రివ్యూస్
How was the movie?
తారాగణం
నవీన్ పొలిశెట్టి
ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ అకా శీనుశృతి శర్మ
స్నేహశ్రద్ధా రాజగోపాలన్వసుధ
అప్పాజీ అంబరీష దర్భవసుధ తండ్రి
సుహాస్
ఏజెంట్ బాల వెంకట సుబ్రహ్మణ్య స్వామి అకా బాబీకృష్ణేశ్వరరావు
గోపాలం/మారుతీరావుప్రశాంత్ యర్రమిల్లిశిరీష్
క్రాంతి ప్రియంPWD అధికారి
సూరి కె. చాప్లిన్
లావణ్యఅజయ్ భార్య
మహిజహర్ష భార్య
సందీప్ రాజ్అజయ్
విను వర్మహర్ష
సిబ్బంది
స్వరూప్ RSJదర్శకుడు
రాహుల్ యాదవ్ నక్కానిర్మాత
మార్క్ K. రాబిన్సంగీతకారుడు
ఎడిటోరియల్ లిస్ట్
కథనాలు
నవీన్ పొలిశెట్టి (Naveen Polishetty) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
స్వయంకృషితో ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు నవీన్ పొలిశెట్టి. చిన్న చిన్న క్యారెక్టర్లు చేసుకుంటూ అంచెలంచెలుగా హీరో స్థాయికి ఎదిగాడు. హీరోగా తొలి సినిమా ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయతో విమర్శకుల ప్రశంసలు పొందాడు. జాతిరత్నాలు, మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి విజయాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. టాలీవుడ్‌లో కామెడీ స్టార్‌గా ఎదిగిన నవీన్ పొలిశెట్టి గురించి చాలా మందికి తెలియని కొన్ని విషయాలు ఇప్పుడు చూద్దాం.
నవీన్ పొలిశెట్టి హీరోగా తొలి సినిమా?
ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ
నవీన్ పొలిశెట్టి ఎత్తు ఎంత?
5 అడుగుల 10 అంగుళాలు
నవీన్ పొలిశెట్టి ఎక్కడ పుట్టాడు?
హైదరాబాద్
నవీన్ పొలిశెట్టి పుట్టిన తేదీ ఎప్పుడు?
1990, డిసెంబర్ 26
నవీన్ పొలిశెట్టికి వివాహం అయిందా?
ఇంకా జరగలేదు.
నవీన్ పొలిశెట్టి ఫెవరెట్ హీరో?
మహేష్ బాబు, అనిల్ కపూర్
నవీన్ పొలిశెట్టి తొలి హిట్ సినిమా?
ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ
నవీన్ పొలిశెట్టి గుర్తింపునిచ్చిన చిత్రం?
జాతి రత్నాలు
నవీన్ పొలిశెట్టి ఇష్టమైన కలర్?
బ్లాక్
నవీన్ పొలిశెట్టి తల్లిదండ్రుల పేరు?
మంజుల(బ్యాంక్ ఉద్యోగి), రాజ్‌కుమార్( ఫార్మస్యూటిక్ బిజినెస్)
నవీన్ పొలిశెట్టి ఇష్టమైన ప్రదేశం?
అమెరికా
నవీన్ పొలిశెట్టికి ఇష్టమైన సినిమాలు?
షోలే
నవీన్ పొలిశెట్టి ఏం చదివాడు?
సివిల్ ఇంజనీరింగ్(NIT భోపాల్)
నవీన్ పొలిశెట్టి అభిరుచులు?
ట్రావలింగ్, డ్యాన్స్ చేయడం, రీడింగ్ బుక్స్
నవీన్ పొలిశెట్టి ఎన్ని సినిమాల్లో నటించాడు?
2024 వరకు 7 సినిమాల్లో నటించాడు.
నవీన్ పొలిశెట్టి సినిమాకి ఎంత తీసుకుంటాడు?
ఒక్కో సినిమాకు రూ.2కోట్లు తీసుకుంటున్నాడు.
https://www.youtube.com/watch?v=6SPYe3HkBVo
మార్చి 21 , 2024
Bhoothaddam Bhaskar Narayana Review: థ్రిల్లింగ్ అంశాలతో ఆకట్టుకున్న ‘భూతద్ధం భాస్కర్ నారాయణ’.. మూవీ ఎలా ఉందంటే?
నటీనటులు: శివ కందుకూరి, రాశి సింగ్, దేవి ప్రసాద్, వర్షిణి సౌందరరాజన్, శివ కుమార్, షఫీ, సురభి సంతోష్, శివన్నారాయణ, వెంకటేష్ కాకుమాను తదితరులు.
దర్శకుడు: పురుషోత్తం రాజ్
సంగీత దర్శకులు: శ్రీచరణ్ పాకాల, విజయ్ బుల్గానిన్
సినిమాటోగ్రాఫర్: గౌతమ్ జి
నిర్మాతలు : స్నేహల్ జంగాల, శశిధర్ కాసి, కార్తీక్ ముడింబి
విడుదల తేదీ : మార్చి 01, 2024
టాలీవుడ్‌లో ఇప్పటివరకూ ఎన్నో డిటెక్టివ్ చిత్రాలు వచ్చాయి. చిరంజీవి ‘చంటబ్బాయ్’ నుంచి రీసెంట్‌గా ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ వరకూ ఆ తరహా చిత్రాలు ప్రేక్షకులకు ఎంతో వినోదాన్ని పంచాయి. తాజాగా ‘భూతద్దం భాస్కర్ నారాయణ’ డిటెక్టివ్ జానర్‌లోనే తెరకెక్కింది. అయితే దర్శకుడు పురుషోత్తం రాజ్.. పురాణాలతో డిటెక్టివ్ కథని ముడిపెడుతూ ఈ సినిమాను రూపొందించడం ఆసక్తికరం. శివ కందుకూరి ఇందులో కథానాయకుడిగా చేశాడు. మరి ఈ చిత్రం ఎలా ఉంది? ఈ డిటెక్టివ్ ఏ మేరకు మెప్పించాడు? అన్నది ఇప్పుడు చూద్దాం.
కథ
ఆంధ్రప్రదేశ్, కర్ణాటక సరిహద్దుల్లో (Bhoothaddam Bhaskar Narayana Review) ఓ సీరియల్ కిల్లర్ మహిళల్ని టార్గెట్ చేస్తూ వరుసగా హత్యలు చేస్తుంటాడు. ఆడవారి తలలు నరికేసి వాటి స్థానంలో దిష్టిబొమ్మలు పెడుతుంటాడు. ఈ వరుస హత్యలు పోలీసులకు చిక్కుముడిలా మారిపోతాయి. దీంతో కేసును పరిష్కరించడం కోసం లోకల్ డిటెక్టివ్ భాస్కర్ నారాయణ (శివ కందుకూరి) రంగంలోకి దిగుతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? కేసును డిటెక్టివ్ ఛేదించాడా? లేదా? ఆ సీరియల్ కిల్లర్ ఎవరు? ఎందుకు ఆడవారినే హత్య చేస్తున్నాడు? వారి తలలు తీసుకెళ్లి ఏం చేస్తున్నాడు? రిపోర్టర్ లక్ష్మీతో హీరో లవ్‌స్టోరీ ఏంటి? వంటివి తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎవరెలా చేశారంటే
శివ కందుకూరి డిటెక్టివ్ పాత్రలో సహజంగా ఒదిగిపోయాడు. నటన పరంగానూ వైవిధ్యం ప్రదర్శించాడు. ప్రథమార్ధంలో సరదా సన్నివేశాల్లో హుషారుగా కనిపించిన అతడు.. సెకండాఫ్‌లో సీరియస్ సన్నివేశాలపైనా బలమైన ప్రభావం చూపించాడు. అటు హీరోయిన్ రాశిసింగ్ చాలా అందంగా కనిపించింది. రిపోర్టర్ లక్ష్మిగా ఆమెకీ కీలకమైన పాత్రే దక్కింది. షఫి, దేవి ప్రసాద్, శివన్నారాయణ, శివకుమార్ తదితరులు అలవాటైన పాత్రల్లో తమ పరిధి మేరకు నటించి మెప్పించారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
డైరెక్టర్ పురుషోత్తమ్ రాజ్.. ఆసక్తికర కథను ఎంచుకున్నారు. డిటెక్టివ్ కథను పురుణాలతో ముడిపెట్టిన విధానం బాగుంది. హీరోను పక్కా లోకల్ డిటెక్టివ్‌గా చూపించడం అందరినీ కనెక్ట్ అయ్యేలా చేస్తుంది. హత్యల పూర్వాపరాలు, పోలీసుల పరిశోధన, ఆ కేసులోకి హీరో ప్రవేశం, అతనికీ సవాల్ విసిరే పరిశోధన తదితర అంశాలన్నీ ఆసక్తిని రేకెత్తిస్తాయి. ద్వితీయార్ధంలో మలుపులు మరింత ఉత్కంఠని పెంచుతాయి. అయితే అక్కడక్కడా కొన్ని సన్నివేశాలు మరీ నాటకీయంగా అనిపిస్తాయి. ముఖ్యంగా ప్రథమార్థంలో కొన్ని సీన్లు కథకు స్పీడ్ బ్రేకుల్లా తయారయ్యాయి. ఓవరాల్‌గా పురషోత్తం రాజ్ దర్శకత్వం ఆకట్టుకుంటుంది.
సాంకేతికంగా
సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. సంగీతం, కెమెరా, ఎడిటింగ్, కళ తదితర విభాగాలన్నీ మంచి పనితీరుని కనబరిచాయి. నేపథ్య సంగీతం ఈ సినిమాకు చాలా బాగా ప్లస్ అయ్యింది. నిర్మాణంలోనూ నాణ్యత కనిపిస్తుంది. బడ్జెట్‌కు వెనకాడినట్లు ఎక్కడా అనిపించలేదు.
ప్లస్ పాయింట్స్
హీరో నటనకథలో పురాణ నేపథ్యంద్వితీయార్థం
మైనల్ పాయింట్స్
ప్రథమార్థంలో కొన్ని సీన్లు
Telugu.yousay.tv Rating : 3/5
మార్చి 02 , 2024
Best Comedy Films in Telugu: ఆన్ లైన్‌లో ఎక్కువ మంది వెతుకుతున్న కామెడీ సినిమాలు ఏవో తెలుసా?
నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వకపోవడం ఒక రోగం అన్నాడో మహా కవి. తెలుగులో హస్య చిత్రాలు కోకొల్లలు. కేవలం కామెడీనే ప్రధాన కథాంశంతో తెరకెక్కిన చిత్రాలు తెలుగు నాట ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్వించాయి. నవ్విస్తున్నాయి. ఈ ఓటీటీ కాలంలో థియేటర్లకు వెళ్లకుండా ఇంటి వద్దనే చూసేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. బెస్ట్ కామెడీ సినిమాల కోసం ఆన్‌లైన్ లో సెర్చ్ చేస్తున్నారు. ఈక్రమంలో తెలుగు మంచి కామెడీ సినిమాలు ఏంటో ఓసారి చూద్దాం..
[toc]
Allari Naresh comedy movies
సుడిగాడు
అల్లరి నరేష్ నటించిన కామెడీ సినిమాల్లో ఎక్కువమంది ఆన్‌లైన్‌లో చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్న సినిమా ఇది. ఈ సినిమా మంచి వినోదాన్ని అందిస్తుంది. ఇక కథ విషయానికొస్తే..శివ చిన్నప్పుడే సిక్స్ ప్యాక్‌తో పుడతాడు. పుట్టినప్పటి నుంచి తిక్కల్ రెడ్డి మనుషులు శివ కోసం వెతుకుతుంటారు. ఈ క్రమంలో డాన్ D మనుషులు శివపై దాడి చేస్తారు. అసలు డాన్ డి ఎవరు? శివకు తిక్కల్ రెడ్డికి మధ్య వైరం ఏంటి? వారందరితో శివ ఎలా పోరాడాడు? అన్నది కథ.
ఓటీటీ: జీ5
అల్లరి
టాలీవుడ్ లో విభిన్న కామెడీ జోనర్ తో వచ్చిన మూవీగా అల్లరిని చెప్పవచ్చు. ఈ మూవీతో హీరోగా నరేష్ పరిచయం అయ్యాడు. ఈ మూవీని రఘు బాబు డైరెక్ట్ చేయగా... ఫ్లైయ్యింగ్ ప్రాగ్స్ బ్యానర్ పై నిర్మించారు. తొలి సినిమాలోనే నరేష్ కు నటనపరంగా మంచి మార్కులు పడ్డాయి. ఈ మూవీ అనంతరం నరేష్ ను కాస్త అల్లరి నరేష్ గా పిలవడం ప్రారంభించారు. అల్లరి నరేష్ ఫుల్ టైం కామెడీ స్టార్ గా మారిపోయాడు. కామెడీ మూవీల్లో ఈ చిత్రం ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. అల్లరిని నరేషే హీరోగా తమిళంలో కురుంబుగా రీమేక్ చేశారు.
ఓటీటీ: యూట్యూబ్
ఆ ఒక్కటీ అడక్కు
ఈ సినిమా చూస్తున్నంతా సేపు పొట్టచెక్కలయ్యేలా ప్రేక్షకులు నవ్వుతారు. ఇక కథ విషయానికొస్తే..గణపతి (అల్లరి నరేష్) పెళ్లి సంబంధాలు చూడటంలో హాఫ్ సెంచరీ కంప్లీట్ చేస్తాడు. వయసు ఎక్కువ కావడంతో అతడికి ఎవరూ పిల్లను ఇవ్వరు. ఓ రోజు మ్యాట్రిమోనీ సైట్‌లో సిద్ధి (ఫరియా అబ్దుల్లా)ని చూసి ప్రేమలో పడతాడు. అయితే ఆమె అబ్బాయిలను మోసం చేస్తోందంటూ మీడియాలో వార్తలు వస్తాయి. అందులో నిజమెంతా? వారిద్దరు ఒక్కటయ్యారా? లేదా? అన్నది కథ.
ఓటీటీ: ప్రైమ్ వీడియో
లడ్డూ బాబు
ఈ చిత్రంలో బరువు పెరిగిన స్థూలకాయుడిగా అల్లరి నరేష్ అలరించాడు. ఈ చిత్రం కూడా ప్రేక్షకులను అలరిస్తుంది. అతిగా బరువు పెరిగిపోయిన హీరోకి సమాజం నుంచి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి. వాటిని ఎలా ఎదుర్కొన్నాడు? అన్నది కథ.
ఓటీటీ: యూట్యూబ్
సిల్లీ ఫెలోస్
ఎమ్మెల్యే (జయప్రకాష్‌రెడ్డి) ఓ రోజు మూకుమ్మడి వివాహాలు ఏర్పాటు చేస్తాడు. ఓ జంట తగ్గడంతో ఎమ్మెల్యే అనుచరుడైన వీరబాబు (అల్లరి నరేష్) సూరిబాబు (సునీల్)ను ఉత్తుత్తి పెళ్లి చేసుకోమని చెబుతాడు. కానీ కంగారులో సూరిబాబు పుష్ప (నందిని రాయ్)కు నిజంగానే తాళికడతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది కథ.
ఓటీటీ: ప్రైమ్ వీడియో
మేడ మీద అబ్బాయి
శ్రీను( అల్లరి నరేష్) ఫిల్మ్ మేకర్ కావాలని ఆడిషన్స్ కోసం హైదరాబాద్‌కు రైలు ఎక్కుతాడు. దారిలో సింధుని కలుసుకుని ఆమెకు తెలియకుండా సెల్ఫీ దిగడంతో సమస్యల్లో పడతాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది కథ.
ఓటీటీ: సన్ నెక్స్ట్
జేమ్స్ బాండ్
నాని ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. అతను తనకు తెలియకుండా ఒక లేడీ డాన్‌ను వివాహం చేసుకుంటాడు. ఆమె గతం, నేర కార్యకలాపాల గురించి తెలిసిన తర్వాత నాని ఏం చేశాడు అన్నది కథ.
ఓటీటీ: ప్రైమ్ వీడియో
బ్రదర్ ఆఫ్ బొమ్మాళి
రాంకీ (అల్లరి నరేష్), లక్కీ(కార్తీక) ఇద్దరు కవలలు. ఓ రోజు హీరోయిన్‌ను చూసి రాంకీ ప్రేమిస్తాడు. అయితే సోదరి పెళ్లి జరిగితే గాని నీ పెళ్లి చేయనని తండ్రి చెబుతాడు. దీంతో లక్కీకి పెళ్లి చేసేందుకు హీరో ఏం చేశాడు? చెల్లెలకు ఇష్టమైన వ్యక్తితోనే వివాహం చేశాడా లేదా? అన్నది కథ.
ఓటీటీ: జీ5
యముడికి మొగుడు
యముడికి మొగుడు 2012లో ఇ. సత్తి బాబు దర్శకత్వం వహించిన భారతీయ తెలుగు-భాషా ఫాంటసీ కామెడీ చిత్రం, ఫ్రెండ్లీ మూవీస్ బ్యానర్‌పై చంటి అడ్డాల నిర్మించారు మరియు అల్లరి నరేష్ మరియు రిచా పనై ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రంలో రమ్య కృష్ణ మరియు నరేష్ కూడా కీలక పాత్రల్లో నటించారు. . ఈ చిత్రానికి సౌండ్‌ట్రాక్‌ను సంగీత దర్శకుడు కోటి స్వరపరిచారు మరియు సినిమాటోగ్రఫీని రవీంద్ర బాబు నిర్వహించారు. ఈ చిత్రం 27 డిసెంబర్ 2012న థియేటర్లలో విడుదలైంది.
OTT: అమెజాన్ ప్రైమ్
సీమ టపాకాయ్
శివ చిన్నప్పుడే సిక్స్ ప్యాక్‌తో పుడతాడు. పుట్టినప్పటి నుంచి తిక్కల్ రెడ్డి మనుషులు శివ కోసం వెతుకుతుంటారు. ఈ క్రమంలో డాన్ D మనుషులు శివపై దాడి చేస్తారు. అసలు డాన్ డి ఎవరు? శివకు తిక్కల్ రెడ్డికి మధ్య వైరం ఏంటి? వారందరితో శివ ఎలా పోరాడాడు? అన్నది కథ.
ఓటీటీ: హాట్ స్టార్, యుట్యూబ్
కత్తి కాంతారావు
ఈ చిత్రంలో అల్లరి నరేష్ కత్తి కాంతరావుగా హాస్యం పండించి ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించాడు. ఈ చిత్రం అల్లరి నరేష్‌కు మంచి గుర్తింపు తెచ్చింది. ఇక కథలోకి వెళ్తే.. కత్తి అనే వ్యక్తి తన కుటుంబం కోరికలను నెరవేర్చి తన తండ్రికి కట్టుబడి ఉండే కానిస్టేబుల్. అతను ఒక అమ్మాయితో ప్రేమలో పడతాడు కానీ తన నలుగురు అక్కచెల్లెల్ల పట్ల ఉన్న బాధ్యతల కారణంగా ఆ విషయం బయటకు చెప్పడు. మరి తన ప్రేమ వ్యవహారం ఎలా బయటపడింది? తన అక్క చెల్లెల్ల సమస్యలను ఎలా చక్కదిద్దాడు అన్నది కథ.
ఓటీటీ: సన్ నెక్ట్స్
బెండు అప్పారావు R.M.P.
ఈ సినిమాలో మధ్యతరగతి కుటుంబంలో జన్మించి డబ్బు సంపాదించేందుకు పడే కష్టాలను హాస్యంతో మిలితంగా చూపించాడు. ఇక కథలో..బెండు అప్పరావు జబ్బుల పేరిట రోగులను మోసం చేస్తూ డబ్బు సంపాదిస్తుంటాడు. ఈ క్రమంలో చనిపోతున్న ఓ వ్యక్తి తన కుటుంబానికి ఇవ్యాల్సిందిగా పెద్ద మొత్తంలో డబ్బు ఇస్తాడు. కానీ బెండు దానిని ఇతర మార్గాల కోసం ఉపయోగిస్తాడు.
ఓటీటీ: జీ5
బ్లేడ్ బాబ్జీ
ఈ చిత్రం చూసినంత సేపూ ఎక్కడా బోర్ కొట్టదు. ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయవచ్చు. తనతో పాటు మురికి వాడల్లో నివసిస్తున్న వారి ఇళ్లను కాపాడేందుకు బ్లేడ్ బాబ్జీ బ్యాంకును దోచుకుంటాడు. అలా దోచుకున్న డబ్బును దాచిపెట్టిన స్థలంలో పోలీసు స్టేషన్ నిర్మిచడంతో కథ మలుపు తిరుగుతుంది.
ఓటీటీ: యూట్యూబ్
బొమ్మన బ్రదర్స్ చందనా సిస్టర్స్
ఈ సినిమాలో అల్లరి నరేష్- కృష్ణభగవాన్ కామెడి ట్రాక్ నవ్వులు పూయిస్తుంది. దొంగలైన ఇద్దరు సోదరులు.. డబ్బున్న అక్కా చెల్లెళ్లను ప్రేమిస్తారు. మాయమాటలు చెప్పి వారికి దగ్గరవుతారు. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ అబద్దాల వల్ల వారు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? అన్నది కథ.
