• TFIDB EN
  • ఆచార్య (2022)
    U/ATelugu2h 34m
    బసవ(సోనూసూద్) పాలనలో ఉన్న ధర్మస్థలిలో అధర్మం రాజ్యమేలుతుంటుంది. ఆ సమయంలో ఆచార్య(చిరంజీవి) అక్కడకి వస్తాడు. బసవ, అతని మనుషులు చేసే అరాచకాలను ఆచార్య ఎలా ఎదురించాడు. అసలు ధర్మస్థలికి ఆచార్య ఎందుకు వస్తాడు? పాదఘట్టం సంరక్షకుడిగా ఉన్న సిద్ధకు ఆచార్యకు మధ్య సంబంధం ఏమిటి అనేది మిగిలిన కథ
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌Primeఫ్రమ్‌
    Watch
    రివ్యూస్
    How was the movie?

    @maheshYadavv

    8 months ago

    తారాగణం
    చిరంజీవి
    కామ్రేడ్ ఆచార్య
    రామ్ చరణ్
    కామ్రేడ్ సిద్ధ
    పూజా హెగ్డే
    నీలాంబరి
    సోనూ సూద్
    బసవ
    జిషు సేన్‌గుప్తా
    రాథోడ్
    సౌరవ్ లోకేష్
    రాథోడ్ సోదరుడు
    నాసర్
    అదన్నా
    అజయ్
    వేదన్న
    తనికెళ్ల భరణి
    పూజారి
    వెన్నెల కిషోర్
    ఆచార్య శిష్యుడు
    సివిఎల్ నరసింహారావు
    బెనర్జీ
    కామ్రేడ్ బోస్
    శత్రు
    ఖిల్లా
    రవి ప్రకాష్
    శివుడు
    పవన్
    బసవ హెంచ్మెన్
    రఘు బాబు
    డ్రగ్ సప్లయర్ (బసవ హెంచ్‌మెన్)
    రాజా రవీందర్
    బసవ హెంచ్మెన్
    భరత్ రెడ్డి
    రణధీర్ రెడ్డి
    ప్రియదర్శి పులికొండ
    సుమన్
    శుభలేఖ సుధాకర్
    చరణ్ రాజ్
    రాజా చెంబోలు
    సత్య ప్రకాష్
    సత్యప్రకాష్
    సత్యదేవ్ కంచరణా
    సిద్ధ తండ్రి (అతి అతిథి పాత్ర)
    సంగీత క్రిష్
    లాహే లాహే పాటలో నర్తకి
    సిబ్బంది
    కొరటాల శివ
    దర్శకుడు
    నిరంజన్ రెడ్డినిర్మాత
    నిరంజన్ రెడ్డినిర్మాత
    మణి శర్మ
    సంగీతకారుడు
    తిర్రు
    సినిమాటోగ్రాఫర్
    నవీన్ నూలి
    ఎడిటర్ర్
    కథనాలు
    మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
    మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
    స్వయంకృషితో సినీ ఇండస్ట్రీలో అగ్రస్థానానికి ఎదగ వచ్చని నిరూపించిన వ్యక్తి ఆయన. టాలీవుడ్‌ బాక్సాఫీస్‌ను పరుగులు పెట్టించిన ఆచార్యుడు. కొత్త టాలెంట్ ఉన్న యువకులకు అండగా నిలబడే 'అన్నయ్య' ఆయన. కోవిడ్ సమయంలో ఎంతో మందికి సాయం చేసిన ఆపాద్బాంధవుడు. ఆయనెవరో కాదు మన మెగాస్టార్ చిరంజీవి. పద్మవిభూషణుడిగా వెలుగొందుతూ.. భావితరాలకు స్ఫూర్తి నింపుతున్న చిరంజీవిగారి గురించి చాలా మందికి తెలియని కొన్ని విషయాలు ఇప్పుడు చూద్దాం.. చిరంజీవి అసలు పేరు? కొణిదెల శివశంకర్ వరప్రసాద్ చిరంజీవి ఎత్తు ఎంత? 5 అడుగుల 7 అంగుళాలు చిరంజీవి నటించిన తొలి సినిమా? ప్రాణం ఖరీదు, (చిరంజీవి నటింటిన తొలి చిత్రం పునాది రాళ్లు అయినా.. ప్రాణం ఖరీదు ముందుగా విడులైంది) చిరంజీవి ఎక్కడ పుట్టారు? పశ్చిమ గోదావరి, మొగల్తూరు, ఆంధ్రప్రదేశ్ చిరంజీవి పుట్టిన తేదీ ఎప్పుడు? 1955 ఆగస్టు 22 చిరంజీవి భార్య పేరు? ప్రముఖ హాస్య నటుడు అల్లు రామలింగయ్య కూతురు సురేఖను 1980లో పెళ్లి చేసుకున్నారు. చిరంజీవి అభిరుచులు? చిరంజీవికి ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం. వీలు చిక్కినప్పుడల్లా ప్రకృతి అందాలను తన కెమెరాలో బంధించి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తుంటాడు చిరంజీవికి మెగాస్టార్ బిరుదు ఎవరు ఇచ్చారు?  "సుప్రీమ్‌ హీరో"గా గుర్తింపు పొందిన చిరంజీవి.. తర్వాత మెగాస్టార్‌గా క్రేజ్‌ సంపాదించుకున్నాడు. 'మరణ మృదంగం' చిత్రం విజయం తర్వాత ఆ సినిమా నిర్మాత కేఎస్‌ రామారావు, చిరంజీవిని మెగాస్టార్‌గా పిలవడం ప్రారంభించారు. చిరంజీవి బ్రేక్ డ్యాన్స్‌ ఏ సినిమాలో ఫస్ట్‌ టైం చేశారు? పసివాడి ప్రాణం చిత్రం ద్వారా చిరంజీవి తొలిసారి తెలుగులో బ్రేక్ డ్యాన్స్ పరిచయం చేశారు చిరంజీవికి ఇష్టమైన సినిమా? రుద్రవీణ చిరంజీవికి ఇష్టమైన పాటలు? రుద్రవీణ చిత్రంలోని 'నమ్మకు నమ్మకు ఈ రేయిని' పాట అంటే చాలా ఇష్టమని పేర్కొన్నారు. చిరంజీవి అభిమాన నటుడు? అమితాబ్ బచ్చన్, శత్రఘ్ను సిన్హా చిరంజీవికి స్టార్ డం అందించిన చిత్రం? ఖైదీ చిరంజీవికి ఇష్టమైన కలర్? బ్లాక్ అండ్ వైట్ చిరంజీవి తల్లిదండ్రుల పేర్లు? కొణిదెల వెంక‌ట్రావ్, అంజనా దేవి  చిరంజీవి ఏం చదివారు? BCom https://www.youtube.com/watch?v=hURrrR2lMrY చిరంజీవి ఎన్ని సినిమాల్లో నటించారు? 150కి పైగా సినిమాల్లో నటించారు చిరంజీవికి ఇష్టమైన ఆహారం? బొమ్మడాయిల పులుసు, చిన్న చిన్న చెపల్లో చింతకాయ వేసి వండితే ఇష్టంగా తింటారు. చిరంజీవి నికర ఆస్తుల విలువ ఎంత? రూ.3000కోట్లు చిరంజీవి సినిమాకి ఎంత తీసుకుంటారు?  ఒక్కో సినిమాకి దాదాపు రూ.70కోట్లు తీసుకుంటారు.
    మార్చి 19 , 2024
    Pushpa 2 Second Song: ‘రారా నా సామి’ పాటను బీట్‌ చేయలేకపోయిన పుష్ప 2 మెలోడి సాంగ్!
    Pushpa 2 Second Song: ‘రారా నా సామి’ పాటను బీట్‌ చేయలేకపోయిన పుష్ప 2 మెలోడి సాంగ్!
    అల్లు అర్జున్‌ (Allu Arjun) హీరోగా సుకుమార్‌ (Sukumar) దర్శకత్వంలో  తెరకెక్కుతోన్న భారీ చిత్రం ‘పుష్ప 2’ (Pushpa 2: The Rule). గతంలో వచ్చిన బ్లాక్‌ బాస్టర్‌ చిత్రం ‘పుష్ప’ (Pushpa: The Rise)కు సీక్వెల్‌గా ఈ చిత్రం రూపొందుతోంది ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌ విడుదల కానుంది. ప్రమోషన్‌లో భాగంగా ఇటీవలే తొలిపాటను విడుదల చేయగా అది జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడు తాజాగా మేకర్స్ రెండో సాంగ్‌ కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.  సోషల్‌ మీడియా షేక్‌ అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న ‘పుష్ప 2 ‘నుంచి సెకండ్ సింగిల్ వచ్చేసింది. ‘సూసేకి అగ్గిర‌వ్వ మాదిరి ఉంటాడే నా సామీ’ పాట‌ను మేక‌ర్స్ బుధ‌వారం (మే 29) రిలీజ్ చేశారు. ఫోక్ స్టైల్‌లో మాస్ ట్యూన్స్‌తో సాగిన ఈ పాట రిలీజైన కొద్ది క్ష‌ణాల్లోనే సోషల్‌మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. చంద్ర‌బోస్ ఈ పాట‌కు సాహిత్యాన్ని స‌మ‌కూర్చగా దేవిశ్రీప్ర‌సాద్ మ్యూజిక్ అందించాడు. బాలీవుడ్‌ స్టార్‌ కొరియోగ్రాఫర్‌ గణేష్ ఆచార్య ఈ సాంగ్‌కు స్టెప్పులు సమకూర్చారు. ఈ సాంగ్‌పై మీరు ఓ లుక్కేయండి. https://www.youtube.com/watch?v=qxbHtcfHq2s&list=PLTtJUIuknk93P010cakd2jZANGFP70tj9&index=1 సాంగ్‌లో ఏముందంటే? ‘సూసేకి అగ్గిర‌వ్వ మాదిరి ఉంటాడే నా సామీ’ పాట‌లో పుష్పరాజ్‌ (బన్నీ), శ్రీవల్లి (రష్మిక) కెమిస్ట్రీ అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటోంది. ఈ రొమాంటిక్ డ్యూయెట్‌లో ఐకానిక్‌ డ్యాన్స్ స్టెప్పుల‌తో అల్లు అర్జున్‌, రష్మిక మందన్న అదరగొట్టారు. గణేష్‌ ఆచార్య అందించిన స్టెప్పులు చాలా క్యాచీగా ఉన్నాయి. దేవిశ్రీప్ర‌సాద్ క్యాచీ ట్యూన్స్‌ మెస్మరైజ్‌చేస్తోంది. డైరెక్టర్ సుకుమార్‌ కూడా సాంగ్‌ చివర్లో స్టెపులు వేసి అలరించారు. తెలుగు, మ‌ల‌యాళం, క‌న్న‌డం, త‌మిళంతో పాటు మొత్తం ఆరు భాష‌ల్లో సూసేకీ పాట‌ను రిలీజ్ చేశారు. ఆరు భాష‌ల్లోనూ శ్రేయా ఘోష‌ల్ ఈ పాట‌ను పాడ‌టం విశేషం. రారా నా సామి పాటను మరిపించిందా? పుష్ప సినిమా నుంచి వచ్చిన ‘రారా నా సామి’ మెలోడి సాంగ్‌ దేశ వ్యాప్తంగా ఎంత సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిందో అందరికీ తెలిసిందే. మాస్, క్లాస్ ఇలా తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ సాంగ్‌ మెస్మరైజ్‌ చేసింది. అయితే పుష్ప 2 నుంచి మెలోడి సాంగ్ అనగానే ఫ్యాన్స్‌ ‘రారా నా సామి’ రేంజ్‌లోనే ఊహించుకున్నారు. అయితే చాలా మందికి ‘సూసేకి అగ్గిర‌వ్వ మాదిరి ఉంటాడే నా సామీ’ పాట నచ్చినప్పటికీ.. ఓవర్‌గా ఎక్స్‌పెక్ట్‌ చేసిన కొద్ది మంది మాత్రం పెదవి విరుస్తున్నారు. తమకు సీక్వెల్‌లో సాంగ్‌ కంటే ‘రారా నా సామి’ పాటే బాగుందని అంటున్నారు. మాస్ ఆడియన్స్‌కు ఈ మెలోడి అంతగా రుచించకవచ్చని కామెంట్స్ చేస్తున్నారు.  రికార్డుల మోత పుష్ప 2 సినిమా నుంచి మే 1వ తేదీన ఫస్ట్‌ సింగిల్‌ లిరికల్‌ సాంగ్‌ను రిలీజ్‌ చేశారు. పుష్ప‌.. పుష్ప  అంటూ సాగే ఈ టైటిల్‌ సాంగ్‌ మాస్‌ ఆడియన్స్‌ను, మ్యూజిక్ ల‌వ‌ర్స్‌ను ఉర్రూత‌లూగిస్తోంది. యూట్యూబ్‌లో ఈ పాట‌కు 10 కోట్లకుపైగా వ్యూస్ వచ్చినట్లు పుష్ప 2 మేకర్స్ ఇటీవల ప్రకటించారు.  అంతేకాదు 22.6 లక్షల లైక్స్ కూడా వచ్చినట్లు పేర్కొన్నారు. రీసెంట్ టైమ్‌లో తెలుగులో అత్య‌ధిక వ్యూస్‌ను ద‌క్కించుకున్న సాంగ్‌గా పుష్ప ఫ‌స్ట్ సింగిల్ నిలిచింది. క్లైమాక్స్‌లో భారీ ట్విస్ట్‌ ప్రస్తుతం ‘పుష్ప 2’ క్లైమాక్స్‌ చిత్రీకరణ జరుగుతున్నట్లు సమాచారం. ఈ సినిమా క్లైమాక్స్‌లో మేకర్స్‌ ఊహించని ట్విస్ట్‌ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. పుష్ప 3కి సంబంధించిన సమాచారం క్లైమాక్స్‌లో ఇవ్వనున్నట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. అలాగే ఈ సినిమాలో అదిరిపోయే ఐటెం సాంగ్‌ కూడా ప్లాన్‌ చేస్తున్నారని టాక్‌. యానిమల్‌ బ్యూటీ తృప్తి డిమ్రి ఈ సాంగ్‌లో ఆడిపాడనున్నారని వార్తలు వస్తున్నాయి. త్వరలోనే సుకుమార్‌ ఈ పాటను కూడా షూట్‌ చేసే అవకాశం ఉంది. కాగా, ఈ చిత్రంలో ఫహాద్‌ ఫాజిల్‌, సునీల్‌, అనసూయ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆగస్టు 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. 
    మే 29 , 2024
    Chiru Leaks: లీకు రాజా బిరుదుకు చెక్ పెట్టిన మెగాస్టార్.. సినిమా ప్రమోషన్లలో సరికొత్త ట్రెండ్..! 
    Chiru Leaks: లీకు రాజా బిరుదుకు చెక్ పెట్టిన మెగాస్టార్.. సినిమా ప్రమోషన్లలో సరికొత్త ట్రెండ్..! 
    సినిమాను తీయడం ఒక ఎత్తయితే, ఆ సినిమాను ప్రజల్లోకి తీసుకెళ్లడం మరొక ఎత్తు. చిత్రబృందం పడిన కష్టానికి ఫలితం ప్రేక్షకులకు చేరాలంటే సినిమాకు ప్రచారం తప్పనిసరి. ఇలా పబ్లిసిటీ కోసం ప్రత్యేకంగా ఓక బృందమే పనిచేస్తుంది. అయితే, రాను రాను ఇండస్ట్రీలో ట్రెండ్ మారిపోతోంది. ఎవరో అప్‌డేట్స్ లీక్ చేయడం కన్నా.. చిత్రబృందమే వరుసగా అప్‌డేట్స్ ఇస్తూ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియా అర చేతిల్లోకి రావడంతో సినిమాకు కావాల్సిన ప్రచారమూ దక్కుతోంది. ఈ కోవలోకి చెందిందే చిరు లీక్స్. మెగాస్టార్ చిరంజీవి ఈ అప్‌డేట్స్‌ని అధికారికంగా లీక్ చేస్తుండటం ట్రెండ్ సెట్టర్‌గా నిలుస్తోంది.  తప్పుని ఒప్పులా.. మెగాస్టార్ చిరంజీవి మాస్టర్ బ్రెయిన్‌కు చిరు లీక్స్ నిదర్శనం. గతంలో చిరంజీవి పలు లీకులను చేశాడు. ఆచార్య టైటిల్ రివీల్ చేయడం, ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్‌చరణ్ పాత్రకు సంబంధించి అన్యాపదేశంగా చెప్పేశాడు.  https://twitter.com/AKentsOfficial/status/1666764990228107267 పొరపాటున వెల్లడించిన వివరాల వల్ల కొంతవరకు విమర్శలకు గురయ్యారు. కానీ, ఇప్పుడు అదే నెగెటివ్ పాయింట్‌ని పాజిటివ్‌గా మలిచిన నటుడు చిరంజీవి.  లీక్ చేస్తున్నామని అధికారికంగా వెల్లడించి మరీ చెప్తుండటం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. గాడ్‌ఫాదర్ మూవీ నుంచి చిరులీక్స్‌ని అఫీషియల్ చేసేశాడు మెగాస్టార్.  ప్రస్తుతం చిరంజీవి భోళాశంకర్ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్‌ని స్వయంగా మెగాస్టారే రివీల్ చేస్తున్నాడు.  https://twitter.com/MeherRamesh/status/1666809538392240129 ఇతర పీఆర్‌లతో పోలిస్తే చిరుకి ఫాలోయింగ్ కాస్త ఎక్కువే. దీంతో ఎక్కువ మందికి రీచ్ కావడానికి ఈ లీక్స్ ఉపయోగపడుతున్నాయి. అలా గాడ్‌ఫాదర్, వాల్తేరు వీరయ్య సినిమాల నుంచి చేసిన లీక్స్ థియేటర్లకు జనాలను రప్పించాయి.  ఇప్పుడు ఇదే పంథాలో భోళాశంకర్ మూవీ నుంచి మేకింగ్ వీడియోను ఫ్యాన్స్‌కి లీక్ చేశాడు. ఓ సాంగ్ కోసం రూపొందించిన భారీ సెట్‌ వీడియో ఇది. ఇందులో ‘జాం జాం జజ్జనిక.. తెల్లార్లు ఆడుదాం తయ్యితక్క’ సాంగ్‌కి చిరు, సుమంత్, తమన్నా, కీర్తి సురేష్ స్టెప్పులేశారు. ఈ పాటను కాసర్ల  శ్యాం రాయగా, మహతి స్వర సాగర్ స్వరపరిచాడు. వీజే శేఖర్ మాస్టర్ డ్యాన్స్ కొరియోగ్రఫీ అందించాడు.  సినిమా అనేది కోట్ల రుపాయలతో కూడుకున్న బిజినెస్. సినిమాలోని ఏ విషయం లీకైనా అది మొత్తం సినిమా రెవెన్యూపైనే ప్రభావం చూపిస్తుంది. అందుకే చాలా జాగ్రత్తగా ఉంటూ కాన్ఫిడెన్షియాలిటీని మెయింటేన్ చేస్తూ ఉంటారు సిబ్బంది.  తెలియకుండానే చిరు చేసిన లీక్స్ కారణంగా కొందరు విమర్శించారు. డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లకు తలనొప్పిలా మారాడని పెదవి విరిచారు.  ఇప్పుడు ఇదే సరికొత్త మార్కెటింగ్ స్ట్రాటజీగా మారింది. చిరు నుంచి ఎప్పుడెప్పుడు లీక్స్ వస్తాయా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తుండటం గమనార్హం.  భోళాశంకర్ సినిమాను ఆగస్టు 11న విడుదల చేస్తున్నారు. దీంతో 2 నెలల ముందు నుంచే సినిమా ప్రమోషన్లను తన స్టైల్‌లో మొదలు పెట్టాడు చిరు. ఒకొక్క లీక్ ఇస్తూ జనాల్లో తన సినిమా ఉండేలా చూసుకుంటున్నాడు. ఇక అధికారిక ప్రచారాలు సపరేటు.  తమిళ సినిమా వేదాళంకు రిమేక్‌గా భోళాశంకర్ తెరకెక్కుతోంది. తెలుగులో మెహర్ రమేశ్ తీస్తున్నాడు. చిరుకు జోడీగా తమన్నా నటించింది. కీర్తి సురేశ్ చిరంజీవి చెల్లెలి పాత్ర పోషించింది. https://www.youtube.com/watch?v=91RtI6ZG2bc
    జూన్ 09 , 2023
    Pooja Hegde: పూజాను వెంటాడుతున్న ఫ్లాపులు.. ఐరన్‌ లెగ్‌ ట్యాగ్‌కు సల్మాన్‌ చెక్ పెట్టేనా?
    Pooja Hegde: పూజాను వెంటాడుతున్న ఫ్లాపులు.. ఐరన్‌ లెగ్‌ ట్యాగ్‌కు సల్మాన్‌ చెక్ పెట్టేనా?
    టాలీవుడ్‌ అగ్ర కథానాయికల్లో పూజా హెగ్డే ఒకరు. 2014లో ‘ఒక లైలా కోసం’ చిత్రం ద్వారా పరిచయమైన ఈ భామ ‘ముకుంద’తో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత బన్నీతో డీజే సినిమాలో నటించిన పూజా.. ఎన్టీఆర్‌ ‘అరవింద సమేత’, ‘అలా వైకుంఠ పురం’ ద్వారా సాలిడ్ హిట్స్‌ అందుకుంది. అయితే గత కొంతకాలంగా పూజా హెగ్డేకు సినిమాల పరంగా కలిసిరావడం లేదు. టాలీవుడ్‌లో ఈ భామ చేసిన రీసెంట్‌ సినిమాలన్నీ ఫ్లాప్‌గా నిలిచాయి.మోస్ట్ ఎలిజిబుల్ బాచిలర్, బీస్ట్, ఆచార్య, రాధేశ్యామ్‌ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. దీంతో నెటిజన్లు పూజాపై ఐరన్‌ లెగ్ ముద్ర వేస్తున్నారు.  అటు బాలీవుడ్‌లోనూ పూజాను ఫ్లాపుల బెడద వెంటాడుతోంది. హృతిక్‌కు జోడీగా మెుహంజదారో చిత్రంలో నటించిన ఈ భామ హిందీలోకి గ్రాండ్‌ ఎంట్రీ ఇవ్వాలని భావించింది. అయితే ఆ సినిమా కూడా బోల్తా పడటంతో పూజా ఆశలు ఆవిరయ్యాయి. హౌస్‌ఫుల్‌ 4 చిత్రం ద్వారా మరోమారు తన అదృష్టాన్ని పరీక్షించుకున్నప్పటికీ మళ్లీ నిరాశే ఎదురైంది. దీంతో తాజాగా సల్మాన్‌తో నటించిన ‘కిసీ కా భాయ్ కిసీ కా జాన్’ చిత్రంతోనైనా ఐరెన్‌ లెగ్‌ ట్యాగ్‌ చెరిపేసుకోవాలని పూజా భావిస్తోంది. ఈ సినిమా ద్వారా తిరిగి హిట్ల బాట పట్టాలని పూజా కోరుకుంటోంది.  ‘కిసీ కా భాయ్ కిసీ కా జాన్’ సినిమా ఏప్రిల్‌ 21న రిలీజ్‌ కాబోతోంది. సల్మాన్‌ స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీగా అంచనాలు పెరిగిపోయాయి. ఈ చిత్రానికి సంబంధించిన ప్రచార చిత్రాలు, పాటల టీజర్లు ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలో రామ్‌చరణ్‌, వెంకటేష్‌ ముఖ్య పాత్రల్లో కనిపిస్తుండటం సినిమాపై మరింత క్రేజ్‌ క్రియేట్‌ చేసింది. తమిళంలో సూపర్‌ హిట్‌గా నిలిచిన వీరమ్‌ సినిమాకు రీమేక్‌గా ఈ చిత్రం రాబోతోంది. ఈ సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుందని సల్మాన్‌తో పాటు డైరెక్టర్‌ ఫర్హద్‌ సామ్జీ ధీమా వ్యక్తం చేస్తున్నారు.  మరోవైపు తనపై పడ్డ ఐరన్‌ లెగ్‌ ముద్రపై గతంలోనే పూజా హెగ్డే క్లారిటీ ఇచ్చారు. ప్రతీ సినిమా విజయం సాధించాలన్న ఉద్దేశంతోనే కష్టపడి చేస్తానని చెప్పుకొచ్చారు. జయాపజయాలు మన చేతిలో ఉండవని పేర్కొన్నారు.ప్రస్తుతం మహేశ్‌, త్రివిక్రమ్‌ కాంబోలో తెరకెక్కుతున్న SSMB28లో పూజా నటిస్తోంది. ఆ తర్వాత విజయ్‌ దేవరకొండ సరసన ‘జనగణమన’ చిత్రంలోనూ పూజా హీరోయిన్‌గా చేయనుంది. ఈ రెండు సినిమాలు వచ్చే ఏడాది రిలీజ్‌ కానున్నాయి.
