ఇంగ్లీష్‌లో చదవండి
మూవీ & ఓటీటీ అప్‌డేట్స్
స్ట్రీమింగ్ ఆన్Primeఫ్రమ్
Watch
స్ట్రీమింగ్ ఆన్Aha
Watch
రివ్యూస్
How was the movie?
తారాగణం
ఎన్టీ రామారావు జూనియర్.
నరసింహా మరియు నరసింహా చారి చారినయనతార
చంద్రకళ చందుషీలా కౌర్
నందుబ్రహ్మానందం
భట్టాచార్య భట్టుమహేష్ మంజ్రేకర్
డాన్ బాబాఆశిష్ విద్యార్థి
ధనరాజ్నాసర్
నరసింహ మరియు చారి తండ్రివినయ ప్రకాష్
నరసింహ మరియు చారి తల్లితనికెళ్ల భరణి
చారి పెంపుడు తండ్రిరాజ్యలక్ష్మి
చారి పెంపుడు తల్లిరమాప్రభ
చంద్రకళ తల్లిముకుల్ దేవ్
ఒక పెద్ద ముఠా నాయకుడుఎంఎస్ నారాయణ
భాషా భాయ్రఘు బాబు
బాబా కుడి చేయిసుప్రీత్
as Panduసుధ
నాయక్ భార్యవత్సల రాజగోపాల్
చారి దత్తత అమ్మమ్మరోరింగ్ స్టార్ రోషన్ బాబు
అనంత్ బాబు
పేరి శాస్త్రిఫిష్ వెంకటయ్య
వెంకట్రాజా రవీందర్
పాండు సోదరుడురఘు కారుమంచి
పాండు గ్యాంగ్ సభ్యుడుపృధ్వీ రాజ్
పోలీస్ ఇన్స్పెక్టర్సిబ్బంది
వివి వినాయక్
దర్శకుడువల్లభనేని వంశీ మోహన్
నిర్మాతకొడాలి శ్రీ వెంకటేశ్వరరావు
నిర్మాతదేవి శ్రీ ప్రసాద్
సంగీతకారుడుకోన వెంకట్
కథఛోటా కె. నాయుడు
సినిమాటోగ్రాఫర్ఎడిటోరియల్ లిస్ట్
కథనాలు
Dhootha Review: జర్నలిస్టుగా నాగ చైతన్య అదుర్స్.. ‘ధూత’ సిరీస్ ఎలా ఉందంటే?
నటీనటులు: అక్కినేని నాగ చైతన్య, ప్రియా భవానీ శంకర్, ప్రాచీ దేశాయ్, పార్వతి తిరువొతు, రవీంద్ర విజయ్, జయప్రకాశ్ తదితరులు
రచన, దర్శకత్వం: విక్రమ్ కె కుమార్
ఛాయాగ్రహణం: మికొలాజ్ సైగుల
సంగీతం: ఇషాన్ చబ్రా
నిర్మాత: శరత్ మరార్
ఓటీటీ వేదిక: అమెజాన్ ప్రైమ్ వీడియో
ఎపిసోడ్స్: 8
విడుదల తేదీ: డిసెంబర్ 1, 2023
సరికొత్త కథలతో సినిమాలను తెరకెక్కించడంలో డైరెక్టర్ విక్రమ్ కె కుమార్ శైలే వేరు. '13బి', 'ఇష్క్', 'మనం', '24' వంటి మెమరబుల్ ఫిల్మ్స్‌కు ఆయన దర్శకత్వం వహించారు. అటువంటి విక్రమ్ తొలిసారి దర్శకత్వం వహించిన వెబ్ సిరీస్ 'దూత'. ఇందులో అక్కినేని నాగ చైతన్య హీరోగా నటించడం విశేషం. '13బి' తర్వాత సూపర్ నేచురల్ జానర్ మరోసారి టచ్ చేశారు విక్రమ్ కె కుమార్. అతీంద్రియ శక్తుల నేపథ్యంలో ఆయన తీసిన 'దూత' ఎలా ఉంది? ఓటీటీ ప్రేక్షకులను మెప్పించిందా? ఈ రివ్యూలో చూద్దాం.
కథ
సాగర్ వర్మ (నాగ చైతన్య) జర్నలిస్ట్. కొత్తగా ప్రారంభమైన సమాచార్ దిన పత్రికకు చీఫ్ ఎడిటర్‌గా వ్యవహరిస్తుంటాడు. ఓ రోజు ధాబాలోకి వెళ్లిన సాగర్‌కు ఓ పేపర్ కటింగ్ కనిపిస్తుంది. అందులో రాసినట్టు కారుకు యాక్సిడెంట్ జరిగి పెంపుడు కుక్క మరణిస్తుంది. ఆ తర్వాత మరికొన్ని పేపర్ కటింగ్స్ సాగర్ వర్మ కంట పడతాయి. వాటిలో రాసినట్టుగా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. అందుకు కారణం ఏంటి? జరగబోయే ప్రమాదాన్ని ముందే పేపర్లలో రాస్తోంది ఎవరు? అతని ప్రయాణంలో భార్య ప్రియా (ప్రియా భవానీ శంకర్), పీఏ కమ్ జర్నలిస్ట్ అమృత (ప్రాచీ దేశాయ్), డీసీపీ క్రాంతి (పార్వతి తిరువొతు) పాత్రలు ఏమిటి? అనేది సిరీస్ చూసి తెలుసుకోవాల్సిందే.
ఎవరెలా చేశారంటే
గ్రే షేడ్స్ ఉన్న పాత్రలో నాగ చైతన్య అదరగొట్టాడు. తన లుక్స్, ఎక్స్‌ప్రెషన్స్‌తో సిరీస్ ఆసాంతం నాగచైతన్య ఇంప్రెస్ చేస్తాడు. అతడి తర్వాత ఆ స్థాయిలో ఆకట్టుకునేది పార్వతి తిరువొతు నటన. ఎస్పీ క్రాంతిగా ఆమె ఒదిగిపోయారు. సహజంగా నటించారు. కథలో ప్రాచీ దేశాయ్, ప్రియా భవానీ శంకర్ పాత్రలు పరిమితమే. కానీ, ఉన్నంతలో తమ ఉనికి చూపించారు. జయప్రకాశ్ తనకు అలవాటైన నటనతో అలరిస్తారు. రవీంద్ర విజయ్, చైతన్య, రోహిణి, ఈశ్వరీ రావు, అనీష్ కురువిల్లా, జీవన్ కుమార్, కామాక్షీ భాస్కర్ల తదితరులు తమ పాత్ర పరిధి మేరకు నటించారు. ఫ్లాష్ బ్యాక్‌లో వచ్చే సీన్లలో పశుపతి, తరుణ్ భాస్కర్, తనికెళ్ళ భరణి, రాజా గౌతమ్, సత్య కృష్ణన్ మెప్పించారు. ఓ సన్నివేశంలో బ్రహ్మానందం తనయుడు రాజా గౌతమ్ నటన ఆశ్చర్యపరుస్తుంది.
డైరెక్షన్ ఎలా ఉందంటే?
విక్రమ్ కె కుమార్ దర్శకత్వ నైపుణ్యాలు ఈ సిరీస్‌లోనూ కనిపిస్తాయి. దూత కథ ఏమిటనేది ఐదారు ఎపిసోడ్స్ తర్వాత గానీ క్లారిటీ రాదు. అయినప్పటికీ వీక్షకులకు ఎక్కడా బోర్ కొట్టకుండా సిరీస్‌ను నడిపించారు డైరెక్టర్. చిన్న చిన్న చమక్కులు, మెరుపులతో ఆసక్తి సన్నగిల్లకుండా చూశారు. ఇక మీడియాపైనా కొన్ని చమక్కులు పేల్చారు డైరెక్టర్. రాజకీయ నాయకుల చేతిలో జర్నలిస్టులు పావులుగా మారుతున్న తీరును ఆయన చక్కగా చూపించారు. జర్నలిజంతో పాటు రాజీకయం, పోలీసు వ్యవస్థల్లోనే మంచి, చెడులను కళ్లకు కట్టారు. అయితే ఒక్కో ఎపిసోడ్ 40-50 నిమిషాల మధ్య ఉండటం వల్ల డైరెక్టర్ కథను సాగదీసిన ఫీలింగ్ కల్గుతుంది. ఓవరాల్‌గా విక్రమ్ కె కుమార్ డైరెక్షన్‌కు మంచి మార్కులే పడ్డాయి.
సాంకేతికంగా
సాంకేతిక అంశాల పరంగా 'దూత' సిరీస్ ఉన్నత స్థాయిలో ఉంది. మికొలాజ్ సైగుల సినిమాటోగ్రఫీ పనితనం మెప్పిస్తుంది. సన్నివేశాలను చిత్రీకరించిన తీరు బాగుంది. ముఖ్యంగా వర్షంలో సన్నివేశాలను ఆయన బాగా తీశారు. అటు నేపథ్య సంగీతం కూడా మెప్పిస్తుంది. చెవులకు ఇబ్బంది కలిగించే శబ్దాలు లేవు. కథతో పాటు ఆర్ఆర్ ట్రావెల్ చేసింది. నిర్మాణ విలువలు సైతం బావున్నాయి.
ప్లస్ పాయింట్స్
నాగ చైతన్య నటనసస్పెన్స్ & క్యూరియాసిటీనేపథ్య సంగీతం
మైనస్ పాయింట్స్
ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌సాగదీత సీన్లు
రేటింగ్: 3.5/5
డిసెంబర్ 01 , 2023
Japan Movie Review: దొంగగా ‘కార్తీ’ నటన అదుర్స్.. మరి ‘జపాన్’ హిట్టా? ఫట్టా?
నటీనటులు: కార్తీ, అనూ ఇమ్మాన్యుయేల్, సునీల్, కెఎస్ రవికుమార్, విజయ్ మిల్టన్ తదితరులు
దర్శకత్వం: రాజు మురుగన్
ఛాయాగ్రహణం: ఎస్. రవి వర్మన్
సంగీతం: జీవీ ప్రకాష్ కుమార్
నిర్మాతలు: S.R ప్రభు, S.R ప్రకాష్ బాబు
విడుదల తేదీ: నవంబర్ 10, 2023
టాలీవుడ్‌లో మంచి క్రేజ్ ఉన్న తమిళ నటుల్లో హీరో కార్తీ (Karthi) ఒకరు. స్టార్ హీరో సూర్య సోదరుడిగా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన కార్తీ.. తన నటనతో మంచి గుర్తింపు సంపాదించాడు. ఈ నేపథ్యంలోనే కార్తీ నుంచి ఏ సినిమా వచ్చిన తెలుగులో భారీ అంచనాలు ఉంటాయి. ఈ క్రమంలోనే కార్తీ కొత్త సినిమా ‘జపాన్’ (Japan) ఇవాళ (నవంబర్ 10) తెలుగు, తమిళ భాషల్లో విడుదలైంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్, ప్రమోషనల్ చిత్రాలు సినిమాపై భారీగా అంచనాలు పెంచేశాయి. మరి దీపావళి కానుకగా వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా? కార్తీ చేసిన కొత్త ప్రయత్నం ఫలించిందా? ఇంతకీ సినిమా హిట్టా? ఫట్టా?. ఈ రివ్యూలో తెలుసుకుందాం.
కథ
హైదరాబాద్‌లోని రాయల్ జ్యువెలరీలో రూ.200 కోట్ల విలువలైన నగలు, ఆభరణాలు దోపిడికి గురవుతాయి. గోల్డెన్ స్టార్ జపాన్ (కార్తీ) ఈ దొంగతనం చేశాడని అందరూ అనుమానిస్తారు. శ్రీధర్ (సునీల్), భవాని (విజయ్ మిల్టన్) ఇద్దరి నేతృత్వంలోని రెండు బృందాలు జపాన్ కోసం వేట మొదలు పెడతాయి. మరోవైపు కేరళ, కర్ణాటక పోలీసులు కూడా జపాన్ కోసం గాలిస్తుంటారు. దోచుకున్న డబ్బులతో సినిమాలు తీసిన జపాన్.. స్టార్ హీరోయిన్ సంజు (అనూ ఇమ్మాన్యుయేల్)ను ప్రేమిస్తాడు. ఈ క్రమంలో ఆమెను కలుసుకునేందుకు వెళ్లిన జపాన్‌ను పోలీసులు పట్టుకుంటారు. అయితే తాను దొంగతనం చేయలేదని చెప్పడంతో పోలీసులు అయోమయంలో పడతారు. జపాన్ కాకపోతే ఆ దొంగతనం చేసింది ఎవరు? ఈ కేసును పోలీసులు ఎలా పరిష్కరించారు? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎవరెలా చేశారంటే
క్యారెక్టర్ కోసం కార్తీ పడిన కష్టం స్పష్టంగా కనిపించింది. ముఖ్యంగా జపాన్ యాస పలకడం కోసం ఆయన శ్రమించారు. హెయిర్ స్టైల్, డ్రసింగ్ స్టైల్ ఛేంజ్ చేశారు. కార్తీ యాక్టింగ్ & ఎఫర్ట్స్ వరకు ఎటువంటి లోపం లేదు. తన పాత్ర వరకు ఆయన న్యాయం చేశారు. హీరోయిన్‌గా అను ఇమ్మాన్యుయేల్ యాక్టింగ్‌కు పెద్దగా స్కోప్ లేదు. గ్లామర్ సన్నివేశాలకు మాత్రమే ఆమె పరిమితమైంది. ఇక సునీల్ తన నటనతో సూపర్ అనిపించాడు. తన లుక్, గెటప్‌తోనే సగం మార్కులు కొట్టేశాడు. ఆయన కోసమే అన్నట్లు మధ్యలో కామెడీ సీన్లు కూడా ఉన్నాయి. భవాని పాత్రలో విజయ్ మిల్టన్ యాక్టింగ్ ఓకే. కెఎస్ రవికుమార్ తదితరులు పాత్రల పరిధి మేరకు చేశారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే?
దర్శకుడు రాజు మురుగన్ ఓ దొంగ చుట్టూ అల్లుకొన్న సింగిల్ పాయింట్ స్టోరీని ఎమోషనల్‌గా మార్చడంలో విఫలమయ్యారు. జపాన్ క్యారెక్టర్‌పై పెట్టిన శ్రద్ద కథపై, స్క్రీన్ ప్లే, ఇతర క్యారెక్టర్లపై పెట్టలేదనే విషయం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. పేలవమైన సన్నివేశాలను, క్లారిటీ లేని క్యారెక్టర్లను సాగదీస్తూ ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టినట్లు అనిపిస్తుంది. అయితే కార్తీ కోసం రాసుకొన్న డైలాగ్స్, కొన్ని సీన్లు కడుపుబ్బా నవ్విస్తాయి.
సాంకేతికంగా
టెక్నికల్ అంశాల పరంగా చూసినా 'జపాన్' ఆకట్టుకోవడం కష్టం. సినిమాటోగ్రఫీలో డార్క్ థీమ్, లో లైట్ ప్యాట్రన్స్ ఫాలో అయ్యారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతంలో మళ్ళీ వినాలనిపించే పాటలు లేవు. నేపథ్య సంగీతం అంతంతమాత్రంగానే ఉంది. స్క్రీన్ ప్లేలో ట్విస్ట్ అనుకున్నవి ఏవీ వర్కవుట్ కాలేదు. తర్వాత ఏం జరుగుతుందో ఊహించడం పెద్ద కష్టం కాదు. నిర్మాణ విలువలు పర్వాలేదు.
ప్లస్ పాయింట్స్
కార్తీ నటనకామెడీ సీన్స్
మైనస్ పాయింట్స్
సాగదీత సీన్లుసంగీతంసినిమాటోగ్రఫీ
రేటింగ్: 2.5/5
నవంబర్ 10 , 2023
My Name Is Shruthi Movie Review: హన్సిక నటన అదుర్స్.. సినిమా హిట్ కొట్టినట్లేనా?
నటీనటులు: హన్సిక, మురళీశర్మ, నరేన్, జయప్రకాష్, వినోదిని, సాయితేజ, పూజా రామచంద్రన్, ప్రేమ, ప్రవీణ్, రాజీవ్ కనకాల తదితరులు
దర్శకత్వం: శ్రీనివాస్ ఓంకార్,
సినిమాటోగ్రఫీ: కిశోర్ బోయిడపు
సంగీతం: మార్క్ కె రాబిన్
నిర్మాత: బురుగు రమ్య ప్రభాకర్,
సంస్థ: వైష్ణవి ఆర్ట్స్
విడుదల: 17 నవంబర్ 2023
టాలీవుడ్‌లో అగ్రకథానాయిక స్థాయికి ఎదిగిన నటీమణుల్లో హన్సిక (Hansika) ఒకరు. బన్నీ, రామ్, నితీన్ వంటి స్టార్ హీరోల సరసన నటించి ఆమె గుర్తింపు సంపాదించింది. అయితే గత కొంత కాలంగా ఆమెకు టాలీవుడ్ నుంచి పెద్దగా అవకాశాలు లేవు. ఈ క్రమంలోనే ఆమె నటించిన లేటెస్ట్ మూవీ `మై నేమ్ ఈజ్ శృతి`. హన్సిక చాలా రోజుల తర్వాత చేసిన తెలుగు చిత్రం ఇది. ఈ సినిమా విజయంపై ఈ భామ ఎన్నో ఆశలు పెట్టుకుంది. మరి ఈ సినిమా ఎలా ఉంది? హన్సికకు విజయాన్ని తెచ్చిపెట్టిందా? ఈ కథనంలో తెలుసుకుందాం.
కథ
శృతి (హన్సిక) ఓ యాడ్ ఏజెన్సీలో పని చేస్తుంటుంది. చిన్నప్పుడే తండ్రి చనిపోవడంతో తాత, అమ్మ పెంపకంలో పెరుగుతుంది. చరణ్ (సాయి తేజ)తో శృతి ప్రేమాయణం సవ్యంగా సాగిపోతున్న దశలో అనుకోకుండా ఆమె ఎమ్మెల్యే గురుమూర్తి (నరేన్) ముఠా వలలో చిక్కుకుంటుంది. స్కిన్ మాఫియా ముఠాలో గురుమూర్తి చేస్తున్న దారుణాలన్నీ శృతికి తెలుస్తాయి. ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలేంటి? ఈ స్కిన్ మాఫియా ముఠా వెనక ఎవరున్నారు? ఈ ముఠా ఆగడాలకు శృతి ఎలా చెక్ పెట్టింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎవరెలా చేశారంటే
శృతిగా హన్సిక మోత్వాని మంచి నటన కనబరిచింది. ప్రథమార్ధంలో కుటుంబం, ప్రేమ నేపథ్యంలో సాగే సన్నివేశాల్లోనూ, ద్వితీయార్ధంలో మలుపులతో కూడిన సీన్లలో మంచి అభినయం ప్రదర్శించిది. పూజా రామచంద్రన్ నటన ఆకట్టుకుంటుంది. ఒకప్పుడు హీరోయిన్‌గా చేసిన ప్రేమ ఇందులో వ్యతిరేక ఛాయలున్న పాత్రలో కనిపించి మెప్పించింది. ప్రతి నాయకుడి పాత్రలో నరేన్ పర్వాలేదనిపించాడు. మురళీశర్మ, జయప్రకాశ్, ప్రవీణ్ అలవాటైన పాత్రల్లో తమదైన నటన కనబరిచారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే?
చర్మంతో కూడా వ్యాపారం చేస్తారనే కొత్త అంశాన్ని డైరెక్టర్ శ్రీనివాస్ ఓం కార్ ఈ సినిమాలో చూపించారు. మంచి కథనే ఎంచుకున్నప్పటికీ దానిని ఆసక్తికరంగా ఆవిష్కరించలేకపోయారు. స్కిన్ గ్రాఫ్టింగ్ ప్రస్తావనతో సినిమా మొదలుపెట్టినా పాత్రల పరిచయానికి, కథా నేపథ్యాన్ని ఆవిష్కరించడానికే ఎక్కువ సమయం తీసుకున్నారు. ఏడాది తర్వాత, ఆరు నెలల ముందు అంటూ ముక్కలు ముక్కలుగా కథని చెప్పడం ప్రేక్షకులను గందరగోళానికి గురిచేస్తుంది. కీలక సన్నివేశాల్లో భావోద్వేగాల్ని పండించడంలో దర్శకుడు విఫలయ్యాడు. అయితే ద్వితియార్థంలో వచ్చే మలుపులు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.
సాంకేతికంగా
సాంకేతిక విభాగాలు మంచి పనితీరునే కనబరిచాయి. మార్క్ కె.రాబిన్ అందించిన సంగీతం ఆకట్టుకుంది. కిశోర్ కెమెరా పనితనం మెప్పిస్తుంది. సినిమాటోగ్రఫీ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
హన్సిక నటనట్విస్ట్‌లుసంగీతం
మైనస్ పాయింట్స్
ప్రథమార్థంపండని భావోద్వేగాలు
రేటింగ్ : 2.5/5
నవంబర్ 17 , 2023
Bhola Shankar Review: ‘భోళా శంకర్’లో చిరు యాక్టింగ్ అదుర్స్.. రీమేక్‌తో మరో హిట్ కొట్టినట్లేనా?
నటీనటులు: చిరంజీవి, సుశాంత్, తమన్నా, కీర్తి సురేశ్, బ్రహ్మానందం, తదితరులు
డైరెక్టర్: మెహెర్ రమేశ్
మ్యూజిక్: మహతి స్వర సాగర్
నిర్మాత: అనిల్ సుంకర
తమిళంలో విజయం సాధించిన ‘వేదాళం’ సినిమాకు రీమేక్‌గా వచ్చింది ‘భోళా శంకర్’. తెలుగు నేటివిటీకి తగ్గట్టు అన్ని హంగులతో మూవీని తీర్చిదిద్దినట్లు చిత్రబృందం చెప్పుకొచ్చింది. ప్రచార చిత్రాలు కూడా ఆకట్టుకోవడంతో సినిమాపై మంచి హైప్ క్రియేట్ అయింది. మెగాస్టార్ చిరంజీవి మరింత యంగ్ లుక్‌లో కనిపించడంతో ఫ్యాన్స్ తెగ ఆసక్తి చూపిస్తున్నారు. మరి, శుక్రవారం(Aug 11) విడుదలైన ఈ చిత్రం ఎలా ఉంది? ఒరిజినల్ మూవీతో పోలిస్తే ఈ సినిమాలో చేసిన మార్పులేంటి? ప్రేక్షకుడు ఎలా ఫీల్ అయ్యాడు? అనే విషయాలను ఈ రివ్యూలో చూద్దాం.
