సంఘటనల నుంచి స్ఫూర్తి పొంది తెరకెక్కించారు. నేటి సమాజంలో పరిస్థితులను ప్రతిబింబిస్తుందని చిత్ర బృందం తెలిపింది. ఖేల్‌ ఖేల్‌ మే (Khel Khel Mein) ఏకంగా 26సార్లు రీమేక్ అయి గిన్నిస్‌ బుక్ ఆఫ్‌ రికార్డ్స్‌లోనూ చోటు సంపాదించుకున్న పర్‌ఫెక్ట్‌ స్ట్రేంజర్స్‌ (Perfetti Sconosciuti) ఇప్పుడు హిందీలో ‘ఖేల్‌ ఖేల్‌ మే’ (khel khel mein)గా రాబోతోంది.  అగ్రకథానాయకుడు అక్షయ్‌ కుమార్‌,  తాప్సి, అమ్మీ వ్రిక్‌, వాణీకపూర్‌, ఫర్దీన్‌ఖాన్‌, ఆదిత్య సీల్‌, ప్రజ్ఞా జైశ్వాల్‌లు  ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ముదస్సర్‌ అజీజ్‌ తెరకెక్కిస్తున్నారు. ఆగస్టు 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు&nbsp; డార్లింగ్‌ ప్రియదర్శి, నభా నటేష్ నటించిన 'డార్లింగ్' (Darling) ఈ వారం ఓటీటీలోకి రాబోతోంది. థియేటర్లలోకి వచ్చి నెల రోజులు కాకముందే ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతోంది. ఆగస్టు 13 నుంచి హాట్‌స్టార్‌ వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది. మ‌ల్టీపుల్ ప‌ర్స‌నాలిటీ డిజార్డ‌ర్ అనే స‌మ‌స్య‌కు వినోదాన్ని జోడించి దర్శకుడు ఈ మూవీని తెరకెక్కించారు. జులై 19న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ పెద్దగా సక్సెస్ కాలేదు. వీరాంజనేయులు విహార యాత్ర (Veeranjaneyulu Vihara Yatra) ప్రముఖ ఓటీటీ సంస్థ ఈటీవీ విన్‌ ఈ వారం మరో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో రాబోతోంది. 'వీరాంజనేయులు విహార యాత్ర' పేరుతో ఆగస్టు 14 నుంచి కొత్త మూవీని స్ట్రీమింగ్‌ చేయబోతోంది. సీనియర్‌ నటుడు నరేశ్‌, శ్రీలక్ష్మీ, యువ నటులు రాగ్‌ మయూర్‌, ప్రియా వడ్లమాని ఈ సిరీస్‌లో కీలక పాత్ర పోషించారు. టైటిల్‌ని బట్టి విహార యాత్ర నేపథ్యంలో ఈ మూవీని రూపొందించినట్లు తెలుస్తోంది.  మనోరథంగల్‌ (Manorathangal) కమల్‌హాసన్, మోహన్‌లాల్, మమ్ముట్టి, ఫహాద్‌ ఫాజిల్‌ వంటి ప్రముఖ సౌత్‌ ఇండియన్‌ స్టార్స్‌ నటించిన లేటెస్ట్‌ సిరీస్‌ ‘మనోరథంగల్‌’.  తొమ్మిది కథలతో, ఎనిమిది మంది దర్శకులు తీర్చిదిద్దిన ఈ సిరీస్‌ను ఆగస్టు 15న ఓటీటీలో విడుదల చేస్తున్నారు. జీ 5 వేదికగా తెలుగు, హిందీతో పాటు పలు దక్షిణాది భాషల్లో ఈ సిరీస్‌ అందుబాటులోకి రానుంది. ప్రముఖ రచయిత, దర్శకుడు ఎమ్‌.టి వాసుదేవన్‌ రాసిన కథల ఆధారంగా ఈ ఆంథాలజీ సిరీస్‌ను రూపొందించారు.  మరిన్ని OTT చిత్రాలు &amp; వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి https://telugu.yousay.tv/tfidb/ott TitleCategoryLanguagePlatformRelease DateDaughtersMovieEnglishNetflixAugust 14Worst Ex EverSeriesEnglishNetflixAugust 14Emily In ParisSeriesEnglishNetflixAugust 14The UnionMovieEnglishNetflixAugust 16Love Nexts DoorMovieKorean/EnglishNetflixAugust 17DarlingMovieTeluguHotstarAugust 13The TyrantMovieKorean/EnglishHotstarAugust 14Nam Namak NishanMovieHindiAmazon&nbsp;August 14JackpotMovieEnglishAmazon&nbsp;August 15ChanakSeriesHindiSonyLIVAugust 16ManorathangalSeriesTelugu DubZee 5August 15Sekhar HomeMovieHindiJio CinemaAugust 14
    ఆగస్టు 12 , 2024
    Pushpa 2: ముందు నుయ్యి.. వెనుక గొయ్యిలా ‘పుష్ప 2’ పరిస్థితి? కలెక్షన్స్ భారీగా పడిపోవడం ఖాయం!
    Pushpa 2: ముందు నుయ్యి.. వెనుక గొయ్యిలా ‘పుష్ప 2’ పరిస్థితి? కలెక్షన్స్ భారీగా పడిపోవడం ఖాయం!
    ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్‌ రూపొందిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘పుష్ప 2’ (Pushpa 2: The Rule). నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్న (Rashmika Mandanna) హీరోయిన్‌గా చేస్తున్న ఈ సినిమాపై జాతీయ స్థాయిలో బజ్‌ ఉంది. ఇప్పటికే విడుదలైన పుష్ప గ్లింప్స్‌, ప్రమోషన్‌ పోస్టర్లు, ఫస్ట్‌ సింగిల్‌ సినిమాపై అంచనాలను మరింత పెంచాయి. ఆగస్టు 15న ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేస్తామని మేకర్స్ ఇప్పటికే ప్రకటించడంతో ఆ రోజు కోసం.. సినీ ప్రేక్షకులు, బన్నీ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా వాయిదా పడనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఒకవేళ చెప్పిన తేదీకే సినిమా రిలీజ్‌ చేస్తే కలెక్షన్స్‌లో భారీగా కోత పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అందుకు గల కారణాలేంటో ఈ కథనంలో పరిశీలిద్దాం.&nbsp; పుష్ప 2 వాయిదా..! ప్రస్తుతం ‘పుష్ప 2’ పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యిలాగా మారింది. ఈ సినిమాను ఆగస్టు 15న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ చేయనున్నట్లు మేకర్స్‌ కొద్ది నెలల క్రితం ప్రకటించారు. అందుకు తగ్గట్లే శరవేగంగా షూటింగ్‌ సైతం నిర్వహిస్తున్నారు. జూన్‌ ఎండింగ్‌ నాటికి షూటింగ్‌ ముగించాలని దర్శకుడు సుకుమార్‌ టార్గెట్‌ పెట్టుకోగా.. అది పూర్తయ్యే పరిస్థితులు ప్రస్తుతం కనిపించడం లేదని టాక్‌ వినిపిస్తోంది. సినిమా షూట్ పూర్తి కావడానికి ఇంకో నెల రోజుల సమయం పడుతుందని సమాచారం. అంటే జులై ఎండింగ్‌కి పుష్ప 2 షూట్‌ కంప్లీట్‌ కానుందట. కాబట్టి మిగిలిన 15 రోజుల్లో ప్రీ రిలీజ్‌ వర్క్‌ చేయడం అసాధ్యం కాబట్టి.. 'పుష్ప 2' పోస్ట్‌ పోన్‌ చేస్తే బెటర్‌ అని చిత్ర యూనిట్‌ భావిస్తోందట. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా వస్తుందని అంటున్నారు. ఇది తెలిసిన ఫ్యాన్స్‌ తీవ్రంగా డిసప్పాయింట్‌ అవుతున్నారు.