    ఏప్రిల్ 10 , 2023
    బాలివుడ్‌ను, ఇండియాను అందుకే వదిలేశా: ప్రియాంక చోప్రా
    బాలివుడ్‌ను, ఇండియాను అందుకే వదిలేశా: ప్రియాంక చోప్రా
    బాలివుడ్‌ నుంచి హాలివుడ్‌కు వెళ్లి పాన్‌ వరల్డ్‌ స్టార్‌గా ఎదిగిన నటి ప్రియాంక చోప్రా. హిందీ సినీ ప్రపంచంలో అగ్రతారగా ఉన్న ఈ భామ.. ఒక్కసారిగా బాలివుడ్‌ను వదిలేసి అమెరికా బాట పట్టింది. ఇటీవల ఓ పాడ్‌క్యాస్ట్‌లో తాను బాలివుడ్‌ను వదిలేయడానికి గల కారణాలపై ప్రియాంక సంచలన వ్యాఖ్యలు చేసింది. అసలెందుకు ప్రియాంక బాలివుడ్‌ను వీడాల్సి వచ్చింది. ఎవరు ఆమెను ఇబ్బంది పెట్టారు?. షారుఖ్‌తో స్నేహమే ఆమె కొంప ముంచిందా?  హాలివుడ్‌ ఆరంగేట్రం 2015లో వచ్చిన ‘క్వాంటికో’ అనే టీవీ సీరియల్‌ ద్వారా ప్రియాంక హాలివుడ్‌లో నటిగా అడుగుపెట్టింది. కానీ అంతకుముందే  'ఇన్ మై సిటీ' మరియు 'ఎక్సోటిక్' వంటి పాటలతో అంతర్జాతీయ వేదికపై ప్రియాంక తన ప్రతిభను ప్రదర్శించింది. ఇక్కడ అగ్రతారగా ఉన్న తాను అసలు పశ్చిమ దేశాలవైపు చూసేలా చేసిన కారణాలను డాక్స్ షెఫెర్డ్ పాడ్‌కాస్ట్‌ ఆర్మ్‌చెయిర్‌ ఎక్స్‌పెర్ట్‌లో వివరించింది. నన్ను బాలివుడ్‌ వెలివేసింది బాలివుడ్‌ తనను కావాలనే వెలివేసిందని ప్రియాంక చోప్రా సంచలన వ్యాఖ్యలు చేసింది. కొందరితో తనకు ఉన్న విభేదాల కారణంగా తనకు సినిమాల్లో అవకాశం రాకుండా చేశారని చెప్పుకొచ్చింది. అప్పుడే తన మేనేజర్‌ అంజులా ఆచార్య తనకు ఆపద్భాందవుడిలా US మ్యూజిక్‌ వీడియోల్లో అవకాశాలను పరిచయం చేశాడని  ప్రియాంక తెలిపింది. బాలివుడ్‌ నుంచి ఎలాగైన బయటపడాలనుకున్న తాను ఈ అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకున్నానని పేర్కొంది. బాలివుడ్‌ పాలిటిక్స్‌కు దూరంగా వెళ్లిపోవాలనే తాను USకు వెళ్లానని చెప్పింది. “ సంగీతం..నన్ను మరో ప్రపంచంలోకి అడుగుపెట్టేందుకు అవకాశం కల్పించింది. సినిమాలు వదిలేయాలని కాదు కానీ అప్పటికే నేను ఎన్నో సినిమాలు చేశా అయినా అవకాశాల కోసం నేల నాకాల్సిన పరిస్థితి. అలా చేయడం నాకు ఇష్టం లేదు.” అంటూ సంచలన ఆరోపణలు చేసింది.  గతంలోనూ “గతంలో ది రణ్‌వీర్‌ షోలోనూ బాలివుడ్‌పై ప్రియాంక ఆరోపణలు చేసింది. “కొంతమంది నన్ను కావాలనే పక్కనబెట్టారు. నా కెరీర్‌ను పూర్తిగా నాశనం చేయాలనుకున్నారు.” అంటూ చెప్పింది. కంగనా ఘాటు స్పందన బాలివుడ్‌ మాఫియాపై నిత్యం ఆరోపణలు చేసే కంగనా రనౌత్‌ ప్రియాంక చోప్రా వ్యాఖ్యలతో మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది. అగ్ర దర్శకుడు కరణ్‌ జోహార్‌ వేధింపుల వల్లే ప్రియాంక బాలివుడ్‌ను వదిలేయాల్సి వచ్చిందని కంగనా ఆరోపించింది. షారుఖ్‌ ఖాన్‌తో ప్రియాంక చోప్రా సన్నిహితంగా ఉండటం సహించలేకపోయిన కరణ్‌ జోహార్‌ ఆమెకు అవకాశాలు రాకుండా అడ్డుకున్నాడని ట్విట్టర్‌ వేదికగా వ్యాఖ్యలు చేసింది. కరణ్‌ వేధింపులు తాళలేకనే ప్రియాంక ఇండియాను వదిలేసిందని అంది. “ గ్యాంగ్‌లు ఏర్పడి, ప్రియాంక చోప్రా బాలివుడ్‌ను వీడే వరకూ వెంటపడ్డారు. కరణ్ జోహారే ఆమెను బ్యాన్‌ చేశాడని అందరికీ తెలుసు’ అంటూ కంగనా రాసుకొచ్చింది. “ అసహ్యకరమైన, నీచమైన, విషపూరిత వ్యక్తి సినీ పరిశ్రమ వాతావరణాన్ని నాశనం చేస్తున్నాడు. అతడి గ్యాంగ్‌, PR మాఫియాపై దాడి చేయాలి” అంటూ కంగనా ఉద్వేగంతో ట్వీట్లు చేసింది.  ప్రియాంక, కంగనా మాత్రమే కాదు బాలివుడ్‌ గ్యాంగ్‌, గ్రూపులపై పలువురు ఇతర సెలబ్రిటీలు కూడా పలుమార్లు వ్యాఖ్యలు చేశారు. ఏఆర్ రెహమాన్‌, రవీనా టాండన్‌ అందులో కొందరు. AR రెహమాన్‌ గతంలో ఏఆర్‌ రెహమాన్ బాలివుడ్‌లో తక్కువ సినిమాలు చేయడానికి గల కారణాలపై  ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “మంచి సినిమాలకు నేనెప్పుడూ నో చెప్పను. కానీ అక్కడొక గ్యాంగ్‌ ఉంది. అసత్యాలను ప్రచారం చేస్తోంది” అన్నారు. రవీనా టాండన్ 1990,2000 కాలంలో వెండితెరను ఏలిన నటీమణుల్లో రవీనా టాండన్‌ ఒకరు. ఆమె కూడా సినీ పరిశ్రమలో రాజకీయాల గురించి గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. “ మీ ఓటమిని ముందుగానే ప్లాన్‌ చేసే కొందరు చెడ్డ వ్యక్తులు ఇక్కడున్నారు. నేను కూడా ఆ పరిస్థితి ఎదుర్కొన్నా. వారు మిమ్మల్ని సినీ పరిశ్రమలో లేకుండా చేయాలని చూస్తారు. ఇవి పక్కా తరగతి రాజకీయాల్లా ఉంటాయి. మీతో ఆడుకుంటారు” అంటూ వ్యాఖ్యలు చేసింది. అయితే ప్రస్తుతం ప్రియాంక మాత్రం హాలివుడ్‌లో బిజీగా గడుపుతోంది. ఏప్రిల్‌ 28న ఆమె నటించిన “ సిటాడెల్‌’ సిరీస్‌ అమేజాన్‌ ప్రైమ్‌ వేదికగా విడుదల కాబోతోంది. ఫరాన్ అక్తర్‌ దర్శకత్వం వహించే ఓ సినిమాతో బాలివుడ్‌లోనూ తిరిగి అడుగుపెట్టే అవకాశముంది. ఈ సినిమాలో ఆలియా భట్‌, కత్రినా కైఫ్‌ కూడా నటిస్తున్నారు.
    మార్చి 28 , 2023
    Review: ‘బలగం’ ఓ చక్కటి పల్లెటూరి కథాచిత్రం
    Review: ‘బలగం’ ఓ చక్కటి పల్లెటూరి కథాచిత్రం
    కమెడియన్‌ వేణు ఇండస్ట్రీలోకి వచ్చిన చాలా ఏళ్లకు దర్శకుడిగా మారి తీసిన సినిమా ‘బలగం’. తొలి సినిమానే ప్రతిష్టాత్మక నిర్మాత దిల్‌రాజు కాంపౌండ్‌లో తెరకెక్కడం విశేషం.  తెలంగాణలో బలగం అంటే బంధుగణం. బంధుత్వాలు, ప్రేమలు, ఆప్యాయతలు, అన్నదమ్ముల ప్రేమలు, పల్లెటూరి మనస్తత్వాలు ఇలా అన్ని రంగరించి ఓ ఎమోషనల్‌ డ్రామాగా వేణు ఈ సినిమాను తెరకెక్కించాడు. మరి తన ప్రయత్నం ఎంతమేరకు విజయవంతమైందో చూద్దాం. చిత్రబృందం నటీనటులు: ప్రియదర్శి, కావ్య కల్యాణ్‌ రామ్‌, సుధాకర్‌ రెడ్డి, రచ్చ రవి, ముర‌ళీధ‌ర్ గౌడ్‌, రూప లక్ష్మి, జయరాం, విజ‌య‌ల‌క్ష్మి, వేణు టిల్లు తదితరులు దర్శకత్వం: వేణు ఎల్దండి సంగీతం: భీమ్స్‌ సిసిరోలియో సినిమాటోగ్రఫీ: ఆచార్య వేణు నిర్మాతలు: హర్షిత్‌ రెడ్డి, హన్షిత https://www.youtube.com/watch?v=8R3Vcy5CaPc కథ: ఓ పల్లెటూరిలో అందరితో సరదాగా ఉండే ఓ ముసలాయన కొమురయ్య( సుధాకర్‌ రెడ్డి). అతడి మనవడు సాయిలు (ప్రియదర్శి). విపరీతంగా అప్పులు చేసిన సాయిలు పెళ్లి చేసుకుని ఆ కట్నం డబ్బులతో అప్పు తీర్చాలనుకుంటాడు. కానీ సరిగ్గా వరపూజ రోజున అతడి తాత కొమురయ్య చనిపోతాడు. దీనికి తోడు చావు ఇంట్లో జరిగిన గొడవతో పెళ్లి కూడా ఆగిపోతుంది. ఇదే సమయంలో 20 ఏళ్ల క్రితమే ఊరి నుంచి వెళ్లిపోయిన కొమురయ్య చిన్న కొడుకు, కూతురు (సాయిలు మేనత్త) తండ్రి మరణవార్త విని ఊరికి వస్తారు.  సాయిలు మేనత్త తన కూతురు సంధ్యను తీసుకుని వస్తుంది. సంధ్యను చూసి ఇష్టపడిన సాయిలు, తనకు బాగా ఆస్తి కూడా ఉందని తెలుసుని ఎలాగైనా తనని ప్రేమలో పడేయాలనుకుంటాడు. కానీ కర్మ రోజున కొమురయ్య పిండాన్ని ఏ కాకీ ముట్టుకోదు. అక్కడ సాయిలు మామ,బాబాయ్‌ల మధ్య గొడవ జరుగుతుంది. కాకి ముట్టకపోవడం ఊరికి అరిష్టమని భావించిన గ్రామ పెద్దలు.. కొమురయ్య కోరిక తీరకపోవడం వల్లే ఇలా జరుగుతోందని అనుకుంటారు. 11వ రోజు కాకి ముట్టకపోతే వారిని ఊరి నుంచి వెలివేస్తామని హెచ్చరిస్తారు. ఆ తర్వాత జరిగే నాటకీయ పరిణామాలు, తాత చావును సాయిలు ఎలా వాడుకున్నాడు. చివరికి ఏం జరిగింది అనేదే కథ. ఎలా ఉంది:  చక్కటి తెలంగాణ పల్లెటూరి వాతావరణంలో తెరకెక్కిన సినిమా ‘బలగం’. పల్లెటూరి యాస, సంస్కృతి, అమాయకత్వం, మొండితనం, మూర్ఖత్వం ఇలా అన్ని కోణాలను దర్శకుడు వేణు చక్కగా తెరకెక్కించాడు. తొలి సినిమానే అయినా అలా ఎక్కడా అనిపించదు. ప్రతి పాత్రా చాలా సహజంగా ఉంది. సినిమా చూస్తున్నంత సేపు మనమే ఆ ఊరిలో ఉండి సాయిలును చూస్తున్నట్లు ఉంటుంది. భావోద్వేగాలు, కామెడీ చాలా సహజంగా ఉంటాయి. తెలంగాణ పల్లెటూరిలో ఓ వ్యక్తి చనిపోయినప్పుడు ఉండే పరిస్థితిని చాలా సహజంగా తెరకెక్కించాడు. తాత చావు, ఓ కాకి చుట్టూ కథ నడిపిస్తూ.. కామెడీ పండిస్తూ ప్రేక్షకుడిని ఆకట్టుకుంటాడు. ఫస్టాఫ్‌ పాత్రల పరిచయం, కామెడీ ఉంటుంది. కొన్ని సీన్లు సాగదీతగా అనిపిస్తాయి. సెకండాఫ్‌లో చివరి 15 నిమిషాల సినిమా కంటతడి పెట్టిస్తుంది. మన ఇంట్లో ఉండే తాత, నాయినమ్మ, అమ్మమ్మలను గుర్తుచేసేలా ఉంటుంది. భావోద్వేగాలు ఎంత చక్కగా పండాయో, కామెడీ కూడా అంతే చక్కగా పండింది.  నటీ నటులు: సాయిలు పాత్రలో ప్రియదర్శి జీవించాడనే చెప్పాలి. నిజంగా మన ఇంటి పక్క సాయిలును చూసినట్టే ఉంటుంది. హీరోయిన్‌గా కావ్య బాగా నటించింది. సుధాకర్‌ రెడ్డి పాత్ర కాసేపే ఉన్నా చాలా బాగా చేశారు. రచ్చ రవి తన కామెడీతో మెప్పించాడు. ఇతర నటీ నటులు కూడా తమ పరిధిమేరకు నటించారు. సాంకేతిక పనితీరు: దర్శకుడు వేణు తొలి సినిమా అయినా చాలా చక్కగా తెరకెక్కించాడు. స్టార్‌ క్యాస్ట్‌ లేకపోయినా సినిమాలో ఉన్న నటులంతా సహజంగా నటించారు. కథనం విషయంలో కాస్త నెమ్మదిగా అనిపిస్తుంది. భీమ్స్‌ సిసిరోలియే సంగీతం సినిమాకు బాగా ప్లస్‌ అయింది. ఆచార్య వేణు సినిమాటోగ్రఫీ మెచ్చుకోవాలి. పల్లెటూరి వాతావరణాన్ని కళ్లకు కట్టినట్లు చూపించాడు. సినిమా చాలా సహజంగా కనిపించడానికి వేణు సినిమాటోగ్రఫీ చాలా సాయపడింది. ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది కాసర్ల శ్యామ్‌ సాహిత్యం గురించి. చివరి 15 నిమిషాలు చక్కటి ఎమోషన్స్ పండాయంటే అందుకు కారణంగా చివర్లో వచ్చే బుర్ర కథ. దీనికి కాసర్ల శ్యామ్‌ రాసిన లిరిక్స్‌ నిజంగా అద్భుతంగా ఉంటాయి. ప్రొడక్షన్ పరంగా సినిమాకు ఏ లోటు లేదు.  బలాలు కథ కథా నేపథ్యం భావోద్వేగాలు కామెడీ పాటల్లో సాహిత్యం బలహీనతలు కొన్ని చోట్ల సాగదీత సీన్లు స్టార్‌ క్యాస్ట్‌ లేకపోవడం ఒక్కమాటలో చక్కటి భావోద్వేగాలతో ఉండే పల్లెటూరి కుటుంబ కథా చిత్రం బలగం. ఈ వీకెండ్‌కి ఫ్యామిలీతో కలిసి సినిమాకు వెళ్లాలనుకుంటే ‘బలగం’ మిస్‌ కాకూడని సినిమా. రేటింగ్‌ 3/5
    మార్చి 03 , 2023
    Pawan vs Jr NTR: పవన్‌ ‘ఓజీ’కి సవాలు విసురుతున్న తారక్‌ ‘దేవర’.. ఎందుకంటే?
    Pawan vs Jr NTR: పవన్‌ ‘ఓజీ’కి సవాలు విసురుతున్న తారక్‌ ‘దేవర’.. ఎందుకంటే?
    ప్రస్తుతం టాలీవుడ్‌ ఇండస్ట్రీ పాన్‌ ఇండియా చిత్రాలకు కేరాఫ్‌గా మారిపోయింది. ఇక్కడి స్టార్‌ హీరోల చిత్రాలన్ని దాదాపుగా జాతీయ స్థాయిలోనే విడుదలవుతున్నాయి. ఈ క్రమంలోనే పవన్‌ కల్యాణ్‌ ‘ఓజీ’ (OG), జూనియర్‌ ఎన్టీఆర్‌ ‘దేవర’ (Devara) చిత్రాలు కూడా ఇండియా వైడ్‌గా రిలీజ్‌కు సిద్ధమవుతున్నాయి. ‘ఓజీ’లో పవన్‌ సరసన ప్రియాంక మోహన్‌ (Priyanka Mohan) నటిస్తుండగా.. ‘సాహో’ (Sahoo) ఫేమ్ సుజీత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మరోవైపు దేవర (Devara) చిత్రాన్ని కొరటాల శివ (Koratala Siva) రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఈ రెండు చిత్రాలపై ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ రెండు సినిమాల విడుదల తేదీలు విడుదల కాగా.. అవి క్లాష్‌ అయ్యాయి. ప్రస్తుతం ఈ అంశం ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌గా మారింది.  క్లాష్‌ ఎలా వచ్చిందంటే? పాన్ ఇండియా (Pawan vs Jr NTR) లెవెల్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్న సినిమాల్లో ‘దేవర’, ‘ఓజీ’ ఉన్నాయనే విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ రెండు సినిమాలకు సంబంధించిన గ్లిమ్స్ వీడియోస్ విడుదలై మంచి రెస్పాన్స్‌ని దక్కించుకున్నాయి. దేనికి ఎక్కువ క్రేజ్ ఉంది అంటే చెప్పలేని సిట్యువేషన్. తాజాగా రెండు సినిమాల మేకర్స్‌ విడుదల తేదీని ప్రకటించారు. దీని ప్రకారం పవన్‌ ‘ఓజీ’ చిత్రం సెప్టెంబర్‌ 27న వస్తుండగా.. తారక్‌ దేవర మూవీ అక్టోబర్‌ 10న విడుదల కాబోతున్నాయి. ఈ రెండు చిత్రాలకు (OG vs Devara) దాదాపు రెండు వారాల సమయం ఉన్నప్పటికీ స్టార్‌ హీరోలు బరిలో నిలుస్తుండటంతో వీరి మధ్య పోటీ ఆసక్తికరంగా మారింది.  https://twitter.com/cinecorndotcom/status/1758446390534197283 గతంలోనూ ఇలాగే! గతంలోనూ పవన్‌ కల్యాణ్‌, తారక్‌ (OG vs Devara) చిత్రాలు కొద్ది రోజుల వ్యవధిలోనే విడుదలయ్యాయి. 2013లో పవన్‌ నటించిన అత్తారింటికి దారేది (Atharintiki Daaredi) చిత్రం కూడా సరిగ్గా సెప్టెంబర్‌ 27న విడుదలైంది. అప్పట్లో ఆ చిత్రం ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. సినిమా విడుదలకు ముందే ఒరిజినల్‌ ప్రింట్‌ బయటకు వచ్చినప్పటికీ పవన్‌ మేనియాతో ఆ సినిమా సాలిడ్ హిట్‌ అందుకుంది. అయితే కొద్ది రోజుల గ్యాప్‌లో ఎన్టీఆర్‌ 'రామయ్య వస్తావయ్యా' (Ramayya Vasthavayya) చిత్రం రిలీజై డిజాస్టర్‌గా నిలిచింది. దీంతో పవన్‌ విన్నర్‌గా నిలిచాడు. అయితే ఈసారి పోటీ చాలా రసవత్తరంగా ఉండే అవకాశముంది. ఎందుకంటే సాహో ఫ్లాప్‌తో సుజీత్‌.. ఆచార్య డిజాస్టర్‌తో కొరటాల శివ ఈ సినిమాలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మిస్తున్నారు.  2 వారాలు సరిపోతాయా? పవన్‌ సినిమా 'దేవర'కు మధ్య (Pawan vs Jr NTR) రెండు వారాల గడువు మాత్రమే ఉంది. ముందుగా ‘ఓజీ’ థియేటర్లలోకి వస్తుండటంతో ఆ చిత్రానికి థియేటర్ల కేటాయింపులో సమస్య ఉండకపోవచ్చు. కానీ రెండు వారాల గ్యాప్‌లోనే ‘దేవర’ వస్తుండటంతో ఓజీ థియేటర్లను ఆ సినిమా ఆక్రమించుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతో ఓజీ కలెక్షన్స్‌పై భారీగా ప్రభావం పడవచ్చని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గతేడాది క్రిస్మస్‌ కానుకగా వచ్చిన సలార్‌ (Salaar)కు కూడా ఇలాంటి సమస్యే ఎదురైంది. రెండు వారాల తర్వాత సంక్రాంతి బరిలో పెద్ద సినిమాలు నిలవడంతో సలార్‌ భారీ సంఖ్యలో థియేటర్లను కోల్పోయింది. దీంతో రూ.1000 కోట్లు కలెక్ట్ చేస్తుందనుకున్న ప్రభాస్‌ చిత్రం రూ.700 కోట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కాబట్టి ఓజీకి కూడా ఇదే పరిస్థితి ఎదురువుతుందా? అన్న ప్రశ్న ప్రధానంగా వినిపిస్తోంది.  ‘ఒకేసారి రిలీజ్‌ చేయండి’ దేవర, ఓజీ సినిమాల క్లాష్‌ అంశం (Pawan vs Jr NTR) సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో ఇరువురి హీరోల ఫ్యాన్స్‌ రంగంలోకి దిగారు. రెండు సినిమాలను ఒకే రోజు రిలీజ్‌ చేయాలని వారు సూచిస్తున్నారు. అప్పుడు ఎవరి సత్తా ఏంటో తెలుస్తుందని అంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తమ హీరో సినిమా విజయం సాధిస్తుందని పవన్‌, తారక్ ఫ్యాన్స్ ఇరువురు చాలా దీమాగా ఉన్నారు. ఇండస్ట్రీ రికార్డులను అవి బద్దలు కొడతాయని అంటున్నారు. మరికొందరు న్యూట్రాల్‌ ఫ్యాన్స్ రెండు వారాల గ్యాప్ ఉండటమే బెటర్ అని అభిప్రాయపడుతున్నారు. అది ఇండస్ట్రీకి మేలు చేస్తుందని చెబుతున్నారు. 
    ఫిబ్రవరి 17 , 2024
    Viswambhara : 18 ఏళ్ల తర్వాత త్రిషతో రొమాన్స్ చేయనున్న చిరంజీవి!
    Viswambhara : 18 ఏళ్ల తర్వాత త్రిషతో రొమాన్స్ చేయనున్న చిరంజీవి!
