UATelugu
ప్రియన్ (సూరజ్) ఆర్థిక సమస్యల్లో ఉంటాడు. తల్లి గుండె ఆపరేషన్‌కు సైతం డబ్బులేక ఇబ్బంది పడుతుంటాడు. ఈ క్రమంలో అతడికి ధనవంతుడైన ప్రిన్స్ (ఆసిఫ్) పరిచయమవుతాడు. అయితే ఇతరులతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడే ప్రిన్స్ వల్ల ప్రియన్‌కు వచ్చిన సమస్యలు ఏంటి? ప్రిన్స్ వద్ద ప్రియన్ డబ్బు తీసుకోగలిగాడా? తన తల్లికి వైద్యం చేయించాడా? అనేది స్టోరీ.
ఇంగ్లీష్‌లో చదవండి
మూవీ & ఓటీటీ అప్‌డేట్స్
స్ట్రీమింగ్ ఆన్Netflixఫ్రమ్
ఇన్ ( Telugu, Malayalam, Kannada, Tamil )
Watch
రివ్యూస్
How was the movie?
తారాగణం
సూరజ్ వెంజరమూడు
షైన్ టామ్ చాకో
వినీత్ తటిల్ డేవిడ్
గణపతి ఎస్. పొదువల్
ముత్తుమణి సోమసుందరన్
జిను జోసెఫ్
సిబ్బంది
నహాస్ నాజర్దర్శకుడు
ఆషిక్ ఉస్మాన్
నిర్మాతగోపీ సుందర్
సంగీతకారుడుజేక్స్ బిజోయ్
సంగీతకారుడుజిమ్షి ఖలీద్సినిమాటోగ్రాఫర్
నిషాద్ యూసుఫ్ఎడిటర్ర్
కథనాలు
Nishadh Yusuf: కంగువా ఎడిటర్ మరణంపై పోలీసుల అనుమానాలు… ఎక్కడ చనిపోయాడంటే?
తమిళ్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి రాబోతున్న భారీ పాన్ ఇండియా సినిమా “కంగువా” పై ప్రేక్షకులలో భారీ ఆసక్తి నెలకొంది. ఈ సినిమాలో సూర్య ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రాన్ని అన్ని భాషల్లో ప్రమోట్ చేయడంలో బిజీగా ఉన్నారు. ముఖ్యంగా తెలుగు, తమిళ భాషల్లో వివిధ ఈవెంట్లను నిర్వహిస్తూ ప్రేక్షకుల దృష్టిని ఈ సినిమాపై మరింతగా ఆకర్షిస్తున్నారు.
ఈ ప్రమోషనల్ కార్యక్రమాల మధ్య, చిత్ర బృందానికి ఓ ఆందోళనకరమైన వార్త ఎదురైంది. ఈ సినిమా ఎడిటర్ నిషాద్ యూసుఫ్ అనుమానాస్పదంగా కన్నుమూయడం చిత్రబృందాన్ని తీవ్రంగా కలచివేసింది. కొచ్చిలోని తన అపార్ట్మెంట్‌లో ఆయన మరణించడం సినీలోకాన్ని విస్మయపరుస్తోంది. సినిమా ఎడిటింగ్‌లో చురుకుగా పాల్గొన్న నిషాద్ ఆకస్మాత్తుగా తనువు చాలించడం పట్ల సినీ వర్గాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. ఈరోజు తెల్లవారుజామున రెండుగంటలకు నిషాద్ మృతి చెందినట్లు పోలీసులు ధృవీకరించారు. ఆయన కొచ్చి- పనంపిల్లి నగర్‌లోని తన అపార్ట్‌మెంట్లో విగత జీవై కనిపించాడు. ఆయన మృతిపై పలు అనుమానాలు రెకెత్తడంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అపార్ట్‌మెంట్ నివాసం ఉంటున్న వారితో పాటు ఆయన క్లోజ్ ఫ్రెండ్స్‌ను కూడా విచారిస్తున్నారు. కుటుంబ సభ్యుల మధ్య గొడవలపై ఆరా తీస్తున్నారు. అయితే ఆయన ఆత్మహత్య చేసుకునేంత బాధలు ఏమి లేవని ఆయన ఆత్మీయులు చెబుతున్నారు. పోలీసులు లోతుగా దర్యాప్తు చేయాలని కోరుతున్నారు. నిషాద్ మరణ వార్త తమిళ్, మలయాళ పరిశ్రమను శోక సంద్రంలో ముంచి వేసింది. ఆయనకు కడసారి వీడ్కోలు తెలిపేందుకు చిత్ర పరిశ్రమ పెద్దలు తరలివస్తున్నారు.
నిషాద్ యూసుఫ్ తెలుగు, తమిళ్ తో పాటు మలయాళ సినిమాలకు కూడా పనిచేశారు. అడియోస్ అమిగోస్, ఉండా, వన్, పెటారాప్, సౌదీ వెళ్లక్క వంటి ఎన్నో ఆసక్తికరమైన చిత్రాలకు ఎడిటింగ్ వర్క్ చేశారు. ఆయన ఆకస్మిక మరణం సినిమా రంగానికి భారీ నష్టం అని చెప్పాలి. ఇక ఆయన చివరగా పనిచేసిన ఈ భారీ పాన్ ఇండియా సినిమా “కంగువా” నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా విడుదలకు 15 రోజుల ముందు ఇలా జరగడం చిత్ర యూనిట్‌కు పెద్ద దెబ్బగా చెప్పవచ్చు.
నిషాద్ యూసుఫ్ మరణం పట్ల కంగువా చిత్ర బృందం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. హీరో సూర్య నిషాద్ మరణవార్త తనను తీవ్రంగా కలచి వేసిందని చెప్పారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
మరోవైపు కంగువా మూవీ ప్రమోషన్స్ తమిళ్‌తో తెలుగులోనూ శరవేగంగా కొనసాగుతున్నాయి. ఏకంగా హీరో సూర్యనే తెలుగులో ప్రెస్ మీట్లు పెడుతూ బిజీగా గడుపుతున్నారు. ఆదివారం బిగ్‌బాస్ హౌస్‌లోకి వచ్చి నాగార్జునతో కలిసి కంటెస్టెంట్స్‌ను పలకరించారు. ప్రస్తుతం హిందీ బెల్ట్‌లోనూ సూర్య ప్రమోషన్స్ స్టార్ట్ చేశాడు . హీరోయిన్ దిశా పటాని, ఈ చిత్రంలో విలన్‌గా నటిస్తున్న బాబీ డియోల్‌తో కలిసి చిత్ర ప్రచారంలో చురుకుగా పాల్గొంటున్నాడు. కాగా ఈ చిత్రం నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
‘కంగువా’ చిత్రాన్ని ఏకంగా 8 భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయాలని మేకర్స్ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి నిర్మాత కేఈ జ్ఞానవేల్ ఓ విషయం పంచుకున్నారు. తమిళ వెర్షన్‌కు సూర్య డబ్బింగ్ చెప్పగా మిగతా భాషల్లో ఏఐ సాయంతో డబ్బింగ్ పనులు పూర్తిచేయనున్నట్లు తెలిపారు. డబ్బింగ్ పనుల కోసం కోలీవుడ్‌లో ఏఐని ఉపయోగించడం ఇదే తొలిసారని పేర్కొన్నారు. ఇటీవల విడుదలైన ‘వేట్టయన్’లో అమితాబ్‌బచ్చన్ వాయిస్‌లో మార్పుల కోసం ఏఐను ఉపయోగించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. అయితే ఇప్పుడు పూర్తిగా ఏఐతో డబ్బింగ్ చేయిస్తున్నట్లు వివరించారు. ఈ ప్రయోగం విజయవంతమవుతుందని భావిస్తున్నట్లు చెప్పారు. ఇక కంగువా చిత్రాన్ని అన్ని ప్రధాన భారతీయ భాషలతో పాటు ఇంగ్లిష్, ఫ్రెంచ్, స్పానిష్‌లలో విడుదల చేయనున్నారు. చైనీస్, జపనీస్ విడుదల తేదీలను కూడా త్వరలోనే ప్రకటిస్తామని నిర్మాత ప్రకటించారు.
రూ.1000 కోట్ల లక్ష్యం!
రూ.1000 కోట్ల కలెక్షన్స్ సాధించడమే లక్ష్యంగా 'కంగువా'ను గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నట్లు ఇటీవల నిర్మాత జ్ఞానవేల్ చెప్పారు. పార్ట్ 2, పార్ట్ 3 కథలు కూడా రెడీగా ఉన్నాయని చెప్పారు. తొలి భాగం విజయం సాధిస్తే మిగితా భాగాలను కూడా తెరకెక్కించేలా ప్లాన్ చేయనున్నట్లు స్పష్టం చేశారు. ఈ సినిమా సూర్యను మరో స్థాయికి తీసుకెళ్తుందని నిర్మాత ధీమా వ్యక్తం చేశారు. యాక్షన్‌తోపాటు ఎమోషన్స్‌కు ఇందులో అధిక ప్రాధాన్యం ఉన్నట్లు నిర్మాత చెప్పారు. త్రీడీలోనూ అలరించనున్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఇందులో సూర్యకు జోడీగా బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ నటించింది. యానిమల్ ఫేమ్ బాబీ డియోల్ విలన్ పాత్ర పోషించాడు. కంగ అనే ఓ పరాక్రముడి పాత్రలో సూర్య కనిపించనున్నాడు.
అక్టోబర్ 30 , 2024
అందుకే అమిగోస్ ఒప్పుకున్నా.. అషికా రంగనాథ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
]మరిన్ని వెబ్‌స్టోరీస్ కోసం లింక్‌పై క్లిక్ చేయండిWatch Now
ఫిబ్రవరి 11 , 2023
2023 ఫిబ్రవరిలో విడుదల కానున్న చిత్రాలు ఇవే.. అలరించనున్న శాకుంతలం, అమిగోస్
]మణి శర్మ మ్యూజిక్ అందించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది.
ఫిబ్రవరి 13 , 2023
Doppelganger: అమిగోస్ సినిమా మాదిరి తెలుగులో వచ్చిన 5 డోపుల్ గ్యాంగర్ చిత్రాలు
]ముగ్గురు ఒకేలా ఉండే వ్యక్తుల కలయిక ఎన్ని విధ్వంసాలను సృష్టించిందో చూపించడమే అమిగోస్ కథ అని తెలుస్తోంది.
ఫిబ్రవరి 11 , 2023
ఆషికా రంగనాథ్ గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
ఆషికా రంగనాథ్.. తెలుగులో అమిగోస్ చిత్రం ద్వారా పరిచయమైంది. నాగార్జున సరసన నా సామిరంగ చిత్రంలో నటించి గుర్తింపు పొందింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడూ ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటుంది. ఆషికా రంగనాథ్‌కు బెల్లీ డ్యాన్స్‌లో మంచి ప్రావీణ్యం ఉంది. ఆషికా రంగనాథ్ గురించి మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు(Some Lesser Known Facts Ashika Ranganath) ఓసారి చూద్దాం
ఆషికా రంగనాథ్ వయస్సు ఎంత?
1996, ఆగస్టు 5న జన్మించింది
ఆషికా రంగనాథ్ తెలుగులో నటించిన తొలి సినిమా?