&nbsp; సుకుమార్‌ అసంతృప్తి పుష్ప 2 చిత్రానికి ఎడిటర్‌గా కార్తిక్‌ శ్రీనివాస్‌ పనిచేశారు. కొద్ది నెలల పాటు యూనిట్‌తో కలిసి ట్రావెల్‌ చేసిన అతడు పలు కారణాల వల్ల సినిమా నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. దీంతో ఆయన స్థానంలో నవీన్‌ నూలి వచ్చి ఫైనల్ కట్స్‌ చేశారు. అయితే ఆ ఫైనల్‌ ఔట్‌పుట్‌పై సుకుమార్‌ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. పైగా కొన్ని ఎపిసోడ్స్‌ను సుకుమార్‌ రీడిజైన్‌ చేసినట్లు తెలుస్తోంది. దీనివల్ల ఆగస్టు 15 నాటికి సినిమాను రెడీ చేయడం కష్టమని మూవీ యూనిట్‌ ఒక నిర్ణయానికి వచ్చేసినట్లు తెలుస్తోంది.&nbsp; కలెక్షన్స్‌లో భారీ కోత! పాన్‌ ఇండియా స్థాయి సినిమా అంటే విడుదల తేదీ పక్కాగా ఉండాలి. అలా లేకుంటే దాని ప్రభావం కలెక్షన్స్‌పై కూడా పడుతుంది. ‘పుష్ప 2’ను ఆగస్టు 15నే రిలీజ్‌ చేస్తే.. కలెక్షన్ల పరంగా బన్నీకి భారీ షాక్‌ తగిలే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అదే రోజున తమ చిత్రాలు రిలీజ్‌ చేసేందుకు ముగ్గురు బడా హీరోలు సిద్ధమవుతున్నారు. తమిళ స్టార్‌ హీరో చియాన్‌ విక్రమ్‌ (Chiyaan Vikram) నటిస్తున్న 'తంగలాన్' (Thagalaan) చిత్రాన్ని ఆగస్టు 15న రిలీజ్‌ చేయాలని మేకర్స్‌ భావిస్తున్నారట. మరోవైపు బాలీవుడ్‌ స్టార్‌ నటుడు అజయ్‌ దేవగణ్‌ (Ajay Devgan) కూడా తన ‘సింగం ఎగైన్‌’ (Singham Again) చిత్రాన్ని ఆ రోజునే తీసుకురావాలని చూస్తున్నారట. అలాగే స్టార్‌ నటుడు జాన్‌ అబ్రహం (John Abraham) నటించిన 'వేద' (Veeda) ఆగస్టు 15న తీసుకొస్తున్నట్లు ఇప్పటికే మేకర్స్‌ అధికారికంగా ప్రకటించారు. ఆ మూడు భారీ చిత్రాలు బరిలో ఉండగా వాటిని తట్టుకొని ‘పుష్ప 2’ పాన్‌ ఇండియా స్థాయిలో భారీ కలెక్షన్స్‌ రాబట్టగలదా? అన్న సందేహం సినీ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా అజయ్‌ దేవగన్‌, జాన్‌ అబ్రహం చిత్రాల రిలీజ్‌ ఉన్న నేపథ్యంలో నార్త్‌లో ‘పుష్ప 2’ కలెక్షన్లపై భారీగా ప్రభావం పడొచ్చని అంటున్నారు.&nbsp; పవన్‌ అభిమానుల్లో ఆగ్రహం ప్రస్తుతం అల్లు అర్జున్‌పై పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) ఫ్యాన్స్‌ గుర్రుగా ఉన్నారు. ఏపీ ఎన్నికల సందర్భంగా వైకాపా అభ్యర్థి తరపున బన్నీ ప్రచారం చేయడాన్ని మెగా ఫ్యాన్స్‌ జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ‘పుష్ప 2’ మూవీని బాయ్‌కాట్‌ చేస్తామని సోషల్‌ మీడియా వేదికగా ప్రకటనలు చేస్తున్నారు. మరోవైపు బుధవారం (జూన్‌ 12) జరిగిన పవన్‌ ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి సైతం బన్నీ హాజరు కాకపోవడంతో ఫ్యాన్స్‌ మరింత ఆగ్రహంతో ఉన్నారు. ఇన్ని కష్టాల మధ్య ఇప్పట్లో ఈ మూవీని రిలీజ్‌ చేయకపోవడమే మంచిదని చిత్రయూనిట్‌ భావిస్తున్నట్లు ఫిల్మ్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది.&nbsp;
    జూన్ 13 , 2024
    War 2 Movie Story: సోషల్‌ మీడియాలో ‘వార్‌ 2’ స్టోరీ లీక్‌.. గూస్‌ బంప్స్‌ తెప్పిస్తున్న కథ!
    War 2 Movie Story: సోషల్‌ మీడియాలో ‘వార్‌ 2’ స్టోరీ లీక్‌.. గూస్‌ బంప్స్‌ తెప్పిస్తున్న కథ!
    టాలీవుడ్‌, బాలీవుడ్‌కు చెందిన అగ్రకథానాయకులు ఎన్టీఆర్‌ (NTR), హృతిక్‌ రోషన్‌ (Hrithik Roshan) కలిసి నటిస్తోన్న చిత్రం ‘వార్‌ 2’ (War 2). అయాన్‌ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని యశ్‌రాజ్‌ స్పై యూనివర్స్‌ నిర్మిస్తోంది. ఈ చిత్రంపై దేశంలోని సగటు అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇద్దరు స్టార్‌ హీరోలు నటిస్తున్న ఈ సినిమా అప్‌డేట్‌ కోసం సినీప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా సినిమాకు సంబంధించిన ఓ వార్త నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. ఈ సినిమా కథ ఇదేనంటూ ఓ ప్లాట్‌ (War 2 Movie Story Leak) నెట్టింట చక్కర్లు కొడుతోంది. మరోవైపు తారక్‌ షూటింగ్‌కు సంబంధించి కూడా ఓ అప్‌డేట్‌ బయటకొచ్చింది. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; ‘వార్‌ 2’ కథ అదేనా? 2019లో వచ్చిన బాలీవుడ్‌ చిత్రం 'వార్‌' (War)కు సీక్వెల్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. గతంలో హృతిక్‌కు కోస్టార్‌గా యంగ్‌ హీరో టైగర్ ష్రాఫ్‌ (Tiger Shroff) నటించగా.. పార్ట్‌ 2లో తారక్‌ కనిపించబోతున్నాడు. లేటెస్ట్‌ బజ్‌ ప్రకారం ఈ సినిమా కథ ఇదేనంటూ నెట్టింట ఓ ప్లాట్‌ వైరల్ అవుతోంది. దాని ప్రకారం ‘వార్‌ 2’ అనేది ఇద్దరు స్నేహితుల కథ. అర్జునుడు - కృష్ణుడిలా కలిసి మెలిసి ఉండే ఇద్దరు స్నేహితులు.. చివరికీ శత్రువులుగా మారితే ఎలా ఉంటుంది? అన్న కాన్సెప్ట్‌తో ఈ సినిమా రానుందట. అయితే దీనిపై చిత్ర యూనిట్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇదిలా ఉంటే ఇందులో తారక్‌, హృతిక్‌ మధ్య వచ్చే యాక్షన్‌ సీక్వెన్స్‌ నెవర్‌ బీఫోర్‌గా ఉంటాయని బాలీవుడ్‌ వర్గాలు చర్చించుకుంటున్నాయి.&nbsp; తారక్‌ షూట్‌ హైదరాబాద్‌లోనే! 'వార్‌ 2'లో హృతిక్‌ రోషన్‌ పాత్రకు సంబంధించి కొన్ని యాక్షన్స్‌ సీక్వెన్స్‌ను ఇటీవల తెరకెక్కించారు. సినిమాకు సంబంధించిన గత షెడ్యూల్‌లో వీటిని ఫినిష్‌ చేశారు. ప్రస్తుతం తారక్‌ రోల్‌కు సంబంధించిన యాక్షన్‌ సీన్స్‌ను తెరకెక్కించేందుకు మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నారట. ఈసారి షెడ్యూల్‌లో ఎన్టీఆర్‌ కూడా పాల్గొంటారని బాలీవుడ్‌ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఏప్రిల్‌ ఫస్ట్‌ వీక్‌ నుంచే తారక్‌కు సంబంధించిన షూటింగ్‌ మెుదలయ్యే అవకాశముందని సమాచారం. అది కూడా హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్‌ సిటీలో ఈ షెడ్యూల్‌ జరగనుందని తెలుస్తోంది. మరి ఈ షూటింగ్‌లో ఎన్టీఆర్‌ ఏ రేంజ్‌ నటనతో ఆకట్టుకుంటాడో చూడాలి.&nbsp; మ్యూజిక్‌ డైరెక్టర్‌ అతడే? 