• TFIDB EN
  • అజ్ఞాతవాసి
    UATelugu2h 38m
    గోవిందా (బొమన్ ఇరానీ) కొడుకు దారుణంగా హత్యకు గురవుతారు. ఇంద్రాణి (ఖుష్బూ) గోవిందా భార్య కంపెనీ వ్యవహారాలు చూసుకుంటుంది. సాధారణ ఉద్యోగిగా AB గ్రూప్ ఆఫ్ కంపెనీల్లోకి సుబ్రహ్మణ్యం ప్రవేశిస్తాడు. అయితే వరుస ఘటనల తర్వాత సుబ్రమణ్యం గురించి ఓ నిజం బయటపడుతుంది. ఇంతకు ఈ సుబ్రహ్మణ్యం ఎవరు? అతను కంపెనీలోకి ఎందుకు ప్రవేశించాడు? అసలు అతని లక్ష్యం ఏమిటి? అనేది మిగతా కథ.
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌SunNextఫ్రమ్‌
    Watch
    రివ్యూస్
    How was the movie?

    తారాగణం
    పవన్ కళ్యాణ్
    బాలసుబ్రహ్మణ్యం మరియు ప్రధాన పాత్రధారి వేషధారణలో వింధా పెద్ద కొడుకు
    ఆది పినిశెట్టి
    వింధా కంపెనీని మరియు ప్రధాన విరోధిని తీసుకోవాలని కోరుకునే ధీనబంధు కుమారుడు
    అను ఇమ్మాన్యుయేల్
    శర్మ కార్యదర్శి
    బొమన్ ఇరానీ
    అభి మరియు మోహన్ తండ్రి
    ఖుష్బు సుందర్
    అభి సవతి తల్లి
    రావు రమేష్
    విందా స్నేహితుడు
    మురళీ శర్మ
    విందా స్నేహితుడు
    సంపత్ రాజ్
    విందా హత్యపై దర్యాప్తు చేస్తున్న పోలీసు అధికారి
    ఇంద్రజ
    అభి అమ్మ
    పవిత్ర లోకేష్
    సుకుమారి తల్లి
    తనికెళ్ల భరణి
    అభి మామయ్య
    పరాగ్ త్యాగి
    సెక్యూరిటీ ఇన్‌ఛార్జ్ ఆఫీసర్
    అజయ్
    విందా స్నేహితుడు
    సమీర్
    విందా మాజీ వ్యాపార భాగస్వామి
    జయప్రకాష్
    ఆదిత్య సోదరుడు
    వెన్నెల కిషోర్
    ఒక మసక బుద్ధిగల వ్యక్తి అతని గుర్తింపును అభి తన కంపెనీలోకి ప్రవేశించడానికి ఉపయోగించాడు
    చైతన్య కృష్ణ
    సూర్యకాంతం మాజీ ప్రియుడు
    రాజా చెంబోలుఅభి టీమ్ కిడ్నాప్ చేసిన సుకుమారి స్నేహితురాలు
    రఘు బాబు
    విందా కంపెనీలో అవినీతిపరుడు మరియు సరసమైన మేనేజర్
    ఆడుకలం నరేన్
    ఎమ్మెల్యే
    నర్రా శ్రీనుఅభి అసిస్టెంట్
    అభిషేక్ మహర్షిఅభి అసిస్టెంట్
    అవంతిక వందనపు
    సంపత్ కూతురు
    ఆదిత్య మీనన్
    సీతారాం అనుచరుడు
    శ్రీకాంత్ అయ్యంగార్
    సంపత్ అసిస్టెంట్
    అప్పాజీ అంబరీష దర్భరచయిత
    ఫిష్ వెంకటయ్య
    ఫిష్ వెంకట్
    లహరి శారీసుస్మిత
    వెంకటేష్
    గురు (అతిధి పాత్ర)
    సిబ్బంది
    త్రివిక్రమ్ శ్రీనివాస్
    దర్శకుడు
    ఎస్. రాధా కృష్ణ
    నిర్మాత
    అనిరుధ్ రవిచందర్
    సంగీతకారుడు
    వి.మణికందన్
    సినిమాటోగ్రాఫర్
    కోటగిరి వెంకటేశ్వరరావు
    ఎడిటర్
    కథనాలు
    <strong>Anirudh Ravichander: టాలీవుడ్‌లో నెంబర్ వన్‌గా అనిరుధ్.. తగ్గిన దేవి శ్రీ, థమన్ హవా!</strong>
    Anirudh Ravichander: టాలీవుడ్‌లో నెంబర్ వన్‌గా అనిరుధ్.. తగ్గిన దేవి శ్రీ, థమన్ హవా!
