• TFIDB EN
  • అగ్ని పర్వతం
    UATelugu2h 23m
    జమదగ్ని తన తల్లిని విడిచిపెట్టినందుకు అతని తండ్రిని ద్వేషిస్తాడు, అది ఆమె మరణానికి దారితీసింది. అయితే అతని శత్రువులు సమస్య సృష్టించేందుకు జమదగ్ని సవతి సోదరుడిని తెరపైకి తెస్తాడు.
    ఇంగ్లీష్‌లో చదవండి
    రివ్యూస్
    How was the movie?

    తారాగణం
    కృష్ణ
    చంద్రం మరియు జమదగ్ని
    జగ్గయ్య
    జగన్నాధరావు
    రావు గోపాల్ రావు
    పాపి
    డాక్టర్ ప్రభాకర్ రెడ్డిరుద్రయ్య
    సిబ్బంది
    కె. రాఘవేంద్రరావు
    దర్శకుడు
    సి. అశ్వని దత్
    నిర్మాత
    పరుచూరి బ్రదర్స్
    రచయిత
    కె. చక్రవర్తి
    సంగీతకారుడు
    కోటగిరి వెంకటేశ్వరరావు
    ఎడిటర్
    కథనాలు
    Raghavendra Rao: దర్శకేంద్రుడు సినిమాల్లోని టాప్‌-10 రొమాంటిక్‌ పాటలు.. బాబోయ్‌ మరీ ఇంత హాాటా!
    Raghavendra Rao: దర్శకేంద్రుడు సినిమాల్లోని టాప్‌-10 రొమాంటిక్‌ పాటలు.. బాబోయ్‌ మరీ ఇంత హాాటా!
    తెలుగులోని దిగ్గజ దర్శకుల్లో దర్శకేంద్రుడు కే. రాఘవేంద్రరావు ఒకరు. రొమాంటిక్ సాంగ్స్‌ను తెరకెక్కించడంలో ఆయనకు సాటి ఎవరూ లేరు. హీరోయిన్స్ బొడ్డు, నడుముపై పళ్ళు, పూలు విసిరితే ఎంత రొమాంటిక్‌గా ఉంటుందో రాఘవేంద్ర రావు తన పాటల్లో చూపించారు. అలనాటి నటి శ్రీదేవి నుంచి ఇప్పటి శ్రీలీల వరకూ ఎంతో మంది హీరోయిన్లతో ఆయన సూపర్ హిట్‌ రొమాంటిక్ పాటలు తీశారు. ఇవాళ దర్శకేంద్రుడి పుట్టిన రోజు సందర్భంగా ఆయన సినిమాల్లోని టాప్‌-10 రొమాంటిక్ సాంగ్స్‌ మీకోసం.. 1. ఈ గాలిలో రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ‘అగ్ని పర్వతం’ చిత్రం సూపర్‌ స్టార్‌ కృష్ణ కెరీర్‌లోనే ఒక చిరస్మరణీయ విజయంగా మిగిలిపోయింది. ఈ సినిమాలోని ‘ఈ గాలిలో’ పాట అప్పట్లో ఒక ట్రెండ్‌ సెట్టర్‌ అని చెప్పొచ్చు. కృష్ణ ఫొటోలతో ఈ పాట సాగుతుంది. ఓ సీన్‌లో హీరోయిన్‌ విజయశాంతి కృష్ణ ఫొటోపై పడుకొని అతని కోసం కళ్లతో వెతుకుతూ పాడుతుంటుంది. ఆమె తన తలను పైకి ఎత్తి కిందకి చూసే సరికి ఫొటో ప్లేస్‌లో కృష్ణ కనిపిస్తారు. రాఘవేంద్రరావు సృజనాత్మకత ఏ పాటిదో ఈ ఒక్క సీన్‌ తెలియజేస్తుంది.  https://www.youtube.com/watch?v=MceWRlMzHYo 2. అబ్బని తియ్యని దెబ్బ చిరంజీవి - శ్రీదేవి జంటగా చేసిన ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ సినిమా అప్పట్లో బ్లాక్‌బాస్టర్‌గా నిలిచింది. డైరెక్టర్‌ రాఘవేంద్రరావుతో పాటు చిరంజీవికి మంచి పేరు తీసుకొచ్చింది. ఇందులోని ‘అబ్బని తియ్యని దెబ్బ’ పాట ఇప్పటికీ ఎంతో పాపులర్‌. చిరంజీవి, శ్రీదేవి వేసే రొమాంటిక్ స్టెప్పులను చూసి ఈ జనరేషన్‌ వారు కూడా ఎంతగానో ఎంజాయ్‌ చేస్తుంటారు. ఈ పాటలో శ్రీదేవి ఎంతో అందంగా కనిపిస్తుంది.  https://www.youtube.com/watch?v=zloL0fdu5aM 3. మా పెరటి జామ చెట్టు పెళ్లిసందడి సినిమాలోని ‘మా పెరటి జామ చెట్టు’ పాట అప్పట్లో సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ పాటలో హీరోయిన్‌ రవళిని దర్శకేంద్రుడు ఎంతో అందంగా చూపించారు. రవళి బొడ్డుపై జామ పండు పడినప్పుడు ఆమె ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్‌‌కి ఆడియన్స్‌ ఫ్లాట్ కావాల్సిందే.  https://www.youtube.com/watch?v=e92ff-s1yRk 4. రోజ్‌ రోజ్‌ రోజా పువ్వా అల్లరి ప్రియుడు సినిమాలోని ‘రోజ్‌ రోజ్‌ రోజా పువ్వా’ సాంగ్‌ రాఘువేంద్రరావు సినిమాల్లోని టాప్‌-5 సూపర్‌ హిట్ సాంగ్స్‌లో ఒకటిగా కచ్చితంగా ఉంటుంది. ఈ పాటలో రమ్యకృష్ణ అందాన్ని ఎంత పొగిడినా తక్కువే. దర్శకేంద్రుడు ఆమెను పాలరాతి శిల్పంలా చూపించారు. పాట మెుత్తాన్ని పూలతో నింపేశారు.  https://www.youtube.com/watch?v=S1X_-z7JTcE 5. సై సై సయ్యారే ‘ఘరానా బుల్లోడు’ సినిమాలోని ‘సై సై సయ్యారే’ పాటను కూడా రాఘవేంద్రరావు చాలా రొమాంటిక్‌గా తీశారు. కుండలు, గొడుగులను సెట్‌ ప్రొపార్టీలుగా ఉపయోగించుకొని పాటను తెరకెక్కించారు.  ఈ పాటలో నాగార్జున, రమ్యకృష్ణ కెమిస్ట్రీకి మంచి రెస్పాన్స్ వచ్చింది.  https://www.youtube.com/watch?v=lRc1LOiYthY 6.  భీమవరం బుల్లోడా ‘ఘరానా బుల్లోడు’ సినిమాలోని ‘భీమవరం బుల్లోడా’ పాట కూడా చాలా పాపులర్ అయ్యింది. ఈ పాట మెుత్తం స్టీల్‌ బిందెలే కనిపిస్తాయి. నాగార్జున, ఆమని డ్యాన్స్ అలరిస్తుంది.  https://www.youtube.com/watch?v=kQD5NHAxtXk 7. మీనా మీనా ‘సాహసవీరుడు సాగర కన్య’ సినిమాలోని ‘మీనా మీనా’ పాట రాఘవేంద్రరావు సృజనాత్మకతకు అద్దం పడుతుంది. శిల్పా శెట్టి నడుముపై వెంకటేష్‌ ముత్యాలు వేసే సీన్‌ దర్శకేంద్రుడి మార్క్‌ను చూపిస్తుంది.  https://www.youtube.com/watch?v=X-37Hz673RE 8. అస్మదీయ  అన్నమయ్య లాంటి భక్తిరస చిత్రంలోనూ దర్శకేంద్రుడు తన మార్క్‌ను విడిచిపెట్టలేదు. మోహన్‌ బాబు, రోజాల మధ్య వచ్చే ‘అస్మదీయ’ పాటలో మళ్లీ పండ్లకు పని చెప్పారు. ద్రాక్ష పండ్ల నడుమ రోజా నడుమును చూపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.  https://www.youtube.com/watch?v=4YRwSezPqmE 9. చాలు చాలు శ్రీరామదాసు సినిమాలోని ‘చాలు చాలు’ పాట కూడా రాఘవేంద్రరావు రొమాంటిక్ పాటలలో ముందు వరుసలో ఉంటుంది. ఈ పాటలో నాగార్జున, స్నేహా మధ్య కెమెస్ట్రీ అద్భుతంగా పండింది.  https://www.youtube.com/watch?v=xj5yoitVQTQ 10. గందర్వ లోకాల రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన ‘పెళ్లి సందD’ సినిమాలోనూ ఆయన మార్క్‌ కనిపించింది. హీరోయిన్‌ శ్రీలీలను గందర్వ లోకాల పాటలో ఎంతో ‌అద్భుతంగా చూపించారు. పైనుంచి దిగొచ్చిన దేవకన్యలా శ్రీలీల కనిపిస్తుంది.  https://www.youtube.com/watch?v=0d3ktyClW8Q
    మే 23 , 2023
    SSMB 29: మహేష్ బాబు సినిమాతో రాజమౌళి మళ్లీ ఆస్కార్ గెలవనున్నాడా?.. ఫ్యాన్స్‌లో భారీగా హైప్!
    SSMB 29: మహేష్ బాబు సినిమాతో రాజమౌళి మళ్లీ ఆస్కార్ గెలవనున్నాడా?.. ఫ్యాన్స్‌లో భారీగా హైప్!
    RRR చిత్రానికి ఆస్కార్ రావటంతో రాజమౌళి తెరకెక్కించబోయే తదుపరి చిత్రంపై అందరి దృష్టి పడింది. ఇప్పటికే మహేశ్‌ బాబు హీరోగా ప్రాజెక్ట్‌ అనౌన్స్‌ కావటంతో అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. RRRను మించి చిత్రం ఉంటుందని అందరూ భావిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా రాజమౌళికి క్రేజ్ పెరగటంతో ఇప్పుడు పాన్ వరల్డ్‌ను మెప్పించే సినిమాను తీయక తప్పని పరిస్థితి ఏర్పడింది. SSMB29 ట్రెండింగ్ RRR ఆస్కార్ అవార్డు అందుకోవటంతో ఓ వైపు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ అభిమానులు సినిమా గురించి ట్రెండ్ చేస్తుంటే… మహేశ్‌ ఫ్యాన్స్‌ కూడా రెచ్చిపోయారు. #SSMB 29 కూడా ట్రెండ్ చేశారు. రాజమౌళి, మహేశ్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా అంచనాలు ఎలా ఉన్నాయంటూ పోస్టులు పెట్టి హోరెత్తించారు.  https://twitter.com/i/status/1635126271427624961 పూనకాలు లోడింగ్ వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా లాంఛ్‌ కోసం ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. ప్రకటన కాకముందే ఇలా ఉంటే అనౌన్స్‌మెంట్ చేస్తే సగం చచ్చిపోతారేమో అంటూ అభిమానులు కామెంట్‌ చేస్తున్నారు. జక్కన్న, సూపర్‌ స్టార్‌ ఫొటోలను పెట్టి అగ్నిపర్వతం బద్ధలు కాబోతుందనే రేంజ్‌లో హైప్ పెంచుతున్నారు. https://twitter.com/TribhuvanRishi/status/1635290226062147584 హాలీవుడ్ హీరోయిన్‌ మహేశ్ సరసన హీరోయిన్ గురించి చర్చ మెుదలయ్యింది. ఆస్కార్ వేడుకలో దీపికా పదుకొణె రాజమౌళిని కలిసిందని.. మహేశ్‌తో నటించేందుకు ఆసక్తిగా ఉన్నట్లు చెప్పిందని టాక్. ఇక ఈ విషయంలో మరో అడుగు ముందుకేశారు. “ జక్కన్న హాలీవుడ్ హీరోయిన్లను చూశావు కదా.. అందులో ఎవర్నైనా టాలీవుడ్‌లోకి దింపేయ్” అంటూ కామెంట్లు పెడుతున్నారు.  https://twitter.com/UrsPrakash_07/status/1635172159688671233 మనదే ఆస్కార్ మహేశ్‌తో పాన్ వరల్డ్ చిత్రం తీయబోతున్న జక్కన్న బాక్సాఫీస్ షేక్ చేయనున్నాడు. ఈ సినిమా కూడా ఆస్కార్ బరిలో నిలిచేలా చేస్తాడంటూ అభిమానులు ట్విటర్‌లో సందడి చేస్తున్నారు. ఉత్తమ నటుడు, చిత్రం అవార్డులు మళ్లీ మనదే అనే కామెంట్లు చేస్తున్నారు. https://twitter.com/sri_cultdhfm/status/1635131220832165888 శరవేగంగా పనులు రాజమౌళి-మహేశ్‌ బాబు సినిమాకు సంబంధించి ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభమయ్యాయి. కథను సిద్ధం చేస్తున్నట్లు విజయేంద్ర ప్రసాద్ ఇప్పటికే చెప్పారు. జేమ్స్‌ బాండ్ తరహాలో స్టోరీ ఉంటుందని హింట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. మిగతా పనులు కూడా చకచకా జరుగుతున్నాయి. అన్ని సవ్యంగా కుదిరితే ఈ ఏడాది చివర లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో సినిమా సెట్స్‌పైకి వెళ్తుంది. ప్రస్తుతం బిజీ రాజమౌళి సినిమా ప్రారంభం కావటానికి దాదాపు సంవత్సరం సమయం ఉంది.  ఇలాంటి సమయంలో ఫ్యాన్స్‌ను నిరాశ పరచకూడదని భావించిన సూపర్ స్టార్ మహేష్… త్రివిక్రమ్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే వరుస షెడ్యూల్స్ జరుగుతున్నాయి. త్వరలోనే పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు మహేశ్. ఆ తర్వాత దర్శక ధీరుడితో సినిమా పట్టాలెక్కనుంది.
    మార్చి 14 , 2023
    Vyjayanthi Movies Hits : ‘కల్కి 2898 ఏడీ’ నిర్మాణ సంస్థ  వైజయంతీ బ్యానర్‌లో ఇన్ని హిట్ సినిమాలు ఉన్నాయా?
    Vyjayanthi Movies Hits : ‘కల్కి 2898 ఏడీ’ నిర్మాణ సంస్థ  వైజయంతీ బ్యానర్‌లో ఇన్ని హిట్ సినిమాలు ఉన్నాయా?
    ప్రభాస్‌ (Prabhas) హీరోగా నటించిన ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) చిత్రం.. థియేటర్లలో ప్రభంజనం సృష్టిస్తోంది. బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. కల్కి ఈ స్థాయి సక్సెస్‌ సాధించడం వెనక దర్శకుడు నాగ్‌ అశ్విన్‌తో పాటు నిర్మాణ సంస్థ ‘వైజయంతీ మూవీస్‌’ (Vyjayanthi Movies) బ్యానర్‌ పాత్ర కూడా ఎంతో ఉంది. నిర్మాత అశ్వనీ దత్‌ (Aswani Dutt) ఎంతో సాహాసోపేతంగా కల్కి చిత్రాన్ని నిర్మించారు. బడ్జెట్‌ అంతకంతకూ పెరుగుతున్నప్పటికీ ఆయన వెనక్కి తగ్గలేదు. క్వాలిటీ ఔట్‌పుట్‌ ఇవ్వాలన్న లక్ష్యంతో దర్శకుడు నాగ్‌ అశ్విన్‌కు బడ్జెట్‌ పరంగా పూర్తి స్వేచ్ఛను కల్పించారు. రూ.600 కోట్లకు పైగా వ్యయంతో ఇండియాలోనే అతి భారీ బడ్జెట్‌ ఫిల్మ్‌గా కల్కిని తీర్చిదిద్దారు. కల్కి లాంటి విజువల్‌ వండర్‌ను అందించిన నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్‌ పేరు.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మారుమోగుతోంది.  వైజయంతీ మూవీస్‌ ప్రస్థానం అశ్వనీ దత్‌.. నిర్మాతగా తన ప్రస్థానాన్ని అభిమాన హీరో నందమూరి తారక రామారావు ఫిల్మ్‌తోనే ప్రారంభించారు. వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌ను నిర్మించి దాని లోగోగా కృష్ణుడి అవతారంలో ఉన్న ఎన్టీఆర్‌ను పెట్టారు. 1975లో వచ్చిన 'ఎదురులేని మనిషి' చిత్రంతో వైజయంతీ మూవీస్‌ సంస్థ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. తొలినాళ్లలో కొన్ని ఒడిదొడుకులు ఎదుర్కొన్నప్పటికీ.. బ్లాక్‌బాస్టర్‌ చిత్రాలను అందించడంలో మాత్రం వెనకడుగు వేయలేదు. ఈ బ్యానర్‌లో వచ్చిన పలు చిత్రాలు టాలీవుడ్‌లో ఎంతో ఇంపాక్ట్‌ క్రియేట్‌ చేశాయి. ఇంతకీ ఆ బ్లాక్‌బాస్టర్‌ చిత్రాలు ఏంటి? తెలుగు చిత్ర పరిశ్రమలో అవి ఎలాంటి మార్క్‌ను క్రియేట్‌ చేశాయి? ఇప్పుడు చూద్దాం.  అగ్నిపర్వతం వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌పై వచ్చిన సూపర్‌ హిట్‌ చిత్రాల్లో ‘అగ్నిపర్వతం’ (Agni Parvatam) ఒకటి. ఇందులో సూపర్‌ స్టార్‌ కృష్ణ డబుల్‌ రోల్స్‌ చేయగా.. రాధ, విజయశాంతి హీరోయిన్లుగా కనిపించారు. కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన ఈ ఫిల్మ్‌ అప్పట్లో ఘన విజయం సాధించింది. ఇందులో సూపర్‌ స్టార్‌ కృష్ణ నట విశ్వరూపం చూపించారు. ఈ చిత్రం కృష్ణ కెరీర్‌లో మైలురాయిగా నిలిచింది. ఈ సినిమాలో కృష్ణ దూకుడుగా చెప్పిన ‘అగ్గి పెట్టుందా?’ డైలాగ్‌ అప్పట్లో మారుమోగింది. అలాగే ‘కదులుతున్న అగ్నిపర్వతం’ సాంగ్‌ కూడా సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. నటుడిగా సరికొత్త కృష్ణను పరిచయం చేసింది. మూవీ కథ ఏంటంటే.. ‘జమదగ్ని తన తల్లిని విడిచిపెట్టినందుకు అతని తండ్రిని ద్వేషిస్తాడు. అయితే అతని శత్రువులు సమస్య సృష్టించేందుకు జమదగ్ని సవతి సోదరుడిని తెరపైకి తెస్తారు. ఆ తర్వాత ఏమైంది? అన్నది కథ.  https://www.youtube.com/watch?v=FaJqLrjanQM జగదేక వీరుడు అతిలోక సుందరి వైజయంతీ మూవీస్‌ రొటిన్‌ చిత్రాలనే కాకుండా ప్రయోగాత్మక ఫిల్మ్స్‌ కూడా తీయగలదని ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ చిత్రం నిరూపించింది. మెగాస్టార్ కెరీర్‌లో మరుపురాని చిత్రంగా నిలిచిపోయింది. సోషియో ఫాంటసీ జానర్‌లో రూపొందిన ఈ చిత్రం.. అప్పట్లో కలెక్షన్ల మోత మోగించింది. ఈ చిత్రం విడుదలకు ముందు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను వరదలు అతలాకుతలం చేశాయి. అయినా ఈ చిత్రం అఖండ విజయాన్ని నమోదు చేసుకోవడం విశేషం.  రూ. 2 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ ఫిల్మ్‌.. ఆ రోజుల్లో రూ.15 కోట్లు కొల్లగొట్టింది. ఈ సినిమాకు ఇళయరాజా అందించిన మధురమైన పాటలు ఇప్పటికీ ఎక్కడోచోట మారుమోగుతూనే ఉన్నాయి. కథ ఏంటంటే ‘నలుగురు అనాథలకు ఆశ్రయిమిచ్చిన రాజు.. గైడ్‌గా పనిచేస్తుంటాడు. రాజుకు అనుకోకుండా ఓ రోజు ఇంద్రుడి కుమార్తె ఇంద్రజకు చెందిన ఉంగరం దొరుకుతుంది. ఆ ఉంగరం కోసం ఇంద్రజ తిరిగి భూమి మీదకు వస్తుంది. ఆ తర్వాత ఏమైంది? అన్నది కథ.  