'వార్‌ 2' చిత్రానికి సంబంధించి (War 2 Movie Story Leak) మరో వార్త కూడా తెరపైకి వచ్చింది. ఈ మూవీకి బాలీవుడ్ స్టార్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ ప్రీతమ్‌ స్వరాలు అందించనున్నట్లు సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానుందట. సూపర్‌ హిట్‌ ఆల్బమ్స్‌ ఇచ్చే సంగీత దర్శకుడిగా ప్రీతమ్‌కు బాలీవుడ్‌లో పేరుంది. ఆయన కూడా ఈ చిత్రంలో భాగమైతే సినిమాపై అంచనాలు మరింత పెరగనున్నాయి. ఇకపోతే ఈ మూవీలో హృతిక్‌ రోషన్‌ పోషించబోయే పాత్ర పేరు కబీర్ అని తెలుస్తోంది. వచ్చే ఏడాది ఆగస్టు 15న విడుదల ‘వార్‌ 2’ను విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.&nbsp; 'వార్‌ 2'లో మరో స్టార్‌ హీరో! ఈ సినిమాలో మరో బాలీవుడ్ స్టార్ జాన్ అబ్రహం (John Abraham) నటించనున్నారు. ఇతడిది కూడా ప్రతినాయకుడి పాత్రేనని అంటున్నారు. భారీ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో.. హృతిక్ రోషన్‌కు జోడీగా కియారా అద్వానీ (Kiara Advani) కనిపించనుంది. కానీ, ఎన్టీఆర్‌కి జోడీగా చేయబోయే హీరోయిన్ గురించి ఇంకా క్లారిటీ రాలేదు. మరి భారీ అంచనాల మధ్య వస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి.
    మార్చి 25 , 2024
    War 2: ఎన్టీఆర్ ‘వార్ 2’ చిత్రంపై క్రేజీ అప్‌డేట్‌.. పూర్తిగా లుక్‌ మార్చిన తారక్&nbsp;
    War 2: ఎన్టీఆర్ ‘వార్ 2’ చిత్రంపై క్రేజీ అప్‌డేట్‌.. పూర్తిగా లుక్‌ మార్చిన తారక్&nbsp;
    భారతీయ సినీ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా ‘వార్ 2’ (War 2). YRF (Yash Raj Films) స్పై యూనివ‌ర్స్‌లో 6వ చిత్రంగా రానుండటంతో అంచనాలు భారీ స్థాయిలో పెరిగిపోయాయి. ఇటీవల ‘బ్ర‌హ్మ‌స్త’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన అయాన్ ముఖ‌ర్జీ.. ‘వార్‌ 2’ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇండియన్ సూపర్ హీరో హృతిక్ రోష‌న్‌, టాలీవుడ్ స్టార్ హీరో జూ.ఎన్టీఆర్ (Jr NTR) ఈ సినిమాలో నటించనున్నారు. 'ఆర్ఆర్ఆర్' లాంటి గ్లోబల్ హిట్ తర్వాత ఎన్టీఆర్ నేరుగా చేస్తున్న తొలి బాలీవుడ్ మూవీ కావడంతో హిందీతో పాటు తెలుగులోనూ ఈ ప్రాజెక్టుపై భారీ హైప్ నెలకొంది. 2019లో హృతిక్, టైగర్ ష్రాఫ్ ప్రధాన పాత్రలో నటించిన ‘వార్’కి సీక్వెల్‌గా ఈ చిత్రం రానుంది. అయితే తాజాగా హృతిక్‌, తారక్‌లకు సంబంధించి సాలిడ్‌ అప్‌డేట్‌ బయటకు వచ్చింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది.&nbsp; హృతిక్‌, తారక్‌ షూట్‌ ఎప్పుడంటే! ‘వార్‌ 2’ (War 2) చిత్రంలో కీలక పాత్రలు పోషించనున్న హృతిక్‌ రోషన్‌ (Hrithik Roshan), తారక్‌ (Jr NTR) షూటింగ్‌కు సంబంధించి క్రేజీ అప్‌డేట్‌ నెట్టింట వైరల్ అవుతోంది. దీని ప్రకారం 'వార్‌ 2'లో హృతిక్‌కు సంబంధించిన సన్నివేశాలను జపాన్‌లో చిత్రీకరించనున్నారు. షావోలిన్‌ టెంపుల్‌ దగ్గర హృతిక్ ఎంట్రీ సీన్స్‌ తెరకెక్కిస్తారని టాక్‌ వినిపిస్తోంది. మార్చి 7 నుంచి షూటింగ్‌ ప్రారంభమవుతుందని సమాచారం. ఇక తారక్ విషయానికి వస్తే అతడు ఏప్రిల్‌లో షూటింగ్‌లో జాయిన్‌ అవుతాడని బాలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. వచ్చే నెల నుంచి తారక్‌-హృతిక్‌కు సంబంధించిన యాక్షన్‌ సన్నివేశాలు తెరకెక్కిస్తారని అంటున్నారు.&nbsp; గాయం నుంచి కోలుకున్న హృతిక్‌! బాలీవుడ్‌ స్టార్‌ హృతిక్ రోషన్‌.. వార్ 2 చిత్రం కోసం గత కొంతకాలం నుంచి వర్కౌట్స్‌ చేస్తున్నాడు. పర్ఫెక్ట్ బాడీ షేప్ పొందేందుకు జిమ్‌లో కష్టపడుతున్నాడు. ఈ క్రమంలోనే రెండు వారాల క్రితం ఆయన జిమ్‌ చేస్తూ గాయపడ్డాడు. దీంతో అనుకున్న దానికంటే ‘వార్‌ 2’ షూట్‌ కాస్త ఆలస్యమైంది. ప్రస్తుతం హృతిక్‌ పూర్తి ఫిట్‌గా ఉండటంతో మార్చి 7 నుంచి ఆయనకు సంబంధించిన సన్నివేశాలను షూట్‌ చేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకు హృతిక్‌ కూడా ఓకే చెప్పడంతో మూవీ యూనిట్‌ జపాన్‌లో వాలిపోయేందుకు సిద్ధమవుతోంది.&nbsp; https://twitter.com/i/status/1764908346640040382 ‘వార్‌ 2’లో తారక్‌ గెటప్‌ అదేనా? కొరటాల దర్శకత్వంలో రూపొందుతున్న ‘దేవర’ (Devara) చిత్రంలో ప్రస్తుతం తారక్‌ నటిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించి వరుస షెడ్యూల్స్‌లో పాల్గొంటూ బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఇందులో తారక్‌కు జోడీగా బాలీవుడ్‌ స్టార్‌ నటి జాన్వీ కపూర్‌ (Janhvi Kapoor) నటిస్తోంది. అయితే తాజాగా బెంగళూరులో జరిగిన ఓ పార్టీకి తారక్‌ సతీసమేతంగా హాజరయ్యాడు. అక్కడ తారక్‌ లుక్‌ చూసి అంతా ఫిదా అయ్యారు. మెున్నటి వరకూ కాస్త లావుగా కనిపించిన తారక్‌.. లేటెస్ట్‌ ఫొటోల్లో బరువు తగ్గి చాలా స్లిమ్ అయ్యారు. దేవరలో ఎన్టీఆర్ ద్విపాత్రిభినయం చేస్తున్నారని వార్తలొస్తున్న తరుణంలో ఎన్టీఆర్‌ ఇలా మారి ఆ గాసిప్స్‌ను కన్ఫార్మ్‌ చేశారని ఫ్యాన్స్‌ అంటున్నారు. మరోవైపు ‘వార్‌ 2’లోనూ తారక్‌ ఇదే గెటప్‌లో కనిపించబోతున్నట్లు సమాచారం. ‘వార్‌ 2’ రిలీజ్ ఎప్పుడంటే? భారీ బడ్జెట్‌తో రూపొందనున్న 'వార్‌ 2' చిత్రం విడుదల తేదీని నిర్మాణ సంస్థ యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. 2025 ఆగ‌ష్టు 14న ఇండిపెండెన్స్ డే కానుక‌గా ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. ఇందులో ఎన్టీఆర్ నెగెటివ్ షేడ్స్‌తో కూడిన పాత్ర‌లో క‌నిపించ‌బోతున్న‌ట్లు సమాచారం ఉంది. హృతిక్ రోష‌న్‌కు ధీటుగా ప‌వ‌ర్‌ఫుల్‌గా అత‌డి క్యారెక్ట‌ర్ సాగుతుంద‌ని స‌మాచారం. అటు బాలీవుడ్‌ స్టార్‌ హీరో జాన్‌ అబ్రహం కూడా ‘వార్‌ 2’లో కీలక పాత్ర పోషించనున్నాడు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్‌గా న‌టించ‌నుంది.&nbsp;
    మార్చి 05 , 2024
    Tollywood: ఎక్కువ భాషల్లో రీమేక్‌ అయిన తెలుగు బ్లాక్‌ బాస్టర్‌ చిత్రాలు ఇవే!