ఓటీటీ: సన్‌నెక్స్ట్
సీమా శాస్త్రి
ఫ్యాక్షనిస్ట్ వేశంలో నటించేందుకు అల్లరి నరేష్ పడే బాధలు కడుపుబ్బ నవిస్తాయి. ఇక కథలో..సుబ్రహ్మణ్య శాస్త్రి అనే యువకుడు ఫ్యాక్షనిస్టు కూతురు సురేఖతో ప్రేమలో పడుతాడు. ఆమె ప్రేమను దక్కించుకునేందుకు ఫ్యాక్షనిస్ట్ వేషంలోకి మారిపోతాడు.
ఓటీటీ: ప్రైమ్ వీడియో
నవీన్ పొలిశెట్టి కామెడీ సినిమాలు
నవీన్ పొలిశెట్టి కామెడీ టైమింగ్‌తో స్టార్ డం సంపాదించాడు. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయా, జాతిరత్నాలు, మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి హిట్లతో కెరీర్ తారా పథంలో దూసుకెళ్తోంది. ఈక్రమంలో అతను నటించిన సూపర్ హిట్ కామెడీ చిత్రాలను ఓసారి చూద్దాం.
మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి
మాస్టర్ చెఫ్ అయిన అన్విత రవళి తల్లి అనారోగ్యంతో చనిపోతుంది. ఈక్రమంలో ఓ కీలక నిర్ణయం తీసుకుంటుంది. పెళ్లిచేసుకోవద్దని నిశ్చయించుకుంటుంది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అయిన సిద్దు పొలిశెట్టిస్టాండప్ కమెడియన్‌గా అలరిస్తుంటాడు. అన్విత అతని కామెడీ ఇష్టపడుతుంటుంది. ఈక్రమంలో సిద్దూ ఆమెతో ప్రేమలో పడతాడు. అన్విత తన నుంచి ఏమి ఆశిస్తుందో చెప్పినప్పుడు సిద్దూ షాక్‌కు గురవుతాడు. ఇంతకు అన్విత సిద్ధుని ఏం అడిగింది? అందుకు సిద్ధు అంగీకరించాడా? అన్నది మిగతా కథ.
ఓటీటీ: నెట్‌ప్లిక్స్
జాతి రత్నాలు
ఆన్‌లైన్‌లో ఎక్కువ మంది వెతుకుతున్న కామెడీ చిత్రమిది. ఈ సినిమా నాన్‌స్టాప్ కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తుంది. ఈ సినిమా కథ విషయానికొస్తే..మంచి ఉద్యోగాల కోసం తమ ఊరి నుంచి హైదరాబాద్ వచ్చిన ముగ్గురు యువకులు ఓ అపార్ట్‌మెంటులో దిగుతారు. అక్కడ పిలువని పార్టీకి వెళ్లి మర్డర్ అటెంప్ట్ కేసులో ఇరుక్కుంటారు. ఆ తర్వాత కేసు నుంచి ఎలా బయటపడ్డారనేది కథ.
ఓటీటీ; అమెజాన్ ప్రైమ్
ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ
ఈ చిత్రం నవీన్ పొలిశెట్టిలోని మంచి నటున్ని పరిచయం చేసింది. ఈ సినిమా కామెడీ ఎంటర్‌టైనర్‌గా సాగినా.. ట్విస్ట్ మాత్రం బాగుంటుంది. ఏజెంట్ సాయి శ్రీనివాస్ అత్రేయా నెల్లూరులో ఓ ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెన్సీని నడుపుతుంటాడు. చిన్న చిన్న కేసులను విచారిస్తూ సమస్యలు ఎదుర్కొంటుంటాడు. రైల్వే ట్రాక్ వద్ద మృతదేహాన్ని గుర్తించినప్పుడు అతని జీవితం తలకిందులవుతుంది.
ఓటీటీ: ఆహా
సిద్ధు జొన్నలగడ్డ కామెడీ సినిమాలు
సిద్ధు జొన్నలగడ్డ ప్రస్తుతం టాలీవుడ్‌లో స్టార్‌బాయ్‌గా కొనసాగుతున్నాడు. టిల్లు స్కేర్ హిట్ తర్వాత అతను నటించిన ఇతర కామెడీ చిత్రాల కోసం ఆన్‌లైన్ వెతుకుతున్నారు. ఈక్రమంలో సిద్ధు జొన్నలగడ్డ నటించిన కామెడీ చిత్రాలపై ఓ లుక్ వేద్దాం.
టిల్లు స్క్వేర్
రాధిక జ్ఞాపకాల నుంచి బయటపడుతున్న టిల్లు జీవితంలోకి ఆమె అప్‌డేటెడ్ వెర్షన్ లిల్లీ జోసెఫ్ వస్తుంది. బర్త్‌డే స్పెషల్‌గా ఓ కోరిక కోరుతుంది. ఆ తర్వాత టిల్లు లైఫ్ ఎలాంటి టర్న్ తీసుకుంది? మాఫియా డాన్ వీరి మధ్యకు ఎందుకు వచ్చాడు? టిల్లు లైఫ్‌లోకి రాధికా మళ్లీ వచ్చిందా? లేదా? అన్నది కథ.
ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్
డీజే టిల్లు
డీజే టిల్లు మంచి మాటకారి. మ్యూజిక్ డైరెక్టర్ కావాలనేది అతడి కల. సింగర్ రాధిక (నేహాశెట్టి)ని చూడగానే ప్రేమలో పడుతాడు. ఇంతలో రాధిక ఓ హత్య కేసులో ఇరుక్కుంటుంది. ఆమెతో స్నేహం చేసిన పాపానికి అందులో టిల్లు కూడా ఇరుక్కుంటాడు. ఆ హత్య కేసు నుంచి బయటపడేందుకు టిల్లు ఏం చేశాడు? ఇంతకు రాధిక ఎవరు అనేది మిగతా కథ.
ఓటీటీ: ఆహా
రాజ్ తరుణ్
పక్కింటి అబ్బాయిలా కనిపించే రాజ్ తరుణ్ తన సహజమైన నటనతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకుల మోముల్లో నవ్వుల పువ్వులు పూయించాడు. రాజ్ తరుణ్ నటించిన బెస్ట్ కామెడీ సినిమాలు ఇప్పుడు చూద్దాం.
ఉయ్యాల జంపాలా
బావామరదళ్లైన సూరి (రాజ్ తరుణ్) - ఉమాదేవి(అవిక గోర్) ప్రతీ చిన్నదానికి గొడవలు పడుతుంటారు. అయితే ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టమని ఆలస్యంగా తెలుసుకుంటారు. అప్పటికే ఉమాదేవి పెళ్లి ఇంకొకరితో ఫిక్స్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది కథ.
సినిమా చూపిస్త మావ
సాదాసీదాగా తిరిగే కత్తి అనే యువకుడు పరిణీతను ప్రేమిస్తాడు. అయితే, పరిణీత తండ్రి వీరి పెళ్లికి ఒప్పుకోడు. ఆమెతో పెళ్లి చేసేందుకు కత్తికి కొన్ని షరతులు విధిస్తాడు
ఓటీటీ: హాట్ స్టార్
విశ్వక్ సేన్ కామెడీ సినిమాలు
ఇండస్ట్రిలో మాస్‌కా దాస్‌గా గుర్తింపు పొందిన విశ్వక్ సేన్ తొలినాళ్లలో కామెడీ సినిమాలతో ఆకట్టుకున్నాడు. మంచి కామెడీ టైమింగ్ ఉన్న విశ్వక్.. మంటి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.
ఈనగరానికి ఏమైంది?
నలుగురు యువకులు చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. అనివార్య కారణాలతో వారు విడిపోతారు. వారిలో ఒకరి పెళ్లి ఫిక్స్ కావడంతో అందరూ ఒక్కటవుతారు. అనుకోని పరిస్థితుల్లో వారంతా గోవాకు వెళతారు? అక్కడ వారు ఏం చేశారు? గోవా ట్రిప్ వారిలో తీసుకొచ్చిన మార్పు ఏంటి? అన్నది కథ.
ఓటీటీ: అమెజాన్ ప్రైమ్
అశోకవనంలో అర్జున కళ్యాణం
మాధవి(రుక్సార్ ధిల్లాన్)తో నిశ్చితార్థం కోసం అర్జున్ కుమార్(విశ్వక్ సేన్) వారింటికి వెళ్తాడు. ఇంతలో కరోనా లాక్ డౌన్ వల్ల అక్కడే ఉండాల్సి వస్తుంది. ఈ క్రమంలో అర్జున్‌కు ఊహించని ఎదురు దెబ్బ తగులుతుంది. అందులోంచి బయటపడే క్రమంలో మాధవి సోదరి వసుధ(రితికా నాయక్) అర్జున్‌తో ప్రేమలో పడుతుంది. ఇంతకు అర్జున్‌కు ఎదురైన ఆ అనుభవం ఏమటి? మాధవి సోదరి వసుధ ప్రేమను అర్జున్ ఒప్పుకున్నాడా? అన్నది మిగతా కథ.
ఓటీటీ: ఆహా
సునీల్ కామెడీ సినిమాలు
సునీల్ ప్రస్తుతం సౌత్ ఇండియాలో మంచి నటుడిగా గుర్తింపు పొందాడు. తన విలక్షణమైన నటనతో తారా పథానికి ఎదిగాడు. సునిల్ నువ్వేకావాలి చిత్రం ద్వారా హస్య నటుడిగా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. ఆ చిత్రం సూపర్ హిట్ కావడంతో ఆయనకు అవకాశాలు వెల్లువెత్తాయి. సుమారు 200కి పైచిలుకు చిత్రాల్లో నటించాడు. అందులో బెస్ట్ కామెడీ చిత్రాలను ఓసారి చూద్దాం.
మర్యాద రామన్న
ఈ చిత్రం ద్వారా సునిల్ మంచి క్రేజ్ సంపాదించాడు. ఈ సినిమా తర్వాత హీరోగా చాలా సినిమాలు చేశాడు.ఈ సినిమా కథ విషయానికొస్తే.. రాము తనకున్న భూమిని అమ్మెందుకు తన స్వగ్రామానికి వెళ్తాడు. అయితే అనుకోకుండా తన తండ్రి శత్రువుల ఇంటికి పోతాడు. అక్కడ వాళ్లు తనని చంపాలనుకుంటున్నారని తెలిసి వారింట్లోనే ఉంటూ ఓ యువతితో ప్రేమలో పడుతాడు. ఆ ఇంట్లో నుంచి బయటపడేందుకు అతని ఎలాంటి పోరాటం చేశాడు. ఇంతకు తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడా? లేదా? అన్నది మిగతా కథ.
ఓటీటీ: ప్రైమ్, హాట్ స్టార్
పూలరంగడు
ఈ చిత్రంలో ఇద్దరు భూస్వాముల మధ్య నలుగుతున్న భూమిని సునిల్ కొనుగోలు చేస్తాడు. తాను మోసపోయినట్లు తెలుసుకుంటాడు. ఈక్రమంలో అతను ఓ భూస్వామి కూతురుతో ప్రేమలో పడుతాడు. అయితే ఆ భూమిని సోంతం చేసుకునేందుకు హీరో ఏం చేశాడు? చివరికి తన ప్రేమను ఎలా దక్కించుకున్నాడు అన్నది మిగతా కథ
ఓటీటీ: ప్రైమ్ వీడియో
కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం అప్పలరాజు
అప్పల్రాజు (సునిల్) స్టార్ డైరెక్టర్ అవ్వాలన్న లక్ష్యంతో అనేక సవాళ్లను ఎదుర్కొని ఓ సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్తాడు. సినిమా స్టార్లు బాబు, కనిష్కను హీరో హీరోయిన్లుగా పెట్టుకుంటాడు. అయితే లవ్‌లో ఉన్న బాబు, కనిష్క ఇద్దరు బ్రేకప్ చెప్పుకొని విడిపోతారు. దీంతో సినిమా మధ్యలోనే ఆగిపోతుంది. అప్పుడు అప్పల్రాజు ఏం చేశాడు? సినిమాను ఎలా పూర్తి చేశాడు? అన్నది కథ.
ఓటీటీ: ప్రైమ్ వీడియో
అందాల రాముడు
ఈ చిత్రంలో సునీల్ కడుపుబ్బ నవ్విస్తాడు. కథ విషయానికొస్తే.. రాముడు( తన మరదలైన రాధను వివాహం చేసుకోవడానికి 12 సంవత్సరాల తర్వాత ఇంటికి తిరిగి వస్తాడు, కానీ రఘుతో ఆమె ప్రేమలో ఉందని తెలుసుకుని నిరాశ చెందుతాడు. అయితే, రాముడు తమ్ముడు రాధను తన అన్నతో కలిపేందుకు ప్లాన్ చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగతా కథ.
ఓటీటీ: యూట్యూబ్
జై చిరంజీవ!
ఈ సినిమాలో సునిల్ కనిపించేది కొద్దిసేపే అయినా... మంచి కామెడీ అందిస్తాడు. ఇక సినిమా కథలో సత్యనారాయణ(చిరంజీవి) తన కుటుంబంతో కలిసి గ్రామంలో నివసిస్తుంటాడు. అతడికి మేనకోడలు లావణ్య అంటే ప్రాణం. గన్ డీలర్ పసుపతి కారణంగా లావణ్య చనిపోతుంది. అతడిపై పగ తీర్చుకునేందుకు సత్యనారాయణ అమెరికాకు వెళ్తాడు.
ఓటీటీ: యూట్యూబ్
సొంతం
ఈ చిత్రంలో సునీల్‌తో కామెడీ ట్రాక్ సూపర్బ్‌గా ఉంటుంది. ఇప్పటికీ.. సునిల్ కామెడీ వీడియోలు యూట్యూబ్‌లో అలరిస్తుంటాయి. ఇక సినిమా కథ విషయానికొస్తే.. బాల్య స్నేహితుడైన వంశీని(ఆర్యన్ రాజేష్) నందు ప్రేమిస్తుంటుంది. అయితే ఆమె తన ఫీలింగ్స్‌ను వంశీతో పంచుకోదు. అయితే ఆమె పట్ల తన భావాలను వంశీ తెలుసుకునే సమయానికి నందుకి ఇంకొకరితో నిశ్చితార్థం జరుగుతుంది.
ఓటీటీ: యూట్యూబ్
చిరునవ్వుతో
ఈ చిత్రంలో సునిల్- వేణు మధ్య వచ్చే కామెడీ సీన్లు కడుపుబ్బా నవ్విస్తాయి. ఈ సినిమా కథలో.. పెళ్లికి ముందు అరుణ, వేణుని విడిచిపెట్టిన తర్వాత, అతను నగరానికి వెళ్లి ఆమెను మరచిపోవడానికి ప్రయత్నిస్తాడు. తరువాత, అక్కడ సంధ్య అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. కానీ అప్పటికే ఆమెకు ప్రతాప్‌తో నిశ్చితార్థం జరిగిందని తెలుస్తుంది.
ఓటీటీ: ఆహా
నువ్వే కావాలి
ఈ సినిమాలోనూ సునిల్ కామెడీ అదిరిపోతుంది. సునిల్ కామెడీ పంచ్‌లు అలరిస్తాయి. ఇక ఈ సినిమా కథలో.. తరుణ్, మధు చిన్నప్పటి నుంచి స్నేహితులు. అయితే వారు పెద్దయ్యాక ఒకరిపై ఒకరికి ప్రేమ ఉన్న బయటకు చెప్పుకోరు. మధుకు మరొకరితో పెళ్లి నిశ్చయమైనప్పుడు పరిస్థితులు మారిపోతాయి. 2000 ఏడాదిలో ఈ చిత్రం సూపర్ హిట్ సాధించింది. తరుణ్ కేరీర్‌కు ఈ చిత్రం కీలక మలుపునిచ్చింది.
ఓటీటీ: ఈటీవీ విన్
తెలుగులో ఇతర బెస్ట్ కామెడీ చిత్రాలు
లేడీస్ టైలర్
సమాజంలో సామాన్య పాత్రలకు హీరో నెటివెటీని జోడించి తొలిసారి కామెడీని పండించింది దర్శకుడు వంశీ. తనకే సాధ్యమైన ప్రత్యేక హస్య కథాంశంతో ఈ చిత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాడు. టైలర్ గా సుందరం పాత్రలో రాజేంద్ర ప్రసాద్ జీవించాడు. తాను ధనవంతుకు కావడం కోసం వీపు మీద పుట్టు మచ్చ ఉన్న అమ్యాయిని పెళ్లి చేసుకునేందుకు అతను పడే తపన.. నవ్వులు పూయిస్తుంది. ఇదే సినిమాలో స్టోరీ లైన్ అయినా అందుకు అనుగుణంగా వచ్చే క్యారెక్టర్లు కామెడీని పండిస్తాయి. ఈ చిత్రంలో రాళ్లపల్లి, మల్లిఖార్జునరావు, అర్చన, తనికెళ్ల భరణి ప్రధాన పాత్రల్లో నటించారు.
ఓటీటీ: యూట్యూబ్
చంటబ్బాయి
జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన చంటబ్బాయి.. తెలుగులో వచ్చిన ఫస్ట్ డిటెక్టివ్ కామెడీ జోనర్ గా చెప్పవచ్చు. ఇది ప్రముఖ రచయిత మల్లాది వెంకట కృష్ణ మూర్తి రచించిన చంటబ్బాయి నవల ఆధారంగా చిత్రీకరించారు. అప్పటి వరకు యాక్షన్ చిత్రాల్లో నటించిన మెగాస్టార్ చిరంజీవి ఒక్కసారిగా కామెడీ పాత్రలో ఒదిగిపోయారు. చిరంజీవిలోని కామెడీ టైమింగ్ ను ప్రేక్షకులకు పరిచయం చేసింది ఈ సినిమా. డిటెక్టివ్ పాత్రలో మెగాస్టార్ కడుపుబ్బ నవ్వించారు. ఈ సినిమాలో సుహాసిని, జగ్గయ్య, ముచ్చెర్ల అరుణ, సుత్తివేలు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు వాణిజ్యపరంగా విజయవంతమైంది.
ఓటీటీ: సన్ నెక్ట్స్
అహ! నా పెళ్లంట
తెలుగులో మరుపురాని హాస్య చిత్రాల్లో అహ! నా పెళ్లంట మూవీ అగ్రభాగాన నిలుస్తుంది. జంధ్యాల డైరెక్ట్ చేసిన చిత్రాల్లో ఈ సినిమా ఒక కలకితురాయి. ప్రముఖ రచయిత ఆది విష్ణు గారు రాసిన సత్యంగారి ఇల్లు నవల ఆధారంగా జంధ్యాల తెరకెక్కించాడు. ప్రతి పాత్రను హాస్య ప్రధానంగా చిత్రీకరించిన తీరు అద్భుతంగా ఉంటుంది. పిసినారి పాత్రలో కోటా శ్రీనివాస్ రావు, అరగుండు క్యారెక్టర్ లో బ్రహ్మానందం మెప్పించారు. రాజేంద్ర ప్రసాద్, రజిని తమ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. రాజేంద్ర ప్రసాద్ తనదైన కామెడీ టైమింగ్ తో ఆకట్టుకున్నాడు. ప్రేక్షకుల హృదయాలకు దగ్గరైన ఈ చిత్రం కమర్షియల్ గాను సక్సెస్ అయింది. రూ.16లక్షల బడ్జెట్ తో నిర్మితమైన ఈ మూవీ ఆ కాలంలో ఏకంగా రూ.5కోట్లు కొల్లగొట్టింది. అహ! నా పెళ్లంట మూవీ... హస్యనటుడిగా బ్రహ్మనందానికి మంచి బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత బ్రహ్మానందం దాదాపు ప్రతి మూవీలో హాస్య పాత్రల్లో కనిపించాడు.
ఓటీటీ- యూట్యూబ్
జంబలకిడి పంబ
తెలుగులో ఫస్ట్ వచ్చిన ఫాంటసీ కామెడీ చిత్రం జంబలకిడి పంబ. మగవాళ్లు.. ఆడవాళ్లుగా, ఆడవాళ్లు మగవాళ్లుగా, చిన్న పిల్లలు పెద్దవాళ్లుగా మారితే ఎలా ఉంటుందనే ఊహను డైరెక్టర్ ఈవీవీ సత్యనారాయణ చక్కగా చిత్రీకరించాడు. సినిమా చూస్తున్నంత సేపూ చిత్రంలోని ప్రతి పాత్ర తనదైన కామెడీతో ప్రేక్షకులను పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తుంది. ఈ కథా వస్తువే సగటు ప్రేక్షకుడ్ని మళ్లీ మళ్లీ ఈ సినిమాను చూసేందుకు థియేటర్ల బాట పట్టించింది. ఈ మూవీలో నరేష్, ఆమని, కోటా శ్రీనివాస్ రావు, బ్రహ్మానందం, అలీ, బాబు మోహన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం అప్పటి వరకు వచ్చిన కామెడీ చిత్రాల నిర్వచనాన్ని సమూలంగా మార్చేసింది. కామెడీ కథాంశంతో సైతం బాక్సాఫీస్ కొల్లగొట్టవచ్చని నిరూపించింది. ఆ తర్వాత వచ్చిన ఎన్నో చిత్రాల సక్సెస్ కు రాచ బాట వేసింది.
ఓటీటీ- యూట్యూబ్
అప్పుల అప్పారావు
తెలుగులో అత్యుత్తమ హాస్య చిత్రాలలో ఒకటిగా అప్పుల అప్పారావు మూవీ విమర్శకుల చేత ప్రశసించబడింది. ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను అలరించింది. ఇందులో రాజేంద్ర ప్రసాద్, శోభన హీరో, హీరోయిన్ లుగా నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్‌గా నమోదైంది. ఊర్లో ప్రతిఒక్కరి దగ్గర అప్పులు చేసే అప్పరావు పాత్రలో రాజేంద్ర ప్రసాద్ కామెడీని పండించాడు. బ్రహ్మానందం, బాబుమోహన్, తనికెళ్ల భరణి, ఐరెన్ లెగ్ శాస్త్రి ప్రధాన పాత్రల్లో నటించారు.