శుభలగ్నం జగపతిబాబు హీరోగా, ఆమని, రోజా హీరోయిన్లుగా వచ్చిన ఈ చిత్రం యూనిక్‌ కాన్సెప్ట్‌తో తెరకెక్కింది. భార్య భర్తలు సంతోషంగా జీవించడానికి డబ్బుతో సంబంధం లేదని నిరూపించింది. డబ్బు కోసం భర్తనే అమ్మేసిన భార్య.. చివరికి మారి భర్తను ఎలా దక్కించుకుంది? అన్న కాన్సెప్ట్‌తో ఈ సినిమా రూపొందింది. అప్పట్లో ఫ్యామిలీ ఆడియన్స్‌ ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు. ఈ మూవీలోని ‘చిలకా ఏ తోడు లేక’ అనే పాటకు ఉత్తమ గీత రచయితగా సిరివెన్నెలకు నంది పురస్కారం రావడం విశేషం. కథ ఏంటంటే.. ‘డబ్బుపై ఆశతో రాధ తన భర్తను ధనవంతురాలైన లతకు ఇచ్చి పెళ్లి చేస్తుంది. ఫలితంగా ఆమెకు కోటి రూపాయలు లభిస్తాయి. అయితే కాలక్రమంలో భర్త తోడు లేని జీవితం వృథా అని భావిస్తుంది’. గోవిందా గోవిందా నాగార్జున - రామ్‌ గోపాల్‌ వర్మ కాంబినేషన్‌లో వచ్చిన 'గోవిందా గోవిందా'.. అప్పట్లో బ్లాక్‌ బాస్టర్ సక్సెస్‌ అందుకుంది. వెంకటేశ్వర స్వామి కిరీటం చుట్టూ తిరిగే ఈ సినిమా కథ తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచింది. ఇందులో శ్రీదేవి తెలుగు ఆడియన్స్‌ ఎంతగానో మిస్మరైజ్‌ చేశారు. కథ ఏంటంటే.. ‘భగవంతుడైన వేంకటేశ్వరుడు.. దైవిక ఆయుధాన్ని ఉపయోగించి భూమిపై గందరగోళ పరిస్థితిని పరిష్కరించాలని నిర్ణయించుకుంటాడు. అయితే ఈ ఆయుధంపై ఉన్న ఆభరణాలను కొంతమంది దుండగులు దొంగిలించినప్పుడు పరిస్థితి దిగజారుతుంది’. ఓటీటీ వేదిక : సన్‌ నెక్స్ట్‌ రాజకుమారుడు వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌ ద్వారానే సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు హీరోగా పరిచయం చేశారు. కథానాయకుడిగా అతడి ఫస్ట్‌ ఫిల్మ్‌ 'రాజకుమారుడు'ను కల్కి నిర్మాత అశ్వనీదత్‌ నిర్మించారు. ఈ సినిమాకు ఉత్తమ కుటుంబ కథా చిత్రంగా నంది అవార్డు సైతం వచ్చింది. చాలా సెంటర్లలో ఈ సినిమా 100 రోజులకు పైగా ఆడింది. ప్లాట్ ఏంటంటే.. 'సెలవులను ఎంజాయ్‌ చేయడానికి వచ్చిన రాజ్‌.. రాణిని చూసి ప్రేమలో పడతాడు. అయితే కుటుంబం ఒత్తిడితో ఆమె ప్రేమను వదులుకుంటాడు. ఇంతకి రాణి ఎవరు? ఆమె ఫ్యామిలీతో రాజ్‌ కుటుంబానికి ఉన్న వైరం ఏంటి? చివరికి వారు ఎలా ఒక్కటయ్యారు?' అన్నది కథ.  ఇంద్ర మెగాస్టార్‌ చిరంజీవి క్రేజ్‌ను మరోస్థాయికి తీసుకెళ్లిన చిత్రంగా 'ఇంద్ర'కు పేరుంది. ఈ సినిమాలో చిరు.. తొలిసారి ఫ్యాక్షనిస్టు పాత్ర పోషించారు. నిర్మాత అశ్వనీదత్‌కు ఈ సినిమా కాసుల వర్షం కురిపించింది. 2002లో ఉత్తమ నటుడిగా చిరంజీవికి నంది పురస్కారం వచ్చేలా చేసింది. 'రాయలసీమలో రెండు కుటుంబాల మధ్య ఆదిపత్య పోరు కొనసాగుతుంటుంది. ప్రజల నీటి సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యర్థుల చెల్లెలితో ఇంద్ర పెళ్లికి అంగీకరిస్తాడు. కట్‌ చేస్తే సాధారణ జీవితం కోసం ఇంద్ర మారుపేరుతో కాశీకి వెళ్లిపోతాడు. ఇంద్ర కాశీకి ఎందుకు వెళ్లాడు? తిరిగి ప్రత్యర్థులపై ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు?' అన్నది కథ. స్టూడెంట్‌ నెంబర్‌ 1 దర్శకధీరుడు రాజమౌళిని నిర్మాత అశ్వని దత్‌ ఇండస్ట్రీకి పరిచయం చేశారు. తారక్‌ హీరోగా రాజమౌళి తెరకెక్కించిన మెుట్ట మెుదటి చిత్రం 'స్టూడెంట్‌ నెం.1' అశ్వనీదత్‌ నిర్మాత. వైజయంతీ మూవీస్‌ సబ్‌ బ్యానర్‌ అయి స్వప్న సినిమాస్‌ ఈ మూవీని తెరకెక్కించింది. ఈ సినిమా 73 కేంద్రాల్లో 50 రోజులు, 42 కేంద్రాల్లో 100 రోజులకు పైగా ప్రదర్శించబడింది. ఈ సినిమాని రూ.1.85 కోట్లతో నిర్మించగా రూ.12 కోట్లు వసూలు చేసింది. కథ ఏంటంటే.. ‘ఆదిత్యకు ఇంజినీర్ కావాలని కోరిక. కానీ అతని తండ్రి లాయర్ కావాలని ఆదేశిస్తాడు. అయితే లా చదవడం ఇష్టం లేని ఆదిత్య పరీక్ష రాసేందుకు వెళ్లే క్రమంలో ఓ అమ్మాయిని రక్షించబోయి సమస్యల్లో పడతాడు. ఆదిత్య తండ్రి అతన్ని ఇంటి నుంచి గెంటేస్తాడు. ఆ తర్వాత ఏమైంది? అన్నది కథ.  మహర్షి మహేష్‌ బాబు హీరోగా పూజా హెగ్డే, అల్లరి నరేష్‌ ప్రధాన పాత్రల్లో చేసిన మహార్షి చిత్రానికి.. అశ్వనీ దత్‌ సహా నిర్మాతగా వ్యవహరించారు. 2019 సంవత్సరానికి గాను 10 విభాగాల్లో విభాగాల్లో సైమా అవార్డ్స్‌ నామినేట్‌ కాగా.. అందులో 5 పురస్కారాలను మహర్షి కైవసం చేసుకోవడం విశేషం. ‘రిషి (మహేష్‌) ఓ మల్టీ నేషనల్‌ కంపెనీకి సీఈవోగా ఉంటాడు. కాలేజీ రోజుల్లో తన కోసం ఫ్రెండ్‌ రవి  చేసిన త్యాగం గురించి తెలుసుకుంటాడు. అతడ్ని వెతుక్కుంటూ ఊరికి వెళ్లిన రిషికి అతడు సమస్యల్లో ఉన్నట్లు తెలుస్తుంది. అప్పుడు రిషి తన ఫ్రెండ్‌ కోసం ఏం చేశాడు? ఎలా అండగా నిలబడ్డాడు?’ అన్నది కథ. ఓటీటీ వేదిక : అమెజాన్‌ ప్రైమ్‌ సీతారామం 2022లో తెరకెక్కిన సీతారామం చిత్రం.. ఎంత పెద్ద ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి నిర్మాతగా అశ్వని దత్‌ వ్యవహరించారు. ఈ సినిమాతో మృణాల్‌ ఠాకూర్‌ రాత్రికి రాత్రి స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. రూ.30 కోట్లతో తెరకెక్కిన సీతారామం చిత్రం.. బాక్సాఫీస్‌ వద్ద రూ.91-98 కోట్లు కొల్లగొట్టింది. ప్లాట్‌ ఏంటంటే.. ‘ఆర్మీ అధికారి రామ్ (దుల్కర్‌ స‌ల్మాన్‌) ఓ అనాథ. ఆ విషయాన్ని రేడియోలో చెప్పినప్పటి నుంచి అతడికి ఉత్తరాలు వెల్లువెత్తుతాయి. పెద్ద కుటుంబం ఏర్పడుతుంది. ఓ అమ్మాయి మాత్రం నీ భార్య సీతామ‌హాల‌క్ష్మి (మృణాల్ ఠాకూర్‌) అని సంబోధిస్తూ ఉత్తరాలు రాస్తుంటుంది. ఇంత‌కీ ఈ ఆమె ఎవ‌రు? అనాథ అయిన రామ్‌కు భార్య ఎక్కడి నుంచి వ‌చ్చింది? ఆమెని క‌లుసుకునేందుక‌ని వ‌చ్చిన రామ్‌కు ఎలాంటి అనుభ‌వాలు ఎదుర‌య్యాయి?’ అనేది కథ. ఓటీటీ వేదిక : అమెజాన్‌ ప్రైమ్‌ & హాట్‌స్టార్‌ కల్కి 2898 ఏడీ నిర్మాత అశ్వని దత్‌.. ఎంతో ప్రతిష్టాత్మకంగా ‘కల్కి 2898 ఏడీ’ చిత్రాన్ని నిర్మించారు. వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌పై వచ్చిన అతి భారీ బడ్జెట్‌ చిత్రం ‘కల్కి’ కావడం విశేషం. ఈ సినిమాను మైథాలిజీ & ఫ్యూచరిక్‌ జానర్లలో నిర్మించారు. ఇందులో బాలీవుడ్ దిగ్గజం అమితాబ్‌ బచ్చన్‌ అశ్వత్థామ పాత్ర పోషించిగా.. విలన్‌గా కమల్‌ హాసన్‌ చేశారు. దిశాపటానీ, దీపిక పదుకొణె ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.  వైజయంతీ మూవీస్‌ సబ్‌ బ్యానర్స్‌లో వచ్చిన హిట్‌ చిత్రాలు బాణం అశ్వని దత్‌ కుమార్తె ప్రియాంక దత్‌.. త్రీ ఎంజెల్స్ బ్యానర్‌పై తొలిసారి బాణం చిత్రాన్ని నిర్మించింది. ఈ మూవీ ద్వారా నారా రోహిత్‌ హీరోగా పరిచయం అయ్యారు. ప్లాట్‌ ఏంటంటే.. ‘మాజీ నక్సలైట్ కొడుకు అయిన భగత్ ఒక చిన్న పట్టణంలో నివసిస్తుంటాడు. స్థానిక గ్యాంగ్‌స్టర్ దౌర్జన్యాల నుంచి ప్రజలను కాపాడేందకు IPS అధికారి కావాలని నిర్ణయించుకుంటాడు. ఆ తర్వాత ఏమైంది? అనుకున్న లక్ష్యాన్ని సాధించాడా? లేదా?’ అన్నది కథ. సారొచ్చారు ప్రియాంక దత్‌ నిర్మించిన ఈ సినిమా.. ఫీల్‌ గుడ్‌ ఎంటర్‌టైనర్‌గా ఆకట్టుకుంది. ఇందులో రవితేజ, కాజల్‌  రిచా గంగోపాథ్యాయ ప్రధాన పాత్రలు పోషించారు. ప్లాట్‌ ఏంటంటే.. 'సంధ్య కార్తిక్‌ను ప్రేమిస్తుంది. అయితే అతడికి ఇదివరకే పెళ్లైన విషయాన్ని తెలుసుకుంటుంది. ఇంతకీ కార్తిక్‌ గతం ఏంటి? కార్తిక్, సంధ్య కలిశారా? లేదా?’ అన్నది స్టోరీ. ఓటీటీ వేదిక : హాట్‌స్టార్‌ & ఆహా Sir Ocharu Movie Posters TollywoodAndhra.in ఎవడే సుబ్రహ్మణ్యం కల్కి డైరెక్టర్ నాగ్ అశ్విన్‌ తెరకెక్కించిన మెుట్టమెుదటి ఫిల్మ్‌ 'ఎవడే సుబ్రహ్మణ్యం'. ఇందులో నాని, విజయ్‌ దేవరకొండ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవీ టాలెంటెడ్‌ డైరెక్టర్‌గా నాగ్ అశ్విన్‌కు గుర్తింపు తీసుకొచ్చింది. ప్లాట్ ఏంటంటే.. ‘మెటీరియలిస్టిక్ స్వభావం కలిగిన సుబ్రమణ్యం జీవితాన్ని పూర్తిగా అర్థం చేసుకునేందుకు హిమాలయాలకు వెళ్తాడు. ఈ క్రమంలో అనుబంధాల పట్ల తన వైఖరిని మార్చుకుంటాడు’. ఓటీటీ వేదిక : సన్‌ నెక్స్ట్‌ మహానటి అశ్వని దత్‌ రెండో కుమార్తె స్వప్న దత్ ఈ సినిమాను నిర్మించారు. ఈ మూవీకి కూడా కల్కి ఫేమ్‌ నాగ అశ్విన్‌ దర్శకత్వం వహించారు. స్వప్న సినిమా బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రం.. మహానటి సావిత్రి జీవత కథ ఆధారంగా తెరకెక్కింది. ‘సావిత్రి ఇండస్ట్రీలోకి ఎలా అడుగుపెట్టారు? నటుడు జెమినీ గణేషన్‌ ఆమె జీవితంపై ఎలాంటి ప్రభావాన్ని చూపించారు? జీవత చరమాంకంలో ఆమె ఎలాంటి కష్టాలు అనుభవించారు?’ అన్నది స్టోరీ.  ఓటీటీ వేదిక :  అమెజాన్‌ ప్రైమ్‌ జాతి రత్నాలు వైజయంతి మూవీస్‌ సబ్‌ బ్యానర్‌ అయిన 'స్వప్న సినిమా'.. జాతిరత్నాలు మూవీని నిర్మించింది. ప్లాట్‌ ఏంటంటే.. ‘మంచి ఉద్యోగాల కోసం తమ ఊరి నుంచి హైదరాబాద్ వచ్చిన ముగ్గురు యువకులు ఓ అపార్ట్‌మెంటులో దిగుతారు. అక్కడ పిలువని పార్టీకి వెళ్లి మర్డర్ అటెంప్ట్ కేసులో ఇరుక్కుంటారు. ఆ తర్వాత కేసు నుంచి ఎలా బయటపడ్డారు’ అనేది కథ. ఓటీటీ వేదిక :  అమెజాన్‌ ప్రైమ్‌
    జూన్ 29 , 2024
    Upcoming Telugu Sequels: టాలీవుడ్‌లో నయా ట్రెండ్‌.. సెట్స్‌పై సీక్వెల్‌ సినిమాలు.. లిస్ట్‌ చాలా పెద్దదే!
    Upcoming Telugu Sequels: టాలీవుడ్‌లో నయా ట్రెండ్‌.. సెట్స్‌పై సీక్వెల్‌ సినిమాలు.. లిస్ట్‌ చాలా పెద్దదే!
    ఓ సినిమా హిట్‌ అయితే దానికి సీక్వెల్‌ తెరకెక్కించడం ఇటీవల అన్ని ఇండస్ట్రీలలో కామన్‌ అయిపోయింది. ఈ ట్రెండ్‌ని టాలీవుడ్‌ కూడా బాగా అలవరుచుకుంది. గతంలో అరకొరగా సీక్వెల్స్‌ వచ్చే టాలీవుడ్‌లో ఇప్పుడు అదే ఓ సిద్ధాంతంగా మారింది. హీరోలు సైతం తమ సూపర్‌ హిట్‌ సినిమాలను రెండో పార్ట్‌గా మలిచేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో డైరెక్టర్లు చకా చకా కథను సిద్దం చేసి సీక్వెల్స్‌ను సెట్స్‌పైకి తీసుకెళ్తున్నారు. ప్రస్తుతం తెలుగులో పలు సీక్వెల్స్‌ అంకుర దశలో ఉండగా, మరికొన్ని శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్నాయి. ఇంకొన్ని త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లేందుకు సిద్దమవుతున్నాయి. ఆ చిత్రాలు ఏవో ఇప్పుడు చూద్దాం.  పుష్ప 2 అల్లుఅర్జున్‌ సుకుమార్‌ కాంబోలో వచ్చిన ‘పుష్ప’ (Pushpa) చిత్రం ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమా బన్నీని పాన్‌ ఇండియా స్టార్‌గా నిలబెట్టింది. ప్రస్తుతం ఈ సినిమా సెకండ్‌ పార్ట్‌ ‘పుష్ప 2’ (Pushpa 2) కూడా వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ ఏడాది డిసెంబర్‌లో పుష్ప2ను రిలీజ్‌ చేయాలని మేకర్స్‌ భావిస్తున్నారు. అందుకు అనుగుణంగానే వేగంగా షూటింగ్ జరుపుతున్నారు.  ఆర్‌ఆర్‌ఆర్‌ - 2  దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన ‘RRR’ చిత్రం పాన్‌ ఇండియా స్థాయిలో సూపర్‌ హిట్ అయింది. ఇందులో రామ్‌చరణ్, తారక్‌ నటనకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సీక్వెల్‌ కూడా రానుందని రాజమౌళి తండ్రి, రచయిత విజయేంద్రవర్మ ఇటీవల ప్రకటించారు. అయితే ఈ చిత్రాన్ని రాజమౌళి కాకుండా వినూత్న దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి తెరకెక్కిస్తారని ప్రచారం జరిగింది. కానీ అందులో వాస్తవం లేదని సినీ వర్గాలు స్ఫష్టం చేశాయి. మరి, ఈ భారీ ప్రాజెక్టుని ఎవరికి అప్పగిస్తారో చూడాలి. డబల్‌ ఇస్మార్ట్‌ రామ్‌పోతినేని హీరోగా పూరి జగన్నాద్‌ డైరెక్షన్‌‌లో వచ్చిన ఇస్మార్ట్‌ శంకర్‌ (Ismart Shankar) సినిమా సూపర్‌ హిట్‌ అయింది. ఇందులో రామ్.. ఊరమాస్‌ క్యారెక్టర్‌లో కనిపించి మెప్పించాడు. తాజాగా ఈ సినిమా సీక్వెల్‌ పనులు కూడా ప్రారంభమయ్యాయి. ‘డబల్‌ ఇస్మార్ట్‌’ (Double Ismart) అనే టైటిల్‌ను కూడా ఖరారు చేశారు. 2024 మార్చి 8న మూవీ రిలీజ్‌ చేయాలని మేకర్స్ లక్ష్యంగా పెట్టుకున్నారు.  గూఢచారి 2 యంగ్‌ హీరో అడివి శేష్ కెరీర్‌లో ‘గూఢచారి’ (Goodachari) చిత్రం బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచింది. తాజాగా ఆ సినిమాకు సీక్వెల్‌ రూపొందుతోంది. ఈ షూటింగ్‌ను ‘G2’ పేరుతో నిర్వహిస్తున్నారు. ఇటీవల విడుదలైన ‘G2’ మూవీ పోస్టర్‌, ప్రీ లుక్‌ టీజర్‌ సినిమాపై ఇప్పటినుంచే అంచనాలు పెంచేశాయి. ఆల్ఫ్‌ పర్వతాల చుట్టూ ఈ సీక్వెల్‌ పార్ట్‌ తిరగనుందని సమాచారం.  హిట్‌ 3 తెలుగులో వచ్చిన మిస్టరీ థ్రిల్లర్‌ ఫ్రాంచైజీ చిత్రం హిట్‌ (HIT). తొలి భాగమైన ‘ది ఫస్ట్‌ కేస్‌’లో విశ్వక్‌ సేన్‌ హీరోగా నటించగా.. హిట్‌-2 (HIT 2)లో అడవిశేష్‌ కథానాయకుడిగా చేశాడు. ఇక హిట్‌-3 (HIT 3) కూడా రానున్నట్లు సెకండ్‌ పార్ట్‌ ఎండింగ్‌లో డైరెక్టర్‌ శైలేష్‌ కొలను హింట్‌ ఇచ్చేశారు. ఇందులో అర్జున్‌ అనే పోలీసు ఆఫీసర్‌ పాత్రను నాని పోషించనున్నాడు.  ప్రతినిధి-2 యంగ్‌ హీరో నారా రోహిత్‌ ప్రస్తుతం ప్రతినిధి-2 (Prathinidhi-2) చిత్రంలో నటిస్తున్నాడు. 2014లో వచ్చిన ప్రతినిధి సినిమాకు ఇది సీక్వెల్‌. ప్రముఖ జర్నలిస్ట్ మూర్తి ఈ మూవీని డైరెక్ట్‌ చేస్తున్నారు. ఇటీవలే ఈ చిత్ర టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్‌‌ను విడుదల చేశారు. వచ్చే ఏడాది జనవరి 25న ఈ మూవీ రిలీజ్ కానుంది.  టిల్లు స్క్వేర్‌ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా చేసిన డీజే టిల్లు చిత్రం గతేడాది మంచి విజయం సాధించింది. ప్రస్తుతం ‘టిల్లు స్క్వేర్‌’ (Tillu Square) పేరుతో ఈ చిత్రానికి సీక్వెల్‌ను రూపొందిస్తున్నారు. ఈ ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవలే ఫస్ట్‌ లుక్‌ పోస్టర్లు, పాట రిలీజయ్యాయి. సెప్టెంబర్‌ 15న టిల్లు స్క్వేర్‌ రిలీజ్‌ చేయనున్నట్లు మేకర్స్‌ తెలిపారు.  బింబిసార 2 గతేడాది విడుదలైన ‘బింబిసార’ (Bimbisara) చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఇందులో హీరో కళ్యాణ్‌ రామ్‌.. మగధ సామ్రాజ్యనేత బింబిసారుడిగా నటించాడు. సినిమా విడుదల సమయంలోనే బింబిసార-2 కూడా ఉంటుందని చిత్ర యూనిట్‌ క్లారిటీ ఇచ్చింది. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు సమాచారం.  సలార్‌  ప్రభాస్‌, ప్రశాంత్ నీల్‌ కాంబోలో సలార్‌ (Salaar) చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. అయితే సలార్‌ రెండు భాగాలుగా తెరకెక్కనున్నట్లు చిత్ర యూనిట్‌ టీజర్‌లో కన్ఫర్మ్ చేసేసింది. అందుకే పార్ట్ 1కి ‘సలార్‌ పార్ట్‌-1: సీజ్‌ ఫైర్‌’ అనే ట్యాగ్ లైన్ జోడించింది. దీన్ని బట్టి రెండో పార్ట్‌ కచ్చితంగా ఉంటుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ప్రాజెక్ట్‌ K ప్రభాస్‌ హీరోగా నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ K (Project K) సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాకు 'కల్కి 2898 ఏడీ' (Kalki 2898 AD) అనే టైటిల్‌ను ఖరారు చేశారు. అయితే ఈ సినిమా కూడా రెండు భాగాలుగా రానునట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో ప్రభాస్‌తో పాటు కమల్‌హాసన్‌, అమితాబ్‌ బచ్చన్‌, దీపికా పదుకొనె, దిశా పటానీ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
    ఆగస్టు 02 , 2023
    Underrated Telugu Movies: కథ బాగున్నా బాక్సాఫీస్‌ వద్ద దారుణంగా విఫలమైన చిత్రాలు ఇవే!
    Underrated Telugu Movies: కథ బాగున్నా బాక్సాఫీస్‌ వద్ద దారుణంగా విఫలమైన చిత్రాలు ఇవే!