కథ
చెల్లి మహా(కీర్తి సురేశ్)తో కలిసి శంకర్ దాదా(చిరంజీవి) కోల్‌కతాలో నివసిస్తుంటాడు. ట్యాక్సీ డ్రైవర్‌గా పనిచేసే శంకర్ హ్యూమన్ ట్రాఫికింగ్ విషయంలో పోలీసులకు ఇన్‌ఫార్మర్‌గా వ్యవహరిస్తుంటాడు. ఈ క్రమంలో నలుగురు కిడ్నాపర్లను హతమార్చడంలో సహాయపడతాడు. దీంతో విలన్ గ్యాంగ్ శంకర్‌ని కనిపెట్టే ప్రయత్నంలో పడుతుంది. ఈ క్రమంలో మహా పెళ్లి నిశ్చయమౌతుంది. తన గురించి వెతుకుతున్నారని తెలుసుకుని శంకర్ ప్రధాన విలన్లలో ఒకడిని హతమార్చి తన అసలు రూపాన్ని బయట పెడతాడు. అసలు శంకర్ కోల్‌కతాకు ఎందుకొచ్చాడు? తన ప్రధాన లక్ష్యం ఏంటి? నిజంగా మహా తన చెల్లెలేనా? అనేది తెరపై చూడాల్సిందే.
https://twitter.com/RC_devotee_5/status/1689864697477255168?s=20
ఎలా ఉంది?
మాతృక కథలో కొన్ని మార్పులు చేసినట్లు చెప్పినా, దాదాపుగా అదే స్టోరీతో సినిమాను దింపేశారు. అయితే చిరంజీవి నటన ప్రేక్షకుడికి నచ్చుతుంది. కామెడీ టైమింగ్‌తో పాటు పవన్ కళ్యాణ్ మ్యానరిజం సీన్స్ కాస్త ఉత్సాహం నింపుతాయి. అయితే, ఖుషి నడుము సీన్ వంటివి ప్రేక్షకుడికి కాస్త వెగటుగా అనిపిస్తాయి. ఇంటర్వెల్ ఫైట్ సీన్ ఫర్వాలేదనిపిస్తుంది. సెకండాఫ్‌లో భోళా ఇంట్రడక్షన్ బాగుంది. రెండు పాటలు ఆకట్టుకుంటాయి. చివర్లో క్లైమాక్స్ ఓకే అనిపిస్తుంది. రెగ్యులర్ కమర్షియల్ సినిమా ఎలిమెంట్స్‌ని మేళవించినా.. అవి పెద్దగా పండలేదు.
ఎవరెలా చేశారు?
ఎప్పటిలాగే చిరంజీవి తన బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. కామెడీతో పాటు ఎమోషన్ సీన్స్‌లలో చక్కగా చేశాడు. ఇక, పవన్ కళ్యాణ్ మ్యానరిజం, డైలాగ్స్‌ని అచ్చు గుద్దినట్లు చేసే ప్రయత్నం చేశాడు. తన యాక్టింగ్‌తో సినిమాను నడిపించాడు. ఇక కీర్తి సురేష్, తమన్నాలు తమ పాత్రకు పరిమితమయ్యారు. సుషాంత్ ఫర్వాలేదనిపించాడు. వెన్నెల కిశోర్ కాస్త నవ్వించాడు. మిగతా పాత్రలకు పెద్దగా ప్రాధాన్యం దక్కలేదు.
https://twitter.com/KickTwood/status/1689845486956453888?s=20
టెక్నికల్‌గా
చిరంజీవి ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకుని కొన్ని ఎలివేషన్స్‌ని ఇవ్వడంలో డైరెక్టర్ మెహెర్ రమేశ్ కాస్త సక్సెస్ అయ్యారు. కానీ, ఒరిజినల్ ప్లాట్‌లో పెద్దగా మార్పులు చేయలేకపోయాడు. కథనాన్ని ఆసక్తికరంగా మలచలేదు. వేదాళం సినిమా చూసిన వారికి ఏ కోశాన కూడా ఈ సినిమాలో కొత్తదనం కనిపించకుండా చేశాడు. ఒకట్రెండు చోట్ల మినహా తన పనితనం కనిపించలేదు. మ్యూజిక్ డైరెక్టర్ మహతి స్వర సాగర్ ఇచ్చిన పాటల్లో రెండు ఆకట్టుకుంటాయి. బీజీఎం ఒకే అనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ ఫర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి.
పాజిటివ్ పాయింట్స్
చిరంజీవి నటన
సెకండాఫ్
నెగెటివ్ పాయింట్స్
ఊహించే కథనం
స్టోరీలో మార్పులు లేకపోవడం
ఖుషి నడుము సీన్
రేటింగ్: 2.25/5
ఆగస్టు 16 , 2023
Guntur Kaaram Record: భారత సినీ చరిత్రలో ఆల్‌టైమ్ రికార్డు.. ట్రోలర్లకు మహేష్ దెబ్బ అదుర్స్!
సూపర్‌స్టార్ మహేష్‌బాబు (Mahesh Babu) 'గుంటూరు కారం' (Guntur Kaaram) సినిమాతో ఆల్‌టైమ్ రికార్డు కొల్లగొట్టాడు. జనవరి 12న రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల (Guntur Kaaram Collections) జోరు ప్రదర్శిస్తోంది. ఓపెనింగ్ రోజు రూ.94 కోట్లు, సెకండ్ డే రూ.33 కోట్లు, మూడో రోజు రూ.37 కోట్ల గ్రాస్ సాధించిన ఈ చిత్రం తొలి వారంలోనే ఏకంగా రూ.212 మొత్తం కోట్ల వసూళ్లను రాబట్టినట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.
భారత సినీ చరిత్రలో ప్రాంతీయ భాషలో రిలీజైన ఓ చిత్రం తొలి వారంలోనే ఇలా రూ.212 కోట్లకు పైగా గ్రాస్ సాధించడం ఇదే తొలిసారి. ఈ అరుదైన ఘనతను సాధించి ‘గుంటూరు కారం’(Guntur Kaaram) ఆల్‌టైమ్ రికార్డు సృష్టించిందని మేకర్స్ తాజా పోస్టర్ ద్వారా తెలియజేశారు. కాగా, మహేష్ కెరీర్‌లో రూ.200+ గ్రాస్ అందుకోవడం ఇది మూడోసారి. అదే విధంగా టాలీవుడ్‌లో రూ.100 కోట్ల క్లబ్‌లో మహేష్ సినిమాలు ఐదు ఉన్నాయి.
గుంటూరు కారం చిత్రం ద్వారా మహేష్‌బాబు కెరీర్‌లో వరుసగా ఐదోసారి రూ.100+ కోట్ల షేర్ సాధించాడు. 'భరత్ అనే నేను', 'మహర్షి', 'సరిలేరు నీకెవ్వరు', 'సర్కారు వారి పాట' సినిమాల ద్వారా ఆయన ఈ ఫీట్ అందుకున్నారు. దీంతో వరుసగా ఐదుసార్లు ఈ రికార్డు అందుకున్న తొలి తెలుగు హీరోగా మహేష్ నిలిచాడు.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ముచ్చటగా ముడోసారి మహేష్‌తో ‘గుంటూరు కారం’ తెరకెక్కించారు. ఇంతకుముందు వీరి కాంబోలో వచ్చిన ‘అతడు’, ‘ఖలేజా’ మంచి సక్సెస్ సాధించాయి. తొలుత ‘గుంటూరు కారం’ సినిమాపై మిశ్రమ స్పందన వచ్చింది. కానీ, ఫ్యామిలీ ఆడియన్స్ సినిమాకు బాగా కనెక్ట్ కావడంతో కలెక్షన్లలో ఆ ప్రభావం కనిపంచలేదు. మహేష్‌బాబు యాక్టింగ్, మేనరిజం, ఫైట్స్‌కు థియేటర్లు దద్దరిల్లిపోతున్నాయి.
ఈ సినిమాలో మహేష్‌కు జోడీగా యంగ్ బ్యూటీ శ్రీలీల (Sreeleela) నటించగా, మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) కీ రోల్ ప్లే చేసింది. సీనియర్ నటుడు ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ, మురళీ శర్మ, ఈశ్వరి రావు తదితరులు ఆయా పాత్రల్లో నటించారు. తమన్ సంగీతం అందించారు. కాగా హారికా అండ్ హసిన్ ప్రొడక్షన్ బ్యానర్‌పై నాగవంశీ ఈ సినిమా నిర్మించారు. ఇక ఈ సినిమా ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ భారీ ధరకు దక్కించుకుందని టాక్. మార్చి ఆఖరి వారంలో గుంటూరు కారం ఓటీటీలోకి వచ్చే ఛాన్స్ ఉంది.
మహేష్ టాప్-5 కలెక్షన్లు ఇవే!
‘గుంటూరు కారం’ చిత్రం బాక్సాఫీస్ వద్ద కనక వర్షం కురిపిస్తూ మరిన్ని రికార్డులను కొల్లగొట్టేందుకు పరుగులు పెడుతోంది. ఈ నేపథ్యంలో మహేష్ నటించిన చిత్రాల్లో ఇప్పటి వరకు అత్యధిక వసూళ్లు సాధించిన టాప్-5 చిత్రాలపై ఓ లుక్కేద్దాం.
సర్కారు వారి పాట
పరుశురామ్ దర్శకత్వంలో మహేష్ హీరోగా రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల మోత మోగించింది. ప్రపంచ వ్యాప్తంగా రూ.230 కోట్ల వసూళ్లు సాధించి మహేష్ సత్తా ఏంటో చూపించింది. ఈ సినిమాలో మహేష్‌కు జోడీగా కీర్తి సురేష్ నటించింది.
సరిలేరు నీకెవ్వరు
మహేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సరిలేరు నీకెవ్వరు' (Sarileru Neekevvaru). రూ.85 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం తొలి రోజే రూ. 64.7 కోట్లను వసూలు చేసింది. ఓవరాల్‌గా రూ.214 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది.
మహర్షి
రూ.90 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ‘మహర్షి’(Maharshi) చిత్రం.. వరల్డ్‌వైడ్‌గా రూ.170.5 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. తొలి రోజునే రూ.48.2 కోట్లు రాబట్టి నిర్మాతలపై కనక వర్షం కురిపించింది. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అల్లరి నరేష్, పూజా హెగ్డే, జగపతిబాబు ముఖ్యపాత్రలు పోషించారు.
భరత్ అనే నేను
కొరటాల శివ డైరెక్షన్‌లో వచ్చిన 'భరత్ అనే నేను' సినిమా సైతం మంచి వసూళ్లను రాబట్టింది. ఈ చిత్ర బడ్జెట్ రూ.95 కోట్లు కాగా.. వరల్డ్‌వైడ్‌గా రూ. 164.9 కోట్లు రాబట్టింది. ఇందులో మహేష్‌కు జోడీగా బాలీవుడ్ భామ కియారా అద్వానీ నటించింది.
శ్రీమంతుడు
మహేష్ కెరీర్‌లో గుర్తుండిపోయే చిత్రాల్లో 'శ్రీమంతుడు'(Srimanthudu) ఒకటి. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.145.2 కోట్లు రాబట్టింది. ఇందులో మహేష్ సరసన శ్రుతి హాసన్ చేసింది. జగపతి బాబు, రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రలు పోషించారు.
జనవరి 19 , 2024
VIVO T2 5G REVIEW: రూ.20వేల లోపు బెస్ట్ 5G స్మార్ట్‌ఫోన్… ఫీచర్లు కూడా అదుర్స్
మెుబైల్ ఫోన్ల దిగ్గజం వివో నుంచి మరో మోడల్ మార్కెట్‌లోకి అందుబాటులోకి వచ్చేసింది. ఇప్పటికే రిలీజ్ అయిన T2 మోడల్ మొబైల్ ప్రియులను తెగ ఆకట్టుకుంటోంది. VIVO T1కి అప్‌గ్రేడ్ వెర్షన్‌గా ఈ స్మార్ట్‌ఫోన్ వచ్చింది. డిజైన్, బిల్డ్, కెమెరా సెటప్, ఛార్జింగ్ కేపెబిలిటీ వంటి మార్పులతో యూజర్లను ఈ 5G ఫోన్ మెస్మరైజ్ చేయనుంది. మరి ఈ ఫోన్ ఫీచర్లు? ధర, తదితర వివరాలను తెలుసుకుందాం.
VIVO T2
VIVO T2 ఫోన్లకు భారత్‌లో మంచి ఆదరణ ఉంది. పైగా మార్కెట్లో ఉన్న OnePlus Nord CE3 Lite 5G, Redmi Note 12 5G, Moto G73 5G, iQoo Z7 5G ఫోన్లకు గట్టి పోటీ ఇస్తోంది. రూ.20 వేల లోపు బడ్జెట్‌లో 5G ఫోన్ కొనుగోలు చేయాలని భావించే వారికి ఇదొక బెస్ట్ ఆప్షన్.
డిస్‌ప్లే
ఈ ఫోన్ డిస్‌ప్లే సైజు 6.38(16.21cm) అంగులాలు ఉంటుంది. ఫుల్ హెచ్‌డీతో పాటు అమోల్డ్ డిస్‌ప్లే టైప్‌తో రూపుదిద్దుకుంది. 1080 x 2400 పిక్సెల్ రెజల్యూషన్ సపోర్ట్ చేస్తుంది.
ప్రాసెసర్
స్నాప్ డ్రాగన్ 695 ఆక్టాకోర్ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఆండ్రాయిడ్ 13 వెర్షన్‌తో 2.2 GHz ప్రైమరీ క్లాక్ స్పీడ్, 90Hz రిఫ్రెష్ రేట్‌తో డిజైన్ అయింది.
మెమోరీ
వివో T2 రెండు రకాల స్టోరేజీలతో వస్తోంది. 128GB + 8GB, 128GB + 8GB వేరియంట్లతో అందుబాటులోకి వచ్చింది.
కెమెరా
ఫోన్‌కి వెనకాల డ్యుయల్ కెమెరా సెటప్‌ని కలిగి ఉంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కలిగిన 64MP ప్రైమరీ కెమెరాతో పాటు 2 MP పోర్ట్‌రైట్ లెన్స్ కలిగిన మరో కెమెరా ఉంది. 16MP ఫ్రంట్ కెమెరా ఉంది. ఈ ఫోన్‌కు అల్ట్రా వైడ్ కెమెరా లేకపోవడం గమనార్హం. ఈ రెండింటితో1080P క్వాలిటీతో వీడియోలు రికార్డ్ చేయవచ్చు.
బ్యాటరీ
T2 5Gలో 4500mAh సామర్థ్యంతో లిథియం బ్యాటరీ సౌకర్యం ఉంది. T1లో 5000mAh ఉండేది. ఫాస్ట్‌ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. 44W ఛార్జర్‌ను ఇస్తున్నారు.
మరికొన్ని
రెండు రంగుల్లో ఫోన్‌ను రూపొందించారు. నైట్రో బ్లేజ్, వెలాసిటీ వేవ్ కలర్స్‌లో తీసుకువచ్చారు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. ఏడాది పాటి వారంటీ లభిస్తోంది.
ధర
వివో T2 128GB + 6GB RAM ఫోన్ ధర రూ. 18,999గా ఉంది. 128+8GB వేరియంట్ ధర రూ.20,999కు లభిస్తోంది. ఈ సెగ్మెంట్‌లో ఉన్న ఇతర ఫోన్లకు గట్టి పోటీని ఇస్తోంది.
https://telugu.yousay.tv/vivo-y78-5g-the-latest-feature-rich-smartphone-from-vivo-at-a-low-price-in-india.html
https://telugu.yousay.tv/flipkart-big-savings-days-flood-of-offers-up-to-80-percent-discount-on-smartphones.html
మే 03 , 2023
SSMB29: రాజమౌళి సినిమాలో మహేష్ ఫైనల్ లుక్ ఇదేనా? పిక్స్ వైరల్!
సూపర్ స్టార్ మహేష్‌బాబు (Mahesh Babu), దర్శకధీరుడు రాజమౌళి (SS Rajamouli) కాంబోలో ఓ సినిమా తెరకెక్కునున్న సంగతి తెలిసిందే. 'RRR' వంటి గ్లోబల్ హిట్ తర్వాత రాజమౌళి రూపొందిస్తున్న చిత్రం కావడంతో 'SSMB29' భారీగానే అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాపై ఇప్పటివరకూ ఒక్క అధికారిక ప్రకటన రానప్పటికీ గాసిప్స్ మాత్రం పెద్ద ఎత్తునే చక్కర్లు కొట్టాయి. ఇక ఈ సినిమా కోసం మహేష్ లాంగ్ హెయిర్, బియర్డ్ లుక్‌తో మేకోవర్ అవుతున్నాడు. దీనికి సంబంధించిన ఫొటోలు సైతం ఇటీవల కాలంలో చాలా సార్లు వైరల్ అయ్యాయి. ఇదిలా ఉంటే తాజాగా మహేష్ లేటెస్ట్ లుక్స్ మరోమారు ట్రెండింగ్‌లోకి వచ్చాయి. గత ఫొటోలతో పోలిస్తే కాస్త భిన్నంగా మహేష్ కనిపించడం విశేషం.
మహేష్ లుక్ అదుర్స్!
భారత్‌కి చెందిన ఒక బిజినెస్ మ్యాన్ మాల్దీవుల్లో ఇచ్చిన విందుకి ఇటీవల మహేష్ బాబు దంపతులు హాజరయ్యారు. వారితో పాటు టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna), విక్టరి వెంకటేష్ (Venkatesh), అక్కినేని అఖిల్ (Akkineni Akhil) కూడా ఈ ఈవెంట్లో పాల్గొన్నారు. వీరంతా ఓ డైనింగ్ టేబుల్ వద్ద కూర్చొని దిగిన ఒక ఫొటో సైతం ఇటీవల వైరల్ అయ్యింది. అయితే ఈ ఈవెంట్లో మహేష్ దిగిన ఫొటోలు తాజాగా నెట్టింట ప్రత్యక్షమయ్యాయి. పార్టీ ఇచ్చిన బిజినెస్ మ్యాన్ కపుల్స్‌తో మహేష్ దంపతులు ఫొటోలు దిగారు. ఈ ఫొటోల్లో మహేష్ లుక్ అదిరిపోయింది. ఈ ఫొటోలు చూసిన ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
https://twitter.com/Nikhil_Prince01/status/1856562711074636174
మార్పులు గమనించారా?
రాజమౌళి దర్శకత్వంలో రానున్న ‘SSMB 29’ ప్రాజెక్ట్ కోసం ప్రస్తుతం మహేష్ బాబు మేకోవర్ అవుతున్నారు. అయితే గతంలో వైరల్ అయిన ఫొటోలకు ప్రస్తుత మేకోవర్‌కు కాస్త డిఫరెన్స్ కనిపిస్తోంది. గత పిక్స్‌లో మహేష్ గుబురు గడ్డం, లాంగ్ హెయిర్‌తో కనిపించాడు. లేటెస్ట్ పిక్స్‌లో మాత్రం అతడి హెయిర్ కాస్త షార్ట్ అయ్యింది. అలాగే గడ్డాన్ని కూడా ట్రిమ్ చేశాడు. పూర్తిగా ఉంగరాల జుట్టుతో కనిపించాడు. ఇది చూసిన ఫ్యాన్స్ మహేష్ లుక్ ఫైనల్ అయ్యిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. రాజమౌళి సినిమాలో మహేష్ ఈ లుక్‌తోనే కనిపిస్తాడని నెట్టింట పోస్టులు పెడుతున్నారు. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
వారణాసి నేపథ్యంలో..
రాజమౌళి - మహేష్ బాబు (SSMB29) చిత్రానికి సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా కథ వారణాసి నేపథ్యంలో మెుదలవుతుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆ తర్వాత సౌతాఫ్రికాకు షిఫ్ట్ అవుతుందని ఫిల్మ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. వారణాసి షెడ్యూల్ మెుత్తాన్ని ఓ సెట్లో పూర్తి చేయాలని జక్కన్న భావిస్తున్నారట. దాని కోసం హైదరాబాద్ శివార్లలో భారీ కాశీ సెట్‌ను నిర్మించనున్నట్లు తెలుస్తోంది. కథ మెుత్తం అటవీ నేపథ్యంలో సాగనుండటంతో అందుకు అనువైన ప్రదేశాన్ని జక్కన్న టీమ్ రెక్కీ చేస్తున్నట్లు సమాచారం. లోకేషన్ ఫైనల్ కాగానే సెట్ నిర్మాణ పనులను మెుదలుపెడతారని సినీ వర్గాలు చెబుతున్నాయి.
హీరోయిన్‌గా బ్రిటిష్ భామ!
SSMB 29 ప్రాజెక్టులో సూపర్ స్టార్ మహేష్‌కు జోడీగా బ్రిటిష్ భామ కనిపించనున్నట్లు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. RRR సినిమాలో బ్రిటీష్ భామ ఓలివియా మోరిస్ (Olivia Morris)ను తీసుకున్న రాజమౌళి మహేష్ బాబుతో సినిమా కోసం మరో బ్రిటీష్ ముద్దుగుమ్మ నవోమి స్కాట్ (Naomi Scott)ని తీసుకోనున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అఫిషియల్ అనౌన్స్మెంట్ రానుందని అంటున్నారు. కాగా నవోమి స్కాట్‌కు భారత్ మూలాలు ఉన్నాయి. ఆమె తల్లి ఉసా స్కాట్ది గుజరాత్ కాగా ఆమె చిన్నప్పుడే ఇంగ్లాండ్‌కు వలస వెళ్లారట. కాబట్టి భారత్‌పై నవోమి స్కాట్‌కు కాస్త అవగాహన ఉన్నట్లు చెబుతున్నారు. బాలీవుడ్లో వచ్చిన ‘చార్లీస్ ఏంజెల్స్’, ‘స్మైల్’, ‘అల్లాద్దీన్’, ‘విజర్డ్స్’ తదితర చిత్రాల్లో నవోమి నటించింది.
రూ.2000 కోట్లకు పైగా బిజినెస్!