అమిగోస్(2023)
ఆషికా రంగనాథ్ ఎత్తు ఎంత?
5 అడుగుల 5అంగుళాలు
Courtesy Twitter: Ashika Ranganath
ఆషికా రంగనాథ్ ఎక్కడ పుట్టింది?
హసన్, కర్ణాటక
ఆషికా రంగనాథ్ ఉండేది ఎక్కడ?
బెంగుళూరు
ఆషికా రంగనాథ్ ఏం చదివింది?
డిగ్రీ
ఆషికా రంగనాథ్ అభిరుచులు?
మోడలింగ్, బెంగుళూరులో మిస్ ఫ్రెష్ ఫేస్ 2014 రన్నరప్‌గా నిలిచింది
ఆషికా రంగనాథ్‌కు ఇష్టమైన ఆహారం?
చికెన్ సూప్
View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath)
ఆషికా రంగనాథ్‌కు ఇష్టమైన కలర్ ?
వైట్
ఆషికా రంగనాథ్ పారితోషికం ఎంత?
ఒక్కొ సినిమాకు రూ.కోటి నుచి రూ.2 కోట్ల వరకు ఛార్జ్ చేస్తోంది.
ఆషికా రంగనాథ్ తల్లిదండ్రుల పేరు?
సుధా, రంగనాథ్
ఆషికా రంగనాథ్ సినిమాల్లోకి రాకముందు ఏం చేసేది?
సినిమాల్లోకి రాకముందు ఆషికా రంగనాథ్ మోడలింగ్ చేసేది
ఆషికా రంగనాథ్ ఇన్‌స్టాగ్రాం లింక్?
https://www.instagram.com/ashika_rangnath/?hl=en
ఆషికా రంగనాథ్ హీరో?
సుదీప్
ఆషికా రంగనాథ్ అభిరుచులు?
ఆషికా రంగనాథ్‌కు డ్యాన్స్ అంటే ఇష్టం. ఫ్రీస్టైల్, బెల్లీ డ్యాన్స్‌లో ప్రావీణ్యం ఉంది.
https://www.youtube.com/watch?v=dnUayT-BsXU
ఏప్రిల్ 16 , 2024
Vishwambhara: జపాన్ వీధుల్లో త్రిషతో చిరంజీవి రొమాన్స్.. ఫ్యాన్స్‌కు కిక్కే కిక్కు!
మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) హీరోగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం 'విశ్వంభర' (Vishwambhara). ఈ సోషియో ఫ్యాంటసీ చిత్రానికి ‘బింబిసార’ (Bimbisara) ఫేమ్ విశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో ప్రముఖ స్టార్ హీరోయిన్ త్రిష (Trisha) చిరుకి జోడీగా నటిస్తోంది. ‘అమిగోస్’ ఆషికా రంగనాథ్, రమ్య పసుపులేటి, సురభి, ఈషా చావ్లా, ఆష్రిత వేముగంటి నండూరి ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం జపాన్‌లో జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించి ఓ క్రేజీ అప్‌డేట్ బయటకొచ్చింది. ప్రస్తుతం అది నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
త్రిషతో చిరు రొమాంటిక్ సాంగ్!
‘విశ్వంభర’ (Viswambhara) టీమ్ ప్రస్తుతం జపాన్‌లో ఉంది. 15 రోజుల షూటింగ్ షెడ్యూల్‌తో హీరో చిరంజీవి సహా దర్శకుడు విశిష్ట ఇతర టీమ్ సభ్యులు రీసెంట్‌గా జపాన్‌లో అడుగుపెట్టారు. షెడ్యూల్‌లో భాగంగా ఇప్పటికే పలు కీలక సన్నివేశాలను మూవీ టీమ్ చిత్రీకరించింది. లేటెస్ట్ బజ్ ప్రకారం ప్రస్తుతం చిరు, త్రిష కాంబోలో ఓ డ్యూయేట్ సాంగ్‌ను షూట్ చేస్తున్నట్లు సమాచారం. ఈ సాంగ్‌లో చిరు, త్రిష జోడీ అదరగొడుతుందని మూవీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా చిరు మేకోవర్ చూస్తే ఆయన 20 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయినట్లు అనిపిస్తుందని అంటున్నారు. త్రిష - చిరంజీవి కెమెస్ట్రీ కూడా సాంగ్‌లో నెక్స్ట్ లెవల్లో వర్కౌట్ అయ్యిందని అంటున్నారు. ఈ సాంగ్ షూట్ అయిపోగానే చిత్ర బృందం హైదరాబాద్‌లో అడుగుపెడుతుందని సమాచారం. ఇదిలా ఉంటే చిరు-త్రిష సాంగ్‌పై వస్తోన్న హైప్ చూసి ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతున్నారు.
18 ఏళ్ల క్రితం ఇదే మ్యాజిక్!
చిరంజీవి - త్రిష జత కట్టడం (Viswambhara Trisha) ఇదేమి తొలిసారి కాదు. 2006లో వచ్చి ‘స్టాలిన్’ సినిమాలో వీరిద్దరు తొలిసారి జోడీగా నటించారు. ఆ తర్వాత వీరు ఏ సినిమాలో కలిసి నటించలేదు. 18 ఏళ్ల తర్వాత తిరిగి ఈ జోడి నటిస్తుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ‘స్టాలిన్’ సమయంలోనే వీరి జోడీకి మంచి మార్కులు పడ్డాయి. వెండి తెరపై వీరి కెమెస్ట్రీ చాలా బాగుందంటూ అప్పట్లో కథనాలు కూడా వచ్చాయి. ఇప్పుడు ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ‘విశ్వంభర’లో చిరు - త్రిష జతకడుతుండటంతో ఈ జోడీ ఈసారి ఏ మ్యాజిక్ చేస్తుందోనన్న ఆసక్తి ఇండస్ట్రీలో నెలకొంది. నిజానికి ‘ఆచార్య’ చిత్రంలోనే చిరుకి జోడీగా త్రిష నటించాల్సి ఉంది. చిత్ర యూనిట్ తొలుత త్రిషనే హీరోయిన్‌గా ప్రకటించింది కూడా. అయితే షూటింగ్ ప్రారంభానికి కొద్ది రోజుల ముందే తాను సినిమా నుంచి తప్పుకుంటున్నట్లు త్రిష వెల్లడించింది.
https://twitter.com/i/status/1849101610762522837
2025 సమ్మర్ బరిలో..
చిరంజీవి - వశిష్ట కాంబోలో రూపొందుతున్న ‘విశ్వంభర’ (Viswambhara) చిత్రం 2025 సమ్మర్‌లో రానున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కావాలి. జనవరి 10న రాబోతున్నట్లు గతంలోనే విశ్వంభర టీమ్ అనౌన్స్ చేసింది. అయితే తనయుడు రామ్ చరణ్ (Ram Charan) నటించిన ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) కోసం చిరు వెనక్కి తగ్గారు. దీంతో గేమ్ ఛేంజర్ సంక్రాంతి బరిలో నిలవగా ‘విశ్వంభర’ సమ్మర్‌కు పోస్టుపోన్ అయినట్లు 2025 మే (Viswambhara Release Date)లో ఈ సినిమాను గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా, గతంలో చిరు నటించిన ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’, ‘అంజి’ సినిమాల తరహాలో సోషియో ఫాంటసీ ఎంటర్ టైనర్‌గా ‘విశ్వంభర’ రూపొందుతోంది.
2024లో చిరుకి గుర్తుండిపోయే మోమోరీస్!
అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi)కి ఈ ఏడాది మరుపురాని జ్ఞాపకాలను అందించింది. మూడు విశిష్టమైన పురస్కారాను మెగాస్టార్ అందుకున్నారు. గత నెల ప్రతిష్టాత్మక ఏఎన్నార్ జాతీయ అవార్డు చిరంజీవిని వరించింది. అక్కినేని నాగార్జున కుటుంబికుల సమక్షంలో బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ ఈ అవార్డు ప్రధానం చేశారు. ఈ ఏడాది జూన్‌లో దేశంలోనే రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్‌ను రాష్ట్రపతి చేతుల మీదగా చిరు అందుకున్నారు. ఈ కార్యక్రమానికి చిరు భార్య సురేఖ, కుమారుడు రామ్‌చరణ్, కోడలు ఉపాసన, కూతురు సుస్మితా హాజరై మురిసిపోయారు. ఇటీవల గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులోను చిరు స్థానం సంపాదించారు. 156 చిత్రాలు.. 537 పాటలు.. 24 వేల స్టెప్పులతో అలరించినందుకు ఆయనకు ఈ రికార్డు దక్కింది.
నవంబర్ 20 , 2024
మెుదటి త్రైమాసికంలో టాలివుడ్, బాలివుడ్,కొలివుడ్, శాండల్‌వుడ్ పైచేయి ఎవరిది?
కొత్త సంవత్సరం ప్రారంభమై దాదాపు 3 నెలలు పూర్తయ్యింది. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో చాలా చిత్రాలు విడుదలయ్యాయి. కొన్ని చిత్రాలు బాక్సాఫీస్‌ను షేక్ చేస్తే…. మరికొన్ని అంచనాలు అందుకోలేక డిజాస్టర్లుగా మిగిలాయి. పఠాన్ వంటి ఆల్‌టైమ్ బ్లాక్ బస్టర్‌తో బాలీవుడ్‌కు పూర్వ వైభవం వచ్చింది. వీరసింహా రెడ్డి, వాల్తేరు వీరయ్య చిత్రాలు టాలీవుడ్ మేనియాను కొనసాగించాయి. తమిళ్, కన్నడ ఇండస్ట్రీలకు మంచి హిట్లే పడ్డాయి.
టాలివుడ్ పరంపర
గతేడాది ధమాకా వంటి సూపర్ హిట్‌తో ముగించిన టాలీవుడ్… ఏడాది ఆరంభంలోనే బ్లాక్‌బస్టర్లను అందుకుంది. సీనియర్ హీరోలు బాలకృష్ణ, చిరంజీవి అభిమానులు పండుగ చేసుకొనే సినిమాలను ఇచ్చారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన వీరసింహా రెడ్డి రూ. 110 కోట్లు పెట్టి తెరకెక్కిస్తే రూ. 134 కోట్ల వసూళ్లు వచ్చాయి. ఇదే బ్యానర్‌లో వచ్చిన వాల్తేరు వీరయ్య రూ.140 కోట్లతో రూపొందించగా.. రూ. 219 కోట్లు సాధించింది.
చిన్న హిట్లు
తెలుగు ప్రేక్షకులను చిన్న సినిమాలు కూడా అలరించాయి. సుహాస్ హీరోగా వచ్చిన రైటర్ పద్మభూషణ్ బాక్సాఫీస్ వద్ద క్లాసిక్ హిట్‌గా నిలిచింది. రూ.2.5 కోట్లతో తెరకెక్కించగా.. రూ. 12.5 కోట్లు వచ్చాయి. ఇదే సమయంలో చాలా రోజుల తర్వాత హిట్ అందుకున్నాడు కిరణ్ అబ్బవరం. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌లో వచ్చిన వినరో భాగ్యము విష్ణు కథ సినిమా ప్రేక్షకులను మెప్పించింది. రూ.1 కోటి బడ్జెట్ పెట్టి నిర్మించగా.. రూ. 9.15 కోట్లు వచ్చాయి.
