• TFIDB EN
  • అలా ఎలా
    UATelugu
    హీరోకి అనుకోకుండా ఓ అమ్మాయితో పెళ్లి ఫిక్స్‌ అవుతుంది. అయితే తనే పెళ్లి కొడుకు అని చెప్పకుండా ఆమెకు పరిచయం అవ్వాలని హీరో ప్లాన్‌ వేస్తాడు. ఫ్రెండ్స్‌తో కలిసి ఆమె ఊరికి వెళ్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది కథ.
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌Zee5ఫ్రమ్‌
    Watch
    రివ్యూస్
    How was the movie?

    తారాగణం
    రాహుల్ రవీంద్రన్
    కార్తీక్
    హెబ్బా పటేల్
    శృతి
    కుషిదివ్య
    భాను శ్రీ మెహ్రా
    వెన్నెల కిషోర్
    శని సాల్మన్
    కొండవలస
    కృష్ణ భగవాన్
    కృష్ణ భగవాన్
    రవి వర్మ
    సిబ్బంది
    అనీష్ ఆర్. కృష్ణదర్శకుడు
    అశోక్ వర్ధన్నిర్మాత
    భీమ్స్ సిసిరోలియో
    సంగీతకారుడు
    కథనాలు
    హెబ్బా పటేల్ గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
    హెబ్బా పటేల్ గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
    హెబ్బా పటేల్ తెలుగు సినీ నటి. తమిళ్, కన్నడ చిత్రాల్లోనూ నటించింది. తెలుగులో అలా ఎలా? ద్వారా పరిచయమైంది. కుమారి 21F సినిమాతో గుర్తింపు పొందింది. ఈ చిత్రంలో ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఆ తర్వాత ఈడోరకం ఆడోరకం, మిస్టర్, 24 కిస్సెస్, ది గ్రేట్ ఇండియన్ సూసైడ్ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. రెడ్ చిత్రంలో రామ్‌ పొత్తినేని సరసన ఓ ఐటెం సాంగ్‌లో కూడా నటించింది. ప్రస్తుతం వెబ్‌సిరీస్‌ల్లోనూ నటించి గుర్తింపు తెచ్చుకున్న హెబ్బా పటేల్(Some Lesser Known Facts about Hebba Patel) గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు హెబ్బా పటేల్ ఎప్పుడు పుట్టింది? 1989,  జనవరి 6న జన్మించింది హెబ్బా పటేల్ తెలుగులో నటించిన తొలి సినిమా? అలా ఎలా(2014) తెలుగులో గుర్తింపునిచ్చిన సినిమా కుమారి 21F(2015) హెబ్బా పటేల్ ఎత్తు ఎంత? 5 అడుగుల 5అంగుళాలు  హెబ్బా పటేల్ ఎక్కడ పుట్టింది? ముంబై హెబ్బా పటేల్ అభిరుచులు? డ్యాన్సింగ్, స్విమ్మింగ్ హెబ్బా పటేల్‌కు ఇష్టమైన ఆహారం? నాన్‌వెజ్ హెబ్బా పటేల్‌కు  ఇష్టమైన కలర్ ? వైట్ హెబ్బా పటేల్‌కు ఇష్టమైన హీరో? సల్మాన్ ఖాన్, మహేష్ బాబు హెబ్బా పటేల్ పారితోషికం తీసుకుంటుంది? ఒక్కొ సినిమాకు రూ.50 లక్షల వరకు ఛార్జ్ చేస్తోంది. హెబ్బా పటేల్ సినిమాల్లోకి రాకముందు ఏం చేసేది? మోడలింగ్ చేసేది హెబ్బా పటేల్ ఇన్‌స్టాగ్రాం లింక్? https://www.instagram.com/ihebahp/?hl=en https://www.youtube.com/watch?v=kSipyGA5qC0
    ఏప్రిల్ 02 , 2024
    EXCLUSIVE: టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్… దర్శకులుగా మారుతున్న యంగ్ హీరోలు
    EXCLUSIVE: టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్… దర్శకులుగా మారుతున్న యంగ్ హీరోలు
    'డైరెక్టర్' ని సినిమాకు టీమ్ లీడర్ లాంటి వాడు. హీరో నుంచి ఇతర నటీనటుల వరకు అతన్ని ఫాలో అవ్వాల్సిందే. అందుకే సినిమా ఫలితం ఎలా ఉన్నా అతకే ఆపాదిస్తారు. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఓ కొత్త ట్రెండ్ నడుస్తోంది. చాలా మంది కుర్ర హీరోలు దర్శకుడు, రచయితలుగా కొత్త అవతారం ఎత్తుతున్నారు.  టాలీవుడ్‌లో ఈ కోవలో హీరో నుంచి దర్శకులుగా మారిన వారి గురించి  ఓసారి చూద్దాం. అడవి శేషు(Adivi Sesh) ఈ కేటగిరిలో మనకు ముందు గుర్తొచ్చే పేరు.. విలక్షణ నటుడు యంగ్ హీరో అడివి శేషు.  'కర్మ' అనే సినిమాతో  డెరెక్టర్‌గా మారి అందరి దృష్టిని ఆకర్షించాడు.శేష్ ఈ సినిమాకు రచన, దర్శకత్వం వహించడమే కాకుండా అందులో ప్రధాన పాత్ర కూడా పోషించాడు. ఈ సినిమాకు మంచి ప్రశంసలు లభించాయి. ఆ తర్వాత 'కిస్' సినిమాని డైరెక్ట్ చేశాడు. ఈ సినిమా విజయవంతం కాలేదు. అయితే ప్రస్తుతం అడవి శేష్ రచయితగా, హీరోగా సత్తా చాటుతున్నాడు.  విశ్వక్ సేన్(Vishwak Sen) ఈ నగరానికి ఏమైంది చిత్రం ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న విశ్వక్ సేన్‌లో మంచి టాలెంట్ దాగుంది. ఓ స్క్రీన్‌ప్లే రైటర్‌గా, రచయితగా, హీరోగా, డైరెక్టర్‌గా బహుముఖ ప్రజ్ఞను చాటుతున్నాడు. ఫలక్‌నామా దాస్(2019) చిత్రాన్ని డైరెక్ట్ చేసి ప్రశంసలు పొందాడు. ఈ చిత్రంలో నటించడంతో పాటు ప్రొడ్యూస్ చేశాడు.  మరో నాలుగేళ్ల తర్వాత  దాస్‌ కా ధమ్కీ(2023) చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు. ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఇటీవల విడుదలైన గామి చిత్రం మంచి సక్సెస్ అందుకుంది. విశ్వక్‌ నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి విడుదల కావాల్సి ఉంది.  సిద్ధు జొన్నలగడ్డ(Siddu Jonnalagadda) ప్రస్తుతం టాలీవుడ్‌లో డైరెక్టర్లకు మోస్ట్ వాంటెడ్ హీరోగా సిద్ధు జొన్నలగడ్డ మారిపోయాడు. స్టార్ బాయ్ సిద్ధూ కూడా స్టోరీ రైటర్‌గా, స్క్రీన్‌ప్లే రచయితగా, ఎడిటర్‌గా సత్తా చాటుతున్నాడు. బ్లాక్ బాస్టర్ చిత్రం DJ టిల్లుకు స్టోరీ రాసిన సిద్ధు జొన్నలగడ్డ.. దాని సీక్వేల్ టిల్లు స్కేర్‌కు కూడా కథ అందించాడు. ఈ చిత్రం సూపర్ హిట్ కావడంతో సిద్ధు టాలెంట్ టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారిపోయింది. ఈ చిత్రాల కంటే ముందు గుంటూరు టాకీస్, కృష్ణ అండ్ హిస్ లీల, మా వింత గాధ వినుమా చిత్రాలకు స్టోరీతో పాటు సంభాషణలు అందించాడు. టిల్లు స్కేర్ చిత్రం తర్వాత దీనికి సీక్వెల్‌గా టిల్లు క్యూబ్ ఉంటుందని ఇటీవల ప్రకటించారు. రాహుల్ రవీంద్రన్(Rahul Ravindran) 'అందాల రాక్షసి', 'టైగర్', 'అలా ఎలా' వంటి సినిమాలలో హీరోగా నటించిన రాహుల్ రవీంద్రన్.. 'చి..ల..సౌ' సినిమాతో దర్శకుడిగా మెగాఫోన్ పట్టుకున్నారు. ఆ తర్వాత 'మన్మధుడు 2' సినిమాతో కింగ్ అక్కినేని నాగార్జున ను డైరెక్ట్ చేశాడు. 'స్నేహగీతం' 'ఇట్స్ మై లవ్ స్టోరీ' వంటి చిత్రాల్లో హీరోగా నటించిన వెంకీ అట్లూరి.. 'తొలిప్రేమ' సినిమాతో డైరెక్టర్ అవతరమెత్తాడు. ఈ క్రమంలో నటనను పక్కనపెట్టి 'మిస్టర్ మజ్ను' 'రంగ్ దే' వంటి సినిమాలను తెరకెక్కించాడు. అయితే టాలీవుడ్‌లో హీరోలు మెగా ఫోన్ పట్టుకోవడం ఇదే కొత్తకాదు. గతంలో దిగ్గజ నటులు ఎన్టీఆర్, సూపర్ స్టార్ కృష్ణ, పవన్ కళ్యాణ్ డైరెక్టర్లుగా మారి తమ అభిరుచికి తగ్గ సినిమాలను తెరకెక్కించారు. పవన్ కళ్యాణ్(Pawan Kalyan) పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా మెగాఫోన్‌ను చేత పట్టుకుని కట్, యాక్షన్ చెప్పారు. తన సొంత బ్యానర్‌లో తెరకెక్కిన 'జానీ' చిత్రానికి పవన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ప్లాఫ్‌ అవడంతో పవన్ మళ్ళీ డైరెక్షన్ వైపు చూడలేదు. 'గుడుంబా శంకర్', 'సర్దార్ గబ్బర్ సింగ్' చిత్రాలకు స్టోరీ-స్క్రీన్ ప్లే అందించారు. టాలీవుడ్‌లో ఈ జనరేషన్‌లో హీరో నుంచి డైరెక్టర్‌గా మారిన నటుడు పవన్ కళ్యాణ్ అని చెప్పవచ్చు. ఆర్‌ నారాయణ మూర్తి(R. Narayana Murthy) విప్లవ సినిమాల హీరో పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి సైతం ఓ వైపు నటుడిగా రాణిస్తూనే నిర్మాతగా, డైరెక్టర్‌గా మారి... పలు సందేశాత్మక చిత్రాలను తెరకెక్కించారు. అర్ధరాత్రి స్వాతంత్ర్యం సినిమా దర్శకుడిగా ఆయన తెరకెక్కించిన తొలి చిత్రం. దండోరా, ఎర్రసైన్యం వంటి సూపర్ హిట్ చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. ఎన్టీఆర్ &సూపర్ స్టార్ కృష్ణ లెజెండరీ యాక్టర్ ఎన్టీర్ స్టార్ హీరోగా ఉన్న సమయంలోనే  అనేక పౌరాణిక, జానపద చిత్రాలకు దర్శకత్వం వహించారు.'సీతారామ కళ్యాణం' అనే మూవీతో డైరెక్టర్‌గా ఆయనకు తొలి సినిమా. ఆ తర్వాత 'గులేభకావళి కథ' 'దాన వీర శూర కర్ణ' 'చాణక్య చంద్రగుప్తా' 'తల్లాపెళ్లామా' వంటి సినిమాలను డైరెక్ట్ చేశారు. ఓ వైపు స్టార్ హీరోగా కొనసాగుతూనే డైరెక్టర్‌గాను సక్సెస్ అయ్యారు. సూపర్ స్టార్ కృష్ణ కూడా హీరోగా నటిస్తూనే  డైరెక్టర్‌గా మారి పలు విజయవంతమైన సినిమాలను తెరకెక్కించారు. . 'సింహాసనం' అనే భారీ బడ్జెట్ సినిమాతో డైరెక్టర్‌గా మారిన కృష్ణ.. ఆ తర్వాత ఎన్నో సక్సెస్ ఫుల్ సినిమాలను డైరెక్ట్ చేశారు. 'శంఖారావం', 'కలియుగ కర్ణుడు', 'ముగ్గురు కొడుకులు' 'కొడుకు దిద్దిన కాపురం' 'రిక్షావాలా' 'అన్నా తమ్ముడు' 'ఇంద్ర భవనం' 'అల్లుడు దిద్దిన కాపురం' 'రక్త తర్పణం' 'మానవుడు దానవుడు'వంటి హిట్ చిత్రాలను ఆయన తెరకెక్కించారు.
    ఏప్రిల్ 01 , 2024
    OTT MOVIES: ఈ వారం థియేటర్లు/OTTల్లో రిలీజ్ కానున్న సినిమాల లిస్ట్ ఇదే!
    OTT MOVIES: ఈ వారం థియేటర్లు/OTTల్లో రిలీజ్ కానున్న సినిమాల లిస్ట్ ఇదే!
    ఈ వారం పలు సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి.  ఆహ్లాదకరమైన వినోదాన్ని అందించేందుకు రాబోతున్నాయి. జులై 17-23 తేదీల మధ్య పలు సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. అలాగే ఓటీటీలో కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్‌ కాబోతున్నాయి. మరి ఆ సినిమాలు ఏంటి? వాటి విశేషాల ఎలా ఉన్నాయి? ఈ కథనంలో చూద్దాం. థియేటర్లలో విడుదలయ్యే చిత్రాలు హిడింబ అశ్విన్‌బాబు, నందిత శ్వేత జంటగా నటించిన చిత్రం ‘హిడింబ’. అనిల్‌ కన్నెగంటి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. గంగపట్నం శ్రీధర్‌ నిర్మాత. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా గురువారం (జులై  20)  ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘ఇప్పటివరకూ చూడని ఓ కొత్త కథతో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతామని చిత్ర బృందం చెబుతోంది. ఈ చిత్రంలోని  థ్రిల్లింగ్‌ అంశాలు ఆకట్టుకుంటాయని ధీమాగా ఉంది.  అన్నపూర్ణ ఫొటో స్టూడియో చైతన్య రావ్‌, లావణ్య జంటగా చేసిన చిత్రం ‘అన్నపూర్ణ ఫొటో స్టూడియో’ (Annapurna Photo Studio). ఈ చిత్రాన్ని చెందు ముద్దు డైరెక్ట్ చేశారు. యష్‌ రంగినేని నిర్మించారు. ‘ఒక మంచి కథను ఆసక్తికర కథనంతో తెరకెక్కించామని మేకర్స్‌ తెలిపారు. కథ 90వ దశకంలో సాగుతుందని పేర్కొన్నారు. ఇప్పుడొస్తున్న చిత్రాలతో పోలిస్తే కచ్చితంగా భిన్నంగా ఉంటుందని అంటున్నారు. కాగా, జులై 21న ఈ సినిమా విడుదల కానుంది. హత్య ‘బిచ్చగాడు-2’తో ఇటీవలే మంచి విజయాన్ని అందుకున్న విజయ్‌ ఆంటోని హత్య మూవీతో మరోమారు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఆయన హీరోగా నటించిన ఈ సినిమాని బాలాజీ కుమార్‌ తెరకెక్కించారు. రితికా సింగ్‌, మీనాక్షి చౌదరి కథానాయికలు. ఈ నెల 21న తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. విభిన్నమైన ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌గా దీన్ని తీర్చిదిద్దారు. ఒప్పెన్‌ హైమర్‌ ఈ ఏడాది సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ‘ఒప్పెన్‌ హైమర్‌’. హాలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్‌ క్రిస్టోఫర్‌ నోలాన్‌ ఈ మూవీని డైరెక్ట్‌ చేశాడు. అణుబాంబు సృష్టికర్త జె. రాబర్ట్‌ ఒప్పెన్‌ హైమర్‌ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తీర్చిదిద్దారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో చోటు చేసుకున్న పరిణామాలను నాటకీయ కోణంలో చూపించనున్నారు. వీఎఫ్‌ఎక్స్‌ షాట్స్‌ లేకుండా ఈ సినిమాను రూపొందించడం విశేషం. జులై 21న ఈ చిత్రం విడుదల కానుంది. హర్‌ రుహానీ శర్మ ప్రధాన పాత్రలో శ్రీధర్‌ స్వరాఘవ్‌ డైరెక్షన్‌లో రూపొందిన చిత్రం ‘హెచ్‌.ఇ.ఆర్‌.’ రఘు సంకురాత్రి, దీపా సంకురాత్రి సంయుక్తంగా నిర్మించారు. సురేష్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. ఇందులో రుహానీ శక్తిమంతమైన ఓ పోలీసు అధికారిణిగా కనిపించనున్నారు. ఆసక్తికర, కథా, కథనాలతో సినిమా సాగుతుందని చిత్ర బృందం చెబుతోంది. అలా ఇలా ఎలా ప్రముఖ దర్శకుడు పి.వాసు తనయుడు శక్తి వాసుదేవన్‌ హీరోగా తెరకెక్కించిన  సస్పెన్స్‌ థ్రిల్లర్‌ చిత్రం ‘అలా ఇలా ఎలా’. నాగబాబు, బ్రహ్మానందం, అలీ, నిషా కొఠారి తదితరులు కీలక పాత్రలు పోషించారు. మణిశర్మ సంగీతమందించారు. ఈ సినిమా జులై 21న థియేటర్లలోకి రానుంది. ఇతర సినిమాలు పైన చెప్పిన సినిమాలతో పాటు ఈ వారం నాగద్వీపం, కార్తీక, జిలేబి, నాతో నేను వంటి చిన్న సినిమాలు విడుదల కానున్నాయి. ఈ చిత్రాలు ప్రేక్షకులను కచ్చితంగా ఆకట్టుకుంటాయని చిత్ర నిర్మాతాలు భావిస్తున్నారు.  ఓటీటీలో రిలీజయ్యే చిత్రాలు/వెబ్‌సిరీస్‌లు TitleCategoryLanguagePlatformRelease DateThe deepest breathMovieEnglishNetflixJuly 19Sweet magnoliasWeb SeriesEnglishNetflixJuly 20The cloned tyroneMovieEnglishNetflixJuly 21BawaalMovieHindiAmazon PrimeJuly 21EstateMovieTamilZee5July 18Spider-Man: Across the Spider-VerseMovieEnglishZee5July 18Trial periodMovieHindiJioCinemaJuly 21
    జూలై 21 , 2023
    Top Whistle-Worthy Intro Scenes in Telugu Movies : తెలుగులో ఇప్పటి వరకు వచ్చిన టాప్ 15 హీరో ఎంట్రీ సీన్స్ ఇవే!
    Top Whistle-Worthy Intro Scenes in Telugu Movies : తెలుగులో ఇప్పటి వరకు వచ్చిన టాప్ 15 హీరో ఎంట్రీ సీన్స్ ఇవే!
    సినిమాల్లో హీరో ఎంట్రీ సీన్లతోనే… ప్రేక్షకులు ఆ చిత్రంపై ఓ అంచనాకు వస్తారు. ముఖ్యంగా స్టార్ హీరోలకైతే కచ్చితంగా ఎలివేషన్‌తో కూడిన ఇంట్రో సీన్ పడాల్సిందే. లేకపోతే ఫ్యాన్స్ నానా రచ్చ చేస్తుంటారు. తెలుగులో హీరో ఎంట్రీ సీన్‌ ప్రత్యేకంగా లేని సినిమాను ఊహించడం చాలా కష్టమనే చెప్పాలి. ఫ్యాన్స్ ఛాయిస్, హీరో ఇమేజ్‌కు తగ్గట్టుగా డైరెక్టర్లు ముందుగానే ఈ ఇంట్రో సీన్ల కోసం చాలా కసరత్తు చేస్తుంటారు. సినిమా డిస్సాపాయింట్ చేసినా ఫ్యాన్స్‌ కాస్త ఒప్పుకుంటారు కానీ... ఇంట్రో సీన్‌ మాత్రం బాక్స్‌ బద్దలవాల్సిందే అని కోరుకుంటారు. మరి తెలుగు సినిమాల్లో ఇప్పటి వరకు వచ్చిన బెస్ట్ ఇంట్రో సీన్లను ఓసారి చూద్దామా. అతడు- మహేష్ బాబు "ఎవరని ఎదురే నిలిస్తే తెలిసే బదులతడే పెను తుఫాను తలొంచి చూసే తొలి నిప్పు కణం అతడే పెను తుఫాను తలొంచి చూసే తొలి నిప్పు కణం అతడే... అతడే.. అంటూ ఈ సాంగ్ లిరిక్స్ సాగుతూ మహేష్ బాబు ఇచ్చే పవర్‌ఫుల్ ఎంట్రీ ఇప్పటికీ ఎవర్‌ గ్రీన్ అని చెప్పాలి. అతడు సినిమాలో మహేష్‌ బాబు ఎంట్రీ సీన్‌కు పడిన BGM సూపర్బ్‌గా ఉంటుంది. మణిశర్మ అందించిన స్కోర్‌ బెస్ట్ ఇంట్రో BGMలలో ఒకటిగా చెప్పవచ్చు. https://youtu.be/HpqfxXRhlgU?si=gVE6a5dcBzFqR1lQ పవన్ కళ్యాణ్- అత్తారింటికి దారేది "బుల్లెట్ ఆరు అంగుళాలే ఉంటుంది కానీ మనిషిని చంపుతుంది. అదే బుల్లెట్ ఆరు అడుగులు ఉంటే ఎలా ఉంటాడో అలా ఉంటాడు నా మనవడు గౌతం నందా" అని పవన్ కళ్యాణ్ గురించి ఆయన తాతా ఇచ్చే ఎలివేషన్ పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు గూస్‌బంప్స్ తెప్పిస్తాయి. ఆ తర్వాత వచ్చే BGMకు ఫ్యాన్స్‌ అరుపులు కేకలతో థియేటర్లు దద్దరిళ్లిపోయాయి.  https://youtu.be/uoBS4Pl6-e8?si=CGm7Tdo6myR7330K ప్రభాస్- బాహుబలి 2 బాహుబలి2 ఇంట్రడక్షన్ సీన్ నెవర్ బిఫోర్‌ అని చెప్పవచ్చు. రాజ్యం సుభిక్షంగా ఉండేందుకు రాజ మాత శివగామి దేవి అఖండ జ్యోతిని తలపై పెట్టుకుని వెళ్తున్న క్రమంలో మదగజం నుంచి ఆమెను ప్రభాస్ కాపాడే సీన్ నిజంగా గూస్ బంప్స్ తెప్పిస్తుంది. తెలుగులో వచ్చిన బెస్ట్ హీరో ఇంట్రడక్షన్ సీన్లలో ఇదొకటిగా చెప్పవచ్చు. ఈ సీన్‌లో బాహుబలి బలం, ధైర్యాన్ని దర్శకుడు ఈ సీన్‌లో చెప్పకనే చెప్పాడు. https://youtu.be/jkgaUY3VJHY?si=IKuFfqQIiA6VeL92 దసరాలో నాని దసరా సినిమాలో నాని హీరోయిజాన్ని ఎలివేట్ చేస్తూ వచ్చిన ప్రతి సీన్ అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా రన్నింగ్ ట్రైన్‌లో బొగ్గు దొంగతనం చేసే సీన్‌ ఫ్యాన్స్‌ చేత కేకలు పుట్టించిందని చెప్పవచ్చు. https://youtu.be/WcOf-pvKGn0?si=xZn3a4j-BvVMyrNF బాలకృష్ణ- లెజెండ్ నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోయిజాన్ని ఎలివేట్ చేస్తూ వచ్చినన్ని ఇంట్రడక్షన్ సీన్లు మరేతర హీరోకు రాలేదని చెప్పాలి. ముఖ్యంగా లెజెండ్ సినిమాలో విలన్లను చేజ్ చేసి ఫైట్ సిక్వెన్స్, తన మార్క్ డైలాగ్స్, ఇంట్రోకు తగ్గట్టుగా ఆయన చెప్పే పవర్ ఫుల్ డైలాగ్స్ నిజంగా ఫ్యాన్స్‌కు కన్నుల పండుగ. https://youtu.be/Ech6LOW6UQA?si=-ueNWM61P2nAq4j- రామ్‌ చరణ్- చిరుత తన తొలి సినిమా చిరుతలో పవర్‌ఫుల్ ఇంట్రో పొందాడు హీరో రామ్‌ చరణ్. జైళ్లో తొటి ఖైదీలు అవమానించినప్పుడు వారిపై చరణ్ తన మొహం కనిపించకుండా రివేంజ్ తీర్చుకునే సీన్.. మెగా ఫ్యాన్స్‌ చేత పూనకాలు పెట్టించింది. https://youtu.be/4OgJoMj7kLo?si=u3wI9Bsm_Sd7YDby జూ.ఎన్టీఆర్- RRR కొమురం భీం క్యారెక్టర్ గురించి బ్రిటిష్ వారికి రాజీవ్ కనకాలా చెప్పే సీన్ నిజంగా జూ. ఎన్టీఆర్ సినిమాల్లో బెస్ట్ ఇంట్రోగా చెప్పవచ్చు. ఆ సీన్‌లో తారక్ పులితో పొరాడే సన్నివేశం అద్భుతంగా ఉంటుంది.  https://youtu.be/BN1MwXUR3PM?si=Cl7Fpcj0qc2nigQu పవన్ కళ్యాణ్- పంజా  పంజా సినిమాలో పవన్ కళ్యాణ్ ఇంట్రడక్షన్ సీన్‌ సైతం ఫ్యాన్స్‌కు గూస్ బంప్స్ తెప్పిస్తాయి. బందీగా ఉన్న తనికెళ్ల భరణిని కాపాడేందుకు వెళ్లిన పవన్‌ను చంపేందుకు విలన్లు అతని కారుపై కాల్పులు జరుపుతారు. ఈక్రమంలో పవన్ చనిపోయాడని దగ్గరకు వెళ్తారు. కట్ చేస్తే... పెద్ద బాంబు పేలిన శబ్దం.. పవర్‌ఫుల్ బీజీఎంతో పవన్ ఎంట్రీ సీన్ సూపర్‌గా ఉంటుంది. https://youtu.be/4OgJoMj7kLo?si=u3wI9Bsm_Sd7YDby మహేష్ బాబు- పోకిరి పోకిరి సినిమాలో మహేష్ బాబు ఇంట్రడక్షన్ సీన్‌ కూడా ప్రేక్షకులను విపరీతంగా అలరించింది. "మేము కాదు పండుగాడు.. రేపు పొద్దున ఇందిరా నగర్‌లో పరుగెత్తించి, పరుగెత్తించి కొడుతాడు" అని హీరో ఫ్రెండ్స్ ఇచ్చే ఎలివేషన్.. కట్ చేస్తే.. మహేష్ స్టన్నింగ్ రన్నింగ్ స్టైల్‌తో వచ్చే ఇంట్రో సూపర్బ్‌గా ఉంటుంది. https://youtu.be/e8-GhC0gFtQ?si=PGXqB0DN34tfHaJg అల్లు అర్జున్- ఆర్య మ్యాన్‌ హోల్ పడిన కుక్క పిల్లను బన్నీ రక్షించే సీన్... హార్ట్‌ ఫెల్ట్‌గా ఉంటుంది. ఈలాంటి సీన్‌తో ఇప్పటి వరకు ఏ హీరోకు ఇంట్రో పడలేదని చెప్పాలి. అప్పవరకు ఉన్న మూస ధొరణి ఇంట్రోలకు సుకుమార్ తన స్టైల్‌ ఆఫ్ టేకింగ్‌తో ఫుల్‌స్టాప్ పెట్టాడు. https://youtu.be/kvYePkoR6s0?si=jNeyhKqY4ARC-zRZ సింహాద్రి- జూనియర్ ఎన్టీఆర్ సింహాద్రి అప్పన్నకు మొక్కు చెల్లించేందుకు వెళ్తున్నప్పుడు విగ్రహాన్ని కోతి దొంగిలించి విలన్లకు ఇస్తుంది. కట్‌ చేస్తే జూ. ఎన్టీఆర్ ఇంట్రో అదిరిపోతుంది. https://youtu.be/P9q4u7KR9Is?si=Ftql6FN6xG8-uABE స్టాలిన్- చిరంజీవి మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమాల్లో వచ్చిన ఇంట్రోల్లో స్టాలిన్ ఇంట్రో వన్‌ ఆఫ్‌ ది బెస్ట్ అని చెప్పవచ్చు.  అమ్మాయిని కిడ్నాప్‌ చేసిన విలన్లకు చిరు బుద్ది చెప్పే సీన్ ఫ్యాన్స్‌కు గూస్ బంప్స్ తెప్పిస్తుంది. https://youtu.be/Dlc5V4Gi0So?si=Af3xz6wiuoQw5NfT రామ్‌ చరణ్- మగధీర ఈ చిత్రంలో రామ్‌ చరణ్ చేసే హై ఎండ్ ఎక్స్‌ట్రీమ్ బైక్ ఫీట్.. టాలీవుడ్‌లో వచ్చిన బెస్ట్ హీరో ఎంట్రీ సీన్లలో ఒకటిగా చెప్పవచ్చు. https://youtu.be/uGh4lbLnmio?si=vsy6ox3mmaiNDg_i ప్రభాస్- బిల్లా హాలీవుడ్ రేంజ్‌ ఎలివేషన్ ఈ సినిమాలో ప్రభాస్‌కు దక్కింది. ఆయన కటౌట్‌కు తగ్గ BGM స్కోర్ సూపర్బ్‌గా ఉంటుంది. ముఖ్యంగా హీరో ఎంట్రీ సీన్‌ ఆ సీన్‌కు తగ్గ మణిశర్మ బీజీఎం, ప్రభాస్ యాటిట్యూడ్‌ను ఎలివేట్ చేసింది.  https://youtu.be/jq1Kr3nlOCE?si=OxJV6jjNiTTEDHta ఘర్షణ- వెంకటేష్ ఈ చిత్రంలో వెంకటేష్ ఇంట్రో వెరైటీగా చూపించాడు దర్శకుడు గౌతమ్ మీనన్. "నా పేరు రామచంద్ర, ఐపీఎస్, నా డ్రెస్ మీద ఉన్న మూడు సింహాలే నా జీవితం, నా తపస్సు" అంటూ ఎలివేషన్‌తో వెంకీని చూపించాడు. https://youtu.be/APNGeCwPlGQ?si=KxY7kBiopg4-6I5a
    ఫిబ్రవరి 26 , 2024
    Telugu dubbed movies: ఈ సినిమాలను అస్సలు మిస్‌ కావొద్దు.. ఒక్కసారైన చూసి తీరాల్సిన చిత్రాలు!
