UATelugu2h 34m
బసవ(సోనూసూద్) పాలనలో ఉన్న ధర్మస్థలిలో అధర్మం రాజ్యమేలుతుంటుంది. ఆ సమయంలో ఆచార్య(చిరంజీవి) అక్కడకి వస్తాడు. బసవ, అతని మనుషులు చేసే అరాచకాలను ఆచార్య ఎలా ఎదురించాడు. అసలు ధర్మస్థలికి ఆచార్య ఎందుకు వస్తాడు? పాదఘట్టం సంరక్షకుడిగా ఉన్న సిద్ధకు ఆచార్యకు మధ్య సంబంధం ఏమిటి అనేది మిగిలిన కథ
ఇంగ్లీష్‌లో చదవండి
మూవీ & ఓటీటీ అప్‌డేట్స్
స్ట్రీమింగ్ ఆన్Primeఫ్రమ్
Watch
రివ్యూస్
How was the movie?
@maheshYadavv
1 year ago
తారాగణం
చిరంజీవి
కామ్రేడ్ ఆచార్యరామ్ చరణ్
కామ్రేడ్ సిద్ధపూజా హెగ్డే
నీలాంబరిసోనూ సూద్
బసవజిషు సేన్‌గుప్తా
రాథోడ్సౌరవ్ లోకేష్
రాథోడ్ సోదరుడునాసర్
అదన్నాఅజయ్
వేదన్నతనికెళ్ల భరణి
పూజారివెన్నెల కిషోర్
ఆచార్య శిష్యుడుసివిఎల్ నరసింహారావు
బెనర్జీ
కామ్రేడ్ బోస్శత్రు
ఖిల్లారవి ప్రకాష్
శివుడుపవన్
బసవ హెంచ్మెన్రఘు బాబు
డ్రగ్ సప్లయర్ (బసవ హెంచ్‌మెన్)రాజా రవీందర్
బసవ హెంచ్మెన్భరత్ రెడ్డి
రణధీర్ రెడ్డి
ప్రియదర్శి పులికొండ
సుమన్
శుభలేఖ సుధాకర్
చరణ్ రాజ్
రాజా చెంబోలు
సత్య ప్రకాష్
సత్యప్రకాష్సత్యదేవ్ కంచరణా
సిద్ధ తండ్రి (అతి అతిథి పాత్ర)సంగీత క్రిష్
లాహే లాహే పాటలో నర్తకిసిబ్బంది
కొరటాల శివ
దర్శకుడునిరంజన్ రెడ్డినిర్మాత
నిరంజన్ రెడ్డినిర్మాత
మణి శర్మ
సంగీతకారుడుతిర్రు
సినిమాటోగ్రాఫర్నవీన్ నూలి
ఎడిటర్ర్కథనాలు
మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
స్వయంకృషితో సినీ ఇండస్ట్రీలో అగ్రస్థానానికి ఎదగ వచ్చని నిరూపించిన వ్యక్తి ఆయన. టాలీవుడ్ బాక్సాఫీస్‌ను పరుగులు పెట్టించిన ఆచార్యుడు. కొత్త టాలెంట్ ఉన్న యువకులకు అండగా నిలబడే 'అన్నయ్య' ఆయన. కోవిడ్ సమయంలో ఎంతో మందికి సాయం చేసిన ఆపాద్బాంధవుడు. ఆయనెవరో కాదు మన మెగాస్టార్ చిరంజీవి. పద్మవిభూషణుడిగా వెలుగొందుతూ.. భావితరాలకు స్ఫూర్తి నింపుతున్న చిరంజీవిగారి గురించి చాలా మందికి తెలియని కొన్ని విషయాలు ఇప్పుడు చూద్దాం..
చిరంజీవి అసలు పేరు?
కొణిదెల శివశంకర్ వరప్రసాద్
చిరంజీవి ఎత్తు ఎంత?
5 అడుగుల 7 అంగుళాలు
చిరంజీవి నటించిన తొలి సినిమా?
ప్రాణం ఖరీదు, (చిరంజీవి నటింటిన తొలి చిత్రం పునాది రాళ్లు అయినా.. ప్రాణం ఖరీదు ముందుగా విడులైంది)
చిరంజీవి ఎక్కడ పుట్టారు?
పశ్చిమ గోదావరి, మొగల్తూరు, ఆంధ్రప్రదేశ్
చిరంజీవి పుట్టిన తేదీ ఎప్పుడు?
1955 ఆగస్టు 22
చిరంజీవి భార్య పేరు?
ప్రముఖ హాస్య నటుడు అల్లు రామలింగయ్య కూతురు సురేఖను 1980లో పెళ్లి చేసుకున్నారు.
చిరంజీవి అభిరుచులు?
చిరంజీవికి ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం. వీలు చిక్కినప్పుడల్లా ప్రకృతి అందాలను తన కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటాడు
చిరంజీవికి మెగాస్టార్ బిరుదు ఎవరు ఇచ్చారు?
"సుప్రీమ్ హీరో"గా గుర్తింపు పొందిన చిరంజీవి.. తర్వాత మెగాస్టార్‌గా క్రేజ్ సంపాదించుకున్నాడు. 'మరణ మృదంగం' చిత్రం విజయం తర్వాత ఆ సినిమా నిర్మాత కేఎస్ రామారావు, చిరంజీవిని మెగాస్టార్‌గా పిలవడం ప్రారంభించారు.
చిరంజీవి బ్రేక్ డ్యాన్స్ ఏ సినిమాలో ఫస్ట్ టైం చేశారు?
పసివాడి ప్రాణం చిత్రం ద్వారా చిరంజీవి తొలిసారి తెలుగులో బ్రేక్ డ్యాన్స్ పరిచయం చేశారు
చిరంజీవికి ఇష్టమైన సినిమా?
రుద్రవీణ
చిరంజీవికి ఇష్టమైన పాటలు?
రుద్రవీణ చిత్రంలోని 'నమ్మకు నమ్మకు ఈ రేయిని' పాట అంటే చాలా ఇష్టమని పేర్కొన్నారు.
చిరంజీవి అభిమాన నటుడు?
అమితాబ్ బచ్చన్, శత్రఘ్ను సిన్హా
చిరంజీవికి స్టార్ డం అందించిన చిత్రం?
ఖైదీ
చిరంజీవికి ఇష్టమైన కలర్?
బ్లాక్ అండ్ వైట్
చిరంజీవి తల్లిదండ్రుల పేర్లు?
కొణిదెల వెంకట్రావ్, అంజనా దేవి
చిరంజీవి ఏం చదివారు?
BCom
https://www.youtube.com/watch?v=hURrrR2lMrY
చిరంజీవి ఎన్ని సినిమాల్లో నటించారు?
150కి పైగా సినిమాల్లో నటించారు
చిరంజీవికి ఇష్టమైన ఆహారం?
బొమ్మడాయిల పులుసు, చిన్న చిన్న చెపల్లో చింతకాయ వేసి వండితే ఇష్టంగా తింటారు.
చిరంజీవి నికర ఆస్తుల విలువ ఎంత?
రూ.3000కోట్లు
చిరంజీవి సినిమాకి ఎంత తీసుకుంటారు?
ఒక్కో సినిమాకి దాదాపు రూ.70కోట్లు తీసుకుంటారు.
మార్చి 19 , 2024
Janaka Aithe Ganaka Review: కండోమ్ కంపెనీపై కోర్టుకెళ్లిన హీరో.. ‘జనక అయితే గనక’ ఎలా ఉందంటే?
నటీనటులు : సుహాస్, సంకీర్తన విపిన్, మురళీ శర్మ, రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్, గోపరాజు రమణ, ఆచార్య శ్రీకాంత్ తదితరులు
రచన, దర్శకత్వం : సందీప్ రెడ్డి బండ్ల
సంగీతం : విజయ్ బుల్గానిన్
సినిమాటోగ్రఫీ : సాయి శ్రీరామ్
నిర్మాతలు : దిల్ రాజు, హన్షిత రెడ్డి, హర్షిత్ రెడ్డి
విడుదల తేదీ: అక్టోబర్ 12, 2024
యంగ్ హీరో సుహాస్ వరుసగా చిత్రాలు రిలీజ్ చేస్తూ దూసుకుపోతున్నాడు. వైవిధ్యమైన కథలతో మంచి విజయాలను సాధిస్తున్నాడు. ఈ క్రమంలోనే అతడు నటించిన లేటెస్ట్ చిత్రం ‘జనక అయితే గనక’. ఇందులో సంకీర్తన హీరోయిన్‌గా చేసింది. దిల్‌రాజు ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించింది. సందీప్ బండ్ల దర్శకత్వం వహించారు. అక్టోబరు 12న ఈ మూవీ రిలీజ్ కానుండగా రెండ్రోజుల ముందే ఈ సినిమా ప్రీమియర్స్ వేశారు. మరి ఈ మూవీ ఎలా ఉంది? సుహాస్‌కు మరో విజయాన్ని అందించిందా? ఈ రివ్యూలో చూద్దాం.
కథేంటి
ప్రసాద్ (సుహాస్) మధ్య తరగతి వ్యక్తి. తండ్రి తనకు బెస్ట్ ఇవ్వలేకపోవడంతో తాను మాత్రం తన పిల్లలకి అన్నీ విషయాల్లో ది బెస్ట్ ఇవ్వాలని అనుకుంటాడు. రూ.30 వేల జీతానికి పని చేసే ప్రసాద్ ది బెస్ట్ ఇచ్చే స్థోమత లేకపోవడంతో పెళ్లై రెండేళ్లు అవుతున్నా పిల్లలు వద్దనుకుంటాడు. ప్రసాద్ భార్య (సంగీత విపిన్) కూాడా ఇందుకు అంగీకరిస్తుంది. ప్రసాద్ తండ్రి (గోపరాజు రమణ) కూడా ఈ విషయంలో సైలెంట్ అయిపోతాడు. అయితే అనూహ్యంగా ప్రసాద్ భార్యకి ప్రెగ్నెన్సీ వస్తుంది. దీంతో కండోమ్ సరిగ్గా పని చేయలేదని భావించిన ప్రసాద్ సదరు కంపెనీపై కేసు వేస్తాడు. తర్వాత ఈ కేసు ఎలాంటి మలుపు తీసుకుంది? ప్రసాద్ లైఫ్‌లో వచ్చిన మార్పులు ఏంటి? ఈ కేసు ప్రసాద్ గెలిచాడా? లేదా? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎవరెలా చేశారంటే
మధ్యతరగతి హీరో పాత్రలో మరోమారు సుహాస్ అదరగొట్టాడు. తన నటనతో ప్రేక్షకులను మరోసారి మెప్పించేశాడు. పిల్లలు వద్దు అని మంకు పట్టు పట్టిన వాడు తండ్రైతే ఎలా ఉంటుందో కళ్లకు కట్టినట్లు చూపించాడు. ప్రసాద్ భార్య పాత్రలో సంకీర్తన అద్భుత నటన కనబరిచింది. భర్త చెప్పిన మాటను జవదాటని ఇల్లాలిగా ఆమె నటన ఆకట్టుకుంటుంది. రాజేంద్ర ప్రసాద్, మురళీ శర్మ, వెన్నెల కిషోర్ పాత్రలు సైతం మెప్పిస్తాయి. నటీనటులు అందరూ తమ పాత్రలకు పూర్తిగా న్యాయం చేశారు.
https://twitter.com/TheAakashavaani/status/1843884507679863162
డైరెక్షన్ ఎలా ఉందంటే
కథ విషయంలో డైరెక్టర్ సందీప్ రెడ్డి బండ్ల వంద మార్కులు కొట్టేశాడు. రొటిన్ సినిమాలకు భిన్నంగా కొత్తగా మూవీని ప్రజెంట్ చేసే ప్రయత్నం చేశారు. సాధారణ మధ్యతరగతి వాడి బతుకు ఎలా ఉంటుంది? పెళ్లైన తరువాత వాడు పడే తిప్పల్ని, ఖర్చుల్ని లెక్కలతో సహా కళ్లకి కట్టారు. అయితే బిడ్డ కడుపులో పడ్డాక వచ్చే కొన్ని సన్నివేశాలను హృదయానికి హత్తుకునేలా చూపించారు. పిల్లలు వద్దనుకునే జంటకు ఈ కథ బాగా కనెక్ట్ అయ్యేలా తీశారు. అటు కోర్టు సన్నివేశాలను సైతం ఎంతో సరదాగా తెరకెక్కించి ఆడియన్స్‌కు గిలిగింతలు పెట్టారు దర్శకుడు. కొన్ని కోర్టు సీన్లు, పిల్లల ఖర్చుల విషయంలో లాజిక్‌లు మిస్ అయినా కామెడీతో వాటిని నెట్టుకొచ్చేశారు. ఊహాకందేలా కథనం సాగడం, పెద్దగా ట్విస్టులు లేకపోవడం మైనస్‌గా చెప్పవచ్చు.
సాంకేతికంగా
టెక్నికల్ అంశాలకు వస్తే సినిమాటోగ్రఫీ బాగుంది. నేపథ్యం సంగీతం ఈ సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. పాటలు గుర్తుంచుకునేలా లేవు. ఎడిటింగ్ వర్క్ ఓకే. నిర్మాణ విలువలు చాలా ఉన్నతంగా ఉన్నాయి. ఖర్చు విషయంలో నిర్మాతలు రాజీ పడలేదు.
ప్లస్ పాయింట్స్
కథలో కొత్తదనంసుహాస్ నటనకామెడీసంగీతం
మైనస్ పాయింట్స్
మెరుపులు లేకపోవడంఊహాజనితంగా స్టోరీ సాగడం
Telugu.yousay.tv Rating : 3/5
అక్టోబర్ 10 , 2024
Jr NTR Records: ఓటమి ఎరుగని హీరోగా తారక్.. ప్రభాస్ సైతం వెనక్కి తగ్గాల్సిందే!
జూ.ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. తొలి మూడు రోజుల్లోనే రూ.300 కోట్లు కొల్లగొట్టిన ఈ చిత్రం ప్రస్తుతం రూ.500 కోట్ల క్లబ్‌లో చేరేందుకు వడి వడిగా అడుగులు వేస్తోంది. ఇందులో తారక్‌కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ చేసింది. విలన్‌గా బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ నటించారు. అయితే ‘దేవర’ మూవీ తారక్‌కు సంబంధించిన అనేక ఆసక్తికర విషయాలను తెరపైకి తీసుకొచ్చింది. ప్రభాస్ వంటి గ్లోబల్ స్టార్‌కు సాధ్యం కానీ విజయాన్ని తారక్‌కు అందించింది. అటు ఫ్లాప్ దర్శకులకు తారక్ ఓ వరమని మరోమారు నిరూపించింది. ఆ విశేషాలేంటో ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.
ఫ్లాప్ డైరెక్టర్లతో హిట్స్!
టాలీవుడ్‌లోని ఫ్లాప్ డైరెక్టర్స్ పాలిట జూ.ఎన్టీఆర్ ఓ దేవుడిలా మారాడని చెప్పవచ్చు. భారీ డిజాస్టర్‌తో ఫేమ్ కోల్పోయిన డైరెక్టర్లు తారక్‌తో ఓ సినిమా చేస్తే మునుపటి క్రేజ్‌ను తిరిగి పొందడం ఖాయంగా కనిపిస్తోంది. రీసెంట్‌గా దేవర విషయంలోనూ ఇదే నిరూపితమైంది. దర్శకుడు కొరటాల శివ గతంలో తీసిన ‘ఆచార్య’ చిత్రం డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. అసలు కొరటాల శివ చిత్రమేనా అంటూ పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అటువంటి డైరెక్టర్‌కు ఛాన్స్ ఇచ్చి దేవరతో సాలిడ్ విజయాన్ని అందుకున్నాడు తారక్. అంతకుముందు ఫ్లాప్‌లతో ఉన్న పూరి జగన్నాథ్‌కు 'టెంపర్'తో సక్సెస్ ఇచ్చాడు. ‘1: నేనొక్కడినే’ పరాజయంతో ఢీలా పడిపోయిన సుకుమార్‌తో ‘నాన్నకు ప్రేమతో’ మూవీ తీసి గాడిలో పెట్టాడు. రవితేజతో ఫ్లాప్ అందుకున్న బాబీకి ‘జై లవకుశ’తో మంచి హిట్ ఇచ్చాడు. ‘అజ్ఞాతవాసి’తో భారీ డిజాస్టర్ అందుకున్న త్రివిక్రమ్‌కు ‘అరవింద సామెత’తో సక్సెస్ అందించాడు. ఇలా ఫ్లాప్ డైరెక్టర్లకు వరుసగా హిట్స్ ఇచ్చి సరికొత్త రికార్డును తారక్ క్రియేట్ చేస్తున్నాడు.
ఒకే ఒక్క హీరోగా తారక్
హీరోల కెరీర్‌లో హిట్స్, ఫ్లాప్స్ అనేవి సర్వ సాధారణం. ఎంత పెద్ద స్టార్ హీరో అయినా తీసిన ప్రతీ సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారన్న నమ్మకం లేదు. గ్లోబల్ స్టార్ ప్రభాస్ సైతం బాహుబలి తర్వాత ‘సాహో’, ‘రాధేశ్యామ్’, ‘ఆదిపురుష్’ చిత్రాలతో ఫ్లాప్ అందుకున్న వాడే. అయితే తారక్ మాత్రం గత తొమ్మిదేళ్లుగా ఒక్క ఫ్లాప్ లేకుండా ఇండస్ట్రీలో దూసుకుపోతున్నాడు. ఆయన చేసిన గత 7 చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బాస్టర్స్‌గా నిలిచాయి. ‘టెంపర్’, ‘నాన్నకు ప్రేమతో’, ‘జనతా గ్యారేజ్’, ‘జై లవకుశ’, ‘అరవింద సమేత’, ‘RRR’, ‘దేవర’ వంటి చిత్రాలు మంచి విజయాలను సాధించాయి. ఈ జనరేషన్ హీరోల్లో ఈ ఘనత సాధించిన ఏకైక హీరోగా తారక్ నిలవడం విశేషం. ఫ్యూచర్‌లో ‘దేవర 2’, ప్రశాంత్ నీల్‌తో ‘NTR 31’, సందీప్ రెడ్డి వంగాతో ఓ చిత్రం (గాసిప్) వంటి బిగ్ ప్రాజెక్ట్స్ ఉండటంతో తారక్ జైత్రయాత్ర ఇకపైనా కొనసాగే అవకాశముంది.