    సాధారణంగా ఏ సినిమాకైనా కథ తొలి ప్రాధాన్యంగా ఉంటుంది. కంటెంట్ సరిగా లేకపోతే ఎంతటి స్టార్‌ హీరోను పెట్టినా ఆ సినిమా విజయం సాధించదు. అయితే టాలీవుడ్‌లో కొన్ని చిత్రాలు ఇప్పటికీ మిస్టరీనే. అద్భుతమైన కథ, స్టార్‌ హీరోలు ఉన్నప్పటికీ ఆయా చిత్రాలు అనూహ్యంగా పరాజయాలను చవి చూశాయి. ఎన్నో ఆశలతో నిర్మించిన నిర్మాతలకు నష్టాలను మిగిల్చాయి. ఇప్పటివరకూ టాలీవుడ్‌లో అలాంటి సినిమాలు చాలానే వచ్చాయి. వాటిలో బెస్ట్‌ కథతో వచ్చిన చిత్రాలు ఏవో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. ఆరెంజ్‌ (Orange) రామ్‌చరణ్‌ (Ramcharan) హీరోగా బొమ్మరిల్లు భాస్కర్‌ (Bommarillu Bhaskar) తెరకెక్కించిన చిత్రం ‘ఆరెంజ్‌’. ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఘోరంగా విఫలమైంది. ఒక యూనిక్‌ కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ సినిమా ఎందుకు ఫ్లాప్‌ అయ్యిందో ఇప్పటికీ మిస్టరీనే. కొద్ది నెలల క్రితం ఈ సినిమాను రీరిలీజ్‌ చేయగా ఆడియన్స్‌ నుంచి విశేష స్పందన వచ్చింది. అయితే ‘ఆరెంజ్‌’ ఆ రోజుల్లో రావాల్సిన చిత్రం కాదని.. ఇప్పుడు గనుక రిలీజై ఉంటే బ్లాక్‌బాస్టర్‌ విజయం అందుకునేదని సినిమా లవర్స్ అంటున్నారు.  అ! (Awe) హనుమాన్‌ ఫేమ్‌ ప్రశాంత్ వర్మ (Prasanth Varma) ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమా కథ చాలా కొత్తగా ఉంటుంది. విభిన్నమైన అనుభూతిని కలిగిస్తుంది. చూసిన చాలామంది ఈ సినిమాను థియేటర్‌లో చూసుంటే బాగుండేదని నెట్టింట కామెంట్స్‌ చేశారు. ఈ సినిమా కాన్సెప్ట్‌ ఏంటంటే.. మల్టిపుల్ పెర్సనాలిటీ డిసార్డర్ అనే వ్యాధితో బాధపడే కాళి అనే అమ్మాయి తనలో కలిగే ఒక్కో ఫీలింగ్‌కు ఒక్కో క్యారెక్టర్‌ను సృష్టించుకుంటూ పోతుంది. ఆ పాత్రల ద్వారా తన భావాలను చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందన్నది కథ. మూవీ ఎంత బాగున్నప్పటికీ కమర్షియల్‌గా విజయం సాధించలేదు. C/o కంచరపాలెం (C/o Kancharapalem) ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం.. ప్రేక్షకుల నుంచి ఊహించని రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంది. అయితే థియేటర్లలో కంటే ఓటీటీలోనే ఎక్కువ మంది ఈ సినిమాను చూశారు. నాలుగు ప్రేమల కథల సమాహారమే ఈ సినిమా. కంచరపాలెంలో మెుదలైన నాలుగు ప్రేమకథలు వారి జీవితాల్లో ఎలాంటి మలుపులకు కారణమయ్యాయి? ఈ నాలుగు జంటలకు ఉన్న సంబంధం ఏంటి? చివరకు వారి కథలు ఎలా ముగిశాయి? అన్నది కథ. వెంకటేష్‌ మహా తెరకెక్కించిన ఈ చిత్రం హృదయాలకు హత్తుకుంటుంది. అంటే సుందరానికి (Ante Sundaraniki) నేచురల్ స్టార్ నాని (Nani) హీరోగా నజ్రీయా హీరోయిన్‌గా వైవిధ్యమైన దర్శకుడు వివేక్ ఆత్రేయ తెరకెక్కించిన చిత్రం ‘అంటే సుందరానికి’. ఈ సినిమా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది. కథలోకి వెళ్తే.. బ్రాహ్మణ కుటుంబానికి చెందిన సుందర్‌ (నాని) ఇంకో మతానికి చెందిన లీల (నజ్రియా నజీమ్‌)ను ప్రేమిస్తాడు. భిన్నమైన సంప్రదాయాలు కలిగిన ఈ జంట పెళ్లి కోసం కుటుంబ సభ్యులతో అబద్దం ఆడతారు. దాని వల్ల ఎలాంటి ఇబ్బందులు పడ్డారన్నది కథ. ఇందులో నాని నటన తన గత చిత్రాలకు భిన్నంగా ఉంటుంది. అయినప్పటికీ ఈ సినిమా కమర్షియల్‌గా విజయాన్ని సాధించలేకపోయింది.  అప్పట్లో ఒకడుండేవాడు (Appatlo Okadundevadu) నారా రోహిత్‌ (Nara Rohit), శ్రీ విష్ణు (Sree Vishnu) ప్రధాన పాత్రల్లో చేసిన ‘అప్పట్లో ఒకడుండేవాడు’ చిత్రం.. హృదయాన్ని హత్తుకునే కథతో రూపొందింది. క్రికెటర్‌ కావాలని కలలు కనే ఓ యువకుడు అనుకోకుండా ఓ కేసులో ఇరుక్కోవడం.. ఓ పోలీసు అధికారి అతడ్ని బాగా ఇబ్బంది పెట్టడం.. చివరికీ అధికారే అతడికి సాయం చేయడం.. ఆకట్టుకుంటుంది. క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ ఆడియన్స్‌కు కంటతడి పెట్టిస్తుంది. అయితే ఈ సినిమాకు బాక్సాఫీస్‌ వద్ద నిర్మాతలకు నష్టాలు మిగిల్చింది.  కర్మ (Karma) యంగ్‌ హీరో అడవి శేషు (Adivi Sesh) నటించిన తొలి చిత్రం ‘కర్మ’. ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద విఫలమైనప్పటికీ టెలివిజన్ ప్రీమియర్స్‌లో మంచి టీఆర్‌పీ రేటింగ్‌ను సాధించింది. ఇందులో హీరోకి అతీంద్రియ శక్తులు ఉంటాయి.  1: నేనొక్కడినే (1: Nenokkadine) సుకుమార్ - మహేష్ బాబు కాంబినేషన్లో భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా.. ప్రేక్షకులను కన్ఫ్యూజన్‌లో పడేసింది. ఆడియన్స్‌కు ఈ సినిమా అర్థమయ్యేలోపే చివరికి డిజాస్టర్‌గా మిగిలిపోయింది. ఈ సినిమా కథలోకి వెళ్తే.. హీరోకి బాధాకరమైన గతం ఉంటుంది. దాని వల్ల అతడ్ని కొన్ని ఆలోచనలు వెంటాడుతాయి. ఈ క్రమంలో హీరో జీవితంలో ఊహించని మలుపులు చోటుచేసుకుంటాయి. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు హీరో గతం ఏంటి? అన్నది సినిమా కథ. ఈ సినిమా టీవీల్లోకి వచ్చాక మంచి ఆదరణ పొందడం విశేషం.  ఈ నగరానికి ఏమైంది (Ee Nagaraniki Emaindi) ఈ సినిమా పేరు చెప్పగానే అందరికీ నవ్వు వస్తుంది. ఎన్ని సార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలి అనిపిస్తుంది. అయితే ఇదంతా ఓటీటీలోకి వచ్చిన తర్వాతనే. థియేటర్లలో ఈ సినిమాకు పెద్దగా ఆదరణ లభించలేదు. ఎప్పుడైతే ఓటీటీలోకి వచ్చిందో ఈ సినిమా అప్పట్లో ట్రెండింగ్‌లోకి వెళ్లిపోయింది. బోరింగ్‌ సమయంలో ఇప్పటికీ చాలా మంది ఈ సినిమాను చూస్తుంటారు. ఇందులోని పాత్రలు ప్రతీ ఒక్కరికీ కనెక్ట్ అవుతాయి.  వేదం (Vedam) అల్లు అర్జున్ (Allu Arjun), మంచు మనోజ్‌(Manchu Manoj), అనుష్క (Anushka Shetty) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘వేదం’. ఈ సినిమా చూసిన వారంతా వేదం ఓ మంచి ఫీల్‌గుడ్‌ మూవీ అని చెబుతారు. అయితే కమర్షియల్‌గా ఈ సినిమా ఫ్లాప్‌ అనే చెప్పాలి. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు ప్రేక్షకులు.. ఆర్థికంగా విజయాన్ని అందించలేకపోయారు. ప్రొడ్యుసర్లు నష్టాలను చవిచూడటంతో ఈ సినిమా థియేటర్లలో ఒక ఫ్లాప్ సినిమాగా మిగిలిపోయింది. ఖలేజా (Khaleja) ఒక సినిమా హిట్ కావడానికి అవసరమైన అన్ని హంగులు ‘ఖలేజా’లో ఉన్నాయి. స్టార్‌ హీరో - హీరోయిన్లు, బలమైన కథ, మంచి సంగీతం, అద్భుతమైన డైరెక్షన్‌ ఇలా అన్నీ సమకూరిన కూడా ఈ చిత్రం ఫ్లాప్‌గా నిలిచింది. టీవీల్లో చూసిన వారంతా ఈ సినిమా ఎందుకు ఫ్లాప్‌ అయ్యిందా? అని ఇప్పటికీ ప్రశ్నించుకుంటూనే ఉంటారు. కథలోకి వెళ్తే.. ఒక గ్రామాన్ని తెలియని వ్యాధి పీడిస్తుంటుంది. ఆ వ్యాధి వల్ల అనేక మంది చనిపోతుంటారు. దేవుడే తమను కాపాడతాడు అని నమ్మిన గ్రామ ప్రజలు... క్యాబ్ డ్రైవర్ రాజులో అతీంద్రియ శక్తిని కనుగొంటారు. ఆ తర్వాత ఏమైంది? అన్నది స్టోరీ.  విరాట పర్వం సాయి పల్లవి (Sai Pallavi), రానా (Rana Daggubati) ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘విరాటపర్వం’. ఈ సినిమా నక్సల్స్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. నక్సల్స్‌ కథకు అద్భుతమైన ప్రేమను జోడించి దర్శకుడు వేణు ఉడుగుల ఈ సినిమాను వైవిధ్యంగా తెరకెక్కించారు. ఓటీటీలో మంచి ఆదరణ పొందిన ఈ సినిమా.. థియేటర్లలో మాత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేదు.  రిపబ్లిక్‌ (Republic) మెగా హీరో సాయిధరమ్‌ తేజ్‌, విలక్షణ దర్శకుడు దేవా కట్టా కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం 'రిపబ్లిక్‌'. ప్రస్తుత సామాజిక పరిస్థితులను ఆధారంగా చేసుకొని దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించారు. జిల్లా పాలనాధికారి ప్రజలకు ఏ విధంగా అండగా ఉండాలో ఇందులో చూపించారు. ఈ సినిమా వీక్షకులకు బాగా నచ్చినప్పటికీ కమర్షియల్‌గా విజయాన్ని అందుకోలేదు. కథలోకి వెళ్తే.. అభిరామ్ (సాయిధరమ్ తేజ్) ఐఏఎస్ ఆఫీసర్‌గా సొంత జిల్లాలోనే బాథ్యతలు చేపడతాడు. ఎన్నో ఏళ్లుగా రాజకీయ ప్రాబల్యానికి గురవుతున్న తెల్లేరు సరస్సుపై ఫోకస్ పెడతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? సీఎం వాణి (రమ్యకృష్ణ) అక్రమాలకు ఎలా చరమగీతం పాడాడు? అన్నది స్టోరీ. మెంటల్‌ మదిలో (Mental Madilo) శ్రీ విష్ణు (Sree Vishnu) హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో వచ్చిన 'మెంటల్ మదిలో' (2017) సినిమా కూడా ఫీల్‌ గుడ్‌ ఎంటర్‌టైనర్‌గా ఆడియన్స్‌ను అలరించింది. రొటిన్ లవ్‌ స్టోరీలకు భిన్నంగా రూపొందిన ఈ చిత్రం యూత్‌కు చాలా బాగా కనెక్ట్ అయ్యింది. సినిమా ఎంత బాగున్నప్పటికీ నిర్మాతలకు కష్టాలు తప్పలేదు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఆశించిన మేర విజయాన్ని సాధించలేకపోయింది. కథలోకి వెళ్తే.. స్థిరమైన మనస్తత్వం లేని ఓ యువకుడు ఇద్దరు అమ్మాయిలతో ప్రేమలో పడతాడు. వారిలో ఒకరినే ఎన్నుకోవలసిన పరిస్థితి వచ్చినప్పుడు అతడు ఏం చేశాడు? అన్నది స్టోరీ. 
    మార్చి 22 , 2024
    SIIMA 2023 Nominations: RRRకు పోటీ ఇస్తున్న సీతారామం.. నామినేషన్స్‌లో తలపడుతున్న టాప్‌ చిత్రాలు..!
    SIIMA 2023 Nominations: RRRకు పోటీ ఇస్తున్న సీతారామం.. నామినేషన్స్‌లో తలపడుతున్న టాప్‌ చిత్రాలు..!
    దక్షిణ భారత దేశంలో జరిగే అతిపెద్ద సినీ ఈవెంట్‌గా  సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (SIIMA) గుర్తింపు పొందింది. ఏటా జరిగే SIIMA వేడుకల్లో అంతకుముందు ఏడాది వచ్చిన అత్యుత్తమ సినిమాలను ఎంపిక చేసి అవార్డులు అందజేస్తారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది సెప్టెంబర్‌ 15, 16వ తేదీల్లో SIIMA అవార్డ్స్‌ వేడుకలను నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ అవార్డులకు సంబంధించిన నామినేషన్లకూ నిర్వాహకులు ఆహ్వానం పలికారు. దీంతో టాలీవుడ్‌ నుంచి పలు సూపర్‌హిట్‌ సినిమాలు SIIMA అవార్డ్స్‌కు నామినేషన్స్‌ పంపాయి. ఈ క్రమంలోనే తెలుగు బెస్ట్ ఫిలిం క్యాటగిరీలో పలు సినిమాలు నామినేట్ కూడా అయ్యాయి. అలాగే తమిళం, మలయాళం, కన్నడ భాష చిత్రాలు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాయి. ఇంతకీ ఆ చిత్రాలు ఏవో ఇప్పుడు చూద్దాం.  తెలుగు టాలీవుడ్‌ నుంచి ఈసారి 5 చిత్రాలు SIIMA అవార్డ్స్‌ రేసులో నిలిచాయి. అందరూ ఊహించినట్లుగానే RRR చిత్రం అత్యధిక నామినేషన్స్‌ దక్కించుకుంది. ఉత్తమ చిత్రం, దర్శకుడు, నటుడు, కెమెరామెన్, స్టంట్స్, కొరియోగ్రఫీ, సంగీతం వంటి పలు విభాగాల్లో 11 నామినేషన్స్ సొంతం చేసుకుంది. మరోవైపు సీతారామం (Sita Ramam) సినిమా  సైతం ‘ఉత్తమ చిత్రం’తో పాటు పలు విభాగాల్లో 10 నామినేషన్స్ దక్కించుకుంది. అటు నిఖిల్ హీరోగా నటించిన ‘కార్తికేయ 2’ (Karthikeya 2)  మూవీతో పాటు, సిద్దు జొన్నలగడ్డ నటించిన ‘డీజే టిల్లు’ (DJ Tillu), అడివి శేష్ నటించిన ‘మేజర్’ (Major) మూవీ ఉత్తమ చిత్రం క్యాటగిరీలో నామినేషన్స్ దక్కించుకున్నాయి. అయితే ఆస్కార్‌ అవార్డు కొల్లగొట్టిన RRR చిత్రం.. SIIMA రేసులో ఉండటంతో క్లీన్‌స్వీప్‌ ఖాయమని సినీ వర్గాలు భావిస్తున్నాయి.  తమిళం కోలీవుడ్‌ నుంచి మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పొన్నియన్ సెల్వన్ -1 (Ponniyin Selvan) మూవీ అత్యధిక నామినేషన్లు సొంతం చేసుకుంది. విక్రమ్, కార్తి, జయం రవి, ఐశ్వర్య రాయ్, త్రిష ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం 10 నామినేషన్స్ దక్కించుకుంది. కమల్ హాసన్, లోకేష్ కనగరాజ్ కాంబోలో తెరకెక్కిన ‘విక్రమ్’ (Vikram) మూవీ ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు సహా 9 కేటగిరిల్లో నామినేషన్స్ దక్కించుకుంది. అటు మాధవన్ దర్శకత్వం వహించి, నటించిన ‘రాకెట్రి’ (Rocketry) మూవీతో పాటు, ‘లవ్ టుడే’ (Love Today) మూవీలు ఉత్తమ చిత్రం కేటగిరిలో నామినేషన్స్ నిలిచాయి. అయితే పొన్నియన్ సెల్వన్ -1, విక్రమ్‌ చిత్రాలపై తమిళ ఇండస్ట్రీ ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది.  కన్నడ 2022 ఏడాది కన్నడ చిత్ర పరిశ్రమకు చిరస్మరణీయ విజయాలను అందించింది. ఆ పరిశ్రమ నుంచి వచ్చిన కాంతార, కేజీఎఫ్‌ చిత్రాలు దేశవ్యాప్తంగా ప్రభంజనం సృష్టించాయి. ఇదిలా ఉంటే ఈ సారి కన్నడ ఇండస్ట్రీ నుంచి నాలుగు చిత్రాలు SIIMA అవార్డ్స్‌ నామినేషన్‌కు ఎంపికయ్యాయి. రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన ‘కాంతార’ (Kantara), యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కేజీఎఫ్ 2’ (KGF 2) చిత్రాలు 11 నామినేషన్స్‌ను దక్కించుకున్నాయి. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ కెమెరా వర్క్ విభాగాల్లో రేసులో నిలిచాయి. అటు ‘విక్రాంత్ రోణ’ (Vikranth rona), ‘ఛార్లీ 777’ (Charlie 777) చిత్రాలు సైతం కన్నడ ఇండస్ట్రీ నుంచి ‘ఉత్తమ చిత్రం’ కేటగిరిల్లో పోటీపడుతున్నాయి. మలయాళం మలయాళం నుంచి  ఆరు చిత్రాలు ఉత్తమ చిత్రం కేటగిరిల్లో నామినేషన్స్ దక్కించుకున్నాయి. మమ్ముట్టి హీరోగా నటించిన ‘భీష్మ పర్వం’ 8 నామినేషన్స్‌తో అగ్ర స్థానంలో నిలిచింది. అటు టొవినో థామస్ (Tovino Thomas) హీరోగా చేసిన ‘థల్లుమాల’ (Thallumaala)కు ఏడు నామినేషన్స్ వచ్చాయి. మొత్తంగా ఈ చిత్రాల్లో ఏయో చిత్రాలు, నటీనటులు, సాంకేతిక నిపుణులు అవార్డులు అందుకుంటారో చూడాలి. వీటితో పాటు హృదయం (Hridayam), జయ జయ జయ జయహే (Jaya Jaya Jaya Jaya Hey),  'న్నా తాన్‌ కేస్ కొడు' (Nna Thaan Case Kodu), జనగణమన (Jana Gana Mana) ఉత్తమ చిత్రం కేటాగిరిలో పోటీ పడుతున్నాయి. కాగా, SIIMA ఈవెంట్ సెప్టెంబర్ 15,16 తేదిల్లో దుబాయ్‌లోని DWTCలో అంగరంగ వైభవంగా జరగనుంది.
    ఆగస్టు 03 , 2023
    Paarijatha Parvam Review: సినిమా వాళ్ల కిడ్నాప్‌ సక్సెస్‌ అయ్యిందా! ‘పారిజాత పర్వం’ హిట్టా? ఫట్టా?
    Paarijatha Parvam Review: సినిమా వాళ్ల కిడ్నాప్‌ సక్సెస్‌ అయ్యిందా! ‘పారిజాత పర్వం’ హిట్టా? ఫట్టా?