    Telugu dubbed movies: ఈ సినిమాలను అస్సలు మిస్‌ కావొద్దు.. ఒక్కసారైన చూసి తీరాల్సిన చిత్రాలు!
    ప్రస్తుతం భారతీయ సినిమా మరింత సరళంగా మారింది. ఒక భాషలో రిలీజైన సినిమాలను మరో భాషలోని ప్రేక్షకులు చూసి ఆదరిస్తున్నారు. కంటెంట్ బాగుంటే భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులు ఆ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. మరి గత రెండేళ్లలో తెలుగులోకి చాలా చిత్రాలు వివిభ భాషల నుంచి డబ్ అయ్యాయి. వాటిలో సూపర్ హిట్‌ అయిన మలయాళం, తమిళ్, కన్నడ, హిందీ చిత్రాలతో పాటు అవి ఏ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులో ఉన్నాయో ఓసారి చూద్దాం. [toc] Best malayalam movies in telugu ప్రేమలు రీసెంట్‌గా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. యూనిక్ కథాంశంతో యూత్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా తెలుగులో ఈ సినిమా మంచి కలెక్షన్లు రాబట్టింది. ఈ చిత్రం కథంతా హైదరాబాద్ కేంద్రంగా ఉండటంతో తెలుగు ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు. ఇక సినిమా కథలోకి వెళ్తే..స‌చిన్.. ఉన్న‌త చ‌దువుల కోసం విదేశాల‌కు వెళ్లాల‌ని క‌ల‌లు కంటాడు. వీసా రిజెక్ట్ కావ‌డంతో గేట్ కోచింగ్ కోసం హైద‌రాబాద్ వ‌స్తాడు. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని రీనూతో తొలి చూపులోనే ప్రేమ‌లో ప‌డ‌తాడు. అప్ప‌టికే ల‌వ్‌లో ఫెయిలైన స‌చిన్‌.. రీనూకు త‌న ప్రేమ‌ను ఎలా చెప్పాడు? రీనూను ప్రేమిస్తున్న ఆది ఎవ‌రు? స‌చిన్‌ - రీనూ చివ‌ర‌కు కలిశారా? లేదా? అన్న‌ది క‌థ‌. మంజుమ్మెల్‌ బాయ్స్‌  ఈ చిత్రం మంచి ఎమోషనల్ బ్యాక్‌డ్రాప్‌లో సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో వచ్చింది. ఈ సినిమా దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో మంచి వసూళ్లు సాధించింది. ఇక ఈ సినిమా కథలోకి వెళ్తే.. కేర‌ళ‌ కొచ్చికి చెందిన కుట్ట‌న్, సుభాష్ స్నేహితులతో కలిసి కొడైకెనాల్ ట్రిప్‌లో భాగంగా గుణ కేవ్స్‌కు వెళ్తారు. అక్క‌డ సుభాష్ పొరపాటున 150 అడుగులకు పైగా లోతున్న డెవిల్స్ కిచెన్ లోయ‌లో ప‌డ‌తాడు. ఆ త‌ర్వాత ఏమైంది? పోలీసులు, రెస్క్యూ సిబ్బంది వారికి ఎందుకు సహకరించలేదు? సుభాష్‌ను కాపాడి తీసుకురావ‌డానికి తోటి మిత్రులు ఏం చేశారు? అన్నది కథ. ఆవేశం ఇటీవల మలయాళంలో బ్లాక్ బాస్టర్ అయిన ఆవేశం చిత్రం అన్ని భాషల్లోనూ అదే హవా కొనసాగించింది. ఈ చిత్రం ఏకంగా రూ.150 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. కామెడీ యాక్షన్ జొనర్‌లో వచ్చి మంచి ఎంటర్‌టైనింగ్ అందించింది. ఈ సినిమా కథలోకి వెళ్తే..కేరళకు చెందిన బీబీ (మిథున్ జై శంకర్), అజు (హిప్‌స్టర్), మరియు శాంతన్ (రోషన్ షానవాజ్) ముగ్గురు స్నేహితులు బెంగళూరులోని ఒక ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతుంటారు. కాలేజీలో సీనియర్లు కారణం లేకుండా కొడుతుంటారు. దీంతో వారికి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుంటారు. ఈక్రమంలో గ్యాంగ్‌స్టర్ అయిన రంగాతో(ఫాహద్ ఫాసిల్) ఫ్రెండ్‌షిప్ చేస్తారు. రంగా స్నేహం వారి జీవితాలను ఏవిధంగా మార్చిందనేది కథ. ది గోట్ లైఫ్ ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఇక కథలోకి వెళ్తే.. నజీబ్ (పృథ్వీరాజ్ సుకుమారన్) తన భార్య సైను (అమలా పాల్)తో ఆనందంగా జీవిస్తుంటాడు. తన స్నేహితుడి సలహాతో దుబాయ్ వెళ్లి డబ్బు సంపాదించాలని నిర్ణయించుకుంటాడు. దుబాయి వెళ్లిన నజీబ్.. ఖలిప్ చేతిలో ఇరుక్కుంటాడు. నజీబ్‌ను బలవంతంగా గొర్రెలను కాసేలా ఓ ఎడారిలో బంధిస్తారు. ఈక్రమంలో నజీబ్ అక్కడి నుంచి తప్పించుకోవడానికి ఎలాంటి కష్టాలు పడ్డాడు? తిరిగి తన కుటుంబాన్ని చేరుకున్నాడా? లేదా? అన్నది మిగతా కథ RDX మార్షియల్ ఆర్ట్స్ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం మలయాళంలో బ్లాక్ బాస్టర్‌ హిట్‌గా నిలిచింది.  2018 కేరళ వరదల నేపథ్యంలో వచ్చిన చిత్రమిది. ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఈ చిత్రాన్ని ఆంథోని జోసెఫ్‌ డైరెక్ట్ చేశాడు. కింగ్ అఫ్ కొత్త ఖన్నా భాయ్ (డ్యాన్స్ రోజ్ షబీర్) కోతా పట్టణంలో డ్రగ్స్ వ్యాపారి. సిఐ షాహుల్ హాసన్ (ప్రసన్న) పట్టణంలో డ్రగ్స్ మాఫియాను నిర్మూలించాలని కంకణం కట్టుకుంటాడు. కొన్నేళ్ల క్రితం కోతా... రాజు (దుల్కర్ సల్మాన్) నియంత్రణలో ఉందని, ఒకప్పుడు ఖన్నా భాయ్ రాజుకి ప్రియమైన స్నేహితుడని షాహుల్ తెలుసుకుంటాడు. కానీ కొన్ని కారణాల వల్ల రాజు మరియు ఖన్నా భాయ్ ఇద్దరూ విడిపోయారు. వారిని వేరు చేసింది ఏమిటి? అప్పుడు సీఐ షాహుల్ హాసన్ ఏం చేశాడు? అనేది కథ రోమాంచం రోమాంచం చిత్రం మలయాళంలో వచ్చిన కామెడీ హర్రర్ చిత్రం. ఈ చిత్రాన్ని జితు మాధావన్ తెరకెక్కించారు. ఈ సినిమా నిజజీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. కథలోకి వెళ్తే…. బెంగుళూరులోని ఓ ఇంట్లో ఉండే ఏడుగురు బ్యాచిలర్ స్నేహితుల కథే ఈ చిత్రం. అందులో ఒకరు ఉద్యోగం చేస్తుంటారు, మరొకరు వ్యాపారాలు చేస్తూ విఫలమవుతుంటాడు. ఇద్దరు ఇంటర్వ్యూని క్రాక్ చేస్తారు కానీ ఇంకా ఆఫర్ లెటర్ అందదు. ఒకరు పెట్రోల్ పంపులో పనిచేస్తున్నారు. మిగిలిన ఇద్దరూ ఏమీ చేయకుండా తమ జీవితాలను సాగిస్తుంటారు. ఇలా సాగుతున్న వీరి జీవితాల్లోకి ఓ అనూహ్య పరిణామం చోటు చేసుకుంటుంది. ఇంతకీ ఎంటా పరిణామం? దాని వల్ల వీరి జీవితాలు ఎలా మారాయి అనేది కథ. భ్రమయుగం తేవన్ అనే గాయకుడు అడవిలో ప్రయాణిస్తూ ఓ పాడుబడ్డ పెద్ద భవంతికి వెళ్తాడు. అక్కడ యజమాని మమ్మూటీ (కుడుమోన్ పొట్టి), ఓ వంటవాడు ఉంటాడు. అనూహ్య పరిణామాల తర్వాత తేవన్ ఆ ఇంటి నుంచి పారిపోవాలని అనుకుంటాడు. అసలు తేవన్ ఏం చూసి భయపడ్డాడు? కుడుమోన్ పొట్టి ఎవరు? అడవిలో ఏం చేస్తున్నాడు? అన్నది కథ. అన్వేషిప్పిన్ కండెతుమ్ ఈ సినిమా మంచి సస్పెన్స్‌ను క్యారీ చేస్తూ.. ఆసక్తికరంగా కథనం సాగుతుంది. ఎస్సై ఆనంద్ నారాయణ్ ఓ కారణం చేత సస్పెండ్ అవుతాడు. ఓ యువతి హత్య కేసు మిస్టరీగా మారుతుంది. దీంతో ట్రాక్‌ రికార్డ్ ఆధారంగా ఆనంద్‌ను రంగంలోకి దింపుతారు. ఈ కేసును హీరో ఎలా సాల్వ్‌ చేశాడు? విచారణకు వెళ్లిన ఆనంద్‌కు ప్రజలు ఎందుకు సహకరించలేదు? అన్నది స్టోరీ. మలైకోట్టై వాలిబన్ స్వాతంత్య్రం కోసం బ్రిటీష్ వారిని ఎదురించి పోరాడిన ఓ నాయ‌కుడి క‌థ‌తో ఈ మూవీ తెర‌కెక్కింది. ఈ పోరాటంలో వాలిబాన్‌ (మోహ‌న్‌లాల్)కు ఎలాంటి అడ్డంకులు ఎదురయ్యాయి? ఆ ప్రాంత ప్రజలకు అతడు హీరోగా ఎలా నిలిచాడు? అన్నది కథ. నెరు కళ్లు కనిపించని సారా మహ్మద్‌ అనే యువతిపై ఒక బడా వ్యాపారి కొడుకు అత్యాచారం చేస్తాడు. పోలీసులు అతడ్ని అరెస్టు చేసినప్పటికీ నిందితుడు తన పలుకుబడితో వెంటనే బెయిల్‌పై బయటకొస్తాడు. దీంతో సారా తల్లిదండ్రులు లాయర్‌ విజయ్‌ మోహన్‌ (మోహన్‌లాల్‌)ని ఆశ్రయిస్తారు. అతడు సారాకు ఎలా న్యాయం చేశాడు? అన్నది కథ. మాలికాపురం ఎనిమిదేళ్ల చిన్నారి షన్ను అయ్యప్ప స్వామి భక్తురాలు. షన్ను కుటుంబంలో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటాయి. దీంతో సోదరుడు బుజ్జితో కలిసి షన్ను శబరిమలై బయలుదేరుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? పిల్లలు కిడ్నాప్‌ చేసే గ్యాంగ్‌ షన్నును ఎలా ఇబ్బంది పెట్టింది? కథలో ఉన్ని ముకుందన్ పాత్ర ఏంటి? అన్నది కథ. Best  Tamil movies in telugu డియర్ అర్జున్‌ (జీవి ప్రకాష్‌) న్యూస్‌ రీడర్‌గా గొప్ప పేరు తెచ్చుకునేందుకు యత్నిస్తుంటాడు. అయితే నిద్రలో చిన్న శబ్దం వచ్చినా ఉలిక్కిపడి లేస్తుంటాడు. అటువంటి అర్జున్‌ లైఫ్‌లోకి భార్యగా దీపిక వస్తుంది. ఆమెకున్న గురక సమస్య.. అర్జున్‌కు ఎలాంటి ఇబ్బందులు తెచ్చిపెట్టింది? అన్నది కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ సైరన్ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రాణించనప్పటికీ.. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇక సినిమా కథలోకి వెళ్తే..భార్యను (అనుప‌మ)ను చంపిన కేసులో తిల‌గ‌న్‌ (జ‌యం ర‌వి) జైలుకు వెళ్తాడు. పెరోల్‌పై బయటకొచ్చిన తిలగన్‌.. వరుసగా పొలిటిషియన్స్‌ను హత్య చేస్తుంటాడు. పోలీస్ ఆఫీస‌ర్‌ నందిని (కీర్తిసురేష్‌) అతడ్ని పట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తుంటుంది. అసలు తిలగన్ ఎందుకు ఆ హత్యలు చేస్తున్నాడు? తన భార్యను తిలగన్ నిజంగానే చంపాడా? లేదా? అన్నది కథ. ఓటీటీ: హాట్‌ స్టార్ లియో హిమాచల్ ప్రదేశ్‌లోని ఓ చిన్న పట్టణంలో పార్తీబన్ (విజయ్) కాఫీ షాప్ నడుపుతుంటాడు. భార్య సత్య (త్రిష), ఇద్దరు పిల్లలతో అతడి జీవితం సంతోషంగా సాగుతుంటుంది. ఈ క్రమంలోనే ఊరి ప్రజల నుంచి హైనాను, హైనా నుంచి ఊరి ప్రజలను పార్తీబన్ కాపాడటంతో అతడి ఫోటోలు పేపర్లలో వస్తాయి. ఇదే సమయంలో ఏపీలోని ఆంటోనీ దాస్ (సంజయ్ దత్) & గ్యాంగ్ హిమాచల్ ప్రదేశ్ వస్తారు. లియో దాస్‌గా ఉన్న పార్తీబన్‌ కోసం వెంటాడుతారు. ఇంతకీ లియో దాస్ ఎవరు? అతని గతం ఏమిటి? అనేది మిగిలిన కథ. ఓటీటీ:  నెట్‌ఫ్లిక్స్ జైలర్ ఈ చిత్రం సరైన హిట్‌లేక సతమతమవుతున్న రజినీకాంత్‌కు సాలిడ్ విజయాన్ని అందించింది. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. చాలా రోజుల తర్వాత వింటేజ్ రజనీకాంత్ ఈ సినిమాలో కనిపిస్తాడు. ముత్తు వేలు(రజనీకాంత్) నీతి నిజాయితి కలిగిన ఓ రిటైర్డ్ పోలీస్ అధికారి. అతని కొడుకు ఏసీపీ అర్జున్‌ తండ్రిలాగే నీతి నిజాయితి కలిగిన పోలీస్‌ ఆఫీసర్‌గా పేరు తెచ్చుకుంటాడు. ఈక్రమంలో విగ్రహాల దొంగతనం ముఠా నాయకుడు వర్మ(వినాయకన్) వల్ల అర్జున్‌ చనిపోతాడు. ఆ తర్వాత ముత్తు వేలు ఏం చేశాడు? వర్మపై ఏవిధంగా ప్రతికారం తీర్చుకున్నాడు అనేది మిగిలిన కథ. ఓటీటీ; హాట్ స్టార్ విక్రమ్ ఈ సినిమా మరోసారి వింటేజ్ కమల్ హాసన్‌ను గుర్తు తెచ్చింది. ప్రతి ఫ్రేమ్‌లోనూ కమల్ హాసన్ తన యాక్టింగ్‌తో అదరగొట్టాడు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా భారీ విజయం సాధించింది. ఇక కథలోకి వెల్తే.. డ్రగ్ మాఫియా కేసును విచారిస్తున్న ఏజెంట్ విక్రమ్ సస్పెండ్ అయిన తర్వాత అండర్‌ గ్రౌండ్‌కు వెళ్తాడు. ఈ క్రమంలో డ్రగ్ మాఫియా డాన్ సంతానం మిస్‌ అయిన ఓ భారీ డ్రగ్ కంటైనర్‌ కోసం వెతుకుతుంటాడు. అండర్‌గ్రౌండ్‌లో ఉన్న విక్రమ్ తన కొడుకు చావుకు కారణమైన వ్యక్తిని చంపుతాడు. అసలు విక్రమ్ కొడుకును చంపిందెవరు? డ్రగ్ కంటైనర్‌ను దక్కించుకునేందుకు సంతానం ఎలాంటి క్రూరత్వాన్ని ప్రదర్శించాడు? విక్రమ్, సంతానం మధ్య వైరం ఎందుకొచ్చింది అన్నది మిగతా కథ. ఓటీటీ; హాట్ స్టార్, జీ5 కాల్వన్ ఓ అడవిలో రాత్రి వేళ హత్యలు జరుగుతుంటాయి. కెంబన్‌ ఆ అడవి సమీపంలో అనాథలా జీవిస్తూ రాత్రి సమయాల్లో దొంగతనాలు చేస్తుంటాడు. హీరోయిన్‌ అతడి జీవితంలోకి రావడం.. కెంబన్‌ గురించి ఓ నిజం తెలుసుకోవడంతో కథ మలుపు తిరుగుతుంది. ఆ తర్వాత ఏమైంది? అన్నది కథ. ఓటీటీ: హాట్‌స్టార్ అయాలన్ భవిష్యత్‌లో ఇంధన అవసరం చాలా ఉందని గ్రహించిన ఆర్యన్‌ (శరద్‌ ఖేల్కర్‌) భూమిని చాలా లోతుకు తవ్వాలని అనుకుంటాడు. దీంతో భూమిపై ఉన్న జీవరాశులకు ముప్పు ఉందని గ్రహించిన ఓ ఏలియన్‌ భారత్‌లో ల్యాండ్‌ అవుతుంది. అలా వచ్చిన ఏలియన్‌కు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? హీరో శివకార్తికేయన్‌కు ఏలియన్‌కు మధ్య సంబంధం ఏంటి? అన్నది కథ. ఓటీటీ: సన్ నెక్ట్స్ మెర్రీ క్రిస్మస్ ఆల్బర్ట్‌ (విజయ్‌ సేతుపతి) ఏడేళ్ల తర్వాత బాంబేకు వస్తాడు. ఓ సినిమాకు వెళ్లగా అక్కడ కూతురుతో వచ్చిన మరియా (కత్రినా కైఫ్‌)తో పరిచయం ఏర్పడుతుంది. ఆమె క్రిస్మస్‌ వేడుకలకు ఇంటికి ఆహ్వానిస్తుంది. అయితే ఇంట్లో మరియా భర్త హత్యకు గురై కనిపిస్తాడు. ఆ హత్య చేసింది ఎవరు? ఆల్బర్ట్‌ గతం ఏంటి? అన్నది స్టోరీ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ అన్నపూర్ణి: ది గాడెస్ ఆఫ్ ఫుడ్ ఈ చిత్రం కాస్త వివాదాస్పదం అయింది. తమిళంలో హిట్ అయినప్పటికీ.. మిగతా భాషల్లో పెద్దగా ఆడలేదు. ఇక సినిమా కథలోకి వెళ్తే.. తమిళనాడులోని శ్రీరంగం ఆలయంలో రంగరాజ్ చెఫ్. ఆయన కూతురు అన్నపూరణి తండ్రిని చూసి చెఫ్ కావాలని అనుకుంటుంది. బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన ఈమె నాన్ వెజ్ ముట్టుకోవడం పాపం అని తండ్రి అంటాడు. మరి కలలు కన్నట్లు అన్నపూరణి చెఫ్ అయిందా? లేదా? అన్నది కథ. జపాన్ ఈ చిత్రం కార్తీ  నటించిన 25వ చిత్రం. ఈ సినిమాలో పేరుమోసిన దొంగ పాత్రలో కార్తీ అద్భుతంగా నటించాడు. అతని పాత్ర హెలెరియస్‌గా ఉంటుంది. హైదరాబాద్‌లోని రాయల్ జ్యువెలరీలో రూ.200 కోట్ల విలువలైన నగలు దోపిడికి గురవుతాయి. గోల్డెన్ స్టార్ జపాన్ (కార్తీ) ఈ దొంగతనం చేశాడని అంతా అనుమానిస్తారు. జపాన్‌ను పట్టుకునేందుకు హైదరాబాద్ పోలీసులు వెతుకుతుంటారు. మరోవైపు కేరళ, కర్ణాటక పోలీసులు కూడా జపాన్‌ కోసం గాలిస్తుంటారు. తన ప్రేయసిని కలిసే ప్రయత్నంలో జపాన్ దొరికిపోతాడు. అయితే ఆ సొత్తు జపాన్ దొంగలించలేదని విచారణలో తేలుతుంది. మరి ఆ నగల దొంగతనం చేసింది ఎవరు? ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ కెప్టెన్ మిల్లర్ కథ 1930 బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుంది. ఈసా (ధ‌నుష్‌) నిమ్న‌ కులానికి చెందిన యువ‌కుడు. ఊరిలోని కుల‌ వివ‌క్ష‌ను భ‌రించ‌లేక గౌర‌వ మ‌ర్యాద‌ల కోసం బ్రిటీష్ ఆర్మీలో చేరతాడు. తన పేరును కెప్టెన్ మిల్ల‌ర్‌గా మార్చుకుంటాడు. కొన్ని అనూహ్య ఘటనల నేపథ్యంలో మిల్లర్‌ దొంగల గ్యాంగ్‌లో చేరి బ్రిటిష్‌ వారికి కావాల్సిన బాక్స్‌ను ఎత్తుకెళ్తాడు. దీంతో బ్రిటిష్ ఆర్మీ అధికారి మిల్లర్‌ను పట్టుకోవడం కోసం అతడి ఊరి ప్రజల్ని బందిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? మిల్లర్‌ ఊరి ప్రజల కోసం తిరిగి వచ్చాడా? మిల్లర్ కొట్టేసిన బాక్స్‌లో ఏముంది? సినిమాలో శివరాజ్‌కుమార్‌, సందీప్‌ కిషన్‌ పాత్రలు ఏంటి? అన్నది కథ. ఓటీటీ: ప్రైమ్ వీడియో చిన్నా మున్సిపాలిటీలో చిన్న ఉద్యోగం చేసుకునే చిన్నా ( సిద్ధార్థ్) తన అన్న చనిపోవడంతో... అతని కూతురు చిట్టి (సహస్ర శ్రీ) బాధ్యతలు తీసుకుంటాడు. ఈ క్రమంలో చిట్టి స్నేహితురాలేన మున్ని(సబియా) లైంగిక దాడికి గురవుతుంది. లైంగిక దాడి చేసింది చిన్నానే అని ఓ వీడియో బయటకు వస్తుంది. ఇంతలో చిట్టి కనిపించకుండా పోతుంది. నిజంగా మున్నిపై లైంగిక దాడి చేసింది చిన్నానేనా? అదృశ్యమైన చిట్టిని చిన్నా ఎలా కనిపెడుతాడు? అనేది మిగతా కథ 800 ఈ చిత్రంలో తొలుత విజయ్ సేతుపతి నటించినప్పటికీ.. తమిళనాడు నుంచి పెద్దఎత్తున ఆందోళనలు రావడంతో ఆయన ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. ఇక కథలోకి వెళ్తే.. తేయాకు తోట‌ల్లో ప‌నిచేస్తున్న త‌మిళ కుటుంబంలో ముత్తయ్య ముర‌ళీధ‌ర‌న్‌ జన్మిస్తారు. శ్రీలంక‌లోని కాండీలో ఆ కుటుంబం బిస్కెట్ ఫ్యాక్ట‌రీ ఏర్పాటు చేస్తుంది. ఈ క్రమంలోనే సింహ‌ళులు, త‌మిళుల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌లు చెల‌రేగుతాయి. దాంతో ముత్తయ్య కుటుంబం ప్రాణ భయంతో దూరంగా వెళ్లి త‌ల‌దాచుకుంటుంది. 70వ దశకంలో చెలరేగిన ఘ‌ర్ష‌ణ‌ల ప్రభావం త‌న బిడ్డపై ప‌డ‌కూడ‌ద‌ని ముత్తయ్య త‌ల్లిదండ్రులు ఏం చేశారు? ముత్తయ్యకి క్రికెట్‌పై ఆస‌క్తి ఎలా ఏర్పడింది? శ్రీలంక జ‌ట్టులో ఎలా చోటు సంపాదించాడు? ఎలాంటి అవ‌మానాల్ని, స‌వాళ్లని ఎదుర్కొని ఆట‌గాడిగా నిలబడ్డాడు? అనేది మిగతా కథ. ఓటీటీ: ప్రైమ్ వీడియో మార్క్ ఆంటోనీ మార్క్ (విశాల్) మెకానిక్‌గా పనిచేస్తుంటాడు. అతని స్నేహితుడు చిరంజీవి( సెల్వ రాఘవన్) ఒక టెలిఫోన్‌ మిషన్‌ను కనుగొంటాడు. ఆ టెలిఫొన్ మెషిన్ ద్వారా భూతకాలానికి చెందిన వ్యక్తులతో మాట్లాడవచ్చు. అయితే మార్క్ చనిపోయిన తన తండ్రి ఆంటోనికి కాల్ చేయాలనుకుంటాడు. ఆ క్రమంలో మార్క్ తన తండ్రిని కొంతమంది చంపాలనుకుంటున్నారన్న విషయం తెలుసుకుంటాడు. ఓటీటీ: ప్రైమ్ నాయకుడు అణగారిన వర్గానికి చెందిన మహారాజు రామాపురం ఎమ్మెల్యే. అయితే, అతడు, అతని కుమారుడు రఘు వీరకు కొన్నేళ్ల నుంచి మాట్లాడుకోవడం మానేశారు. మహారాజు జీవితంలో జరిగిన ఒక సంఘటన తండ్రి కోసం పోరాడేందుకు రఘుని ప్రేరేపిస్తుంది. ఇంతకు ఆ సమస్య ఏమిటి? వారు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం ఎందుకు మానేశారు?చివరికి ఏమి జరిగింది అనేది మిగిలిన కథ ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ సార్ బాలగంగాధర్ (ధనుష్ ) ఒక జూనియర్ మ్యాథ్స్ లెక్చరర్. సిరిపురం అనే గ్రామంలోని జూనియర్ కళాశాలకు మ్యాథ్స్ చెప్పడానికి వెళ్తాడు. అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ పాస్ అయ్యేలా చదువు చెబితే.. సీనియర్ మ్యాథ్స్ లెక్చరర్‌గా ప్రమోషన్ ఇస్తానని కాలేజీ యాజమాన్యం చెబుతుంది. అయితే, అక్కడ పరిస్థితులు బాలుకి అనుకూలంగా ఉండవు. అయినా, తన మాటలతో, చేతలతో ఆ సిరిపురం స్టూడెంట్స్‌ను ప్రభావితం చేస్తాడు. అనంతరం జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల వల్ల బాలు జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి. ఆ మార్పులు ఏమిటి అనేది మిగతా కథ ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ Best Kannada movies in telugu కబ్జ ఆర్కేశ్వర (ఉపేంద్ర), భారత వైమానిక దళ అధికారి, స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబంలో జన్మించాడు. అతను సంపన్నమైన అమ్మాయి అయిన మధుమతి (శ్రియా శరణ్)ను ప్రేమిస్తాడు. వీరిద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. ఇదేక్రమంలో అమరాపురను తమ  అధికారం కోసం భయంకరమైన గూండాలు మరియు రాజకీయ నాయకులు ఓ క్రైమ్ వరల్డ్‌గా  మార్చేస్తారు. అయితే అర్కేశ్వర క్రైమ్ ప్రపంచంలోకి ప్రవేశించి ఆ ప్రాంతానికి నాయకుడు ఎలా అవుతాడు? ఈ క్రమంలో అతను ఎదుర్కొన్న సవాళ్లు ఏంటి అనేది మిగతా కథ. సప్తసాగరాలు దాటి సైడ్ బి మను (రక్షిత్ శెట్టి) జైలు నుంచి వచ్చాక ఓ ఉద్యోగంలో చేరతాడు. తాను ప్రేమించిన ప్రియ (రుక్మిణి వసంత్) జ్ఞాపకాలే గుర్తుకు వస్తుండటంతో తనని వెతుకుతాడు. ప్రియ భర్త గోపాల్ దేశపాండే వ్యాపారంలో నష్టాలు రావడంతో తాగుడికి బానిసైపోయి ఇంటిని పట్టించుకోడు. దీంతో ప్రియ కష్టపడుతూ ఇంటిని నడుపుతుంది. తాను ప్రేమించిన అమ్మాయి సంతోషంగా లేదని తెలిసిన మను ఆమెని సంతోషంగా ఉంచడానికి ఏం చేశాడు ? వాళ్ళ కష్టాలు ఎలా తీర్చాడు? అన్నది మిగతా కథ. ఓటీటీ; ప్రైమ్ వీడియో ఘోస్ట్ బిగ్ డాడీ అలియాస్ ఘోస్ట్ తన గ్యాంగ్‌తో కలిగి ఓ జైలును ఆక్రమిస్తాడు. మాజీ సీబీఐ అధికారి వామన్ శ్రీనివాస్ కిడ్నాప్ చేస్తాడు. దీంతో ఈ కేసును సాల్వ్ చేయడానికి ప్రభుత్వం చరణ్ రాజ్‌ని రంగంలోకి దించుతుంది. ఇంతకీ ఈ బిగ్ డాడీ ఎవరు ? అతని గతం ఏమిటి ? అసలు అతను ఘోస్ట్‌గా ఎందుకు మారాడు ? అన్నది మిగతా కథ. ఓటీటీ: జీ5 బాయ్స్ హాస్టల్ ఓ బాయ్స్ హాస్టల్‌లో తన ఫ్రెండ్స్‌తో కలిసి ఉండే అజిత్ (ప్రజ్వల్) ఓ షార్ట్ ఫిల్మ్ తీయాలని స్క్రిప్ట్ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాడు. తమని టార్చర్ చేసే హాస్టల్ వార్డెన్‌ను తన ఫ్రెండ్స్‌తో కలిసి చంపేసినట్లుగా స్క్రిప్ట్‌లో రాసుకుంటాడు. అయితే నిజంగానే వార్డెన్‌ చనిపోతాడు. సుసైడ్‌ నోట్‌లో అజిత్‌, ‌అతడి ఫ్రెండ్స్ పేరు రాయడంతో కథ మలుపు తిరుగుతుంది. ఓటీటీ: ఈటీవీ విన్ కాటేరా ఈ సినిమా కన్నడ నాట బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇక కథలోకి వెళ్తే.. భూస్వామిని చంపిన కేసులో జైలు శిక్ష‌ అనుభ‌విస్తున్న‌ కాటేరా (ద‌ర్శ‌న్‌) పెరోల్ మీద బ‌య‌ట‌కు వ‌స్తాడు. దీంతో కాటేరాను చంపేందుకు చాలా మంది ప్ర‌య‌త్నిస్తుంటారు. వారంద‌రూ ఎవ‌రు? కాటేరా భూస్వామిని ఎందుకు చంపాడు? భూస్వాములతో కాటేరాకు ఏంటి విరోధం? అన్నది కథ. ఓటీటీ: జీ5 టోబి టోబి చిన్నప్పటి నుంచి ఎన్నో వేధింపులకు గురవుతాడు. కోపం వస్తే అందరితో దారుణంగా ప్రవరిస్తుంటాడు. నిజానికి అమాయకుడైన టోనీని ఊరిపెద్ద ఆనంద హత్యలు చేసేందుకు ఉపయోగించుకుంటాడు. తనను వాడుకుంటున్నారని తెలుసుకున్న టోబి ఏం చేశాడు? ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు? అన్నది కథ. ఓటీటీ: సోనీ లీవ్ Best Hindi movies in telugu అమర్ సింగ్ చమ్కిలా జానపద గాయకుడు అమర్ సింగ్ చమ్కిలా జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. పేద కుటుంబంలో జన్మించిన ఆయన  సింగర్‌ కావడాని కసితో ఎలా ఎదిగాడు? 