23 ఏళ్ల ఫ్లాప్ రికార్డు బద్దలు
దర్శకధీరుడు రాజమౌళి (SS Rajamouli)తో సినిమా చేస్తే బ్లాక్ బాస్టర్ పక్కా అని అందరికీ తెలిసిందే. అదే సమయంలో జక్కన్నతో సినిమా చేసిన తర్వాత ఏ హీరో కూడా వెంటనే హిట్ కొట్టిన దాఖలాలు లేవు. అయితే 'దేవర'తో తారక్ ఈ ఫ్లాప్ సెంటిమంట్‌ను బీట్ చేశాడు. రాజమౌళితో 'RRR' చేసిన తారక్ వెంటనే ‘దేవర’తో సాలిడ్ విజయాన్ని అందుకున్నాడు. రాజమౌళి ఫస్ట్ ఫిల్మ్ ‘స్టూడెంట్ నెం.1’తో ఈ ఫ్లాప్ సెంటిమెంట్‌కు శ్రీకారం చుట్టిన తారక్ స్వయంగా తానే దీనిని బ్రేక్ చేయడం విశేషం. అది కూడా 23 క్రితం స్టూడెంట్ నెం.1 రిలీజైన రోజున దేవరను తీసుకొచ్చి రాజమౌళి సెంటిమెంట్‌ను బద్దలు కొట్టాడు.
రైతు పాత్రలో తారక్!
తారక్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రానున్న 'NTR 31' ప్రాజెక్ట్‌ను మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ నిర్మించనున్నాయి. ఈ సినిమాకు సంబంధించి ఓ బజ్ టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం రూపొందనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రంలో తారక్ రైతుగా కనిపిస్తాడని అంటున్నారు. కథ మెుత్తం బంగ్లాదేశ్ నేపథ్యంలో సాగుతుందని చెబుతున్నారు. అక్కడ వ్యవసాయం చేసుకుంటూ జీవించే యువకుడు అనుకోని సంఘటనల కారణంగా స్థానికుల కోసం ఎలాంటి పోరాటం చేశాడన్న కాన్సెప్ట్‌తో ఇది తెరకెక్కనున్నట్లు టాక్. ఇందులో తారక్‌ను రెండు వేరియేషన్స్‌లో ప్రశాంత్ నీల్ చూపించనున్నట్లు తెలుస్తోంది. తారక్ క్యారెక్టరైజేషన్, పెర్ఫార్మెన్స్ గత చిత్రాలకు భిన్నంగా నెక్స్ట్ లెవల్లో ఉంటాయని ఫిల్మ్ వర్గాల సమాచారం.
హీరోయిన్‌గా రష్మిక?
దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ‘NTR 31’ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. ప్రధాన తారాగణం కూర్పుకు సంబంధించి వర్క్ చేస్తున్నారు. ఇందులో తారక్‌కు జోడీగా రష్మిక మందన్నను తీసుకునే యోచనలో ప్రశాంత్ నీల్ ఉన్నట్లు సమాచారం. ఇదే జరిగితే తారక్-రష్మిక కాంబోలో రానున్న తొలి చిత్రం ఇదే కానుంది. NTR 31 చిత్రాన్ని 2026 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని డైరెక్టర్ భావిస్తున్నారట. దీనికి అనుగుణంగా త్వరలోనే షూటింగ్ ప్రారంభించాలని ఆయన భావిస్తున్నారుట. ఈ మూవీకి రవి బస్రూర్ మ్యూజిక్ అందిస్తుండగా సినిమాటోగ్రాఫర్ బాధ్యతలు భువన్ గౌడ భుజాలకు ఎత్తుకోబోతున్నాడు.
అక్టోబర్ 04 , 2024
Devara Dialogues : గూస్‌బంప్ తెప్పించిన దేవర టాప్ డైలాగ్స్ ఇవే
జూ.ఎన్టీఆర్ (Jr.NTR) హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ డ్రామా ‘దేవర’. జాన్వీకపూర్ (Janhvi Kapoor) కథానాయిక. జూ.ఎన్టీఆర్ చాలా సంవత్సరాల తర్వాత ద్విపాత్రాభినయం చేశాడు. ఇందులో ఆయన దేవర, వర పాత్రలు పోషించాడు. సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడిగా, ప్రకాశ్‌రాజ్, శ్రీకాంత్, షైన్ టామ్ చాకో కీలక పాత్రలు పోషించారు.
సినిమా కథను కొరటాల చాలా జాగ్రత్తగా రాసుకున్నారు. ఆచార్య అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని తెరకెక్కించినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా సినిమా డైలాగ్స్ చాలా ప్రభావవంతంగా ఉన్నాయి. సినిమా పూర్తైన తర్వాత కూడా ఆ డైలాగ్స్ వెంటాడుతాయి.
ముఖ్యంగా జూ.ఎన్టీఆర్, ప్రకాశ్ రాజ్, సైఫ్ అలీఖాన్, జాన్వీకపూర్ ఆయ పాత్రలకు అనుగుణంగా చెప్పే డైలాగ్స్ విజిల్స్ కొట్టిస్తాయి.
[toc]
బైరా(సైఫ్ అలీ ఖాన్) డైలాగ్:
“ఎర్ర సముద్రం కాడికి వచ్చి రక్తం గురించి మాట్లాడుతుండావా.. నాకు చావు గురించి చెబుతుండావా”
అక్కడి నుంచి తప్పించుకున్న అజయ్, ప్రకాశ్ రాజ్ దగ్గరికి వెళ్లినప్పుడూ…
ప్రకాశ్ రాజ్ డైలాగ్: కొండ మీదకొచ్చి భయపెడుదామనుకున్నావా
అజయ్ : ఎవడ్రా నువ్వు
ప్రకాశ్ రాజ్: సింగప్పా.. నువు దిగివచ్చిన కొండ మీద తూర్పు దిక్కున ఉంటాను
అజయ్: నేను ఇక్కడికో పనిమీద వచ్చాను. పెద్దాయనవి, మీ వాళ్లకు ఓ మాట చెప్పి ఒప్పించగలవా..!
సముద్రంపై పడవలో వెళ్తున్న సమయంలో వచ్చే డైలాగ్స్…
అజయ్ తన డైమండ్ ఉంగరం కోసం సముద్రంలో దూకి.. లోపల ఆస్తి పంజరాలు చూసి భయపడినప్పుడు.. ప్రకాశ్ రాజ్ చెప్పే డైలాగ్ బాగుటుంది.
ప్రకాశ్ రాజ్: “వజ్రపు ఉంగరం దొరికిందా? సముద్రంలో నీకు కానొచ్చిన దాని భయంతో వజ్రం గుర్తుకు రాలే.! ఈ భయమే నీలాంటి వాళ్లు ఎంత మంది వచ్చినా, ఎంత ఆశ చూపినా, ఇక్కడ ఉన్నవాళ్లు ఈ సముద్రం జోలికి మాత్రం రారు.”
ప్రకాశ్ రాజ్ దేవరను పరిచయం చేస్తూ చెప్పే డైలాగ్ ఫ్యాన్స్‌తో విజిల్స్ వేయిస్తుంది.
అజయ్: కళ్లు మూసినా, తెరిసినా సముద్రంలో చూసిందే కనిపిస్తోంది. అసలు ఎవరు వాళ్లంతా.. ఎవరు చేశారు ఇదంతా?
ప్రకాశ్ రాజ్: “చాలా పెద్ద కథ సామీ, రక్తంతో సంద్రమే ఎరుపెక్కిన కథ“
అజయ్: ఎవరి కథ
ప్రకాశ్ రాజ్: పడి పడి లేచే సముద్రం మీద పడకుండా నిలబడిన వాడి కథ.. మా దేవర కథ.
“భయం పోవాలంటే దేవుడి కథ వినాలా, భయం అంటే ఏంటో తెలియాలంటే దేవర కథ వినాలా”
”కులం లేదు, మతం లేదు, భయం లేదు వారికి తెలిసింది ధైర్యమే”
దేవర… తన కొడుకు వరంకు తన తండ్రి గురించే చెప్పే సందర్భంలోని డైలాగ్స్ కూడా బాగుంటాయి.
(Devara Movie Dialogues)
వరం(జూ.ఎన్టీఆర్): అబ్బా ఎప్పుడూ మీ నాన్న కథలు, వాళ్ల నాన్న కథలు చెబుతుంటావ్..! మా నాన్న కథ చెప్పు దేవర కథ చెప్పు నాకు!
దేవర: తరువాత తరానికి చెప్పుకునేటంత కథలు కావురా.. మీ నాయనవి. మా నాయనోళ్లవి దేశం కోసం పోరాడిన వీరుల కథలు. మావీ.. ఎవ్వరికీ చెప్పుకోలేని చీకటి కథలు, బతికున్నామే గాని, భావితరాలకు కథలుగా చెప్పుకునేలా ఈ బతుకులు మారుతాయో లేదో మాకుడా తెలియదు.
దేవర తొలిసారి ఆయుధ వ్యాపారులకు ఎదురు తిరిగిన సందర్భంలో వచ్చే సీన్‌లో డైలాగ్స్ పవర్‌ఫుల్‌గా ఉంటాయి.
దేవర: మా ఆయుధాల లెక్కే ఇందులో కూడా ఆయుధాలు ఉన్నాయంటావ్
“మా ఆయుధాలు మంచిని చెడు నుంచి కాపాడటానికి పుట్టాయ్.. మీ ఆయుధాలు మంచిని చంపడానికి పుట్టాయ్..”
విలన్: మాటలు ఎక్కువ అవుతున్నాయ్, సముద్రం ఎక్కాలా, సముద్రం ఎలాలా?
దేవర గ్యాంగ్‌లోని కొండ ఎదురు తిరిగినప్పుడు ఎన్టీఆర్ చెప్పే డైలాగ్ సూపర్బ్‌గా ఉంటుంది.
Jr Ntr Dialogues- Devara
దేవర:
“చేసే పని తప్పని తెలిసినా మన అవసరం కోసం చేస్తున్నావ్ అనుకున్నా, ఇప్పుడు అదే అలవాటుగా మారి తప్పుడు పనులు మన రక్తంలో ఇంకిపోయాయని ఇప్పుడే అర్ధం అవుతా ఉండాది.“
“మనిషికి బతికేంత ధైర్యం చాలు, చంపేంత ధైర్యం కాదు”. కాదు కూడదు అని మీరు మళ్లీ ఆ ధైర్యాన్ని కూడగడితే..ఆ ధైర్యాన్ని చంపే భయాన్ని అవుతా..!
“దేవర అడిగినాడంటే.. సెప్పినాడనిఅదే సెప్పినాడంటే”…
ఇంటర్వెల్ బ్యాంగ్‌కు ముందు ఎన్టీఆర్ యాక్షన్ సీక్వెన్స్ ఉంటుంది. తన మీద దాడికి వచ్చిన వారందర్ని దేవర చంపేస్తాడు. సముద్రం దేవర చంపిన వ్యక్తుల రక్తంతో ఎర్రగా మారుతుంది.అప్పుడు దేవర ఓ బండపై రాసిన డైలాగ్స్ మంచి కిక్ ఇస్తాయి
ధైర్యం ఎక్కువై తప్పుడు పనులు చేస్తున్నా, మనోళ్లే కదా మాట చెబితే మారుతారు అనుకున్నా..
కానీ, భయం అంటే ఏమిటో తెలియని మృగాలుగా మారిపోయారు అని అర్థమై ఉండాది
మీ కళ్లముందు ఉంటే భగవంతుడికి, భూతానికి కూడా భయపడరు
అందుకే ఈరోజు నుంచి వాళ్లలెక్క మీ నుండి దూరంగా వెళ్లిపోయి.. కానరాని భయాన్ని అయితా..
భయం మరిచి ఎప్పుడైనా తప్పుడు పనికోసం సంద్రం ఎక్కితే… సంద్రం ఒడ్డున ఇట్టా పండబెడుతా..!”.
అలాగే సైఫ్ అలి ఖాన్ డైలాగ్స్ కూడా పవర్‌పుల్‌గా ఉంటాయి.
“దేవరను చంపాలంటే సరైనా సమయమే కాదు సరైన ఆయుధం కూడా దొరకాలా..
జాన్వీ కపూర్ డైలాగ్స్
తంగా(జాన్వీకపూర్) వరం(జూ.ఎన్టీఆర్) పిరికితనం గురించి చెప్పే డైలాగ్ కామెడీగా ఉంటాయి.
“వాడికి వాళ్ల అయ్య రూపం వచ్చింది కాని, రక్తం రాలే.. ఎప్పుడు చూడు పిల్లతనం, పిరికితనం వాడితో ఎట్టాగే,
నా మగాన్ని ఆమడ దూరం నుంచి చూసినా.. లోపల నుంచి పొంగాలా.. ఉప్పొంగాలా!!
సొరచెపను చంపి ‘వర’ తీసుకొచ్చాడని ఫ్రెండ్స్ చెప్పినప్పుడు.. తంగం చెప్పే డైలాగ్ నవ్వు తెప్పిస్తుంది.
“ఉందే వాడిలో .. ఉందే ఆడిలో..!నాకు తెలుసూ..ఇంతప్పటి నుంచి చూస్తుండాగాఉందే వాడిలో!!
యంగ్ ఎన్టీఆర్‌ను చూసి జాన్వీ కపూర్ చెప్పే డైలాగ్ కూడా హెలేరియస్‌గా ఉంటుంది.
ఆఆ ఆడా ఆడా.. వీరుడిలెక్క ఆ నడక చూడూ
లోపల పొంగి ఉప్పొంగుతాందే..లోపల
ఎన్టీఆర్, జాన్వీకపూర్ తొలిసారి ఒకరికొకరు ఎదురు పడినప్పుడు వారి మధ్య సాగే సంభాషణ రొమాంటిక్‌గా ఉంటుంది.
తంగం(జాన్వీకపూర్): ఏంది ఇట్లా వచ్చినవ్
వర(ఎన్టీఆర్): రాయప్ప(శ్రీకాంత్)తో పని ఉండి వచ్చినా
తంగం: అబ్బో అప్పుడే మా అయ్యతో మాట్లాడేదాక పోయినావా
ఈరోజు నాకు ఊపిరి ఆగిపోయేలా ఉంది.నా వీరుడు ఆయుధ పూజకు సిద్ధమవుతున్నాడా
ఆయుధ పూజలో మత్తు మందు ఇచ్చి గెలిచిన యంగ్ ఎన్టీఆర్‌ను తక్కువ చేసి విలన్(సైఫ్ అలీ ఖాన్) మాట్లాడినప్పుడు రాయప్ప(శ్రీకాంత్) చెప్పే డైలాగ్ పవర్‌పుల్‌గా ఉంటుంది.
రాయప్ప
ఏమి జరగనట్లు అందరూ అంతా మరచిపోతే మంచిది బైరా..వాళ్లు ఆడు కలిపిన మత్తు మందుకే పడినారంటే.. పొద్దునకళ్లా మత్తు దిగాలా..కానీ, వాళ్లు మంచం కూడా దిగలా..ఆయుధ పూజలో మీరు వాడి కంట్లో బెరుకునే చూసుండారు..కానీ నేను వాడి దెబ్బలో ఒడుపు చూసినా!దేవర లెక్క బలాన్ని చూసినావాడి బలం వాడికి కూడా తెలియక, ఇలా అందర్ని మత్తులో పెట్టి గెలవాలనుకోవడం వాడి పసితనంకానీ ఓ రకంగా మీ అందరికీ, అదే మంచిదిసముద్రం మీద ఒక దేవర ఉన్నాడు చాలుకొండ మీద ఇంకో దేవరను తయారు చేస్తే అది మీకే మంచిది కాదు భైరా
తంగం (జాన్వీ కపూర్ డైలాగ్స్)
“నావళ్ల కావట్లా, అందరికీ మత్తు మందు ఇచ్చి గెలవడం ఏంటే.అక్కా, నా మొగుడంటే..సముద్ర అల అంతా ఊహించుకున్నా నేనువాడేమో.. ఒడ్డుకు చేరే పిల్ల అల మాదిరి ఉన్నాడు”
తంగం స్నేహితురాలు ఓదార్చుతూ చెప్పే డైలాగ్ నవ్వు తెప్పిస్తుంది
అన్ని తెలిసిన దాన్ని చెబుతానా విను
“ప్రతి ఆడదానికి… నచ్చినోడు ఒకడుంటాడువచ్చినోడు ఇంకోడుంటాడువచ్చినోడిలో నచ్చినవాడిని చూసుకునిదీపం ఆర్పేసుకుని కాపురం చేసుకుంటేబతుకు సాఫీగా సాగిపోతది”
Devara Climax Dialogues
క్లైమాక్స్‌లో దేవర గురించి అతని భార్య జోగుల(శ్రుతి మరాఠే)కు ప్రకాశ్ రాజ్ చెప్పే డైలాగ్స్ గూస్ బంప్స్ తెప్పిస్తాయి.
“నీ పెనిమిటి అందర్ని వదిలిపెట్టి ఎప్పుడో పొయినాడు తల్లిదేవర మనల్ని విడిచిపెట్టి ఎప్పుడో చనిపోయాడుఇన్నేళ్లుగా అందర్ని సముద్రంపై తప్పు చేయకుండా భయపెడతా ఉందినీ పెనిమిటి దేవర కాదు..నీ బిడ్డ వరచిన్నప్పటి నుంచి దేవర చెప్పిన కథలు వింటూ పెరిగి ఉండాడేమో..ఈ కొండను బతికించడానికి పెద్ద కథను రాసినాడు నీ బిడ్డఆ మృగాల మాయలోపడి గొర్రె పిల్లాల పోయాడు అనుకున్నావాకాదు తల్లి, వాడిని అడ్డుపెట్టుకుని వెళ్లిన వాళ్లు గొర్రెపిల్లలుసముద్రంలో ఈపాటికి మృగాన్ని వెటాడినట్లు వెటాడుతుంటాడు నీ బిడ్డ!