    Tollywood: ఎక్కువ భాషల్లో రీమేక్‌ అయిన తెలుగు బ్లాక్‌ బాస్టర్‌ చిత్రాలు ఇవే!
    భారత చలనచిత్ర పరిశ్రమలో రీమేక్ అనేది సర్వసాధారణంగా మారిపోయింది. సహజంగా ఒక భాషలో విజయం సాధించిన చిత్రాన్ని కంటెంట్‌ బాగుంటే మరో భాషలోకి రిమేక్‌ చేస్తుంటారు. కొత్త నటీనటులను పెట్టి వారి నేటివిటికి అనుగుణంగా ఆ చిత్రాన్ని నిర్మిస్తుంటారు. బాలీవుడ్‌, టాలీవుడ్‌, కోలీవుడ్‌, మలయాళం, భోజ్‌పూరి, బెంగాలి పరిశ్రమల్లో ఇలా పదుల సంఖ్యలో చిత్రాలు వచ్చాయి. అయితే ఇతర ఇండస్ట్రీలతో పోలిస్తే టాలీవుడ్‌ (Telugu movies that have been remade in most languages) నుంచే ఏటా ఎక్కువ సినిమాలు ఇతర భాషల్లోకి రీమేక్ అవుతుంటాయి. ఈ క్రమంలోనే ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ చిత్రం.. ఏకంగా తొమ్మిది భాషల్లో రీమేక్ అయ్యి ఇటీవల సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ నేపథ్యంలో తెలుగులో రూపొంది మూడు లేదా అంతకంటే ఎక్కువ లాంగ్వేజెస్‌లో రీమేక్‌ అయిన చిత్రాలు ఏవో ఇప్పుడు చూద్దాం.&nbsp; నువ్వొస్తానంటే నేనొద్దంటానా (Nuvvostanante Nenoddantana) టాలీవుడ్‌లో వచ్చిన 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' (2005) చిత్రం.. తొమ్మిది భాషల్లో రీమేకైన తొలి తెలుగు చిత్రంగా రికార్డు క్రియేట్‌ చేసింది. ఈ చిత్రం 7 భారతీయ భాషల్లో (తమిళం, కన్నడ, హిందీ, ఒడియా, మణిపురి, పంజాబీ, బెంగాలీ), 2 విదేశీ భాషల్లో (బంగ్లాదేశ్‌ బెంగాలీ, నేపాలి) భాషల్లో అనువదింప బడింది. తెలుగులో సిద్ధార్థ్‌, త్రిష, శ్రీహరి నటించిన ఈ చిత్రాన్ని డ్యాన్స్ మాస్టర్‌ ప్రభుదేవా డైరెక్ట్ చేశారు. ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపింది.&nbsp; ఒక్కడు (Okkadu) మహేష్‌ బాబు (Mahesh Babu) హీరోగా గుణశేఖర్‌ (Gunasekhar) దర్శకత్వంలో వచ్చిన ఈ తెలుగు సినిమా కూడా 5 భాషల్లోకి రీమేక్ అయ్యింది. తమిళం, కన్నడ, బెంగాలీ, హిందీ, ఒడియా భాషల్లో రిమేక్‌ చేయబడి అక్కడ కూడా మంచి విజయాన్ని అందుకుంది. తమిళంలో స్టార్ హీరో విజయ్ (Vijay) 'గిల్లీ' పేరుతో ఈ సినిమాను రీమేక్‌ చేయగా.. కన్నడలో 'అజయ్‌' పేరుతో పునీత్‌ రాజ్‌కుమార్‌ (Punit Raj Kumar) నటించాడు.&nbsp; మర్యాద రామన్న (Maryada Ramanna) దర్శకధీరుడు రాజమౌళి (SS Rajamouli) రూపొందించిన ‘మర్యాద రామన్న’ చిత్రం కూడా ఐదు భాషల్లో రీమేక్ కావడం విశేషం. సునీల్‌ (Sunil) హీరోగా చేసిన ఈ చిత్రం కన్నడ, బెంగాలీ, హిందీ, తమిళం, మలయాళం భాషల్లో రీమేక్ అయ్యింది. అక్కడా ఈ సినిమా విజయాన్ని అందుకోవడం గమనార్హం. హిందీలో ‘సన్‌ ఆఫ్‌ సర్దార్‌’ పేరుతో రాజమౌళినే ఈ సినిమాను తెరకెక్కించడం విశేషం. ఇందులో అజయ్‌ దేవగన్‌, సంజయ్‌ దత్, సోనాక్షి సిన్హా ముఖ్య పాత్రలు పోషించారు.&nbsp; వర్షం (Varsham) ప్రభాస్‌ (Prabhas), త్రిష (Trisha) జంటగా 2004లో వచ్చిన సూపర్‌ హిట్‌ చిత్రం 'వర్షం'. శోభన్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కూడా ఎక్కువ భాషల్లో రూపొందింది. ఒడియాలో ‘మై డార్లింగ్‌’ (2004), తమిళంలో ‘మజాయ్‌’ (2005), హిందీలో ‘భాగీ’ (2016) పేరుతో రిలీజై మంచి ఆదరణ పొందింది.&nbsp; ఛత్రపతి (Chatrapathi) ప్రభాస్‌ (Prabhas) హీరోగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఛత్రపతి చిత్రం టాలీవుడ్‌లో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. నిర్మాతలకు మూడు రెట్లు లాభాలను అందించింది. అయితే మూడు భాషల్లో రీమేక్‌ అయ్యింది. కన్నడ, బెంగాలి భాషల్లో రిఫ్యూజ్‌ పేరుతో విడుదల కాగా, హిందీలో రీసెంట్‌గా ఛత్రపతి పేరుతోనే విడుదలైంది. వి.వి వినాయక్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బెల్లంకొండ శ్రీనివాస్‌ హీరోగా చేశాడు. అయితే ఈ సినిమా హిందీలో డిజాస్టర్‌గా నిలిచింది. పోకిరి (Pokiri) మ‌హేష్ బాబు (Mahesh Babu) హీరోగా పూరీ జ‌గ‌న్నాథ్ (Puri Jagannadh) డైరెక్ష‌న్ లో వ‌చ్చిన ఈ పోకిరి సినిమా.. 4 భాష‌ల్లో రిమేక్ అయ్యింది. తమిళంలో విజయ్‌ హీరోగా ‘పొక్కిరి’ (2007), హిందీలో సల్మాన్‌ ఖాన్ హీరోగా 'వాంటెడ్‌' (2009), కన్నడలో దర్శన్‌ హీరోగా ‘పొర్కి’ (2010) పేరుతో ఈ సినిమా విడుదలై ఘన విజయం సాధించింది. ఉర్దూలోనూ ఈ సినిమా రీమేక్ అయినప్పటికి కొన్ని కారణాల వల్ల విడుదల కాలేదు. అయితే హిందీలో ఈ సినిమాకు ప్రభుదేవ దర్శకత్వం వహించడం విశేషం.&nbsp; డార్లింగ్‌ (Darling) ప్రభాస్‌ హీరోగా 2010లో వచ్చిన ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌ను ఏ. కరుణాకరణ్‌ తెరకెక్కించారు. ఈ సినిమా సూపర్‌ హిట్‌ సాధించడంతో పలు భాషలకు చెందిన దర్శక నిర్మాతలు ఈ సినిమాను రీమేక్ చేశారు. కన్నడలో దర్షన్‌&nbsp; హీరోగా 'బుల్‌బుల్', హిందీలో 'సబ్సే బధాకర్‌ హమ్‌' పేరుతో రీమేకై అక్కడ కూడా విజయాన్ని అందుకుంది. బెంగాలీలోనూ ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ పనులు మెుదలు కాగా కొన్ని కారణాల వల్ల సినిమా ఆగిపోయింది.