    ప్రస్తుతం సౌత్‌ ఇండస్ట్రీలో అనిరుధ్‌ రవిచందర్‌ (Anirudh Ravichander) పేరు మార్మోమోగుతోంది. కోలీవుడ్‌కు చెందిన ఈ మ్యూజిక్‌ సెన్సేషన్‌ ‘రఘువరన్‌ బీటెక్‌’, ‘విక్రమ్‌’, ‘జైలర్‌’, ‘బీస్ట్‌’ వంటి చిత్రాలతో యమా క్రేజ్‌ సంపాదించాడు. అనిరుధ్‌ మ్యూజిక్‌ ఉందంటే ఆ మూవీకి ఎనలేని క్రేజ్ వస్తోంది. ముఖ్యంగా యూత్‌ అనిరుధ్‌ ఇచ్చే పాటలు, నేపథ్య సంగీతానికి బాగా కనెక్ట్ అవుతున్నారు. రీసెంట్‌గా తారక్‌ నటించిన ‘దేవర’ చిత్రానికి సైతం అనిరుధ్‌ అదిరిపోయే సంగీతం ఇచ్చి తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. అయితే ఇప్పటివరకూ కోలీవుడ్‌పైనే ఫోకస్‌ ఉంచిన అనిరుధ్‌ ప్రస్తుతం దానిని టాలీవుడ్‌పైకి మరల్చినట్లు కనిపిస్తోంది. దీంతో ఇక్కడి మ్యూజిక్‌ డైరెక్టర్లకు కష్టాలు తప్పవన్న చర్చ మెుదలైంది.&nbsp; ఆ చిత్రాలతో తెలుగులో క్రేజ్‌! యంగ్‌ మ్యూజిక్ సెన్సేషన్‌ అనిరుధ్‌కు తెలుగులోనూ మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. తెలుగులో నేరుగా ‘అజ్ఞాతవాసి’, ‘జెర్సీ’, ‘గ్యాంగ్‌ లీడర్‌’, ‘యూటర్న్‌’ వంటి చిత్రాలు చేశాడు. ఆయా సినిమాల్లో మ్యూజిక్‌ పెద్ద హిట్ అయినప్పటికీ అనిరుధ్‌ గురించి టాలీవుడ్‌లో పెద్దగా చర్చ జరగలేదు. అయితే రీసెంట్‌గా ‘విక్రమ్‌’, ‘జైలర్‌’, ‘జవాన్’ చిత్రాలతో అతడి పేరు పాన్‌ ఇండియా స్థాయిలో మారుమోగిపోయింది. ముఖ్యంగా అతడిచ్చిన నేపథ్య సంగీతానికి యూత్‌ ఫిదా అయ్యారు. ఆయా చిత్రాలు తెలుగులోనూ డబ్‌ కావడంతో అనిరుధ్‌ మ్యూజిక్‌ను తెలుగు ఆడియన్స్‌ సైతం బాగా ఎంజాయ్‌ చేశారు. రిపీట్‌ మోడ్‌లో అతడి పాటలు వింటూ సంగీతాన్ని అస్వాదించారు. ఇక ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ డిమాండ్‌ వల్లే అనిరుధ్‌ ‘దేవర’ ప్రాజెక్ట్‌లో భాగమైనట్లు కూడా మేకర్స్‌ ఇటీవల తెలియజేశారు.&nbsp; టాలీవుడ్‌లో వరుస ఆఫర్లు! ‘దేవర’ సక్సెస్‌ తర్వాత టాలీవుడ్‌లో అనిరుధ్‌ పేరు బాగా వినిపిస్తోంది. మరోమారు థియేటర్లలో అతడి మ్యూజిక్‌ ఎంజాయ్‌ చూసేందుకు తెలుగు ప్రేక్షకులు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇది గమనించిన తెలుగు దర్శక నిర్మాతలు అనిరుధ్‌తో వర్క్ చేసేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. అటు తెలుగులో వస్తోన్న ఆదరణ చూసి టాలీవుడ్‌లోనూ తన దూకుడు పెంచాలని అనిరుధ్‌ నిర్ణయించుకున్నట్లు సమాచారం. కాగా, ఇప్పటికే విజయ్‌ దేవరకొండ, గౌతం తిన్ననూరి కాంబోలో రూపొందుతున్న ‘VD12’ ప్రాజెక్ట్‌కు అనిరుధ్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు. అలాగే నాని - శ్రీకాంత్ ఓదెల కాంబోలో రాబోతున్న సినిమాకు సైతం అనిరుధ్‌ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. మరికొందరు డైరెక్టర్లు కూడా తమ మూవీ కోసం అనిరుధ్‌ను సంప్రదిస్తున్నట్లు టాక్‌. రానున్న రోజుల్లో అరడజను ప్రాజెక్ట్స్‌ వరకూ తెలుగులో అనిరుధ్‌ చేయవచ్చని అంటున్నారు.&nbsp; థమన్‌, దేవిశ్రీకి కష్టమేనా! సంగీత దర్శకులు థమన్‌, దేవిశ్రీ ప్రసాద్‌ గత కొన్నేళ్లుగా టాలీవుడ్‌లో టాప్‌ మ్యూజిక్‌ డైరెక్టర్లుగా కొనసాగుతూ వస్తున్నారు. ఇండస్ట్రీలో రిలీజయ్యే 10 చిత్రాల్లో కనీసం 5-8 చిత్రాలకు వీరిద్దరే మ్యూజిక్ అందిస్తున్నారు. తెలుగు డైరెక్టర్ల తొలి రెండు ప్రాధాన్యాలుగా వీరిద్దరే ఉంటూ వచ్చారు. అటువంటి థమన్‌, దేవిశ్రీకి అనిరుధ్‌ రాకతో గట్టి పోటీ తప్పదని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నిన్న, మెున్నటి వరకూ టాలీవుడ్‌ను అంతగా ప్రాధాన్యత ఇవ్వని అనిరుధ్‌ ప్రస్తుతం తెలుగు సినిమాలపై ఫోకస్‌ పెట్టడం వారికి గట్టి ఎదురుదెబ్బేనని అభిప్రాయపడుతున్నారు. మరి అనిరుధ్‌ మ్యానియాను తట్టుకొని థమన్‌, దేవిశ్రీ ఏవిధంగా రాణిస్తారో చూడాలని పేర్కొంటున్నారు.