సెప్టెంబర్ 30 , 2024
Pushpa 2 Second Song: ‘రారా నా సామి’ పాటను బీట్ చేయలేకపోయిన పుష్ప 2 మెలోడి సాంగ్!
అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న భారీ చిత్రం ‘పుష్ప 2’ (Pushpa 2: The Rule). గతంలో వచ్చిన బ్లాక్ బాస్టర్ చిత్రం ‘పుష్ప’ (Pushpa: The Rise)కు సీక్వెల్‌గా ఈ చిత్రం రూపొందుతోంది ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ విడుదల కానుంది. ప్రమోషన్‌లో భాగంగా ఇటీవలే తొలిపాటను విడుదల చేయగా అది జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడు తాజాగా మేకర్స్ రెండో సాంగ్ కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.
సోషల్ మీడియా షేక్
అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న ‘పుష్ప 2 ‘నుంచి సెకండ్ సింగిల్ వచ్చేసింది. ‘సూసేకి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సామీ’ పాటను మేకర్స్ బుధవారం (మే 29) రిలీజ్ చేశారు. ఫోక్ స్టైల్‌లో మాస్ ట్యూన్స్‌తో సాగిన ఈ పాట రిలీజైన కొద్ది క్షణాల్లోనే సోషల్‌మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. చంద్రబోస్ ఈ పాటకు సాహిత్యాన్ని సమకూర్చగా దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అందించాడు. బాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య ఈ సాంగ్‌కు స్టెప్పులు సమకూర్చారు. ఈ సాంగ్‌పై మీరు ఓ లుక్కేయండి.
https://www.youtube.com/watch?v=qxbHtcfHq2s&list=PLTtJUIuknk93P010cakd2jZANGFP70tj9&index=1
సాంగ్‌లో ఏముందంటే?
‘సూసేకి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సామీ’ పాటలో పుష్పరాజ్ (బన్నీ), శ్రీవల్లి (రష్మిక) కెమిస్ట్రీ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ రొమాంటిక్ డ్యూయెట్‌లో ఐకానిక్ డ్యాన్స్ స్టెప్పులతో అల్లు అర్జున్, రష్మిక మందన్న అదరగొట్టారు. గణేష్ ఆచార్య అందించిన స్టెప్పులు చాలా క్యాచీగా ఉన్నాయి. దేవిశ్రీప్రసాద్ క్యాచీ ట్యూన్స్ మెస్మరైజ్‌చేస్తోంది. డైరెక్టర్ సుకుమార్ కూడా సాంగ్ చివర్లో స్టెపులు వేసి అలరించారు. తెలుగు, మలయాళం, కన్నడం, తమిళంతో పాటు మొత్తం ఆరు భాషల్లో సూసేకీ పాటను రిలీజ్ చేశారు. ఆరు భాషల్లోనూ శ్రేయా ఘోషల్ ఈ పాటను పాడటం విశేషం.
రారా నా సామి పాటను మరిపించిందా?
పుష్ప సినిమా నుంచి వచ్చిన ‘రారా నా సామి’ మెలోడి సాంగ్ దేశ వ్యాప్తంగా ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. మాస్, క్లాస్ ఇలా తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ సాంగ్ మెస్మరైజ్ చేసింది. అయితే పుష్ప 2 నుంచి మెలోడి సాంగ్ అనగానే ఫ్యాన్స్ ‘రారా నా సామి’ రేంజ్‌లోనే ఊహించుకున్నారు. అయితే చాలా మందికి ‘సూసేకి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సామీ’ పాట నచ్చినప్పటికీ.. ఓవర్‌గా ఎక్స్‌పెక్ట్ చేసిన కొద్ది మంది మాత్రం పెదవి విరుస్తున్నారు. తమకు సీక్వెల్‌లో సాంగ్ కంటే ‘రారా నా సామి’ పాటే బాగుందని అంటున్నారు. మాస్ ఆడియన్స్‌కు ఈ మెలోడి అంతగా రుచించకవచ్చని కామెంట్స్ చేస్తున్నారు.
రికార్డుల మోత
పుష్ప 2 సినిమా నుంచి మే 1వ తేదీన ఫస్ట్ సింగిల్ లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. పుష్ప.. పుష్ప అంటూ సాగే ఈ టైటిల్ సాంగ్ మాస్ ఆడియన్స్‌ను, మ్యూజిక్ లవర్స్‌ను ఉర్రూతలూగిస్తోంది. యూట్యూబ్‌లో ఈ పాటకు 10 కోట్లకుపైగా వ్యూస్ వచ్చినట్లు పుష్ప 2 మేకర్స్ ఇటీవల ప్రకటించారు. అంతేకాదు 22.6 లక్షల లైక్స్ కూడా వచ్చినట్లు పేర్కొన్నారు. రీసెంట్ టైమ్‌లో తెలుగులో అత్యధిక వ్యూస్‌ను దక్కించుకున్న సాంగ్‌గా పుష్ప ఫస్ట్ సింగిల్ నిలిచింది.
క్లైమాక్స్‌లో భారీ ట్విస్ట్
ప్రస్తుతం ‘పుష్ప 2’ క్లైమాక్స్ చిత్రీకరణ జరుగుతున్నట్లు సమాచారం. ఈ సినిమా క్లైమాక్స్‌లో మేకర్స్ ఊహించని ట్విస్ట్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. పుష్ప 3కి సంబంధించిన సమాచారం క్లైమాక్స్‌లో ఇవ్వనున్నట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. అలాగే ఈ సినిమాలో అదిరిపోయే ఐటెం సాంగ్ కూడా ప్లాన్ చేస్తున్నారని టాక్. యానిమల్ బ్యూటీ తృప్తి డిమ్రి ఈ సాంగ్‌లో ఆడిపాడనున్నారని వార్తలు వస్తున్నాయి. త్వరలోనే సుకుమార్ ఈ పాటను కూడా షూట్ చేసే అవకాశం ఉంది. కాగా, ఈ చిత్రంలో ఫహాద్ ఫాజిల్, సునీల్, అనసూయ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆగస్టు 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
మే 29 , 2024
Chiru Leaks: లీకు రాజా బిరుదుకు చెక్ పెట్టిన మెగాస్టార్.. సినిమా ప్రమోషన్లలో సరికొత్త ట్రెండ్..!
సినిమాను తీయడం ఒక ఎత్తయితే, ఆ సినిమాను ప్రజల్లోకి తీసుకెళ్లడం మరొక ఎత్తు. చిత్రబృందం పడిన కష్టానికి ఫలితం ప్రేక్షకులకు చేరాలంటే సినిమాకు ప్రచారం తప్పనిసరి. ఇలా పబ్లిసిటీ కోసం ప్రత్యేకంగా ఓక బృందమే పనిచేస్తుంది. అయితే, రాను రాను ఇండస్ట్రీలో ట్రెండ్ మారిపోతోంది. ఎవరో అప్‌డేట్స్ లీక్ చేయడం కన్నా.. చిత్రబృందమే వరుసగా అప్‌డేట్స్ ఇస్తూ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియా అర చేతిల్లోకి రావడంతో సినిమాకు కావాల్సిన ప్రచారమూ దక్కుతోంది. ఈ కోవలోకి చెందిందే చిరు లీక్స్. మెగాస్టార్ చిరంజీవి ఈ అప్‌డేట్స్‌ని అధికారికంగా లీక్ చేస్తుండటం ట్రెండ్ సెట్టర్‌గా నిలుస్తోంది.
తప్పుని ఒప్పులా..
మెగాస్టార్ చిరంజీవి మాస్టర్ బ్రెయిన్‌కు చిరు లీక్స్ నిదర్శనం. గతంలో చిరంజీవి పలు లీకులను చేశాడు. ఆచార్య టైటిల్ రివీల్ చేయడం, ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్‌చరణ్ పాత్రకు సంబంధించి అన్యాపదేశంగా చెప్పేశాడు.
https://twitter.com/AKentsOfficial/status/1666764990228107267
పొరపాటున వెల్లడించిన వివరాల వల్ల కొంతవరకు విమర్శలకు గురయ్యారు. కానీ, ఇప్పుడు అదే నెగెటివ్ పాయింట్‌ని పాజిటివ్‌గా మలిచిన నటుడు చిరంజీవి.
లీక్ చేస్తున్నామని అధికారికంగా వెల్లడించి మరీ చెప్తుండటం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. గాడ్‌ఫాదర్ మూవీ నుంచి చిరులీక్స్‌ని అఫీషియల్ చేసేశాడు మెగాస్టార్.
ప్రస్తుతం చిరంజీవి భోళాశంకర్ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్‌ని స్వయంగా మెగాస్టారే రివీల్ చేస్తున్నాడు.
https://twitter.com/MeherRamesh/status/1666809538392240129
ఇతర పీఆర్‌లతో పోలిస్తే చిరుకి ఫాలోయింగ్ కాస్త ఎక్కువే. దీంతో ఎక్కువ మందికి రీచ్ కావడానికి ఈ లీక్స్ ఉపయోగపడుతున్నాయి. అలా గాడ్‌ఫాదర్, వాల్తేరు వీరయ్య సినిమాల నుంచి చేసిన లీక్స్ థియేటర్లకు జనాలను రప్పించాయి.
ఇప్పుడు ఇదే పంథాలో భోళాశంకర్ మూవీ నుంచి మేకింగ్ వీడియోను ఫ్యాన్స్‌కి లీక్ చేశాడు. ఓ సాంగ్ కోసం రూపొందించిన భారీ సెట్ వీడియో ఇది.
ఇందులో ‘జాం జాం జజ్జనిక.. తెల్లార్లు ఆడుదాం తయ్యితక్క’ సాంగ్‌కి చిరు, సుమంత్, తమన్నా, కీర్తి సురేష్ స్టెప్పులేశారు. ఈ పాటను కాసర్ల శ్యాం రాయగా, మహతి స్వర సాగర్ స్వరపరిచాడు. వీజే శేఖర్ మాస్టర్ డ్యాన్స్ కొరియోగ్రఫీ అందించాడు.
సినిమా అనేది కోట్ల రుపాయలతో కూడుకున్న బిజినెస్. సినిమాలోని ఏ విషయం లీకైనా అది మొత్తం సినిమా రెవెన్యూపైనే ప్రభావం చూపిస్తుంది. అందుకే చాలా జాగ్రత్తగా ఉంటూ కాన్ఫిడెన్షియాలిటీని మెయింటేన్ చేస్తూ ఉంటారు సిబ్బంది.
తెలియకుండానే చిరు చేసిన లీక్స్ కారణంగా కొందరు విమర్శించారు. డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లకు తలనొప్పిలా మారాడని పెదవి విరిచారు.
ఇప్పుడు ఇదే సరికొత్త మార్కెటింగ్ స్ట్రాటజీగా మారింది. చిరు నుంచి ఎప్పుడెప్పుడు లీక్స్ వస్తాయా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తుండటం గమనార్హం.
భోళాశంకర్ సినిమాను ఆగస్టు 11న విడుదల చేస్తున్నారు. దీంతో 2 నెలల ముందు నుంచే సినిమా ప్రమోషన్లను తన స్టైల్‌లో మొదలు పెట్టాడు చిరు.
ఒకొక్క లీక్ ఇస్తూ జనాల్లో తన సినిమా ఉండేలా చూసుకుంటున్నాడు. ఇక అధికారిక ప్రచారాలు సపరేటు.
తమిళ సినిమా వేదాళంకు రిమేక్‌గా భోళాశంకర్ తెరకెక్కుతోంది. తెలుగులో మెహర్ రమేశ్ తీస్తున్నాడు. చిరుకు జోడీగా తమన్నా నటించింది. కీర్తి సురేశ్ చిరంజీవి చెల్లెలి పాత్ర పోషించింది.
https://www.youtube.com/watch?v=91RtI6ZG2bc
జూన్ 09 , 2023
Pooja Hegde: పూజాను వెంటాడుతున్న ఫ్లాపులు.. ఐరన్ లెగ్ ట్యాగ్‌కు సల్మాన్ చెక్ పెట్టేనా?
టాలీవుడ్ అగ్ర కథానాయికల్లో పూజా హెగ్డే ఒకరు. 2014లో ‘ఒక లైలా కోసం’ చిత్రం ద్వారా పరిచయమైన ఈ భామ ‘ముకుంద’తో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత బన్నీతో డీజే సినిమాలో నటించిన పూజా.. ఎన్టీఆర్ ‘అరవింద సమేత’, ‘అలా వైకుంఠ పురం’ ద్వారా సాలిడ్ హిట్స్ అందుకుంది. అయితే గత కొంతకాలంగా పూజా హెగ్డేకు సినిమాల పరంగా కలిసిరావడం లేదు. టాలీవుడ్‌లో ఈ భామ చేసిన రీసెంట్ సినిమాలన్నీ ఫ్లాప్‌గా నిలిచాయి.మోస్ట్ ఎలిజిబుల్ బాచిలర్, బీస్ట్, ఆచార్య, రాధేశ్యామ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. దీంతో నెటిజన్లు పూజాపై ఐరన్ లెగ్ ముద్ర వేస్తున్నారు.
అటు బాలీవుడ్‌లోనూ పూజాను ఫ్లాపుల బెడద వెంటాడుతోంది. హృతిక్‌కు జోడీగా మెుహంజదారో చిత్రంలో నటించిన ఈ భామ హిందీలోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వాలని భావించింది. అయితే ఆ సినిమా కూడా బోల్తా పడటంతో పూజా ఆశలు ఆవిరయ్యాయి. హౌస్‌ఫుల్ 4 చిత్రం ద్వారా మరోమారు తన అదృష్టాన్ని పరీక్షించుకున్నప్పటికీ మళ్లీ నిరాశే ఎదురైంది. దీంతో తాజాగా సల్మాన్‌తో నటించిన ‘కిసీ కా భాయ్ కిసీ కా జాన్’ చిత్రంతోనైనా ఐరెన్ లెగ్ ట్యాగ్ చెరిపేసుకోవాలని పూజా భావిస్తోంది. ఈ సినిమా ద్వారా తిరిగి హిట్ల బాట పట్టాలని పూజా కోరుకుంటోంది.
‘కిసీ కా భాయ్ కిసీ కా జాన్’ సినిమా ఏప్రిల్ 21న రిలీజ్ కాబోతోంది. సల్మాన్ స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీగా అంచనాలు పెరిగిపోయాయి. ఈ చిత్రానికి సంబంధించిన ప్రచార చిత్రాలు, పాటల టీజర్లు ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలో రామ్‌చరణ్, వెంకటేష్ ముఖ్య పాత్రల్లో కనిపిస్తుండటం సినిమాపై మరింత క్రేజ్ క్రియేట్ చేసింది. తమిళంలో సూపర్ హిట్‌గా నిలిచిన వీరమ్ సినిమాకు రీమేక్‌గా ఈ చిత్రం రాబోతోంది. ఈ సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుందని సల్మాన్‌తో పాటు డైరెక్టర్ ఫర్హద్ సామ్జీ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు తనపై పడ్డ ఐరన్ లెగ్ ముద్రపై గతంలోనే పూజా హెగ్డే క్లారిటీ ఇచ్చారు. ప్రతీ సినిమా విజయం సాధించాలన్న ఉద్దేశంతోనే కష్టపడి చేస్తానని చెప్పుకొచ్చారు. జయాపజయాలు మన చేతిలో ఉండవని పేర్కొన్నారు.ప్రస్తుతం మహేశ్, త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న SSMB28లో పూజా నటిస్తోంది. ఆ తర్వాత విజయ్ దేవరకొండ సరసన ‘జనగణమన’ చిత్రంలోనూ పూజా హీరోయిన్‌గా చేయనుంది. ఈ రెండు సినిమాలు వచ్చే ఏడాది రిలీజ్ కానున్నాయి.
ఏప్రిల్ 10 , 2023
బాలివుడ్‌ను, ఇండియాను అందుకే వదిలేశా: ప్రియాంక చోప్రా
బాలివుడ్ నుంచి హాలివుడ్‌కు వెళ్లి పాన్ వరల్డ్ స్టార్‌గా ఎదిగిన నటి ప్రియాంక చోప్రా. హిందీ సినీ ప్రపంచంలో అగ్రతారగా ఉన్న ఈ భామ.. ఒక్కసారిగా బాలివుడ్‌ను వదిలేసి అమెరికా బాట పట్టింది. ఇటీవల ఓ పాడ్‌క్యాస్ట్‌లో తాను బాలివుడ్‌ను వదిలేయడానికి గల కారణాలపై ప్రియాంక సంచలన వ్యాఖ్యలు చేసింది. అసలెందుకు ప్రియాంక బాలివుడ్‌ను వీడాల్సి వచ్చింది. ఎవరు ఆమెను ఇబ్బంది పెట్టారు?. షారుఖ్‌తో స్నేహమే ఆమె కొంప ముంచిందా?
హాలివుడ్ ఆరంగేట్రం
2015లో వచ్చిన ‘క్వాంటికో’ అనే టీవీ సీరియల్ ద్వారా ప్రియాంక హాలివుడ్‌లో నటిగా అడుగుపెట్టింది. కానీ అంతకుముందే 'ఇన్ మై సిటీ' మరియు 'ఎక్సోటిక్' వంటి పాటలతో అంతర్జాతీయ వేదికపై ప్రియాంక తన ప్రతిభను ప్రదర్శించింది. ఇక్కడ అగ్రతారగా ఉన్న తాను అసలు పశ్చిమ దేశాలవైపు చూసేలా చేసిన కారణాలను డాక్స్ షెఫెర్డ్ పాడ్‌కాస్ట్ ఆర్మ్‌చెయిర్ ఎక్స్‌పెర్ట్‌లో వివరించింది.