భావోద్వేగాల బలగం
మంచి సినిమాను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారని బలగం సినిమాతో మరోసారి రుజువయ్యింది. కమెడియన్ వేణు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ప్రతి ఒక్కరూ ఆస్వాదించారు. సూపర్ హిట్ చేసి కలెక్షన్ల వర్షం కురిపించారు ప్రేక్షకులు. రూ. 1.5 కోట్లతో దిల్‌రాజు నిర్మించగా.. రూ. 18.65 కోట్లు వసూలు చేసింది చిత్రం. ఇంకా థియేటర్లలో అలరిస్తోంది.
డిజాస్టర్లు
బింబిసార వంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన కళ్యాణ్ రామ్ ఈ ఏడాది నిరాశపర్చాడు. సరికొత్త కాన్సెప్ట్‌తో అమిగోస్ అనే చిత్రం తెరకెక్కించి విఫలమయ్యాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. ఎప్పట్నుంచో హిట్ కోసం ఎదురుచూస్తున్న సందీప్ కిషన్‌కి కూడా సరైన హిట్ దక్కలేదు. మైఖేల్ సినిమాతో మళ్లీ ఫ్లాప్ మూటగట్టుకున్నాడు సందీప్. ఇవి మినహా తెలుగులో మంచి హిట్లే దక్కాయి.
బాలీవుడ్ బాద్షా
వరుస ఫ్లాప్‌లతో సతమతమవుతున్న బాలీవుడ్ పరిశ్రమకు చాలాకాలం గ్యాప్ తర్వాత వచ్చిన బాద్షా షారుఖ్ ఖాన్ ఆల్ టైమ్ బ్లాక్‌బస్టర్‌ను అందించాడు.ఏకంగా వెయ్యి కోట్ల కలెక్షన్లను దాటేశాడు. రూ.250 కోట్లతో తెరకెక్కిన పఠాన్ చిత్రం రూ. 1047 కోట్లు వసూలు చేసింది. బాలీవుడ్‌లో బాహుబలి పేరిట ఉన్న రికార్డును చేరిపేశాడు కింగ్ ఖాన్.
రొమాంటిక్ హిట్
కింగ్ ఖాన్ తెచ్చిన వైభవాన్ని రణ్‌బీర్ కపూర్ కొనసాగించాడు. తూ జూటీ మై మక్కర్ వంటి రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామాతో హిట్ కొట్టాడు ఈ కుర్ర హీరో. ఈ సినిమా రూ. 70 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించగా.. రూ.151.35 కోట్లు వసూలు చేసింది. అయితే, తెలుగు రీమేక్‌గా రూపుదిద్దుకున్న షెహజాదా మాత్రం డిజాస్టర్‌గా మిగిలిపోయింది.
షెహ్‌జాదా ఎందుకు ఫ్లాప్ అయింది?
https://telugu.yousay.tv/why-did-the-remake-of-ala-vaikunthapuram-not-work-out-why-shehzada-is-a-disaster.html
తమిళ్ సూపర్ స్టార్స్
కోలీవుడ్‌లో కూడా ఈ ఏడాది శుభారంభంతోనే ప్రారంభమయ్యింది. దిల్ రాజు నిర్మాణంలో దళపతి విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తీసిన వారిసు ఇండస్ట్రీ హిట్ అయ్యింది. రూ.297 కోట్లు వసూళ్లు సాధించింది ఈ సినిమా. సంక్రాంతి బరిలో అజిత్ చిత్రం తునివు కూడా హిట్‌గానే నిలిచింది. కాకపోతే పెట్టిన బడ్జెట్ తిరిగి వచ్చింది అంతే. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ధనుష్ నటించిన సార్ సినిమా సగటు ప్రేక్షకులను మెప్పించింది. రూ.35 కోట్లతో తీర్చిదిద్దితే రూ.115 కోట్లు సాధించింది ఈ చిత్రం.
ఇంకా మెుదలుకాలేదు
కన్నడలో విడుదలైన ఒకే ఒక్క పెద్ద చిత్రం కబ్జ. దాదాపు కేజీఎఫ్ రేంజ్ ట్రైలర్ చూపించినప్పటికీ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడటం లేదు. ఇండియన్ రియల్ స్టార్ ఉపేంద్ర, కిచ్చా సుదీప్, శివన్న వంటి స్టార్లు ఉన్నప్పటికీ ప్రేక్షకులను మెప్పించలేకపోయారు.
ఆధిపత్యం ఎవరిది?
చిత్ర పరిశ్రమలన్నింటిలో హిట్లు, ఫ్లాపులు ఉన్నాయి. తెలుగులో వరుస బ్లాక్‌బస్టర్లు కొట్టాయి. తమిళ్ నుంచి డబ్ అయిన చిత్రాలు కూడా బాగానే ఆదరించారు. కానీ, కలెక్షన్ల పరంగా బాలీవుడ్ దూసుకుపోయింది. ఆల్‌టైమ్ ఇండస్ట్రీ హిట్‌ను కొట్టేశాయి. తమిళ్‌లోనూ రూ.100 కోట్ల క్లబ్ సినిమాలు మూడు వచ్చాయి. ఈ పరంగా చూసుకున్నట్లయితే… ఒక్కో విభాగంలో ఒక్కో ఇండస్ట్రీ టాప్‌లో నిలిచిందనే చెప్పాలి. లేదు ప్రస్తుతం కలెక్షన్లే మ్యాటర్ అనుకుంటే.. బాలీవుడ్ దే పైచేయి.
మార్చి 20 , 2023
Telugu dubbed movies: ఈ సినిమాలను అస్సలు మిస్ కావొద్దు.. ఒక్కసారైన చూసి తీరాల్సిన చిత్రాలు!
ప్రస్తుతం భారతీయ సినిమా మరింత సరళంగా మారింది. ఒక భాషలో రిలీజైన సినిమాలను మరో భాషలోని ప్రేక్షకులు చూసి ఆదరిస్తున్నారు. కంటెంట్ బాగుంటే భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులు ఆ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. మరి గత రెండేళ్లలో తెలుగులోకి చాలా చిత్రాలు వివిభ భాషల నుంచి డబ్ అయ్యాయి. వాటిలో సూపర్ హిట్ అయిన మలయాళం, తమిళ్, కన్నడ, హిందీ చిత్రాలతో పాటు అవి ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులో ఉన్నాయో ఓసారి చూద్దాం.
[toc]
Best malayalam movies in telugu
ప్రేమలు
రీసెంట్‌గా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. యూనిక్ కథాంశంతో యూత్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా తెలుగులో ఈ సినిమా మంచి కలెక్షన్లు రాబట్టింది. ఈ చిత్రం కథంతా హైదరాబాద్ కేంద్రంగా ఉండటంతో తెలుగు ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు. ఇక సినిమా కథలోకి వెళ్తే..సచిన్.. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లాలని కలలు కంటాడు. వీసా రిజెక్ట్ కావడంతో గేట్ కోచింగ్ కోసం హైదరాబాద్ వస్తాడు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని రీనూతో తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. అప్పటికే లవ్‌లో ఫెయిలైన సచిన్.. రీనూకు తన ప్రేమను ఎలా చెప్పాడు? రీనూను ప్రేమిస్తున్న ఆది ఎవరు? సచిన్ - రీనూ చివరకు కలిశారా? లేదా? అన్నది కథ.
మంజుమ్మెల్ బాయ్స్
ఈ చిత్రం మంచి ఎమోషనల్ బ్యాక్‌డ్రాప్‌లో సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో వచ్చింది. ఈ సినిమా దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో మంచి వసూళ్లు సాధించింది. ఇక ఈ సినిమా కథలోకి వెళ్తే.. కేరళ కొచ్చికి చెందిన కుట్టన్, సుభాష్ స్నేహితులతో కలిసి కొడైకెనాల్ ట్రిప్‌లో భాగంగా గుణ కేవ్స్‌కు వెళ్తారు. అక్కడ సుభాష్ పొరపాటున 150 అడుగులకు పైగా లోతున్న డెవిల్స్ కిచెన్ లోయలో పడతాడు. ఆ తర్వాత ఏమైంది? పోలీసులు, రెస్క్యూ సిబ్బంది వారికి ఎందుకు సహకరించలేదు? సుభాష్‌ను కాపాడి తీసుకురావడానికి తోటి మిత్రులు ఏం చేశారు? అన్నది కథ.
ఆవేశం
ఇటీవల మలయాళంలో బ్లాక్ బాస్టర్ అయిన ఆవేశం చిత్రం అన్ని భాషల్లోనూ అదే హవా కొనసాగించింది. ఈ చిత్రం ఏకంగా రూ.150 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. కామెడీ యాక్షన్ జొనర్‌లో వచ్చి మంచి ఎంటర్‌టైనింగ్ అందించింది. ఈ సినిమా కథలోకి వెళ్తే..కేరళకు చెందిన బీబీ (మిథున్ జై శంకర్), అజు (హిప్‌స్టర్), మరియు శాంతన్ (రోషన్ షానవాజ్) ముగ్గురు స్నేహితులు బెంగళూరులోని ఒక ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతుంటారు. కాలేజీలో సీనియర్లు కారణం లేకుండా కొడుతుంటారు. దీంతో వారికి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుంటారు. ఈక్రమంలో గ్యాంగ్‌స్టర్ అయిన రంగాతో(ఫాహద్ ఫాసిల్) ఫ్రెండ్‌షిప్ చేస్తారు. రంగా స్నేహం వారి జీవితాలను ఏవిధంగా మార్చిందనేది కథ.
ది గోట్ లైఫ్
ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఇక కథలోకి వెళ్తే.. నజీబ్ (పృథ్వీరాజ్ సుకుమారన్) తన భార్య సైను (అమలా పాల్)తో ఆనందంగా జీవిస్తుంటాడు. తన స్నేహితుడి సలహాతో దుబాయ్ వెళ్లి డబ్బు సంపాదించాలని నిర్ణయించుకుంటాడు. దుబాయి వెళ్లిన నజీబ్.. ఖలిప్ చేతిలో ఇరుక్కుంటాడు. నజీబ్‌ను బలవంతంగా గొర్రెలను కాసేలా ఓ ఎడారిలో బంధిస్తారు. ఈక్రమంలో నజీబ్ అక్కడి నుంచి తప్పించుకోవడానికి ఎలాంటి కష్టాలు పడ్డాడు? తిరిగి తన కుటుంబాన్ని చేరుకున్నాడా? లేదా? అన్నది మిగతా కథ
RDX
మార్షియల్ ఆర్ట్స్ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం మలయాళంలో బ్లాక్ బాస్టర్ హిట్‌గా నిలిచింది.
2018
కేరళ వరదల నేపథ్యంలో వచ్చిన చిత్రమిది. ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఈ చిత్రాన్ని ఆంథోని జోసెఫ్ డైరెక్ట్ చేశాడు.