ఓటీటీ- జియో సినిమా
రాజేంద్రుడు గజేంద్రుడు
రాజేంద్ర ప్రసాద్, సౌందర్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం పూర్తిగా హాస్యభరితం. ఎస్. వి. కృష్ణారెడ్డికి దర్శకుడిగా ఇది మొదటి సినిమా. కథంతా ఒక ఏనుగు చుట్టూ తిరుగుతుంది. రాజేంద్రగా రాజేంద్ర ప్రసాద్, గజేంద్రగా ఏనుగు, అలకగా సౌందర్య, కోటిలింగంగా కోట శ్రీనివాసరావు, గుండు హన్మంతరావు పాత్రలకు తగ్గట్టు హాస్యాన్ని పండించారు. ఈ మూవీ డైరెక్టర్ గా ఎస్.వి. కృష్ణా రెడ్డికి మంచి లైఫ్ ఇచ్చింది.
ఓటీటీ: ఆహా
మాయలోడు
పక్కా కామెడీ ఎంటర్ టైనర్ గా S. V. కృష్ణారెడ్డి డైరెక్షన్ లో మాయలోడు వచ్చింది. ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్, సౌందర్య నటించారు. వీరబాబు పాత్రలో మాయలోడుగా రాజేంద్ర ప్రసాద్ అద్భుతంగా హాస్యాన్ని పండించాడు. ఈ మూవీ బాక్సాఫీసు వద్ద సూపర్‌హిట్‌గా నిలిచింది. మాయలోడు హైదరాబాద్- శ్రీనివాస థియేటర్‌లో ఏకంగా 260 రోజులు నడిచింది. ఈ చిత్రం రెండు నంది అవార్డులు కూడా గెలుచుకుంది.
ఓటీటీ: ఈటీవీ విన్
యమలీల
S. V. కృష్ణా రెడ్డి దర్శకత్వం వహించిన యమలీల చిత్రం తెలుగు సినీచరిత్రలో పెను సంచలనం సృష్టించింది. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. కేవలం రూ.75లక్షలతో నిర్మించిన ఈ మూవీ రూ.12కోట్లు వసూలు చేసింది. అప్పటివరకు చిన్న చిన్న కామెడీ పాత్రలు చేస్తున్న అలీ తొలిసారి హీరోగా పరిచయం అయ్యాడు. తన తల్లి ప్రాణాలు కాపాడుకునేందుకు హీరో.. యముడిని ఏలా ఏమార్చాడు అనే కథాంశంతో మూవీని దర్శకుడు చక్కగా నడిపాడు. మూవీలో మదర్ సెంటిమెంట్ కొనసాగిస్తూనే.. కామెడీని అద్భుతంగా పండించాడు. ఈ చిత్రాన్ని వెంకటేష్ హీరోగా హిందీలో తక్‌దీర్‌వాలాగా, కార్తీక్ హీరోగా తమిళంలో లక్కీ మ్యాన్‌గా రీమేక్ చేశారు.
ఓటీటీ: యూట్యూబ్
క్షేమంగా వెళ్లి లాభంగా రండి
రాజా వన్నెంరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మహిళా ప్రేక్షకుల మనసులు దోచింది. శ్రీకాంత్, రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, రోజా, కోవై సరళ ముఖ్యపాత్రల్లో నటించారు. జంబులింగం పాత్రలో బ్రహ్మనందం ఆయన భార్యగా సుబ్బలక్ష్మి పాత్రలో కోవైసరళ మధ్య వచ్చే కామెడీ సీన్లు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించాయి. అలాగే రాంబాబు పాత్రలో రాజేంద్ర ప్రసాద్, రవి పాత్రలో శ్రీకాంత్ తమదైన కామెడీ టైమింగ్ తో అలరించారు. అన్నివర్గాల ప్రేక్షకులను ఈ సినిమా అలరించింది. ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. ఈ మూవీ తర్వాత చాలా సినిమాలు కామెడీ బాట పట్టాయి.
ఓటీటీ: ప్రైమ్
హనుమాన్ జంక్షన్
ఎం. రాజా దర్శకత్వంలో వచ్చిన హనుమాన్ జంక్షన్ కామెడీ కల్ట్ గా నిలిచింది. కమర్షియల్ గాను బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. అర్జున్, జగపతి బాబు, వేణు, స్నేహ, లయ ప్రధాన పాత్రల్లో నటించారు. కోవై సరళ, ఎల్ బీ శ్రీరాం, జయప్రకాశ్ రెడ్డి, ఎంఎస్ నారాయణ ఇతర పాత్రాల్లో నటించారు. తోటపల్లి మధు అందించిన కామెడీ డైలాగ్స్ పాత్రాధారుల మధ్య అద్భుతంగా పేలాయి. ఈ మూవీలోని నా 'భూతో నా భవిష్యత్' అనే డైలాగ్ ఇప్పటికీ చాలా ఫేమస్. అంతలా సినిమా ప్రేక్షకులపై ప్రభావం చూపింది.
ఓటీటీ: ప్రైమ్
నువ్వు నాకు నచ్చావ్
కె. విజయ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. తెలుగులో వచ్చిన రోమాంటిక్ కామెడీ మూవీల్లో ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ అందించిన డైలాగ్స్.. ఈ చిత్రాన్ని ప్రేక్షకుల హృదయాల్లో ఆల్ టైమ్ క్లాసిక్ గా నిలిపింది. అప్పటివరకు తెలుగు తెరకు పెద్దగా పరిచయం లేని పంచ్ కామెడీ టైమింగ్ ను ఈ సినిమా పరిచయం చేసింది. ఈ చిత్రంలో వెంకటేష్ , ఆర్తి అగర్వాల్ ప్రధాన పాత్రల్లో నటించగా.. ప్రకాశ్ రాజ్, చంద్రమోహన్, సుహాసిని ఇతర పాత్రాల్లో నటించారు. ఈ మూవీ విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు కమర్షియల్ పరంగా భారీ విజయం సాధించింది. ఐదు నంది అవార్డులను గెలుచుకుంది. కుటుంబ సమేతంగా వీక్షించే ఉత్తమ చిత్రంగా అక్కినేని అవార్డు కూడా గెలుచుకుంది.
ఓటీటీ: హాట్ స్టార్
వెంకీ
తెలుగులో వచ్చిన ఆల్ టైం కామెడీ కల్ట్ మూవీల్లో వెంకీ ఒకటి. శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందింది. రవితేజ, స్నేహ ప్రధాన పాత్రధారులుగా.. బ్రహ్మానందం, ఏవీఎస్, చిత్రం శ్రీను, శ్రీనివాస్ రెడ్డి ఇతర పాత్రల్లో నటించారు. రోటిన్ కామెడీకి విభిన్నంగా స్పెషల్ ట్రాక్ కామెడీని శ్రీను వైట్ల పరిచయం చేశాడు. ఈ మూవీతో శ్రీను వైట్లకు మంచి బ్రేక్ వచ్చింది.
ఓటీటీ: యూట్యూబ్
దూకుడు
పక్కా యాక్షన్ కామెడీ ఫిల్మ్ గా దూసుకొచ్చిన దూకుడు మూవీ టాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను షేక్ చేసింది. శ్రీనువైట్ల డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ మూవీ రూ.101 కోట్లు రాబట్టింది. సూపర్ స్టార్ మహేష్ బాబు తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను అలరించాడు. దీనికి తోడు బ్రహ్మానందం, ఎంఎస్ నారాయణ కామెడీ ట్రాక్ ఈ సినిమాకే హైలెట్.
మత్తు వదలరా
తెలుగులో వచ్చిన అతి కొద్ది కామెడీ క్రైమ్ థ్రిల్లర్ సినిమాల్లో మత్తు వదలరా ఒకటి. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై రితేష్ రానా డైరెక్ట్ చేసిన తొలి సినిమా ఇది. శ్రీ సింహా, సత్య, నరేష్, అతుల్య చంద్ర, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుని బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది.
ఓటీటీ: ప్రైమ్ వీడియో
బ్రహ్మానందం టాప్ 10 బెస్ట్ కామెడీ సినిమాలు
బ్రహ్మానందం నటించిన ఈ చిత్రాలకు తెలుగు హాస్య చిత్రాల్లో ప్రత్యేక స్థానం ఉంది. ఈ చిత్రాలను చూడని వారు బ్రహ్మీ అసలు సిసలు కామెడీని మిస్ అవుతున్నట్లే లెక్క. మరి ఆ సినిమాలు ఏంటో ఓసారి చూసేయండి.
అదుర్స్
అదుర్స్‌లో బ్రహ్మానందం గారు చేసిన భట్టు క్యారెక్టర్ ఎప్పటికీ ప్రత్యేకంగా నిలుస్తుంది. నువ్వంతా హార్ష్‌గా మాట్లాడకు చందు అని బ్రహ్మి చెప్పే డైలాగ్ చాలా మంది మీమర్స్‌కు మంచి స్టఫ్ అందించిందని చెప్పవచ్చు. ఈ చిత్రంలో జూ. ఎన్టీఆర్- బ్రహ్మానందం- నయనతార మధ్య వచ్చే కామెడీ ట్రాక్ బాగా ఆకట్టుకుంటుంది. బట్టు-చారి-చందు క్యారెక్టర్లు తెలుగు చిత్ర సీమలో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు.
ఓటీటీ: ప్రైమ్, ఆహా
మన్మధుడు
ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెలరేగిపోతాను.. అని బ్రహ్మి చెప్పిన డైలాగ్ ఎంతో ఫేమసో ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ చిత్రంలో బ్రహ్మానందం స్క్రీన్ టైమ్ తక్కువే అయినప్పటికీ అయిన సినిమాపై గట్టి ఇంపాక్ట్ చూపించారు.
ఓటీటీ: హాట్ స్టార్, యూట్యూబ్
ఢీ
మంచు విష్ణుతో కలిసి నటించిన బ్రహ్మనందం ఈ సినిమాలో గుమస్తాగా పనిచేశారు. ఏమో సార్.. "దయచేసి నన్ను ఇన్వాల్ చేయకండి సార్" అంటూ చెప్పే డైలాగ్స్ ప్రేక్షకులను అలరిస్తాయి. ఈ చిత్రంలో ఆయన అమాయకత్వం, వ్యక్తీకరణలు హాస్యాన్ని పండిస్తాయి.
ఓటీటీ: యూట్యూబ్
రెడీ
శ్రీను వైట్ల డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం కామెడీ చిత్రాల్లో బెస్ట్ సినిమాగా చెప్పవచ్చు. ఈ సినిమాలో మెక్‌డోవెల్ మూర్తి క్యారెక్టర్‌లో బ్రహ్మానందం కామెడీ ట్రాక్ కడుపుబ్బ నవ్విస్తుంది. అలాగే చందు పాత్రలో రామ్ పొత్తినేని, చిట్టినాయుడిగా జయప్రకాశ్ రెడ్డి కామెడీ అలరిస్తుంది. ఈ సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది.
రేసు గుర్రం
ఈ చిత్రాన్ని సూపర్ హిట్ చేసింది... కిల్ బిల్ పాండే పాత్ర అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. చివరి అర్ధగంటలో బ్రహ్మానందం ట్రాక్ సినిమాకు హైలెట్‌గా ఉంటుంది. ప్రస్టేషన్.. ప్రస్టేషన్ అంటూ వచ్చే బీజీఎం నవ్వులు పూయిస్తుంది. కిల్ బిల్ పాండే రోల్‌లో బ్రహ్మానందం జీవించేశారు.
ఓటీటీ: యూట్యూబ్
మనీ మనీ
"వారేవ్వా ఏమి ఫేసు.. అచ్చం హీరోల ఉంది బాసు" ఈ పాట ఎంత ఫెమస్సో అందరికీ తెలిసిందే. అతను చేసిన ఖాన్ క్యారెక్టర్ ఎంతో మంది ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయింది. ఖాన్‌తో గేమ్స్ ఆడొద్దు..శాల్తీలు లేచిపోతాయ్ వంటి డైలాగ్స్ ఎన్నో మీమ్స్‌కు స్ఫూర్తిగా నిలిచాయి.
ఓటీటీ: యూట్యూబ్, ప్రైమ్
అనగనగా ఒకరోజు
ఇక చిత్రంలో బ్రహ్మానందం ఓ దొంగలా యాక్ట్ చేశాడు. 'నెల్లూరు పెద్దా రెడ్డి' తెలుసా నీకు అని బ్రహ్మి చెప్పిన డైలాగ్ ఎంతో ప్రాచూర్యం పొందింది. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు ఉందండి అని చెప్పే డైలాగ్ ఎంత అందరికి తెలిసిందే.
ఓటీటీ: ప్రైమ్, జియో సినిమా
కింగ్
ఈ చిత్రంలో బ్రహ్మానందం మ్యూజిక్ డైరెక్టర్‌గా తెగ నవ్వించాడు. 'అరె అరె.. రికార్డ్ చేయ్ రికార్డ్ చేయ్' ఆయన చేసిన పాత్రను ఇప్పటికీ చాలా మంది మీమర్స్.. ట్యూన్స్‌ను కాపీ చేస్తున్న మ్యూజిక్ డైరెక్టర్స్‌ను ట్రోల్ చేసేందుకు వాడుతున్నారు.
ఓటీటీ: ప్రైమ్, యూట్యూబ్
వెన్నెల కిషోర్ బెస్ట్ కామెడీ సినిమాలు
వెన్నెల
ఈ చిత్రం పేరునే తన ఇంటి పేరుగా మార్చుకునేంత గొప్ప పేరు కిషోర్‌కు వచ్చింది. ఈ చిత్రంలో వెన్నెల కిషోర్ ఖాదర్ భాషా పాత్రలో నటించాడు. ఈ సినిమాలో కిషోర్ చెప్పే డైలాగ్‌లు చాలా హెలేరియస్‌గా ఉంటాయి. డోంట్ బాదార్ ఐ యామ్ ఖాదర్ అంటూ తెగ నవ్విస్తాడు.
ఓటీటీ: యూట్యూబ్
భలే భలే మగాడివోయ్
ఈ చిత్రంలో నానితో వెన్నెల కిషోర్ పండించే కామెడీ హెలెరియస్‌గా ఉంటుంది. నాని మతిమరుపునకు బలయ్యే క్యారెక్టర్‌లో బాగా నవ్వు తెప్పించాడు.
ఓటీటీ: హాట్ స్టార్
అలీ బెస్ట్ కామెడీ చిత్రాలు
అలీ తనదైన మేనరిజంతో నవ్వులు పూయించిన చిత్రాలు అనేకం ఉన్నప్పటికీ.. పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లో వచ్చిన సినిమాలు ఆయన క్యారెక్టర్ విషయంలో మోస్ట్ హెలెరియస్‌గా ఉంటాయి. వీటిని మాత్రం అస్సలు మిస్ కావొద్దు.
దేశముదురు
ఈ చిత్రంలో అలీ రోల్ తెగ నవ్విస్తుంది. బ్యాంక్ ఎంప్లాయ్ నుంచి అలీ ఎలా స్వామిజీగా మారాడు అనే ఎపిసోడ్.. చాలా హెలేరియస్‌గా ఉంటుంది
ఓటీటీ: యూట్యూబ్
చిరుత
ఈ సినిమాలో అలీ చేసిన లక్ష్మీ క్యారెక్టర్ చాలా ఫేమస్ అయింది. మసాజ్.. థాయ్ మసాజ్ అంటూ అలీ చెప్పే డైలాగ్స్ మంచి ఫన్ జనరేట్ అవుతుంది
ఓటీటీ: యూట్యూబ్
పోకిరి
ఈ సినిమాలో అలీ బిచ్చగాడు పాత్రలో చేసిని కామెడీ అంతా ఇంతకాదు. ముఖ్యంగా బ్రహ్మానందాన్ని ఓ ఆట ఆడుకునే ట్రాక్ థియేటర్ మొత్తం నవ్వులు పూయిస్తుంది
ఓటీటీ: యూట్యూబ్/ హాట్ స్టార్
సూపర్
ఈ చిత్రంలో అలీ దొంగ పాత్రలో అద్భుతంగా కామెడీ పంచాడు. ముఖ్యంగా స్పెషల్ ఆఫీసర్‌గా బ్రహ్మానందం... అలీని ఇంటరాగెట్ చేసే సీన్ కడుపుబ్బ నవ్వు తెప్పిస్తుంది
ఓటీటీ: హాట్ స్టార్/యూట్యూబ్
మే 23 , 2024
EXCLUSIVE: ఫ్యూచర్‌లో టాలీవుడ్‌ను రూల్ చేసే యంగ్ హీరోలు వీరే!
సినీ పరిశ్రమలో వారసత్వం అనేది సర్వసాధారణంగా మారిపోయింది. స్టార్ హీరోల కుమారులు తమ టాలెంట్‌ను నిరూపించుకొని కథానాయకులుగా ఎదుగుతున్నారు. టాలీవుడ్‌లోనూ ఈ తరహా పరిస్థితులే ఉన్నాయి. వారసులుగా వచ్చిన ఈతరం యువ నటులు.. ఇక్కడ స్టార్లుగా గుర్తింపు సంపాదించారు. అయితే కొందరు మాత్రం ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి టాలీవుడ్‌లో స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్నారు. అద్భుతమైన యాక్టింగ్ స్కిల్స్‌తో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించారు. తద్వారా రానున్న ఐదేళ్లలో తెలుగు చిత్ర పరిశ్రమను రూల్ చేయగలమన్న నమ్మకాన్ని కలిగిస్తున్నారు. ఇంతకీ ఆ కథానాయకులు ఎవరు? వారి ప్రస్థానం ఇకపై ఎలా సాగనుంది? టాలీవుడ్‌ను శాసించేందుకు వారికి కలిసి రానున్న అంశాలేంటి? ఈ ప్రత్యేక కథనంలో పరిశీలిద్దాం.
సుహాస్
యువ నటుడు సుహాస్ (Suhas).. వరుస హిట్స్‌తో టాలీవుడ్‌లో దూసుకెళ్తున్నాడు. కమెడియన్‌గా తెలుగు ఆడియన్స్‌కు పరిచయమైన సుహాస్.. తానొక హీరో మెటీరియల్ అని నిరూపించుకున్నాడు. ‘కలర్ ఫొటో’, ‘రైటర్’, ‘అంజాబీపేట మ్యారేజ్ బ్యాండ్’ వంటి హిట్ చిత్రాలతో ఫ్యామిలీ ఆడియన్స్‌కు బాగా దగ్గరయ్యాడు. సుహాస్‌తో సినిమా అంటే హిట్ పక్కా అని దర్శక నిర్మాతలు భావించే స్థాయికి ఈ యువ హీరో ఎదిగాడు. కథల ఎంపికలో సుహాస్ అనుసరిస్తున్న వైఖరి చాలా బాగుందని సినీ విమర్శకులు సైతం ప్రశంసిస్తున్నారు. సుహాస్ ఇదే తరహాలో భవిష్యత్‌లో సినిమాలు చేస్తే హీరో నానిలా మరో నేచురల్ స్టార్ అవుతాడని అంటున్నారు.
విజయ్ దేవరకొండ
యంగ్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda).. ఫ్యూచర్ స్టార్‌గా ఎదుగుతున్నాడు. ‘అర్జున్ రెడ్డి’తో స్టార్ హీరోగా మారిన విజయ్.. మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. హిట్, ఫ్లాప్‌తో సంబంధం లేకుండా అభిమానించే ఫ్యాన్స్.. విజయ్ సొంతం. ప్రస్తుతం సరైన హిట్ లేక విజయ్ ఇబ్బంది పడుతున్నాడు. అంతమాత్రన అతడి పని అయిపోయినట్లేనని భావిస్తే పొరపాటే. విజయ్ మార్కెట్ ఏంటో 2018లో వచ్చిన ‘గీతా గోవిందం’ కళ్లకు కట్టింది. ఆ సినిమా ద్వారా అప్పట్లోనే విజయ్ రూ.100 కోట్ల కలెక్షన్లను రాబట్టాడు. ఇక సాలిడ్ హిట్ లభిస్తే విజయ్‌ను ఆపడం కష్టమేనని చెప్పవచ్చు.
సిద్ధు జొన్నలగడ్డ
టాలీవుడ్‌ను రూల్ చేయగల సామర్థ్యమున్న మరో హీరో ‘సిద్ధు జొన్నలగడ్డ’. ‘డీజే టిల్లు’కి ముందు వరకు సాధారణ హీరోగా ఉన్న సిద్ధూ.. ఆ సినిమాతో తన టాలెంట్ ఏంటో చూపించాడు. రీసెంట్‌గా ‘టిల్లు స్క్వేర్’తో రూ.100 కోట్ల క్లబ్‌లో వచ్చి చేరాడు. సిద్ధూ మ్యానరిజం, బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ, రైటింగ్ స్కిల్స్ యూత్‌కు బాగా కనెక్ట్ అయ్యాయి. ఎప్పుడైన ఒక సినిమాను సక్సెస్ చేయడంలో యూత్ కీలకంగా ఉంటారు. అటువంటి యూత్‌పై ఈ యంగ్ హీరో చెరగని ముద్ర వేయడం.. అతడి ఫ్యూచర్‌కు కలిసిరానుంది. త్వరలో ‘టిల్లు క్యూబ్’ను పట్టాలెక్కించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇందులో స్టార్ హీరోయిన్లు సమంత, తమన్నాలు నటిస్తారని టాక్ వినిపిస్తోంది. ఆ మూవీ కూడా సక్సెస్ అయితే ఇక ఇండస్ట్రీలో సిద్ధూకు తిరుగుండదని చెప్పవచ్చు.