27 ఎళ్లతో ఎంతో ఫేమస్ అయిన అతన్ని ఎవరు చంపారు అన్నది మిగతా కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ యానిమల్‌ ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. సినిమాలో సన్నివేశాలపై అభ్యంతరాలు వ్యక్తమైనప్పటికీ వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ ఘన విజయం సాధించింది. ఈ చిత్రం విజయంతో రణ్‌బీర్ కపూర్ మార్కెట్ దేశవ్యాప్తంగా పెరిగింది. దేశంలోని అత్యంత సంపన్నుల్లో బల్బీర్ సింగ్ (అనిల్ కపూర్) ఒకరు. ఆయన కుమారుడు రణ్ విజయ్ సింగ్ (రణబీర్ కపూర్). తండ్రి అంటే అమితమైన ప్రేమ. అయితే తన దూకుడు మనస్తత్వం కారణంగా హీరోకి తండ్రితో దూరం పెరుగుతుంది. దీంతో అమెరికా వెళ్లిపోతాడు. ఓ రోజు తండ్రిపై హత్యయాత్నం జరిగినట్లు తెలిసుకొని విజయ్‌ ఇండియాకు వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? బల్బీర్‌పై దాడి చేసిన వారిపై హీరో ఎలా ప్రతికారం తీర్చుకున్నాడు? అన్నది కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ మైదాన్ 1952లో జరిగిన ఒలింపిక్స్‌ పోటీల్లో భారత ఫుట్‌బాల్‌ జట్టు.. విఫలమవుతుంది. దీంతో జట్టును టార్గెట్‌ చేస్తూ విమర్శలు వస్తాయి. అప్పుడు కోచ్‌ సయ్యద్ అబ్దుల్‌ రహీమ్‌ (అజయ్‌ దేవగన్‌) ఏం చేశాడు? కొత్త ఆటగాళ్లతో తన ప్రయాణాన్ని ఎలా మెుదలుపెట్టాడు? ఒలింపిక్స్‌లో ఆ జట్టు ఎలాంటి ప్రదర్శన చేసింది? భారత జట్టు కోచ్‌గా అతడు ఏం సాధించాడు? అన్నది కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ లస్ట్ స్టోరీస్ 2 లస్ట్ స్టోరీస్ 2లో మొత్తం నాలుగు కథలు ఉంటాయి. మొదటి కథలో మృణాల్, అంగన్ బేడీ పెళ్లి చేసుకోవాలనుకుంటారు. పెద్దలు కూడా ఒప్పుకుంటారు. అయితే మృణాల్ నానమ్మ.. పెళ్లికి ప్రేమ కంటే బలమైన శారీరక సంబంధం ముఖ్యమని స్పష్టం చేస్తుంది. ఆ తర్వాత మృణాల్- బేడీ ఎం చేశారన్నది ఫస్ట్ కథ. రెండో కథలో ఓనర్ లేనప్పుడు పనిమనిషి తన భర్తను తెచ్చుకుని లైంగికానందం పొందుతుంది. అయితే వీరిద్దరిని చూసిన ఓనర్ ఏం చేసింది అనేది రెండో కథ. ఇక మూడో కథలో ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అయిన విజయ్ వర్మ కొన్నేళ్ల తర్వాత తమన్నను కలుస్తాడు. వీరిద్దరు శారీరకంగా దగ్గరైన తర్వాత ఏం జరిగింది అనేది కథ. నాల్గొ కథలో కామంతో రగిలిపోతున్న తన భర్త విషయంలో కాజల్ ఏమి చేసింది అనేది కథ.. ఈ చిత్రంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినప్పటికీ ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించిందని చెప్పవచ్చు. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ మర్డర్ ముబారక్ రాయల్‌ ఢిల్లీ క్లబ్‌లో ఓ మృతదేహం కలకలం సృష్టిస్తుంది. ఈ మిస్టరీని ఛేదించేందుకు ఏసీపీ సింగ్‌ రంగంలోకి దిగుతాడు. క్లబ్‌లో సభ్యులుగా ఉన్న బాంబి (సారా అలీఖాన్‌), నటి షెహనాజ్‌ నూరాని (కరిష్మా కపూర్‌), రాయల్‌ రన్‌విజయ్‌ (సంజయ్‌ కపూర్‌), లాయర్‌ ఆకాష్‌ (విజయ్‌ వర్మ)లపై అనుమానం వ్యక్తం చేస్తాడు. ఇంతకీ ఆ మర్డర్‌ చేసింది ఎవరు? దర్యాప్తులో తేలిన అంశాలేంటి? అన్నది కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ భక్షక్ జర్నలిస్టు వైశాలి.. యూట్యూబ్ ఛానెల్ ద్వారా స్థానిక వార్తలు అందిస్తుంటుంది. ఊరిలోని అనాథ బాలికల వసతి గృహంలో లైంగిక దాడులు జరుగుతున్నట్లు ఆమెకు తెలుస్తుంది. అయితే దానిని రాజకీయంగా పలుకుబడి ఉన్న వ్యక్తి నిర్వహిస్తుంటాడు. అతడి దారుణాలను వైశాలి ఎలా బయటపెట్టింది? ఈ క్రమంలో ఎదురైన సవాళ్లు ఏంటి? అన్నది కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ గంగూభాయి కతియావాడి ఈ చిత్రం అలియా భట్‌ నటనకు జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చింది. జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా ఎంపికైంది. ఇక ఈ సినిమా కథలోకి వెళ్తే.. గంగూబాయి హర్జీవందాస్‌ (అలియా భట్‌) గుజరాత్‌లోని  ఓ పెద్ద కుటుంబంలో పుడుతుంది.  ఆమెకు చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఇష్టం. ఆ ఇష్టాన్ని ఆసరా చేసుకున్న గంగుభాయ్ లవర్ ఆమెను ముంబై తీసుకొచ్చి అక్కడ వేశ్య గృహానికి అమ్మేస్తాడు. తప్పని పరిస్థితుల్లో ఆమె వేశ్యగా కొనసాగుతుంది. కొన్ని నాటకీయ పరిణామాల తర్వాత.. గంగూబాయి ఓ కీలక నిర్ణయం తీసుకుంటుంది. ఆ నిర్ణయం ఏమిటి? వేశ్యల అభ్యున్నతి ఆమె ఏం చేసింది అనేది మిగతా కథ. ఓటీటీ; నెట్‌ఫ్లిక్స్ 83 1983 నాటి క్రికెట్ ప్రపంచకప్‌ను ఇండియా గెలుచుకున్న నేపథ్యాన్ని ఈ చిత్రం ఆవిష్కరిస్తుంది. ఆ క్రమంలో ఆటగాళ్లు ఎదురుకున్న సమస్యలు, ప్రత్యర్థుల నుంచి వచ్చిన సవాళ్ళను ఎలా అధిగమించారు ? ఎలా కప్ గెలిచారు ? అనేది మిగతా కథ ఓటీటీ; డిస్నీ హాట్ స్టార్ జవాన్ సరిహద్దుల్లో తీవ్ర గాయాలతో పడిపోయిన ఓ వ్యక్తిని తల్లి కొడుకులు రక్షిస్తారు. అతను కోమాలోకి వెళ్లగా గ్రామానికి తీసుకెళ్లి వైద్యం చేయిస్తారు. ఇదే సమయంలో ఆ ఊరిపై కొందరు పదునైన ఆయుధాలతో దాడి చేస్తారు. కోమాలో నుంచి బయటకు వచ్చిన ఆ వ్యక్తి వారిని తరిమికొడతాడు. దీంతో ఆ గ్రామ ప్రజలు అతన్ని దేవుడిలా పూజిస్తారు. అప్పుడు ఆ వ్యక్తి తాను ఎవర్ని అని వారిని ప్రశ్నిస్తాడు. దీనికి జవాబు తాను పెద్దయ్యేలోపు కనుగొంటానని కాపాడిన పిల్లోడు ప్రామిస్ చేస్తాడు. ఇంతకు ఆ వ్యక్తి ఎవరు? పిల్లాడితో అతనికి ఉన్న సంబంధం ఏమిటి అన్నది మిగతా కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ గదర్ 2 బాలీవుడ్‌లో చిత్రాలు వరుసగా ప్లాఫ్ అవుతున్న క్రమంలో వచ్చిన ఈ సినిమా విజయం ఇండస్ట్రీకి ఊపిరి పోసింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ఇక కథలోకి వెళ్తే.. తారా సింగ్ (సన్నీ డియోల్) భారత సరిహద్దుల్లో కనిపించకుండా పోతాడు. పాక్‌ అతడ్ని బంధించిందని భావించిన అతడి కొడుకు.. మారువేషంలో శత్రు దేశానికి వెళ్తాడు. అనూహ్యాంగా ఇంటికి తిరిగొచ్చిన తారా సింగ్‌.. కొడుకు పాక్‌లో ఉన్న సంగతి తెలుసుకుంటాడు. బిడ్డను కాపాడేందుకు పాక్‌ వెళ్తాడు. అక్కడ ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? అన్నది స్టోరీ. ఓటీటీ: ప్రైమ్ వీడియో
    మే 20 , 2024
    Kamal Hassan: ‘కల్కి’పై కమల్‌ హాసన్‌ క్రేజీ కామెంట్స్‌.. 27 ఏళ్ల తర్వాత స్టార్‌ హీరోయిన్‌ రీఎంట్రీ!
    Kamal Hassan: ‘కల్కి’పై కమల్‌ హాసన్‌ క్రేజీ కామెంట్స్‌.. 27 ఏళ్ల తర్వాత స్టార్‌ హీరోయిన్‌ రీఎంట్రీ!
    పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ (Prabhas) హీరోగా గ్లోబల్‌ మార్కెట్‌ను టార్గెట్‌ చేస్తూ రూపొందిన చిత్రం 'కల్కి 2898 ఏడి' (Kalki 2898 AD). నాగ్‌ అశ్విన్‌ (Nag Ashwin) డైరెక్షన్‌లో వస్తోన్న ఈ చిత్రం.. యావత్‌ దేశం దృష్టిని ఆకర్షిస్తోంది. సైంటిఫిక్‌ ‌అండ్ ఫ్యూచరిక్‌ జానర్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా దిగ్గజ నటుడు కమల్‌ హాసన్‌ (Kamal Hassan) నటించారు. దీంతో ఆయన పాత్ర ఎలా ఉండబోతుందన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. అయితే కల్కి గురించి ఇప్పటివరకూ పెద్దగా కామెంట్స్‌ చేయని కమల్‌.. తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు కల్కిపై అంచనాలను మరింత పెంచుతున్నాయి కమల్‌ ఏమన్నారంటే దేశం గర్వించతగ్గ నటుల్లో కమల్‌ హాసన్‌ ఒకరు. ఆయన యూనివర్సల్ స్టార్‌గానూ గుర్తింపు పొందారు. అటువంటి కమల్‌.. కల్కిలో ఓ ఇంపార్టెంట్‌ రోల్‌లో కనిపించనున్నారని తెలియగానే సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. అయితే తాజాగా కల్కి సినిమాపై స్పందించిన కమల్‌.. ఈ చిత్రాన్ని హవర్‌ గ్లాస్‌తో పోల్చారు. మనం ఎలా టర్న్‌ చేస్తే అలా సినిమా తిరుగుతుందని వ్యాఖానించారు. ఇలాంటి సినిమాలో నటించడం చాలా ఆసక్తికరమని చెప్పారు. ఇప్పటివరకు చేసిన 230 చిత్రాల్లో ఈ తరహా సినిమాను చేయలేదని చెప్పుకొచ్చారు. కమల్‌ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.  కల్కిలో భారీ కాస్టింగ్‌ ప్రతిష్టాత్మంగా రూపొందుతున్న కల్కి చిత్రంలో.. హీరో ప్రభాస్‌, కమల్‌ హాసన్‌లతో పాటు అమితాబ్‌ బచ్చన్‌, దీపికా పదుకొనే, దిశా పటానీ నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే లేటెస్ట్ బజ్‌ ప్రకారం మరింత మంది స్టార్ నటులు కల్కిలో కనిపించబోతున్నారు. గతంలో ప్రచారం జరిగిన విధంగా ఎస్‌.ఎస్‌ రాజమౌళి (SS Rajamouli), ఆర్జీవీ (RGV), విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda), హీరో నాని (Nani) ఈ సినిమాలో అతిథి పాత్రల్లో కనిపించనున్నారట. వీరితో పాటు దుల్కర్‌ సల్మాన్‌, మృణాల్‌ ఠాకూర్‌, రానాలు కూడా గెస్ట్‌ రోల్స్‌లో అలరించబోతున్నట్లు తాజాగా నెట్టింట ప్రచారం జరుగుతోంది. కాగా, ఇప్పటికే సినిమాలోని బుజ్జి అనే రోబొటిక్‌ వాహనానికి హీరోయిన్‌ కీర్తి సురేష్‌ తన వాయిస్‌ అందించింది. ఇలా ఇంతమంది స్టార్‌ నటీనటులు కల్కిలో భాగస్వామ్యం కావడంతో సినిమాపై అంచనాలు తారా స్థాయికి చేరాయి.  అలనాటి నటి గ్రాండ్‌ ఎంట్రీ! కల్కి సినిమాలో కనిపించబోయే స్టార్‌ క్యాస్టింగ్‌లలో ప్రధానంగా ఓ నటి పేరు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఒకప్పటి స్టార్‌ హీరోయిన్‌ అయిన శోభన (Actress Shobana) కూడా కల్కిలో ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు ఫిల్మ్‌ వర్గాల్లో టాక్‌ వినిపిస్తోంది. నటి శోభన తెలుగులో సినిమాలు చేసిన రెండు దశాబ్దాలు దాటి పోయింది. 1997 తర్వాత ఆమె తెలుగులో ఏ సినిమా చేయలేదు. ఈ క్రమంలో ఇప్పుడు కల్కిలో ఆమె రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లు స్ట్రాంగ్‌ బజ్‌ వినిపిస్తోంది. సుమారు 27 ఏళ్ల తర్వాత ఆమె తెలుగు తెరపై మెరవబోతున్నారు. కాగా, ఈ సినిమాలో హాస్య నటుడు బ్రహ్మానందం కూడా ఓ ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు. జూన్‌ రెండో వారంలో ట్రైలర్‌! విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో కల్కి టీమ్‌ ప్రమోషన్స్‌ జోరు పెంచింది. ఇప్పటికే 'బుజ్జి అండ్‌ భైరవ' అనే యానిమేటెడ్‌ సిరీస్‌ను ఓటీటీలో లాంచ్‌ చేసి ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. దీనికి కొనసాగింపుగా త్వరలో ట్రైలర్‌ కూడా తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వర్స్క్‌ కూడా మెుదలైనట్లు ఫిల్మ్‌ వర్గాల్లో టాక్‌ వినిపిస్తోంది. జూన్‌ రెండో వారంలో ట్రైలర్‌ లాంచ్ అయ్యే అవకాశమున్నట్లు సమాచారం. విజువల్‌ వండర్‌లా ట్రైలర్‌ ఉంటుందని, అసలు కంటెంట్‌ను ఇందులో చూపిస్తారని సమాచారం. మరి ఈ ట్రైలర్ ఏ మేరకు ఆడియన్స్‌ను అట్రాక్ట్‌ చేస్తుందో చూడాలి. 
    జూన్ 04 , 2024
    BRO Pre Review: బ్రో మూల కథ ఎలా పుట్టింది? 12 భాషల్లో ఈ సినిమాను ఎందుకు తీస్తున్నారు?
    BRO Pre Review: బ్రో మూల కథ ఎలా పుట్టింది? 12 భాషల్లో ఈ సినిమాను ఎందుకు తీస్తున్నారు?
    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ మల్టీస్టారర్‌గా రూపొందిన చిత్రం ‘బ్రో’. తమిళంలో విజయం సాధించిన ‘వినోదయ సిత్తం’ సినిమాకు రీమేక్‌ ఇది. మాతృకలో తీసిన డైరెక్టర్ సముద్రఖని తెలుగులోనూ చిత్రీకరించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించారు. ఈ సినిమా విజయంపై మూవీ యూనిట్ ఎంతో ధీమాతో ఉంది. దీనికి కారణం సినిమా మూల కథే. మరి, ‘వినోదయ సిత్తం’ కథ ఎలా పుట్టింది? ఈ సినిమాలో అంతగా ఏముంది? మూవీతో ఏం సందేశం ఇచ్చారు? వంటి అంశాలను తెలుసుకుందాం.  అలా తెరమీదకి.. ఓటీటీ కంటెంట్ కోసం జీ స్టూడియోస్ సముద్రఖనిని పిలిపించుకుని ఓ 5 కథలను చెప్పమంది. ఇందుకు 25 నిమిషాలు టైం ఇచ్చింది. దర్శకుడు 20 నిమిషాల్లోనే 5 కథలను పూర్తి చేశారు. ఇందులో నుంచి ఓ కథను సెలెక్ట్ చేసి ఓకే చేసేశారు. మరో 3 నిమిషాలు మిగిలి ఉండటంతో ఒక కథ చెప్పే అవకాశం ఇవ్వండని కోరి ఈ ‘బ్రో’ మూవీ స్టోరీ లైన్ చెప్పారు సముద్రఖని. దీంతో ముందుగా ఓకే చేసిన స్టోరీని పక్కన పెట్టి ‘వినోదయ సిత్తం’కు నిర్మాతలు ఓటేశారు. అలా ఈ సినిమాకు బీజం పడింది. అయితే, వినోదయ సిత్తం కథను తన గురువు బాలచందర్ గారు అందించినట్లు సముద్రఖని చెబుతుంటారు.   https://twitter.com/KarnatakaPSPKFC/status/1683893592304111617?s=20 స్టోరీ ఇదే.. పరశురామ్(తంబిరామయ్య) క్రమశిక్షణ గల ఉద్యోగి. 25 ఏళ్లుగా ఓ ఎంఎన్‌సీ కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్‌గా చేస్తుంటాడు. కంపెనీ ఎదుగుదలలో కీలక పాత్ర పోషించి ప్రమోషన్ కోసం ఎదురు చూస్తుంటాడు. సమయాన్ని పకడ్బందీగా వాడుకోవాలని భార్య, పిల్లలకు చెబుతుంటాడు. అమెరికాలో ఉన్న కొడుక్కి సైతం పక్కా ప్లానింగ్ ఇస్తుంటాడు. అలా ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు తీరిక లేకుండా గడిపేస్తుంటాడు. కంపెనీ పనిమీద వేరే సిటీకి వెళ్లి తిరిగి వస్తుండగా యాక్సిడెంట్‌లో పరశురామ్‌ మరణిస్తాడు. పరశురామ్‌ని స్వర్గానికి తీసుకెళ్లడానికి కాలదేవుడు(సముద్రఖని) వస్తాడు. ఇక్కడ ఇద్దరి మధ్య సంభాషణ జరుగుతుంది. తాను నెరవేర్చాల్సిన బాధ్యతలు ఇంకా మిగిలే ఉన్నాయని, భవిష్యత్తులో ఆనందంగా ఉండటానికి ఎంతో కష్టపడ్డానని, తనను బతికించాలని వేడుకుంటాడు. వాదోపవాదాల అనంతరం 3 నెలల సమయాన్ని పొందుతాడు. అయితే, దీని గురించి ఇతరులకు చెప్పకుండా ఉండేందుకు కాలదేవుడు కూడా పరశురామ్‌ని వెంబడిస్తాడు. ముందుగా కూతురి పెళ్లిని ఫిక్స్ చేస్తాడు. కానీ, ఆమె ప్రేమించిన అబ్బాయితో వెళ్లిపోతుంది. ఈ బాధలో ఉండగానే కొడుకు ఉద్యోగం కోల్పోయి అమెరికా నుంచి గర్ల్‌ఫ్రెండ్‌ని తీసుకొచ్చేస్తాడు. ఇదిలా ఉండగానే ఆఫీసులో తనకి కాకుండా వేరొకరికి ప్రమోషన్ వస్తుంది. ఇలా ఒకదాని వెంబడి మరొకటి జరిగి పరశురామ్‌కి జీవిత పరమార్థం అంటే ఏంటో అర్థమవుతుంది.   https://youtu.be/stcCZWCBegk త్రివిక్రమ్‌కి అందుకే నచ్చిందా? మనిషికి భవిష్యత్తు అనేది ఉండదని వర్తమానం ఒక్కటే ఆచరణలో ఉంటుందని చెప్పే స్టోరీ ఇది.  వాస్త‌వాల‌కు, భ్ర‌మ‌ల‌కు మ‌ధ్య ఉన్న తేడాని తెలుసుకుంటే జీవిత పరమార్థం బోధపడుతుందని చెబుతుంది. అందుకే, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్‌కి స్టోరీ చెబుతుండగానే నచ్చేసింది. చివర్లో వచ్చే డైలాగుని మళ్ళీ మళ్ళీ చెప్పించుకుని ఇంప్రెస్ అయ్యారట త్రివిక్రమ్. దీంతో తెలుగులో తీయడానికి వెంటనే ఓకే చేసి తానే దగ్గరుండి క్యాస్టింగ్ ఫైనలైజ్ చేశారట. తెలుగు నేటివిటీకి అనుగుణంగా, పవన్ కళ్యాణ్ హీరోయిజాన్ని దృష్టిలో పెట్టుకుని కథను కొత్తగా మలిచి ‘బ్రో’గా తీసుకొచ్చారు.  https://www.youtube.com/watch?v=yNnJ9de339k 12 భాషల్లో చిత్రీకరణ డైరెక్టర్ సముద్రఖని తమిళనాడులోని మారుమూల గ్రామం. అక్కడినుంచి చెన్నై వచ్చి, అటుపై హైదరాబాద్‌కి రావడం వెనకాల ఏదో ఒక శక్తి ఉందని బలంగా నమ్మారు. దానినే ‘టైం’గా అభివర్ణించారు. అలా మనకు ఎన్నో ఇచ్చిన సమాజానికి మనం తిరిగి ఏమివ్వగలం అనే కోణం నుంచి కొత్త ఆలోచన పుట్టుకొచ్చింది. బ్రో మూల కథను అన్ని భాషల ప్రేక్షకులకు చేరవేయాలని సంకల్పించుకున్నారు. అలా, తమిళంలో ‘వినోదయ సిత్తం’తో ముందడుగు వేశారు. ఇప్పుడు తెలుగులో ‘బ్రో’ చేశారు. తర్వాత ‘తుళు’లో చేయడానికి రెడీ అవుతున్నారు. ఇలా బెంగాళీ, మరాఠీ, గుజరాతీ.. తదితర 12 భాషల్లో ఇదే సినిమాను తీస్తానని చెబుతున్నారు సముద్రఖని.  https://www.youtube.com/watch?v=ArOm-GWR6Zk
    జూలై 26 , 2023
    <strong>Anasuya Bharadwaj: 'ఇంత చేతగాని వాళ్లలాగా ఉంటే ఎలా'.. అనసూయ భరద్వాజ్‌ పోస్ట్‌ వైరల్‌!</strong>
    Anasuya Bharadwaj: 'ఇంత చేతగాని వాళ్లలాగా ఉంటే ఎలా'.. అనసూయ భరద్వాజ్‌ పోస్ట్‌ వైరల్‌!
    బుల్లితెర యాంకర్‌, నటి అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జబర్దస్త్‌ షో ద్వారా కెరీర్‌ ప్రారంభించిన అనసూయ ‘రంగస్థలం’, ‘పుష్ప’ వంటి చిత్రాలతో స్టార్‌ నటిగా మారిపోయింది. అయితే గత కొంతలంగా అనసూయ ఏమాట్లాడిన నెటిజన్లు ఆమెను టార్గెట్‌ చేస్తూ వస్తున్నారు. అనసూయ కూడా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా వాటికి సోషల్‌ మీడియా వేదికగా పలుమార్లు దీటుగా సమాధానం ఇచ్చింది. ఈ క్రమంలోనే తాజాగా మరోమారు అనసూయ ఎక్స్‌ వేదికగా తీవ్ర స్థాయిలో మండిపడింది. ఓ హీరో ఫ్యాన్స్‌ను టార్గెట్‌ చేస్తూ పోస్టు పెట్టారు. ప్రస్తుతం అది హాట్‌ టాపిక్‌గా మారింది.&nbsp; అనసూయ షాకింగ్‌ పోస్టు బుల్లితెరపై ప్రయాణం ప్రారంభించి వెండి తెరపై ఓ వెలుగు వెలుగుతున్న అనసూయ మరోమారు సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారింది. తాజాగా ఎక్స్‌ వేదికగా ఓ పోస్టు పెట్టిన అనసూయ కొందరిని టార్గెట్‌ చేస్తూ తీవ్ర స్థాయిలో మండిపడింది. ‘మరీ ఇంత చేతకానివాళ్లలా ఉంటే ఎలా? నేను ఏం మాట్లాడినా అది ట్రోల్స్ చేస్తుంటారు. ఆ టాపిక్ గురించే మాట్లాడుతారు. మీకు దమ్ముంటే వారిపైన చూపించండి. నా మీద కాదు. కానీ, మీరు అలా చేయరు కదా. ఎందుకంటే మీకు అది చేతకాదు. మీ హీరోలా ఆడవారిని ఉద్దేశించి గొడవ పడటం మాత్రమే వచ్చు కదా పాపం. మీరంతా త్వరగా కోలుకోవాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నా’ అంటూ రాసుకొచ్చింది. అయితే ఈ పోస్టుకు ఎవరినీ ట్యాగ్‌ చేయకపోవడంతో ఈ పోస్టుపై గందరగోళం ఏర్పడింది. ఆమె ఎవరినీ టార్గెట్‌ చేసి అన్నారో తెలియక నెటిజన్లు కన్ఫ్యూజ్‌ అవుతున్నారు.&nbsp; https://twitter.com/anusuyakhasba/status/1816155138421317791 విజయ్‌ దేవరకొండను ఉద్దేశించేనా? అనసూయ, జగపతి బాబు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'సింబా'. సంపత్ నంది అందించిన కథకు మురళీ మనోహర్‌ దర్శకత్వం వహించారు. అయితే బుధవారం ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ జరగ్గా చిత్ర యూనిట్‌తో పాటు అనసూయ పాల్గొంది. ఈ సందర్భంగా ట్రైలర్‌లోని ఓ సీన్‌పై జర్నలిస్టులు అనసూయను ప్రశ్నించారు. అలాగే విజయ్‌ దేవరకొండతో గొడవ గురించి ప్రస్తావన వచ్చింది. దీనిపై మాట్లాడిన అనసూయ తనకు విజయ్‌కు మధ్య పెద్దగా గొడవలు లేవని, స్టేజ్‌ మ్యానర్స్‌ గురించే ఆ రోజు తాను మాట్లాడాల్సి వచ్చిందని క్లారిటీ ఇచ్చారు. లైమ్‌ టైల్‌లో ఉన్నప్పుడు పద్దతిగా ఉండాలని మాత్రమే చెప్పానని అంతకు మించి ఎవరి మీద తనకు వ్యక్తిగతంగా ఎటువంటి గొడవలు లేవని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు చేసిన గంటల వ్యవధిలో ఇలా ఫైర్‌ అవుతూ పోస్టులు పెట్టడం షాక్‌కు గురిచేస్తోంది. ఇది విజయ్‌ దేవరకొండను ఉద్దేశించి పెట్టిన పోస్టు అన్న అనుమానం ఇండస్ట్రీ వర్గాల్లో కలుగుతోంది.&nbsp; గతంలోనూ ఇలాగే.. అనసూయ ఈ తరహా అగ్రెసివ్‌ పోస్టులు పెట్టడం ఇదే తొలిసారి కాదు. తనను ఆంటీ అన్న నెటిజన్లపై తీవ్ర స్థాయిలో మండిపడుతూ గతంలో చాలానే పోస్టులు పెట్టారు. ఆంటీ అని పిలిస్తే ఎందుకు కోపం వస్తుందని గతంలో ఓ నెటిజన్‌ ప్రశ్నించగా, కొందరు మాటల్లో అర్థాలు వేరుంటాయని ఆమె చెప్పుకొచ్చింది. మరో సందర్భంలో ఇన్‌స్టాగ్రామ్‌లో ఘాటైన క్యాప్షన్‌ పెట్టి అందరినీ షాక్‌ గురిచేసింది. తన గ్లామరస్‌ ఫోటోలోను షేర్‌ చేస్తూ హాట్‌ క్యాప్షన్‌ ఇచ్చింది. 'నేను మహిళని , భయం లేదు, సెక్సీగా ఉంటాను, అజేయురాలిని, సృజనాత్మకత కలిగిన మహిళని, మీకు ఏమైనా నేర్పించగలను.. నేను మిమ్మల్ని ప్రేమించగలను' అంటూ రాసుకొచ్చింది. ఇలా అనసూయ పెట్టే పోస్టులు సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌గా మారడం గత కొంతకాలంగా కామన్‌గా మారిపోయింది. View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) అనసూయ ప్రస్థానం జబర్దస్త్ షో ద్వారా అనసూయ తొలిసారి బుల్లితెరకు పరిచయమైంది. పొట్టి పొట్టి డ్రెస్సుల్లో కనిపించి కుర్రకారును తన మాయలో పడేసింది. కేవలం యాంకర్‌గానే గాక గ్లామర్‌ బ్యూటీగానూ పేరు తెచ్చుకుంది. తద్వారా సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది. తెలుగులో సోగ్గాడే చిన్ని నాయన (Soggade Chinni Nayana), క్షణం (Kshanam), విన్నర్‌ (Winner), గాయత్రి (Gayathri) సినిమాల్లో అనసూయ నటించింది. క్షణం చిత్రంలో ఆమె పోషించిన ప్రతినాయక పాత్రకు మంచి మార్కులే పడ్డాయి. రంగస్థలం (Rangasthalam) సినిమా అనసూయ కెరీర్‌ను మలుపు తిప్పింది. ఇందులో రంగమ్మత్త పాత్రలో అద్భుతంగా నటించింది. రంగస్థలం తర్వాత వరుస సినిమా ఆఫర్లు అనసూయను చుట్టుముట్టాయి. మీకు మాత్రమే చెప్తా, కథనం, F2, చావు కబురు చల్లగా, థ్యాంక్‌ యూ బ్రదర్‌, కిలాడీ, వాంటెడ్ పండుగాడు సినిమాల్లో అనసూయ మెరిసింది. సుకుమార్‌ తెరకెక్కించిన ‘పుష్ప’ (Pushpa) సినిమాలోనూ అనసూయ గోల్డెన్‌ ఛాన్స్‌ కొట్టేసింది. ఇందులో దాక్షయణి పాత్ర పోషించి అలరించింది. రీసెంట్‌గా ‘రజాకార్‌’ చిత్రంలో పోచమ్మ పాత్రలో కనిపించి అనసూయ అందర్నీ అలరించింది. ప్రస్తుతం ‘పుష్ప 2’ సినిమాతో పాటు తమిళంలో ఫ్లాష్‌ బ్యాక్‌ మూవీలో అనసూయ నటిస్తోంది.&nbsp;
    జూలై 25 , 2024
    Shanmukh Jaswanth: ‘షణ్ముఖ్’ గురించి సంచలన నిజాలు బయటపెట్టిన ఫ్రెండ్స్.. ఎలాంటి వాడంటే?