కింగ్ అఫ్ కొత్త
ఖన్నా భాయ్ (డ్యాన్స్ రోజ్ షబీర్) కోతా పట్టణంలో డ్రగ్స్ వ్యాపారి. సిఐ షాహుల్ హాసన్ (ప్రసన్న) పట్టణంలో డ్రగ్స్ మాఫియాను నిర్మూలించాలని కంకణం కట్టుకుంటాడు. కొన్నేళ్ల క్రితం కోతా... రాజు (దుల్కర్ సల్మాన్) నియంత్రణలో ఉందని, ఒకప్పుడు ఖన్నా భాయ్ రాజుకి ప్రియమైన స్నేహితుడని షాహుల్ తెలుసుకుంటాడు. కానీ కొన్ని కారణాల వల్ల రాజు మరియు ఖన్నా భాయ్ ఇద్దరూ విడిపోయారు. వారిని వేరు చేసింది ఏమిటి? అప్పుడు సీఐ షాహుల్ హాసన్ ఏం చేశాడు? అనేది కథ
రోమాంచం
రోమాంచం చిత్రం మలయాళంలో వచ్చిన కామెడీ హర్రర్ చిత్రం. ఈ చిత్రాన్ని జితు మాధావన్ తెరకెక్కించారు. ఈ సినిమా నిజజీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. కథలోకి వెళ్తే…. బెంగుళూరులోని ఓ ఇంట్లో ఉండే ఏడుగురు బ్యాచిలర్ స్నేహితుల కథే ఈ చిత్రం. అందులో ఒకరు ఉద్యోగం చేస్తుంటారు, మరొకరు వ్యాపారాలు చేస్తూ విఫలమవుతుంటాడు. ఇద్దరు ఇంటర్వ్యూని క్రాక్ చేస్తారు కానీ ఇంకా ఆఫర్ లెటర్ అందదు. ఒకరు పెట్రోల్ పంపులో పనిచేస్తున్నారు. మిగిలిన ఇద్దరూ ఏమీ చేయకుండా తమ జీవితాలను సాగిస్తుంటారు. ఇలా సాగుతున్న వీరి జీవితాల్లోకి ఓ అనూహ్య పరిణామం చోటు చేసుకుంటుంది. ఇంతకీ ఎంటా పరిణామం? దాని వల్ల వీరి జీవితాలు ఎలా మారాయి అనేది కథ.
భ్రమయుగం
తేవన్ అనే గాయకుడు అడవిలో ప్రయాణిస్తూ ఓ పాడుబడ్డ పెద్ద భవంతికి వెళ్తాడు. అక్కడ యజమాని మమ్మూటీ (కుడుమోన్ పొట్టి), ఓ వంటవాడు ఉంటాడు. అనూహ్య పరిణామాల తర్వాత తేవన్ ఆ ఇంటి నుంచి పారిపోవాలని అనుకుంటాడు. అసలు తేవన్ ఏం చూసి భయపడ్డాడు? కుడుమోన్ పొట్టి ఎవరు? అడవిలో ఏం చేస్తున్నాడు? అన్నది కథ.
అన్వేషిప్పిన్ కండెతుమ్
ఈ సినిమా మంచి సస్పెన్స్‌ను క్యారీ చేస్తూ.. ఆసక్తికరంగా కథనం సాగుతుంది. ఎస్సై ఆనంద్ నారాయణ్ ఓ కారణం చేత సస్పెండ్ అవుతాడు. ఓ యువతి హత్య కేసు మిస్టరీగా మారుతుంది. దీంతో ట్రాక్ రికార్డ్ ఆధారంగా ఆనంద్‌ను రంగంలోకి దింపుతారు. ఈ కేసును హీరో ఎలా సాల్వ్ చేశాడు? విచారణకు వెళ్లిన ఆనంద్‌కు ప్రజలు ఎందుకు సహకరించలేదు? అన్నది స్టోరీ.
మలైకోట్టై వాలిబన్
స్వాతంత్య్రం కోసం బ్రిటీష్ వారిని ఎదురించి పోరాడిన ఓ నాయకుడి కథతో ఈ మూవీ తెరకెక్కింది. ఈ పోరాటంలో వాలిబాన్ (మోహన్‌లాల్)కు ఎలాంటి అడ్డంకులు ఎదురయ్యాయి? ఆ ప్రాంత ప్రజలకు అతడు హీరోగా ఎలా నిలిచాడు? అన్నది కథ.
నెరు
కళ్లు కనిపించని సారా మహ్మద్ అనే యువతిపై ఒక బడా వ్యాపారి కొడుకు అత్యాచారం చేస్తాడు. పోలీసులు అతడ్ని అరెస్టు చేసినప్పటికీ నిందితుడు తన పలుకుబడితో వెంటనే బెయిల్‌పై బయటకొస్తాడు. దీంతో సారా తల్లిదండ్రులు లాయర్ విజయ్ మోహన్ (మోహన్‌లాల్)ని ఆశ్రయిస్తారు. అతడు సారాకు ఎలా న్యాయం చేశాడు? అన్నది కథ.
మాలికాపురం
ఎనిమిదేళ్ల చిన్నారి షన్ను అయ్యప్ప స్వామి భక్తురాలు. షన్ను కుటుంబంలో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటాయి. దీంతో సోదరుడు బుజ్జితో కలిసి షన్ను శబరిమలై బయలుదేరుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? పిల్లలు కిడ్నాప్ చేసే గ్యాంగ్ షన్నును ఎలా ఇబ్బంది పెట్టింది? కథలో ఉన్ని ముకుందన్ పాత్ర ఏంటి? అన్నది కథ.
Best Tamil movies in telugu
డియర్
అర్జున్ (జీవి ప్రకాష్) న్యూస్ రీడర్‌గా గొప్ప పేరు తెచ్చుకునేందుకు యత్నిస్తుంటాడు. అయితే నిద్రలో చిన్న శబ్దం వచ్చినా ఉలిక్కిపడి లేస్తుంటాడు. అటువంటి అర్జున్ లైఫ్‌లోకి భార్యగా దీపిక వస్తుంది. ఆమెకున్న గురక సమస్య.. అర్జున్‌కు ఎలాంటి ఇబ్బందులు తెచ్చిపెట్టింది? అన్నది కథ.
ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్
సైరన్
ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రాణించనప్పటికీ.. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇక సినిమా కథలోకి వెళ్తే..భార్యను (అనుపమ)ను చంపిన కేసులో తిలగన్ (జయం రవి) జైలుకు వెళ్తాడు. పెరోల్‌పై బయటకొచ్చిన తిలగన్.. వరుసగా పొలిటిషియన్స్‌ను హత్య చేస్తుంటాడు. పోలీస్ ఆఫీసర్ నందిని (కీర్తిసురేష్) అతడ్ని పట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తుంటుంది. అసలు తిలగన్ ఎందుకు ఆ హత్యలు చేస్తున్నాడు? తన భార్యను తిలగన్ నిజంగానే చంపాడా? లేదా? అన్నది కథ.
ఓటీటీ: హాట్ స్టార్
లియో
హిమాచల్ ప్రదేశ్‌లోని ఓ చిన్న పట్టణంలో పార్తీబన్ (విజయ్) కాఫీ షాప్ నడుపుతుంటాడు. భార్య సత్య (త్రిష), ఇద్దరు పిల్లలతో అతడి జీవితం సంతోషంగా సాగుతుంటుంది. ఈ క్రమంలోనే ఊరి ప్రజల నుంచి హైనాను, హైనా నుంచి ఊరి ప్రజలను పార్తీబన్ కాపాడటంతో అతడి ఫోటోలు పేపర్లలో వస్తాయి. ఇదే సమయంలో ఏపీలోని ఆంటోనీ దాస్ (సంజయ్ దత్) & గ్యాంగ్ హిమాచల్ ప్రదేశ్ వస్తారు. లియో దాస్‌గా ఉన్న పార్తీబన్ కోసం వెంటాడుతారు. ఇంతకీ లియో దాస్ ఎవరు? అతని గతం ఏమిటి? అనేది మిగిలిన కథ.
ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్
జైలర్
ఈ చిత్రం సరైన హిట్‌లేక సతమతమవుతున్న రజినీకాంత్‌కు సాలిడ్ విజయాన్ని అందించింది. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. చాలా రోజుల తర్వాత వింటేజ్ రజనీకాంత్ ఈ సినిమాలో కనిపిస్తాడు. ముత్తు వేలు(రజనీకాంత్) నీతి నిజాయితి కలిగిన ఓ రిటైర్డ్ పోలీస్ అధికారి. అతని కొడుకు ఏసీపీ అర్జున్ తండ్రిలాగే నీతి నిజాయితి కలిగిన పోలీస్ ఆఫీసర్‌గా పేరు తెచ్చుకుంటాడు. ఈక్రమంలో విగ్రహాల దొంగతనం ముఠా నాయకుడు వర్మ(వినాయకన్) వల్ల అర్జున్ చనిపోతాడు. ఆ తర్వాత ముత్తు వేలు ఏం చేశాడు? వర్మపై ఏవిధంగా ప్రతికారం తీర్చుకున్నాడు అనేది మిగిలిన కథ.
ఓటీటీ; హాట్ స్టార్
విక్రమ్
ఈ సినిమా మరోసారి వింటేజ్ కమల్ హాసన్‌ను గుర్తు తెచ్చింది. ప్రతి ఫ్రేమ్‌లోనూ కమల్ హాసన్ తన యాక్టింగ్‌తో అదరగొట్టాడు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా భారీ విజయం సాధించింది. ఇక కథలోకి వెల్తే.. డ్రగ్ మాఫియా కేసును విచారిస్తున్న ఏజెంట్ విక్రమ్ సస్పెండ్ అయిన తర్వాత అండర్ గ్రౌండ్‌కు వెళ్తాడు. ఈ క్రమంలో డ్రగ్ మాఫియా డాన్ సంతానం మిస్ అయిన ఓ భారీ డ్రగ్ కంటైనర్ కోసం వెతుకుతుంటాడు. అండర్‌గ్రౌండ్‌లో ఉన్న విక్రమ్ తన కొడుకు చావుకు కారణమైన వ్యక్తిని చంపుతాడు. అసలు విక్రమ్ కొడుకును చంపిందెవరు? డ్రగ్ కంటైనర్‌ను దక్కించుకునేందుకు సంతానం ఎలాంటి క్రూరత్వాన్ని ప్రదర్శించాడు? విక్రమ్, సంతానం మధ్య వైరం ఎందుకొచ్చింది అన్నది మిగతా కథ.
ఓటీటీ; హాట్ స్టార్, జీ5
కాల్వన్
ఓ అడవిలో రాత్రి వేళ హత్యలు జరుగుతుంటాయి. కెంబన్ ఆ అడవి సమీపంలో అనాథలా జీవిస్తూ రాత్రి సమయాల్లో దొంగతనాలు చేస్తుంటాడు. హీరోయిన్ అతడి జీవితంలోకి రావడం.. కెంబన్ గురించి ఓ నిజం తెలుసుకోవడంతో కథ మలుపు తిరుగుతుంది. ఆ తర్వాత ఏమైంది? అన్నది కథ.