నవీన్ పొలిశెట్టి
ఒకప్పుడు కామెడీ హీరో అనగానే ముందుగా రాజేంద్ర ప్రసాద్ గుర్తుకు వచ్చేవారు. ఈ జనరేషన్‌లో కామెడీ స్టార్ అనగానే అందరికీ నవీన్ పొలిశెట్టి గుర్తుకు వస్తున్నాడు. ఈ యంగ్ హీరో కామెడీ టైమింగ్‌కు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. 2019లో వచ్చిన ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ'తో నవీన్ తన టాలెంట్ ఏంటో చూపించాడు. ‘జాతి రత్నాలు’ సినిమాతో తన క్రేజ్ ఒక సినిమాతో పోయేది కాదని నిరూపించాడు. ఫన్ అండ్ ఎంటర్‌టైనర్ చిత్రాలకు కేరాఫ్‌గా మారిన నవీన్ పొలిశెట్టితో సినిమా అంటే మినిమమ్ గ్యారంటీ అని నిర్మాతలు భావిస్తున్నారు. బాక్సాఫీస్ వద్ద ఒక సాలిడ్ హిట్ లభిస్తే నవీన్ పొలిశెట్టిని ఇక ఎవరూ ఆపలేరని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
తేజ సజ్జ
యంగ్ హీరో ‘తేజ సజ్జ’ విభిన్నమైన కథలను ఎంచుకుంటూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ‘హను మాన్’తో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాందించిన ఈ యంగ్ హీరో.. టాలీవుడ్ ఫ్యూచర్‌పై గట్టి భరోసా కల్పిస్తున్నాడు. తేజ ఇప్పటివరకూ చేసిన ‘జాంబిరెడ్డి’, ‘ఇష్క్’, ‘అద్భుతం’ చిత్రాలను గమనిస్తే అవన్నీ యూనిక్ కాన్సెప్ట్‌తో తెరకెక్కినవే. ప్రస్తుతం అతడు చేస్తున్న ‘సూపర్ యోధ’ చిత్రం కూడా సాహసోపేతమైన కథతో పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతోంది. ఈ మూవీ కూడా హనుమాన్ స్థాయిలో సక్సెస్ అయితే తేజ ఇక తిరిగి వెనక్కి చూసుకోవాల్సిన అవసరముండదని సినీ నిపుణుల అభిప్రాయం.
అడవి శేషు
యువ హీరో అడవి శేషు.. యాక్షన్ చిత్రాలకు కేరాఫ్‌గా మారిపోయాడు. ‘గూఢచారి’ వంటి స్ఫై థ్రిల్లర్ తర్వాత ఈ హీరో కథల ఎంపిక పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు లవర్ బాయ్, విలన్ షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపించిన ఈ యంగ్ హీరో.. ప్రస్తుతం ప్రేక్షకులు ఏం కోరుకుంటున్నారో అలాంటి చిత్రాలనే చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నాడు. ఈ క్రమంలోనే ‘హిట్: సెకండ్ కేసు’, ‘మేజర్’ వంటి బ్లాక్ బాస్టర్స్ వచ్చాయి. ప్రస్తుతం గూఢచారికి సీక్వెల్‌లో నటిస్తూ అడవి శేషు.. బిజీగా ఉన్నాడు. ఈ వ్యూహాన్నే ఫ్యూచర్‌లోనూ అనుసరిస్తే.. ఈ కుర్ర హీరో టాలీవుడ్ జేమ్స్ బాండ్‌గా మారే అవకాశముంది.
ప్రియదర్శి
కమెడియన్‌గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి హీరోగా మారిన నటుడు ప్రియదర్శి. 2016లో వచ్చిన 'టెర్రర్' చిత్రంతో ఇండస్ట్రీలోకి వచ్చిన అతడు.. తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించాడు. గ్రామీణ నేపథ్యమున్న చిత్రాల్లో హీరోగా నటిస్తూ ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకర్షిస్తున్నాడు. గతేడాది వచ్చిన ‘బలగం’ చిత్రం ప్రియదర్శి కెరీర్‌ను మలుపు తిప్పింది. ఇటీవల వచ్చిన ‘మంగళవారం’ సినిమాలో ఓ డిఫరెంట్‌లో రోల్‌లో కనిపించి తనలోని కొత్త నటుడ్ని పరిచయం చేశాడు. ప్రియదర్శి.. ఇలాగే తన ఫ్యూచర్ ప్రాజెక్టులను ప్లాన్ చేసుకుంటే భవిష్యత్‌లో స్టార్ హీరోగా మారడం ఖాయమని ఫిల్మ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఏప్రిల్ 18 , 2024
EXCLUSIVE: ఈ జనరేషన్ మెగాస్టార్లు.. స్వయంకృషితో స్టార్లుగా ఎదిగిన టాలీవుడ్ కుర్ర హీరోలు వీరే!
తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటికే చాలా మంది కథానాయకులు ఉన్నారు. స్టార్ హీరోల కుటుంబాల నుంచి వచ్చిన వారసులు, దర్శక నిర్మాతల తనయులు.. హీరోలుగా మారి తామేంటో నిరూపించుకున్నారు. అయితే కొందరు మాత్రం ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి టాలీవుడ్‌లో స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్నారు. అద్భుతమైన యాక్టింగ్ స్కిల్స్‌తో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించారు. కసి, పట్టుదల ఉంటే ఇండస్ట్రీలో ఎవరైనా పైకి రావొచ్చని ఆ కుర్ర హీరోలు నిరూపించారు. ఇంతకీ ఆ కథానాయకులు ఎవరు? ఇండస్ట్రీలో తమ ప్రస్థానాన్ని ఎలా మెుదలు పెట్టారు? వారిని స్టార్లుగా మార్చిన చిత్రాలు ఏవి? ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.
నాని
స్వయం కృషితో పైకొచ్చిన ఈ తరం హీరో అనగానే అందరికీ ముందుగా నాని (Nani)నే గుర్తుకు వస్తాడు. అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించిన నాని.. ‘అష్టా చమ్మా’ సినిమాతో హీరోగా మారాడు. ‘భీమిలి కబడ్డి జట్టు’, ‘అలా మెుదలైంది’, ‘పిల్ల జమిందార్’, ‘ఈగ’, ‘ఎటో వెళ్లిపోయింది మనసు’, ‘భలే భలే మగాడివోయ్’, ‘నేను లోకల్’, ‘జెర్సీ’, ‘శ్యామ్ సింగరాయ్’, ‘దసరా’, ‘హాయ్ నాన్న’ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించి స్టార్ హీరోగా మారిపోయాడు. నాని నటించిన లేటెస్ట్ చిత్రం ‘సరిపోదా శనివారం’ ఆగస్టు 29న విడుదల కానుంది.
విజయ్ దేవరకొండ
యంగ్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) కూడా కెరీర్ ప్రారంభంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. హీరో ఫ్రెండ్, ప్రాధాన్యం లేని పాత్రల్లో నటిస్తూ సరైన అవకాశాల కోసం ఎదురుచూశాడు. ‘నువ్విలా’ చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయమైన విజయ్.. ‘లైఫ్ ఇజ్ బ్యూటిఫుల్’, ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ చిత్రాల్లో సైడ్ రోల్స్‌లో చేశాడు. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన 'పెళ్లి చూపులు' చిత్రంతో తొలిసారి ఫుల్ లెన్త్ హీరోగా మారాడు. ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌లో వచ్చిన 'అర్జున్ రెడ్డి'తో విజయ్ రాత్రికి రాత్రే స్టార్‌గా ఎదిగాడు. యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించాడు. 'గీతా గోవిందం' ఫిల్మ్ ద్వారా ఫ్యామిలీ ఆడియన్స్‌కూ విజయ్ దగ్గరయ్యాడు. రీసెంట్‌గా ‘ఫ్యామిలీ స్టార్’తో విజయ్ తెలుగు ఆడియన్స్‌ను పలకరించాడు.
సిద్ధు జొన్నలగడ్డ
హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda).. నటనపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి వచ్చాడు. చిత్ర పరిశ్రమలో తెలిసిన వారు ఎవరూ లేకపోవడంతో చిన్న పాత్రలతో కొద్ది రోజులు నెట్టుకొంచాడు. ‘జోష్’, ‘ఆరెంజ్’, ‘భీమిలి కబడ్డీ జట్టు’, ‘డాన్ శీను’ చిత్రాల్లో పెద్దగా గుర్తింపు లేని పాత్రల్లో నటించాడు. ప్రవీణ్ సత్తారు డైరెక్షన్‌లో వచ్చిన 'LBW' (లైఫ్ బిఫోర్ వెడ్డింగ్) మూవీతో సిద్ధూ హీరోగా మారాడు. 'గుంటూరు టాకీస్' చిత్రం హీరోగా అతడికి గుర్తింపు తీసుకొచ్చింది. ఆ తర్వాత అడపాదడపా చిత్రాలు చేసినప్పటికీ సిద్ధుకు చెప్పుకోతగ్గ హిట్ రాలేదు. 2022లో వచ్చిన 'డీజే టిల్లు' ఈ యంగ్ హీరో కెరీర్‌ను మలుపు తిప్పింది. ప్రేమ పేరుతో మోసపోయిన టిల్లు పాత్రలో సిద్ధు జీవించేశాడు. తాజాగా ఈ సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన టిల్లు స్క్వేర్ కూడా బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. అంతేకాదు రూ.100 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి సిద్ధూను స్టార్ హీరోల సరసన నిలబెట్టింది. దీంతో 'టిల్లు క్యూబ్' తీసేందుకు మేకర్స్ సన్నాహాలు మెుదలు పెట్టారు.
నవీన్ పొలిశెట్టి
యువ కథానాయకుడు నవీన్ పొలిశెట్టి (Naveen Polishetty) సైతం.. ఇండస్ట్రీలో ఎవరి సపోర్టు లేకుండా స్టార్ హీరో స్థాయికి ఎదిగాడు. కెరీర్ తొలినాళ్లల్లో ప్రాధాన్యం లేని పాత్రల్లో నవీన్ నటించాడు. శేఖర్ కమ్ముల తెరకెక్కించిన 'లైఫ్ ఇజ్ బ్యూటిఫుల్' చిత్రంతో తొలిసారి ఇండస్ట్రీకి పరిచయయ్యాడు. ఆ తర్వాత 'డీ ఫర్ దోపిడి', ‘1 నేనొక్కడినే’ చిత్రాల్లో చేసినప్పటికీ పెద్దగా ఫేమ్ రాలేదు. అయితే 2019లో వచ్చిన ఏజెంట్ 'సాయి శ్రీనివాస ఆత్రేయ' చిత్రం.. నవీన్ పోటిశెట్టి పేరు మార్మోగేలా చేసింది. ఇందులో నవీన్ చెప్పే ఫన్నీ డైలాగ్ డెలివరీ కడుపుబ్బా నవ్విస్తుంది. ఇక 'జాతి రత్నాలు' ఫిల్మ్‌తో నవీన్ పొలిశెట్టి క్రేజ్ మరో స్థాయికి చేరింది. ఇటీవల స్టార్ నటి అనుష్కతో మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి చిత్రంలో ఈ యంగ్ హీరో నటించగా ఆ ఫిల్మ్ కూడా హిట్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో టాలీవుడ్‌లో నవీన్ మినిమమ్ గ్యారంటీ హీరోగా మారిపోయాడు.
తేజ సజ్జ
యువ హీరో తేజ సజ్జ (Teja Sajja).. ఒకప్పుడు బాల నటుడిగా తెలుగు ప్రేక్షకులను అలరించాడు. చిరంజీవి, మహేష్‌బాబు, వెంకటేష్, పవన్ కల్యాణ్, శ్రీకాంత్, జూ.ఎన్టీఆర్ చిత్రాల్లో నటించాడు. కాగా, 2019లో వచ్చిన 'జాంబిరెడ్డి' సినిమాతో తేజ సజ్జా హీరోగా మారాడు. ఆ సినిమా సూపర్ హిట్ సాధించింది. ఆ తర్వాత చేసిన ఇష్క్, అద్భుతం సినిమాలు కూడా హిట్ టాక్ తెచ్చుకున్నాయి. రీసెంట్‌గా అతడు నటించిన ‘హనుమాన్’ (Hanu Man) సినిమా ప్యాన్ ఇండియా స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ప్రశాంత్ వర్మ (Prashanth Varma) దర్శకత్వం వహించిన ఈ సినిమా.. నార్త్‌లో విశేష ఆదరణ సంపాందించింది. దీంతో తేజ సజ్జా క్రేజ్ అమాంతం పెరిగింది. ప్రస్తుతం అతడు సూపర్ యోధ అనే ఫిల్మ్‌లో నటిస్తున్నాడు.
అడవి శేషు
స్టార్ హీరో అడవి శేషు (Adivi Sesh)కు కూడా ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేదు. తొలి చిత్రం 'కర్మ'తో హీరోగా మారిన అతడు.. అరంగేట్రంతోనే మంచి గుర్తింపు సంపాదించాడు. ఆ తర్వాత ‘పంజా’, ‘బలుపు’, ‘రన్ రాజా రన్’, ‘బాహుబలి’, ‘అమీ తుమీ’ వంటి చిత్రాల్లో సపోర్టింగ్ రోల్స్‌లో కనిపించాడు. ఆ తర్వాత వచ్చిన 'గూడఛారి' చిత్రం అడివి శేషు కెరీర్‌ను మలుపు తిప్పింది. ఈ స్పై థ్రిల్లర్ చిత్రం తెలుగు ఆడియన్స్‌ను విపరీతంగా ఆకర్షించింది. ఆ తర్వాత చేసిన ‘ఎవరు’, ‘మేజర్’, ‘హిట్: సెకండ్ కేసు’ కూడా సూపర్ హిట్స్‌గా నిలవడంతో ఈ యువ నటుడు స్టార్ హీరోగా మారిపోయాడు. ప్రస్తుతం అడివి శేషు.. గూడఛారి సీక్వెల్‌లో నటిస్తున్నాడు.
ప్రియదర్శి
యువనటుడు ప్రియదర్శి (Priyadarshi Pulikonda)కి చిన్నప్పటి నుంచే సినిమాలపై ఆసక్తి ఉండేది. ఇండస్ట్రీలో తనకంటూ ఎవరు లేనప్పటికీ అవకాశాల కోసం కాళ్లు అరిగేలా తిరిగాడు. చివరికీ 2016లో శ్రీకాంత్ హీరోగా వచ్చిన 'టెర్రర్' చిత్రంలో ఉగ్రవాది పాత్రతో ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. అదే ఏడాది వచ్చిన ‘పెళ్లి చూపులు’ అతడికి మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఇందులో 'నావు చావు నేను చస్తా.. నీకెందుకు' డైలాగ్‌తో అతడు బాగా ఫేమస్ అయ్యాడు. ఆ తర్వాత పలు చిత్రాల్లో హాస్య పాత్రల్లో కనిపించిన ప్రియదర్శి.. 'జాతి రత్నాలు' మూవీతో మరింత పాపులర్ అయ్యాడు. ఈ క్రమంలోనే గతేడాది వచ్చిన 'బలగం' సినిమా ప్రియదర్శిని స్టార్ నటుడిగా నిలబెట్టింది. ఇటీవల వచ్చిన ‘మంగళవారం’, ‘ఓం భీమ్ బుష్’ చిత్రాల్లో లీడ్ రోల్స్‌లో నటించి ప్రియదర్శి అలరించాడు.
ఏప్రిల్ 17 , 2024
Tollywood Comedians As Heros: హీరోలుగా సత్తా చాటుతున్న ఈ తరం హాస్యనటులు వీరే..!
టాలీవుడ్‌కి చెందిన దిగ్గజ హాస్య నటులు గతంలో హీరోలుగా నటించి మంచి విజయాలు సాధించారు. బ్రహ్మానందం (Brahmandam), అలీ (Ali), సునీల్ (Sunil), వేణుమాదవ్ (Venu Madhav) లాంటి సీనియర్ కమెడియన్లు పలు చిత్రాల్లో కథానాయకులుగా చేసి అలరించారు. తాజాగా ఈ జనరేషన్ కమెడియన్స్ కూడా వారిని ఆదర్శంగా తీసుకుంటున్నారు. కథానాయకులుగా కనిపిస్తూ ఆడియన్స్‌ను సర్‌ప్రైజ్ చేస్తున్నారు. సాలిడ్ కథతో వచ్చి మంచి హిట్స్ సైతం సాధిస్తున్నారు. అలా రీసెంట్‌గా ఆడియన్స్ ముందుకు వచ్చిన వారెవరు? ఆ సినిమాలేంటి? ఇప్పుడు చూద్దాం.
సుహాస్ (Suhas)
ప్రముఖ నటుడు సుహాస్.. వరుస హిట్లతో టాలీవుడ్‌లో దూసుకెళ్తున్నాడు. షార్ట్‌ఫిల్మ్స్‌తో ఫేమస్ అయిన సుహాస్.. 2018లో ‘పడి పడి లేచె మనసు’ సినిమాతో తెరంగేట్రం చేశాడు. తర్వాత ‘మజిలీ’, ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’, ‘డియర్ కామ్రేడ్’, ‘ప్రతిరోజూ పండగే’, ‘ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య’ చిత్రాల్లో హాస్య పాత్రలు పోషించి నవ్వులు పంచాడు. ‘కలర్ ఫొటో’తో తొలి ప్రయత్నంలోనే హీరోగా విజయం అందుకున్న సుహాస్..‘ఫ్యామిలీ డ్రామా’, ‘రైటర్ పద్మభూషణ్’ చిత్రాలతో మంచి పేరు సంపాదించాడు. రీసెంట్‌గా ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ (Ambajipeta Marriage Band)తో కథానాయకుడిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. ప్రస్తుతం ‘కేబుల్ రెడ్డి’, ‘శ్రీరంగ నీతులు’, ‘ప్రసన్నవదనం’ తదితర చిత్రాల్లో సుహాస్ నటిస్తున్నాడు.
వైవా హర్ష (Harsha Chemudu)
షార్ట్‌ఫిల్మ్స్ నుంచి వెండితెరపైకి వచ్చిన ప్రముఖ కమెడియన్స్‌లో వైవా హర్ష ఒకరు. ‘మసాలా’తో సినీ కెరీర్ ప్రారంభించిన హర్ష.. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’, ‘రాజాది గ్రేట్’, ‘పక్కా కమర్షియల్’, ‘కార్తికేయ 2’, ‘బింబిసార’ తదితర చిత్రాల్లో నవ్వులు పూయించాడు. తాజాగా ‘సుందరం మాస్టర్’ (Sundaram Master) చిత్రంతో హర్ష కథానాయకుడిగా మారాడు. గతనెల ఫిబ్రవరిలో ఈ చిత్రం విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.
అభినవ్ గోమటం (Abhinav Gomatam)
యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ తరం హాస్య నటుల్లో ‘అభినవ్ గోమటం’ (Abhinav Gomatam) ముందు వరుసలో ఉంటాడు. షార్ట్‌ఫిల్మ్స్‌లో ప్రతిభ కనబరిచి సినిమాల్లోకి వచ్చి అభినవ్.. తొలి చిత్రం ‘ఈ నగరానికి ఏమైంది’తో అందరి దృష్టిని ఆకర్షించాడు. ‘మీకు మాత్రమే చెప్తా’, ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ తదితర చిత్రాల్లోనూ కమెడియన్‌గా వినోదం పంచాడు. రీసెంట్‌గా ‘మస్త్ షేడ్స్ ఉన్నయ్‌రా..’ (Masthu Shades Unnai Ra) సినిమాతో అభినవ్ హీరోగా మారాడు.
సుడిగాలి సుధీర్ (Sudigali Sudheer)
‘జబర్దస్త్’ వేదికగా బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన సుడిగాలి సుధీర్.. ‘అడ్డా’తో సినీ రంగంలోకి అడుగుపెట్టాడు. ‘రేసుగుర్రం’, ‘సుప్రీం’, ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ తదితర చిత్రాల్లో సందడి చేసిన అతడు.. ‘సాఫ్ట్‌వేర్ సుధీర్’తో హీరో అయ్యాడు. తర్వాత ‘గాలోడు’, ‘కాలింగ్ సహస్ర’లో ప్రధాన పాత్రలు పోషించాడు. ప్రస్తుతం ‘జి.ఒ.ఎ.టి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధయ్యాడు.
సత్యం రాజేష్ (Satyam Rajesh)
సత్యం సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రాజేష్.. ఆ మూవీ టైటిల్‌నే తన ఇంటి పేరుగా మార్చుకున్నాడు. ‘మా ఊరి పొలిమేర’ సినిమాతో హీరోగా మారిన అతడు.. మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. కొవిడ్ కారణంగా నేరుగా ఓటీటీలో విడుదలైన ఈ చిత్రానికి విశేష స్పందన వచ్చింది. దీనికి సీక్వెల్‌గా ఇటీవల వచ్చిన ‘మా ఊరి పొలిమేర 2’ గతేడాది చివర్లో థియేటర్లలో రిలీజై హిట్ టాక్ తెచ్చుకుంది.