&nbsp; విక్రమార్కుడు (Vikramarkudu) రవితేజ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఆరు భాషల్లో రీమేక్ అయ్యింది. కన్నడలో ‘వీర మదకారి’ (2009), తమిళంలో ‘సిరుతాయ్’ (2011), హిందీలో ‘రౌడీ రాతోడ్‌’ (2012), బంగ్లాదేశ్‌ బెంగాలీలో ‘ఉల్టా పల్టా 69’ (2007), ‘యాక్షన్‌ జాస్మిన్’ (2015) పేర్లతో రెండుసార్లు రీమేక్ అయ్యింది.&nbsp; మిర్చి (Mirchi) ప్రభాస్‌ హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన మిర్చి కూడా మూడు భాషల్లో రీమేక్ అయ్యింది.&nbsp;కన్నడలో 'మాణిక్య', బెంగాలీలో 'బిందాస్‌', ఒడియాలో 'బిశ్వంత్‌'&nbsp; పేర్లతో రిలీజ్‌ అయ్యింది. ఇక హిందీలో ఈ సినిమాకు సంబంధించిన రైట్స్‌ను స్టార్ నటుడు జాన్‌ అబ్రహం దక్కించుకున్నప్పటికీ ఇప్పటివరకూ సినిమా చేయలేదు. ఆడవారికి మాటలకు అర్థాలే వేరులే వెంక‌టేష్ (Venkatesh) హీరోగా సెల్వ రాఘ‌వ‌న్ డైరెక్ష‌న్‌లో వ‌చ్చిన ఈ సినిమా 5 భాష‌ల్లోకి రిమేక్ అయ్యింది. త‌మిళం, బెంగాలీ, భోజ్‌పురి, క‌న్న‌డ‌, ఒడియా భాష‌ల్లోకి రిమేక్ చేయ‌బ‌డింది. అన్ని భాష‌ల్లో సూప‌ర్ హిట్‌గా నిలిచింది.
    మార్చి 23 , 2024
    Mansi Taxak: యానిమల్‌లో బాబీ డియోల్ భార్యగా నటించిన ఈ బ్యూటీ ఎవరో తెలుసా?
    Mansi Taxak: యానిమల్‌లో బాబీ డియోల్ భార్యగా నటించిన ఈ బ్యూటీ ఎవరో తెలుసా?
    యానిమల్ సినిమాలో బాబీ డియోల్ మూడో భార్యగా నటించిన మాన్సి టాక్సాక్( Mansi Taxak ) ఇప్పుడో సోషల్ మీడియాలో టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారింది. సినిమాలో ఆమె పాత్ర నిడివి చాలా తక్కువైనా ప్రేక్షకులపై చాలా ఇంపాక్ట్ కలిగించింది.&nbsp; యానిమల్ సినిమాలో కొత్త పెళ్లి కూతురుగా అబ్రంను (బాబీ డియోల్‌) పెళ్లి చేసుకుంటుంది. ఆ తర్వాత వెంటనే అబ్రం.. అందరూ చూస్తుండగా ఆమెపై బలత్కారం చేసి తన క్రూరత్వాన్ని చూపిస్తాడు. ప్రస్తుతం ఆమె గ్లామర్‌పై సినిమా చూసిన ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. మాన్సి టాక్సక్ గురించి నెట్టింట్లో సెర్చ్ చేస్తున్నారు.&nbsp; ఆమె బ్యాక్‌గ్రౌండ్, ఏజ్, బాయ్‌ ఫ్రెండ్ వంటి అంశాలపై ఆరా తీస్తున్నారు. మాన్సి టాక్సక్‌ 1998 జులై 23న ముంబైలో కుల్దీప్ సింగ్ టాక్సాక్, కౌనిక టాక్సాక్ దంపతులకు&nbsp; జన్మించింది. ఆమె విద్యభ్యాసం అంతా గుజరాత్, ముంబైలో జరిగింది. సినిమాల్లోకి రాకముందు మాన్సి టాక్సక్ మోడలింగ్ చేసేది. ఆమె 2019లో&nbsp; 'ఫెమినా మిస్‌ఇండియా' పోటీల్లో పాల్గొని 'మిస్‌ ఇండియా గుజరాత్‌' కిరిటం సాధించింది.&nbsp; ఆ తర్వాత 2022లో ఐ ప్రామిస్‌ అనే షార్ట్ ఫిల్మ్‌ ద్వారా వెండి తెరకు పరిచయమైమంది.&nbsp; ఈ చిత్రం యూట్యూ ఛానెల్‌ క్యూనెట్‌లో రిలీజైంది. ఈ సినిమా తర్వాత బాలీవుడ్ బాద్‌షా నటించిన పఠాన్‌ మూవీలో నటించే అవకాశం దక్కింది.&nbsp; ఆ తర్వాత ది కేరళ స్టోరీ,&nbsp; గదర్ 2 సినిమాల్లోనూ కనిపించింది.&nbsp; మాన్సి నటించిన సినిమాలు బ్లాక్‌బాస్టర్ హిట్లు సాధించడం విశేషం. https://twitter.com/TBSTwizzle/status/1733476252290302005 ఇక మాన్సి టాక్సాక్‌ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. ఆమెకు 2 లక్షల మంది వరకు ఫాలోవర్లు ఉన్నారు. ఎప్పటికప్పుడూ గ్లామర్ ఫోటో షూట్ చేస్తూ కనువిందు చేస్తుంటుంది మాన్సి టాక్సాక్ కాలేజీ డేస్‌లో స్టేట్ లెవెల్ వాలీబాల్ ప్లేయర్. అంతేకాదు జిల్లా స్థాయిలో అనేక బ్యాడ్మింటన్ పోటీల్లో పాల్గొని గెలిచింది. మాన్సి టాక్సాక్‌కు భరత నాట్యం, బెల్లీ డ్యాన్స్‌లో మంచి ప్రావీణ్యం ఉంది. మాన్సికి సామాజిక స్పృహా కూడా ఎక్కువే.&nbsp; దిలే సే ఫౌండేషన్ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలను చేపడుతుంటుంది. అంతేకాదు ఈ కుర్ర హీరోయిన్‌కు హిందీ, ఇంగ్లీష్‌తో పాటు స్పానీష్ భాషలో మంచి ప్రావీణ్యం ఉంది. యానిమల్ సినిమాలో ఈ అమ్మడి గ్లామర్‌కు ఫిదా అయిన బాలీవుడ్ నిర్మాతలు తమ సినిమాల్లో అవకాశాలు ఇచ్చేందుకు క్యూ కట్టారంట. మరోవైపు యానిమల్ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. విడుదలైన 10 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.700కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇండియా వైడ్‌గా రూ.438 కోట్ల వసూళ్లను రాబట్టింది. &nbsp;ఇప్పటివరకు బాలీవుడ్‌లో షారుఖ్ ఖాన్, ఆమిర్ ఖాన్ వంటి అగ్రహీరోల సినిమాలు మాత్రమే రూ.500 కోట్లు రాబట్టాయి. ఇప్పుడు ఆ లిస్ట్‌లో రణ్‌బీర్ కపూర్ సినిమా యానిమల్ యాడ్ అయింది.