    నటీనటులు : చైతన్యరావు, సునీల్‌, హర్ష చెముడు, శ్రద్ధా దాస్‌, మాళవికా సతీశన్‌, శ్రీకాంత్ అయ్యంగార్‌, సమీర్‌ తదితరులు దర్శకుడు : సంతోష్‌ కంభంపాటి సంగీతం : రీ సినిమాటోగ్రాఫర్‌ : బాల సరస్వతి ఎడిటర్‌ : శశాంక్‌ ఉప్పుటూరి నిర్మాతలు : మహిధర్‌ రెడ్డి, దేవేష్‌ శ్రీనివాసన్‌ సునీల్‌, శ్రద్ధాదాస్‌, చైతన్య రావు, మాళవిక సతీశన్‌ ప్రధాన పాత్రల్లో చేసిన చిత్రం 'పారిజాత పర్వం' (Paarijatha Parvam). సంతోష్‌ కంభంపాటి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి 'కిడ్నాప్‌ ఈజ్‌ ఏన్‌ ఆర్ట్‌' అని ఉపశీర్షిక పెట్టారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్‌.. ప్రేక్షకుల్లో అంచనాలు పెంచాయి. కాగా, శుక్రవారం (ఏప్రిల్ 19న) థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.  కథేంటి చైత‌న్య (చైత‌న్య‌రావు) డైరెక్టర్ కావాలని క‌ల‌లు కంటుంటాడు. స్నేహితుడ్ని (హ‌ర్ష‌) హీరోగా పెట్టి ఓ కథతో నిర్మాత‌ల చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతాడు. ఆ ప్రయత్నాలు సక్సెస్‌ కాకపోవడంతో చివ‌రికి తానే నిర్మాత‌గా మారి సినిమా తీయాల‌ని ఫిక్స‌వుతాడు. డ‌బ్బు కోసం శెట్టి (శ్రీ‌కాంత్ అయ్యంగార్‌) సెకండ్ సెట‌ప్‌ని కిడ్నాప్ చేయాల‌ని ప్లాన్‌ వేస్తాడు. మ‌రోవైపు బారు శ్రీ‌ను (సునీల్‌), పారు (శ్ర‌ద్దా దాస్‌) కూడా ఆమెను కిడ్నాప్‌ చేసేందుకు స్కెచ్ వేస్తారు. మ‌రి ఈ ఇద్ద‌రిలో శెట్టి భార్య‌ని ఎవ‌రు కిడ్నాప్ చేశారు? అస‌లు బారు శ్రీ‌ను ఎవ‌రు? అతడి క‌థేంటి? చైతన్య డైరెక్టర్‌ అయ్యాడా? లేదా? అన్నది కథ.  ఎవరెలా చేశారంటే కథానాయకుడు చైతన్యరావు హ్యాండ్సమ్ లుక్స్‌తో ఆకట్టుకున్నాడు. ఎప్పటిలాగే చక్కటి నటన కనబరిచాడు. అయితే ఈ సినిమాకు హీరో కంటే హర్ష చెముడు, సునీల్‌ పాత్రలే కీలకమని చెప్పవచ్చు. ముఖ్యంగా హర్ష.. తన కమెడీ టైమింగ్‌తో అదరగొట్టాడు. అటు సునీల్‌ సైతం తన కామెడీతో మెప్పించాడు. వింటేజ్‌ సునీల్‌ను మరోమారు ప్రేక్షకులకు పరిచయం చేశాడు. హీరోయిన్‌గా మాళవిక రావు నటన పర్వాలేదు. హర్ష, మాళవిక మధ్య వచ్చే కామెడీ ట్రాక్‌ నవ్విస్తుంది. బార్‌ డ్యాన్సర్‌గా శ్రద్ధా దాస్ నటన ఓకే. శ్రీకాంత్‌ అయ్యంగార్‌, సురేఖ వాణి చాలా రోజుల తర్వాత ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో కనిపించారు.  డైరెక్షన్ ఎలా ఉందంటే దర్శకుడు సంతోష్‌ కంభంపాటి.. సినిమా బ్యాక్‌డ్రాప్‌లో ఈ ఫన్‌ ఎంటర్‌టైనర్‌ను తెరకెక్కించారు. సినిమాలు తీసేవాళ్లకు తమ జీవితాల్లో ఎదురయ్యే కష్టాలను చూపించారు. వైవా హర్షను హీరోగా పెట్టి సినిమా తీస్తానని చైతన్య చెప్పడం, నిర్మాతలు ఇచ్చే సమాధానాలు నవ్విస్తాయి. హర్ష, సునీల్‌లోని కామెడీ టైమింగ్‌ను డైరెక్టర్ చాలా బాగా వాడుకున్నారు. అయితే చైతన్యరావులోని నటుడ్ని సరిగా వాడుకోలేదని అనిపిస్తుంది. కథ కూడా సాదా సీదాగా సాగడం, పేలవమైన స్క్రీన్‌ప్లే, రొటీన్‌ ట్విస్టులు సినిమాకు మైనస్‌గా మారాయి. సినిమాలో చాలా చోట్ల లాజిక్కులు మిస్‌ అయ్యాయి. కిడ్నాప్ డ్రామా తెరపైకి వచ్చి ట్విస్టులు రివీల్ అయ్యాక కామెడీ డైల్యూట్ అయ్యింది. ఫలితంగా ప్రేక్షకుల్లో కథపై క్యూరియాసిటీ తగ్గిపోయింది. అప్పటి వరకు సినిమా బ్యాక్‌డ్రాప్‌తో కొత్తగా అనిపించిన 'పారిజాత పర్వం'.. డైరెక్టర్‌ చేసిన కొన్ని తప్పిదాల వల్ల రొటీన్‌ మూవీగా మారిపోయింది.  టెక్నికల్‌గా సాంకేతిక అంశాల విషయానికి వస్తే.. కెమెరా, ప్రొడక్షన్ వేల్యూస్ బావున్నాయి. సంగీత దర్శకుడు 'రీ' బాణీల్లో పెప్పీ, మోడ్రన్ స్టైల్ వినిపించింది. నేపథ్య సంగీతం సోసోగా ఉంది. నిర్మాతలు ఎక్కడా రాజీపడినట్లు కనిపించలేదు.  ప్లస్‌ పాయింట్స్‌ కథకామెడీ సన్నివేశాలు మైనస్‌ పాయింట్స్‌ రొటీన్‌ సన్నివేశాలుపేలవమైన స్క్రీన్‌ప్లేలాజిక్స్‌కు అందని సీన్స్‌ Telugu.yousay.tv Rating : 2.5/5 
    ఏప్రిల్ 19 , 2024
    Mrunal Thakur: తెలుగులో మళ్లీ జతకట్టనున్న మృణాల్ ఠాకూర్- దుల్కర్ సల్మాన్.. డైరెక్టర్ ఎవరంటే?
    Mrunal Thakur: తెలుగులో మళ్లీ జతకట్టనున్న మృణాల్ ఠాకూర్- దుల్కర్ సల్మాన్.. డైరెక్టర్ ఎవరంటే?
    సీతారామం సినిమా తెలుగులోనే కాకుండా అన్ని భాషల్లో ఎంత పెద్ద హిట్టైందో అందరికి తెలిసిందే. ఈ సినిమాలో జతకట్టిన దుల్కర్ సల్మాన్- మృణాల్ ఠాకూర్ హిట్ పేయిర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. దుల్క‌ర్ స‌ల్మాన్ రామ్ పాత్ర‌లో, మృణాల్ సీత పాత్రలో అలరించారు. స్వ‌చ్ఛ‌మైన ప్రేమ‌క‌థ‌ను తమ క‌ళ్ల‌తోటే పలికించి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీని అద్భుతంగా పండించారు. మృణాల్ ఠాకూర్ సాంప్ర‌దాయ వస్త్రధారణతో ఆమె చేసిన అభినయం తెలుగు ప్రేక్షకులను బాగా అలరించింది. అయితే ఈ జోడీ మరోసారి జత కట్టనుట్లు వార్తలు వస్తున్నాయి. డైరెక్టర్ పరుశురామ్ శిష్యుడు రవి ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నట్లు తెలిసింది. ఈ చిత్రాన్ని మంచి ప్రేమకథా చిత్రం రాసుకున్నట్లు సమాచారం. ఈ సినిమాను దిల్ రాజు బ్యానర్‌లో నిర్మించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.  హిట్ పేయిర్ రిపీట్ సీతారామం మూవీ హిట్ తర్వాత దుల్కర్ సల్మాన్‌తో పాటు మృణాల్ ఠాకూర్‌కు సరైన హిట్ పడలేదనే చెప్పాలి. దుల్కర్ కింగ్ కొత్త వంటి వెబ్ సిరీస్‌లో నటించినా అది ఆశించినంత విజయం సాధించలేదనే చెప్పాలి. మరోవైపు సీతారామం సినిమా తర్వాత మృణాల్ ఠాకూర్.. హాయ్ నాన్నా, ఫ్యామిలీ స్టార్ చిత్రాలు చేసింది. ఇందులో హాయ్ నాన్న బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించినా... ఫ్యామిలీ స్టార్ చిత్రం మాత్రం చతికిలపడిపోయింది. ఫ్యామిలీ స్టార్‌కు మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ.. ఆశించినంతగా వసూళ్లు రాలేదు. ఈ సినిమా కోసం మృణాల్ బాగానే కష్టపడిందని చెప్పాలి. విజయ్ దేవరకొండతో కలిసి మూవీ ప్రమోషన్లలో తీరిక లేకుండా పాల్గొంది. స్వయంగా రీల్స్ చేసి వైరల్ చేసినా.. సినిమా ఫలితం మాత్రం వేరేలాగా వచ్చింది. దీంతో ఆమె కెరీర్ తెలుగులో ప్రశ్నార్థకంగా మారింది. కొత్త హీరోయిన్లతో గట్టి పోటీ ఎదుర్కొంటోంది. మృణాల్ హవా కొనసాగేనా? దశాబ్దకాలంగా మృణాల్ బాలీవుడ్‌లో నటిస్తోంది."సూపర్ 30"లో హృతిక్ రోషన్‌తో జతకట్టింది, కానీ ఇప్పటివరకు ఈ కలువ కనుల సుందరికి బీటౌన్‌లో సరైన గుర్తింపు దక్కలేదు. అయితే టాలీవుడ్‌లో మృణాల్ కేవలం ఒక్క సినిమాతో సూపర్ సక్సెస్‌ను అందుకుంది. తెలుగు ప్రజల ప్రేమకు మైమరిచిపోయిన ఈ భామ అప్పట్లో కన్నీళ్లు కూడా పెట్టుకుంది.సీతారామం విజయం మృణాల్‌కు టాలీవుడ్‌లో రాచబాట పరిచింది. సీతారామం సినిమాకోసం రూ.80 లక్షలు పారితోషికం తీసుకున్న ఈ ముద్దుగుమ్మ తర్వాత తన రెమ్యూనరేషన్‌ను రూ.కోటీన్నరకు పెంచింది. ఫ్యామిలీ స్టార్ పరాజయంతో  ప్రస్తుతం ఆమెకు టాలీవుడ్‌లో అవకాశాలు సన్నగిల్లాయి. రవి డైరెక్షన్‌లో దుల్కర్ సల్మాన్‌తో జత కట్టే సినిమాపై ఈ ముద్దుగుమ్మ కెరీర్‌ను నిర్ణయించే అవకాశం ఉంది. విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో స్టోరీ టాలీవుడ్‌లో దుల్కర్ సల్మాన్- మృణాల్ ఠాకుర్ జోడీ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ తెలుగు ప్రేక్షకులకు బాగా నచ్చడంతో.. ఈ జంటలో మరో మారు సినిమా తీయాలని టాలీవుడ్ దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఫ్యామిలీ స్టార్ డైరెక్టర్ పరుశురాం అసిస్టెంట్ డైరెక్టర్ రవి ఈ జంటతో సినిమా తీసేందుకు ముందుకొచ్చాడని సమాచారం. దుల్కర్- సల్మాన్‌ కోసం ఓ వినూత్నమైన ప్రేమ కథను రాసుకున్నాడంట. ఇది పూర్తిగా విలేజ్ బ్యాక్‌ డ్రాప్‌లో సాగుతుందని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కూడా రవి పూర్తి చేశాడంట. ఈ సినిమా కోసం దిల్ రాజు దగ్గరికి వెళ్లగా ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలిసింది. ఈ సినిమాను వెంకటేశ్వర క్రియేషన్‌లో తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. ఇక ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్‌గా జీవీ ప్రకాశ్‌ను ఎంపిక చేశారంట. ఆయన కూడా ఈ సినిమాకు పనిచేసేందుకు ఉత్సాహంగా ఉన్నట్లు తెలిసింది. ఆయన తమిళ్ మ్యూజిక్ డైరెక్టర్ అయినప్పటికీ.. తెలుగులో సార్, ఆదికేశవ వంటి చిత్రాలకు సంగీతం అందించాడు. సార్ సినిమా పాటలు ఎంత హిట్‌ అయ్యాయో అందరికి తెలిసిందే. అదే తరహాలో మ్యూజిక్ అందించేందుకు జీవీ ప్రకాశ్ సిద్ధమయ్యారు. షూటింగ్ ఎప్పుడంటే? ప్రస్తుతం దిల్ రాజు గేమ్ ఛేంజర్, విజయ్ దేవరకొండతో మరో సినిమాతో ఆయన బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలు పూర్తికాగానే దుల్కర్- మృణాల్ ఠాకూర్ చిత్రాన్ని పట్టాలెక్కించనున్నారు. అటు మృణాల్ ఠాకూర్ సైతం పూజా మేరి జాన్ అనే బాలీవుడ్ చిత్రంతో బిజీగా ఉంది. ఇటు దుల్కర్ సైతం మలయాళం చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఇవి పూర్తికాగానే ఈ చిత్రం షూటింగ్ ప్రారంభించనున్నట్లు టాక్. అయితే ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. ప్రస్తుతానికి మాత్రం ఈ జంటపై ఊహగానాలు వినిపిస్తున్నాయి.
    మే 14 , 2024
    Salaar 2: ‘గేమ్స్‌ ఆఫ్‌ థ్రోన్స్‌’ను తలదన్నేలా ‘సలార్‌ 2’.. ప్రభాస్ షూట్‌లో పాల్గొనేది అప్పుడే!
    Salaar 2: ‘గేమ్స్‌ ఆఫ్‌ థ్రోన్స్‌’ను తలదన్నేలా ‘సలార్‌ 2’.. ప్రభాస్ షూట్‌లో పాల్గొనేది అప్పుడే!
    పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ (Prabhas) హీరోగా ప్రశాంత్ నీల్‌ (Prashanth Neel) దర్శకత్వంలో రూపొందిన బ్లాక్‌ బాస్టర్‌ చిత్రం సలార్‌ పార్ట్‌ -1; సీజ్‌ ఫైర్‌' (Salaar: Part 1 Ceasefire). గతేడాది క్రిస్‌మస్‌ కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. నిర్మాతలపై కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ మూవీకి సీక్వెల్‌గా ‘సలార్‌ 2: శౌర్యంగ పర్వం’ (Salaar 2- Shouryanga Parvam) కూడా రానుందని తొలి పార్ట్‌ క్రైమాక్స్‌లోనే డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌ స్పష్టం చేశారు. దీంతో రెండో భాగంపై అందరిలోనూ ఆసక్తి ఏర్పడింది. ఈ సినిమా షూటింగ్‌ ఎప్పుడు మెుదలవుతుందా అని ప్రతి ఒక్కరూ ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘సలార్‌ 2’కి సంబంధించి ఒకేసారి రెండు అప్‌డేట్స్‌ బయటకు వచ్చాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.  వరదరాజ మన్నార్ స్పెషల్ ఎపిసోడ్‌ 'సలార్‌ 2' సినిమా షూటింగ్‌ ఏప్రిల్‌ నుంచి ప్రారంభమవుతుందని నటుడు బాబీ సింహా ఇటీవల ఓ ఇంటర్యూలో ప్రకటించాడు. తాజాగా కేరళ నటుడు పృథ్వీరాజ్‌ సుకుమాన్‌ (Prithviraj Sukumaran) కూడా ఇదే విషయాన్ని పునరుద్ఘటించాడు. సలార్‌లో ప్రభాస్‌ స్నేహితుడిగా వరద రాజమన్నార్‌ పాత్రలో పృథ్వీరాజ్‌ అదరగొట్టాడు. తాజాగా 'ది గోట్‌ లైఫ్‌' (The Goat Life) మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొన్న పృథ్వీరాజ్‌ త్వరలోనే 'సలార్‌ 2' షూట్‌ మెుదలవుతుందని చెప్పాడు. ముందుగా వరదరాజమన్నార్‌ పాత్రకు సంబంధించి యాక్షన్ ఎపిసోడ్‌ షూట్‌ చేస్తారని స్పష్టం చేశాడు. అయితే ఈ స్పెషల్‌ ఎపిసోడ్‌లోనే వరదరాజ మన్నార్‌ గ్రాఫ్‌ చూపిస్తారని అంటున్నారు.  సెట్‌లోకి ప్రభాస్ ఎంట్రీ ఎప్పుడంటే! పృథ్వీరాజ్ సుకుమారన్‌ (Prithviraj Sukumaran)తో వరదరాజ మన్నార్‌ ఎపిసోడ్‌ పూర్తయ్యాక.. నటుడు బాబీ సింహా (Bobby Simha), శ్రియా రెడ్డి (Sriya Reddy), జగపతిబాబు (Jagapathi Babu)లపై కీలక సీన్స్‌ షూట్‌ చేస్తారని తెలుస్తోంది. ఈ రెండు షెడ్యూల్స్‌ పూర్తైన తర్వాత రెబల్‌ స్టార్ ప్రభాస్‌ (Prabhas) సెట్‌లోకి అడుగుపెడతారని సమాచారం. ఈ మూవీ మూడో షెడ్యూల్‌ నుంచి ప్రభాస్‌ రెగ్యులర్‌ షూటింగ్‌లో పాల్గొంటారని టాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం డైరెక్టర్‌ ప్రశాంత్ నీల్‌ 'సలార్‌ 2' స్క్రిప్ట్‌పై కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది.  గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌లా ‘సలార్‌ 2’..! తాజాగా ఓ ఈవెంట్‌లో పాల్గొన్న ‘సలార్ 2’ నిర్మాత విజయ్‌ కిరగందూర్‌ సినిమాకు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏప్రిల్ తర్వాత నుంచి ఈ సినిమా పార్ట్-2 షూటింగ్‌ ప్రారంభించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. 2025లో సినిమా రిలీజ్‌ చేసేందుకు ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రముఖ హాలీవుడ్‌ సిరీస్ ‘గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌’లా సలార్‌ పార్ట్‌ 2 ఉండనుందని ఆయన తెలిపారు. నిర్మాత వ్యాఖ్యలతో ప్రభాస్‌ ఫ్యాన్స్‌ తెగ ఖుషి అవుతున్నారు. ‘సలార్‌ 2’.. తొలి భాగానికి మించి విజయం సాధిస్తుందని ఆకాంక్షిస్తున్నారు.  ఫ్యూచర్‌ ప్రాజెక్ట్స్‌తో ప్రభాస్‌ బిజీ బిజీ.. ప్రస్తుతం ప్రభాస్.. ‘కల్కి’ (Kalki 2898 AD), ‘రాజా సాబ్’ (Raja Saab) చిత్రాల షూటింగ్‌తో తీరిక లేకుండా గడుపుతున్నాడు. మరోవైపు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) ‘స్పిరిట్’ (Spirit)ను పట్టాలెక్కించే పనిలో ఉన్నాడు. ఇంత బిజీలో ప్రభాస్ ‘సలార్-2’కు ఎలా డేట్లు కేటాయించి వచ్చే ఏడాది సినిమా రిలీజయ్యేలా చూస్తాడో చూడాలి మరి. 
    మార్చి 12 , 2024
    Nivetha Pethuraj: పోలీసులతో గొడవ పెట్టుకున్న హీరోయిన్ నివేదా పేతురాజ్‌.. వీడియో వైరల్!
    Nivetha Pethuraj: పోలీసులతో గొడవ పెట్టుకున్న హీరోయిన్ నివేదా పేతురాజ్‌.. వీడియో వైరల్!
    టాలీవుడ్‌లో అతి కొద్ది సినిమాలతోనే మంచి ఫేమ్ తెచుకున్న హీరోయిన్లలో 'నివేదా పేతురాజ్‌'. మెంటల్‌ మదిలో సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు.. తన నటనతో మంచి గుర్తింపు సంపాదించింది. ఆ మూవీ తర్వాత వరుస అవకాశాలు అందుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్‌ సంపాదించుకుంది. ఇదిలా ఉంటే నివేతాకు గత కొంతకాలంగా ఏదీ కలిసిరావడం లేదు. ఇటీవల ఆమె ఓ సీఎం కొడుకుతో రిలేషన్‌లో ఉన్నారంటూ తమిళనాట పెద్ద ఎత్తున దుమారం రేగింది. తాజాగా ఈ బ్యూటీకి సంబంధించిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది.  అసలు ఏం జరిగిందంటే? వైరల్‌ అవుతున్న వీడియో ప్రకారం.. కారులో ప్రయాణిస్తున్న నివేదాను పోలీసులు అడ్డగించారు. ఆపై డిక్కీ ఓపెన్‌ చేయాలని ఆమెను కోరారు. దీనికి అంగీకరించని నివేద.. పోలీసులపై కోపం తెచ్చుకుంది. 'రోడ్డు వరకు వెళ్తున్నాను. నా దగ్గర పేపర్స్‌ అన్నీ కరెక్ట్‌గానే ఉన్నాయి. కావాలంటే చెక్‌ చేసుకోండి. డిక్కీలో ఏం లేవు. అర్థం చేసుకోండి. ఇది పరువుకు సంబంధించిన విషయం. ఇప్పుడు చెప్పినా మీకు అర్థం కాదు. నేను డిక్కీ ఓపెన్‌ చేయలేను' అని కోపంగా చెప్పారు. ఇదంతా ఓ వ్యక్తి తన కెమెరాలో రికార్డు చేస్తుండగా అతడిపైనా నటి మండిపడింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.  https://twitter.com/Karthikkkk_7/status/1795883722673135776 నివేదా ప్రాంక్‌ చేసిందా? నివేదా పేతురాజ్‌ వైరల్ వీడియోను చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. డిక్కీ ఓపెన్‌ చేస్తే సరిపోయేది కదా ఇలా పోలీసులతో వాగ్వాదం చేయడం ఎందుకు అని కామెంట్స్‌ చేస్తున్నారు. మరికొందరు నెటిజన్లు ఈ వీడియోను ఓ ప్రాంక్‌గా అభిప్రాయపడ్డారు. వీడియో నేచురల్‌గా లేదని.. స్క్రిప్టెడ్‌లా కనిపిస్తోందని పోస్టులు పెడుతున్నారు. ఏదైనా ప్రమోషన్స్‌లో భాగంగా నివేదా ఇలా చేసి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. పైగా ఈ వీడియోలో పోలీసులు షూస్‌కి బదులు చెప్పులు వేసుకొని కనిపించారని అంటున్నారు. కాబట్టి ఇది పక్కా ప్రమోషనల్‌ వీడియోనేనని నెటిజన్లు తేల్చేస్తున్నారు. ఏది ఏమైనా దీనిపై నివేదా క్లారిటీ ఇచ్చేవరకూ ఈ ప్రశ్నలకు ముగింపు రాదు.  సీఎం కొడుకుతో ఎఫైర్ అంటూ పుకార్లు కొన్ని నెలల క్రితం తమిళనాడు సీఎం స్టాలిన్‌ కుమారుడు, హీరో ఉదయనిధి స్టాలిన్‌ - నివేదా పేతురాజ్‌కు మధ్య ఏదో నడుస్తోందంటూ ఆ రాష్ట్ర మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. ఆమె కోసం ఉదయనిధి విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేస్తున్నారని, రూ.50 కోట్లతో ఇంటిని కూడా కొనుగోలు చేశాడని ప్రచారం జరిగింది. దీనిపై నివేదా ఎక్స్‌ వేదికగా తీవ్రస్థాయిలో మండిపడింది. ఈ తప్పుడు వార్తల వల్ల తాను, తన కుటుంబం ఒత్తిడికి లోనయ్యామని పేర్కొంది. మరోమారు తన ఆత్మగౌరవాన్ని కించపరిస్తే చట్టపరమైన చర్యలకు దిగుతానని వార్నింగ్‌ ఇచ్చింది. దీంతో ఆ రూమర్లకు చెక్‌ పడింది. https://twitter.com/Nivetha_Tweets/status/1764949757116735550 విష్వక్‌తో హ్యాట్రిక్‌ చిత్రాలు తెలుగులో తన తొలి చిత్రం ‘మెంటల్‌ మదిలో’ తర్వాత నివేదా.. 'చిత్రలహరి'తో మరో హిట్‌ తన ఖాతాలో వేసుకొంది. ఆ తర్వాత శ్రీవిష్ణుతో చేసిన 'బ్రోచేవారెవరురా' మంచి హిట్‌ టాక్‌ తెచ్చుకుంది.  ఇక యంగ్‌ హీరో విశ్వక్ సేన్ నటించిన ‘దాస్‌ కా ధమ్కీ’, ‘పాగల్’, ‘బూ’ అనే మూడు సినిమాల్లో నివేదా నటించింది. ఇవే కాకుండా రానా-సాయి పల్లవిల ‘విరాట పర్వం’ మూవీలోనూ అలరించింది. ఇటీవల ‘బ్లడ్ మేరీ’ అనే సినిమాతో ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఆమె చేతిలో ఏ ప్రాజెక్ట్స్‌ లేవు. దీంతో అందరి దృష్టిని ఆకర్షించేందుకు నివేదా ఇలా ప్రాంక్‌ చేసి ఉండొచ్చన వాదన కూడా నెట్టింట వినిపిస్తోంది. 