    గత కొన్నిరోజులుగా టాలీవుడ్‌ (Tollywood)ను తొలిచేస్తున్న ప్రశ్నకు ఇవాళ సమాధానం దొరికింది. మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) తర్వాతి చిత్రం ‘విశ్వంభర’లో హీరోయిన్ ఎవరన్న ఊహాగానాలకు చిత్ర బృందం చెక్ పెట్టింది. ఇందులో చిరుకు జోడీగా స్టార్‌ నటి త్రిష (Actress Trisha) నటించనున్నట్లు మూవీ యూనిట్‌ ప్రకటించింది. అంతేకాకుండా త్రిష సెట్‌లో పాల్గొన్న వీడియోను చిరంజీవి స్వయంగా షేర్‌ చేశారు.  ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.  చిరు - త్రిష ఆలింగనం చిరు షేర్‌ చేసిన వీడియో ప్రకారం.. మెుదట సెట్‌లో అడుగుపెట్టిన మెగాస్టార్‌.. డైరెక్టర్ వశిష్టతో (Mallidi Vasishta) కలిసి స్క్రిప్ట్‌కు సంబంధించిన విషయాలను చర్చిస్తుంటారు. పక్కనే చిరు తనయ సుస్మిత (Sushmita Konidela) కూడా నిలబడి ఉంటుంది. ఈ క్రమంలోనే నటి త్రిష.. క్యారీవ్యాన్‌ నుంచి బయటకొచ్చి మెగాస్టార్‌ చిరును ఆలింగనం చేసుకుంటుంది. ఆ తర్వాత మెగాస్టార్‌ ఆమెకు పుష్పగుచ్చంతో సెట్‌లోకి స్వాగతం పలుకుతారు. ఈ వీడియోను చూసిన మెగా ఫ్యాన్స్‌ ఉత్సాహంతో ఊగిపోతున్నారు. లైక్స్‌, షేర్స్‌తో వీడియోను ట్రెండింగ్‌ చేస్తున్నారు. https://twitter.com/i/status/1754373323910533528 18 ఏళ్ల తర్వాత.. చిరంజీవి - త్రిష జత కట్టడం (Viswambhara Trisha) ఇదేమి తొలిసారి కాదు. 2006లో వచ్చి ‘స్టాలిన్‌’ సినిమాలో వీరిద్దరు తొలిసారి జోడీగా నటించారు. ఆ తర్వాత వీరు ఏ సినిమాలో కలిసి నటించలేదు. 18 ఏళ్ల తర్వాత తిరిగి ఈ జోడి నటిస్తుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ‘స్టాలిన్‌’ సమయంలోనే వీరి జోడీకి  మంచి మార్కులు పడ్డాయి. వెండి తెరపై వీరి కెమెస్ట్రీ చాలా బాగుందంటూ అప్పట్లో కథనాలు కూడా వచ్చాయి. ఇప్పుడు ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ‘విశ్వంభర’లో చిరు - త్రిష జతకడుతుండటంతో ఈ జోడీ ఈసారి ఏ మ్యాజిక్‌ చేస్తుందోనన్న ఆసక్తి ఇండస్ట్రీలో నెలకొంది.  ఆచార్యకు నో చెప్పిన త్రిష! నిజానికి ‘ఆచార్య’ చిత్రంలోనే చిరుకి జోడీగా త్రిష నటించాల్సి ఉంది. చిత్ర యూనిట్‌ తొలుత త్రిషనే హీరోయిన్‌గా ప్రకటించింది కూడా. అయితే షూటింగ్‌ ప్రారంభానికి కొద్ది రోజుల ముందే తాను సినిమా నుంచి తప్పుకుంటున్నట్లు త్రిష వెల్లడించింది. క్రియేటివ్ డిఫ‌రెన్సెస్ కార‌ణంగా ఆచార్య నుంచి వైదొలుగుతున్నట్లు ఆ సందర్భంలో ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. ఈ వ్యవహారం అప్పట్లో హాట్‌ టాపిక్‌గా మారింది. చిరు సినిమా ఆఫర్‌ను త్రిష కాదనుకోవడం పలు ఊహాగానాలకు తావిచ్చింది. ఇక మెగా సినిమాలో త్రిష కనపించడం కష్టమేనన్న వార్తలు కూడా వచ్చాయి. వాటన్నింటికి చెక్‌ పెడుతూ చిరు లేటెస్ట్‌ మూవీలో ఈ భామ అవకాశం దక్కించుకోవడం విశేషం.  సెకండ్‌ హీరోయిన్‌ ఎవరో? ‘విశ్వంభర’లో త్రిష (Viswambhara)తో పాటు మరో హీరోయిన్‌ కూడా నటించబోతున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఆమె కోసం మంచి పాత్ర కూడా సిద్దంగా ఉందని అంటున్నారు. అయితే ఆ పాత్రకు సరిగ్గా సరిపోయే భామ కోసం చిత్ర యూనిట్‌ తెగ వెతికేస్తున్నట్లు టాక్‌. అంతకుముందు చిరు జోడీ ఎవరు? అంటు పలు హీరోయిన్ల పేరు బయటకొచ్చాయి. వారిలో త్రిషతో పాటు కాజల్ అగర్వాల్‌, హానీ రోజ్‌, సంయుక్త మీనన్‌ పేర్లు వినిపించాయి. బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్ దీపికా పదుకునేను కూడా తీసుకునే ఛాన్స్ ఉందని వార్తలు వచ్చాయి. మరి మెయిన్‌ హీరోయిన్‌గా త్రిష ఫైనల్‌ అయిన నేపథ్యంలోనే ఈ జాబితా నుంచే సెకండ్‌ హీరోయిన్‌ను కూడా ఎంచుకుంటారా? లేదా? అన్నది చూడాలి.  13 భారీ సెట్‌లు..! చిరు 156వ చిత్రంగా ‘విశ్వంభర’ (Viswambhara Trisha) రూపొందుతోంది. సాహసాలు, ఊహా ప్రపంచం మేళవింపుతో ఈ చిత్రం మెగాస్టార్‌ కెరీర్‌లోనే అత్యధిక వ్యయంతో రూపుదిద్దుకుంటోంది. ఈ మూవీ కోసం 13 భారీ సెట్‌లతో ప్రత్యేక ప్రపంచాన్నే సృష్టించారు. 2025 జనవరి 10న ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. యూవీ క్రియేషన్స్‌ (UV Creations) బ్యానర్‌పై ఇది రానుంది. 
    ఫిబ్రవరి 05 , 2024
    Gandeevadhari Arjuna Movie Review: రా ఏజెంట్‌గా అదరగొట్టిన వరుణ్‌ తేజ్‌.. సినిమా ఎలా ఉందంటే?
    Gandeevadhari Arjuna Movie Review: రా ఏజెంట్‌గా అదరగొట్టిన వరుణ్‌ తేజ్‌.. సినిమా ఎలా ఉందంటే?
    నటీనటులు : వరుణ్ తేజ్, సాక్షివైద్య, వినయ్ రాయ్, నాజర్, విమలా రామన్‌, రవివర్మ తదితరులు దర్శకత్వం : ప్రవీణ్ సత్తారు  నిర్మాత : బీవీఎన్ఎస్ ప్రసాద్  సంగీత దర్శకుడు : మిక్కీ జే మేయర్ సినిమా నిడివి : 2 గంటల 16 నిమిషాలు  విడుదల తేదీ : ఆగస్టు 25, 2023 మెగా ప్రిన్స్‌ వరుణ్‌తేజ్‌(Varun tej) హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ ‘గాండీవధారి అర్జున’ (Gandeevadhari Arjuna). ప్రవీణ్‌ సత్తారు(Praveen sattaru) దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో సాక్షి వైద్య (Sakshi vaidya) హీరోయిన్‌గా నటించింది. BVS ప్రసాద్‌ నిర్మించిన ఈ మూవీకి మిక్కీ జే. మేయర్‌ సంగీతం అందించాడు. టీజర్, ట్రైలర్, సాంగ్స్‌తో మంచి అంచనాలు క్రియేట్ చేసిన ఈ సినిమా ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి గాండీవధారి అర్జున సినిమా ఎలా ఉంది? ఈ యాక్షన్ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఆడియన్స్‌ను ఏమేరకు మెప్పించింది? వరుణ్‌ ఖాతాలో మరో హిట్‌ చేరినట్లేనా? ఇప్పుడు చూద్దాం. కథ కథలోకి వెళితే ఆచార్య (నాజర్‌) అంతర్జాతీయ పర్యావరణ పరిరక్షణ మంత్రి. విలన్లు చేసే మెడికల్‌ స్కామ్‌ వల్ల మనుషులతో పాటు పర్యావరణం దెబ్బతింటున్నట్లు ఆచార్య గ్రహిస్తాడు. వారిని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తుంటాడు. అదే సమయంలో ఆచార్యను చంపేందుకు విలన్‌ మనుషులు ప్రయత్నిస్తుంటారు. దీంతో తనకు రక్షణ కల్పించడంతో పాటు, మెడికల్‌ స్కామ్‌ను ఎలాగైనా ఆపే బాధ్యతను రా ఏజెంట్‌ అర్జున్ (వరుణ్‌తేజ్‌)కు ఆచార్య అప్పగిస్తాడు. ఈ క్రమంలో అర్జున్‌కు ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురయ్యాయి? మెడికల్‌ స్కామ్‌ను అతడు ఎలా బయటపెట్టాడు? ఆ స్కామ్‌కు పర్యావరణానికి మధ్య ఉన్న సంబంధం ఏంటి? వంటి విషయాలు తెలియాలంటే సినిమాకు వెళ్లాల్సిందే. https://twitter.com/baraju_SuperHit/status/1694964373507260852?s=20 ఎలా సాగిందంటే గాండీవధారి అర్జున మూవీ రెగ్యులర్ ఫార్మాట్ మాదిరిగానే ఉంది. యాక్షన్ ఎంటర్ టైనర్ చూసే కొందరిని తప్ప.. మిగతావారిని ఆకట్టుకునేలా లేదు. ఇంటర్వెల్ వరకు మూవీ సాగదీతగా అనిపిస్తుంది. కొంత నాటకీయత ఉన్నప్పటికీ అదీ ఎలివేట్ చేయబడలేదు. తర్వాత యాక్షన్ సీన్స్ ఎక్కువగా ఉన్నాయి. కామెడీ ఆశించే ప్రేక్షకులకు భంగపాటు తప్పదు. మూవీ ఒక లోకేషన్ నుంచి మరో లోకేషన్‌కు ఈజీగా వెళుతుంది. క్లైమాక్స్ కూడా ఊహించినట్టే ఉంది. పెద్దగా మలుపులు, ట్విస్ట్స్ అంటూ ఏమీ లేవు.  ఎవరెలా చేశారంటే..? గాండీవధారి అర్జున మూవీలో వరుణ్ తేజ్ యాక్షన్ రోల్ చేశాడు. తన పర్సనాలిటీతో ఆ పాత్రకు హుందాతనాన్ని తీసుకొచ్చాడు. హాలీవుడ్ యాక్షన్ హీరోను తలపించాడు. అయితే యాక్షన్‌ చిత్రం కావడంతో నటనకు పెద్దగా స్కోప్‌ లేదు. అయినప్పటికీ వరుణ్‌ ఉన్నంతలో తన మార్క్‌ చూపించే ప్రయత్నం చేశాడు. ఇక సాక్షి వైద్య సినిమా మొత్తం ఉన్నా లేనట్టే అనిపిస్తుంది. ఆమె పాత్రకు అంతగా ప్రాధాన్యం ఉండదు. నాజర్‌ ఎప్పటిలాగే తన అనుభవాన్ని ఉపయోగించి నటించారు. తమిళ నటుడు వినయ్ రాయ్ విలన్ పాత్రలో మెప్పించాడు. మనీశ్ చౌదరీ, రవి వర్మ పరిధి మేరకు నటించారు. టెక్నికల్‌గా  ఇక సాంకేతిక అంశాల విషయానికి వస్తే మిక్కీ జే మేయర్‌ అందించిన సంగీతం సినిమాకు ప్లస్‌ కాలేకపోయింది. ఒక్క పాట కూడా గుర్తుంచుకునేలా లేదు. అటు బ్యాగ్రౌండ్‌ మ్యూజిక్‌ సైతం నామమాత్రంగానే ఉంది. యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రాలకు ఇచ్చే BGM లాగా అనిపించలేదు. G. ముఖేశ్‌ ఇచ్చిన సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంటుంది. ఆయన పనితనం సినిమాకు చాలా బాగా ప్లస్‌ అయ్యింది. ధర్మేంద్ర కాకర్ల ఎడిటింగ్ ఫర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి.  ప్లస్‌ పాయింట్స్‌ వరుణ్‌ తేజ్‌ నటనయాక్షన్‌ సన్నివేశాలుసినిమాటోగ్రఫీ మైనస్‌ పాయింట్స్‌ రొటిన్‌ స్టోరీడైరెక్షన్‌పాటలునో థ్రిల్స్‌ & నో ట్విస్ట్స్‌ సినిమా రేటింగ్‌: 2.5/5 https://www.youtube.com/watch?v=cBGSJcM8C8s
    ఆగస్టు 28 , 2023
    Chiranjeevi in Bhola Shankar: స్ట్రెయిట్ సినిమాలు చేసే గట్స్ చిరంజీవికి లేదా? మెగాస్టార్‌కు ఎందుకంత భయం!
    Chiranjeevi in Bhola Shankar: స్ట్రెయిట్ సినిమాలు చేసే గట్స్ చిరంజీవికి లేదా? మెగాస్టార్‌కు ఎందుకంత భయం!
    టాలీవుడ్‌లో మెగాస్టార్ చిరంజీవికి ఉండే క్రేజే వేరు. తన నటన, డ్యాన్స్‌లతో ట్రెండ్ సెట్ చేసిన స్టార్ హీరో చిరంజీవి. ఇండియాలో తొలిసారిగా రూ.కోటి పారితోషికం తీసుకున్న నటుడు. మెగాస్టార్ సినిమా వస్తుందంటే థియేటర్ల వద్ద టిక్కెట్ల కోసం చొక్కాలు చినగాల్సిందే. కెరీర్‌లో ఎన్నో హిట్ సినిమాలు అందించి తన మార్కెట్ స్థాయి ఏంటో నిరూపించుకున్నాడు. కానీ, రీఎంట్రీ తర్వాత చిరంజీవిలో పదును తగ్గింది. స్ట్రెయిట్ సినిమాలు కాకుండా రీమేక్‌లపై ఎక్కువగా ఆధార పడుతున్నట్లు కనిపిస్తోంది. అసలు, ఒరిజినల్ ఫిల్మ్ చేసే గట్స్ చిరంజీవికి లేవా? అంటూ నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.  సగం రీమేక్‌లే.. సినీ కెరీర్‌లో రీఎంట్రీ తర్వాత మునపటి చిరంజీవిని పరిచయం చేయలేక పోతున్నాడు. పైగా, తీసిన 6 సినిమాల్లో 3 రీమేక్‌లే ఉన్నాయి. ఖైదీ నంబర్ 150, గాడ్‌ఫాదర్‌తో పాటు తాజాగా వచ్చిన భోళా శంకర్ కూడా రీమేక్ సినిమానే. మిగతావి స్ట్రెయిట్ సినిమాలే అయినా, అందులో ఇతర హీరోల అండదండలు తీసుకున్నాడు మెగాస్టార్. సైరా నరసింహరెడ్డిలో అమితాబ్ బచ్చన్, సుదీప్, విజయ్ సేతుపతి వంటి భారీ తారాగణం ఉంది. ఇక, వాల్తేరు వీరయ్యలో రవితేజ, ఆచార్యలో తనయుడు రామ్‌చరణ్ తేజ్‌ల సపోర్ట్ తీసుకున్నాడు. అంటే, సొంతంగా సినిమాను చిరంజీవి నడిపించలేడా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.   దిగజారిన స్థాయి? తన స్థాయి, మార్కెట్ తగ్గిందని చిరంజీవి గ్రహించినట్లు తెలుస్తోంది. ఇతర హీరోలను తీసుకుంటే మార్కెట్ కలిసి వస్తుందని చెప్పడానికి రీమేక్ అనంతరం చేసిన సినిమాలే ఉదాహరణగా నిలుస్తున్నాయి. పైగా, ఆడియెన్స్‌ని థియేటర్లకు రప్పించేందుకు ఇదివరకు చేయని పనులను కూడా చిరు ట్రై చేస్తుండటం దీనికి ఊతమిస్తోంది. ఇతర హీరోలను ఇమిటేట్ చేయడం ఇందుకు నిదర్శనం. వాల్తేరు వీరయ్య సినిమాలో రవితేజ డైలాగ్‌ని చెప్పడం, భోళాశంకర్ సినిమాలో తమ్ముడు పవన్ కళ్యాణ్ మ్యానరిజం, డైలాగ్స్‌ని ఇమిటేట్ చేయడానికి ప్రయత్నించడం.. ఈ కోవకు చెందేవే. ఇతర హీరోల ఫ్యాన్స్ అయినా థియేటర్లకు వస్తారన్న ఆశో? లేదా అందరి ఫ్యాన్స్‌ని అలరించాలన్న తాపత్రయమో? ఫలితం మాత్రం అటు, ఇటు గాకుండా పోతోంది. తేడాకొడుతున్న రీమేక్? ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు ఇప్పటివరకు ఒక్క రీమేక్‌లోనూ నటించలేదు. స్టోరీ సెలక్షన్ పరంగా మెగాస్టార్‌ని తక్కువ అంచనా వేయలేం. ఎందుకంటే, కెరీర్‌లో చేసిన ఎన్నో స్ట్రెయిట్ సినిమాలు ఇండస్ట్రీ హిట్ కొట్టాయి. అయితే, రీఎంట్రీ తర్వాత కథల ఎంపికలో చిరు తడబడుతున్నాడు. లుక్స్ పరంగా వయసు కూడా పూర్తిగా సహకరించట్లేదు. దీంతో కొన్ని సినిమా కథలకు మాత్రమే పరిమితం కావాల్సి వస్తోంది. కమర్షియల్ సినిమాకు కావాల్సిన హంగులన్నీ చిరు సమకూరుస్తున్నా కొత్తదనం లేకపోవడంతో ప్రేక్షకులు ఆసక్తి చూపించట్లేదు. భోళాశంకర్ సినిమాలో రీక్రియేట్ చేసిన ఖుషీ నడుము సీన్ బెడిసి కొట్టడానికి కారణం కూడా ఇదే .  సక్సెస్ ఫార్ములా? చిరంజీవికి ఎదురు దెబ్బ తగిలిన సమయాల్లో రీమేక్ సినిమాలపై ఫోకస్ పెడుతున్నాడు. ఠాగూర్ వంటి రీమేక్ సినిమా అనంతరం 2004లో అంజి వచ్చింది. ఇది థియేటర్ల వద్ద బోల్తా పడింది. దీంతో మరోసారి చిరు రీమేక్‌నే నమ్ముకున్నాడు. శంకర్‌దాదా ఎంబీబీఎస్‌తో అదే ఏడాది వచ్చి హిట్ కొట్టాడు. అందుకే, రీఎంట్రీకి సైతం రీమేక్‌నే ఎంచుకున్నాడు. సైరా, ఆచార్యల తర్వాత గాడ్‌ఫాదర్ రీమేక్ చేసి కాస్త ఊరట పొందాడు. ఇలా మాతృకలో ఉన్న బలమైన కథని తీసుకుని పై పై హంగులు చేరిస్తే తెలుగులో హిట్ అయిపోతుందని చిరు నమ్మకం. వాల్తేరు వీరయ్య సమయంలోనే మరో రీమేక్‌కి సైన్ చేశాడు. అయితే, బంగార్రాజు డైరెక్టర్ కల్యాణ్ క్రిష్ణతో చిరంజీవి మూవీ చేయనున్నాడు. ఇది కూడా మళయాల సినిమా ‘బ్రో డాడీ’కి రీమేక్ అన్నట్లు టాక్. ఇందులో చిరుతో పాటు హీరో శర్వానంద్ నటిస్తున్నట్లు సమాచారం. మరి, ఈ సారి సక్సెస్ ఫార్ములా వర్కౌట్ అవుతుందా? అనేది వేచి చూడాలి.  రీమేక్స్ వద్దు.. చిరంజీవి రీమేక్ సినిమాలను ఎంచుకోవడంపై ఫ్యాన్స్ అసంతృప్తితో ఉన్నారు. ఆల్రెడీ సగం మంది చూసేసిన సినిమాలో తమ హీరోని ఊహించుకోలేక పోతున్నామని చెబుతున్నారు. రీమేక్ ఎంచుకున్న ప్రతి సందర్భంలోనూ ఒరిజినల్ ఫిల్మ్‌తో కంపేర్ చేయడం, రీమేక్‌లో లోపాలను వెతకడంతో ఇబ్బందులు పడుతున్నామని ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రీమేక్ సినిమాలు చేయొద్దంటూ వేడుకుంటున్నారు. 