ప్రియదర్శి (Priyadarsi)
యంగ్ కమెడియన్ ప్రియదర్శి కూడా పలు చిత్రాల్లో హీరోగా నటిస్తూ మంచి గుర్తింపు సంపాదించాడు. ‘మల్లేశం’తో తొలిసారి కథానాయకుడిగా మారిన ప్రియదర్శి.. గతేడాది ‘బలగం’ (Balagam) సినిమాతో సాలిడ్ విజయాన్ని అందుకున్నాడు. ఇటీవల ‘మంగళవారం’ (Mangalavaram) చిత్రంలో ప్రధాన పాత్ర పోషించి అలరించాడు. దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి తెరకెక్కించనున్న ఓ సినిమాకి ప్రియదర్శి హీరోగా ఎంపికయ్యాడు.
వెన్నెల కిషోర్ (Vennela Kishore)
టాలీవుడ్‌లోని స్టార్ కమెడియన్స్‌లో వెన్నెల కిషోర్ ఒకరు. తన తొలి సినిమా ‘వెన్నెల’ టైటిల్‌ను ఇంటి పేరుగా మార్చుకున్న కిషోర్.. ‘దూకుడు’, ‘జులాయి’ వంటి పలు సూపర్ చిత్రాల్లో హాస్య నటుడిగా మెప్పించాడు. ‘అతడు ఆమె ఓ స్కూటర్’తో కథానాయకుడిగా మారిన కిషోర్.. రీసెంట్‌గా ‘చారి 111’ (Chari 111)తో మరోమారు ప్రేక్షకుల ముందుకొచ్చాడు. అయితే ప్రేక్షకులను అలరించడంలో ఈ సినిమా విఫలమైంది.
ధన్‌రాజ్ (Dhanraj)
జబర్దస్త్ షో ద్వారానే మంచి గుర్తింపు తెచ్చుకున్న మరో కమెడియన్ ధన్‌రాజ్. ‘బుజ్జీ ఇలారా’ చిత్రంలో ప్రధాన పాత్రదారిగా కనిపించిన ధన్‌రాజ్.. ప్రస్తుతం ‘రామం రాఘవం’లో లీడ్ రోల్‌లో నటిస్తున్నాడు. ఈ సినిమాకు అతడే దర్శకత్వం వహిస్తుండటం విశేషం. దర్శకుడు సముద్రఖని మరో కీలక పాత్రలో కనిపించనున్నాడు.
మార్చి 14 , 2024
Telugu Debut Directors: ఎన్ని సినిమాలు తీశాం అన్నది కాదన్నయ్యా...స్టార్ డైరెక్టర్ అయ్యామా లేదా?
తెలుగు ఇండస్ట్రీలో ఒక డైరెక్టర్‌గా స్థిరపడటమంటే మామూలు విషయం కాదు. దానికి ఎన్నో సంవత్సరాల కృషి అవసరం. కొందరికి నాలుగైదు సినిమాలకు డైరెక్టర్‌గా గుర్తింపు వస్తే ఇంకొందరికి 10 సినిమాల వరకు పట్టొచ్చు. కానీ, ఇందుకు భిన్నంగా అరంగేట్ర సినిమాతోనే కొందరు డైరెక్టర్లు ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించారు. దశాబ్ద కాలానికి వచ్చే పేరును మెుదటి సినిమాతోనే సొంతం చేసుకున్నారు. తద్వారా టాలీవుడ్‌లో అగ్రడైరెక్టర్ల సరసన చేరిపోయారు. టాలీవుడ్‌లో బెస్ట్ డెబ్యూ డైరెక్టర్లుగా గుర్తింపు తెచ్చుకున్న ఆ దర్శకులు ఎవరో ఇప్పుడు చూద్దాం..
1. శ్రీకాంత్ ఓదెల (srikanth odela)
ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల పేరు టాలీవుడ్‌లో మార్మోగుతోంది. తొలి సినిమా ‘దసరా’ తోనే రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిపోయిన శ్రీకాంత్.. డైరెక్టర్‌గా ఇండస్ట్రీలోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. దసరా సినిమా చూసిన వారంతా శ్రీకాంత్ డైరెక్షన్‌ను తెగ మెచ్చుకుంటున్నారు. యాక్షన్, ఎమోషనల్ సీన్స్‌ను తెరపై చాలా బాగా చూపించాడని ప్రశంసిస్తున్నారు. కాగా, సుకుమార్ దగ్గర శ్రీకాంత్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. నాన్నకు ప్రేమతో, రంగస్థలం సినిమాలు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
2. వేణు ఎల్దండి(Venu Yeldandi)
బలగం సినిమాతో వేణు ఎల్దండి గొప్ప డైరెక్టర్‌గా గుర్తింపు పొందాడు. చిన్న సినిమాగా వచ్చిన బలగం అంతర్జాతీయ స్థాయిలో అవార్డులను కొల్లగొట్టింది. వేణు డైరెక్షన్ స్కిల్స్‌ను ఎంత మెచ్చుకున్నా తక్కువే. తెలంగాణ సంస్కృతి, పల్లెటూరి కట్టుబాట్లు, ప్రేమానురాగాలను వేణు చాలా చక్కగా చూపించాడు. తెలంగాణలోని ప్రతీ పల్లెలోను తెరలు కట్టుకొని మరీ సినిమాను చూస్తున్నారంటే బలగం ఏ రేంజ్‌లో ఆదరణ పొందిందో అర్థం చేసుకోవచ్చు.
3. బుచ్చిబాబు సాన(buchi babu sana)
డైరెక్టర్ బుచ్చిబాబు కూడా తొలి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించాడు. ఉప్పెన సినిమా ద్వారా టాలీవుడ్‌లోకి ఘనంగా ఎంట్రీ ఇచ్చాడు. హీరో పంజా వైష్ణవ్ తేజ్, హీరోయిన్ కృతి శెట్టి ఇద్దరు కొత్త వారే అయినప్పటికీ బుచ్చిబాబు తన డైరక్షన్ స్కిల్స్‌తో సినిమాను నిలబెట్టాడు. స్వచ్చమైన ప్రేమ కావ్యాన్ని తెలుగు ఆడియన్స్‌కు అందించాడు. ఈ సూపర్ హిట్ సాధించడంతో బుచ్చిబాబు టాలెంట్ ఇండస్ట్రీ అంతా తెలిసింది. దీంతో తన రెండో సినిమానే రామ్‌చరణ్‌తో చేసే అవకాశం లభించింది. బుచ్చిబాబు కూడా సుకుమార్ దగ్గరే దర్శకత్వ పాఠాలు నేర్చుకోవడం విశేషం.
4. సందీప్ వంగా(sandeep reddy vanga)
అర్జున్ రెడ్డి సినిమాతో విజయ్ దేవరకొండ రాత్రికి రాత్రే స్టార్ హీరోగా మారిపోయాడు. ఆ సినిమా డైరెక్ట్ చేసిన సందీప్ వంగా కూడా అంతే స్థాయిలో ప్రశంసలు అందుకున్నాడు. మెుదట అర్జున్ రెడ్డి ప్రచార చిత్రాలు, ట్రైలర్ చూసి పెద్ద దుమారమే రేగింది. కానీ, సినిమా రిలీజ్ తర్వాత పరిస్థితులు అన్నీ మారిపోయాయి. పెద్ద ఎత్తున యువత సినిమాకు కనెక్ట్ అయ్యారు. అప్పట్లో ఈ సినిమా ట్రెండ్ సెట్టర్ అనే చెప్పాలి. ప్రస్తుతం అల్లు అర్జున్‌తో కలిసి సందీప్ ఓ సినిమా చేయబోతున్నాడు. పుష్ప2 షూటింగ్ పూర్తైన వెంటనే బన్నీ ఈ సినిమాపై ఫోకస్ పెట్టనున్నాడు.
5. అనిల్ రావిపూడి(anil ravipudi)
డైరెక్టర్ అనిల్ రావిపూడి తీసిన తొలి చిత్రం ‘పటాస్’ ఘన విజయం సాధించింది. హీరో కళ్యాణ్‌రామ్ కెరీర్‌లో గొప్ప హిట్‌గా నిలిచింది. ఈ సినిమాతో హాస్య దర్శకుడిగా అనిల్ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత చేసిన సుప్రీమ్, రాజా ది గ్రేట్, F2, సరిలేరు నీకెవ్వరు, F3 చిత్రాలు ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్ల సరసన అనిల్‌ను నిలబెట్టాయి. ప్రస్తుతం అనిల్ బాలకృష్ణతో ఓ సినిమా చేస్తున్నాడు.
6. సుజీత్ (sujeeth)
డైరెక్టర్ సుజీత్ కూడా రన్ రాజా రన్ చిత్రం ద్వారా టాలీవుడ్‌లోకి ఘనంగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా అప్పట్లో సూపర్ హిట్‌గా నిలిచింది. ఓ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ చిత్రానికి ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు. ఈ సినిమాకు గాను సుజీత్ ఉత్తమ అరంగేట్ర డైరెక్టర్‌గా అవార్డు అందుకున్నాడు. అయితే ప్రభాస్ హీరోగా సుజీత్ డైరెక్షన్‌లో వచ్చిన రీసెంట్ మూవీ సాహో బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమైంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్‌తో సుజీత్ ఓ సినిమా చేస్తున్నాడు.
7. తరుణ్ భాస్కర్(Tharun Bhascker)
పెళ్లి చూపులు చిత్రం ద్వారా టాలెంటెడ్ డైరెక్టర్‌గా తరుణ్ భాస్కర్ గుర్తింపు తెచ్చుకున్నారు. లవ్ అండ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్నే అందుకుంది. ఈ సినిమాకు గాను తరణ్ భాస్కర్ సైమా అవార్డ్స్-2016 సైమా అవార్డ్స్ అందుకున్నారు. ఉత్తమ అరంగేట్ర డైెరెక్టర్‌గా పురస్కారాన్ని పొందారు. పెళ్లి చూపులు తర్వాత చేసిన ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమా కూడా తరుణ్‌కు మంచి హిట్ ఇచ్చింది. ఈ సినిమా ద్వారానే విశ్వక్ సేన్ తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు.
8. స్వరూప్ RSJ
‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ సినిమాతో డైరెక్టర్‌గా స్వరూప్ RSJ టాలీవుడ్‌లో అడుగుపెట్టాడు. ఈ సినిమా ఘనవిజయం సాధించడంతో పాటు స్వరూప్ డైరెక్షన్‌కు మంచి మార్కులే పడ్డాయి. రొటిన్ కామెడీతో వస్తున్న సినిమాలకు ఈ చిత్రం ట్రెండ్ సెటర్‌గా నిలిచింది. మిషన్ ఇంపాజిబుల్ (2022) చిత్రం ద్వారా మరోమారు స్వరూప్ తెలుగు ప్రేక్షకులను పలకరించాడు.
9. అజయ్ భూపతి(Ajay Bhupathi)
అజయ్ భూపతి డైరెక్షన్‌లో వచ్చిన RX100 చిత్రం పెద్ద సంచలనమే అని చెప్పాలి. 'యాన్ ఇన్‌క్రెడిబుల్ లవ్ స్టోరీ' అనే ట్యాగ్‌లైన్‌కి తగ్గట్టే సినిమాను చాలా డిఫరేంట్‌గా తెరపైకి ఎక్కించాడు. ఈ సినిమా యూత్‌కు తెగ కనెక్ట్ అయింది. దీంతో అజయ్ భూపతి పేరు అప్పట్లో మార్మోగింది. ఆ తర్వాత అజయ్ తీసిని మహాసముద్రం (2021) బాక్సాఫీసు వద్ద బోల్తా పడింది.
10. కరుణ కుమార్(karuna kumar)
డైరెక్టర్ కరుణ కుమార్ కూడా తన తొలి సినిమా పలాసతో మంచి డైరెక్టర్‌గా గుర్తింపు పొందాడు. తన సొంత ఊరులో జరిగిన యధార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తీసినట్లు అప్పట్లో కరుణ కుమార్ తెలిపారు. కుల వివక్ష, అంటరానితనం, దళితుల శ్రమ దోపిడి వంటి అంశాలను పలాసలో చక్కగా చూపించాడు. ఈ సినిమాకు గాను కరుణ కుమార్‌ను సైమా అవార్డ్ వరించింది. ఉత్తమ అరంగేట్ర డైరెక్టర్-2020 పురస్కారాన్ని అందించింది. అయితే ఆ తర్వాత కరుణ కుమార్ డైరెక్షన్‌లో వచ్చిన మెట్రో కథలు, శ్రీదేవి సోడా సెంటర్, కళాపురం చిత్రాలు ఆకట్టుకోలేదు.
ఏప్రిల్ 12 , 2023
Upcoming Telugu Movies November 2023: దీపావళి బరిలో పోటీ పడుతున్న సినిమాలు ఇవే!
అక్టోబర్‌లో పెద్ద హీరోల చిత్రాలు సందడి చేసి బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించాయి. దసరా బరిలో నిలిచిన భగవంత్‌కేసరి, టైగర్‌నాగేశ్వరరావు సినిమాలు సక్సెస్ సాధించాయి. అయితే నవంబర్‌లో పెద్ద హీరోల సినిమాలు మాత్రం లేవు. చాలా రోజుల తర్వాత బ్రహ్మానందం యాక్ట్ చేస్తున్న కీడాకోలా, నందమూరి కళ్యాణ్ రామ్ డెవిల్ చిత్రాలు దీపావళి బరిలో ఉన్నాయి. వీటితో పాటు పాయల్ రాజ్‌పూత్ నటించిన హరర్ మూవీ మంగళవారం సైతం నవంబర్‌లోనే విడుదల కానుంది. మరి నవంబర్ నెలలో విడుదల కానున్న ఇతర తెలుగు చిత్రాల వివరాలపై ఓ లుక్ వేయండి.
మా ఊరి పొలిమేర-2
సత్యం రాజేశ్ ప్రధాన పాత్రలో నటించిన 'మా ఊరి పొలిమెర-2' చిత్రం నవంబర్ 3న విడుదల కానుంది. ఈ చిత్రాన్ని డాక్టర్ అనిల్ విశ్వనాథ్ తెరకెక్కించారు. సత్యం రాజేష్‌తో పాటు గెటప్ శ్రీను, రాకెందు మౌళి, చిత్రం శ్రీను, అక్షత శ్రీనివాస్ ముఖ్య పాత్రల్లో నటించారు.
కీడా కోలా
బ్రహ్మానందం ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం కీడాకోలా. ఈ చిత్రాన్ని డైరెక్టర్ తరుణ్ భాస్కర్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నారు. బ్రహ్మానందంతో పాటు ఈ సినిమాలో చైతన్య రావు, రవీంద్ర విజయ్, విష్ణు, రాగ్ మయూర్.. పలువురు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా నవంబర్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఎర్ర చీర
శ్రీరామ్, అజయ్ లీడ్ రోల్స్‌లో నటించిన చిత్రం ఎర్ర చీర. ఈ సినిమాను సుమన్ బాబు డైరెక్ట్ చేశారు. అమ్మ సెంటిమెంట్, హరర్, యాక్షన్ ఎలిమెంట్స్‌తో ఈచిత్రాన్ని తెరకెక్కించారు. నవంబర్ 9న ఎర్రచీర సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఆదికేశవ
పంజా వైష్ణవ్ తేజ్, శ్రీలీల జంటగా నటిస్తున్న చిత్రం ఆదికేశవ. ఈ చిత్రం నవంబర్ 10న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ అంచనాలను పెంచేసింది. ఈ చిత్రాన్ని శ్రీకాంత్ ఎన్ రెడ్డి డైరెక్ట్ చేశారు. సాయి సౌజన్య సంగీతం అందిస్తున్నారు. నాగవంశి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
టైగర్ 3
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న టైగర్ 3 మూవీ నవంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం పాన్ఇండియా లెవల్లో డైరెక్టర్ మానిష్ శర్మ తెరకెక్కించారు. సల్మాన్ సరసన కత్రీనా కైఫ్ హీరోయిన్‌గా నటించింది. ఇమ్రాన్ హష్మి, అషుతోష్ రాణా ముఖ్య పాత్రల్లో నటించారు.
మంగళవారం
పాయల్ రాజ్‌పూత్ లీడ్ రోల్‌లో ఈ సినిమాను సైకాలజికల్ హరర్ చిత్రంగా డైరెక్టర్ అజయ్ భూపతి తెరకెక్కించారు. ఇటీవల రిలీజ్ చేసిన ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచింది. ఇక ఈ సినిమాకు కాంతార మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించారు. మంగళవారం చిత్రం నవంబర్ 17న విడుదల కానుంది.
సప్తసాగరాలు దాటి- సైడ్ బీ
కన్నడ స్టార్ హీరో రక్షిత్ శెట్టి ప్రధాన పాత్రలో నటించిన సప్తసాగరాలు దాటి-సైడ్ బీ సినిమా నవంబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. తొలి భాగం కన్నడలో సూపర్ హిట్ కాగా.. తెలుగులో యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు రెండో భాగాన్ని డబ్బింగ్ వెర్షన్‌లో నవంబర్ 17న రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని హేమంత్ రావు డైరెక్ట్ చేశారు. రక్షిత్ శెట్టి సరసన రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటించింది.
డెవిల్
నందమూరి కళ్యాణ్ రామ్, సంయుక్త మీనన్ కాంబోలో వస్తున్న చిత్రం డెవిల్. ఈ చిత్రం నవంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాను 'బాబు బాగా బిజీ' ఫేమ్ నవీన్ మేడారం తెరకెక్కిస్తున్నారు. డెవిల్ చిత్రంలో కళ్యాణ్ సీక్రెట్ ఏజెంట్ పాత్రలో కనిపించనున్నారు.
అక్టోబర్ 26 , 2023
Telugu OTT Releases: ఈ వారం (మే 15) థియేటర్లు, ఓటీటీలలో సందడి చేసే సినిమాలు ఇవే..
ఈ వారం కూడా పలు సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. ఈ వేసవిలో ఆహ్లాదకరమైన వినోదాన్ని అందించేందుకు రాబోతున్నాయి. మే 14-21వ తేదీల మధ్య పలు సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. అలాగే ఓటీటీలో కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. అవేంటో ఈ కథనంలో చూద్దాం.
థియేటర్‌లో రిలీజయ్యే చిత్రాలు:
అన్ని మంచి శకునములే
యంగ్ హీరో సంతోష్ శోభన్, అందాల భామ మాళవిక నాయర్ జంటగా చేసిన చిత్రం ‘అన్నీ మంచి శకునములే’. డైరెక్టర్ నందినీ రెడ్డి తెరకెక్కించిన ఈ సినిమా మే 18న రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన సాంగ్స్, ట్రైలర్ ఆకట్టుకోవడంతో ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ బ్యానర్ నిర్మించింది. ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీగా ఈ సినిమాను చిత్ర యూనిట్ రూపొందించింది.
బిచ్చగాడు-2
‘బిచ్చగాడు’ సినిమాతో హీరో విజయ్ ఆంటోని తన కెరీర్‌లోనే భారీ విజయాన్ని అందుకున్నాడు. ఈ నేపథ్యంలో ఆ సినిమాకు సీక్వెల్ కూడా విజయ్ తెరకెక్కించాడు. బిచ్చగాడు-2 పేరుతో దానిని 19న ధియేటర్లలోకి తీసుకొస్తున్నాడు. ఈ చిత్రంలో విజయ్ అంటోని ద్విపాత్రాభినయం చేసినట్లు ప్రచార చిత్రం చూస్తే అర్థమవుతోంది. యాక్షన్‌తో పాటు అన్నా చెల్లెళ్ల సెంటిమెంట్‌కు ప్రాధాన్యత ఇచ్చారు.
ఫాస్ట్ X
ఫాస్ట్ అండ్ ఫూరియస్ నుంచి మరో సిరీస్ ఈ వారం రానుంది. విన్ డీజిల్ ప్రధాన పాత్రలో.. జాసన్ మొమోవా ప్రతినాయకుడిగా ఫాస్ట్ X ను తెరక్కించారు. జస్టిన్ లిన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను కూడా మే 19న విడుదల కానుంది. కార్లతో దుమ్ము రేపే పోరాటాలు, ఉత్కంఠ కలిగించే యాక్షన్ ఎపిసోడ్లతో ప్రేక్షకులను సీటు అంచులకు తీసుకొచ్చే ఈ సిరీస్‌పై అంచనాలు భారీగా ఉన్నాయి.
ఓటీటీలో స్ట్రీమింగ్‌కానున్న చిత్రాలు/వెబ్‌సిరీస్‌లు
ఏజెంట్
భారీ అంచనాలతో రిలీజైన అఖిల్ లేటెస్ట్ మూవీ ఏజెంట్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది. ఇప్పుడు సోనీలివ్ వేదికగా మే 19వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సాక్షి వైద్య కథానాయిక. ప్రముఖ కథానాయకుడు మమ్ముట్టి ప్రత్యేక పాత్రలో కనిపించారు. మరి ఓటీటీలోనైనా ఏజెంట్ చిత్రం ఆకట్టుకుంటుందేమో చూడాలి.