    Shanmukh Jaswanth: ‘షణ్ముఖ్’ గురించి సంచలన నిజాలు బయటపెట్టిన ఫ్రెండ్స్.. ఎలాంటి వాడంటే?
    యూట్యూబర్‌, బిగ్‌బాస్‌ ఫేమ్‌ షణ్ముఖ్‌ జశ్వంత్‌ గంజాయి తీసుకుంటూ గురువారం పోలీసులకు పట్టబడ్డ విషయం తెలిసిందే. షణ్ముఖ్‌ సోదరుడు సంపత్‌ వినయ్‌ తనను మోసం చేశాడంటూ డాక్టర్‌ మౌనిక అనే యువతి పెట్టిన కేసును విచారించేందుకు వెళ్లిన పోలీసులకు ఫ్లాటులో షన్ను కనిపించాడు. అతడు గంజాయి తీసుకుంటూ రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిపోవడంతో సోదరుడు సంపత్‌తో పాటు షణ్ముఖ్‌ను పోలీసులు అరెస్టు చేసినట్లు వార్తలు వచ్చాయి. అతడికి వైద్య పరీక్షలు చేయించగా బాడీలో గంజాయి ఆనవాళ్లు గుర్తించినట్లు ఫోరెన్సిక్‌ వైద్యులు సైతం నివేదిక ఇచ్చారు. అయితే ఈ వ్యవహారానికి సంబంధించి షణ్ముఖ్‌ స్నేహితులు సంచలన విషయాలు బయటపెట్టారు. షణ్ముఖ్, అతడి సోదరుడు ఎలాంటి వారో కళ్లకు కట్టే ప్రయత్నం చేశారు. ‘గంజాయి తీసుకుంది నిజమే’ యాంకర్ ధనుష్‌.. షణ్ముఖ్ జస్వంత్ అరెస్టు వెనుక అసలు నిజాలను అతడి ఫ్రెండ్స్‌ను అడిగి తెలుసుకున్నట్లు చెప్పాడు. బిగ్‌బాస్‌ ఫేమ్‌ గలాటా గీతు యూట్యూబ్‌ ఛానెల్ ద్వారా ఆ విషయాలను అతడు పంచుకున్నాడు. షన్ను గంజాయి తీసుకుంటూ రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిన మాట వాస్తవమేనని అతడి ఫ్రెండ్స్‌ కూడా ఒప్పుకున్నట్లు ధనుష్‌ చెప్పాడు. అయితే వార్తల్లో వస్తున్నట్లుగా డ్రగ్స్, కొకైన్, ఇతర డ్రగ్ పిల్స్ కానీ అతడి వద్ద లభించలేదని స్పష్టం చేశాడు. 16 గ్రాములు గంజాయి మాత్రమే పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ప్రస్తుతం కేసు కొనసాగుతున్నందున మరిన్ని విషయాలు పంచుకునేందుకు షన్ను స్నేహితులు వెనకాడినట్లు ధనుష్ చెప్పుకొచ్చాడు.&nbsp; ఆ వార్తలు అవాస్తవం : గీతూ అదే యూట్యూబ్ వీడియోలో గీతూ రాయల్‌ మాట్లాడారు. షణ్ముఖ్‌ సోదరుడు సంపత్‌ వినయ్‌ మరొకర్ని పెళ్లి చేసుకున్నాడని, లివింగ్‌ రిలేషన్‌లో ఉన్నాడని వస్తోన్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు. వాస్తవానికి 2021లోనే వినయ్‌కు.. అతడిపై ఫిర్యాదు చేసిన మౌనికకు ఎంగేజ్‌మెంట్ జరిగినట్లు గీతూ చెప్పారు. అప్పట్లోనే పెళ్లి అంటూ మౌనిక తనతో చెప్పిందని పేర్కొన్నారు. అయితే కొన్ని కారణాల వల్ల సంపత్‌ - మౌనికల పెళ్లికి గ్యాప్ వచ్చిందని.. ఈ నెల 28న పెళ్లి డేట్‌ కూడా ఫిక్స్ చేసుకున్నారని వివరించారు. ఈ క్రమంలోనే మౌనిక.. వినయ్‌ స్నేహితుల్లో ఒకరికి ఫోన్‌ చేసిందని తెలిపారు. వినయ్‌ ఇంకో పెళ్లి చేసుకునే ఆలోచనలో ఉన్నట్లు స్నేహితుడు చెప్పడంతో ఆమె వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసిందని గీతూ వెల్లడించారు. ‘అలా చేయడం సరికాదు’ ఆరు రోజుల్లో పెళ్లి పెట్టుకుని.. ఇప్పుడు మరో పెళ్లి ఆలోచన చేయడం ఏంటో తనకు అర్థం కావడం లేదని గీతూ రాయల్ అన్నారు. సమస్య ఉంటే ఇద్దరు మాట్లాడుకుని విడిపోవాలి కానీ ఇలా చేయడం సరైంది కాదని అభిప్రాయపడ్డారు. తనకు మౌనిక కొన్ని సంవత్సరాలుగా తెలుసని ఆమె చాలా సున్నిత మనస్కురాలని గీతు చెప్పుకొచ్చారు. వినయ్‌కు పెళ్లి అయితే కాలేదని, కానీ లివింగ్ రిలేషన్ షిప్‌లో ఉన్నట్లు అనిపిస్తోందని గీతూ పేర్కొన్నారు. ఇది ఏమైనా ఈ సమస్యను ఇద్దరూ సామరస్యంగా పరిష్కరించుకొని ఉంటే బాగుండేదని గీతూ అభిప్రాయపడ్డారు.&nbsp; మౌనిక చేసిన ఆరోపణలు ఇవే! బాధిత యువతి మౌనిక(Mounika).. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో అన్న సంపంత్‌తో పాటు షణ్ముఖ్‌పైనా సంచలన ఆరోపణలు చేసింది. యూట్యూబ్‌లో అవకాశం ఇస్తానని చెప్పి షణ్ముఖ్‌ తనను మోసం చేశాడని తెలిపింది. మరోవైపు సంపత్‌ తనను హోటల్స్, విల్లాలకు తీసుకెళ్లి లైంగిక దాడి చేసినట్లు ఆరోపించింది. ఈ క్రమంలో తాను గర్భవతిని కాగా, సంపత్‌ భయపెట్టి అబార్షన్‌ కూడా చేయించాడని పేర్కొంది. తనను పెళ్లి చేసుకోవాలని బలవంతం చేయడంతో ఓ రింగ్‌ తొడిగి నిశ్చితార్థం అయిపోయిందని చెప్పాడని వివరించింది. అటు షణ్ముఖ్‌ దగ్గర గంజాయి, డ్రగ్స్‌ పిల్స్ ఉన్నాయని మౌనిక ఆరోపించింది. తన దగ్గర వీడియో ఆధారాలు కూడా ఉన్నాయని చెప్పింది. ఓ కానిస్టేబుల్‌ షణ్ముఖ్‌కు సాయపడాలని చూశాడని ఆమె ఆరోపించింది. తనకు ప్రాణ భయం ఉందని.. రక్షణ కల్పించాలంటూ మౌనిక పోలీసులను వేడుకుంది.&nbsp; షణ్ముఖ్‌కు ఇది తొలిసారి కాదు! షణ్ముఖ్ అరెస్టు కావడం ఇది మొదటి సారి కాదు. గతంలో హిట్ అండ్ రన్ కేసులో షణ్ముఖ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అప్పుడు మద్యం సేవించి లేకపోవడంతో ఆ కేసు నుండి షణ్ముఖ్‌ త్వరగానే బయపడగలిగాడు. అయితే తనపై పడ్డ మచ్చను తుడిపేసుకోవాలన్న లక్ష్యంతో షణ్ముఖ్‌ బిగ్‌బాస్‌ సీజన్‌-5లో అడుగుపెట్టాడు. కానీ అక్కడ అక్కడ తోటి హౌస్‌మేట్‌ సిరి హనుమంత్‌తో హద్దులు మీరడంతో విన్నర్‌ కావాల్సిన షణ్ముఖ్‌ రన్నర్‌ కావాల్సి వచ్చింది. ఆ సీజన్‌ విజేతగా సన్నీ నిలిచాడు.&nbsp; బిగ్‌బాస్‌ ఎఫెక్ట్‌తో బ్రేకప్‌! బిగ్‌బాస్‌ వెళ్లడానికి ముందు వరకూ సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌ దీప్తి సునైనాతో షణ్ముఖ్‌ డీప్‌ లవ్‌లో ఉండేవాడు. అప్పట్లో ఎక్కడ చూసిన ఈ జంటే కనిపించింది. సోషల్‌ మీడియాలోనూ వీరిద్దరు కలిసి దిగిన ఫొటోలు చక్కర్లు కొట్టేవి. అయితే బిగ్‌బాస్‌ ఇంట్లో సిరితో చేసిన సిల్లీ పనుల వల్ల వారి ప్రేమకు బ్రేకప్‌ పడింది.&nbsp; అయితే బ్రేకప్ బాధలో ఉన్న తమ్ముడికి ఆ సమయంలో&nbsp; అన్న సంపత్‌ ప్రేమ పాఠాలు చెప్పి కళ్లు తెరిపించాడు. ప్రేమలో ఓడి పోయావని దిగులు చెందవద్దని ముందు ముందు దేశం మెుత్తం నిన్ను ప్రేమిస్తుందని ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఓ పోస్టు పెట్టాడు. అయితే అప్పుడు తమ్ముడికి ప్రేమ సూక్తులు, జీవిత పాఠాల గురించి చెప్పి ఇప్పుడు ప్రేయసి మోసం చేసిన కేసులో సంపత్ అరెస్టు కావడం విడ్డూరంగా ఉంది. షణ్ముఖ్‌తో క్లోజ్‌.. వైష్ణవి లవ్‌ బ్రేకప్‌! బేబీ (Baby Movie)సినిమాతో బాగా పాపులర్ అయిన హీరోయిన్ వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya).. ఆ చిత్రానికి ముందు యూట్యూబ్‌ సిరీస్‌లలో నటించేది. ముఖ్యంగా షణ్ముఖ్ జస్వంత్‌తో చేసిన ‘సాఫ్ట్‌వేర్‌ డెవలపర్’ సిరీస్‌ ఆమెకు విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టింది. ఇందులో షన్ను, వైష్ణవి జోడీ సూపర్‌గా ఉందంటూ కామెంట్స్ వినిపించాయి. వీటికి తోడు అప్పట్లో ఈ జంట కలిసి చేసి డ్యూయెట్‌ రీల్స్‌ కూడా నెట్టింట బాగా వైరల్ అయ్యాయి. అయితే ‘సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌’ సిరీస్‌కు ముందు వైష్ణవి.. బిగ్‌బాస్‌ ఫేమ్‌ మెహబూబ్‌ దిల్సేతో చాలా క్లోజ్‌గా ఉండేదట. వారిద్దరూ రిలేషన్‌లో ఉన్నట్లు సోషల్‌ మీడియా గుసగుసలు వినిపించాయి. అయితే షన్నుతో సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌ చేసినప్పటి నుంచి వారి మధ్య దూరం పెరిగిందట. షన్నుతో వైష్ణవి క్లోజ్‌గా ఉండటంతో మెహబూబ్‌ దూరంగా వెళ్లిపోయినట్లు గాసిప్స్‌ వచ్చాయి.&nbsp; షణ్మఖ్‌ను ఫేమస్‌ చేసిన సిరీస్‌లు ఇవే! 2018లో వచ్చిన 'నన్ను దోచుకుందువటే' చిత్రంలో ఓ చిన్న పాత్ర ద్వారా షణ్ముఖ్‌ తెరంగేట్రం చేశాడు. ఆ తర్వాత ఇండస్ట్రీలో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో యూట్యూబ్‌పై తన ఫోకస్ పెట్టాడు. 2020లో అతడు చేసిన ‘ది సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌’ (The Software Developer) అతడి కెరీర్‌ను మలుపు తిప్పింది. యూత్‌లో ఎనలేని క్రేజ్‌ను తీసుకువచ్చింది. ఆ తర్వాత వరుసగా ‘సూర్య’, ‘స్టూడెంట్‌’ వంటి యూట్యూబ్‌ సిరీస్‌లలో నటించి షణ్ముఖ్‌ తన క్రేజ్‌ను మరింత పెంచుకున్నాడు. రుక్మిణి, మలుపు, Shanmukh Anthem, జాను, అయ్యయ్యో వంటి మ్యూజిక్ ఆల్బమ్స్‌తోనూ షణ్మఖ్‌ మంచి పేరు సంపాదించాడు.
    ఫిబ్రవరి 23 , 2024
    Nindha Movie Review: వరుణ్‌ సందేశ్‌ వరుస ఫ్లాప్స్‌కు బ్రేక్‌ పడిందా.. ‘నింద’ సినిమా ఎలా ఉందంటే?
    Nindha Movie Review: వరుణ్‌ సందేశ్‌ వరుస ఫ్లాప్స్‌కు బ్రేక్‌ పడిందా.. ‘నింద’ సినిమా ఎలా ఉందంటే?
    నటీనటులు : వరుణ్‌ సందేశ్‌, అనీ జిబి, తనికెళ్ల భరణి, భద్రం, సూర్య కుమార్‌, శ్రేయా రాణి రెడ్డి, మధు తదితరులు రచన, దర్శకత్వం : రాజేష్‌ జగన్నాథం సంగీతం : సంతు ఓంకార్‌ సినిమాటోగ్రఫీ : రమిజ్‌ నవీత్‌ ఎడిటర్‌ : అనిల్‌ కుమార్‌. పి నిర్మాత: రాజేష్‌ జగన్నాథం విడుదల తేదీ: 21 జూన్‌, 2024 వరుణ్‌సందేశ్‌ హీరోగా.. రాజేశ్‌ జగన్నాథం డైరెక్షన్‌లో రూపొందిన చిత్రం ‘నింద’ (Nindha Movie). కాండ్రకోట మిస్టరీ అనే క్యాప్షన్‌తో ఈ సినిమా రూపొందింది. అనీ, తనికెళ్లభరణి, భద్రం, సూర్య కుమార్‌ ముఖ్య పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్‌ ఆకట్టుకున్నాయి. జూన్‌ 21న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా? ఫ్లాప్స్‌తో సతమతమవుతున్న వరుణ్‌ సందేశ్‌కు విజయాన్ని అందించిందా? ఈ రివ్యూలో తెలుసుకుందాం. కథేంటి కాండ్రకోట అనే ఊరిలో ముంజు అనే అమ్మాయిని బాలరాజు (ఛత్రపతి శేఖర్) అత్యాచారం చేసి చంపేశాడని పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఉరిశిక్ష విధిస్తారు. అయితే ఈ తీర్పు ఇచ్చిన జడ్జి సత్యానంద్ (తనికెళ్ల భరణి) మాత్రం.. ఈ కేసులో సరైన తీర్పు ఇవ్వలేకపోయానని బాధతోనే కన్నుమూస్తారు. దీంతో ఈ కేసులో అసలైన నిందితుడు ఎవరో తెలుసుకోవాలని జడ్జి కొడుకు వివేక్ (వరుణ్ సందేశ్) ఫిక్స్ అవుతాడు. అలా ఓ ఆరుగురు వ్యక్తుల్ని కిడ్నాప్ చేస్తాడు. దీంతో అసలు నిజాలు బయటపడతాయి. ఇంతకీ వివేక్ ఏం తెలుసుకున్నాడు? ఆ ఆరుగురిలో హత్య చేసింది ఎవరు? 'నింద' పడిన బాలరాజుకి ఉరిశిక్ష పడకుండా వివేక్‌ అడ్డుకోగలిగాడా? లేదా? అనేది స్టోరీ. ఎవరెలా చేశారంటే కెరీర్‌లో చాలా వరకూ లవర్‌ బాయ్‌ పాత్రలే చేసిన వరుణ్‌ సందేశ్‌.. ఇందులో వివేక్ అనే పాత్రలో కొత్త కనిపించాడు. మానవ హక్కుల కమీషనర్‌ ఉద్యోగిగా తన మార్క్‌ నటనతో మెప్పించాడు. ఈ సినిమాలో వరుణ్‌ సందేశ్‌ పడిన కష్టం.. ప్రతీ సీన్‌లో స్పష్టంగా కనిపించింది. ఈ సినిమాతో అతడు నటుడిగా మరో మెట్టు పైకెక్కాడు. అటు బాలరాజుగా చేసిన ఛత్రపతి శేఖర్, మంజుగా చేసిన మధు తమ నటనతో ఆకట్టుకున్నారు. కిడ్నాప్ అయిన ఆరుగురు కూడా ఉన్నంతలో పర్వాలేదనిపించారు. మిగిలిన పాత్రదారులు తమ పరిధిమేరకు నటించి మెప్పించారు. డైరెక్షన్‌ ఎలా ఉందంటే? చేయని నేరానికి ఏళ్ల తరబడి శిక్ష అనుభవించిన ఘటనలు ఇటీవల తరచూ వార్తల్లో చూస్తూనే ఉన్నాం. దర్శకుడు రాజేష్‌ జగన్నాథం ఈ పాయింట్‌నే కథాంశంగా తీసుకోవడం ప్రశంసనీయం. ఆరుగురు వ్యక్తుల కిడ్నాప్‌తో కథ మెుదలు పెట్టిన దర్శకుడు.. వారి నుంచి నిజాన్ని రాబట్టేందుకు ఇంటర్వెల్‌ వరకూ సమయాన్ని తీసుకోవడం కాస్త సాగదీతలా అనిపిస్తుంది. ప్రేక్షకులకు బోర్‌ తెప్పిస్తుంది. అయితే ఫస్టాఫ్‌తో పోలిస్తే సెకండాఫ్‌ను దర్శకుడు చాలా ఆసక్తికరంగా నడిపించారు. బాలరాజు, మంజు ఎవరు? వాళ్ల బ్యాక్ స్టోరీ ఏంటి? కిడ్నాప్ అయిన ఆరుగురికి ఈ కేసుకి సంబంధమేంటి? అన్న ప్రశ్నలకు సెకండాఫ్‌లో క్లారిటీ ఇస్తూ వచ్చారు డైరెక్టర్‌. క్లైమాక్స్‌లో వచ్చే ఊహించని ట్విస్ట్‌ ప్రేక్షకులను ఉలిక్కిపడేలా చేస్తుంది. ఫస్టాఫ్‌లోని సాగదీత సన్నివేశాలను పక్కనబెడితే క్రైమ్‌ థ్రిల్లర్‌లను ఇష్టపడేవారికి ఈ మూవీ పర్వాలేదనిపిస్తుంది. టెక్నికల్‌గా.. సాంకేతిక అంశాల విషయానికి వస్తే.. నేపథ్యం సంగీతం మెప్పిస్తుంది. అయితే కొన్ని చోట్ల డైలాగ్స్‌ను డామినేట్ చేయడం వల్ల సరిగా వినిపించలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. తక్కువ లోకేషన్స్‌లో సినిమాను తీసినప్పటికీ విజువల్స్‌ చాలా నేచురల్‌గా ఉన్నాయి. ఎడిటర్‌ తన కత్తెరకు ఇంకాస్త పని పెట్టి ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు సినిమా తగ్గట్లు ఉన్నాయి. ప్లస్‌ పాయింట్స్ వరణ్‌ సందేశ్‌ నటననేపథ్య సంగీతంసెకండాఫ్‌ మైనస్‌ పాయింట్స్‌ ఫస్టాఫ్‌సాగదీత సీన్స్‌ Telugu.yousay.tv Rating : 2.5/5
    జూన్ 21 , 2024
    Music Shop Murthy Review: లక్ష్యం కోసం 52 ఏళ్ల వ్యక్తి చేసే పోరాటం.. ‘మ్యూజిక్‌ షాప్‌ మూర్తి’ ఎలా ఉందంటే ?
    Music Shop Murthy Review: లక్ష్యం కోసం 52 ఏళ్ల వ్యక్తి చేసే పోరాటం.. ‘మ్యూజిక్‌ షాప్‌ మూర్తి’ ఎలా ఉందంటే ?
    నటీనటులు: అజయ్ ఘోష్, చాందిని చౌదరి, ఆమని, అమిత్ శర్మ, భాను చందర్, దయానంద్ రెడ్డి తదితరులు రచన, దర్శకత్వం: శివ పాలడుగు&nbsp; సంగీతం: పవన్&nbsp; సినిమాటోగ్రఫీ: శ్రీనివాస్‌ బెజుగం ఎడిటర్‌: బొంతల నాగేశ్వరరెడ్డి నిర్మాతలు: హర్ష గారపాటి &amp; రంగారావు గారపాటి విడుదల తేది: జూన్‌ 14, 2024 టాలీవుడ్ విలక్షణ నటుడు అజయ్ ఘోష్ (Ajay Ghosh), క్యూట్ హీరోయిన్ చాందిని చౌదరి (Chandini Chowdary) ప్రధాన పాత్రలలో నటించిన లేటెస్ట్ మూవీ 'మ్యూజిక్ షాప్ మూర్తి' (Music Shop Murthy Review). శివ పాలడుగు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఫ్లై హై సినిమాస్ బ్యానర్‌పై హర్ష గారపాటి, రంగారావు గారపాటి గ్రాండ్‌గా నిర్మించారు. ఇప్పటికే విడుదలై ట్రైలర్, ప్రమోషన్‌ చిత్రాలు ఆడియన్స్‌ను ఆకర్షిస్తున్నాయి. జూన్ 14న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా? నటుడిగా అజయ్‌ ఘోష్‌ను మరో మెట్టు పైకి ఎక్కించిందా? ఇప్పుడు చూద్దాం.&nbsp; కథేంటి మూర్తి (అజయ్‌ ఘోష్‌).. 52 ఏళ్ల వయసులో మ్యూజిక్‌ షాప్‌ నడుపుతుంటాడు. లాభాలు లేకున్నా అదే పని చేస్తుంటాడు. అయితే మూర్తికి డీజే అవ్వాలన్న కోరిక ఉంటుంది. మరోవైపు అమెరికా నుంచి వచ్చిన అంజన (చాందిని చౌదరి) కూడా డీజే కావాలని కలలు కంటుంది. అందులో శిక్షణ కూడా తీసుకుంటుంది. ఓ కారణం చేత మూర్తిని కలిసిన అంజన.. డీజే కావాలన్న అతడి ఆసక్తిని గమనించి నేర్పించేందుకు ఒప్పుకుంటుంది. అలా ఆమె వద్ద డీజే నేర్చుకొని హైదరాబాద్‌కు వచ్చిన మూర్తి.. ఎలాంటి కష్టాలు పడ్డాడు? అంజన తండ్రి.. మూర్తిపై ఎందుకు కేసు పెట్టాడు? ఫేమస్‌ డీజే డెవిల్‌ (అమిత్‌ శర్మ) మూర్తిని ఎలా అవమానించాడు? ఇంతకీ మూర్తి డీజేగా సక్సెస్‌ అయ్యాడా? లేదా? అన్నది కథ. ఎవరెలా చేశారంటే క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న అజయ్‌ ఘోష్‌.. మూర్తి పాత్రలో మరోమారు అదరగొట్టారు. మధ్యతరగతి వ్యక్తి పాత్రలో పూర్తిగా ఒదిగిపోయి నటించారు. ఓ పక్క తనదైన కామెడీతో నవ్విస్తూనే.. ఎమోషనల్‌ సీన్స్‌లో ఏడిపించారు. ఇక అంజన పాత్రకు హీరోయిన్‌ చాందిని పూర్తిగా న్యాయం చేసింది. మూర్తికి డీజే నేర్పించే క్రమంలో ఆమె చెప్పే డైలాగ్స్‌ ఆలోచింపజేస్తాయి. మూర్తి భార్యగా ఆమని చక్కటి నటన కనబరిచింది. అమిత్‌ శర్మ, భానుచందర్‌, దయానంద్‌ రెడ్డి, పటాస్‌ నాని తదితరులు తమ పాత్ర పరిధిమేరకు నటించి ఆకట్టుకున్నారు.&nbsp; డైరెక్షన్ ఎలా ఉందంటే దర్శకుడు శివ పాలడుగు.. మూర్తి పాత్రకు అజయ్‌ ఘోష్‌ను ఎంచుకోవడం ద్వారానే సగం విజయం సాధించేశారు. కథలో పెద్దగా మెరుపులు లేనప్పటికీ ఎమోషనల్‌గా సినిమాను నడిపి ఆకట్టుకున్నారు. ప్రారంభంలో కథ స్లోగా నడుస్తున్నట్లు అనిపించినా.. పది నిమిషాలకే అందరు కథలో లీనమవుతారు. ఫస్టాఫ్‌లో మూర్తి ఫ్యామిలీ కష్టాలతో పాటు డీజే సాధన వంటివి చూపించారు. ఇక సెకండాఫ్‌ను ఫన్‌ &amp; ఎమోషనల్‌గా నడిపి దర్శకుడు ఆకట్టున్నారు. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్‌లో వచ్చే సన్నివేశాలు కన్నీళ్లు తెప్పిస్తాయి. అయితే ప్రధానమైన క్లైమాక్స్‌ ఇంకాస్త బెటర్‌గా రాసుకొని ఉంటే బాగుండేది. ఓవరాల్‌గా 52 ఏళ్ల మూర్తి.. తన లక్ష్యం కోసం చేసే పోరాటం అందర్నీ మెప్పిస్తుంది.&nbsp; టెక్నికల్‌గా..&nbsp; సాంకేతిక అంశాల విషయానికి వస్తే.. అన్ని విభాగాలు మంచి పనితీరు కనబరిచాయి. ముఖ్యంగా పవన్‌ అందించిన సంగీతం సినిమాకు చాలా బాగా ప్లస్‌ అయ్యింది. అతడు అందించిన నేపథ్య సంగీతం.. భావోద్వేగ సన్నివేశాలను మరింత హత్తుకునేలా చేసింది. సినిమాటోగ్రఫీ ఓకే. ఎడిటింగ్‌ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. ప్లస్‌ పాయింట్స్‌ అజయ్‌ ఘోష్‌ నటనభావోద్వేగ సన్నివేశాలుప్రీ క్లైమాక్స్‌ మైనస్‌ పాయింట్స్‌ స్లో నారేషన్‌క్లైమాక్స్‌ Telugu.yousay.tv Rating : 3/5&nbsp;&nbsp; https://telugu.yousay.tv/top-secrets-you-dont-know-about-telugu-beauty-chandini-chowdary.html
    జూన్ 14 , 2024
    Love Mouli Review: బోల్డ్‌ సీన్స్‌లో నవదీప్‌ రచ్చ రచ్చ.. ‘లవ్‌ మౌళి’ ఎలా ఉందంటే?