    మే 30 , 2024
    This Week OTT Movies: ఈ వారం మిమ్మల్ని  అలరించే చిత్రాలు/ సిరీస్‌లు ఇవే!
    This Week OTT Movies: ఈ వారం మిమ్మల్ని  అలరించే చిత్రాలు/ సిరీస్‌లు ఇవే!
    గత కొన్ని వారాలుగా స్టార్‌ హీరోల చిత్రాలు విడుదలవుతూ థియేటర్లలో సందడి చేస్తున్నాయి. అయితే ఈ వారం మాత్రం చిన్న చిత్రాల హవా కొనసాగనుంది. ఈ వేసవిలో అహ్లాదకరమైన వినోదాన్ని పంచేందుకు సిద్ధమవుతున్నాయి. మరోవైపు ఓటీటీలోనూ కొత్త సినిమాలు, సిరీస్‌లు డబుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇచ్చేందుకు వచ్చేస్తున్నాయి. ఆ విశేషాలేంటో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.  థియేటర్లలో రిలీజయ్యే చిత్రాలు టెనెంట్‌ హాస్య నటుడు సత్యం రాజేష్‌ (Satyam Rajesh) హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం 'టెనెంట్‌' (Tenant). ఏప్రిల్‌ 19న థియేటర్లలో రిలీజ్ కానుంది. వై. యుగంధర్ దర్శకత్వం వహించారు. ప్రేమ పెళ్లి తర్వాత సంతోషంగా సాగాల్సిన హీరో జీవితం ఎలాంటి అనూహ్య మలుపులు తిరిగింది? అన్నది కథ. శశివదనే రక్షిత్‌ అట్లూరి, కోమలి ప్రసాద్‌ జంటగా నటించిన ప్రేమకథ చిత్రం 'శశివదనే' (Sasivadane). సాయి మోహన్‌ ఉబ్బర దర్శకుడు. ఈ సినిమా ఏప్రిల్‌ 19న విడుదల కానుంది. గోదావరి నేపథ్యంలో ఈ  ప్రేమ కథ సాగనుంది. పారిజాత పర్వం సునీల్‌, శ్రద్ధాదాస్‌, చైతన్య రావు, మాళవిక సతీశన్‌ ప్రధాన పాత్రల్లో చేసిన చిత్రం 'పారిజాత పర్వం' (Paarijathaparvam). సంతోష్‌ కంభంపాటి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి 'కిడ్నాప్‌ ఈజ్‌ ఏన్‌ ఆర్ట్‌' అని ఉపశీర్షిక పెట్టారు. ఈ మూవీ ఏప్రిల్‌ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ట్రైలర్‌లోని ప్రతీ సన్నివేశం నవ్వులు పూయిస్తోంది.  లవ్‌ మౌళి అవనీంద్ర దర్శకత్వంలో నవ్‌దీప్‌ హీరోగా చేసిన సినిమా 'లవ్‌ మౌళి' (Love Mouli). ఇందులు పంకురి గిద్వానీ హీరోయిన్‌గా చేసింది. ఏప్రిల్‌ 19న ఈ సినిమా విడుదల కానుంది. ప్రేమ అనేది లేకుండా మనుషులకు దూరంగా బతుకుతున్న ఒక వ్యక్తికి.. లవ్‌ దొరికితే ఎలా ఉంటుంది? అనే కోణంలో ఈ చిత్రాన్ని తెరక్కించారు. మార్కెట్‌ మహాలక్ష్మీ కేరింత ఫేమ్‌ పార్వతీశం ఈ సినిమా (Market Mahalakshmi)లో హీరోగా చేశాడు. వీఎస్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీతో ప్రణీకాన్వికా హీరోయిన్‌గా పరిచయం అవుతోంది. అఖిలేష్‌ కలారు నిర్మాత. ఈ చిత్రంలో హర్షవర్ధన్‌, మహబూబ్‌ భాషా, ముక్కు అవినాష్‌ ముఖ్యపాత్రలు పోషించారు. ఏప్రిల్‌ 19న ఈ మూవీ రిలీజ్‌ కానుంది.  శరపంజరం నవీన్‌కుమార్‌ గట్టు హీరోగా నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘శరపంజరం’ (Sarapanjaram). లయ కథానాయిక. ఈ మూవీ ఏప్రిల్‌ 19న థియేటర్‌లలో విడుదల కానుంది. ‘జోగిని వ్యవస్థ, గంగిరెద్దుల్ని ఆడించే సంచార జాతుల కష్టాల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. మార‌ణాయుధం సీనియర్‌ నటి మాలాశ్రీ.. పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో నటించిన తాజా చిత్రం ‘మార‌ణాయుధం’ (Maaranaayudham). గురుమూర్తి సునామి ద‌ర్శ‌క‌త్వం వహించిన ఈ చిత్రం.. గతేడాది కన్నడలో విడుదలై పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుంది. ఇప్పుడు తెలుగు ప్రేక్షకులనూ అలరించడానికి సిద్ధమైంది. ఏప్రిల్‌ 19న ‘మారణాయుధం’ థియేటర్‌లలో విడుదల కానుంది. లవ్‌ యూ శంకర్‌  దర్శకుడు రాజీవ్‌ ఎస్‌.రియా.. ‘మై ఫ్రెండ్‌ గణేశా’ యానిమేషన్‌ చిత్రంతో అందరి దృష్టిని ఆకర్షించాడు. తాజాగా ‘లవ్‌ యూ శంకర్‌’ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఏప్రిల్‌ 19న ఈ చిత్రం విడుదల కానుంది. ఇందులో శ్రేయాస్‌ తల్పాడే, తనీషా జంటగా నటించారు.  ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు/ సిరీస్‌లు సైరెన్‌ జ‌యం ర‌వి (Jayam Ravi) క‌థానాయ‌కుడిగా నటించిన లేటెస్ట్ మూవీ ‘సైరెన్’ (Siren). ఫిబ్రవరి 16న కోలీవుడ్‌లో విడుదలైన ఈ సినిమా యావరేజ్‌ టాక్‌ తెచ్చుకుంది. ఏప్రిల్ 19 నుంచి ఈ మూవీ డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌ వేదికగా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. తమిళంతోపాటు తెలుగులో కూడా సైరన్ డిజిటల్ ప్రీమియర్ కానుంది. ఇందులో జయం రవితో పాటు కీర్తి సురేష్, అనుపమా పరమేశ్వరన్‌ ముఖ్యపాత్రలు పోషించారు. మై డియర్ దొంగ  ఓటీటీలోకి నేరుగా మరో కామెడీ మూవీ వస్తోంది. అభినవ్ గోమటం, షాలిని, దివ్య శ్రీపాద నటించిన ‘మై డియర్ దొంగ’ (My Dear Donga) మూవీ.. ఏప్రిల్ 19 నుంచి ఆహా వేదికగా స్ట్రీమింగ్ కానుంది.  ఓ అమ్మాయి ఇంట్లోకి దొంగ‌త‌నం చేయ‌డానికి వ‌చ్చిన యువ‌కుడు.. అనుకోని ప‌రిస్థితుల్లో అక్క‌డే బందీగా చిక్కుకుపోతే ఏం జ‌రిగింది? దొంగ‌కు, యువ‌తికి మ‌ధ్య ఏర్ప‌డిన స్నేహం ఎలాంటి మ‌లుపులకు కారణమైంది? అన్న కథతో ఈ మూవీ రూపొందింది. కాటేరా కన్నడ స్టార్‌ హీరో దర్శన్‌ నటించిన చిత్రం కాటేరా (Kaatera). తరుణ్‌ సుధీర్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం గతేడాది విడుదలై రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇప్పటికే ఈ సినిమా కన్నడ వెర్షన్‌ ప్రముఖ ఓటీటీ వేదిక ‘జీ5’ (Zee 5)లో స్ట్రీమింగ్‌ అవుతోంది. అయితే తాజాగా తెలుగు, తమిళ వెర్షన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ‘జీ 5’ వర్గాలు ప్రకటించాయి. మరిన్ని OTT చిత్రాలు & వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి https://telugu.yousay.tv/tfidb/ott TitleCategoryLanguagePlatformRelease DateAnyone but YouMovieEnglishNetflixApril 15Rebel MoonMovieEnglishNetflixApril 19Chief Detective 1958SeriesKoreanDisney + HotstarApril 19SirenMovieTeluguDisney + HotstarApril 19My Dear DongaMovieTeluguAhaApril 19Dream ScenarioMovieEnglishLions Gate PlayApril 19The Tourist S2SeriesEnglishLions Gate PlayApril 19Pon Ondru KandenMovieTamilJio CinemaApril 14The SympathizerSeriesEnglishJio CinemaApril 14Article 370MovieHindiJio CinemaApril 19Quizzer Of The YearSeriesEnglishSonyLIVApril 15Dune: Part TwoMovieEnglishBook My ShowApril 16
    ఏప్రిల్ 15 , 2024
    Kaliyugam Pattanamlo Review: సరికొత్త క్రైమ్‌ థ్రిల్లర్‌గా ‘కలియుగం పట్టణంలో’.. సినిమా ఎలా ఉందంటే?
    Kaliyugam Pattanamlo Review: సరికొత్త క్రైమ్‌ థ్రిల్లర్‌గా ‘కలియుగం పట్టణంలో’.. సినిమా ఎలా ఉందంటే?
    నటీనటులు : విశ్వ కార్తికేయ, ఆయుషి పటేల్‌, చిత్ర శుక్లా, రూపా  లక్ష్మీ, అనీష్‌ కురువిల్ల, దేవి ప్రసాద్‌ తదితరులు.. దర్శకత్వం : రమాకాంత్‌ రెడ్డి సంగీతం : అజయ్‌ అరసద సినిమాటోగ్రాఫర్‌ : చరణ్‌ మాధవనేని నిర్మాతలు: కందుల చంద్ర ఓబుల్‌ రెడ్డి, గడ్డం మహేశ్వర రెడ్డి, కాటం రమేష్‌ విడుదల తేదీ: 29-03-2024 విశ్వ కార్తికేయ (Vishva Karthikeya), ఆయూషి పటేల్ (Ayushi Patel) హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘కలియుగం పట్టణంలో’ (Kaliyugam Pattanamlo). కథ, డైలాగ్స్, స్క్రీన్ ప్లే, దర్శకత్వం ఇలా అన్ని బాధ్యతలను రమాకాంత్ రెడ్డి చూసుకున్నారు. డాక్టర్ కందుల చంద్ర ఓబుల్ రెడ్డి, జి.మహేశ్వరరెడ్డి, కాటం రమేష్‌‌ నిర్మించిన ఈ చిత్రం ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఎలా ఉంది? తెలుగు ఆడియన్స్‌ను మెప్పించిందా? లేదా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.  కథేంటి విజయ్-సాగర్‌ (విశ్వ కార్తికేయ) కవల పిల్లలు. విజయ్‌కి చిన్నప్పటి నుంచి రక్తం చూస్తే భయం. అయితే విజయ్‌ భయపడుతుంటే సాగర్‌ చూసి ఆనందిస్తుంటాడు. దీంతో పేరెంట్స్‌ సాగర్‌ను చూసి భయపడి చిన్నప్పుడే అతడ్ని మెంటల్ హాస్పిటల్‌లో చేర్పిస్తారు. కట్‌ చేస్తే.. కొన్నేళ్ల తర్వాత నంద్యాలలో వరుసగా హత్యలు జరుగుతుంటాయి. దీన్ని సాల్వ్‌ చేసేందుకు మహిళా పోలీసు అధికారి (Chitra Shukla) రంగంలోకి దిగుతుంది. ఆమె కనిపెట్టిన విషయాలు ఏంటి? అసలు విజయ్‌ - సాగర్‌లలో ఎవరు మంచివారు? వారికి ఈ హత్యలకు ఏమైనా సంబంధం ఉందా? అన్నది స్టోరీ.  ఎవరెలా చేశారంటే? విజయ్-సాగర్ పాత్రల్లో విశ్వ కార్తికేయ బాగా నటించాడు. పాత్రకు తగ్గట్లు వేరియేషన్స్‌ చూపించి ఆకట్టుకున్నాడు. యాక్షన్స్ సన్నివేశాలలోనూ అద్భుత ప్రతిభ కనబరిచి మెప్పించాడు. ఇక హీరోయిన్ల విషయానికి వస్తే ఆయుషి పటేల్(Kaliyugam Pattanamlo Movie Review) తన గ్లామర్‌తో మెప్పించింది. తొలి భాగమంతా ఆమె సందడే స్క్రీన్‌ పైన కనిపిస్తుంది. ఇక సెకండాఫ్‌లో చిత్రా శుక్ల తన నటనతో మెరిసింది. మిగిలిన పాత్ర ధారులు తమ పరిధిమేరకు నటించి మెప్పించారు.  డైరెక్షన్‌ ఎలా ఉందంటే? ఇప్పటికే తెలుగులో ఎన్నో రకాల క్రైమ్ థ్రిల్లర్ చిత్రాలు విడుదలై ప్రేక్షకులను అలరించాయి. అయితే దర్శకుడు రమాకాంత్‌ రెడ్డి.. సరికొత్త కాన్సెప్ట్‌తో ఈ సినిమాను తెరకెక్కించి ఆకట్టుకున్నాడు. ప్రథమార్థం మెుత్తం చిక్కుముడులతో నింపేసి.. ద్వితియార్థంలో వాటిని ఒక్కొక్కటిగా రివీల్‌ చేసుకుంటూ వెళ్లాడు. పిల్లల పెంపకం ఎలా ఉండాలి? ఎలా ఉండకూడదు? అన్న సెన్సిటివ్‌ కాన్సెప్ట్‌ను ఈ క్రైమ్‌ థ్రిల్లర్‌గా జోడించడం ప్రశంసనీయం. అయితే ఫస్ట్‌ హాఫ్‌ను ఆసక్తిగా నడిపించిన డైరెక్టర్‌.. సెకండాఫ్‌పై మాత్రం కాస్త పట్టుసడలించినట్లు అనిపిస్తుంది. ద్వితియార్థంలో(Kaliyugam Pattanamlo Movie Review) సినిమాపై ఆసక్తి క్రమంగా తగ్గుతూ వస్తుంది. కొన్ని సీన్లు మరి సాగదీతగా అనిపిస్తాయి. అయితే మంచి  క్లైమాక్స్‌తో ఆడియన్స్‌లో తిరిగి ఉత్తేజం తెప్పించాడు డైరెక్టర్‌. ఓవరాల్‌గా రమాకాంత్‌ రెడ్డి డైరెక్షన్‌కు మంచి మార్కులే ఇవ్వొచ్చు.  టెక్నికల్‌గా సాంకేతిక అంశాల విషయానికి వస్తే.. ప్రతీ విభాగం ప్రతిభ కనబరిచింది. ముఖ్యంగా చరణ్‌ సినిమాటోగ్రఫీ నైపుణ్యం సినిమాకు బాగా ప్లస్‌ అయ్యింది. చాలా సీన్లు లైవ్‌ లోకేషన్స్‌లో తెరకెక్కించడం వల్ల ఫ్రేమ్స్‌ చాలా సహజంగా కుదిరాయి. సంగీతం కూడా పర్వాలేదు. బ్యాగ్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌ను బాగా ఎలివేట్ చేసింది. నిర్మాణ విలువలు కూడా సినిమాకు తగ్గట్లు ఉన్నాయి. బడ్జెట్‌ విషయంలో నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్‌ కానట్లు కనిపిస్తోంది.  ప్లస్ పాయింట్స్ కథవిశ్వ కార్తికేయ నటనప్రథమార్ధం మైనస్ పాయింట్స్‌ సెకండాఫ్‌సాగదీత సన్నివేశాలు Telugu.yousay.tv Rating : 3/5
    మార్చి 29 , 2024
    Syed Sohel: నా సినిమా ఎందుకు చూడరంటూ వెక్కి వెక్కి ఏడ్చిన సోహెల్‌.. నెటిజన్లు ఫైర్‌!
    Syed Sohel: నా సినిమా ఎందుకు చూడరంటూ వెక్కి వెక్కి ఏడ్చిన సోహెల్‌.. నెటిజన్లు ఫైర్‌!
    తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్‌ (Bigg Boss Telugu) సీజన్‌-4లో తన ఆటతో ఆకట్టుకున్న సోహెల్‌ (Sohel).. బయటకొచ్చాక పలు సినిమాల్లో హీరోగా నటించాడు. ఆ చిత్రాలన్నీ యావరేజ్‌ టాక్‌ సొంతం చేసుకున్నాయి. ఈ క్రమంలోనే ఆయన తాజా చిత్రం ‘బూట్‌కట్‌ బాలరాజు’ (Bootcut Balaraju) కూడా శుక్రవారం (ఫిబ్రవరి 2న) థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా రిలీజ్‌ అనంతరం సోహెల్‌ చేసిన భావోద్వేగ వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. తన మనసులోని మాటలను బయటపెడుతూ కన్నీటి పర్యంతమయ్యాడు. అయితే సోహెల్‌ వ్యాఖ్యలను కొందరు సమర్థిస్తుంటే ఎక్కువ మంది విభేదిస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఇంతకీ ఆ వ్యవహారం ఏంటో ఇప్పుడు చూద్దాం. ‘నా సినిమాకు వెళ్లండన్నా’ ‘బూట్‌కట్‌ బాలరాజు’ను మంచి కథాంశంతో తీసినప్పటికీ ప్రేక్షకులు రాకపోవడంపై సోహెల్‌ భావోద్వేగానికి గురయ్యాడు. ‘ఫ్యామిలీ సినిమాలను ప్రజలు చూడాలని అనుకోవట్లేదా? నేను తమ్ముడు, చెల్లి, అక్క.. ఇలా కుటుంబ సభ్యులు అందరితో కలిసి చూసే సినిమాలే చేస్తున్నా. ఇది కూడా (బూట్‌కట్‌ బాలరాజు) అలాంటి సినిమానే. మూవీ చూసిన వారందరూ బాగానే ఎంజాయ్‌ చేస్తున్నారు. నా సినిమాకు వెళ్ళండి.. థియేటర్స్‌కు ఎందుకు వెళ్లడం లేదు? ఏమైంది?. బిగ్ బాస్‌లో ఉన్నపుడు వేల కామెంట్స్ పెట్టారు కదా సోహెల్ సోహెల్ అని .. ఇప్పుడెందుకు ఎంకరేజ్ చేయడం లేదు?’ అంటూ సోహెల్ అందరిని ప్రశ్నించాడు.  https://twitter.com/i/status/1753489890397098009 నెటిజన్ల రియాక్షన్‌ ఇదే! బిగ్‌ బాస్‌ హోస్ట్‌ నాగార్జున (Akkineni Nagarjuna) సినిమాలు చూసే వారే ప్రస్తుతం లేరు.. ఇక నీ మూవీ ఎవరు చూస్తారు సోహెల్‌ సాబ్‌ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.  తన సినిమాకు ప్రేక్షకులు రావాలంటూ సోహెల్‌ (Sohel) డిమాండ్‌ చేయడాన్ని పలువురు నెటిజన్లు తప్పుబడుతున్నారు. ఇలా మాట్లాడితే వచ్చేవారు కూడా రారంటూ కామెంట్స్ చేస్తున్నారు.  స్టార్‌ హీరో పవన్‌ కల్యాణ్‌ సినిమాలకే కంటెంట్‌ ఉన్న ఆడియన్స్‌ సరిగా వెళ్లడం లేదని నెటిజన్లు అంటున్నారు. మహేష్‌ ‘గుంటూరు కారం’కి కూడా ఆడియన్స్‌ రావట్లేదని అప్పట్లో ప్రొడ్యూసర్‌ ప్రెస్‌ పెట్టారని విషయాన్ని గుర్తు చేస్తున్నారు.  నటుడు సోహెల్‌ తన పద్ధతి మార్చుకోవాలని మరో నెటిజన్‌ సూచించాడు. నిన్ను సినిమా తియ్యమని మేము చెప్పామా? అంటూ ప్రశ్నించాడు. బిగ్‌బాస్‌ వరకూ ఓకే.. ప్రతీవాడు హీరో అయ్యి సినిమా చూడమంటే ఎలా అంటూ ప్రశ్నించాడు.  ఇండస్ట్రీలో సక్సెస్‌ రావాలంటే ఓపిక ఉండాలని ఓ నెటిజన్ అన్నాడు. పెద్ద బ్యాగ్రౌండ్‌ ఉన్న బెల్లంకొండ శ్రీనివాస్, అక్కినేని అఖిల్‌కే ఇప్పటివరకూ సరైన హిట్‌ రాలేదని పేర్కొన్నాడు. వాళ్లేమన్నా పబ్లిక్‌లోకి వచ్చి ఏడుస్తున్నారా? అంటూ ప్రశ్నించాడు. తన సినిమాలు ఎందుకు ప్రేక్షకులు ఎందుకు చూడట్లేదో కూర్చొని ఆలోచించుకోవాలని సోహెల్‌కు ఓ నెటిజన్‌ సూచించాడు. ఏడిస్తేనో.. బెదిరిస్తేనో చూస్తారనుకుంటే పొరపాటేనని చెప్పుకొచ్చాడు.  సోహెల్‌ ఫ్రస్టేషన్‌కు కారణమిదే! బిగ్‌బాస్‌ నుంచి బయటకొచ్చిన తర్వాత సోహెల్‌ (Sohel) వరుసగా మూడు సినిమాలు చేశాడు. ‘లక్కీ లక్ష్మణ్‌’, ‘ఆర్గానిక్ మామా.. హైబ్రీడ్‌ అల్లుడు’, ‘మిస్టర్‌ ప్రెగ్నెంట్‌’ వంటి చిత్రాలతో ప్రేక్షకులను పలకరించాడు. అయితే ఆ చిత్రాలు చెప్పుకోతగ్గ విజయం సాధించకపోవడంతో లేటెస్ట్ చిత్రం 'బూట్‌కట్‌ బాలరాజు' సోహేల్ అన్ని ఆశలు పెట్టుకున్నాడు. పైగా ఈ సినిమాకు సోహెల్‌ స్వయంగా నిర్మత కూడా. చిత్ర ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌కు కూడా సరిగా డబ్బులు లేకపోవడంతో యాంకర్‌ సుమ ఫ్రీగా ఈవెంట్‌కు హోస్ట్‌గా వ్యవహరించింది. ఇలా ఎన్నో ప్రయాశలకు ఓడ్చి తీసిన సినిమాకు తొలిరోజు ప్రేక్షకుల ఆదరణ లేకపోవడంతో సోహెల్‌ దిగ్భ్రాంతికి గురయ్యాడు. తన మనసులోని భావాలను బయటపెట్టాడు. 