    డిసెంబర్ 11 , 2023
    <strong>Mufasa Telugu Trailer: సింహం నోట మహేష్‌ పంచ్ డైలాగ్స్‌.. డబ్బింగ్‌ ఇరగదీశాడు భయ్యా!</strong>
    Mufasa Telugu Trailer: సింహం నోట మహేష్‌ పంచ్ డైలాగ్స్‌.. డబ్బింగ్‌ ఇరగదీశాడు భయ్యా!
    ప్రముఖ హాలీవుడ్‌ నిర్మాణ సంస్థ డిస్నీ తెరకెక్కిస్తున్న ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుల్లో ‘ముఫాసా: ది లయన్‌ కింగ్‌’ (Mufasa The Lion King) ఒకటి. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ చిత్రంలో ఆరోన్‌ స్టోన్‌, కెల్విన్‌ హ్యారిసన్‌ జూనియర్‌ తదితరులు నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా తెలుగు ట్రైలర్‌ విడుదలైంది. ఇందులో కీలకమైన ‘ముఫాసా’ పాత్రకు మహేశ్‌బాబు (Mahesh babu) డబ్బింగ్‌ చెప్పి అదరగొట్టాడు. సింహానికి మహేష్‌ సూపర్బ్‌గా డబ్బింగ్ చెప్పారంటూ సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. ఇంతకీ ట్రైలర్‌ ఎలా ఉంది? అందులో మహేష్‌ చెప్పిన డైలాగ్స్‌ ఏంటి? ఇప్పుడు చూద్దాం.&nbsp; మహేష్‌ వాయిసే హైలేట్‌ ‘ముఫాసా: ది లయన్‌ కింగ్‌’ (Mufasa The Lion King) తెలుగు ట్రైలర్‌ను నిర్మాణ సంస్థ డిస్నీ సోమవారం (ఆగస్టు 26) విడుదల చేసింది. నీకు ఒక క‌థ చెప్పే స‌మ‌యం వ‌చ్చింది. నీలాగే ఉండే చిట్టి సింహాల క‌థ అంటూ ట్రైల‌ర్ ప్రారంభ‌మైంది. పుట్టుక‌తోనే అన్న‌ద‌మ్ములు కాక‌పోయినా ముఫాసా, స్కార్ అనే పేరుతో పిలువ‌బ‌డిన టాకాల క‌థ ఇది అంటూ క‌థ‌లోకి వెళ్లారు. ఆ త‌ర్వాత బాల్యంలో ముఫాసా, టాకాల మ‌ధ్య అనుబంధాన్ని, స్నేహాన్ని చూపించారు. ‘అప్పుడ‌ప్పుడు ఈ చ‌ల్ల‌ని గాలి, నా ఇంటి నుంచి జ్ఞాప‌కాల్ని గుర్తుచేస్తున్న‌ట్లు అనిపిస్తుంది’ అంటూ మ‌హేష్‌బాబు చెప్పిన డైలాగ్ ఆక‌ట్టుకుంది. ‘మ‌నం ఒక్క‌టిగా పోరాడాలి, నేను ఉండ‌గా నీకు ఏం కాదు టాకా, భ‌య‌ప‌డ‌కు’ అంటూ మ‌హేష్ బాబు చెప్పిన ప‌వ‌ర్‌ఫుల్ డైలాగ్స్ ట్రైల‌ర్‌కు హైలైట్‌గా నిలిచాయి. ‘ఇందాకా ఏదో అన్నావే’ అంటూ చివ‌ర‌లో త‌న కామెడీ టైమింగ్‌తో అల‌రించాడు మహేష్‌. ముఫాసా ది ల‌య‌న్ కింగ్ ట్రైల‌ర్ విడుద‌లైన కొద్ది నిమిషాల్లోనే సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది.&nbsp; మ‌హేష్ వాయిస్ కోస‌మైనా సినిమాను థియేట‌ర్ల‌లో చూస్తామంటూ ఫ్యాన్స్‌తో పాటు తెలుగు సినీ లవర్స్‌ కామెంట్స్ చేస్తున్నారు.&nbsp; https://twitter.com/urstrulyMahesh/status/1827943721280631129 ‘ఇది నాకెంతో ప్రత్యేకం’ ముఫాసా తెలుగు ట్రైలర్‌ను మహేష్‌ తన ఎక్స్‌ ఖాతాలో స్వయంగా పోస్టు చేశారు. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘మనకు తెలిసిన, ఇష్టపడే పాత్రకు కొత్త అంకం. తెలుగులో ముఫాసాకు వాయిస్‌ని అందించినందుకు చాలా సంతోషిస్తున్నా. ఈ క్లాసిక్‌కి నేను విపరీతమైన అభిమానిని కావడంతో ఇది నాకెంతో ప్రత్యేకంగా ఉంది’’ అని రాసుకొచ్చారు. అంతకుముందు కూడా డబ్బింగ్‌ చెప్పడంపై మహేష్‌ మాట్లాడారు. ‘డిస్నీ అంటే నాకెంతో గౌరవం. ముఫాసా తన కుమారుడిని నడిపించే తండ్రిగానే కాకుండా అడవికి గొప్ప రాజుగా అందరినీ ఆకర్షిస్తాడు. డిస్నీతో కలిసి వర్క్‌ చేయడం నాకు వ్యక్తిగతంగా చాలా ప్రత్యేకమైనది. దీన్ని నా పిల్లలతో కలిసి ఎంజాయ్‌ చేస్తాను. డిసెంబర్‌ 20న ముఫాసాను నా కుటుంబంతో, అభిమానులతో కలిసి చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’ అంటూ ఆనందం వ్యక్తంచేశారు. తెలుగులో మహేష్‌.. హిందీలో షారుక్‌ ‘ముఫాసా: ది లయన్‌ కింగ్‌’ (Mufasa: The Lion King) హిందీ వెర్షన్‌ ట్రైలర్‌ సైతం ఇటీవల విడుదలైంది. ఇందులో చిట్టి ముఫాసా పాత్రకు బాలీవుడ్‌ బాద్‌ షా షారుక్‌ ఖాన్‌ (Shah Rukh Khan) కుమారుడు అబ్రం (Abram) వాయిస్ అందించారు. ఇదే చిత్రంలో ముఫాసా (పెద్దయ్యాక) పాత్రకు షారుక్‌ ఖాన్‌, సింబా పాత్రకు షారుక్‌ పెద్ద తనయుడు ఆర్యన్‌ ఖాన్‌ (Aryan Khan) వాయిస్‌ ఇవ్వడం విశేషం. ఈ సినిమా గురించి షారుక్‌ మాట్లాడుతూ ‘ముఫాసాకు అద్భుతమైన వారసత్వం ఉంది. అడవికి అతడే రారాజుగా నిలుస్తాడు. ఒక తండ్రిగా ఆ పాత్ర నా మనసుకు చేరువైంది. బాల్యం నుంచి రాజుగా ఎదగడం వరకూ ముఫాసా జీవితం ఎలా సాగిందనే విషయాన్ని ఈ సినిమా తెలియజేస్తుంది. 2019లో వచ్చిన ది లయన్‌ కింగ్‌ తర్వాత మరోసారి ఈ పాత్ర కోసం వర్క్‌ చేయడం ప్రత్యేకంగా ఉంది. మరీ ముఖ్యంగా నా పిల్లలతో కలిసి వర్క్‌ చేయడం ఆనందంగా అనిపిస్తోంది’ అని అన్నారు. కాగా, ముఫాసా చిత్రాన్ని తెలుగు, హిందీ, ఇంగ్లీషుతో పాటు తమిళంలోనూ భారీగా రిలీజ్ చేయనున్నారు.