    Love Mouli Review: బోల్డ్‌ సీన్స్‌లో నవదీప్‌ రచ్చ రచ్చ.. ‘లవ్‌ మౌళి’ ఎలా ఉందంటే?
    నటీనటులు: నవదీప్‌, పంకూరి గిద్వానీ, చార్వి దత్తా, మిర్చి హేమంత్‌, భావన సాగి, మిర్చి కిరణ్‌, అక్షయ్‌ డోగ్రా తదితరులు దర్శకుడు: అవ‌నీంద్ర సంగీత దర్శకుడు: గోవింద్‌ వసంత్‌ సినిమాటోగ్రఫీ: అజయ్ శివశంకర్ ఎడిటింగ్: అవనీంద్ర నిర్మాణ సంస్థ : సి స్పేస్‌ విడుదల తేదీ: జూన్‌ 7, 2024 నవదీప్‌ హీరోగా అవనీంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘లవ్‌ మౌళి’ (Love Mouli Review). పంఖురి గిద్వానీ, భావన సాగి హీరోయిన్లుగా చేశారు. సి స్పేస్‌ సంస్థ ఈ సినిమాను నిర్మించింది. న‌వ‌దీప్ 2.0 అంటూ వినూత్న‌మైన ప్ర‌మోష‌న్స్‌తో ఆకట్టుకున్న ఈ చిత్రం.. జూన్‌ 7న థియేటర్లలోకి వచ్చింది. మరి ‘లవ్‌ మౌళి’.. నవ్‌దీప్‌కు హిట్‌ తెచ్చిపెట్టిందా? యూత్‌ను ఏమేరకు ఆకట్టుకుంది? ఈ రివ్యూలో తెలుసుకుందాం.&nbsp; కథేంటి తల్లిదండ్రులు విడిపోవడంతో మౌళి (నవదీప్‌) చిన్నప్పటి నుంచి ఒంటరిగా పెరుగుతాడు. కొన్ని అనుభవాల వల్ల అతడికి ప్రేమ‌పై కూడా న‌మ్మ‌కం పోతుంది. పెయిటింగ్ వేస్తూ వాటి ద్వారా వ‌చ్చిన డ‌బ్బుల‌తో జీవిస్తుంటాడు. కొన్ని నాటకీయ పరిణామాల వల్ల ఓ అఘోరా (రానా ద‌గ్గుబాటి) అతడికి మహిమ గల బ్రష్‌ ఇస్తాడు. ఆ పెయింటింగ్ బ్ర‌ష్‌తో తను కోరుకునే లక్షణాలున్న అమ్మాయిని సృష్టించే శక్తి మౌళికి వస్తుంది. ఈ క్రమంలో అతడు వేసిన పెయింటింగ్ ద్వారా చిత్ర (ఫంఖూరీ గిద్వానీ) అత‌డి ముందు ప్ర‌త్య‌క్ష‌మ‌వుతుంది. కొన్నాళ్లు సాఫీగా సాగిన వారి ప్రేమ బంధం.. గొడవలు రావడంతో బ్రేకప్‌ అవుతుంది. మౌళి.. మళ్లీ బ్రష్‌ పట్టి అమ్మాయి పెయింటింగ్‌ గీయగా తిరిగి చిత్రనే ముందుకు వస్తుంది. అలా ఎందుకు జరిగింది? మౌళి.. లవ్‌ బ్రేకప్‌కు కారణమేంటి? ప్రేమకు నిజమైన అర్థాన్ని హీరో ఎలా తెలుకున్నాడు? మౌళి, చిత్ర ఒక్కటయ్యారా? లేదా? అన్నది కథ. ఎవరెలా చేశారంటే మౌళి పాత్రలో నటుడు నవదీప్‌ కొత్త కోణంలో కనిపిస్తాడు. అతడి లుక్‌తో పాటు నటనలోనూ వైవిద్యం కనిపించింది. స‌మాజపు క‌ట్టుబాట్ల‌తో సంబంధం లేకుండా స్వేచ్ఛ‌గా బ‌తికే యువ‌కుడి పాత్ర‌లో అతడు చక్కటి నటన కనబరిచాడు. కెరీర్‌ బెస్ట్‌ నటనతో ఆకట్టుకున్నాడు. ఇక చిత్ర పాత్రలో ఫంకూరి గిద్వానీ ఆకట్టుకుంది. ప్రాధాన్యం ఉన్న పాత్రలో అద్భుతంగా నటించింది. గ్లామర్‌ పండిస్తూనే నటనలోనూ వేరియేషన్స్‌ చూపించింది. ఇక అఘోరాగా గెస్ట్‌ పాత్రలో కనిపించి రానా అందర్నీ సర్‌ప్రైజ్‌ చేశాడు. మిగిలిన పాత్ర ధారులు తమ పరిధిమేరకు ఆకట్టుకున్నారు.&nbsp; డైరెక్షన్‌ ఎలా ఉందంటే దర్శకుడు అవనీంద్ర.. యూత్‌ను టార్గెట్‌ చేస్తూ బోల్డ్‌ లవ్‌స్టోరీగా 'లవ్‌ మౌళి'ని తెరకెక్కించారు. తాను కోరుకునే అమ్మాయిని తానే స్వ‌యంగా సృష్టించుకునే శ‌క్తి ఓ యువ‌కుడి వ‌స్తే ఎలా ఉంటుంద‌న్న డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో మూవీని రూపొందించారు. లిప్‌లాక్‌లు, బోల్డ్‌ సీన్స్‌తో.. కథను రొమాంటిక్‌గా నడిపించారు డైరెక్టర్‌. ప్రారంభంలో కాస్త బోరింగ్‌గా అనిపించినా.. మౌళి లైఫ్‌లోకి చిత్ర వచ్చినప్పటికీ నుంచి అసలు కథ మెుదలవుతుంది. అయితే హీరో హీరోయిన్ల మధ్య వచ్చే సీన్స్‌, ఘర్షణలు రొటిన్‌గా అనిపిస్తాయి. అవసరం లేకున్నా వచ్చే కొన్ని బోల్డ్‌ సన్నివేశాలు.. ప్రేక్షకులకు విసుగు తెప్పిస్తాయి. ఇక క్లైమాక్స్‌ను కూడా చాలా సాధారణంగా ముగించాడు. ఓవరాల్‌గా నవదీప్‌ యాక్టింగ్‌తో పాటు లొకేషన్స్‌, అద్భుతమైన విజువల్స్‌తో ఆడియన్స్‌కు మంచి ఎక్స్‌పీరియన్స్ అందించారు డైరెక్టర్‌.&nbsp; టెక్నికల్‌గా సాంకేతిక అంశాల గురించి మాట్లాడుకుంటే.. సంగీత దర్శకుడు గోవింద్‌ వసంత్‌ అందించిన మ్యూజిక్‌ పర్వాలేదు. ఎడిటర్‌గా కూడా బాధ్యతలు చేపట్టిన దర్శకుడు అవనీంద్ర అనవసరమైన సీన్స్‌ని ఇంకా టైట్‌గా ట్రీమ్ చేసి ఉంటే బాగుండేది. కెమెరామెన్‌ అజయ్ శివశంకర్ పనితనం ఆకట్టుకుంది. విజువల్స్‌ను చాలా సహజంగా, చాలా అందంగా చూపించారు. నిర్మాణ విలువలు బాగున్నాయి. ప్లస్‌ పాయింట్స్‌ నవదీప్‌, పంకూరి గిద్వానీ నటనఎమోషనల్‌ సన్నివేశాలుసంగీతం మైనస్‌ పాయింట్స్‌ ఆసక్తిగా సాగని కథనంబోరింగ్‌ సన్నివేశాలు Telugu.yousay.tv Rating : 2.5/5&nbsp;&nbsp;
    జూన్ 07 , 2024
    Vidya Vasula Aham Review: ఓటీటీలోకి వచ్చేసిన ‘విద్య వాసుల అహం’.. సినిమా ఎలా ఉందంటే?
    Vidya Vasula Aham Review: ఓటీటీలోకి వచ్చేసిన ‘విద్య వాసుల అహం’.. సినిమా ఎలా ఉందంటే?
    నటీనటులు: రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్, అవసరాల శ్రీనివాస్, అభినయ, శ్రీనివాస్ రెడ్డి, రవివర్మ అడ్డూరి, కాశీ విశ్వనాథ్, రూప లక్ష్మి, రాజశ్రీ నాయర్, తదితరులు దర్శకుడు: మణికాంత్ గెల్లి సంగీత దర్శకుడు: కల్యాణి మాలిక్ సినిమాటోగ్రఫీ: అఖిల్ వల్లూరి ఎడిటింగ్: సత్య గిడుతూరి నిర్మాతలు: నవ్య మహేష్ ఎమ్, రంజిత్ కుమార్ కొడాలి, చందన కట్ట ఓటీటీ : ఆహా రాహుల్ విజయ్, శివాని జంటగా నటించిన&nbsp; లేటేస్ట్‌ చిత్రం 'విద్య వాసుల అహం'. మణికాంత్‌ గెల్లి దర్శకుడు. ఈ చిత్రాన్ని ఎటర్నిటి ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై లక్ష్మీ సవ్య, రంజిత్‌ కుమార్‌ నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌, ప్రచార చిత్రాల సినిమా ఆసక్తిని పెంచాయి. ఇదిలా ఉంటే ఈ సినిమా నేరుగా ఇవాళ ఓటీటీలోకి వచ్చింది. మే 17 నుంచి ఆహా వేదికగా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఈ సినిమా ఎలా ఉంది. ఓటీటీ ప్రేక్షకులను మెప్పించిందా? లేదా?&nbsp; ఈ రివ్యూలో తెలుసుకుందాం.&nbsp; కథేంటి విద్య (శివానీ రాజశేఖర్) తాను పెళ్లి చేసుకోబోయే అబ్బాయికి కొన్ని లక్షణాలు తప్పనిసరిగా ఉండాలని నిర్ణయించుకుంటుంది. తను పెట్టిన పరీక్షల్లో నెగ్గిన వరుడినే పెళ్లి చేసుకుంటానని తల్లిదండ్రులను ఒప్పిస్తుంది. అలా వాసు (రాహుల్‌ విజయ్‌)ను విద్య వెళ్లి చేసుకుంటుంది. అయితే రోజులు గడుస్తున్న కొద్ది వారిలోని అహం మెుదలవుతుంది. అది వారి బంధాన్ని ప్రభావితం చేస్తుంటుంది. కొన్ని నాటకీయ పరిణామాలు.. వాసు-విద్య జీవితాల్లో ఎలాంటి మార్పులకు కారణమయ్యాయి? వారి మధ్య వచ్చిన గొడవలు ఏంటి? వాసు జాబ్‌ పోతే విద్య ఏం చేసింది? కొత్త జంట తమ కలహాలకు ఎలాంటి ముగింపు ఇచ్చారు? అన్నది కథ. ఎవరెలా చేశారంటే యువ నటుడు రాహుల్ విజయ్ కొత్త పెళ్ళి కొడుకు పాత్రలో మెప్పించాడు. ఈ జనరేషన్‌ యూత్‌ను ప్రతిబింబిస్తూ తన నటనతో ఆకట్టుకున్నాడు. హీరోయిన్ పాత్రలో శివాని రాజశేఖర్‌ చక్కటి నటన కనబరిచింది. నవ వధువుగా చీరలో క్యూట్‌గా కనిపిస్తూనే భర్తతో గొడవ పడే సీన్స్‌లో అదరగొట్టింది. ప్రధానంగా ఈ రెండు పాత్రల చుట్టే కథ మెుత్తం తిరిగింది. ఇక నారదుడుగా శ్రీనివాస రెడ్డి, లక్ష్మి దేవిగా అభినయ, విష్ణుమూర్తిగా అవసరాల శ్రీనివాస్ కాస్సేపు కనపడి అలరించారు. ఇతర నటీనటులు తమ పరిధిమేరకు నటించి ఆకట్టుకున్నారు.&nbsp; డైరెక్షన్ ఎలా ఉందంటే దర్శకుడు మణికాంత్‌ గెల్లి.. ఈ జనరేషన్‌ యూత్‌ను లక్ష్యంగా చేసుకొని ఈ మూవీని తెరకెక్కించారు. పెళ్లైన తర్వాత యువతీ యువకులు ఎలా ఉంటున్నారో కళ్లకు కట్టే ప్రయత్నం చేశారు. సినిమాను మాముల కథలా చెప్పకుండా విష్ణుమూర్తి, లక్ష్మీ దేవి, నారదుడు మాటల ద్వారా స్టోరీని నడిపించడం కొత్తగా అనిపిస్తుంది. అయితే హీరో హీరోయిన్ల మధ్య బలమైన సన్నివేశాలను రాసుకోవడంలో డైరెక్టర్‌ విఫలమయ్యారు. అహం కారణంగా వారి జీవితాలు ఎలా ప్రభావితం అయ్యాయో తెరపై స్పష్టంగా చూపించడంలో తడబడ్డాడు. డైలాగ్స్‌ కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. కథ మెుత్తాన్ని భార్య భర్తల మధ్యే తిప్పడం.. ఆకట్టుకునే ఇతర పాత్రలు లేకపోవడం ఆడియన్స్‌కు బోర్‌ కొట్టిస్తుంది.&nbsp;&nbsp; సాంకేతికంగా సాంకేతిక అంశాల విషయానికి వస్తే.. కల్యాణి మాలిక్ సంగీతం బాగుంది. నేపథ్య సంగీతం కూడా సన్నివేశాలను బాగా ఎలివేట్‌ చేసింది. సినిమాటోగ్రాఫర్‌ చక్కటి విజువల్స్ అందించాడు. ఎడిటర్‌ తన కత్తెరకు మరింత పని పెట్టి ఉంటే బాగుండేంది. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.&nbsp; ప్లస్‌ పాయింట్స్‌ రాహుల్‌, శివానీ నటనసంగీతంసినిమాటోగ్రఫీ మైనస్‌ పాయింట్స్ స్లో స్క్రీన్‌ప్లేఎడిటింగ్‌ Telugu.yousay.tv Rating : 2.5/5&nbsp;&nbsp;
    మే 17 , 2024
    Line Man Review: హీరో దెబ్బకు ఆ గ్రామంలో కరెంటు కష్టాలు.. సినిమా ఎలా ఉందంటే?
    Line Man Review: హీరో దెబ్బకు ఆ గ్రామంలో కరెంటు కష్టాలు.. సినిమా ఎలా ఉందంటే?
    నటీనటులు : త్రిగుణ్‌, కాజల్ కుందెర్, జయశ్రీ, హరిణీ శ్రీకాంత్‌ తదితరులు.. డైరెక్టర్‌ : వి. రఘు శాస్త్రి సంగీతం: మణికాంత్‌ ఖాద్రి సినిమాటోగ్రాఫర్‌ : శాంతి సాగర్‌ హెచ్‌.జీ నిర్మాత : గణేష్‌ పాపన్న విడుదల తేదీ: 22-03-2024 యంగ్‌ హీరో త్రిగుణ్ (Trigun), కాజల్ కుందెర్ (Kaajal Kunder) జంటగా రఘు శాస్త్రి (Raghu Shastry) దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘లైన్ మ్యాన్’ (Line Man Review In Telugu). పర్పల్ రాక్ ఎంటర్‌టైనర్స్ బ్యానర్‌పై ఈ సినిమాని తెరకెక్కించారు. కేరళలో జరిగిన ఓ యదార్థ ఘటన ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించినట్లు చిత్ర యూనిట్‌ తెలిపింది. ఇవాళ తెలుగు, కన్నడ భాషల్లో ఒకేసారి విడుదలైన ఈ చిత్రం ఎలా ఉంది? ప్రేక్షకులను మెప్పించిందా? లేదా? ఈ రివ్యూలో పరిశీలిద్దాం.&nbsp; కథేంటి నటరాజ్‌ అలియాస్‌ నట్టు (త్రిగుణ్‌) తండ్రి విద్యుత్‌శాఖలో లైన్‌మ్యాన్‌గా పనిచేసేవాడు. ఆయన అకస్మిక మరణంతో ఆ జాబ్‌ నట్టుకు వస్తుంది. దీంతో ఊర్లో కరెంట్‌ రావాలన్న, పోవాలన్న అంతా నట్టు చేతుల్లోకి వెళ్లిపోతుంది. ఈ క్రమంలో గ్రామంలో అందరికి పురుళ్లు పోసే దేవుడమ్మ (బి. జయశ్రీ) 100వ పుట్టిన రోజు ఘనంగా చేద్దామని నట్టు గ్రామస్తులకు సలహా ఇస్తాడు. ఇందుకు గ్రామస్తులు ఓకే చెప్పి ఏర్పాట్లు కూడా మెుదలుపెడతారు. అయితే సడెన్‌గా నట్టు కరెంటు ఇవ్వను అని చెప్పడంతో అంతా ఆశ్చర్యపోతారు. నట్టు ఎందుకు అలా అన్నాడు? దేవుడమ్మ రియాక్షన్‌ ఏంటి? కొన్ని రోజుల పాటు కరెంట్ ఆపేయడానికి కారణం ఏంటి? మళ్ళీ ఆ ఊరికి నట్టు కరెంట్ ఇచ్చాడా? లేదా? అన్నది తెలియాలంటే తెరపై చూడాల్సిందే. ఎవరెలా చేశారంటే హీరో త్రిగుణ్‌.. లైన్‌ మ్యాన్‌ (Line Man Review In Telugu) పాత్రలో చక్కగా ఒదిగిపోయాడు. పల్లెటూరు వ్యక్తిగా నేచురల్‌ లుక్‌లో కనిపించి ఆకట్టుకున్నాడు. చక్కగా హావాభావాలను పలికించి మెప్పించాడు. అటు హీరోయిన్ కాజల్‌ కుందెర్‌.. దేవుడమ్మ మనవరాలి పాత్రలో పర్వాలేదనిపించింది. ఆమె పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదు. ఇక 99 ఏళ్ల దేవుడమ్మ పాత్రలో బి. జయశ్రీ అద్భుతంగా నటించారు. ఆమె పాత్రనే సినిమాకు కీలకం. నివిక్ష నాయుడు, హరిణి శ్రీకాంత్‌ సహా మిగిత పాత్రధారులు తమ పరిధి మేరకు నటించి ఓకే అనిపించారు. డైరెక్షన్ ఎలా ఉందంటే డైరెక్టర్‌ రఘు శాస్త్రి ఈ సినిమా కోసం ఆసక్తికర కథను ఎంచుకున్నారు. గంట సేపు కరెంటు పోతేనే తట్టుకోలేని ఈ రోజుల్లో కొన్ని రోజుల పాటు విద్యుత్ పోతే ఆ ఊరి పరిస్థితి ఏంటి అన్న కాన్సెప్ట్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు. పల్లెటూరులో ఉండే మనుషులు, వారి మనస్తత్వాలను డైరెక్టర్‌ కళ్లకు కట్టారు. కరెంటు లేకుండా రాత్రి పూట పల్లెల్లో ఎలా ఉండేవారో చూపించారు. కరెంటు లేకపోయినా గ్రామస్తులు ఉండటానికి సిద్ధపడ్డారంటే అందుకు బలమైన కారణమే చూపాలి. ఆ పాయింట్‌ను డైరెక్టర్‌ ఎమోషనల్‌గా చెప్పిన తీరు బాగుంది. అయితే స్క్రీన్‌ప్లే విషయంలో కాస్త జాగ్రత్త వహించి ఉంటే బాగుండేది. కొన్ని సీన్లు మరి సాగదీతలా అనిపిస్తాయి. సినిమా నిడివి తక్కువ కావడం బాగా కలిసొచ్చింది. దర్శకుడిగా రఘుశాస్త్రి.. మొదటి ప్రయత్నంలో పర్వాలేదనిపించాడు. టెక్నికల్‌గా సాంకేతిక అంశాల విషయానికి వస్తే.. టెక్నికల్‌ టీమ్‌ మంచి పనితీరు కనబరిచింది. కెమెరామెన్‌&nbsp;శాంతి సాగర్‌ హెచ్‌.జీ.. విలేజ్‌ లుక్స్‌ను చాలా బాగా చూపించారు. మణికాంత్‌ ఖాద్రి అందించిన సంగీతం బాగుంది. ముఖ్యంగా ఎమోషనల్‌ సీన్స్‌కు ఆయన ఇచ్చిన నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. నిర్మాణ విలువలు కూడా ఉన్నతంగా ఉన్నాయి. బడ్జెట్‌ విషయంలో నిర్మాత ఎక్కడ రాజీపడలేదు.&nbsp; ప్లస్‌ పాయింట్స్‌ కథత్రిగుణ్‌, జయశ్రీ నటనసంగీతం మైనస్‌ పాయింట్స్‌ స్క్రీన్‌ ప్లేసాగదీత సీన్స్‌ Telugu.yousay.tv Rating : 3/5&nbsp;&nbsp;
    మార్చి 22 , 2024
    Pedda Kapu 1 Review: డైరెక్టర్‌ శ్రీకాంత్‌ అడ్డాల గ్రేట్ కమ్‌బ్యాక్‌ ఇచ్చినట్లేనా? సినిమా ఎలా ఉందంటే!
    Pedda Kapu 1 Review: డైరెక్టర్‌ శ్రీకాంత్‌ అడ్డాల గ్రేట్ కమ్‌బ్యాక్‌ ఇచ్చినట్లేనా? సినిమా ఎలా ఉందంటే!
    నటీనటులు: విరాట్ కర్ణ, ప్రగతి శ్రీ వాస్తవ, శ్రీకాంత్ అడ్డాల, రావు రమేష్‌, నాగ బాబు, రాజీవ్‌ కనకాల, ఈశ్వరి రావు, ఆడుకలం నరేన్‌ డైరెక్టర్‌: శ్రీకాంత్ అడ్దాల సంగీతం: మిక్కీ జే. మేయర్‌ సినిమాటోగ్రఫీ: ఛోటా కే. నాయుడు నిర్మాత: మిర్యాల రమేష్‌, మిర్యాల సత్యనారాయణ క్లాస్‌ దర్శకుడిగా పేరొందిన శ్రీకాంత్‌ అడ్డాల (Srikanth Addala) తెరకెక్కించిన పొలిటికల్‌ యాక్షన్‌ ఫిల్మ్‌ ‘పెదకాపు 1’ (Peda Kapu 1). టైటిల్‌ని బట్టి చాలామంది ఈ సినిమా ఓ సామాజిక వర్గం నేపథ్యంలో రూపొందిందని అనుకుంటున్నారు. కానీ, ఇది క్యాస్ట్‌కు సంబంధించి కాదు ఓ సామాన్యుడి సంతకం అని దర్శకుడు స్పష్టం చేశారు. నిర్మాత మిర్యాల రవీందర్‌ రెడ్డి కుటుంబ సభ్యుడు విరాట్‌ కర్ణ ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నాడు. ప్రగతి శ్రీవాస్తవ కథానాయిక. ఈ సినిమాతో శ్రీకాంత్‌ అడ్డాల తన పంథా మార్చడం ఓ విశేషమైతే ఇందులో నెగెటివ్‌ ఛాయలున్న పాత్రలో ఆయన నటించడం మరో విశేషం. అయితే ఈ చిత్రం ఇవాళ (సెప్టెంబర్‌ 29) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా పూర్తి రివ్యూ మీకోసం. కథ: 1980లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టిన సందర్భం అది. లంక గ్రామాన్ని సత్యరంగయ్య (రావు రమేష్), బయన్న (నరేన్) అనే ఇద్దరు వ్యక్తులు శాసిస్తుంటారు. హింసని ప్రేరేపిస్తూ తమ అధికారం కోసం మిగతా జనాల్ని బలిపశువులుగా మారుస్తుంటారు. పెదకాపు (విరాట్ కర్ణ) తన అన్నతో కలిసి సత్యరంగయ్య వద్ద పని చేస్తుంటారు. అనుకోని పరిస్థితిలో సత్యరంగయ్య తరపున పెదకాపు అన్న జైలుకి వెళ్ళాల్సివస్తుంది. అలా జైలుకి వెళ్ళిన పెదకాపు అన్న కనిపించకుండా పోతాడు. ఈ క్రమంలోనే 1983 సంవత్సరంలో ఎన్టీఆర్‌ తెలుగుదేశం పార్టీని ప్రారంభిస్తాడు. బడుగు, బలహీన వర్గాలు సంక్షేమం కోసం సరైన వ్యక్తులను పార్టీలోకి ఆహ్వానించేందుకు ప్లాన్ చేస్తారు. ఈ పరిస్థితుల్లో ఆ గ్రామంలో ఆవేశంతోపాటు ఆలోచన ఉన్న పెద్దకాపు (విరాట్ కర్ణ) తెలుగుదేశం జెండాను గ్రామంలోని నడిబొడ్డున పాతి సత్య రంగయ్య, బయన్నకు సవాల్ విసురుతాడు. పెదకాపు.. వారిని ఎలా ఎదిరించాడు? లంక గ్రామాల్లో అల్లర్లు చేలరగడానికి కారణం ఏమిటి? ఈ కథలో కన్నబాబు ( శ్రీకాంత్ అడ్డాల), అక్కమ్మ (అనసూయ), పార్టీ ఇంచార్జ్ (నాగబాబు) పాత్రల స్వభావం ఏమిటి?&nbsp; తెలియాలంటే సినిమా చూడాల్సిందే.&nbsp; ఎలా సాగిందంటే? ఫస్టాఫ్‌లోని ప్రథమ భాగమంతా గోదావరి జిల్లాలో కులాల కొట్లాటల చుట్టే తిరుగుతుంది. ఆ తర్వాత ఎన్టీఆర్ పార్టీ పెట్టడంతో బడుగు, బలహీన వర్గాల తరపున హీరో టీడీపీ జెండాను పాతే ఎపిసోడ్ సినిమాకు హైలెట్‌గా నిలుస్తుంది. ఆ సీన్‌ కథలోని ఇంటెన్సిటీ ఏమిటో చెబుతుంది. ఇక సత్య రంగయ్య, బయన్న అరాచకాలు, వాటి మధ్య నలిగే గ్రామీణ ప్రజలు, పెద్దకాపు నేతగా ఎదిగే తీరును ఫస్టాఫ్‌లో డైరెక్టర్‌ చాలా ఇంట్రెస్టింగ్‌గా చూపించారు. అయితే కొన్ని సీన్లు మరి సాగదీతల అనిపిస్తాయి. ఇక సెకండాఫ్‌లో కథ ఊపందుకుంటుంది. సత్య రంగయ్య హఠాన్మరణం, పెద్దకాపు అన్నయ్య కిడ్నాప్, పెద్దకాపు కాబోయే వదిన హత్య, అనసూయ ఎంట్రీ సినిమాను మరో రేంజ్‌కు తీసుకెళ్తాయి. ప్రీ క్లైమాక్స్ నుంచి చివరి సీన్ వరకు కథలో ఎమోషన్స్, యాక్షన్ దట్టించిన విధానం సినిమాలోని ఇంటెన్సిటీని ఎలివేట్ చేసేందుకు దోహదపడ్డాయి. అనసూయ పాత్ర సినిమాకు మరింత బలాన్ని ఇచ్చిందని చెప్పవచ్చు. ఎవరేలా చేశారంటే పెదకాపు పాత్ర చేసిన విరాట్‌ కర్ణకు ఇదే తొలి సినిమా అయినప్పటికీ నటుడిగా తనకు మంచి భవిష్యత్‌ ఉందని ‌అతడు నిరూపించుకున్నాడు. యాక్షన్‌ సీన్స్‌లో బాగా నటించాడు. చాలా సహజంగా కనిపించే ప్రయత్నం చేశాడు. అయితే ఎమోషన్ సీన్స్‌, భారీ డైలాగులు చెప్పేటప్పుడు మాత్రం కాస్త తడబడినట్లు కనిపించింది. హీరోయిన్‌ ప్రగతి పాత్రకు యాక్టింగ్‌ స్కోప్‌ లేకపోవడంతో తెరపై ఆమె కంట్రీబ్యూషన్‌ తక్కువే. ఇక సినిమాకు అనసూయ నటనే హైలెట్‌ అని చెప్పవచ్చు. అక్కమ్మ పాత్రలో ఆమె ఇరగదీసింది. అయితే రంగమ్మత్తలా ఓన్ చేసుకునే పాత్ర ఐతే కాదు. సత్యరంగయ్య పాత్రలో రావు రమేష్‌ అదరగొట్టాడు. బయన్న పాత్రలో నరేన్ కూడా మంచి నటన కనబరిచారు. కన్నబాబు పాత్రలో శ్రీకాంత్ అడ్దాల నిజంగానే సర్ప్రైజ్ చేశారు. తనికెళ్ల భరణి, నాగబాబు, రాజీవ్‌ కనకాల ఎప్పటిలాగే తమ నటనతో మెప్పించారు.&nbsp; టెక్నికల్‌గా.. సాంకేతిక అంశాల విషయానికి వస్తే ముందుగా చెప్పుకోవాల్సి ఛోటా కె. నాయుడు కెమెరా పనితనం. ఆయన తన నైపుణ్యంతో సినిమాకు కలర్‌ఫుల్‌ రంగులు అద్దారు. నిజంగా కొత్త గోదావరిని చూపించారు. జెండాపాతే సన్నివేశం, గౌరీ ఉరి సన్నివేశం, జాతర పాటని చిత్రీకరించిన తీరు చాలా బావుంది. మిక్కీ జె. మేయర్‌ పాటలు సినిమాకి కలిసిరాలేదు. నేపథ్య సంగీతం మాత్రం బావుంది. మాటలు, పాటలతో కథ చెప్పే శ్రీకాంత్‌ అడ్డాల ఆ విషయంలో కాస్త గతి తప్పినట్లు కనిపించింది. ఒకట్రెండు మినహా సినిమాలో గుర్తుండిపోయే డైలాగులు పెద్దగా కనిపించవు. నిర్మాణ విలువలు బాగున్నాయి. నాణ్యత విషయంలో నిర్మాతలు రాజీపడినట్లు ఎక్కడా కనిపించదు.  ప్లస్‌ పాయింట్స్‌ స్క్రీన్‌ ప్లేవిరాట్‌, అనసూయ నటననేపథ్య సంగీతంసినిమాటోగ్రఫీ మైనస్‌ పాయింట్స్‌ సాగదీత సీన్స్పాటలు రేటింగ్‌ : 3/5
    సెప్టెంబర్ 29 , 2023
    Nani HBD: అసిస్టెంట్‌ డైరెక్టర్‌ నుంచి నేచురల్‌ స్టార్‌ వరకూ.. నాని ఇన్‌స్పిరేషనల్‌ జర్నీ!