    ఫిబ్రవరి 03 , 2024
    Latest OTT telugu Movies: ఈ వీకెండ్‌లో ఈ చిత్రాలను అస్సలు మిస్ కాకండి.. సూపర్బ్ థ్రిల్లింగ్ సినిమాలు
    Latest OTT telugu Movies: ఈ వీకెండ్‌లో ఈ చిత్రాలను అస్సలు మిస్ కాకండి.. సూపర్బ్ థ్రిల్లింగ్ సినిమాలు
    రీసెంట్‌గా చాలా సినిమాలు ఓటీటీల్లోకి స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వీటిలో థియేటర్లలో విడుదలై రెండు వారాలు గడవకముందే ఓటీటీలోకి వచ్చిన సినిమాలు ఉన్నాయి. మరికొన్ని నేరుగా ఓటీటీల్లోకి విడుదలైన వెబ్ సిరీస్‌లు ఉన్నాయి. ఇక్కడ అందిస్తున్న లిస్ట్‌లో దాదాపు అన్నింటికీ ప్రేక్షకుల నుంచి మంచి రివ్యూలు అందుకున్నవే ఉన్నాయి. మరి వీటిలో మీకు నచ్చిన జనర్‌ను ఎంచుకుని వీకెండ్‌ను ఎంజాయ్ చేయండి లవ్ మీ ఇఫ్ యు డేర్ మీ రౌడీ బాయ్స్ ఫేమ్ ఆశిష్, బేబీ మూవీ వైష్ణవి చైతన్య జంటగా నటించిన లేటెస్ట్‌ చిత్రం ‘లవ్‌ మీ’ (Love Me). ఇఫ్‌ యూ డేర్‌ (If You Dare) అనేది ఉప శీర్షిక. ఈ చిత్రాని అరుణ్‌  తెరకెక్కించారు. దిల్ రాజు (Dil Raju) ప్రొడక్షన్స్ బ్యానర్‌లో హన్షిత రెడ్డి, హర్షిత్ రెడ్డి నిర్మించారు. దెయ్యంతో హీరో ప్రేమలో పడితే ఎలా ఉంటుందన్న కాన్సెప్ట్‌తో ఈ మూవీని రూపొందించారు. మే 25న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మిక్స్డ్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. తాజాగా ఈ చిత్రం ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది. అమెజాన్ ప్రైమ్(జూన్ 15) వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. వీకెండ్‌లో కాస్త రొమాంటిక్ డోస్‌ కావాలనుకునే వారికి ఈ సినిమా మంచి ఛాయిస్ అని చెప్పవచ్చు. ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే... అర్జున్ (ఆశిష్), ప్రతాప్(రవికృష్ణ) కలిసి ఓ యూట్యూబ్ ఛానల్ నడుపుతూ ఉంటారు. దెయ్యాలు, ఆత్మలు, స్మశానాలకు సంబంధించిన వీడియోలు చేస్తుంటారు. ప్రతాప్‌ లవర్‌ ప్రియా (వైష్ణవి చైతన్య).. దివ్యవతి అనే దెయ్యం గురించి చెప్పడంతో ఆమె ఉంటున్న పాడుబడ్డ అపార్ట్‌మెంట్‌కు అర్జున్‌ వెళ్తాడు. అలా వెళ్లిన అర్జున్‌ దివ్యవతి ఆత్మతో ప్రేమలో పడతాడు. మరి ఆ దెయ్యం కూడా అర్జున్‌ ప్రేమలో పడుతుందా? అసలు ఈ దివ్యవతి ఎవరు? సినిమా ప్రారంభంలో నిప్పంటించుకొని చనిపోయిన కపుల్‌తో ఆమెకున్న సంబంధం ఏంటి? చివరికీ ఏమైంది? అన్నది కథ. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి విష్వక్‌ సేన్‌ (Vishwak Sen) హీరోగా డైరెక్టర్ కృష్ణ చైతన్య తెరకెక్కించిన తాజా చిత్రం ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ (Gangs of Godavari). నేహాశెట్టి హీరోయిన్‌. అంజలి కీలక పాత్ర పోషించింది. ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగ వంశీ నిర్మించారు.మే 31న  థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. కలెక్షన్ల పరంగా బ్రేక్ ఈవెన్ సాధించి విజయం అందుకుంది. ముఖ్యంగా విష్వక్ సేన్ మాస్ నటన ప్రేక్షకులను అలరించింది. నెహ శెట్టి, అంజలి గ్లామర్ తోడవడంతో (Gangs of Godavari Ott) ఆశించిన ఫలితం సాధించింది. అయితే థియేటర్లలో ఈ సినిమా మిస్‌ అయినవారు ఓటీటీలో వీక్షించే అవకాశం తాజాగా లభించింది. ప్రస్తుతం ఈ చిత్రం(జూన్ 14నుంచి) నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‌పామ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అప్పుడు మిస్ అయిన వారు ఈ వీకెండ్‌లో చూసి ఎంజాయ్ చేయండి.  ఇక ఈ సినిమా కథ విషాయానికొస్తే..  పని పాట లేకుండా ఖాళీగా తిరిగే లంకల రత్నం(విష్వక్‌ సేన్‌).. తమ ఊరి రాజకీయాల్లో జరుగుతున్న అన్యాయాన్ని చూస్తూ తట్టుకోలేకపోతాడు. రాజకీయాల్లోకి ప్రవేశించి ఆ వ్యవస్థను మార్చాలని నిర్ణయించుకుంటాడు. మంచి ఉద్దేశ్యంతో పాలిటిక్స్‌లోకి దిగిన అతడికి ఊహించని సవాళ్లు ఎదురవుతాయి. వాటిని ఎలా ఎదుర్కొన్నాడు? ప్రేమించిన అమ్మాయిని ఎలా సొంతం చేసుకున్నాడు? పాలిటిక్స్‌లో తన లక్ష్యాన్ని హీరో చేరుకున్నాడా? లేదా? అన్నది కథ. పారిజాత పర్వం సునీల్‌, శ్రద్ధాదాస్‌, చైతన్య రావు, మాళవిక సతీశన్‌ ప్రధాన పాత్రల్లో చేసిన చిత్రం 'పారిజాత పర్వం' (Paarijatha Parvam). సంతోష్‌ కంభంపాటి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి 'కిడ్నాప్‌ ఈజ్‌ ఏన్‌ ఆర్ట్‌' అని ఉపశీర్షిక పెట్టారు.  (ఏప్రిల్ 19న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా తాజాగా ఓటీటీలోకి వచ్చింది. ఈ సినిమా ప్రస్తుతం(జూన్ 12 నుంచి) ఆహా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. కామెడీ జనర్‌లో వచ్చిన ఈ సినిమా వీకెండ్‌లో చూసేందుకు మంచి ఛాయిస్‌గా చెప్పవచ్చు. ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే.. చైత‌న్య (చైత‌న్య‌రావు) డైరెక్టర్ కావాలని క‌ల‌లు కంటుంటాడు. స్నేహితుడ్ని (హ‌ర్ష‌) హీరోగా పెట్టి ఓ కథతో నిర్మాత‌ల చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతాడు. ఆ ప్రయత్నాలు సక్సెస్‌ కాకపోవడంతో చివ‌రికి తానే నిర్మాత‌గా మారి సినిమా తీయాల‌ని ఫిక్స‌వుతాడు. డ‌బ్బు కోసం శెట్టి (శ్రీ‌కాంత్ అయ్యంగార్‌) సెకండ్ సెట‌ప్‌ని కిడ్నాప్ చేయాల‌ని ప్లాన్‌ వేస్తాడు.  మ‌రోవైపు బారు శ్రీ‌ను (సునీల్‌), పారు (శ్ర‌ద్దా దాస్‌) కూడా ఆమెను కిడ్నాప్‌ చేసేందుకు స్కెచ్ వేస్తారు. మ‌రి ఈ ఇద్ద‌రిలో శెట్టి భార్య‌ని ఎవ‌రు కిడ్నాప్ చేశారు? అస‌లు బారు శ్రీ‌ను ఎవ‌రు? అతడి క‌థేంటి? చైతన్య డైరెక్టర్‌ అయ్యాడా? లేదా? అన్నది కథ.  యక్షిణి మంచు లక్షి, వేదిక ప్రధాన పాత్రల్లో నటించిన సోషియో ఫాంటసి & హారర్‌ సిరీస్‌ 'యక్షిణి'. కోటా బొమ్మాళి ఫేమ్ రాహుల్ విజయ్ హీరోగా చేశాడు. డైరెక్టర్ తేజ (Yakshini Ott) మార్ని రూపొందించిన ఈ సిరీస్‌.. నేరుగా డిస్నీ హాట్‌స్టార్‌లో జూన్ 14 విడుదలైంది. ఈ వెబ్‌ సిరీస్‌పై పాజిటివ్ సమీక్షలు అయితే వస్తున్నాయి. వీకెండ్‌లో మంచి హరర్‌ థ్రిల్లర్ సినిమా కావాలనుకునే వారు ఈ సిరీస్‌ను చూడవచ్చు. ఇక కథ విషయానికొస్తే.. యక్షిణిల రాజైన అయిన కుబేరుడు,  మాయ అనే దేవకన్యను (వేదిక)ను శపిస్తాడు. ఆమె తిరిగి అల్కపురికి వచ్చేందుకు 100 మందిని చంపాలని షరతు పెడుతాడు. దీంతో ఆమె అమాయకుడైన  కృష్ణ (రాహుల్ విజయ్)ని  ప్రేమిస్తున్నట్లు నాటకమాడి అతన్ని పెళ్లి చేసుకుంటుంది. అతన్ని చంపే క్రమంలో మహాకల్ (అజయ్) మహాకల్ అడ్డుపడుతాడు. ఇంతకు ఈ మహాకల్ ఎవరు? మాయకు ఎందుకు అడ్డుపడుతాడు? జ్వాలముఖి(మంచు లక్ష్మి) ఎలా ప్రవేశిస్తుంది? చివరకు మాయ తన స్వస్థలం అల్కాపురికి చేరుకుందా? లేదా? అనేది మిగతా కథ. పరువు నివేదా పేతురాజ్‌, నరేష్‌ అగస్య ప్రధాన పాత్రల్లో నటించిన సిరీస్‌ ‘పరువు’. సిద్దార్థ్ నాయుడు, వడ్లపాటి రాజశేఖర్ తెరకెక్కించిన ఈ సిరీస్‌లో నాగబాబు, ప్రణీత పట్నాయక్, బిందు మాధవి, అమిత్ తివారి ప్రముఖ పాత్రలు పోషించారు. జూన్ 14న ఈ వెబ్ సిరీస్ నేరుగా జీ5లో(Paruvu ott) విడుదలైంది. ఈ వెబ్ సిరీస్‌పైన మిక్స్‌డ్ రివ్యూస్ వస్తున్నాయి. పబ్లిక్ మాత్రం ఈ క్రైమ్ థ్రిల్లర్‌ను చూడొచ్చు అని అడ్వైజ్ చేస్తున్నారు. ఇక ఈ వెబ్ సిరీస్ కథ విషయానికొస్తే... పల్లవి(నివేదా పేతురాజ్), సుధీర్(నరేష్ అగస్త్య) ఒకరినొకరు ప్రేమించుకుంటారు. కులాలు వేరు కావడంతో పెద్దలు ఓప్పుకోరు. దీంతో ప్రేమ వివాహం చేసుకుంటారు. ఈక్రమంలో పల్లవి పెద్దనాన్న చనిపోవడంతో అతన్ని చూసేందుకు పల్లవి, సుధీర్ బయల్దేరుతారు. మార్గమాధ్యలో ఇద్దరు కలిసి పల్లవి బావ చందును చంపుతారు. ఇంతకు చందును వీరిద్దరు ఎందుకు చంపాల్సి వచ్చింది. ఆ తర్వాత వారికి ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి అనేది మిగతా కథ.
    జూన్ 15 , 2024
    Music Shop Murthy Review: లక్ష్యం కోసం 52 ఏళ్ల వ్యక్తి చేసే పోరాటం.. ‘మ్యూజిక్‌ షాప్‌ మూర్తి’ ఎలా ఉందంటే ?
    Music Shop Murthy Review: లక్ష్యం కోసం 52 ఏళ్ల వ్యక్తి చేసే పోరాటం.. ‘మ్యూజిక్‌ షాప్‌ మూర్తి’ ఎలా ఉందంటే ?
    నటీనటులు: అజయ్ ఘోష్, చాందిని చౌదరి, ఆమని, అమిత్ శర్మ, భాను చందర్, దయానంద్ రెడ్డి తదితరులు రచన, దర్శకత్వం: శివ పాలడుగు  సంగీతం: పవన్  సినిమాటోగ్రఫీ: శ్రీనివాస్‌ బెజుగం ఎడిటర్‌: బొంతల నాగేశ్వరరెడ్డి నిర్మాతలు: హర్ష గారపాటి & రంగారావు గారపాటి విడుదల తేది: జూన్‌ 14, 2024 టాలీవుడ్ విలక్షణ నటుడు అజయ్ ఘోష్ (Ajay Ghosh), క్యూట్ హీరోయిన్ చాందిని చౌదరి (Chandini Chowdary) ప్రధాన పాత్రలలో నటించిన లేటెస్ట్ మూవీ 'మ్యూజిక్ షాప్ మూర్తి' (Music Shop Murthy Review). శివ పాలడుగు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఫ్లై హై సినిమాస్ బ్యానర్‌పై హర్ష గారపాటి, రంగారావు గారపాటి గ్రాండ్‌గా నిర్మించారు. ఇప్పటికే విడుదలై ట్రైలర్, ప్రమోషన్‌ చిత్రాలు ఆడియన్స్‌ను ఆకర్షిస్తున్నాయి. జూన్ 14న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా? నటుడిగా అజయ్‌ ఘోష్‌ను మరో మెట్టు పైకి ఎక్కించిందా? ఇప్పుడు చూద్దాం.  కథేంటి మూర్తి (అజయ్‌ ఘోష్‌).. 52 ఏళ్ల వయసులో మ్యూజిక్‌ షాప్‌ నడుపుతుంటాడు. లాభాలు లేకున్నా అదే పని చేస్తుంటాడు. అయితే మూర్తికి డీజే అవ్వాలన్న కోరిక ఉంటుంది. మరోవైపు అమెరికా నుంచి వచ్చిన అంజన (చాందిని చౌదరి) కూడా డీజే కావాలని కలలు కంటుంది. అందులో శిక్షణ కూడా తీసుకుంటుంది. ఓ కారణం చేత మూర్తిని కలిసిన అంజన.. డీజే కావాలన్న అతడి ఆసక్తిని గమనించి నేర్పించేందుకు ఒప్పుకుంటుంది. అలా ఆమె వద్ద డీజే నేర్చుకొని హైదరాబాద్‌కు వచ్చిన మూర్తి.. ఎలాంటి కష్టాలు పడ్డాడు? అంజన తండ్రి.. మూర్తిపై ఎందుకు కేసు పెట్టాడు? ఫేమస్‌ డీజే డెవిల్‌ (అమిత్‌ శర్మ) మూర్తిని ఎలా అవమానించాడు? ఇంతకీ మూర్తి డీజేగా సక్సెస్‌ అయ్యాడా? లేదా? అన్నది కథ. ఎవరెలా చేశారంటే క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న అజయ్‌ ఘోష్‌.. మూర్తి పాత్రలో మరోమారు అదరగొట్టారు. మధ్యతరగతి వ్యక్తి పాత్రలో పూర్తిగా ఒదిగిపోయి నటించారు. ఓ పక్క తనదైన కామెడీతో నవ్విస్తూనే.. ఎమోషనల్‌ సీన్స్‌లో ఏడిపించారు. ఇక అంజన పాత్రకు హీరోయిన్‌ చాందిని పూర్తిగా న్యాయం చేసింది. మూర్తికి డీజే నేర్పించే క్రమంలో ఆమె చెప్పే డైలాగ్స్‌ ఆలోచింపజేస్తాయి. మూర్తి భార్యగా ఆమని చక్కటి నటన కనబరిచింది. అమిత్‌ శర్మ, భానుచందర్‌, దయానంద్‌ రెడ్డి, పటాస్‌ నాని తదితరులు తమ పాత్ర పరిధిమేరకు నటించి ఆకట్టుకున్నారు.  డైరెక్షన్ ఎలా ఉందంటే దర్శకుడు శివ పాలడుగు.. మూర్తి పాత్రకు అజయ్‌ ఘోష్‌ను ఎంచుకోవడం ద్వారానే సగం విజయం సాధించేశారు. కథలో పెద్దగా మెరుపులు లేనప్పటికీ ఎమోషనల్‌గా సినిమాను నడిపి ఆకట్టుకున్నారు. ప్రారంభంలో కథ స్లోగా నడుస్తున్నట్లు అనిపించినా.. పది నిమిషాలకే అందరు కథలో లీనమవుతారు. ఫస్టాఫ్‌లో మూర్తి ఫ్యామిలీ కష్టాలతో పాటు డీజే సాధన వంటివి చూపించారు. ఇక సెకండాఫ్‌ను ఫన్‌ & ఎమోషనల్‌గా నడిపి దర్శకుడు ఆకట్టున్నారు. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్‌లో వచ్చే సన్నివేశాలు కన్నీళ్లు తెప్పిస్తాయి. అయితే ప్రధానమైన క్లైమాక్స్‌ ఇంకాస్త బెటర్‌గా రాసుకొని ఉంటే బాగుండేది. ఓవరాల్‌గా 52 ఏళ్ల మూర్తి.. తన లక్ష్యం కోసం చేసే పోరాటం అందర్నీ మెప్పిస్తుంది.  టెక్నికల్‌గా..  సాంకేతిక అంశాల విషయానికి వస్తే.. అన్ని విభాగాలు మంచి పనితీరు కనబరిచాయి. ముఖ్యంగా పవన్‌ అందించిన సంగీతం సినిమాకు చాలా బాగా ప్లస్‌ అయ్యింది. అతడు అందించిన నేపథ్య సంగీతం.. భావోద్వేగ సన్నివేశాలను మరింత హత్తుకునేలా చేసింది. సినిమాటోగ్రఫీ ఓకే. ఎడిటింగ్‌ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. ప్లస్‌ పాయింట్స్‌ అజయ్‌ ఘోష్‌ నటనభావోద్వేగ సన్నివేశాలుప్రీ క్లైమాక్స్‌ మైనస్‌ పాయింట్స్‌ స్లో నారేషన్‌క్లైమాక్స్‌ Telugu.yousay.tv Rating : 3/5   https://telugu.yousay.tv/top-secrets-you-dont-know-about-telugu-beauty-chandini-chowdary.html
    జూన్ 14 , 2024
    New OTT Releases Telugu: ఈ వారం థియేటర్లు, ఓటీటీల్లో విడుదలయ్యే చిత్రాలు, సిరీస్‌లు ఇవే!
    New OTT Releases Telugu: ఈ వారం థియేటర్లు, ఓటీటీల్లో విడుదలయ్యే చిత్రాలు, సిరీస్‌లు ఇవే!