&nbsp; https://www.youtube.com/watch?v=oelsxH0orHI మహేష్‌కు డబ్బింగ్‌ కొత్త కాదు.. కానీ! ముఫాస పాత్రకు డబ్బింగ్‌ చెప్పడం మహేష్‌ బాబుకు ఇదే తొలిసారి కాదు. ఆయన గతంలో రెండు చిత్రాలకు తన వాయిస్ అందించారు. పవన్‌ కల్యాణ్‌ నటించిన 'జల్సా', తారక్‌ హీరోగా చేసిన 'బాద్‌షా' చిత్రాలకు బ్యాక్‌గ్రౌండ్‌లో మహేష్‌ తన వాయిస్‌ను ఇచ్చారు. అయితే అవి ఒక పాత్రకు చెప్పినవి కాదు. పాత్రను ఎలివేట్‌ చేసే క్రమంలో మహేష్‌ వాయిస్‌ ఇచ్చారు. అయితే మహేష్‌ ఒక పాత్రకు పూర్తిగా డబ్బింగ్‌ చెప్పడం ఇదే తొలిసారి. మరి తన వాయిస్‌తో ఏమేరకు ప్రేక్షకులను మహేష్‌ ఆకట్టుకుంటారో చూడాలి.&nbsp; 'SSMB29'తో బిజీ బిజీ దర్శక ధీరుడు రాజ‌మౌళితో ఓ అడ్వెంచ‌ర‌స్ యాక్ష‌న్ మూవీని మహేష్‌ చేయబోతున్నాడు. ఇందులో మ‌హేష్ కొత్త లుక్‌లో క‌నిపించ‌బోతున్నాడు. ఇందుకోసం లాంగ్‌ హెయిర్‌, గడ్డంతో మ‌హేష్ మేకోవ‌ర్ అవుతున్నాడు. త్వ‌ర‌లోనే మ‌హేష్‌బాబు, రాజ‌మౌళి మూవీ ఆఫీషియ‌ల్‌గా లాంఛ్ కానున్న‌ట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం ప‌లువురు హాలీవుడ్ న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులు ప‌నిచేయ‌బోతున్న‌ట్లు సమాచారం.&nbsp;
    ఆగస్టు 26 , 2024
    <strong>Mahesh Babu Voice To Mufasa: మహేష్‌ గొంతుతో గర్జించనున్న హాలీవుడ్‌ సింహాం ‘ముఫాసా’..!</strong>
    Mahesh Babu Voice To Mufasa: మహేష్‌ గొంతుతో గర్జించనున్న హాలీవుడ్‌ సింహాం ‘ముఫాసా’..!
    టాలీవుడ్‌లో భారీ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉన్న హీరోల్లో సూపర్ స్టార్‌ మహేష్‌ బాబు ముందు వరుసలో ఉంటాడు. దర్శకధీరుడు రాజమౌళితో అతడి తర్వాతి ప్రాజెక్ట్‌ ఉండటంతో ‘SSMB29’పై ఇప్పటినుంచే భారీ అంచనాలు మెుదలయ్యాయి. అయితే రాజమౌళితో సినిమా అంటే అది ఏ స్థాయిలో ఉంటుందో, ఎంత టైమ్‌ తీసుకుంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దీంతో ఇప్పట్లో మహేష్‌ స్క్రీన్‌ ప్రెజెన్స్‌ను చూడలేమన్న బాధలో ఫ్యాన్స్‌ ఉన్నారు. ఈ క్రమంలో ఫ్యాన్స్‌కు మహేష్‌ బాబు అదిరిపోయే సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. ఓ హాలీవుడ్‌ మూవీ తెలుగు వెర్షన్‌కు వాయిస్ ఓవర్‌ ఇచ్చి ఆశ్చర్యపరిచాడు. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; సింహానికి మహేష్ డబ్బింగ్‌ ప్రముఖ హాలీవుడ్‌ నిర్మాణసంస్థ డిస్నీ తెరకెక్కిస్తున్న ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుల్లో ‘ముఫాసా: ది లయన్‌ కింగ్‌’ (Mufasa: The Lion King) ఒకటి. చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమాను ఇండియాలో భారీగా విడుదల చేసేందుకు మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారు. ఇందులో భాగంగా వివిధ ఇండస్ట్రీలకు చెందిన స్టార్‌ నటులతో ముఫాసా అనే సింహం పాత్రకు డబ్బింగ్‌ చెప్పించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో తాజాగా డిస్నీ ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. ఇందులో ముఫాసా పాత్ర తెలుగు వెర్షన్‌కు స్టార్‌ హీరో మహేశ్‌ బాబు (Mahesh Babu) డబ్బింగ్‌ చెప్పనున్నట్లు తెలిపింది. దీని తెలుగు ట్రైలర్‌ ఈనెల 26న ఉదయం 11. 07 గంటలకు విడుదల చేయనున్నట్లు స్పష్టం చేసింది. దీంతో ఆ ట్రైలర్ కోసం మహేష్‌ ఫ్యాన్స్‌తో పాటు సినీ లవర్స్‌ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.&nbsp; https://twitter.com/taran_adarsh/status/1826142693149327810 డబ్బింగ్‌పై మహేష్‌ ఏమన్నారంటే? ‘ముఫాసా: ది లయన్‌ కింగ్‌’ యానిమేషన్‌ చిత్రంలో మెయిన్‌ లీడ్‌కు డబ్బింగ్‌ చెప్పడంపై సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు స్పందించాడు. ‘డిస్నీ అంటే నాకెంతో గౌరవం. ముఫాసా తన కుమారుడిని నడిపించే తండ్రిగానే కాకుండా అడవికి గొప్ప రాజుగా అందరినీ ఆకర్షిస్తాడు. డిస్నీతో కలిసి వర్క్‌ చేయడం నాకు వ్యక్తిగతంగా చాలా ప్రత్యేకమైనది. దీన్ని నా పిల్లలతో కలిసి ఎంజాయ్‌ చేస్తాను. డిసెంబర్‌ 20న తెలుగులో ‘ముఫాసా: ది లయన్‌ కింగ్‌’ను బిగ్‌ స్క్రీన్‌పై నా కుటుంబంతో, అభిమానులతో కలిసి చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’ అంటూ ఆనందం వ్యక్తంచేశారు. కాగా ఈ మూవీలో ఆరోన్‌ స్టోన్‌, కెల్విన్‌ హ్యారిసన్‌ జూనియర్‌ తదితరులు నటిస్తున్నారు. క్రిస్మస్ కానుకగా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్‌ కానుంది. హిందీలో డబ్బింగ్ ఎవరంటే? ‘ముఫాసా: ది లయన్‌ కింగ్‌’ (Mufasa: The Lion King) హిందీ వెర్షన్‌ ట్రైలర్‌ ఇటీవల విడుదలైంది. ఇందులో చిట్టి ముఫాసా పాత్రకు బాలీవుడ్‌ బాద్‌ షా షారుక్‌ ఖాన్‌ (Shah Rukh Khan) కుమారుడు అబ్రం (Abraham) వాయిస్ అందించారు. ఇదే చిత్రంలో ముఫాసా (పెద్దయ్యాక) పాత్రకు షారుక్‌ ఖాన్‌, సింబా పాత్రకు షారుక్‌ పెద్ద తనయుడు ఆర్యన్‌ ఖాన్‌ (Aryan Khan) వాయిస్‌ ఇవ్వడం విశేషం. తన పిల్లలతో కలిసి ఒక సినిమా కోసం వర్క్‌ చేయడంపై షారుక్‌ ఇటీవల ఆనందం వ్యక్తం చేశారు.