నన్ను బాలివుడ్ వెలివేసింది
బాలివుడ్ తనను కావాలనే వెలివేసిందని ప్రియాంక చోప్రా సంచలన వ్యాఖ్యలు చేసింది. కొందరితో తనకు ఉన్న విభేదాల కారణంగా తనకు సినిమాల్లో అవకాశం రాకుండా చేశారని చెప్పుకొచ్చింది. అప్పుడే తన మేనేజర్ అంజులా ఆచార్య తనకు ఆపద్భాందవుడిలా US మ్యూజిక్ వీడియోల్లో అవకాశాలను పరిచయం చేశాడని ప్రియాంక తెలిపింది. బాలివుడ్ నుంచి ఎలాగైన బయటపడాలనుకున్న తాను ఈ అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకున్నానని పేర్కొంది. బాలివుడ్ పాలిటిక్స్‌కు దూరంగా వెళ్లిపోవాలనే తాను USకు వెళ్లానని చెప్పింది. “ సంగీతం..నన్ను మరో ప్రపంచంలోకి అడుగుపెట్టేందుకు అవకాశం కల్పించింది. సినిమాలు వదిలేయాలని కాదు కానీ అప్పటికే నేను ఎన్నో సినిమాలు చేశా అయినా అవకాశాల కోసం నేల నాకాల్సిన పరిస్థితి. అలా చేయడం నాకు ఇష్టం లేదు.” అంటూ సంచలన ఆరోపణలు చేసింది.
గతంలోనూ
“గతంలో ది రణ్‌వీర్ షోలోనూ బాలివుడ్‌పై ప్రియాంక ఆరోపణలు చేసింది. “కొంతమంది నన్ను కావాలనే పక్కనబెట్టారు. నా కెరీర్‌ను పూర్తిగా నాశనం చేయాలనుకున్నారు.” అంటూ చెప్పింది.
కంగనా ఘాటు స్పందన
బాలివుడ్ మాఫియాపై నిత్యం ఆరోపణలు చేసే కంగనా రనౌత్ ప్రియాంక చోప్రా వ్యాఖ్యలతో మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది. అగ్ర దర్శకుడు కరణ్ జోహార్ వేధింపుల వల్లే ప్రియాంక బాలివుడ్‌ను వదిలేయాల్సి వచ్చిందని కంగనా ఆరోపించింది. షారుఖ్ ఖాన్‌తో ప్రియాంక చోప్రా సన్నిహితంగా ఉండటం సహించలేకపోయిన కరణ్ జోహార్ ఆమెకు అవకాశాలు రాకుండా అడ్డుకున్నాడని ట్విట్టర్ వేదికగా వ్యాఖ్యలు చేసింది. కరణ్ వేధింపులు తాళలేకనే ప్రియాంక ఇండియాను వదిలేసిందని అంది. “ గ్యాంగ్‌లు ఏర్పడి, ప్రియాంక చోప్రా బాలివుడ్‌ను వీడే వరకూ వెంటపడ్డారు. కరణ్ జోహారే ఆమెను బ్యాన్ చేశాడని అందరికీ తెలుసు’ అంటూ కంగనా రాసుకొచ్చింది. “ అసహ్యకరమైన, నీచమైన, విషపూరిత వ్యక్తి సినీ పరిశ్రమ వాతావరణాన్ని నాశనం చేస్తున్నాడు. అతడి గ్యాంగ్, PR మాఫియాపై దాడి చేయాలి” అంటూ కంగనా ఉద్వేగంతో ట్వీట్లు చేసింది.
ప్రియాంక, కంగనా మాత్రమే కాదు బాలివుడ్ గ్యాంగ్, గ్రూపులపై పలువురు ఇతర సెలబ్రిటీలు కూడా పలుమార్లు వ్యాఖ్యలు చేశారు. ఏఆర్ రెహమాన్, రవీనా టాండన్ అందులో కొందరు.
AR రెహమాన్
గతంలో ఏఆర్ రెహమాన్ బాలివుడ్‌లో తక్కువ సినిమాలు చేయడానికి గల కారణాలపై ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “మంచి సినిమాలకు నేనెప్పుడూ నో చెప్పను. కానీ అక్కడొక గ్యాంగ్ ఉంది. అసత్యాలను ప్రచారం చేస్తోంది” అన్నారు.
రవీనా టాండన్
1990,2000 కాలంలో వెండితెరను ఏలిన నటీమణుల్లో రవీనా టాండన్ ఒకరు. ఆమె కూడా సినీ పరిశ్రమలో రాజకీయాల గురించి గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. “ మీ ఓటమిని ముందుగానే ప్లాన్ చేసే కొందరు చెడ్డ వ్యక్తులు ఇక్కడున్నారు. నేను కూడా ఆ పరిస్థితి ఎదుర్కొన్నా. వారు మిమ్మల్ని సినీ పరిశ్రమలో లేకుండా చేయాలని చూస్తారు. ఇవి పక్కా తరగతి రాజకీయాల్లా ఉంటాయి. మీతో ఆడుకుంటారు” అంటూ వ్యాఖ్యలు చేసింది.
అయితే ప్రస్తుతం ప్రియాంక మాత్రం హాలివుడ్‌లో బిజీగా గడుపుతోంది. ఏప్రిల్ 28న ఆమె నటించిన “ సిటాడెల్’ సిరీస్ అమేజాన్ ప్రైమ్ వేదికగా విడుదల కాబోతోంది. ఫరాన్ అక్తర్ దర్శకత్వం వహించే ఓ సినిమాతో బాలివుడ్‌లోనూ తిరిగి అడుగుపెట్టే అవకాశముంది. ఈ సినిమాలో ఆలియా భట్, కత్రినా కైఫ్ కూడా నటిస్తున్నారు.
మార్చి 28 , 2023
Review: ‘బలగం’ ఓ చక్కటి పల్లెటూరి కథాచిత్రం
కమెడియన్ వేణు ఇండస్ట్రీలోకి వచ్చిన చాలా ఏళ్లకు దర్శకుడిగా మారి తీసిన సినిమా ‘బలగం’. తొలి సినిమానే ప్రతిష్టాత్మక నిర్మాత దిల్‌రాజు కాంపౌండ్‌లో తెరకెక్కడం విశేషం. తెలంగాణలో బలగం అంటే బంధుగణం. బంధుత్వాలు, ప్రేమలు, ఆప్యాయతలు, అన్నదమ్ముల ప్రేమలు, పల్లెటూరి మనస్తత్వాలు ఇలా అన్ని రంగరించి ఓ ఎమోషనల్ డ్రామాగా వేణు ఈ సినిమాను తెరకెక్కించాడు. మరి తన ప్రయత్నం ఎంతమేరకు విజయవంతమైందో చూద్దాం.
చిత్రబృందం
నటీనటులు: ప్రియదర్శి, కావ్య కల్యాణ్ రామ్, సుధాకర్ రెడ్డి, రచ్చ రవి, మురళీధర్ గౌడ్, రూప లక్ష్మి, జయరాం, విజయలక్ష్మి, వేణు టిల్లు తదితరులు
దర్శకత్వం: వేణు ఎల్దండి
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
సినిమాటోగ్రఫీ: ఆచార్య వేణు
నిర్మాతలు: హర్షిత్ రెడ్డి, హన్షిత
https://www.youtube.com/watch?v=8R3Vcy5CaPc
కథ:
ఓ పల్లెటూరిలో అందరితో సరదాగా ఉండే ఓ ముసలాయన కొమురయ్య( సుధాకర్ రెడ్డి). అతడి మనవడు సాయిలు (ప్రియదర్శి). విపరీతంగా అప్పులు చేసిన సాయిలు పెళ్లి చేసుకుని ఆ కట్నం డబ్బులతో అప్పు తీర్చాలనుకుంటాడు. కానీ సరిగ్గా వరపూజ రోజున అతడి తాత కొమురయ్య చనిపోతాడు. దీనికి తోడు చావు ఇంట్లో జరిగిన గొడవతో పెళ్లి కూడా ఆగిపోతుంది. ఇదే సమయంలో 20 ఏళ్ల క్రితమే ఊరి నుంచి వెళ్లిపోయిన కొమురయ్య చిన్న కొడుకు, కూతురు (సాయిలు మేనత్త) తండ్రి మరణవార్త విని ఊరికి వస్తారు. సాయిలు మేనత్త తన కూతురు సంధ్యను తీసుకుని వస్తుంది. సంధ్యను చూసి ఇష్టపడిన సాయిలు, తనకు బాగా ఆస్తి కూడా ఉందని తెలుసుని ఎలాగైనా తనని ప్రేమలో పడేయాలనుకుంటాడు. కానీ కర్మ రోజున కొమురయ్య పిండాన్ని ఏ కాకీ ముట్టుకోదు. అక్కడ సాయిలు మామ,బాబాయ్‌ల మధ్య గొడవ జరుగుతుంది. కాకి ముట్టకపోవడం ఊరికి అరిష్టమని భావించిన గ్రామ పెద్దలు.. కొమురయ్య కోరిక తీరకపోవడం వల్లే ఇలా జరుగుతోందని అనుకుంటారు. 11వ రోజు కాకి ముట్టకపోతే వారిని ఊరి నుంచి వెలివేస్తామని హెచ్చరిస్తారు. ఆ తర్వాత జరిగే నాటకీయ పరిణామాలు, తాత చావును సాయిలు ఎలా వాడుకున్నాడు. చివరికి ఏం జరిగింది అనేదే కథ.
ఎలా ఉంది:
చక్కటి తెలంగాణ పల్లెటూరి వాతావరణంలో తెరకెక్కిన సినిమా ‘బలగం’. పల్లెటూరి యాస, సంస్కృతి, అమాయకత్వం, మొండితనం, మూర్ఖత్వం ఇలా అన్ని కోణాలను దర్శకుడు వేణు చక్కగా తెరకెక్కించాడు. తొలి సినిమానే అయినా అలా ఎక్కడా అనిపించదు. ప్రతి పాత్రా చాలా సహజంగా ఉంది. సినిమా చూస్తున్నంత సేపు మనమే ఆ ఊరిలో ఉండి సాయిలును చూస్తున్నట్లు ఉంటుంది. భావోద్వేగాలు, కామెడీ చాలా సహజంగా ఉంటాయి. తెలంగాణ పల్లెటూరిలో ఓ వ్యక్తి చనిపోయినప్పుడు ఉండే పరిస్థితిని చాలా సహజంగా తెరకెక్కించాడు. తాత చావు, ఓ కాకి చుట్టూ కథ నడిపిస్తూ.. కామెడీ పండిస్తూ ప్రేక్షకుడిని ఆకట్టుకుంటాడు. ఫస్టాఫ్ పాత్రల పరిచయం, కామెడీ ఉంటుంది. కొన్ని సీన్లు సాగదీతగా అనిపిస్తాయి. సెకండాఫ్‌లో చివరి 15 నిమిషాల సినిమా కంటతడి పెట్టిస్తుంది. మన ఇంట్లో ఉండే తాత, నాయినమ్మ, అమ్మమ్మలను గుర్తుచేసేలా ఉంటుంది. భావోద్వేగాలు ఎంత చక్కగా పండాయో, కామెడీ కూడా అంతే చక్కగా పండింది.
నటీ నటులు:
సాయిలు పాత్రలో ప్రియదర్శి జీవించాడనే చెప్పాలి. నిజంగా మన ఇంటి పక్క సాయిలును చూసినట్టే ఉంటుంది. హీరోయిన్‌గా కావ్య బాగా నటించింది. సుధాకర్ రెడ్డి పాత్ర కాసేపే ఉన్నా చాలా బాగా చేశారు. రచ్చ రవి తన కామెడీతో మెప్పించాడు. ఇతర నటీ నటులు కూడా తమ పరిధిమేరకు నటించారు.
సాంకేతిక పనితీరు:
దర్శకుడు వేణు తొలి సినిమా అయినా చాలా చక్కగా తెరకెక్కించాడు. స్టార్ క్యాస్ట్ లేకపోయినా సినిమాలో ఉన్న నటులంతా సహజంగా నటించారు. కథనం విషయంలో కాస్త నెమ్మదిగా అనిపిస్తుంది. భీమ్స్ సిసిరోలియే సంగీతం సినిమాకు బాగా ప్లస్ అయింది. ఆచార్య వేణు సినిమాటోగ్రఫీ మెచ్చుకోవాలి. పల్లెటూరి వాతావరణాన్ని కళ్లకు కట్టినట్లు చూపించాడు. సినిమా చాలా సహజంగా కనిపించడానికి వేణు సినిమాటోగ్రఫీ చాలా సాయపడింది. ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది కాసర్ల శ్యామ్ సాహిత్యం గురించి. చివరి 15 నిమిషాలు చక్కటి ఎమోషన్స్ పండాయంటే అందుకు కారణంగా చివర్లో వచ్చే బుర్ర కథ. దీనికి కాసర్ల శ్యామ్ రాసిన లిరిక్స్ నిజంగా అద్భుతంగా ఉంటాయి. ప్రొడక్షన్ పరంగా సినిమాకు ఏ లోటు లేదు.
బలాలు
కథ
కథా నేపథ్యం
భావోద్వేగాలు
కామెడీ
పాటల్లో సాహిత్యం
బలహీనతలు
కొన్ని చోట్ల సాగదీత సీన్లు
స్టార్ క్యాస్ట్ లేకపోవడం
ఒక్కమాటలో
చక్కటి భావోద్వేగాలతో ఉండే పల్లెటూరి కుటుంబ కథా చిత్రం బలగం. ఈ వీకెండ్‌కి ఫ్యామిలీతో కలిసి సినిమాకు వెళ్లాలనుకుంటే ‘బలగం’ మిస్ కాకూడని సినిమా.
రేటింగ్
3/5
మార్చి 03 , 2023
Vishwambhara: జపాన్ వీధుల్లో త్రిషతో చిరంజీవి రొమాన్స్.. ఫ్యాన్స్‌కు కిక్కే కిక్కు!
మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) హీరోగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం 'విశ్వంభర' (Vishwambhara). ఈ సోషియో ఫ్యాంటసీ చిత్రానికి ‘బింబిసార’ (Bimbisara) ఫేమ్ విశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో ప్రముఖ స్టార్ హీరోయిన్ త్రిష (Trisha) చిరుకి జోడీగా నటిస్తోంది. ‘అమిగోస్’ ఆషికా రంగనాథ్, రమ్య పసుపులేటి, సురభి, ఈషా చావ్లా, ఆష్రిత వేముగంటి నండూరి ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం జపాన్‌లో జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించి ఓ క్రేజీ అప్‌డేట్ బయటకొచ్చింది. ప్రస్తుతం అది నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
త్రిషతో చిరు రొమాంటిక్ సాంగ్!
‘విశ్వంభర’ (Viswambhara) టీమ్ ప్రస్తుతం జపాన్‌లో ఉంది. 15 రోజుల షూటింగ్ షెడ్యూల్‌తో హీరో చిరంజీవి సహా దర్శకుడు విశిష్ట ఇతర టీమ్ సభ్యులు రీసెంట్‌గా జపాన్‌లో అడుగుపెట్టారు. షెడ్యూల్‌లో భాగంగా ఇప్పటికే పలు కీలక సన్నివేశాలను మూవీ టీమ్ చిత్రీకరించింది. లేటెస్ట్ బజ్ ప్రకారం ప్రస్తుతం చిరు, త్రిష కాంబోలో ఓ డ్యూయేట్ సాంగ్‌ను షూట్ చేస్తున్నట్లు సమాచారం. ఈ సాంగ్‌లో చిరు, త్రిష జోడీ అదరగొడుతుందని మూవీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా చిరు మేకోవర్ చూస్తే ఆయన 20 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయినట్లు అనిపిస్తుందని అంటున్నారు. త్రిష - చిరంజీవి కెమెస్ట్రీ కూడా సాంగ్‌లో నెక్స్ట్ లెవల్లో వర్కౌట్ అయ్యిందని అంటున్నారు. ఈ సాంగ్ షూట్ అయిపోగానే చిత్ర బృందం హైదరాబాద్‌లో అడుగుపెడుతుందని సమాచారం. ఇదిలా ఉంటే చిరు-త్రిష సాంగ్‌పై వస్తోన్న హైప్ చూసి ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతున్నారు.
18 ఏళ్ల క్రితం ఇదే మ్యాజిక్!
చిరంజీవి - త్రిష జత కట్టడం (Viswambhara Trisha) ఇదేమి తొలిసారి కాదు. 2006లో వచ్చి ‘స్టాలిన్’ సినిమాలో వీరిద్దరు తొలిసారి జోడీగా నటించారు. ఆ తర్వాత వీరు ఏ సినిమాలో కలిసి నటించలేదు. 18 ఏళ్ల తర్వాత తిరిగి ఈ జోడి నటిస్తుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ‘స్టాలిన్’ సమయంలోనే వీరి జోడీకి మంచి మార్కులు పడ్డాయి. వెండి తెరపై వీరి కెమెస్ట్రీ చాలా బాగుందంటూ అప్పట్లో కథనాలు కూడా వచ్చాయి. ఇప్పుడు ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ‘విశ్వంభర’లో చిరు - త్రిష జతకడుతుండటంతో ఈ జోడీ ఈసారి ఏ మ్యాజిక్ చేస్తుందోనన్న ఆసక్తి ఇండస్ట్రీలో నెలకొంది. నిజానికి ‘ఆచార్య’ చిత్రంలోనే చిరుకి జోడీగా త్రిష నటించాల్సి ఉంది. చిత్ర యూనిట్ తొలుత త్రిషనే హీరోయిన్‌గా ప్రకటించింది కూడా. అయితే షూటింగ్ ప్రారంభానికి కొద్ది రోజుల ముందే తాను సినిమా నుంచి తప్పుకుంటున్నట్లు త్రిష వెల్లడించింది.
https://twitter.com/i/status/1849101610762522837
2025 సమ్మర్ బరిలో..