    ప్రతీ శుక్రవారం టాలీవుడ్‌లో కొత్త సినిమాలు రిలీజ్‌ అవుతూ ప్రేక్షకులను అలరిస్తుంటాయి. అయితే గత కొన్ని వారాలుగా పెద్ద హీరోల సినిమాలు ఒక్కటి కూడా విడుదల కాలేదు. ఈ వారం కూడా అదే రిపీట్‌ కానుంది. ఈ వీకెండ్‌ కూడా ప్రేక్షకులను అలరించేందుకు చిన్న చిత్రాలు, తమిళ డబ్బింగ్‌ మూవీస్‌ రాబోతున్నాయి. అటు ఓటీటీలోనూ కొత్త చిత్రాలు, సిరీస్‌లు మిమ్మల్ని ఎంటర్‌టైన్‌ చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. థియేటర్లలో రిలీజయ్యే చిత్రాలు హరోం హర సుధీర్‌బాబు హీరోగా జ్ఞానసాగర్‌ ద్వారక దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'హరోం హర' (Harom Hara). మాళవిక శర్మ హీరోయిన్‌. సునీల్‌, రవి కాలే, కేశవ్‌ దీపక్, రాజశేఖర్‌ అనింగి ముఖ్య పాత్రలు పోషించారు. జూన్‌ 14న ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది. 1989 నేపథ్యంలో జరిగే కథ ఇదని, అప్పటి వాతావరణాన్ని కళ్లకు కట్టినట్లుగా ప్రెజెంట్‌ చేసినట్లు చిత్ర యూనిట్‌ తెలిపింది. ఇప్పటికే విడుదలై ట్రైలర్‌, టీజర్ ఆకట్టుకుంటున్నాయి. రాయణ్‌  తమిళ స్టార్‌ హీరో ధనుష్‌ (New OTT Releases Telugu) నటించిన లేటెస్ట్‌ చిత్ర 'రాయణ్‌' (Raayan). ధనుష్‌ స్వీయ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో దుషారా విజయన్‌ హీరోయిన్‌గా చేసింది. సందీప్‌ కిషన్‌, ఎస్‌.జే. సూర్య, అపర్ణ బాలమురళి, నిత్యా మీనన్‌, కాళిదాస్‌ జయరామ్ ముఖ్య పాత్రలు పోషించారు. జూన్‌ 13న ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది.  ఇంద్రాణి  యానీయా, అంకిత, అజయ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'ఇంద్రాణి' (Indrani). ఈ చిత్రం స్టీఫెన్‌ పల్లం స్వీయ దర్శక నిర్మాణంలో రూపొందింది. జూన్‌ 14న ఈ చిత్రం ధియేటర్లలో రిలీజ్‌ కాబోతోంది. టైం ట్రావెల్‌ కాన్సెప్ట్‌తో ఈ మూవీని రూపొందించినట్లు చిత్ర యూనిట్‌ తెలిపింది. వందేళ్ల తర్వాత టెక్నాలజీ పరంగా వచ్చే మార్పులేంటి? అన్నది ఇందులో చూడవచ్చని చెప్పింది.  మ్యూజిక్‌ షాప్‌ మూర్తి టాలీవుడ్ విలక్షణ నటుడు అజయ్ ఘోష్, క్యూట్ హీరోయిన్ చాందిని చౌదరి ప్రధాన పాత్రలలో నటించిన లేటెస్ట్ మూవీ 'మ్యూజిక్ షాప్ మూర్తి' (Music Shop Murthy). శివ పాలడుగు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఫ్లై హై సినిమాస్ బ్యానర్‌పై హర్ష గారపాటి, రంగారావు గారపాటి గ్రాండ్‌గా నిర్మించారు. జూన్ 14న (New OTT Releases Telugu) గ్రాండ్‌ ఈ సినిమా విడుదల కానుంది. 'ఓ మిడిల్ క్లాస్ వ్యక్తి తన కలను నెరవేర్చుకోవడానికి వయసుతో సంబంధం లేదు' అనే కాన్సెప్ట్‌తో ఈ మూవీ రూపొందింది. మహారాజా (తెలుగు డబ్‌) తమిళ స్టార్ హీరో విజయ్‌ సేతుపతి నటించిన 'మహా రాజా' (Maha Raja).. ఈ వారమే విడుదల కానుంది. నిథిలాన్‌ స్వామినాథన్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో మమతా మోహన్‌ దాస్‌, అనురాగ్‌ కశ్యప్‌, మునీశ్‌ కాంత్‌ ముఖ్య పాత్రలు పోషించారు. అజనీష్‌ లోక్‌నాథ్‌ సంగీతం సమకూర్చారు. జూన్‌ 14న తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమా రిలీజ్‌ కానుంది.  ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి విష్వక్‌ సేన్‌ హీరోగా నటించిన ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ (Gangs Of Godavari) చిత్రం ఈ వారమే ఓటీటీలోకి రానుంది. నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా జూన్‌ 14 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ఈ మేరకు సదరు ఓటీటీ సంస్థ (OTT Releases This Week Telugu) పోస్టర్‌ విడుదల చేసింది. తెలుగుతో పాటు తమిళ్‌, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సినిమా అందుబాటులో ఉండనుంది. కృష్ణ చైతన్య దర్శకత్వం వహించిన ఈ సినిమా మే 31 థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంది.  పారిజాత పర్వం చైతన్య రావు, శ్రద్ధా దాస్ నటించిన క్రైమ్ కామెడీ చిత్రం ‘పారిజాత పర్వం’ (Paarijatha Parvam) ఓటీటీలోకి వస్తోంది. ఏప్రిల్ 19న థియేటర్లలో రిలీజై.. మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీని రెండు నెలల తర్వాత ఈ వారం ఓటీటీలోకి తీసుకొస్తున్నారు. జూన్ 12 నుంచి ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్‌ చేయనున్నట్లు 'ఆహా' (OTT Releases This Week Telugu) అధికారికంగా ప్రకటించింది. కంభంపాటి సంతోష్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో సునీల్‌, హర్ష కీలక పాత్రలు చేశారు.  TitleCategoryLanguagePlatformRelease DateTour Day France Unchained S2SeriesEnglishNetflixJune 11My Next Guest S2SeriesEnglishNetflixJune 12Mysteries Of The Terracotta WarriorsMovieEnglishNetflixJune 12Doctor ClimaxSeriesEnglishNetflixJune 13Gangs Of GodavariMovieTeluguNetflixJune 14Maha RajMovieHindiNetflixJune 14Protecting ParadiseMovieEnglishDisney + HotstarJune 10The Colour Of VictorySeriesEnglishDisney + HotstarJune 10Not Dead At S2SeriesEnglishDisney + HotstarJune 12Gaanth Chapter 1SeriesHindiJio CinemaJune 11GroundMovieTeluguAmazonJune 10The Boys Season 4SeriesTeluguAmazonJune 13Paarijatha ParvamMovieTeluguAhaJune 12Kurangu PedalSeriesTamilAhaJune 14Love Ki Arrange MarriageMovieHindiZee 5June 14ParuvuSeriesTeluguZee 5June 14
    జూన్ 10 , 2024
    Top 10 Malayalam Movies: మీకు మలయాళ చిత్రాలంటే ఇష్టమా? అక్కడ టాప్‌-10 మూవీస్‌ ఇవే!
    Top 10 Malayalam Movies: మీకు మలయాళ చిత్రాలంటే ఇష్టమా? అక్కడ టాప్‌-10 మూవీస్‌ ఇవే!
    టాలీవుడ్‌లో మలయాళ చిత్రాల హవా మెుదలైంది. ఆ ఇండస్ట్రీకి చెందిన పలు చిత్రాలు ఇటీవలే విడుదలై మంచి విజయాలను సాధిస్తున్నాయి. ఇటీవల విడుదలైన ప్రేమలు సినిమా మలయాళం నుంచి డబ్బింగై తెలుగులో కలెక్షన్ల వర్షం కురిపించింది. తెలుగులో ఏకంగా రూ.15 కోట్లకు పైగా గ్రాస్‌ సాధించి ఇక్కడ ఈ స్థాయిలో వసూళ్లు రాబట్టిన తొలి మలయాళ చిత్రంగా చరిత్ర సృష్టించింది. తాజాగా మరో మలయాళ బ్లాక్ బాస్టర్‌ ‘మంజుమ్మల్‌ బాయ్స్‌’ కూడా తెలుగులో విడుదలై సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో కలెక్షన్ల పరంగా మలయాళంలో వచ్చిన టాప్‌-10 చిత్రాలు ఏవో ఇప్పుడు చూద్దాం.  మంజుమ్మల్‌ బాయ్స్‌ గత నెల ఫిబ్రవరి 22న రిలీజైన ఈ (Manjummel Boys) చిత్రం మలయాళంలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. సుమారు రూ.20 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం.. ఇప్పటివరకూ రూ.214 కోట్ల గ్రాస్‌ సాధించి సంచలనం సృష్టించింది. ఈ స్థాయి కలెక్షన్స్‌ రాబట్టిన తొలి చిత్రంగా ‘మంజుమ్మల్‌ బాయ్స్‌’ నిలిచింది. 2006లో కొడైకెనాల్‌లోని గుణకేవ్‌లో చిక్కుకున్న తమ స్నేహితుణ్ణి మంజుమ్మల్‌ యువకులు ఎలా కాపాడారు? అన్న కాన్సెప్ట్‌తో ఈ సినిమా రూపొందింది. ఏప్రిల్‌ 6 తెలుగులోనూ రిలీజ్ కాబోతోంది. 2018 2018లో వచ్చిన కేరళ వరదల నేపథ్యంలో ఈ సినిమా రూపొందింది. రూ.26 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం 2023లో విడుదలై ఏకంగా రూ.175.5 కోట్ల వసూళ్లను సాధించింది. అటు తెలుగులోనూ డబ్‌ అయ్యి ఇక్కడా కూడా హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. జూడ్ ఆంథనీ జోసేఫ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో టోవినో థామస్‌, కున్‌చకో బొబన్‌, అపర్ణా బాలమురళి ముఖ్య పాత్రలు పోషించారు. ‘మంజుమ్మల్‌ బాయ్స్‌’ ముందు వరకూ మలయాళంలో అత్యధిక కలెక్షన్ల రికార్డు ఈ మూవీ పేరునే ఉండేది.  పులిమురుగన్‌ మలయాళంలోని స్టార్‌ హీరోల్లో మోహన్‌లాల్‌ (Mohan Lal) ఒకరు. ఆయన నటించిన ‘పులిమురుగన్‌’ (Pulimurugan) చిత్రం.. 2016లో విడుదలై ఏకంగా రూ.152 కోట్ల గ్రాస్‌ వసూళ్లను రాబట్టింది. రూ.25 కోట్ల బడ్టెట్‌తో రూపొందిన ఈ సినిమా.. ఆరు రెట్లు కలెక్షన్స్‌ రాబట్టి అందర్నీ ఆశ్చర్యపరిచింది. 2016-2023 మధ్య ఏడేళ్ల పాటు మలయాళంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా పులిమురుగన్‌ కొనసాగింది. అటు తెలుగులోను ‘మన్యంపులి’ (Manyam Puli) పేరుతో ఈ చిత్రం విడుదలై హిట్‌ టాక్‌ దక్కించుకోవడం విశేషం. ఈ చిత్రానికి వైశాక్‌ దర్శకత్వం వహించారు.  ప్రేమలు (Premalu) నస్లేన్‌ కె. గఫూర్‌, మ్యాథ్యూ థామస్‌, మమిత బైజు తదితరులు ప్రధాన పాత్రల్లో గిరీష్‌ ఎ. డి తెరకెక్కించిన మలయాళ చిత్రం 'ప్రేమలు' (Premalu). ఫిబ్రవరి 9న మలయాళంలో విడుదలైన ఈ సినిమాకు ఆడియన్స్‌ నుంచి ఊహించని రెస్పాన్స్ వచ్చింది. కేవలం రూ.3 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా.. ఏకంగా రూ.130 కోట్ల గ్రాస్ సాధించి.. మలయాళంలో అత్యధిక వసూళ్లు సాధించిన నాల్గో చిత్రంగా నిలిచింది. అటు టాలీవుడ్‌లో ఈ సినిమాకు విశేష ఆదరణ దక్కింది. ఈ సినిమా షూటింగ్‌ ఎక్కువగా హైదరాబాద్‌లో జరగడంతో తెలుగు ఆడియన్స్‌ ఈ సినిమాను ఓన్‌ చేసుకున్నారు.   లూసిఫర్‌  2019లో మోహన్‌లాల్‌ (Mohan lal) హీరోగా వచ్చిన లూసిఫర్‌ (Lucifer) కూడా రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి మలయాళంలో ఈ స్థాయి కలెక్షన్స్‌ వసూలు చేసిన ఐదో చిత్రంగా నిలిచింది. ఈ సినిమాకు సలార్ ఫేమ్‌ పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ దర్శకత్వం వహించాడు. రూ.30 కోట్ల బడ్జెట్‌తో ఈ మూవీ రూపొందగా.. రూ.127 కోట్ల గ్రాస్‌ వచ్చింది. ఈ సినిమానే తెలుగులో ‘గాడ్ ఫాదర్‌’ (Godfather) పేరుతో మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) రీమేక్ చేయడం గమనార్హం.  నెరు  గతేడాది వచ్చిన నెరు (Neru) సినిమా మలయాళంలో బ్లాక్‌ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో మోహన్‌లాల్‌ లాయర్‌గా నటించాడు. రూ.12 బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం రూ.86 కోట్ల గ్రాస్ సాధించింది. అత్యాచారానికి గురైన ఓ అంధ యువతికి ఓ లాయర్‌ అండగా నిలబడి ఎలా న్యాయం చేశాడు? అన్న కథాంశంతో దర్శకుడు జీతు జోసెఫ్‌ ఈ సినిమాను రూపొందించారు. ఈ సినిమా తెలుగు డబ్బింగ్‌ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది.  భీష్మ పర్వం మమ్ముట్టి (Mammootty) హీరోగా 2022లో వచ్చిన ‘భీష్మ పర్వం’ (Bheeshma Parvam) కూడా మలయాళ ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. రూ.15 కోట్ల బడ్జెట్‌తో వచ్చిన ఈ సినిమా రూ.85 కోట్లు (గ్రాస్‌) రాబట్టి ఈ జాబితాలో ఏడో చిత్రంగా నిలిచింది. ఈ సినిమాకు అమల్‌ నీరద్‌ దర్శకత్వం వహించగా మమ్ముట్టితో పాటు నదియా, అనసూయ, నెడుముడి వేణు ముఖ్య పాత్రలు పోషించారు.  ఆర్‌డీఎక్స్‌ రాబర్ట్ (R), డానీ (D), జేవియర్‌ (X) అనే ముగ్గురు స్నేహితుల్లో జీవితాల్లో జరిగిన సంఘటనల సమాహారమే ఈ చిత్రం. గతేడాది విడుదలైన ఈ సినిమా మలయాళంలో సూపర్‌హిట్‌గా నిలిచింది. రూ.8 కోట్ల బడ్జెట్‌కు గాను రూ.84.55 వసూళ్లను రాబట్టి ఆశ్చర్యపరిచింది. ఈ సినిమాకు కథ, దర్శకత్వం నిహాస్‌ హిదయనాథ్ అందించారు.  కన్నూర్‌ స్క్వాడ్‌ మమ్ముట్టి హీరోగా చేసిన్న ‘కన్నూర్‌ స్క్వాడ్‌’ (Kannur Squad) చిత్రం కూడా కలెక్షన్ల పరంగా తొమ్మిదో స్థానంలో నిలిచింది. ఈ సినిమా బడ్జెట్‌ రూ.10 కోట్లు. విడుదల అనంతరం ఈ సినిమా రూ.82 కోట్ల గ్రాస్‌ రాబట్టింది. కేరళలోని కన్నూర్‌లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా దర్శకుడు రోబీ వర్గీస్‌ రాజ్‌ ఈ మూవీని రూపొందించారు. ప్రముఖ ఓటీటీ వేదిక హాట్‌స్టార్‌లో ఈ సినిమా తెలుగులో స్ట్రీమింగ్‌ అవుతోంది.  కురుప్‌ దుల్కార్‌ సల్మాన్‌ (Dulquer Salmaan) హీరోగా చేసిన ‘కురుప్‌’ (Kurup) చిత్రం.. కలెక్షన్స్‌ పరంగా మలయాళంలో టాప్‌-10లో నిలిచింది. ఈ సినిమా బడ్జెట్‌ రూ.35 కోట్లు. ఓవరాల్‌గా ఈ సినిమాకు రూ.81 కోట్ల గ్రాస్‌ వచ్చింది. కేరళలో ఫేమస్‌ క్రిమినల్‌ సుకుమార కురుప్పు జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. శ్రీనాథ్‌ రాజేంద్రన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హీరోయిన్‌గా శోభితా దూళిపాళ్ల (Sobhita Dhulipala) నటించింది. 
    మార్చి 29 , 2024
    Oscar Award Winning Movies 2024: ఆస్కార్‌ గెలిచిన ఈ సినిమాలు ఎందుకు చూడాలంటే?
    Oscar Award Winning Movies 2024: ఆస్కార్‌ గెలిచిన ఈ సినిమాలు ఎందుకు చూడాలంటే?
    సాధారణంగా అవార్డ్ విన్నింగ్ సినిమా అంటే సినీ ప్రేమికులు చూసేందుకు ఇష్టపడతారు. ఇక ఆస్కార్ దక్కించుకున్న సినిమా అంటే వారి ఆసక్తి ఇక ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయా చిత్రాలు అవార్డు సాధించేంత స్పెషాలిటీ ఆ సినిమాల్లో ఏముందోనని తెలుసుకునేందుకు వారు తెగ వెతికేస్తుంటారు. తాజాగా అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో అంగరంగ వైభవంగా అస్కార్‌ వేడుకలు జరిగాయి. ఇందులో 10 చిత్రాలు వివిధ విభాగాల్లో అవార్డులను సొంతం చేసుకున్నాయి. ఆయా చిత్రాల విశేషాలను YouSay మీ ముందుకు తెచ్చింది. అంతేకాకుండా ఆస్కార్‌కు నామినేట్ అయినా చిత్ర వివరాలను సైతం ఈ కథనంలో పొందుపరిచింది. ఆయా సినిమాల కథ, ఏ ఓటీటీ వేదికలో స్ట్రీమింగ్ అవుతోంది అన్న విషయాలను ఇప్పుడు పరిశీలిద్దాం.  ఆస్కార్‌ గెలిచిన చిత్రాలు ఓపెన్ హైమర్ (Oppenheimer) అందరూ ఊహించనట్లే ఈసారి 'ఓపెన్ హైమర్' చిత్రానికి ఏకంగా ఏడు పురస్కారాలు దక్కాయి. ఈ చిత్రానికి హాలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్‌ క్రిస్టోపర్‌ నోలాన్‌ (Christopher Nolan) దర్శకత్వం వహించారు. కథ విషయానికి వస్తే ఈ సినిమా.. ప్రముఖ అమెరికన్‌ సైంటిస్ట్ జె. రాబర్ట్‌ ఓపెన్‌హైమర్‌ జీవిత కథ ఆధారంగా రూపొందింది. ఫాదర్‌ ఆఫ్‌ ఆటమ్‌ బాంబ్‌గా అతడి జర్నీ ఎలా మెుదలైంది? అసలు అణుబాంబును అమెరికా ఎందుకు తయారు చేయాల్సి వచ్చింది? జపాన్‌లోని హీరోషిమా - నాగసాకిపైనే వారు ఎందుకు దాడి చేశారు? ఆ దాడి తర్వాత ఓపెన్‌హైమర్‌ మానసిక పరిస్థితి ఎలా ఉండేది? ఆపే అతని జీవితంలో ఎలాంటి మార్పులు చోటుచేసుకున్నాయి? అన్నది స్టోరీ. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో రెంటల్ బేసిస్ తో చూడొచ్చు. అయితే మార్చి 21 నుంచి జియో సినిమాలో ఉచితంగా స్ట్రీమింగ్ కానుంది. బార్బీ (Barbie) గ్రెటా గర్‌విగ్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఒక  ఫాంటసీ కామెడీ ఫిల్మ్. ఒక ట్రాన్స్ జెండర్ ఓ బార్బీ మధ్య జరిగే కథ ఇది. బార్బీ డాల్స్ కోసం నిజంగా ఒక లోకం ఉంటే... తన లోకం వదిలి సదరు బార్బీ డాల్ భూలోకంలో అడుగు పెడితే ఎలా ఉంటుంది. బార్బీ డాల్ పట్ల మనుషుల ప్రవర్తన ఎలా ఉంటుంది. అసలు బార్బీ తన ప్రపంచం వదిలి భూలోకంలోకి ఎందుకు వచ్చింది? వంటి విషయాల సమాహారమే ఈ మూవీ. అవుట్ అండ్ అవుట్ కామెడీ రొమాంటిక్ ఎంటర్టైనర్‌గా ‘బార్బీ’ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రాన్ని ‘జియో సినిమా’ ఓటీటీ వేదికలో వీక్షించవచ్చు.  పూర్‌ థింగ్స్‌ (Poor Things) ఈ సినిమా కథలోకి వెళ్తే.. అసాధారణ శాస్త్రవేత్త గాడ్విన్‌ బాక్స్‌టర్‌.. చనిపోయిన యువతికి తిరిగి జీవం పోస్తాడు. ఆమె మెదడును కడుపులో ఉన్న బిడ్డతో అనుసంధానం చేస్తాడు. దీంతో శిశువు తెలివితేటలు అసాధారణంగా పెరిగిపోతాయి. బయటి ప్రపంచం గురించి తెలుసుకోవాలన్న ఆసక్తితో ప్రయాణం మెుదలు పెడుతుంది. ఈ క్రమంలో ఆమెకు అనూహ్య పరిస్థితులు ఎదురవుతాయి. చివరికీ ఏమైంది? అన్నది స్టోరీ. ఈ చిత్రాన్ని డిస్నీ + హాట్‌స్టార్‌లో చూడవచ్చు.  అమెరిన్‌ ఫిక్షన్‌ (American Fiction) అమెరికన్‌ ఫిక్షన్ సినిమా.. ఓ నవలా రచయిత చుట్టూ తిరుగుతుంది. కథలోకి వెళ్తే.. మాంక్‌ ఒక తెలివైన గొప్ప నవలా రచయిత. అతడి నవలలకు అకాడెమిక్‌ ప్రశంసలు లభించినా ప్రచురణకు మాత్రం పెద్దగా నోచుకోవు. నల్లజాతీయుడు కావడం చేత మాంక్‌కు కొన్ని ఇబ్బందులు ఎదురవుతుంటాయి. దీంతో విసుగు చెందిన మాంక్‌.. మనసు లోతుల్లో ఎప్పటి నుంచో దాగున్నా అభిప్రాయాలను ఓ పుస్తకం ద్వారా ప్రపంచానికి తెలియజేయాలని నిర్ణయించుకుంటాడు. ఈ క్రమంలో మాంక్‌కు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? అన్నది కథ. ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది.  అనాటమి ఆఫ్‌ ఏ ఫాల్‌ (Anatomy of a Fall) ఈ సినిమా మిస్టరీ క్రైమ్‌ థ్రిల్లర్‌గా రూపొందింది. కథలోకి వెళ్తే.. శామ్యుల్‌, శాండ్రా భార్య భర్తలు. వారిద్దరు తమ బిడ్డ డానియేల్‌తో కలిసి సంతోషంగా జీవిస్తుంటారు. ఓ రోజు అనుమానస్పద స్థితిలో శామ్యుల్‌ చనిపోతాడు. పోలీసులు అతడి భార్య శాండ్రాపై అనుమానం వ్యక్తం చేస్తారు. పోలీసుల దర్యాప్తులో ఎలాంటి విషయాలు వెలుగు చూశాయి? శామ్యుల్‌ను హత్య చేసింది ఎవరు? అన్నది కథ. ఈ సినిమా అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది.  ది జోన్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌  (The Zone of Interest) కమాండెంట్‌ రూడొల్ఫ్‌ హాస్‌ తన భార్య, పిల్లలతో కలిసి చెరువుకు ఆనుకొని ఉన్న ఇంటిలో జీవిస్తుంటాడు. అతడి ఇంటి ఆవరణలో ఉండే గార్డెన్‌లో కొందరు బానిసలు పనిచేస్తుంటారు. ఓ రోజు చెరువులో తన పిల్లల మృతదేహాలు రుడోల్ఫ్‌కు కనిపిస్తాయి. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది కథ. ఈ సినిమా అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌లో ఉంది.  ది హోల్డోవర్స్‌ (The Holdovers) టీచర్‌, స్టూడెంట్‌కు మధ్య ఉండే సంబంధాలను ఈ చిత్రం ప్రతిబింబిస్తుంది. ప్రిపరేషన్‌ స్కూల్‌లో క్రాంకీ హిస్టరీ టీచర్‌గా పనిచేస్తుంటాడు. అతడంటే విద్యార్థులకు చాలా భయం. స్కూల్‌కు క్రిస్మస్‌ సెలవులు రావడంతో కొందరు విద్యార్థులు హాలీడేస్‌కు వెళ్లలేకపోతారు. వారికి గార్డియన్‌గా క్రాంకీ ఉండాల్సి వస్తుంది. ఈ క్రమంలో టీచర్‌కు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? అన్నది స్టోరీ. ఈ చిత్రాన్ని అమెజాన్‌ ప్రైమ్‌లో రెంటల్ విధానంలో చూడవచ్చు.  మ్యాస్ట్రో (Maestro) ఈ చిత్రం అద్భుతమైన ప్రేమ కావ్యంగా రూపొందింది. కండక్టర్‌ - స్వరకర్త లియోనార్డ్ బెర్న్‌ స్టెయిన్‌ ఓ కార్యక్రమంలో నటి ఫెలిసియాను చూసి మనసు పడతాడు. ఆమె కూడా అతడ్ని ఇష్టపడటంతో ఇద్దరూ డేటింగ్‌కు వెళ్తారు. ఆ తర్వాత పెళ్లి కూడా చేసుకుంటారు. వారి వైవాహిక బంధం ఎంత మధురంగా సాగింది? ఈ ప్రయాణంలో వారికి ఎదురైన సమస్యలు ఏంటి? వాటిని ఎలా అధిగమించారు? అన్నది కథ. ప్రస్తుతం ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌లో ఉంది.  కిల్లర్‌ ఆఫ్‌ ద ఫ్లవర్‌ మూన్‌ (Killers of the Flower Moon) లియోనార్డో డికాప్రియో ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా.. గతేడాది విడుదలై ఘన విజయం సాధించింది. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. 1920లో ఒక్లాహోమాలోని ఓసేజ్‌ నేషన్ ల్యాండ్‌ కింద చమురు బయటపడుతుంది. ఆ తర్వాత నుంచి ఆ ప్రాంత ప్రజలు ఒక్కొక్కరుగా చనిపోతూ ఉంటారు. ఈ మిస్టరీని ఛేదించేందుకు ఎఫ్‌బీఐ రంగంలోకి దిగుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది ప్లాట్‌. ప్రస్తుతం ఈ సినిమా ఆపిల్‌ టీవీ ప్లస్‌లో అందుబాటులో ఉంది. ఆస్కార్‌ నామినేషన్స్‌లో నిలిచిన చిత్రాలు ఆస్కార్ గెలిచిన చిత్రాలతో పాటు ఈ అవార్డుల రేసులో నిలిచిన మరికొన్ని చిత్రాల విశిష్టతను ఓసారి తెలుసుకుందాం. పాస్ట్ లైవ్స్‌ (Past Lives) నోరా, హే సంగ్ అనే ఇద్దరు చిన్ననాటి స్నేహితులు. నోరా కుటుంబం దక్షిణ కొరియాకు వెళ్లిపోవడంతో వారు విడిపోతారు. ఇరవై సంవత్సరాల తర్వాత వారు తమ ఒకరికొరు ప్రేమలు ఉన్నట్లు గ్రహిస్తారు. వారు తిరిగి ఎలా ఒక్కటయ్యారు? అన్నది స్టోరీ. ఈ సినిమాను కూడా అమెజాన్‌ ప్రైమ్‌లో రెంటల్‌ విధానంలో చూడవచ్చు. ఈ చిత్రం అమెజాన్‌ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. సొసైటీ ఆఫ్‌ ది స్నో (Society of the Snow) రగ్బీ బృందంతో ప్రయాణిస్తున్న విమానం.. ప్రమాదవశాత్తు ఆండీస్‌ మంచు పర్వతాల్లో కుప్పకూలుతుంది. ఈ ప్రమాదం నుండి కొందరు ప్రయాణికులు బయటపడతారు. అత్యంత కష్టతరమైన వాతావరణంలో తమ ప్రాణాలను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తారు. బాహ్య ప్రపంచానికి తాను బతికే ఉన్నామని చెప్పేందుకు వివిధ రకాలు అన్వేషిస్తారు. మరి వారు ప్రాణాలతో బయటపడ్డారా? లేదా? అన్నది కథ. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది.  లో క్యాపిటనో (Lo Capitano) వలసదారులు పడే కష్టాలకు ఈ చిత్రం అద్దం పడుతుంది. ఇద్దరు నల్లజాతి యువకులు యువకులు చేసే సాహస యాత్రనే ఈ చిత్రం కథ. యూరప్ చేరుకోవడానికి డాకర్ నుండి ఇద్దరు యువకులు సెడౌ, మౌసా బయలుదేరుతారు. గమ్యాన్ని చేరుకునే క్రమంలా వారికి ఎలాంటి కఠిన పరిస్థితులు ఎదురయ్యాయి. వాటిని ఎలా అధిగమించారు? చివరికి వారు యూరప్‌ చేరుకున్నారా? లేదా? అన్నది ప్లాట్‌.  పర్‌ఫెక్ట్‌ డేస్‌ (Perfect Days) ఆస్కార్‌ నామినేషన్‌లో నిలిచి ఈ చిత్రం అందరి దృష్టిని ఆకర్షించింది. హిరాయామా అనే వ్యక్తి టోక్యోలో టాయిలెట్ క్లీనర్‌గా పని చేస్తూ సంతృప్తికరమై జీవితాన్ని అనుభవిస్తుంటాడు. క్యాసెట్ టేపులలో సంగీతాన్ని వింటూ, పుస్తకాలు చదువుతూ హాయిగా రోజులు గడుపుతుంటాడు. కొన్ని ఊహించని ఘటనలు అతడి జీవితంలో ఎనలేని మార్పులను తీసుకొస్తాయి.  ది టీచర్స్‌ లాంజ్‌ (The Teachers' Lounge) కర్నా నోవాక్‌ స్కూల్లో టీచర్‌గా పనిచేస్తుంటుంది. ఆమె స్టూడెంట్స్‌లో ఒకరు దొంగతనానికి సంబంధించి అనుమానితుడుగా ఉంటాడు. నిజా నిజాలు తెల్చేందుకు ఆమె రంగంలోకి దిగుతుంది. ఈ క్రమంలో ఆమెకు అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. ప్రస్తుతం ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్‌లో వీక్షించవచ్చు. 