    Nani HBD: అసిస్టెంట్‌ డైరెక్టర్‌ నుంచి నేచురల్‌ స్టార్‌ వరకూ.. నాని ఇన్‌స్పిరేషనల్‌ జర్నీ!
    టాలీవుడ్‌లో ఎలాంటి ఫిల్మ్‌&nbsp; బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా (Happy Birthday Nani) వచ్చిన యంగ్‌ హీరో అంటే ముందుగా నేచురల్ స్టార్ నాని (Nani)నే గుర్తుకు వస్తాడు. ఇండస్ట్రీలో తెలిసిన వారు లేకపోయిన తన యాక్టింగ్‌ టాలెంట్‌తో అవకాశాలను సంపాదించుకున్నాడు నాని. తన అద్భుతమైన నటనతో ఎన్నో సూపర్‌ హిట్‌ అందుకున్న నాని.. ప్రతీ సినిమాకు యాక్టర్‌గా ఓ మెట్టు ఎక్కుతూనే వచ్చాడు. ఎన్నో మరపురాని పాత్రలు చేసి తన టాలెంట్‌ ఏంటో నిరూపించుకున్నాడు. ‘అష్టా చమ్మా’ చిత్రం ద్వారా తొలిసారి ఇండస్ట్రీలో అడుగు పెట్టిన నాని.. ‘దసరా’ విజయంతో పాన్‌ ఇండియా స్టార్‌గా ఎదిగాడు. రీసెంట్‌గా ‘హాయ్‌ నాన్న’ సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్‌ హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. ఈ రెండు సినిమాలతో ఇక ఎంతమాత్రం తాను టైర్ 2 హీరో కానని నానీ నిరూపించుకున్నాడు. లేటెస్ట్‌గా ‘సరిపోదా శనివారం’ అనే సినిమాతో థియేటర్లలో రచ్చ చేసేందుకు ఈ నేచురల్‌ స్టార్ సిద్ధమవుతున్నాడు.&nbsp; ఈ తరం యంగ్‌ హీరోలకు స్ఫూర్తిగా నిలిచిన నానికి (Happy Birthday Nani) ఈ సక్సెస్ ఒక్కరోజులో వచ్చింది కాదు. కథల ఎంపిక, సినీరంగంలో తాను ఎదుర్కొన్న సవాళ్లు ఆయన్ను ఈ స్థాయిలో నిలిపింది. ఇవాళ నాని పుట్టిన రోజు&nbsp; సందర్భంగా ఆయన సినీ ప్రస్థానం? నాని తీసిన సూపర్‌ హిట్‌ సినిమాలు? ఇండస్ట్రీలో స్థిరపడేందుకు దోహదం చేసిన పాత్రలు? ఏంటో ఒకసారి పరిశీలిద్దాం.&nbsp; అష్టా చమ్మా (2008) అష్టా చమ్మా (Ashta chamma) సినిమా ద్వారానే నానిడ సహజ సిద్దమైన నటన తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఈ సినిమా ద్వారానే నాని నటనా సామర్థ్యం ఇండస్ట్రీకి తెలిసింది. మహేష్‌ పాత్రలో నాని నటన ఎంతో నేచురల్‌గా అనిపించింది. పక్కింటి కుర్రాడిలా ఉన్నాడనే ట్యాగ్‌ను తెచ్చి పెట్టింది. మెుదటి సినిమాతోనే నాని ప్రేక్షకుల హృదయాల్లో బలమైన ముద్ర వేశాడనే చెప్పాలి. పరిశ్రమకు కూడా నాని ఆశాజనకంగా కనిపించడంతో వరుస అవకాశాలు లభించాయి.&nbsp; రైడ్‌ (2009) రైడ్ (Ride) సినిమాలో నానిలోని నటుడు మరింత పరిణితి చెందాడు. నటనకు ఆస్కారమున్న అర్జున్‌ పాత్రలో నాని మెప్పించాడు. జీవితంలోని సవాళ్లతో పోరాడుతున్న యువకుడిగా చక్కగా తన హావభావాలను పలికించాడు. క్లిష్టమైన భావోద్వేగాలను కూడా చక్కగా ప్రదర్శించిన నాని వర్ధమాన నటుడిగా ఇండస్ట్రీలో తన ఖ్యాతిని సుస్థిరం చేసుకున్నాడు. అలా మెుదలైంది (2011) అలా మెుదలైంది (Ala Modalaindi) సినిమాతో నాని తొలిసారి సోలో హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. గౌతం పాత్రలో నాని చేసిన కామెడి నానిలోని కొత్త కోణాన్ని పరిచయం చేసింది. నాని తన ఎక్స్‌లెంట్‌ కామెడి టైమింగ్‌తో అదరగొట్టాడు. హీరోయిన్‌ నిత్యాతో నాని కెమిస్ట్రీ బాగా కుదురడంతో ఈ చిత్రం సూపర్‌హిట్‌గా నిలించింది. ఈ విజయంతో నాని కెరీర్‌కు తిరుగు లేకుండా పోయింది.&nbsp;&nbsp; పిల్ల జమీందార్‌ (2011) పిల్ల జమీందార్‌(Pilla Zamindar) సినిమా నానిని కామెడి స్టార్‌గానూ నిలబెట్టింది. సినిమాలోని ప్రతిసీన్‌లో నాని మార్క్‌ కనిపిస్తుంది. హాస్య సన్నివేశాలు, భావోద్వేగ సీన్లలో నాని ఎంతో మెచ్యూర్‌గా నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద కూడా మంచి కలెక్షన్లనే రాబట్టింది.&nbsp; ఈగ (2012) దర్శకధీరుడు రాజమౌళితో చేసిన ఈగ (Eega) సినిమా నాని కెరీర్‌ను మలుపు తిప్పిందనే చెప్పాలి. ఇందులో నాని యూనిక్‌ రోల్‌లో కనిపించారు. పునర్జన్మ పొందిన ఈగగా కనిపించి అలరించాడు. సినిమాలో నాని నేరుగా కనిపిచేంది కొద్దిసేపే అయినప్పటికీ చిత్ర విజయానికి అతడి యాక్టింగ్‌ ఎంతో దోహదం చేసింది. భలే భలే మగాడివోయ్ (2015) భలే భలే మగాడివోయ్‌ (Bhale Bhale Magadivoy) సినిమాలో నాని మతిమరుపు ఉన్న పాత్రలో నటించాడు. తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు. ఎమోషనల్‌ సీన్స్‌లోనూ హావభావాలను చక్కగా పండించాడు. లక్కీ పాత్రలో నాని నటనకు విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు వచ్చాయి. ఈ సినిమాతో నాని ఫ్యాన్‌ ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోయింది.&nbsp; నేను లోకల్‌ (2017) నేను లోకల్‌ చిత్రం(Nenu Local)తో నాని అగ్రహీరోల సరసన చేరిపోయాడు. ఇందులో నాని నటన సినిమాకే హైలెట్‌గా నిలిచింది. ఈ మూవీ సక్సెస్‌తో నాని నిర్మాతల హీరోగా మారిపోయాడు. నానితో సినిమా అంటే వసూళ్లకు ఎలాంటి లోటు ఉండదని ఇండస్ట్రీ అంతా భావించింది.&nbsp; MCA (మిడిల్‌ క్లాస్‌ అబ్బాయి) (2017) MCA చిత్రంలో నాని (HBD Nani) మధ్య తరగతికి చెందిన అబ్బాయిగా కనిపించి మెప్పించాడు. నాని నటనకు మంచి మార్కులే పడ్డాయి. నాని క్రేజ్‌ కారణంగా రూ. 25 కోట్ల బడ్జెట్ తీసిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఏకంగా రూ.70 కోట్లను వసూలు చేసింది.&nbsp; నిన్ను కోరి (2017) నిన్నుకోరి చిత్రంలో నాని నటన మరో స్థాయికి వెళ్లింది. ప్రేమికుడిగా, భగ్న ప్రేమికుడిగా, తన ప్రేమను పొందాలని తాపత్రయ పడే యువకుడిగా నాని మెప్పించాడు. క్లైమాక్స్‌లో నాని నటన కంటతడి తెప్పిస్తుంది.&nbsp; జెర్సీ (2019) జెర్సీ(Jersey) సినిమా నానిలోని పరిపూర్ణ నటుడ్ని (HBD Nani) పరిచయం చేసింది. ఫెయిల్యూర్‌ క్రికెటర్‌గా నాని ఎంతో బాగా నటించాడు. ఈ పాత్రను తనను తప్ప మరొకరిని ఊహించుకోలేని విధంగా నటించి మెప్పించాడు. ఉద్వేగభరితమైన సన్నివేశాల్లో నాని నటన అమోఘమనే చెప్పాలి.&nbsp; గ్యాంగ్ లీడర్‌ (2019) గ్యాంగ్‌ లీడర్‌లో ఐదుగురు ఆడవాళ్లకు సాయపడే వ్యక్తిగా నాని కనిపిస్తాడు. అదే ఏడాది విడుదలైన జెర్సీలో పాత్రకు ఈ క్యారెక్టర్‌ పూర్తి భిన్నం.పెన్సిల్‌ పార్థసారథి పాత్రలో నాని నవ్వులు పూయిస్తాడు. సెకండాఫ్‌లో విలన్‌ ఎత్తులకు పైఎత్తులు వేసే యువకుడిగా అలరిస్తాడు.&nbsp; వి (2020) వి(V) సినిమాలో నాని&nbsp; నెగెటివ్‌ రోల్‌ కనిపించాడు. ఎన్నో సవాళ్లు ఉన్న ఈ పాత్రకు నాని వంద శాతం న్యాయం చేశాడు. తనకు ఎలాంటి వైవిధ్యమైన పాత్ర ఇచ్చిన అలవోకగా చేయగలనని నాని ఈ సినిమా ద్వారా నిరూపించుకున్నాడు.&nbsp; టక్‌ జగదీష్‌ (2021) టక్‌ జగదీష్‌ పాత్రకు నాని 100 శాతం న్యాయం చేశాడు. ఎమోషనల్‌ సన్నివేశాల్లో తనకు తిరుగులేదని మరోసారి నాని నిరూపించాడు. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ సినిమాను నాని తన భుజాలపై మోసాడు.&nbsp; శ్యామ్‌ సింగరాయ్‌ (2021)&nbsp; పునర్జన్మ కథాంశంతో రూపొందిన ఈ చిత్రంలో నాని ద్విపాత్రాభినయం చేశారు. వాసు, శ్యామ్‌ సింగరాయ్ పాత్రలో రాణి అద్భుతంగా నటించాడు. ఇందులో నాని ఆహార్యం, మాట తీరు అన్ని కొత్తగా అనిపిస్తాయి.&nbsp; అంటే.. సుందరానికీ (2022) గతేడాది విడుదలైన అంటే సుందరానికీ చిత్రంలో నాని బ్రహ్మణ కుటుంబానికి చెందిన యువకుడిగా కనిపిస్తాడు. సుందర్ ప్రసాద్ పాత్రలో నాని పూర్తిగా ఒదికిపోయాడు. పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసిన నాని కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకుల హృదయాలను మరోమారు గెలుచుకున్నారు. దసరా (2023) దసరా మూవీలో నాని ఊరమాస్‌గా కనిపించారు. ధరణి పాత్రలో తనదైన ముద్ర వేస్తూ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందిన ఈ చిత్రంతో నాని బాలీవుడ్‌ ప్రేక్షకుల మనసులను సైతం గెలుచుకున్నారు. నాని కెరీర్‌లోనేే వసూళ్లు, నటన పరంగా ఈ సినిమా ది బెస్ట్‌గా నిలుస్తుందని అంచనాలు ఉన్నాయి.&nbsp; హాయ్‌ నాన్న (2023) నాని-మృణాల్ ఠాకూర్‌ కాంబినేషన్‌లో యువ డైరెక్టర్‌ శౌర్యువ్‌ రూపొందించిన చిత్రం ‘హాయ్‌ నాన్న’. గుండెలకు హత్తుకునే భావోద్వేగాలతో వచ్చిన ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. మరోమారు నానీ తన అద్భుతమైన నటనతో ఇందులో ఆకట్టుకున్నాడు.&nbsp; &nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;మెుత్తంగా అష్టా చమ్మా నుంచి ‘హాయ్‌ నాన్న’ వరకూ నాని సినీ ప్రస్థానం అద్భుతమనే చెప్పాలి. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ నాని ఎదిగిన తీరు ప్రస్తుత, భవిష్యత్‌ తరాల హీరోలకు ఆదర్శంగా నిలుస్తుంది. ఇండస్ట్రీలో అతని వరుస విజయాలు… నాని అంకిత భావానికి, కృషి, ప్రతిభకు నిదర్శనంగా నిలుస్తాయి. నేచురల్ స్టార్ నాని తన కేరీర్‌లో మరిన్ని అత్యున్నత శిఖరాలు అధిరోహించాలని YOUSAY మనస్ఫూర్తిగా కోరుకుంటోంది.
    ఫిబ్రవరి 24 , 2024
    Hero Nani: ఇవే పాటించకపోయి ఉంటే.. నాని నేచురల్ స్టార్ అయ్యేవాడు కాదు! రియల్లీ గ్రేట్
    Hero Nani: ఇవే పాటించకపోయి ఉంటే.. నాని నేచురల్ స్టార్ అయ్యేవాడు కాదు! రియల్లీ గ్రేట్
    టాలీవుడ్‌లో ఎలాంటి ఫిల్మ్‌&nbsp; బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా వచ్చిన యంగ్‌ హీరో అంటే ముందుగా నేచురల్ స్టార్ నాని (Nani)నే గుర్తుకు వస్తాడు. ఇండస్ట్రీలో తెలిసిన వారు లేకపోయిన తన యాక్టింగ్‌ టాలెంట్‌తో అవకాశాలను సంపాదించుకున్నాడు నాని. తన అద్భుతమైన నటనతో ఎన్నో సూపర్‌ హిట్‌ అందుకున్న నాని.. ప్రతీ సినిమాకు యాక్టర్‌గా ఓ మెట్టు ఎక్కుతూనే వచ్చాడు. ఎన్నో మరపురాని పాత్రలు చేసి తన టాలెంట్‌ ఏంటో నిరూపించుకున్నాడు. అష్టా చమ్మా’ చిత్రం ద్వారా తొలిసారి ఇండస్ట్రీలో అడుగు పెట్టిన నాని ఇవాళ ‘దసరా’ విజయంతో పాన్‌ ఇండియా స్టార్‌గా ఎదిగాడు.&nbsp; ఇక ఎంతమాత్రం తాను టైర్ 2 హీరో కానని నిరూపించుకున్నాడు. దసరా మూవీ ఒక్కరోజులోనే రూ. 38కోట్లు రాబట్టిందంటే నాని స్టామినా ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఈ విజయంతో నాని ఎంతో మంది యంగ్ హీరోలకు ఆదర్శంగా మారాడు. ‌అయితే నానికి ఈ సక్సెస్ ఒక్కరోజులో వరించలేదు. కథల ఎంపిక, సినీరంగంలో తాను ఎదుర్కొన్న సవాళ్లు ఆయన్ను ఈ స్థాయిలో నిలిపింది. ఈ నేపథ్యంలో నాని సినీ ప్రస్థానం ఎలా సాగింది?. నాని తీసిన సూపర్‌ హిట్‌ సినిమాలు? ఇండస్ట్రీలో స్థిరపడేందుకు దోహదం చేసిన పాత్రలు? ఏంటో ఒకసారి పరిశీలిద్దాం.&nbsp; అష్టా చమ్మా (2008) అష్టా చమ్మా (Ashta chamma) సినిమా ద్వారానే నానిడ సహజ సిద్దమైన నటన తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఈ సినిమా ద్వారానే నాని నటనా సామర్థ్యం ఇండస్ట్రీకి తెలిసింది. మహేష్‌ పాత్రలో నాని నటన ఎంతో నేచురల్‌గా అనిపించింది. పక్కింటి కుర్రాడిలా ఉన్నాడనే ట్యాగ్‌ను తెచ్చి పెట్టింది. మెుదటి సినిమాతోనే నాని ప్రేక్షకుల హృదయాల్లో బలమైన ముద్ర వేశాడనే చెప్పాలి. పరిశ్రమకు కూడా నాని ఆశాజనకంగా కనిపించడంతో వరుస అవకాశాలు లభించాయి.&nbsp; రైడ్‌ (2009) రైడ్ (Ride) సినిమాలో నానిలోని నటుడు మరింత పరిణితి చెందాడు. నటనకు ఆస్కారమున్న అర్జున్‌ పాత్రలో నాని మెప్పించాడు. జీవితంలోని సవాళ్లతో పోరాడుతున్న యువకుడిగా చక్కగా తన హావభావాలను పలికించాడు. క్లిష్టమైన భావోద్వేగాలను కూడా చక్కగా ప్రదర్శించిన నాని వర్ధమాన నటుడిగా ఇండస్ట్రీలో తన ఖ్యాతిని సుస్థిరం చేసుకున్నాడు. అలా మెుదలైంది (2011) అలా మెుదలైంది (Ala Modalaindi) సినిమాతో నాని తొలిసారి సోలో హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. గౌతం పాత్రలో నాని చేసిన కామెడి నానిలోని కొత్త కోణాన్ని పరిచయం చేసింది. నాని తన ఎక్స్‌లెంట్‌ కామెడి టైమింగ్‌తో అదరగొట్టాడు. హీరోయిన్‌ నిత్యాతో నాని కెమిస్ట్రీ బాగా కుదురడంతో ఈ చిత్రం సూపర్‌హిట్‌గా నిలించింది. ఈ విజయంతో నాని కెరీర్‌కు తిరుగు లేకుండా పోయింది.&nbsp;&nbsp; పిల్ల జమీందార్‌ (2011) పిల్ల జమీందార్‌(Pilla Zamindar) సినిమా నానిని కామెడి స్టార్‌గానూ నిలబెట్టింది. సినిమాలోని ప్రతిసీన్‌లో నాని మార్క్‌ కనిపిస్తుంది. హాస్య సన్నివేశాలు, భావోద్వేగ సీన్లలో నాని ఎంతో మెచ్యూర్‌గా నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద కూడా మంచి కలెక్షన్లనే రాబట్టింది.&nbsp; ఈగ (2012) దర్శకధీరుడు రాజమౌళితో చేసిన ఈగ (Eega) సినిమా నాని కెరీర్‌ను మలుపు తిప్పిందనే చెప్పాలి. ఇందులో నాని యూనిక్‌ రోల్‌లో కనిపించారు. పునర్జన్మ పొందిన ఈగగా కనిపించి అలరించాడు. సినిమాలో నాని నేరుగా కనిపిచేంది కొద్దిసేపే అయినప్పటికీ చిత్ర విజయానికి అతడి యాక్టింగ్‌ ఎంతో దోహదం చేసింది. భలే భలే మగాడివోయ్ (2015) భలే భలే మగాడివోయ్‌ (Bhale Bhale Magadivoy) సినిమాలో నాని మతిమరుపు ఉన్న పాత్రలో నటించాడు. తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు. ఎమోషనల్‌ సీన్స్‌లోనూ హావభావాలను చక్కగా పండించాడు. లక్కీ పాత్రలో నాని నటనకు విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు వచ్చాయి. ఈ సినిమాతో నాని ఫ్యాన్‌ ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోయింది.&nbsp; నేను లోకల్‌ (2017) నేను లోకల్‌ చిత్రం(Nenu Local)తో నాని అగ్రహీరోల సరసన చేరిపోయాడు. ఇందులో నాని నటన సినిమాకే హైలెట్‌గా నిలిచింది. ఈ మూవీ సక్సెస్‌తో నాని నిర్మాతల హీరోగా మారిపోయాడు. నానితో సినిమా అంటే వసూళ్లకు ఎలాంటి లోటు ఉండదని ఇండస్ట్రీ అంతా భావించింది.&nbsp; MCA (మిడిల్‌ క్లాస్‌ అబ్బాయి) (2017) MCA చిత్రంలో నాని మధ్య తరగతికి చెందిన అబ్బాయిగా కనిపించి మెప్పించాడు. నాని నటనకు మంచి మార్కులే పడ్డాయి. నాని క్రేజ్‌ కారణంగా రూ. 25 కోట్ల బడ్జెట్ తీసిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఏకంగా రూ.70 కోట్లను వసూలు చేసింది.&nbsp; నిన్ను కోరి (2017) నిన్నుకోరి చిత్రంలో నాని నటన మరో స్థాయికి వెళ్లింది. ప్రేమికుడిగా, భగ్న ప్రేమికుడిగా, తన ప్రేమను పొందాలని తాపత్రయ పడే యువకుడిగా నాని మెప్పించాడు. క్లైమాక్స్‌లో నాని నటన కంటతడి తెప్పిస్తుంది.&nbsp; జెర్సీ (2019) జెర్సీ(Jersey) సినిమా నానిలోని పరిపూర్ణ నటుడ్ని పరిచయం చేసింది. ఫెయిల్యూర్‌ క్రికెటర్‌గా నాని ఎంతో బాగా నటించాడు. ఈ పాత్రను తనను తప్ప మరొకరిని ఊహించుకోలేని విధంగా నటించి మెప్పించాడు. ఉద్వేగభరితమైన సన్నివేశాల్లో నాని నటన అమోఘమనే చెప్పాలి.&nbsp; గ్యాంగ్ లీడర్‌ (2019) గ్యాంగ్‌ లీడర్‌లో ఐదుగురు ఆడవాళ్లకు సాయపడే వ్యక్తిగా నాని కనిపిస్తాడు. అదే ఏడాది విడుదలైన జెర్సీలో పాత్రకు ఈ క్యారెక్టర్‌ పూర్తి భిన్నం.పెన్సిల్‌ పార్థసారథి పాత్రలో నాని నవ్వులు పూయిస్తాడు. సెకండాఫ్‌లో విలన్‌ ఎత్తులకు పైఎత్తులు వేసే యువకుడిగా అలరిస్తాడు.&nbsp; వి (2020) వి(V) సినిమాలో నాని&nbsp; నెగెటివ్‌ రోల్‌ కనిపించాడు. ఎన్నో సవాళ్లు ఉన్న ఈ పాత్రకు నాని వంద శాతం న్యాయం చేశాడు. తనకు ఎలాంటి వైవిధ్యమైన పాత్ర ఇచ్చిన అలవోకగా చేయగలనని నాని ఈ సినిమా ద్వారా నిరూపించుకున్నాడు.&nbsp; టక్‌ జగదీష్‌ (2021) టక్‌ జగదీష్‌ పాత్రకు నాని 100 శాతం న్యాయం చేశాడు. ఎమోషనల్‌ సన్నివేశాల్లో తనకు తిరుగులేదని మరోసారి నాని నిరూపించాడు. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ సినిమాను నాని తన భుజాలపై మోసాడు.&nbsp; శ్యామ్‌ సింగరాయ్‌ (2021)&nbsp; పునర్జన్మ కథాంశంతో రూపొందిన ఈ చిత్రంలో నాని ద్విపాత్రాభినయం చేశారు. వాసు, శ్యామ్‌ సింగరాయ్ పాత్రలో రాణి అద్భుతంగా నటించాడు. ఇందులో నాని ఆహార్యం, మాట తీరు అన్ని కొత్తగా అనిపిస్తాయి.&nbsp; అంటే.. సుందరానికీ (2022) గతేడాది విడుదలైన అంటే సుందరానికీ చిత్రంలో నాని బ్రహ్మణ కుటుంబానికి చెందిన యువకుడిగా కనిపిస్తాడు. సుందర్ ప్రసాద్ పాత్రలో నాని పూర్తిగా ఒదికిపోయాడు. పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసిన నాని కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకుల హృదయాలను మరోమారు గెలుచుకున్నారు. దసరా (2023) దసరా మూవీలో నాని ఊరమాస్‌గా కనిపించారు. ధరణి పాత్రలో తనదైన ముద్ర వేస్తూ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందిన ఈ చిత్రంతో నాని బాలీవుడ్‌ ప్రేక్షకుల మనసులను సైతం గెలుచుకున్నారు. నాని కెరీర్‌లోనేే వసూళ్లు, నటన పరంగా ఈ సినిమా ది బెస్ట్‌గా నిలుస్తుందని అంచనాలు ఉన్నాయి.&nbsp; &nbsp;&nbsp;&nbsp;&nbsp;&nbsp;మెుత్తంగా అష్టా చమ్మా నుంచి దసరా వరకూ నాని సినీ ప్రస్థానం అద్భుతమనే చెప్పాలి. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ నాని ఎదిగిన తీరు ప్రస్తుత, భవిష్యత్‌ తరాల హీరోలకు ఆదర్శంగా నిలుస్తుంది. ఇండస్ట్రీలో అతని వరుస విజయాలు… నాని అంకిత భావానికి, కృషి, ప్రతిభకు నిదర్శనంగా నిలుస్తాయి. నేచురల్ స్టార్ నాని తన కేరీర్‌లో మరిన్ని అత్యున్నత శిఖరాలు అధిరోహించాలని YOUSAY మనస్ఫూర్తిగా కోరుకుంటోంది.
    మార్చి 31 , 2023
    Trending Telugu Movies 2024: గూగుల్‌లో అత్యధికంగా వెతికిన టాప్ 60 తెలుగు సినిమాలు ఇవే!
    Trending Telugu Movies 2024: గూగుల్‌లో అత్యధికంగా వెతికిన టాప్ 60 తెలుగు సినిమాలు ఇవే!