&nbsp; అవి క్లిక్‌ అయితే ఆపడం కష్టం! రామ్‌చరణ్‌ హీరోగా డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న గేమ్ ఛేంజర్‌ చిత్రానికి థమన్‌ సంగీతం సమకూరుస్తున్నారు. ఇప్పటికే ఆ మూవీ నుంచి జరగండి జరగండి, రా మచ్చా మచ్చా పాటలు రిలీజ్‌ కాగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే పవన్‌ కల్యాణ్‌ ‘ఓజీ’ చిత్రానికి సైతం థమన్‌ సంగీతం సమకూరుస్తున్నాడు. ‘హంగ్రీ చీతా’ రిలీజ్‌ చేసిన సాంగ్‌ పవన్‌ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించింది. తాజాగా బాలయ్య-బోయపాటి నాలుగో చిత్రం ‘అఖండ 2’కి థమన్ సంగీత దర్శకుడిగా ఎంపికయ్యాడు. మరోవైపు దేవిశ్రీ చేతిలో ‘పుష్ప 2’ ప్రాజెక్ట్ ఉంది. ఇప్పటికే రిలీజైన పుష్ప టైటిల్‌ సాంగ్‌తోపాటు 'సూసేకి అగ్గిరవ్వ మాదిరి' పాటకు యూట్యూబ్‌లో మిలియన్ల కొద్ది వ్యూస్‌ వచ్చాయి. ఆయా ప్రాజెక్ట్స్‌ సక్సెస్ అయితే థమన్‌, దేవిశ్రీకి తిరుగుండదని చెప్పవచ్చు.&nbsp;
    అక్టోబర్ 22 , 2024
    <strong>Jr NTR Records: ఓటమి ఎరుగని హీరోగా తారక్‌.. ప్రభాస్‌ సైతం వెనక్కి తగ్గాల్సిందే!&nbsp;</strong>
    Jr NTR Records: ఓటమి ఎరుగని హీరోగా తారక్‌.. ప్రభాస్‌ సైతం వెనక్కి తగ్గాల్సిందే!&nbsp;
    జూ.ఎన్టీఆర్‌ హీరోగా నటించిన దేవర చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. తొలి మూడు రోజుల్లోనే రూ.300 కోట్లు కొల్లగొట్టిన ఈ చిత్రం ప్రస్తుతం రూ.500 కోట్ల క్లబ్‌లో చేరేందుకు వడి వడిగా అడుగులు వేస్తోంది. ఇందులో తారక్‌కు జోడీగా బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్‌ చేసింది. విలన్‌గా బాలీవుడ్‌ స్టార్‌ సైఫ్‌ అలీఖాన్ నటించారు. అయితే ‘దేవర’ మూవీ తారక్‌కు సంబంధించిన అనేక ఆసక్తికర విషయాలను తెరపైకి తీసుకొచ్చింది. ప్రభాస్‌ వంటి గ్లోబల్‌ స్టార్‌కు సాధ్యం కానీ విజయాన్ని తారక్‌కు అందించింది. అటు ఫ్లాప్‌ దర్శకులకు తారక్‌ ఓ వరమని మరోమారు నిరూపించింది. ఆ విశేషాలేంటో ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. ఫ్లాప్‌ డైరెక్టర్లతో హిట్స్‌! టాలీవుడ్‌లోని ఫ్లాప్ డైరెక్టర్స్‌ పాలిట జూ.ఎన్టీఆర్‌ ఓ దేవుడిలా మారాడని చెప్పవచ్చు. భారీ డిజాస్టర్‌తో ఫేమ్‌ కోల్పోయిన డైరెక్టర్లు తారక్‌తో ఓ సినిమా చేస్తే మునుపటి క్రేజ్‌ను తిరిగి పొందడం ఖాయంగా కనిపిస్తోంది. రీసెంట్‌గా దేవర విషయంలోనూ ఇదే నిరూపితమైంది. దర్శకుడు కొరటాల శివ గతంలో తీసిన ‘ఆచార్య’ చిత్రం డిజాస్టర్‌ టాక్‌ తెచ్చుకుంది. అసలు కొరటాల శివ చిత్రమేనా అంటూ పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అటువంటి డైరెక్టర్‌కు ఛాన్స్‌ ఇచ్చి దేవరతో సాలిడ్‌ విజయాన్ని అందుకున్నాడు తారక్. అంతకుముందు ఫ్లాప్‌లతో ఉన్న పూరి జగన్నాథ్‌కు 'టెంపర్‌'తో సక్సెస్‌ ఇచ్చాడు. ‘1: నేనొక్కడినే’ పరాజయంతో ఢీలా పడిపోయిన సుకుమార్‌తో ‘నాన్నకు ప్రేమతో’ మూవీ తీసి గాడిలో పెట్టాడు. రవితేజతో ఫ్లాప్ అందుకున్న బాబీకి ‘జై లవకుశ’తో మంచి హిట్ ఇచ్చాడు. ‘అజ్ఞాతవాసి’తో భారీ డిజాస్టర్‌ అందుకున్న త్రివిక్రమ్‌కు ‘అరవింద సామెత’తో&nbsp; సక్సెస్‌ అందించాడు. ఇలా ఫ్లాప్ డైరెక్టర్లకు వరుసగా హిట్స్‌ ఇచ్చి సరికొత్త రికార్డును తారక్‌ క్రియేట్ చేస్తున్నాడు. ఒకే ఒక్క హీరోగా తారక్‌ హీరోల కెరీర్‌లో హిట్స్‌, ఫ్లాప్స్‌ అనేవి సర్వ సాధారణం. ఎంత పెద్ద స్టార్‌ హీరో అయినా తీసిన ప్రతీ సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారన్న