చిరంజీవి - వశిష్ట కాంబోలో రూపొందుతున్న ‘విశ్వంభర’ (Viswambhara) చిత్రం 2025 సమ్మర్‌లో రానున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కావాలి. జనవరి 10న రాబోతున్నట్లు గతంలోనే విశ్వంభర టీమ్ అనౌన్స్ చేసింది. అయితే తనయుడు రామ్ చరణ్ (Ram Charan) నటించిన ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) కోసం చిరు వెనక్కి తగ్గారు. దీంతో గేమ్ ఛేంజర్ సంక్రాంతి బరిలో నిలవగా ‘విశ్వంభర’ సమ్మర్‌కు పోస్టుపోన్ అయినట్లు 2025 మే (Viswambhara Release Date)లో ఈ సినిమాను గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా, గతంలో చిరు నటించిన ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’, ‘అంజి’ సినిమాల తరహాలో సోషియో ఫాంటసీ ఎంటర్ టైనర్‌గా ‘విశ్వంభర’ రూపొందుతోంది.
2024లో చిరుకి గుర్తుండిపోయే మోమోరీస్!
అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi)కి ఈ ఏడాది మరుపురాని జ్ఞాపకాలను అందించింది. మూడు విశిష్టమైన పురస్కారాను మెగాస్టార్ అందుకున్నారు. గత నెల ప్రతిష్టాత్మక ఏఎన్నార్ జాతీయ అవార్డు చిరంజీవిని వరించింది. అక్కినేని నాగార్జున కుటుంబికుల సమక్షంలో బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ ఈ అవార్డు ప్రధానం చేశారు. ఈ ఏడాది జూన్‌లో దేశంలోనే రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్‌ను రాష్ట్రపతి చేతుల మీదగా చిరు అందుకున్నారు. ఈ కార్యక్రమానికి చిరు భార్య సురేఖ, కుమారుడు రామ్‌చరణ్, కోడలు ఉపాసన, కూతురు సుస్మితా హాజరై మురిసిపోయారు. ఇటీవల గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులోను చిరు స్థానం సంపాదించారు. 156 చిత్రాలు.. 537 పాటలు.. 24 వేల స్టెప్పులతో అలరించినందుకు ఆయనకు ఈ రికార్డు దక్కింది.
నవంబర్ 20 , 2024
Pooja Hegde: పూజా హెగ్డేతో నాగచైతన్య రొమాన్స్.. మరి హైట్ సెట్ అవుతుందా?
టాలీవుడ్‌లో కొన్ని కాంబోలకు మంచి ఫ్యాన్ బేస్ క్రియేట్ అవుతుంది. అలాంటి వాటిలో అక్కినేని నాగచైతన్య (Akkineni Naga Chaitanya), అందాల భామ పూజా హెగ్డే (Pooja Hegde) జోడీ కూడా ఒకటి. వీరి కాంబోలో వచ్చిన ‘ఒక లైలా కోసం’ (Oka Laila Kosam) సినిమా ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంది. వీరి కెమెస్ట్రీ అద్భుతంగా ఉందంటూ వార్తలు వచ్చాయి. అయితే ఆ తర్వాత నుంచి వీరు కలిసి నటించలేదు. వీరి కాంబోలో ఇప్పటివరకూ ఒక్క సినిమా కూడా రాలేదు. కానీ త్వరలోనే ఈ జంట కలిసి నటించబోతున్నట్లు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. దీంతో ఈ జంటను మరోమారు తెరపై చూసేందుకు అక్కినేని ఫ్యాన్స్ తెగ ఎదురుచూస్తున్నారు.
విరూపాక్ష డైరెక్టర్‌తో..
సాయిధరమ్ తేజ్ నటించిన విరూపాక్ష (Virupaksha) చిత్రం టాలీవుడ్‌లో ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను తెరకెక్కించిన డైరెక్టర్ కార్తిక్ వర్మ దండుపై సర్వత్రా ప్రశంసలు కురిశాయి. ఇప్పుడు ఈ డైరెక్టర్‌తోనే నాగ చైతన్య ఓ సినిమా చేయబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. సూపర్ నేచురల్ థ్రిల్లర్ ఇది రాబోతున్నట్లు ఫిల్మ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్‌గా పూజా హెగ్డేను పరిశీలిస్తున్నట్లు సమాచారం. డైరెక్టర్ కార్తిక్ వర్మ త్వరలోనే ఆమెను కలిసి కథ వినిపిస్తారని అంటున్నారు. చైతూతో నటించేందుకు ఆమె ఓకే చెప్పే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లు చిత్ర బృందం అంచనా వేస్తోంది. మూవీ అనౌన్స్‌మెంట్‌తో పాటే హీరో, హీరోయిన్ల పేరు ప్రకటించాలని దర్శకుడు భావిస్తున్నట్లు సమాచారం. అయితే నాగచైతన్య కంటే పూజా కాస్త ఎత్తు ఎక్కువ ఉండటంతో రొమాన్స్ పరంగా కాస్త ఇబ్బంది కలగొచ్చేమోనని నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.
పూజా హెగ్డే ఫ్యూచర్ ప్రాజెక్ట్స్
గత మూడేళ్లుగా పూజా హెగ్డే (Pooja Hegde)కు అసలు కలిసి రావడం లేదు. ప్రభాస్‌తో చేసిన రాధేశ్యామ్ (Radhe Shyam)తో మొదలైన ఆమె ఫ్లాపుల పరంపర ‘బీస్ట్’ (Beast), ‘ఆచార్య’ (Acharya), ‘సర్కస్’ (Circus), ‘కిసి కా భాయ్ కిసీ కీ జాన్’ (Kisi Ka Bhai Kisi Ki Jaan) వరకూ కొనసాగింది. దీంతో కొంతకాలం సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ఈ అమ్మడు హ్యాపీగా కుటుంబ సభ్యులతో సమయాన్ని గడిపింది. అటు మేకర్స్ సైతం ఆమెను కాస్త పక్కన పెట్టారు. అయితే ఈ మధ్యే మళ్లీ పూజాకు ఆఫర్లు మొదలయ్యాయి. ‘దేవా’, ‘సూర్య 44’, ‘దళపతి 69’ సినిమాల్లో ఆమెకు అవకాశాలు దక్కాయి. ఇక చైతూతో ప్రాజెక్ట్ ఓకే అయితే ఆచార్య తర్వాత ఆమె చేయబోయే మెుదటి తెలుగు సినిమా ఇదే కానుంది.
‘తండేల్’తో వస్తోన్న చైతూ
ప్రస్తుతం అక్కినేని నాగచైతన్య 'తండేల్' చిత్రంలో నటిస్తున్నాడు. ఇందులో అతడికి జోడీగా సాయిపల్లవి (Sai Pallavi) నటిస్తోంది. లవ్ స్టోరీ’ (Love Story) వంటి బ్లాక్ బాస్టర్ తర్వాత చైతు-సాయిపల్లవి కాంబో వస్తోన్న రెండో చిత్రం కావడంతో ‘తండేల్’పై అందరిలోనూ అంచనాలు ఏర్పడ్డాయి. ఇందులో మత్సకారుడిగా నాగచైతన్య కనిపించనున్నారు. ప్రస్తుతం నాగ చైతన్య ఆశలన్నీ ఈ మూవీపైనే ఉంది. ‘బంగార్రాజు’, ‘థ్యాంక్ యూ’, ‘లాల్ సింగ్ చద్ధా’, గతేడాది వచ్చిన ‘కస్టడీ’ సినిమాలు బాక్సాఫీస్ వద్ద పరాజయం చెందాయి. దీంతో ‘తండేల్’ ద్వారా ఎలాగైన గెలుపు బాట పట్టాలని నాగచైతన్య పట్టుదలతో ఉన్నాడు. ఈ మూవీ 2025 ఫిబ్రవరి 7న రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమాను అల్లు అరవింద్ సమర్పణలో జీఏ 2 పిక్చర్స్ బ్యానర్‌లో బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నాగ చైతన్య హీరోగా గీతా ఆర్ట్స్ సంస్థ '100 పర్సెంట్ లవ్' నిర్మించింది.
డిసెంబర్‌లో చై - శోభిత పెళ్లి!
టాలీవుడ్ స్టార్ నటుడు అక్కినేని నాగచైతన్య సమంతతో విడాకుల అనంతరం నటి శోభితా ధూళిపాళ్ల (Sobhita Dhulipala)తో ఏడడుగులు వేయబోతున్నాడు. డిసెంబర్ 4న వీరు గ్రాండ్‌గా వివాహం చేసుకోబోతున్నట్లు టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. డిసెంబర్ 2న సంగీత్, 3న మెహందీ, 4న పెళ్లి జరగనున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ 10న గ్రాండ్‌గా రిసెప్షన్ కూడా ఏర్పాటు చేసినట్లు టాక్. వీరి వివాహం హైదరాబాద్ (Hyderabad)లోని అన్నపూర్ణ స్టూడియోస్ (Annapurna Studios)లోనే జరగబోతోనున్నట్లు సమాచారం. ఈ మేరకు పెళ్లి కోసం అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఏర్పాట్లు కూడా మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. సెట్టింగ్, డెకరేషన్ పనులు ముమ్మరంగా సాగుతున్నట్లు సమాచారం. పెళ్లికి అతి తక్కువ మందిని మాత్రమే పిలబోతున్నట్లు తెలిసింది. రిసెప్షన్‌కు మాత్రం ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తోపాటు సినీ, రాజకీయ ప్రముఖులకు ఆహ్వానించనున్నారు.
నవంబర్ 16 , 2024
HBD Sangeetha: సంగీత భర్త ఎంత పెద్ద సింగరో తెలుసా? ఫస్ట్ లుక్‌లోనే ఫ్లాట్ అయ్యిందట!
టాలీవుడ్‌కు చెందిన ఒకప్పటి స్టార్ హీరోయిన్లలో సంగీత (Sangeetha Krish) ఒకరు. అందం, నటన, డ్యాన్స్‌లతో ఆమె పలు చిత్రాల్లో అదరగొట్టింది. పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించి హీరోయిన్‌గా పాపులర్ అయ్యింది. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి ఆకట్టుకుంటోంది. ఇదిలా ఉంటే ఇవాళ సంగీత పుట్టిన రోజు. 46వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఈ నేపథ్యంలో ఆమె జీవితంలోని ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం.
నిర్మాతల ఫ్యామిలీ
చెన్నైకి చెందిన సంగీత 1978 అక్టోబర్ 21న జన్మించింది. ఆమె అసలు పేరు రసిక కాగా సినిమాల్లోకి వచ్చాక సంగీతగా మార్చుకుంది. ఆమె తాత కె.ఆర్. బాలన్ తమిళ ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాత. 20కి పైగా చిత్రాలను ఆయన నిర్మించారు. తండ్రి శాంతారామ్ కూడా తమిళంలో పలు చిత్రాలను నిర్మించడం గమనార్హం. సంగీతకు చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. అందుకే స్కూల్ డేస్‌లోనే భరతనాట్యం నేర్చుకుంది. మలయాళం పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ ‘గంగోత్రి’ (1997) సినిమా సంగీత ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. తెలుగులో ఆమె చేసిన ఫస్ట్ ఫిల్మ్ ‘సర్కస్ సత్తిపండు’.
ఆ చిత్రాలతో గుర్తింపు
1997లోనే సర్కస్ సత్తిపండు సినిమాలో నటించినప్పటికీ తెలుగులో ఆమెకు పెద్దగా అవకాశాలు రాలేదు. ఆ సమయంలో తమిళం, మలయాళ భాషల్లో సంగీత వరుసగా చిత్రాలు చేసింది. రెండేళ్ల గ్యాప్ తర్వాత 'ఆశల సందడి' (1999) మూవీతో తెలుగు ప్రేక్షకులను మరోమారు పలకరించింది. ఆ తర్వాత‘ఖడ్గం’, ‘పెళ్లాం ఊరెళితే’, ‘ఖుషీ ఖుషీగా’, ‘సంక్రాంతి’ శివపుత్రుడు వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించి హీరోయిన్‌గా గుర్తింపు సంపాదించింది.
సింగర్‌తో లవ్ మ్యారేజ్
కెరీర్ పీక్స్‌లో ఉండగానే నటి సంగీత వివాహం చేసుకున్నారు. తమిళ స్టార్ సింగర్ క్రిష్‌ను ఆమె ప్రేమ వివాహం చేసుకున్నారు. ఓ అవార్డ్ ఫంక్షన్‌లో ఆమె తొలిసారి క్రిష్‌ను చూశారు. తన నుంచి అవార్డు తీసుకోవడానికి స్టేజీపైకి వస్తున్న క్రమంలో అతడి లుక్స్ చూసి తను ఫిదా అయినట్లు ఓ ఇంటర్వూలో చెప్పారు. ఆపై అతడి అట్రాక్టివ్ స్పీచ్‌కు ఆమె మరింత కనెక్ట్ అయ్యారు. అనుకోకుండా అదే రోజు రాత్రి ఫ్రెండ్స్‌తో డిన్నర్ ప్లాన్ చేయగా క్రిష్ కూడా అక్కడకు వచ్చారట. ఆ సందర్భంగా క్రిష్‌తో నేరుగా మీరు నచ్చారని సంగీత అన్నారట. ఆపై ఇద్దరు నెంబర్లు మార్చుకోవడం, మూడు నెలల్లో ఎంగేజ్‌మెంట్, 8 నెలల్లో పెళ్లి కూడా జరిగిపోయినట్లు సంగీత తెలిపారు. తర్వాతి ఏడాది అవార్డు ఫంక్షన్‌కు తామిద్దరం జంటగా వెళ్లినట్లు పేర్కొన్నారు.
https://www.youtube.com/watch?v=OLf1U7c867M
సెకండ్ ఇన్నింగ్స్‌లో జోరు!
తెలుగులో పలు హిట్ చిత్రాలు చేసినప్పటికీ సంగీత ఎక్కువ కాలం ఇండస్ట్రీలో నిలదొక్కుకోలేకపోయింది. 2010లో వచ్చిన 'కారా మజాకా' తర్వాత మరో తెలుగు చిత్రం చేయడానికి 10 ఏళ్ల సమయం తీసుకుంది. మహేష్ నటించిన 'సరిలేరు నీకెవ్వరు'తో మరోమారు తెలుగు ఇండస్ట్రీలోకి కమ్ బ్యాక్ ఇచ్చింది. అప్పటివరకూ హీరోయిన్‌గా, లీడ్ యాక్ట్రెస్‌గా నటించిన ఆమె క్యారెక్టర్ ఆర్టిస్టుగా సెకండ్ ఇన్నింగ్స్ మెుదలు పెట్టింది. ఆచార్య (స్పెషల్ సాంగ్), మసూద, వారసుడు వంటి సినిమాల్లో నటించి అందరి దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా మసూద చిత్రానికి గాను ఉత్తమ సహాయనటిగా సైమా అవార్డు సైతం అందుకుంది.
బుల్లితెర హోస్ట్‌గానూ..
నటి సంగీత బుల్లితెర హోస్ట్‌గానూ తన సెకండ్ ఇన్నింగ్స్‌లో రాణిస్తోంది. తమిళ టెలివిజన్ డ్యాన్స్ షోస్ జోడీ నెం.1, డ్యాన్స్ జోడీ డ్యాన్స్, సూపర్ జోడీ (తెలుగు)లకు ఆమె జడ్జిగా వ్యవహరించారు. కొత్త డ్యాన్సర్లను ప్రోత్సహిస్తూ తగిన సూచనలు చేశారు. ఈటీవీ వేదికగా వచ్చే పండుగ స్పెషల్ షోలలోనూ పాల్గొంటూ బుల్లితెర ఆడియన్స్‌ను అలరిస్తున్నారు.
అక్టోబర్ 21 , 2024
Best Cameos in Telugu Movies: క్యామియోలకు జీవం పోసిందే మెగాస్టార్ అని తెలుసా? గెస్ట్ రోల్స్‌తో ఇరగదీసిన స్టార్స్ వీరే!
భారతీయ చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం క్యామియో అనే కొత్త ట్రెండ్ మెుదలైంది. టాలీవుడ్, బాలీవుడ్, కోలివుడ్ అనే తారతమ్యం లేకుండా ప్రతీ ఒక్క ఇండస్ట్రీ ఈ ట్రెండ్‌ను అనుసరిస్తూ సత్ఫలితాలను పొందుతున్నాయి. పక్క ఇండస్ట్రీలకు చెందిన స్టార్ నటులను తీసుకొని తమ చిత్రాల్లో ఒక పవర్‌ఫుల్ క్యామియో లేదా రోల్ ఇవ్వడం ద్వారా ఆడియన్స్‌లో హైప్ క్రియేట్ చేస్తున్నాయి. తద్వారా సూపర్ హిట్ విజయాలను అందుకుంటున్నాయి. అయితే ఈ క్యామియోలకు మెుట్ట మెుదట జీవం పోసింది మన మెగాస్టార్ అని చాలా మందికి తెలిసి ఉండదు. రజనీకాంత్ ఫిల్మ్‌లో గెస్ట్ రోల్ చేయడం ద్వారా అప్పట్లోనే ఈ ఒరవడికి చిరు నాంది పలికారు. ఇంతకీ ఆ చిత్రం ఏంటి? ఇప్పటివరకూ వచ్చిన బెస్ట్ క్యామియో చిత్రాలు ఏవి? అన్నది ఈ ప్రత్యేక కథనంలో పరిశీలిద్దాం.