డెడ్ పిక్సెల్స్
వివాహానంతరం నిహారిక కొణిదెల నటించిన తొలి వెబ్‌సిరీస్ ‘డెడ్ పిక్సెల్స్’. నిహారికతో పాటు వైవా హర్ష, అక్షయ్ లింగుస్వామి, సాయి రోణక్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఆదిత్య మండల దర్శకత్వం వహిస్తున్న ఈ సిరీస్ ‘డిస్నీ+ హాట్‌స్టార్’ లో ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. వీడియో గేమ్‌లకు యువత ఎంతగా ప్రభావితమవుతుందో ఈ సిరీస్‌లో చూపించబోతున్నట్టు మేకర్స్ తెలిపారు.
ఫ్లాట్‌ఫామ్ వారీగా ఓటీటీ విడుదలలు…
TitleCategoryLanguagePlatformRelease DateAnt Man and Wasp: QuantumaniaMovieEnglishDisney+ HotstarMay 17Modern Love ChennaiSeriesTamilAmazon PrimeMay 18kadina kadoramee andakadahamMovieTamilSony LIVMay 19AyalvashiMovieMalayalamNetflixMay 19KathalMovieHindiNetflixMay 19Bayi AjaibMovieEnglishNetflixMay 19MutedMovieEnglishNetflixMay 19faithfully yoursMovieEnglishNetflixMay 17Selling Sunset: Season 6SeriesEnglishNetflixMay 19Young, Famous & African: Season 2SeriesEnglishNetflixMay 19
మే 15 , 2023
HBD SSMB: ఫ్లాప్స్‌ని నిజాయితీగా యాక్సెప్ట్ చేసిన హీరో.. మహేశ్ లాగే ఫ్యాన్స్‌కి సారీ చెప్పిన హీరోలు ఎవరో తెలుసా?
సినీ ప్రస్థానంలో ఎంత పెద్ద హీరోకైనా హిట్, ఫ్లాప్‌లు సహజం. పరాజయాలను తట్టుకుని నిలబడితేనే ఇక్కడ రాణించగలం. అయితే, సినిమా హిట్ అయితే క్రెడిట్ హీరోది, ఫ్లాప్ అయితే డైరెక్టర్లదనే వాదన ఉండేది. కానీ, ఫెయిల్యూర్‌ని నిజాయితీగా ఒప్పుకున్న హీరోలు కొంత మందే ఉన్నారు. అందులో ముందు వరుసలో ఉండేది మహేశ్ బాబునే. తన చిత్రాల పరాభవానికి బహిరంగంగా క్షమాపణలు చెప్పి అభిమానుల ఆదరణను నిలబెట్టుకున్నాడు. మరి మహేశ్ సారీ చెప్పిన సందర్భాలేంటి? ఈ లిస్టులో ఉన్న ఇతర హీరోలు ఎవరో చూద్దాం.
మహేశ్ బాబు
టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకడిగా కొనసాగుతున్న మహేశ్.. తన కెరీర్‌లో కొన్ని పరాజయాలను చవిచూశాడు. భారీ అంచనాల నడుమ విడుదలైన చిత్రాలు బోల్తా కొట్టడంతో ఫ్యాన్స్ జీర్ణించుకోలేదు. దీంతో మహేశ్ బహిరంగంగానే క్షమాపణలు చెప్పాడు. ఆగడు మూవీ పరాజయంపై శ్రీమంతుడు ఆడియో రిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడాడు. ఆగడు సినిమా మిమ్మల్ని నిరాశపరచడంపై సారీ చెప్తున్నా అంటూ భావోద్వేగానికి లోనయ్యాడు. ఇదే కాకుండా, ‘భరత్ అనే నేను’ సినిమా ఈవెంట్‌లో బ్రహ్మోత్సవం సినిమా ఫ్లాప్‌ని యాక్సెప్ట్ చేశాడు. స్పైడర్ సినిమాపై కూడా సూపర్ స్టార్ సారీ చెప్పాడు.
https://www.youtube.com/watch?v=R99OpY-9uis&t=41s
జూనియర్ ఎన్టీఆర్
వరుస హిట్ మూవీలతో ‘మ్యాన్ ఆఫ్ మాసెస్’గా మారాడు ఎన్టీఆర్. కెరీర్‌లో రెండు, మూడు సినిమాల పరాజయాల్ని ఎన్టీఆర్ మరచిపోలేడు. రభస, రామయ్య వస్తావయ్యా సినిమాల విషయంలో అభిమానులకు సారీ చెప్పాడు. టెంపర్ మూవీ ఈవెంట్‌లో ఫ్యాన్స్‌తో మనసులో మాట పంచుకున్నాడు. ‘ప్రతి సినిమాతో వస్తున్నాం. పోతున్నాం. కానీ, ఈ సారి మాత్రం కాలర్ ఎగిరేసే సినిమాను అందించబోతున్నాం’ అంటూ మైకులో చెప్పేశాడు. దీంతో పాటు ఎన్టీఆర్, మెహర్ రమేశ్ కాంబోలో వచ్చిన డిజాస్టర్ ‘శక్తి’ మూవీపై పలుమార్లు ప్రస్తావించాడు తారక్.
https://www.youtube.com/watch?v=-ZitbUbHFKQ&t=7s
పవన్ కళ్యాణ్
ఖుషి సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ చెప్పుకునే విజయాన్ని సాధించలేదు. గబ్బర్‌సింగ్‌తో ఈ కోరిక తీరిపోయింది. గబ్బర్ సింగ్ సినిమాల కన్నా ముందు పరాజయం సాధించిన సినిమాలను ప్రస్తావించాడు. గబ్బర్ సింగ్ మూవీ ఆడియో ఫంక్షన్‌లో పవన్ కళ్యాణ్ భావోద్వేగానికి గురయ్యాడు. ప్రతి సినిమాకు శాయశక్తులా ప్రయత్నిస్తామని చెప్పుకొచ్చాడు.
https://www.youtube.com/watch?v=0VAIYgsc5Bc&t=92s
నాగార్జున
భాయ్ సినిమా విషయంలోనూ నాగార్జున పెదవి విప్పారు. మనం మూవీ ఆడియో ఫంక్షన్‌లో ఆ సినిమా ఫెయిల్యూర్‌పై మాట్లాడారు.
https://www.youtube.com/watch?v=cXM5F5FAKKA&t=55s
రామ్‌చరణ్ తేజ్
రంగస్థలం సినిమా అనంతరం అంచనాల మధ్య వచ్చిన మూవీ.. ‘వినయ విధేయ రామ’. బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా చెర్రీకి ఊహించిన విజయాన్ని ఇవ్వలేకపోయింది. దీంతో సినిమా ఫలితంపై రామ్‌చరణ్ ప్రత్యేకంగా క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్‌ఫారంలో ఒక నోట్ రిలీజ్ చేశాడు.
అఖిల్, వరుణ్ తేజ్
రీసెంట్‌గా వచ్చిన స్పై మూవీపై నిఖిల్ సిద్ధార్థ, ఏజెంట్ మూవీపై అఖిల్, గని సినిమాపై వరుణ్ తేజ్‌లు కూడా పబ్లిక్‌గానే సారీ చెప్పారు. ఇంకా, ఇలా ఫెయిల్యూర్స్‌ని యాక్సెప్ట్ చేసిన హీరోలు ఉంటే కామెంట్ చేయండి.
https://twitter.com/AkhilAkkineni8/status/1658079819790422016
ఆగస్టు 08 , 2023
I Saw The Devil: ఓటీటీలో ఔట్ స్టాండింగ్ కొరియన్ క్రైమ్ థ్రిల్లర్.. పెద్దలకు మాత్రమే!
ప్రస్తుతం ఓటీటీలో కొరియన్ డ్రామాలు, సినిమాలకు ఎంతో క్రేజ్ ఉంది. అవి యునిక్ కాన్సెప్ట్‌తో అద్భుతమైన స్క్రీన్‌ప్లేతో వస్తాయని చాలా మంచి పేరుంది. దీనికి తోడు ఆయా చిత్రాలు, సిరీస్‌ల కంటెంట్ చాలా రియలిస్టిక్‌గా ఉంటుందని అంటుంటారు. అందుకే దేశవ్యాప్తంగా కొరియన్ సినిమాలకు ఫ్యాన్స్ ఉన్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో వీటిని ఆదరించే వారి సంఖ్య నానాటికి పెరిగిపోతోంది. కాబట్టి ఈ వీకెండ్‌లో మంచి కొరియన్ సినిమా చూడాలని భావించే వారికి YouSay ఓ సినిమాను ఓటీటీ సజిషన్స్ రూపంలో తీసుకొచ్చింది. వైలెన్స్, థ్రిల్లర్, మర్డర్స్ జానర్ సినిమాలను ఇష్టపడేవారికి ఈ చిత్రం కచ్చితంగా నచ్చుతుంది. ఆ సినిమా పేరేంటి? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది? ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.
ఆ మూవీ ఏదంటే?
ఓటీటీలో తప్పకచూడాల్సిన కొరియన్ చిత్రాల్లో ‘ఐ సా ది డెవిల్’ (I Saw The Devil) ముందు వరుసలో ఉంటుంది. 2010లో కొరియాలో విడుదలైన ఈ చిత్రం.. అక్కడ సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. లీ బైంగ్-హమ్ (Lee Byung-Hun) కథానాయకుడిగా, చోయ్ మైనా-సిక్ (Choi Myna-Sik) ప్రతినాయకుడిగా నటించిన ఈ సినిమాకు కిమ్ జీ-వూన్ (Kim Jee-woon) దర్శకత్వం వహించారు. 2 గం. 22 ని.ల నిడివితో డార్క్, యాక్షన్ థ్రిల్లర్ జానర్‌లో రూపొందిన ఈ రివేంజ్ సినిమా.. అమెజాన్ ప్రైమ్‌లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, హిందీతో పాటు ఇతర దక్షిణాది భాషల్లో ఈ చిత్రాన్ని వీక్షించవచ్చు.
పెద్దలకు మాత్రమే!
ఒక సైకో కిల్లర్ మనస్తత్వం ఎలా ఉంటుందో దర్శకుడు కిమ్ జీ-వూన్ ఈ చిత్రం ద్వారా కళ్లకు కట్టాడు. పగలు సాధారణ మనుషుల్లాగే ఉంటూ రాత్రి అయితే ఎంత వైలెంట్‌గా మారతారో ఇందులో చూపించారు. ఆడవారిని కిల్లర్ హత్య చేయడాన్ని చాలా రియలిస్టిక్‌గా చూపించాడు దర్శకుడు. శరీర భాగాలను కట్ చేసి అందులో ఆనందాన్ని వెతుక్కోవడం వీక్షకులకు సైతం కోపం తెప్పిస్తుంది. అటువంటి కిల్లర్ చేతిలో తనకు ప్రాణానికి ప్రాణమైన యువతి మరణిస్తే ఆ హీరో రియాక్షన్ ఇంకెంత వైలెంట్‌గా మారుతుందో ప్రేక్షకులకు తెలియజేశాడు. అయితే ఇందులో బోల్డ్ కంటెంట్, క్రైమ్ సీన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. చిన్నపిల్లలు, ఫ్యామిలీతో చూసే సినిమా అయితే కాదు. ఒంటరిగా మాత్రమే చూడాల్సి ఉంటుంది.
కథేంటి?
ఓ సీరియల్ కిల్లర్ పగలు స్కూల్ వ్యాన్ డ్రైవర్‌గా పని చేస్తూ రాత్రిళ్లు ఒంటరిగా కనిపించే ఆడ వారిని కిడ్నాప్ చేస్తుంటాడు. వారిని వివస్త్రలను చేసిన విచక్షణారహితంగా చంపుతుంటాడు. ఈ క్రమంలో ఓ NIS (The National Intelligence Service) ఏజెంట్ భార్య ఒంటరిగా కారులో వెళుతూ నిర్మానుష్య ప్రాంతంలో చిక్కుకుపోతుంది. కిల్లర్ గమనించి ఆమెపై దాడి చేస్తాడు. ఇంటికి తీసుకెళ్లి ముక్కలు ముక్కలుగా నరికి చంపేస్తాడు. ఈ ఘటనతో బాగా డిస్టర్బ్ అయిన హీరో.. విలన్ ఆచూకీ తెలుసుకుని అతడ్ని పట్టుకుంటాడు. అయితే చంపకుండా చిత్రహింసలు పెట్టి వదిలేస్తాడు. కిల్లర్ కడుపులో జీపీఎస్ ట్రాకర్ అమర్చి.. అతడు ఎక్కడకు వెళ్తే అక్కడికి వెళ్లి నరకం చూపిస్తుంటాడు. తన బాడీలో జీపీఎస్ ఉందని గ్రహించిన కిల్లర్.. దాన్ని తీసివేస్తాడు. ఆ తర్వాత ఏమైంది? కిల్లర్ ఆచూకీని హీరో కనిపెట్టాడా? లేదా? అన్నది కథ.
Telugu.yousay.tv Rating : 3/5
ఏప్రిల్ 27 , 2024
Weekend OTT Suggestions: దసరా వీకెండ్‌ను మరింత వినోదాత్మకంగా మార్చే చిత్రాలు ఇవే!
ప్రస్తుత ఓటీటీ యుగంలో ప్రతీ వారం కొత్త సినిమాలు ప్రేక్షకులను పలకరిస్తున్నాయి. ఈ క్రమంలో ఈ వీకెండ్ కూడా పెద్ద ఎత్తున తెలుగు చిత్రాలు ఓటీటీలోకి రాబోతున్నాయి. కొన్ని ఇప్పటికే స్ట్రీమింగ్‌లోకి వచ్చేశాయి కూడా. ఇంతకీ ఈ వారం ఓటీటీలోకి వచ్చిన చిత్రాలు ఏంటి? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయి? వాటి ప్లాట్స్ ఎలా ఉన్నాయి? ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.
మత్తు వదలరా 2 (Mathu vadalara 2)
బ్లాక్ బస్టర్ కామెడీ మూవీ ‘మత్తు వదలరా 2’ ఈ వీకెండ్ ఓటీటీలోకి వస్తోంది. అక్టోబర్ 11 నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ గానుంది. సెప్టెంబర్ 13న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఇందులో శ్రీసింహా, సత్య ప్రధాన పాత్రలు పోషించారు. ప్లాట్ ఏంటంటే 'డెలీవరీ బాయ్ ఏజెంట్స్ బాబు (శ్రీ సింహా), యేసుబాబు (సత్య) డబ్బులు సరిపోకా స్పెషల్ ఏజెంట్స్‌గా మారతారు. ఓ కేసు విషయంలో చేసిన చిన్న పొరపాటు కారణంగా చిక్కుల్లో పడతారు. ఇంతకీ ఏంటా కేసు? వారు చేసిన పొరపాటు ఏంటి? దాని నుంచి ఎలా బయటపడ్డారు? అండర్ కవర్ ఏజెంట్ నిధి (ఫరియా అబ్దుల్లా) వారికి ఎలా సాయపడింది?' అన్నది స్టోరీ.
గొర్రె పురాణం (Gorre Puranam)
సుహాస్ నటించిన రీసెంట్ చిత్రం ‘గొర్రె పురాణం’ బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించింది. సెప్టెంబర్ 20న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఆకట్టుకుంది. కాగా, ఆక్టోబర్ 10 (గురువారం) నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వచ్చింది. థియేటర్లలో మిస్సయిన వారు ఇప్పుడు ఇంట్లోనే ఈ సినిమాను కుంటుంబంతో కలిసి చూసేయచ్చు. ప్లాట్ ఏంటంటే ‘బిర్యానీ చేసుకుందామని ఒక ముస్లిం వ్యక్తి కొనుగోలు చేసిన గొర్రె తప్పించుకొని గ్రామ దేవత గుడిలో దూరుతుంది. అక్కడ కల్లు తాగి జట్కా ఇవ్వడంతో దాన్ని తామే బలిస్తామని హిందువులు పట్టుబడతారు. ఈ వ్యవహారం రెండు మతాల మధ్య చిచ్చుపెట్టడంతో పోలీసులు గొర్రెను అరెస్టు చేస్తారు. రవి (సుహాస్) ఉన్న సెల్‌లో బంధిస్తారు. ఇంతకీ రవి ఎవరు? అతడు చేసిన హత్యకు గొర్రెకు సంబంధం ఏంటి?’ అన్నది స్టోరీ.
పైలం పిలగా (Pailam Pilaga)
సాయితేజ, పావని కరణం జంటగా నటించిన చిత్రం 'పైలం పిలగా'. సెప్టెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం పర్వాలేదనిపించింది. దసరా కానుకగా ఈ సినిమా అక్టోబర్ 10 నుంచి స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. ఈటీవీ విన్‌లో ఈ సినిమాను వీక్షించవచ్చు. ప్లాట్ ఏంటంటే 'శివ దుబాయ్ వెళ్లి బాగా సెటిల్ కావాలని నిర్ణయించుకుంటాడు. పాస్‌పోర్టు, ఉద్యోగం కోసం అతడికి రూ.2 లక్షలు అవసరం అవుతాయి. దీంతో గుట్టపై ఉన్న స్థలాన్ని అమ్మేందుకు యత్నించగా ఎవరు ముందుకు రారు. కానీ మరుసటి రోజు పోటీపడి మరి కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తారు. పనికిరాని గుట్టను కొనేందుకు వారు ఎందుకు పోటీ పడ్డారు? శివ కోరిక నెరవేరిందా? లేదా?’ అన్నది స్టోరీ.
శబరి (Sabari)
విలక్షణ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన పాన్ ఇండియా సినిమా ‘శబరి’. మహా మూవీస్ పతాకంపై మహేంద్రనాథ్ కూండ్ల నిర్మించారు. ఈ సినిమాతో అనిల్ కాట్జ్ దర్శకుడిగా పరిచయం అయ్యారు. థియేటర్లలో యావరేజ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం వీకెండ్‌లో ఓటీటీలోకి రాబోతోంది. అక్టోబర్ 11 నుంచి సన్‌నెక్ట్స్ ఓటీటీలో ఐదు భాషల్లో విడుదల కాబోతోంది. ప్లాట్ ఏంటంటే 'సంజనా (వరలక్ష్మీ) భర్తను వదిలేసి కూతురితో ముంబయి నుంచి వైజాగ్ వస్తుంది. అక్కడ ఓ కార్పొరేట్ కంపెనీ జుంబా డ్యాన్సర్‌గా చేరుతుంది. అయితే సంజనాను చంపేందుకు సూర్య (మైమ్ గోపి) ప్రయత్నిస్తాడు. ఇంతకీ సూర్య ఎవరు? భర్త అరవింద్‌తో సంజనా ఎందుకు విడిపోయింది? కిడ్నాపైన కూతుర్ని సంజనా ఎలా కాపాడుకుంది?’ అన్నది కథ.
లెవల్ క్రాస్ (Level Cross)
అమలాపాల్ హీరోయిన్‌గా నటించిన మలయాళం మూవీ ‘లెవెల్ క్రాస్’ థియేటర్లలో రిలీజైన రెండు నెలల తర్వాత ఓటీటీలోకి వస్తోంది. సైకలాజికల్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీకి అర్ఫాజ్ అయూబ్ దర్శకత్వం వహించాడు. ఆసిఫ్ అలీ హీరోగా నటించాడు. అక్టోబర్ 11 నుంచి ఆహాలో ఈ చిత్రం ప్రసారం కానుంది. ప్లాట్ ఏంటంటే చైతాలి (అమలాపాల్) ట్రైన్ ప్రమాదంలో గాయపడుతుంది. ఆమెను రైల్వే గేట్‌మెన్ రఘు (ఆసిఫ్ అలీ) కాపాడుతాడు. రఘుని కలిసిన తర్వాత నుంచి చైతాలి జీవితంలో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటాయి. చైతాలి తనకు పెళ్లి అయినట్లుగా ఎందుకు భ్రమపడుతుంది? వారిద్దరికి ఉన్న సంబంధం ఏంటి? అన్నది స్టోరీ.
వెయ్ దరువేయ్ (Vey Dharuvey)
ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ తమ్ముడు సాయిరాం శంకర్ నటించిన రీసెంట్ చిత్రం ‘వెయ్ దరువెయ్’. ఈ యాక్షన్ మూవీ మార్చి 15న థియేటర్లలో రిలీజై ఆకట్టుకోలేకపోయింది. నవీన్ రెడ్డి డైరెక్ట్ వచ్చిన ఈ చిత్రం ఏడు నెలల తర్వాత ఓటీటీలోకి అడుగు పెడుతోంది. అక్టోబర్ 11 నుంచి ఆహాలో ఈ సినిమాను వీక్షించవచ్చు. ప్లాట్ ఏంటంటే ‘శంకర్.. ఫేక్ సర్టిఫికేట్స్‌తో ఉద్యోగం పొందేందుకు ప్రయత్నిస్తుంటాడు. ఇందుకోసం ఫ్లై కన్సల్టెన్సీని సంప్రదిస్తాడు. అందులో పనిచేస్తున్న శ్రుతిని చూసి ఇష్టపడతాడు. అయితే ఈ ఫేక్ సర్టిఫికేట్స్ మాఫియాకు శంకర్‌కు సంబంధం ఏంటి? కేవలం ఉద్యోగం కోసమే హీరో నగరానికి వచ్చాడా? ఏదైనా ప్లాన్ ఉందా?’ అన్నది కథ.