    ఆగస్టు 11 , 2023
    Ramayanam in Trivikram Movies: గురూజీ సినిమాల్లో రామాయణం రిఫరెన్స్‌లు
    Ramayanam in Trivikram Movies: గురూజీ సినిమాల్లో రామాయణం రిఫరెన్స్‌లు
    “విపరీతమైన విలువలు పాటించి జీవించిన వాడు మర్యాద పురుషోత్తముడు..రాముడు. ప్రపంచంలో ఇన్ని సార్లు తిరిగి తిరిగి తిరిగి చెప్పిన కథ ఏదైనా ఉందంటే రాముడిదే” ఇది s/o సత్యమూర్తి ప్రమోషన్ల టైంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ చెప్పిన మాట. రాముడు అన్నా, రామాయణ, మహాభారతాలు అన్నా త్రివిక్రమ్‌ అమితమైన గౌరవం. ఆ గౌరవాన్ని తాను రైటర్‌గా ఉన్నప్పటి నుంచే తన సినిమాల్లో అక్కడక్కడా చూపిస్తూనే ఉన్నాడు. ఫన్నీగానో, సీరియస్‌గానో, ఎమోషనల్‌గానే తన సినిమాలో చిన్న డైలాగ్ అయినా రామాయణం నుంచి రిఫరెన్స్‌ తీసుకుని రాస్తుంటాడు. అలాంటివి కొన్ని చూద్దాం. నువ్వు నాకు నచ్చావ్‌! ప్రకాశ్‌ రాజ్‌ ఇంటికి వెంకటేశ్‌ వచ్చినపుడు సునీల్‌ తనని ఔట్‌ హౌజ్‌కు తీసుకెళ్తాడు. అక్కడ ఆ ఇంటి గురించి చెబుతూ.. “ అయ్యగారు రాముడైతే అమ్మగారు సీత.. అందుకే ఈ ఇంటికి అయోధ్య అని పేరు పెట్టారు” అంటాడు. వెంటనే వెంకటేశ్‌ సెటైర్‌ వేస్తూ అయితే “ఔట్‌హౌజ్‌ పేరు లంకా” అనేస్తాడు. https://www.youtube.com/watch?v=UVFCtTNU29s అత్తారింటికి దారేది అత్తారింటికి దారేదిలో పవన్ కల్యాణ్ తన అత్తయ్యని ఒప్పించి ఇంటికి తీసుకురావడానికి బయల్దేరుతున్నపుడు… ఎం.ఎస్‌. నారాయణ ఇప్పుడెలా ఒప్పిస్తారు సార్‌ అని అడుగుతాడు. అప్పుడు పవన్ కల్యాణ్‌ “ ఒరేయ్‌ రాముడు సముద్రం దాకా వెళ్లాక బ్రిడ్జ్‌ ఎలా కట్టాలి అని ప్లాన్‌ చేసుకున్నాడు గానీ అడవిలో బ్రిడ్జ్‌కు ప్లాన్‌ గీసుకుని సముద్రం దగ్గరకు వెళ్లలేదురా” అని చెప్తాడు. అంటే అక్కడికెళ్లాక చూసుకుందాంలే అనే చిన్న మాటను గురూజీ ఇలా తన స్టైల్‌లో రాశాడు. https://www.youtube.com/watch?v=9-PckWpekQY జల్సా జల్సాలో ఇలియానాకు అమ్మాయిల గురించి చెబుతూ… ఇప్పుడంటే అమ్మాయిలు అబ్బాయిల వెనకాల పడుతున్నారు గానీ గతంలో కనీసం కన్నెత్తి కూడా చూసేవారు కాదు. అంతెందుకు సాక్షాత్తు శ్రీరాముల వారు ఆల్‌ ది వే లంక దాకా బ్రిడ్జి కట్టుకుని వచ్చి మరీ యుద్ధం చేస్తుంటే సీతమ్మ అశోక చెట్టు కింద పడుకుంది గానీ కనీసం చెట్టు ఎక్కి చూసిందా?” అంటూ చెబుతాడు.  https://www.youtube.com/watch?v=ow0cZU-BkrI అ ఆ ‘అ ఆ’లో అనుపమ చెప్పే ఈ డైలాగ్‌ అయితే అందరికీ తెలిసిందే. ‘ రావణాసురుడి మమ్మీ, డాడీ కూడా ‘సూర్పనక’ను సమంత అనే అనుకుంటారు కదే అని రావు రమేశ్ అంటే.. రావణాసురుడి భార్య కూడా తన భర్తను పవన్ కల్యాణ్‌ అనే అనుకుంటుంది అంటూ ఫన్నీగా రామాయణంలో క్యారెక్టర్ల రిఫరెన్స్ తీసుకున్నాడు. https://www.youtube.com/watch?v=qrrldRJc5e8 మన్మథుడు మన్మథుడులో సునీల్‌ తన వదిన జోలికి రాకండి అని వార్నింగ్‌ ఇచ్చే క్రమంలో “ రాముడు పక్కనుండగా సీత జోలికి ఎవడైనా వస్తే లక్ష్మణుడికి కోపం రావడం ఎంత సహజమో. ఇప్పుడు నాకు కోపం రావడం అంతే సహజం’ అంటూ తణికెళ్ల భరణికి వార్నింగ్‌ ఇస్తాడు.  https://www.youtube.com/watch?v=vn3CHyPz8Ow అల వైకుంఠపురములో అల్లు అర్జున్‌కు రాంబంటు అని పేరు పెడితే అదేం పేరు అండి అంటూ ఆచార్యుల వారు అడుగుతారు. రాంబంటు అంటే ఆంజనేయ స్వామికి గుడి కట్టి పూజ చేయట్లేదు అని మురళీ శర్మ అంటాడు. ఆయన రాముడికి బంటు అండి అంటూ ఆచార్యులు సమాధానం ఇస్తారు.ఇలా ఇంకా చాలా సినిమాల్లో సింగిల్ లైన్‌లో త్రివిక్రమ్‌ పౌరాణికాలపై తనకున్న ప్రేమను ప్రదర్శించాడు. అజ్ఞాతవాసి “సీతాదేవిని తెచ్చాడని మండోదరి రావణాసురుడికి అన్నం పెట్టడం మానేసిందా?” ( కీర్తి సురేశ్‌తో తన తల్లి) S/O సత్యమూర్తి “రావణాసురుడు సీతను పట్టుకున్నాడు రాముడి చేతిలో చచ్చాడు వదిలేసుంటే కనీసం బతికేవాడు” ( ఫంక్షన్‌లో అల్లు అర్జున్‌) భీమ్లా నాయక్‌ “ఆ రాముడు కూడా ఇలాగే ఒకటే బాణం ఒకరే సీత అని అడవుల్లో వదిలేశాడు”( పవన్ కల్యాణ్‌తో నిత్య మీనన్‌) అతడు “హనుమంతుడి కన్నా నమ్మకైన వాడు రాముడికి ఇంక ఎవరున్నారు చెప్పు” (సునీల్‌తో మహేశ్‌ బాబు)మీకు ఇంకా ఏమైనా తెలిస్తే కామెంట్ల రూపంలో తెలియజేయండి.
    ఏప్రిల్ 14 , 2023
    Trending Telugu Movies 2024: గూగుల్‌లో అత్యధికంగా వెతికిన టాప్ 60 తెలుగు సినిమాలు ఇవే!
    Trending Telugu Movies 2024: గూగుల్‌లో అత్యధికంగా వెతికిన టాప్ 60 తెలుగు సినిమాలు ఇవే!
    నెట్టింట ఏదైనా సమాచారాన్ని వెతకాలంటే వెంటనే గూగుల్ చేస్తాం. అలా ప్రతి సమాచార శోధనకు గూగుల్ సెర్చ్ ఇంజిన్ కేరాఫ్ అడ్రస్‌గా మారింది. అయితే, ఈ ఏడాది గూగుల్‌లో అత్యధికంగా వెతికిన సినిమాల జాబితాను ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే విచిత్రంగా బ్లాక్ బాస్టర్ సూపర్ డూపర్ హిట్లను తలదన్నీ మన తెలుగు ప్రేక్షకులు చక్కని కథనం, ఫీల్ గుడ్, కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లకు పట్టం కట్టడం విశేషం. మరి గూగూల్‌లో ఎక్కువ మంది వెతికిన టాప్ 60 సినిమాల లిస్ట్‌ను మీరు చూడండి. [toc] Drushyam దృశ్యం చిత్రం వచ్చి 10 సంవత్సరాలైనా ఆ సినిమాకు ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికీ టాప్‌లో ట్రెండ్ అవుతోంది. పెద్ద పెద్ద చిత్రాలను తలదన్ని ఆశ్చర్యకరంగా గూగుల్‌లో అత్యధికంగా వెతుకుతున్న చిత్రాల్లో ఈ సినిమా మొదటి స్థానంలో నిలిచింది. ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు ఎక్కవగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ చిత్రంలో భావోద్వేగాలు.. సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశం, వెంకటేష్ నటన ఈ సినిమాను ప్రత్యేకంగా నిలిపాయి.ఇక సినిమా కథలోకి వెళ్తే.. రాంబాబు (వెంకటేష్‌) ఊరిలో కేబుల్‌ నెట్‌వర్క్‌ పెట్టుకొని కుటుంబంతో హాయిగా జీవిస్తుంటాడు. ఓ రోజు ఐజీ గీత ప్రభాకర్‌ (నదియా) కొడుకు కనిపించకుండా పోతాడు. కానిస్టేబుల్‌ వీరభద్రం కారణంగా ఆ కేసులో రాంబాబు, అతని ఫ్యామిలీ ఇరుక్కుటుంది. ఆ కేసుకి రాంబాబు ఫ్యామిలీకి ఏంటి సంబంధం? అన్నది కథ. Karthikeya 2 ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన కార్తీకేయ చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా దేశవ్యాప్తంగా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. ఇక ఈ చిత్రాన్ని ప్రేక్షకులు పదే పదే చూసేందుకు ఇష్టపడుతున్నారని గూగుల్ ట్రెండ్స్‌ బట్టి తెలుస్తోంది. అత్యధిక మంది వెతుకుతున్న చిత్రాల్లో ఈ సినిమా రెండో స్థానంలో ఉంది. ఈ సినిమాను చూసేందుకు నెటిజన్లు పెద్ద సంఖ్యలో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక ఈ సినిమా కథలోకి వెళ్తే… కార్తికేయ (నిఖిల్‌)కు ప్రశ్నలకు సమాధానం వెతకడం అంటే ఇష్టం. తల్లితో పాటు కార్తికేయ ద్వారక వెళ్లగా అక్కడ ఓ ఆర్కియాలజిస్ట్ హత్యకు గురవుతాడు. దాని వెనక కారణాల్ని వెతుకుతూ కార్తికేయ చేసే సాహసోపేతమైన ప్రయాణమే అసలు కథ. Bichagadu 2 ఆశ్చర్యకరంగా ఈ సినిమా తెలుగులో ట్రెండ్ అవుతున్న సినిమాల్లో మూడో స్థానంలో నిలవడం విశేషం. విజయ్ ఆంటోని నటించిన బిచ్చగాడు సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ కావడంతో దానికి సీక్వెల్‌గా వచ్చిన బిచ్చగాడు 2 సైతం మంచి విజయం సాధించింది. తల్లి కొడుకుల మధ్య చక్కని సెంటిమెంట్, చక్కని పాత్రల చిత్రణ ఈ సినిమాను ప్రేక్షకుల హృదయాల్లో నిలిపింది. అందుకే ఈ చిత్రం టాప్ ట్రెండింగ్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఈ సినిమాను చూసేందుకు నెటిజన్లు ఎక్కువగా ఆసక్తి చూపారు. ఇక ఈ సినిమా కథలోకి వెళ్తే.. విజయ్ గురుమూర్తి (విజయ్ ఆంటోని) భారతదేశంలోని 7వ అత్యంత సంపన్నుడు. అతని సహోద్యోగి మరియు స్నేహితుడు అరవింద్ (దేవ్ గిల్), అతని గ్యాంగ్‌తో కలిసి, అతని సంపద కోసం విజయ్‌ని చంపి, అతని మెదడును బిచ్చగాడు సత్య (విజయ్ ఆంటోని) మెదడుతో మారుస్తాడు. అయితే సత్య వారిని చంపి తన ప్రతీకారం తీర్చుకుంటాడు. యాంటీ బికిలీ ప్రాజెక్ట్‌ను ప్రారంభిస్తాడు. యాంటీ బికిలీ ప్రాజెక్ట్ అంటే ఏమిటి? సత్య అరవింద్ ఇంతకు ఆ గ్యాంగ్‌ను ఎందుకు చంపాడు? ఇంతకు సత్య వెనుక ఉన్న కథ ఏమిటి? అన్నది మిగతా కథ F2 2019 సంక్రాంతికి వచ్చిన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. వెంకీ-వరుణ్ తేజ్‌ల జోడీ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించింది. ఈ సినిమా వచ్చి ఏళ్లు గడుస్తున్నా క్రేజ్ మాత్రం తగ్గలేదు. ఇప్పటికీ ఈ సినిమాను చూసేందుకు నెటిజన్లు ఆసక్తి చూపిస్తారు. గూగుల్ సెర్చ్‌లో టాప్‌లో ట్రెండ్‌ అవుతున్న సినిమాల్లో ఈ చిత్రం ఒకటి. ఇక ఈ సినిమా కథలోకి వెళ్తే.. వెంకీ(వెంకటేష్) MLA దగ్గరా పీఏ పనిచేస్తుంటాడు. ఆత్మగౌరవం, మొగుడుపై పెత్తనం చలాయించే వ్యక్తిత్వం ఉన్న తమన్నాను వెంకీ పెళ్లి చేసుకుంటాడు. కొద్దిరోజులు వీరి కాపురం బాగానే సాగినా.. ఇగోల వల్ల సమస్యలు వస్తాయి. దీంతో తమన్నా ఫ్యామిలీ వెంకీని టార్చర్ పెడుతుంది. ఈక్రమంలో తమన్నా చెల్లెలు హాని(మెహరీన్) వరుణ్‌(వరుణ్‌ తేజ్‌)ను ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. తమన్నా ఫ్యామిలీ దెబ్బకు వరుణ్ సైతం బాధితుడిగా మారుతాడు. అప్పుడు వెంకీ- వరుణ్ కలిసి ఏం చేశారు? తమ ఇగో సమస్యలను ఎలా పరిష్కరించుకున్నారు అనేది కథ. Ante Sundaraniki గూగుల్ సెర్చ్‌లో అత్యధికంగా వెతుకుతున్న తెలుగు సినిమాల జాబితాలో ఈ చిత్రం కూడా ఒకటి. నాని మార్క్ కామెడీ, నజ్రియా నదియా క్యూట్ నెస్, వల్గారిటీ లేని కామెడీ ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా నిలిపాయి. అందుకే నెటిజన్లు ఈ సినిమా చూసేందు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక కథలోకి వెళ్తే..బ్రాహ్మణ కుటుంబానికి చెందిన సుందర్‌ (నాని) ఇంకో మతానికి చెందిన లీల (నజ్రియా నజీమ్‌)ను ప్రేమిస్తాడు. భిన్నమైన సంప్రదాయాలు కలిగిన ఈ జంట పెళ్లి కోసం కుటుంబ సభ్యులతో అబద్దం ఆడతారు. దాని వల్ల ఎలాంటి ఇబ్బందులు పడ్డారన్నది కథ. Tholiprema ఈ చిత్రం వచ్చి 25 ఏళ్లు దాటినా ఇప్పటికీ ఎప్పటికీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. ఈ క్లాసిక్ చిత్రాన్ని చూసేందుకు ప్రేక్షకులు ఇప్పటికీ ఆసక్తి చూపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ యాక్టింగ్, కీర్తి రెడ్డి మెస్మరైజింగ్ బ్యూటీ, చక్కని లవ్ స్టోరీ ఈ సినిమాను ప్రేక్షకుల హృదయాల్లో చిరస్మరణీయం చేశాయి. గూగుల్ సెర్చ్‌లో అధికంగా వెతుకుతున్న సినిమాల్లో ఈ సినిమా ఒకటిగా నిలిచింది. ఇక కథలోకి వెళ్తే.. అమెరికా నుంచి వచ్చి తన తాత ఇంటికి వెళ్తున్న అనూను బాలు ఓ ప్రమాదం నుండి కాపాడతాడు. దీంతో అను అతడితో స్నేహం చేస్తుంది. ఈ ప్రయాణంలో బాలు అనూని ఇష్టపడతాడు. కానీ, ఆమెకు చెప్పలేకపోతాడు. వీరి ప్రేమ కథ చివరికి ఏమైంది? అన్నది కథ. Pelli Choopulu తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా నిలిచింది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ నటన ఆకట్టుకుంటుంది. ఇక కథలోకి వెళ్తే..పెళ్లి చూపుల్లో ప్రశాంత్‌ (విజయ్‌ దేవరకొండ)ను చిత్ర (రీతు వర్మ) రిజెక్ట్‌ చేస్తోంది. ఓ కారణం వల్ల హీరోయిన్‌ పెట్టే ఫుడ్‌ ట్రక్‌ బిజినెస్‌లో హీరో భాగమవుతాడు. ఈ ఇద్దరి ప్రయాణం తర్వాత ఏయే మలుపులు తిరిగింది? అన్నది కథ. ఓటీటీ సన్ నెక్ట్స్ Spyder స్పైడర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయం సాధించనప్పటికీ.. మంచి స్టోరీ లైన్‌తో వచ్చింది. ఈ సిని సస్పెన్స్ థ్రిల్లర్‌గా అలరించింది. ఈ సినిమా చూసేందుకు ఇప్పటికీ చాలా మంది నెటిజన్లు ఆసక్తి చూపిస్తున్నారు. ఇక కథలోకి వెళ్తే… ఇంటెలిజెన్స్ అధికారి అయిన శివ, అత్యవసరమైన పరిస్థితుల్లో ఉన్నవారి ట్రాక్ చేయడంలో సహాయపడే ఫోన్ సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేస్తాడు. ఒక సీరియల్ కిల్లర్ అమాయకులను హత్య చేస్తున్న క్రమంలో అతడి ఆగడాలను అరికడుతాడు. ఇంతకు ఆ హత్యలు చేస్తుంది ఎవరు? అతన్ని శివ పట్టుకోవడంలో ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు అనేది మిగతా కథ. ఓటీటీ- నెట్‌ఫ్లిక్స్ Raja The Great రవితేజ చేసిన బెస్ట్ కామెడీ చిత్రాల్లో రాజా ది గ్రేట్ ఒకటని చెప్పవచ్చు. ఈ సినిమా చూసేందుకు నెటిజన్లు ఆసక్తి చూపిస్తున్నారు. కంటి చూపులేని రాజా.. ఆసాధారణ ప్రతిభకలవాడు. ఓ యువతి ఆపాదలో ఉన్నప్పుడు ఆమెకు సాయం చేయాలనుకుంటాడు. ఆమెను రక్షించే క్రమంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు అన్నది మిగతా కథ.ఓటీటీ: ఆహా Ori Devuda వెంకటేష్- విశ్వక్ సేన్ మేయిన్‌ లీడ్‌లో నటించిన ఈ చిత్రం మంచి ఫీల్ గుడ్ సినిమా. ఈ సినిమా అత్యధికంగా వెతుకుతున్న తెలుగు సినిమా జాబితాలో పదో స్థానంలో నిలిచింది. అర్జున్ (విశ్వక్‌ సేన్‌), అను (మిథిలా పాల్కర్) పెళ్లి చేసుకుంటారు. అర్జున్‌ని అను అనుమానిస్తూనే ఉంటుంది. దీంతో పెళ్లి తర్వాత స్వేచ్చ కోల్పోయినట్లు అతడు భావిస్తాడు. పెళ్లి విషయంలో తనకు సెకండ్ ఛాన్స్ ఇవ్వమని దేవుడ్ని మెురపెట్టుకుంటాడు. కొన్ని షరతులతో దేవుడు (వెంకటేష్‌) అందుకు అంగీకరిస్తాడు. ఆ తర్వాత ఏమైందన్నది కథ.ఓటీటీ: ఆహా Bichagadu ఒక ధనవంతుడైన వ్యాపారవేత్త తల్లి ప్రమాదానికి గురై కోమాలోకి వెళ్లిపోతుంది. వైద్యులు ఆమెకు నయం చేయలేమని చెబుతారు. అయితే, ఒక పూజారి ఆ వ్యాపారవేత్త బిచ్చగాడుగా జీవిస్తే ఆమె కోలుకుంటుందని స్పష్టం చేస్తాడు.ఓటీటీ: ప్రైమ్ వీడియో Jalsa సంజయ్‌ చిన్నప్పుడు ఎదుర్కొన్న పరిస్థితుల కారణంగా నక్సలైట్‌గా మారతాడు. ఓ పోలీసాఫీసర్‌ కారణంగా ప్రజా జీవితంలోకి వస్తాడు. అయితే అనుకోకుండా ఆ పోలీసు అధికారి కూతుర్లనే రెండు పర్యాయాలలో ప్రేమిస్తాడు. ఓటీటీ: ఆహా Nenu అల్లరి నరేష్‌లో అద్భుతమైన నటనను ఆవిష్కరించింది ఈ చిత్రం. మానసిక రోగి పాత్రలో అతని యాక్టింగ్ సూపర్బ్‌గా ఉంటుంది. అందుకే ఈ సినిమా వచ్చి 20 ఏళ్లు గడిచినా క్రేజ్ మాత్రం తగ్గలేదు. కథలోకి వెళ్తే..మానసిక రోగి అయిన వినోద్ తన స్నేహితురాలిగా భావించే ఒక అమ్మాయితో ప్రేమలో పడతాడు. అయితే ఆ యువతి వెరొకరితో ప్రేమలో ఉంటుంది. ప్రేమను గెలిపిస్తాననే నెపంతో ఆ యువతిని వినోద్ అడవిలోకి తీసుకెళ్లడంతో కథ మలుపు తిరుగుతుంది. ఓటీటీ: సన్ నెక్ట్స్ Sye Raa Narasimha Reddy భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించనప్పటికీ… ఈ సినిమా ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయింది. కథలోకి వెళ్తే.. భారతదేశాన్ని ఆక్రమించుకునే క్రమంలో బ్రిటిష్ సైన్యాన్ని ఎదురించలేక పాలెగాళ్లు అందరూ లొంగిపోతారు. అయితే రేనాడు ప్రాంతానికి చెందిన రాజు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి బ్రిటిష్ సైనికులకు ఎదురుతిరిగి వారు దోచుకున్న భూమిని సంపదను అడ్డుకుని ప్రజలకు అండగా నిలబడతాడు. తోటి పాలెగాళ్ళలో మార్పు తెచ్చి వారితో కలిసి దేశ స్వాతంత్ర్యం కోసం ఉద్యమాన్ని నిర్మిస్తాడు? ఈ క్రమంలో ఆయన ఎదుర్కొన్న సమస్యలు ఏమిటి? అసలు యుద్దానికి దారి తీసిన అంశాలు ఏమిటి? అన్నది మిగతా కథ Hari Hara Veera Mallu పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఈ చిత్రం ఇంకా విడుదల కాలేదు. కానీ ఈ సినిమా కోసం నెటిజన్లు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందని ఎదురు చూస్తున్నరు. ఇక ఈ సినిమా మొగల్స్ కాలం నాటి పరిస్థితుల ఆధారంగా తెరకెక్కుతోంది. Bharat Ane Nenu సీఎం అయిన తండ్రి చనిపోవడంతో భరత్‌ (మహేష్‌) ఆ పదవిలోకి వస్తాడు. బాధ్యతగా ప్రజలకు మంచి చేయాలనుకుంటాడు. ఈ క్రమంలో అతడికి ఎదురైన సమస్యలు ఏంటి? సొంత పార్టీ నేతలు చేస్తున్న కుట్రలకు ఎలా చెక్‌ పెట్టాడు? అన్నది కథ.ఓటీటీ: ఆహా Ye Maaya Chesave ఈ చిత్రం 15 ఏళ్లు గడిచినా ఈ క్లాసిక్ సినిమాపై ఇంకా క్రేజ్ పోలేదు.