నమ్మకం లేదు. గ్లోబల్‌ స్టార్‌ ప్రభాస్‌ సైతం బాహుబలి తర్వాత ‘సాహో’, ‘రాధేశ్యామ్‌’, ‘ఆదిపురుష్‌’ చిత్రాలతో ఫ్లాప్‌ అందుకున్న వాడే. అయితే తారక్‌ మాత్రం గత తొమ్మిదేళ్లుగా ఒక్క ఫ్లాప్‌ లేకుండా ఇండస్ట్రీలో దూసుకుపోతున్నాడు. ఆయన చేసిన గత 7 చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద బ్లాక్‌ బాస్టర్స్‌గా నిలిచాయి. ‘టెంపర్‌’, ‘నాన్నకు ప్రేమతో’, ‘జనతా గ్యారేజ్‌’, ‘జై లవకుశ’, ‘అరవింద సమేత’, ‘RRR’, ‘దేవర’ వంటి చిత్రాలు మంచి విజయాలను సాధించాయి. ఈ జనరేషన్‌ హీరోల్లో ఈ ఘనత సాధించిన ఏకైక హీరోగా తారక్‌ నిలవడం విశేషం. ఫ్యూచర్‌లో ‘దేవర 2’, ప్రశాంత్‌ నీల్‌తో ‘NTR 31’, సందీప్‌ రెడ్డి వంగాతో ఓ చిత్రం (గాసిప్‌) వంటి బిగ్‌ ప్రాజెక్ట్స్‌ ఉండటంతో తారక్ జైత్రయాత్ర ఇకపైనా కొనసాగే అవకాశముంది.&nbsp; 23 ఏళ్ల ఫ్లాప్‌ రికార్డు బద్దలు దర్శకధీరుడు రాజమౌళి (SS Rajamouli)తో సినిమా చేస్తే బ్లాక్‌ బాస్టర్ పక్కా అని అందరికీ తెలిసిందే. అదే సమయంలో జక్కన్నతో సినిమా చేసిన తర్వాత ఏ హీరో కూడా వెంటనే హిట్‌ కొట్టిన దాఖలాలు లేవు. అయితే 'దేవర'తో తారక్‌ ఈ ఫ్లాప్‌ సెంటిమంట్‌ను బీట్‌ చేశాడు. రాజమౌళితో 'RRR' చేసిన తారక్‌ వెంటనే ‘దేవర’తో సాలిడ్‌ విజయాన్ని అందుకున్నాడు. రాజమౌళి ఫస్ట్‌ ఫిల్మ్‌ ‘స్టూడెంట్‌ నెం.1’తో ఈ ఫ్లాప్ సెంటిమెంట్‌కు శ్రీకారం చుట్టిన తారక్‌ స్వయంగా తానే దీనిని&nbsp; బ్రేక్‌ చేయడం విశేషం. అది కూడా 23 క్రితం స్టూడెంట్ నెం.1 రిలీజైన రోజున దేవరను తీసుకొచ్చి రాజమౌళి సెంటిమెంట్‌ను బద్దలు కొట్టాడు. రైతు పాత్రలో తారక్‌! తారక్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో రానున్న 'NTR 31' ప్రాజెక్ట్‌ను మైత్రీ మూవీ మేకర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్‌ నిర్మించనున్నాయి. ఈ సినిమాకు సంబంధించి ఓ బజ్‌ టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామాగా ఈ చిత్రం రూపొందనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రంలో తారక్‌ రైతుగా కనిపిస్తాడని అంటున్నారు. కథ మెుత్తం బంగ్లాదేశ్ నేపథ్యంలో సాగుతుందని చెబుతున్నారు. అక్కడ వ్యవసాయం చేసుకుంటూ జీవించే యువకుడు అనుకోని సంఘటనల కారణంగా స్థానికుల కోసం ఎలాంటి పోరాటం చేశాడన్న కాన్సెప్ట్‌తో ఇది తెరకెక్కనున్నట్లు టాక్‌. ఇందులో తారక్‌ను రెండు వేరియేషన్స్‌లో ప్రశాంత్‌ నీల్‌ చూపించనున్నట్లు తెలుస్తోంది. తారక్‌ క్యారెక్టరైజేషన్‌, పెర్ఫార్మెన్స్‌ గత చిత్రాలకు భిన్నంగా నెక్స్ట్‌ లెవల్లో ఉంటాయని ఫిల్మ్‌ వర్గాల సమాచారం.&nbsp; హీరోయిన్‌గా రష్మిక? దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ ప్రస్తుతం ‘NTR 31’ ప్రీ ప్రొడక్షన్‌ పనుల్లో బిజీగా ఉన్నారు. ప్రధాన తారాగణం కూర్పుకు సంబంధించి వర్క్‌ చేస్తున్నారు. ఇందులో తారక్‌కు జోడీగా రష్మిక మందన్నను తీసుకునే యోచనలో ప్రశాంత్‌ నీల్ ఉన్నట్లు సమాచారం. ఇదే జరిగితే తారక్‌-రష్మిక కాంబోలో రానున్న తొలి చిత్రం ఇదే కానుంది. NTR 31 చిత్రాన్ని 2026 సంక్రాంతి కానుకగా రిలీజ్‌ చేయాలని డైరెక్టర్‌ భావిస్తున్నారట. దీనికి అనుగుణంగా త్వరలోనే షూటింగ్‌ ప్రారంభించాలని ఆయన భావిస్తున్నారుట. ఈ మూవీకి రవి బస్రూర్ మ్యూజిక్ అందిస్తుండగా సినిమాటోగ్రాఫర్ బాధ్యతలు భువన్ గౌడ భుజాలకు ఎత్తుకోబోతున్నాడు.&nbsp;&nbsp;
    అక్టోబర్ 04 , 2024
    Avantika Vandanapu: ఈ కుర్ర పిల్లలో విషయం బాగా ముదిరింది.. ఏకంగా హలీవుడే షేక్‌.!
    Avantika Vandanapu: ఈ కుర్ర పిల్లలో విషయం బాగా ముదిరింది.. ఏకంగా హలీవుడే షేక్‌.!