మహేశ్-రాజమౌళి కాంబోలో రానున్న SSMB 29 గురించి టాలీవుడ్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ గ్లోబల్ ప్రాజెక్ట్ బడ్జెట్ కచ్చితంగా రూ.1000 కోట్లు దాటుతుందని అంచనా వేశారు. 'అంతర్జాతీయ నటులు ఈ చిత్రంలో నటించనున్నారు. దీని బిజినెస్ మినిమం రూ.2000కోట్లు దాటొచ్చని టీమ్ భావిస్తోంది. అంతకుమించి ఎంతైనా వసూలు చేయొచ్చు. ఈ నంబర్ రూ.3, 4 వేల కోట్ల వరకు వెళ్లొచ్చు. అదే జరిగితే తెలుగు సినిమాలోనే కాదు భారతదేశ సినీరంగంలోనే కొత్త చరిత్ర అవుతుంది. భవిష్యత్తును రాజమౌళి బాగా ఊహిస్తారు. ఆయన ఈ చిత్రంతో మళ్లీ మరోసారి సత్తా చాటనున్నారు' అని అన్నారు.
నవంబర్ 13 , 2024
The Raja Saab: ప్రభాస్ ‘రాజాసాబ్’ నుంచి రొమాంటిక్ ఫొటో లీక్..!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రానున్న చిత్రం ‘ది రాజా సాబ్’ (The Raja Saab). ఈ సినిమా అప్‌డేట్స్ కోసం డార్లింగ్ ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రియులంతా చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా అదిరిపోయే అప్డేట్ ఉంటుందని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. దీంతో ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. అయితే ఎవరూ ఊహించని విధంగా ‘రాజా సాబ్’ సినిమా నుంచి ఓ రొమాంటిక్ ఫొటో నెట్టింట ప్రత్యక్షమయ్యింది. హీరోయిన్‌తో కలిసి క్రేజీ ఫోజులో ఉన్న ప్రభాస్‌ను చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
లేటెస్ట్ అప్డేట్ అదుర్స్
ప్రభాస్ బర్త్‌డేను పురస్కరించుకొని అక్టోబర్ 23న గ్రాండ్ ట్రీట్ ఇవ్వబోతున్నట్లు రాజా సాబ్ మేకర్స్ తాజాగా ప్రకటించారు. రాయల్ ట్రీట్ (టీజర్/ట్రైలర్ రిలీజ్) ఇవ్వనున్నట్టు ఓ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో గళ్ల చొక్కా, కళ్లద్దాలు పెట్టుకుని స్టైల్‌గా నడుస్తూ ప్రభాస్ కనిపించాడు. ఇది చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఈ లుక్ వింటేజ్ ప్రభాస్‌ను గుర్తుచేస్తోందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవల రాజాసాబ్ నిర్మాత మాట్లాడుతూ ప్రభాస్ పుట్టిన రోజు నుంచి వరుస అప్‌డేట్స్ ఉంటాయని స్పష్టం చేశారు. అక్టోబర్ 23 నుంచి సినిమా విడుదల వరకూ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామన్నారు. కాగా వచ్చే ఏడాది ఏప్రిల్ 10న 'రాజా సాబ్' రిలీజ్ కానుంది.
రాజా సాబ్ ఫొటో లీక్!
రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం ‘రాజా సాబ్’ షూటింగ్లో బిజీ బిజీగా ఉన్నారు. ‘కల్కి 2898 ఏడీ’ వంటి బ్లాక్ బాస్టర్ తర్వాత రిలీజ్ కానున్న చిత్రం కావడంతో సహజంగానే ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. ఇందులో ప్రభాస్‌ను చాలా హ్యాండ్సమ్గా చూపిస్తుండటంతో ఈ హైప్ మరింత పెరిగింది. ఇదిలా ఉంటే ఈ మూవీ షూటింగ్ లొకేషన్ నుంచి ఓ పిక్ లీకయ్యింది. ప్రస్తుతం అది నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఇందులో ప్రభాస్ లాంగ్ హెయిర్‌తో ఫుల్ హ్యాండ్సమ్గా ఉన్నాడు. గడ్డంతో ముఖంపై బొట్టుతో ఆకట్టుకుంటున్నాడు. అతడితో పోటు హీరోయిన్ రిద్ది కుమార్ లీకైన ఫొటోలో కనిపించారు. సాంగ్ షూటింగ్ సందర్భంగా మానిటర్ నుంచి ఈ ఫొటోను క్యాప్చర్ చేసినట్లు కనిపిస్తోంది.
https://twitter.com/Baahubali230/status/1848209164553814057
రీ-రిలీజ్‌ల సందడి
మరోవైపు ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ప్రభాస్ పుట్టిన రోజు హంగామా మెుదలైంది. సలార్ వంటి బ్లాక్ బాస్టర్ చిత్రాన్ని ఇటీవలే రీరిలీజ్ చేసి స్పెషల్ షోస్ సైతం వేశారు. సలార్‌తో పాటు ‘ఈశ్వర్’, ‘మిస్టర్ పర్ఫెక్ట్’, ‘మిర్చి’, ‘రెబల్’ చిత్రాలను బర్త్‌డే కానుకగా రీరిలీజ్ చేస్తున్నారు.
భారీ ధరకు మ్యూజిక్ రైట్స్
రాజా సాబ్‌కు సంబంధించి మరో క్రేజీ అప్డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా మ్యూజిక్ రైట్స్ భారీ ధరకు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. ప్రముఖ మ్యూజిక్ సంస్థ T-సిరీస్ రాజాసాబ్ ఆడియో హక్కులను రూ.25 కోట్లకు కొనుగోలు చేసినట్లు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. త్వరలోనే ఒక్కొక్కటిగా ఈ సినిమాలోని సాంగ్స్ రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. ఇక పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై రూపొందుతున్న ఈ సినిమాకు థమన్ సంగీతం సమకూరుస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 10న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కాబోతోంది.
వరుస సినిమాలతో ప్రభాస్ జోరు!
ప్రస్తుతం ప్రభాస్ చేతిలో అరడజను పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ‘రాజా సాబ్’ (Raja Saab)తో పాటు సందీప్ రెడ్డి వంగాతో ‘స్పిరిట్’ (Spirit), నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో ‘కల్కి 2’ (Kalki 2), ప్రశాంత్ నీల్‌తో ‘సలార్ 2’ (Salaar 2), హను రాఘవపూడితో ‘ఫౌజీ’ (Fouji) చిత్రం చేయనున్నాడు. అలాగే మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప'లోనూ ప్రభాస్ స్పెషల్ రోల్ చేస్తున్నాడు. ఇది కాకుండా హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మతో ఓ సినిమా చేయబోతున్నట్లు తాజాగా ప్రచారం జరిగింది. కథను ప్రశాంత్ వర్మ వినిపించగా అది ప్రభాస్‌కు బాగా నచ్చిందని కూడా టాక్ వచ్చింది. ఈ విధంగా వరుస ప్రాజెక్ట్స్‌తో ప్రభాస్ కెరీర్ పరంగా దూసుకుపోతున్నాడు.
అక్టోబర్ 21 , 2024
Pushpa 2: ‘పుష్ప 2’ను ఇంకా చెక్కే పనిలోనే సుకుమార్.. రిలీజ్ డేట్ పోస్ట్‌పన్?
అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో రూపొందిన ‘పుష్ప 2’ (Pushpa 2)పై దేశవ్యాప్తంగా బజ్ ఉంది. ఇటీవల పాట్నా వేదికగా రిలీజైన ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. మిలియన్ల కొద్ది వ్యూస్‌తో యూట్యూబ్‌లో దూసుకుపోతోంది. డిసెంబర్ 5న ‘పుష్ప 2’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీంతో మేకర్స్ చురుగ్గా ప్రమోషన్స్ నిర్వహిస్తూ వరుసగా అప్‌డేట్స్ ఇస్తున్నారు. మరోవైపు పోస్టు ప్రొడక్షన్స్ వర్క్స్ సైతం వేగంగా సాగుతున్నాయి. డైరెక్టర్ సుకుమార్ బెస్ట్ ఔట్పుట్ ఇచ్చేందుకు రెయింబవళ్లు కష్టపడుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను పుష్ప టీమ్ తాజాగా తమ ఎక్స్ ఖాతాలో పంచుకుంది. అయితే ఈ వీడియో సినీ లవర్స్‌లో కొత్త భయాలను సృష్టిస్తోంది. అందుకు గల కారణాలేంటో ఇప్పుడు చూద్దాం.
బిగ్గెస్ట్ మూవీ కోసం శ్రమిస్తున్న సుకుమార్!
అల్లు అర్జున్ - సుకుమార్ కాంబోలో రాబోతున్న ‘పుష్ప 2’ (Pushpa 2)పై యావత్ దేశం ఎదురుచూస్తోంది. రిలీజ్‌కు ఇంకా రెండు వారాల సమయమే ఉండటంతో అందరూ వెయ్యి కళ్లతో వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘పుష్ప 2’ టీమ్ ఓ ఆసక్తికర వీడియోను ఎక్స్‌లో పెట్టింది. అర్ధరాత్రి సమయంలోనూ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో సుకుమార్ బిజీగా ఉన్న వీడియోను పంచుకుంది. బిగ్గెస్ట్ ఇండియన్ ఫిల్మ్ కోసం ‘ఏరౌండ్ ది క్లాక్’ సుకుమార్ పనిచేస్తున్నారని మూవీ టీమ్ రాసుకొచ్చింది. వీడియోను పరిశీలిస్తే ల్యాప్‌టాప్‌లో ‘పుష్ప 2’ను పరిశీలిస్తూ టెక్నికల్ టీమ్ వ్యక్తికి సుకుమార్ కొన్ని సూచనలు చేస్తున్నాడు. ఇది చూసిన అల్లు అర్జున్ ఫ్యాన్స్ సుకుమార్ చేస్తున్న కృష్టిని ప్రశంసిస్తున్నారు. బెస్ట్ ఔట్పుట్ ఇచ్చేందుకు ఆయన అహర్నిశలు శ్రమిస్తున్నారని ఆకాశానికెత్తుతున్నారు.
https://twitter.com/i/status/1860015165732978697
ఆందోళన ఎందుకంటే?
‘పుష్ప 2’ చిత్రం డిసెంబర్ 5న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. విడుదలకు సరిగ్గా రెండు వారాల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఇప్పటికీ సుకుమార్ పోస్టు ప్రొడక్షన్ పనులే చేస్తూ ఉండటంతో కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రమోషన్స్‌పై ఫోకస్ పెట్టాల్సిన సమయంలో ఇంకా పోస్టు ప్రొడక్షన్ పనులను పరిశీలిస్తుండటం ఏంటని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పైగా నాలుగో పాట షూటింగ్ కూడా శుక్రవారం (నవంబర్ 22) నుంచి స్టార్ట్ చేసినట్లు ఫిల్మ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీనికి తోడు సినిమాకు సంబంధించి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వర్క్ ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయన్న టాక్ ఉంది. ఇటీవల థమన్ ఇచ్చిన నేపథ్య సంగీతంపై సుకుమార్ అసంతృప్తి వ్యక్తం చేశాడని కథనాలు కూడా వచ్చాయి. ఇన్ని పెండింగ్ వర్క్స్ పెట్టుకొని రెండు వారాల్లో సినిమాను ఎలా రిలీజ్ చేస్తారోనని బన్నీ ఫ్యాన్స్ సైతం అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చివరి క్షణంలో సినిమా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించి హ్యాండ్ ఇస్తారేమోనని అనుమానిస్తున్నారు.
అదుర్స్ అనేలా ‘కిస్సిక్’ ప్రోమో
దర్శకుడు సుకుమార్ తెరకెక్కించే సినిమాల్లో స్పెషల్ సాంగ్స్‌కు ఓ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంటుంది. మొదటి సినిమా 'ఆర్య'లో 'అ అంటే అమలాపురం' ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. 'రంగస్థలం'లో 'జిల్ జిల్ జిగేల్ రాణి' కూడా అందరినీ ఊర్రూతలూగించింది. గత చిత్రం పుష్పలోని 'ఊ అంటావా మావ ఊఊ అంటావా మావ' సాంగ్ యావత్ దేశాన్ని స్టెప్పులు వేసేలా చేసింది. ఇప్పుడు 'పుష్ప 2'లోనూ అలాంటి సాంగ్ ఉంది. 'కిస్సిక్' అంటూ సాగే ఈ పాటలో డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల స్టెప్పులు వేసింది. నవంబర్ 24న ‘కిస్సిక్’ లిరికల్ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ పాటకు సంబంధించిన ప్రోమోను తాజాగా రిలీజ్ చేశారు. ఈ ప్రోమో చూస్తుంటే సాంగ్ పక్కా హిట్ అయ్యేలా కనిపిస్తోంది. ఓ సారి ప్రోమోను మీరూ చూసేయండి.
https://www.youtube.com/watch?v=AiJZ3jLajHI
‘కిస్సిక్’ హైప్‌కు కారణం ఇదే
డైరెక్టర్ సుకుమార్ తన ప్రతీ చిత్రంలోనూ ఓ ఐటెం సాంగ్ (Kissik Song) తప్పనిసరిగా ఉంచుతారు. అయితే ‘కిస్సిక్’ పాటకు వస్తున్నంత హైప్ గతంలో ఏ పాటకు రాలేదు. సుకుమార్ గత చిత్రం ‘పుష్ప’లోని ‘ఊ అంటావా ఊఊ అంటావా’కు సైతం రిలీజ్‌కు ముందు ఇంత బజ్ క్రియేట్ కాలేదు. అయితే ‘కిస్సిక్’కు మాత్రమే ఈ స్థాయి హైప్ ఏర్పడటానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ‘పుష్ప’కి మించి ‘పుష్ప 2’ ఉంటుందని చిత్ర బృందం ముందు నుంచి చెబుతూ వస్తోంది. దీంతో ఇండియాను షేక్ చేసిన ‘ఊ ఊ అంటావా.. ఊ ఊ అంటావా’ కంటే ‘కిస్సిక్’ ఇంకా అదిరిపోతుందని ఆడియన్స్ ఓ అభిప్రాయానికి వచ్చేశారు. దానికి తోడు డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల సాంగ్‌లో చేస్తుండటం, సమంత కంటే బెటర్ డ్యాన్సర్ కావడం, బన్నీ కూడా స్టెప్పులు ఇరగదీస్తాడని పేరుండటంతో ఈ సాంగ్‌పై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి.
నవంబర్ 23 , 2024
Mahesh Babu Trolls: మీమర్స్ స్టఫ్‌గా మారిపోయిన మహేష్ బాబు.. ఒక్క వీడియోపై ఇన్ని ట్రోల్సా!
సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) ఇటీవల ఓ బిజినెస్ మ్యాన్ పుట్టినరోజు వేడుకకు హాజరైన సంగతి తెలిసిందే. మాల్దీవుల్లో జరిగిన ఈ సెలబ్రేషన్స్‌కు మహేష్‌తో పాటు టాలీవుడ్ నుంచి చిరంజీవి, నాగార్జున, అఖిల్, వెంకటేష్ హాజరయ్యారు. సెలబ్రిటీలంతా కలిసిన దిగిన ఓ ఫొటో ఇటీవల బయటకు రాగా అది క్షణాల్లో నెట్టింట వైరల్ అయ్యింది. తాజాగా మరికొన్నిఫొటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. ఇందులో మహేష్‌కు సంబంధించిన ఓ వీడియో తెగ ట్రోలింగ్ (Mahesh Babu Trolls)కు గురవుతోంది. అందుకు గల కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మహేష్ మరీ ఇంత ఇంట్రోవర్టా?
సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంట్రోవర్ట్ (Mahesh Babu Trolls) అన్న సంగతి అందరికీ తెలిసిందే. సినిమా ఫంక్షన్స్‌లో చాలా తక్కువగా మాట్లాడుతుంటారు. తన మూవీ ఈవెంట్ అయినా కూడా కొద్ది మాటలతోనే ముగిస్తుంటారు. ఇదిలా ఉంటే తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో మహేష్ ఎంత ఇంట్రోవర్టో మరోమారు బయటపడింది. ఈ వీడియోలో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ అందరూ బర్త్‌డే బాయ్‌తో ఫుల్‌గా ఎంజాయ్ చేస్తుంటే మహేష్ మాత్రం పక్కనే కొంచెం గ్యాప్‌తో సైలెంట్‌గా నిల్చున్నాడు. అందరూ ఎంజాయ్ చేస్తుంటే మహేష్ మాత్రం పక్కన ఫొటోకి ఫోజు ఇచ్చినట్లు నిలబడిపోయాడు. ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు మహేష్‌ను చూసి నవ్వుకుంటున్నారు. మహేష్ మరీ ఇంత ఇంట్రోవర్టా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
https://twitter.com/i/status/1856609040123441371
మీమర్స్ స్టఫ్‌గా మహేష్..!
అయితే మహేష్ బాబు తాజా వీడియోను ఇంట్రోవర్ట్స్ అంతా ఓన్ చేసుకుంటున్నారు. ఇంట్రోవర్ట్స్ కమ్యూనిటీలోకి స్వాగతం అంటూ నెట్టింట పోస్టులు పెడుతున్నారు. అంతేకాదు ఆ వీడియోను పలు రకాలుగా ఎడిటింగ్ చేసి మీమ్స్ స్టఫ్ (Mahesh Babu Trolls)గా వాడుకుంటున్నారు. ‘మహేష్ బాబు.. సేమ్ టూ సేమ్ నాలాగే’ అంటూ ఇంట్రోవర్ట్స్ పోస్టులు పెడుతున్నారు. తాము కూడా ఫ్యామిలీ ఫంక్షన్స్ అటెండ్ అయినప్పుడు ఇలాగే ప్రవర్తిస్తుంటామని తెలియజేస్తున్నారు. అయితే ఈ ట్రోల్స్‌పై మహేష్ అభిమానులు మాత్రం తమదైన శైలిలో కౌంటర్ ఇస్తున్నారు. 'నిండు చంద్రుడు ఒకవైపు.. చుక్కలు ఒకవైపు' అంటూ సమర్థించుకుంటున్నారు. నలుగురిలో ప్రత్యేకంగా ఉండటం తమ హీరోకు అలవాటని వెనకేసుకొస్తున్నారు.
https://twitter.com/Sampath01266745/status/1856890678778773683
https://twitter.com/ursbhargav_1/status/1856738857888473213
https://twitter.com/Memuchalabusy_2/status/1856590047505723771
ధనుష్ కోసం మహేష్..
టాలీవుడ్ సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల రూపొందిస్తున్న లేటెస్ట్ చిత్రం 'కుబేర'. తమిళ స్టార్ హీరో ధనుష్ ఇందులో హీరోగా చేస్తున్నాడు. టాలీవుడ్ కింగ్ నాగార్జున కీలకపాత్ర పోషిస్తున్నారు. రేపు (నవంబర్ 15) కార్తీక పౌర్ణమి సందర్భంగా ‘కుబేర’ గ్లింప్స్‌ను రిలీజ్ చేయబోతున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా ఈ గ్లింప్ల్ విడుదల కానున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు స్పెషల్ పోస్టర్‌ను సైతం రిలీజ్ చేశారు. కాగా ఈ మూవీలో ధనుష్, నాగార్జున మధ్య వచ్చే సీన్స్ చాలా వైవిధ్యభరితంగా ఉంటాయని అంటున్నారు. ఈ సినిమాకు రాక్‌స్టార్ దేవిశ్రీ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాదిలో ఈ మూవీ రిలీజ్ కానుంది.
https://twitter.com/SVCLLP/status/1856645705110298753
మహేష్ లేటెస్ట్ లుక్ అదుర్స్!
బిజినెస్ మ్యాన్ బర్త్‌డే ఫంక్షన్లో మహేష్‌కు సంబంధించి మరిన్ని ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. పార్టీ ఇచ్చిన బిజినెస్ మ్యాన్ కపుల్స్‌తో మహేష్ దంపతులు ఫొటోలు దిగారు. ఈ ఫొటోల్లో మహేష్ లుక్ అదిరిపోయింది. గతంలో వచ్చిన పిక్స్‌లో మహేష్ గుబురు గడ్డం, లాంగ్ హెయిర్‌తో కనిపించాడు. లేటెస్ట్ పిక్స్‌లో మాత్రం అతడి హెయిర్ కాస్త షార్ట్ అయ్యింది. అలాగే గడ్డాన్ని కూడా ట్రిమ్ చేశాడు. పూర్తిగా ఉంగరాల జుట్టుతో కనిపించాడు. ఇది చూసిన ఫ్యాన్స్ రాజమౌళి సినిమాలో మహేష్ ఇలాగే కనిపిస్తారేమోనని సందేహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
https://twitter.com/Nikhil_Prince01/status/1856562711074636174
హైదరాబాద్‌లో వారణాసి సెట్!
రాజమౌళి - మహేష్ బాబు (SSMB29) చిత్రానికి సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా కథ వారణాసి నేపథ్యంలో మెుదలవుతుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆ తర్వాత సౌతాఫ్రికాకు షిఫ్ట్ అవుతుందని ఫిల్మ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. వారణాసి షెడ్యూల్ మెుత్తాన్ని ఓ సెట్లో పూర్తి చేయాలని జక్కన్న భావిస్తున్నారట. దాని కోసం హైదరాబాద్ శివార్లలో భారీ కాశీ సెట్‌ను నిర్మించనున్నట్లు తెలుస్తోంది. కథ మెుత్తం అటవీ నేపథ్యంలో సాగనుండటంతో అందుకు అనువైన ప్రదేశాన్ని జక్కన్న టీమ్ రెక్కీ చేస్తున్నట్లు సమాచారం. లోకేషన్ ఫైనల్ కాగానే సెట్ నిర్మాణ పనులను మెుదలుపెడతారని సినీ వర్గాలు చెబుతున్నాయి.
నవంబర్ 14 , 2024
Pushpa 2 Trailer: బిహార్‌లోనే పుష్ప ట్రైలర్ రిలీజ్ ఎందుకంటే?
అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో రూపొందిన ‘పుష్ప 2’ (Pushpa 2)పై దేశవ్యాప్తంగా బజ్ ఉంది. డిసెంబర్ 5న వరల్డ్ వైడ్‌గా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ‘పుష్ప 2’ సంబంధించి రోజుకో అప్డేట్ నెట్టింట హల్చల్ చేస్తోంది. దీంతో ట్రైలర్ (Pushpa 2 Trailer) రిలీజ్ అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే వారి నిరీక్షణనను పటాపంచలు చేస్తూ మేకర్స్ అదిరిపోయే అప్డేట్ తీసుకొచ్చారు. పుష్ప 2 ట్రైలర్ రిలీజ్‌పై ఓ స్పెషల్ పోస్టర్ ద్వారా స్పష్టత ఇచ్చారు.
పాట్నాలో గ్రాండ్ రిలీజ్
దేశ విదేశాల్లో ఉన్న సినీ ప్రియులందరూ ఆసక్తిగా ఎదురుచూస్తోన్న చిత్రం ‘పుష్ప ది రూల్’ (Pushpa The Rule). మూవీ రిలీజ్‌కు నెల రోజులు కూడా లేకపోవడంతో ట్రైలర్ ఎప్పుడు వస్తుందా అని అందరూ ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ట్రైలర్ రిలీజ్‌పై మూవీ టీమ్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది. నవంబర్ 17న సాయంత్రం 6.03 గంటలకు పాట్నాలో ట్రైలర్ (Pushpa 2 Trailer)ను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు బన్నీకి సంబంధించిన కొత్త పోస్టర్‌ను సైతం రిలీజ్ చేసింది. ఇందులో గన్ భుజాన పెట్టుకొని పుష్పగాడు ఎంతో అగ్రెసివ్‌గా కనిపించాడు. ఇది చూసిన సినీ లవర్స్ తెగ ఖుషీ అవుతున్నారు. పుష్ప 2 ట్రైలర్ దెబ్బకు సోషల్ మీడియా మోతమోగడం ఖాయమని అంటున్నారు.
https://twitter.com/PushpaMovie/status/1855922382181134676
బిహార్‌లోనే ఎందుకంటే?
తెలుగు స్టేట్స్తో పాటు నార్త్‌లో ఇన్ని రాష్టాలు ఉండాలుగా ‘పుష్ప 2’ టీమ్ ట్రైలర్ రిలీజ్‌కు బిహార్‌నే ఎంచుకోవడం వెనక ఓ బలమైన కారణమే ఉంది. 2021లో విడుదలైన ‘పుష్ప’ చిత్రం ఎవరూ ఊహించని విధంగా నార్త్‌లో ఘన విజయం సాధించింది. ముఖ్యంగా బిహార్ స్టేట్‌లో ‘పుష్ప’ సినిమాకు బ్రహ్మరథం పట్టారు. పుష్పగాడి మాస్ క్యారెక్టర్‌ను బిహార్ ఆడియన్స్ బాగా ఓన్ చేసుకున్నారు. అప్పట్లో బన్నీని ఇమిటేట్ చేస్తూ పెద్ద ఎత్తున రీల్స్ సైతం చేశారు. ఇటీవల ‘పుష్ప 2’ టైటిల్ సాంగ్ రిలీజవ్వగా దానిపైనా బిహారి యూత్ రీల్స్ చేసింది. బిహార్ సరిహద్దు రాష్ట్రం యూపీలోనూ ‘పుష్ప’కు మంచి ఆదరణ ఉంది. 2022 యూపీ ఎలక్షన్స్ సందర్భంగా 'పుష్ప'లోని శ్రీవల్లి సాంగ్ ప్రముఖంగా వినిపించింది. విపక్ష కాంగ్రెస్ పార్టీ శ్రీవల్లి ట్యూన్‌ను కాపీ చేసి 'తూ హై గజాబ్ యూపీ.. తేరి కసం యూపీ' అంటూ లిరిక్స్ మార్చి పాటను ప్రచారానికి వాడుకుంది. ఇలా చెప్పుకుంటే బిహార్, యూపీలో పుష్పగాడి క్రేజ్‌కు నిదర్శనమైన ఎన్నో ఘటనలు ఉన్నాయి. ప్రస్తుతం పాన్ ఇండియా మార్కెట్‌ను టార్గెట్ చేసిన ‘పుష్ప 2’ టీమ్ బిహార్ రాజధాని పాట్నాలో ట్రైలర్ రిలీజ్ చేయడం ద్వారా మంచి మైలేజ్ సాధించవచ్చని అంచనా వేస్తోంది.
‘కిస్సిక్’ శ్రీలీల అదుర్స్
స్టార్ హీరోయిన్ శ్రీలీల 'పుష్ప 2'లో ఐటెం సాంగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల సెట్లో బన్నీతో ఆమె ఉన్న పిక్ నెట్టింట వైరల్ అయ్యింది. ఇదిలా ఉంటే శ్రీలీల తమ ప్రాజెక్టులో భాగమైనట్లు 'పుష్ప 2' టీమ్ ఆదివారం (నవంబర్ 11) అధికారికంగా ప్రకటించింది. ఇందులో ఆమె స్పెషల్ సాంగ్ చేయనున్నట్లు తెలిపింది. ‘కిస్సిక్’ అంటూ సాగే ఈ పాట సాంగ్ ఆఫ్ ది ఇయర్ కానుందని పేర్కొంది. సినీ ప్రియులను ఇది తప్పక అలరిస్తుందని తెలిపింది. ‘ది డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల’అంటూ ఈ పోస్టర్‌కు క్యాప్షన్ సైతం ఇచ్చింది. ప్రస్తుతం ఈ పాట చిత్రీకరణ జరుగుతోంది.
https://twitter.com/PushpaMovie/status/1855559794985426988
డ్యాన్స్ అదిరిపోవాల్సిందే!
‘పుష్ప 2’ ఐటెం సాంగ్‌లో శ్రీలీల డ్యాన్స్ (Pushpa 2 Trailer) అదిరిపోతుందని చెప్పవచ్చు. ప్రస్తుత తరం కథానాయికల్లో డ్యాన్స్‌లో శ్రీలీలను కొట్టేవారే లేరనడంతో అతిశయోక్తి లేదు. ఈ భామ తన నటన కంటే డ్యాన్స్ పరంగానే ఎక్కువ మంది అభిమానులను సంపాదించుకుంది. రవితేజ 'ధమాకా' చిత్రంలో పల్సర్ బైక్ సాంగ్‌లో ఈ అమ్మడు ఏవిధంగా అదరగొట్టిందో అందరికీ తెలిసిందే. రీసెంట్‌గా మహేష్ బాబుతో 'కుర్చీని మడతపెట్టి' సాంగ్‌లో ఏకంగా తన స్టెప్పులతో విధ్వంసం సృష్టించింది. శ్రీలీలతో డ్యాన్స్ అంటే హేమా హేమీ డ్యాన్సర్లు సైతం కాస్త వెనక్కి తగ్గుతుంటారు. అటువంటి శ్రీలీలతో డ్యాన్స్‌కు కేరాఫ్‌గా నిలిచే బన్నీ జతకలిస్తే ఇక ఐటెం సాంగ్ ఏ స్థాయిలో ఉంటుందో అభిమానుల ఊహకే వదిలేయవచ్చు.
ప్రమోషన్స్‌కు టీమిండియా!
‘పుష్ప 2’ (Pushpa 2) రిలీజ్‌కు నెల రోజులు కూడా లేకపోవడంతో ప్రమోషన్స్‌పై చిత్ర బృందం ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. నార్త్ ఇండియాలోని అన్ని ప్రధాన నగరాల్లో ఈవెంట్స్ (Pushpa 2 Trailer)ను ప్లాన్ చేస్తున్నారట. అక్కడ జరిగే ఈవెంట్స్‌కు టీమిండియా స్టార్ క్రికెటర్స్ సూర్యకుమార్ యాదవ్, రింకు సింగ్, అర్షదీప్ సింగ్ సహా పలువురు క్రికెటర్స్‌ను ఆహ్వానించనున్నట్లు సమాచారం. దీనిపై నెక్స్ట్‌వీక్‌లో అధికారిక ప్రకటన సైతం రానున్నట్లు చెబుతున్నారు. ఇదే నిజమైతే ‘పుష్ప 2’ కొత్త ట్రెండ్‌ను సృష్టించనున్నాయి. ఇప్పటివరకూ మూవీ ప్రమోషన్స్‌లో క్రికెటర్లు పాల్గొన్న సందర్భాలు లేవు. ‘పుష్ప 2’ ప్రమోషన్స్‌లో వారు గనుక భాగం అయితే ఇండియన్ మూవీ హిస్టరీలో ఇదొక కొత్త అధ్యాయం కానుంది.
నవంబర్ 11 , 2024
Akhanda 2: బాలయ్య - బోయపాటి మాస్ తాండవం షురూ.. రికార్డులన్నీ సర్దుకోవాల్సిందే!
టాలీవుడ్‌లో బాలకృష్ణ (Balakrishna), దర్శకుడు బోయపాటి శ్రీను (Boyapati Srinu) చిత్రాలకు మంచి క్రేజ్ ఉంది. వీరి కాంబోలో వచ్చిన ‘సింహా’ (Simha), ‘లెజెండ్’ (Legend), ‘అఖండ’ (Akhanda) చిత్రాలు ఏ స్థాయి విజయాన్ని అందుకున్నాయో అందరికీ తెలిసిందే. అయితే వీరి కాంబోలో నాల్గో సినిమా కూడా రాబోతున్నట్లు ఇటీవలే అధికారిక ప్రకటన సైతం వచ్చింది. అయితే తాజాగా ‘అఖండ 2’ ప్రాజెక్ట్‌ను మేకర్స్ పట్టాలెక్కించారు. ఇవాళ పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
క్లాప్ కొట్టిన బ్రాహ్మణి
బాలకృష్ణ (Balakrishna) కథానాయకుడిగా బోయపాటి శ్రీను (Boyapati Srinu) దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం ‘అఖండ 2’ (Akhanda 2). ‘తాండవం’ అనే పేరును క్యాప్షన్‌గా పెట్టారు. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. చిత్రబృందంతోపాటు బాలకృష్ణ కుమార్తెలు నారా బ్రాహ్మణి (Nara Brahmani), తేజస్విని (Tejaswini), ఇతర కుటుంబసభ్యులు ఈ వేడుకలో పాల్గొని సందడి చేశారు. చిత్రబృందానికి అభినందనలు తెలిపారు. ముహూర్తపు షాట్‌కు బ్రాహ్మణి క్లాప్ కొట్టారు. దీనికి సంబంధించిన పలు ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఇవి చూసిన నందమూరి ఫ్యాన్స్ తెగ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
https://twitter.com/TeluguChitraalu/status/1846413204492374156
టైటిల్ థీమ్ అదుర్స్
అఖండ 2 సినిమాను గ్రాండ్‌గా లాంఛ్ చేసిన కాసేపటికే ఈ మూవీకి సంబంధించిన టైటిల్ థీమ్‌ను కూడా మేకర్స్ విడుదల చేశారు. ఈ టైటిల్ థీమ్‌కు మ్యూజిక్ సెన్సేషన్ తమన్ అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు. ఇది విన్న నందమూరి ఫ్యాన్స్ టైటిల్‌కే ఈ రేంజ్లో ఇచ్చాడంటే సినిమాకు ఏ రేంజ్లో ఇస్తాడో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక థియేటర్లలో పూనకాలు రావడం పక్కా అంటూ పోస్టులు పెడుతున్నారు. ఈ సినిమా క్యాప్షన్‌కు తగ్గట్లు థమన్ తాండవం చేయడం కన్ఫార్మ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మీరు కూడా అఖండ్ 2 టైటిల్‌ను ఓ సారి వినేయండి.
https://www.youtube.com/watch?v=FdBnvmLOuiM
కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్!
బాలయ్య - బోయపాటి శ్రీను కాంబోలో గతంలో వచ్చిన సింహా, లెజెండ్, అఖండ చిత్రాలు భారీ విజయాన్ని అందుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ముఖ్యంగా 2021లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘అఖండ’ (Akhanda) బాలయ్య కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ముఖ్యంగా అఖండ సినిమాకు తమన్ అదిరిపోయే నేపథ్య సంగీతాన్ని అందించారు. థమన్ BGM దెబ్బకు థియేటర్స్‌లో సౌండ్ బాక్స్‌లు కూడా షేక్ అయిపోయాయి. ఆ సినిమా విజయంలో తమన్ అందించిన మ్యూజిక్ కీలక పాత్ర పోషించిందనడంలో ఏమాత్రం సందేహాం లేదు. ఈ చిత్రంలో బాలయ్య ద్విపాత్రాభినయం చేయగా హీరోయిన్‌గా ప్రగ్యా జైశ్వాల్ నటించింది. ఇప్పుడు దీనికి సీక్వెల్‌గా ‘అఖండ 2’ వస్తుండటంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
యానిమేషన్లో బాలయ్య ప్రోమో
ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా నిర్వహించే అన్‌స్టాపబుల్ టాక్ షోకు బాలయ్య హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటివరకూ మూడు సీజన్లుగా ఈ టాక్ షో ప్రసారం కాగా ఓటీటీ ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చింది. బాలయ్య హోస్టింగ్ బాగుందంటూ పెద్ద ఎత్తున కామెంట్స్ వచ్చాయి. ఈ క్రమంలోనే తాజాగా అన్‌స్టాపబుల్ సీజన్ 4ను ప్రసారం చేసేందుకు ఆహా వర్గాలు రెడీ అయ్యాయి. ఇందులో భాగంగా ఇటీవల ‘బాలయ్య పండగ’ పేరుతో యానిమేషన్ ప్రోమోను రిలీజ్ చేశారు. యానిమేషన్ రూపంలో ఉన్న బాలయ్యను చూసి ఫ్యాన్స్ తెగ మురిసిపోయారు. అక్టోబర్ 24 నుంచి అన్‌స్టాపబుల్ 4 సీజన్ స్ట్రీమింగ్ కానుంది.
https://twitter.com/CBN_Era/status/1845061468053438745
నాన్నకు హ్యాట్సాఫ్ : తేజస్విని
బాలకృష్ణ రెండో కూతురు నందమూరి తేజస్విని అన్‌స్టాపబుల్ షోకి నిర్మాతగా, క్రియేటివ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు. ఇన్నాళ్లు తెర వెనుక ఉండి అన్‌స్టాపబుల్ షోని నడిపించిన తేజస్విని ఇటీవల జరిగిన సీజన్ 4 లాంచింగ్ ప్రెస్ మీట్లో తొలిసారి మీడియా ముందుకు వచ్చారు. తన తండ్రిపై పొగడ్తల వర్షం కురిపించారు. అల్లు అరవింద్ ఈ టాక్‌షో గురించి చెప్పినప్పుడు అందరం చేద్దామా? వద్దా? అని తెగ ఆలోచించినట్లు తెలిపారు. కానీ తన తండ్రి మాత్రం చేయాల్సిందేనని చెప్పారన్నారు. ఆ ధైర్యమే ఇవాళ అన్‌స్టాపబుల్‌ని ఈ రేంజ్‌కి తీసుకొచ్చిందని పేర్కొన్నారు. IMDB రేటింగ్స్‌లో అన్‌స్టాపబుల్ షో వరల్డ్ 18వ ర్యాంక్ సాధించిందని గుర్తు చేశారు. తన తండ్రి ఫ్యామిలీ కోసం, ఫ్రెండ్స్ కోసం, ప్రజల కోసం నిలబడే వ్యక్తి అని తేజస్విని అన్నారు. హిందూపూర్‌లో హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలిచిన విషయాన్ని గుర్తుచేశారు. నాన్నకు హ్యాట్సాఫ్ అంటూ ప్రసంగాన్ని ముగించారు. తేజస్విని వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో నెట్టింట విపరీతంగా ట్రెండ్ అయ్యింది.
https://twitter.com/GulteOfficial/status/1845034242280956027
రాజకీయ వారసురాలిగా తేజస్విని!
బాలయ్య చిన్న కూతురు తేజస్విని తొలిసారి మీడియా ముందుకు వచ్చినప్పటికీ ఏమాత్రం బెరుకు లేకుండా మాట్లాడారు. తాను చెప్పాలనుకున్న అంశాలను ఏమాత్రం తడబడకుండా అర్ధవంతంగా తెలియజేశారు. దీంతో బాలయ్య ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోతోంది. తేజస్విని ఇంత బాగా మాట్లాడతారని తాము అసలు ఎక్స్పెక్ట్ చేయాలేదని కామెంట్స్ చేస్తున్నారు. ఆమె మాటల్లోని స్పష్టత చూస్తుంటే రాజకీయాల్లోనూ రాణించగలదన్న నమ్మకం తమకు కలుగుతోందని పోస్టులు పెడుతున్నారు. బాలయ్యకు రాజకీయ వారసత్వంగా తేజస్విని ఉంటే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. కాగా, తేజస్విని భర్త భరత్ ఇప్పటికే వైజాగ్ ఎంపీగా గెలుపొందారు. రానున్న రోజుల్లో తేజస్విని రాజకీయాల్లో చూసే అవకాశం లేకపోలేదని నందమూరి అభిమానులు భావిస్తున్నారు.
అక్టోబర్ 16 , 2024
Vettaiyan Movie Review: విద్యా వ్యవస్థ లోపాలపై రజనీ పోరాటం.. ‘వేట్టయన్’ మెప్పించిందా?
నటీనటులు : రజనీకాంత్, అమితాబ్ బచ్చన్, మంజూ వారియర్, ఫహాద్ ఫాజిల్, రానా దగ్గుబాటి, రితికా సింగ్ తదితరులు
దర్శకుడు : టీజీ జ్ఞానవేల్
సంగీతం : అనిరుధ్ రవిచంద్రన్
ఎడిటర్ : ఫిలోమిన్ రాజ్
సినిమాటోగ్రఫీ : ఎస్. ఆర్. ఖదీర్
నిర్మాణ సంస్థ : లైకా ప్రొడక్షన్స్
నిర్మాత: సుభాస్కరన్ అల్లిరాజా
విడుదల తేదీ: అక్టోబర్ 10, 2024
సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా 'జై భీమ్' ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన సినిమా 'వేట్టయన్ - ద హంటర్' (Vettaiyan Movie Review In Telugu). లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాస్కరన్ నిర్మించారు. అమితాబ్ బచ్చన్, రానా దగ్గుబాటి, మంజూ వారియర్, ఫహాద్ ఫాజిల్, దుషారా విజయన్, రితికా సింగ్ ముఖ్య పాత్రలు పోషించారు. తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా విడుదలైంది. అయితే తెలుగు టైటిల్లోనూ తమిళ పేరే పెట్టడంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. మరి వాటిని తట్టుకొని ఈ సినిమా పాజిటివ్ టాక్ సాధించిందా? ‘జైలర్’ వంటి బ్లాక్ బాస్టర్ తర్వాత రజనీకి మరో సాలిడ్ విజయాన్ని అందించిందా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.
కథేంటి
పోలీసు ఆఫీసర్ అదియన్ (రజనీకాంత్) కన్యాకుమారిలో ఎస్పీగా పనిచేస్తుంటాడు. ఎన్కౌంటర్ స్పెషలిస్టుగా డిపార్ట్మెంట్లో పేరు తెచ్చుకుంటాడు. స్కూల్ టీచర్ శరణ్య (దుషారా విజయన్) ఫిర్యాదు ఆధారంగా గంజాయి మాఫియా నడిపే వ్యక్తిని ఎన్కౌంటర్ చేస్తాడు. ఆ తర్వాత శరణ్య చెన్నైకు ట్రాన్స్ఫర్ అవుతుంది. అక్కడ అనూహ్యంగా ఆమె హత్యాచారానికి గురవుతుంది. దీనిపై ఉపాధ్యాయ సంఘాలు, ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగడంతో ఈ కేసును అదియన్‌కు అప్పగిస్తారు. ఆదియన్ 48 గంటల్లో గుణ అనే వ్యక్తిని పట్టుకొని అతడే నిందితుడని చెప్పి ఎన్కౌంటర్ చేస్తాడు. దానిపై జడ్జి సత్యదేవ్ (అమితాబ్ బచ్చన్) నేతృత్వంలో విచారణ కమిటీ ఏర్పాటవుతుంది. సత్యదేవ్ కమిటీ ఏం తేల్చింది? శరణ్య మరణానికి కారణం ఏంటి? ఆమె మరణం వెనకున్న ఎడ్యుకేషన్ మాఫియా ఏంటి? ఈ కేసులో ప్యాట్రిక్ (ఫహాద్ ఫాజిల్), నటరాజ్ (రానా దగ్గుబాటి), ఏసీపీ రూప కిరణ్ (రితికా సింగ్), హను రెడ్డి (సంపత్ రాజ్) పాత్రలు ఏంటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎవరెలా చేశారంటే
సూపర్ స్టార్ రజనీకాంత్ ఎప్పటిలాగే ఇందులో అద్భుతమైన నటన కనబరిచారు. మాస్ మూమెంట్స్, హీరోయిజం, ఎలివేషన్స్‌తో ఆయన పాత్ర కన్నుల పండుగగా అనిపిస్తుంది. ముఖ్యంగా రజనీ డైలాగ్ డెలివరీ, మ్యానరిజమ్స్ ఆడియన్స్‌ను బాగా మెప్పిస్తాయి. ఇక రజనీకి ధీటైన పాత్రలో అమితాబ్ బచ్చన్ అదరగొట్టారు. వారిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు అదుర్స్ అనిపిస్తాయి. పోలీసు ఇన్‌ఫార్మర్‌గా ఫహాద్ ఫాజిల్ పాత్ర ఆకట్టుకుంటుంది. ఓవైపు నవ్విస్తూనే తన నటనతో ఫహాద్ మెప్పించాడు. అటు దగ్గుబాటి రానా, దుషారా విజయన్‌లకు సైతం మంచి పాత్రలే దక్కాయి. తమ నటనతో వారు ఎంతో సర్ప్రైజ్ చేశారు. మిగిలిన నటీనటులు తమ పరిధి మేరకు నటించి ఆకట్టుకున్నారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
'జై భీమ్' వంటి క్లాస్ సబ్జెక్ట్ తీసిన దర్శకుడు టీజే జ్ఞానవేల్ 'వేట్టయన్'తో కూడా మంచి సందేశం ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆడియన్స్ కోరుకునే మాస్ మూమెంట్స్, హీరోయిజం ఎలివేషన్స్, కమర్షియల్ హంగులు కథకు జతచేయడం బాగా ప్లస్ అయ్యింది. స్మార్ట్ ఎడ్యుకేషన్ పేరుతో ఎలా దోచుకుంటున్నారు? అన్న సున్నితమైన పాయింట్‌ను ఎంతో బలంగా చెప్పే ప్రయత్నం చేశారు డైరెక్టర్. రజనీకాంత్ ఇంట్రడక్షన్, గంజాయి మాఫియాపై ఉక్కుపాదంతో కమర్షియల్‌గా మూవీని మెుదలుపెట్టిన డైరెక్టర్, శరణ్య రేప్ కేసు తర్వాత అసలు కథలోకి తీసుకెళ్లారు. అయితే కథనం నెమ్మదిగా సాగడం, ఊహాకందేలా స్టోరీ ఉండటం మైనస్‌గా చెప్పవచ్చు. కానీ, అమితాబ్ బచ్చన్ - రజనీ మధ్య వచ్చే సీన్స్ సినిమాను ఆసక్తికరంగా మార్చేశాయి. రజనీ చెప్పే డైలాగ్స్, ఫహాద్ ఫాజిల్, రానా వంటి స్టార్ క్యాస్ట్‌ను డైరెక్టర్ ఉపయోగించుకున్న విధానం మెప్పిస్తుంది. క్లైమాక్స్ కూడా సంతృప్తికరంగా అనిపిస్తుంది.