ఇంజినీరింగ్‌ విద్యార్థి అయిన కార్తీక్‌కి ఫిల్మ్ డైరెక్టర్ కావాలని కోరిక. ఈక్రమంలో అతను తన ఇంటి యజమాని కూతురు జెస్సీతో ప్రేమలో పడతాడు. ఇద్దరు మతాలు వేరుకావడంతో ఆమె తండ్రి వారి ప్రేమను వ్యతిరేకిస్తాడు. మరి కార్తీక్ తన ప్రేమను గెలిచేందుకు ఏం చేశాడు అన్నది మిగతా కథ. ఓటీటీ: జీ5, ప్రైమ్ Baahubali: The Beginning మాహిష్మతి రాజ్యంలో, శివుడు అనే ధైర్యవంతుడైన యువకుడు… ఒక యువ యోధురాలుతో ప్రేమలో పడతాడు. ఆమెను ప్రేమిస్తున్న క్రమంలో అతని కుటుంబం, తన నిజమైన వారసత్వం గురించి తెలుసుకుంటాడు. ఆ తర్వాత అతను ఏం చేశాడు అనేది కథ. ఓటీటీ: హాట్ స్టార్ Businessman ముంబయిని ఏలాలన్న లక్ష్యంతో సూర్య నగరానికి వస్తాడు. లోకల్‌ గ్యాంగ్‌స్టర్లతో కలిసి పవర్‌ఫుల్‌ బిజినెస్‌మ్యాన్‌గా ఎదుగుతాడు. ఇంతకీ ఆ యువకుడు పెట్టిన బిజినెస్ ఏంటి? చిత్ర-సూర్యల లవ్‌స్టోరీ ఏంటి? అన్నది కథ. ఓటీటీ: హాట్ స్టార్, ప్రైమ్ Good Luck Sakhi బంజార యువతి సఖి (కీర్తి సురేష్‌) అంటే గోలి రాజు (ఆది పినిశెట్టి)కి ఎంతో ఇష్టం. సఖి గురిపై రాజుకు మహా నమ్మకం. ఆమెను షూటింగ్‌ వైపు వెళ్లేలా ప్రోత్సహిస్తాడు. ఇందుకోసం ఊరికి వచ్చిన కల్నల్ (జగపతిబాబు) సాయం తీసుకుంటాడు. షూటింగ్‌లో ఎదిగే క్రమంలో సఖికి ఎదురైన సవాళ్లు ఏంటి? అన్నదే కథ. ఓటీటీ: ప్రైమ్, ఆహా Oxygen అరవింద్ కృష్ణ తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు ఇండియాకు వస్తాడు. కానీ ఆ అమ్మాయి కుటుంబాన్ని కొంతమంది చంపుతారు. ఇలాంటి పరిస్థితుల్లో అరవింద్ కృష్ణ ఏం చేశాడు అన్నది కథ ఓటీటీ: సన్ నెక్ట్స్ Adipurush ఆదిపురుష్ సినిమా కథ వాల్మికి రామాయణంలోని యుద్ధకాండ నుంచి ప్రారంభం అవుతుంది. తండ్రి దశరథుడి ఆజ్ఞపై రాఘవ (ప్రభాస్) తన భార్య జానకి (కృతి సనన్) – శేషు (సన్ని సింగ్)తో కలిసి వనవాసానికి వెళ్తాడు. తన సోదరి శూర్పణఖకు జరిగిన అవమానం తెలిసిన రావణ (సైఫ్ అలీ ఖాన్) మారు వేషంలో వచ్చి జానకిని తీసుకు వెళ్తాడు. స్త్రీలోలుడైన రావణ.. జానకిపై ఆశ పడుతాడు. ఆ తర్వాత జానకిని రావణుడి చర నుంచి జానకిని ఎలా కాపాడాడు అనేది కథ ఓటీటీ: సన్ నెక్ట్స్ SR Kalyanamandapam కల్యాణ్‌ (కిరణ్‌ అబ్బవరం) వారసత్వంగా వస్తున్న ఎస్‌.ఆర్‌. కళ్యాణ మండపం నిర్వహణ బాధ్యతలను తీసుకుంటాడు. ఇంజనీరింగ్‌ చదివే కల్యాణ్‌ గిరాకీ లేని కల్యాణ మండపాన్ని నడపించాలని ఎందుకు అనుకున్నాడు? దానికి పూర్వ వైభవం తీసుకొచ్చాడా లేదా? తండ్రి (సాయికుమార్‌)తో మాట్లాడకపోవడానికి కారణమేంటి? అన్నది కథ. ఓటీటీ: ఆహా Disco Raja భయంకమైన మాఫియా బ్యాక్‌గ్రౌండ్ ఉన్న డిస్కో రాజా బాడీని హిమాలయాల్లో శాస్త్రవేత్తల బృందం కనిపెడుతుంది. అతనికి చికిత్స చేయడంతో మాములు మనిషిగా మారుతాడు. తన గతం గురించి తెలుసుకున్న డిస్కో రాజా ఏం చేశాడు. అసలు డిస్కో రాజా హిమాలయాల్లో ఎందుకు కూరుకు పోయాడు అనేది మిగతా కథ ఓటీటీ: సన్ నెక్స్ట్ Goutham Nanda మల్టీ బిలియనీర్ కొడుకైన గౌతమ్, ఓ కంపెనీలో ఉద్యోగి అయిన నందాతో జీవితాన్ని మార్చుకోవడం ద్వారా తన ఆస్తిని విడిచిపెట్టి సాధారణ జీవితం గడపాలని నిర్ణయించుకుంటాడు. ఓటీటీ: ప్రైమ్ Kirrak Party కృష్ణ(నిఖిల్) అనే ఇంజినీరింగ్ విద్యార్థి తన స్నేహితుల బృందంతో కలిసి సంతోషంగా జీవిస్తుంటాడు. అతను తన సీనియర్ మీరా(సిమ్రాన్)తో ప్రేమలో పడతాడు. అంతా సవ్యంగా సాగుతున్న క్రమంలో.. ఒక విషాద సంఘటన కృష్ణ జీవితాన్ని తలకిందులు చేస్తుంది. ఆ తర్వాత కృష్ణ ఏం చేశాడన్నది మిగతా కథ ఓటీటీ: ప్రైమ్ Teja తేజ ( తరుణ్ ) పుట్టుకతోనే మేధావి. 6 వ తరగతి చదువే అతను 10 వ తరగతికి సిద్ధమవుతుంటాడు. భౌతికశాస్త్రం, కంప్యూటర్లు, రోబోల పట్ల ఆసక్తి కలిగి ఉంటాడు. ఓ రోజు ప్రిన్సిపాల్ భర్త ఓ మహిళను హత్య చేయడం చూసి ఫొటోలు తీస్తాడు. తేజ సాక్ష్యంతో కోర్టు ప్రిన్సిపల్ భర్తకు ఉరి శిక్ష విధిస్తుంది. జైలు నుంచి తప్పించుకున్న అతను తేజపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది కథ. Pelli Sandadi శ్రీకాంత్‌ తాను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి చెల్లెలు అని తెలియక స్వప్నతో ప్రేమలో పడతాడు. సోదరి పెళ్లి విషయం తెలుసుకున్న స్వప్న తన అక్క సంతోషం కోసం ప్రేమను త్యాగం చేసేందుకు సిద్ధపడుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? ఇంతకు శ్రీకాంత్ పెళ్లి ఎవరితో జరిగిందనేది మిగతా కథ. ఓటీటీ:యూట్యూబ్ Swathi Muthyam బాలమురళీ కృష్ణ (బెల్లంకొండ గణేష్) భాగ్యలక్ష్మీ(వర్షా బొల్లమ్మ)ని చూడగానే ప్రేమలో పడతాడు. వారికి పెళ్లి జరుగుతుండగా చంటిబిడ్డతో శైలజ (దివ్య శ్రీపాద) ప్రత్యక్షం అవుతుంది. ఆ బిడ్డకు తండ్రి బాలమురళీ కృష్ణ అని చెబుతుంది. మరి భాగ్యలక్ష్మీ స్పందన ఏంటి? ఆ శైలజ ఎవరు? అనేది కథ. ఓటీటీ: జియో టీవీ Dhruva ఐపీఎస్‌ అధికారి అయిన ధ్రువ (రామ్‌చరణ్‌).. సిద్ధార్థ్‌ అభిమన్యూ (అరవింద స్వామి) నడిపే అక్రమ వైద్య నెట్‌వర్క్‌ను ఎలా ధ్వంసం చేశాడు? అన్నది కథ. ఓటీటీ: సన్ నెక్స్ట్ KGF 2 రాకీ గరుడను చంపి KGFని స్వాధీనం చేసుకుంటాడు. కొద్దికాలంలోనే సూపర్ పవర్‌గా ఎదుగుతాడు. కానీ అతనికి అధీర (సంజయ్ దత్) రూపంలో అడ్డంకులు వస్తాయి. ఇదేక్రమంలో రాకీని అణిచివేసేందుకు ప్రధాన మంత్రి ఆదేశాలు జారీ చేస్తుంది. మరి రాకీ, అధీరను, రాజకీయ శక్తిని ఎలా ఎదుర్కొన్నాడు? చివరకు వీరిపై విజయం సాధించాడా? లేదా? అన్నది మిగతా కథ. Baadshah ఓ యువకుడు తన తండ్రికి గ్యాంగ్‌స్టర్‌తో ఉన్న సంబంధాల కారణంగా పోలీస్ ఫోర్స్‌లో ఉద్యోగం పొందడంలో విఫలమవుతాడు. ఓ మాఫియా బాంబు దాడిలో అతని స్నేహితుడు చనిపోవడంతో వారిపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంటాడు. ఓటీటీ: యూట్యూబ్ Pushpa పుష్ప (అల్లుఅర్జున్‌) ఎర్రచందనం కూలీ. కొండా రెడ్డి (అజయ్‌ ఘోష్‌) సోదరులకు స్మగ్లింగ్‌లో సలహాలు ఇచ్చే స్థాయికి అతడు వెళతాడు. అక్కడ నుంచి సిండికేట్‌ను శాసించే రేంజ్‌కు పుష్ప ఎలా ఎదిగాడు? మంగళం శ్రీను (సునీల్‌)తో ఉన్న గొడవేంటి? అన్నది కథ. ఓటీటీ: ప్రైమ్ Nannaku Prematho హీరో తండ్రిని ఓ వ్యాపారవేత్త మోసం చేస్తాడు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయిన తండ్రి ద్వారా హీరో ఈ విషయాన్ని తెలుసుకుంటాడు. ఆ తర్వాత హీరో ఏం చేశాడు? తన తండ్రి కోసం విలన్‌పై ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు? అన్నది కథ. ఓటీటీ: సన్‌ నెక్స్ట్ Ala Modalaindi లవ్‌ ఫేయిల్ అయిన ఓ వ్యక్తి ఒక అమ్మాయిని కలుస్తాడు. ఆమెతో ప్రేమలో పడతాడు. అయితే, ఆమెకు అప్పటికే నిశ్చితార్థం జరిగిందని తెలియగానే కథలో ట్విస్ట్‌ మొదలవుతుంది. ఓటీటీ: జీ5, ప్రైమ్ Sir బాలగంగాధర్ (ధనుష్ ) ఒక జూనియర్ మ్యాథ్స్ లెక్చరర్. సిరిపురం అనే గ్రామంలోని జూనియర్ కళాశాలకు మ్యాథ్స్ చెప్పడానికి వెళ్తాడు. అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ పాస్ అయ్యేలా చదువు చెబితే.. సీనియర్ మ్యాథ్స్ లెక్చరర్‌గా ప్రమోషన్ ఇస్తానని కాలేజీ యాజమాన్యం చెబుతుంది. అయితే, అక్కడ పరిస్థితులు బాలుకి అనుకూలంగా ఉండవు. అయినా, తన మాటలతో, చేతలతో ఆ సిరిపురం స్టూడెంట్స్‌ను ప్రభావితం చేస్తాడు. అనంతరం జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల వల్ల బాలు జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి. ఆ మార్పులు ఏమిటి అనేది మిగతా కథ ఓటీటీ: నెట్‌ప్లిక్స్ Jersey అర్జున్(నాని) మాజీ రంజీ ఆటగాడు, అతను తన భార్య సారా(శ్రద్ధా శ్రీనాథ్) కొడుకు నానితో సాధారణం జీవితం గడుపుతుంటాడు. ఈక్రమంలో అతని ఉద్యోగం పోతుంది. చేచడానికి ఎలాంటి పనిలేక ఖాళీగా తిరుగుతుంటాడు. జీవితంలో ఏదోఒకటి చేయాలన్న తపన ఉన్న అర్జున్ తన కొడుకు కోసం ఓ కీలక నిర్ణయం తీసుకుంటాడు. ఇంతకు అతను తీసుకున్న నిర్ణయం ఏమిటి? తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించాడా లేదా అన్నది కథ. ఓటీటీ: జీ5 Hit: The First Case ఇన్‌స్పెక్టర్ విక్రమ్ తన లవర్ నేహా మిస్‌కావడంతో గందరగోళంలో ఉంటాడు. ఇదే సమయంలో తన లవర్ మిస్సింగ్ కేసుతో సంబంధం ఉన్న ప్రీతీ అనే అమ్మాయి మిస్సింగ్ కేసులో ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్‌గా విక్రమ్ అపాయింట్ అవుతాడు. ఈ కేసు దర్యాప్తులో కొన్ని షాకింగ్ విషయాలు తెలుసుకుంటాడు. ఆ తర్వాత విక్రమ్ ఏం చేశాడు అనేది కథ. ఓటీటీ: ప్రైమ్ Aditya 369 అనుకోని పరిస్థితుల్లో ఓ సైంటిస్ట్ కనిపెట్టిన టైం మిషన్ ఎక్కిన కృష్ణకుమార్ (బాలకృష్ణ) అతని ప్రేయసి మోహిని(హేమ)… గతంలోకి శ్రీకృష్ణదేవరాయల కాలంలోకి వెళ్తారు.. అప్పుడు అక్కడ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు. ఆ తర్వాత భవిష్యత్‌ కాలంలోకి ఎలా ప్రయాణించారు? తిరిగి వారు ప్రస్తుత కాలానికి వచ్చారా? లేదా అనేది మిగతా కథ ఓటీటీ: ప్రైమ్, యూట్యూబ్ Aha Naa Pellanta ఒక ధనిక పారిశ్రామిక వేత్త కొడుకై కృష్ణ మూర్తి, పరమ పిసినారి అయిన లక్ష్మిపతి కూతురు పద్మతో ప్రేమలో పడతాడు. అయితే లక్ష్మిపతిని తమ పెళ్లికి ఒప్పిస్తానని కృష్ణమూర్తి తన తండ్రితో ఛాలెంజ్ చేస్తాడు. ఈక్రమంలో అతను ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు? చివరకు తాను చేసిన ఛాలెంజ్‌లో గెలిచాడా లేదా అన్నది కథ. ఓటీటీ: యూట్యూబ్ Vikram Vedha వేదా అనే గ్యాంగ్ స్టర్‌ను కనిపెట్టడానికి విక్రమ్ అనే పోలీస్ ఆఫీసర్ బయలుదేరాడు. వేద స్వచ్ఛందంగా తనకు తాను లొంగిపోతాడు. ఆ తర్వాత విక్రమ్‌కు అతను మూడు కథలు చెప్తాడు.దీంతో విక్రమ్ మంచి, చెడుపై ఉన్న తన అభిప్రాయాన్ని మార్చుకుంటాడు. ఇంతకు వేదా.. విక్రమ్‌కు ఏం చెప్పాడు అనేది మిగిలిన కథ. ఓటీటీ: ప్రైమ్ Bro మార్క్( సాయి ధరమ్ తేజ్) ఎప్పుడూ తన ఉద్యోగంతో బిజీగా ఉంటాడు. దేనికి టైం లేదు టైం లేదు అంటుంటాడు. కుటుంబం మొత్తం అతని సంపాదన మీదే ఆధారపడి ఉంటుంది. చివరకు తన ప్రేయసి రమ్య( కేతిక శర్మ)తో సమయం గడిపాడు. ఓ రోజు అకస్మాత్తుగా మార్క్ ప్రమాదం చనిపోతాడు. అతని ఆత్మ టైం గాడ్‌(పవన్ కళ్యాణ్‌)ను కలుస్తుంది. తన బాధ్యతలు నిర్వర్తించేందుకు తనకు రెండో ఛాన్స్ ఇవ్వాలని కోరగా.. టైం గాడ్ 90 రోజులు సమయం ఇస్తాడు. ఆ తర్వాత మార్క్ ఏం చేశాడు అనేది మిగతా కథఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ Khaidi ఒక పేద రైతు కొడుకు సూర్యం, ఓ క్రూరమైన భూస్వామి కూతురుతో ప్రేమలో పడుతాడు. దీంతో ఆ భూస్వామి, సూర్యం కుటుంబాన్ని, అతని జీవితాన్ని చిద్రం చేస్తాడు. ఓటీటీ: యూట్యూబ్ Uppena మత్స్యకార కుటుంబానికి చెందిన ఆశీ (పంజా వైష్ణవ్‌ తేజ్‌) గొప్పింటి కుటుంబానికి చెందిన బేబమ్మ (కృతి శెట్టి)ను ప్రేమిస్తాడు. విషయం తెలుసుకున్న తండ్రి(విజయ్ సేతుపతి) ఏం చేశాడు? ప్రేమను దక్కించుకునే క్రమంలో ఆశీ ఏం కోల్పోయాడు? చివరకూ ఆ జంట ఎలా ఒక్కటైంది? అన్నది కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ Geetha Govindam గోవింద్‌ (విజయ్‌ దేవరకొండ) గుడిలో గీత (రష్మిక)ను చూసి తొలిచూపులోనే ఇష్టపడతాడు. విజయ్‌ ఊరు వెళ్లేందుకు బస్సు ఎక్కగా అతడి పక్క సీటులోనే గీత కూర్చుంటుంది. ఆమె నిద్రిస్తున్న క్రమంలో ముద్దు పెట్టేందుకు యత్నించి గీత దృష్టిలో విజయ్‌ రోగ్‌లా మారిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? విజయ్‌ ఆమె ప్రేమను ఎలా గెలుచుకున్నాడు? అన్నది కథ. ఓటీటీ: జీ5 Acharya బసవ(సోనూసూద్) పాలనలో ఉన్న ధర్మస్థలిలో అధర్మం రాజ్యమేలుతుంటుంది. ఆ సమయంలో ఆచార్య(చిరంజీవి) అక్కడకి వస్తాడు. బసవ, అతని మనుషులు చేసే అరాచకాలను ఆచార్య ఎలా ఎదురించాడు. అసలు ధర్మస్థలికి ఆచార్య ఎందుకు వస్తాడు? పాదఘట్టం సంరక్షకుడిగా ఉన్న సిద్ధకు ఆచార్యకు మధ్య సంబంధం ఏమిటి అనేది మిగిలిన కథ Rang De అను (కీర్తి సురేష్), అర్జున్ (నితిన్) ఇద్దరు చిన్ననాటి స్నేహితులు. ఒకరంటే ఒకరికి పడదు. అను అర్జున్‌ని ప్రేమిస్తుంది కానీ అతను ఆమెను ద్వేషిస్తాడు. కానీ ఓ సంఘటన వల్ల అర్జున్‌ అనును పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అను ప్రేమను అర్జున్ అర్థం చేసుకున్నాడా? లేదా? అన్నది మిగతా కథ.ఓటీటీ: జీ5 ఓటీటీ: ప్రైమ్ Induvadana వాసు (వరుమ్‌ సందేశ్‌) ఫారెస్ట్‌ పోలీసాఫీసర్‌. గిరిజన యువతి ఇందు (ఫర్నాజ్‌ శెట్టి)తో ప్రేమలో పడతాడు. కులం పేరుతో వారి పెళ్లిని పెద్దలు నిరాకరిస్తారు. ఈ క్రమంలోనే ఇందు హత్యకు గురవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందన్నది కథ. ఓటీటీ: యూట్యూబ్ Maharshi మహర్షి అనేది వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన 2019 భారతీయ తెలుగు భాషా యాక్షన్ డ్రామా చిత్రం మరియు దీనిని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, వైజయంతీ మూవీస్ మరియు PVP సినిమా నిర్మించాయి. ఇందులో మహేష్ బాబు, అల్లరి నరేష్, పూజా హెగ్డే నటించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు. ఈ చిత్రం 9 మే 2019న విడుదలైంది. ఓటీటీ: ప్రైమ్, ఆహా Aakaasam Nee Haddhu Ra సూర్య (మహా) గుంటూరులోని ఓ చిన్న కుగ్రామంలోని పోస్ట్ మాస్టర్ కొడుకు. తన తండ్రి వల్ల ఆ ఊరుకి కరెంట్ వస్తోంది. అలాంటి తండ్రి పెంపకంలో పెరిగిన మహా వల్ల ఆ ఊరికి రైలు వస్తోంది. అయితే ఆ తరువాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం పేదవాడు కూడా ఫ్లైట్ లో ప్రయాణించగలగాలనే లక్ష్యంతో మహా 'డెక్కన్ ఎయిర్ లైన్' ప్రారంభిస్తాడు. కానీ ఈ మధ్యలో తన ఫ్లైట్ ఎగరడానికి మహా ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నాడు? అసలు చివరకు తాను కన్న కలను సాధించగలిగాడా ? లేదా ? అన్నది మిగతా కథ ఓటీటీ: ప్రైమ్ Ala Vaikunthapurramuloo బంటు(అల్లు అర్జున్) తన పెంపుడు తండ్రి అవమానాల మధ్య పెరిగి పెద్దవాడవుతాడు. కానీ తన నిజమైన తల్లిదండ్రుల గురించి తెలుసుకుని వారికి దగ్గర కావాలని నిర్ణయించుకుంటాడు. ఈ క్రమంలో బంటు నిజమైన తండ్రి కుటుంబానికి ఓ సమస్య వస్తుంది. ఆ సమస్యను బంటు ఎలా పరిష్కరించాడు? తన కుటుంబంలో ఎలా చేరాడు అనేది మిగతా కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ Munna కాలేజీ స్టూడెంట్ అయిన మున్నా.. తన తల్లి, సోదరిని చంపిన కాకా అనే గుండాను చంపాలనే లక్ష్యాన్ని కలిగి ఉంటాడు. ఈ ప్రక్రియలో కాకా గురించి మున్నా ఓ నిజాన్ని తెలుసుకుంటాడు. మున్నా తెలుసుకున్న నిజం ఏమిటి? కాకాతో మున్నాకు ఉన్న సంబంధం ఏమిటి? అన్నది మిగతా కథ. ఓటీటీ: యూట్యూబ్ RRR నిజాం రాజును కలిసేందుకు వచ్చిన బ్రిటిష్ అధికారి గోండు పిల్లను తమ వెంట ఢిల్లీకి తీసుకెళ్తారు. ఆ గోండు జాతి నాయకుడైన భీమ్(జూ.ఎన్టీఆర్) ఆ పిల్లను వెతుక్కుంటూ ఢిల్లీకి వస్తాడు. ఈ విషయం తెలిసిన బ్రిటిష్ ప్రభుత్వం అతన్ని పట్టుకునేందుకు రామరాజు(రామ్‌చరణ్‌)ను ప్రత్యేక అధికారిగా నియమిస్తుంది. ఈక్రమంలో ఓ సంఘటన వల్ల భీమ్- రామరాజు ఒకరికొకరు తెలియకుండానే ప్రాణ స్నేహితులుగా మారుతారు. కానీ కొన్ని పరిణామాల వల్ల ఒకరిపై ఒకరు దాడి చేసుకోవాల్సి వస్తుంది. ఇంతకు గోండు పిల్లను బ్రిటిష్ చర నుంచి భీమ్ విడిపించాడా? అసలు రామరాజు బ్రిటిషర్ల దగ్గర ఎందుకు పనిచేశాడు అనేది మిగతా కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్, జీ5 Bommarillu సిద్ధూ తండ్రి అతనికి ఓ ధనవంతుడి కూతురితో పెళ్లి ఖాయం చేస్తాడు. అయితే సిద్ధూ తన తండ్రి తెచ్చిన సంబంధాన్ని కాదని హాసిని అనే యువతితో ప్రేమలో పడటంతో కథ ఆసక్తికరమైన మలుపు తిరుగుతుంది. ఓటీటీ: యూట్యూబ్ Dear Comrade స్టూడెంట్ లీడర్ అయిన బాబీ(విజయ్ దేవరకొండ).. స్టేట్ లెవల్ క్రికెటర్ అయిన లిల్లీతో ప్రేమలో పడుతాడు. అతని దుడుకు స్వభావం వల్ల లిల్లీ అతనికి దూరం అవుతుంది. ఈ క్రమంలో లిల్లీ ఓ సమస్యలో చిక్కుకుంటుంది. లిల్లీ సమస్యను బాబీ ఏవిధంగా పరిష్కరించి తిరిగి ఆమెకు ఎలా దగ్గరయ్యాడు అనేది కథ. ఓటీటీ: ప్రైమ్ Jathi Ratnalu మంచి ఉద్యోగాల కోసం తమ ఊరి నుంచి హైదరాబాద్ వచ్చిన ముగ్గురు యువకులు ఓ అపార్ట్‌మెంటులో దిగుతారు. అక్కడ పిలువని పార్టీకి వెళ్లి మర్డర్ అటెంప్ట్ కేసులో ఇరుక్కుంటారు. ఆ తర్వాత కేసు నుంచి ఎలా బయటపడ్డారనేది కథ. ఓటీటీ: ప్రైమ్ Dirty Hari హరికి హైదరాబాద్‌లో కోటీశ్వరురాలైన వసుధతో ప్రేమలో పడుతాడు. వారి ప్రేమ సాగుతున్న క్రమంలో వసుధ అన్న గర్ల్‌ఫ్రెండ్ అందానికి ఆకర్షితుడవుతాడు. ఒకరికి తెలియకుండా ఒకరితో సంబంధాన్ని కొనసాగిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది కథ ఓటీటీ: ఆహా Arjun Reddy అర్జున్ రెడ్డి టాలెంట్ ఉన్న ఒక యువ సర్జన్. ప్రీతి అనే యువతిని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తాడు. అయితే ఓ సంఘటన అర్జున్ రెడ్డిని షాక్‌కు గురిచేస్తుంది. మద్యానికి బానిసవుతాడు. ఇంతకు తన ప్రేయసిని అతను తిరిగి కలుసుకున్నాడా లేదా? అన్నది మిగతా కథ. ఓటీటీ: ఆహా, ప్రైమ్ Rangasthalam ఊరి ప్రెసిడెంట్‌గా 30 ఏళ్ల నుంచి ఫణీంద్ర భూపతి (జగపతిబాబు) ప్రజలను పీడిస్తుంటాడు. అతడి అన్యాయాలకు హీరో అన్న కుమార్‌బాబు (ఆది పినిశెట్టి) ఎదురు తిరుగుతాడు. ఫణీంద్ర భూపతికి పోటీగా నామినేషన్‌ వేస్తాడు. ఈ క్రమంలోనే కుమార్‌బాబు అనూహ్యంగా హత్యకు గురవుతాడు. అన్న చావుని చూసిన చిట్టిబాబు (రామ్‌చరణ్‌) ఎలా రివేంజ్‌ తీర్చుకున్నాడన్నది కథ. ఓటీటీ: ప్రైమ్
    జూన్ 25 , 2024
    Telugu Directors: రాజమౌళిని బీట్ చేసే సత్తా ఈ తెలుగు డైరెక్టర్లకు ఉందా?