&nbsp; ‘ముఫాసా' తనకు ఎంతో ప్రత్యేకమైనదని చెప్పుకొచ్చారు. కాగా, ముఫాసా చిత్రాన్ని తెలుగు, హిందీ, ఇంగ్లీషుతో పాటు తమిళంలోనూ భారీగా రిలీజ్ చేయనున్నారు.&nbsp; https://www.youtube.com/watch?v=oelsxH0orHI మహేష్‌కు డబ్బింగ్‌ కొత్త కాదు.. కానీ! ముఫాస పాత్రకు డబ్బింగ్‌ చెప్పడం మహేష్‌ బాబుకు ఇదే తొలిసారి కాదు. ఆయన గతంలో రెండు చిత్రాలకు తన వాయిస్ అందించారు. పవన్‌ కల్యాణ్‌ నటించిన 'జల్సా', తారక్‌ హీరోగా చేసిన 'బాద్‌షా' చిత్రాలకు బ్యాక్‌గ్రౌండ్‌లో మహేష్‌ తన వాయిస్‌ను ఇచ్చారు. అయితే అవి ఒక పాత్రకు చెప్పినవి కాదు. పాత్రను ఎలివేట్‌ చేసే క్రమంలో మహేష్‌ వాయిస్‌ ఇచ్చారు. అయితే మహేష్‌ ఒక పాత్రకు పూర్తిగా డబ్బింగ్‌ చెప్పడం ఇదే తొలిసారి. మరి తన వాయిస్‌తో ఏమేరకు ప్రేక్షకులను మహేష్‌ ఆకట్టుకుంటారో చూడాలి.&nbsp;
    ఆగస్టు 21 , 2024
    Mrunal Thakur: మృణాల్ లేత అందాలు.. టైట్ డ్రెస్‌లో హాట్ బంప్స్
    Mrunal Thakur: మృణాల్ లేత అందాలు.. టైట్ డ్రెస్‌లో హాట్ బంప్స్
    యంగ్‌ బ్యూటీ మృణాల్‌ ఠాకూర్‌.. మరోమారు మత్తెక్కించే అందాలతో సోషల్‌ మీడియాను హీటెక్కించింది. కళ్లు చెదిరే స్కిన్‌ షోతో నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.&nbsp; తాజాగా ‘69వ ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు’ (69th Filmfare Awards)వేడుకల్లో పాల్గొన్న మృణాల్‌.. అక్కడ తన గ్లామర్‌తో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. టైట్‌ఫిట్‌ డ్రెస్‌లో ఎద అందాలను చూపిస్తూ వీక్షకులను ఫిదా చేసింది. ప్రస్తుతం మృణాల్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. #MrunalThakur హ్యాష్‌టాగ్‌తో అవి వైరల్‌ అవుతున్నాయి. https://twitter.com/i/status/1751880621524484350 ‘సీతారామం’ (Sitaramam) సినిమాతో సూపర్‌ క్రేజ్‌ తెచ్చుకున్న మృణాల్‌ ఠాకూర్‌ (Mrunal Thakur).. ప్రస్తుతం వరుసగా అవకాశాలు దక్కించుకుంటూ బిజీ బిజీగా ఉంటోంది. ఇటీవల బాలీవుడ్‌ మీడియాతో మాట్లాడిన మృణాల్‌ (69th Filmfare Awards) ఆసక్తికర కామెంట్స్‌ చేసింది. కెరీర్ పరంగా ఎదుగుతున్నా హిందీలో మాత్రం పెద్ద సినిమాలలో అవకాశాలు రావడం లేదని వాపోయింది. ముఖ్యంగా రొమాంటిక్‌ సినిమాల్లో ఆఫర్లు రావట్లేదని మృణాల్‌ స్పష్టం చేసింది. కొందరు రొమాంటిక్‌ సినిమాలంటే ఇష్టం లేదని అంటారని.. కానీ అవే చూస్తారని పేర్కొంది.&nbsp; ఇక ఈ భామ తెలుగు లేటెస్ట్‌ మూవీ 'హాయ్‌ నాన్న' మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా కోసం ఆమె దాదాపు రూ.3 కోట్ల రెమ్యూనరేషన్‌ తీసుకున్నట్లు ఇండస్ట్రీలో టాక్‌.&nbsp; ప్రస్తుతం తెలుగులో విజయ్‌ దేవరకొండ సరసన మృణాల్‌ నటిస్తోంది. పరుశురామ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి విజయ్‌నే మృణాల్‌ను రిఫర్ చేశాడని సమాచారం.&nbsp; ఇక తమిళ్‌ స్టార్‌ శివ కార్తికేయన్‌ మూవీలోనూ ఈ బ్యూటీకి అవకాశం దక్కిందట. దర్శకుడు మురగదాస్‌ ఈ సినిమా రూపొందనున్నట్లు తెలుస్తోంది. అనిరుధ్‌ రవిచందర్‌ ఈ సినిమాకు సంగీతం అందిస్తారని టాక్. ఇక మృణాల్ వ్యక్తిగత విషయాలకు వస్తే.. ఆమె 1 ఆగస్టు 1992న మహారాష్ట్రలోని ధూలేలో జన్మించింది.&nbsp; మృణాల్.. ముంబైలోని KC కాలేజీ డిగ్రీ చేస్తుండగానే టెలివిజన్‌ రంగం వైపు అడుగులు వేశారు. ఈ క్రమంలో ‘కుంకుమ్ భాగ్య’ సీరియల్‌లో నటించి మృణాల్‌ పాపులర్ అయ్యింది. 2014లో విడుదలైన మరాఠీ చిత్రం ‘విట్టి దండు’తో సినీ రంగ ప్రవేశం చేసింది. 2019లో వికాస్ బహ్ల్ బయోపిక్ ‘సూపర్ 30’ నటించి బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. 2020లో నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చిన ‘ఆంథాలజీ ఘోస్ట్ స్టోరీస్‌’లోనూ మృణాలు మెరిసింది. ఇందులో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. అదే సంవత్సరం జాన్ అబ్రహంతో కలిసి 'గల్లన్ గోరియా' అనే మ్యూజిక్ వీడియోలోనూ ఈ బ్యూటీ తళుక్కుమంది. 2021లో రాకేష్ ఓంప్రకాష్ మెహ్రా దర్శకత్వం వహించిన ‘తూఫాన్’ అనే స్పోర్ట్స్ డ్రామాలో మృణాల్‌ నటించింది.&nbsp; ఆ తర్వాత షాహిద్‌ కపూర్‌తో కలిసి ‘జెర్సీ’ సినిమా రీమేక్‌లో ఆమె కనిపించింది. అయితే ఈ చిత్రం ఫ్లాప్‌ టాక్ తెచ్చుకుంది.&nbsp;
    జనవరి 29 , 2024

    @2021 KTree