    నెట్టింట ఏదైనా సమాచారాన్ని వెతకాలంటే వెంటనే గూగుల్ చేస్తాం. అలా ప్రతి సమాచార శోధనకు గూగుల్ సెర్చ్ ఇంజిన్ కేరాఫ్ అడ్రస్‌గా మారింది. అయితే, ఈ ఏడాది గూగుల్‌లో అత్యధికంగా వెతికిన సినిమాల జాబితాను ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే విచిత్రంగా బ్లాక్ బాస్టర్ సూపర్ డూపర్ హిట్లను తలదన్నీ మన తెలుగు ప్రేక్షకులు చక్కని కథనం, ఫీల్ గుడ్, కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లకు పట్టం కట్టడం విశేషం. మరి గూగూల్‌లో ఎక్కువ మంది వెతికిన టాప్ 60 సినిమాల లిస్ట్‌ను మీరు చూడండి. [toc] Drushyam దృశ్యం చిత్రం వచ్చి 10 సంవత్సరాలైనా ఆ సినిమాకు ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికీ టాప్‌లో ట్రెండ్ అవుతోంది. పెద్ద పెద్ద చిత్రాలను తలదన్ని ఆశ్చర్యకరంగా గూగుల్‌లో అత్యధికంగా వెతుకుతున్న చిత్రాల్లో ఈ సినిమా మొదటి స్థానంలో నిలిచింది. ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు ఎక్కవగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ చిత్రంలో భావోద్వేగాలు.. సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశం, వెంకటేష్ నటన ఈ సినిమాను ప్రత్యేకంగా నిలిపాయి.ఇక సినిమా కథలోకి వెళ్తే.. రాంబాబు (వెంకటేష్‌) ఊరిలో కేబుల్‌ నెట్‌వర్క్‌ పెట్టుకొని కుటుంబంతో హాయిగా జీవిస్తుంటాడు. ఓ రోజు ఐజీ గీత ప్రభాకర్‌ (నదియా) కొడుకు కనిపించకుండా పోతాడు. కానిస్టేబుల్‌ వీరభద్రం కారణంగా ఆ కేసులో రాంబాబు, అతని ఫ్యామిలీ ఇరుక్కుటుంది. ఆ కేసుకి రాంబాబు ఫ్యామిలీకి ఏంటి సంబంధం? అన్నది కథ. Karthikeya 2 ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన కార్తీకేయ చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా దేశవ్యాప్తంగా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. ఇక ఈ చిత్రాన్ని ప్రేక్షకులు పదే పదే చూసేందుకు ఇష్టపడుతున్నారని గూగుల్ ట్రెండ్స్‌ బట్టి తెలుస్తోంది. అత్యధిక మంది వెతుకుతున్న చిత్రాల్లో ఈ సినిమా రెండో స్థానంలో ఉంది. ఈ సినిమాను చూసేందుకు నెటిజన్లు పెద్ద సంఖ్యలో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక ఈ సినిమా కథలోకి వెళ్తే… కార్తికేయ (నిఖిల్‌)కు ప్రశ్నలకు సమాధానం వెతకడం అంటే ఇష్టం. తల్లితో పాటు కార్తికేయ ద్వారక వెళ్లగా అక్కడ ఓ ఆర్కియాలజిస్ట్ హత్యకు గురవుతాడు. దాని వెనక కారణాల్ని వెతుకుతూ కార్తికేయ చేసే సాహసోపేతమైన ప్రయాణమే అసలు కథ. Bichagadu 2 ఆశ్చర్యకరంగా ఈ సినిమా తెలుగులో ట్రెండ్ అవుతున్న సినిమాల్లో మూడో స్థానంలో నిలవడం విశేషం. విజయ్ ఆంటోని నటించిన బిచ్చగాడు సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ కావడంతో దానికి సీక్వెల్‌గా వచ్చిన బిచ్చగాడు 2 సైతం మంచి విజయం సాధించింది. తల్లి కొడుకుల మధ్య చక్కని సెంటిమెంట్, చక్కని పాత్రల చిత్రణ ఈ సినిమాను ప్రేక్షకుల హృదయాల్లో నిలిపింది. అందుకే ఈ చిత్రం టాప్ ట్రెండింగ్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఈ సినిమాను చూసేందుకు నెటిజన్లు ఎక్కువగా ఆసక్తి చూపారు. ఇక ఈ సినిమా కథలోకి వెళ్తే.. విజయ్ గురుమూర్తి (విజయ్ ఆంటోని) భారతదేశంలోని 7వ అత్యంత సంపన్నుడు. అతని సహోద్యోగి మరియు స్నేహితుడు అరవింద్ (దేవ్ గిల్), అతని గ్యాంగ్‌తో కలిసి, అతని సంపద కోసం విజయ్‌ని చంపి, అతని మెదడును బిచ్చగాడు సత్య (విజయ్ ఆంటోని) మెదడుతో మారుస్తాడు. అయితే సత్య వారిని చంపి తన ప్రతీకారం తీర్చుకుంటాడు. యాంటీ బికిలీ ప్రాజెక్ట్‌ను ప్రారంభిస్తాడు. యాంటీ బికిలీ ప్రాజెక్ట్ అంటే ఏమిటి? సత్య అరవింద్ ఇంతకు ఆ గ్యాంగ్‌ను ఎందుకు చంపాడు? ఇంతకు సత్య వెనుక ఉన్న కథ ఏమిటి? అన్నది మిగతా కథ F2 2019 సంక్రాంతికి వచ్చిన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. వెంకీ-వరుణ్ తేజ్‌ల జోడీ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించింది. ఈ సినిమా వచ్చి ఏళ్లు గడుస్తున్నా క్రేజ్ మాత్రం తగ్గలేదు. ఇప్పటికీ ఈ సినిమాను చూసేందుకు నెటిజన్లు ఆసక్తి చూపిస్తారు. గూగుల్ సెర్చ్‌లో టాప్‌లో ట్రెండ్‌ అవుతున్న సినిమాల్లో ఈ చిత్రం ఒకటి. ఇక ఈ సినిమా కథలోకి వెళ్తే.. వెంకీ(వెంకటేష్) MLA దగ్గరా పీఏ పనిచేస్తుంటాడు. ఆత్మగౌరవం, మొగుడుపై పెత్తనం చలాయించే వ్యక్తిత్వం ఉన్న తమన్నాను వెంకీ పెళ్లి చేసుకుంటాడు. కొద్దిరోజులు వీరి కాపురం బాగానే సాగినా.. ఇగోల వల్ల సమస్యలు వస్తాయి. దీంతో తమన్నా ఫ్యామిలీ వెంకీని టార్చర్ పెడుతుంది. ఈక్రమంలో తమన్నా చెల్లెలు హాని(మెహరీన్) వరుణ్‌(వరుణ్‌ తేజ్‌)ను ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. తమన్నా ఫ్యామిలీ దెబ్బకు వరుణ్ సైతం బాధితుడిగా మారుతాడు. అప్పుడు వెంకీ- వరుణ్ కలిసి ఏం చేశారు? తమ ఇగో సమస్యలను ఎలా పరిష్కరించుకున్నారు అనేది కథ. Ante Sundaraniki గూగుల్ సెర్చ్‌లో అత్యధికంగా వెతుకుతున్న తెలుగు సినిమాల జాబితాలో ఈ చిత్రం కూడా ఒకటి. నాని మార్క్ కామెడీ, నజ్రియా నదియా క్యూట్ నెస్, వల్గారిటీ లేని కామెడీ ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా నిలిపాయి. అందుకే నెటిజన్లు ఈ సినిమా చూసేందు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక కథలోకి వెళ్తే..బ్రాహ్మణ కుటుంబానికి చెందిన సుందర్‌ (నాని) ఇంకో మతానికి చెందిన లీల (నజ్రియా నజీమ్‌)ను ప్రేమిస్తాడు. భిన్నమైన సంప్రదాయాలు కలిగిన ఈ జంట పెళ్లి కోసం కుటుంబ సభ్యులతో అబద్దం ఆడతారు. దాని వల్ల ఎలాంటి ఇబ్బందులు పడ్డారన్నది కథ. Tholiprema ఈ చిత్రం వచ్చి 25 ఏళ్లు దాటినా ఇప్పటికీ ఎప్పటికీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. ఈ క్లాసిక్ చిత్రాన్ని చూసేందుకు ప్రేక్షకులు ఇప్పటికీ ఆసక్తి చూపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ యాక్టింగ్, కీర్తి రెడ్డి మెస్మరైజింగ్ బ్యూటీ, చక్కని లవ్ స్టోరీ ఈ సినిమాను ప్రేక్షకుల హృదయాల్లో చిరస్మరణీయం చేశాయి. గూగుల్ సెర్చ్‌లో అధికంగా వెతుకుతున్న సినిమాల్లో ఈ సినిమా ఒకటిగా నిలిచింది. ఇక కథలోకి వెళ్తే.. అమెరికా నుంచి వచ్చి తన తాత ఇంటికి వెళ్తున్న అనూను బాలు ఓ ప్రమాదం నుండి కాపాడతాడు. దీంతో అను అతడితో స్నేహం చేస్తుంది. ఈ ప్రయాణంలో బాలు అనూని ఇష్టపడతాడు. కానీ, ఆమెకు చెప్పలేకపోతాడు. వీరి ప్రేమ కథ చివరికి ఏమైంది? అన్నది కథ. Pelli Choopulu తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా నిలిచింది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ నటన ఆకట్టుకుంటుంది. ఇక కథలోకి వెళ్తే..పెళ్లి చూపుల్లో ప్రశాంత్‌ (విజయ్‌ దేవరకొండ)ను చిత్ర (రీతు వర్మ) రిజెక్ట్‌ చేస్తోంది. ఓ కారణం వల్ల హీరోయిన్‌ పెట్టే ఫుడ్‌ ట్రక్‌ బిజినెస్‌లో హీరో భాగమవుతాడు. ఈ ఇద్దరి ప్రయాణం తర్వాత ఏయే మలుపులు తిరిగింది? అన్నది కథ. ఓటీటీ సన్ నెక్ట్స్ Spyder స్పైడర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయం సాధించనప్పటికీ.. మంచి స్టోరీ లైన్‌తో వచ్చింది. ఈ సిని సస్పెన్స్ థ్రిల్లర్‌గా అలరించింది. ఈ సినిమా చూసేందుకు ఇప్పటికీ చాలా మంది నెటిజన్లు ఆసక్తి చూపిస్తున్నారు. ఇక కథలోకి వెళ్తే… ఇంటెలిజెన్స్ అధికారి అయిన శివ, అత్యవసరమైన పరిస్థితుల్లో ఉన్నవారి ట్రాక్ చేయడంలో సహాయపడే ఫోన్ సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేస్తాడు. ఒక సీరియల్ కిల్లర్ అమాయకులను హత్య చేస్తున్న క్రమంలో అతడి ఆగడాలను అరికడుతాడు. ఇంతకు ఆ హత్యలు చేస్తుంది ఎవరు? అతన్ని శివ పట్టుకోవడంలో ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు అనేది మిగతా కథ. ఓటీటీ- నెట్‌ఫ్లిక్స్ Raja The Great రవితేజ చేసిన బెస్ట్ కామెడీ చిత్రాల్లో రాజా ది గ్రేట్ ఒకటని చెప్పవచ్చు. ఈ సినిమా చూసేందుకు నెటిజన్లు ఆసక్తి చూపిస్తున్నారు. కంటి చూపులేని రాజా.. ఆసాధారణ ప్రతిభకలవాడు. ఓ యువతి ఆపాదలో ఉన్నప్పుడు ఆమెకు సాయం చేయాలనుకుంటాడు. ఆమెను రక్షించే క్రమంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు అన్నది మిగతా కథ.ఓటీటీ: ఆహా Ori Devuda వెంకటేష్- విశ్వక్ సేన్ మేయిన్‌ లీడ్‌లో నటించిన ఈ చిత్రం మంచి ఫీల్ గుడ్ సినిమా. ఈ సినిమా అత్యధికంగా వెతుకుతున్న తెలుగు సినిమా జాబితాలో పదో స్థానంలో నిలిచింది. అర్జున్ (విశ్వక్‌ సేన్‌), అను (మిథిలా పాల్కర్) పెళ్లి చేసుకుంటారు. అర్జున్‌ని అను అనుమానిస్తూనే ఉంటుంది. దీంతో పెళ్లి తర్వాత స్వేచ్చ కోల్పోయినట్లు అతడు భావిస్తాడు. పెళ్లి విషయంలో తనకు సెకండ్ ఛాన్స్ ఇవ్వమని దేవుడ్ని మెురపెట్టుకుంటాడు. కొన్ని షరతులతో దేవుడు (వెంకటేష్‌) అందుకు అంగీకరిస్తాడు. ఆ తర్వాత ఏమైందన్నది కథ.ఓటీటీ: ఆహా Bichagadu ఒక ధనవంతుడైన వ్యాపారవేత్త తల్లి ప్రమాదానికి గురై కోమాలోకి వెళ్లిపోతుంది. వైద్యులు ఆమెకు నయం చేయలేమని చెబుతారు. అయితే, ఒక పూజారి ఆ వ్యాపారవేత్త బిచ్చగాడుగా జీవిస్తే ఆమె కోలుకుంటుందని స్పష్టం చేస్తాడు.ఓటీటీ: ప్రైమ్ వీడియో Jalsa సంజయ్‌ చిన్నప్పుడు ఎదుర్కొన్న పరిస్థితుల కారణంగా నక్సలైట్‌గా మారతాడు. ఓ పోలీసాఫీసర్‌ కారణంగా ప్రజా జీవితంలోకి వస్తాడు. అయితే అనుకోకుండా ఆ పోలీసు అధికారి కూతుర్లనే రెండు పర్యాయాలలో ప్రేమిస్తాడు. ఓటీటీ: ఆహా Nenu అల్లరి నరేష్‌లో అద్భుతమైన నటనను ఆవిష్కరించింది ఈ చిత్రం. మానసిక రోగి పాత్రలో అతని యాక్టింగ్ సూపర్బ్‌గా ఉంటుంది. అందుకే ఈ సినిమా వచ్చి 20 ఏళ్లు గడిచినా క్రేజ్ మాత్రం తగ్గలేదు. కథలోకి వెళ్తే..మానసిక రోగి అయిన వినోద్ తన స్నేహితురాలిగా భావించే ఒక అమ్మాయితో ప్రేమలో పడతాడు. అయితే ఆ యువతి వెరొకరితో ప్రేమలో ఉంటుంది. ప్రేమను గెలిపిస్తాననే నెపంతో ఆ యువతిని వినోద్ అడవిలోకి తీసుకెళ్లడంతో కథ మలుపు తిరుగుతుంది. ఓటీటీ: సన్ నెక్ట్స్ Sye Raa Narasimha Reddy భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించనప్పటికీ… ఈ సినిమా ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయింది. కథలోకి వెళ్తే.. భారతదేశాన్ని ఆక్రమించుకునే క్రమంలో బ్రిటిష్ సైన్యాన్ని ఎదురించలేక పాలెగాళ్లు అందరూ లొంగిపోతారు. అయితే రేనాడు ప్రాంతానికి చెందిన రాజు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి బ్రిటిష్ సైనికులకు ఎదురుతిరిగి వారు దోచుకున్న భూమిని సంపదను అడ్డుకుని ప్రజలకు అండగా నిలబడతాడు. తోటి పాలెగాళ్ళలో మార్పు తెచ్చి వారితో కలిసి దేశ స్వాతంత్ర్యం కోసం ఉద్యమాన్ని నిర్మిస్తాడు? ఈ క్రమంలో ఆయన ఎదుర్కొన్న సమస్యలు ఏమిటి? అసలు యుద్దానికి దారి తీసిన అంశాలు ఏమిటి? అన్నది మిగతా కథ Hari Hara Veera Mallu పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఈ చిత్రం ఇంకా విడుదల కాలేదు. కానీ ఈ సినిమా కోసం నెటిజన్లు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందని ఎదురు చూస్తున్నరు. ఇక ఈ సినిమా మొగల్స్ కాలం నాటి పరిస్థితుల ఆధారంగా తెరకెక్కుతోంది. Bharat Ane Nenu సీఎం అయిన తండ్రి చనిపోవడంతో భరత్‌ (మహేష్‌) ఆ పదవిలోకి వస్తాడు. బాధ్యతగా ప్రజలకు మంచి చేయాలనుకుంటాడు. ఈ క్రమంలో అతడికి ఎదురైన సమస్యలు ఏంటి? సొంత పార్టీ నేతలు చేస్తున్న కుట్రలకు ఎలా చెక్‌ పెట్టాడు? అన్నది కథ.ఓటీటీ: ఆహా Ye Maaya Chesave ఈ చిత్రం 15 ఏళ్లు గడిచినా ఈ క్లాసిక్ సినిమాపై ఇంకా క్రేజ్ పోలేదు.ఇంజినీరింగ్‌ విద్యార్థి అయిన కార్తీక్‌కి ఫిల్మ్ డైరెక్టర్ కావాలని కోరిక. ఈక్రమంలో అతను తన ఇంటి యజమాని కూతురు జెస్సీతో ప్రేమలో పడతాడు. ఇద్దరు మతాలు వేరుకావడంతో ఆమె తండ్రి వారి ప్రేమను వ్యతిరేకిస్తాడు. మరి కార్తీక్ తన ప్రేమను గెలిచేందుకు ఏం చేశాడు అన్నది మిగతా కథ. ఓటీటీ: జీ5, ప్రైమ్ Baahubali: The Beginning మాహిష్మతి రాజ్యంలో, శివుడు అనే ధైర్యవంతుడైన యువకుడు… ఒక యువ యోధురాలుతో ప్రేమలో పడతాడు. ఆమెను ప్రేమిస్తున్న క్రమంలో అతని కుటుంబం, తన నిజమైన వారసత్వం గురించి తెలుసుకుంటాడు. ఆ తర్వాత అతను ఏం చేశాడు అనేది కథ. ఓటీటీ: హాట్ స్టార్ Businessman ముంబయిని ఏలాలన్న లక్ష్యంతో సూర్య నగరానికి వస్తాడు. లోకల్‌ గ్యాంగ్‌స్టర్లతో కలిసి పవర్‌ఫుల్‌ బిజినెస్‌మ్యాన్‌గా ఎదుగుతాడు. ఇంతకీ ఆ యువకుడు పెట్టిన బిజినెస్ ఏంటి? చిత్ర-సూర్యల లవ్‌స్టోరీ ఏంటి? అన్నది కథ. ఓటీటీ: హాట్ స్టార్, ప్రైమ్ Good Luck Sakhi బంజార యువతి సఖి (కీర్తి సురేష్‌) అంటే గోలి రాజు (ఆది పినిశెట్టి)కి ఎంతో ఇష్టం. సఖి గురిపై రాజుకు మహా నమ్మకం. ఆమెను షూటింగ్‌ వైపు వెళ్లేలా ప్రోత్సహిస్తాడు. ఇందుకోసం ఊరికి వచ్చిన కల్నల్ (జగపతిబాబు) సాయం తీసుకుంటాడు. షూటింగ్‌లో ఎదిగే క్రమంలో సఖికి ఎదురైన సవాళ్లు ఏంటి? అన్నదే కథ. ఓటీటీ: ప్రైమ్, ఆహా Oxygen అరవింద్ కృష్ణ తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు ఇండియాకు వస్తాడు. కానీ ఆ అమ్మాయి కుటుంబాన్ని కొంతమంది చంపుతారు. ఇలాంటి పరిస్థితుల్లో అరవింద్ కృష్ణ ఏం చేశాడు అన్నది కథ ఓటీటీ: సన్ నెక్ట్స్ Adipurush ఆదిపురుష్ సినిమా కథ వాల్మికి రామాయణంలోని యుద్ధకాండ నుంచి ప్రారంభం అవుతుంది. తండ్రి దశరథుడి ఆజ్ఞపై రాఘవ (ప్రభాస్) తన భార్య జానకి (కృతి సనన్) – శేషు (సన్ని సింగ్)తో కలిసి వనవాసానికి వెళ్తాడు. తన సోదరి శూర్పణఖకు జరిగిన అవమానం తెలిసిన రావణ (సైఫ్ అలీ ఖాన్) మారు వేషంలో వచ్చి జానకిని తీసుకు వెళ్తాడు. స్త్రీలోలుడైన రావణ.. జానకిపై ఆశ పడుతాడు. ఆ తర్వాత జానకిని రావణుడి చర నుంచి జానకిని ఎలా కాపాడాడు అనేది కథ ఓటీటీ: సన్ నెక్ట్స్ SR Kalyanamandapam కల్యాణ్‌ (కిరణ్‌ అబ్బవరం) వారసత్వంగా వస్తున్న ఎస్‌.ఆర్‌. కళ్యాణ మండపం నిర్వహణ బాధ్యతలను తీసుకుంటాడు. ఇంజనీరింగ్‌ చదివే కల్యాణ్‌ గిరాకీ లేని కల్యాణ మండపాన్ని నడపించాలని ఎందుకు అనుకున్నాడు? దానికి పూర్వ వైభవం తీసుకొచ్చాడా లేదా? తండ్రి (సాయికుమార్‌)తో మాట్లాడకపోవడానికి కారణమేంటి? అన్నది కథ. ఓటీటీ: ఆహా Disco Raja భయంకమైన మాఫియా బ్యాక్‌గ్రౌండ్ ఉన్న డిస్కో రాజా బాడీని హిమాలయాల్లో శాస్త్రవేత్తల బృందం కనిపెడుతుంది. అతనికి చికిత్స చేయడంతో మాములు మనిషిగా మారుతాడు. తన గతం గురించి తెలుసుకున్న డిస్కో రాజా ఏం చేశాడు. అసలు డిస్కో రాజా హిమాలయాల్లో ఎందుకు కూరుకు పోయాడు అనేది మిగతా కథ ఓటీటీ: సన్ నెక్స్ట్ Goutham Nanda మల్టీ బిలియనీర్ కొడుకైన గౌతమ్, ఓ కంపెనీలో ఉద్యోగి అయిన నందాతో జీవితాన్ని మార్చుకోవడం ద్వారా తన ఆస్తిని విడిచిపెట్టి సాధారణ జీవితం గడపాలని నిర్ణయించుకుంటాడు. ఓటీటీ: ప్రైమ్ Kirrak Party కృష్ణ(నిఖిల్) అనే ఇంజినీరింగ్ విద్యార్థి తన స్నేహితుల బృందంతో కలిసి సంతోషంగా జీవిస్తుంటాడు. అతను తన సీనియర్ మీరా(సిమ్రాన్)తో ప్రేమలో పడతాడు. అంతా సవ్యంగా సాగుతున్న క్రమంలో.. ఒక విషాద సంఘటన కృష్ణ జీవితాన్ని తలకిందులు చేస్తుంది. ఆ తర్వాత కృష్ణ ఏం చేశాడన్నది మిగతా కథ ఓటీటీ: ప్రైమ్ Teja తేజ ( తరుణ్ ) పుట్టుకతోనే మేధావి. 6 వ తరగతి చదువే అతను 10 వ తరగతికి సిద్ధమవుతుంటాడు. భౌతికశాస్త్రం, కంప్యూటర్లు, రోబోల పట్ల ఆసక్తి కలిగి ఉంటాడు. ఓ రోజు ప్రిన్సిపాల్ భర్త ఓ మహిళను హత్య చేయడం చూసి ఫొటోలు తీస్తాడు. తేజ సాక్ష్యంతో కోర్టు ప్రిన్సిపల్ భర్తకు ఉరి శిక్ష విధిస్తుంది. జైలు నుంచి తప్పించుకున్న అతను తేజపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది కథ. Pelli Sandadi శ్రీకాంత్‌ తాను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి చెల్లెలు అని తెలియక స్వప్నతో ప్రేమలో పడతాడు. సోదరి పెళ్లి విషయం తెలుసుకున్న స్వప్న తన అక్క సంతోషం కోసం ప్రేమను త్యాగం చేసేందుకు సిద్ధపడుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? ఇంతకు శ్రీకాంత్ పెళ్లి ఎవరితో జరిగిందనేది మిగతా కథ. ఓటీటీ:యూట్యూబ్ Swathi Muthyam బాలమురళీ కృష్ణ (బెల్లంకొండ గణేష్) భాగ్యలక్ష్మీ(వర్షా బొల్లమ్మ)ని చూడగానే ప్రేమలో పడతాడు. వారికి పెళ్లి జరుగుతుండగా చంటిబిడ్డతో శైలజ (దివ్య శ్రీపాద) ప్రత్యక్షం అవుతుంది. ఆ బిడ్డకు తండ్రి బాలమురళీ కృష్ణ అని చెబుతుంది. మరి భాగ్యలక్ష్మీ స్పందన ఏంటి? ఆ శైలజ ఎవరు? అనేది కథ. ఓటీటీ: జియో టీవీ Dhruva ఐపీఎస్‌ అధికారి అయిన ధ్రువ (రామ్‌చరణ్‌).. సిద్ధార్థ్‌ అభిమన్యూ (అరవింద స్వామి) నడిపే అక్రమ వైద్య నెట్‌వర్క్‌ను ఎలా ధ్వంసం చేశాడు? అన్నది కథ. ఓటీటీ: సన్ నెక్స్ట్ KGF 2 రాకీ గరుడను చంపి KGFని స్వాధీనం చేసుకుంటాడు. కొద్దికాలంలోనే సూపర్ పవర్‌గా ఎదుగుతాడు. కానీ అతనికి అధీర (సంజయ్ దత్) రూపంలో అడ్డంకులు వస్తాయి. ఇదేక్రమంలో రాకీని అణిచివేసేందుకు ప్రధాన మంత్రి ఆదేశాలు జారీ చేస్తుంది. మరి రాకీ, అధీరను, రాజకీయ శక్తిని ఎలా ఎదుర్కొన్నాడు? చివరకు వీరిపై విజయం సాధించాడా? లేదా? అన్నది మిగతా కథ. Baadshah ఓ యువకుడు తన తండ్రికి గ్యాంగ్‌స్టర్‌తో ఉన్న సంబంధాల కారణంగా పోలీస్ ఫోర్స్‌లో ఉద్యోగం పొందడంలో విఫలమవుతాడు. ఓ మాఫియా బాంబు దాడిలో అతని స్నేహితుడు చనిపోవడంతో వారిపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంటాడు. ఓటీటీ: యూట్యూబ్ Pushpa పుష్ప (అల్లుఅర్జున్‌) ఎర్రచందనం కూలీ. కొండా రెడ్డి (అజయ్‌ ఘోష్‌) సోదరులకు స్మగ్లింగ్‌లో సలహాలు ఇచ్చే స్థాయికి అతడు వెళతాడు. అక్కడ నుంచి సిండికేట్‌ను శాసించే రేంజ్‌కు పుష్ప ఎలా ఎదిగాడు? మంగళం శ్రీను (సునీల్‌)తో ఉన్న గొడవేంటి? అన్నది కథ. ఓటీటీ: ప్రైమ్ Nannaku Prematho హీరో తండ్రిని ఓ వ్యాపారవేత్త మోసం చేస్తాడు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయిన తండ్రి ద్వారా హీరో ఈ విషయాన్ని తెలుసుకుంటాడు. ఆ తర్వాత హీరో ఏం చేశాడు? తన తండ్రి కోసం విలన్‌పై ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు? అన్నది కథ. ఓటీటీ: సన్‌ నెక్స్ట్ Ala Modalaindi లవ్‌ ఫేయిల్ అయిన ఓ వ్యక్తి ఒక అమ్మాయిని కలుస్తాడు. ఆమెతో ప్రేమలో పడతాడు. అయితే, ఆమెకు అప్పటికే నిశ్చితార్థం జరిగిందని తెలియగానే కథలో ట్విస్ట్‌ మొదలవుతుంది. ఓటీటీ: జీ5, ప్రైమ్ Sir బాలగంగాధర్ (ధనుష్ ) ఒక జూనియర్ మ్యాథ్స్ లెక్చరర్. సిరిపురం అనే గ్రామంలోని జూనియర్ కళాశాలకు మ్యాథ్స్ చెప్పడానికి వెళ్తాడు. అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ పాస్ అయ్యేలా చదువు చెబితే.. సీనియర్ మ్యాథ్స్ లెక్చరర్‌గా ప్రమోషన్ ఇస్తానని కాలేజీ యాజమాన్యం చెబుతుంది. అయితే, అక్కడ పరిస్థితులు బాలుకి అనుకూలంగా ఉండవు. అయినా, తన మాటలతో, చేతలతో ఆ సిరిపురం స్టూడెంట్స్‌ను ప్రభావితం చేస్తాడు. అనంతరం జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల వల్ల బాలు జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి. ఆ మార్పులు ఏమిటి అనేది మిగతా కథ ఓటీటీ: నెట్‌ప్లిక్స్ Jersey అర్జున్(నాని) మాజీ రంజీ ఆటగాడు, అతను తన భార్య సారా(శ్రద్ధా శ్రీనాథ్) కొడుకు నానితో సాధారణం జీవితం గడుపుతుంటాడు. ఈక్రమంలో అతని ఉద్యోగం పోతుంది. చేచడానికి ఎలాంటి పనిలేక ఖాళీగా తిరుగుతుంటాడు. జీవితంలో ఏదోఒకటి చేయాలన్న తపన ఉన్న అర్జున్ తన కొడుకు కోసం ఓ కీలక నిర్ణయం తీసుకుంటాడు. ఇంతకు అతను తీసుకున్న నిర్ణయం ఏమిటి? తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించాడా లేదా అన్నది కథ. ఓటీటీ: జీ5 Hit: The First Case ఇన్‌స్పెక్టర్ విక్రమ్ తన లవర్ నేహా మిస్‌కావడంతో గందరగోళంలో ఉంటాడు. ఇదే సమయంలో తన లవర్ మిస్సింగ్ కేసుతో సంబంధం ఉన్న ప్రీతీ అనే అమ్మాయి మిస్సింగ్ కేసులో ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్‌గా విక్రమ్ అపాయింట్ అవుతాడు. ఈ కేసు దర్యాప్తులో కొన్ని షాకింగ్ విషయాలు తెలుసుకుంటాడు. ఆ తర్వాత విక్రమ్ ఏం చేశాడు అనేది కథ. ఓటీటీ: ప్రైమ్ Aditya 369 అనుకోని పరిస్థితుల్లో ఓ సైంటిస్ట్ కనిపెట్టిన టైం మిషన్ ఎక్కిన కృష్ణకుమార్ (బాలకృష్ణ) అతని ప్రేయసి మోహిని(హేమ)… గతంలోకి శ్రీకృష్ణదేవరాయల కాలంలోకి వెళ్తారు.. అప్పుడు అక్కడ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు. ఆ తర్వాత భవిష్యత్‌ కాలంలోకి ఎలా ప్రయాణించారు? తిరిగి వారు ప్రస్తుత కాలానికి వచ్చారా? లేదా అనేది మిగతా కథ ఓటీటీ: ప్రైమ్, యూట్యూబ్ Aha Naa Pellanta ఒక ధనిక పారిశ్రామిక వేత్త కొడుకై కృష్ణ మూర్తి, పరమ పిసినారి అయిన లక్ష్మిపతి కూతురు పద్మతో ప్రేమలో పడతాడు. అయితే లక్ష్మిపతిని తమ పెళ్లికి ఒప్పిస్తానని కృష్ణమూర్తి తన తండ్రితో ఛాలెంజ్ చేస్తాడు. ఈక్రమంలో అతను ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు? చివరకు తాను చేసిన ఛాలెంజ్‌లో గెలిచాడా లేదా అన్నది కథ. ఓటీటీ: యూట్యూబ్ Vikram Vedha వేదా అనే గ్యాంగ్ స్టర్‌ను కనిపెట్టడానికి విక్రమ్ అనే పోలీస్ ఆఫీసర్ బయలుదేరాడు. వేద స్వచ్ఛందంగా తనకు తాను లొంగిపోతాడు. ఆ తర్వాత విక్రమ్‌కు అతను మూడు కథలు చెప్తాడు.