    Telugu Directors: రాజమౌళిని బీట్ చేసే సత్తా ఈ తెలుగు డైరెక్టర్లకు ఉందా?
    దేశం గర్వించతగ్గ దర్శకుల్లో ఎస్‌.ఎస్‌. రాజమౌళి (SS Rajamouli) ఒకరు. అపజయం ఎరుగని డైరెక్టర్‌గా ఆయన తన జైత్ర యాత్రను కొనసాగిస్తున్నారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) మూవీతో తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ స్థాయికి చేర్చిన ఆయన.. మహేష్‌తో SSMB29తో గ్లోబల్‌ మార్కెట్‌ను శాంసించేందుకు సిద్ధమవుతున్నారు. అయితే రాజమౌళి తర్వాత ఆ స్థాయిలో రాణించగల డైరెక్టర్లు తెలుగులో ఉన్నారా అన్న సందేహాన్ని నార్త్‌ ఆడియన్స్‌ వ్యక్తం చేస్తున్నాయి. ఈ ప్రశ్నకు సమాధానంగా పలువురు డైనమిక్‌ డైరెక్టర్స్‌ కనిపిస్తున్నారు. రాజమౌళి బాటలోనే నడుస్తూ.. ఇండియన్‌ బాక్సాఫీస్‌ను షేక్‌ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇంతకీ ఆ డైరెక్టర్లు ఎవరు? వారి ముందున్న అవకాశాలు ఏంటి? ఇప్పుడు పరిశీలిద్దాం.  నాగ్ అశ్విన్‌ (Nag Ashwin)   ప్రస్తుతం టాలీవుడ్‌లో బాగా వినిపిస్తున్న డైరెక్టర్‌ పేరు ‘నాగ్‌ అశ్విన్‌’. ప్రభాస్‌ హీరోగా అతడు తెరకెక్కిస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ చిత్రంపై గ్లోబల్‌ స్థాయిలో బజ్ ఉంది. భారతీయ పురాణాలు స్ఫూర్తిగా సైన్స్ ఫిక్షన్ జానర్‌లో వస్తోన్న ఈ సినిమా.. జూన్‌ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమా సక్సెస్‌ అయితే నాగ్‌ అశ్విన్‌కు కెరీర్‌ పరంగా తిరుగుండదని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ సినిమా టాలీవుడ్‌ స్థాయిని మరో రేంజ్‌కు తీసుకెళ్లి.. నాగ్‌ అశ్విన్‌కు ఎనలేని ఫేమ్‌ను తీసుకొచ్చే అవకాశం ఉంది. పైగా నాగ్‌ అశ్విన్‌.. విజన్‌, ఎగ్జిక్యూషన్‌, యునిక్‌ ప్రమోషన్స్ చూస్తే అచ్చం రాజమౌళి గుర్తుకు రాక మానడు.   టెక్నాలజీని సినిమాకు అన్వయించడంలో దర్శక ధీరుడు రాజమౌళి ఎప్పుడు ముందుంటాడు. ప్రపంచస్థాయి గ్రాఫిక్స్‌, కొత్త తరహా ఆయుధాలు, వినూత్నమైన కాస్ట్యూమ్స్‌, వైవిధ్యమైన డైలాగ్స్‌, నెవర్‌బీఫోర్‌ హీరో ఎలివేషన్స్‌ ఇలా ప్రతీ అంశంలోనూ తన మార్క్‌ చూపిస్తుంటాడు. అయితే కల్కి డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్‌ కూడా ఈ విషయంలో రాజమౌళిని గుర్తు చేస్తున్నాడు. కల్కి కోసం లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నాడు. ముఖ్యంగా ఈ మూవీ కోసం ఓ స్పెషల్‌ వెహికల్‌ను చిత్ర యూనిట్‌ తయారు చేయించింది. సినిమాలో ‘బుజ్జి’ అని పిలిచే ఈ రోబోటిక్‌ వాహనంతోనే హీరో ప్రభాస్‌ అడ్వెంచర్స్ చేశాడు. బుజ్జికి సంబంధించి బుధవారం (మే 22) స్పెషల్‌ గ్లింప్స్‌ను రిలీజ్‌ చేయగా అది యూట్యూబ్‌లో అత్యధిక వ్యూస్‌తో దూసుకెళ్తోంది.  https://twitter.com/i/status/1793606030703927405 బుజ్జి అనే స్పెషల్‌ వెహికల్‌ని మూవీ టీమ్ మహీంద్రా కంపెనీతో కలిసి తయారు చేసింది. దీన్ని తయారు చేయడానికి దాదాపు 7 కోట్లు ఖర్చు అయిందని సమాచారం. సాధారణంగా ఏదైనా కొత్త వెహికల్‌ను తయారు చేయడానికి ఐదు నుంచి పదేళ్ల సమయం పడుతుంది. డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్‌.. మహీంద్రా టీమ్‌ను సినిమాలో భాగంగా చేసుకొని తమ ఆలోచనలకు అనుగుణంగా వారిని డైరెక్ట్‌ చేస్తూ వెహికల్‌ను తయారు చేయించుకున్నారు. ఈ సినిమాలో బుజ్జికి చాలా ఇంపార్టెంట్‌ రోల్ ఉందని నాగ్ అశ్విన్‌.. గ్లింప్స్‌ రిలీజ్‌ ఈవెంట్‌లో అన్నారు. వెహికల్‌ తయారీకి సహకరించిన ఆనంద్‌ మహీంద్ర టీమ్‌కు థ్యాంక్స్ చెప్పారు.  https://twitter.com/i/status/1793303611583418579 సుకుమార్‌ (Sukumar) ‘పుష్ప’ (Pushpa : The Rise) సినిమా ముందు వరకూ టాలీవుడ్‌కే పరిమితమైన సుకుమార్‌.. ఆ మూవీ తర్వాత ప్యాన్‌ ఇండియా డైరెక్టర్‌గా మారిపోయాడు. ఇందులో సుకుమార్‌ దర్శకత్వ నైపుణ్యం చూసి ప్రతీ ఒక్కరు ఇంప్రెస్ అయ్యారు. ముఖ్యంగా అల్లు అర్జున్ లాంటి స్టైలిష్‌ హీరోను.. ఎలాంటి మేకప్‌ లేకుండా మాసిన జుట్టు, గడ్డంతో చూపించడం ఆశ్చర్యం కలిగించింది. అయితే కథకు తగ్గట్లు బన్నీ రూపురేఖలు మార్చి అక్కడే సినిమా విజయానికి పునాది వేశారు సుకుమార్. సాధారణంగా రాజమౌళి తన సినిమాల్లో ఇంటర్వెల్‌, క్లైమాక్స్‌ సీన్లకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తాడు. సాలిడ్‌ ఇంటర్వెల్‌ ద్వారా సెకండాఫ్‌పై ఆసక్తి రేకెత్తిస్తాడు. అటు సినిమా ముగింపును కూడా ఆడియన్స్‌కు చాలా సంతృప్తి కలిగేలా రాజమౌళి తీర్చిదిద్దుతాడు. అయితే డైరెక్టర్ సుకుమార్‌ దీనికి పూర్తి డిఫరెంట్‌ ఫార్మూలను పుష్ప విషయంలో అనుసరించారు. ఇందులో ఎలాంటి రక్తపాతం లేకుండా ఇంటర్వెల్‌, క్లైమాక్స్‌ సీన్లను డిజైన్‌ చేశారు. పుష్ప.. మంగళం శీను (సునీల్‌) ఇంటికి వెళ్లి వార్నింగ్ ఇచ్చే సీన్‌తో సెకండాఫ్‌పై హైప్‌ క్రియేట్‌ చేశారు సుకుమార్‌. ‌అటు క్లైమాక్స్‌లో ఎస్పీ భన్వర్‌ సింగ్‌ షెకావత్‌ (ఫహాద్‌ ఫాజిల్‌)కు పుష్ప చేత సవాలు విసిరించి.. రెండో పార్ట్‌పై ఆసక్తిని రగిలించారు.  ప్రస్తుతం సుకుమార్‌ రూపొందిస్తున్న పుష్ప సీక్వెల్‌ ‘పుష్ప 2 : ది రూల్‌’ కోసం యావత్‌ దేశం ఎదురుచూస్తోంది. ఆగస్టు 15న ఈ సినిమా విడుదల కానుండగా.. మేకర్స్‌ ఇప్పటికే ప్రమోషన్స్‌ షూరు చేశారు. ఈ సినిమా విజయం సాధిస్తే సుకుమార్‌ స్థాయి మరింత పెరగనుంది. పైగా తన తర్వాతి చిత్రాన్ని రామ్‌చరణ్‌తో చేయనున్నట్లు సుకుమార్ ప్రకటించారు. అటు ‘పుష్ప 3’ కూడా ఉంటుందని ప్రచారం జరుగుతోంది. కాబట్టి నెక్స్ట్‌ 2, 3 ఏళ్లలో సుకుమార్‌.. రాజమౌళి రేంజ్‌లో పాపులర్ అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.  సందీప్‌ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) టాలీవుడ్‌ సెన్సేషన్‌ డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగా.. ‘యానిమల్‌’ (Animal) సినిమా ద్వారా తన సత్తా ఏంటో చూపించాడు. డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో సినిమాలు తెరకెక్కిస్తూ తన కంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. అయితే సందీప్‌.. రాజమౌళిలాగా సినిమా మేకింగ్‌ స్టైల్‌నే మార్చేశాడు. ఇప్పటివరకూ ఏ డైరెక్టర్‌ సాహించని విధంగా సినిమాలు తీస్తూ అలరిస్తున్నాడు. సందీప్‌ తన తర్వాతి చిత్రాన్ని ప్రభాస్‌తో తీయనున్నాడు. దీనికి స్పిరిట్‌ అనే టైటిల్‌ కూడా ఖరారు చేశారు.  స్పిరిట్‌ సినిమాలో ప్రభాస్‌ తొలిసారి పోలీసు ఆఫీసర్‌గా కనిపించనున్నాడు. అతడి పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉండనున్నట్లు సమాచారం. ఇప్పటికే ప్రభాస్‌ పాత్రకు సంబంధించిన ఓ పోస్టర్‌ను సైతం చిత్ర యూనిట్‌ రిలీజ్‌ చేసింది. ఇందులో ప్రభాస్‌ వేసుకున్న పోలీసు డ్రెస్‌ చాలా డిఫరెంట్‌గా ఉంది. ఇంటర్‌నేషనల్‌ కాప్‌ లుక్‌ను తలపిస్తోంది. యానిమల్‌ కంటే స్ట్రాంగ్‌ కంటెంట్‌తో స్పిరిట్‌ రానుంది ఇప్పటికే సందీప్‌ ప్రకటించాడు. తొలి రోజే రూ.150 కోట్ల వసూళ్లను రాబడుతుందని ధీమా వ్యక్తం చేశారు. మూవీ హిట్‌ టాక్‌ వస్తే.. వారం రోజుల్లోనే రూ.1500 కలెక్షన్లు సాధిస్తుందని సందీప్‌ వంగా నమ్మకంగా ఉన్నట్లు తెలిసింది.  ఇక స్పిరిట్‌ తర్వాత సందీప్‌ రెడ్డి.. రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor)తోనే ‘యానిమల్‌ 2’ చేయనున్నాడు. ఈ రెండు సినిమాలు సక్సెస్‌ అయితే సందీప్‌కు రాజమౌళి స్థాయిలో ఫేమ్‌ రావడం ఖాయమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.  ప్రశాంత్‌ వర్మ (Prasanth Varma) యంగ్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మ.. తన టాలెంట్‌ ఏంటో ‘హనుమాన్‌’ (HanuMan) ద్వారా యావత్‌ దేశానికి తెలియజేశాడు. తన మూడో సినిమాతోనే స్టార్‌ డైరెక్టర్ల సరసన నిలబడ్డాడు. ఈ ఏడాది ఇప్పటివరకూ అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా హనుమాన్‌ నిలిచింది. బాక్సాఫీస్‌ వద్ద రూ. 350 కోట్లకు పైగా కలెక్షన్స్‌ కొలగొట్టి అందర్నీ ఆశ్చర్య పరిచింది. ప్రస్తుతం ప్రశాంత్‌ వర్మ..  ‘హనుమాన్‌ 2’ చిత్రాన్ని తెరకెక్కించే పనిలో ఉన్నాడు. అటు బాలీవుడ్‌ స్టార్ హీరో రణ్‌వీర్‌ సింగ్‌ (Ranveer Singh)తో ఓ పీరియాడికల్‌ సినిమా చేసే ఛాన్స్ ప్రశాంత్‌కు దక్కినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ రెండు ప్రాజెక్ట్స్‌ కూడా సక్సెస్‌ అయితే ప్రశాంత్‌ పేరు జాతీయ స్థాయిలో మారుమోగడం ఖాయం.  ప్రశాంత్‌ నీల్‌ (Prashanth Neel) కన్నడ డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌.. టాలీవుడ్‌ స్టార్‌ ప్రభాస్‌తో ‘సలార్‌’ (Salaar) రూపొందించి సాలిడ్‌ విజయాన్ని అందుకున్నాడు. ఈ దర్శకుడి మేకింగ్‌ స్టైల్‌ రాజమౌళిని సైతం ఎంతగానో ఇంప్రెస్‌ చేసింది. ప్రభాస్‌ కటౌట్‌కు తగ్గ ఎలివేషన్స్‌ ఇచ్చి.. ప్రతీ ఒక్కరినీ ప్రశాంత్‌ నీల్ ఆకట్టుకున్నారు. హీరో ప్రభాస్‌ను చాలా స్ట్రాంగ్‌ పర్సనాలిటీగా సలార్‌లో ప్రొజెక్ట్‌ చేశాడు డైరెక్టర్‌. రాజమౌళి తరహాలోనే అద్భుతంగా ఇంటర్వెల్‌ను డిజైన్‌ చేశాడు. ప్రభాస్‌ను స్క్రీన్‌పై కనిపించిన ప్రతీసారి ఫ్యాన్స్‌కు గూస్‌బంప్స్‌ వచ్చాయి.  ప్రస్తుతం ప్రశాంత్ నీల్ ఫోకస్‌ మెుత్తం ‘సలార్‌ 2’ (Salaar: Part 2 - Shouryanga Parvam)పై ఉంది. ఈ మూవీ కూడా విజయం సాధిస్తే ప్రశాంత్‌ నీల్‌ జాతీయ స్థాయిలో టాప్‌ డైరెక్టర్లలో ఒకరిగా మారిపోవడం ఖాయం. అటు తారక్‌తోనూ ప్రశాంత్‌.. ఓ సినిమాను ప్రకటించాడు. ‘NTR31’ ప్రొడక్షన్‌ టైటిల్‌తో ఈ మూవీ సెట్స్‌పైకి వెళ్లనుంది. అటు ‘కేజీఎఫ్‌ 3’ రూపొందనున్నట్లు సదరు నిర్మాణ సంస్థ ప్రకటించింది. ఈ మూడు ప్రాజెక్టులు సక్సెస్‌ అయితే ప్రశాంత్‌ క్రేజ్‌ రాజమౌళి స్థాయికి చేరే అవకాశముంది.  కొరటాల శివ (Koratala Siva) టాలీవుడ్‌ టాలెంటెడ్‌ డైెరెక్టర్లలో కొరటాల శివ ఒకరు. ఆచార్య మినహా ఇప్పటివరకూ అతడు డైరెక్ట్‌ చేసిన చిత్రాలన్నీ బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాయి. అతడు కెరీర్‌లో తొలిసారి ఓ పాన్‌ ఇండియా చిత్రాన్ని రూపొందిస్తున్నారు. తారక్‌తో ‘దేవర’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీపై దేశవ్యాప్తంగా బజ్ ఉంది. తీర ప్రాంత నేపథ్యంలో ఈ సినిమా వస్తోంది. మెుత్తం రెండు పార్ట్స్‌గా ఈ మూవీ రానుండగా తొలి భాగం.. అక్టోబర్‌ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. తారక్‌తో పాటు బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌, మ్యూజిక్ సెన్సేషన్‌ అనిరుధ్‌ ఈ ప్రాజెక్టులో భాగం కావడంతో సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి. గతంలో రిలీజ్‌ చేసిన దేవర గ్లింప్స్‌ ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. ఈ గ్లింప్‌లో తారక్‌.. కత్తితో శత్రువులను తెగనరకడం చూపించాడు డైరెక్టర్‌. ఓ సీన్‌లో తారక్‌ శత్రువుని నరకగా అతడి రక్తం.. హాఫ్‌ మూన్‌ను కింద వైపు నుంచి ఈక్వెల్‌గా రౌండ్‌ చేయడం గూస్‌బంప్స్‌ తెప్పిస్తుంది. అలాగే ఇటీవల తారక్‌ బర్త్‌డేను పురస్కరించుకొని రిలీజ్‌ చేసిన ఫస్ట్‌ సింగిల్‌ కూడా సినిమాపై మరింత హైప్‌ను పెంచింది. ముఖ్యంగా తారక్‌ పాత్రను ఎలివేట్‌ చేస్తూ రాసుకున్న లిరిక్స్‌ హైలెట్‌గా నిలిచాయి. ఈ మూవీ సక్సెస్‌ అయితే కొరటాల శివ క్రేజ్‌ జాతీయ స్థాయికి చేరనుంది. ఇక దేవర రెండు పార్ట్స్‌ కూడా విజయం సాధిస్తే.. దేశంలోని ప్రముఖ డైరెక్టర్ల జాబితాలో అతడు చేరడం ఖాయం.  సుజీత్‌ (Sujeeth) యంగ్‌ డైరెక్టర్‌ సుజీత్‌.. స్టైలిష్‌ డైరెక్టర్‌గా ఇండస్ట్రీలో పేరుంది. అతడి డైరెక్షన్‌ స్కిల్స్‌ రాజమౌళి తరహాలోనే హాలీవుడ్‌ డైరెక్టర్లను తలపిస్తాయి. బాహుబలి తర్వాత ప్రభాస్‌ చేసిన ‘సాహో’ చిత్రానికి  సుజీత్‌ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ఫ్లాప్‌ టాక్‌ తెచ్చుకున్నప్పటికీ.. సుజీత్‌ మేకింగ్‌ నైపుణ్యం, స్క్రీన్‌ప్లే, ఐడియాలజీకి ఆడియన్స్ ఇంప్రెస్ అయ్యారు. ముఖ్యంగా యాక్షన్స్‌ సీక్వెన్స్‌ను ఆయన తెరకెక్కించిన విధానం ఎంతగానో ఆకట్టుకుంది. ప్రభాస్‌ను చాలా స్టైలిష్‌గా చూపించాడు. సరైన హిట్‌ లభిస్తే సుజీత్‌ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదని అప్పట్లో వార్తలు వచ్చాయి. ప్రస్తుతం అతడు పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan)తో ‘ఓజీ’ (OG) సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ గ్లింప్స్‌ పవన్‌ ఫ్యాన్స్‌ను ఎంతగానో ఇంప్రెస్ చేసింది. ఇందులో పవన్‌ గ్యాంగ్‌ స్టర్‌గా కనిపించనున్నాడు. ఈ మూవీ సక్సెస్‌ అయితే సుజీత్ కెరీర్‌ మరోలా ఉంటుందని సినీ విశ్లేషకుల అంచనా. రెండు సాలిడ్ హిట్స్ పడితే అతడి క్రేజ్‌ రాజమౌళి స్థాయికి చేరే అవకాశముందని విశ్లేషణలు ఉన్నాయి.  బుచ్చిబాబు (Buchi Babu) తొలి సినిమాతోనే సాలిడ్‌ హిట్‌ అందుకున్న అతికొద్ది దర్శకుల్లో బుచ్చిబాబు ఒకరు. ‘ఉప్పెన’ (Uppena) సినిమాతో స్వచ్ఛమైన ప్రేమ కథను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన అతడు.. తనలో ఎంతో టాలెంట్‌ ఉందని ఇండస్ట్రీకి తెలిసేలా చేశాడు. తన తర్వాతి చిత్రాన్ని టాలీవుడ్‌ స్టార్‌ హీరో రామ్‌చరణ్‌తో చేసే స్థాయికి ఎదిగాడు. స్పోర్ట్స్‌ డ్రామాగా రానున్న ఈ చిత్రం కూడా పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందనుంది. రామ్‌చరణ్‌ క్రేజ్‌కు బుచ్చిబాబు టాలెంట్‌ తోడైతే ఈ సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. జాతీయ స్థాయిలో అతడి పేరు మార్మోగుతుందని అభిప్రాయపడుతున్నారు. 