ఓటీటీ: హాట్‌స్టార్
అయాలన్
భవిష్యత్‌లో ఇంధన అవసరం చాలా ఉందని గ్రహించిన ఆర్యన్ (శరద్ ఖేల్కర్) భూమిని చాలా లోతుకు తవ్వాలని అనుకుంటాడు. దీంతో భూమిపై ఉన్న జీవరాశులకు ముప్పు ఉందని గ్రహించిన ఓ ఏలియన్ భారత్‌లో ల్యాండ్ అవుతుంది. అలా వచ్చిన ఏలియన్‌కు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? హీరో శివకార్తికేయన్‌కు ఏలియన్‌కు మధ్య సంబంధం ఏంటి? అన్నది కథ.
ఓటీటీ: సన్ నెక్ట్స్
మెర్రీ క్రిస్మస్
ఆల్బర్ట్ (విజయ్ సేతుపతి) ఏడేళ్ల తర్వాత బాంబేకు వస్తాడు. ఓ సినిమాకు వెళ్లగా అక్కడ కూతురుతో వచ్చిన మరియా (కత్రినా కైఫ్)తో పరిచయం ఏర్పడుతుంది. ఆమె క్రిస్మస్ వేడుకలకు ఇంటికి ఆహ్వానిస్తుంది. అయితే ఇంట్లో మరియా భర్త హత్యకు గురై కనిపిస్తాడు. ఆ హత్య చేసింది ఎవరు? ఆల్బర్ట్ గతం ఏంటి? అన్నది స్టోరీ.
ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్
అన్నపూర్ణి: ది గాడెస్ ఆఫ్ ఫుడ్
ఈ చిత్రం కాస్త వివాదాస్పదం అయింది. తమిళంలో హిట్ అయినప్పటికీ.. మిగతా భాషల్లో పెద్దగా ఆడలేదు. ఇక సినిమా కథలోకి వెళ్తే.. తమిళనాడులోని శ్రీరంగం ఆలయంలో రంగరాజ్ చెఫ్. ఆయన కూతురు అన్నపూరణి తండ్రిని చూసి చెఫ్ కావాలని అనుకుంటుంది. బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన ఈమె నాన్ వెజ్ ముట్టుకోవడం పాపం అని తండ్రి అంటాడు. మరి కలలు కన్నట్లు అన్నపూరణి చెఫ్ అయిందా? లేదా? అన్నది కథ.
జపాన్
ఈ చిత్రం కార్తీ నటించిన 25వ చిత్రం. ఈ సినిమాలో పేరుమోసిన దొంగ పాత్రలో కార్తీ అద్భుతంగా నటించాడు. అతని పాత్ర హెలెరియస్‌గా ఉంటుంది. హైదరాబాద్‌లోని రాయల్ జ్యువెలరీలో రూ.200 కోట్ల విలువలైన నగలు దోపిడికి గురవుతాయి. గోల్డెన్ స్టార్ జపాన్ (కార్తీ) ఈ దొంగతనం చేశాడని అంతా అనుమానిస్తారు. జపాన్‌ను పట్టుకునేందుకు హైదరాబాద్ పోలీసులు వెతుకుతుంటారు. మరోవైపు కేరళ, కర్ణాటక పోలీసులు కూడా జపాన్ కోసం గాలిస్తుంటారు. తన ప్రేయసిని కలిసే ప్రయత్నంలో జపాన్ దొరికిపోతాడు. అయితే ఆ సొత్తు జపాన్ దొంగలించలేదని విచారణలో తేలుతుంది. మరి ఆ నగల దొంగతనం చేసింది ఎవరు?
ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్
కెప్టెన్ మిల్లర్
కథ 1930 బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుంది. ఈసా (ధనుష్) నిమ్న కులానికి చెందిన యువకుడు. ఊరిలోని కుల వివక్షను భరించలేక గౌరవ మర్యాదల కోసం బ్రిటీష్ ఆర్మీలో చేరతాడు. తన పేరును కెప్టెన్ మిల్లర్‌గా మార్చుకుంటాడు. కొన్ని అనూహ్య ఘటనల నేపథ్యంలో మిల్లర్ దొంగల గ్యాంగ్‌లో చేరి బ్రిటిష్ వారికి కావాల్సిన బాక్స్‌ను ఎత్తుకెళ్తాడు. దీంతో బ్రిటిష్ ఆర్మీ అధికారి మిల్లర్‌ను పట్టుకోవడం కోసం అతడి ఊరి ప్రజల్ని బందిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? మిల్లర్ ఊరి ప్రజల కోసం తిరిగి వచ్చాడా? మిల్లర్ కొట్టేసిన బాక్స్‌లో ఏముంది? సినిమాలో శివరాజ్‌కుమార్, సందీప్ కిషన్ పాత్రలు ఏంటి? అన్నది కథ.
ఓటీటీ: ప్రైమ్ వీడియో
చిన్నా
మున్సిపాలిటీలో చిన్న ఉద్యోగం చేసుకునే చిన్నా ( సిద్ధార్థ్) తన అన్న చనిపోవడంతో... అతని కూతురు చిట్టి (సహస్ర శ్రీ) బాధ్యతలు తీసుకుంటాడు. ఈ క్రమంలో చిట్టి స్నేహితురాలేన మున్ని(సబియా) లైంగిక దాడికి గురవుతుంది. లైంగిక దాడి చేసింది చిన్నానే అని ఓ వీడియో బయటకు వస్తుంది. ఇంతలో చిట్టి కనిపించకుండా పోతుంది. నిజంగా మున్నిపై లైంగిక దాడి చేసింది చిన్నానేనా? అదృశ్యమైన చిట్టిని చిన్నా ఎలా కనిపెడుతాడు? అనేది మిగతా కథ
800
ఈ చిత్రంలో తొలుత విజయ్ సేతుపతి నటించినప్పటికీ.. తమిళనాడు నుంచి పెద్దఎత్తున ఆందోళనలు రావడంతో ఆయన ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. ఇక కథలోకి వెళ్తే.. తేయాకు తోటల్లో పనిచేస్తున్న తమిళ కుటుంబంలో ముత్తయ్య మురళీధరన్ జన్మిస్తారు. శ్రీలంకలోని కాండీలో ఆ కుటుంబం బిస్కెట్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తుంది. ఈ క్రమంలోనే సింహళులు, తమిళుల మధ్య ఘర్షణలు చెలరేగుతాయి. దాంతో ముత్తయ్య కుటుంబం ప్రాణ భయంతో దూరంగా వెళ్లి తలదాచుకుంటుంది. 70వ దశకంలో చెలరేగిన ఘర్షణల ప్రభావం తన బిడ్డపై పడకూడదని ముత్తయ్య తల్లిదండ్రులు ఏం చేశారు? ముత్తయ్యకి క్రికెట్‌పై ఆసక్తి ఎలా ఏర్పడింది? శ్రీలంక జట్టులో ఎలా చోటు సంపాదించాడు? ఎలాంటి అవమానాల్ని, సవాళ్లని ఎదుర్కొని ఆటగాడిగా నిలబడ్డాడు? అనేది మిగతా కథ.
ఓటీటీ: ప్రైమ్ వీడియో
మార్క్ ఆంటోనీ
మార్క్ (విశాల్) మెకానిక్‌గా పనిచేస్తుంటాడు. అతని స్నేహితుడు చిరంజీవి( సెల్వ రాఘవన్) ఒక టెలిఫోన్ మిషన్‌ను కనుగొంటాడు. ఆ టెలిఫొన్ మెషిన్ ద్వారా భూతకాలానికి చెందిన వ్యక్తులతో మాట్లాడవచ్చు. అయితే మార్క్ చనిపోయిన తన తండ్రి ఆంటోనికి కాల్ చేయాలనుకుంటాడు. ఆ క్రమంలో మార్క్ తన తండ్రిని కొంతమంది చంపాలనుకుంటున్నారన్న విషయం తెలుసుకుంటాడు.
ఓటీటీ: ప్రైమ్
నాయకుడు
అణగారిన వర్గానికి చెందిన మహారాజు రామాపురం ఎమ్మెల్యే. అయితే, అతడు, అతని కుమారుడు రఘు వీరకు కొన్నేళ్ల నుంచి మాట్లాడుకోవడం మానేశారు. మహారాజు జీవితంలో జరిగిన ఒక సంఘటన తండ్రి కోసం పోరాడేందుకు రఘుని ప్రేరేపిస్తుంది. ఇంతకు ఆ సమస్య ఏమిటి? వారు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం ఎందుకు మానేశారు?చివరికి ఏమి జరిగింది అనేది మిగిలిన కథ
ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్
సార్
బాలగంగాధర్ (ధనుష్ ) ఒక జూనియర్ మ్యాథ్స్ లెక్చరర్. సిరిపురం అనే గ్రామంలోని జూనియర్ కళాశాలకు మ్యాథ్స్ చెప్పడానికి వెళ్తాడు. అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ పాస్ అయ్యేలా చదువు చెబితే.. సీనియర్ మ్యాథ్స్ లెక్చరర్‌గా ప్రమోషన్ ఇస్తానని కాలేజీ యాజమాన్యం చెబుతుంది. అయితే, అక్కడ పరిస్థితులు బాలుకి అనుకూలంగా ఉండవు. అయినా, తన మాటలతో, చేతలతో ఆ సిరిపురం స్టూడెంట్స్‌ను ప్రభావితం చేస్తాడు. అనంతరం జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల వల్ల బాలు జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి. ఆ మార్పులు ఏమిటి అనేది మిగతా కథ
ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్
Best Kannada movies in telugu
కబ్జ
ఆర్కేశ్వర (ఉపేంద్ర), భారత వైమానిక దళ అధికారి, స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబంలో జన్మించాడు. అతను సంపన్నమైన అమ్మాయి అయిన మధుమతి (శ్రియా శరణ్)ను ప్రేమిస్తాడు. వీరిద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. ఇదేక్రమంలో అమరాపురను తమ అధికారం కోసం భయంకరమైన గూండాలు మరియు రాజకీయ నాయకులు ఓ క్రైమ్ వరల్డ్‌గా మార్చేస్తారు. అయితే అర్కేశ్వర క్రైమ్ ప్రపంచంలోకి ప్రవేశించి ఆ ప్రాంతానికి నాయకుడు ఎలా అవుతాడు? ఈ క్రమంలో అతను ఎదుర్కొన్న సవాళ్లు ఏంటి అనేది మిగతా కథ.
సప్తసాగరాలు దాటి సైడ్ బి
మను (రక్షిత్ శెట్టి) జైలు నుంచి వచ్చాక ఓ ఉద్యోగంలో చేరతాడు. తాను ప్రేమించిన ప్రియ (రుక్మిణి వసంత్) జ్ఞాపకాలే గుర్తుకు వస్తుండటంతో తనని వెతుకుతాడు. ప్రియ భర్త గోపాల్ దేశపాండే వ్యాపారంలో నష్టాలు రావడంతో తాగుడికి బానిసైపోయి ఇంటిని పట్టించుకోడు. దీంతో ప్రియ కష్టపడుతూ ఇంటిని నడుపుతుంది. తాను ప్రేమించిన అమ్మాయి సంతోషంగా లేదని తెలిసిన మను ఆమెని సంతోషంగా ఉంచడానికి ఏం చేశాడు ? వాళ్ళ కష్టాలు ఎలా తీర్చాడు? అన్నది మిగతా కథ.