    బ్రహ్మోత్సవం చిత్రంలో బాలనటిగా అరంగేట్రం చేసిన 'అవంతిక వందనపు'.. ఇప్పుడు హాలీవుడ్‌లో సెన్సేషన్‌గా మారింది.&nbsp; https://twitter.com/i/status/1747997141644251346 టాలీవుడ్ ద్వారా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ చిన్నది.. ఇప్పుడు వరుస హాలీవుడ్‌ చిత్రాల్లో నటిస్తూ ఫుల్‌ బిజీగా మారింది. https://twitter.com/i/status/1746394374546559063 తాజాగా అవంతిక న‌టించిన హాలీవుడ్ చిత్రం ‘మీన్ గర్ల్స్’ (Mean Girls) విడుద‌లై మంచి విజ‌యం సాధించ‌డంతో ఇప్పుడు ఈ అమ్మ‌డి పేరు సోష‌ల్ మీడియాలో మారు మ్రోగుతుంది. ముఖ్యంగా ఈ సినిమాలో అమ్మ‌డు చాలా బోల్డ్‌గా క‌నిపించడంతో పాటు ఓ పాట‌లో శృతిమించి అందాల ప్ర‌ద‌ర్శ‌న చేసింది. బాలనటిగా చేసిన అవంతని ఇలా బోల్డ్‌గా చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. https://twitter.com/i/status/1746552711666094366 మ‌నం చూస్తున్న‌ది అప్పుడు తెలుగు సినిమాల‌లో చూసిన అవంతికనేనా.. ఇంత‌లో అంత మార్పా అంటూ షాక్ అవుతున్నారు. దీనికి సంబంధించిన వీడియోను విపరీతంగా షేర్‌ చేస్తున్నారు.&nbsp; అవంతిక వందనపు.. బ్రహ్మోత్సవం సినిమాలో మహేష్‌ చెల్లెలిగా నటించింది. తన డ్యాన్స్‌తో అందరినీ ఆకట్టుకుంటుంది.&nbsp; బ్రహ్మోత్సవం సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్‌లో మహేష్‌ను ఇంటర్యూ చేసి మంచి మార్కులు కొట్టేసింది. https://twitter.com/i/status/1746391190511952308 అవంతిక.. ఇండో-అమెరికన్‌ యువతి. కాలిఫోర్నియాలో తెలుగు మూలలున్న కుటుంబంలో 2005లో పుట్టింది. అక్కడే చదవుకుంటూ డ్యాన్స్‌, నటనలో శిక్షణ తీసుకుంది. 2014లో ప్రముఖ టీవీ ఛానల్‌ నిర్వహించిన డ్యాన్స్‌ ఇండియా డ్యాన్స్‌ లిటిల్‌ మాస్టర్స్‌ (నార్త్‌ అమెరికన్‌ ఎడిషన్‌)లో రన్నరప్‌గా నిలిచి అవంతిక అందరిచేత ప్రశంసలు అందుకుంది.&nbsp; ఆ తర్వాత 2016లో ‘బ్రహ్మోత్సవం’ సినిమా ద్వారా నటిగా మెప్పించి బాలనటిగా తెలుగులో వరుస అవకాశాలను దక్కించుకుంది.&nbsp; మనమంతా, ప్రేమమ్‌, రారండోయ్‌ వేడుక చూద్దాం, బాలకృష్ణుడు, ఆక్సిజన్‌, అజ్ఞాతవాసి చిత్రాల్లోనూ అవంతిక బాల నటిగా మెరిసింది. ఇటీవల తెలుగు చిత్రాల్లో హీరోయిన్‌గా నటించే అవకాశాలు కూడా అవంతికకు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే కొన్ని కారణాల వల్ల ఆమె వాటిని తిరస్కరించినట్లు సమాచారం.&nbsp; ప్రస్తుతం అవంతిక తన ఫోకస్‌ మెుత్తం హాలీవుడ్‌ పైనే పెట్టింది. హాలీవుడ్ యానిమేషన్ సిరీస్‌లైన మీరా: రాయల్ డిటెక్టివ్, డైరీ ఆఫ్ ఏ ఫ్యూచర్ ప్రెసిడెంట్‌లోని పాత్రలకు ఆమె గాత్రదానం చేసింది. హాలీవుడ్లో నటించాలన్న అవంతిక ఆశకు డిస్నీ సంస్థ ఊపిరి పోసింది. స్పిన్ చిత్రం ద్వారా ఆమె కలను నెరవేర్చింది. ఆ తర్వాత ‘సీనియర్ ఇయర్‌’ అనే హాలీవుడ్‌ చిత్రంలోనూ అవంతిక కీలక పాత్ర పోషించింది. ప్రస్తుతం ఈ భామా హోరోస్కోప్‌, క్రౌన్‌ విషెష్‌ అనే రెండు హాలీవుడ్‌ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. అదే సమయంలో ఓ రెస్టారెంట్‌లో వర్క్‌ చేస్తూ అవంతిక అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.&nbsp; అమెరికా సంప్రదాయం ప్రకారం తల్లిదండ్రులు ఎంత రిచ్‌ అయినా 18 ఏళ్లు నిండితే వారు స్వయం కృషితో స్వంతంగా బతకాలి. కుటుంబ సభ్యులపై ఆధారపడకుండా తమకాళ్లపై తాము నిలబడాలి. ఈ క్రమంలోనే అవంతిక (Avantika Vandanapu) త‌ల్లిదండ్రులు ఉన్న‌వాళ్లైన‌ప్ప‌టికీ త‌ను ఓ రెస్టారెంట్‌లో ప‌ని చేస్తూ మ‌రో వైపు సినిమాల‌లో న‌టిస్తూ చాలామంది యువ‌త‌కు ఆద‌ర్శంగా నిలుస్తోంది.