    మే 24 , 2024
    RamCharan Global Craze: రామ్‌ చరణ్ లాంటి నటుడు మాకు కావాలి: హాలీవుడ్
    RamCharan Global Craze: రామ్‌ చరణ్ లాంటి నటుడు మాకు కావాలి: హాలీవుడ్
    మెగాస్టార్‌ చిరంజీవి తనయుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ‘రామ్‌చరణ్‌’ (Ramcharan).. టాలీవుడ్‌ అగ్రకథానాయకుల్లో ఒకరిగా మారారు. ‘చిరుత’తో ఎంట్రీ ఇచ్చిన అతడు.. ‘మగధీర’తో స్టార్‌ హీరోగా మారిపోయాడు. ‘రంగస్థలం’ ద్వారా తనలో దాగున్న అద్భుతమైన నటుడ్ని ఆడియన్స్‌కు పరిచయం చేశాడు. రీసెంట్‌గా వచ్చిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’తో రామ్‌చరణ్‌ పాన్‌ ఇండియా స్థాయిలో గుర్తింపు సంపాదించాడు. ఈ చిత్రం ఆస్కార్‌ స్థాయికి ఎదగడంతో ఇందులో నటించిన తారక్‌ (Jr NTR), రామ్‌చరణ్‌ గురించి గ్లోబల్‌ స్థాయిలో చర్చ జరిగింది. ప్రస్తుతం హాలీవుడ్‌లో రామ్‌చరణ్‌కు ఏ స్థాయిలో క్రేజ్ ఉందో చెప్పే పోస్టర్‌ నెట్టింట వైరల్ అవుతోంది. అది చూసిన మెగా ఫ్యాన్స్‌ తెగ ఖుషి అవుతున్నారు.  ‘చరణ్‌ లాంటి నటుడు కావాలి’ హాలీవుడ్‌లో ఓ నటీనటుల ఎంపిక సంస్థ తమకి ఈ లక్షణాలు ఉన్న నటుడు కావాలని కొన్ని పాయింట్స్ పెట్టి అందులో పలువురు హాలీవుడ్ స్టార్స్ ఫొటోలను చేర్చింది. ఆస్కార్‌ ఇసాక్‌ (Oscar Isaac), టెనెట్‌ (Tenet) నటుడు జాన్‌ డేవిడ్‌ వాషింగ్టన్‌ (John David Washington), టాప్‌ గన్‌ (Top Gun) ఫేమ్‌ మైల్స్‌ టెల్లర్‌ (Miles Teller) లాంటి నటులతో సహా ఆర్‌ఆర్‌ఆర్‌ (RRR)లో రామ్‌చరణ్‌ పోలీసు గెటప్‌ను చేర్చింది. తమకు వీరి రేంజ్‌ ఫిజిక్‌, లుక్స్‌ ఉన్న నటులు కావాలని సోషల్‌ మీడియాలో పోస్టు పెట్టింది. ప్రస్తుతం ఈ పోస్టు నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. రామ్‌చరణ్‌ (RamCharan) లాంటి నటుడ్ని హాలీవుడ్‌ కోరుకుంటోందని మెగా ఫ్యాన్స్‌ ఖుషీ అవుతున్నారు. తమ హీరో పక్కా హాలీవుడ్ మెటిరియల్‌ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. ఇందుకు లేటెస్ట్‌ పోస్టరే ఉదాహరణ అంటూ పోస్టులు పెడుతున్నారు.  https://twitter.com/TweetRamCharan/status/1763423843023196469?s=20 ‘గేమ్‌ ఛేంజర్‌’లో ఎన్ని కోణాలో! ప్రస్తుతం రామ్‌ చరణ్‌.. 'గేమ్ ఛేంజర్‌' (Game Changer) సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో అతడు ద్విపాత్రాభినయం చేయబోతున్నట్లు తెలుస్తోంది. రెండూ పొంతనలేని పాత్రలని టాక్‌. అందులో ఒక పాత్ర నేటి యువతరానికి ప్రతీకగా నిలిచేదైతే.. మరో పాత్ర 1970-80 కాలానికి చెందిందని అంటున్నారు. రెండు పాత్రల ఆహార్యాలు కూడా పూర్తి భిన్నంగా ఉంటాయి. ఇందులో రామ్‌చరణ్‌ పోషిస్తున్న ఒక పాత్ర పేరు ‘రామ్‌ నందన్‌’ అని తెలుస్తోంది. రాజకీయ నేపథ్యంలో సాగే ఈ ఎమోషనల్‌ మూవీలో పీరియాడికల్‌ నేపథ్యంతో పాటు, ప్రేమ, స్నేహం, నమ్మకద్రోహం, ప్రతీకారం, సామాజిక సమస్యలు.. అన్నీ మిళితమై ఉంటాయని వినికిడి. కైరా అద్వాణీ, అంజలి కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో సునీల్‌, శ్రీకాంత్‌, ఎస్‌.ఎ.సూర్య కీలక పాత్రలు పోషిస్తున్నారు.  అంబానీ కొడుకు వెడ్డింగ్‌కు రామ్‌చరణ్‌! ప్రపంచ కుబేరుల్లో ఒక‌రైన ముఖేష్ అంబానీ త‌న‌యుడు అనంత్ అంబానీ.. రాధికా మ‌ర్చంట్‌తో ఏడ‌డుగులు వేయ‌బోతున్నాడు. అనంత్‌, రాధిక ప్రీ వెడ్డింగ్ సెల‌బ్రేష‌న్స్ ఫిబ్ర‌వ‌రి 28 నుంచి గుజ‌రాత్‌లోని జామ్‌న‌గ‌ర్‌లో మొద‌ల‌య్యాయి. ఈ ప్రీ వెడ్డింగ్ సెల‌బ్రేష‌న్స్‌కు రామ్‌చ‌ర‌ణ్ అటెండ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. త‌న స‌తీమ‌ణి ఉపాస‌న‌తో క‌లిసి ఈ పెళ్లి వేడుక‌ల్లో చెర్రీ పాల్గొంటారని సినీ వర్గాలు పేర్కొన్నాయి. టాలీవుడ్ నుంచి రామ్ చ‌ర‌ణ్ మాత్ర‌మే అనంత్ పెళ్లి వేడుక‌ల‌కు హాజ‌రుకాబోతున్న‌ట్లు స‌మాచారం. రామ్‌చ‌ర‌ణ్‌తో పాటు షారుఖ్‌ ఖాన్ త‌న భార్య పిల్ల‌ల‌తో అనంత్ అంబానీ వెడ్డింగ్ సెల‌బ్రేష‌న్స్‌లో పాల్గొన‌నున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. బుచ్చిబాబుతో స్పోర్ట్స్‌ డ్రామా చిత్రం! గేమ్ ఛేంజ‌ర్ త‌ర్వాత రామ్‌చ‌ర‌ణ్.. ఉప్పెన (Uppena) ఫేమ్ బుచ్చిబాబు (Buchi Babu)తో ఓ స్పోర్ట్స్ డ్రామా మూవీ చేయ‌బోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌ సైతం రెడీ అయిపోయింది. ఈ మూవీ రూర‌ల్ బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్కనున్నట్లు తెలుస్తోంది. పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందనున్న ‘RC16’ మూవీలో క‌న్న‌డ అగ్ర హీరో శివ‌రాజ్‌కుమార్ కీల‌క పాత్ర పోషించనున్నారు. ఈ ఏడాదే ఈ మూవీ సెట్స్‌పైకి వెళ్లనుంది. ఇందులో రామ్‌చరణ్‌కు జోడీగా బాలీవుడ్‌ స్టార్‌ జాన్వీ కపూర్‌ (Janhvi Kapoor) నటించనుంది.  ప్రొడ్యూసర్‌గానూ బిజీ బిజీ! హీరోగా బిజీగా ఉంటూనే చిత్ర నిర్మాణంపై రామ్‌చ‌ర‌ణ్ ఫోక‌స్ పెట్టాడు. తండ్రి చిరంజీవితో ఆచార్య, ఖైదీ నంబ‌ర్ 150 వంటి భారీ బ‌డ్జెట్ సినిమాల‌ను నిర్మించిన చరణ్‌.. కాన్సెప్ట్ ఓరియెంటెడ్ క‌థాంశంతో కూడిన చిన్న సినిమాల‌ను నిర్మిచండానికి ‘వీ మెగా పిక్చ‌ర్స్’ పేరుతో మ‌రో కొత్త నిర్మాణ సంస్థ‌ను ప్రారంభించాడు. ఈ బ్యాన‌ర్ ద్వారా ‘ది ఇండియా హౌజ్’ పేరుతో ఓ దేశ‌భ‌క్తి మూవీని చ‌ర‌ణ్ నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో నిఖిల్ హీరోగా న‌టిస్తున్నాడు.
    మార్చి 01 , 2024
    Chaithra J Achar: చైత్ర జె ఆచార్ అందాల ఆరాచకం.. చూసి తట్టుకోగలరా?
    Chaithra J Achar: చైత్ర జె ఆచార్ అందాల ఆరాచకం.. చూసి తట్టుకోగలరా?
    'సప్త సాగరాలు దాటి మూవీ ఫేమ్ చైత్ర జె ఆచార్ అందాల ఆరాచకం సృష్టిస్తోంది. ఓ రేంజ్‌లో పరువాలు ఒల‌క‌బోస్తూ కుర్రాళ్లను కంగు తినేలా చేస్తోంది. తాజాగా ఆమె చేసిన ఫొటో షూట్  కుర్రకారులో మ‌రింత వేడిని పెంచుతోంది. క్రీమ్ కలర్ మల్బరీ బ్లౌజ్‌లో ఎద అందాలను ప్రదర్శిస్తూ కవ్విస్తోంది.  మల్బరీ పట్టు చీరను కేరళ స్టైల్‌లో ధరించి అందాల విందు చేసింది. మత్తెక్కించే చూపులతో గాలం వేస్తోంది లూజ్ హెయిర్, గొల్డెన్ జూకాలు, నోస్‌ రింగ్ ఆమె అందాన్ని మరింత ఆకర్శనీయం చేశాయి. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఏం అందం రా బాబు అంటూ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. స‌ప్త సాగ‌రాలు (Sapta Sagaralu Dhaati (Side B) చిత్రంలో లిప్‌లాక్‌ సీన్లలో నటించి అందరి దృష్టిని ఆకర్షించిన ఈ ముద్దుగుమ్మ ఏ డ్రెస్ వేసినా అందాల ప్రదర్శన మాత్రం ఆపడం లేదు.  మ‌హిరా (Mahira 2019)  అనే కన్నడ చిత్రంతో సినిమా ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ... తక్కువ కాలంలో మల్టీ టాలెంట్‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది.  చైత్ర ఆచార్ కర్ణాటకలోని బెంగళూరులో జన్మించింది. ఆమె తల్లి పాడేటప్పుడు ఇంట్లో సంగీతం వింటూ పెరిగింది, అలా ఆమె పాడటంపై ఆసక్తిని పెంచుకుని కర్ణాటక శాస్త్రీయ సంగీతాన్ని నేర్చుకుంది. సంగీతం అంటే ఇష్టంతో సింగర్‌గా వచ్చిన చైత్ర అనుకోకుండా నటిగా మారింది. ఇప్పటికే నేపథ్య గాయనిగా 10కి పైగా పాటలు పాడింది. గరుడ గమన వృషభ వాహన సినిమాలో "సోజుగడ సూజుమల్లిగే" పాటకు గాను ఉత్తమ నేపథ్య గాయనిగా సైమా అవార్డును పొందింది. కళాశాలలో ఉండగానే, నటుడు అనీష్ తేజేశ్వర్ దర్శకత్వం వహించి, నిర్మించిన బెంగళూరు క్వీన్స్ అనే కన్నడ వెబ్ సిరీస్‌తో తన కెరీర్ ప్రారంభించింది. కన్నడ స్టార్ హీరో రక్షిత్ శెట్టి నటించిన సప్త సాగరాలు దాటి సైడ్ ఏ, సప్త సాగరాలు దాటి సైడ్ బి చిత్రాల్లో నటించి హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. ఈ చిత్రంలో  వేశ్యగా న‌టించి మెప్పించింది. టోబీ సినిమాలో తండ్రిని కాపాడే ఓ ప‌ల్లెటూరు కూతురిగా అంద‌రినీ అలరించింది. ప్రస్తుతం స్ట్రాబెర్రి, జన్మదిన శుభాకాంక్షలు వంటి కన్నడ చిత్రాల్లో నటిస్తోంది.
    ఏప్రిల్ 01 , 2024
    Village Flavoured Movies: టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్.. ఈ లైన్‌తో సినిమా తీస్తే పక్కా హిట్..!
    Village Flavoured Movies: టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్.. ఈ లైన్‌తో సినిమా తీస్తే పక్కా హిట్..!
    టాలీవుడ్‌లో నయా ట్రెండ్ నడుస్తోంది. గ్రామీణ నేపథ్యంలో వస్తున్న సినిమాలు బంపర్ హిట్ సాధిస్తున్నాయి. పల్లెటూరి వాతావరణం, ఆహార్యం, యాస, ఆచార సంప్రదాయాలను ఎన్నో సినిమాలు ప్రతిబింబిస్తున్నాయి. ఇలా వచ్చిన సినిమాలు విజయాన్ని అందుకుంటున్నాయి. గత కొద్ది కాలంగా విలేజ్ ఫ్లేవర్‌తో వచ్చిన సినిమాలు తెగ ఆకట్టుకుంటున్నాయి. ఆ సినిమాలేంటో ఓ లుక్కేద్దాం.  రంగస్థలం రంగస్థలం అనే గ్రామాన్ని సృష్టించి ఈ సినిమా తెరకెక్కించారు. ఇందులో నదీ పరివాహక ప్రాంతం, పొలాలు, గుడిసెలు.. అంతా పల్లెటూరి వాతావరణాన్ని ప్రతిబింబిస్తుంది. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. తన నటనతో రామ్‌చరణ్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాడు.  దసరా సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన మొదటి చిత్రం ‘దసరా’. సింగరేణి బొగ్గు గనుల్లో ఉన్న ‘వీర్లపల్లి’ అనే గ్రామం చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. ముఖ్యంగా, ఇక్కడి మనుషుల అలవాట్లు, కట్టుబాట్లు, వేష భాషను సినిమాలో చక్కగా చూపించారు. తెలంగాణ మాండలికంలో డైలాగులు చెబుతూ నాని యాక్టింగ్ ఇరగదీశాడు. బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్ల గ్రాస్ వసూళ్లను ఈ సినిమా క్రాస్ చేసింది. బలగం అంచనాలు లేకుండా వచ్చి సంచలనం రేపిన సినిమా ‘బలగం’. ఇదొక ఊరి కథ. ప్రతి గ్రామంలోని ఓ కుటుంబంలో ఉండే కామన్ సమస్యను ఇందులో చూపించాడు డైరెక్టర్ వేణు యెల్దండి. గ్రామస్థుల మధ్య సంబంధ, బాంధవ్యాలు; వ్యవహార శైలిని కళ్లకు కట్టినట్లు తీశాడు. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం పెను సంచలనం సృష్టించింది. ఊర్లలో ప్రత్యేకంగా ఈ సినిమాను స్క్రీనింగ్ చేశారు. బండ్లు, బస్సులు, ట్రాక్టర్లు కట్టుకుని థియేటర్లకు ప్రేక్షకులు వెళ్లారు.  విరూపాక్ష పూర్తిగా గ్రామీణ నేపథ్యం ఉన్న సినిమా ఇది. రుద్రవనం అనే గ్రామంలో జరిగే ఘటనల చుట్టూ సినిమా కథను రాసుకున్నాడు డైరెక్టర్ కార్తీక్ దండు. 1990వ దశకంలో గ్రామాల్లోని పరిస్థితి ఎలా ఉండేది? మూఢ నమ్మకాలను ఎంత బలంగా విశ్వసించేవారు? పల్లెటూరి వాతావరణం వంటి వాటిని ఇందులో చూపించారు.  పుష్ప సుకుమార్ తెరకెక్కించిన మరో చిత్రం పుష్ప. శేషాచలం అడవుల్లోని గ్రామాల్లో నెలకొనే పరిస్థితులపై సినిమా తెరకెక్కింది. నటీనటుల వేష, భాష అచ్చం రాయలసీమను ప్రతిబింబిస్తాయి. బాక్సాఫీస్‌తో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుందీ సినిమా. పుష్ప రాజ్‌గా అల్లు అర్జున్ ఇరగదీశాడు.  కేరాఫ్ కంచరపాలెం కంచరపాలెం, భీమిలి పరిసర ప్రాంతాల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇక్కడి ప్రజల జీవనశైలిని నిశితంగా పరిశీలించి చిత్రాన్ని తీయాలని డైరెక్టర్ వెంకటేశ్ మహా భావించాడు. అలా ఓ కథను ఎంచుకుని గ్రామీణ పరిస్థితులు ఉట్టిపడేలా సినిమాను తీశాడు. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది.  శ్రీకారం వ్యవసాయానికి ఆదరణ కోల్పోతున్న నేపథ్యంలో దాని ప్రాధాన్యతను తెలియజేస్తూ వచ్చిన చిత్రం ఇది. గ్రామాల్లోని రైతుల మధ్య ఉండే అనుబంధాలను ఇందులో చక్కగా చూపించాడు డైరెక్టర్ కిశోర్. శర్వానంద్ హీరోగా, ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా నటించింది.   కాంతార చిన్న చిత్రంగా విడుదలై దేశవ్యాప్తంగా సంచలనం రేపింది కాంతార. ఓ మారుమూల అటవీ గ్రామంలోని ఆచారాన్ని ఆదర్శంగా తీసుకుని సినిమాను తెరకెక్కించారు. అడవి, గ్రామస్థులు, వారి అలవాట్లు, జీవన విధానం.. ఇలా ప్రతి కోణంలోనూ పల్లెటూరి వాతావరణాన్ని కళ్లకు కట్టేలా చూపించారు. 
    జూన్ 13 , 2023
    Ramayanam: ‘రామాయణం’ సెట్‌ నుంచి ఫొటోలు లీక్‌.. సీతగా ‘సాయిపల్లవి’ ఎంత బాగుందో చూడండి!
    Ramayanam: ‘రామాయణం’ సెట్‌ నుంచి ఫొటోలు లీక్‌.. సీతగా ‘సాయిపల్లవి’ ఎంత బాగుందో చూడండి!
    రామాయణాన్ని ఆధారంగా చేసుకొని బాలీవుడ్‌లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ‘రామాయణం’ (Ramayanam) పేరుతో రూపొందనున్న ఈ చిత్రంలో రాముడిగా రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor), సీతగా సాయి పల్లవి (Sai Pallavi) నటిస్తున్నారు. బాలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్‌ దర్శకుడు నితేశ్‌ తివారీ (Nitesh Tiwari) ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్‌ కూడా ప్రారంభమైంది. కీలక సన్నివేశాలను చిత్ర యూనిట్‌ చిత్రీకరిస్తోంది. ఈ క్రమంలోనే సెట్‌ నుంచి కొన్ని ఫొటోలు ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమయ్యాయి. ప్రస్తుతం అవి నెట్టింట ట్రెండింగ్‌ అవుతున్నాయి. రణ్‌బీర్‌, సాయిపల్లవి లుక్స్‌ లీక్‌ తాజాగా రామాయణం సెట్‌ నుంచి రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి ఫొటోలు లీకయ్యాయి. ఇందులో రణ్‌బీర్‌ రాముడి గెటప్‌లో కనిపించాడు. సీత కాస్ట్యూమ్‌లో సాయిపల్లవి అందంగా కనిపించింది. ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు మైమరిచిపోతున్నారు. ముఖ్యంగా సీత పాత్రకు సాయి పల్లవి సరిగ్గా సరిపోయిందని కామెంట్స్‌ చేస్తున్నారు. ఆమె కట్టు, బొట్టు, హుందాతనం చూస్తే అచ్చం సీతలాగే ఉందని ప్రశంసిస్తున్నారు. సీత పాత్రకు ఆమె ఎంపిక 100 శాతం సరైనదని అంటున్నారు. అటు రాముడిగా రణ్‌బీర్‌ లుక్‌ కూడా బాగుందని ఫ్యాన్స్‌ పోస్టులు పెడుతున్నారు. అతడి ఆహార్యం రాముడి సరిగ్గా సరిపోయిందని పేర్కొంటున్నారు. సీతారాములుగా వీరి పెయిర్‌ చూడ ముచ్చటగా ఉందంటూ అభిప్రాయపడుతున్నారు.  https://twitter.com/RKs_Tilllast/status/1784096317817708991 https://twitter.com/Udbhav1947/status/1784115819171233844 https://twitter.com/BFilmyOfficial/status/1784097462581604480 ఇద్దరు ఆస్కార్‌ విన్నర్లు! రామాయణం చిత్రానికి సంగీతం అందించ‌డం కోసం ఇద్దరు ఆస్కార్ విన్నర్లు రాబోతున్నారట. ఇందులో ఒక‌రు ఇండియన్ ఆస్కార్ విన్నర్ ఏ ఆర్ రెహమాన్ కాగా.. ఇంకొక‌రు హాలీవుడ్ ఆస్కార్ విన్నర్ హన్స్ జిమ్మెర్ (Hans Zimmer). వీరిద్ద‌రూ క‌లిసి రామాయ‌ణం సినిమాకు సంగీతం అందించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే ఈ విష‌యంపై నితీష్‌ తీవారి ఏ.ఆర్ రెహమాన్, హన్స్ జిమ్మెర్‌తో చ‌ర్చ‌లు జ‌రిపిన‌ట్లు స‌మాచారం. ‘ది లయన్ కింగ్’, ‘డార్క్ నైట్ ట్రయాలజీ’, ‘ఇన్‌సెప్షన్’ చిత్రాల‌తో హన్స్ జిమ్మెర్ త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు సంపాదించాడు. త్రివిక్రమ్‌కు కీలక బాధ్యత! రామాయణ తెలుగు వెర్షన్‌ డైలాగ్స్‌ రాసే బాధ్యతను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ (Trivikram Srinivas)కు మేకర్స్‌ అప్పగించినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. మాటల రచయితగా ఆయనకు టాలీవుడ్‌లో ప్రత్యేక స్థానం ఉంది. తెలుగు సాహిత్యంపై ఆయనకు మంచి పట్టు సైతం ఉంది. ఈ విషయం పలు చిత్రాల ద్వారా ఇప్పటికే నిరూపితమైంది. దీంతో రామాయణ చిత్ర యూనిట్‌ ఆయన్ను సంప్రదించినట్లు బాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపించింది. తెలుగు వెర్షన్‌కు మాటలు అందించాల్సిందిగా కోరినట్లు తెలిసింది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రావాల్సి వస్తుందని అంటున్నారు. గ్రాఫిక్స్‌పై ప్రత్యేక దృష్టి ప్రభాస్‌ రాముడిగా నటించిన ‘ఆదిపురుష్‌’ చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలై విమర్శలు మూటగట్టుకుంది. ముఖ్యంగా ఈ సినిమాల్లోని గ్రాఫిక్స్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది. గ్రాఫిక్స్‌ మరి పేలవంగా ఉన్నాయని, కార్టూన్‌ను తలపిస్తున్నాయని విమర్శలు వచ్చాయి. దీంతో అలాంటి తప్పు చేయకుండా ‘రాయయణం’ టీమ్ జాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తోంది. హాలీవుడ్‌ స్థాయి చిత్రాలకు పనిచేసే గ్రాఫిక్‌ టీమ్‌ను ఈ మూవీ కోసం తీసుకున్నట్లు సమాచారం. 
    ఏప్రిల్ 30 , 2024
    Sri Krishna Janmashtami 2023: మహేష్ బాబు నుంచి సునీల్ వరకు శ్రీకృష్ణుడి పాత్రలో మెప్పించిన హీరోల లిస్ట్ ఇదే!
    Sri Krishna Janmashtami 2023: మహేష్ బాబు నుంచి సునీల్ వరకు శ్రీకృష్ణుడి పాత్రలో మెప్పించిన హీరోల లిస్ట్ ఇదే!