చిరు క్యామియో
చిరంజీవి హీరోగా నటించిన 'అత్తకు యముడు అమ్మాయికి మెుగుడు' చిత్రం తెలుగులో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మించగా కోదండ రామిరెడ్డి దర్శకత్వం వహించారు. కాగా, ఈ సినిమాను తమిళంలో రజనీకాంత్‌తో అల్లు అరవింద్ రీమేక్ చేశారు. 'మాపిళ్లై' పేరుతో ఇది విడుదలైంది. అయితే ఇందులో మెగాస్టార్ చిరంజీవి అదిరిపోయే క్యామియో ఇచ్చారు. హీరో పెళ్లిని చెడగొట్టడానికి వచ్చిన అల్లరి మూకతో గుడి మెట్ల దగ్గర చిరు ఫైట్ చేస్తాడు. ఆ గుండాలలో శ్రీహరి కూడా ఉండటం గమనార్హం. ఇక చిరు తన స్వంత గళంతోనే తమిళంలో సంభాషణలు చెప్పారు. రజినీ తన అత్తని పరిచయం చేసేటప్పుడు చిరు అతడి చెవిలో, 'మీ అత్త బాగుందిరా!' (తమిళంలో అంటాడు. దానికి రజినీ చిరుని 'కొంప ముంచేలా ఉన్నావు! నువ్వు బయలుదేరరా బాబూ!' అని అనటం ప్రేక్షకులని గిలిగింతలు పెడుతుంది. అయితే అప్పట్లో ఈ క్యామియోను ఎవరూ ఊహించలేదు. చిరు, రజనీ పలు చిత్రాల్లో అప్పటికే కలిసి నటించినప్పటికీ ఇలా అతిథి పాత్రలో చేయడం అదే తొలిసారి. ఇప్పుడు ఇదే పరంపరను పలు ఇండస్ట్రీలు అనుసరించడం గమనార్హం.
https://twitter.com/i/status/1212794102867083265
అదిరిపోయే క్యామియోలతో వచ్చిన చిత్రాలు
మిస్టర్ బచ్చన్
రవితేజ, హరీష్ శంకర్ కాంబోలో వచ్చిన ‘మిస్టర్ బచ్చన్’ మూవీ కుర్ర హీరో సిద్ధు జొన్నల గడ్డ ఒక స్పెషల్ క్యామియో ఇచ్చారు. సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నప్పటికీ సిద్ధు క్యామియో మాత్రం థియేటర్లలో విజిల్స్ వేసేలా చేసింది.
కల్కి 2898 ఏడీ
ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ‘కల్కి 2898 ఏడీ’ చిత్రంలో పలువురు స్టార్స్ అదిరిపోయే క్యామియోస్ ఇచ్చారు. యంగ్ హీరో విజయ్ దేవరకొండ, తమిళ నటుడు దుల్కర్ సల్మాన్, హీరోయిన్ మృణాల్ ఠాకూర్, దర్శకధీరుడు రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ స్క్రీన్‌పై కొద్దిసేపు మెరిసి ఆశ్చర్యపరిచారు. బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ఇందులో ఫుల్ లెంగ్త్ పాత్రలు పోషించారు.
సలార్
ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చిన ‘సలార్’ చిత్రంలో ప్రముఖ మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమాన్ నటించిన సంగతి తెలిసిందే. అయితే అతడిది క్యామియో కాదు. ప్రభాస్‌కు ఫ్రెండ్‌గా, ప్రత్యర్థిగా ఫుల్ లెంగ్త్ రోల్‌లో నటించాడు.
జైలర్
రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన ‘జైలర్’ చిత్రంలో ఇద్దరు స్టార్ హీరోలు క్యామియో ఇచ్చారు. మలయాళ నటుడు మోహన్‌లాల్, కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ అతిథి పాత్రల్లో కనిపించి ఆకట్టుకున్నారు.
విక్రమ్
కమల్ హాసన్ హీరోగా లోకేష్ కనగరాజన్ దర్శకత్వంలో రూపొందిన ‘విక్రమ్’ చిత్రంలో తమిళ నటుడు విజయ్ సేతుపతి, మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ కీలక పాత్రల్లో నటించారు. సినిమా సక్సెస్‌లో కీలక పాత్ర పోషించారు. క్లైమాక్స్‌లో రోలెక్స్ పాత్రలో సూర్య కనిపించి గూస్‌బంప్స్ తెప్పించారు.
బ్రహ్మాస్త్ర
రణ్‌బీర్ కపూర్ హీరోగా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందిన ‘బ్రహ్మాస్త్ర’ చిత్రంలో తెలుగు దిగ్గజ నటుడు అక్కినేని నాగార్జున ఓ స్పెషల్ క్యామియో ఇచ్చి అందర్నీ సర్‌ప్రైజ్ చేశారు. యాక్షన్స్ సీక్వెన్స్‌లో తన మార్క్ చూపించి అదరగొట్టాడు.
వాల్తేరు వీరయ్య
మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’ చిత్రంలో స్టార్ హీరో రవితేజ ఓ ముఖ్య పాత్రలో నటించారు. తద్వారా చిరుపై తనకున్న అభిమానాన్ని మరోమారు చాటుకున్నారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.
ఆచార్య
మెగాస్టార్ చిరంజీవి గత చిత్రం ‘ఆచార్య’లో రామ్ చరణ్ అతిథి పాత్రలో నటించాడు. అంతకుముందు చరణ్ చేసిన ’మగధీర’, బ్రూస్‌లీ చిత్రాల్లో చిరు ప్రత్యేక రోల్స్‌లో కనిపించి సర్‌ప్రైజ్ చేయడం విశేషం.
లాల్ సింగ్ చద్దా
బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చద్దా సినిమాలో అక్కినేని నాగ చైతన్య ఓ ముఖ్యమైన పాత్రలో నటించారు. ఈ సినిమా ఆశించిన విజయం సాధించనప్పటికీ చైతూ నటనకు మంచి మార్కులే పడ్డాయి.
లైగర్
విజయ్ దేవరకొండ హీరోగా చేసిన ‘లైగర్’ చిత్రంలో వరల్డ్ ఫేమస్ బాక్సర్ ‘మైక్ టైసన్’ క్లైమాక్స్‌లో కనిపించి అందరినీ సర్‌ప్రైజ్ చేశారు. అయితే అతడ్ని సరిగ్గా వినియోగించలేకపోయారని దర్శకుడు పూరి జగన్నాథ్‌పై అప్పట్లో విమర్శలు వచ్చాయి.
సెప్టెంబర్ 18 , 2024
Devara Story Prediction: కొరటాల శివ సూపర్ హిట్ ఫార్మూలాతో ‘దేవర’.. కంప్లీట్ స్టోరీ ఇదేనా?
తారక్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ‘దేవర’ (Devara: Part 1) చిత్రంపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా బజ్ ఉంది. ‘ఆర్‌ఆర్‌ఆర్’ (RRR) వంటి గ్లోబల్ హిట్ తర్వాత తారక్ నుంచి వస్తోన్న మూవీ కావడంతో తెలుగుతో పాటు నార్త్‌లోనూ ఈ సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ట్రైలర్ కూడా నేడు రిలీజ్ కానుండటంతో #JrNTR, #DevaraTrailer, #KoratalaSiva వంటి హ్యాష్‌ట్యాగ్స్ నెట్టింట ట్రెండింగ్‌గా మారాయి. ఇదిలా ఉంటే దర్శకుడు కొరటాల శివ తన ప్రతీ సినిమాలో ఓ ప్రత్యేక ఫార్మూలాను అనుసరిస్తుంటారు. ఆయన గత చిత్రాలను నిశితంగా పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుంది. అయితే దీనిని ఆధారంగా చేసుకొని కొందరు నెటిజన్లు దేవర ప్లాట్‌ను అంచనా వేశారు. ప్రస్తుతం అది నెట్టింట వైరల్ అవుతోంది. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.
కొరటాల ఫార్ములా ఇదే?
కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ‘మిర్చి’ (Mirchi), ‘శ్రీమంతుడు’ (Srimanthudu), ‘జనతా గ్యారేజ్’ (Janatha Garage), ‘భరత్ అనే నేను’ (Bharat Ane Nenu) చిత్రాలు బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకున్నాయి. అయితే ఈ సినిమా కథ, నేపథ్యం వేర్వేరు అయినప్పటికీ అందులో అంతర్లీనంగా ఉన్న ఫార్ములా మాత్రం ఒక్కటే. అది ఏంటంటే, ఔట్‌సైడర్ అయిన హీరో ఒక కొత్త ప్రదేశానికి వెళ్లి అక్కడ కష్టాలు అనుభవిస్తున్న ప్రజలకు అండగా ఉంటాడు. ఇబ్బందులకు గురిచేస్తున్న విలన్‌ను బుద్ది చెప్తాడు. కట్ చేస్తే హీరోకు ఆ ప్రాంత విలన్‌కు లింకప్ చేస్తూ ఓ గతం ఉంటుంది. పైన చెప్పిన ఈ సినిమాల ప్లాట్స్‌ను గుర్తుచేసుకొని దానికి ఇప్పుడు చెప్పిన ఫార్మూలాను అన్వయించుకుంటే మీకూ ఇది నిజమే అనిపిస్తుంది. కొరటాల శివ గత చిత్రం 'ఆచార్య' కూడా ఇదే ఫార్మూలతో వచ్చిందే. ఔట్‌సైడర్ అయిన చిరు, పాదగట్టం అనే ప్రాంతానికి వెళ్లి అక్కడ అరచాకం సృష్టిస్తున్న విలన్లను అంతం చేస్తాడు. రామ్‌చరణ్ - పాదగట్టం - చిరును లింకప్ చేస్తూ ఓ ఫ్లాష్‌బ్యాక్‌ను రాసుకున్నారు డైరెక్టర్ కొరటాల శివ.
దేవర స్టోరీ ఇదేనా?
కొరటాల శివ గత చిత్రాల ఫార్మూలాను ఆధారంగా కొందరు నెటిజన్లు దేవర ప్లాట్‌ను ప్రిడిక్షన్ చేస్తున్నారు. దాని ప్రకారం ఫస్ట్ టీజర్‌లో చూపించిన ఎర్ర సముద్రాన్ని ఒక ప్రాంతంగా అంచనా వేస్తున్నారు. ఎర్ర సముద్ర ప్రాంతంలో నివసించే జాలర్లకు ఎన్టీఆర్ నాయకుడు. అక్కడ అరాచకాలు సృష్టిస్తున్న విలన్లకు అతడు గట్టిగా బుద్ది చెబుతాడు. దీంతో కుట్ర చేసి విలన్ల గ్యాంగ్ అతడ్ని అంతం చేస్తుంది. విలన్ల దాడి నుంచి తప్పించుకున్న అతడి కుమారుడు (ఎన్టీఆర్) పెద్దయ్యాక తిరిగి ఆ ప్రాంతానికి వచ్చి విలన్లపై ఏవిధంగా ప్రతీకారం తీర్చుకున్నాడు? అనేది ప్లాట్ అయి ఉండొచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు. కొరటాల ఫార్మూలాను బట్టి చూస్తే ‘దేవర’ ప్లాట్ ఇదే అయ్యి ఉండొచ్చని కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇది ఎంతవరకూ వాస్తవమో తెలియదు కాని ప్లాట్ మాత్రం కన్విన్సింగ్ ఉందని మరికొందరు పోస్టులు పెడుతున్నారు.
చరిత్ర సృష్టించిన ‘దేవర’
ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘దేవర’ (Devara) చిత్రం సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుంది. ఇప్పటికే పాటలతో పలు రికార్డులు సొంతం చేసుకున్న ఈ సినిమా తాజాగా మరో ఘనతను తన ఖాతాలో వేసుకుంది. ఇటీవల ఓవర్సీస్‌లో దీని ప్రీసేల్ టికెట్ బుకింగ్స్ ఓపెన్ చేయగా తాజాగా అది 1 మిలియన్ డాలర్ల మార్క్‌ను అందుకుంది. నార్త్ అమెరికన్ బాక్సాఫీస్‌లో టికెట్ల ప్రీసేల్ ద్వారా అత్యంత వేగంగా వన్ మిలియన్ డాలర్ల మార్క్‌ను చేరిన సినిమాగా ‘దేవర’ నిలిచింది. ఈ ఘనత సాధించిన మొదటి భారతీయ చిత్రంగా రికార్డు నెలకొల్పింది. దీంతో తారక్ ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు.
ముగ్గురు స్టార్ డైరెక్టర్లతో తారక్..
'దేవర' తర్వాత తారక్ లైనప్‌లో బాలీవుడ్ చిత్రం 'వార్ 2'తో పాటు 'NTR 31' కూడా ఉంది. హిందీ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తుండగా, 'NTR 31' ప్రశాంత్ నీల్ తెరకెక్కించారు. అయితే తాజాగా కొరటాల శివతో పాటు ఈ ఇద్దరు డైరెక్టర్లతో తారక్ దిగిన ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. తన ముగ్గురు డైరెక్టర్లతో తారక్ కలయిక సూపర్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ క్రేజీ కలయికకు ఓ కారణం ఉన్నట్లు సమాచారం. దేవర ప్రమోషన్స్‌లో భాగంగా ఈ ముగ్గురు దర్శకులతో తారక్ ఓ ఇంటర్యూలో కనిపించబోతున్నట్లు సమాచారం.
ట్రైలర్ లోడింగ్..
యాక్షన్ డ్రామాగా ముస్తాబవుతోన్న దేవర చిత్రం నుంచి నేడు (సెప్టెంబర్ 10) ట్రైలర్ రిలీజ్ కానుంది. సాయంత్రం 5.04 గంటలకు దీన్ని రీలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఈ ట్రైలర్ 2 నిమిషాల 50 సెకన్ల పాటు ఉంటుందని సమాచారం. ట్రైలర్‌ను చాలా వరకూ యాక్షన్ సీక్వెన్స్‌తో దర్శకుడు కొరటాల శివ నింపేసినట్లు తెలుస్తోంది. అటు మూవీ టీమ్ కూడా యాక్షన్ ఫీస్ట్‌కు సిద్ధంగా ఉండండంటూ ట్రైలర్‌పై భారీ ఎత్తున హైప్ పెంచేసింది. కాగా ఇందులో తారక్‌కు జోడీగా జాన్వీ కపూర్ నటించింది. బాలీవుడ్ నటులు సైఫ్ అలీఖాన్, బాబీ డియోల్ విలన్ పాత్రల్లో కనిపించనున్నారు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ ఈ సినిమాకు సంగీతం సమకూరుస్తున్నారు.
సెప్టెంబర్ 10 , 2024
Devara Story Leak: ‘దేవర’ స్టోరీ లీక్? టీడీపీని ఇరుకున పెట్టేలా కథనం!
‘ఆర్‌ఆర్‌ఆర్’ (RRR) వంటి గ్లోబల్ స్థాయి హిట్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ (Jr. NTR) చేస్తోన్న చిత్రం ‘దేవర’ (Devara: Part 1). కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంపై ఆడియన్స్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండటం, సైఫ్ అలీఖాన్ లాంటి దిగ్గజ నటుడు విలన్ పాత్ర పోషిస్తుండటం సినిమాపై హైప్ క్రియేట్ చేసింది. చక చకా షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఇందులో తారక్ డ్యుయల్ రోల్ పోషిస్తుండటంతో అసలు ఈ సినిమా స్టోరీ ఏమై ఉంటుందా? అని నందమూరి అభిమానులతో పాటు సినీ లవర్స్ తెగ ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలో ‘దేవర’ స్టోరీకి సంబంధించి ఓ క్రేజీ వార్త నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఒకప్పుడు ఉమ్మడి ఏపీని కుదిపేసిన యథార్థ సంఘటన నేపథ్యంలో ఈ సినిమా రూపొందినట్లు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. ఇంతకీ ఏంటా ఘటన? దేవర స్టోరీ ఏంటి? ఇప్పుడు తెలుసుకుందాం.
‘దేవర’ స్టోరీ అదేనా?
'దేవర' చిత్ర కథను కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా చేసుకొని దర్శకుడు కొరటాల శివ రాసుకున్నట్లు తెలుస్తోంది. లేటెస్ట్ బజ్ ప్రకారం దళితులపై గతంలో జరిగిన క్రూరమైన హత్యాకాండకు సంబంధించి ఈ మూవీ తెరకెక్కినట్లు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చోటుచేసుకున్న కారంచేడు విషాద ఘటనను ఇందులో చూపించనున్నట్లు సమచారం. 1985లో ఏపీలోని కారంచేడు గ్రామంలో అనేక మంది దళితులు అగ్రవర్ణాల చేతిలో బలయ్యారు. ఈ రియల్ లైఫ్ ఇన్సిడెంట్‌ను ‘దేవర’ చిత్రంలో చూపించడానికి కొరటాల శివ ప్లాన్ చేసినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ‘దేవర’ సినిమాపై అంచనాలు మరింత రెట్టింపయ్యాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై చిత్ర యూనిట్ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.
టీడీపీని ఇరకాటంలో పడేస్తుందా?
1985లో 'కారంచేడు ఘటన' జరిగినప్పుడు నందమూరి తారక రామారావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ ఘటన తర్వాత ఆయన దళితుల కోసం చాలా కొత్త చట్టాలను తీసుకువచ్చారు. అయినప్పటికీ ఇది ఆయన ప్రభుత్వానికి మాయని మచ్చలా ఉండిపోయింది. ఏళ్లు గడుస్తున్నప్పటికీ అప్పటి రక్తం మరకలు టీడీపీ ప్రభుత్వాన్ని వెంటాడుతూనే ఉన్నాయి. ప్రస్తుతం ఏపీలో మళ్లీ టీడీపీ ప్రభుత్వమే అధికారంలో ఉంది. ‘దేవర’ సినిమాతో మరోమారు ఈ అంశం తెరపైకి వస్తే ఇది చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీని ఇరాకటంలో పడేసే అవకాశం లేకపోలేదని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. పైగా తెలుగు దేశం పార్టీ, బాలకృష్ణతో ఎన్టీఆర్‌కు మనస్పర్థలు తలెత్తినట్లు కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ‘దేవర’ సినిమాలో కారంచేడు ఘటనను చూపిస్తే ఈ దూరం మరింత పెరిగే ఛాన్స్ ఉందని అంటున్నారు.
సోషల్ మెసేజ్ తప్పనిసరి!
తెలుగులో మంచి క్రేజ్ ఉన్న దర్శకుల్లో కొరటాల శివ (Koratala Siva) ఒకరు. ఆయన ఇప్పటివరకూ తీసిన ప్రతీ సినిమాలోనూ ఏదోక సందేశాన్ని ఇస్తూనే వచ్చారు. లేదంటే సామాజిక అంశాన్నైనా టచ్ చేస్తూ వచ్చారు. ‘మిర్చి’ చిత్రంలో ఫ్యాక్షన్ గొడవలను, ‘శ్రీమంతుడు’ సినిమాలో గ్రామాన్ని దత్తత తీసుకోవడం, ‘జనతా గ్యారేజ్’లో బలహీనులకు అండగా నిలబడటం, ‘భరత్ అనే నేను’ సినిమాలో రాజకీయాల్లో జవాబుదారి తనం, ‘ఆచార్య’ చిత్రంలో నక్సలైట్ ఉద్యమాన్ని చూపించారు. అలాగే ‘దేవర’ కథలో కారంచేడు విషాద ఘటన తాలూకా సీన్లు ఉండే అవకాశం లేకపోలేదని ఇండస్ట్రీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
మూడో సాంగ్ వచ్చేస్తోంది..