కృష్ణం ప్రణయ సఖీ (Krishnam Pranaya Sakhi)
కృష్ణమ్ ప్రణయ సఖి మూవీలో కన్నడ గోల్డెన్ స్టార్ గణేష్ హీరోగా నటించాడు. ఈ రొమాంటిక్ మూవీకి దండుపాళ్యం ఫేమ్ శ్రీనివాసరాజు దర్శకత్వం వహించాడు. ఇందులో మాళవికానాయర్‌తో పాటు శరణ్య శెట్టి హీరోయిన్లుగా చేశారు. కన్నడలో సూపర్ సక్సెస్ అయిన ఈ చిత్రం అక్టోబర్ 11 నుంచి తెలుగులో స్ట్రీమింగ్ వస్తోంది. అమెజాన్ ప్రైమ్ వేదికగా సినిమాను వీక్షించవచ్చు. ప్లాట్ ఏంటంటే ‘కృష్ణ (గణేష్) ఫ్యామిలీ బిజినెస్ చూసుకుంటూ ఉంటాడు. ఉమ్మడి కుటుంబం కావడంతో ఫ్యామిలీలో అడ్జస్ట్ అయ్యే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఆశపడతాడు. ఈ క్రమంలోనే అనాథ అయిన ప్రణయ అతడికి పరిచయమవుతుంది. తాను కోటీశ్వరుడన్న నిజం దాచి ప్రణయకు కృష్ణ దగ్గరవుతాడు. మరోవైపు కృష్ణను దక్కించుకునేందుకు జాహ్నవి ప్రయత్నిస్తుంటుంది. ఈ ట్రయాంగిల్ లవ్‌స్టోరి చివరికి ఏలాంటి పరిస్థితులకు దారి తీసింది?’ అన్నది స్టోరీ.
ది గోట్ (The Greatest Of All Time)
గతవారం పలు ఆసక్తికర చిత్రాలు ఓటీటీలోకి వచ్చాయి. వాటిని ఇంకా చూడకపోతే ఈ వీకెండ్ ప్లాన్ చేసుకోండి. విజయ్ హీరోగా నటించిన రీసెంట్ చిత్రం ‘ది గోట్’ (The Greatest Of All Time). వెంకట్ ప్రభు దర్శకత్వంలో వచ్చిన ఈ యాక్షన్ మూవీ అక్టోబర్ 3 నుంచి నెట్‌ఫ్లిక్స్ (Netflix) వేదికగా ప్రసారం అవుతోంది. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో సినిమాను వీక్షించవచ్చు. ప్లాట్ ఏంటంటే 'గాంధీ (విజయ్) స్పెషల్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ఆఫీసర్‌గా పనిచేస్తుంటాడు. ఓ మిషన్‌లో భాగంగా విదేశాలకు వెళ్లి కొడుకును పొగొట్టుకుంటాడు. దీంతో భార్య అను (స్నేహా) అతడ్ని దూరం పెడుతుంది. కొన్నేళ్ల తర్వాత మాస్కోకు వెళ్లిన గాంధీకి చనిపోయాడనుకుంటున్న కొడుకు జీవన్ (విజయ్) కనిపిస్తాడు. సంతోషంగా ఇంటికి తీసుకొస్తాడు. అప్పటినుంచి గాంధీకి సంబంధించిన వారు ఒక్కొక్కరుగా చనిపోతుంటారు. ఈ హత్యలకు కారణం ఎవరు? చనిపోయిన జీవన్ ఎలా తిరిగొచ్చాడు?’ అన్నది స్టోరీ.
35 చిన్న కథ కాదు (35 Chinna katha kadu)
ప్రముఖ నటి నివేదా థామస్ ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ చిత్రం ’35 చిన్న కథ కాదు’. ఎమోషనల్ కామెడీ డ్రామాగా రూపొందించిన ఈ చిత్రానికి నందకిషోర్ ఇమాని దర్శకత్వం వహించాడు. ఇందులో ప్రియదర్శి, విశ్వదేవ్ రాచకొండ, గౌతమి కీలకపాత్రలు పోషించారు. సెప్టెంబర్ 6న థియేటర్లలో విడుదలైన మూవీ పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. అక్టోబర్ 2 నుంచి ఆహా వేదికగా స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. ప్లాట్ ఏంటంటే ‘ప్రసాద్ (విశ్వదేవ్), సరస్వతి (నివేదా థామస్) మధ్యతరగతి కుటుంబానికి చెందిన భార్య భర్తలు. పెద్ద కుమారుడు అరుణ్ స్కూల్లో ఆరో తరగతి చదువుతుంటాడు. మ్యాథ్స్‌లో చాలా వీక్. దాంతో లెక్కల మాస్టారు చాణక్య (ప్రియదర్శి) అరుణ్‌కి జీరో అని పేరు పెడతాడు. పరీక్షల్లో ఫెయిల్ కూడా చేస్తాడు. అరుణ్ స్కూల్‌లో ఉండాలంటే లెక్కల్లో కనీసం 35 మార్కులు సాధించాల్సిందేనని షరతు విధిస్తాడు. ఆ పరిస్థితుల్లో అరుణ్ ఏం చేశాడు? అతడికి తల్లి సరస్వతి ఎలా సాయం చేసింది?’ అన్నది స్టోరీ.
భలే ఉన్నాడే (Bhale Unnade)
రాజ్‌తరుణ్ (Raj tarun) కథానాయకుడిగా జె.శివసాయివర్ధన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘భలే ఉన్నాడే’ (Bhale Unnade). మనీషా కంద్కూర్ కథానాయిక. సెప్టెంబరు 13న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు స్ట్రీమింగ్‌కు వచ్చింది. ఈటీవీ విన్‌లో (ETV Win) అక్టోబరు 3వ తేదీ నుంచి ప్రసారం అవుతోంది. ప్లాట్ ఏంటంటే ‘రాధ (రాజ్‌తరుణ్) చాలా సౌమ్యుడు. వైజాగ్‌లో శారీ డ్రాపర్‌గా పనిచేస్తూ తల్లికి హెల్ప్ చేస్తుంటాడు. తన తల్లితో పాటు బ్యాంక్‌లో పనిచేసే మనీషాకు లంచ్ బాక్స్ ద్వారా దగ్గరవుతాడు. ఈ క్రమంలో వారిద్దరు ఒకరినొకరు ఇష్టబడి నిశ్చితార్థం వరకూ వెళ్తారు. అయితే రాధ పెళ్లికి పనికొస్తాడా? లేదా? అన్న సందేహాం కృష్ణకు కలుగుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? రాధకు కృష్ణ పెట్టిన పరీక్ష ఏంటి?’ అన్నది స్టోరీ.
అక్టోబర్ 10 , 2024
క్రైం థ్రిల్లర్ జానర్‌లో తెలుగులో తప్పక చూడాల్సిన సినిమాలు ఇవే!
]గూఢచారి ఉత్కంఠగా సాగే సినిమా ఇది. అడివి శేష్ ఇందులో ‘రా ఏజెంట్’గా నటించాడు. శోభిత ధూళిపాళ్ల హీరోయిన్‌గా చేసింది. శశి కిరణ్ టిక్కా ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.గూఢచారి - Prime VideoDownload Our App
ఫిబ్రవరి 14 , 2023
Jhanvi Kapoor: నా కళ్లు కాదు.. అబ్బాయిలు ఇంకేదో చూస్తారు.. జాన్వీ అఫిషియల్ లీక్!
బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ లేటెస్ట్ గ్లామర్ ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా కాఫీ విత్ కరణ్ షోలో సోదరి ఖుషీతో కలిసి పాల్గొన్న ఆమె రెడ్ డ్రెస్‌లో మెరిసిపోయింది. ఎద అందాలను చూపిస్తూ కుర్రకారుని అలరించింది.
ఈ షోలో జాన్వీ పలు ఆసక్తికర ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఏ హీరో అయినా కొంటెగా మెసేజ్ చేశాడా? అని కరణ్ జోహర్ ప్రశ్నించగా.. నీ బాడీలోని బ్యూటీ స్పాట్స్ చెప్తావా అంటూ ఓ హీరో తనకు టెక్స్ట్ చేసినట్లు జాన్వీ సమాధానం ఇచ్చింది.
మరో ప్రశ్న కింద అబ్బాయిలు నీలో మెుదట చూసేది ఏంటని కరణ్ జోహార్ అడగ్గా.. తన కళ్లు బాగుంటాయని, చాలామంది వాటికి ఆకర్షితులవుతారని జాన్వీ చెప్పింది. అదేంటో వాళ్ల చూపులు మాత్రం కళ్ల మీదకు కాకుండా ఇంకెక్కడికో వెళ్తుంటాయని నవ్వుతూ తెలిపింది.
ఈ ఎపిసోడ్‌లో జాన్వీ తన ప్రియుడు శిఖర్ పహారియా గురించి మాట్లాడారు. శిఖర్‌తో డేటింగ్ నిజమా? అబద్ధమా? అన్న కరణ్ జోహార్ ప్రశ్నకు శిఖర్ తన ఫ్యామిలీలో అందరికీ ఇష్టమని జాన్వీ సమాధానం ఇచ్చింది.
శిఖర్ చాలా నిస్వార్థంగా, గౌరవప్రదంగా ఉండే వ్యక్తి అని.. తనలాంటి వ్యక్తిత్వం ఉన్న మగవారిని తాను ఇప్పటివరకు చూడలేదని జాన్వీ చెప్పారు. తన తండ్రి బోనీ కపూర్, చెల్లెలు (ఖుషి) అందరికీ మంచి స్నేహితుడిలా ఉన్నాడని పేర్కొంది.
ప్రస్తుతం జాన్వీ తెలుగులో 'దేవర' చిత్రంలో నటిస్తోంది. న్యూయర్ సందర్భంగా దేవర పోస్టర్ రిలీజ్ చేసిన చిత్ర యూనిట్.. జనవరి 8న సినిమా గ్లింప్స్ విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది. దీంతో ఫ్యాన్స్ గ్లింప్స్ కోసం తెగ ఎదురు చూస్తున్నారు.
ఈ సినిమాలో జాన్వీ కపూర్ మత్స్యకారుని కూతురిగా కనిపించనున్నట్లు ఆమె పోస్టర్లను బట్టి అర్థమవుతోంది. జాన్వీ లుక్ చాలా వరకూ లంగా ఓణీలో ఉంటుందని టాక్. ఇక తారక్ ఈ మూవీలో ట్రైబల్ లుక్‌లో కనిపించనున్నారని, ఈ సినిమాలో అతడి పాత్ర పేరు తంగం అని తెలుస్తోంది.
ఇక దేవర సినిమాను రెండు పార్ట్‌లుగా ప్రకటించగా తొలి భాగం ఏప్రిల్ 5న విడుదల చేస్తామని మేకర్స్ ఇప్పటికే తెలిపారు. ఇందులో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్, మలయాళం స్టార్ టామ్ చాకోలు విలన్స్‌గా కనపడబోతున్నారు.
ఇక జాన్వీ సినిమాల విషయానికి వస్తే.. దేవరతో పాటు ఆమెకు మరో తెలుగు సినిమాలో అవకాశం వచ్చినట్లు లేటెస్ట్ టాక్. ఏజెంట్ తర్వాత అఖిల్ చేయబోతున్న మూవీలో ఆమెకు అవకాశం ఇవ్వాలని మేకర్స్ భావిస్తున్నారట. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా వచ్చే అవకాశముందని తెలుస్తోంది.
ఈ సినిమాలతో పాటు జాన్వీకి తెలుగులో మరో ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్‌గా జాన్వీ కపూర్‌ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. చాలా పేర్లు పరిశీలించిన టీమ్ చివరకు జాన్వీని ఓకే చేసినట్లు టాక్.
ఇక జాన్వీ రెమ్యూనరేషన్ విషయానికి వస్తే.. ఆమె హిందీలో ఒక్కో సినిమాకు రూ.3.5 కోట్ల వరకూ తీసుకుంటుందట. అయితే తెలుగులో మాత్రం రూ.5 కోట్లు డిమాండ్ చేస్తుందని అంటున్నారు. జాన్వీ ముంబైలోని జుహు ప్రాంతంలో రూ.39 కోట్ల రూపాయలతో ఓ ఖరీదైన ఇంటిని సొంతం చేసుకుందని బాలీవుడ్ వర్గాల్లో టాక్.
జనవరి 04 , 2024
SAKSHI VAIDYA: అఖిల్ రోమాంటిక్ వైల్డ్ బాయ్.. అక్కడ బాగా కోపరేట్ చేశాడు.. ఏజెంట్ హీరోయిన్
టాలీవుడ్‌లోకి మరో ముంబయి భామ అడుగుపెట్టింది. అందం, అభినయంతో పాటు ఓ చిన్న చిరునవ్వుతో కుర్రాళ్లను కట్టిపడేస్తుంది.
ఆమె ఎవరో కాదు.. ఏజెంట్ చిత్రంలో అఖిల్ సరసన నటించిన సాక్షి వైద్య. ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది ఈ అమ్మడు.
తొలి సినిమాతోనే క్రేజ్ సంపాదించుకున్న ఈ హీరోయిన్ గురించి చాలామంది గూగుల్‌లో వెతుకుతున్నారు. మరి ఆమె గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకోండి.
సాక్షి వైద్యకు తొలి చిత్రం ఏజెంట్. చదువు పూర్తికాగానే ఫ్యాషన్ రంగంలో అడుగుపెట్టింది ఈ సుందరి. సినిమా రిలీజ్‌కు ముందే క్రేజ్‌ను సంపాదించింది.
సాక్షి మెుదట టీవీ యాడ్స్‌లో నటించింది. టీవీఎస్ XL 100 యాడ్‌లో తళుక్కున మెరిసింది ముంబయి భామ.
అవకాశాల కోసం ఎన్నో ఆడిషన్స్ ఇచ్చానంటోంది సాక్షి. ఏజెంట్ సినిమాలో హాట్ లుక్‌లో కనిపించబోతుంది.
సినిమా నుంచి విడుదలైన లుక్స్ సహా పాటల్లో గ్లామరస్‌గా కనిపించింది ఈ అమ్మడు. మోడ్రన్ లుక్‌లో దర్శనమిస్తోంది.
ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు 7 లక్షల మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. సాక్షి చేసే రీల్స్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తుంటారు.
View this post on Instagram A post shared by Sakshi (@_vaidyasakshi)
కుటుంబసభ్యులతో కలిసి ఉండే సాక్షికి బాయ్ ఫ్రెండ్ లేడు. కానీ, లవ్ వ్యవహారాల్లో మాత్రం జోక్యం చేసుకుందట ఈ మద్దుగుమ్మ. ఎన్నో జంటలను కలిపినట్లు చెబుతోంది.
View this post on Instagram A post shared by Sakshi (@_vaidyasakshi)
తను ఇంకా ప్రేమలో పడలేదని చెబుతోంది సాక్షి వైద్య. ప్రస్తుతం సినిమాలతో బిజీగా గడపాలని కోరుకుంటున్నట్లు తెలిపింది.
ఏజెంట్ సినిమా మినహా మరే సినిమాను ఆమె ఒప్పుకోలేదు. అఖిల్ చిత్రంపైనే చాలా ఆశలు పెట్టుకుంది.
తెలుగు చిత్రంతో పరిచయం కావటం పట్ల సంతోషం వ్యక్తం చేసింది సాక్షి. అవకాశాలు వరుస కడతాయని భావిస్తోంది.
బాలీవుడ్‌లో ఎక్కువగా ఆడిషన్స్ ఇచ్చినప్పటికీ పెద్దగా ఆఫర్లు రాలేదని చెప్పింది. ఏజెంట్ హిట్ అయితే అక్కడ కూడా ఆఫర్లు రావొచ్చు.
ఇక ఏజెంట్ షూటింగ్ విషయాలను ఓ ఇంటర్వ్యూ సందర్భంగా సాక్షి పంచుకుంది. అఖిల్‌ను రొమాంటిక్ వైల్డ్ బాయ్ అని సెట్స్‌లో తనకు బాగా కోపరేట్ చేశాడని పేర్కొంది.
ఇక సినిమాలో తనది రాయలసీమ అమ్మాయి పాత్ర అని చెప్పుకొచ్చింది. రాయలసీమ స్లాంగ్‌లో డైలాగ్స్ చెప్పేటప్పుడు కాస్త ఇబ్బంది పడినట్లు వివరించింది. అయితే తాను మాత్రం ఆ డైలాగ్స్‌ను హిందీలో చెప్పినట్లు పేర్కొంది. వాటిని తెలుగులో డబ్ చేశారని తెలిపింది.
ఏప్రిల్ 24 , 2023
గత 7 ఏళ్లలో సంక్రాంతి హిట్లుగా నిలిచిన తెలుగు సినిమాలివే..!
]అఖిల్ అక్కినేని ‘ఏజెంట్’ కూడా ఇదే సమయానికి వస్తోంది. తెలుగులోకి డబ్ అవుతున్న విజయ్ ‘వారసుడు’, అజిత్ ‘తునివు’ సినిమాలు ఏ మేరకు ఆకట్టుకుంటాయో వేచి చూడాలి.
ఫిబ్రవరి 14 , 2023
Chaari 111 Review: స్పై ఏజెంట్‌గా మెప్పించిన వెన్నెల కిషోర్.. ‘చారి 111’ ఎలా ఉందంటే?
నటీనటులు: వెన్నెల కిషోర్, సంయుక్త విశ్వనాథన్, మురళీ శర్మ తదితరులు
దర్శకుడు: టీజీ కీర్తి కుమార్
సంగీత దర్శకులు: సైమన్ కె కింగ్
సినిమాటోగ్రాఫర్: రిచర్డ్ కెవిన్ ఎ
ఎడిటింగ్: కాశీష్ గ్రోవర్
నిర్మాత: అదితి సోని
వెన్నెల కిషోర్ (Vennela Kishore) హీరోగా (Chaari 111 Review In Telugu) నటించిన స్పై యాక్షన్ ఫన్ ఎంటర్టైనర్ చిత్రం ‘చారి 111’ (Chaari 111). టీజీ కీర్తి కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో వెన్నెల కిశోర్‌కు జోడీగా సంయుక్త విశ్వనాథన్ నటించింది. మురళీశర్మ ప్రధాన పాత్ర పోషించారు. సైమన్ కె. సింగ్ సంగీతం సమకూర్చారు. ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ప్రేక్షకులను ఈ ఏ మేరకు మెప్పించింది? హీరోగా వెన్నెల కిషోర్ ఆకట్టుకున్నాడా? వంటి విశేషాలను ఈ రివ్యూలో తెలుసుకుందాం.
కథ
చారి (వెన్నెల కిషోర్) (Chaari 111 Review In Telugu) రుద్రనేత్ర అనే గుఢాచార సంస్థలో ఒక ఏజెంట్. డ్యూటీలో ఎప్పడూ సిల్లీ మిస్టేక్స్ చేస్తూ బాస్ రావు (మురళీశర్మ) చేత చివాట్లు తింటుంటాడు. ఈ క్రమంలో నగరంలో ఓ హ్యుమన్ బాంబ్ బ్లాస్ట్ జరుగుతుంది. ఆ క్రైమ్‌ను సాల్వ్ చేయడానికి చారిని ఏజెంట్‌గా నియమిస్తారు. ‘ప్లాన్ బి’గా ఈషా (సంయుక్త విశ్వనాథన్)ను కూడా ఈ మిషన్‌లో భాగం చేస్తారు. అసలు ఈ క్రైమ్ వెనుక ఉన్న వ్యక్తి ఎవరు? ఎందుకు పేలుళ్లకు ప్లాన్ చేశాడు? చారి అతన్ని ఎలా అంతం చేశాడు? చారి, ఈషా లవ్ స్టోరీ ఏంటి? అన్నది కథ.
ఎవరెలా చేశారంటే
వెన్నెల కిషోర్ ఈ సినిమాలో (Chaari 111 Review In Telugu) అద్భుతంగా నటించాడు. ఏజెంట్ చారి పాత్రలో సిల్లీ మిస్టేక్‌లు చేస్తూ తనదైన శైలీలో నవ్వులు పూయించాడు. క్లైమాక్స్‌లో వచ్చే యాక్షన్ సీన్లలోనూ అదరగొట్టాడు. గత చిత్రాలకు భిన్నంగా ఎమోషనల్ సీన్స్‌ను బాగా పండించాడు. ఇక హీరోయిన్‌గా సంయుక్త విశ్వనాథన్ బాగానే చేసింది. మురళి శర్మ, కమెడియన్ సత్యా కూడా తమ నటనతో ఆకట్టుకున్నారు. అలాగే బ్రహ్మాజీతో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు పర్వాలేదనిపించారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
దర్శకుడు టీజీ కీర్తి కుమార్ రాసుకున్న మెయిన్ స్టోరీ పాయింట్.. కొన్ని కామెడీ సన్నివేశాలు బాగున్నాయి. అయితే సింగిల్ లైన్ స్టోరీ కావడం.. కథనం కూడా రొటీన్‌గా ఆసక్తిలేకుండా సాగడం మైనస్ అయ్యింది. ఏజెంట్ చారీ చేత అదే పనిగా సిల్లీ మిస్టేక్‌లు చేయించడం ఓ దశలో ఆడియన్స్ బోర్ కొట్టిస్తుంది. కామెడీ మేకింగ్, ఫన్నీ డైలాగ్స్ ఉన్నప్పటికీ.. సాగదీత సన్నివేశాలు.. లాజిక్‌కు అందని సీన్లు సినిమాకు స్పీడ్ బ్రేకులుగా మారాయి. కీలకమైన ఫ్లాష్ బ్యాక్ సీన్‌ను కూడా డైరెక్టర్ అంత ఎఫెక్టివ్‌గా చూపించలేకపోయారు. క్లైమాక్స్ కూడా అంత సంతృప్తి కరంగా అనిపించదు. విలన్ పాత్ర ముగింపును కొంచెం బాగా చూపించాల్సింది.