టెక్నికల్‌గా..
సాంకేతిక అంశాల విషయానికి వస్తే ప్రతీ విభాగం మంచి పనితీరు కనబరిచింది. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. కథకు కమర్షియల్ లుక్ తీసుకురావడానికి కెమెరా వర్క్ ఉపయోగిపడింది. ఇక అనిరుధ్ నేపథ్య సంగీతం ఎప్పటిలాగే ఆడియన్స్‌కు పూనకాలు తెప్పించింది. ఫ్యాన్స్ తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. ఎడిటిర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పి ఉంటే బాగుండేది. లైకా ప్రొడక్షన్స్ సినిమా నిర్మాణంలో రాజీ పడలేదు.
ప్లస్ పాయింట్స్
రజనీకాంత్ నటనసోషల్ మెసేజ్‌సంగీతంసినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్స్
నెమ్మదిగా సాగే కథనంఊహజనీతంగా ఉండటం
Telugu.yousay.tv Rating : 3/5
అక్టోబర్ 10 , 2024
Devara Movie: జూ.ఎన్టీఆర్‌కు కలిసిరాని సెంటిమెంట్ ‘దేవర’కు షాక్ తప్పదా?
జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR), కొరటాల శివ (Koratala Siva) కాంబోలో రూపొందిన ‘దేవర’ (Devara: Part 1) చిత్రం ప్రస్తుతం టాక్ ఆఫ్ ది నేషన్‌గా మారిపోయింది. సెప్టెంబర్ 27న ఈ మూవీ రిలీజ్ కానుండటంతో చిత్ర యూనిట్ సినిమా ప్రమోషన్స్‌పై ఫోకస్ పెట్టింది. ఇటీవల పలు సాంగ్స్ రిలీజ్ చేసిన దేవర టీమ్ మంగళవారం (సెప్టెంబర్ 10) ట్రైలర్‌నూ రిలీజ్ చేసింది. ఈ ట్రైలర్ అందరి అంచనాలను అందుకుంటూ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేసింది. తారక్ ఇందులో తండ్రి-కొడుకులుగా ద్విపాత్రాభినయం చేయనున్నట్లు మేకర్స్ ట్రైలర్ ద్వారా క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ఇది తారక్ అభిమానుల్లో కొత్త భయానికి తెరతీసింది. గతంలో తారక్ చేసి ద్విపాత్రాభినయం చిత్రాలు ఫ్లాప్ కావడంతో ‘దేవర’ ఫలితం ఎలా ఉంటుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
డ్యూయల్ అంటే ఫసక్కేనా!
‘దేవర’ చిత్రంలో తారక్ ద్విపాత్రాభినయం చేసిన సంగతి తెలిసిందే. అయితే తారక్ గతంలోనూ పలు చిత్రాల్లో డ్యూయల్ రోల్స్ (Jr NTR Dual Role Films) చేశారు. ‘ఆంధ్రావాలా’, ‘శక్తి’, ‘అదుర్స్’ చిత్రాల్లో అతడు రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించారు. వీటిలో తారక్ తొలిసారి ద్విపాత్రాభినయం చేసిన చిత్రం ‘ఆంధ్రావాలా’. పూరి జగన్నాథ్ దర్శకత్వలో రూపొందిన ఈ చిత్రం భారీ డిజాస్టర్‌గా నిలిచింది. ఆ తర్వాత వచ్చిన ‘శక్తి’ మూవీలోనూ తారక్ ద్విపాత్రాభినయం చేసి చేతులు కాల్చుకున్నారు. ఈ రెండు చిత్రాలు తారక్, అతడి ఫ్యాన్స్‌కు పీడకలను మిగిల్చాయి. ఆ తర్వాత చేసిన ‘అదుర్స్’ ప్రయోగం కొద్దిమేర ఫలించినా కమర్షియల్‌గా ఆ సినిమా సక్సెస్ కాలేదు. రూ.26 కోట్ల బడ్జెట్‌తో వచ్చిన ‘అదుర్స్’ కేవలం రెండు కోట్ల మార్జిన్ (రూ.28 కోట్ల గ్రాస్) మాత్రమే సాధించింది. అయితే తారక్ రెండు కంటే ఎక్కువ పాత్రలు చేసిన ‘జై లవ కుశ’ మాత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. ఇందులో తారక్ డ్యూయల్ రోల్ కాకుండా త్రిపాత్రాభినయం చేయడం గమనార్హం.
‘దేవర’ హిట్ కష్టమేనా!
జూనియర్ ఎన్టీఆర్ డ్యూయల్ రోల్స్ చేసినప్పుడల్లా ఏదోక ఎదురు దెబ్బ తగులుతూనే ఉందని సినీ వర్గాలు సైతం అంచనా వేస్తున్నాయి. గత చిత్రాలు అనుభవాలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. తారక్‌ను వెంటాడుతున్న ఈ బ్యాడ్ సెంటిమెంట్ ‘దేవర’పై కూడా పనిచేస్తే భారీ దెబ్బ తప్పదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే తారక్ ఫ్యాన్స్ మాత్రం ఈసారి ‘దేవర’ కచ్చితంగా విజయం సాధిస్తుందని నమ్ముతున్నారు. ఎన్నో ఏళ్లుగా తమను వెంటాడుతున్న ఈ బ్యాడ్ సెంటిమెంట్‌కు ‘దేవర’తో తారక్ చెక్ పెడతాడని స్పష్టం చేస్తున్నారు. అటు ‘దేవర’ ట్రైలర్ కూడా అదిరిపోయిందని ఈ సినిమా పక్కాగా విజయం సాధిస్తుందని నెట్టింట పోస్టులు పెడుతున్నారు. ‘దేవర’ సినిమా సక్సెస్ కావాలని మనమూ కోరుకుందాం.
‘NTR 31’లోనూ డ్యూయల్ రోల్!
తారక్ (Jr NTR) హీరోగా ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ‘NTR 31’ వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా రూపొందనుంది. అయితే ఈ సినిమాలోనూ జూ.ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఒకటి కెరీర్‌లో ఎప్పుడు చేయని 75 ఏళ్ల వృద్ధుడి పాత్ర అని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇంకో పాత్రలో మాఫియా డాన్‌గా తారక్ కనిపిస్తారని టాక్ వినిపిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. NTR 31 చిత్రానికి ‘డ్రాగన్’ అనే ఆసక్తికరమైన టైటిల్ కూడా పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ఒకవేళ ‘దేవర’కు ఊహించని ఫలితం ఎదురైతే ‘NTR 31’ను కూడా ఆ సెంటిమెంట్ వెంటాడే ప్రమాదం ఉంది.
దేవర ట్రైలర్ ఎలా ఉందంటే?
దేవర ట్రైలర్ ప్రకాష్ రాజ్ గంభీరమైన వాయిస్ ఓవర్‌తో ప్రారంభమైంది. ‘కులం లేదు మతం లేదు భయం అసలే లేదు.. కానీ, మొదటిసారి భయం పొరలు కమ్ముకున్నాయి’ అనే డైలాగ్‌తో ట్రైలర్ మొదలైంది. ‘మనిషికి బ్రతికేంత ధైర్యం చాలు చంపేంత ధైర్యం కాదు. కాదు కూడదు అని మళ్ళీ ఆ ధైర్యాన్ని కూడగడితే.. ఆ ధైర్యాన్ని చంపే భయాన్ని అయితా’ వంటి డైలాగ్‌తో ఎన్టీఆర్ (దేవర) క్యారెక్టరైజేషన్‌ని చూపించారు. పార్లర్గా విలన్ బైరా (సైఫ్ అలీ ఖాన్) పాత్రని అతని గ్యాంగ్ చేస్తున్న దారుణాలను కూడా చూపించారు. ‘దేవర’ని చంపాలని ఆ గ్యాంగ్ ఆలోచిస్తున్న టైంలో ఇంకో ఎన్టీఆర్ (వర) పాత్రని పరిచయం చేశారు. అతను మహా పిరికివాడు అన్నట్టు హీరోయిన్ జాన్వీ కపూర్ పరిచయం చేసింది. మరోపక్క ‘దేవర’ (Devara) బ్రతికున్నాడా? చనిపోయాడా? బైరా గ్యాంగ్ వల్ల వరకి అలాగే ఆ ఊరి జనాలకి ఎలాంటి సమస్యలు తలెత్తాయి? అనే సస్పెన్స్‌ను మాత్రం దర్శకుడు కొరటాల శివ మెయింటైన్ చేస్తూ ‘దేవర’ మొదటి భాగం ట్రైలర్ ఉంది.
https://www.youtube.com/watch?v=5cx7rvMvAWo
సెప్టెంబర్ 11 , 2024
Game Changer: టెన్షన్లో మెగా ఫ్యాన్స్.. ‘గేమ్ ఛేంజర్’ ఈ ఏడాది రానట్లేనా?
'ఆర్ఆర్ఆర్' (RRR) వంటి బ్లాక్ బాస్టర్ తర్వాత రామ్‌చరణ్ (Ram Charan) నటిస్తున్న చిత్రం 'గేమ్ ఛేంజర్' (Game Changer). పొలిటికల్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్నారు. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. క్రిస్మస్ కానుకగా ఈ సినిమా రాబోతున్నట్లు ఇటీవల దిల్ రాజు ప్రకటించడంతో మెగా అభిమానులు సంబరాలు చేసుకున్నారు. కానీ, ఇప్పుడు ‘గేమ్ ఛేంజర్’కు కొత్త సమస్య మెుదలైనట్లు తెలుస్తోంది. దీని వల్ల ఈ ఏడాది సినిమా రిలీజ్ కాకపోవచ్చని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.
కారణం ఏంటంటే?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న 'గేమ్ ఛేంజర్' (Game Changer) చిత్రం ఈ ఏడాది విడుదల కాకపోవచ్చని జోరుగా ప్రచారం జరుగుతోంది. నిర్మాత దిల్ రాజు చెప్పినట్లు క్రిస్మస్కు విడుదల కాకపోవచ్చని స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. షూటింగ్ ఇంకా పూర్తి కాకపోవడమే ఇందుకు కారణమని అంటున్నారు. ఈ సినిమాకు ఇంకా 15 రోజులకు పైగా షూటింగ్ పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. పైగా కొత్త లొకేషన్స్ కోసం దర్శకుడు శంకర్ వెతుకుతున్నట్లు ఫిల్మ్ వర్గాలు చెబుతున్నాయి. కావాల్సిన లొకేషన్స్ దొరికి మిగిలిన షూటింగ్‌ను ఫినిష్ చేసే సరికి మరింత సమయం పట్టే అవకాశముంది. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్, డబ్బింగ్ కంప్లీట్ చేసేసరికి డిసెంబర్ దాటి పోవచ్చని అంచనా వేస్తున్నారు. డిసెంబర్ 25న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలంటే మూవీ యూనిట్ మరింత వేగంగా పని చేయాల్సి ఉంటుంది. అయితే డైరెక్టర్ శంకర్ ప్రస్తుత స్పీడ్ చూస్తుంటే ఈ ఏడాది చరణ్ మూవీ రావడం కష్టమేనని సినీ వర్గాలు భావిస్తున్నాయి. దీంతో మెగా ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.
2024 సమ్మర్ కానుకగా!
రామ్ చరణ్ - శంకర్ కాంబోలోని 'గేమ్ ఛేంజర్' చిత్రం డిసెంబర్ నుంచి 2025 సమ్మర్‌కి వెళ్లే ఛాన్స్ ఉందని నెట్టింట ప్రచారం జరుగుతోంది. డిసెంబర్ మిస్ అయితే సంక్రాంతికి రిలీజ్ చేసే అవకాశం ఉన్నప్పటికీ ఇప్పటికే పలు చిత్రాలు పొంగల్ బరిలో నిలిచాయి. మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. అలాగే వెంకటేష్- అనిల్ రావిపూడి చిత్రంతో పాటు అజిత్ నటిస్తున్న ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’, ‘శతమానం భవతి 2’ కూడా సంక్రాంతి రేసులో నిలిచాయి. ఈ నేపథ్యంలో వాటికి పోటీగా ‘గేమ్ ఛేంజర్’ను బరిలోకి దింపడం కరెక్ట్ కాదని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అటు ఫిబ్రవరి, మార్చి పరీక్షల కాలం కావడంతో వేసవి సెలవుల్లో ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్ కావొచ్చని సినీ పండితులు విశ్లేషిస్తున్నారు.
గేమ్ ఛేంజర్‌పై భారీ ఆశలు!
డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ‘భారతీయుడు 2’ (Indian 2) చిత్రం ఇటీవల విడుదలై ప్రేక్షకులను తీవ్రంగా నిరాశ పరిచింది. ఇది అసలు శంకర్ చిత్రంలానే లేదంటూ పెద్ద ఎత్తున నెటిజన్లు పోస్టులు పెట్టారు. అంతకుముందు శంకర్ డైరెక్షన్‌లో వచ్చిన ‘రోబో 2.0’, ‘ఐ’, ‘స్నేహితుడు’ వంటి చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద డీలా పడ్డాయి. దీంతో శంకర్ తిరిగి సక్సెస్ బాటలో పడేందుకు ‘గేమ్ ఛేంజర్’ కీలకంగా మారింది. అటు నిర్మాత దిల్‌రాజుకు కూడా గత చిత్రం పీడకలనే మిగిల్చింది. విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) హీరోగా తెరకెక్కిన ‘ఫ్యామిలీ స్టార్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమైంది. దిల్‌రాజుకు భారీగా నష్టాలను మిగిల్చిందంటూ టాలీవుడ్‌లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీంతో వాటిని ‘గేమ్ ఛేంజర్’ పూడుస్తుందని దిల్ రాజు భావిస్తున్నారట. ప్రస్తుతం దర్శకుడు, నిర్మాత ఆశలన్నీ చరణ్ మూవీ సక్సెస్‌పైనే ఆధారపడి ఉన్నాయి.
కియారా పోస్టర్ అదుర్స్!
గేమ్ ఛేంజర్ మూవీలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వాని (Kiara Advani) ఫీమేల్ లీడ్‌గా నటిస్తోంది. ఇటీవల ఈ భామ బర్త్‌డే సందర్భంగా చిత్ర బృందం ఓ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. ఈ పోస్టర్లో కియారా ఓ మల్టీ కలర్ లెహంగాలో ఎంతో అందంగా కనిపించింది. మూవీ నుంచి వచ్చిన ఫస్ట్ సింగిల్ ‘జరగండి జరగండి’ పాటలోని లుక్ ఇది. ఇక ఈ చిత్రంలో చరణ్, కియారాలతో పాటు ఎస్.జే. సూర్య, అంజలి, శ్రీకాంత్, నాజర్, నవీన్ చంద్ర, సముద్రఖని ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
ఆగస్టు 06 , 2024
HBD Rashmika: రీల్‌లోనే కాదు.. రియల్ లైఫ్‌లోనూ రష్మిక టాపే.. ఏకైక హీరోయిన్‌గా ఎన్ని రికార్డులో!
నేషనల్ క్రష్ రష్మిక.. అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు సంపాదించింది. కన్నడలో వచ్చిన ‘కిర్రాక్ పార్టీ’ (Kirik Party)తో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈ సుందరి.. ఆ తర్వాత అగ్ర హీరోల సరసన నటించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. కఠినమైన పాత్రలను కూడా అలవోకగా చేసేసి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇవాళ రష్మిక పుట్టిన రోజు సందర్భంగా ఆమె తన జీవితంలో సాధించిన ఘనతలు ఏంటో ఈ ప్రత్యేక కథనంలో పరిశీలిద్దాం. అలాగే ఆమె లేటెస్ట్ చిత్రాలు ‘పుష్ప 2’, ‘ది గర్ల్‌ఫ్రెండ్’ నుండి విడుదలైన రష్మిక పోస్టర్లపైనా ఓ లుక్కేద్దాం.
ఫోర్బ్స్ జాబితాలో అగ్రస్థానం
ఈ ఏడాది ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రకటించిన ‘ఫోర్బ్స్ ఇండియా 30 అండర్ 30’ జాబితాలోనూ రష్మిక స్థానం సంపాదించుకుంది. 30 ఏళ్ల వయసు లోపున్న 30 మంది ప్రతిభావంతుల లిస్ట్‌ను తాజాగా విడుదల చేసింది. దీంట్లో రష్మిక అగ్రస్థానంలో నిలిచింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించిన శ్రీవల్లి తనను ఎంపిక చేసిన వారికి కృతజ్ఞత చెప్పింది.
తొలి ఇండియన్‌గా గుర్తింపు
తెలుగు, తమిళ, హిందీలో వరుసగా సినిమాలు చేస్తూ ఎంతో బిజీగా ఉన్న రష్మిక.. ఇటీవల కొత్త ప్రయాణాన్ని మొదలు పెట్టింది. జపాన్‌కు చెందిన ‘ఒనిట్సుకా టైగర్ ఫ్యాషన్’ సంస్థకు ‘బ్రాండ్ అడ్వకేట్’గా ఎంపికైంది. ఆ సంస్థకు బ్రాండ్ అడ్వకేట్‌గా నియమితులైన ఫస్ట్ భారతీయురాలు తానేనని రష్మిక స్వయంగా వెల్లడించింది.
ఏకైక నటి రష్మికనే
రష్మిక తన సినీ కెరీర్‌లో ఇప్పటివరకూ ఎన్నో అవార్డులను అందుకుంది. ఈ క్రమంలోనే ఇటీవల ఓ అరుదైన ఘనతను సాధించింది. నెదర్లాండ్స్‌కు చెందిన ‘సెప్టిమిస్ అవార్డ్స్’ నామినేషన్స్‌లో రష్మిక నిలిచింది. నెదర్లాండ్స్‌కు చెందిన ఈ సంస్థ.. ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ పరిశ్రమకు సంబంధించిన కొన్ని విభాగాల్లో బెస్ట్ అవార్డ్స్ ప్రకటిస్తుంది. ఈ క్రమంలోనే బెస్ట్ ఏషియన్ యాక్ట్రెస్ నామినేషన్స్‌లో మన దేశం నుంచి రష్మిక మందన్న నిలవడం విశేషం.
తొలి సెలబ్రెటీగా రికార్డు
ఇటీవల టోక్యోలో జరిగిన ‘క్రంచీ రోల్ అనిమే’ (Crunchyroll Anime) అవార్డులకు నేషనర్ క్రష్ రష్మిక హాజరైంది. అక్కడ అభిమానులు ‘పుష్ప’ సినిమాలో శ్రీవల్లి పాత్రకు సంబంధించిన ఫొటోలు పట్టుకొని వారి అభిమానాన్ని చాటుకున్నారు. అయితే భారతదేశం నుంచి ఈ అవార్డు వేడుకకు హాజరైన తొలి సెలబ్రిటీగా రష్మిక రికార్డు సృష్టించింది. దీంతో పలువురు ప్రముఖులు కూడా రష్మికపై ప్రశంసలు కురిపించారు.
https://twitter.com/i/status/1763610574485647680
సోషల్‌మీడియాలోనూ రికార్డు
యంగ్ బ్యూటీ రష్మిక మందన్న ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే సోషల్ మీడియాలోనూ చాలా చురుగ్గా ఉంటుంది. దీంతో సోషల్ మీడియాలో ఆమెకు గణనీయమైన సంఖ్యలో ఫాలోవర్లు ఉన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు 43 మిలియన్ల మందితో అత్యధిక ఫాలోవర్లు కలిగిన హీరోయిన్స్‌లో ఆమె ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ముఖ్యంగా టాలీవుడ్‌లో ఈ మార్క్‌ను చేరుకున్న తొలి హీరోయిన్‌గానూ క్రేజ్ దక్కించుకుంది. ఆతర్వాత సమంత 33 మిలియన్లు, పూజా హెగ్డె 26.9 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు.
శ్రీవల్లి.. మెస్మరైజ్ లుక్
అల్లు అర్జున్ హీరోగా డైరెక్టర్ సుకుమార్ రూపొందిస్తున్న చిత్రం 'పుష్ప 2' (Pushpa 2). ఇందులో రష్మిక మందన్న హీరోయిన్‌గా చేస్తోంది. కాగా, ఇవాళ రష్మిక బర్త్‌డే సందర్భంగా చిత్ర యూనిట్ అదిరిపోయే పోస్టర్‌ను లాంచ్ చేసింది. శ్రీవల్లి పాత్రకు సంబంధించిన అద్భుతమైన పోస్టర్‌ను రిలీజ్ చేసింది. ఇందులో రష్మిక చీరలో దట్టంగా వేసిన నగలతో చాలా అందంగా కనిపించింది.
కాలేజీ స్టూడెంట్‌గా అదుర్స్!