దేవర సినిమా నుంచి సెప్టెంబర్ 4వ తేదీన మూడో పాట రిలీజ్ కానుంది. ఈ విషయాన్ని మూవీ టీమ్ ఓ పోస్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించింది. 'దావుడి' అంటూ ఈ డ్యూయోట్ సాంగ్ సాగనున్నట్లు తెలిపింది. ‘ఇది కచ్చితంగా అదిరిపోతుంది. ప్రతీ బీట్ కూడా విజిల్ వేసేలా ఉంటుంది. సెప్టెంబర్ 4న దావుడి’ అంటూ సోషల్ మీడియాలో దేవర టీమ్ రాసుకొచ్చింది. తాజా పోస్టర్‌లో తారక్ బ్లాక్ ఔట్‌ఫిట్‌లో ఉండగా వైట్ కలర్ డ్రెస్‌లో జాన్వీ మెస్మరైజ్ చేసింది. తారక్ అలా వెనక్కి వాలుతుండగా ఆయనను జాన్వీ రొమాంటిక్‍గా పట్టుకున్నట్టుగా ఈ పోస్టర్ ఉంది. ఈ పాటలో ఎన్టీఆర్ డ్యాన్స్ స్టెప్స్ అదిరిపోయేలా ఉంటాయని తెలుస్తోంది.
https://twitter.com/DevaraMovie/status/1830601323152289828
తారక్ పెద్ద మనసు
తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న వరద సహాయ చర్యల కోసం జూనియర్ ఎన్టీఆర్ రంగంలోకి దిగారు. తన వంతుగా ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలకు చెరో రూ.50 లక్షలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా తారక్ వెల్లడించారు. జూనియర్ ఎన్టీఆర్ సాయం ప్రకటించిన కాసేపటికే మరో యువ నటుడు విశ్వక్సేన్ కూడా తన వంతు విరాళాన్ని అందించడం విశేషం. తాను కూడా రెండు రాష్ట్రాలకు చెరో రూ.5 లక్షలు ఇస్తున్నట్లు ఎక్స్ వేదికగా ప్రకటించారు. కష్ట కాలంలో అండగా నిలిచిన ఈ ఇద్దరు హీరోలపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
https://twitter.com/tarak9999/status/1830825968820244827
https://twitter.com/VishwakSenActor/status/1830826016509759684
https://twitter.com/VishwakSenActor/status/1830830975905079307
సెప్టెంబర్ 03 , 2024
Balakrishna - Ram: టాలీవుడ్‌లో సరికొత్త కాంబోలు.. మల్టీస్టారర్ల శకం మెుదలైందా?
టాలీవుడ్‌లో మల్టీస్టారర్ చిత్రాలకు ఎంతో క్రేజ్ ఉంది. ఇద్దరు స్టార్ హీరోలు ఒకే స్క్రీన్‌పై కనిపిస్తే అది ఆడియన్స్‌కు కన్నుల పండుగగా ఉంటుంది. గతంలో ఈ తరహా మల్టీ స్టారర్ చిత్రాలు పెద్ద ఎత్తునే వచ్చాయి. అయితే ఇటీవల కాలంలో వాటి జోరు తగ్గింది. దీంతో ఆడియన్స్ కూడా మల్టీస్టారర్ మేనియా నుంచి కాస్త పక్కకు జరిగారు. అయితే ‘ఆర్‌ఆర్‌ఆర్’ తర్వాత మళ్లీ ఆ తరహా చిత్రాలకు డిమాండ్ ఏర్పడింది. దీంతో సరైన కథ తగిలితే మల్టీ స్టారర్లు చేసేందుకు తెలుగు స్టార్లు రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో ఇటీవల చిరు-పవన్-చరణ్, రామ్‌చరణ్-సూర్య కాంబినేషన్స్‌పై గాసిప్స్ వచ్చాయి. తాజాగా బాలయ్య-రామ్ పోతినేని కాంబో చిత్రంపైనా జోరుగా ప్రచారం మెుదలైంది. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.
మల్టీస్టారర్ లోడింగ్..!
మాస్ ఆడియన్స్‌లో మంచి ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), రామ్ పోతినేని (Ram Pothineni) ముందు వరుసలో ఉంటారు. నటుడు బాలకృష్ణ గత కొంతకాలంగా మాస్ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తూ సినిమాలు తీస్తున్నారు. అటు రామ్ కెరీర్ ప్రారంభంలో లవర్ బాయ్ చిత్రాలు చేసినప్పటికీ ఇటీవల యాక్షన్ చిత్రాలపై ఫోకస్ పెట్టారు. ఇస్మార్ట్, స్కంద, డబుల్ ఇస్మార్ట్ వంటి యాక్షన్ చిత్రాల్లో నటించాడు. అటువంటి ఈ ఇద్దరి హీరోల కాంబోలో ఓ క్రేజీ మల్టీస్టారర్ రాబోతున్నట్లు ఓ వార్త టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగస్వామి కాబోతున్నట్లు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. అయితే దీనిపై నిర్మాణ సంస్థ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ, ఈ వార్త నిజమైతే మాస్ ఆడియన్స్‌కు పండగే అని చెప్పవచ్చు.
గుడ్ ఫ్రెండ్‌షిప్
హీరో రామ్, నందమూరి బాలకృష్ణకు మధ్య వ్యక్తిగతంగా మంచి సంబంధాలే ఉన్నాయి. అయితే ఈ విషయం తొలిసారి స్కంద ఆడియో ఫంక్షన్‌లో బయటపడింది. బోయపాటి, రామ్ కాంబోలో రూపొందిన ‘స్కంద’ ఆడియో రిలీజ్ వేడుకకు బాలయ్య ముఖ్య అతిథిగా పాల్గొని సందడి చేశారు. ఆ సందర్భంగా హీరో రామ్‌తో ఆయన ఎంతో సన్నిహితంగా మెలిగారు. రామ్ తన స్పీచులో బాలయ్యపై ప్రశంసల వర్షం కురిపించారు. ఇక్కడ ఒక్క తరాన్ని అలరించేందుకు అల్లాడుతుంటే బాలయ్య మాత్రం మూడు తరాలను అలరిస్తూనే ఉన్నారంటూ పొగడ్తల్లో ముంచేత్తారు. అటు బాలయ్య రామ్‌ను ఆకాశానికెత్తారు. ఇలా వయసుతో సంబంధం లేకుండా మంచి స్నేహ బంధాన్ని కలిగి ఉన్న ఈ ఇద్దరు స్టార్ హీరోలు ఓ సినిమాలో కలిసి నటిస్తే ఇక రికార్డులు గల్లంతేనని ఫ్యాన్స్ అంటున్నారు.
చరణ్ - సూర్య కాంబోపై బజ్!
గ్లోబల్‌స్టార్ రామ్‌చరణ్ తేజ్ (Ram Charan), తమిళ స్టార్ హీరో సూర్య (Suriya) కాంబినేషన్‌లో ఓ మల్టీ స్టారర్ రాబోతున్నట్లు నెట్టింట జోరుగా ప్రచారం జరిగింది. లవ్ స్టోరీస్ తీయడంలో స్పెషలిస్ట్‌గా గుర్తింపు పొందిన హను రాఘవపూడి (Hanu Raghavapudi) ఈ మల్టీ స్టారర్‌ను తెరకెక్కించనున్నట్లు ఫిల్మ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే కథను సూర్యకు వినిపించగా అది అతడికి బాగా నచ్చిందని సమాచారం. అయితే రామ్‌చరణ్‌కు స్టోరీ వినిపించాల్సి ఉందని తెలుస్తోంది. రామ్‌చరణ్ కూడా ఓకే చెప్తే ఈ క్రేజీ ప్రాజెక్ట్ పట్టాలెక్కడం ఖాయమని అంటున్నారు. అదే జరిగితే చరణ్ - సూర్య మధ్య వచ్చే ఫైట్ సీక్వెన్స్ క్రేజీగా ఉంటుందని అంటున్నారు. బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కావడం ఖాయమని ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు.
మెగా హీరోలతో మల్టీస్టారర్!
మెగా ఫ్యామిలీకి బాగా దగ్గరైన దర్శకుల్లో హరీష్ శంకర్ (Harish Shankar) ఒకరు. అటువంటి హరీశ్ శంకర్ తన 'మిస్టర్ బచ్చన్' సినిమా ప్రమోషన్ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకూ పాన్ ఇండియా చిత్రం ఎందుకు తీయలేదు? అనే ప్రశ్నకు ఆసక్తికర సమాధానం ఇచ్చారు. పవన్ కల్యాణ్, రామ్ చరణ్, చిరంజీవిల కోసం ఒక స్టోరీని సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. అది పట్టాలెక్కితే అన్ని పాన్ ఇండియాల కంటే అదే అతి పెద్ద పాన్ ఇండియా అవుతుందని పేర్కొన్నారు. దీంతో మెగా ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. త్వరలో ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్తే బాగుంటుందని కోరుకుంటున్నారు. అయితే గతంలో చిరు, రామ్‌చరణ్‌లు కలిసి ‘ఆచార్య’ చిత్రంలో నటించారు. ‘బ్రూస్‌లీ’, ‘మగధీర’ చిత్రాల్లో చరణ్ కోసం మెగాస్టార్ ఓ స్పెషల్ క్యామియో కూడా ఇచ్చారు. అటు పవన్ కల్యాణ్ సైతం 'శంకర్ దాదా MBBS', 'శంకర్ దాదా జిందాబాద్' చిత్రాల్లో చిన్న క్యామియో పోషించారు.
ఆగస్టు 03 , 2024
Ram Charan - Suriya: రామ్ చరణ్‌కు ప్రత్యర్థిగా సూర్య.. మల్టీ స్టారర్‌కు రంగం సిద్ధమైందా?
టాలీవుడ్‌లో మల్టీ స్టారర్ చిత్రాలకు మంచి క్రేజ్ ఏర్పడింది. దీంతో స్టార్ హీరోలు సైతం మల్టీస్టారర్ చిత్రాలు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ క్రమంలోనే వచ్చిన ‘ఆర్‌ఆర్‌ఆర్’ (తారక్ - రామ్‌చరణ్), వాల్తేరు వీరయ్య (చిరు - రవితేజ), ‘సలార్’ (ప్రభాస్ - పృథ్వీరాజ్ సుకుమారన్), కల్కి (ప్రభాస్, అమితాబ్, కమల్) చిత్రాలు ఏ స్థాయి సక్సెస్ సాధించాయో అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే మరో మైండ్ బ్లోయింగ్ మల్టీ స్టారర్ తెలుగులో రాబోతున్నట్లు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. దక్షిణాది స్టార్ హీరోలు రామ్‌చరణ్, సూర్యలు కలిసి ఓ చిత్రంలో నటించబోతున్నట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది.
చరణ్‌కు విలన్‌గా సూర్య!
గ్లోబల్‌స్టార్ రామ్‌చరణ్ తేజ్ (Ram Charan), తమిళ స్టార్ హీరో సూర్య (Suriya) కాంబినేషన్‌లో ఓ మల్టీ స్టారర్ రాబోతున్నట్లు నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది. లవ్ స్టోరీస్ తీయడంలో స్పెషలిస్ట్‌గా గుర్తింపు పొందిన హను రాఘవపూడి (Hanu Raghavapudi) ఈ మల్టీ స్టారర్‌ను తెరకెక్కించనున్నట్లు ఫిల్మ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే కథను సూర్యకు వినిపించగా అది అతడికి బాగా నచ్చిందని సమాచారం. అయితే రామ్‌చరణ్‌కు స్టోరీ వినిపించాల్సి ఉందని తెలుస్తోంది. రామ్‌చరణ్ కూడా ఓకే చెప్తే ఈ క్రేజీ ప్రాజెక్ట్ పట్టాలెక్కడం ఖాయమని అంటున్నారు. అదే జరిగితే చరణ్ - సూర్య మధ్య వచ్చే ఫైట్ సీక్వెన్స్ క్రేజీగా ఉంటుందని అంటున్నారు. బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కావడం ఖాయమని ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు.
ప్రభాస్‌తో సినిమా తర్వాతే!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో డైరెక్టర్ హను రాఘవపూడి ఓ బిగ్ ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించి కథ చర్చలు కూడా ఇటీవలే ముగిసాయి. స్వాతంత్రానికి ముందు జరిగిన రజాకార్ల ఉద్యమం నేపథ్యంలో ఈ చిత్రం సాగనున్నట్లు తెలుస్తోంది. మైత్రి మూవీస్ నిర్మించబోయే ఈ సినిమాకు 'ఫౌజి' అనే టైటిల్‌ను దాదాపుగా ఖరారు చేసినట్లు సమాచారం. డైరెక్టర్ హను గత చిత్రాలకు భిన్నంగా పూర్తి యాక్షన్ డ్రామాగా ఇది రూపొందనున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్‌తో సినిమా తర్వాతనే రామ్‌చరణ్-సూర్య కాంబో మూవీపై హను రాఘవపూడి దృష్టి పెడతారని ఫిల్మ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
చరణ్-సూర్య బిజీ బిజీ
ప్రస్తుతం రామ్ చరణ్, సూర్య ఇద్దరూ తమ చిత్రాలతో బిజీ బిజీగా ఉన్నారు. రామ్‌చరణ్ ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) సినిమాలో నటిస్తుండగా సూర్య 'కంగువ' (Kanguva) చేస్తున్నాడు. సూర్య చిత్రం అక్టోబర్ 10న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కానుంది. అటు రామ్‌చరణ్ డిసెంబర్‌లో అందరినీ ఎంటర్‌టైన్ చేసే ఛాన్స్ ఉంది. ‘గేమ్ ఛేంజర్’ తర్వాత రామ్‌చరణ్ డైరెక్టర్ బుచ్చిబాబుతో ఓ సినిమా చేయనున్నాడు. స్పోర్ట్స్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. ఇందులో చరణ్‌కు జోడీగా జాన్వీ కపూర్‌ను లాక్ చేశారు. ఈ సినిమాకు 'పెద్ది' అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. కన్నడ స్టార్ నటుడు శివరాజ్ కుమార్ ముఖ్యమైన పాత్రలో కనిపిస్తారని సమాచారం. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
మెగా మల్టీస్టారర్ లోడింగ్..!
మెగా ఫ్యామిలీకి బాగా దగ్గరైన దర్శకుల్లో హరీష్ శంకర్ (Harish Shankar) ఒకరు. అటువంటి హరీశ్ శంకర్ తన 'మిస్టర్ బచ్చన్' సినిమా ప్రమోషన్ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకూ పాన్ ఇండియా చిత్రం ఎందుకు తీయలేదు? అనే ప్రశ్నకు ఆసక్తికర సమాధానం ఇచ్చారు. పవన్ కల్యాణ్, రామ్ చరణ్, చిరంజీవిల కోసం ఒక స్టోరీని సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. అది పట్టాలెక్కితే అన్ని పాన్ ఇండియాల కంటే అదే అతి పెద్ద పాన్ ఇండియా అవుతుందని పేర్కొన్నారు. దీంతో మెగా ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. త్వరలో ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్తే బాగుంటుందని కోరుకుంటున్నారు. అయితే గతంలో చిరు, రామ్‌చరణ్‌లు కలిసి ‘ఆచార్య’ చిత్రంలో నటించారు. ‘బ్రూస్‌లీ’, ‘మగధీర’ చిత్రాల్లో చరణ్ కోసం మెగాస్టార్ ఓ స్పెషల్ క్యామియో కూడా ఇచ్చారు. అటు పవన్ కల్యాణ్ సైతం 'శంకర్ దాదా MBBS', 'శంకర్ దాదా జిందాబాద్' చిత్రాల్లో చిన్న క్యామియో పోషించారు.
జూలై 31 , 2024
Mega Multi Starrer Movie: చిరు, పవన్, చరణ్ కాంబోలో మల్టీస్టారర్.. డైరెక్టర్ హారీష్ శంకర్ బిగ్ ప్లాన్!
టాలీవుడ్‌లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న కుటుంబాల్లో 'మెగా ఫ్యామిలీ' (Mega Family) ఒకటి. మెగాస్టార్ చిరంజీవి ఈ ఫ్యామిలీకి మూల పురుషుడు కాగా ఆయన తర్వాత ఎంతో మంది హీరోలు టాలీవుడ్‌లో అడుగుపెట్టారు. అలా వచ్చిన పవన్ కల్యాణ్ (Pawan Kalyan), రామ్ చరణ్ (Ram Charan), అల్లు అర్జున్ (Allu Arjun) ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా రాణిస్తున్నారు. అయితే మెగా ఫ్యామిలీ నుంచి ఏ హీరో సినిమా వచ్చినా అది టాలీవుడ్‌లో సెన్సేషనే అని చెప్పవచ్చు. అటువంటిది చిరు, పవన్, చరణ్ కలిసి ఒక మల్టీస్టారర్ తీస్తే ఎలా ఉంటుంది? ఆ ఊహే ఎంతో బాగుంది కదూ..! అయితే ఇది త్వరలోనే నిజమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆ దిశగా డైరెక్టర్ హరీష్ శంకర్ కృషి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ విశేషాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
‘అదే అతి పెద్ద పాన్ ఇండియా’..