ఓటీటీ; ప్రైమ్ వీడియో
ఘోస్ట్
బిగ్ డాడీ అలియాస్ ఘోస్ట్ తన గ్యాంగ్‌తో కలిగి ఓ జైలును ఆక్రమిస్తాడు. మాజీ సీబీఐ అధికారి వామన్ శ్రీనివాస్ కిడ్నాప్ చేస్తాడు. దీంతో ఈ కేసును సాల్వ్ చేయడానికి ప్రభుత్వం చరణ్ రాజ్‌ని రంగంలోకి దించుతుంది. ఇంతకీ ఈ బిగ్ డాడీ ఎవరు ? అతని గతం ఏమిటి ? అసలు అతను ఘోస్ట్‌గా ఎందుకు మారాడు ? అన్నది మిగతా కథ.
ఓటీటీ: జీ5
బాయ్స్ హాస్టల్
ఓ బాయ్స్ హాస్టల్‌లో తన ఫ్రెండ్స్‌తో కలిసి ఉండే అజిత్ (ప్రజ్వల్) ఓ షార్ట్ ఫిల్మ్ తీయాలని స్క్రిప్ట్ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాడు. తమని టార్చర్ చేసే హాస్టల్ వార్డెన్‌ను తన ఫ్రెండ్స్‌తో కలిసి చంపేసినట్లుగా స్క్రిప్ట్‌లో రాసుకుంటాడు. అయితే నిజంగానే వార్డెన్ చనిపోతాడు. సుసైడ్ నోట్‌లో అజిత్, అతడి ఫ్రెండ్స్ పేరు రాయడంతో కథ మలుపు తిరుగుతుంది.
ఓటీటీ: ఈటీవీ విన్
కాటేరా
ఈ సినిమా కన్నడ నాట బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇక కథలోకి వెళ్తే.. భూస్వామిని చంపిన కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న కాటేరా (దర్శన్) పెరోల్ మీద బయటకు వస్తాడు. దీంతో కాటేరాను చంపేందుకు చాలా మంది ప్రయత్నిస్తుంటారు. వారందరూ ఎవరు? కాటేరా భూస్వామిని ఎందుకు చంపాడు? భూస్వాములతో కాటేరాకు ఏంటి విరోధం? అన్నది కథ.
ఓటీటీ: జీ5
టోబి
టోబి చిన్నప్పటి నుంచి ఎన్నో వేధింపులకు గురవుతాడు. కోపం వస్తే అందరితో దారుణంగా ప్రవరిస్తుంటాడు. నిజానికి అమాయకుడైన టోనీని ఊరిపెద్ద ఆనంద హత్యలు చేసేందుకు ఉపయోగించుకుంటాడు. తనను వాడుకుంటున్నారని తెలుసుకున్న టోబి ఏం చేశాడు? ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు? అన్నది కథ.
ఓటీటీ: సోనీ లీవ్
Best Hindi movies in telugu
అమర్ సింగ్ చమ్కిలా
జానపద గాయకుడు అమర్ సింగ్ చమ్కిలా జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. పేద కుటుంబంలో జన్మించిన ఆయన సింగర్ కావడాని కసితో ఎలా ఎదిగాడు? 27 ఎళ్లతో ఎంతో ఫేమస్ అయిన అతన్ని ఎవరు చంపారు అన్నది మిగతా కథ.
ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్
యానిమల్
ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. సినిమాలో సన్నివేశాలపై అభ్యంతరాలు వ్యక్తమైనప్పటికీ వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ ఘన విజయం సాధించింది. ఈ చిత్రం విజయంతో రణ్‌బీర్ కపూర్ మార్కెట్ దేశవ్యాప్తంగా పెరిగింది. దేశంలోని అత్యంత సంపన్నుల్లో బల్బీర్ సింగ్ (అనిల్ కపూర్) ఒకరు. ఆయన కుమారుడు రణ్ విజయ్ సింగ్ (రణబీర్ కపూర్). తండ్రి అంటే అమితమైన ప్రేమ. అయితే తన దూకుడు మనస్తత్వం కారణంగా హీరోకి తండ్రితో దూరం పెరుగుతుంది. దీంతో అమెరికా వెళ్లిపోతాడు. ఓ రోజు తండ్రిపై హత్యయాత్నం జరిగినట్లు తెలిసుకొని విజయ్ ఇండియాకు వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? బల్బీర్‌పై దాడి చేసిన వారిపై హీరో ఎలా ప్రతికారం తీర్చుకున్నాడు? అన్నది కథ.
ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్
మైదాన్
1952లో జరిగిన ఒలింపిక్స్ పోటీల్లో భారత ఫుట్‌బాల్ జట్టు.. విఫలమవుతుంది. దీంతో జట్టును టార్గెట్ చేస్తూ విమర్శలు వస్తాయి. అప్పుడు కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ (అజయ్ దేవగన్) ఏం చేశాడు? కొత్త ఆటగాళ్లతో తన ప్రయాణాన్ని ఎలా మెుదలుపెట్టాడు? ఒలింపిక్స్‌లో ఆ జట్టు ఎలాంటి ప్రదర్శన చేసింది? భారత జట్టు కోచ్‌గా అతడు ఏం సాధించాడు? అన్నది కథ.
ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్
లస్ట్ స్టోరీస్ 2
లస్ట్ స్టోరీస్ 2లో మొత్తం నాలుగు కథలు ఉంటాయి. మొదటి కథలో మృణాల్, అంగన్ బేడీ పెళ్లి చేసుకోవాలనుకుంటారు. పెద్దలు కూడా ఒప్పుకుంటారు. అయితే మృణాల్ నానమ్మ.. పెళ్లికి ప్రేమ కంటే బలమైన శారీరక సంబంధం ముఖ్యమని స్పష్టం చేస్తుంది. ఆ తర్వాత మృణాల్- బేడీ ఎం చేశారన్నది ఫస్ట్ కథ. రెండో కథలో ఓనర్ లేనప్పుడు పనిమనిషి తన భర్తను తెచ్చుకుని లైంగికానందం పొందుతుంది. అయితే వీరిద్దరిని చూసిన ఓనర్ ఏం చేసింది అనేది రెండో కథ. ఇక మూడో కథలో ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అయిన విజయ్ వర్మ కొన్నేళ్ల తర్వాత తమన్నను కలుస్తాడు. వీరిద్దరు శారీరకంగా దగ్గరైన తర్వాత ఏం జరిగింది అనేది కథ. నాల్గొ కథలో కామంతో రగిలిపోతున్న తన భర్త విషయంలో కాజల్ ఏమి చేసింది అనేది కథ.. ఈ చిత్రంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినప్పటికీ ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించిందని చెప్పవచ్చు.
ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్
మర్డర్ ముబారక్
రాయల్ ఢిల్లీ క్లబ్‌లో ఓ మృతదేహం కలకలం సృష్టిస్తుంది. ఈ మిస్టరీని ఛేదించేందుకు ఏసీపీ సింగ్ రంగంలోకి దిగుతాడు. క్లబ్‌లో సభ్యులుగా ఉన్న బాంబి (సారా అలీఖాన్), నటి షెహనాజ్ నూరాని (కరిష్మా కపూర్), రాయల్ రన్‌విజయ్ (సంజయ్ కపూర్), లాయర్ ఆకాష్ (విజయ్ వర్మ)లపై అనుమానం వ్యక్తం చేస్తాడు. ఇంతకీ ఆ మర్డర్ చేసింది ఎవరు? దర్యాప్తులో తేలిన అంశాలేంటి? అన్నది కథ.
ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్
భక్షక్
జర్నలిస్టు వైశాలి.. యూట్యూబ్ ఛానెల్ ద్వారా స్థానిక వార్తలు అందిస్తుంటుంది. ఊరిలోని అనాథ బాలికల వసతి గృహంలో లైంగిక దాడులు జరుగుతున్నట్లు ఆమెకు తెలుస్తుంది. అయితే దానిని రాజకీయంగా పలుకుబడి ఉన్న వ్యక్తి నిర్వహిస్తుంటాడు. అతడి దారుణాలను వైశాలి ఎలా బయటపెట్టింది? ఈ క్రమంలో ఎదురైన సవాళ్లు ఏంటి? అన్నది కథ.
ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్
గంగూభాయి కతియావాడి
ఈ చిత్రం అలియా భట్ నటనకు జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చింది. జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా ఎంపికైంది. ఇక ఈ సినిమా కథలోకి వెళ్తే.. గంగూబాయి హర్జీవందాస్ (అలియా భట్) గుజరాత్‌లోని ఓ పెద్ద కుటుంబంలో పుడుతుంది. ఆమెకు చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఇష్టం. ఆ ఇష్టాన్ని ఆసరా చేసుకున్న గంగుభాయ్ లవర్ ఆమెను ముంబై తీసుకొచ్చి అక్కడ వేశ్య గృహానికి అమ్మేస్తాడు. తప్పని పరిస్థితుల్లో ఆమె వేశ్యగా కొనసాగుతుంది. కొన్ని నాటకీయ పరిణామాల తర్వాత.. గంగూబాయి ఓ కీలక నిర్ణయం తీసుకుంటుంది. ఆ నిర్ణయం ఏమిటి? వేశ్యల అభ్యున్నతి ఆమె ఏం చేసింది అనేది మిగతా కథ.
ఓటీటీ; నెట్‌ఫ్లిక్స్
83
1983 నాటి క్రికెట్ ప్రపంచకప్‌ను ఇండియా గెలుచుకున్న నేపథ్యాన్ని ఈ చిత్రం ఆవిష్కరిస్తుంది. ఆ క్రమంలో ఆటగాళ్లు ఎదురుకున్న సమస్యలు, ప్రత్యర్థుల నుంచి వచ్చిన సవాళ్ళను ఎలా అధిగమించారు ? ఎలా కప్ గెలిచారు ? అనేది మిగతా కథ
ఓటీటీ; డిస్నీ హాట్ స్టార్
జవాన్
సరిహద్దుల్లో తీవ్ర గాయాలతో పడిపోయిన ఓ వ్యక్తిని తల్లి కొడుకులు రక్షిస్తారు. అతను కోమాలోకి వెళ్లగా గ్రామానికి తీసుకెళ్లి వైద్యం చేయిస్తారు. ఇదే సమయంలో ఆ ఊరిపై కొందరు పదునైన ఆయుధాలతో దాడి చేస్తారు. కోమాలో నుంచి బయటకు వచ్చిన ఆ వ్యక్తి వారిని తరిమికొడతాడు. దీంతో ఆ గ్రామ ప్రజలు అతన్ని దేవుడిలా పూజిస్తారు. అప్పుడు ఆ వ్యక్తి తాను ఎవర్ని అని వారిని ప్రశ్నిస్తాడు. దీనికి జవాబు తాను పెద్దయ్యేలోపు కనుగొంటానని కాపాడిన పిల్లోడు ప్రామిస్ చేస్తాడు. ఇంతకు ఆ వ్యక్తి ఎవరు? పిల్లాడితో అతనికి ఉన్న సంబంధం ఏమిటి అన్నది మిగతా కథ.
ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్
గదర్ 2
బాలీవుడ్‌లో చిత్రాలు వరుసగా ప్లాఫ్ అవుతున్న క్రమంలో వచ్చిన ఈ సినిమా విజయం ఇండస్ట్రీకి ఊపిరి పోసింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ఇక కథలోకి వెళ్తే.. తారా సింగ్ (సన్నీ డియోల్) భారత సరిహద్దుల్లో కనిపించకుండా పోతాడు. పాక్ అతడ్ని బంధించిందని భావించిన అతడి కొడుకు.. మారువేషంలో శత్రు దేశానికి వెళ్తాడు. అనూహ్యాంగా ఇంటికి తిరిగొచ్చిన తారా సింగ్.. కొడుకు పాక్‌లో ఉన్న సంగతి తెలుసుకుంటాడు. బిడ్డను కాపాడేందుకు పాక్ వెళ్తాడు. అక్కడ ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? అన్నది స్టోరీ.
ఓటీటీ: ప్రైమ్ వీడియో
మే 20 , 2024
Operation Valentine Review In Telugu: ఫైటర్ పైలెట్‌గా అదరగొట్టిన వరుణ్ తేజ్.. సినిమా హిట్టా? ఫట్టా?
నటీనటులు: వరుణ్‌తేజ్, మానుషి చిల్లర్, నవదీప్, మిర్ సర్వర్, రుహానీ శర్మ తదితరులు
దర్శకత్వం: శక్తి ప్రతాప్ సింగ్ హడా
సంగీతం: మిక్కీ జే మేయర్
సినిమాటోగ్రఫీ: హరి కె. వేదాంతం
ఎడిటింగ్: నవీన్ నూలి
సంభాషణలు: సాయి మాధవ్ బుర్రా
నిర్మాత: సోనీ పిక్చర్స్, సందీప్ ముద్ద
విడుదల: 01-03-2024
వరుణ్‌తేజ్ (Varun Tej) హీరోగా దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్’ (Operation Valentine). మానుషి చిల్లర్ (Manushi Chhillar) కథానాయిక. మన వైమానిక దళ వీరుల అసమానమైన ధైర్య సాహసాల్ని, దేశాన్ని రక్షించడంలో వారు ఎదుర్కొంటున్న సవాళ్లను ఈ సినిమాలో చూపించనున్నట్లు ఇప్పటికే చిత్ర బృందం ప్రకటించింది. తెలుగులో రూపొందిన తొలి ఏరియల్ యాక్షన్ చిత్రం ఇదే కావడంతో ఈ సినిమాపై అందరి దృష్టి పడింది. తెలుగుతో పాటు హిందీలోనూ ఏకకాలంలో నిర్మాణం జరుపుకొని ఇవాళ ‘ఆపరేషన్ వాలెంటైన్’ ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉంది? ఫైటర్ పైలట్ పాత్రలో ఎలా చేశాడు? వరుణ్ ఖాతాలో హిట్ పడిందా? లేదా? ఇప్పుడు చూద్దాం.
కథ
అర్జున్ రుద్రదేవ్ అలియాస్ రుద్ర (వరుణ్‌తేజ్) ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో స్వ్కాడ్రన్ లీడర్. ‘ఏం జరిగినా చూసుకుందాం’ అంటూ దూకుడు ముందుకు వెళ్లిపోతుంటాడు. వైమానిక దళంలోనే పనిచేసే రాడార్ ఆఫీసర్ అహనా గిల్ (మానుషి చిల్లర్)తో రుద్ర ప్రేమలో ఉంటాడు. ప్రాజెక్ట్ వజ్ర కోసం నడుం కట్టిన సమయంలోనే రుద్రకు ఓ చేదు అనుభవం ఎదురవుతుంది. దాన్నుంచి బయటపడుతున్న క్రమంలోనే అతడు ఆపరేషన్ వాలెంటైన్ కోసం రంగంలోకి దిగుతాడు. ఆ ఆపరేషన్ వెనక ఉన్న కథేమిటి? ప్రాజెక్ట్ వజ్ర లక్ష్యమేమిటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎవరెలా చేశారంటే
వరుణ్ తేజ్ (Operation Valentine Review in telugu) కెరీర్ బెస్ట్ నటనతో ఈ సినిమాలో ఆకట్టుకున్నాడు. నిజమైన ఫైటర్ పైలెట్‌లా తన పాత్రలో ఒదిగిపోయాడు. భావోద్వేగ సన్నివేశాల్లోనూ మంచి పరిణితి కనబరిచి ప్రతిభ చూపించాడు. హీరోయిన్‌గా మానుషి చిల్లర్ ప్రాధాన్యత ఉన్న పాత్రలోనే నటించింది. దాదాపుగా సినిమా అంతా హీరో హీరోయిన్లే తెరపై కనిపిస్తారు. వీళ్ల జంట చూడటానికి చాలా బాగుంది. మిగిలిన పాత్రలన్నీ పరిమితంగానే కనిపిస్తాయి. వారు తమ పరిధి మేరకు నటించి పర్వాలేదనిపించాడు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
భారత్, పాకిస్థాన్ మధ్య జరిగిన నిజమైన సంఘటనల స్ఫూర్తితో డైరెక్టర్ శక్తి ప్రతాప్ సింగ్ హడా ఈ చిత్రాన్ని రూపొందించారు. 2019లో ఉగ్రవాదులు జరిపిన పుల్వామా దాడులు మొదలుకొని, దానికి ప్రతిగా భారత వైమానిక దళం జరిపిన బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ వరకూ పలు సంఘటనలు ఇందులో ప్రతిబింబిస్తాయి. శత్రు స్థావరాలను ధ్వంసం చేయడం, దేశ భక్తి ప్రధానంగా సాగే సీన్స్, పతాక సన్నివేశాలను డైరెక్టర్ చాలా బాగా తెరకెక్కించారు. అయితే నాయకా నాయికల మధ్య సాగే ప్రేమకథలోనే గాఢత చూపలేకపోయారు. కథ దాదాపుగా అందరికే తెలిసిందే కావడం.. రచన పరంగా మరిన్ని కసరత్తులు చేయకపోవడం మైనస్ అని చెప్పవచ్చు. ఇక కథనంలో కూడా ఎక్కడ బలం ఉన్నట్లు అనిపించదు. ఈ మధ్యే వచ్చిన ‘ఫైటర్’ కథకి ఆపరేషన్ వాలెంటైన్ స్టోరీకి దగ్గరి పోలికలు కనిపిస్తాయి.
టెక్నికల్‌గా
సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. ముఖ్యంగా విజువల్స్ ఆకట్టుకుంటాయి. (Operation Valentine Review in telugu) మిక్కీ జె.మేయర్ సంగీతం మెప్పిస్తుంది. యాక్షన్ సన్నివేశాలను నేపథ్య సంగీతం చాలా బాగా ఎలివేట్ చేసింది. నిర్మాణ విలువలు కూడా ఉన్నతంగా ఉన్నాయి. బడ్జెట్ పరంగా పరిమితులున్నా నాణ్యమైన విజువల్స్‌తో సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.
ప్లస్ పాయింట్స్
వరుణ్‌తేజ్ నటనవిజువల్స్‌యుద్ధ సన్నివేశాలు
మైనస్ పాయింట్స్
కథనంహీరో, హీరోయిన్ కెమెస్ట్రీ
Telugu.yousay.tv Rating : 3/5
Click Here For English Review
https://telugu.yousay.tv/strongvarana-taja-varun-tej-garacha-maka-talayana-asakatakaramana-sagatala-strong.html
మార్చి 01 , 2024
Fighter Movie Review: శత్రుదేశానికి చుక్కలు చూపించిన హృతిక్.. ‘ఫైటర్’ ఎలా ఉందంటే?
నటీనటులు: హృతిక్ రోషన్, దీపికా పదుకొణె, అనిల్ కపూర్, కరణ్ సింగ్ గ్రోవర్, అక్షయ్ ఒబెరాయ్, సంజీవ్ జైశ్వాల్ తదితరులు
రచన, దర్శకత్వం: సిద్ధార్థ్ ఆనంద్
సంగీతం: విశాల్ - శేఖర్
నేపథ్య సంగీతం: సంచిత్ బల్హారా - అంకిత్
సినిమాటోగ్రఫీ: సచిత్ పాలోస్
ఎడిటింగ్: ఆరిఫ్ షేక్
విడుదల: 25-01-2024
బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ (Hrithik Roshan) హీరోగా, సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఫైటర్’ (Fighter). బాలీవుడ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసిన ‘వార్’ చిత్రం తర్వాత హృతిక్ - ఆనంద్ కాంబోలో మరోమారు ఈ చిత్రం వస్తుండటంతో భారీగా అంచనాలు పెరిగిపోయాయి. పైగా సిద్దార్థ్ ఆనంద్ రీసెంట్ చిత్రం ‘పఠాన్’ సూపర్ హిట్ కావడంతో (Fighter Movie Review In Telugu) అందరి దృష్టి ఈ చిత్రంపై పడింది. ఇందులో హృతిక్‌కు జోడీగా దీపికా పదుకునే నటించింది. ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ఎలా ఉంది? హృతిక్ చేసిన యాక్షన్ అడ్వెంచర్స్ ఆకట్టుకుందా? సిద్దార్థ్ ఆనంద్ ఖాతాలో మరో హిట్ చేరినట్లేనా? ఇప్పుడు చూద్దాం.
కథేంటి
సంషేర్ పఠానియా అలియాస్ పాటీ (హృతిక్ రోషన్) భారత వైమానిక దళంలో స్క్వాడ్రన్ లీడర్. సాహసాలకి వెనుకాడని ఫైటర్ పైలట్. ఓ ఆపరేషన్ కోసం శ్రీనగర్ వస్తాడు. రాకీ (అనిల్ కపూర్) నేతృత్వంలో మిన్ను (దీపికా పదుకొణె), తాజ్ (కరణ్ సింగ్ గ్రోవర్), బాష్ (అక్షయ్ ఒబెరాయ్) బృందం కూడా ఆ మిషన్ కోసం అతడితో పాటు రంగంలోకి దిగుతుంది. గగనతలంలో శత్రువులపై వాళ్ల పోరాటం ఎలా సాగింది? (Fighter Movie Review) పాటీని వెంటాడుతున్న గతం ఏమిటి? తనకు ఎదురైన సవాళ్లని దాటి పాటీ వీరోచిత ఫైటర్‌గా ఎలా నిలిచాడు? అన్నది కథ.
ఎవరెలా చేశారంటే
హృతిక్‌రోషన్ (Hrithik Roshan) ఎప్పటిలాగే అద్భుతంగా నటించాడు. ఎంతో స్టైలిష్‌గా కనిపిస్తూనే పోరాట ఘట్టాల్లో తన మార్క్ ఏంటో చూపించాడు. కళ్లతో భావాల్ని పలికిస్తూ చాలా సన్నివేశాల్లో భావోద్వేగాలను రగిలించాడు. అటు హృతిక్‌కు జోడీగా దీపికా పదుకునే (Deepika Padukone) చక్కటి నటన కనబరిచింది. ద్వితియార్థంలో తన నటనతో భావోద్వేగాల్ని పండించింది. అనిల్ కపూర్ (Anil Kapoor) చిత్రంలో కీలకపాత్ర పోషించాడు. రాకీ పాత్రలో ఆయన ఒదిగిపోయారు. కరణ్ సింగ్ గ్రోవర్, అక్షయ్ ఒబెరాయ్ తదితరులు పాత్రల పరిధి మేరకు నటించారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే?