రష్మిక నటిస్తున్న మరో లేటెస్ట్ మూవీ 'ది గర్ల్ ఫ్రెండ్' (The Girlfriend). నటుడు రాహుల్ రవీంద్రన్ (Rahul Ravindran) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించి రష్మిక ఫస్ట్ పోస్టర్ కూడా ఇవాలే విడుదలై నెట్టింట వైరల్ అవుతోంది. ఇందులో రష్మిక పాత్రకు సంబంధించిన రెండు పోస్టర్లను దర్శకుడు రాహుల్ రవీంద్రన్ తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో పోస్ట్ చేశాడు. ఇందులో రష్మిక చాలా క్లాస్ లుక్‌లో కాలేజీ స్టూడెంట్‌గా కనిపించింది. క్యూట్ లుక్స్‌తో ఆకట్టుకుంటోంది.
https://twitter.com/23_rahulr/status/1776105100903432572
ఏప్రిల్ 05 , 2024
NABHA NATESH: వైట్ స్కర్ట్‌లో ఇస్మార్ట్ బ్యూటీ ఎద అందాల విందు
ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ఒక్కసారిగా ఇస్మార్ట్ బ్యూటీగా కుర్రాళ్ల గుండెల్లోకి దూసుకెళ్లిన అందాల తార నభా నటేశ్. కన్నడ సినిమాతో వెండతెరపైకి అడుగుపెట్టినా తన క్యూట్ లుక్స్‌తో టాలివుడ్‌లో తనకంటూ మంచి క్రేజ్ తెచ్చుకుంది.
సినిమాల్లో హాట్ అండ్ క్యూట్ లుక్స్‌తో కట్టిపడేసే ఈ భామ సోషల్ మీడియాలోనూ తన సొగసులతో సెగలు పుట్టిస్తోంది.
నిత్యం కొత్త కొత్త ఫోటో షూట్‌లతో కుర్రాళ్ల హృదయాలను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. తాజాగా వైట్ స్కర్ట్‌లో ఈ భామ పోస్ట్ చేసిన ఫోటోలు చూసి ఆమె అభిమానులు మతులు పోగొట్టుకుంటున్నారు.
నభా నటేశ్ తొలుత ‘వజ్రకాయ’ అనే కన్నడ సినిమాతో 2015లో వెండితెరపైకి అడుగుపెట్టింది. అందులో పటాకా పార్వతిగా ప్రేక్షకుల మనసులు దోచుకుంది.
ఏడాది గ్యాప్ తర్వాత 2017లో మళ్లీ లీ, సాహెబా అనే రెండు కన్నడ సినిమాల్లో మెరిసింది.
2018లో తన తొలి తెలుగు సినిమా ‘నన్ను దోచుకుందువటే’ రిలీజ్ అయింది. సినిమాల పిచ్చి ఉన్న మేఘన క్యారెక్టర్‌లో నభా అదరగొట్టింది.
2018లోనే రవిబాబు నటించిన కామెడీ సినిమా ‘అదుగో’లోనూ నటించి మెప్పించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేదు.
పూరీ కమ్‌బ్యాక్ మూవీ ఇష్మార్ట్ శంకర్‌తో నభా నటేశ్ దశ తిరిగింది. అందులో వరంగల్ పిల్ల చాందినీగా నభాకు జనం ఫిదా అయ్యారని చెప్పొచ్చు.
2020లో డిస్కో రాజా, సోలో బ్రతుకే సో బెటర్, 2021లో అల్లుడు అదుర్స్, మేస్ట్రో సినిమాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం అంతగా అవకాశాల్లేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం అలరిస్తోంది.
మార్చి 28 , 2023
Best Comedy Films in Telugu: ఆన్ లైన్‌లో ఎక్కువ మంది వెతుకుతున్న కామెడీ సినిమాలు ఏవో తెలుసా?
నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వకపోవడం ఒక రోగం అన్నాడో మహా కవి. తెలుగులో హస్య చిత్రాలు కోకొల్లలు. కేవలం కామెడీనే ప్రధాన కథాంశంతో తెరకెక్కిన చిత్రాలు తెలుగు నాట ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్వించాయి. నవ్విస్తున్నాయి. ఈ ఓటీటీ కాలంలో థియేటర్లకు వెళ్లకుండా ఇంటి వద్దనే చూసేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. బెస్ట్ కామెడీ సినిమాల కోసం ఆన్‌లైన్ లో సెర్చ్ చేస్తున్నారు. ఈక్రమంలో తెలుగు మంచి కామెడీ సినిమాలు ఏంటో ఓసారి చూద్దాం..
[toc]
Allari Naresh comedy movies
సుడిగాడు
అల్లరి నరేష్ నటించిన కామెడీ సినిమాల్లో ఎక్కువమంది ఆన్‌లైన్‌లో చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్న సినిమా ఇది. ఈ సినిమా మంచి వినోదాన్ని అందిస్తుంది. ఇక కథ విషయానికొస్తే..శివ చిన్నప్పుడే సిక్స్ ప్యాక్‌తో పుడతాడు. పుట్టినప్పటి నుంచి తిక్కల్ రెడ్డి మనుషులు శివ కోసం వెతుకుతుంటారు. ఈ క్రమంలో డాన్ D మనుషులు శివపై దాడి చేస్తారు. అసలు డాన్ డి ఎవరు? శివకు తిక్కల్ రెడ్డికి మధ్య వైరం ఏంటి? వారందరితో శివ ఎలా పోరాడాడు? అన్నది కథ.
ఓటీటీ: జీ5
అల్లరి
టాలీవుడ్ లో విభిన్న కామెడీ జోనర్ తో వచ్చిన మూవీగా అల్లరిని చెప్పవచ్చు. ఈ మూవీతో హీరోగా నరేష్ పరిచయం అయ్యాడు. ఈ మూవీని రఘు బాబు డైరెక్ట్ చేయగా... ఫ్లైయ్యింగ్ ప్రాగ్స్ బ్యానర్ పై నిర్మించారు. తొలి సినిమాలోనే నరేష్ కు నటనపరంగా మంచి మార్కులు పడ్డాయి. ఈ మూవీ అనంతరం నరేష్ ను కాస్త అల్లరి నరేష్ గా పిలవడం ప్రారంభించారు. అల్లరి నరేష్ ఫుల్ టైం కామెడీ స్టార్ గా మారిపోయాడు. కామెడీ మూవీల్లో ఈ చిత్రం ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. అల్లరిని నరేషే హీరోగా తమిళంలో కురుంబుగా రీమేక్ చేశారు.
ఓటీటీ: యూట్యూబ్
ఆ ఒక్కటీ అడక్కు
ఈ సినిమా చూస్తున్నంతా సేపు పొట్టచెక్కలయ్యేలా ప్రేక్షకులు నవ్వుతారు. ఇక కథ విషయానికొస్తే..గణపతి (అల్లరి నరేష్) పెళ్లి సంబంధాలు చూడటంలో హాఫ్ సెంచరీ కంప్లీట్ చేస్తాడు. వయసు ఎక్కువ కావడంతో అతడికి ఎవరూ పిల్లను ఇవ్వరు. ఓ రోజు మ్యాట్రిమోనీ సైట్‌లో సిద్ధి (ఫరియా అబ్దుల్లా)ని చూసి ప్రేమలో పడతాడు. అయితే ఆమె అబ్బాయిలను మోసం చేస్తోందంటూ మీడియాలో వార్తలు వస్తాయి. అందులో నిజమెంతా? వారిద్దరు ఒక్కటయ్యారా? లేదా? అన్నది కథ.
ఓటీటీ: ప్రైమ్ వీడియో
లడ్డూ బాబు
ఈ చిత్రంలో బరువు పెరిగిన స్థూలకాయుడిగా అల్లరి నరేష్ అలరించాడు. ఈ చిత్రం కూడా ప్రేక్షకులను అలరిస్తుంది. అతిగా బరువు పెరిగిపోయిన హీరోకి సమాజం నుంచి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి. వాటిని ఎలా ఎదుర్కొన్నాడు? అన్నది కథ.
ఓటీటీ: యూట్యూబ్
సిల్లీ ఫెలోస్
ఎమ్మెల్యే (జయప్రకాష్‌రెడ్డి) ఓ రోజు మూకుమ్మడి వివాహాలు ఏర్పాటు చేస్తాడు. ఓ జంట తగ్గడంతో ఎమ్మెల్యే అనుచరుడైన వీరబాబు (అల్లరి నరేష్) సూరిబాబు (సునీల్)ను ఉత్తుత్తి పెళ్లి చేసుకోమని చెబుతాడు. కానీ కంగారులో సూరిబాబు పుష్ప (నందిని రాయ్)కు నిజంగానే తాళికడతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది కథ.
ఓటీటీ: ప్రైమ్ వీడియో
మేడ మీద అబ్బాయి
శ్రీను( అల్లరి నరేష్) ఫిల్మ్ మేకర్ కావాలని ఆడిషన్స్ కోసం హైదరాబాద్‌కు రైలు ఎక్కుతాడు. దారిలో సింధుని కలుసుకుని ఆమెకు తెలియకుండా సెల్ఫీ దిగడంతో సమస్యల్లో పడతాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది కథ.
ఓటీటీ: సన్ నెక్స్ట్
జేమ్స్ బాండ్
నాని ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. అతను తనకు తెలియకుండా ఒక లేడీ డాన్‌ను వివాహం చేసుకుంటాడు. ఆమె గతం, నేర కార్యకలాపాల గురించి తెలిసిన తర్వాత నాని ఏం చేశాడు అన్నది కథ.
ఓటీటీ: ప్రైమ్ వీడియో
బ్రదర్ ఆఫ్ బొమ్మాళి
రాంకీ (అల్లరి నరేష్), లక్కీ(కార్తీక) ఇద్దరు కవలలు. ఓ రోజు హీరోయిన్‌ను చూసి రాంకీ ప్రేమిస్తాడు. అయితే సోదరి పెళ్లి జరిగితే గాని నీ పెళ్లి చేయనని తండ్రి చెబుతాడు. దీంతో లక్కీకి పెళ్లి చేసేందుకు హీరో ఏం చేశాడు? చెల్లెలకు ఇష్టమైన వ్యక్తితోనే వివాహం చేశాడా లేదా? అన్నది కథ.
ఓటీటీ: జీ5
యముడికి మొగుడు
యముడికి మొగుడు 2012లో ఇ. సత్తి బాబు దర్శకత్వం వహించిన భారతీయ తెలుగు-భాషా ఫాంటసీ కామెడీ చిత్రం, ఫ్రెండ్లీ మూవీస్ బ్యానర్‌పై చంటి అడ్డాల నిర్మించారు మరియు అల్లరి నరేష్ మరియు రిచా పనై ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రంలో రమ్య కృష్ణ మరియు నరేష్ కూడా కీలక పాత్రల్లో నటించారు. . ఈ చిత్రానికి సౌండ్‌ట్రాక్‌ను సంగీత దర్శకుడు కోటి స్వరపరిచారు మరియు సినిమాటోగ్రఫీని రవీంద్ర బాబు నిర్వహించారు. ఈ చిత్రం 27 డిసెంబర్ 2012న థియేటర్లలో విడుదలైంది.
OTT: అమెజాన్ ప్రైమ్
సీమ టపాకాయ్
శివ చిన్నప్పుడే సిక్స్ ప్యాక్‌తో పుడతాడు. పుట్టినప్పటి నుంచి తిక్కల్ రెడ్డి మనుషులు శివ కోసం వెతుకుతుంటారు. ఈ క్రమంలో డాన్ D మనుషులు శివపై దాడి చేస్తారు. అసలు డాన్ డి ఎవరు? శివకు తిక్కల్ రెడ్డికి మధ్య వైరం ఏంటి? వారందరితో శివ ఎలా పోరాడాడు? అన్నది కథ.
ఓటీటీ: హాట్ స్టార్, యుట్యూబ్
కత్తి కాంతారావు
ఈ చిత్రంలో అల్లరి నరేష్ కత్తి కాంతరావుగా హాస్యం పండించి ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించాడు. ఈ చిత్రం అల్లరి నరేష్‌కు మంచి గుర్తింపు తెచ్చింది. ఇక కథలోకి వెళ్తే.. కత్తి అనే వ్యక్తి తన కుటుంబం కోరికలను నెరవేర్చి తన తండ్రికి కట్టుబడి ఉండే కానిస్టేబుల్. అతను ఒక అమ్మాయితో ప్రేమలో పడతాడు కానీ తన నలుగురు అక్కచెల్లెల్ల పట్ల ఉన్న బాధ్యతల కారణంగా ఆ విషయం బయటకు చెప్పడు. మరి తన ప్రేమ వ్యవహారం ఎలా బయటపడింది? తన అక్క చెల్లెల్ల సమస్యలను ఎలా చక్కదిద్దాడు అన్నది కథ.
ఓటీటీ: సన్ నెక్ట్స్
బెండు అప్పారావు R.M.P.
ఈ సినిమాలో మధ్యతరగతి కుటుంబంలో జన్మించి డబ్బు సంపాదించేందుకు పడే కష్టాలను హాస్యంతో మిలితంగా చూపించాడు. ఇక కథలో..బెండు అప్పరావు జబ్బుల పేరిట రోగులను మోసం చేస్తూ డబ్బు సంపాదిస్తుంటాడు. ఈ క్రమంలో చనిపోతున్న ఓ వ్యక్తి తన కుటుంబానికి ఇవ్యాల్సిందిగా పెద్ద మొత్తంలో డబ్బు ఇస్తాడు. కానీ బెండు దానిని ఇతర మార్గాల కోసం ఉపయోగిస్తాడు.
ఓటీటీ: జీ5
బ్లేడ్ బాబ్జీ
ఈ చిత్రం చూసినంత సేపూ ఎక్కడా బోర్ కొట్టదు. ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయవచ్చు. తనతో పాటు మురికి వాడల్లో నివసిస్తున్న వారి ఇళ్లను కాపాడేందుకు బ్లేడ్ బాబ్జీ బ్యాంకును దోచుకుంటాడు. అలా దోచుకున్న డబ్బును దాచిపెట్టిన స్థలంలో పోలీసు స్టేషన్ నిర్మిచడంతో కథ మలుపు తిరుగుతుంది.
ఓటీటీ: యూట్యూబ్
బొమ్మన బ్రదర్స్ చందనా సిస్టర్స్
ఈ సినిమాలో అల్లరి నరేష్- కృష్ణభగవాన్ కామెడి ట్రాక్ నవ్వులు పూయిస్తుంది. దొంగలైన ఇద్దరు సోదరులు.. డబ్బున్న అక్కా చెల్లెళ్లను ప్రేమిస్తారు. మాయమాటలు చెప్పి వారికి దగ్గరవుతారు. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ అబద్దాల వల్ల వారు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? అన్నది కథ.
ఓటీటీ: సన్‌నెక్స్ట్
సీమా శాస్త్రి
ఫ్యాక్షనిస్ట్ వేశంలో నటించేందుకు అల్లరి నరేష్ పడే బాధలు కడుపుబ్బ నవిస్తాయి. ఇక కథలో..సుబ్రహ్మణ్య శాస్త్రి అనే యువకుడు ఫ్యాక్షనిస్టు కూతురు సురేఖతో ప్రేమలో పడుతాడు. ఆమె ప్రేమను దక్కించుకునేందుకు ఫ్యాక్షనిస్ట్ వేషంలోకి మారిపోతాడు.
ఓటీటీ: ప్రైమ్ వీడియో
నవీన్ పొలిశెట్టి కామెడీ సినిమాలు
నవీన్ పొలిశెట్టి కామెడీ టైమింగ్‌తో స్టార్ డం సంపాదించాడు. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయా, జాతిరత్నాలు, మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి హిట్లతో కెరీర్ తారా పథంలో దూసుకెళ్తోంది. ఈక్రమంలో అతను నటించిన సూపర్ హిట్ కామెడీ చిత్రాలను ఓసారి చూద్దాం.
మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి
మాస్టర్ చెఫ్ అయిన అన్విత రవళి తల్లి అనారోగ్యంతో చనిపోతుంది. ఈక్రమంలో ఓ కీలక నిర్ణయం తీసుకుంటుంది. పెళ్లిచేసుకోవద్దని నిశ్చయించుకుంటుంది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అయిన సిద్దు పొలిశెట్టిస్టాండప్ కమెడియన్‌గా అలరిస్తుంటాడు. అన్విత అతని కామెడీ ఇష్టపడుతుంటుంది. ఈక్రమంలో సిద్దూ ఆమెతో ప్రేమలో పడతాడు. అన్విత తన నుంచి ఏమి ఆశిస్తుందో చెప్పినప్పుడు సిద్దూ షాక్‌కు గురవుతాడు. ఇంతకు అన్విత సిద్ధుని ఏం అడిగింది? అందుకు సిద్ధు అంగీకరించాడా? అన్నది మిగతా కథ.
ఓటీటీ: నెట్‌ప్లిక్స్
జాతి రత్నాలు
ఆన్‌లైన్‌లో ఎక్కువ మంది వెతుకుతున్న కామెడీ చిత్రమిది. ఈ సినిమా నాన్‌స్టాప్ కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తుంది. ఈ సినిమా కథ విషయానికొస్తే..మంచి ఉద్యోగాల కోసం తమ ఊరి నుంచి హైదరాబాద్ వచ్చిన ముగ్గురు యువకులు ఓ అపార్ట్‌మెంటులో దిగుతారు. అక్కడ పిలువని పార్టీకి వెళ్లి మర్డర్ అటెంప్ట్ కేసులో ఇరుక్కుంటారు. ఆ తర్వాత కేసు నుంచి ఎలా బయటపడ్డారనేది కథ.
ఓటీటీ; అమెజాన్ ప్రైమ్
ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ
ఈ చిత్రం నవీన్ పొలిశెట్టిలోని మంచి నటున్ని పరిచయం చేసింది. ఈ సినిమా కామెడీ ఎంటర్‌టైనర్‌గా సాగినా.. ట్విస్ట్ మాత్రం బాగుంటుంది. ఏజెంట్ సాయి శ్రీనివాస్ అత్రేయా నెల్లూరులో ఓ ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెన్సీని నడుపుతుంటాడు. చిన్న చిన్న కేసులను విచారిస్తూ సమస్యలు ఎదుర్కొంటుంటాడు. రైల్వే ట్రాక్ వద్ద మృతదేహాన్ని గుర్తించినప్పుడు అతని జీవితం తలకిందులవుతుంది.
ఓటీటీ: ఆహా
సిద్ధు జొన్నలగడ్డ కామెడీ సినిమాలు
సిద్ధు జొన్నలగడ్డ ప్రస్తుతం టాలీవుడ్‌లో స్టార్‌బాయ్‌గా కొనసాగుతున్నాడు. టిల్లు స్కేర్ హిట్ తర్వాత అతను నటించిన ఇతర కామెడీ చిత్రాల కోసం ఆన్‌లైన్ వెతుకుతున్నారు. ఈక్రమంలో సిద్ధు జొన్నలగడ్డ నటించిన కామెడీ చిత్రాలపై ఓ లుక్ వేద్దాం.
టిల్లు స్క్వేర్
రాధిక జ్ఞాపకాల నుంచి బయటపడుతున్న టిల్లు జీవితంలోకి ఆమె అప్‌డేటెడ్ వెర్షన్ లిల్లీ జోసెఫ్ వస్తుంది. బర్త్‌డే స్పెషల్‌గా ఓ కోరిక కోరుతుంది. ఆ తర్వాత టిల్లు లైఫ్ ఎలాంటి టర్న్ తీసుకుంది? మాఫియా డాన్ వీరి మధ్యకు ఎందుకు వచ్చాడు? టిల్లు లైఫ్‌లోకి రాధికా మళ్లీ వచ్చిందా? లేదా? అన్నది కథ.
ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్
డీజే టిల్లు
డీజే టిల్లు మంచి మాటకారి. మ్యూజిక్ డైరెక్టర్ కావాలనేది అతడి కల. సింగర్ రాధిక (నేహాశెట్టి)ని చూడగానే ప్రేమలో పడుతాడు. ఇంతలో రాధిక ఓ హత్య కేసులో ఇరుక్కుంటుంది. ఆమెతో స్నేహం చేసిన పాపానికి అందులో టిల్లు కూడా ఇరుక్కుంటాడు. ఆ హత్య కేసు నుంచి బయటపడేందుకు టిల్లు ఏం చేశాడు? ఇంతకు రాధిక ఎవరు అనేది మిగతా కథ.
ఓటీటీ: ఆహా
రాజ్ తరుణ్
పక్కింటి అబ్బాయిలా కనిపించే రాజ్ తరుణ్ తన సహజమైన నటనతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకుల మోముల్లో నవ్వుల పువ్వులు పూయించాడు. రాజ్ తరుణ్ నటించిన బెస్ట్ కామెడీ సినిమాలు ఇప్పుడు చూద్దాం.
ఉయ్యాల జంపాలా
బావామరదళ్లైన సూరి (రాజ్ తరుణ్) - ఉమాదేవి(అవిక గోర్) ప్రతీ చిన్నదానికి గొడవలు పడుతుంటారు. అయితే ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టమని ఆలస్యంగా తెలుసుకుంటారు. అప్పటికే ఉమాదేవి పెళ్లి ఇంకొకరితో ఫిక్స్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది కథ.
సినిమా చూపిస్త మావ
సాదాసీదాగా తిరిగే కత్తి అనే యువకుడు పరిణీతను ప్రేమిస్తాడు. అయితే, పరిణీత తండ్రి వీరి పెళ్లికి ఒప్పుకోడు. ఆమెతో పెళ్లి చేసేందుకు కత్తికి కొన్ని షరతులు విధిస్తాడు
ఓటీటీ: హాట్ స్టార్
విశ్వక్ సేన్ కామెడీ సినిమాలు
ఇండస్ట్రిలో మాస్‌కా దాస్‌గా గుర్తింపు పొందిన విశ్వక్ సేన్ తొలినాళ్లలో కామెడీ సినిమాలతో ఆకట్టుకున్నాడు. మంచి కామెడీ టైమింగ్ ఉన్న విశ్వక్.. మంటి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.
ఈనగరానికి ఏమైంది?
నలుగురు యువకులు చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. అనివార్య కారణాలతో వారు విడిపోతారు. వారిలో ఒకరి పెళ్లి ఫిక్స్ కావడంతో అందరూ ఒక్కటవుతారు. అనుకోని పరిస్థితుల్లో వారంతా గోవాకు వెళతారు? అక్కడ వారు ఏం చేశారు? గోవా ట్రిప్ వారిలో తీసుకొచ్చిన మార్పు ఏంటి? అన్నది కథ.