మెగా ఫ్యామిలీకి బాగా దగ్గరైన దర్శకుల్లో హరీష్ శంకర్ (Harish Shankar) ఒకరు. ఆయన పవన్ కల్యాణ్ భక్తుడిగా తనను తాను ప్రకటించుకున్నారు. అటువంటి హరీశ్ శంకర్ తన 'మిస్టర్ బచ్చన్' సినిమా ప్రమోషన్ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకూ పాన్ ఇండియా చిత్రం ఎందుకు తీయలేదు? అనే ప్రశ్నకు ఆసక్తికర సమాధానం ఇచ్చారు. 'పాన్ ఇండియా కోసం అని కథ రాయలేం. ‘పుష్ప’ పాన్ ఇండియా సినిమా అని తీయలేదు. 'కాంతార' పాన్ ఇండియా కోసం చేయలేదు. వాళ్ళ మట్టి కథను చెప్పారు. పాన్ ఇండియా ఆడియన్స్ యాక్సెప్ట్ చేశారు. సహజసిద్ధంగా అలా జరగాలి. కల్యాణ్ గారు, రామ్ చరణ్, చిరంజీవి ఈ ముగ్గురి కోసం ఒక లైన్ ఎప్పటి నుంచో వర్కవుట్ చేస్తున్నాను. చేస్తే అన్ని పాన్ ఇండియాల కంటే అదే పాన్ ఇండియా అవుతుంది' అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు టాక్ ఆఫ్ ది టాలీవుడ్‌గా మారిపోయింది. ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నట్లు మెగా ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు.
https://twitter.com/i/status/1817891248398795055
గతంలోనే స్పెషల్ క్యామియోలు!
మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ గతంలోనే ‘ఆచార్య’ సినిమాలో కలిసి నటించారు. ఇందులో చరణ్ ఓ స్పెషల్ క్యామియోతో అలరించాడు. అంతకుముందు ‘బ్రూస్‌లీ’ ‘మగధీర’ చిత్రాల్లో కుమారుడి కోసం మెగాస్టార్ ఒక చిన్న క్యామియో ఇచ్చారు. మరోవైపు చిరంజీవి, పవన్ కల్యాణ్ సైతం రెండు సినిమాల్లో కలిసి నటించారు. ‘శంకర్‌దాదా MBBS’ మూవీలోని ఓ స్పెషల్ సాంగ్‌లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మెరిశారు. అలాగే ‘శంకర్ దాదా జిందాబాద్’ సినిమా క్లైమాక్స్‌లోనూ అన్న చిరుతో కలిసి పవన్ స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అయితే చిరు, పవన్, చరణ్ ముగ్గురు కలిసి ఇప్పటివరకూ ఒక్కసారి కూడా నటించలేదు. క్యామియోలు తప్ప కలిసి ఫుల్ లెంగ్త్ రోల్స్‌లో నటించలేదు. దీంతో మెగా మల్టీస్టారర్ చిత్రం కోసం ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు.
మెగా ఫ్యామిలీతో అనుబంధం
దర్శకుడు హరీష్ శంకర్‌కు మెగా ఫ్యామిలీతో మంచి అనుబంధం ఉంది. పవన్ కల్యాణ్‌తో పాటు మెగా ఫ్యామిలీకి వీర విధేయుడన్న పేరు ఈ మాస్ డైరెక్టర్‌కు ఉంది. మెగా ఆడియన్స్ పల్స్ గురించి హరీష్ శంకర్‌కు బాగా తెలుసు. ఆయన ఇప్పటికే నలుగురు మెగా హీరోలతో పని చేశారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో 'గబ్బర్ సింగ్' (Gabbar Singh), అల్లు అర్జున్‌తో 'దువ్వాడ జగన్నాథం' (Duvvada Jagannadham), వరుణ్‌తేజ్‌తో 'గద్దలకొండ గణేష్' (Gaddalakonda Ganesh), సాయి ధరమ్ తేజ్‌తో 'సుబ్రహ్మణ్యం ఫర్ సేల్' (Subrahmanya For Sale) చిత్రాలు తెరెకెక్కించారు. అందులో మెగా హీరోలను చూపించిన తీరు ఫ్యాన్స్‌ను ఎంతగానో మెప్పించింది. దీంతో అతడి డైరెక్షన్‌లో మల్టీస్టారర్ వస్తే ఇక బాక్సాఫీస్ బద్దలు కావడం ఖాయమని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. ఈ ప్రాజెక్ట్ ఓకే అయ్యి త్వరలోనే పట్టాలెక్కాలని కోరుకుంటున్నారు.
‘ఉస్తాద్ భగత్ సింగ్ గుర్తుండిపోతుంది’
పవన్ కల్యాణ్, హరీష్ శంకర్ కాంబోలో 'ఉస్తాద్ భగత్ సింగ్' (Ustad Bhagat Singh) తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పవన్ కల్యాణ్ ఏపీ రాజకీయాల్లో బిజీ అయిన నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్‌కు బ్రేకులు పడ్డాయి. దీంతో ఆ చిత్రాన్ని పక్కన పెట్టి రవితేజతో 'మిస్టర్ బచ్చన్' (Mr.Bachchan) సినిమాను సైతం హరీష్ శంకర్ రూపొందించారు. తాజాగా నిర్వహించిన ప్రెస్ మీట్లో ఉస్తాద్ భగత్ సింగ్ గురించి హరీష్ శంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. ఆయన వీలును బట్టి సినిమా పూర్తవుతుందని స్పష్టం చేశారు. ఈ చిత్రం చాలా ఏళ్ల పాటు అభిమానులకు గుర్తుండిపోతుందని భరోసా ఇచ్చారు. పవన్ కల్యాణ్ సినిమా అంటే ఏది ఆశించి థియేటర్లకు వస్తోరో ఆ అంశాలన్నీ సంపూర్ణంగా ఉస్తాద్ భగత్ సింగ్‌లో ఉంటాయని చెప్పుకొచ్చారు. ఫ్యాన్స్ మళ్లీ మళ్లీ ఈ సినిమాను చూస్తారని ధీమా వ్యక్తం చేశారు.
జూలై 30 , 2024
Pawan vs Jr NTR: పవన్ ‘ఓజీ’కి సవాలు విసురుతున్న తారక్ ‘దేవర’.. ఎందుకంటే?
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ పాన్ ఇండియా చిత్రాలకు కేరాఫ్‌గా మారిపోయింది. ఇక్కడి స్టార్ హీరోల చిత్రాలన్ని దాదాపుగా జాతీయ స్థాయిలోనే విడుదలవుతున్నాయి. ఈ క్రమంలోనే పవన్ కల్యాణ్ ‘ఓజీ’ (OG), జూనియర్ ఎన్టీఆర్ ‘దేవర’ (Devara) చిత్రాలు కూడా ఇండియా వైడ్‌గా రిలీజ్‌కు సిద్ధమవుతున్నాయి. ‘ఓజీ’లో పవన్ సరసన ప్రియాంక మోహన్ (Priyanka Mohan) నటిస్తుండగా.. ‘సాహో’ (Sahoo) ఫేమ్ సుజీత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మరోవైపు దేవర (Devara) చిత్రాన్ని కొరటాల శివ (Koratala Siva) రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఈ రెండు చిత్రాలపై ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ రెండు సినిమాల విడుదల తేదీలు విడుదల కాగా.. అవి క్లాష్ అయ్యాయి. ప్రస్తుతం ఈ అంశం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
క్లాష్ ఎలా వచ్చిందంటే?
పాన్ ఇండియా (Pawan vs Jr NTR) లెవెల్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్న సినిమాల్లో ‘దేవర’, ‘ఓజీ’ ఉన్నాయనే విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ రెండు సినిమాలకు సంబంధించిన గ్లిమ్స్ వీడియోస్ విడుదలై మంచి రెస్పాన్స్‌ని దక్కించుకున్నాయి. దేనికి ఎక్కువ క్రేజ్ ఉంది అంటే చెప్పలేని సిట్యువేషన్. తాజాగా రెండు సినిమాల మేకర్స్ విడుదల తేదీని ప్రకటించారు. దీని ప్రకారం పవన్ ‘ఓజీ’ చిత్రం సెప్టెంబర్ 27న వస్తుండగా.. తారక్ దేవర మూవీ అక్టోబర్ 10న విడుదల కాబోతున్నాయి. ఈ రెండు చిత్రాలకు (OG vs Devara) దాదాపు రెండు వారాల సమయం ఉన్నప్పటికీ స్టార్ హీరోలు బరిలో నిలుస్తుండటంతో వీరి మధ్య పోటీ ఆసక్తికరంగా మారింది.
https://twitter.com/cinecorndotcom/status/1758446390534197283
గతంలోనూ ఇలాగే!
గతంలోనూ పవన్ కల్యాణ్, తారక్ (OG vs Devara) చిత్రాలు కొద్ది రోజుల వ్యవధిలోనే విడుదలయ్యాయి. 2013లో పవన్ నటించిన అత్తారింటికి దారేది (Atharintiki Daaredi) చిత్రం కూడా సరిగ్గా సెప్టెంబర్ 27న విడుదలైంది. అప్పట్లో ఆ చిత్రం ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. సినిమా విడుదలకు ముందే ఒరిజినల్ ప్రింట్ బయటకు వచ్చినప్పటికీ పవన్ మేనియాతో ఆ సినిమా సాలిడ్ హిట్ అందుకుంది. అయితే కొద్ది రోజుల గ్యాప్‌లో ఎన్టీఆర్ 'రామయ్య వస్తావయ్యా' (Ramayya Vasthavayya) చిత్రం రిలీజై డిజాస్టర్‌గా నిలిచింది. దీంతో పవన్ విన్నర్‌గా నిలిచాడు. అయితే ఈసారి పోటీ చాలా రసవత్తరంగా ఉండే అవకాశముంది. ఎందుకంటే సాహో ఫ్లాప్‌తో సుజీత్.. ఆచార్య డిజాస్టర్‌తో కొరటాల శివ ఈ సినిమాలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మిస్తున్నారు.
2 వారాలు సరిపోతాయా?
పవన్ సినిమా 'దేవర'కు మధ్య (Pawan vs Jr NTR) రెండు వారాల గడువు మాత్రమే ఉంది. ముందుగా ‘ఓజీ’ థియేటర్లలోకి వస్తుండటంతో ఆ చిత్రానికి థియేటర్ల కేటాయింపులో సమస్య ఉండకపోవచ్చు. కానీ రెండు వారాల గ్యాప్‌లోనే ‘దేవర’ వస్తుండటంతో ఓజీ థియేటర్లను ఆ సినిమా ఆక్రమించుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతో ఓజీ కలెక్షన్స్‌పై భారీగా ప్రభావం పడవచ్చని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గతేడాది క్రిస్మస్ కానుకగా వచ్చిన సలార్ (Salaar)కు కూడా ఇలాంటి సమస్యే ఎదురైంది. రెండు వారాల తర్వాత సంక్రాంతి బరిలో పెద్ద సినిమాలు నిలవడంతో సలార్ భారీ సంఖ్యలో థియేటర్లను కోల్పోయింది. దీంతో రూ.1000 కోట్లు కలెక్ట్ చేస్తుందనుకున్న ప్రభాస్ చిత్రం రూ.700 కోట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కాబట్టి ఓజీకి కూడా ఇదే పరిస్థితి ఎదురువుతుందా? అన్న ప్రశ్న ప్రధానంగా వినిపిస్తోంది.
‘ఒకేసారి రిలీజ్ చేయండి’
దేవర, ఓజీ సినిమాల క్లాష్ అంశం (Pawan vs Jr NTR) సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో ఇరువురి హీరోల ఫ్యాన్స్ రంగంలోకి దిగారు. రెండు సినిమాలను ఒకే రోజు రిలీజ్ చేయాలని వారు సూచిస్తున్నారు. అప్పుడు ఎవరి సత్తా ఏంటో తెలుస్తుందని అంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తమ హీరో సినిమా విజయం సాధిస్తుందని పవన్, తారక్ ఫ్యాన్స్ ఇరువురు చాలా దీమాగా ఉన్నారు. ఇండస్ట్రీ రికార్డులను అవి బద్దలు కొడతాయని అంటున్నారు. మరికొందరు న్యూట్రాల్ ఫ్యాన్స్ రెండు వారాల గ్యాప్ ఉండటమే బెటర్ అని అభిప్రాయపడుతున్నారు. అది ఇండస్ట్రీకి మేలు చేస్తుందని చెబుతున్నారు.
ఫిబ్రవరి 17 , 2024
Viswambhara : 18 ఏళ్ల తర్వాత త్రిషతో రొమాన్స్ చేయనున్న చిరంజీవి!
గత కొన్నిరోజులుగా టాలీవుడ్ (Tollywood)ను తొలిచేస్తున్న ప్రశ్నకు ఇవాళ సమాధానం దొరికింది. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) తర్వాతి చిత్రం ‘విశ్వంభర’లో హీరోయిన్ ఎవరన్న ఊహాగానాలకు చిత్ర బృందం చెక్ పెట్టింది. ఇందులో చిరుకు జోడీగా స్టార్ నటి త్రిష (Actress Trisha) నటించనున్నట్లు మూవీ యూనిట్ ప్రకటించింది. అంతేకాకుండా త్రిష సెట్‌లో పాల్గొన్న వీడియోను చిరంజీవి స్వయంగా షేర్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
చిరు - త్రిష ఆలింగనం
చిరు షేర్ చేసిన వీడియో ప్రకారం.. మెుదట సెట్‌లో అడుగుపెట్టిన మెగాస్టార్.. డైరెక్టర్ వశిష్టతో (Mallidi Vasishta) కలిసి స్క్రిప్ట్‌కు సంబంధించిన విషయాలను చర్చిస్తుంటారు. పక్కనే చిరు తనయ సుస్మిత (Sushmita Konidela) కూడా నిలబడి ఉంటుంది. ఈ క్రమంలోనే నటి త్రిష.. క్యారీవ్యాన్ నుంచి బయటకొచ్చి మెగాస్టార్ చిరును ఆలింగనం చేసుకుంటుంది. ఆ తర్వాత మెగాస్టార్ ఆమెకు పుష్పగుచ్చంతో సెట్‌లోకి స్వాగతం పలుకుతారు. ఈ వీడియోను చూసిన మెగా ఫ్యాన్స్ ఉత్సాహంతో ఊగిపోతున్నారు. లైక్స్, షేర్స్‌తో వీడియోను ట్రెండింగ్ చేస్తున్నారు.
https://twitter.com/i/status/1754373323910533528
18 ఏళ్ల తర్వాత..
చిరంజీవి - త్రిష జత కట్టడం (Viswambhara Trisha) ఇదేమి తొలిసారి కాదు. 2006లో వచ్చి ‘స్టాలిన్’ సినిమాలో వీరిద్దరు తొలిసారి జోడీగా నటించారు. ఆ తర్వాత వీరు ఏ సినిమాలో కలిసి నటించలేదు. 18 ఏళ్ల తర్వాత తిరిగి ఈ జోడి నటిస్తుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ‘స్టాలిన్’ సమయంలోనే వీరి జోడీకి మంచి మార్కులు పడ్డాయి. వెండి తెరపై వీరి కెమెస్ట్రీ చాలా బాగుందంటూ అప్పట్లో కథనాలు కూడా వచ్చాయి. ఇప్పుడు ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ‘విశ్వంభర’లో చిరు - త్రిష జతకడుతుండటంతో ఈ జోడీ ఈసారి ఏ మ్యాజిక్ చేస్తుందోనన్న ఆసక్తి ఇండస్ట్రీలో నెలకొంది.
ఆచార్యకు నో చెప్పిన త్రిష!
నిజానికి ‘ఆచార్య’ చిత్రంలోనే చిరుకి జోడీగా త్రిష నటించాల్సి ఉంది. చిత్ర యూనిట్ తొలుత త్రిషనే హీరోయిన్‌గా ప్రకటించింది కూడా. అయితే షూటింగ్ ప్రారంభానికి కొద్ది రోజుల ముందే తాను సినిమా నుంచి తప్పుకుంటున్నట్లు త్రిష వెల్లడించింది. క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా ఆచార్య నుంచి వైదొలుగుతున్నట్లు ఆ సందర్భంలో ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. ఈ వ్యవహారం అప్పట్లో హాట్ టాపిక్‌గా మారింది. చిరు సినిమా ఆఫర్‌ను త్రిష కాదనుకోవడం పలు ఊహాగానాలకు తావిచ్చింది. ఇక మెగా సినిమాలో త్రిష కనపించడం కష్టమేనన్న వార్తలు కూడా వచ్చాయి. వాటన్నింటికి చెక్ పెడుతూ చిరు లేటెస్ట్ మూవీలో ఈ భామ అవకాశం దక్కించుకోవడం విశేషం.
సెకండ్ హీరోయిన్ ఎవరో?
‘విశ్వంభర’లో త్రిష (Viswambhara)తో పాటు మరో హీరోయిన్ కూడా నటించబోతున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఆమె కోసం మంచి పాత్ర కూడా సిద్దంగా ఉందని అంటున్నారు. అయితే ఆ పాత్రకు సరిగ్గా సరిపోయే భామ కోసం చిత్ర యూనిట్ తెగ వెతికేస్తున్నట్లు టాక్. అంతకుముందు చిరు జోడీ ఎవరు? అంటు పలు హీరోయిన్ల పేరు బయటకొచ్చాయి. వారిలో త్రిషతో పాటు కాజల్ అగర్వాల్, హానీ రోజ్, సంయుక్త మీనన్ పేర్లు వినిపించాయి. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకునేను కూడా తీసుకునే ఛాన్స్ ఉందని వార్తలు వచ్చాయి. మరి మెయిన్ హీరోయిన్‌గా త్రిష ఫైనల్ అయిన నేపథ్యంలోనే ఈ జాబితా నుంచే సెకండ్ హీరోయిన్‌ను కూడా ఎంచుకుంటారా? లేదా? అన్నది చూడాలి.
13 భారీ సెట్‌లు..!
చిరు 156వ చిత్రంగా ‘విశ్వంభర’ (Viswambhara Trisha) రూపొందుతోంది. సాహసాలు, ఊహా ప్రపంచం మేళవింపుతో ఈ చిత్రం మెగాస్టార్ కెరీర్‌లోనే అత్యధిక వ్యయంతో రూపుదిద్దుకుంటోంది. ఈ మూవీ కోసం 13 భారీ సెట్‌లతో ప్రత్యేక ప్రపంచాన్నే సృష్టించారు. 2025 జనవరి 10న ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ (UV Creations) బ్యానర్‌పై ఇది రానుంది.
ఫిబ్రవరి 05 , 2024