భారత వాయుసేన చుట్టూ సాగే కథ ఇది. యాక్షన్, నేపథ్యం, విజువల్స్ పరంగా ‘ఫైటర్’ (Fighter Movie Review In Telugu) పర్వాలేదు కానీ కథ, కథనాల పరంగానే నిరుత్సాహ పరుస్తాడు. తర్వాత ఏం జరుగుతుందనే ఉత్సుకతని దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్ ప్రేక్షకుల్లో ఏమాత్రం కలిగించలేకపోయారు. అయితే శత్రుదేశమైన పాక్ ఉగ్రవాదులతో పన్నిన పన్నాగాలను వైమానిక దళం ఎలా ఎదుర్కొందో చూపించిన తీరు బాగుంది. హాలీవుడ్ చిత్రాల్ని తలదన్నే రీతిలో సన్నివేశాల్ని తీర్చిదిద్దడంలో దర్శకుడు సఫలమయ్యాడు. వాటికి దేశభక్తిని జోడించడం కలిసొచ్చింది. కథ, కథనాన్ని పక్కన పెడితే డైరెక్టర్‌గా సిద్ధార్థ్ ఆనంద్ మరోమారు సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు.
సాంకేతికంగా
సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. సచిత్ కెమెరా పనితనం ఆకట్టుకుంది. ముఖ్యంగా గగనతలంలో వచ్చే యాక్షన్ సీన్లను ఆయన అద్భుతంగా చూపించారు. ఇక సంచిత్-అంకిత్ నేపథ్య సంగీతం, విశాల్-శేఖర్ పాటలు చిత్రానికి ప్రధానబలంగా నిలిచాయి. నిర్మాణ విలువలు చాలా ఉన్నతంగా ఉన్నాయి. బడ్జెట్ విషయంలో నిర్మాతలు రాజీపడినట్లు ఎక్కడా కనిపించలేదు.
ప్లస్ పాయింట్స్
హృతిక్, దీపిక, అనిల్ కపూర్ నటనయాక్షన్ సన్నివేశాలుసంగీతం
మైనస్ పాయింట్స్
రొటిన్ స్టోరీఊహకందే సన్నివేశాలు
రేటింగ్: 3/5
జనవరి 25 , 2024
TIGER 3 Review in Telugu: సల్మాన్ ఖాన్ యాక్షన్‌తో అదరగొట్టాడు.. కానీ!
నటీనటులు: సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్, రేవతి, ఇమ్రాన్ హష్మీ, సిమ్రాన్, రద్ధీ డోంగ్రా, అనీష్ కురువిల్లా, కుముద్ మిశ్రా, మాస్టర్ విశాల్ జేత్వా, రణ్వీర్ షోరే.
డైరెక్టర్: ఆదిత్య చోప్రా
ప్రొడ్యూసర్: ఆదిత్య చోప్రా
మ్యూజిక్: తనూజ్ టికు
ఎడిటర్: రామేశ్వర్ S. భగత్
స్క్రీన్ ప్లే: శ్రీధర్ రాఘవన్
సినిమాటోగ్రఫీ: అనయ్ గోస్వామి
విడుదల తేదీ: 12/11/2023 (దీపావళి రోజున)
సల్మాన్ ఖాన్(TIGER 3 Review in Telugu) లెటెస్ట్ స్పై యాక్షన్ డ్రామా 'టైగర్ 3' దీపావళి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఏక్‌థా టైగర్, టైగర్ జిందాహై సినిమాకు ఇది సీక్వెల్. మొదట వచ్చిన ఈ రెండు చిత్రాలు సూపర్ హిట్ కావడంతో టైగర్ 3పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ట్రైలర్, టీజర్‌లో సల్మాన్ మాస్ యాక్షన్, కత్రినా కైఫ్ బ్యూటీ సినిమాపై అంచనాలను పెంచాయి. మరి టైగర్ 3 ఇంతకు ఎలా ఉంది? ప్రేక్షకుల అంచనాలను అందుకుందా? లేదా అనే విషయాలను ఈ రివ్యూలో చూద్దాం.
కథ:
అవినాష్ అలియాస్ టైగర్(సల్మాన్ ఖాన్) భారత దేశం తరఫున 'రా' ఏజెంట్‌గా పనిచేస్తుంటాడు. ఆయన భార్య జోయా(కత్రినా కైఫ్) పాకిస్థాన్‌కు చెందిన మాజీ ISI ఏజెంట్. అయితే టైగర్ పాకిస్థాన్‌లో రా ఏజెంట్ గోపీ( రణ్వీర్ షోరే)ని ఉగ్రవాదుల నుంచి కాపాడుతాడు. అయితే గోపీ చనిపోయే ముందు జోయా గురించి ఓ నమ్మలేని నిజాన్ని చెబుతాడు. తన భార్య ఐస్ఐ ఏజెంట్ అని తెలుసుకున్న టైగర్ ఏం చేశాడు? అసలు జోయా తన భర్తను ఎందుకు మోసం చేసింది. భారత్- పాకిస్థాన్ ప్రభుత్వాలు వీరిద్దరి కోసం ఎందుకు వెతుకుతాయి అనేది మిగిలిన కథ
ఎలా ఉందంటే?
టైగర్ 3 సినిమా.. ఏక్ థా టైగర్, టైగర్ జిందా హై రేంజ్‌లో మాత్రం లేదు. భారీ యాక్షన్ విజువల్స్‌తో తెరకెక్కిన ఈ చిత్రం అక్కడక్కడ ఆకట్టుకుంటుంది. సినిమాలో శత్రుదేశాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు 'భార్య భర్తలు' అయితే అనే పాయింట్ బాగున్నప్పటికీ.. దానికి తగ్గట్టుగా కథనం లేకపోవడం మైనస్ అని చెప్పాలి. సినిమా ఫస్టాఫ్, ఇంటర్వెల్ బ్యాంగ్ సినిమాకు మైనస్. ఎందుకంటే ఈ పార్ట్‌లో కథనం బలహీనంగా ఉంది. అయితే సెకండాఫ్‌లో(TIGER 3 Review in Telugu) వచ్చే యాక్షన్ సీక్వెన్స్ , క్లైమాక్స్ సీన్లు కొద్దిమేరకు మెప్పిస్తాయి. సులువుగా ప్రేక్షకుడు గెస్ చేసే స్క్రీప్ట్‌ను శ్రీధర్ రాఘవన్ రాసుకున్నట్లు తెలుస్తోంది. ఇంకాస్త దీనిపై వర్క్ చేస్తే బాగుండేది. స్పై సినిమాలు అంటే ఆద్యంతం ఉత్కంఠ, ప్రతి సీన్‌లో ట్విస్ట్‌ను ప్రేక్షకుడు ఊహిస్తాడు. కానీ టైగర్ 3 సినిమాలో అవేమి కనిపించలేదు. ప్రేక్షకున్ని సినిమాలో ఎంగేజ్ చేయకుండా కథ సాగిందని చెప్పవచ్చు. సినిమా చివర్లో సల్మాన్ ఖాన్‌ను రక్షించేందుకు షారుఖ్ ఖాన్ రావడం, క్లైమాక్స్ సీన్‌లో హృతిక్ ఎంట్రీ సీన్లు ప్రేక్షకులను అలరిస్తాయి.
ఎవరెలా చేశారంటే
సల్మాన్ ఖాన్ వన్ మ్యాన్ ఆర్మీ షో చేశాడు. టైగర్ పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. తన పాత్రలో జీవించాడు. తన యాక్షన్ స్టైల్‌తో ఇరగదీశాడు. ఆయనపై వచ్చిన కొన్ని ఎలివేషన్ సీన్లు గూస్ బంప్స్ తెప్పిస్తాయి. ఎమోషనల్ సీన్లలోనూ సల్మాన్ అద్భుతంగా నటించాడు. ఇక సల్మాన్- కత్రినా జంట కూడా స్క్రీన్‌పై ఆకట్టుకుంది. కత్రినా కాస్త ఓల్డ్ లుక్‌లో కనిపించినప్పటికీ యాక్టింగ్ బాగా చేసింది. తన బోల్డ్ లుక్స్‌తో ప్రేక్షకులకు కనువిందు చేసింది. ముఖ్యంగా టవల్ ఫైట్ సీన్‌లో ఆమె అందం యువ ప్రేక్షకులను రంజింపజేస్తుంది. ఇక విలన్‌గా నటించిన ఇమ్రాన్ హష్మీ తన పాత్ర పరిధిమేరకు నటించాడు. రా చీఫ్‌గా రేవతి, పాక్ ప్రైమ్ మినిస్టర్‌గా సిమ్రాన్ మెప్పించింది. క్లైమాక్స్‌లో పఠాన్‌గా వచ్చిన షారుక్ ఖాన్, హృతిక్ రోషన్ సీన్లు సినిమాకే హైలెట్.
టెక్నికల్ పరంగా
సాంకేతికంగా టైగర్ 3 సినిమా ఉన్నతంగా ఉంది. అనయ్ గోస్వామి సినిమాటోగ్రఫీ సినిమాకే బాగా ప్లస్ అయింది. యాక్షన్ సీక్వెన్స్‌లో ఆయన పడిన కష్టం తెలుస్తుంది. ఇక తనూజ్ టీకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అలరిస్తుంది. యాక్షన్ సీన్లను(TIGER 3 Review) ఎలివేట్ చేసిందని చెప్పవచ్చు. డైరెక్టర్ ఆదిత్య చోప్రా ఇంకా బలమైన కథ రాసుకున్నప్పటికీ... అందుకు తగిన సీన్లు, కథనం పెట్టుకోవడంలో ఫెయిల్ అయ్యాడు. ఉత్కంఠ భరితంగా సాగాల్సి కథనాన్ని ప్రేక్షకుడు ఊహించే విధంగా సాగింది.
బలాలు
సల్మాన్ ఖాన్ యాక్షన్ సీన్లు, కత్రినా కైఫ్ బోల్డ్ లుక్స్షారుఖ్ ఖాన్ కెమియో రోల్
బలహీనతలు
స్క్రీన్ ప్లేసహజత్వం లేని కొన్ని సీన్లుప్రేక్షకుడు ఊహించదగిన కథనం
చివరగా:
హై వోల్టేజ్ యాక్షన్ స్పై మూవీగా వచ్చిన టైగర్ 3లో.. సల్మాన్ ఖాన్ యాక్షన్ సీన్లు, కత్రినా కైఫ్ బోల్డ్ లుక్స్, షారుఖ్ ఎంట్రీ ప్రేక్షకులను మెప్పిస్తాయి. ఈ సినిమా సల్మాన్ ఖాన్ ఫ్యాన్స్‌తో పాటు ఇతర యాక్షన్ సీక్వెన్స్ ఇష్టపడే ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. మిగతా సగటు ప్రేక్షకులకు సినిమా నచ్చకపోవచ్చు.
రేటింగ్: 2.5/5
నవంబర్ 12 , 2023