    జనవరి 19 , 2024
    Common Point in NTR, SSMB, PSPK Movies: జూ.ఎన్టీఆర్, మహేశ్ బాబు, పవన్ కళ్యాణ్‌ 25వ సినిమాలో ఈ కామన్ పాయింట్ గమనించారా?&nbsp;
    Common Point in NTR, SSMB, PSPK Movies: జూ.ఎన్టీఆర్, మహేశ్ బాబు, పవన్ కళ్యాణ్‌ 25వ సినిమాలో ఈ కామన్ పాయింట్ గమనించారా?&nbsp;
    టాలీవుడ్ టాప్ హీరోలు ఎవరంటే.. ఎన్టీఆర్, మహేశ్ బాబు, పవన్ కళ్యాణ్‌ల పేర్లు తప్పకుండా చెబుతారు. వీరు ముగ్గురూ దాదాపుగా ఒకే కాలంలో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. 20వ దశాబ్దపు హీరోల్లో కెరీర్‌లో 25కు పైగా సినిమాలను పూర్తి చేసుకున్న ప్రముఖ నటులు కూడా వీరే. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో ఈ హీరోలు బిజీబిజీగా గడుపుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ దేవర(NTR in Devara), మహేశ్ బాబు గుంటూరు కారం(Guntur Karam), పవన్ ఓజీ, ఉస్తాద్ భగత్‌సింగ్ చిత్రాలు చేస్తున్నాడు. అయితే, ఈ ముగ్గురి హీరోల 25వ సినిమాలో ఒక కామన్ పాయింట్ ఉంది. అదేంటో తెలుసుకుందాం.&nbsp; ఎన్టీఆర్ 25వ సినిమాగా ‘నాన్నకు ప్రేమతో’ సినిమా విడుదలైంది. 2016లో రిలీజైన ఈ చిత్రం అప్పట్లో ఘన విజయం సాధించింది. తండ్రి కోరికను నెరవేర్చడమే లక్ష్యంగా కొడుకు చేసిన పోరాటం ఈ సినిమా. డైరెక్టర్ సుకుమార్ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించాడు. స్టైలిష్ లుక్కుతో జూనియర్ ఎన్టీఆర్ అదరగొట్టాడు. శత్రువుని తెలివిగా దెబ్బ కొట్టి తండ్రి ఆశయాన్ని నెరవేర్చే కుమారుడి పాత్రలో ఎన్టీఆర్ నటించాడు.&nbsp; మహేశ్ బాబు 25వ సినిమా ‘మహర్షి’. వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేసిన ఈ సినిమా అప్పట్లో సంచలన విజయం సాధించింది. రైతులపై గౌరవం పెంచింది. ఈ సినిమా అనంతరం, పాఠశాలలు అగ్రికల్చర్ టూర్ చేపట్టాయంటే సినిమా ఎలాంటి ప్రభావం చూపించిందో అర్థం చేసుకోవచ్చు. ఇందులోనూ మిత్రుడి కోసం మహేశ్ బాబు పోరాటం చేస్తాడు. వ్యవసాయం విలువను తెలిపే ప్రయత్నం చేశాడు.&nbsp; పవన్ కళ్యాణ్ 25వ మూవీ ‘అజ్ఞాతవాసి’. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ పెద్దగా అంచనాలను అందుకోలేదు. తన తండ్రిని ఎవరు చంపారు? ఎందుకు చంపారనే విషయం తెలుసుకోవడానికి కొడుకు పడే తాపత్రయం ఇది. తండ్రి స్థాపించిన సామ్రాజ్యాన్ని తిరిగి ఎలా నిలబెట్టాడనేది సినిమాలో చూపిస్తారు.&nbsp; ఒకే పొజిషన్లలో.. ఈ మూడు సినిమాల్లో కామన్ పాయింట్ ఏంటని ఆలోచిస్తున్నారా? ఒక్కసారి రివైండ్ చేసుకోండి. వీరు ముగ్గురు ఆయా సినిమాల్లో ఓ కంపెనీకి సీఈవోగా పనిచేస్తారు. నాన్నకు ప్రేమతో సినిమాలో తారక్ KMC అనే కంపెనీని స్టార్ట్ చేస్తాడు. సినిమా ప్రారంభంలో ఈ విజువల్స్ కనిపిస్తాయి. ఇక, ‘మహర్షి’ సినిమాలో ఆరిజిన్(Origin) అనే కంపెనీకి మహేశ్ సీఈవోగా ఉంటాడు. సీఈవోగా పనిచేస్తూనే ఊర్లోకి వచ్చి ధర్నా చేస్తుంటాడు. మరోవైపు, ‘అజ్ఞాతవాసి’లోనూ పవన్ చివరికి సీఈవోగా అపాయింట్ అవుతాడు. నాన్న స్థాపించిన ‘AB’ అనే కంపెనీకి సీఈవోగా వ్యవహరిస్తాడు. పంతం సినిమాలోనూ గోపీచంద్ సీఈవోగా పనిచేస్తాడు.&nbsp; మరో పాయింట్.. ఈ మూడు సినిమాల్లోనూ మరో కామన్ పాయింట్ కూడా ఉంది. వీటిల్లో ఫాదర్ సెంటిమెంట్ కనిపిస్తుంది. నాన్నకు ప్రేమతో సినిమాలో రాజేంద్ర ప్రసాద్ చివరికి చనిపోతాడు. మహర్షి సినిమాలోనూ ప్రకాశ్ రాజు బతకడు. ఇక, అజ్ఞాతవాసిలోనూ బొమ్మన్ ఇరానీ మరణిస్తాడు. ఇలా ఈ మూడు సినిమాల్లో ఫాదర్ ఎమోషన్ ఉండటం యాధృచ్ఛికం అనే చెప్పొచ్చు. భూమికతో హిట్.. జూనియర్ ఎన్టీఆర్, మహేశ్ బాబు, పవన్ కళ్యాణ్‌లతో భూమిక నటించింది. ఎన్టీఆర్‌ ‘సింహాద్రి’, మహేశ్ బాబు ‘ఒక్కడు’, పవన్ కళ్యాణ్ ‘ఖుషి’.. సినిమాల్లో భూమికనే హీరోయిన్. మరో విశేషం ఏంటంటే.. ఈ మూడు సినిమాలు బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. తారక్, మహేశ్, పవన్ కెరీర్లో మైలురాయి సినిమాలుగా మారాయి. ఇది కూడా వీరిలో ఒక కామన్ పాయింటే. మరి, మీకు తెలిసిన సారూప్యతలను మాతో పంచుకోండి.&nbsp;&nbsp; https://www.youtube.com/watch?v=sMqHX71j_HU
    ఆగస్టు 16 , 2023
    Mahabharatam in Trivikram Movies: గురూజీ సినిమాల్లో మహా భారతం రిఫరెన్సులు.. ఈ సీన్లు మీకు గుర్తున్నాయా?
    Mahabharatam in Trivikram Movies: గురూజీ సినిమాల్లో మహా భారతం రిఫరెన్సులు.. ఈ సీన్లు మీకు గుర్తున్నాయా?