దీంతో విక్రమ్ మంచి, చెడుపై ఉన్న తన అభిప్రాయాన్ని మార్చుకుంటాడు. ఇంతకు వేదా.. విక్రమ్‌కు ఏం చెప్పాడు అనేది మిగిలిన కథ. ఓటీటీ: ప్రైమ్ Bro మార్క్( సాయి ధరమ్ తేజ్) ఎప్పుడూ తన ఉద్యోగంతో బిజీగా ఉంటాడు. దేనికి టైం లేదు టైం లేదు అంటుంటాడు. కుటుంబం మొత్తం అతని సంపాదన మీదే ఆధారపడి ఉంటుంది. చివరకు తన ప్రేయసి రమ్య( కేతిక శర్మ)తో సమయం గడిపాడు. ఓ రోజు అకస్మాత్తుగా మార్క్ ప్రమాదం చనిపోతాడు. అతని ఆత్మ టైం గాడ్‌(పవన్ కళ్యాణ్‌)ను కలుస్తుంది. తన బాధ్యతలు నిర్వర్తించేందుకు తనకు రెండో ఛాన్స్ ఇవ్వాలని కోరగా.. టైం గాడ్ 90 రోజులు సమయం ఇస్తాడు. ఆ తర్వాత మార్క్ ఏం చేశాడు అనేది మిగతా కథఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ Khaidi ఒక పేద రైతు కొడుకు సూర్యం, ఓ క్రూరమైన భూస్వామి కూతురుతో ప్రేమలో పడుతాడు. దీంతో ఆ భూస్వామి, సూర్యం కుటుంబాన్ని, అతని జీవితాన్ని చిద్రం చేస్తాడు. ఓటీటీ: యూట్యూబ్ Uppena మత్స్యకార కుటుంబానికి చెందిన ఆశీ (పంజా వైష్ణవ్‌ తేజ్‌) గొప్పింటి కుటుంబానికి చెందిన బేబమ్మ (కృతి శెట్టి)ను ప్రేమిస్తాడు. విషయం తెలుసుకున్న తండ్రి(విజయ్ సేతుపతి) ఏం చేశాడు? ప్రేమను దక్కించుకునే క్రమంలో ఆశీ ఏం కోల్పోయాడు? చివరకూ ఆ జంట ఎలా ఒక్కటైంది? అన్నది కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ Geetha Govindam గోవింద్‌ (విజయ్‌ దేవరకొండ) గుడిలో గీత (రష్మిక)ను చూసి తొలిచూపులోనే ఇష్టపడతాడు. విజయ్‌ ఊరు వెళ్లేందుకు బస్సు ఎక్కగా అతడి పక్క సీటులోనే గీత కూర్చుంటుంది. ఆమె నిద్రిస్తున్న క్రమంలో ముద్దు పెట్టేందుకు యత్నించి గీత దృష్టిలో విజయ్‌ రోగ్‌లా మారిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? విజయ్‌ ఆమె ప్రేమను ఎలా గెలుచుకున్నాడు? అన్నది కథ. ఓటీటీ: జీ5 Acharya బసవ(సోనూసూద్) పాలనలో ఉన్న ధర్మస్థలిలో అధర్మం రాజ్యమేలుతుంటుంది. ఆ సమయంలో ఆచార్య(చిరంజీవి) అక్కడకి వస్తాడు. బసవ, అతని మనుషులు చేసే అరాచకాలను ఆచార్య ఎలా ఎదురించాడు. అసలు ధర్మస్థలికి ఆచార్య ఎందుకు వస్తాడు? పాదఘట్టం సంరక్షకుడిగా ఉన్న సిద్ధకు ఆచార్యకు మధ్య సంబంధం ఏమిటి అనేది మిగిలిన కథ Rang De అను (కీర్తి సురేష్), అర్జున్ (నితిన్) ఇద్దరు చిన్ననాటి స్నేహితులు. ఒకరంటే ఒకరికి పడదు. అను అర్జున్‌ని ప్రేమిస్తుంది కానీ అతను ఆమెను ద్వేషిస్తాడు. కానీ ఓ సంఘటన వల్ల అర్జున్‌ అనును పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అను ప్రేమను అర్జున్ అర్థం చేసుకున్నాడా? లేదా? అన్నది మిగతా కథ.ఓటీటీ: జీ5 ఓటీటీ: ప్రైమ్ Induvadana వాసు (వరుమ్‌ సందేశ్‌) ఫారెస్ట్‌ పోలీసాఫీసర్‌. గిరిజన యువతి ఇందు (ఫర్నాజ్‌ శెట్టి)తో ప్రేమలో పడతాడు. కులం పేరుతో వారి పెళ్లిని పెద్దలు నిరాకరిస్తారు. ఈ క్రమంలోనే ఇందు హత్యకు గురవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందన్నది కథ. ఓటీటీ: యూట్యూబ్ Maharshi మహర్షి అనేది వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన 2019 భారతీయ తెలుగు భాషా యాక్షన్ డ్రామా చిత్రం మరియు దీనిని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, వైజయంతీ మూవీస్ మరియు PVP సినిమా నిర్మించాయి. ఇందులో మహేష్ బాబు, అల్లరి నరేష్, పూజా హెగ్డే నటించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు. ఈ చిత్రం 9 మే 2019న విడుదలైంది. ఓటీటీ: ప్రైమ్, ఆహా Aakaasam Nee Haddhu Ra సూర్య (మహా) గుంటూరులోని ఓ చిన్న కుగ్రామంలోని పోస్ట్ మాస్టర్ కొడుకు. తన తండ్రి వల్ల ఆ ఊరుకి కరెంట్ వస్తోంది. అలాంటి తండ్రి పెంపకంలో పెరిగిన మహా వల్ల ఆ ఊరికి రైలు వస్తోంది. అయితే ఆ తరువాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం పేదవాడు కూడా ఫ్లైట్ లో ప్రయాణించగలగాలనే లక్ష్యంతో మహా 'డెక్కన్ ఎయిర్ లైన్' ప్రారంభిస్తాడు. కానీ ఈ మధ్యలో తన ఫ్లైట్ ఎగరడానికి మహా ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నాడు? అసలు చివరకు తాను కన్న కలను సాధించగలిగాడా ? లేదా ? అన్నది మిగతా కథ ఓటీటీ: ప్రైమ్ Ala Vaikunthapurramuloo బంటు(అల్లు అర్జున్) తన పెంపుడు తండ్రి అవమానాల మధ్య పెరిగి పెద్దవాడవుతాడు. కానీ తన నిజమైన తల్లిదండ్రుల గురించి తెలుసుకుని వారికి దగ్గర కావాలని నిర్ణయించుకుంటాడు. ఈ క్రమంలో బంటు నిజమైన తండ్రి కుటుంబానికి ఓ సమస్య వస్తుంది. ఆ సమస్యను బంటు ఎలా పరిష్కరించాడు? తన కుటుంబంలో ఎలా చేరాడు అనేది మిగతా కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ Munna కాలేజీ స్టూడెంట్ అయిన మున్నా.. తన తల్లి, సోదరిని చంపిన కాకా అనే గుండాను చంపాలనే లక్ష్యాన్ని కలిగి ఉంటాడు. ఈ ప్రక్రియలో కాకా గురించి మున్నా ఓ నిజాన్ని తెలుసుకుంటాడు. మున్నా తెలుసుకున్న నిజం ఏమిటి? కాకాతో మున్నాకు ఉన్న సంబంధం ఏమిటి? అన్నది మిగతా కథ. ఓటీటీ: యూట్యూబ్ RRR నిజాం రాజును కలిసేందుకు వచ్చిన బ్రిటిష్ అధికారి గోండు పిల్లను తమ వెంట ఢిల్లీకి తీసుకెళ్తారు. ఆ గోండు జాతి నాయకుడైన భీమ్(జూ.ఎన్టీఆర్) ఆ పిల్లను వెతుక్కుంటూ ఢిల్లీకి వస్తాడు. ఈ విషయం తెలిసిన బ్రిటిష్ ప్రభుత్వం అతన్ని పట్టుకునేందుకు రామరాజు(రామ్‌చరణ్‌)ను ప్రత్యేక అధికారిగా నియమిస్తుంది. ఈక్రమంలో ఓ సంఘటన వల్ల భీమ్- రామరాజు ఒకరికొకరు తెలియకుండానే ప్రాణ స్నేహితులుగా మారుతారు. కానీ కొన్ని పరిణామాల వల్ల ఒకరిపై ఒకరు దాడి చేసుకోవాల్సి వస్తుంది. ఇంతకు గోండు పిల్లను బ్రిటిష్ చర నుంచి భీమ్ విడిపించాడా? అసలు రామరాజు బ్రిటిషర్ల దగ్గర ఎందుకు పనిచేశాడు అనేది మిగతా కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్, జీ5 Bommarillu సిద్ధూ తండ్రి అతనికి ఓ ధనవంతుడి కూతురితో పెళ్లి ఖాయం చేస్తాడు. అయితే సిద్ధూ తన తండ్రి తెచ్చిన సంబంధాన్ని కాదని హాసిని అనే యువతితో ప్రేమలో పడటంతో కథ ఆసక్తికరమైన మలుపు తిరుగుతుంది. ఓటీటీ: యూట్యూబ్ Dear Comrade స్టూడెంట్ లీడర్ అయిన బాబీ(విజయ్ దేవరకొండ).. స్టేట్ లెవల్ క్రికెటర్ అయిన లిల్లీతో ప్రేమలో పడుతాడు. అతని దుడుకు స్వభావం వల్ల లిల్లీ అతనికి దూరం అవుతుంది. ఈ క్రమంలో లిల్లీ ఓ సమస్యలో చిక్కుకుంటుంది. లిల్లీ సమస్యను బాబీ ఏవిధంగా పరిష్కరించి తిరిగి ఆమెకు ఎలా దగ్గరయ్యాడు అనేది కథ. ఓటీటీ: ప్రైమ్ Jathi Ratnalu మంచి ఉద్యోగాల కోసం తమ ఊరి నుంచి హైదరాబాద్ వచ్చిన ముగ్గురు యువకులు ఓ అపార్ట్‌మెంటులో దిగుతారు. అక్కడ పిలువని పార్టీకి వెళ్లి మర్డర్ అటెంప్ట్ కేసులో ఇరుక్కుంటారు. ఆ తర్వాత కేసు నుంచి ఎలా బయటపడ్డారనేది కథ. ఓటీటీ: ప్రైమ్ Dirty Hari హరికి హైదరాబాద్‌లో కోటీశ్వరురాలైన వసుధతో ప్రేమలో పడుతాడు. వారి ప్రేమ సాగుతున్న క్రమంలో వసుధ అన్న గర్ల్‌ఫ్రెండ్ అందానికి ఆకర్షితుడవుతాడు. ఒకరికి తెలియకుండా ఒకరితో సంబంధాన్ని కొనసాగిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది కథ ఓటీటీ: ఆహా Arjun Reddy అర్జున్ రెడ్డి టాలెంట్ ఉన్న ఒక యువ సర్జన్. ప్రీతి అనే యువతిని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తాడు. అయితే ఓ సంఘటన అర్జున్ రెడ్డిని షాక్‌కు గురిచేస్తుంది. మద్యానికి బానిసవుతాడు. ఇంతకు తన ప్రేయసిని అతను తిరిగి కలుసుకున్నాడా లేదా? అన్నది మిగతా కథ. ఓటీటీ: ఆహా, ప్రైమ్ Rangasthalam ఊరి ప్రెసిడెంట్‌గా 30 ఏళ్ల నుంచి ఫణీంద్ర భూపతి (జగపతిబాబు) ప్రజలను పీడిస్తుంటాడు. అతడి అన్యాయాలకు హీరో అన్న కుమార్‌బాబు (ఆది పినిశెట్టి) ఎదురు తిరుగుతాడు. ఫణీంద్ర భూపతికి పోటీగా నామినేషన్‌ వేస్తాడు. ఈ క్రమంలోనే కుమార్‌బాబు అనూహ్యంగా హత్యకు గురవుతాడు. అన్న చావుని చూసిన చిట్టిబాబు (రామ్‌చరణ్‌) ఎలా రివేంజ్‌ తీర్చుకున్నాడన్నది కథ. ఓటీటీ: ప్రైమ్
    జూన్ 25 , 2024
    EXCLUSIVE: ఈ జనరేషన్‌ మెగాస్టార్లు.. స్వయంకృషితో స్టార్లుగా ఎదిగిన టాలీవుడ్‌ కుర్ర హీరోలు వీరే!
    EXCLUSIVE: ఈ జనరేషన్‌ మెగాస్టార్లు.. స్వయంకృషితో స్టార్లుగా ఎదిగిన టాలీవుడ్‌ కుర్ర హీరోలు వీరే!
    తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటికే చాలా మంది కథానాయకులు ఉన్నారు. స్టార్‌ హీరోల కుటుంబాల నుంచి వచ్చిన వారసులు, దర్శక నిర్మాతల తనయులు.. హీరోలుగా మారి తామేంటో నిరూపించుకున్నారు. అయితే కొందరు మాత్రం ఎలాంటి బ్యాగ్రౌండ్‌ లేకుండా వచ్చి టాలీవుడ్‌లో స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్నారు. అద్భుతమైన యాక్టింగ్‌ స్కిల్స్‌తో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించారు. కసి, పట్టుదల ఉంటే ఇండస్ట్రీలో ఎవరైనా పైకి రావొచ్చని ఆ కుర్ర హీరోలు నిరూపించారు. ఇంతకీ ఆ కథానాయకులు ఎవరు? ఇండస్ట్రీలో తమ ప్రస్థానాన్ని ఎలా మెుదలు పెట్టారు? వారిని స్టార్లుగా మార్చిన చిత్రాలు ఏవి? ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.&nbsp; నాని స్వయం కృషితో పైకొచ్చిన ఈ తరం హీరో అనగానే అందరికీ ముందుగా నాని (Nani)నే గుర్తుకు వస్తాడు. అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా కెరీర్‌ ప్రారంభించిన నాని.. ‘అష్టా చమ్మా’ సినిమాతో హీరోగా మారాడు. ‘భీమిలి కబడ్డి జట్టు’, ‘అలా మెుదలైంది’, ‘పిల్ల జమిందార్‌’, ‘ఈగ’, ‘ఎటో వెళ్లిపోయింది మనసు’, ‘భలే భలే మగాడివోయ్‌’, ‘నేను లోకల్‌’, ‘జెర్సీ’, ‘శ్యామ్‌ సింగరాయ్‌’, ‘దసరా’, ‘హాయ్‌ నాన్న’ వంటి సూపర్‌ హిట్‌ చిత్రాల్లో నటించి స్టార్‌ హీరోగా మారిపోయాడు. నాని నటించిన లేటెస్ట్‌ చిత్రం ‘సరిపోదా శనివారం’ ఆగస్టు 29న విడుదల కానుంది.&nbsp; విజయ్‌ దేవరకొండ యంగ్‌ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) కూడా కెరీర్‌ ప్రారంభంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. హీరో ఫ్రెండ్‌, ప్రాధాన్యం లేని పాత్రల్లో నటిస్తూ సరైన అవకాశాల కోసం ఎదురుచూశాడు. ‘నువ్విలా’ చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయమైన విజయ్‌.. ‘లైఫ్‌ ఇజ్‌ బ్యూటిఫుల్‌’, ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ చిత్రాల్లో సైడ్‌ రోల్స్‌లో చేశాడు. తరుణ్‌ భాస్కర్‌ దర్శకత్వంలో వచ్చిన 'పెళ్లి చూపులు' చిత్రంతో తొలిసారి ఫుల్‌ లెన్త్‌ హీరోగా మారాడు. ఆ తర్వాత సందీప్‌ రెడ్డి వంగా డైరెక్షన్‌లో వచ్చిన 'అర్జున్‌ రెడ్డి'తో విజయ్‌ రాత్రికి రాత్రే స్టార్‌గా ఎదిగాడు. యూత్‌లో మంచి క్రేజ్‌ సంపాదించాడు. 'గీతా గోవిందం' ఫిల్మ్‌ ద్వారా ఫ్యామిలీ ఆడియన్స్‌కూ విజయ్‌ దగ్గరయ్యాడు. రీసెంట్‌గా ‘ఫ్యామిలీ స్టార్‌’తో విజయ్‌ తెలుగు ఆడియన్స్‌ను పలకరించాడు.&nbsp; సిద్ధు జొన్నలగడ్డ హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన యంగ్‌ హీరో సిద్ధు జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda).. నటనపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి వచ్చాడు. చిత్ర పరిశ్రమలో తెలిసిన వారు ఎవరూ లేకపోవడంతో చిన్న పాత్రలతో కొద్ది రోజులు నెట్టుకొంచాడు. ‘జోష్‌’, ‘ఆరెంజ్‌’, ‘భీమిలి కబడ్డీ జట్టు’, ‘డాన్‌ శీను’ చిత్రాల్లో పెద్దగా గుర్తింపు లేని పాత్రల్లో నటించాడు. ప్రవీణ్‌ సత్తారు డైరెక్షన్‌లో వచ్చిన 'LBW' (లైఫ్‌ బిఫోర్‌ వెడ్డింగ్‌) మూవీతో సిద్ధూ హీరోగా మారాడు. 'గుంటూరు టాకీస్‌' చిత్రం హీరోగా అతడికి గుర్తింపు తీసుకొచ్చింది. ఆ తర్వాత అడపాదడపా చిత్రాలు చేసినప్పటికీ సిద్ధుకు చెప్పుకోతగ్గ హిట్‌ రాలేదు. 2022లో వచ్చిన 'డీజే టిల్లు' ఈ యంగ్‌ హీరో కెరీర్‌ను మలుపు తిప్పింది. ప్రేమ పేరుతో మోసపోయిన టిల్లు పాత్రలో సిద్ధు జీవించేశాడు. తాజాగా ఈ సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన టిల్లు స్క్వేర్‌ కూడా బ్లాక్‌ బాస్టర్‌ విజయాన్ని అందుకుంది. అంతేకాదు రూ.100 కోట్లకు పైగా గ్రాస్‌ రాబట్టి సిద్ధూను స్టార్‌ హీరోల సరసన నిలబెట్టింది. దీంతో 'టిల్లు క్యూబ్‌' తీసేందుకు మేకర్స్ సన్నాహాలు మెుదలు పెట్టారు.&nbsp; నవీన్ పొలిశెట్టి యువ కథానాయకుడు నవీన్‌ పొలిశెట్టి (Naveen Polishetty) సైతం.. ఇండస్ట్రీలో ఎవరి సపోర్టు లేకుండా స్టార్ హీరో స్థాయికి ఎదిగాడు. కెరీర్‌ తొలినాళ్లల్లో ప్రాధాన్యం లేని పాత్రల్లో నవీన్‌ నటించాడు. శేఖర్ కమ్ముల తెరకెక్కించిన 'లైఫ్‌ ఇజ్‌ బ్యూటిఫుల్‌' చిత్రంతో తొలిసారి ఇండస్ట్రీకి పరిచయయ్యాడు. ఆ తర్వాత 'డీ ఫర్‌ దోపిడి', ‘1 నేనొక్కడినే’ చిత్రాల్లో చేసినప్పటికీ పెద్దగా ఫేమ్‌ రాలేదు. అయితే 2019లో వచ్చిన ఏజెంట్‌ 'సాయి శ్రీనివాస ఆత్రేయ' చిత్రం.. నవీన్‌ పోటిశెట్టి పేరు మార్మోగేలా చేసింది. ఇందులో నవీన్‌ చెప్పే ఫన్నీ డైలాగ్‌ డెలివరీ కడుపుబ్బా నవ్విస్తుంది. ఇక 'జాతి రత్నాలు' ఫిల్మ్‌తో నవీన్‌ పొలిశెట్టి క్రేజ్‌ మరో స్థాయికి చేరింది. ఇటీవల స్టార్‌ నటి అనుష్కతో మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి చిత్రంలో ఈ యంగ్‌ హీరో నటించగా ఆ ఫిల్మ్‌ కూడా హిట్‌ టాక్‌ సొంతం చేసుకుంది. దీంతో టాలీవుడ్‌లో నవీన్‌ మినిమమ్‌ గ్యారంటీ హీరోగా మారిపోయాడు.&nbsp; తేజ సజ్జ యువ హీరో తేజ సజ్జ (Teja Sajja).. ఒకప్పుడు బాల నటుడిగా తెలుగు ప్రేక్షకులను అలరించాడు. చిరంజీవి, మహేష్‌బాబు, వెంకటేష్‌, పవన్‌ కల్యాణ్‌, శ్రీకాంత్, జూ.ఎన్టీఆర్‌ చిత్రాల్లో నటించాడు. కాగా, 2019లో వచ్చిన 'జాంబిరెడ్డి' సినిమాతో తేజ సజ్జా హీరోగా మారాడు. ఆ సినిమా సూపర్‌ హిట్‌ సాధించింది. ఆ తర్వాత చేసిన ఇష్క్‌, అద్భుతం సినిమాలు కూడా హిట్‌ టాక్‌ తెచ్చుకున్నాయి. రీసెంట్‌గా అతడు నటించిన ‘హనుమాన్‌’ (Hanu Man) సినిమా ప్యాన్‌ ఇండియా స్థాయిలో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. ప్రశాంత్‌ వర్మ (Prashanth Varma) దర్శకత్వం వహించిన ఈ సినిమా.. నార్త్‌లో విశేష ఆదరణ సంపాందించింది. దీంతో తేజ సజ్జా క్రేజ్‌ అమాంతం పెరిగింది. ప్రస్తుతం అతడు సూపర్ యోధ అనే ఫిల్మ్‌లో నటిస్తున్నాడు.&nbsp; అడవి శేషు స్టార్‌ హీరో అడవి శేషు (Adivi Sesh)కు కూడా ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్‌ లేదు. తొలి చిత్రం 'కర్మ'తో హీరోగా మారిన అతడు.. అరంగేట్రంతోనే మంచి గుర్తింపు సంపాదించాడు. ఆ తర్వాత ‘పంజా’, ‘బలుపు’, ‘రన్‌ రాజా రన్‌’, ‘బాహుబలి’, ‘అమీ తుమీ’ వంటి చిత్రాల్లో సపోర్టింగ్‌ రోల్స్‌లో కనిపించాడు. ఆ తర్వాత వచ్చిన 'గూడఛారి' చిత్రం అడివి శేషు కెరీర్‌ను మలుపు తిప్పింది. ఈ స్పై థ్రిల్లర్‌ చిత్రం తెలుగు ఆడియన్స్‌ను విపరీతంగా ఆకర్షించింది. ఆ తర్వాత చేసిన ‘ఎవరు’, ‘మేజర్‌’, ‘హిట్‌: సెకండ్‌ కేసు’ కూడా సూపర్‌ హిట్స్‌గా నిలవడంతో ఈ యువ నటుడు స్టార్‌ హీరోగా మారిపోయాడు. ప్రస్తుతం అడివి శేషు.. గూడఛారి సీక్వెల్‌లో నటిస్తున్నాడు.&nbsp; ప్రియదర్శి యువనటుడు ప్రియదర్శి (Priyadarshi Pulikonda)కి చిన్నప్పటి నుంచే సినిమాలపై ఆసక్తి ఉండేది. ఇండస్ట్రీలో తనకంటూ ఎవరు లేనప్పటికీ అవకాశాల కోసం కాళ్లు అరిగేలా తిరిగాడు. చివరికీ 2016లో శ్రీకాంత్‌ హీరోగా వచ్చిన&nbsp; 'టెర్రర్‌' చిత్రంలో ఉగ్రవాది పాత్రతో ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. అదే ఏడాది వచ్చిన ‘పెళ్లి చూపులు’ అతడికి మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఇందులో 'నావు చావు నేను చస్తా.. నీకెందుకు' డైలాగ్‌తో అతడు బాగా ఫేమస్‌ అయ్యాడు. ఆ తర్వాత పలు చిత్రాల్లో హాస్య పాత్రల్లో కనిపించిన ప్రియదర్శి.. 'జాతి రత్నాలు' మూవీతో మరింత పాపులర్ అయ్యాడు. ఈ క్రమంలోనే గతేడాది వచ్చిన 'బలగం' సినిమా ప్రియదర్శిని స్టార్‌ నటుడిగా నిలబెట్టింది. ఇటీవల వచ్చిన ‘మంగళవారం’, ‘ఓం భీమ్ బుష్‌’ చిత్రాల్లో లీడ్‌ రోల్స్‌లో నటించి ప్రియదర్శి అలరించాడు.&nbsp;
    ఏప్రిల్ 17 , 2024
    FAMILY MOVIES:&nbsp; ఈ మధ్యకాలంలో&nbsp; కుటుంబ విలువలు చాటి చెప్పిన టాప్‌ 5 తెలుగు సినిమాలు
    FAMILY MOVIES:&nbsp; ఈ మధ్యకాలంలో&nbsp; కుటుంబ విలువలు చాటి చెప్పిన టాప్‌ 5 తెలుగు సినిమాలు
    సినిమాల ప్రభావం జనాలపై ఎంతో కొంత కచ్చితంగా ఉంటుంది. చిత్రంలో వచ్చే సన్నివేశాలు కొన్ని సందర్భాల్లో కదిలిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇటీవల వచ్చిన కొన్ని చిత్రాలు కుటుంబాలను విపరీతంగా ఆకట్టుకున్నాయి. థియేటర్లు, ఓటీటీ అనే తేడా లేకుండా ఆదరించారు ప్రేక్షకులు. కుటుంబాలపై ప్రభావం చూపించిన టాప్‌ 5 చిత్రాలు ఇవే ! బలగం ఈ ఏడాది విడుదలైన కుటుంబ కథా చిత్రాల్లో మెుదటిది బలగం. చిన్న చిన్న కారణాల వల్ల విడిపోయిన కుటుం మళ్లీ ఎలా కలుస్తుందనే కథను అద్భుతంగా తెరకెక్కించడంతో బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది. ప్రతి ఒక్కర్ని కంటతడి పెట్టించిన ఈ చిత్రం కారణంగా ఎన్నో విడిపోయిన కుటుంబాలు మళ్లీ కలుసుకున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. రంగ మార్తాండ కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన తల్లిదండ్రులు, ఇప్పటి జనరేషన్ పిల్లల మధ్య జరిగిన సంఘర్షణలే రంగ మార్తాండ. కుటుంబ కథా చిత్రాల దర్శకుడు కృష్ణవంశీ నుంచి వచ్చింది ఈ సినిమా. ఈ చిత్రం నేటితరం యువతకు మంచి పాఠంగా నిలుస్తుంది. తల్లిదండ్రులు మనకు ఏం చేశారో తెలుసుకొని వారిని ఎలా గౌరవించాలో తెలుసునేందుకు ఉపయోగపడుతుంది రంగ మార్తాండ.&nbsp; రైటర్ పద్మభూషణ్ యంగ్‌ హీరో సుహాస్‌ లీడ్‌ రోల్‌ చేసిన సినిమా రైటర్ పద్మభూషణ్. సినిమా మెుత్తం ఓ యువకుడు కెరీర్‌లో నిలదొక్కుకోవటానికి పడే కష్టాల గురించి వివరించినా… అతడికి తల్లిదండ్రులు ఎలా మద్దతుగా నిలబడ్డారనేది అసలు అంశం. కలల్ని వదిలి వంటింటికే పరిమితమైన తల్లి కుమారుడి కోసం రచనలు చేయడం ప్రారంభించడం ఎంతోమందికి స్ఫూర్తినిచ్చింది. అంతేకాదు, మహిళల కలల్ని అర్థం చేసుకొని వారి ఆలోచనల్ని గౌరవించాలనే విషయాన్ని చాలామందికి చెబుతుంది ఈ సినిమా. మట్టి కుస్తీ భార్య, భర్తల మధ్య సమస్యలను ఓ చిన్న కథతో ముడి పెట్టి తీశారు. భర్త ఆధిపత్యమే కొనసాగాలనే వ్యక్తికి.. మగవాళ్లకు మేము ఏం తక్కువ కాదనే భార్య. కానీ, ఒకరికొకరు అర్థం చేసుకుంటేనే జీవితం ముందుకు సాగుతుందని కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ సినిమా చాలామందిలో మార్పు తీసుకువచ్చింది. ఇల్లాలికి తగిన గౌరవం ఇస్తామని చెప్పినవారు కూడా ఉన్నారు. ది గ్రేట్ ఇండియన్ కిచెన్ సంప్రదాయాలు, కట్టుబాట్ల పేరుతో మహిళలను ఇంటి పనులకే పరిమితం చేస్తున్నారనేది సింపుల్ కథ. ఓ మహిళకు కొత్తగా పెళ్లై అత్తారింటికి వెళ్తుంది. మగవాళ్ల ఆధిపత్యం ఉన్న ఇంట్లో ఆమె ఇమడలేకపోతుంది. ఇళ్లు, వంటపని మెుత్తం చేస్తూ విసిగిపోయి శివమెత్తుతుంది. పురుషాధిక్యాన్ని ఎదురించి స్వతంత్రంగా తన లక్ష్యం వైపు సాగుతుంది.&nbsp; పురుషాధిక్య సమాజంలో మహిళలు ఇంకా ఎదుర్కొంటున్న అంశాలను సినిమాలో చక్కగా ప్రస్తావించారు. కొందరికి కళ్లు తెరిపిస్తే.. మరికొందరికి సమస్యగా మారింది ఈ చిత్రం. అన్ని పనులు షేర్ చేసుకోవాలంటూ ఆఫీసుల నుంచి వచ్చిన&nbsp; భర్తల్ని భార్యలు ఆటపట్టిస్తున్నారంట&nbsp; ఈ సినిమా చూసి…! జయ జయ జయ జయ జయహే ఈ సినిమా కూడా భార్య భర్తల మధ్య వచ్చే ఇగో ప్రాబ్లమ్స్‌తో తెరకెక్కించారు. అన్ని తను అనుకున్నట్లుగా సాగాలనుకునే భర్త.. అనుకోని సందర్భంలో భార్యపై చేయిచేసుకుంటాడు. ఎవరికి చెప్పినా పట్టించుకోకపోవటంతో తానే అన్ని చూసుకోవాలని ఆమె తైక్వాండో నేర్చుకుంటుంది. ఈ క్రమంలో ఇబ్బందులు రావటం, వాళ్లు విడిపోవడం జరుగుతుంది. అబ్బాయిపై ఆధారపడకుండా కూడా అమ్మాయిలు జీవిస్తారు. కానీ, అలా మగవారు ఉండలేరని చూపించారు. ఇది కూడా చాలామంది కపుల్స్‌పై ప్రభావం చూపించింది. ఇందులో భర్తను తైక్వాండోతో ఆటాడుకునే రీల్‌ తెగ వైరల్ అయ్యింది. ఆ పరిస్థితుల్లో మీరుంటే ఒక్కసారి ఊహించుకోండి.
    ఏప్రిల్ 27 , 2023

    @2021 KTree