    మార్చి 11 , 2024
    Gaami Movie Review: అఘోరా శంకర్‌గా విశ్వరూపం చూపించిన విష్వక్‌ సేన్‌.. ‘గామి’  ఎలా ఉందంటే?
    Gaami Movie Review: అఘోరా శంకర్‌గా విశ్వరూపం చూపించిన విష్వక్‌ సేన్‌.. ‘గామి’  ఎలా ఉందంటే?
    నటీనటులు: విష్వక్‌ సేన్‌, చాందిని చౌదరి, అభినయ, రమ్య పసుపులేటి, మహ్మద్‌ సమద్‌, దయానంద్‌ రెడ్డి, మయాంక్‌ పరాక్‌, రాజీవ్‌ కుమార్‌,  దర్శకుడు: విద్యాధర్‌ కాగిత సంగీతం: స్వీకర్‌ అగస్తీ, నరేష్‌ కుమారన్‌ సినిమాటోగ్రాఫర్‌:  విశ్వనాథ్‌ రెడ్డి, రాంపీ నందీగాం నిర్మాత: కార్తిక్‌ శబరీష్‌, శ్వేత మోరవనేని విడుదల తేదీ: 8 మార్చి, 2024 విశ్వక్‌ సేన్‌ (Vishwak sen) హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘గామి’ (Gaami). విద్యాధర్‌ కాగిత ఈ మూవీతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. చాందినీ చౌదరి కథానాయిక. ఇందులో విష్వక్ తొలిసారి అఘోరా గెటప్‌లో కనిపించనున్నాడు. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్‌ సినిమాపై భారీగా అంచనాలు పెంచేసింది. హాలీవుడ్‌ స్థాయిలో ఉన్న విజువల్‌ ట్రీట్‌ చూసి సినీ ప్రముఖులు ఆశ్చర్యపోయారు. కాగా, భారీ అంచనాల నడుమ గామి చిత్రం ఇవాళ థియేటర్లలో విడుదలైంది. మరి సినిమా ఎలా ఉంది? అఘోరా గెటప్‌లో విష్వక్‌ మెప్పించాడా? అందరి అంచనాలను ఈ సినిమా నిలబెట్టిందా? లేదా? ఇప్పుడు చూద్దాం.  కథ అఘోరా శంకర్‌ (విష్వక్‌ సేన్‌) విచిత్రమైన సమస్యతో బాధపడుతుంటాడు. మానవ స్పర్శ తగిలితే అతడికి ప్రాణం పోయేంత బాధ కలుగుతుంది. ఎవరూ ముట్టుకోవడానికి వచ్చినా చర్మ పగిలిపోతుంటుంది. అయితే ఈ సమస్యకు పరిష్కారం హిమాలయ పర్వతాల్లో ఉందని ఓ సాధువు చెబుతాడు. 36 ఏళ్లకు ఒకసారి వికసించే పుష్పాన్ని తాకితే సమస్య నుంచి బయటపడవచ్చని సూచిస్తాడు. దీంతో ఆ పుష్పాలను అన్వేషిస్తూ శంకర్‌ హిమాలయాలకు బయలుదేరుతాడు. మరోవైపు సమాంతర ప్రపంచంలో ఓ దేవదాసి (అభినయ) బిడ్డకు జన్మనివ్వడంతో ఊరి ప్రజలు ఆమెను తరిమేస్తారు. అలాగే ఓ రహస్య ప్రదేశంలో మానవులపై ప్రయోగాలు జరుగుతుంటాయి. ఈ సబ్‌ప్లాట్స్‌తో అఘోరా శంకర్‌కు సంబంధం ఏంటి? హిమాలయాలకు వెళ్లిన శంకర్‌కు ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? అతడికి చాందిని చౌదరి చేసిన సాయం ఏంటి? దేవదాసిని తరిమేసిన గ్రామస్తులే తిరిగి ఆమెకోసం ఎందుకు వెతకాల్సి వచ్చింది? హ్యుమన్‌ ట్రైల్స్‌ ఎందుకు చేస్తున్నారు? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.  ఎవరేలా చేశారంటే  ఈ సినిమాలో కొత్త విష్వక్‌ సేన్‌ను చూస్తారు. అఘోరా శంకర్‌ పాత్రలో అతడు విశ్వరూపం చూపించాడు. పాత్రలో పరకాయ ప్రవేశం చేసి మరి నటించాడు. విష్వక్‌ నటన, డైలాగ్‌ డెలివరీ గత చిత్రాల కంటే చాలా బెటర్‌గా అనిపిస్తాయి. యాక్షన్‌, ఎమోషన్స్‌ సీన్లలో విష్వక్ అదరగొట్టాడు. అటు ఫీమేల్‌ లీడ్‌ రోల్‌లో నటి చాందిని చౌదరి ఆకట్టుకుంది. సినిమాలో విష్వక్‌ తర్వాత స్క్రీన్‌పై ఆమె పాత్రకే ఎక్కువ ప్రజెన్స్‌ లభించింది. హిమాలయ యాత్రలో విష్వక్‌కు సాయపడే పాత్రలో ఆమె మెప్పించింది. నటన పరంగా ఆమెకు ఎలాంటి మైనస్‌లు లేవు. ఇక దేవదాసి పాత్రలో అభినయ కూడా చక్కటి నటన కనబరిచింది. మిగిలిన పాత్ర ధారులు తమ పరిధిమేరకు నటించారు.  డైరెక్షన్ ఎలా ఉందంటే దర్శకుడు విద్యాధర్ కాగిత.. ‘గామి’ చిత్రాన్ని సరికొత్త కథతో తెరకెక్కించారు. ఇప్పటివరకూ రాని యూనిక్‌ కాన్సెప్ట్‌తో ఈ సినిమాను తెరకెక్కించి.. అరంగేట్రంలోని మంచి ఇంప్రెషన్‌ సంపాదించాడు. సినిమా ప్రారంభం నుంచే ఆడియన్స్‌లో ఆసక్తిని పెంచిన దర్శకుడు.. శంకర్‌ పాత్రలో ప్రేక్షకులు త్వరగా లీనమయ్యేలా చేశారు. ఓ వైపు శంకర్‌ పాత్రను నడిపిస్తూనే సమాంతరంగా మరో రెండు విభిన్న స్టోరీలను తీసుకురావడం మరింత ఆసక్తిని పెంచింది. చివర్లో ఆ మూడు కథలను లింకప్ చేసిన తీరు ఆకట్టుకుంది. ఇక ఇంటర్వెల్‌కు ముందు వచ్చే లయన్‌ యాక్షన్‌ ఎపిసోడ్‌ విజువల్‌ ట్రీట్‌గా అనిపిస్తుంది. అయితే సబ్‌ప్లాట్ స్టోరీలైన దేవదాసి, హ్యూమన్‌ ట్రైల్స్‌ ఎపిసోడ్‌ను సమర్థవంతంగా చూపించడంలో మాత్రం డైరెక్టర్ కాస్త తడబడినట్లు అనిపిస్తుంది. అటు సెకండాఫ్‌లో కొన్ని సన్నివేశాలను మరీ సాగదీసిన భావన కలుగుతుంది. అయితే క్లైమాక్స్‌లో డైరెక్టర్‌ విద్యాధర్ ఇచ్చిన ట్విస్టులు మాత్రం మెప్పిస్తాయి. టెక్నికల్‌గా  ఈ సినిమాకు సాంకేతిక విభాగం చాలా బాగా ప్లస్ అయ్యింది. ప్రతీ విభాగం తమ పనికి 100 శాతం న్యాయం చేసింది. ముఖ్యంగా సినిమాటోగ్రఫీ గురించి ఎంత చెప్పినా తక్కువే. విశ్వనాథ్‌ రెడ్డి, రాంపీల కెమెరా పనితనం మెప్పిస్తుంది. స్వీకర్‌ అగస్తీ, నరేష్‌ కుమారన్‌ అందించిన సంగీతం ఆకట్టుకుంది. నేపథ్య సంగీతం సన్నివేశాలను బాగా ఎలివేట్‌ చేసింది. నిర్మాణ విలువలు కూడా ఉన్నతంగా ఉన్నాయి.  ప్లస్‌ పాయింట్స్ కథ, కథనంవిష్వన్‌ నటనటెక్నికల్‌ టీమ్‌ మైనస్‌ పాయింట్స్‌ సబ్‌ప్లాట్ స్టోరీలుసాగదీత సీన్లు Telugu.yousay.tv Rating : 3/5
    మార్చి 08 , 2024
    Guntur Kaaram Review: డ్యాన్స్‌, మాస్‌ యాక్షన్‌తో ఇరగదీసిన మహేష్‌.. ‘గుంటూరు కారం’ ఎలా ఉందంటే!
    Guntur Kaaram Review: డ్యాన్స్‌, మాస్‌ యాక్షన్‌తో ఇరగదీసిన మహేష్‌.. ‘గుంటూరు కారం’ ఎలా ఉందంటే!
    నటీనటులు: మహేశ్‌బాబు, శ్రీలీల, మీనాక్షి చౌదరి, జగపతిబాబు, రమ్యకృష్ణ, ప్రకాశ్‌రాజ్‌, జయరాం, రావు రమేశ్‌, ఈశ్వరిరావు, మురళీశర్మ, సునీల్‌ తదితరులు రచన, దర్శకత్వం: త్రివిక్రమ్‌ సంగీతం: థమన్‌ సినిమాటోగ్రఫీ: మనోజ్‌ పరమహంస ఎడిటింగ్‌: నవీన్‌ నూలి నిర్మాత: ఎస్‌.రాధాకృష్ణ ప్రొడక్షన్‌ కంపెనీ: హారిక & హాసిని క్రియేషన్స్‌ విడుదల తేదీ: 12-01-2024 మహేష్‌ బాబు కథానాయకుడిగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్‌ డ్రామా చిత్రం 'గుంటూరు కారం' (Guntur Karam). శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. రమ్యకృష్ణ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలై టీజర్‌, ట్రైలర్‌, పాటలు సినిమాపై అంచనాలను పెంచేశాయి. త్రివిక్రమ్‌-మహేష్‌ కాంబోలో వస్తున్న హ్యాట్రిక్‌ మూవీ కావడంతో ఈ చిత్రం అందరి దృష్టిని ఆకర్షించింది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైంది. మరి గుంటూరు కారం ఎలా ఉంది? మహేశ్‌ మాస్‌ అవతార్‌ మెప్పించిందా? శ్రీలీల అందాలతో అలరించిందా? ఇప్పుడు చూద్దాం.  కథ జనదళం పార్టీ అధినేత వైరా సూర్య నారాయణ (ప్రకాశ్‌ రాజ్‌) కూతురు వసుంధర (రమ్యకృష్ణ) మూడోసారి ఎమ్మెల్యేగా గెలుస్తుంది. వసుంధరను మంత్రిని చేయాలని సూర్యనారాయణ భావిస్తాడు. ఎమ్మెల్యే కాటా మధు (రవిశంకర్‌) ఇందుకు అడ్డుతగులుతాడు. ఆ పదవి తనకు ఇవ్వకపోతే వసుంధరకు రెండో పెళ్లి అయిన విషయంతో పాటు మెుదటి భర్త సంతానం రమణ (మహేష్‌ బాబు) గురించి బయటపెడతానని బెదిరిస్తాడు. దీంతో సూర్యనారాయణ ముందు చూపుగా రమణను పిలిపించి వసుంధరతో ఎలాంటి సంబంధం లేదని బాండ్ పేపర్స్‌పై సంతకం చేయమంటాడు. కానీ రమణ నిరాకరిస్తాడు.(Guntur kaaram Review) తండ్రి రాయల్ సత్యం (జయరామ్‌) చెప్పినా వినకుండా గుంటూరులోనే ఉంటూ మిర్చియార్డ్‌ నడుపుతుంటాడు. అసలు వసుంధర తన మెుదటి భర్తకు ఎందుకు విడాకులు ఇచ్చింది? రమణను చూడటానికి కూడా ఎందుకు ఇష్టపడలేదు? అమ్ము (శ్రీలీల) రమణల లవ్ ట్రాక్‌ ఏంటి? మరదలు రాజి (మీనాక్షి చౌదరి) పాత్ర ఏంటి? అన్నది కథ. ఎవరెలా చేశారంటే మ‌హేశ్‌బాబు (Mahesh babu) పాత్ర ఆయ‌న నట‌నే ఈ సినిమాకి హైలైట్‌ అని చెప్పవచ్చు. ముఖ్యంగా డ్యాన్స్‌తో మహేష్‌(Mahesh babu) ఇరగదీశాడు. భావోద్వేగాల్నీ తనదైన శైలీలో అద్భుతంగా పండించాడు. శ్రీలీల మ‌రోసారి స్టెప్పులకే ప‌రిమితమైంది. కుర్చీ మ‌డ‌త‌పెట్టి పాటలో ఆమె, మ‌హేష్ క‌లిసి చేసిన హంగామా క‌ల్ట్ మాస్ అనాల్సిందే. మీనాక్షి చౌద‌రి పాత్ర కూడా సినిమాలో ప‌రిమిత‌మే. ర‌మ్య‌కృష్ణ పాత్ర‌, ఆమె న‌ట‌న హుందాగా అనిపిస్తుంది. ప్ర‌కాశ్‌రాజ్, వెన్నెల కిశోర్  పాత్ర‌ల్లో కొత్త‌ద‌న‌ం లేదు. జ‌గ‌ప‌తిబాబు, రావు ర‌మేశ్‌, ముర‌ళీశ‌ర్మ‌, సునీల్‌ ఇలా చాలా మంది నటులు ఉన్నా ఏ పాత్ర‌లోనూ బ‌లం క‌నిపించ‌దు. డైరెక్షన్‌ ఎలా ఉందంటే బలమైన భావోద్వేగాలు, పదునైన మాటలతో త్రివిక్రమ్‌ (Trivikram) తన చిత్రాల్లో మ్యాజిక్‌ చేస్తుంటారు. కానీ గుంటూరు కారం (Guntur Kaaram Review) విషయంలో ఆ మేజిక్‌ మిస్‌ అయ్యింది. పాతికేళ్లు తల్లికి దూరంగా పెరిగినా కొడుకు.. సంతకం చేస్తే తెగిపోయే బంధంతో కథ ముడి పడి ఉంటుంది. ఈ విషయం తొలి సన్నివేశాల్లోనే చెప్పేసిన త్రివిక్రమ్‌.. ఆ తర్వాత సినిమాను కాలక్షేప సీన్లతో నడిపించేసినట్టే అనిపిస్తుంది. కథతో సంబంధం లేకుండా పాత్రలను రాసుకున్నట్లు కనిపిస్తుంది. అవి త్రివిక్ర‌మ్ స్థాయికి త‌గ్గ పాత్ర‌లు, స‌న్నివేశాలు ఏమాత్రం కావు. ఓవరాల్‌గా మాస్ పాత్ర‌లో మ‌హేశ్‌బాబు చేసే హంగామా, ఆయ‌న ఎన‌ర్జీ, పాట‌లు, విరామ స‌న్నివేశాలు, ప‌తాక స‌న్నివేశాల్లో కాసిన్ని భావోద్వేగాలు ఇవే ఈ సినిమాకు బలం. టెక్నికల్‌గా ఇక సాంకేతిక విషయాలకొస్తే.. తమన్‌ సంగీతం బాగుంది. పాటలతో పాటు మంచి నేపథ్య సంగీతాన్ని అందించాడు. మనోజ్‌ పరమహంస అందించిన సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంది. నవీన్‌ నూలి ఎడిటింగ్‌ వర్క్‌ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. ప్లస్‌ పాయింట్స్‌ మహేష్ నటనశ్రీలీల డ్యాన్సులుసంగీతం మైనస్‌ పాయింట్స్‌ కథ, కథనంకొరవడిన భావోద్వేగాలుకనబపడని త్రివిక్రమ్‌ మార్క్‌ రేటింగ్‌ : 3/5
    జనవరి 12 , 2024

    @2021 KTree