ఓటీటీ: అమెజాన్ ప్రైమ్
అశోకవనంలో అర్జున కళ్యాణం
మాధవి(రుక్సార్ ధిల్లాన్)తో నిశ్చితార్థం కోసం అర్జున్ కుమార్(విశ్వక్ సేన్) వారింటికి వెళ్తాడు. ఇంతలో కరోనా లాక్ డౌన్ వల్ల అక్కడే ఉండాల్సి వస్తుంది. ఈ క్రమంలో అర్జున్‌కు ఊహించని ఎదురు దెబ్బ తగులుతుంది. అందులోంచి బయటపడే క్రమంలో మాధవి సోదరి వసుధ(రితికా నాయక్) అర్జున్‌తో ప్రేమలో పడుతుంది. ఇంతకు అర్జున్‌కు ఎదురైన ఆ అనుభవం ఏమటి? మాధవి సోదరి వసుధ ప్రేమను అర్జున్ ఒప్పుకున్నాడా? అన్నది మిగతా కథ.
ఓటీటీ: ఆహా
సునీల్ కామెడీ సినిమాలు
సునీల్ ప్రస్తుతం సౌత్ ఇండియాలో మంచి నటుడిగా గుర్తింపు పొందాడు. తన విలక్షణమైన నటనతో తారా పథానికి ఎదిగాడు. సునిల్ నువ్వేకావాలి చిత్రం ద్వారా హస్య నటుడిగా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. ఆ చిత్రం సూపర్ హిట్ కావడంతో ఆయనకు అవకాశాలు వెల్లువెత్తాయి. సుమారు 200కి పైచిలుకు చిత్రాల్లో నటించాడు. అందులో బెస్ట్ కామెడీ చిత్రాలను ఓసారి చూద్దాం.
మర్యాద రామన్న
ఈ చిత్రం ద్వారా సునిల్ మంచి క్రేజ్ సంపాదించాడు. ఈ సినిమా తర్వాత హీరోగా చాలా సినిమాలు చేశాడు.ఈ సినిమా కథ విషయానికొస్తే.. రాము తనకున్న భూమిని అమ్మెందుకు తన స్వగ్రామానికి వెళ్తాడు. అయితే అనుకోకుండా తన తండ్రి శత్రువుల ఇంటికి పోతాడు. అక్కడ వాళ్లు తనని చంపాలనుకుంటున్నారని తెలిసి వారింట్లోనే ఉంటూ ఓ యువతితో ప్రేమలో పడుతాడు. ఆ ఇంట్లో నుంచి బయటపడేందుకు అతని ఎలాంటి పోరాటం చేశాడు. ఇంతకు తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడా? లేదా? అన్నది మిగతా కథ.
ఓటీటీ: ప్రైమ్, హాట్ స్టార్
పూలరంగడు
ఈ చిత్రంలో ఇద్దరు భూస్వాముల మధ్య నలుగుతున్న భూమిని సునిల్ కొనుగోలు చేస్తాడు. తాను మోసపోయినట్లు తెలుసుకుంటాడు. ఈక్రమంలో అతను ఓ భూస్వామి కూతురుతో ప్రేమలో పడుతాడు. అయితే ఆ భూమిని సోంతం చేసుకునేందుకు హీరో ఏం చేశాడు? చివరికి తన ప్రేమను ఎలా దక్కించుకున్నాడు అన్నది మిగతా కథ
ఓటీటీ: ప్రైమ్ వీడియో
కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం అప్పలరాజు
అప్పల్రాజు (సునిల్) స్టార్ డైరెక్టర్ అవ్వాలన్న లక్ష్యంతో అనేక సవాళ్లను ఎదుర్కొని ఓ సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్తాడు. సినిమా స్టార్లు బాబు, కనిష్కను హీరో హీరోయిన్లుగా పెట్టుకుంటాడు. అయితే లవ్‌లో ఉన్న బాబు, కనిష్క ఇద్దరు బ్రేకప్ చెప్పుకొని విడిపోతారు. దీంతో సినిమా మధ్యలోనే ఆగిపోతుంది. అప్పుడు అప్పల్రాజు ఏం చేశాడు? సినిమాను ఎలా పూర్తి చేశాడు? అన్నది కథ.
ఓటీటీ: ప్రైమ్ వీడియో
అందాల రాముడు
ఈ చిత్రంలో సునీల్ కడుపుబ్బ నవ్విస్తాడు. కథ విషయానికొస్తే.. రాముడు( తన మరదలైన రాధను వివాహం చేసుకోవడానికి 12 సంవత్సరాల తర్వాత ఇంటికి తిరిగి వస్తాడు, కానీ రఘుతో ఆమె ప్రేమలో ఉందని తెలుసుకుని నిరాశ చెందుతాడు. అయితే, రాముడు తమ్ముడు రాధను తన అన్నతో కలిపేందుకు ప్లాన్ చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగతా కథ.
ఓటీటీ: యూట్యూబ్
జై చిరంజీవ!
ఈ సినిమాలో సునిల్ కనిపించేది కొద్దిసేపే అయినా... మంచి కామెడీ అందిస్తాడు. ఇక సినిమా కథలో సత్యనారాయణ(చిరంజీవి) తన కుటుంబంతో కలిసి గ్రామంలో నివసిస్తుంటాడు. అతడికి మేనకోడలు లావణ్య అంటే ప్రాణం. గన్ డీలర్ పసుపతి కారణంగా లావణ్య చనిపోతుంది. అతడిపై పగ తీర్చుకునేందుకు సత్యనారాయణ అమెరికాకు వెళ్తాడు.
ఓటీటీ: యూట్యూబ్
సొంతం
ఈ చిత్రంలో సునీల్‌తో కామెడీ ట్రాక్ సూపర్బ్‌గా ఉంటుంది. ఇప్పటికీ.. సునిల్ కామెడీ వీడియోలు యూట్యూబ్‌లో అలరిస్తుంటాయి. ఇక సినిమా కథ విషయానికొస్తే.. బాల్య స్నేహితుడైన వంశీని(ఆర్యన్ రాజేష్) నందు ప్రేమిస్తుంటుంది. అయితే ఆమె తన ఫీలింగ్స్‌ను వంశీతో పంచుకోదు. అయితే ఆమె పట్ల తన భావాలను వంశీ తెలుసుకునే సమయానికి నందుకి ఇంకొకరితో నిశ్చితార్థం జరుగుతుంది.
ఓటీటీ: యూట్యూబ్
చిరునవ్వుతో
ఈ చిత్రంలో సునిల్- వేణు మధ్య వచ్చే కామెడీ సీన్లు కడుపుబ్బా నవ్విస్తాయి. ఈ సినిమా కథలో.. పెళ్లికి ముందు అరుణ, వేణుని విడిచిపెట్టిన తర్వాత, అతను నగరానికి వెళ్లి ఆమెను మరచిపోవడానికి ప్రయత్నిస్తాడు. తరువాత, అక్కడ సంధ్య అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. కానీ అప్పటికే ఆమెకు ప్రతాప్‌తో నిశ్చితార్థం జరిగిందని తెలుస్తుంది.
ఓటీటీ: ఆహా
నువ్వే కావాలి
ఈ సినిమాలోనూ సునిల్ కామెడీ అదిరిపోతుంది. సునిల్ కామెడీ పంచ్‌లు అలరిస్తాయి. ఇక ఈ సినిమా కథలో.. తరుణ్, మధు చిన్నప్పటి నుంచి స్నేహితులు. అయితే వారు పెద్దయ్యాక ఒకరిపై ఒకరికి ప్రేమ ఉన్న బయటకు చెప్పుకోరు. మధుకు మరొకరితో పెళ్లి నిశ్చయమైనప్పుడు పరిస్థితులు మారిపోతాయి. 2000 ఏడాదిలో ఈ చిత్రం సూపర్ హిట్ సాధించింది. తరుణ్ కేరీర్‌కు ఈ చిత్రం కీలక మలుపునిచ్చింది.
ఓటీటీ: ఈటీవీ విన్
తెలుగులో ఇతర బెస్ట్ కామెడీ చిత్రాలు
లేడీస్ టైలర్
సమాజంలో సామాన్య పాత్రలకు హీరో నెటివెటీని జోడించి తొలిసారి కామెడీని పండించింది దర్శకుడు వంశీ. తనకే సాధ్యమైన ప్రత్యేక హస్య కథాంశంతో ఈ చిత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాడు. టైలర్ గా సుందరం పాత్రలో రాజేంద్ర ప్రసాద్ జీవించాడు. తాను ధనవంతుకు కావడం కోసం వీపు మీద పుట్టు మచ్చ ఉన్న అమ్యాయిని పెళ్లి చేసుకునేందుకు అతను పడే తపన.. నవ్వులు పూయిస్తుంది. ఇదే సినిమాలో స్టోరీ లైన్ అయినా అందుకు అనుగుణంగా వచ్చే క్యారెక్టర్లు కామెడీని పండిస్తాయి. ఈ చిత్రంలో రాళ్లపల్లి, మల్లిఖార్జునరావు, అర్చన, తనికెళ్ల భరణి ప్రధాన పాత్రల్లో నటించారు.
ఓటీటీ: యూట్యూబ్
చంటబ్బాయి
జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన చంటబ్బాయి.. తెలుగులో వచ్చిన ఫస్ట్ డిటెక్టివ్ కామెడీ జోనర్ గా చెప్పవచ్చు. ఇది ప్రముఖ రచయిత మల్లాది వెంకట కృష్ణ మూర్తి రచించిన చంటబ్బాయి నవల ఆధారంగా చిత్రీకరించారు. అప్పటి వరకు యాక్షన్ చిత్రాల్లో నటించిన మెగాస్టార్ చిరంజీవి ఒక్కసారిగా కామెడీ పాత్రలో ఒదిగిపోయారు. చిరంజీవిలోని కామెడీ టైమింగ్ ను ప్రేక్షకులకు పరిచయం చేసింది ఈ సినిమా. డిటెక్టివ్ పాత్రలో మెగాస్టార్ కడుపుబ్బ నవ్వించారు. ఈ సినిమాలో సుహాసిని, జగ్గయ్య, ముచ్చెర్ల అరుణ, సుత్తివేలు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు వాణిజ్యపరంగా విజయవంతమైంది.
ఓటీటీ: సన్ నెక్ట్స్
అహ! నా పెళ్లంట
తెలుగులో మరుపురాని హాస్య చిత్రాల్లో అహ! నా పెళ్లంట మూవీ అగ్రభాగాన నిలుస్తుంది. జంధ్యాల డైరెక్ట్ చేసిన చిత్రాల్లో ఈ సినిమా ఒక కలకితురాయి. ప్రముఖ రచయిత ఆది విష్ణు గారు రాసిన సత్యంగారి ఇల్లు నవల ఆధారంగా జంధ్యాల తెరకెక్కించాడు. ప్రతి పాత్రను హాస్య ప్రధానంగా చిత్రీకరించిన తీరు అద్భుతంగా ఉంటుంది. పిసినారి పాత్రలో కోటా శ్రీనివాస్ రావు, అరగుండు క్యారెక్టర్ లో బ్రహ్మానందం మెప్పించారు. రాజేంద్ర ప్రసాద్, రజిని తమ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. రాజేంద్ర ప్రసాద్ తనదైన కామెడీ టైమింగ్ తో ఆకట్టుకున్నాడు. ప్రేక్షకుల హృదయాలకు దగ్గరైన ఈ చిత్రం కమర్షియల్ గాను సక్సెస్ అయింది. రూ.16లక్షల బడ్జెట్ తో నిర్మితమైన ఈ మూవీ ఆ కాలంలో ఏకంగా రూ.5కోట్లు కొల్లగొట్టింది. అహ! నా పెళ్లంట మూవీ... హస్యనటుడిగా బ్రహ్మనందానికి మంచి బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత బ్రహ్మానందం దాదాపు ప్రతి మూవీలో హాస్య పాత్రల్లో కనిపించాడు.
ఓటీటీ- యూట్యూబ్
జంబలకిడి పంబ
తెలుగులో ఫస్ట్ వచ్చిన ఫాంటసీ కామెడీ చిత్రం జంబలకిడి పంబ. మగవాళ్లు.. ఆడవాళ్లుగా, ఆడవాళ్లు మగవాళ్లుగా, చిన్న పిల్లలు పెద్దవాళ్లుగా మారితే ఎలా ఉంటుందనే ఊహను డైరెక్టర్ ఈవీవీ సత్యనారాయణ చక్కగా చిత్రీకరించాడు. సినిమా చూస్తున్నంత సేపూ చిత్రంలోని ప్రతి పాత్ర తనదైన కామెడీతో ప్రేక్షకులను పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తుంది. ఈ కథా వస్తువే సగటు ప్రేక్షకుడ్ని మళ్లీ మళ్లీ ఈ సినిమాను చూసేందుకు థియేటర్ల బాట పట్టించింది. ఈ మూవీలో నరేష్, ఆమని, కోటా శ్రీనివాస్ రావు, బ్రహ్మానందం, అలీ, బాబు మోహన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం అప్పటి వరకు వచ్చిన కామెడీ చిత్రాల నిర్వచనాన్ని సమూలంగా మార్చేసింది. కామెడీ కథాంశంతో సైతం బాక్సాఫీస్ కొల్లగొట్టవచ్చని నిరూపించింది. ఆ తర్వాత వచ్చిన ఎన్నో చిత్రాల సక్సెస్ కు రాచ బాట వేసింది.
ఓటీటీ- యూట్యూబ్
అప్పుల అప్పారావు
తెలుగులో అత్యుత్తమ హాస్య చిత్రాలలో ఒకటిగా అప్పుల అప్పారావు మూవీ విమర్శకుల చేత ప్రశసించబడింది. ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను అలరించింది. ఇందులో రాజేంద్ర ప్రసాద్, శోభన హీరో, హీరోయిన్ లుగా నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్‌గా నమోదైంది. ఊర్లో ప్రతిఒక్కరి దగ్గర అప్పులు చేసే అప్పరావు పాత్రలో రాజేంద్ర ప్రసాద్ కామెడీని పండించాడు. బ్రహ్మానందం, బాబుమోహన్, తనికెళ్ల భరణి, ఐరెన్ లెగ్ శాస్త్రి ప్రధాన పాత్రల్లో నటించారు.
ఓటీటీ- జియో సినిమా
రాజేంద్రుడు గజేంద్రుడు
రాజేంద్ర ప్రసాద్, సౌందర్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం పూర్తిగా హాస్యభరితం. ఎస్. వి. కృష్ణారెడ్డికి దర్శకుడిగా ఇది మొదటి సినిమా. కథంతా ఒక ఏనుగు చుట్టూ తిరుగుతుంది. రాజేంద్రగా రాజేంద్ర ప్రసాద్, గజేంద్రగా ఏనుగు, అలకగా సౌందర్య, కోటిలింగంగా కోట శ్రీనివాసరావు, గుండు హన్మంతరావు పాత్రలకు తగ్గట్టు హాస్యాన్ని పండించారు. ఈ మూవీ డైరెక్టర్ గా ఎస్.వి. కృష్ణా రెడ్డికి మంచి లైఫ్ ఇచ్చింది.
ఓటీటీ: ఆహా
మాయలోడు
పక్కా కామెడీ ఎంటర్ టైనర్ గా S. V. కృష్ణారెడ్డి డైరెక్షన్ లో మాయలోడు వచ్చింది. ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్, సౌందర్య నటించారు. వీరబాబు పాత్రలో మాయలోడుగా రాజేంద్ర ప్రసాద్ అద్భుతంగా హాస్యాన్ని పండించాడు. ఈ మూవీ బాక్సాఫీసు వద్ద సూపర్‌హిట్‌గా నిలిచింది. మాయలోడు హైదరాబాద్- శ్రీనివాస థియేటర్‌లో ఏకంగా 260 రోజులు నడిచింది. ఈ చిత్రం రెండు నంది అవార్డులు కూడా గెలుచుకుంది.
ఓటీటీ: ఈటీవీ విన్
యమలీల
S. V. కృష్ణా రెడ్డి దర్శకత్వం వహించిన యమలీల చిత్రం తెలుగు సినీచరిత్రలో పెను సంచలనం సృష్టించింది. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. కేవలం రూ.75లక్షలతో నిర్మించిన ఈ మూవీ రూ.12కోట్లు వసూలు చేసింది. అప్పటివరకు చిన్న చిన్న కామెడీ పాత్రలు చేస్తున్న అలీ తొలిసారి హీరోగా పరిచయం అయ్యాడు. తన తల్లి ప్రాణాలు కాపాడుకునేందుకు హీరో.. యముడిని ఏలా ఏమార్చాడు అనే కథాంశంతో మూవీని దర్శకుడు చక్కగా నడిపాడు. మూవీలో మదర్ సెంటిమెంట్ కొనసాగిస్తూనే.. కామెడీని అద్భుతంగా పండించాడు. ఈ చిత్రాన్ని వెంకటేష్ హీరోగా హిందీలో తక్‌దీర్‌వాలాగా, కార్తీక్ హీరోగా తమిళంలో లక్కీ మ్యాన్‌గా రీమేక్ చేశారు.
ఓటీటీ: యూట్యూబ్
క్షేమంగా వెళ్లి లాభంగా రండి
రాజా వన్నెంరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మహిళా ప్రేక్షకుల మనసులు దోచింది. శ్రీకాంత్, రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, రోజా, కోవై సరళ ముఖ్యపాత్రల్లో నటించారు. జంబులింగం పాత్రలో బ్రహ్మనందం ఆయన భార్యగా సుబ్బలక్ష్మి పాత్రలో కోవైసరళ మధ్య వచ్చే కామెడీ సీన్లు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించాయి. అలాగే రాంబాబు పాత్రలో రాజేంద్ర ప్రసాద్, రవి పాత్రలో శ్రీకాంత్ తమదైన కామెడీ టైమింగ్ తో అలరించారు. అన్నివర్గాల ప్రేక్షకులను ఈ సినిమా అలరించింది. ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. ఈ మూవీ తర్వాత చాలా సినిమాలు కామెడీ బాట పట్టాయి.
ఓటీటీ: ప్రైమ్
హనుమాన్ జంక్షన్
ఎం. రాజా దర్శకత్వంలో వచ్చిన హనుమాన్ జంక్షన్ కామెడీ కల్ట్ గా నిలిచింది. కమర్షియల్ గాను బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. అర్జున్, జగపతి బాబు, వేణు, స్నేహ, లయ ప్రధాన పాత్రల్లో నటించారు. కోవై సరళ, ఎల్ బీ శ్రీరాం, జయప్రకాశ్ రెడ్డి, ఎంఎస్ నారాయణ ఇతర పాత్రాల్లో నటించారు. తోటపల్లి మధు అందించిన కామెడీ డైలాగ్స్ పాత్రాధారుల మధ్య అద్భుతంగా పేలాయి. ఈ మూవీలోని నా 'భూతో నా భవిష్యత్' అనే డైలాగ్ ఇప్పటికీ చాలా ఫేమస్. అంతలా సినిమా ప్రేక్షకులపై ప్రభావం చూపింది.
ఓటీటీ: ప్రైమ్
నువ్వు నాకు నచ్చావ్
కె. విజయ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. తెలుగులో వచ్చిన రోమాంటిక్ కామెడీ మూవీల్లో ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ అందించిన డైలాగ్స్.. ఈ చిత్రాన్ని ప్రేక్షకుల హృదయాల్లో ఆల్ టైమ్ క్లాసిక్ గా నిలిపింది. అప్పటివరకు తెలుగు తెరకు పెద్దగా పరిచయం లేని పంచ్ కామెడీ టైమింగ్ ను ఈ సినిమా పరిచయం చేసింది. ఈ చిత్రంలో వెంకటేష్ , ఆర్తి అగర్వాల్ ప్రధాన పాత్రల్లో నటించగా.. ప్రకాశ్ రాజ్, చంద్రమోహన్, సుహాసిని ఇతర పాత్రాల్లో నటించారు. ఈ మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు కమర్షియల్ పరంగా భారీ విజయం సాధించింది. ఐదు నంది అవార్డులను గెలుచుకుంది. కుటుంబ సమేతంగా వీక్షించే ఉత్తమ చిత్రంగా అక్కినేని అవార్డు కూడా గెలుచుకుంది.
ఓటీటీ: హాట్ స్టార్
వెంకీ
తెలుగులో వచ్చిన ఆల్ టైం కామెడీ కల్ట్ మూవీల్లో వెంకీ ఒకటి. శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందింది. రవితేజ, స్నేహ ప్రధాన పాత్రధారులుగా.. బ్రహ్మానందం, ఏవీఎస్, చిత్రం శ్రీను, శ్రీనివాస్ రెడ్డి ఇతర పాత్రల్లో నటించారు. రోటిన్ కామెడీకి విభిన్నంగా స్పెషల్ ట్రాక్ కామెడీని శ్రీను వైట్ల పరిచయం చేశాడు. ఈ మూవీతో శ్రీను వైట్లకు మంచి బ్రేక్ వచ్చింది.
ఓటీటీ: యూట్యూబ్
దూకుడు
పక్కా యాక్షన్ కామెడీ ఫిల్మ్ గా దూసుకొచ్చిన దూకుడు మూవీ టాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను షేక్ చేసింది. శ్రీనువైట్ల డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ మూవీ రూ.101 కోట్లు రాబట్టింది. సూపర్ స్టార్ మహేష్ బాబు తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను అలరించాడు. దీనికి తోడు బ్రహ్మానందం, ఎంఎస్ నారాయణ కామెడీ ట్రాక్ ఈ సినిమాకే హైలెట్.
మత్తు వదలరా
తెలుగులో వచ్చిన అతి కొద్ది కామెడీ క్రైమ్ థ్రిల్లర్ సినిమాల్లో మత్తు వదలరా ఒకటి. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై రితేష్ రానా డైరెక్ట్ చేసిన తొలి సినిమా ఇది. శ్రీ సింహా, సత్య, నరేష్, అతుల్య చంద్ర, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుని బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది.