    భారత ఇతిహాసాల్లో మహాభారతం ఒకటి. ఇందులోని సారాన్ని సినిమాల్లో సందర్భానుసారంగా ప్రస్తావిస్తుంటారు. మహాభారతంలోని ఔన్నత్యాన్ని ప్రేక్షకులకు తెలియజేయాలని కొందరు దర్శకులు, రచయితలు ఆరాట పడుతుంటారు. అందులో ఒకరు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. గురూజీ తీసిన సినిమాల్లో కచ్చితంగా రామాయణ, మహాభారత ఇతిహాసాల తాలూకూ ఘటనలు, ఆదర్శాలు ఉంటాయి. సరదాగానో, సీరియస్‌గానో వీటిని తన సినిమాల్లో ప్రస్తావిస్తాడు. అలాంటివి ఇప్పుడు చూద్దాం.&nbsp; అరవింద సమేత వీరరాఘవ హీరోయిన్ పూజా హెగ్డేని వెంటాడుతుండగా ఎన్టీఆర్ కంట పడుతుంది. ఈ సమయంలో వారిని అడ్డుకోవాలనే ఎన్టీఆర్ ప్రయత్నాన్ని పూజా హెగ్డే నిలువరిస్తుంది. ‘భీముడు, అర్జునుడు ఒక్క చేత్తో వందమందిని చంపగలరు. కానీ, కృష్ణుడు కత్తి పట్టుకున్న ఫొటో అయినా చూశావా. ఆయనకు 8మంది భార్యలు. అర్థమైందా మా ఆడవాళ్లకు ఎలాంటి వారు నచ్చుతారో’ అంటూ ఎన్టీఆర్ ఆలోచన తీరును మార్చేస్తుంది.&nbsp; https://www.youtube.com/watch?v=qmqQHtla20w S/O సత్యమూర్తి ఈ సినిమాలో రెండు, మూడు సందర్భాల్లో మహాభారతం ప్రస్తావనను గురూజీ తీసుకొచ్చాడు. పార్టీలో అల్లు అర్జున్ స్పీచ్ ఇస్తుండగాా ఓ ఉదాహరణను చెబుతాడు. ‘కౌరవులు జూదంలో గెలిచారు. కురుక్షేత్రంలో పోయారు. జూదంలో ఓడిపోయి ఉంటే బ్రదర్స్ అందరూ కలిసి ఇలా పార్టీ చేసుకునే వారు’ అని చెబుతాడు. ఇందులోనే రాజేంద్ర ప్రసాద్ సమంతతో మాట్లాడుతూ.. ‘కర్ణుడిలా అన్నీ ఇచ్చేసి చివరికి అనాథలా పోతాడు’ అనేస్తాడు. ఇక బ్రహ్మానందం.. ‘వినటానికి విల్లింగ్‌గా ఉంటే భారతంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు ఇంత చెప్పాడంటా’ అంటూ దీర్ఘం తీస్తాడు. ‘యుద్ధం గెలవడానికి ధర్మరాజు లాంటోడే ఒక అబద్ధం ఆడాడు’&nbsp; (అల్లు అర్జున్‌తో శ్రీవిష్ణు)అని మరో డైలాగ్ ఉంటుంది. https://www.youtube.com/watch?v=x0jKDVs34xQ అజ్ఞాతవాసి ఈ సినిమాలో ఓ మాస్టారు సందర్భోచితంగా నకుల ధర్మం గురించి వివరిస్తాడు. హీరో పవన్ కళ్యాణ్‌పై దుండగులు దాడికి దిగుతారు. ఈ సమయంలోనే ‘పాండవులు అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు కౌరవుల గూఢచారులు గుర్తిస్తారు. ఈ సమయంలో నకులుడు ఒక ఉపాయం చెబుతాడు. చుట్టు పక్కల పరిసరాల్లో ఎలాంటి మార్పు లేకుండా వారిని సంహరించేలా ప్లాన్ చేస్తాడు. నిశ్శబ్దంగా చేసే ఈ యుద్ధాన్నే నకుల ధర్మం అని అంటారు’ అని చెబుతారు. https://www.youtube.com/watch?v=6Fdb2UUhRzc జులాయి తనికెల్ల భరణి ఆసుపత్రిలో చేరిన సమయంలో అల్లు అర్జున్‌తో ఓ డైలాగ్ చెబుతాడు. ‘ధర్మరాజు జూదం ఆడితే కురుక్షేత్రం జరిగింది రవి’ అంటూ తనికెళ్ల భరణి అల్లు అర్జున్‌లో స్ఫూర్తిని నింపుతాడు.&nbsp; https://www.youtube.com/watch?v=ypYkw6sHO_U ఖలేజా&nbsp; మహేశ్ బాబు, అనుష్కల మధ్య జరిగే సన్నివేశంలోనూ గురూజీ ఓ విషయాన్ని ఫన్నీ టోన్‌లో చెబుతారు. గ్రామస్థులంతా తనను దేవుడని నమ్ముతున్నారని మహేశ్ బాబుతో అనుష్క చెబితే.. ‘ట్యాక్సీ డ్రైవర్ అని చెప్పొచ్చుగా’ అని బాబు రిప్లై ఇస్తాడు. దీంతో ‘కృష్ణుడు కూడా అర్జునిడికి డ్రైవరే అని చెప్పారు’ అంటూ స్వీటీ బదులిస్తుంది.&nbsp; https://www.youtube.com/watch?v=LFnZyjBZzKE ఇంకా మీకు తెలిసిన సన్నివేశాలు ఉంటే కామెంట్లలో మాతో పంచుకోండి.  https://telugu.yousay.tv/ramayanam-references-in-guruji-trivikram-movies.html
    జూన్ 12 , 2023
    Ramayanam in Trivikram Movies: గురూజీ సినిమాల్లో రామాయణం రిఫరెన్స్‌లు
    Ramayanam in Trivikram Movies: గురూజీ సినిమాల్లో రామాయణం రిఫరెన్స్‌లు