టెక్నికల్‌గా
సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే (Chaari 111 Movie Review).. సైమన్ కె. కింగ్ నేపథ్య సంగీతం పర్వాలేదు. సినిమాటోగ్రాఫర్ రిచర్డ్ కెవిన్ పనితనం ఈ సినిమాకి ప్రధాన బలం. ప్రతి ఫ్రేమ్‌ను ఆయన చాలా ఎఫెక్టివ్‌గా తీశారు. ఎడిటింగ్ కూడా బాగుంది. అదితి సోని నిర్మాణ విలువలు బాగున్నాయి. ఖర్చులో రాజీపడినట్లు ఎక్కడా కనిపించలేదు.
ప్లస్ పాయింట్స్
వెన్నెల కిషోర్ నటనకామెడీసినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్స్
స్లో నారేషన్‌రక్తి కట్టించే సీన్లు లేకపోవడం
Telugu.yousay.tv Rating : 2.5/5
మార్చి 01 , 2024
Tollywood Biggest Disasters 2023: ఈ ఏడాది డిజాస్టర్లుగా నిలిచిన స్టార్ హీరోల చిత్రాలు ఇవే!
2023వ సంవత్సం కొందరి హీరోలకు ఊహించని విజయాలను అందిస్తే మరికొందరికి మాత్రం పీడకలను మిగిల్చింది. భారీ అంచనాలతో విడుదలైన కొన్ని చిత్రాలు భాక్సాఫీస్ వద్ద ఘోరంగా దెబ్బతిన్నాయి. ఊహించని పరాజయాన్ని మూటగట్టుకుని ఈ ఏడాదిలోనే అతిపెద్ద డిజాస్టర్లుగా నిలిచాయి. ఇంతకి ఆ చిత్రాలు ఏవి? అందులో నటించిన స్టార్ హీరోలు ఎవరు? ఇతర విశేషాలను ఇప్పుడు చూద్దాం.
శాకుంతలం
గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ఫాంటసీ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘శాకుంతలం’. సమంత లీడ్ రోల్ చేసిన చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద చతికలపడింది. తీవ్ర నష్టాలను చవిచూసింది. సినిమాపై సామ్ పెట్టుకున్న ఆశలను అడియాశలు చేసింది.
ఏజెంట్
యంగ్ హీరో అక్కినేని అఖిల్‌కు ఇండస్ట్రీలో ఇప్పటివరకూ సరైన హిట్ లేదు. దీంతో అతడు ‘ఏజెంట్’ సినిమాపై ఎన్నో అంచనాలు పెట్టుకున్నాడు. సురేందర్ రెడ్డి డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద ఊహించని పరాజయాన్ని మూటగట్టుకుంది. అఖిల్ కెరీర్‌లో మరో ఫ్లాప్‌గా నిలిచింది.
ఆదిపురుష్
ప్రభాస్ రాముడిగా తెరకెక్కిన 'ఆదిపురుష్' చిత్రం ఈ ఏడాదిలోనే అతిపెద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ఓం రౌత్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. విడుదల తర్వాత అనేక విమర్శలను మూటగట్టుకుంది.
కస్టడీ
ఈ ఏడాది అక్కినేని ఫ్యామిలీకి కలిసిరాలేదని చెప్పవచ్చు. ఎందుకంటే నాగ చైతన్య హీరోగా చేసిన ‘కస్టడీ’ చిత్రం కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. తొలిసారి కానిస్టేబుల్ పాత్రలో చేసిన చైతూ.. సినిమాను విజయతీరాలకు చేర్చలేకపోయారు. దీంతో నిర్మాతలు నష్టాలు చవిచూడాల్సి వచ్చింది.
రావాణాసుర
రవితేజ తొలిసారి విలన్ షేడెడ్ పాత్రలో నటించిన చిత్రం 'రావణాసుర'. ఈ సినిమాకు సంబంధించిన ప్రచార చిత్రాలు, పోస్టర్లు సినిమాపై భారీగా అంచనాలను పెంచేశాయి. అయితే థియేటర్లలో ఈ చిత్రం ఊహించని విధంగా ఫ్లాప్ టాక్ సొంతం చేసుకుంది. రవితేజ నటనకు మంచి మార్కులే పడినప్పటికీ బాక్సాఫీస్ వద్ద మాత్రం కాసుల వర్షం కురిపించలేకపోయింది.
గాండీవదారి అర్జున
వరణ్‌తేజ్ హీరోగా తెరకెక్కిన 'గాండీవదారి అర్జున' చిత్రం కూడా ఈ ఏడాది అతిపెద్ద డిజాస్టర్లలో ఒకటిగా నిలిచింది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో సాక్షి వైద్య హీరోయిన్‌గా చేసిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ నష్టాలను చవిచూసింది.
రామబాణం
ఈ మధ్య సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్న స్టార్ హీరో గోపిచంద్.. ఈ ఏడాది ‘రామబాణం’తో ప్రేక్షకులను పలకరించాడు. ఆ చిత్రం గోపిచంద్ ఆశలను అడియాశలు చేసింది. ప్రేక్షకులను మెప్పించలేక చతికిలపడింది. డిజాస్టర్‌గా నిలిచి హీరో గోపిచంద్‌కు అసంతృప్తిని మిగిల్చింది.
భోళాశంకర్
మెగాస్టార్ హీరోగా మేహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘భోళాశంకర్’. భారీ అంచనాలు, ప్రమోషన్స్‌తో ఊదరగొట్టిన ఈ సినిమా ఊహించని విధంగా ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. చిరంజీవి కెరీర్‌లోనే అతిపెద్ద డిజాస్టర్‌గా నిలిచింది. నిర్మాతలకు తీవ్ర నష్టాలను మిగిల్చింది.
ఆదికేశవ
మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్, శ్రీలీల జంటగా చేసిన ‘ఆదికేశవ’ చిత్రం కూడా ఇటీవల విడుదలై ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది.
డిసెంబర్ 20 , 2023
Spy Movie Review: నిఖిల్ ‘స్పై’ మూవీ ఎలా ఉందంటే? ఈసారి ఆ ఫార్మూలా బెడిసికొట్టిందా?
సినిమా- స్పై
తారాగణం: నిఖిల్ సిద్ధార్థ్, ఐశ్వర్య మీనన్, జిషుసేన్ గుప్తా, ఆర్యన్ రాజేష్, అభినవ్ గోమఠం
నిర్మాణ సంస్థ: ఈడీ ఎంటర్‌టైన్‌మెంట్స్
డైరెక్టర్: గ్యారీ బీహెచ్
మ్యూజిక్: విశాల్ చంద్రశేఖర్ & శ్రీచరణ్ పాకాల
సినిమాటోగ్రఫీ: వంశీ పచ్చిపులుసు, మార్క్ డేవిడ్
ఎడిటర్: గ్యారీ బీహెచ్
యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ 'స్పై' ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. కార్తికేయ సిరీస్‌తో పాన్ ఇండియా హీరోగా ఎదిగిన నిఖిల్ భిన్నమైన కథలను ఎంచుకుంటూ హిట్స్ సాధిస్తున్నాడు. దైవ భక్తి నేపథ్యంతో వచ్చిన కార్తికేయ సిరీస్ 1,2 మంచి హిట్ సాధించాయి. ఈసారి దేశ భక్తి కాన్సెప్ట్‌తో వచ్చిన 'స్పై' విడుదలకు ముందే ప్రేక్షకుల మధ్య మంచి బజ్ క్రియేట్ చేసింది. మరి ప్రేక్షకుల అంచనాలను స్పై అందుకుందా? నిఖిల్ ఖాతాలో మరో హిట్ పడిందా? సినిమా ఎలా ఉందో ఓసారి సమీక్షిద్దాం.
కథ:
జై(నిఖిల్) రా ఏజెంట్. విదేశాల్లో సీక్రెట్ ఆపరేషన్స్ నిర్వహిస్తుంటాడు. ఈ క్రమంలో ఓ మిషిన్‌లో పనిచేస్తూ 'రా' ఎజెంట్ అయిన సుభాష్ వర్ధన్( ఆర్యన్ రాజేష్) చనిపోతాడు. అతని చావుకు కారణం తెలుసుకోవాలని 'రా' చీఫ్ శాస్త్రి( మకరంద్ పాండే) ఆ కేసు ఫైల్స్ జైకి అప్పగిస్తారు. ఈ మిషన్‌లో భాగంగా అనుహ్యంగా దేశభక్తుడైన సుభాష్ చంద్రబోస్ డెత్ మిస్టరీ ఫైల్స్ గురించి జైకి తెలుస్తుంది. అసలు ఓ ఉగ్రవాది దగ్గర నేతాజీ ఫైల్స్ ఎందుకున్నాయి? నేతాజీ డెత్ మిస్టరీ చివరకు జై ఛేదించాడా? అన్న అంశాలు తెలియాలంటే సిల్వర్ స్క్రీన్‌పై చూడాల్సిందే.
ఎలా ఉందంటే?
స్పై మూవీ గతంలో తెలుగులో వచ్చిన గూఢచారి సినిమాలనే పోలి ఉంది. ఓ రా చీఫ్.. హీరో అయిన రా ఏజెంట్‌కు సిక్రెట్ మిషిన్ అప్పగిస్తాడు. అతడు చివరికి మిషిన్ పూర్తి చేసి విలన్ చంపే కామన్ పాయింట్‌ను స్పై చిత్రం కూడా ఫాలో అయింది. గతంలో సూపర్ స్టార్ కృష్ణ నటించి గూఢాచారి 116 నుంచి అడవి శేషు నటించిన గూఢచారి వరకు ఇదే ఫార్మూలలో వచ్చి హిట్ సాధించాయి. స్పై మూవీ సైతం ఇదే తరహాలో ఉండటంతో సినిమా చూస్తున్నంతసేపు కొత్తదనం అనిపించదు. ఫస్టాప్‌లో నిఖిల్, హీరోయిన్ వైష్ణవి లవ్ స్టోరీ, జోర్డాన్‌లో ఆయుధాల స్మగ్లింగ్ వంటి సీన్లు ఉంటాయి. నేతాజీ రిలేటెడ్ సీన్స్ బాగున్నాయి. కోర్ పాయింట్స్ ఉన్నా సీన్లకు హైప్ తీసుకురాలేదు. అయితే ఫస్టాఫ్‌లో ఓ మంచి సీన్‌తో ఇంటర్వెల్ బ్యాంగ్ పడుతుంది. సెకండాఫ్ విషయానికొస్తే... ఏజెంట్ జై టీమ్‌కి నేతాజీ సుభాష్ చంద్రబోస్ డెత్ మిస్టరీ ఫైల్స్ గురించి తెలుస్తుంది. దాని ఆధారంగా చేసుకుని సెకండాఫ్ సాగుతుంది. సినిమాలో దేశభక్తి కోటింగ్ తప్ప.. ఆ కోర్ పాయింట్‌కు తగ్గ సీన్లు మాత్రం పడలేదు. రెగ్యులర్ స్పై మూవీలాగే కనిపిస్తుంది. కొన్ని ఓవర్ ఎలివేటెడ్‌గా అనిపిస్తాయి. యాక్షన్ సీన్లు అంతగా పండలేదు.
ఎవరెలా చేశారంటే?
రా ఏజెంట్‌గా నిఖిల్ సిద్ధార్జ్ బాగా సూట్ అయ్యాడు. గతంలో చేసిన క్యారెక్టర్స్ మాదిరి ఉండటంతో చాలా ఈజీగా చేసుకుంటూ వెళ్లిపోయాడు. హీరోయిన్‌గా ఐశ్వర్య మేనన్.. ఏజెంట్ వైష్ణవి పాత్రలో పర్వాలేదనిపించింది. అభినవ్ గోమఠం.. కామెడీని పండించాడు. అతనితో యాక్షన్ సీన్ల కంటే కామెడీ సీన్లే ఎక్కువ ఉంటాయి. రానా దగ్గుపాటి కొద్దిసేపు కనిపించి అలరిస్తాడు. మిగతా క్యారెక్టర్లు పోసాని కృష్ణమురళి, ఆర్యన్ రాజేశ్, సచిన్ ఖేడ్కర్, సురేశ్, ఆర్యన్ రాజేష్ తమ పాత్రల పరిధిమేరకు నటించారు.
టెక్నికల్‌గా..
స్పై సినిమా నిర్మాణ విలువలు బాగున్నాయి. టెక్నికల్ పరంగా చాలా రిచ్‌గా ఉంది. విజువల్స్ మెపిస్తాయి. యాక్షన్ సీన్లు ఇంకొంచెం బాగా తీస్తే బాగుండు అనే ఫీలింగ్ కలుగుతుంది. సినిమాలో బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ బాగున్నప్పటికీ.. సాంగ్స్ మెప్పించవు. విశాల్ చంద్ర శేఖర్ ట్యూన్స్ విషయంలో ఇంకాస్తా శ్రద్ధ తీసుకుంటే బాగుండేది. సినిమాటోగ్రఫీ ఓకే. గ్రాఫిక్స్ సీన్స్ మెప్పించవు. కొన్ని చోట్లు తేలిపోయాయి.యాక్షన్ కొరియోగ్రఫీ బాగుంది కానీ ఇంకా బెటర్ గా చేసి ఉండాల్సింది. స్వతహాగా ఎడిటర్ అయిన డైరెక్టర్ గ్యారీ బీహెచ్ తన కత్తెరకు పనిచెప్పడంలో పనిచెప్పలేకపోయాడు. ఫస్టాఫ్‌లో కొన్ని సీన్లు ల్యాగ్ అనిపిస్తాయి.
చివరగా: ఓవరాల్‌గా గూఢచారి టెంప్లెట్‌లో సినిమా కావాలనుకునే వారికి 'స్పై' వినోదాన్ని అయితే పంచుతుంది.
రేటింగ్: 2.25/5
జూన్ 29 , 2023
AKHIL AGENT REVIEW: ఏజెంట్ సినిమాతో అఖిల్ హిట్ కొట్టాడా? లేదా మరో డిజాస్టర్ అయ్యిందా ?
అఖిల్ అక్కినేని దాదాపు సంవత్సరం తర్వాత ప్రేక్షకులను పలకరించాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో వచ్చాడు. స్పై థ్రిల్లర్‌గా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. చాలాకాలంగా సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్న అఖిల్ ఆశలు నిజమయ్యాయా? చిత్రం ఎలా ఉంది? హీరోయిన్‌గా మారిన సాక్షి వైద్యకు ప్లస్ అయ్యిందా? మమ్ముట్టి రోల్ ఆకట్టుకుంటుందా? అభిమానులను, ప్రేక్షకులను సినిమా మెప్పించిందా అనే అంశాలు రివ్యూలో చూద్దాం.
దర్శకుడు: సురేందర్ రెడ్డి
నటీ నటులు: అఖిల్, సాక్షి వైద్య, మమ్ముట్టి తదితరులు
సంగీతం: హిపాప్ తమిజా
సినిమాటోగ్రఫీ: రసూల్ ఎల్లోర్
కథేంటి?
రిక్కీ ( అఖిల్ ) 'రా' ఏజెంట్ కావాలని చాలా కష్టపడుతుంటాడు. కానీ, అతడు చేసే ప్రయత్నాలన్ని విఫలం అవుతాయి. అతడికి రాలో పనిచేస్తున్న డెవిల్ ( మమ్ముట్టి )తో పరిచయం ఏర్పడుతుంది. భారత్‌లో సిండికేట్ ప్రారంభించిన మాఫియా డాన్ ది గాడ్ (డినో మోరియా )ను అడ్డుతొలగించాలని చూస్తుంటాడు డెవిల్. ఇందుకోసం అఖిల్ ఏం చేశాడు? అనేది కథ.
ఎలా ఉంది?
సినిమాలో ఫస్టాఫ్‌లో కొద్ది సేపు పాత్రల పరిచయం చేశాడు దర్శకుడు. మమ్ముట్టిని రా ఏజెంట్‌గా, సిండికేట్ ఫామ్ చేసిన డినో మోరియా, రాలో పనిచేయాలని కష్టపడుతున్న వ్యక్తిగా అఖిల్ పాత్రల గురించి చకచకా చెప్పేశాడు.
తర్వాత హీరో, హీరోయిన్ల మధ్య లవ్ ట్రాక్‌తో నింపేశాడు. ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోదు. ఇద్దరూ కలుసుకోవటం తర్వాత విడిపోవటం ఇప్పటికే చాలా సినిమాల్లో చూసిన ఫీలింగ్ వస్తుంది. సినిమా సగం పూర్తయిన తర్వాత అసలు కథ ప్రారంభమవుతుంది. ఏజెంట్ వైల్డ్‌గా రాలోకి అఖిల్ ఎంట్రీ ఇవ్వడంతో హైప్ వస్తుంది. భారీ యాక్షన్ సీక్వెన్స్‌తో ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరిపోయింది.
సెకాండాఫ్ మెుత్తం రొటీన్‌గా సాగిపోయింది. సిండికేట్‌ను అడ్డుకునేందుకు హీరో చేసే ప్రయత్నాలు, వాళ్లు అతడిని టార్గెట్ చేయడం వంటి సీన్లు బోర్ కొడతాయి. హైవోల్డేజ్ యాక్షన్ సీన్‌తో సినిమా క్లైమాక్స్ చేరినా ప్రేక్షకులు నిరాశకు గురవుతారు. క్లైమాక్స్ కూడా పెద్దగా ఆకట్టుకోదు. అయితే, యాక్షన్ సీక్వెన్సులు మాత్రం నెక్ట్స్ లెవల్.
ఎవరెలా చేశారు
సినిమాకు పెద్ద అసెట్ అఖిల్ అక్కినేని. తన రోల్ కోసం పూర్తిగా మారిపోయాడు. ఆ క్యారెక్టర్‌లో ఇమిడిపోయేందుకు తనవంతు కృషి చేశాడు ఈ యంగ్ హీరో. వైల్డ్ ఏజెెంట్‌గా అతడి లుక్ సెట్ అయ్యింది. నటనలోనూ కాస్త మెరుగయ్యాడు. దర్శకుడు చెప్పిన విధంగా చేయడంలో సక్సెస్ అయ్యాడు. అయితే, లవర్ బాయ్‌గా చూసిన అఖిల్‌కు యాక్షన్ డ్రామాలు సెట్ కాలేదు.
సీనియర్ నటుడు మమ్ముట్టి ఎప్పటిలాగే ఆకట్టుకున్నారు. తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు. రా ఏజెంట్‌గా పరిధి మేరకు నటించారు. హీరోయిన్ సాక్షి వైద్యకి పెద్దగా అవకాశం లేదు. కానీ, స్క్రీన్‌పై గ్లామరస్‌గా కనిపించింది. పక్కా కమర్షియల్ సినిమాల్లో ఉండే పాత్రనే ఆమెకు దక్కింది. బాలీవుడ్ నటుడు డినో మోరియా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చినా.. గుర్తుండిపోయే క్యారెక్టర్ కాదు. అయినా తన పరిధి మేరకు నటించి మెప్పించాడు.
సాంకేతిక పనితీరు
ధృవ, సైరా చిత్రాలతో మంచి హిట్స్ అందించిన దర్శకుడు సురేందర్ రెడ్డి నుంచి వస్తున్న సినిమా అంటే అంచనాలు ఉంటాయి. అలాంటి చిత్రాన్ని అందించడంలో విఫలమయ్యాడు దర్శకుడు. కానీ, ఇప్పటివరకు తీసిన యాక్షన్ సీక్వెన్సుల్లో సూరికి ఇదే బెస్ట్ సినిమా. అంత రిచ్ లుక్‌లో తెరకెక్కించాడు. కథ, కథనంపై ఫోకస్ పెట్టి ఉంటే మరో లెవల్‌లో ఉండేది. వక్కంతం వంశీ అందించిన కథ పెద్ద మైనస్. పక్కా కమర్షియల్ స్టోరీ ఇది.
ఏజెంట్ చిత్రానికి మరో మెనస్ పాయింట్ ఏదైనా ఉందంటే అది సంగీతం.హిపాప్ తమీజా ఒక్క చాట్ బస్టర్ ఇవ్వలేకపోయాడు. ఏ పాట కూడా ప్రేక్షకులను మెప్పించలేదు. ఇక బ్యాక్‌గ్రౌండ్ స్కోరు ఫర్వాలేదు అంతే. సినిమాటోగ్రఫీ అద్భుతం. దర్శకుడు అనుకున్న ప్రతి పాయింట్‌ను చక్కగా చూపించారు. పోరాట సన్నివేశాలను తెరకెక్కించిన విధానం బాగుంది.
ఎడిటింగ్ పర్వాలేదు. కత్తెరకు మరికొంత పనిచెప్పి ఉంటే ఇంకా బాగుండేది. సినిమాకు అసలైన హైలెట్ నిర్మాణ విలువలు. ప్రతి సన్నివేశం అద్భుతంగా కనిపించిందంటే నిర్మాతనే కారణం. పెట్టిన ప్రతి పైసా స్క్రీన్‌పై కనిపిస్తుంది.
బలాలు
అఖిల్
యాక్షన్ సీన్స్
బలహీనతలు
కథ
కథనం
సంగీతం
రేటింగ్ : 2.5/5
ఏప్రిల్ 28 , 2023