ఓటీటీ: ప్రైమ్ వీడియో
బ్రహ్మానందం టాప్ 10 బెస్ట్ కామెడీ సినిమాలు
బ్రహ్మానందం నటించిన ఈ చిత్రాలకు తెలుగు హాస్య చిత్రాల్లో ప్రత్యేక స్థానం ఉంది. ఈ చిత్రాలను చూడని వారు బ్రహ్మీ అసలు సిసలు కామెడీని మిస్ అవుతున్నట్లే లెక్క. మరి ఆ సినిమాలు ఏంటో ఓసారి చూసేయండి.
అదుర్స్
అదుర్స్‌లో బ్రహ్మానందం గారు చేసిన భట్టు క్యారెక్టర్ ఎప్పటికీ ప్రత్యేకంగా నిలుస్తుంది. నువ్వంతా హార్ష్‌గా మాట్లాడకు చందు అని బ్రహ్మి చెప్పే డైలాగ్ చాలా మంది మీమర్స్‌కు మంచి స్టఫ్ అందించిందని చెప్పవచ్చు. ఈ చిత్రంలో జూ. ఎన్టీఆర్- బ్రహ్మానందం- నయనతార మధ్య వచ్చే కామెడీ ట్రాక్ బాగా ఆకట్టుకుంటుంది. బట్టు-చారి-చందు క్యారెక్టర్లు తెలుగు చిత్ర సీమలో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు.
ఓటీటీ: ప్రైమ్, ఆహా
మన్మధుడు
ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెలరేగిపోతాను.. అని బ్రహ్మి చెప్పిన డైలాగ్ ఎంతో ఫేమసో ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ చిత్రంలో బ్రహ్మానందం స్క్రీన్ టైమ్ తక్కువే అయినప్పటికీ అయిన సినిమాపై గట్టి ఇంపాక్ట్ చూపించారు.
ఓటీటీ: హాట్ స్టార్, యూట్యూబ్
ఢీ
మంచు విష్ణుతో కలిసి నటించిన బ్రహ్మనందం ఈ సినిమాలో గుమస్తాగా పనిచేశారు. ఏమో సార్.. "దయచేసి నన్ను ఇన్వాల్ చేయకండి సార్" అంటూ చెప్పే డైలాగ్స్ ప్రేక్షకులను అలరిస్తాయి. ఈ చిత్రంలో ఆయన అమాయకత్వం, వ్యక్తీకరణలు హాస్యాన్ని పండిస్తాయి.
ఓటీటీ: యూట్యూబ్
రెడీ
శ్రీను వైట్ల డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం కామెడీ చిత్రాల్లో బెస్ట్ సినిమాగా చెప్పవచ్చు. ఈ సినిమాలో మెక్‌డోవెల్ మూర్తి క్యారెక్టర్‌లో బ్రహ్మానందం కామెడీ ట్రాక్ కడుపుబ్బ నవ్విస్తుంది. అలాగే చందు పాత్రలో రామ్ పొత్తినేని, చిట్టినాయుడిగా జయప్రకాశ్ రెడ్డి కామెడీ అలరిస్తుంది. ఈ సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది.
రేసు గుర్రం
ఈ చిత్రాన్ని సూపర్ హిట్ చేసింది... కిల్ బిల్ పాండే పాత్ర అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. చివరి అర్ధగంటలో బ్రహ్మానందం ట్రాక్ సినిమాకు హైలెట్‌గా ఉంటుంది. ప్రస్టేషన్.. ప్రస్టేషన్ అంటూ వచ్చే బీజీఎం నవ్వులు పూయిస్తుంది. కిల్ బిల్ పాండే రోల్‌లో బ్రహ్మానందం జీవించేశారు.
ఓటీటీ: యూట్యూబ్
మనీ మనీ
"వారేవ్వా ఏమి ఫేసు.. అచ్చం హీరోల ఉంది బాసు" ఈ పాట ఎంత ఫెమస్సో అందరికీ తెలిసిందే. అతను చేసిన ఖాన్ క్యారెక్టర్ ఎంతో మంది ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయింది. ఖాన్‌తో గేమ్స్ ఆడొద్దు..శాల్తీలు లేచిపోతాయ్ వంటి డైలాగ్స్ ఎన్నో మీమ్స్‌కు స్ఫూర్తిగా నిలిచాయి.
ఓటీటీ: యూట్యూబ్, ప్రైమ్
అనగనగా ఒకరోజు
ఇక చిత్రంలో బ్రహ్మానందం ఓ దొంగలా యాక్ట్ చేశాడు. 'నెల్లూరు పెద్దా రెడ్డి' తెలుసా నీకు అని బ్రహ్మి చెప్పిన డైలాగ్ ఎంతో ప్రాచూర్యం పొందింది. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు ఉందండి అని చెప్పే డైలాగ్ ఎంత అందరికి తెలిసిందే.
ఓటీటీ: ప్రైమ్, జియో సినిమా
కింగ్
ఈ చిత్రంలో బ్రహ్మానందం మ్యూజిక్ డైరెక్టర్‌గా తెగ నవ్వించాడు. 'అరె అరె.. రికార్డ్ చేయ్ రికార్డ్ చేయ్' ఆయన చేసిన పాత్రను ఇప్పటికీ చాలా మంది మీమర్స్.. ట్యూన్స్‌ను కాపీ చేస్తున్న మ్యూజిక్ డైరెక్టర్స్‌ను ట్రోల్ చేసేందుకు వాడుతున్నారు.
ఓటీటీ: ప్రైమ్, యూట్యూబ్
వెన్నెల కిషోర్ బెస్ట్ కామెడీ సినిమాలు
వెన్నెల
ఈ చిత్రం పేరునే తన ఇంటి పేరుగా మార్చుకునేంత గొప్ప పేరు కిషోర్‌కు వచ్చింది. ఈ చిత్రంలో వెన్నెల కిషోర్ ఖాదర్ భాషా పాత్రలో నటించాడు. ఈ సినిమాలో కిషోర్ చెప్పే డైలాగ్‌లు చాలా హెలేరియస్‌గా ఉంటాయి. డోంట్ బాదార్ ఐ యామ్ ఖాదర్ అంటూ తెగ నవ్విస్తాడు.
ఓటీటీ: యూట్యూబ్
భలే భలే మగాడివోయ్
ఈ చిత్రంలో నానితో వెన్నెల కిషోర్ పండించే కామెడీ హెలెరియస్‌గా ఉంటుంది. నాని మతిమరుపునకు బలయ్యే క్యారెక్టర్‌లో బాగా నవ్వు తెప్పించాడు.
ఓటీటీ: హాట్ స్టార్
అలీ బెస్ట్ కామెడీ చిత్రాలు
అలీ తనదైన మేనరిజంతో నవ్వులు పూయించిన చిత్రాలు అనేకం ఉన్నప్పటికీ.. పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లో వచ్చిన సినిమాలు ఆయన క్యారెక్టర్ విషయంలో మోస్ట్ హెలెరియస్‌గా ఉంటాయి. వీటిని మాత్రం అస్సలు మిస్ కావొద్దు.
దేశముదురు
ఈ చిత్రంలో అలీ రోల్ తెగ నవ్విస్తుంది. బ్యాంక్ ఎంప్లాయ్ నుంచి అలీ ఎలా స్వామిజీగా మారాడు అనే ఎపిసోడ్.. చాలా హెలేరియస్‌గా ఉంటుంది
ఓటీటీ: యూట్యూబ్
చిరుత
ఈ సినిమాలో అలీ చేసిన లక్ష్మీ క్యారెక్టర్ చాలా ఫేమస్ అయింది. మసాజ్.. థాయ్ మసాజ్ అంటూ అలీ చెప్పే డైలాగ్స్ మంచి ఫన్ జనరేట్ అవుతుంది
ఓటీటీ: యూట్యూబ్
పోకిరి
ఈ సినిమాలో అలీ బిచ్చగాడు పాత్రలో చేసిని కామెడీ అంతా ఇంతకాదు. ముఖ్యంగా బ్రహ్మానందాన్ని ఓ ఆట ఆడుకునే ట్రాక్ థియేటర్ మొత్తం నవ్వులు పూయిస్తుంది
ఓటీటీ: యూట్యూబ్/ హాట్ స్టార్
సూపర్
ఈ చిత్రంలో అలీ దొంగ పాత్రలో అద్భుతంగా కామెడీ పంచాడు. ముఖ్యంగా స్పెషల్ ఆఫీసర్‌గా బ్రహ్మానందం... అలీని ఇంటరాగెట్ చేసే సీన్ కడుపుబ్బ నవ్వు తెప్పిస్తుంది
ఓటీటీ: హాట్ స్టార్/యూట్యూబ్
మే 23 , 2024
Top TV Hosts In South India: సౌత్ ఇండియాను షేక్ చేస్తున్న బుల్లితెర భామలు వీరే!
దక్షిణాదిలో వెండితెరకు సమానంగా బుల్లితెర ఎదుగుతోంది. ఎంతో మంది మహిళా యాంకర్లు, సీరియల్ నటీమణులు టెలివిజన్ ఆడియన్స్‌ను అలరిస్తున్నారు. అదే సమయంలో సినిమా ఈవెంట్స్, ప్రీ రిలీజ్ ఫంక్షన్లు, సక్సెస్ మీట్‌లకు హోస్ట్‌గా వ్యవహరిస్తూ తమదైన శైలిలో దూసుకుపోతున్నారు. కొందరు సీనియర్ యాంకర్లు తమ మాటలతో మంచి గుర్తింపు సంపాదించగా.. ఇంకొందరు తమ బ్యూటీతో మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు. చిట్టిపొట్టి డ్రెస్సులతో గ్లామర్ షో చేస్తున్నారు. హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని అందంతో బుల్లితెర ప్రేక్షకులను ఫిదా చేస్తున్నారు. తద్వారా సినిమా అవకాశాలు దక్కించుకొని పై స్థాయికి ఎదుగుతున్నారు. ఇలా దక్షిణాదిలో అందరి దృష్టిని ఆకర్షించిన టాప్ యాంకర్లు, నటీమణులు ఎవరో ఇప్పుడు చూద్దాం.
మంజూష (Manjusha)
హీరోయిన్ మెటీరియల్‌లా అనిపించే యాంకర్ మంజూష.. చాలా ఏళ్లుగా ఇండస్ట్రీలోనే ఉంది. తన గ్లామర్ షోతో కుర్రకారు మతులు పొగొట్టే ఈ భామ.. ఆడియో, సినిమా ఫంక్షన్లలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. మిగిలిన యాంకర్లు టీవీ, రియాలిటీ షోలలో కనిపిస్తుంటారు కానీ.. మంజూష మాత్రం సినిమా ఈవెంట్లకు మాత్రమే పరిమితమవుతూ వస్తోంది.
వర్షిణి (Varshini)
అందాల ఆరబోతలో అనసూయ, రష్మీలకు ఈ మధ్య కాలంలో యాంకర్ వర్షిణీ గట్టి పోటీ ఇస్తోంది. పటాస్ షోతో అందరి దృష్టిని ఆకర్షించిన వర్షిణి.. పలు సినిమాల్లోనూ నటించింది. ‘చందమామ కథలు’, ‘లవర్స్’, ‘మళ్లీ మెుదలైంది’, రీసెంట్‌గా ‘భాగ్ సాలే’ చిత్రాల్లో వర్షిణి మెరిసింది.
విష్ణు ప్రియ (Vishnu Priya)
తెలుగులో డ్యాన్స్ అద్భుతంగా చేసే అతికొద్ది మంది యాంకర్లలో ‘విష్ణుప్రియ’ ఒకరు. ఈ భామ కూడా ఒంపుసొంపులను ఒలికించడంలో ఏ మాత్రం ఆలోచించడం లేదు. అవకాశం వచ్చినప్పుడల్లా తన గ్లామర్ షోతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. గత కొంతకాలంగా యూట్యూబ్‌లో డ్యాన్సింగ్ ఆల్బమ్స్ చేస్తూ ఆకట్టుకుంటోంది.
అషూ రెడ్డి (Ashu reddy)
ఇన్‌స్టాగ్రామ్‌లో డబ్‌స్మాష్ వీడియోలు పోస్టు చేస్తూ కెరీర్‌ను ప్రారంభించిన అషూ రెడ్డి.. తన వీడియోలతో చాలా ఫేమస్ అయ్యింది. 'ఛల్ మోహన్ రంగా' వెండి తెరపై ఆరంగేట్రం చేసింది. ఆ తర్వాత తెలుగు బిగ్‌బాస్ సీజన్ 3లో కనిపించి అలరించింది. ప్రస్తుతం బుల్లితెరపై వచ్చే షోలలో కనిపిస్తూ అందాలు ఆరబోస్తోంది.
సౌమ్యరావు (Sowmya rao)
జబర్దస్త్ షో ద్వారా తెలుగులో ఫేమస్ అయిన కన్నడ భామ సౌమ్య రావు.. తన కెరీర్‌ను తమిళ టెలివిజన్ ఇండస్ట్రీలో ప్రారంభించింది. 'రోజా' అనే సీరియల్‌లో తొలిసారి నటించి మెప్పించింది. తెలుగులో శ్రీమంతుడు సినిమాలో ఓ చిన్న పాత్రలో కనిపించింది. ప్రస్తుతం బుల్లితెరపై గ్లామర్‌గా మెరిసిపోతూ కుర్రకారును ఆకట్టుకుంటోంది.
శ్యామల (Shyamala)
అసూయపడే అందం, అలరించే యాంకరింగ్‌తో శ్యామల.. సుదీర్ఘ కాలంగా బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. 'లయ', 'అభిషేకం', 'గోరింటాకు' వంటి సీరియళ్లలో అదిరిపోయే నటన కనబరిచినా శ్యామలా.. ఆ తర్వాత యాంకర్‌గా మారింది. 'పట్టుకుంటే పట్టుచీర' వంటి షోలు చేసింది. సినిమాల్లో వరుసగా అవకాశాలు దక్కించుకుంటూ శ్యామల దూసుకెళ్తోంది.
దీప్తి నల్లమోతు (Deepthi Nallamothu)
కెరీర్ ప్రారంభంలో ఓ న్యూస్ ఛానెల్‌లో పనిచేసిన దీప్తి నల్లమోతు.. ఔనా.. నిజమా? అన్న డైలాగ్‌తో చాలా ఫేమస్ అయ్యింది. అంతకుముందు రవితేజ 'భద్ర' సినిమాలో ఓ చిన్న పాత్ర పోషించినప్పటికీ అంతగా గుర్తింపు రాలేదు. ఈ క్రమంలోనే బిగ్‌బాస్ తెలుగు సీజన్ 2లో హౌస్‌మేట్‌గా అడుగుపెట్టి తనకంటూ మంచి పేరు సంపాదించింది.
అనసూయ (Anasuya)
యాంకర్ అనసూయ గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన పనిలేదు. జబర్దస్త్ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ భామ.. తన గ్లామర్‌తో షోకే అందాన్ని తీసుకొచ్చింది. ఆ షో సూపర్ హిట్ కావడంలో తన వంతు పాత్ర పోషించింది. జబర్దస్త్ క్రేజ్‌తో సినిమాల్లోకి వచ్చిన ఈ గ్లామర్ బ్యూటీ.. ‘రంగస్థలం’లో రంగమ్మత్త, ‘పుష్ప’లో దాక్షాయణి పాత్రల్లో మెప్పించి మరింత గుర్తింపు సంపాదించింది. ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతోంది.
రష్మి (Rashmi)
జబర్దస్త్ షో (Jabardasth) ద్వారానే మంచి క్రేజ్ సంపాదించుకున్న మరో యాంకర్ రష్మి. జబర్దస్త్ స్కిట్లతో పాటు రష్మి అందాలకు కూడా పెద్ద సంఖ్యలో ఫ్యాన్స్ ఉన్నారు. చిరంజీవి రీసెంట్ మూవీ భోళా శంకర్‌లోనూ రష్మి నటించింది. అడపా దడపా సినిమాల్లో నటిస్తూ టాలీవుడ్ ప్రేక్షకులను ఈ చిన్నది అలరిస్తోంది.
శ్రీముఖి (Srimukhi)
యాంకర్ అనసూయ, రష్మిల తరువాత ఆ స్థాయిలో అందాలు ఆరబోసే బుల్లితెర యాంకర్ ‘శ్రీముఖి’. వినోదాన్ని పంచే విషయంలో వారిద్దరి కంటే శ్రీముఖి ఓ మెట్టు పైనే ఉంటుంది. ఈ భామ కూడా తన గ్లామర్‌తో ఎక్కువ మంది అభిమానులను సంపాదించుకుంది. జీ తెలుగు, స్టార్ మా వంటి ఛానెళ్లలో వచ్చే పలు షోలకు యాంకర్‌గా వ్యవహరిస్తూ శ్రీముఖి దూసుకెళ్తోంది. మధ్య మధ్యలో సినిమా ఈవెంట్లలోనూ తళుక్కుమంటోంది.
వింధ్య (Vindhya)
తెలుగు యాంకర్లు అందరిదీ ఒక లెక్క అయితే.. వింధ్యది మరో లెక్క. తెలుగులో ఏకైక మహిళా స్పోర్ట్స్ యాంకర్ ఈమెనే. ఐపీఎల్ వచ్చినా, ప్రో కబడ్డీ లీగ్స్ జరిగినా వింధ్య తన యాంకరింగ్‌తో కనువిందు చేస్తుంటుంది. తన హాట్‌నెస్‌తో క్రీడాభిమానుల హృదయాలను కొల్లగొడుతోంది. చిట్టి పొట్టి డ్రెస్సుల్లో కనిపించి అందరి చూపును తనవైపు తిప్పుకుంటుంది.
రచిత (Rachitha)
ప్రముఖ సీరియల్ నటి రచిత మహాలక్ష్మీ.. తన కెరీర్‌ను మోడల్‌గా ప్రారంభించింది. బెంగళూరుకు చెందిన రచిత.. తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో సినిమాలు, సీరియళ్లలో నటించింది. తెలుగులో ‘స్వాతి చినుకులు’ సీరియల్ ద్వారా ఎనలేని ఖ్యాతిని సంపాదించింది. ఆ సీరియల్ ఏడేళ్ల పాటు సుదీర్ఘంగా నడిచిందంటే అందుకు కారణం రచిత అని చెప్పవచ్చు.
పల్లవి రామిశెట్టి (Pallavi Ramisetty)
బుల్లి తెరపై కనిపించే అందమైన సీరియల్ నటీమణుల్లో పల్లవి రామిశెట్టి ఒకరు. ‘ఆడదే ఆధారం’, ‘అత్తారింటికి దారేది’, ‘మాటే మంత్రం’, ‘పాపే మా జీవన జ్యోతి’ వంటి ప్రముఖ సీరియళ్లలో పల్లవి నటించింది. ‘అలీ 369’, ‘స్టార్ మహిళా’, ‘క్యాష్’ వంటి టెలివిజన్ షోలలోనూ ఈమె పాల్గొంది.
ప్రేమి విశ్వనాథ్ (Premi Viswanath)
‘కార్తిక దీపం’ సీరియల్‌తో ప్రేమి విశ్వనాథ్ చాలా పాపులర్ అయ్యారు. కేరళకు చెందిన ప్రేమి.. ‘కరుతముత్తు’ అనే మలయాళ సీరియల్ ద్వారా బుల్లితెరపై అడుగుపెట్టింది. తెలుగులో గోరింటాకు, చెల్లెలి కాపురం వంటి సీరియళ్లలో అతిథి పాత్రలు పోషించింది. ‘మా ఉగాది వేడుక’, ‘మా వరలక్ష్మీ వ్రతం’ వంటి స్పెషల్ షోలలోను కనిపించి సందడి చేసింది.
ప్రీతి అస్రాని (Preeti Asrani)
గుజరాత్‌కు చెందిన ప్రీతి అస్రాని.. ‘ఊ కొడతారా? ఉలిక్కి పడతారా?’ అనే సినిమాతో బాలనటిగా తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత ‘గుండెల్లో గోదారి’, ‘మళ్లీ రావా’ వంటి చిత్రాల్లో చేసింది. 2016లో ‘పక్కింటి అమ్మాయి’ సీరియల్ ద్వారా బుల్లితెరలోకి అడుపెట్టింది. ఇటీవల ‘9 అవర్స్’, ‘వ్యూహాం’ వంటి సిరీస్‌లలోనూ ప్రీతి మెరిసింది.
వరలక్ష్మీ శరత్‌కుమార్ (Varalakshmi Sarathkumar)
ప్రముఖ స్టార్ జంట రాధిక - శరత్‌కుమార్‌ల తనయ వరలక్ష్మీ.. పలు సందర్భాల్లో బుల్లితెరపై మెరిసింది. జయ టీవీలో వచ్చిన 'ఉన్నాయ్ అరింధాల్' షోకు హోస్ట్‌గా వ్యవహించింది. అలాగే కలర్స్ తమిళ్ ఛానెల్‌లో వచ్చిన 'ఎంగ వీటు మపిల్లాయ్' షోలోనూ మెరిసింది. రీసెంట్‌గా తెలుగు వచ్చిన ‘హనుమాన్’ (Hanuman Movie)లో కీలక పాత్ర పోషించి వరలక్ష్మీ అందరి దృష్టిని ఆకర్షించింది.
వైష్ణవి గౌడ (Vaishnavi Gowda)
కన్నడలో బాగా పాపులర్ అయిన అందమైన బుల్లితెర నటీమణుల్లో వైష్ణవి గౌడ ఒకరు. ‘అగ్నిసాక్షి’ సీరియల్‌లో సన్నిధి పాత్రను పోషించి మెప్పించింది. బిగ్‌బాస్ కన్నడ సీజన్ 8లో హౌస్‌మేట్‌గా వెళ్లి తన క్రేజ్‌ను మరింత పెంచుకుంది.
దీపికా దాస్ (Deepika Das)
కర్ణాటకకు చెందిన దీపికా దాస్.. అక్కడ సీరియళ్లలో నటించి చాలా ఫేమస్ అయ్యింది. 2016లో వచ్చిన 'నాగిని' సీరియల్‌తో దీపిక బుల్లితెరపై అరంగేట్రం చేసింది. తన నటనతో మంచి గుర్తింపు సంపాదించింది. ఈ క్రమంలో 2017లో 'డ్రీమ్ గర్ల్' అనే కన్నడ సినిమాలో ఆమెకు ఛాన్స్ వచ్చింది.
ఫిబ్రవరి 22 , 2024