    “విపరీతమైన విలువలు పాటించి జీవించిన వాడు మర్యాద పురుషోత్తముడు..రాముడు. ప్రపంచంలో ఇన్ని సార్లు తిరిగి తిరిగి తిరిగి చెప్పిన కథ ఏదైనా ఉందంటే రాముడిదే” ఇది s/o సత్యమూర్తి ప్రమోషన్ల టైంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ చెప్పిన మాట. రాముడు అన్నా, రామాయణ, మహాభారతాలు అన్నా త్రివిక్రమ్‌ అమితమైన గౌరవం. ఆ గౌరవాన్ని తాను రైటర్‌గా ఉన్నప్పటి నుంచే తన సినిమాల్లో అక్కడక్కడా చూపిస్తూనే ఉన్నాడు. ఫన్నీగానో, సీరియస్‌గానో, ఎమోషనల్‌గానే తన సినిమాలో చిన్న డైలాగ్ అయినా రామాయణం నుంచి రిఫరెన్స్‌ తీసుకుని రాస్తుంటాడు. అలాంటివి కొన్ని చూద్దాం. నువ్వు నాకు నచ్చావ్‌! ప్రకాశ్‌ రాజ్‌ ఇంటికి వెంకటేశ్‌ వచ్చినపుడు సునీల్‌ తనని ఔట్‌ హౌజ్‌కు తీసుకెళ్తాడు. అక్కడ ఆ ఇంటి గురించి చెబుతూ.. “ అయ్యగారు రాముడైతే అమ్మగారు సీత.. అందుకే ఈ ఇంటికి అయోధ్య అని పేరు పెట్టారు” అంటాడు. వెంటనే వెంకటేశ్‌ సెటైర్‌ వేస్తూ అయితే “ఔట్‌హౌజ్‌ పేరు లంకా” అనేస్తాడు. https://www.youtube.com/watch?v=UVFCtTNU29s అత్తారింటికి దారేది అత్తారింటికి దారేదిలో పవన్ కల్యాణ్ తన అత్తయ్యని ఒప్పించి ఇంటికి తీసుకురావడానికి బయల్దేరుతున్నపుడు… ఎం.ఎస్‌. నారాయణ ఇప్పుడెలా ఒప్పిస్తారు సార్‌ అని అడుగుతాడు. అప్పుడు పవన్ కల్యాణ్‌ “ ఒరేయ్‌ రాముడు సముద్రం దాకా వెళ్లాక బ్రిడ్జ్‌ ఎలా కట్టాలి అని ప్లాన్‌ చేసుకున్నాడు గానీ అడవిలో బ్రిడ్జ్‌కు ప్లాన్‌ గీసుకుని సముద్రం దగ్గరకు వెళ్లలేదురా” అని చెప్తాడు. అంటే అక్కడికెళ్లాక చూసుకుందాంలే అనే చిన్న మాటను గురూజీ ఇలా తన స్టైల్‌లో రాశాడు. https://www.youtube.com/watch?v=9-PckWpekQY జల్సా జల్సాలో ఇలియానాకు అమ్మాయిల గురించి చెబుతూ… ఇప్పుడంటే అమ్మాయిలు అబ్బాయిల వెనకాల పడుతున్నారు గానీ గతంలో కనీసం కన్నెత్తి కూడా చూసేవారు కాదు. అంతెందుకు సాక్షాత్తు శ్రీరాముల వారు ఆల్‌ ది వే లంక దాకా బ్రిడ్జి కట్టుకుని వచ్చి మరీ యుద్ధం చేస్తుంటే సీతమ్మ అశోక చెట్టు కింద పడుకుంది గానీ కనీసం చెట్టు ఎక్కి చూసిందా?” అంటూ చెబుతాడు.&nbsp; https://www.youtube.com/watch?v=ow0cZU-BkrI అ ఆ ‘అ ఆ’లో అనుపమ చెప్పే ఈ డైలాగ్‌ అయితే అందరికీ తెలిసిందే. ‘ రావణాసురుడి మమ్మీ, డాడీ కూడా ‘సూర్పనక’ను సమంత అనే అనుకుంటారు కదే అని రావు రమేశ్ అంటే.. రావణాసురుడి భార్య కూడా తన భర్తను పవన్ కల్యాణ్‌ అనే అనుకుంటుంది అంటూ ఫన్నీగా రామాయణంలో క్యారెక్టర్ల రిఫరెన్స్ తీసుకున్నాడు. https://www.youtube.com/watch?v=qrrldRJc5e8 మన్మథుడు మన్మథుడులో సునీల్‌ తన వదిన జోలికి రాకండి అని వార్నింగ్‌ ఇచ్చే క్రమంలో “ రాముడు పక్కనుండగా సీత జోలికి ఎవడైనా వస్తే లక్ష్మణుడికి కోపం రావడం ఎంత సహజమో. ఇప్పుడు నాకు కోపం రావడం అంతే సహజం’ అంటూ తణికెళ్ల భరణికి వార్నింగ్‌ ఇస్తాడు.&nbsp; https://www.youtube.com/watch?v=vn3CHyPz8Ow అల వైకుంఠపురములో అల్లు అర్జున్‌కు రాంబంటు అని పేరు పెడితే అదేం పేరు అండి అంటూ ఆచార్యుల వారు అడుగుతారు. రాంబంటు అంటే ఆంజనేయ స్వామికి గుడి కట్టి పూజ చేయట్లేదు అని మురళీ శర్మ అంటాడు. ఆయన రాముడికి బంటు అండి అంటూ ఆచార్యులు సమాధానం ఇస్తారు.ఇలా ఇంకా చాలా సినిమాల్లో సింగిల్ లైన్‌లో త్రివిక్రమ్‌ పౌరాణికాలపై తనకున్న ప్రేమను ప్రదర్శించాడు. అజ్ఞాతవాసి “సీతాదేవిని తెచ్చాడని మండోదరి రావణాసురుడికి అన్నం పెట్టడం మానేసిందా?” ( కీర్తి సురేశ్‌తో తన తల్లి) S/O సత్యమూర్తి “రావణాసురుడు సీతను పట్టుకున్నాడు రాముడి చేతిలో చచ్చాడు వదిలేసుంటే కనీసం బతికేవాడు” ( ఫంక్షన్‌లో అల్లు అర్జున్‌) భీమ్లా నాయక్‌ “ఆ రాముడు కూడా ఇలాగే ఒకటే బాణం ఒకరే సీత అని అడవుల్లో వదిలేశాడు”( పవన్ కల్యాణ్‌తో నిత్య మీనన్‌) అతడు “హనుమంతుడి కన్నా నమ్మకైన వాడు రాముడికి ఇంక ఎవరున్నారు చెప్పు” (సునీల్‌తో మహేశ్‌ బాబు)మీకు ఇంకా ఏమైనా తెలిస్తే కామెంట్ల రూపంలో తెలియజేయండి.
    ఏప్రిల్ 14 , 2023

    @2021 KTree