    తెలుగులో ఎంతో మంది నటులు శ్రీకృష్ణుడి వేషధారణలో నటించి తమదైన ముద్ర వేశారు. శ్రీ మహావిష్ణువు ఎత్తిన దశావతారల్లో శ్రీకృష్ణావతారం ఎంతో ఉత్కృష్ణమైంది. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణార్థం ద్వాపర యుగంలో శ్రీమహా విష్ణువు శ్రీకృష్ణుడిగా అవతరించాడు. ఆయన నోటి నుంచి వచ్చిన జ్ఞాన బోధే పంచవేదం భగవద్గీతగా విరాజిల్లుతోంది. అందుకే శ్రీకృష్ణ పరమాత్ముడు జగద్గురువుగా ప్రసిద్ధిచెందాడు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా వెండితెరపై శ్రీకృష్ణుడి పాత్రలో మెరిసిన నేటి తరం యువ కథనాయకులు, పాత తరం హీరోలపై YouSay Telugu ప్రత్యేక కథనం. జూ.ఎన్టీఆర్ వంశీ పైడిపల్లి డైరెక్షన్‌లో వచ్చిన ‘బృందావనం’ సినిమాలో కొద్దిసేపూ జూ. ఎన్టీఆర్ కృష్ణుడిగా కనిపించి అలరించాడు. ఈ సినిమాలో ‘చిన్నదో వైపు, పెద్దదో వైపు’  పాటలో తారక్ మోడ్రన్ కృష్ణుడి గెటప్‌లో వావ్ అనిపించాడు. అయితే రాముడిగా, యంగ్ యముడి పాత్రలో ప్రేక్షకులను అలరించిన  జూ.ఎన్టీఆర్‌ను.. కృష్ణుడిగా ఫుల్ లెంగ్త్‌ రోల్‌లో చూడాలని ఆయన ఫ్యాన్స్ ముచ్చటపడుతున్నారు. అయితే రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్‌ మహాభారతంలో శ్రీకృష్ణుడి పాత్రలో జూ.ఎన్టీఆర్ నటించే అవకాశం ఉన్నట్లు వార్తలైతే ఉన్నాయి. https://www.youtube.com/watch?v=hzAaEN6yc1g మహేష్ బాబు సూపర్ స్టార్ మహేశ్ బాబు సైతం ఓ సినిమాలో శ్రీకృష్ణుడిగా అలరించాడు. ఆయన కేరీర్ ఆరంభంలో వచ్చిన ‘యువరాజు’ సినిమాలోని 'గుంతలకిడి గుంతలకిడి గుమ్మ' పాటలో శ్రీకృష్ణుడిగా కనువిందు చేశాడు. కృష్ణుడి వేషంలో మహేష్ బాగా సెట్ అయ్యాడని అప్పట్లో అభిమానులు తెగ సంతోషపడిపోయారు. https://youtu.be/b02ieSLiyRI?feature=shared పవన్ కళ్యాణ్ ఈ తరం హీరోల్లో కృష్ణుడి పాత్రలో అలరించిన మరో హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. 'గోపాల గోపాల' సినిమాలో పవన్ కళ్యాణ్ కృష్ణుడిగా మెరిసాడు. సామన్య మానవుడి రూపు దాల్చిన  శ్రీకృష్ణ పరమాత్మ వేషంలో పవర్ స్టార్ కనిపించి కనువిందు చేశాడు. https://www.youtube.com/watch?v=HNeBe1JvBmU నాగార్జున మంచు విష్ణు హీరోగా వచ్చిన 'కృష్ణార్జున' మూవీలో శ్రీకృష్ణుడి వేషంలో కనిపించి ప్రేక్షకులను మెప్పించాడు. నాగార్జున సైతం మోడ్రన్ కృష్ణుడిగా... సామాన్యుడిలా కనిపించి అలరించాడు. సునీల్ విలక్షణ నటుడు సునీల్ తొలిసారి తేజా డైరెక్షన్‌లో వచ్చిన నువ్వు- నేను సినిమాలో కాసేపు చిలిపి కృష్ణుడిగా కనిపించి నవ్వులు పూయించాడు. ‘గాజువాక పిల్ల మేము గాజులోల్లం కాదా’ సాంగ్‌లో సునీల్ కృష్ణుడిగా మెరిసాడు. అలాగే అందాలరాముడులో కొంటె శ్రీకృష్ణుడిగా కాసేపు కనువిందు చేశాడు.. https://youtu.be/VhyejE23l4M?feature=shared రాజేంద్ర ప్రసాద్ రాజేంద్ర ప్రసాద్ డ్యుయల్ రోల్‌లో మెప్పించిన ‘కన్నయ్య కిట్టయ్య’ సినిమాలో... నటకిరిటి శ్రీకృష్ణుడిగా, భక్తుడిగా రెండు పాత్రల్లో నటించి మెప్పించాడు. ఈ సినిమా అప్పట్లో సూపర్ డూపర్ హిట్ అయింది. బాలకృష్ణ పౌరాణిక వేషాల్లో సీనియర్ ఎన్టీఆర్ తర్వాత అంతటి ఆహార్యం సంపాదించిన నటులు బాలకృష్ణ. శ్రీకృష్ణార్జున విజయం, పాండురంగడు, ఎన్టీఆర్ చిత్రాల్లో ఆయన శ్రీకృష్ణుడిగా నటించి ప్రేక్షకులను అలరించారు. https://youtu.be/wcJhLH_T6N0?feature=shared శోభన్ బాబు: వెండితెరపై శ్రీకృష్ణుడి వేషం వేసి మెప్పించిన నటుల్లో శోభన్ బాబు ఒకరు.  బాపు డైరెక్షన్‌లో వచ్చిన 'బుద్దిమంతుడు' చిత్రంలో కాసేపూ ఆయన కృష్ణుడి వేషంలో దర్శనమిచ్చారు. 'కురుక్షేత్రం' సినిమాలో పూర్తి నిడివిలో కృష్ణ భగవానుడిగా అలరించారు. https://youtu.be/Nf2ts_Cld-s?feature=shared కాంతరావు ఎన్టీఆర్ తర్వాత కృష్ణుడి పాత్రలో మెప్పించిన నటుడిగా ఆయనకు మంచి పేరు ఉంది. ఆయన తొలిసారి మలయాళ చిత్రం భక్త కుచేల చిత్రంలో కృష్ణుడిగా కనిపించారు. ఆ తర్వాత పాండవ వనమాసం, నర్తనశాల, ప్రమీలార్జనీయం చిత్రాల్లో కృష్ణుడి వేషంలో ఆకట్టుకున్నారు. ఎన్టీఆర్ తెలుగు ప్రజల మదిలో కృష్ణుడు, రాముడు అంటే గుర్తుకొచ్చే పేరు ఎన్టీఆర్. వెండితెరపై ఎంతమంది కృష్ణుడి వేషంలో కనిపించినా ఆయనకు సాటి రాలేదనేది చాలా మందివాదన. ఆయన రూపం, సంభాషణ చాతుర్యం ఇలాంటివన్నీ ఎన్టీఆర్‌ను వెండితెర కృష్ణుడిగా నిలబెట్టాయి. ఆయన సినిమాలు, ఇతర నాటకాల్లో కలిపి మొత్తం 33 సార్లు శ్రీకృష్ణుడిగా కనిపించారు. మాయాబజార్, శ్రీకృష్ణార్జునయుద్ధం, శ్రీకృష్ణతులాభారం, దానవీరశూరకర్ణ వంటి చిత్రాల్లో ఆయన కృష్ణుడిగా అలరించారు. శ్రీకృష్ణుడి పాత్రలో ఎన్టీఆర్ 18 చిత్రాల్లో నటించి రికార్డు సృష్టించారు. https://www.youtube.com/watch?app=desktop&v=JlsXEmQIWNs
    సెప్టెంబర్ 06 , 2023
    ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్స్‌ ఉన్న టాప్‌-10 తెలుగు హీరోలు వీళ్లే..!
    ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్స్‌ ఉన్న టాప్‌-10 తెలుగు హీరోలు వీళ్లే..!
    మనిషి జీవితంలో సోషల్ మీడియా కూడా ఒక భాగంగా మారిపోయింది. రోజులో కనీసం ఒకసారైన ఫేస్‌బుక్‌, వాట్సప్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌ తెరవని స్మార్ట్‌ ఫోన్‌ యూజర్‌ లేరని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ప్రస్తుత రోజుల్లో సమాచారం చేరవేయడానికి సోషల్‌ మీడియా ప్రధాన వేదికగా మారింది. సోషల్‌ మీడియాకు ఆదరణ పెరగడంతో సినీ హీరోలు సైతం తమను తాము ప్రమోట్‌ చేసుకునేందుకు దీనిని వేదికగా చేసుకున్నారు. టాలీవుడ్‌లో చాలా మంది హీరోలు సోషల్‌ మీడియాలో మరీ ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో సంచలనాలు సృష్టిస్తున్నారు. కోట్ల మంది ఫాలోయర్స్‌తో రికార్డులు సృష్టిస్తున్నారు. ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్స్‌ను కలిగిన టాప్‌-10 తెలుగు హీరోలు ఎవరో ఇప్పుడు చూద్దాం. 1. అల్లుఅర్జున్‌: ఐకాన్‌ స్టార్‌ అల్లుఅర్జున్‌ క్రేజ్‌ ‘పుష్ప’ చిత్రంతో అమాంతం పెరిగిపోయింది. పాన్‌ ఇండియా స్థాయిలో పుష్ప విజయం సాధించడంతో బాలీవుడ్‌ ప్రేక్షకులు సైతం బన్నీకి అభిమానులుగా మారిపోయారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవుతూ బన్నీ ఇచ్చే అప్‌డేట్స్‌ తెలుసుకుంటున్నారు. ప్రస్తుతం తెలుగు హీరోల్లో అత్యధికమంది ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉన్న నటుడిగా బన్నీ ఉన్నాడు. బన్నీ ఇన్‌స్టా ఖాతాను 20.3 మిలియన్స్‌ మంది ఫాలో అవుతున్నారు. అయితే బన్నీ మాత్రం తన భార్య స్నేహరెడ్డి ఖాతాను మాత్రమే ఫాలో అవుతుండటం గమనార్హం. 2. విజయ్‌ దేవరకొండ:  2017లో విడుదలైన అర్జున్‌ రెడ్డి మూవీతో విజయ్‌ దేవరకొండ ఓవర్‌నైట్ స్టార్‌గా ఎదిగాడు. తన విభిన్నమైన బాడీ లాంగ్వేజ్‌తో యూత్‌ను ఆకర్షించిన విజయ్‌.. తనకంటూ సపరేట్‌ ఫ్యాన్‌ బేస్‌ను క్రియేట్ చేసుకున్నాడు. ఫలితంగా ఇన్‌స్టాలో రెండో అత్యధిక ఫాలోవర్స్‌ ఉన్న తెలుగు హీరోగా విజయ్ నిలిచాడు. ప్రస్తుతం విజయ్‌ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాను 17.9 మిలియన్స్‌ మంది ఫాలో అవుతున్నారు. కానీ విజయ్‌ ఏ ఒక్కరినీ కూడా ఫాలో అవ్వడం లేదు.  3. రామ్‌చరణ్‌ RRR చిత్రంతో రామ్‌చరణ్‌ రేంజ్‌ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఈ సినిమాలో చెర్రీ నటన చూసి చాలా మంది ఆయనకు అభిమానులుగా మారిపోయారు. ప్రస్తుతం రామ్‌చరణ్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను 13.6 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. దీంతో టాప్‌ ఇన్‌స్టాగ్రామ్‌ ఫాలోవర్స్‌ ఉన్న తెలుగు హీరోల జాబితాలో చరణ్‌ 3వ స్థానంలో నిలిచాడు. 4. మహేశ్‌ బాబు టాలీవుడ్‌లో మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉన్న హీరోల్లో మహేశ్‌ ఒకరు. మహేశ్‌ కొత్త సినిమా రిలీజ్‌ అంటే ఫ్యాన్స్‌కు పండగే అని చెప్పాలి. సామాజిక మాధ్యమాలకు మహేశ్‌ కాస్త దూరం పాటిస్తున్నప్పటికీ ఆయన ఫ్యాన్స్‌ మాత్రం మహేశ్‌ను విపరీతంగా ఫాలోఅవుతున్నారు. ప్రస్తుతం మహేశ్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో 10.1 మిలియన్స్‌ మంది ఫాలోవర్స్‌ ఉన్నారు.  5. ప్రభాస్‌: బాహుబలి ముందు వరకు టాలీవుడ్‌కే పరిమితమైన ప్రభాస్‌ క్రేజ్‌ ఆ సినిమా తర్వాత విశ్వవ్యాప్తమైంది. ప్రభాస్‌ ఆహార్యం, నటన చూసి కోట్లాది మంది సినీ ప్రేక్షకులు ప్రభాస్‌కు అభిమానులుగా మారిపోయారు. అంతేగాక ప్రభాస్‌ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాను తెగ ఫాలో అవుతున్నారు.  ప్రస్తుతం 9.3 మిలియన్‌ ఫాలోవర్స్‌ను సంపాదించిన ప్రభాస్ టాప్‌-3 తెలుగు హీరోగా నిలిచాడు.  6. జూ.ఎన్టీఆర్‌ RRR చిత్రం రామ్‌చరణ్‌తో పాటు తారక్‌కు సైతం మంచి గుర్తింపు తీసుకొచ్చింది. NTR తన మిస్మరైజింగ్‌ నటనతో మరింత మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ఇన్‌స్టాలో 5.9 మిలియన్ల మంది ఎన్టీఆర్‌ను ఫాలో అవుతున్నారు.  7. నాని నేచురల్‌ స్టార్‌ నాని తన సహజ సిద్దమైన నటనతో టాలీవుడ్‌లో మంచి హీరోగా ఎదిగాడు. ఆయన లేటెస్ట్‌ మూవీ దసరా మంచి హిట్‌ టాక్‌ తెచ్చుకోవడంతో నాని ఇమేజ్‌ మరింత పెరగనుంది. ప్రస్తుతం నాని ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాను 5.9 మిలియన్ల మంది అనుసరిస్తున్నారు.  8. రామ్‌ పోతినేని యంగ్‌ హీరో రామ్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పెద్ద సంఖ్యలోనే అభిమానులు ఫాలో అవుతున్నారు. మెుత్తం 3.6 మిలియన్ల మంది రామ్‌ను అనుసరిస్తున్నారు.  9. వరుణ్‌ తేజ్ మెగా హీరోల్లో అల్లుఅర్జున్ తర్వాత వరణ్‌తేజ్‌కే అత్యధిక ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్‌ ఉన్నారు. ప్రస్తుతం వరుణ్‌ ఖాతాను కూడా 3 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు.  10. అఖిల్‌ అక్కినేని నాగార్జున తనయుడు అఖిల్ అక్కినేని నుంచి మూడు సినిమాలు విడుదలైనప్పటికీ అందులో ఒక్కటి కూడా ఆశించిన మేర విజయం సాధించలేకపోయింది. అయితే విజయాలతో సంబంధం లేకుండా అఖిల్ మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ సంపాదించాడు. అఖిల్‌ను సైతం 3 మిలియన్ల మంది ఇన్‌స్టాలో ఫాలో అవుతున్నారు. 
    మార్చి 30 , 2023
    Nani HBD: అసిస్టెంట్‌ డైరెక్టర్‌ నుంచి నేచురల్‌ స్టార్‌ వరకూ.. నాని ఇన్‌స్పిరేషనల్‌ జర్నీ!
    Nani HBD: అసిస్టెంట్‌ డైరెక్టర్‌ నుంచి నేచురల్‌ స్టార్‌ వరకూ.. నాని ఇన్‌స్పిరేషనల్‌ జర్నీ!
    టాలీవుడ్‌లో ఎలాంటి ఫిల్మ్‌  బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా (Happy Birthday Nani) వచ్చిన యంగ్‌ హీరో అంటే ముందుగా నేచురల్ స్టార్ నాని (Nani)నే గుర్తుకు వస్తాడు. ఇండస్ట్రీలో తెలిసిన వారు లేకపోయిన తన యాక్టింగ్‌ టాలెంట్‌తో అవకాశాలను సంపాదించుకున్నాడు నాని. తన అద్భుతమైన నటనతో ఎన్నో సూపర్‌ హిట్‌ అందుకున్న నాని.. ప్రతీ సినిమాకు యాక్టర్‌గా ఓ మెట్టు ఎక్కుతూనే వచ్చాడు. ఎన్నో మరపురాని పాత్రలు చేసి తన టాలెంట్‌ ఏంటో నిరూపించుకున్నాడు. ‘అష్టా చమ్మా’ చిత్రం ద్వారా తొలిసారి ఇండస్ట్రీలో అడుగు పెట్టిన నాని.. ‘దసరా’ విజయంతో పాన్‌ ఇండియా స్టార్‌గా ఎదిగాడు. రీసెంట్‌గా ‘హాయ్‌ నాన్న’ సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్‌ హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. ఈ రెండు సినిమాలతో ఇక ఎంతమాత్రం తాను టైర్ 2 హీరో కానని నానీ నిరూపించుకున్నాడు. లేటెస్ట్‌గా ‘సరిపోదా శనివారం’ అనే సినిమాతో థియేటర్లలో రచ్చ చేసేందుకు ఈ నేచురల్‌ స్టార్ సిద్ధమవుతున్నాడు.  ఈ తరం యంగ్‌ హీరోలకు స్ఫూర్తిగా నిలిచిన నానికి (Happy Birthday Nani) ఈ సక్సెస్ ఒక్కరోజులో వచ్చింది కాదు. కథల ఎంపిక, సినీరంగంలో తాను ఎదుర్కొన్న సవాళ్లు ఆయన్ను ఈ స్థాయిలో నిలిపింది. ఇవాళ నాని పుట్టిన రోజు  సందర్భంగా ఆయన సినీ ప్రస్థానం? నాని తీసిన సూపర్‌ హిట్‌ సినిమాలు? ఇండస్ట్రీలో స్థిరపడేందుకు దోహదం చేసిన పాత్రలు? ఏంటో ఒకసారి పరిశీలిద్దాం.  అష్టా చమ్మా (2008) అష్టా చమ్మా (Ashta chamma) సినిమా ద్వారానే నానిడ సహజ సిద్దమైన నటన తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఈ సినిమా ద్వారానే నాని నటనా సామర్థ్యం ఇండస్ట్రీకి తెలిసింది. మహేష్‌ పాత్రలో నాని నటన ఎంతో నేచురల్‌గా అనిపించింది. పక్కింటి కుర్రాడిలా ఉన్నాడనే ట్యాగ్‌ను తెచ్చి పెట్టింది. మెుదటి సినిమాతోనే నాని ప్రేక్షకుల హృదయాల్లో బలమైన ముద్ర వేశాడనే చెప్పాలి. పరిశ్రమకు కూడా నాని ఆశాజనకంగా కనిపించడంతో వరుస అవకాశాలు లభించాయి.  రైడ్‌ (2009) రైడ్ (Ride) సినిమాలో నానిలోని నటుడు మరింత పరిణితి చెందాడు. నటనకు ఆస్కారమున్న అర్జున్‌ పాత్రలో నాని మెప్పించాడు. జీవితంలోని సవాళ్లతో పోరాడుతున్న యువకుడిగా చక్కగా తన హావభావాలను పలికించాడు. క్లిష్టమైన భావోద్వేగాలను కూడా చక్కగా ప్రదర్శించిన నాని వర్ధమాన నటుడిగా ఇండస్ట్రీలో తన ఖ్యాతిని సుస్థిరం చేసుకున్నాడు. అలా మెుదలైంది (2011) అలా మెుదలైంది (Ala Modalaindi) సినిమాతో నాని తొలిసారి సోలో హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. గౌతం పాత్రలో నాని చేసిన కామెడి నానిలోని కొత్త కోణాన్ని పరిచయం చేసింది. నాని తన ఎక్స్‌లెంట్‌ కామెడి టైమింగ్‌తో అదరగొట్టాడు. హీరోయిన్‌ నిత్యాతో నాని కెమిస్ట్రీ బాగా కుదురడంతో ఈ చిత్రం సూపర్‌హిట్‌గా నిలించింది. ఈ విజయంతో నాని కెరీర్‌కు తిరుగు లేకుండా పోయింది.   పిల్ల జమీందార్‌ (2011) పిల్ల జమీందార్‌(Pilla Zamindar) సినిమా నానిని కామెడి స్టార్‌గానూ నిలబెట్టింది. సినిమాలోని ప్రతిసీన్‌లో నాని మార్క్‌ కనిపిస్తుంది. హాస్య సన్నివేశాలు, భావోద్వేగ సీన్లలో నాని ఎంతో మెచ్యూర్‌గా నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద కూడా మంచి కలెక్షన్లనే రాబట్టింది.  ఈగ (2012) దర్శకధీరుడు రాజమౌళితో చేసిన ఈగ (Eega) సినిమా నాని కెరీర్‌ను మలుపు తిప్పిందనే చెప్పాలి. ఇందులో నాని యూనిక్‌ రోల్‌లో కనిపించారు. పునర్జన్మ పొందిన ఈగగా కనిపించి అలరించాడు. సినిమాలో నాని నేరుగా కనిపిచేంది కొద్దిసేపే అయినప్పటికీ చిత్ర విజయానికి అతడి యాక్టింగ్‌ ఎంతో దోహదం చేసింది. భలే భలే మగాడివోయ్ (2015) భలే భలే మగాడివోయ్‌ (Bhale Bhale Magadivoy) సినిమాలో నాని మతిమరుపు ఉన్న పాత్రలో నటించాడు. తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు. ఎమోషనల్‌ సీన్స్‌లోనూ హావభావాలను చక్కగా పండించాడు. లక్కీ పాత్రలో నాని నటనకు విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు వచ్చాయి. ఈ సినిమాతో నాని ఫ్యాన్‌ ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోయింది.  నేను లోకల్‌ (2017) నేను లోకల్‌ చిత్రం(Nenu Local)తో నాని అగ్రహీరోల సరసన చేరిపోయాడు. ఇందులో నాని నటన సినిమాకే హైలెట్‌గా నిలిచింది. ఈ మూవీ సక్సెస్‌తో నాని నిర్మాతల హీరోగా మారిపోయాడు. నానితో సినిమా అంటే వసూళ్లకు ఎలాంటి లోటు ఉండదని ఇండస్ట్రీ అంతా భావించింది.  MCA (మిడిల్‌ క్లాస్‌ అబ్బాయి) (2017) MCA చిత్రంలో నాని (HBD Nani) మధ్య తరగతికి చెందిన అబ్బాయిగా కనిపించి మెప్పించాడు. నాని నటనకు మంచి మార్కులే పడ్డాయి. నాని క్రేజ్‌ కారణంగా రూ. 25 కోట్ల బడ్జెట్ తీసిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఏకంగా రూ.70 కోట్లను వసూలు చేసింది.  నిన్ను కోరి (2017) నిన్నుకోరి చిత్రంలో నాని నటన మరో స్థాయికి వెళ్లింది. ప్రేమికుడిగా, భగ్న ప్రేమికుడిగా, తన ప్రేమను పొందాలని తాపత్రయ పడే యువకుడిగా నాని మెప్పించాడు. క్లైమాక్స్‌లో నాని నటన కంటతడి తెప్పిస్తుంది.  జెర్సీ (2019) జెర్సీ(Jersey) సినిమా నానిలోని పరిపూర్ణ నటుడ్ని (HBD Nani) పరిచయం చేసింది. ఫెయిల్యూర్‌ క్రికెటర్‌గా నాని ఎంతో బాగా నటించాడు. ఈ పాత్రను తనను తప్ప మరొకరిని ఊహించుకోలేని విధంగా నటించి మెప్పించాడు. ఉద్వేగభరితమైన సన్నివేశాల్లో నాని నటన అమోఘమనే చెప్పాలి.  గ్యాంగ్ లీడర్‌ (2019) గ్యాంగ్‌ లీడర్‌లో ఐదుగురు ఆడవాళ్లకు సాయపడే వ్యక్తిగా నాని కనిపిస్తాడు. అదే ఏడాది విడుదలైన జెర్సీలో పాత్రకు ఈ క్యారెక్టర్‌ పూర్తి భిన్నం.పెన్సిల్‌ పార్థసారథి పాత్రలో నాని నవ్వులు పూయిస్తాడు. సెకండాఫ్‌లో విలన్‌ ఎత్తులకు పైఎత్తులు వేసే యువకుడిగా అలరిస్తాడు.  వి (2020) వి(V) సినిమాలో నాని  నెగెటివ్‌ రోల్‌ కనిపించాడు. ఎన్నో సవాళ్లు ఉన్న ఈ పాత్రకు నాని వంద శాతం న్యాయం చేశాడు. తనకు ఎలాంటి వైవిధ్యమైన పాత్ర ఇచ్చిన అలవోకగా చేయగలనని నాని ఈ సినిమా ద్వారా నిరూపించుకున్నాడు.  టక్‌ జగదీష్‌ (2021) టక్‌ జగదీష్‌ పాత్రకు నాని 100 శాతం న్యాయం చేశాడు. ఎమోషనల్‌ సన్నివేశాల్లో తనకు తిరుగులేదని మరోసారి నాని నిరూపించాడు. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ సినిమాను నాని తన భుజాలపై మోసాడు.  శ్యామ్‌ సింగరాయ్‌ (2021)  పునర్జన్మ కథాంశంతో రూపొందిన ఈ చిత్రంలో నాని ద్విపాత్రాభినయం చేశారు. వాసు, శ్యామ్‌ సింగరాయ్ పాత్రలో రాణి అద్భుతంగా నటించాడు. ఇందులో నాని ఆహార్యం, మాట తీరు అన్ని కొత్తగా అనిపిస్తాయి.  అంటే.. సుందరానికీ (2022) గతేడాది విడుదలైన అంటే సుందరానికీ చిత్రంలో నాని బ్రహ్మణ కుటుంబానికి చెందిన యువకుడిగా కనిపిస్తాడు. సుందర్ ప్రసాద్ పాత్రలో నాని పూర్తిగా ఒదికిపోయాడు. పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసిన నాని కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకుల హృదయాలను మరోమారు గెలుచుకున్నారు. దసరా (2023) దసరా మూవీలో నాని ఊరమాస్‌గా కనిపించారు. ధరణి పాత్రలో తనదైన ముద్ర వేస్తూ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందిన ఈ చిత్రంతో నాని బాలీవుడ్‌ ప్రేక్షకుల మనసులను సైతం గెలుచుకున్నారు. నాని కెరీర్‌లోనేే వసూళ్లు, నటన పరంగా ఈ సినిమా ది బెస్ట్‌గా నిలుస్తుందని అంచనాలు ఉన్నాయి.  హాయ్‌ నాన్న (2023) నాని-మృణాల్ ఠాకూర్‌ కాంబినేషన్‌లో యువ డైరెక్టర్‌ శౌర్యువ్‌ రూపొందించిన చిత్రం ‘హాయ్‌ నాన్న’. గుండెలకు హత్తుకునే భావోద్వేగాలతో వచ్చిన ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. మరోమారు నానీ తన అద్భుతమైన నటనతో ఇందులో ఆకట్టుకున్నాడు.       మెుత్తంగా అష్టా చమ్మా నుంచి ‘హాయ్‌ నాన్న’ వరకూ నాని సినీ ప్రస్థానం అద్భుతమనే చెప్పాలి. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ నాని ఎదిగిన తీరు ప్రస్తుత, భవిష్యత్‌ తరాల హీరోలకు ఆదర్శంగా నిలుస్తుంది. ఇండస్ట్రీలో అతని వరుస విజయాలు… నాని అంకిత భావానికి, కృషి, ప్రతిభకు నిదర్శనంగా నిలుస్తాయి. నేచురల్ స్టార్ నాని తన కేరీర్‌లో మరిన్ని అత్యున్నత శిఖరాలు అధిరోహించాలని YOUSAY మనస్ఫూర్తిగా కోరుకుంటోంది.
    ఫిబ్రవరి 24 , 2024

    @2021 KTree